మళ్ళీ కలుద్దాం అంటూ ముగిసిన కార్తీక దీపం!

ఇప్పటి వరకు ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న 'కార్తీక దీపం' సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ తో ముగిసింది. అయితే గత కొద్దిరోజులుగా క్లైమాక్స్ ఎలా ఉండాబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాగా ఈ ఎపిసోడ్ లో... మోనిత దగ్గర ఉన్న గన్ ని దీప తీసుకోగానే సీన్ రివర్స్ అయ్యింది. పిల్లలని తీసుకొని వెళ్ళండి అత్తయ్య అని దీప అనగానే సౌందర్య పిల్లలను తీసుకొని వెళ్తుంది. "నన్ను వదిలిపెట్టు... దూరం నుండి అయినా సరే కార్తీక్ ను చూస్తూ బ్రతికేస్తా ప్లీజ్ దీప వదిలిపెట్టు" అని బ్రతిమిలాడుతుంది. అప్పటికే దీప చేతిలో ఉన్న గన్  గురి తప్పి పేలుతుంది. అందులో నుండి బుల్లెట్ నేరుగా మోనిత గుండెల్లోకి దూరి.. తను అక్కడికక్కడే పడిపోతుంది. ఆ తర్వాత దీపని తీసుకొని కార్ లో వెళ్తుండగా... మోనిత ఒక్కసారిగా లేచి వచ్చి వాళ్ళు వెళ్తున్న కార్ లో బాంబ్ పెడుతుంది. నాకు దక్కని కార్తీక్ ఎవరికి దక్కకూడదంటూ మోనిత చనిపోతుంది. మరో వైపు హిమతో గొడవపడి శౌర్య వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతుంది. కార్తిక్, దీపలు కార్ లో వెళ్తుంటారు. నీకేం కాదు దీప... నేను నీకు ఏం కానివ్వను అని కార్తిక్ అనగానే  నా పిల్లల్ని చూడకుండానే వెళ్ళిపోతానా... పిల్లల్ని జాగ్రత్త గా చూసుకోండి డాక్టర్ బాబు అంటుంది. "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు దీప" అని కార్తిక్ అంటాడు.  కార్ ఆపమని దీప చెప్తుంది. కార్తిక్ కార్ ఆపి  పక్కకి నడుచుకుంటూ వస్తారు. "మీతో మళ్ళీ ఏడు అడుగులు వెయ్యాలని ఉంది. నా చివరి కోరికలు తీర్చరా" దీప అనగానే ఇద్దరూ ఏడు అడుగులు వేసి నడుస్తారు. అంతలోనే మోనిత కార్ లో పెట్టిన బాంబు పేలిపోతుంది. అది చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా నడుచుకుంటూ ముందుకెళ్తారు.  ఒక దగ్గర కూర్చొని ఇద్దరూ ఒకరికొకరు వారి పరిచయం దగ్గర మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన అన్ని జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు. వీరి ఇద్దరి మధ్య జరిగిన ఈ సీన్స్  ఎమోషనల్ గా సాగాయి. మొదటి నుంచి వారు పడిన బాధల గురించి చెప్పుకుంటూ ఉండగా..  "ఇక నేను బ్రతకను డాక్టర్ బాబు" అని దీప అంటుంది.  "నేను నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను" అని కార్తిక్ అంటాడు. అలా ఇద్దరూ కలిసి ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. ఇలా‌ 'కార్తీక దీపం' ముగిసింది. 'ది ఎండ్' అని ఎండ్ టైటిల్స్ వేయకుండా 'మళ్ళీ కలుద్దాం' అని వేసాడు డైరెక్టర్. దీంతో పార్ట్-2 ఉంటుందేమోనని అనుకుంటున్నారు కార్తీకదీపం సీరియల్ ఫ్యాన్స్.

వసుధార చేసిన మోసంతో తనకి ఒంటరితనం అలవాటయ్యిందన్న రిషి!

'గుప్పెడంత  మనసు' సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్ -667లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో... జగతి, మహేంద్రలు కాలేజీకి వచ్చి రిషి, వసుధారల గురించి మాట్లాడుకుంటారు. "రిషీ సర్ ఒంటరిగా ఉన్నారేంటి ఇంకా ఇంటికెళ్ళలేదా" అని వసుధార అడుగుతుంది. "చిన్నప్పుడే ఒకరు ఒంటరి చేసారు. సాక్షి కొద్దీ రోజులకి తోడుంటా అని చెప్పి తన దారి తను చూసుకుంది. నువ్వేమో నన్ను నాకే పరిచయం చేసి నన్నిలా ఒంటరిని చేసావు. ఒంటరిగా ఉండడం నాకు అలవాటు అయిపోయింది. ఒంటరితనం అనేది శాపంగా మారిన వరం" అని అంటాడు.. మనం మాట్లాడుకోవాలి సర్ అని వసుధార అనగానే మనం అనే పదం ఇక వాడకని చెప్తాడు. ఆ తర్వాత వసుధార బాధపడుతూ వెళ్లిపోతుంటే...  తనకి ఎదురుగా దేవయని వస్తుంది. ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతుంది. వసుధార మాస్ డైలాగ్స్ తో దేవయానికి చెమటలు పట్టించింది. ఆ తర్వాత వసుధార వెళ్లే దారిలో రాజీవ్ వస్తాడు. కాసేపు తనకి మాటలతో చిరాకు తెప్పిస్తాడు. దాంతో  వసుధారకి చిరాకు వచ్చి వెళ్లిపోతుంది. వసుధార ఒక ప్రాజెక్ట్ గురించి రిషికి మెసేజ్ చేస్తుంది. తను రిప్లై ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఆ  తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే...!

'నీకు అవసరం లేకపోతే వెళ్లి రామాయణం చదువుకో'

స్టార్ మా రాత్రి 8 ఐతే చాలు "ఇంటింటి గృహలక్ష్మి" అంటూ కస్తూరి వచ్చేస్తుంది. సీరియల్ లో ఎంతో పద్దతిగా, హుందాగా, గౌరవప్రదమైన పాత్రలో కనిపిస్తూ ఉంటుంది. ఐతే బయట కస్తూరి వేసే డ్రెస్సులు, చేసే అల్లరి, హడావిడి చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఎవ్వరికైనా సరే చెంప మీద కొట్టినట్టుగా సమాధానం ఇచ్చేస్తుంది. కస్తూరిని దరింగ్ వుమన్ గా చెప్పుకోవచ్చు. మోడరన్ డ్రెస్సులంటే కస్తూరి బాగా ఇష్టపడుతుంది. కస్తూరి అలాంటి డ్రెస్సులు వేసుకుంది అంటే చాలు నెటిజన్స్ కామెంట్స్ మాములుగా ఉండవు. అలాంటి ఒక ఘటన రీసెంట్ గా జరిగింది.  ఒక నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చి పడేసింది. స్విమ్‌సూట్‌ వేసుకుని స్విమ్ చేస్తున్నట్టుగా ఉన్న ఒక స్లో మోషన్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కస్తూరి..‘‘ఈ నీళ్లు రమ్మంటూ స్వాగతిస్తుంటే నన్ను నేనే మైమరిచిపోతున్నా"  అని ఒక కాప్షన్ పెట్టుకుంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ఒక నెటిజన్.. ‘‘ఈ వయసులో ఇలాంటి పనులు అవసరమా?’’అని తమిళ్ లో కామెంట్ చేశాడు. ‘‘అవసరమే. ఈ వయసులో నీకు అవసరం లేదు. పో.. వెళ్లి రామాయణం చదువుకో’’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది. ఆ  సమాధానానికి ఆమె ఫాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఏం చెప్పారంటూ పొగిడేశారు. తన ఫొటోలపై, తన వస్త్రధారణపై నెగటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళను ఆమె అస్సలు వదిలిపెట్టదు. కస్తూరి ప్రస్తుతం ‘ఇంటింటి గృహలక్ష్మి’ డైలీ సీరియల్‌లో తులసి పాత్రలో తెలుగు ఆడియన్స్ ని అలరిస్తోంది.

జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి ఇంట్లో విషాదం!

జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి గురించి అందరికీ తెలుసు..టిక్ టాక్ స్టార్ గా  అందరికీ పరిచయమే. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈమె ఇంట్లో విషాదం నెలకొంది.  గుండెపోటుతో ఆమె తండ్రి తుదిశ్వాస విడిచారు.  విషయం తెలుసుకున్న ఆడియన్స్, జబర్దస్త్ కమెడియన్స్ అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రి  మృతిపై రీతూ చౌదరి భావోద్వేగానికి గురయ్యింది. తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. తండ్రితో కలిసున్న ఫొటోని ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టి.. “నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఈ ఫొటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు.  నీతో తీసుకున్న లాస్ట్ ఫొటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్ళిపోయావు నాన్నా? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా నీ కూతురు దగ్గరికి” అంటూ రీతూ చౌదరీ పెట్టిన ఎమోషనల్  పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  రీతూ చౌదరికి తన నాన్న అంటే చాలా ఇష్టం అని తమ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉందని ఎన్నో సందర్భాల్లో చెప్పింది.  ఇంట్లో అందరి కంటే నాన్న అంటేనే చాలా ఇష్టం. ఏ విషయమైనా సరే  ఆయనతోనే పంచుకుంటుంది. అలాంటిది రీతూ ఇప్పుడు తన తండ్రి లేరనే విషయాన్ని తట్టుకోలేకపోతోంది. జబర్దస్త్ కమెడియన్స్, రీతూ ఫాన్స్ , నెటిజన్స్ అంతా కూడా  ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

నెక్స్ట్ సీజన్ 'బిగ్ బాస్ హౌస్' లోకి అలనాటి అందాల నటి రాధా !

"నెక్స్ట్ సీజన్ కి బిగ్ బాస్ కి వెళదామని అనుకుంటున్నా" అంది అలనాటి అందాల నటి రాధ. వచ్చే వారం  ప్రసారం కాబోయే  బీబీ జోడి ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ షోలో అదరగొట్టే పెర్ఫార్మెన్సెస్ తో కంటెస్టెంట్స్  రాబోతున్నారు. అంతకు మించి అన్నట్టుగా డాన్స్ చేసి సత్తా చాటారు జోడీస్.  ఇక ఈ షోలో అభినయశ్రీ-కౌషల్ జోడి ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు. "అనురాధ కూతురా మజాకానా" అని రాధా అంటే "నువ్వు మీ అమ్మనే డామినేట్ చేసేసావ్" అని కంప్లిమెంట్ ఇచ్చారు తరుణ్ మాస్టర్. అదే టైంకి వెనక నుంచి అభినయశ్రీ వాళ్ళ అమ్మ అనురాధ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఆమెను చూసి స్టేజి మొత్తం లేచి నిలబడింది. రాధ "వెల్కమ్ అను" అంటూ ఇన్వైట్ చేసింది. "రాధా నేను కలిసి చాలా సినిమాలు చేసాం అని అనురాధ అనేసరికి అవును నీ పని ఎప్పుడూ అదే కదా నా హీరోస్ వెంట పడి అలా లాగేస్తావ్ " అని కామెడీ చేసింది రాధ.  ఇక బ్యాక్ గ్రౌండ్ లో "నీ ఇల్లు బంగారం కాను" సాంగ్ వస్తుంటే రాధ, అనురాధ, అభినయశ్రీ అందరూ కలిసి డాన్స్ చేశారు. తర్వాత అభినయశ్రీ తన లైఫ్ లో జరిగిన  ఇష్యూస్ చెప్పి బాధపడింది. "నాన్న లేకపోయినా నన్ను తమ్ముడిని పెంచి పెద్ద చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ మా అమ్మ ఎన్నో స్ట్రగుల్స్ పడుతూనే ఉంది " అనేసరికి అనురాధ కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత అఖిల్ సార్థక్ - తేజస్విని కలిసి అద్దిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసారు. తరుణ్ మాస్టర్ వాళ్ళ డాన్స్ కి పేపర్స్ చింపి మరీ ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత కౌషల్ మాట్లాడుతూ "మీకు ఇచ్చిన థీమ్ కథక్. ఫినిషింగ్ లో టప్ టప్ అని వస్తూ ఉంటుంది" కానీ మీరు అలా చేయలేదు అనే సెన్స్ లో మాట్లాడేసరికి "ఐతే ఆ స్టెప్ ఎలా వేయాలో చూపించు" అని అఖిల్ సీరియస్ గా అడిగాడు. "నేనేమీ కథక్ డాన్సర్ ని కాదు కదా నీకు డాన్స్ స్టెప్స్ చూపించడానికి" అని కౌంటర్ వేసాడు కౌషల్. "మరి ఎందుకు అలా చెప్పావ్" అని రివర్స్ కౌంటర్ వేసాడు అఖిల్. "ఈ ఆటలన్నీ నాతో ఆడకు బిగ్ బాస్ హౌస్ లో ఆడుకో" అని అఖిల్ మరింత సీరియస్ గా ఆన్సర్ ఇచ్చాడు. "నువ్వు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ వే కదా..ఎందుకలా మాట్లాడుతున్నావ్. నా కళ్ళతో చూసింది నేను చెప్పాను" అని కౌషల్ అనేసరికి "మేమూ మా కళ్ళతోనే చూస్తాం" అని అఖిల్ అన్నాడు.  తర్వాత అభినయశ్రీ-కౌషల్ పెర్ఫార్మెన్స్ మీద ఫైమా కామెంట్ చేసేసరికి కౌషల్ మండిపడ్డాడు. బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బీబీ జోడిలో కూడా కౌషల్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతున్నాడు. "కావాలని ఎవరైనా పాయింట్స్ తగ్గిస్తే వాళ్లకు కూడా పాయింట్స్ తగ్గిపోతాయి" అని రాధా ఫైనల్ గా ఒక కంక్లూషన్ ఇచ్చింది. ఇక వాతావరణం మొత్తం హాట్ హాట్ గా ఉండేసరికి దాన్ని కూల్ చేయడానికన్నట్టుగా "నెక్స్ట్ సీజన్ కి బిగ్ బాస్ కి వెళదామని అనుకుంటున్నా" అని మనసులో మాట చెప్పింది...దాంతో  స్టేజి మొత్తం అరుపులు కేకలు వినిపించాయి. ఏమో రాధ మాట గనక బిగ్ బాస్ వింటే సీనియర్ నటీ నటులతో ఒక బిగ్ బాస్ షో కూడా  ప్లాన్ చేయొచ్చేమో..చూడాలి.

మోనిత పెళ్లికూతురాయెనే!

శోభాశెట్టి అంటే ఎవరికీ తెలియదు. కానీ కార్తీకదీపం మోనిత అంటే చాలు టక్కున గుర్తొచ్చేస్తుంది కదా. ఇప్పుడు శోభాశెట్టి తన పెళ్లి చూపుల కోసం రెడీ అయ్యింది. ఆ వీడియోని తన యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. "ఒకసారి చూడండి నా గదిలో అంతా హంగామాగా ఉంది ఏమిటి అనుకుంటున్నారు కదా.  ఈరోజు నాకు పెళ్లి చూపులు అంటూ తెగ సిగ్గు పడిపోయింది. జనరల్ గా నేను అస్సలు సిగ్గు పడను. కానీ ఇప్పుడు నాకు పెళ్లిచూపులు అని చెప్పాలంటేనే చాలా సిగ్గు పడుతున్నాను. ఫస్ట్ టైం ఇలా సిగ్గు పడుతున్నాను అంటే నాకు పెళ్లి కళ వచ్చేసిందన్నమాట. అసలు విషయం ఏమిటి అంటే ఈరోజు నా బర్త్ డే.  ప్రతీ సంవత్సరం నా పుట్టిన రోజు నాడు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం.  ఇక ఇప్పుడు మా అమ్మ నాకు చెప్పకుండా సీక్రెట్ గా ఒక అబ్బాయిని చూసింది. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు." అంటూ తన మేకోవర్ మొత్తాన్ని చూపించింది. పట్టుచీర కట్టుకుని కుందనపు బొమ్మలా కనిపించింది. ఐతే అసలు విషయం చెప్పలేదు అనుకుంటున్నారు కదా. ఆ విషయాన్ని మరో వీడియోలో చూపిస్తాను అని తన ఫాన్స్ ని ఊరించి వదిలేసింది. నెటిజన్స్ అంతా మోనితను విష్ చేశారు. సీరియల్ పూర్తయ్యాక పెళ్లి చూపులు పెట్టుకున్నారు..కంగ్రాట్యులేషన్స్ అంటున్నారు.

కొనబోయే కారు గురించి చెప్పిన శ్రీవాణి!

గ్రాండ్ విటారా కారుని కొనాలనుకుంటున్న బుల్లితెర నటి శ్రీవాణి. హైదరాబాద్ ట్రాఫిక్‌కి ఆటోమేటిక్ కార్ ఐతే బాగుటుందని ఆ కార్ కొంటున్నట్లు చెప్పింది.. ఈ కారులో ఉన్న కొత్త కొత్త ఆప్షన్స్‌ని తన ఫాన్స్ కోసం చూపించింది. ప్రతీ ఫీచర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయించింది. అలాగే ఇందులో మరో ఫెసిలిటీ కూడా ఉందని యాభై వేల వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయని చెప్పింది.  ఇక ఈ వాయిస్ కమాండ్ టెస్టింగ్ కోసం శ్రీవాణి భర్త విక్రమ్ "సుజుకి భోజనం చేశావమ్మా" అని కామెడీ చేసేసరికి అందరూ నవ్వేశారు. ఈ కార్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే ఒక నెల రోజులు క్లాసులకు వెళ్ళాలి అని అంది శ్రీవాణి. కార్ గురించి తెలుసుకున్న విక్రమ్ "ఇది కారా మనిషా" అనేసరికి ఈ కార్‌ని మరోసారి టెస్ట్ డ్రైవ్ చేసి కొనాలని డిసైడ్ చేసింది శ్రీవాణి. కార్ కొన్నాక దాని మీద కూడా ఒక వ్లాగ్ చేస్తానని చెప్పింది.  బుల్లితెర నటి శ్రీవాణి, ఆమె భర్త విక్రమాదిత్య ఈ మధ్య కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఈమె తన యూట్యూబ్ ద్వారా రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ అందరినీ అలరిస్తుంటుంది. 

వంటలక్క మ్యానియా ఈజ్ బ్యాక్!

బుల్లితెరపై అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ 'కార్తీక దీపం' అనే విషయం అందరికి తెలిసిందే.. కాగా ఈ సీరియల్ శుభం కార్డుకి టైం రానే వచ్చింది. ఈ సీరియల్ ముగుస్తుండటంతో ప్రేక్షకులు  నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. వంటలక్క, డాక్టర్ బాబులని చాలా మిస్ అవుతామని.. ఇన్ని రోజులుగా వాళ్ళని మా ఇంట్లో వాళ్ళలాగా భావించామంటూ సోషల్ మీడియాలో అభిమానుల చేసిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఈ సీరియల్ కోసం కొంతమంది పూజలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ సీరియల్ అంటే జనాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. అయితే ప్రేక్షకుల విన్నపం డైరెక్టర్ కి వినపడినట్లే ఉంది కాబోలు.. కార్తీక దీపం సీజన్-2 ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా డాక్టర్ బాబు, వంటలక్కలదే మెయిన్ రోల్ అంట.. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. 'కార్తీక దీపం'  ఈ టైటిల్ కలిసి రావడంతో అదే టైటిల్ తో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎక్కడ చుసినా "వంటలక్క మ్యానియా ఈజ్ బ్యాక్" అనే ట్యాగ్ లతో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కార్తీక దీపం సీజన్-2 ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కరీంనగర్ లో సందడి చేసిన యాంకర్ విష్ణు ప్రియ...!

తన అందం అభినయంతో ఆకట్టుకుంటోన్న విష్ణు ప్రియ  మొదటగా చిన్న చిన్న షోలకు యాంకరింగ్ చేస్తూ.. ఇప్పుడు తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చుకుంది. ఈ భామకి ఆఫర్స్ బీభత్సంగా రావడంతో ఒక్కసారిగా హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయింది. ఒకవైపు టీవీ షోస్, మరోవైపు ఈవెంట్స్ తో ఖాళీ లేకుండా బిజీ జీవితం గడుపుతోంది. రీసెంట్ గా బిగ్ బాస్  ఫేమ్ మానస్ తో ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో తన అందమైన అందాలతో మెరిసింది. అది సూపర్ హిట్ కావడంతో ఆఫర్స్ తనని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటూ.. తన ఫోటోస్ ని షేర్ చేస్తుంది. గత వారమే ఒకేషన్ అంటూ మాల్దీవులలో దిగిన  ఫొటోస్ ని షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. విష్ణు ప్రియ కరీంనగర్ లో సందడి చేసింది. ఆమె అక్కడ ఒక  ఇంటర్నేషనల్ బ్రైడల్ మేకప్ సెలూన్ ఓపెనింగ్ కి వచ్చి మీడియాతో మాట్లాడింది. "నాకు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది.  ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం గర్వంగా ఉంది" అంటూ మాట్లాడింది. అయితే విష్ణు ప్రియని చూడడానికి జనాలు బారులు తీరారు.  

టీడీపీ లీడర్ పరిటాల శ్రీరామ్ ని కలిసిన డాక్టర్ బాబు

డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల అందరికీ తెలుసు. కార్తీక దీపం సీరియల్ ద్వారా ఆయన ఎంతో ఫేమస్. డాక్టర్ బాబు, వంటలక్క క్యారెక్టర్స్ తో ఈ సీరియల్ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సీరియల్ కి శుభం కార్డు పడబోతోంది. ఈ టైములో నిరుపమ్ తన సీరియల్ టీమ్ తో కలిసి అనంతపురంని విజిట్ చేసాడు. అక్కడ టీడీపీ లీడర్ పరిటాల శ్రీరామ్ ని కలిసి ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. పరిటాల శ్రీరామ్‌ రియల్ హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. వాస్తవానికి ఇద్దరి ఇంటిపేరు పరిటాల కావడంతో బంధువులు అని అంతా అనుకునేవారు. కానీ.. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఓ ఇంటర్వ్యూలో నిరుపమ్ క్లారిటీ ఇచ్చాడు.  సోషల్ మీడియాలో నిరుపమ్ పరిటాల చాలా యాక్టివ్ గా ఉంటాడు. కార్తీకదీపం టీమ్‌తో కలిసి రెగ్యులర్ గా రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటాడు. నిరుపమ్ వైఫ్ మంజుల కూడా సీరియల్ యాక్టర్. కర్నాటకకి చెందిన మంజుల తొలుత కన్నడలో సీరియల్స్‌ చేసి..తర్వాత తెలుగులో చంద్రముఖి సీరియల్‌ ద్వారా పరిచయమయ్యింది. నిరుపమ్‌ని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు.. ఇంతకంటే మంచి హీరో దొరకలేదా మీకు? అని అడిగేసిందట. అప్పట్లో    సన్నగా, గుండుతో ఉన్న నిరుపమ్ ని ఫస్ట్ టైమ్ అలా చూసేసరికి మంజుల అలా అనేసిందట. ఆ తర్వాత అదే సీరియల్‌‌లో ఇద్దరూ ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నారు. నిరుపమ్ హిట్లర్ గారి పెళ్లాం, ప్రేమ, కలవారి కోడలు, కాంచన గంగ వంటి సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

'ఆర్ఆర్ఆర్' చూసి చిరంజీవికి మెసేజ్ పంపించిన రాధ!

'బిబి జోడి' ఇప్పుడు స్టార్ మా టీవీలో వస్తోన్న డ్యాన్స్ షో అని అందరికి తెలిసిన విషయమే. ఈ షోకి యాంకర్ గా శ్రీముఖి చేస్తుండగా జడ్జిలుగా సదా, తరుణ్ మాస్టర్, రాధ వ్యవహరిస్తున్నారు.  శనివారం రాత్రి ప్రసారమైన ఈ‌ ప్రోగ్రామ్ లో సూపర్ స్టార్ రౌండ్ జరిగింది. ‌ఈ రౌండ్ లో డ్యాన్స్ చేసే బిబి‌ జోడిలు ఒక సూపర్ స్టార్ ని సెలెక్ట్ చేసుకొని ఆ హీరోకి సంబంధించిన మ్యానరిజం, ఇంకా డ్యాన్స్ చేయవలసి ఉంటుంది. ఇక మొదటి డ్యాన్స్ జోడిగా కౌశల్, అభినయశ్రీ వచ్చి.. రామ్ చరణ్ ని సూపర్ స్టార్ గా తీసుకొని పర్ఫామెన్స్ చేసారు. వీరి డ్యాన్స్ తర్వాత శ్రీముఖి పర్ఫామెన్స్ గురించి జడ్జ్ లను అడుగగా మొదట తరుణ్ మాస్టర్ బాగుందని చెప్పాడు. ఆ తర్వాత రాధ తన అభిప్రాయం చెప్తూ... "రామ్ చరణ్ ని చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. కొందరు హీరోలు ఒకటి రెండు హిట్స్ వచ్చాక రిలాక్స్ అవుతారు.. కానీ రామ్ చరణ్ అలా కాదు.. ఒక్కో సినిమాకి ఇంకా కష్టపడుతూ తనని తాను మెరుగుపర్చుకుంటున్నాడు. మొన్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో అతని యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అంత బాగా చేసాడు. అది చూసి రామ్ చరణ్ గురించి చిరంజీవికి ఒక పెద్ద మెసేజ్ పంపించాను. అంత పెద్ద మెసేజ్ నేను ఇప్పటివరకు ఎవరికి పంపించలేదు" అని రాధ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత జోడీగా సూర్య, ఫైమా సూపర్ స్టార్ గా ప్రభాస్ ని ఎన్నుకొని డ్యాన్స్ చేసారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ ని సూపర్ స్టార్ గా తీసుకొని చైతు, కాజల్  జోడి పర్ఫామెన్స్ చేసారు. అఖిల్, తేజస్విని జోడి స్టార్ గా మహేష్ బాబుని ఎన్నుకొని డ్యాన్స్‌ చేసారు. ఆ తర్వాత స్కోర్ లో కౌశల్, అభినయశ్రీ జోడీ లీడింగ్ స్థానంలో ఉన్నారు. డేంజర్ జోన్ లో‌ అఖిల్, తేజస్విని ఉన్నారు. ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఈ జోడీలలో నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారో తెలుస్తుంది.

మోనితని పెళ్ళి చేసుకోమని డాక్టర్ బాబుకి చెప్పిన దీప!

'కార్తీక దీపం'  సీరియల్ శుభం కార్డుకి ఇంకా ఒక్కరోజే ఉండడంతో..  క్లైమాక్స్ ఎలా ఉంటుదోననే సస్పెన్స్ అందరిలోను నెలకొంది. కాగా ఇప్పుడు ఈ సీరియల్ ఎపిసోడ్ -1568 లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. దీపకి ఫోన్ చేస్తాడు వారణాసి. "మోనిత ఇంకా హిమ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు" అని చెప్తాడు. వారణాసి అలా చెప్పడంతో అందరూ మోనిత ఇంటికి బయలుదేరుతారు. వెళ్తున్న దారిలో.. "మోనిత నీ కోసం ఎంతకైనా తెగిస్తుంది. నేను వెళ్ళాక కూడా మిమ్మల్ని ఇలాగే టార్చర్ చేస్తుంది. నా చివరి కోరిక ఉంది అదైనా తీరుస్తారా?" అని దీప అంటుంది. "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. నీతోనే నేను. అది భూమ్మీదైనా, స్వర్గంలోనైనా" అని కార్తీక్ చెప్తాడు. మోనిత ఇంటికి అందరూ వెళ్తారు. హిమ తలపై గన్ పెట్టి బెదిరిస్తుంది మోనిత. అది చూసి భయంతో దీప కింద పడిపోతుంది. అయినా మోనిత కొంచెం కూడా కనికరం లేకుండా.. "నాకు రెండు కోరికలు ఉన్నాయి.. ఒకటి కార్తీక్ ని పెళ్ళికి ఒప్పించడం.. ఇంకొకటి దీప నోటితో నన్ను డాక్టర్ బాబు భార్య అని చెప్పాలి" అని తన కండిషన్స్ చెప్తుంది.  తను చెప్పమన్నట్లు చెప్పకుంటే హిమని చంపేస్తానని బెదిరిస్తుంది. "నేను పోయాక ఎవరినో ఒకరిని చేసుకుంటారు కదా.. అదేదో మోనితనే పెళ్లి  చేసుకోండి డాక్టర్ బాబు" అని దీప అనగానే మోనిత ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. కార్తీక్, సౌందర్య ఇద్దరు "తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు దీప" అని చెప్తూ ఉంటారు. అంతలోనే తొందరగా మోనిత దగ్గరికి వెళ్ళి తన చేతిలోని రివాల్వర్ తీసుకుంటుంది దీప. ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రాజీవ్ కి చక్రపాణి వార్నింగ్!

'గుప్పెడంత మనసు' సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్-666 లోకి అడుగు పెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. రిషి వసుధారలు గెస్ట్ హౌస్ లో ఉన్న విషయం తెలిసి దేవయాని.. "అసలు మీకెలా తెలుసు వాళ్ళు అక్కడ ఉన్నట్లు" అని మహేంద్రని అడుగుతుంది. అలా అనగానే వసుధార పంపిన వాయిస్ మెసేజ్ వినిపిస్తాడు మహేంద్ర. "ఇప్పుడు ఆ వసుధార మన బాధ్యతలు గుర్తు చేస్తుందా.. నిజంగానే రిషిని మీరు పట్టించుకోవడం లేదు. చిన్నప్పుడు జగతి రిషిని వదిలేసి వెళ్తే.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు వసుధార వల్ల రిషి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు" అని అంటుంది. అంతలోనే రిషి జగతికి ఫోన్ చేసి మేడం తొందరగా కాలేజీకి రండి మాట్లాడాలి అంటాడు. దానికి సరే అని బయలుదేరుతుంది. మరో వైపు చక్రపాణికి ఫోన్ చేస్తాడు రాజీవ్. తనది తప్పేం లేదు అని చెప్పే ప్రయత్నం చేసినా.. వినకుండా చక్రపాణి రాజీవ్ ని తిడతాడు. "నువ్వు నా కళ్ళ ముందు లేవు కాబట్టి బ్రతికిపోయావు.. లేదంటే నిన్ను చంపేసేవాణ్ణి" అని చక్రపాణి అంటాడు. "నన్ను మీరు చంపలేరు మామయ్య.. ఎందుకంటే మీరు చాలా మంచివారు‌. ఒకసారి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగాలని ఉంది" అని అనగానే చక్రపాణి ఫోన్ కట్ చేస్తాడు. "వసుధారకి బాక్స్ ఇవ్వండి" అని రిషికి ఇస్తుంది పుష్ప. అంతలోనే రిషి దగ్గరికి జగతి వస్తుంది. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. "నీ ఫ్లాట్  తాళం చెవి వసుధారకి ఇవ్వు. ప్రాజెక్ట్ హెడ్ గా తనకి ఫెసిలిటీస్ కల్పించడం మన బాధ్యత" అని జగతి చెప్తుంది.  రిషి, వసుధార ఇద్దరు మళ్ళీ ఎక్కడ ఒకటి అవుతారోనని దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. రాజీవ్ కి ఫోన్ చేసి " ఏరా ఎక్కడ చచ్చావ్" అని అనగానే .. "ఏరా అంటున్నావ్ ఏంటి" అంటూ కోపంతో మాట్లాడుతాడు రాజీవ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కృష్ణని ఒక్క మాట కూడా అనే రైట్ నీకు లేదు ముకుంద!

'కృష్ణ ముకుంద మురారి' ఈ సీరియల్ ఇప్పుడు 60వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో కృష్ణని మహాలక్ష్మిలాగా రెడీ చేసి తీసుకొస్తుంది రేవతి. అందరూ కృష్ణని చూస్తు అలాగే ఉండిపోతారు. నీ కోడలు ఎలా ఉంది పెద్దమ్మ అని మురారి అడగగానే.. తనకేంటి బాగానే ఉంటుందని భవాని చెప్తుంది. పూజ పూర్తి అయిన తర్వాత అందరికి హారతి ఇస్తూ వస్తుంటుంది కృష్ణ. హారతి తీసుకో ముకుంద అని అంటుంది. "ఇవి నా నగలు నువ్వు ఎందుకు వేసుకున్నావ్.. నా పెళ్ళికి భవాని అత్తయ్య నాకు ఇచ్చినవి.. నన్ను అడుగకుండా ఎందుకు వేసుకున్నావ్" అని ముకుంద అంటుంది. అలా అనగానే రేవతి మధ్యలో కలుగజేసుకొని "ఆ నగలు ఇంటి కోడళ్ళలో ఎవరైనా పెట్టుకోవచ్చు.. ఆ మాత్రానికే ఇంత రాద్దాంతం చేయాలా?" అని రేవతి ప్రశ్నిస్తుంది. "నాకు ఒక మాట చెప్పాలి కదా.. మీకు కొడుకు, కోడలు సంతోషంగా ఉంటే చాలు ఇంకెవరు అవసరం లేదు కదా" అని ముకుంద అంటుంది. "మాటలు మర్యాదగా రానివ్వు.. మా అత్తయ్య గారిని ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకోను" అని కృష్ణ అంటుంది.  ఇదంతా చూస్తున్న  భవాని ఆపండి... ఏంటీ ముకుంద నీకు సంస్కారం లేదా చిన్నా పెద్ద తేడా లేకుండా ఆ మాటలు ఏంటీ అని ముకుందని అడుగుతుంది. నగలు తీసుకునేటప్పుడు ఒక మాట అడగాలి కదా అని రేవతిని అంటుంది. "అసలు విషయం నగల గురించి కాదు అత్తయ్య ఇంట్లో నా ఉనికి గురించి.. ఇంటికి పెద్ద కోడలు అయినా కూడా పూచిక పుల్లను చూసినట్లు చూస్తారు. కూర్చున్న ప్లేస్ నుండి లేపుతారు.. ఎదురుగా వస్తే ఎందుకు వచ్చావ్ అంటారు" అంటూ ముకుంద ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. దీనంతటికి కారణం నువ్వే వెళ్లి ముకుందని సముదాయించు అని కృష్ణని పంపిస్తుంది. కృష్ణతో పాటుగా మురారి కూడా వెళ్తాడు.  ముకుంద వాళ్ళని చూసి గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. సహనం కోల్పోయిన మురారి కోపంతో ముకుందకి చెప్తాడు.‌ "కృష్ణని ఒక్క మాట కూడా అనే రైట్ నీకు లేదు ముకుంద" అని చెప్పి అక్కడి నుండి ఇద్దరు వెళ్ళిపోతారు. బెడ్ మీద పడుకొని ముకుంద చేసింది తప్పు అని కృష్ణ, మురారిలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ముద్దులే ముద్దులు...కాబోయే భర్తపై రష్మీ క్లారిటీ

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రతీ వారం సరికొత్తగా అలరిస్తూ వస్తోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంచుకున్న కాన్సెప్ట్ 'వింటర్ హనీమూన్ కాంటెస్ట్'.  రాబోయే ఎపిసోడ్ లో రష్మీ, హైపర్ ఆది, నరేష్ ఇతర కమెడియన్లు ఎప్పటిలాగే తమ పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఈ ఎపిసోడ్ లో   రియల్ లైఫ్ కపుల్స్ పార్టిసిపేట్ చేసి రొమాన్స్ చేశారు. వాళ్ళల్లో డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ కపుల్ కూడా ఉన్నారు. ఇంకొంతమంది డాన్స్ మాస్టర్స్ తమ తమ బెటర్ హాఫ్స్ తో  వచ్చారు.  రొమాంటిక్ కపుల్స్ తో దగ్గర ఉండి హనీమూన్ స్కిట్స్ చేయించారు హైపర్ ఆది, రష్మీ. రొమాన్స్ చేస్తున్న జంటలపై  ఆది కామెడీ పంచ్ లు వేయడం.. జడ్జి ఇంద్రజ.. "రియల్ కపుల్ రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు" అని కామెంట్ చేయడం ఆకట్టుకుంది.  ఇక కపుల్స్ మధ్యలో యాంకర్ రష్మి అలాగే హైపర్ ఆది ఇద్దరూ ఒక పేపర్ వేసి పెదాలతో ఆ కాగితాన్ని  పట్టుకోమని పోటీ పెట్టారు. ఇక సెలబ్రిటీ జంటలు గేమ్ ఆడుతూ ఉంటే మధ్యలో "పేపర్ ఆగినా నువ్వు ఆగేలా లేవు" అంటూ అర్జున్ అంబటి మీద హైపర్ ఆది పంచ్ వేసాడు. ఆ పేపర్ మిస్ అయ్యేసరికి  ఒకరినొకరు ముద్దులు కూడా పెట్టేసుకున్నారు. ఆది పక్కన ఉన్న లేడీ కమెడియన్ "ఈ చలిలో నాకు పెదాలు పగిలిపోతున్నాయి, చేతులు పగిలిపోతున్నాయి..నువ్వు పట్టించుకోవడం లేదు" అనేసరికి "నువ్వు పగిలిపోవడం గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఇక్కడ రగిలిపోవడం గురించి నువ్వు ఆలోచించట్లేదు" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక సింగర్ గణేష్ సాంగ్ పాడి అందరినీ అలరించాడు. కేరళ అమ్మాయి గెటప్ తో నాటీ నరేష్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఎపిసోడ్ లో రష్మీ పెళ్లి విషయం మళ్ళీ హైలైట్ అయ్యింది. రష్మీ పెళ్ళికి సంబంధించిన ఒక ఫోటోను స్క్రీన్ మీద చూపించారు. రష్మీ పక్కన ముఖం కనిపించకుండా కూర్చున్న అబ్బాయి గురించి అడిగారు. అందుకు రష్మీ ఎవరు, ఎప్పుడు వస్తున్నారంటే అంటూ క్లియర్ గా ఆన్సర్ చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసింది.

కొత్త ఇంటిని కొనుగోలు చేసిన ‘ఆట’ సందీప్

ఎవరు ఏ పని చేసినా తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ పడుతూ ఉంటారు.. అలాగే డబ్బు కూడబెట్టి ఏదో ఒకటి సొంతంగా సమకూర్చుకోవాలని చూస్తుంటారు. అలా కష్టపడి కారు, బైకు, ఇల్లు వంటివి కొనుక్కుని వాటికి యజమానులు అవుతారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘ఆట’ సందీప్ జోడీ వచ్చేసారు. ఆట సందీప్ అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న డాన్సర్. పది పదిహేనేళ్ల క్రితం ఆట, ఛాలెంజ్ లాంటి షోలు ప్రతి వీకెండ్ లోనూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేవి. ఆ టైంలో ‘ఆట’ ఫస్ట్ సీజన్ విన్నర్ గా నిలిచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్..తర్వాతి కాలంలో ఆట సందీప్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. తన తోటి డాన్సర్ ఐన జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం చిన్న సినిమాలు, ఈవెంట్స్ కి కొరియోగ్రఫీ చేస్తూ కాస్త బిజీగానే ఉన్న సందీప్ జోడి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇన్ స్టాలో షార్ట్ వీడియోస్ తో డాన్సులు చేయడం ఇంటరెస్ట్ ఉన్న వాళ్లకు స్టెప్స్ నేర్పించడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ జంట సొంత ఇల్లు కొనుక్కున్నారు. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది జ్యోతి. పెద్దవాళ్ళు అన్నారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. కానీ లైఫ్ లో ఈ రెండూ చాలా కష్టం. ఐదేళ్లు కష్టపడి వన్ మాన్ ఆర్మీలా ఎన్నో కష్టాలు పడి హోప్స్ అన్నీ వదిలేసుకుని ఫైనల్ గా మాకు నచ్చిన ఇల్లు కొనుక్కున్నాం అని ఎంతో సంతోషంతో చెప్పింది జ్యోతి. ఇక మూవీ యాక్టర్ స్నేహ కంగ్రాట్యులేషన్స్ అని మెసేజ్ పెట్టారు.

ఆయనతో వెళ్లడం అంటే సన్నీలియోన్ ని సంకనేసుకెళ్ళినట్టే!

సుడిగాలి సుధీర్ ని సన్నీ లియోన్ తో పోల్చాడు జబర్దస్త్ కమెడియన్ అవినాష్. ఈ మధ్య కాలంలో ఆహాలో "కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్" పేరుతో ఒక కామెడీ షో వస్తోంది. ఈ షోకి హోస్ట్ గా  చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఇదే షోలో వేణు, అవినాష్‌, సద్దామ్‌, జ్ఞానేశ్వర్, భాస్కర్ యాదమ్మ రాజు కామెడీ స్కిట్స్ చేస్తూ నవ్విస్తూ ఉంటారు.  ఇక రీసెంట్ గా స్ట్రీమ్ అవుతున్న ఎపిసోడ్ చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. ఇందులో అవినాష్  తన కామెడీ స్కిట్‌ లో భాగంగా 2017 లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. సుధీర్‌, వేణు, రాంప్రసాద్‌, ధన్‌రాజ్‌ ఇలా అందరు కలిసి ఈవెంట్స్ కోసం అమెరికా వెళ్లారట. వేణు అన్నని తీసుకెళ్తే ప్రిన్సిపల్‌ని సంకన పెట్టుకుని తీసుకెళ్లినట్టే ఉంటుంది. అక్కడికి వెళ్లొద్దు, ఇక్కడికి వెళ్లొద్దు అని కండిషన్స్ పెడతాడని చెప్పాడు. తర్వాత సుడిగాలి సుధీర్‌ గురించి చెప్తూ సుధీర్ తో టూర్‌ వెళితే సన్నీలియోన్‌ని సంకన పెట్టుకుని వెళ్ళినట్టే అని అన్నాడు. కుదురుగా ఉండడని, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం అంటూ ఉంటాడని చెప్పుకొచ్చాడు.  ఆ టైంలో తాము ఉన్న రూమ్ తనదంటూ ఒక రష్యాన్‌ అమ్మాయితో ఇష్యూ అయ్యిందని ఆ మేటర్ రాత్రి మొదలుకుని మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు సాగిందని చెప్పాడు. ఎవరి భాష ఎవరికీ అర్ధం కాకపోయేసరికి చివరికి సుధీర్ ఇంగ్లీష్ లో మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేసాడని చెప్తూ ఎన్నో రకాల ఎమోషన్స్ ని స్టేజి మీద పండించాడు అవినాష్‌. దీంతో అవినాష్ స్కిట్‌ నవ్వులు పూయించింది. చైర్మన్ అనిల్‌ రావిపూడి స్పందిస్తూ, ఇది ఏ సర్టిఫికేట్‌ స్కిట్‌ అని, కానీ అవినాష్‌ యు సర్టిఫికేట్‌ కోటింగ్‌ వేసి చెప్పాడని, సేఫ్‌ గేమ్‌ ఆడాడని, తను సేఫ్‌ కానీ సుధీర్‌ని ఇరికించేసాడంటూ చెప్పాడు.

బయట టూ లెట్ బోర్డు.. ఇంట్లో హిమతో మోనిత!

'కార్తీక దీపం' కి ఎలాంటి  ముగింపు ఉంటుందోనని అందరిలో సస్పెన్సు నెలకొంది. ఇప్పుడు ఈ సీరియల్ ఎపిసోడ్ -1567 లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. తనని రోడ్డు మీద పడుకోబెట్టిన దీపను వదలను అంటూ కోపంతో ఊగిపోతుంది‌ మోనిత.  సౌందర్య ఇంటికి భాగ్యం వచ్చి దీప గురించి ఆరా తీసేలోపే బయట నుండి దీప వస్తుంది. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటారు. అంతలో శౌర్య అక్కడికి వచ్చి "హిమ ఎక్కడా? కనిపించడం లేదు" అని అడుగుతుంది. "ఇందాక నేను వస్తుంటే హిమ బయటికి వెళ్ళింది. నా ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి ఎక్కడికి రావాలి అని అడిగింది" అని భాగ్యం చెప్పగా అక్కడే ఉన్న దీప తన ఫోన్ తీసుకొని నెంబర్ చెక్ చేస్తే మోనిత నెంబర్ రావడంతో.. ఒక్కసారిగా భయపడి నా కూతురిని ఆ మోనిత ఏం చేస్తుందోనని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. కాసేపటికి కార్తిక్ వస్తాడు. సౌందర్య, కార్తిక్, దీపలు కలిసి మోనిత దగ్గరకి వెళ్తారు. అయితే హిమకి వాళ్ళ నాన్న గురించి తప్పుగా చెప్తూ.. తన మాటలన్నీ వినేలా మాట్లాడుతూ ఉంటుంది మోనిత. మోనిత ఇంటికి వెళ్లేసరికి.. అక్కడ బయట తాళం వేసి టూ-లెట్  బోర్డ్ ఉంటుంది. అయితే హిమ, మోనిత ఇద్దరు లోపలే ఉంటారు. బయట తాళం వేసి ఉండటం చూసి హిమని మోనిత ఎక్కడికో తీసుకెళ్ళిందని దీప కన్నీటి పర్యంతం అవుతుంది. దీపని ఓదార్చుతాడు కార్తిక్. "హిమని అడ్డం పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అంతే కానీ హిమను ఏం చెయ్యదు" అని కార్తీక్ అంటాడు. ఆ మాటలను  శౌర్య వింటుంది. "మోనిత దగ్గర హిమ ఉందా? ఈ హిమ ఎప్పుడు ఇంతే ఎవరు చెప్పింది వినదు" అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!

కృష్ణ అనుకొని ముకుందను హగ్ చేసుకున్న మురారి!

'కృష్ణ ముకుంద మురారి' ఈ సీరియల్ ఇప్పుడు 59వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. విజయ్ తో పాటుగా ఇంట్లో వాళ్ళు అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. విజయ్ ప్రతీసారీ కృష్ణ, ముకుందలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అయితే విజయ్ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు మురారి జంటకు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇస్తాడు.  కృష్ణ, ముకుందలు ఇద్దరూ ఒకే కలర్ చీర కట్టుకోవడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ముకుంద పూలు సర్దుతుండగా వెనుక నుండి చూసి కృష్ణ అనుకొని మురారి పట్టుకుంటాడు. అటునుండి వస్తున్న రేవతి  గమనించి "ఏం చేస్తున్నావ్" అని మురారిని కోప్పడుతుంది. "నేను కృష్ణ అనుకొని పట్టుకున్నాను" అని మురారి అంటాడు. "తను కృష్ణా అని పట్టుకున్నాడు. మరి నీకేమైంది నువ్వు కృష్ణవి కాదు కదా ముకుందా.. నీకు తెలుసు కదా" అని రేవతి అనడంతో "మీ ఉద్దేశ్యం ఏంటీ అత్తయ్య.. అర్ధం కావడం లేదు" అని  అంటుంది. "నీ ఉద్దేశ్యమే నాకు అర్ధం కావడం లేదు" అని రేవతి చెప్తుంది. కృష్ణ నువ్వు ఇంకెప్పుడు ఈ చీర కట్టుకోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గాలిపటాలు ఎగురవెయ్యడంలో కుటుంబసభ్యులంతా పోటీ పడతారు. అందులో మురారి గాలిపటంకి ఉన్న ధారం తెగిపోతుంది. పోటీలో చివరగా కృష్ణ, ముకుందలు ఉంటారు. అయితే కృష్ణకి సపోర్ట్ ఇచ్చి దగ్గర ఉండి గెలిపిస్తాడు మురారి. అది చూసి ముకుంద తట్టుకోలేదు. ఆ తర్వాత కృష్ణ ని అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తూ ఉంటుంది రేవతి. ఇంట్లో వాళ్ళు అందరూ కృష్ణని ఆశ్చర్యపోతూ చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.