శ్రీరామాచంద్ర  ఇక్కడ సింగర్ గా రాణించాడు..అక్కడ డాన్సర్ గా అదరగొడుతున్నాడు

శ్రీరామాచంద్ర సింగర్ గానే మనకు ఇంత వరకు తెలుసు. కానీ ఇప్పుడు డాన్సర్ గా అవతారం ఎత్తి ఇరగదీసేస్తున్నాడు. సోనీలో ప్రసారమవుతున్న ఝలక్ దికలాజా డాన్స్ షోలో కో-డాన్సర్ సోనాలితో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇక శ్రీరామచంద్ర చేస్తున్న ఈ డాన్స్ పిక్ ని వరుణ్ సందేశ్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. "శ్రీరామచంద్ర తన డాషింగ్ స్టెప్స్ తో జడ్జెస్ ని బాగా ఇంప్రెస్స్ చేసాడు" అంటూ కాప్షన్ కూడా పెట్టాడు వరుణ్ సందేశ్. ఇండియన్ ఐడల్ సీజన్ 5 టైటిల్‌ విజేత మన శ్రీరామచంద్ర. శ్రీరామ చంద్ర ప్లేబ్యాక్ సింగర్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసాడు అలాగే  2007లో నోట్ బుక్‌ అనే మూవీలో ఒక సాంగ్ పాడాడు. ఇండియన్ ఐడల్ విన్ అయ్యాక   సింగర్ శ్రీరామ చంద్ర మొదటి హిందీ ఆల్బమ్ - రెహ్నుమా 2010లో విడుదలైంది. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్ , సునిధి చౌహాన్ వంటి ప్రఖ్యాత గాయకులతో కలిసి ప్రదర్శన ఇచ్చాడు. 2013 నుండి శ్రీరామచంద్ర నటన వైపుకు అడుగులు వేసాడు. తెలుగులో 'జగద్గురు ఆది శంకర' అనే మూవీలో నటించాడు. తర్వాత  2014 లో "ప్రేమ గీమ జాన్తా నై" మూవీ ద్వారా హీరోగా అరంగేట్రం చేసాడు. అక్కడ పెద్దగా క్లిక్ కాలేదు శ్రీరామచంద్ర. ఇక తర్వాత  బిగ్ బాస్ తెలుగు సీజన్  5లో కంటెస్టెంట్ వెళ్లి ఆడియన్స్  దృష్టిని ఆకర్షించి చివరికి సీజన్‌లో సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తర్వాత ఓటిటి ప్లాటుఫారం మీదకు అడుగుపెట్టాడు ఈ సింగర్.. తెలుగు ఇండియన్ ఐడల్‌కి హోస్ట్‌గా చేసాడు. అలాగే ఇప్పడు "పాపం పసివాడు" వెబ్ సిరీస్ లో నటించాడు. ఇక డాన్సర్ గా కూడా తనదైన ముద్రను వేసుకుంటూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఝలక్ దికలాజా సీజన్ 11 లో మనోడు మెరిసి దూసుకుపోతున్నాడు. ఇక ఈ షోకి మలైకా అరోరా, ఫరా ఖాన్, అర్షద్ వార్సీ న్యాయనిర్ణేతలుగా ఉన్నారు.    

Brahmamudi:వాళ్ళిద్దరిని అలా చూసి షాకైన అపర్ణ.. రాజ్ బంఢారం బయటపడనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -279 లో.. దుగ్గిరాల ఇంట్లో కావ్య పూజ చేసి అందరికి హారతి ఇస్తుంది. సాయంత్రం కోనేరులో దీపం వదిలేవరకు ఎవరు ఉపవాసం వదలడానికి వీలు లేదని  ఇందిరాదేవి అనగానే.. మీకు ఉపవాసం, మాకు కాదంటు సుభాష్, ప్రకాష్ టిఫిన్ చెయ్యడానికి సిద్ధం అవుతు రాజ్ ని పిలుస్తారు.  అప్పుడే రాజ్ ని కావ్య అటపట్టిస్తు.. నాతో పాటు తను కూడా ఉపవాసం ఉంటానని చెప్పాడని కావ్య అనగానే రాజ్ ఏం మాట్లాడలేకపోతాడు. ఆ తర్వాత స్వప్న ఉపవాసం ఉంటానని అనగానే.. నువ్వేం అవసరం లేదు.. వెళ్లి టిఫిన్ చేయమని ఇందిరాదేవి అంటుంది. అవును నేను ఎందుకు ఉపవాసం. ఈ ఇంటికి వారసుడిని ఇస్తున్నానని స్వప్న అంటుంది.. మరొక వైపు రాజ్ చాటుగా గదిలో ఫ్రూట్స్ అన్ని తింటు ఉంటాడు. అప్పుడే కావ్య వచ్చి చూస్తుంది. ఈ ఒక్క రోజైన పూజ చేస్తే దేవుడికి దయకలిగి మనల్ని కలుపుతాడని అనుకున్నానని కావ్య అంటుంది. మన ఇద్దరిని ఆ దేవుడు కూడ కలపలేడని రాజ్ అంటాడు. మరొక వైపు రాహుల్, రుద్రాణి లు స్వప్న కడుపుని పోగొట్టే ప్లాన్ చేస్తారు. అరుణ్ ని గుడికి రప్పించి ఒకసారి స్వప్నని కనిపించమను. అప్పుడు అరుణ్ తో స్వప్నని నిజం చెప్పియ్యలని తన వెంట వెళ్లేలా చెయ్యాలని, దాంతో కోనేటిలో పడేలా చేస్తే అబార్షన్ అవుతుంది. అప్పుడు అబార్షన్ అయిందని పెద్ద సీన్ క్రీయేట్ చెయ్యొచ్చని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. మరొకవైపు రాజ్ కి శ్వేత ఫోన్ చేసి కలవాలని చెప్తుంది. ఈ రోజు వీలవదు గుడికి వెళ్తున్నామని రాజ్ అనగానే.. నేను వస్తానని శ్వేత అంటుంది. దాంతో వద్దని రాజ్ అంటాడు. అయిన వినకుండా వస్తానని చెప్పి శ్వేత ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత అందరు గుడికి వస్తారు. అనామిక ఫ్యామిలీ కూడా గుడికి వస్తారు. కాసేపటికి అప్పు, కృష్ణమూర్తి లు కూడా గుడికి వస్తారు.. ఎక్కడకు వెళ్లిన దీని ఎంట్రీ ఏంటని అనామిక తల్లి అనగానే.. అవును మమ్మీ నాకంటే అప్పుకే కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇస్తుండు. నాకు జెలస్ గా ఉందని అనామిక అనగానే.. నేను చూసుకుంటానని అనామిక తల్లి అంటుంది. అప్పుకి కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే అనామిక ఇవ్వకుండా ఆపుతుంది. ఆ తర్వాత.. మీరు వెళ్ళండి కావ్య ఇప్పుడే రాదు మొక్క పచ్చగా ఉంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుందని రాజ్ అనగానే.. కావ్య ఆశ్చర్యపోతు ఇరికించాడు కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత అరుణ్ కి రాహుల్ ఫోన్ చూసి గుడికి వచ్చాడో లేదో కనుక్కుంటాడు. తరువాయి భాగంలో..  శ్వేత దగ్గరికి‌ రాజ్ వస్తాడు.  రాజ్ ని శ్వేత హగ్ చేసుకొని ఉండడం అపర్ణ చూసి షాక్ అవుతుంది. మరొక వైపు కావ్య కూడా వాళ్ళు ఉన్నవైపుగా వస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిం  

జబర్దస్త్ యాంకర్ సౌమ్య వెళ్లిపోవడం వెనక కుట్ర .. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా!

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ పైకి కామెడీని పంచుతూ ఆడియన్స్ నవ్విస్తూనే ఉంటాయి. కానీ లోపల ఎన్నో లుకలుకలు ఉన్నాయి...అవేవి పైకి కనిపించవు. ఈ షోస్ ని యాంకర్ రష్మీ, అనసూయ ఉన్నారు. ఐతే అనసూయ కూడా తనకు సెట్ లో ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వడం లేదనే నెపంతో బయటకు వచ్చేసి సిల్వర్ స్క్రీన్ మీద ఫిక్స్ ఐపోయింది. తర్వాత సౌమ్య శారదా అనే కన్నడ అమ్మాయిని తీసుకొచ్చారు. ఐతే ఆమెకు తెలుగు రాకపోయినా చాల స్పాంటేనియస్ గా..ఎలాంటి ఫేక్ ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ లేకుండా చాల జెన్యూన్ గా ఉంటూ యాంకరింగ్ చేసేది. కానీ ప్రస్తుతం ఆమెని తీసేసో తప్పించేసో సిరి హన్మంత్ ని యాంకర్ గా తీసుకొచ్చారు. ఇదే విషయం గురించి నెటిజన్స్ సౌమ్యని అడుగుతున్నారు. ఎప్పుడు జబర్దస్త్ కి తిరిగి వస్తారు...అసలు ఎందుకు తీసేసారు అని అడుగుతున్నారు. ఇక ఒక నెటిజన్ ఐతే సుదీర్ఘ మెసేజ్ పెట్టారు.  "నా ఉద్దేశ్యం ఏంటంటే  సౌమ్య గారూ... ఇప్పటి వరకు జబర్దస్త్ లోని  యాంకర్‌లందరూ డ్యాన్స్ కి,  ఫేక్ స్మైల్స్ కే పరిమితమయ్యారు...కానీ మీరు అలా కాదు.  స్పాంటేనియస్‌గా, హ్యూమరస్ ఉన్న యాంకర్‌గా, హైపర్ ఆదికి కూడా కౌంటర్లు, పంచులు ఇచ్చి  వేయగలిగిన ఏకైక యాంకర్ మీరే... అతనికి తిరిగి కౌంటర్ పంచులు ఇవ్వగలింది మీరే..   మీరు ఏదో షో కోసం అన్నట్టుగా చేయకుండా చాలా జెన్యూన్ గా ఆడియన్స్ కోసం నేచురల్ గా చేస్తారు. మిమ్మల్ని బుల్లి తెర మీద మిస్ అవుతున్నాం.. కానీ మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నా...వెండితెర మీద మంచి ఛాన్సెస్ రావాలని విష్ చేస్తున్న" అని అన్నారు. ఐతే హైపర్ ఆదికి ఎదురు పంచులు వేస్తోందని  సౌమ్యను యాంకర్‌గా తీసేసారా ? సౌమ్యనే వెళ్లిపోయిందో ఇంతవరకు తెలీదు. ఎందుకంటే ఈ షో నుంచి ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండానీ ఆమె వెళ్ళిపోయింది. ఆ కారణం ఇప్పటివరకు ఎవరూ కూడా రివీల్ చేయలేదు.   ఈమెను తప్పించడం వెనుక ఎవరున్నారు ? మల్లెమాల టీం నిర్ణయమా... జబర్దస్త్ డైరెక్షన్ టీం నిర్ణయమా... ? ఎవ్వరికీ తెలియదు. ఆ  నెటిజన్ కి సౌమ్య ఇలా రిప్లై ఇచ్చింది. " టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా.. థాంక్యూ సో మచ్ "  అని చెప్పింది . అంటే జబర్దస్త్ షోకు సౌమ్య దూరం అవ్వడం వెనక పెద్ద తతంగమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి సౌమ్య ఎప్పుడు నోరు విప్పుతుందో.. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి.  

Guppedantha Manasu:రిషిని కిడ్నాప్ చేసింది శైలేంద్రేనని తెలుసుకున్న అనుపమ !

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -946 లో.. ధరణి వచ్చి శైలేంద్ర చేసిన కుట్రల గురించి వసుధార, మహేంద్రలకి చెప్తుంది. ఆ తర్వాత శైలేంద్ర దగ్గరికి వసుధార వచ్చి.. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతుంది. ఇలా కాదు బెగ్గింగ్ చెయ్యాలి, అప్పుడు చెప్తాను రిషి ఎక్కడ ఉన్నాడో అని వసుధారతో శైలేంద్ర క్రూరంగా మాట్లాడుతాడు.  అయిన రిషి కోసం వసుధార తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని శైలేంద్రని రిక్వెస్ట్ చేస్తుంది. ఎంత రిక్వెస్ట్ చేసిన శైలేంద్ర తన విలనిజాన్ని చూపిస్తూ రిషి గురించి చెప్పడు.  ఆ తర్వాత రిషి క్షేమంగా ఇంటికి రావాలంటే.. నువ్వు ఎండీ సీట్ నాకు ఇవ్వాలని శైలేంద్ర అంటాడు. అది కుదరదని వసుధార చెప్తుంది. అయినా శైలేంద్ర కోపంగా.. నువ్వు నాకు ఎండీ చైర్ ఇస్తేనే రిషి ఇంటికి వస్తాడని చెప్తాడు. ఆ తర్వాత రిషి నీకు క్షేమంగా ఇంటికి రావాలా? ఎండీ చైర్ కావాలా? బాగా అలోచించి చెప్పమని వసుధారతో శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార ఏం చెయ్యలేక  అక్కడ నుండి ఏడుస్తూ ఇంటికి బయలుదేరుతుంది. ఆ తర్వాత వసుధార ఇంటికి డల్ గా రావడం చుసిన మహేంద్ర.. ఏమైంది అలా ఉన్నావని అడుగుతాడు. నేను ఎండీగా ఉండలేను మామయ్య. నాకు రిషి సర్ కావాలని వసుధార అనగానే.. అక్కడే ఉన్న అనుపమ, మహేంద్ర ఇద్దరు అసలు ఏమైందని అంటారు. ఇక వసుధార జరిగింది మొత్తం వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత రిషిని శైలేంద్ర కిడ్నాప్ చేసాడా అంటూ మహేంద్ర కోపంగా ఉంటాడు. మరొకవైపు ధరణిని  శైలేంద్ర పిలిచి.. నీకు వసుధార ఎక్కడ కలిసింది. తనకి నిజం చెప్పావా అని శైలేంద్ర అడుగుతాడు. అప్పుడు ధరణి నేనేం చెప్పలేదంటూ చాలా తెలివిగా సమాధానం చెప్తుంది. అప్పుడే దేవయాని వస్తుంది. ధరణి వెళ్ళిపోతుంది. రిషి నీ దగ్గరే ఉన్నాడా అని దేవయాని అడుగుతుంది. నేనే కిడ్నాప్ చేయించానని శైలేంద్ర చెప్పి.. వసుధారతో చెప్పిన మాటలు కూడా చెప్తాడు. మరొకవైపు రిషి గురించి  వసుధార బాధపడుతుంటే అనుపమ వచ్చి.. వసుధారకి ధైర్యం చెప్తుంది. మీ ఇద్దరిని ఎలాగైనా నేను ఒకటి చేస్తానని అనుపమ అంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..  

వైన్ గ్లాస్..లిప్ లాక్...హాట్ గా గుప్పెడంతమనసు జగతి మేడం

గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్ జగతి వరుసగా సినిమాలు చేసేస్తూ వస్తోంది. ఈ సీరియల్ లో రిషి సర్ కి మదర్ రోల్ పూర్తైపోయి బయటికి వచ్చేసాక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా హాట్ గా హల్చల్ చేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ కి సైన్ చేసేస్తూ అందం ఉండగానే అకౌంట్స్ నిండుగా డబ్బులు దాచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో "నో మరి సీక్రెట్స్" అంటూ ఒక హాట్ వెబ్ సిరీస్ కి సంబందించిన న్యూస్ ని , పోస్టర్ ని  తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ లో  బీచ్ ఒడ్డున చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని హీరోకి  లిప్ కిస్ ఇస్తూ కనిపించింది అమ్మడు. "నో మోర్ సీక్రెట్స్ వెబ్ సిరీస్‌లో నా ఫస్ట్ లుక్ ని ఇలా షేర్ చేయడం  ఆనందంగా ఉంది. ఈ సిరీస్  తెలుగు, హిందీ భాషల్లో రాబోతోంది. ఈ అవకాశం ఇచ్చిన పార్థు సార్‌కి థ్యాంక్స్. ఈ సూపర్ వెబ్ సిరీస్‌లో నాకు ఫిమేల్ లీడ్‌గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సిరీస్ కి సంబంధించిన మిగతా   అప్‌డేట్స్ త్వరలో చెబుతాను." అంటూ టాగ్ లైన్ పెట్టింది జగతి మేడం. బుల్లితెర నుంచి  వెండితెర పై  ఓ వెలుగు వెలిగేసి కావాల్సినంత సంపాదించుకుని పక్కన పడేసుకుంటే ఆ తర్వాత ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనే ప్లాన్ లో ఉంది ఈ బ్యూటీ.  ప్రస్తుతం 'ఏ మాస్టర్ పీస్', 'ప్రెట్టీ గర్ల్' "అండర్ వరల్డ్ బిలియనీర్స్" అనే  వెబ్ సిరీస్ లో  చేస్తున్న జగతి " నో మోర్ సీక్రెట్స్ ' అంటూ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేసింది. ఈ మధ్య జగతి మేడం ఎక్స్పోజింగ్ శృతి మించి సోషల్ మీడియాని షాక్ చేసేస్తోంది. చిన్న గౌన్ వేసుకున్న పెద్ద పాపా అనే పాటలోలా హాట్ ఫోటోషూట్స్ ని చేసేసి ఇన్స్టాగ్రామ్ లో పడేస్తోంది. మరిన్ని ఛాన్సెస్ కోసం ఎదురుచూస్తోంది జగతి మేడం.

Krishna Mukunda Murari:గడువులోగా ఆ తప్పు చేయలేదని  మురారి నిరూపించగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -340 లో.. మురారికి గతం గుర్తుకు రావడంతో అందరు సంతోషంగా ఉంటారు. కానీ ఒక ముకుంద మాత్రం డల్ గా ఉంటుంది. కోపంగా ఇంట్లోకి వెళ్లి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది. అది చూసి మధు ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు కంగారుగా ముకుంద దగ్గరికి వస్తారు. ఆ తర్వాత కృష్ణ  గౌతమ్ ఇద్దరు తనకి ట్రీట్ మెంట్ ఇస్తారు. ఇక తనకి ఎలాంటి ఇబ్బంది లేదని భవానికి గౌతమ్ చెప్తాడు. మురారికి తన గతం గుర్తుకు రావడం ముకుందకి ఇష్టం లేదు అందుకే ఇలా చేసిందని రేవతి అంటుంది. దాంతో భవానికి కోపం వచ్చి.. ఎందుకు అలా మాట్లాడుతున్నావ్? తన జీవితం ఏం అవుతుందోనని అర్థం కాకా ఇలా చేసిందని అంటుంది. మరొకవైపు మురారి దగ్గరికి నందు వెళ్తుంది. నందు వెళ్ళగానే మురారి తన మనసులో మాటలన్నీ చెప్తాడు. మా ఇంట్లో వాళ్ళు ఇన్ని రోజులుగా కృష్ణనే నా భార్య అనే విషయం చెప్పకుండా, నన్ను పిచ్చి వాడిలా చూసారని మురారి అడుగుతాడు. అమ్మకి ఎదరుచెప్పలేక ఇలా మౌనంగా ఉన్నామని నందు చెప్తుంది. ఆ తర్వాత మురారి దగ్గరికి.. ముకుంద మురారీల శుభలేక తీసుకోని భవాని వస్తుంది. అది మురారికి ఇవ్వగానే.. బాగుంటుందని మురారి అంటాడు. నీకు గతం గుర్తుకు వచ్చింది కాబట్టి చెప్పనవసరం లేదనుకుంట.. వచ్చే శుక్రవారం నీకు ముకుందకి పెళ్లి అని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత తనని అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పకుండా మోసం చేశారని భవాని అంటుంది. మేం అగ్రిమెంట్ మ్యారేజ్ కాస్తా పర్మినెంట్ మ్యారేజ్ చేసుకుందామని మీకు చెప్పేలోపే ఇలా జరిగిందని మురారి చెప్తాడు. కృష్ణ తన చిన్నాన్నతో కలిసి  ఇలా చేసిందంటు చెప్పి, నీ రూపం మార్చారని భవాని చెప్తుంది. వాళ్ళు చెయ్యలేదని నిరూపిస్తానని మురారి అంటాడు. నిరూపించు కానీ ఈ శుక్రవారం లోపే జరగాలి నిరూపిస్తే మీ పెళ్ళిని అంగీకరిస్తాను లేకపోతే ముకుందకి నీకు పెళ్లి అని భవాని చెప్తుంది. నిరూపిస్తానని మురారి చెప్తాడు. ఆ తర్వాత మీరు తప్పకుండా నిరూపిస్తారు. ఆ నమ్మకం నాకు ఉందని మురారీతో కృష్ణ అంటుంది. తరువాయి భాగంలో.. కృష్ణ దగ్గరికి మురారి వచ్చి.. అలా బయటకు వెళదామా అంటాడు. కృష్ణని మాటల్లో పెట్టి కృష్ణ చెంపపై ముద్దు పెడతాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

హౌస్ మేట్స్ కి హ్యపీ డేస్.. ఇంకా రెండు రోజులేగా!

బిగ్ బాస్ సీజన్-7 మరో రెండు రోజుల్లో ముగుస్తుండటంతో హౌస్ లో ఉన్న ఆరుగురు మంచి స్నేహితులుగా మారిపోయారు. హౌస్ లో చివరి వేకప్ సాంగ్ గా.. హ్యాపీ డేస్ టైటిల్ సాంగ్ వేసి అందరిలో జోష్ ను నింపాడు బిగ్ బాస్. ఇక హౌస్ మేట్స్ అందరు ఇంటి భోజనం మిస్ అవుతున్నారని వారి కోసం ఫుడ్ ను తీసుకొచ్చాడు బిగ్ బాస్.  ఇక మొదటగా అర్జున్ కోసం అతని  భార్య సురేఖ‌ .. రాగి సంకటి, మటన్ కర్రీ చేసి పంపించింది.‌ ఇక ఆ ఫుడ్ కావాలంటే యావర్ బాల్స్ ని స్డాండ్ మీద అయిదు నిమిషాల్లో ఫౌల్ ఆడకుండా పెట్టాలని చెప్పగా. ‌ అయిదు నిమిషాల్లో సరిగ్గా టాస్క్ ని పూర్తిచేసి యావర్ విజయం సాధించడంతో అర్జున్ కి ఫుడ్ లభించింది. ఆ తర్వాత శివాజీ కోసం అతని కొడుకు రిక్కీ చికెన్ ని పంపించాడు. ప్రియాంక టాస్క్ గెలవాలని చెప్పగా.. విల్లు మీద ఐరన్ బాల్స్ ని ఉంచాలని అది అయిదు నిమిషాల్లో పూర్తి చేసింది. ప్రియాంక గెలిచి చికెన్ కర్రీని శివాజీకి ఇచ్చింది. మూడవది అమర్ దీప్ కోసం రొయ్యల బిర్యానీ చేసి పంపింది తేజస్విని గౌడ. ఇక అది కావాలంటే శివాజీ తల మీద బర్త్ డే క్యాప్ ధరించి పైన ఉన్న బెలూన్స్ ని అయిదు నిమిషాల్లో పూర్తి చేయాలని చెప్పగా.. అతను గెలిచాడు. ఆ తర్వాత తేజస్విని పంపిన రొయ్యల బిర్యానీ అమర్ దీప్ కి ఇచ్చాడు‌. బిగ్ బాస్ హౌస్ లోకి ఏలియన్స్ వచ్చారు. వారికి శివాజీ కాఫి చేసాడు.  మేం కాఫీ తాగామని సింక్ లో కాఫీ పారబోసారు ఏలియన్స్. ఆ తర్వాత వారితో పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు హౌస్ మేట్స్.  ఇక ఆ తర్వాత అసలు పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. మీ 14 వారాల జర్నీలో మీ ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా అంటే మీ టాస్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ దృష్టిలో పెట్టుకొని 60 నిమిషాల ఎపిసోడ్‌లో మీరు ఎంత సేపు కనిపించడానికి అర్హులో అందుకు సంబంధించిన కారణాలు చెప్పాలని బిగ్‌బాస్ అన్నాడు. అలానే మిగతా ఇంటి సభ్యులకి కూడా ఎవరికి ఏ టైమ్ ఇవ్వాలని భావిస్తే వాళ్లకి ఆ టైమ్ కార్డ్ ఇచ్చి తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ అన్నాడు. ఇలా మెజార్టీ ఇంటి సభ్యుల నిర్ణయం ఆధారంగా వారు ఆ టైమ్ కార్డ్ ధరించాల్సి ఉంటుందని చెప్పాడు. ఇక ముందుగా అర్జున్ మొదలుపెట్టాడు. ముందుగా అర్జున్ తనకి తాను 10 ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత శివాజీకి 15, ప్రియాంకకి 7, యావర్ 5, ప్రశాంత్ 3 ఇచ్చి రీజన్స్ ఇచ్చాడు అర్జున్. ఇక ఆ తర్వాత వచ్చిన అమర్ దీప్ తనకి తాను 15 ఇచ్చుకున్నాడు. అర్జున్ కి 3, ప్రియాంకకి 7, యావర్ 5, ప్రశాంత్ 10, శివాజీకి 20 ఇచ్చాడు అమర్ దీప్. అమర్ దీప్ కి 3 ఇచ్చాడు శివాజీ. ప్రియాంకకి 10, అర్జున్ 7, యావర్, ప్రశాంత్ ఇద్దరికి 15, 20‌ మార్కుల బోర్డ్ లు ఇచ్చి మీరే వేసుకోండిరా అని శివాజీ చెప్పాడు. ఇలా అందరు హౌస్ మేట్స్ కి మార్కులు ఇచ్చుకున్నారు. కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగాయి.

ఓటింగ్ లో ఆ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్!

బిగ్ బాస్ సీజన్ ఫినాలేకి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక విన్నర్ ఎవరో తెలియాలంటే శుక్రవారం రాత్రి పన్నెండు వరకు పడిన ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉంటే వారే విజేత అని బిగ్ బాస్ అఫీషియల్ గా చెప్పగా.. హౌస్ లో  కుర్రాళ్ళున్నా ఒక యాభై సంవత్సరాల శివాజీ వారితో పోట పోటీగా గేమ్స్ ఆడుతూ చాణక్యుడిలా మైండ్ గేమ్ ఆడుతూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ బిగ్ వాస్ కంటెస్టెంట్ గా శివాజీ రికార్డులు సృష్టిస్తున్నాడు.  నిన్నటి జరిగిన ఫుడ్ కి సంబంధించిన టాస్క్ లో కూడా అయిదు నిమిషాలో అన్ని బెలూన్స్ ని పగులగొట్టి విజయం సాధించి.. వహ్వా అనిపించాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌ ఎవరో తెలియడానికి మరో  అడుగు దూరమే ఉంది. ఈ అవకాశం ఉన్న వారిలో శివాజీ ఒకడు. శివాజీ సినిమా హీరోగా ఉన్నప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలుసు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడం మాత్రం శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా హౌస్‌లో అడుగుపెట్టిన శివాజీ ప్రస్తుతం టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. నిజానికి ఫ్యామిలీ వీక్ వరకు శివాజీనే హాట్ ఫేవరేట్ ఉన్నాడు. ఆ వీక్‌లో తన  పెద్ద కొడుకు వెంకట్ హౌస్‌లోకి వచ్చినప్పుడు శివాజీ ఎమోషనల్ అవ్వడంతో  ఆడియన్స్‌కి శివాజీ మరింత కనెక్ట్ అయ్యాడు. తండ్రి, కొడుకుల మధ్య ఉన్న ఆ బాండింగ్‌ను అందరికి గుర్తు చేసి మరింత ఎమోషనల్ చేసాడు బిగ్ బాస్. అయితే ఫ్యామిలీ వీక్ ఈ సారి పదవ వారంలోనే  జరిగింది. ఇక హౌస్ లో అందరితో మంచి రాపో ఉంది కేవలం శివాజీకే అని జర్నీ వీడియోలో‌ స్పష్టత వచ్చేసింది. చాణక్యుడిగా, పల్లవి ప్రశాంత్, యావర్ లకి గురువుగా ఎంతో మంది అభిమానాన్ని పొందాడు శివాజీ. దీంతో అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో శివాజీ ఉన్నాడు. అమర్ దీప్ టైటిల్ రేస్ నుండి తప్పుకున్నట్టే ఎందుకంటే గతవారం ముందు వరకు మూడవ స్థానంలో ఉన్న అమర్ దీప్.. పద్నాలుగవ వారంలో ప్రశాంత్‌తో బిహేవియర్ చూసి ఆడియన్స్ షాకయ్యారు. ప్రశాంత్‌ను కొరకడం, తోసేయడం, తోసుకుంటూ రూడ్‌గా బిహేవ్ చేయడంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువైంది. అంతకుముందు వరకు ఫౌల్ గేమ్స్ తో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించిన అమర్ దీప్.. ప్రియాంక, శోభాల సపోర్ట్ తో‌ ఇన్నివారాలు ఉన్నాడనేది వాస్తవం. గత ఆరు వారాలుగా దత్తపుత్రిక  శోభాశెట్టిని కాపాడిన బిగ్ బాస్. ఇక రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. గ్రామాల నుండి అత్యధిక ఓట్లు వస్తున్నా.. శివాజీని బీట్ చేయలేకపోతున్నాడు ప్రశాంత్.   ఇక ప్రియాంక,  అర్జున్ బాటమ్-2 లో ఉన్నారు. హౌస్ లో ఆరుగురి జర్నీ వీడియోలలో బాగా పాపులర్ అయిన ఎక్కువ మందికి నచ్చేసిన జర్నీలు.. శివాజీ, యావర్, ప్రశాంత్ ల జర్నీ వీడియోలే. వీరి జర్నీ లలో ఒక కష్టం, ఆనందం, గెలవాలనే కసి, ఫెయిర్ ప్లే, లౌఖ్యం.. ఇలా తెలిసి తప్పు చేయకూడదు.‌ ఒకవేళ తెలియకుండా చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని యావర్, శివాజీ, ప్రశాంత్ ముగ్గురు నిరూపించారు. అందుకే జనాలు వీరికి పట్టం కట్టారు.  అయితే ప్రస్తుతం ఉన్న ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య గట్టి పోటీ జరుగుతుంది. ఓటింగ్ లో వీరే టాప్ లో ఉన్నారు. మరి విన్నర్ ఎవరవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు అగాల్సిందే.  

సీజన్-7 గ్రాంఢ్ ఫినాలేకి మహేష్ బాబు!

బిగ్ బాస్ ఇప్పటికే పద్నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే ఉండబోతుంది‌. అయితే నిన్నటి వరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న అంబటి అర్జున్ ఎలిమినేషన్ అయ్యాడని కొన్ని వార్తలు రాగా అవన్నీ ఫేక్ అని తెలిసింది. కాగా ఇప్పుడు మరో న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇప్పటివరకు  బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలేకి ఎంతో మంది సెలబ్రిటీలు  వచ్చారు. అయితే ఈ సీజన్-7 కి సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నట్లు గట్టిగా వినిపిస్తుంది. అయితే ఇప్పటికే హౌస్ లోకి గెస్ట్ గా శ్రీముఖి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నాగార్జున తన ' నా సామిరంగ' సినిమా ఫస్ట్ టీజర్ ని లాంఛ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.  ఇక యాంకర్ సుమ కనకాల ఫినాలే రోజున ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విక్టరీ వెంకటేశ్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద కనపించనున్నారని తెలుస్తోంది. అయితే ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలతో బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ లాంచ్ పై ప్రేక్షకులకు భారీగానే అంచనాలు పెరిగాయి. కొన్ని ఇన్ స్టాగ్రామ్, సోషల్ మీడియా పేజీలలో అంబటి అర్జున్ హౌస్ లో లేడని, బయటకొచ్చాడని చెప్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఇచ్చిన ర్యాంకింగ్ లో కూడా శివాజీకే మొదటి స్థానం ఇచ్చారు హౌస్ మేట్స్.  అయితే హౌస్ లో ప్రస్తుతం పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, ప్రియాంక, అమర్ దీప్, అంబటి అర్జున్ ఉన్నారు. వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారనేది శుక్రవారం రాత్రివరకు పడే ఓటింగ్ తో తెలియనుంది‌. ఇక శనివారం రాత్రివరకు హౌస్ లో ఎంతమంది ఉంటారని తెలుస్తుంది. ఆయితే గ్రాంఢ్ ఫినాలే రోజున టైటిల్ కప్ ని అందించడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నాడని వస్తున్న వార్తలు నిజమే అయితే ఈ సీజన్ గ్రాంఢ్ గా ముగిసినట్టే. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో ఓటింగ్ ప్రకారం టాప్-2 లో పల్లవి ప్రశాంత్, శివాజీ ఉండగా.. బాటమ్-2 లో ప్రియాంక, అర్జున్ ఇద్దరు ఉన్నారు.  

ఇలాంటి స్టెప్స్ ప్రభుదేవా కూడా వేయలేడు...

ఆలీతో ఆల్ ఇన్ వన్ షో ప్రతీ వారం ఫుల్ కామెడీగా నవ్వు తెప్పిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి మహేష్ ఆచంట, అనన్య, విశ్వా వచ్చారు. ఇక "ధూమ్ ధామ్ దోస్తాన్" సాంగ్ కి మహేష్ ఆచంట నాన్ సింక్ స్టెప్పులేసేసరికి ఆలీ షాకైపోయి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయారు. "నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్న నువ్వు వేసిన స్టెప్పు ప్రభుదేవా కూడా వేయలేరు" అంటూ కితాబిచ్చారు. తర్వాత స్టేజి మీదకు అనన్య వచ్చింది. "నాలాగే నీకు కూడా నవ్వితే బుగ్గల మీద సొట్టలు పడుతున్నాయి" అని అలీ అనేసరికి "ఒక బుగ్గాకే పడుతుంది" అని అనన్య చెప్పేసరికి "రెండు బుగ్గలకు సొట్టలు పడే అబ్బాయిని వెతుక్కో" అని ఆలీ కౌంటర్ వేసేసరికి "మీరున్నారు కదా సర్" అంటూ ఆలీకి అద్దిరిపోయే పంచె వేసింది అనన్య. ఇక తర్వాత విశ్వా చాల స్టైలిష్ గా కళ్ళజోడు పెట్టుకుని మరీ డాన్స్ చేస్తూ వచ్చాడు. " ఏమిటి ఈ కళ్ళజోడు ..స్టైలా " అని ఆలీ అడిగారు. "కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని" అన్నాడు విశ్వా "అంటే దూరంగా ఉన్నవాళ్ళెవరూ కనిపించారా" అని మళ్ళీ కౌంటర్ వేసాడు ఆలీ. "బాగా దగ్గరగా కనిపిస్తారన్న" అంటూ పంచ్ ఇచ్చాడు విశ్వా. తర్వాత పవిత్ర వచ్చి అనన్యను చూసి "జస్ట్ లూకింగ్ లైక్ ఏ వావ్" అనే గట్టిగా గాండ్రించేసరికి మహేష్ కూడా "గౌడగేదె గాండ్రించినట్టుంది" అంటూ పవిత్ర పై కామెంట్ చేసాడు. ఇక ఈ ముగ్గురు కూడా బుల్లితెర మీద షోస్ లో, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. అనన్య కొన్ని మూవీస్ లో నటించింది.

యాంకర్ గా ప్రదీప్ కి బైబై..నందుకి హాయ్ హాయ్

  ఢీ  డాన్స్ షో ఎన్నో ఏళ్ళ నుంచి అలరిస్తూ ఇప్పటి వరకు 16 సీజన్స్ ని పూర్తిచేసుకుంది.. ఇక ఇప్పుడు ఢీ సీజన్ 17 సెలబ్రిటీ స్పెషల్ పేరుతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ షో కమింగ్ సూన్ ప్రోమోని రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇన్ని సీజన్స్ గా మనం ఢీ షోలో సుధీర్, ప్రదీప్ యాంకరింగ్ చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఈ సీజన్ ప్రోమోలో మాత్రం నటుడు నందు కనిపించి సీజన్ అవుట్ లైన్ చెప్పాడు. "డాన్స్ అంటే నాకు ప్రాణం ప్రతీ ఒక్కరి జీవితంలో డాన్స్ ఉంటుంది. డాన్స్ ఉన్న ప్రతీ ఒక్కరిలో ఢీ ఉంటుంది." అంటూ ఢీ ఇంట్రడక్షన్ ఇచ్చాడు నందు. ఆ తర్వాత స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఢీ పూర్తి చేసుకున్న సీజన్స్ లిస్ట్ ని చూపించారు. "ఈ స్టేజి మీదకు ఎంతో మంది కామన్ పీపుల్ గా వచ్చి పోటీ పది సెలబ్రిటీస్ అయ్యారు. కానీ మొదటి సారి ఈ స్టేజి మీద సెలబ్రిటీస్ పోటీ పడబోతున్నారు.. అదే ఈ సీజన్ ఢీ సెలెబ్రిటీ స్పెషల్" అని చెప్పాడు నందు. ఇక నందు యాంకర్ గా రాబోతున్నాడు అనిపిస్తోంది ఈ ప్రోమో చూస్తోంది. ఇక ప్రదీప్ కి బైబై చెప్పేసినట్టేనా మేకర్స్ అంటున్నారు నెటిజన్స్. ఇక ప్రదీప్ యాంకర్ గా కనిపించకపోయేసరికి నెటిజన్స్ అంతా తెగ ఫీలైపోతున్నారు. సుధీర్ అన్న కానీ ప్రదీప్ అన్న కానీ ఉండాలి కామెడీ ఉంటుంది అని అంటుంటే ఇంకొందరు మాత్రం మార్పు మంచిదే బై బై ప్రదీప్ అన్న అంటున్నారు. ఇంకొందరు మాత్రం నందుకి అవకాశం ఇచ్చిన మల్లెమాలకు థ్యాంక్స్ అంటూ విషెస్ చెప్తున్నారు. ఐతే అసలే సెలబ్రిటీ స్పెషల్ కాబట్టి కంటెస్టెంట్స్ ఎవరూ అనే విషయం ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు...మరి ఈ సీజన ఎంత ధూమ్ ధామ్ గా ఎవరు లాంచ్ చేయబోతున్నారో చూడాలి.. ఇక నందు రీసెంట్ గా రిలీజయిన "వధువు" థ్రిల్లర్  వెబ్ సిరీస్ లో తనదైన స్టైల్ తో  నటించి అందరినీ ఆకట్టుకున్నాడు.  

బాగుండే తెలుగమ్మాయిలు నచ్చరేమో వాళ్లకు..అందుకే ఆ రోల్స్ ఇస్తారేమో

బిగ్ బాస్ శ్రీసత్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిస్ బాస్ 6లోకి 6వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లో అందమైన కంటెస్టెంట్ కూడా శ్రీసత్యనే .   విజయవాడకు చెందిన శ్రీసత్య.. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. 2015లో మిస్ విజయవాడగా టైటిల్ విజేతగా నిలిచింది. నేను శైలజ, ‘లవ్ స్కెచ్’, గోదారి నవ్వింది వంటి సినిమాల్లో శ్రీసత్య నటించింది. ‘ముద్ద మందారం’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి శ్రీ సత్య ఇప్పుడు "మాట్లాడుకుందామా" అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఫాన్స్ తో కాసేపు మాట్లాడింది. "ఎంత క్యూట్ గా ఉన్నావ్ .. సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్ మాత్రమే ఇస్తారు ఎందుకు" అని ఒక నెటిజన్ అడిగేసరికి " ఎం చేస్తామండీ. తెలుగమ్మాయిలు లేరు అంటారు.. మేము తెలుగమ్మాయిలమే...మరి ఎందుకు తీసుకోరో మాకు ఒక్కోసారి అర్ధం కాదు.. నాకు కూడా ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్..ఒక పది మంది తెలుగమ్మాయిలు ఉంటె అందులో ఒకరో ఇద్దరినో మాత్రమే తీసుకుంటున్నారు అతి కష్టం మీద.. మరి ఎం జరుగుతుందో తీసిన వాళ్ళను అడగాలి.. తెలుగమ్మాయిలు బాగుండేవాళ్లు కూడా వాళ్లకు నచ్చరేమో" అని ఆన్సర్ ఇచ్చింది.  బిగ్ బాస్ గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు "యావర్, శివాజీ, ప్రశాంత్ ఇష్టం.. ఇప్పటివరకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే నేను బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఏమీ చూడలేదు..ఇప్పుడే అన్ని ఎపిసోడ్స్ చూసాను కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను.. 365 డేస్ చికెన్ పెట్టినా తింటా..కొన్ని పండగల సమయాల్లో తప్ప.. నా చేతికి పెట్టుకున్న ఉంగరాలు జాతకం ఉంగరాలు..నాకు కొంచెం జాతకం పిచ్చి ఉంది.. ఎవరి ఫ్యాన్ పేజెస్ వాళ్ళు వాళ్లకు నచ్చిన వాళ్ళను సపోర్ట్ చేసుకుంటారు. నేను చేయొద్దని ఎవరికీ చెప్పను ..ఎవరిష్టం వాళ్ళది" అంటూ నెటిజన్స్ అడిగిన వాటికి ఆన్సర్ ఇచ్చింది శ్రీసత్య.

బావుంది భోజనం..రాత్రి ఉంది శోభనం...రెచ్చిపోయిన రష్మీ

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కంటే ఇప్పుడు మిగతా ఇండివిడ్యువల్ షోస్ లో కామెడీ బీభత్సంగా ఇరగదీస్తోంది. ఈ రెండు షోస్ లో మాత్రం మనకు మనం కితకితలు పెట్టుకుని నవ్వుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో రెగ్యులర్ కమెడియన్స్ తో పాటు సినిమా రివ్యూస్ తన స్టయిల్లో అరుస్తూ ప్రాసలతో పంచులతో డైలాగ్స్ ని పరిగెత్తించే మీమార్ , రివ్యూవర్ బ్రో లక్ష్మణ్ కూడా మెరిశాడు. ఇక ఇప్పుడు  లక్కీ లక్ష్మణ్ పేరుతో ఇతనిది ఒక కొత్త టీమ్‌ ని లైన్ లోకి తీసుకొచ్చారు మేకర్స్. "జడ్జీలు మాకు ఇస్తారు మార్కులు టెన్.. అప్పుడే వేసింది బ్రో రష్మీ నా మీద కన్ను" అంటూ స్టేజ్ ఎక్కకముందే బిస్కెట్ పంచులు వేసేశాడు లక్ష్మణ్. ఇక బ్రో  పక్కనే ఉన్న పూలచొక్కా నవీన్ అనే  మరో కమెడియన్ డప్పు కొడుతూ కనిపించాడు. ఇక వెంటనే  "నువ్వు ఓకే అంటే వెళ్దాం గోవా.. మీ తమ్ముడికి నేనే బావా" అంటూ బ్రో కౌంటర్ వేయగానే దానికి కంటిన్యుయస్ ప్రాసగా  "ఇక స్టేజ్ మీదకి రావా" అంటూ  పంచ్ ఇచ్చారు జడ్జ్  కృష్ణ భగవాన్. ఇక స్కిట్‌లో బ్రో తన సహా కమెడియన్ తో స్కిట్ చేస్తున్నాడు. ఇంతలో బ్రో వైఫ్ గా చేసిన లేడీ కమెడియన్ "భోజనం పెట్టి ఎలా ఉందొ నీ స్టైల్లో చెప్పు" అని లక్ష్మణ్ అడిగేసరికి  నేను చెబుతా అంటూ రష్మీ మధ్యలో వచ్చి ఫుల్ జోష్ తో  "బావుంది భోజనం.. రాత్రి ఉంది శోభనం" అంటూ  చెప్పగానే సెట్ మొత్తం పగలబడి నవ్వింది. ఇక లక్ష్మణ్  బ్రోకి రష్మీ తన డైలాగ్ చెప్పేసరికి  ఏం చేయాలో తెలియక తన  ఫేస్ ని మాడిపోయిన అట్టులా  పెట్టాడు. ఐతే ఈ షో  రేటింగ్ ఏ వారానికి ఆ వారం తగ్గిపోతూ ఉండడంతో కొత్త కమెడియన్స్ ని తీసుకొస్తున్నారు జబర్దస్త్ మేకర్స్.   

రీఎంట్రీ ఇచ్చిన మనో..కామెడీ క్వాలిటీ బాలేదు

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ ఐన మొదట్లో చాల ఎంటర్టైనింగ్ గా ఫుల్ కామెడీ డైలాగ్స్ తో ఇంటిల్లిపాదీ చూసేలా ఉండేది. కానీ రాను రాను ఈ షోస్ కి పిల్లర్స్ లా ఉన్న సీనియర్ కమెడియన్స్ అంతా వెళ్లిపోయారు. కొత్త వాళ్ళు వచ్చారు. ఐతే కొంత కాలం నుంచి ఈ షోకి కమెడియన్స్ తో పాటు జడ్జెస్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. దాంతో ఈ షోస్ కి వున్న రేటింగ్, క్వాలిటీ కామెడీ ఇండెక్స్ తగ్గిపోతూ వస్తోంది. జబర్దస్త్ అంటే జడ్జెస్  ప్లేస్‌లో రోజా, నాగబాబు పడీపడీ నవ్వుతూ పంచులు వేస్తూ, సలహాలు, సూచనలు ఇస్తూ కమెడియన్స్ పాటు కలిసి పోయి జోక్స్ వేస్తూ చాల సందడిగా, సరదాగా ఉండేది షో. కానీ రోజా మంత్రి కావడంతో జబర్దస్త్‌కి గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోయారు. తర్వాత నాగబాబు కూడా చిన్నచిన్న ఇష్యూస్ కి  బైబై చెప్పేసి వెళ్లిపోయారు..తిరిగి రాను అని చెప్పేసారు. తర్వాత వాళ్ళ ప్లేసెస్ ని రీప్లేస్  చేసేందుకు జబర్దస్త్ టీమ్ చాలా ప్రయత్నాలు చేసింది. తర్వాత నాగబాబు కొంతకాలం సీట్ లో కనిపించారు ఆ తర్వాత మళ్ళీ వేరే షోస్ కి జడ్జిగా అవకాశం వచ్చేసరికి వెళ్లిపోయారు. ఇక  ఫైనల్ గా  కృష్ణ భగవాన్, ఇంద్రజ హాట్ సీట్స్ లో సెట్ ఇపోయారు. అయితే ఇటు జబర్దస్త్, అటు ఎక్స్‌ట్రా జబర్దస్త్ రెండూ షోలను మేనేజ్ చేయడం కష్టంగా ఉండటంతో కొద్ది కాలం ఖుష్భూ కూడా జడ్జిగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మరోసారి జడ్జి మారిపోయారు. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత రోజాతో పాటు ఆ ప్లేస్‌లో జడ్జిగా ఉన్న సింగర్ మనో ఇప్పుడు మరోసారి జబర్దస్త్ సెట్‌లో కనిపించారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో కృష్ణ భగవాన్‌తో పాటు మనో వచ్చారు. ఇటీవలే ఖుష్ఫూ ఈ షోకి గుడ్‌బై చెప్పడంతో ఒక ఎపిసోడ్ కి అలనాటి అందాల నటి మహేశ్వరిని జడ్జి తీసుకొచ్చారు. ఇక ఈ వారం మనోను షోకి తిరిగి రప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఇక లేడీ జడ్జి ఉండరు అనే విషయం అర్ధమవుతోంది. జబర్దస్త్‌కి మాత్రం ఇంద్రజ, కృష్ణ భగవాన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ షోస్ ఆగిపోతాయి కామెడీ లేదు అంటూ కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తోంది. మరి ఈ రెండు షోస్ సంగతి ఏమో కానీ నెటిజన్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలను కామెంట్స్ చేస్తున్నారు. "కామెంట్స్ తగ్గిపోయాయి , లైక్ లు తగ్గిపోయాయి, వ్యూస్ తగ్గిపోయాయి...ఇవన్నీ పెరగాలి అంటే సుడిగాలి సుదీర్.. హైపర్ ఆది రావాలి.... అప్పుడు బాగుంటుంది షో ... జబర్దస్త్ రేటింగ్ చాలా పడిపోయింది పాతవారిని మళ్లీ తీసుకురండి..." అని ఎక్స్ట్రా జబర్దస్త్ మేకర్స్ ని అడుగుతున్నారు. మరి వాళ్ళు ఎం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  

ఆదికి జాతక దోషం..ముసలావిడను పెళ్లి చేసుకోమంటూ బాబా సలహా

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో హైపర్ ఆది పెళ్లి తిప్పలు కాన్సెప్ట్ తో ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి అందంగా ముస్తాబై రాబోతోంది. హైపర్‌ ఆదికి నలభై ఏళ్లు దాటినా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. వాళ్ళను వీళ్ళను చూపించి పెళ్లి చేసుకుంటాను అంటాడు కానీ ఆ  పెళ్లి ఊసే ఎత్తడు. మరి వెళ్లేందుకు చేసుకోవడం అని ఆరా తీస్తే  ఆయన జాతకంలో దోషం ఉందని తెలిసి ఒక బాబాను ఆశ్రయించాడు. ఆ బాబా ఎవరో కాదు తాగుబోతు రమేష్.  ఇక ఆ బాబా హైపర్ ఆది చేతి రేఖలు చూసి కుజ దోషం పోవాలంటే ముందుగా ఒక వృద్ధురాలిని పెళ్లి చేసుకున్నాక మళ్లీ ఇంకో  అమ్మాయిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. ఇక హైపర్ ఆదికి స్వయంవరం జరుగుతుంది. కొంతమంది ముసలి వాళ్ళు వచ్చారు.  మొదట వచ్చిన ఆమె బాగానే ఉన్నా వద్దని చెప్తాడు ..ఇక రెండో ముసలావిడ వచ్చి హైపర్ ఆది వద్దు అంటూ ఒక పాట రూపంలో పాడి వినిపిస్తుంది. ఇక తర్వాత ముగ్గురు మహిళలు వచ్చి `కోట బొమ్మాళి` మూవీలోని `లింగిడి లింగిడి` సాంగ్ కి  అదిరిపోయే స్టెప్పులేశారు. అయితే వారి డాన్సులకు ఫిదా అయిన హైపర్‌ ఆది.. అందులో ఒక ముసలామెకు  కనెక్ట్ అయ్యి  ఓకే చెప్పాడు. తీరా చూస్తే లేడీ గెటప్ లో ఉన్న ఒక మేల్ డాన్సర్ . ఇక అతని నెత్తి మీద ఉన్న లేడీ విగ్ తీసేసరికి ఆది, రష్మీ షాకైపోయారు.  ఇందులో రష్మి, ఇంద్రజ పై ఆది  పంచ్‌లు పీక్స్ లో ఉన్నాయి. ఇక పాపం ఎప్పటికప్పుడు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆదికి ఇక్కడ కూడా నిరాశే ఎదురయ్యింది. మరి ఇంకా ఎప్పటికి పెళ్లయేనో..ఇక ఆది స్కిట్ చూసిన నెటిజన్స్ అంతా కూడా ఆది కామెడీ లేనిదే శ్రీదేవి డ్రామా కంపెనీ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

కవులకు కౌంటర్ వేసిన రాకెట్ రాఘవ...ఆడవాళ్లనే పొగుడుతారంటూ ఫైర్

ఈ వారం జబర్దస్త్ షోలో స్కిట్స్ అన్నీ కూడా చాల వెరైటీగా ఉన్నాయి. అందులో రాకెట్ రాఘవ స్కిట్ ఐతే భలే నవ్వు తెప్పించింది. ఈ స్కిట్ లో రాఘవ కవుల మీద ఫైర్ కూడా అయ్యాడండోయ్.. స్కిట్ లో భాగంగా రాఘవ పెళ్ళానికి ఒకసారి నెక్లెస్ దొరికిందట. ఐతే దాన్ని అక్కడే వదిలేసి వచ్చిందట. తీరా ఎందుకు వదిలేసిందో కనుక్కుంటూ దాని డిజైన్ నక్కలేదట. ఇలాంటి తింగరిది ఇంకా ఎక్కడన్నా ఉంటుందా అంటూ ఇంద్రజకి చెప్పాడు. ఇక ఆమె పగలబడి నవ్వింది. "అసలు దీన్ని కాదండి అనాల్సింది..కవుల్ని. కవులు ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ అందాలనే పొగుడుతూ ఉంటారు. మగవాళ్ల అందాల్ని అస్సలు పొగడరు. ఎందుకో తెలుసా అండి మా అందాలను పొగడడానికి పదాలు సరిపోవు." అనేసరికి "ఎందుకు సరిపోవు..సరిపోతాయి" అని రాఘవ వైఫ్ గట్టిగా చెప్పి బ్యాక్ గ్రౌండ్ లో " సచ్చినోడా" అనే సాంగ్ ని ప్లే చేయించి రాఘవ పరువు నిలువునా తీసేసింది. ఇక రాఘవ స్కిట్ చాల ఫన్నీగా సాగింది. అనగనగా రాజు రాజుకు ఏడుగురు కొడుకులు కాన్సెప్ట్ లో అనగనగా రాఘవ...రాఘవకు ఏడుగురు భార్యలు అనే ఈ స్కిట్ లో ఒక భార్యకు తమ్ము గండం ఉందని తుమ్మితే పోతుందంటూ ఏడు పెళ్లిళ్లు చేసుకోవడం రాఘవ రెడీ అవడం చివరికి ఆ పెళ్లిళ్ల ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో రాఘవ పెళ్ళాల చేతుల్లో తన్నులు తినడం ఆడియన్స్ ని బాగా నవ్వించింది. ఇక కృష్ణ భగవాన్ ఐతే రాఘవని తెగ పొగిడేశారు. ఇలాంటి కథ ఎలా ఆలోచించారు. ఈ కాన్సెప్ట్ ఆలోచించడమే చాల కష్టం కదా..ఇంతకు సమరంలో సలహాలు, కాపురంలో కలహాలు డైలాగ్ సూపర్ గా ఉంది. ఎప్పుడు అన్నీ స్కిట్స్ బాగున్నాయని ఊరికే చెప్తుంటాం..కానీ ఇప్పుడు స్కిట్ మాత్రం చాల బాగుంది అని చెప్పారు.

బ్యాక్ టు బ్యాక్ రెండు కొత్త సీరియల్స్ తో సందడి చేయబోతున్న స్టార్ మా

తెలుగు ఆడియన్స్ కి స్టార్ మా గుడ్ న్యూస్ చెప్పేసింది. లేటెస్ట్ గా ఒక అప్ డేట్ ఐతే తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక కొత్త సీరియల్స్ సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. ఒకటి కాదు ఏకంగా రెండు సీరియల్స్ పట్టాలెక్కించింది స్టార్ మా. అదే ఊర్వశివో-రాక్షసివో ఒకటి అలాగే యష్-వేద జోడి నటిస్తున్న సత్యభామ సీరియల్స్. ఈ రెండు సీరియల్స్ కూడా వన్ బై బై రాబోతోన్నయి. సత్యభామ సీరియల్ రాత్రి 9 .30 గంటలకు ప్రసారమవుతుండగా, ఊర్వశివో-రాక్షసివో సీరియల్ రాత్రి 10 గంటలకు రాబోతోంది. ఈ రెండు సీరియల్ ఈ నెల 18  సోమవారం నుంచి బుల్లితెర మీద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఊర్వశివో-రాక్షసివో సీరియల్ లో వినయ్ సింధియా హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో ఇతనికి ఇదే మొదటి సీరియల్.  అలాగే హీరోయిన్ గా కేరళ అమ్మాయి ఆయేషా నటిస్తోంది. ఈమె సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో నటించింది. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా ఆయేషా ఎంట్రీ ఇచ్చి వచ్చింది. ఇక ప్రగతి ఈ సీరియల్ నెగటివ్ రోల్ లో కనిపించబోతోంది. ఇక సత్యభామ సీరియల్ కూడా తెలుగు అభిమానులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. ఎందుకంటే ఈ సీరియల్ లో కనిపించబోతున్న యష్- వేద జోడి ఆల్రెడీ  ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో అలరించింది. ఇక వీళ్ళ కాంబోలోనే మరో సీరియల్ వస్తుండడంతో ఆడియన్స్ కి పండగే పండగ అని చెప్పొచ్చు.  

Krishna Mukunda Murari:కృష్ణని చూసి షాక్.. మురారికి గతం గుర్తొచ్చిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -339 లో.. ముకుంద, మురారి పూజ చేస్తుంటారు. మీ వయసు గల వారు కంకనం కట్టాలని పంతులు అనగానే కృష్ణ ఉంది కదా అని మురారి అంటాడు. అవసరం లేదు నందుని తీసుకుని రమ్మని  ప్రసాద్ కి భవాని చెప్తుంది. కాసేపటికి కృష్ణ, నందుల దగ్గరికి ప్రసాద్‌ వెళ్తాడు. అక్కడే మధు కూడా ఉంటాడు. జరిగింది చెప్పి కృష్ణ నువ్వు పద అని అనగానే మధు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కృష్ణని తీసుకోని ప్రసాద్ పూజ దగ్గరికి వెళ్తాడు.  కృష్ణని చూసి అందరు షాక్ అవుతారు. నందుకి తలనొప్పి గా ఉంటే కృష్ణని తీసుకోని వచ్చానని ప్రసాద్ చెప్తాడు . కాసేపటికి కృష్ణ వెళ్లి మురారికి కంకనం కడుతుంటే మురారికి గతం గుర్తుకు వచ్చినట్లు అవుతుంది. ఆ తర్వాత ముకుందకి కడుతుంది. కాసేపటికి నందు దగ్గరికి వెళ్లి మురారికి గతం గుర్తుకు వస్తున్నట్టు ఉందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు ముకుంద కోనేరు దగ్గరికి  దీపాలు వదలడానికి వెళ్తుంది. తనతో పాటు కృష్ణ కూడా వెళ్తుంది. అసలు ఎందుకు నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావని కృష్ణతో ముకుంస అంటుంది. అప్పుడే కృష్ణ కోనేరులో పడిపోతుంది. కాపాడండి ఏసీపీ సర్ అని కృష్ణ గట్టిగా అరుస్తుంటుంది.  దాంతో మురారి పరుగున వచ్చి కృష్ణని కాపాడతాడు. ఆ తర్వాత కృష్ణ సర్ అంటూ ఏదో చెప్పబోతుండగా.. నీ ఏసీపీ సర్ ని. నాకు గతం గుర్తుకువచ్చిందని మురారి చెప్పగానే.. ఒక్క ముకుంద తప్ప అక్కడున్న అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. గతం మర్చిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని భవానితో మురారి అంటాడు. ఆ తర్వాత అందరు కలిసి ఇంటికి వస్తారు. ముకుంద కోపంగా లోపలికి వెళ్తుంది. కృష్ణ ఈ రాత్రి నువ్వు అవుట్ హౌస్ లోకి వెళ్ళు.. రేపు ప్రొద్దున మాట్లాడుతానని భవాని చెప్తుంది. మధు లోపలికి వెళ్లి చూసేసరికి ముకుంద సూసైడ్ చేసుకొని ఉంటుంది. కృష్ణ తనకి ట్రీట్ మెంట్ ఇస్తుంది. తరువాయి భాగంలో ముకుంద, నువ్వు ప్రేమించుకున్నది నిజం కాద? నీ మీద ప్రేమతో ఆ పిచ్చిది ప్రాణం మీదకి తెచ్చుకుంది. అందుకే వచ్చే శుక్రవారం ముకుందకి నీకు పెళ్లి అని భవాని చెప్తుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నేను నథింగ్.. రతికతో లవ్ ట్రాక్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఫ్యామీలీ వీక్ అంటే జనాలంతా ఆతృతగా ఎదురు చూస్తారు. ఎందుకంటే కొన్ని వారాలుగా ఫ్యామిలీకి దూరంగా హౌస్ లో ఉన్నవారికోసం వస్తారు కాబట్టి దానికంత క్రేజ్. కానీ దానికి మించి ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు కంటెస్టెంట్స్. ప్రతీ సీజన్ లో లాగా ఈ సీజన్-7 లో టాప్-5 ని కాకుండా టాప్-6 ని ఉంచారు బిగ్ బాస్. ఇక గత మూడు రోజులుగా ఈ ఆరుగురికి సంబంధించిన జర్నీ వీడియోలని బిగ్ బాస్ చూపిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో‌ మొదటగా యావర్ జర్నీని ప్లే చేసారు‌ బిగ్ బాస్. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'టెంపర్' సినిమాలోని 'నీ అయ్య టెంపర్'.. పాటతో యావర్ కి స్వాగతం పలికాడు బిగ్ బాస్. ఇక గార్డెన్ లో మంచు కురుస్తున్న వేళ.. తన జర్నీని అద్భుతంగా మలిచాడు బిగ్ బాస్. తను గేమ్  లో ఆడిన విధానం, శివాజీ ఓదార్చిన సీన్,  బాల్ టాస్క్, ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పడిన కష్టం.. ఇలా అన్ని ఫోటోలని చూపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత యావర్ కోసం కొన్ని మోటివేషనల్ మాటలని మాట్లాడాడు బిగ్ బాస్.  ‘మీరు ఏదైనా ఇష్టపడితే దాని కోసం ఎంత కష్టపడటానికైనా సిద్దపడే మీ గుణం అందరికి నచ్చింది. టాస్క్‌లలో మీకు ఎవరు పోటీ కాదు అనే విధంగా ప్రతి టాస్క్‌లో ఇరగదీశారు. యావర్‌తో పోటీ అంటే ఆలోచించాల్సిందే అనేట్టు చేశారు. స్పైగా మీకు దొరికిన అమూల్యమైన స్నేహం కూడా మీ ప్రయాణం సాఫీగా ముందుకు కదిలేందుకు దోహదపడింది. మీ కోపం, పట్టుదల.. మీకు తప్పు కనిపించిన ప్రతీ చోట కనిపించాయి. అదే ధైర్యం మీరు ఎవిక్షన్ పాస్‌ని సాధించేలా చేసింది. ఆ ఎవిక్షన్ పాస్‌ని తిరిగి ఇచ్చేసినప్పుడు.. నీతిగా గెలవాలనే మీ క్యారెక్టర్ అందరికీ నచ్చింది" అంటూ బిగ్ బాస్ చెప్పడంతో.. యావర్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత యావర్ జర్నీ వీడియోని చూపించాడు‌ బిగ్ బాస్. అందులో రతికతో లవ్ ట్రాక్, శివాజీ, ప్రశాంత్ లతో స్పై గా మొదలైన స్నేహం, శోభాశెట్టితో గొడవ, ఆట సందీప్ బ్యాక్ బిచ్చింగ్, రతిక సీక్రెట్ రూమ్ లో చెప్పిన అన్ డిజర్వింగ్ రీజన్, శివాజీతో కలిసి తనకేమీ లేవని, జాబ్ కూడా లేదని చెప్పుకున్నది.. ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అన్నయ్య వచ్చినప్పటి ఫుటేజ్.. ఇలా అన్నింటిని చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు యావర్. అసలు పరిచయం మనుషుల మధ్య భాష రాకపోయిన.. ఉండొచ్చు అని నిరూపిస్తూ సాగిన యావర్ జర్నీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఇక తన జర్నీ వీడియో చూసాక యావర్ మాట్లాడిన ప్రతీ మాట యావర్ ని ఈ స్టేజ్ మీద డిజర్వింగ్ అనేంతలా అనిపించింది. బిగ్ బాస్ నేను మీ బిడ్డను.. నేను నథింగ్.. మీరు నన్ను సంథింగ్ చేశారు. నా జీవితాంతం మీకు ఋణపడి ఉంటానని యావర్ చెప్పిన ప్రతీ మాట టీవీ చూస్తున్న ప్రేక్షకుడిని కదిలించాయి. హౌస్ లో ఒంటరిగా మొదలైన యావర్ ప్రయాణం.. బిగ్ బాస్ సీజన్-7 లో ది బెస్ట్ జర్నీగా నిలిచింది.