‘కార్తీక దీపం’ వంటలక్క మిస్సింగ్.. వెతికి పెట్టండంటూ అడిగిన నెటిజన్

కొన్ని నెలల క్రితం వరకు స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ మస్త్ ఫేమస్ అయ్యింది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ మూడు క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతూనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెన్సేషన్ సృష్టిస్తూ ఉండేది ఈ సీరియల్. వంటలక్కగా ప్రేమి విశ్వనాధ్ నటన అద్భుతః అనే ఆడియన్స్ చాల ఎక్కువ. ఇక సీరియల్ ఐపోయినా కూడా నిరుపమ్ పరిటాలను డాక్టర్ బాబు అనే పిలుస్తూ ఉంటారు. ఇక ప్రేమి విశ్వనాధ్, నిరుపమ్ జోడీగా కార్తీక దీపం సీక్వెల్ ఉంటుందని అప్పట్లో టాక్ వచ్చింది కానీ దాని గురించి అసలు ఇంతవరకు అప్ డేట్ ఏమీ లేదు. ఇక ప్రేమి విశ్వనాధ్ మాత్రం సీరియల్ ఐపోయిన తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. రీసెంట్ గా వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాధ్ ఇన్స్టాగ్రామ్ లో శారీ ఫోటో షూట్ కి చెందిన పిక్స్ ని పోస్ట్ చేసింది. "మిమ్మల్ని మీరే కాదు మీరు వేసుకునే అవుట్ ఫిట్ కూడా అందంగా మార్చుతుంది" అంటూ ఒక కాప్షన్ పెట్టింది. ఇక వంటలక్క పిక్స్ కి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   " హలో మేడమ్..మా ప్రేమి గారు మిస్ అయ్యారు  కొంచెం వెతికి పెడతారా..మీరు ప్రేమి గారి చిన్న చెల్లెలే  కదా..హాయ్ మై డార్లింగ్, మై స్వీట్ మెమరబుల్,  నా ఫేవరెట్ దీపా, ఎలా ఉన్నావు, నువ్వు ఎప్పుడు వస్తావు.. ప్రపంచంలోని అత్యుత్తమమైన, అందమైన వాటిల్లో ఒకటి నీ చిరునవ్వు, రెండవది నీ ప్రేమ...వావ్ సూపర్ మై ఏంజెల్ ..మీరు చూడడానికి  నయనతారలా, ఉంది, జ్యోతికలా ఉన్నారు  ప్రేమి మామ్ " అంటూ వాళ్ళ ప్రేమను, అభిమానాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేశారు. ఇక కార్తీక దీపం సీరియల్ లో లేడీ విలన్ గా హీరోయిన్ తో సమానగ్గ నటించిన మోనిత బిగ్ బాస్ సీజన్ 7 లో మిగతా కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చి రీసెంట్ గా ఎలిమినేట్ అయ్యింది.. ఇక ఈ ముగ్గురు తిరిగి ఏదైనా సీరియల్ కనిపిస్తారా...? కనిపిస్తే బాగుండు అనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్.  

రైతుబిడ్డకి బిగ్ బాస్ గిఫ్ట్.. అటు లవ్ ట్రాక్.‌. ఇటు స్పైతో స్నేహం!

ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఒక కామన్ మ్యాన్ గ్రాంఢ్ ఫినాలేకి రావడం ఇధే ప్రథమం. బిగ్ బాస్ సీజన్-7 లో కామన్ మ్యాన్ క్యాటగిరీలో అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎవరూ ఊహించనంత స్థాయికి ఎదిగాడు. పల్లవి ప్రశాంత్ ఫైనల్ కప్ కి ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. ప్రస్తుతం అర్జున్, యావర్, శివాజీ, ప్రియాంక, ప్రశాంత్, అమర్‌దీప్ హౌస్ లో ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ పద్నాలుగు వారాలు పూర్తిచేసుకొని పదిహేనవ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ చివరిదైన ఫినాలే వీక్ లో హౌస్ మేట్స్ యొక్క జర్నీ వీడియోలని చూపిస్తున్నాడు బిగ్ బాస్. మొన్న జరిగిన ఎపిసోడ్ శివాజీ జర్నీ వీడియోని టీవీలో చూసినవాళ్ళే ఎక్కువని టీఆర్పీలో చూస్తే అర్థమవుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొదట యావర్ జర్నీ చూపించిన బిగ్ బాస్.. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ జర్నీ వీడియోని చూపించాడు.  చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలోని 'ఘల్లు ఘల్లుమని' పాటతో ప్రారంభించాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో తన ఫోటోలని చూసుకున్నాడు ప్రశాంత్.  కాసేపటికి యాక్టివిటి ఏరియాకి రమ్మన్నాడు బిగ్ బాస్. "మట్టితో మనకున్న బంధం ప్రత్యేకమైనది. ఆ మట్టే మిగతావారికంటే నిన్ను ప్రత్యేకంగా చేసింది. మిమ్మల్ని ఆదరించి ఎంతోమంది మద్దతుగా కామన్ మ్యాన్ గా ఈ ఇంట్లో అడుగుపెట్టారు. మీ ప్రయాణం మొదలైనప్పటి నుండి ఎన్నో అనుభవాలు.. ఎవరి ఉద్దేశాలేంటో, ఎవరు మీవారో? ఎవరు కాదో తెలియక సంకోచంలో పడ్డ మీకు.. మిమ్మల్ని  సరైన  దిశలో నడిపే బంధం మీకు దొరికింది. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాస్క్ లలో గెలవడానికి మీ రక్తాన్ని సైతం చిందించడానికి వెనుకాడలేదు. ఆ తెగింపే మిమ్మల్ని సీజన్-7 మొదటి కెప్టెన్ ని చేసింది " అని బిగ్ బాస్ చెప్పగా.. థాంక్స్ అని ప్రశాంత్ అన్నాడు. "మీ కలని పట్టువదలకుండా ఇక్కడివరకు వచ్చి నెరవేర్చుకున్నారు. మిమ్మల్ని చూసే ఎందరికో పెద్ద కలలు కనడానికి, అవి నెరవేరేందుకు మొండి ధైర్యం ఉంటే సాధ్యమని ఎక్కడ తగ్గేదేలే లేదని నిరూపించారు. ఆకాశం నుండి జారే ప్రతీ నీటి బొట్టు భూమి మీద జీవానికి ఒక అవకాశమే.. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యమే విజయం. మీ జీవితంలో వచ్చే అవకాశాలన్ని  ఒడిసిపట్టే నైపుణ్యం ఈ ఇల్లు మీకు నేర్పిందని మీ ప్రయాణం ఓ సారి చూద్దాం" అంటూ జర్నీ వీడియోని చూపించాడు బిగ్ బాస్. "మహర్షి" సినిమాలోని 'భల్లుమంటు నింగి వొల్లు విరిగెను గడ్డిపరకతోన' పాటతో జర్నీ ప్రారంభించిన బిగ్ బాస్.. పండించిన బియ్యం ప్రశాంత్ గిఫ్ట్ ఇవ్వగా.. నాగార్జున ఒక మిర్చీ మొక్కని ఇచ్చాడు. శివాజీ, ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ ల మధ్య ఉన్న స్నేహాన్ని, రతిక-ప్రశాంత్ ల మధ్య లవ్ ట్రాక్ ని అద్భుతంగా ‌చూపించాడు బిగ్ బాస్.   

Guppedantha Manasu : భర్తను కాపాడుకోవడానికి భార్య ఆ పని చేయగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -945 లో శైలేంద్ర చేసే కుట్రలు మోసాలు చూడలేకపోతుంది ధరణి. వసుధార, మహేంద్ర దగ్గరికి ధరణి వచ్చి.. జగతిని చంపించింది తన భర్తనే అని, వాళ్ళకి తనకి తెలిసింది అంత చెప్తుంది. అది విని వసుధార మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు.. వాళ్ళతో పాటు ధరణి చెప్పేది అనుపమ కూడా వింటుంది. ఎండీ చైర్ కోసం ఇదంతా చేస్తున్నాడని ధరణి చెప్తుంది. ఆ తర్వాత వసుధారపై తను ప్రవర్తించిన తీరుని గుర్తుకు చేసుకొని వసుధారకి  అనుపమ సారీ చెప్తుంది. నీ మీద అనుమానంతో నిన్ను బాధపెట్టానని వసుధారతో అనుపమ అంటుంది. ఆ తర్వాత ధరణిని వసుధార తీసుకోని శైలేంద్ర దగ్గరికి బయలుదేరుతుంది. మరొకవైపు ధరణిని శైలేంద్ర పిలుస్తుంటాడు. ధరణి ఇంట్లో ఉండదు అప్పుడే దేవయాని వచ్చి.. ఎక్కడో ఉంటుందిలే అయిన ఈ మధ్య బాగా కలవరిస్తున్నావని దేవాయని అనగానే.. ధరణితో బాగుంటేనే కదా మనం చేసిన కుట్రలు ఎవరితో చెప్పదని శైలేంద్ర అంటాడు. ఈ మధ్య నువ్వు ఏం చేసిన చెప్పడం లేదు.. ఎటాక్ సంబంధించి చెప్పలేదు.. రిషి కన్పించకుండా పోవడానికి నువ్వేనా అని  శైలేంద్రని దేవయని అడుగుతుంది. శైలేంద్ర మాత్రం  కిడ్నాప్ చేసింది నేనే అని చెప్పకుండా.. రిషి గురించి ఇన్ని రోజులు టెన్షన్ పడ్డావ్  కదా ఇక వాడి వల్ల మనకేం టెన్షన్ ఉండదు. వాడు మనల్ని ఏం చెయ్యలేడని శైలేంద్ర అంటాడు.. ఆ తర్వాత శైలేంద్ర దగ్గరికి వసుధార, ధరణి వస్తారు. నేను శైలేంద్రతో మాట్లాడాలి. నువ్వు కాసేపు బయటకు వెళ్ళు అని  దేవాయనితో వసుధార అనగానే.. దేవాయని బయటకు వెళ్తుంది. మరొక వైపు మహేంద్రని అనుపమ అపార్థం చేసుకున్నందుకు  సారీ చెప్తుంది.  ఇక శైలేంద్రని రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని వసుధార అడుగుతుంది. నాకు తెలియదని  శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత నువ్వు అడగాల్సింది ఇలా కాదు.. బెగ్గింగ్ చెయ్యాలని శైలేంద్ర అనగానే.. వసుధార రిక్వెస్ట్ చేస్తూ రిషి ఎక్కడ అని అడుగుతుంది.. ఇలా కాదు అంటూ వాయిస్ పొగరు తగ్గాలని శైలేంద్ర అనగానే చేతులు జోడించి రిక్వెస్ట్ చేసి అడు

Brahamamudi: అప్పు ఉపవాసం.. రాజ్ లైఫ్ లోని ఆ అమ్మాయి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -278 లో... అనామిక, కళ్యాణ్ ల మొదటి శుభలేక కాలిపోవడం చూసి ఇదంతా కావ్య కావాలనే చేసింది. ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని అనామిక తల్లి అంటుంది. దాంతో మా వదిన అలాంటిది కాదని కళ్యాణ్ కావ్య సపోర్ట్ చేస్తు మాట్లాడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ , అనామికల పెళ్లి జరగాలని కావ్యే మొదటి నుండి సపోర్ట్ చేసింది. అలా కావాలని చెయ్యదని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఇదంతా అనుకోకుండా జరిగింది. దీన్ని వదిలేయండి. పెళ్లి తర్వాత మీ అమ్మాయికి ఈ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని రాజ్ చెప్పగానే.. అనామిక పేరెంట్స్ రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత రాజ్ కి శ్వేత ఫోన్ చెయ్యగానే అక్కడ నుండి తనని కలవడానికి వెళ్తాడు. మరొకవైపు రాజ్ చాలా మంచివాడు. ఇంత ఆస్తులు ఉన్న పెళ్లికి ముందు తన జీవితంలో ఏ అమ్మయి లేదని కనకం మురిసిపోతుంది. అవును నా భర్త ఇప్పుడు ఇప్పుడే నన్ను అర్థం చేసుకుంటున్నాడని కావ్య కూడా మురిసిపోతుంది. మరొకవైపు రాజ్ ఒక దగ్గరికి వెళ్లి శ్వేతా కోసం వెయిట్ చేస్తుంటే శ్వేత వచ్చి రాజ్ ని హగ్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావని శ్వేతని రాజ్ అడుగుతాడు. ఇలాగే ఉన్నాను నా మనసు అలాగే ఉంది. ఆ ప్రేమ అలాగే ఉందని శ్వేత చెప్తుంది. నీకు ఎప్పుడు నేను తోడు ఉంటానని శ్వేతతో రాజ్ ప్రేమగా అంటాడు. మరొకవైపు కళ్యాణ్ శుభలేక కాలిపోయిన విషయం గురించి బాధపడుతు ఉంటాడు. కావ్య ఇంకా ఇంట్లో వాళ్ళు అందరు వచ్చి దాని గురించి వదిలేయ్ అని చెప్తారు. రేపు గుడికి వెళ్లి దీపం వదిలి ఉపవాసం ఉండమని ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ కి చెప్తారు.  ఆ తర్వాత అదే విషయం అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి చెప్తాడు. కాసేపటికి అనామిక పేరెంట్స్ కన్నింగ్ గా అలోచించి.. నువ్వు ఉపవాసం ఉన్నానని అబద్ధం చెప్పు.. కళ్యాణ్ తో పెళ్లి జరగడం కంటే నీకు ఏది ఎక్కువ కాదని వాళ్ళకి తెలిసేలా చెయ్యి. నీకు కళ్యణ్ కి పెళ్లి అయ్యాక,‌ ఆ తర్వాత కథ నేను నడిపిస్తానని అనామిక తండ్రి అంటాడు.  మరొకవైపు అప్పుకి కనకం ఫోన్ చేసి.. ఉపవాసం ఉండమని చెప్తుంది. మొదట అప్పు ఒప్పుకోదు కానీ ఆ తర్వాత అప్పు ఒప్పుకుంటుంది. తరువాయి భాగంలో.. అందరు గుడికి వెళ్తారు.‌ కళ్యాణ్, అనామికల పెళ్లి జరగాలని కావ్య నూట ఎనమిది  ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుందని రాజ్ కావాలనే అంటాడు. ఆ తర్వాత కావ్యని ఎత్తుకొని రాజ్ ప్రదక్షిణలు చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషి సర్ తిరిగి వస్తాడా ? రోల్ ని రీప్లేస్ చేస్తారా ? డైలమాలో ఆడియన్స్

గుప్పెడంత మనసు సీరియల్ అంటే చాలు రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడనే అందరికీ గుర్తొస్తాడు..అందమైన మాష్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి రిషి సర్ క్యారెక్టర్ ని దాచి పెట్టేసి  రెండు వారాలుగా సీరియల్‌ ని నడిపించేస్తున్నారు. ఈ విషయాన్నీ మాత్రం  అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే   జగతి అలియాస్ జ్యోతి రాయ్ క్యారెక్టర్ ని చంపేశారు.. ఆమె మూవీస్ లో నటిస్తున్న కారణంగా ఈ రోల్ ని త్వరగా ముగించేశారు. అలాగే రిషి రోల్ ని కూడా ముగించేసినట్టేనా అంటూ ఫాన్స్ అనుమానిస్తున్నారు. రీసెంట్ గా మరో సీరియల్ "కృష్ణ ముకుంద మురారీ" లో కూడా  మురారీని మార్చేశారు... అసలైన క్యారెక్టర్ కి  యాక్సిడెంట్‌ అయ్యేలా చేసి ఫేస్ కి ప్లాస్టిక్‌ సర్జరీ చేసేసి కొత్త మనిషి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేసారు. ఇవన్నీ చూస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆడియన్స్ లో కూడా ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఐతే ఇంకో విషయం ఏంటంటే ముఖేష్ గౌడ.. గుప్పెడంత మనసు సీరియల్‌ తో సంపాదించుకున్న క్రేజ్‌తో బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయ్యాడు... ఆయన హీరోగా  ‘గీతా శంకరం’ అనే మూవీ త్వరలో రాబోతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ముఖేష్ గౌడ సరసన.. ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్‌  విడుదల చేశారు. ఐతే ఈ మూవీ నవంబర్ నుంచి షూటింగ్ జరుపుకుంటోంది.  ఈ సినిమా షూటింగ్ కోసమే ముఖేష్ గౌడ.. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక సీరియల్ కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ప్రస్తుతానికి ఈ క్యారెక్టర్ కి సంబందించిన కథలో చేంజెస్ చేసి రిషిని తప్పించినట్టు తెలుస్తోంది. ఐతే మూవీ షూటింగ్ పూర్తయ్యాక సీరియల్ లో చేస్తాడా..లేదంటే ఈ రిషి సర్ ప్లేస్ ని ఎవరితో ఐనా రీప్లేస్ చేస్తారా అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.  

ఇండిగో సర్వీసెస్ పై యాంకర్ శ్యామల ఫైర్...దిగొచ్చిన యాజమాన్యం

యాంకర్ శ్యామల గురించి అందరికీ తెలుసు. యాంకర్ గా ఆమెకు ఎంతో పేరుంది. అలాంటి శ్యామలకు ఇప్పుడు కోపం వచ్చింది. రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఒక వీడియోని పోస్ట్ చేసింది. తనకు ఎదురైనా ఒక ఇన్సిడెంట్ గురించి ఆ వీడియోలో చెప్పింది. అలాగే ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసెస్ మీద ఆమె ఫైర్ అయ్యింది. లగేజీ కోసం ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నా స్టాఫ్ ఎవరూ కూడా అప్ డేట్ ఇవ్వడం లేదని, లగేజ్ కోసం అడగడానికి కనీసం ఏ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండరూ అంటూ సీరియస్ అయ్యింది. లగేజ్ కోసం  అనౌన్స్మెంట్ కూడా చేయరని ఇలా జరగడం తనకు ఇది మూడో సారి అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇది వరకు చాలా మంది సెలెబ్రిటీలు ఎయిర్ పోర్టులో ప్రైవేట్ సంస్థల సేవల మీద ఫిర్యాదుల చేశారు. లగేజ్ మిస్ అయిందంటూ, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వరంటూ కూడా   కంప్లైంట్స్ చేసిన విషయం తెలిసిందే . ఇండిగో  డొమెస్టిక్ ఫ్లైట్ దిగాక  లగేజ్ విషయంలో  సంస్థ సరిగ్గా పని చేయడం లేదని ఫైర్ అయ్యింది. తనతో పాటు చాలా మంది పాసెంజర్స్  వెయిట్ చేస్తున్నారని, దాదాపు 45   నిమిషాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ అసహనం వ్యక్తం చేసింది.  అండ్ ఫైనల్లీ  శ్యామల వీడియో దెబ్బకు ఇండిగో  క్షణాల్లో ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసింది.  యాంకర్ శ్యామల ఇన్ స్టా స్టోరీకి రిప్లై ఇచ్చింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని సమస్యను పరిష్కరించింది. ఇలా వెంటనే స్పందించినందు కూడా బదులుగా థాంక్స్ అంటూ శ్యామల కూడా  రిప్లై ఇచ్చింది.  

ఇలా చూడగానే అలా డాన్స్..అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం

అలీతో ఆల్ ఇన్ వన్ షో ఈ వారం చాల సరదాసరదాగా సాగింది. ఈ షోకి జబర్దస్త్ కమెడియన్ సద్దాం, డాన్సర్ పండు, సింగర్ సమీరా భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ముందుగా పండుతో దోచేయ్ గేమ్ ని ఆడించాడు ఆలీ. "మన తెలుగు ఇండస్ట్రీలో స్క్రీన్ మీద చూసినప్పుడు అబ్బా ఎవరా హీరో  ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు అని అడిగితె ఎవరు పేరు చెప్తావ్" అంటూ ఆలీ అడిగేసరికి "జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం..అయన డాన్స్ బాగా వేస్తారు. ఆయన అన్ని మూవీస్ ఫాలో అవుతూ ఉంటాను. ఒకసారి నేను జై లవకుశ మూవీ షూటింగ్ కి వెళ్లాను. ఆ టైంలో ట్రింగ్ ట్రింగ్ అనే సాంగ్ షూటింగ్ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడే లొకేషన్ కి వచ్చారు అప్పుడే చూసి వెంటనే వేసేసారు. డాన్స్ మూవ్మెంట్స్ ని గుర్తుపెట్టుకుని స్టెప్స్  వేయడం అంటే డాన్సర్స్ గా మాకే చాలా కష్టం. 32 కౌంట్స్ ని గుర్తు పెట్టుకోవాలి అంటే చాల టఫ్. కానీ ఆయన మాత్రం అలా కాదు. శేఖర్ మాష్టర్ డాన్స్ స్టెప్స్ ని హాఫ్ హాఫ్ కౌంట్స్ చూపించారు అవి చూసారు..వెంటనే టేక్ కి వెళ్లిపోయారు. టేక్ కూడా ఓకే ఐపోయింది. నాకే చాల ఆశ్చర్యమేసింది. ఇంత షార్ప్ గా ఉన్నారేమిటా అనిపించింది. ఒక డాన్సర్ కి ముందుగా కావాల్సింది అదే. ఏ స్టెప్ చూపిస్తే ఆ స్టెప్ అలాగే షూటింగ్ లో దింపేయడమే. డాన్స్ నేర్చుకుని స్టైలిష్ గా పెర్ఫార్మ్ చేయడం ఒక ఎత్తు కానీ ఇలా చూసి అలా గుర్తుపెట్టుకుని వెంటనే టేక్ లో ఓకే ఐపోవడం అనేది ఆయన గొప్పతనం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాల ఇష్టం. పండు ఈమధ్య బుల్లితెర మీద అన్ని రకాల షోస్ లో కనిపిస్తూ తనదైన స్టైల్ డాన్స్ వేస్తూ అలరిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు.

మంచు మనోజ్ నిద్రపోవాలంటే అది ఉండాల్సిందే..ఛీఛీ డర్టీ ఫెలో

ఈటీవీ విన్ యాప్ లో కొత్త గేమ్ షో రాబోతోంది. అదే "ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం". ఇక ఈ షోకి మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ కి "హాయ్ నాన్న" మూవీ నుంచి నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షో స్టేజి మీదకు నాని ఎంట్రీ ఇచ్చేసరికి ఆడియన్స్ అంతా కలిసి కార్డు బోర్డ్స్ మీద నాని అని లెటర్స్ ని హార్ట్ సింబల్స్ లో రాసి వెల్కమ్ చెప్పారు. ఇక మంచు మనోజ్ అది చూసి షాకయ్యాడు. "ఎన్నో రకాల వెల్కమ్స్ ని చూసా కానీ ఇలాంటి వెల్కమ్ ని చూడలేదు" అన్నాడు. ఇక ఇందులో నానికి టాస్క్ ఇచ్చాడు మనోజ్. "ఇప్పుడు నువ్వు నా నాన్నవు..నేను నీ కొడుకును..నన్ను నిద్రపుచ్చి..నువ్వు లోపలి వెళ్ళాలి" అని మనోజ్ చెప్పేసరికి "నిన్ను పడుకోబెట్టాలంటే ఫుల్ తాగించాలనుకుంటా" అంటూ ఒక సిగ్నల్ ఇచ్చాడు నాని. "నీకు అమ్మకు మధ్యలో వచ్చి పడుకున్నా" అంటూ ఒక డైలాగ్ వేసాడు మనోజ్ ..దానికి నాని "ఉండు మీ అమ్మకు ఫోన్ చేస్తున్నా" అనేసరికి "వొద్దొద్దు" అంటూ లేచి వెళ్ళిపోయాడు. మధ్యలో ఇంకో టాస్క్ ఇచ్చాడు మనోజ్..హీరోయిన్స్ పిక్స్ చూపించి అన్ని వరసగా పెట్టమనేసరికి "నాజియా, మృణాల్ ఎవరు ముందు...మృణాల్ మధ్యలో వస్తుంది.." అనేసరికి "ఎవరి మధ్యలో" అంటూ కొంటె డైలాగ్ వేసాడు మనోజ్.."ఛిఛి డర్టీ ఫెలో" అన్నాడు నాని. ఇక చివరిలో దసరా మూవీ సాంగ్ కి డాన్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు నాని, మనోజ్ . ఇక మంచు మనోజ్ ఎలా హోస్టింగ్ గురించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. " మంచు మనోజ్ హోస్ట్ అంటే ఎలా చేస్తాడో అనుకున్నాను బాస్ ఫస్ట్ లో పర్లేదు బాగానే లీడ్ చేస్తున్నాడు హోస్ట్ గా గుడ్ .. మనోజ్ అన్న ఇంకా  మారలేదు అదే కామెడీ అదే పంచెస్...మనోజ్ అన్నా షో  చాలా మంచి హిట్  అవ్వాలని" ఎన్టిఆర్ ఫాన్స్ కోరుతున్నారు.  

ముగిసిన ఢీ ప్రీమియర్ లీగ్..75 లక్షలు గెలుచుకున్న గ్రీష్మ

  ఢీ ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలే ఆడియన్స్ ని బాగా అలరించింది. ఇందులో హైదరాబాద్ ఉస్తాద్స్ గ్రీష్మ మాస్టర్  వార్సెస్ సైరా రాయలసీమ ప్రభు మాస్టర్ మధ్య గట్టి పోటీ జరిగింది. అన్ని రకాల రౌండ్స్ లో ఈ రెండు టీమ్స్ పోటాపోటీగా పెర్ఫార్మ్ చేశాయి. గ్రీష్మ మాస్టర్  హీరో నాని విన్నింగ్ టైటిల్ తో పాటు కాష్ ప్రైజ్ 75 లక్షలు అందించారు. ఇక చివరిగా నాని కొన్ని మాటలు వీళ్లకు చెప్పారు. "మీరు స్క్రీన్ మీద చాలామంది డాన్స్ చేయడాన్ని చూసి చాల ఇన్స్పైర్ అయ్యి ఈ స్టేజి మీద డాన్స్ చేసి ఉంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా కదా మీకంటే కూడా వాళ్ళెవరూ అంత బాగా చేయలేదు. ఇక గ్రీష్మ గురించి ప్రభుదేవా మాస్టర్ కూడా కొన్ని విషయాలు చెప్పాడు "గ్రీష్మ టైటిల్ విన్ ఐనందుకు చాల సంతోషంగా ఉంది. మేమిద్దరం కలిసి ఢీ జోడిలో చేసాం. గ్రీష్మ చాల కష్టపడుతుంది. ఇక షో స్టార్టింగ్ లో నానిని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగాడు హోస్ట్ ప్రదీప్ "ఇంట్లో మీరు వంట చేసి ఎవరైనా తినగలిగే ఐటెం ఏమిటి" అనేసరికి " ఆ నమ్మకం లేకే ఇంతవరకు వంట చేయలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే వేరుశెనగగుళ్ళను ఉడకపెట్టడం నేను ఒక్కడినే చేస్తాను" అన్నాడు. "మలయాళంలో అమ్మాయిలంతా మిమ్మల్ని బావ అని పిలుచుకుంటారు" అనేసరికి నాని ఆన్సర్ చెప్పకుండా ఇదేదో ఆడియన్స్ అడిగిన ప్రశ్నల్లా లేవు అని కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఆది కూడా శేఖర్  మాస్టర్  ని కొన్ని ప్రశ్నలు అడిగి ఎంటర్టైన్ చేసాడు. ఇలా ఈ వారంతో ఢీ సీజన్ 16 ముగిసింది.  

Brahmamudi:శుభలేకకి నిప్పు.. వారి పెళ్ళిలో మరో ముప్పు...!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -277 లో... అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి.. ఇంటికి రమ్మని చెప్తాడు. ఆ విషయం వెనకాల ఉన్న కనకం వింటుంది. అదే విషయం కనకానికి కళ్యాణ్ చెప్తాడు. మొక్క విషయంలో నా ప్లాన్ ఫెయిల్ అయింది. ఈ సారి సరిగ్గా ప్లాన్ చెయ్యాలని కనకం ఆలోచిస్తుంది. ఇక అనామిక వాళ్ళు ఇంటికి వచ్చి తాంబులాలు మర్చుకున్నట్లు కుంకుమభరని కనకం కిందపడిపోయినట్లు, ఇక అపశకునమని పెళ్లి కాన్సిల్ చేసినట్లు కనకం ఓ కల కంటుంది. కాసేపటికి అప్పు వచ్చి పిలవగానే.. ఇదంతా కల కన్నానా అని అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి సరిగ్గా టైమ్ కీ వచ్చావంటూ అప్పు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. మరొక వైపు ఇంట్లో అందరు బిజీగా ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నవని రుద్రాణిని రాహుల్ అడుగుతాడు. మనకి ఆ స్వప్నని కోడలుగా చేసి వాళ్ళు మాత్రం మంచి ఇంటి నుండి సంబంధం తెచ్చుకుంటున్నారు. నాకు దక్కని అనందం ఎవరికి దక్కడానికి వీలు లేదని రుద్రాణి అంటుంది. ఎలాగు దోషం ఉందని చెప్పారు కదా, ఇప్పుడు ఏం జరిగిన దాని వల్లే జరిగిందని అనుకుంటారు. అది మనం చెయ్యకూడదు కావ్య వల్లే జరిగిందని అనేలా చెయ్యాలని రాహుల్ తో ఒక ప్లాన్ చెప్తుంది రుద్రాణి. మరొకవైపు అనామిక పేరెంట్స్ దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఇరు కుటుంబాలు తాంబులాలు‌ ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక కనకం ఉహించుకున్నట్లుగానే కుంకుమభరని కిందకి పడేయ్యబోతుంటే ధాన్యలక్ష్మి చూసి కిందకి పడకుండా పట్టుకుంటుంది. ఆ తర్వాత మొదట శుభలేకని దేవుడి దగ్గర పెట్టి కావ్య పూజ చేస్తుంటుంది. అయితే దీనికి ముందు.. శుభలేకకి పెట్టిన పసుపులో ఏదో మందు కలుపుతుంది రుద్రాణి. ఇక కావ్య పూజ చేసి.‌. శుభలేకతో హారతి ఇస్తుండగా మంట అంటుకుంటుంది. దాంతో అందరు కంగారుపడతారు శుభలేకకి ఉన్న మంటని కావ్య ఆర్పుతుంది . ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావంటు కావ్యని రుద్రాణి తిడుతుంది. అది విని అనామిక పేరెంట్స్ కూడా కావ్యనే తప్పు పడుతారు. నీ అజాగ్రత్త వల్ల ఏం జరిగిన.. అది నా కూతురు దోషం వల్లే అయిందని అనుకుంటారనే ఇదంతా చేసావా? ఇందాక మీ అమ్మా కుంకుమభరిని పడేయబోతే ధాన్యలక్ష్మి పట్టుకుంది. అసలు ఈ అమ్మయికి ఈ పెళ్లి ఇష్టం లేదు కావచ్చని కావ్యని అనామిక వాల్ల అమ్మ అనగానే.. అలా అనకండి అని కళ్యణ్ అంటాడు. అప్పుడే కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటాడు. తరువాయి భాగంలో.. ఇంత ఆస్తులు ఉన్నా రాజ్ జీవితం లో పెళ్లి కాకముందు అతని జీవితంలో ఏ అమ్మాయి ఉండకపోవడం నీ అదృష్టమని కావ్యతో కనకం చెప్తుంది. అవునని కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు శ్వేత అనే అమ్మాయిని రాజ్ రహస్యంగా కలుస్తాడు. ఆ అమ్మయిని కౌగిలించుకొని.. నీకు నేను ఉన్నానని ఎప్పటికి మర్చిపోకు శ్వేత అని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Guppedantha Manasu:జగతిని చంపింది శైలేంద్రే అని తెలుసుకున్న అనుపమ.. ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -944 లో ముకుల్ చేసిన ఇన్వెస్టిగేషన్ తప్పని శైలేంద్ర డ్రామా క్రియేట్ చెయ్యడంతో ఇక ఎవరికి ఏది నమ్మాలో అర్థం కాదు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర తమ ప్లాన్ సక్సెస్ అని  హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అప్పుడే  ధరణి వచ్చి ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉన్నది మీరే కాదా అని అడుగుతుంది. అవును నేనే కానీ ఇప్పుడు మారిపోయానని శైలేంద్ర నటన మళ్ళీ మొదలుపెడతాడు.  ఆ తర్వాత శైలేంద్ర, దేవాయని ఇద్దరు ఎంత నటించిన ధరణి నమ్మదు. వాళ్లపై కోపంగా బయటకు వెళ్తుంది. ధరణి నమ్మట్లేదని దేవాయని అనగానే.. తనని ఎలా నమ్మించాలో నాకు తెలుసని శైలేంద్ర అంటాడు. మరొకవైపు జగతి ఇన్వెస్టిగేషన్ గురించి ముకుల్, అనుపమ మాట్లాడుకుంటారు. ఈ కేసు ప్రధాన నిందితుడు శైలేంద్ర అని ముకుల్ అంటాడు. మీకేలా తెలుసు అంటూ అనుపమ అడుగుతుంది. ఆధారం దొరికిన వెంటనే తనపై ఎటాక్ జరగడమేంటి? మళ్ళీ ఇప్పుడు రిషి కన్పించకుండా పోవడమేంటి? అంత ఒక పజిల్ లా ఉంది. ఎలాగైనా ఈ కేసుకి సంబంధించిన నిందితులని పట్టుకుంటానని ముకుల్ అంటాడు. ఈ కేసుకి సంబంధించి ఏదైనా కావాలంటే నా ఇన్ ఫ్లుయెన్స్ ఉపయోగిస్తానని అనుపమ చెప్తుంది. మరొకవైపు తనకు తానే ఎటాక్ చేయించుకున్న శైలేంద్ర.. ఎటాక్ చేసిన రౌడీలతో మాట్లాడుతుంటే దూరంగా ఉండి వింటుంది. మీరు చాలా బాగా చేశారు. నేను చెప్పినట్టు నాపై ఎటాక్ చేశారని ఆ రౌడీలతో శైలేంద్ర మాట్లాడుతూ.. వాళ్ళకి డబ్బులు ఇవ్వడాన్ని ధరణి చూసి షాక్ అవుతుంది. మరొకవైపు రిషి గురించి మహేంద్ర, వసుధార ఆలోచిస్తుంటారు. అప్పుడే ధరణి కంగారుగా వసుధార, మహేంద్ర దగ్గరికి వచ్చి... ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉన్న వాయిస్ మా అయన శైలేంద్రదని అనగానే ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత శైలేంద్ర చేసిన తప్పుల గురించి చెప్తూ.. ఈ ఎటాక్ కూడా తనే చెప్పించుకున్నాడు. ఇందాక ఆ ఎటాక్ చేసిన రౌడీలతో మాట్లాడుతుంటే విన్నానని ధరణి చెప్తుంది. అప్పుడే అనుపమ వచ్చి ధరణి మాటలు విని.. నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. నిజమే అంటు ఎండీ చైర్ కోసం ఇదంతా శైలేంద్ర చేస్తున్నాడని ధరణి  చెప్తుంది. ఇన్ని రోజులు జగతిని ఎవరు చంపారంటూ అడిగావ్ కదా? ఇప్పుడు తెలిసిందా అని అనుపమతో‌ మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:కోనేరులో పడిపోయిన కృష్ణ.. మురారికి గతం గుర్తొచ్చేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -338 లో.. కృష్ణ ఒకవైపు మురారి, ముకుందలు ఒక వైపు తులసి పూజా చేస్తుంటారు. కృష్ణ, మురారి దూరంగా ఉన్న.. పక్కన ఉన్నట్టు ఫీల్ అయి మురారిని చూస్తూ పూజ చేస్తుంటుంది కృష్ణ. అటువైపు మురారి పక్కన ముకుంద ఉన్న కూడా పట్టించుకోడు. దాంతో ముకుంద డిస్సపాయింట్ అవుతుంది.  ఆ తర్వాత భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. పూజ అయిపొయిందా అని అనగానే ముకుంద చిరాకుగా చెప్పడం తో ఏమైందని అడుగుతుంది. దాంతో ముకుంద పూజ దగ్గర జరిగింది చెప్తుంది. నీది తప్పు కాదు. నాది తప్పు అసలు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక వాళ్ళని ఇక్కడి వరకు రానివ్వకుండా ఉంటే, ఇక్కడి వరకు  వచ్చేది కాదని భవాని అంటుంది. ఆ తర్వాత కృష్ణకి మీపై చాలా గౌరవం అందుకే ఇప్పుటి వరకు నిజం చెప్పకుండా ఆగింది. నిన్ను రాత్రి కూడా కృష్ణ భర్త ఎవరని అందరిని అడిగి కోపంగా కృష్ణ దగ్గరికి వెళ్లి అడిగాడు కృష్ణ. అప్పుడు కూడా నిజం చెప్పలేదు. చెప్తే ఇంట్లో వేరేలా ఉండేదని ముకుంద అనగానే.. కృష్ణ అంత మోసం చేసిన తన గురించి పాజిటివ్ గా చెప్తున్నావ్. అది నాకు బాగా నచ్చింది. మురారికి కాబోయే భార్యకి ఉండే అర్హత నీకు ఉందని ముకుందతో భవాని అంటుంది. మురారికి పెళ్లి చేస్తానని భవాని చెప్పగానే ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ దగ్గరికి మురారి ఆపిల్ ముక్కలు, చట్నీ తీసుకోని వస్తాడు. అది చూసి మురారికి గతం గుర్తుకు వస్తుందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అందరు గుడికి వస్తారు. కృష్ణ కూడా వస్తుంది. ముకుంద, భవాని తప్ప అందరూ కృష్ణతో సరదాగా మాట్లాడుతుంటే.. చూడండి అందరూ కృష్ణతో ఎలా సరదాగా ఉన్నారో అని ముకుంద అంటుంది. వాళ్ళ దగ్గరికి భవాని వెళ్లి.. అందరు రండి ఒక కృష్ణ తప్ప అంటుంది. దాంతో అందరు వెళ్ళిపోతారు కృష్ణ ఒక్కతే ఉందని బాధపడుతు ఉంటుంది. మరొక వైపు ముకుంద మురారి ఇద్దరు పూజ చేస్తుంటారు. అది చూడలేక నందు, మధు ఇద్దరు కృష్ణ దగ్గరికి వస్తారు.  నిన్న రాత్రి నీ భర్త ఎవరని మురారి అడిగినప్పుడు.. ఏమని చెప్పావ్ అని నందు అడుగుతుంది. గతం గుర్తుక వస్తే నా భర్త ఎవరో తెలుస్తుందని చెప్పానని నందుకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత మీ ఈడు గల మూత్తయిదువులతో కంకనాలు కట్టించాలని పంతులు చెప్తాడు. ఎవరు.. ఉన్నారని భవాని అనగానే కృష్ణ ఉంది కాదా అని మురారి అంటాడు. తరువాయి భాగంలో.. కృష్ణ, ముకుంద ఇద్దరు మాట్లాడుకుంటు ఉండగా కృష్ణ కోనేరులో పడిపోతుంది. ఏసీపీ సర్ కాపాడండని కృష్ణ అరుస్తుంటే.. మురారికి గతం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శివంగి ప్రియాంక గేమ్ ఆన్.. జర్నీ అదుర్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో‌ ఇప్పటికే పద్నాలుగు వారాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న అమర్, ప్రశాంత్,‌యావర్, శివాజీ, ప్రియాంక ఫినాలే వీక్ లో‌ ఉన్నారు. ‌కాగా మొదటి రోజు అనగా సోమవారం నాటి ఎపిసోడ్ లో అమర్ దీప్,‌ అంబటి అర్జున్ ల జర్నీ వీడియోలని చూపించిన బిగ్ బాస్ .. నిన్నటి ఎపిసోడ్ లో మొదట శివాజీ బ్లాక్ బస్టర్ జర్నీ చూపించి ఆ తర్వాత ప్రియాంక జర్నీని చూపించాడు‌ బిగ్ బాస్. మొదటగా గార్డెన్ ఏరియాలో ప్రియాంక హౌస్ లో‌ గడిపిన కొన్ని జ్ఞాపకాలని ఫోటలలో చూపించగా.. ఒక బిబి మెమరీ గిఫ్ట్ అని శివ్ వచ్చినప్పటి ఫోటో చూసి ఇంప్రెస్ అయింది. ఎవరితో స్నేహం సరైనదో, ఆటలో ముందుకు వెళ్లేందుకు ఏ దారిని ఎంచుకోవాలో మీకు స్పష్టత ఉంది. ఇంటికి ఆయువుపట్టు లాంటి కిచెన్‌కి ఉన్న శక్తిని అర్థం చేసుకొని అక్కడి నుంచే మీ ఆటని కొనసాగించారు. సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు శివంగి ప్రియాంకగా మారి నామినేషన్లలో విరుచుకపడ్డ తీరు మీరేంటో అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఎవరు ఎన్ని మాటలన్న వాటి నుంచి తేరుకొని మీ లక్ష్యంపై దృష్టి పెట్టారు తప్ప ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు అంటూ ప్రియాంక గురించి బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. ఇక తన జర్నీ వీడియో చూసుకొని ప్రియాంక తెగ ఎమోషనల్ అయిపోయింది. అసలు బిగ్‌బాస్ మాట్లాడుతుండగానే ప్రియాంక కంట్లో నీళ్లు వచ్చేశాయి. తన జర్నీని ఇంత అద్భుతంగా చూపించినందుకు సంతోషంతో ఉప్పొంగిపోయింది ప్రియాంక. అయిన ఫైనలిస్టుగా చోటు సంపాదించిన ప్రియాంక ఈ నాలుగు రోజులు హౌస్ లో ఉంటుందా లేదా చూడాలి మరి.  

సరైన సమయంలో సరైన పావులు కదిపిన చాణక్యుడు.. బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది!

బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ కప్ కి మరికొన్ని రోజులే ఉండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారి జర్నీ వీడియోలతో సర్ ప్రైజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. రోజుకి ఇద్దరి జర్నీ వీడియోలతో ప్రేక్షకులకు మళ్లీ కంటెస్టెంట్ ఆటతీరు, మాటతీరుని చూపిస్తున్నాడు. మొన్న అమర్, అర్జున్ ల జర్నీ చూపించగా.. నిన్న శివాజీ, ప్రియాంకల జర్నీ చూపించాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో మొదట శివాజీని గార్డెన్ ఏరియాకి పిలిచాడు బిగ్ బాస్. అక్కడ తను హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన జ్ఞాపకాలని గుర్తుచేస్తూ తీసిన ఫోటోలని చూసి మురిసిపోయాడు. ఇక ఆ తర్వాత యాక్టివిటి ఏరియాకి పిలిచి తన జర్నీ వీడియో చూపించాడు బిగ్ బాస్. ఇక ఈ జర్నీ చూస్తూ.. నా ఇరవై సంవత్సరాల సినిమా కెరీర్ ఒక ఎత్తు, లైఫ్ లో బిగ్ బాస్ ఒక ఎత్తు అని శివాజీ చెప్పాడు. శివాజీ.. మిమ్మల్ని ఒక వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు వాళ్ళ వైపే ఉండేలా చేయగల మాటకారి మీరు అని బిగ్ బాస్ చెప్తూ.. రాజుగారి పెద్ద పెళ్ళాం మంచిదంటే చిన్నపెళ్ళాం చెడ్డదని కాదని శివాజీ చెప్పిన మాటలని ప్లే చేసి చూపించాడు బిగ్ బాస్. మీ గాయం మిమ్మల్ని ఎంత వేధించిన ఓటమి వైపు చూడలేదు. మీ అబ్బాయి డాక్టర్ గా వచ్చినప్పుడు మీ బాధనంతా మర్చిపోయారని బిగ్ బాస్ చెప్తుండగా శివాజీ ఎమోషనల్ అయ్యాడు. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణక్యుడులా నిలిచాడని టాస్క్ లో శోభాశెట్టితో శివాజీ డిఫెండ్ చేసిన వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. ఈ పూర్తి సీజన్ లో మీ మీద పైచేయి సాధించిన ఒకే ఒక విషయం ఏంటో తెలుసా.. కాఫీ. అలా చెప్పి శివాజీ కాఫీ కోసం పడే ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపించాడు. కంటెస్టెంట్ గా మొదలై కన్ఫమేషన్ పొంది హౌస్ మేట్ అయ్యారు. మీ ఆటతీరే మిమ్మల్ని ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని బిగ్ బాస్ చెప్పగా.. థాంక్స్ బిగ్ బాస్ అని శివాజీ చెప్పాడు. పంజా సినిమాలోని " నీ చిరు చిరు చూపులే పంజా" పాటని ఏవీ చివరలో ప్లే చేసాడు. ఇది పవర్ ఫుల్ జర్నీగా బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది. శివాజీ బిగ్ బాస్ టైటిల్ విజేత అని దీన్ని బట్టే తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే శివాజీ తన ఫెయిర్ గేమ్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. హౌస్ లో ఏదైన టాస్క్ తర్వాత శివాజీ పక్కన ఎవరైన హౌస్  మేట్ ఉంటే.. వారిద్దరిలో ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేయండి అని బిగ్ బాస్ చెప్తే.. మిగిలిన అందరు కలిసి శివాజీకే ఓట్ వేస్తారనేది అందరికి తెలిసిన నిజం. ఎందుకంటే శివాజీలో ఆటలో ఫౌల్,  మాటల్లో నెగెటివ్ అంటు ఏమీ ఉండవు. అందుకే అతడిని శివాజీ.. ది బాస్  అంటు ప్రేక్షకులు కామెంట్లలో తెలుపుతున్నారు. 

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ప్రియాంక.. అర్జున్ కి ఉల్టా పుల్టా ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-7 విజయవంతంగా పద్నాలుగు వారాలు పూర్తిచేసుకుంది. ఇక ముగింపుకి వచ్చేసింది. హౌస్ లో ఫినాలే వీక్ నడుస్తోంది. ఇందులో ఒక్కో‌ కంటెస్టెంట్ యొక్క జర్నీ వీడియోలని చూపిస్తున్నాడు బిగ్ బాస్. అయితే మొదట అమర్ దీప్ జర్నీ వీడియోని చూపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత అంబటి అర్జున్, నిన్నటి ఎపిసోడ్ లో మొదట శివాజీ జర్నీ, ఆ తర్వాత ప్రియాంక జర్నీ వీడియోలని చూపించాడు బిగ్ బాస్. ఇంకా యావర్, ప్రశాంత్ ల జర్నీ వీడియోలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే యావర్, ప్రశాంత్, శివాజీ ఇప్పటికే అత్యధిక ఓటింగ్ తో టాప్-3 లో ఉన్నారు. కానీ అమర్ దీప్, అంబటి అర్జున్, ప్రియాంకకి లీస్ట్ ఓటింగ్ పడుతోంది. అయితే ఇప్పటికి జరిగిన ఓటింగ్ ప్రకారం బాటమ్-2 లో.. అర్జున్, ప్రియాంక ఉన్నారు. అందుకే వారి జర్నీ వీడియోలని బిగ్ బాస్ త్వరగా చూపించాడేమోనని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీనికి కారణం కూడా ఉంది‌. హౌస్ లో ప్రతీ సీజన్ ఫినాలేకి టాప్-5 మాత్రమే ఉంటారు. అదే ప్రక్రియలో భాగంగా గతవారం శోభాశెట్టిని బయటకు పంపించేశారు బిగ్ బాస్. దాంతో హౌస్ లో  ఇప్పుడు ఆరుగురు ఉన్నారు. ఇక మిగిలింది నాలుగు రోజులే కావడంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్ గనుక జరిగితే ప్రియాంక, అర్జున్ లలో ఎవరో ఒకరు బయటకు రావాల్సిందే. ఎందుకంటే వీరికి ఓట్లు వేసేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. హౌస్ లో అంబటి అర్జున్ కన్నింగ్ గేమ్ ప్లాన్ అర్థమైంది కాబట్టి ప్రేక్షకులు అతనికి  ఓట్లు వేయడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇక ప్రియాంక ఎప్పుడూ గ్రూప్, అమర్, శోభాశెట్టిలకి సపోర్ట్ చేయాలంటూ తన దాకా వస్తే తన స్వార్థమే చూసుకుంటు చాలావరకు హౌస్ లో గొడవలు జరగడానికి ప్రధాన కారణం అయ్యింది. కిచెన్ లో తప్ప బయట ఎక్కువ కనిపించని ప్రియాంక ఆటలో గెలిచినవి తక్కువే. ఈమె సింపతీ డ్రామా కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. మరీ అర్జున్, ప్రియాంకల జర్నీ వీడియోలు మొదట చూపించడానికి ప్రధాన కారణం వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలనేదే రీజన్ లా అనిపిస్తుంది. మరి జర్నీ వీడియోలని బట్టి చూస్తే అంబటి అర్జున్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటూ ట్విస్ట్ ఇస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ప్రియాంక బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

శివాజీని బీట్ చేయలేకపోతున్న ప్రశాంత్.. టైటిల్ రేస్ నుంచి తప్పుకున్నాడా?

ఓటింగ్ లో శివాజీ హవా నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్-7 లో మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఫెయిర్ కంటెస్టెంట్ గా శివాజీ రికార్డులు సృష్టిస్తున్నాడు. అతని మైండ్ గేమ్, స్ట్రాటజీ, ‌మాటతీరుతో జనాలే కాదు హోస్ట్ నాగార్జున కూడా ఫిధా అయ్యారు. ఎంతలా అంటే శివాజీ చేతికి గాయం అయిందని మిగతా హౌస్ మేట్స్ అందరు ఆడట్లేదని అన్నా సరే శివాజీకే మద్దతు ఇస్తూ వచ్చారు. రెండు మూడు సార్లు కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి మరీ మోటివేషన్ ఇచ్చి మరీ ఉండేలా చేశారు బిగ్ బాస్. సీజన్ విన్నర్‌గా నిలిచేందుకు అవకాశం ఉన్న వారిలో శివాజీ ఒకడు. శివాజీ సినిమా హీరోగా ఉన్నప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడం మాత్రం శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా హౌస్‌లో అడుగుపెట్టిన శివాజీ ప్రస్తుతం టైటిల్ రేసులో గట్టి పోటీ ఇస్తున్నాడు. నిజానికి ఫ్యామిలీ వీక్ వరకు శివాజీనే హాట్ ఫేవరెట్‌గా ఉన్నాడు. ఆ వీక్‌లో తన పెద్ద కొడుకు వెంకట్ హౌస్‌లోకి వచ్చినప్పుడు శివాజీ ఎమోషనల్ అవ్వడంతో  ఆడియన్స్‌కి శివాజీ మరింత కనెక్ట్ అయ్యాడు. తండ్రి, కొడుకుల మధ్య ఉన్న ఆ బాండింగ్‌ను అందరికీ గుర్తు చేసి మరింత ఎమోషనల్ చేసాడు బిగ్ బాస్. అయితే ఫ్యామిలీ వీక్ ఈసారి పదవ వారంలోనే  జరిగింది. ఇక హౌస్ లో అందరితో మంచి రాపో ఉంది కేవలం శివాజీకే అని నిన్నటి జర్నీ వీడియోలో‌ స్పష్టత వచ్చేసింది. చాణక్యుడిగా, పల్లవి ప్రశాంత్, యావర్ లకి గురువుగా ఎంతో మంది అభిమానాన్ని పొందాడు శివాజీ. దీంతో అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో శివాజీ ఉన్నాడు. అమర్ దీప్ టైటిల్ రేస్ నుండి తప్పుకున్నట్టే ఎందుకంటే గతవారం ముందు వరకు మూడవ స్థానంలో ఉన్న అమర్ దీప్.. పద్నాలుగవ వారంలో ప్రశాంత్‌తో బిహేవియర్ చూసి ఆడియన్స్ షాకయ్యారు. ప్రశాంత్‌ను కొరకడం, తోసేయడం, తోసుకుంటూ రూడ్‌గా బిహేవ్ చేయడంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువైంది. అంతకుముందు వరకు ఫౌల్ గేమ్స్ తో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించిన అమర్ దీప్.. ప్రియాంక, శోభాల సపోర్ట్ తో‌ ఇన్నివారాలు ఉన్నాడనేది వాస్తవం. గత ఆరు వారాలుగా దత్తపుత్రిక  శోభాశెట్టిని కాపాడిన బిగ్ బాస్ గతవారం తనని ఎలిమినేట్ చేసి జనాలకి ఓట్లు వేయాలనే ఆసక్తిని కలుగజేసారు. ఇక రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. గ్రామాల నుండి అత్యధిక ఓట్లు వస్తున్నా.. శివాజీని బీట్ చేయలేకపోతున్నాడు ప్రశాంత్.   ఇక ప్రియాంక,  అర్జున్ బాటమ్-2 లో ఉన్నారు.  

టాప్-5 జర్నీ వీడియోలు చూస్తూ ఎమోషనల్ అయిన గీతు రాయల్!

బిగ్ బాస్ సీజన్-7 లో ప్రస్తుతం టాప్-6 లో ఉన్న హౌస్ మేట్స్ జర్నీ వీడియోలు ప్లే చేస్తున్నాడు బిగ్ బాస్.‌ ఇది చూసి ఎంతోమంది కనెక్ట్ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్-7 కి బజ్ ఇంటర్వ్యూ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న గీతు రాయల్‌‌.. ఈ జర్నీ వీడియోలు చూస్తూ ఎమోషనల్ అవుతుంది. గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు  నాగార్జున. ఇక గీతు రాయల్ ఎలిమినేషన్ చూసి అందరు ఎమోషనల్ అయ్యారు. అయితే గీతు టాప్-5 లో ఉండకుండానే బయటకు వచ్చేసింది. దాంతో ప్రస్తుతం టాప్-6 లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం సాగుతున్న జర్నీ వీడియోలని చూసి ఎమోషనల్ అవుతుంది. దాని గురించి తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది గీతు. అందులో ఏం ఉందంటే.. " అందరి టాప్-5 జర్నీ చూస్తుంటే  నేను చాలా మిస్ అయిపోయా అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకో.. నా డ్రీమ్ ఒకప్పుడు అట్ల గార్డెన్  ఏరియాలో నిల్చున్నప్పుడు బిగ్ బాస్ నా గురించి మాట్లాడితే వినాలని, ఒక 20 మినట్స్ 'AV' చూసుకోవాలని, అందరి ఫోటోస్ తీసుకెళ్ళాలని, మా‌ఇంటి నిండా ఆ ఫోటోలని ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవాలని ఉంది. కలలు కల్లోలం అయినప్పుడు హృదయం గాయపడుతుంది.. కన్నీళ్ళుగా మిగిలిపోతుంది" అంటూ గీతు ఎమోషనల్ వర్డ్స్ రాసుకొచ్చింది. కాగా ఇప్పుడు ఇది ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.  

చాణక్యుడు శివాజీ మోస్ట్ పవర్ ఫుల్ జర్నీ.. ప్రోమో అదుర్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో ప్రస్తుతం హౌస్ మేట్స్ జర్నీ వీడియోలు ప్లే చేస్తున్నారు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్, అంబటి అర్జున్ ల జర్నీ వీడియోలని చూపించగా.. నేడు హౌస్ లో శివాజీ జర్నీ చూపించబోతున్నారనే ప్రోమో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రోమో ఫుల్ వైరల్ గా మారింది. నా ఇరవై సంవత్సరాల సినిమా కెరీర్ ఒక ఎత్తు, లైఫ్ లో బిగ్ బాస్ ఒక ఎత్తు అని శివాజీ చెప్పాడు. శివాజీ.. మిమ్మల్ని ఒక వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు వాళ్ళ వైపే ఉండేలా చేయగల మాటకారి మీరు అని బిగ్ బాస్ చెప్తూ.. రాజుగారి పెద్ద పెళ్ళాం మంచిదంటే చిన్నపెళ్ళాం చెడ్డదని కాదని శివాజీ చెప్పిన మాటలని ప్లే చేసి చూపించాడు బిగ్ బాస్. మీ గాయం మిమ్మల్ని ఎంత వేధించిన ఓటమి వైపు చూడలేదు. మీ అబ్బాయి మీ డాక్టర్ గా వచ్చినప్పుడు మీ బాధనంతా మర్చిపోయారని బిగ్ బాస్ చెప్తుండగా శివాజీ ఎమోషనల్ అయ్యాడు. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణక్యుడులా నిలిచాడని టాస్క్ లో శోభాశెట్టితో శివాజీ డిఫెండ్ చేసిన వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. ఈ పూర్తి సీజన్ లో మీ మీద పైచేయి సాధించిన ఒకే ఒక విషయం ఏంటో తెలుసా.. కాఫీ. అలా చెప్పి శివాజీ కాఫీ కోసం పడే ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపించాడు. కంటెస్టెంట్ గా మొదలై కన్ఫమేషన్ పొంది హౌస్ మేట్ అయ్యారు. మీ ఆటతీరే మిమ్మల్ని ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని బిగ్ బాస్ చెప్పగా.. థాంక్స్ బిగ్ బాస్ అని శివాజీ చెప్పాడు. ఇప్పటికి శివాజీతో కలిపి ముగ్గరి జర్నీ వీడియోలు యూట్యూబ్ లో రిలీజ్ చేయగా.. శివాజీ జర్నీ వీడియోకే  అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది. ఇది పవర్ ఫుల్ జర్నీగా బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది. శివాజీ బిగ్ బాస్ టైటిల్ విజేత అని దీన్ని బట్టే తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే శివాజీ తన ఫెయిర్ గేమ్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. హౌస్ లో ఏదైన టాస్క్ తర్వాత శివాజీ పక్కన ఎవరైన హౌస్  మేట్ ఉంటే.. వారిద్దరిలో ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేయండి అని బిగ్ బాస్ చెప్తే.. మిగిలిన అందరు కలిసి శివాజీకే ఓట్ వేస్తారనేది అందరికి తెలిసిన నిజం. ఎందుకంటే శివాజీలో ఆటలో ఫౌల్,  మాటల్లో నెగెటివ్ అంటు ఏమీ ఉండవు. అందుకే అతడిని శివాజీ.. ది బాస్  అంటు ప్రేక్షకులు కామెంట్లలో తెలుపుతున్నారు.   

బిగ్ బాస్ చరిత్రలో రికార్డు.. శివాజీ గెలవాలని అన్నదానం చేసిన అభిమానులు!

బిగ్ బాస్ సీజన్-7 లో శివాజీ ఈజ్ అల్టిమేట్. అంతే కొందరు ఆడటం కోసం వస్తారు. మరికొందరు ఎంజాయ్ చేయడం కోసం వస్తారు. కానీ జనాలకి మంచిని అలవర్చాలని, కుర్రాళ్ళకి ఇన్ స్పైరింగ్ గా ఉండాలని, నిరంతరం హౌస్ లో ఏ సపోర్ట్ లేని యావర్, ప్రశాంత్ లకి అండగా నిలిచాడు‌. ఎంతలా అంటే ప్రశాంత్, యావర్ లలో ఎవరు నీకిష్టమని నాగార్జున అడుగగానే.. రెండు కళ్ళలో ఏ కన్ను ఇష్టమంటే ఏం చెప్పాలని చెప్పాడు. అంతలా వీరి ముగ్గురి బాండింగ్ ఉంది‌.  హౌస్ లో ఇంతవరకు ఎవరి గురించి నెగెటివ్ గా మాట్లాడకుండా.. నామినేషన్ లో గ్రూప్ గా వేయకుండా, ఫెయిర్ అండ్ క్లీన్ గా ఆడింది ముగ్గురే ముగ్గరు.. వాళ్ళే SPY(శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్). ఇక గత వారం వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడు హౌస్ మేట్స్ అందరు మిగిలిన వారిలో నుండి ఏదో ఒక క్వాలిటి నేర్చుకుంటారు కదా ఏంటని ఒక్కొక్కరిని అడిగాడు. శివాజీ గారి దగ్గర లౌఖ్యంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాని అంబటి అర్జున్ అన్నాడు. ఎదుటివాళ్ళు ఎంత బాధలో ఉన్న మనం మనసారా నవ్వితే చాలు ఆటోమేటిక్ గా ఆ భాద నుండి మనం బయటకు వస్తామనేది శివాజీ అన్న దగ్గరే నేర్చుకు‌న్నాని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. ఓపికగా ఎలా ఉండాలో శివాజీ అన్న దగ్గర నేర్చుకున్నానని యావర్ అన్నాడు. ఒకవేళ నామినేషన్ లో ఏదైన జరిగితే అది అయిపోయింది వదిలేయ్ అని చెప్పేస్తాడని యావర్ అన్నాడు. నవ్వుతూ ఏ సిచువేషన్ అయిన ఎదర్కోవడమే జీవితం అని అది శివాజీ దగ్గర ఉంటే నేర్చుకుంటావని నాగార్జున అన్నాడు. ఇక తాజాగా శివాజీకి సపోర్ట్ చేయమని చెప్తూ.. కొంతమంది అనాధలకి అన్నదాన కార్యక్రమం జరిపారు అభిమానులు‌‌. ఈ వీడియోని శివాజీ అఫీషియల్  పేజీలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. ఒక మనిషిని అభిమానిస్తే ఇంతలా చేస్తారా అనేదానికి మరో సాక్ష్యమంటు చేసిన ఈ గొప్ప పనికి జనాలు నీరాజనాలు తెలుపుతున్నారు. దీంతో శివాజీకి మరింత హైప్ వచ్చేసింది. ఇప్పటికే ఓటింగ్ లో నెంబర్ వన్ ర్యాంకింగ్ తో శివాజీ దూసుకెళ్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ఉన్నప్పుడు ఆ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయమని చెప్తూ అన్నదానం నిర్వహించడం ఇదే ప్రథమం. కాగా ఇప్పుడు ఇది బిగ్ బాస్ చరిత్రలో ఒక రికార్డుగా నమోదైంది.