Guppedantha Manasu:మెడపట్డి బయటకు గెంటేసిన ఎండీ!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -950 లో.. శైలేంద్ర రెడీ అవుతుంటే దేవయాని వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. కాలేజీకి వెళ్తున్నానని శైలేంద్ర చెప్పగానే.. ఇప్పుడు నీకేం బాగోలేదు ఎందుకు వెళ్లడమని దేవయాని అనగానే.. ఇంటి దగ్గర ఉంటే బాబాయ్ వచ్చి అలా చేశాడు. అందుకే అలా వెళ్తున్నానని శైలేంద్ర అనగానే ఆవును నిజమే అని దేవాయని అంటుంది.  ఆ తర్వాత శైలేంద్ర దగ్గరికి ధరణి వచ్చి.. మీరు ఇప్పుడు కాలేజీకి ఎందుకంటూ వెటకారంగా అడుగుతుంది. దేవయాని కోపంగా ఎందుకు నీకు వాడికి కాలేజీ లో వర్క్ ఉండదా? ఫైల్స్ మీద సైన్ చెయ్యాలి. వాడికి ఇష్టం ఉన్నది చేస్తాడు కావాలంటే పేపర్స్ కూడా చింపేస్తాడని దేవాయని అనగానే.. అ చింపేసుడేందో మామయ్య గారికి చెప్పి ఫైల్స్ ఇంటికి తెప్పిస్తాను. ఇక్కడే చింపేయండని ధరణి అంటుంది. ఏంటి ఈ మధ్య కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడుతున్నావని ధరణిపై దేవయాని కోప్పడుతుంది. ఆ తర్వాత శైలేంద్ర, దేవయాని ఇద్దరు కాలేజీకి వెళ్తారు. రిషి ఎప్పుడు వస్తాడో వీళ్ళ అరాచకం ఎప్పుడు బయటపడుతుందో ఏమో అని ధరణి అనుకుంటుంది. మరొకవైపు నోటీసు బోర్డు దగ్గర  వసుధార ఉండడం చూసి అనుపమ వస్తుంది. ఇంపార్టెంట్ నోటీసు అయి ఉంటుంది అందుకే చూస్తున్నావా అని అనుపమ అంటుంది. జగతి మేడమ్ ని స్ఫూర్తి గా తీసుకొని నేను ఇక్కడ వరకు వచ్చాను. ఈ ఎండీ చైర్ గురించి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి. రిషి సర్ నాపై బాధ్యతలు పెట్టి సపోర్ట్ ఇస్తు వచ్చారంటు అనుపమకి వసుధార చెప్తుంది. వసుధార డిస్సపాయింట్ అవుతుంటే అనుపమ దైర్యం చెప్తుంది. మరొకవైపు దేవయాని, శైలేంద్ర ఇద్దరు కాలేజీ వస్తారు. అలా కాలేజీలోని ఎండీ క్యాబిన్ లోకి వెళ్తారు. క్యాబిన్ లో రెండు చైర్ లు చూసి ఏంటి రెండు ఉన్నాయని శైలేంద్ర అనగానే.. ఒకటి రిషిది అ చైర్ లో ఎవరు కూర్చొవద్దంట‌ అని అనగానే.. ఎందుకు రిజర్వేషన్ చేయించిందా అని  శైలేంద్ర అంటాడు. నువ్వు కూర్చో.. నీ ముచ్చట తీర్చుకో.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ శైలేంద్రని కూర్చొమని దేవయాని చెప్తుంది. శైలేంద్ర కూర్చోబోతుంటే వసుధార వచ్చి ఆగమని చెప్తుంది. అ చైర్ లో కూర్చోడానికి అర్హత ఉండాలి అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయిన మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రానిచ్చారటూ ఫ్యూన్ ని పిలుస్తుంది. మేడపట్టి బయటకు గెంటేయ్యని ఫ్యూన్ కి వసుధార చెప్పగానే.. శైలేంద్ర దేవయానిలే అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

డిసెంబర్ 31వ తేదీ రాత్రి 9:30 నిమిషాలకు రష్మీ పెళ్లి!

బుల్లితెర మీద రష్మీ ఒక స్టార్ యాంకర్. సుడిగాలి సుధీర్ తో కలిసి రష్మీ హోస్ట్ చేసిందంటే చూసే ఆడియెన్స్ లో వచ్చే ఆ హుషార్ వేరు.  జబర్దస్త్ యాంకర్ గా మంచి సక్సెస్ ని అందుకుంది. తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ చేసింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరించే అవకాశాన్ని అందుకుంది.  ఇలా బుల్లితెరపై సూపర్  సక్సెస్ అందుకున్న రష్మీ సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన లక్ ని పరీక్షించుకుంది. కొన్ని మూవీస్ లో నటించి ఒక మోస్తరు సంపాదించుకుంది. కానీ అనుకున్నంత సక్సెస్ రాలేదు. బుల్లితెర మీద వచ్చినంటే పేరు సిల్వర్ స్క్రీన్ మీద రాలేదు. ఏదైనా ఒక్క మూవీ ఐనా బ్రేక్ ఇచ్చి ఉంటె రష్మీ ఈపాటికి బుల్లితెర మీద కనిపించేదే కాదు. బుల్లితెరపై సుడిగాలి సుదీర్ తో కలిసి  చేసిన స్కిట్స్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఉన్నట్టు, అన్నట్టు ఆడియన్స్ లో ఒక మాయను సృష్టించారు. వీళ్ళిద్దరూ నిజంగా లైఫ్ లో పెళ్లి చేసుకుంటే బాగుండు అని కూడా ఆడియన్స్ అనుకున్నారంటే ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఎంతగా వర్కౌట్ అయ్యిందో వేరేగా చెప్పక్కర్లేదు.  ఐతే ఈ మధ్యలో ఎవరి దిష్టి తగిలిందో ఇద్దరూ వేరైపోయారు.. సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వేరే షోస్ కి యాంకర్ గా వెళ్ళిపోయాడు. అవి పూర్తయ్యాక సినిమాల్లో నటించడానికి వెళ్లి రష్మీకి దూరమైపోయాడు. కానీ ఆడియన్స్ మాత్రం ఈ జోడి అస్సలు వదల్లేదు.  ఐతే రష్మీ ఏజ్ పెరిగిపోతుంది..దాంతో అందరూ కూడా పెళ్ళెప్పుడు అని ప్రతీ సందర్భంలో అడుగుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రష్మీ తన పెళ్ళెప్పుడు అని అడుగుతున్న వాళ్లకు ఒకటే సమాధానం ఇచ్చారు డిసెంబర్  31  న తన పెళ్లి విషయం చెప్తాను అని చెప్పింది. న్యూ ఇయర్ రాబోతుండడంతో "రష్మీ పెళ్లి పార్టీ" అంటూ ఓ స్పెషల్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్మీ  తన పెళ్లి విషయాన్ని ప్రకటించడం కోసం ముహూర్తం నిర్ణయించారు... ఆ ముహూర్తం ఎప్పుడు అనే విషయానికి వస్తే డిసెంబర్ 31వ తేదీ రాత్రి 9:30 నిమిషాలకు తన పెళ్లి పెళ్లికి సంబంధించిన విషయాలను ప్రకటిస్తానని ఈ ప్రోమోలో చెప్పింది. అయితే ఇదంతా న్యూ ఇయర్ షోలో ఒక భాగంగానే విషయం అర్థమైపోతుంది.

Krishna Mukunda Murari:‌మురారి మళ్ళీ డ్యూటీలో‌ జాయిన్ అవ్వగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -344 లో.. ఎక్కడ నిజం బయటపడి పెళ్లి ఆగిపోతుందోనని ముకుంద భయపడుతుంటుంది. అప్పుడే ముకుంద దగ్గరికి భవాని వచ్చి.. ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది.  ఏం లేదు మురారికి గతం గుర్తుకు వచ్చింది. నాకు అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉందని ముకుంద అంటుంది. భయం ఎందుకు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కదా.. తప్పు చెయ్యనిదే జైలుకీ ఎందుకు వెళ్తాడని భవాని అనగానే.. పెళ్లి అయ్యాక ఒకవేళ కృష్ణ వాళ్ళు ఏమి తప్పు చేయలేద తెలిస్తే అని ముకుంద అంటుంది. అవన్నీ ఏమి ఆలోచించకని భవాని చెప్తుంది.  ఆ తర్వాత మీరు అన్ని చూసుకుంటారు. నాకు ఇక టెన్షన్ ఎందుకని ముకుంద వెళ్ళిపోతుంది. నేను చూసుకుంటానని ముకుంద దైర్యంగా ఉంది. నేను అనుకున్నవి ఏమి జరగట్లేదు. మురారిని అమెరికా పంపించాలి అనుకున్నా అవ్వలేదు.. కృష్ణని ఇంట్లో నుండి పంపించాలని అనుకున్నాను. ఇది అవలేదు. అన్ని కృష్ణకి ఫేవర్ గా అవుతున్నయని భవాని అనుకుంటుంది. మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు హాస్పిటల్ కి వెళ్లి  పరిమళ మేడమ్ ని కలుస్తారు. జరిగిందంతా చెప్పి నన్ను  సర్జరీ కోసం తీసుకోని వచ్చింది ఎవరని మురారి అడుగుతాడు. శేఖర్ అనే వ్యక్తి తీసుకోని వచ్చాడు. అంతే డీటెయిల్స్ ఏమి చెప్పలేదని పరిమళ చెప్తుంది. సీసీ టీవీ ఫుటేజ్  లో చూడండని మురారి అంటాడు. కానీ సీసీ టీవీ ఫుటెజ్ ఆ ఒక్క రోజుది తప్ప మిగతా రోజులవి ఉన్నాయి. ఎవరో పక్కా ప్లాన్ తో ఇదంతా చేశారని మురారి అనుకుంటాడు. పరిమళ మేడమ్ స్టాఫ్ ని పిలిచి అడుగుతుంది. అ రోజు సీసీ టీవీ రిపేర్ లో ఉందని చెప్తాడు. కాసేపటికి మురారి, కృష్ణ ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు పెళ్లి నగలు సెలెక్ట్ చెయ్యడానికి భవాని మేడమ్ ఇంటికి రమ్మన్నారని సేట్ నగలు ఇంటికి పట్టుకొని వస్తాడు. ఆ తర్వాత ముకుంద, భవాని ఇద్దరు నగలు సెలక్షన్ చేస్తుంటారు. అక్కడే ఉన్న రేవతిని ఎలా ఉన్నాయని అడుగగా.. బాగాలేదని చెప్తుంది. మరి నువ్వు సెలెక్ట్ చెయ్ అని భవాని అనగానే.. తనకి ఇష్టం లేకున్నా రేవతి సెలెక్ట్ చేస్తుంది. ఇక ముకుంద కూడ ఇష్టం లేకున్నా రేవతి సెలక్షన్ చేసింది కాబట్టి నచ్చిందని చెప్తుంది. కాసేపటికి శకుంతల దగ్గరికి రేవతి వస్తుంది. మురారి ఎలాగైనా  మా అయన ఏం తప్పు చెయ్యలేదని నిరూపిస్తాడని శకుంతల చెప్తుంది. మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు వెళ్లి కమీషనర్ ని కలుస్తారు. జరిగిందంతా చెప్తారు. మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతానని అనగానే రెండు నెలలు కన్పించకుండా ఉండి రూపం మారి వస్తే చాలా కాంప్లికేటెడ్ అవుతుందని కమీషనర్ అంటాడు.  అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే  

మానస్ హీరో మెటీరియల్ అంటూ ఇంద్రజ కామెంట్స్

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక క్రిస్మస్ రాబోతున్న సందర్భంగా ఆ ఈటీవీలో ఆ సెలెబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు శ్రీదేవి డ్రామా కంపెనీ కంపెనీ. ఈ ఈవెంట్ కి కొత్త పెళ్ళికొడుకు మానస్ నాగులపల్లి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షోకి రష్మీ శాంతాక్లాజ్ లా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది. ఇక స్టేజి మీదకు వచ్చిన రాంప్రసాద్ మానస్ కి "హ్యాపీ మారీడ్ లైఫ్" అంటూ విష్ చేసి "ఏంటో ఎదవలందరికీ పెళ్ళిళ్ళయిపోతాయి ముందే" అని కౌంటర్ వేసేసరికి "అందుకే నీకు ముందు అయ్యింది పెళ్లి" అని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు మానస్. దానికి రాంప్రసాద్ పరువు పోయింది. తర్వాత శ్రీ సత్యతో కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి మానస్ మంచి హాట్ గా డాన్స్ చేసాడు.. అతని డాన్స్ చూసిన జడ్జి ఇంద్రజ " యు ఆర్ ఏ హీరో మెటీరియల్ మ్యాన్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక గుంటూరు కారం మూవీ నుంచి ఒక మంచి సాంగ్ ని ధనుంజయ్ పాడి అందరినీ అలరించాడు. ధనుంజయ్ వాయిస్ ని ఇంద్రధనుస్సుతో పోల్చింది ఇంద్రజ. తర్వాత నాటీ నరేష్ దశావతారం మూవీలో ఒక బిట్ ని స్పూఫ్ గా చేసి చూపించి మంచి ఫన్ క్రియేట్ చేసాడు. "బట్టలు, చెప్పులు నాకు ఏనాడైనా కొంటివా...రాంప్రసాద్ అని పలికిన నోటా ఇంద్రజమ్మ అని పలకనులే" అంటూ ఆ సాంగ్ ని పేరడీ చేసి మరీ పాడాడు నరేష్. లాస్ట్ లో భావన, ఐశ్వర్య కలిసి రెయిన్ డాన్స్ వేసి అందరినీ అలరించారు. ఐతే ఈ క్రిస్మస్ ఎపిసోడ్ లో మాత్రం హైపర్  ఆది కనిపించలేదు, అలాగే వర్ష కూడా కనిపించలేదు. ఇక రష్మీ వేసుకొచ్చిన డ్రెస్ బాగుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ, వర్షా, ఆది ఎందుకు రాలేదంటూ ఆరా తీస్తున్నారు.

Brahmamudi:సర్ ప్రైజ్ చేద్దామనుకుంటున్న ప్రియురాలు.. భార్య చేతికి భర్త దొరకనున్నాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -283 లో.. అనామిక-కళ్యాణ్ పెళ్లిలో భాగంగా దుగ్గిరాల ఇంట్లో సందడిగా ఉంటుంది. వెండి బాసిగల్ తీసుకొని వచ్చావా అని అపర్ణని ఇందిరాదేవి అడుగగా.. తీసుకుని వచ్చానని అపర్ణ చెప్తుంది. అ తర్వాత నగలు గురించి మాట్లాడుకుంటుంటే.. వాళ్ళు అసలు ఏం పెట్టేలా లేరు. కేవలం మన ఆస్తి కోసం పెళ్లి చేస్తునట్లు ఉందని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత పెళ్లిలో ఎలాంటి గొడవలు జరగకుడదని రుద్రాణికి ఇందిరాదేవి చెప్తుంది. అప్పుడే సీతారామయ్య కింద పడిపోతాడు. వెంటనే డాక్టర్ ని పిలిపిస్తాడు రాజ్.. ఎందుకో ఈ పెళ్లి ఆపేస్తేనే మంచిదని పంతులు గారు చెప్పిన మాటలని కళ్యాణ్ గుర్తుకుచేసుకుంటాడు. ధటన్యలక్ష్మి, రుద్రాణి ఇద్దరు కూడా అలాగే అంటారు. కాసేపటికి సీతారామయ్య దగ్గరికి డాక్టర్ వచ్చి తన కండిషన్ చూసి హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాలని చెప్తాడు. కానీ సీతారామయ్య ఈ విషయం ఎవరికి చెప్పకండి బాగున్నాడని చెప్పండని డాక్టర్ కి చెప్తాడు. అ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి.. బాగున్నాడని చెప్పగానే అందరు రిలాక్స్ అవుతారు. మరొక వైపు రాజ్ తన రిలెటివ్స్ అయిన విక్కీ, పద్మావతి లని పెళ్లి కీ పిలుస్తాడు. మరొక వైపు అనామిక వాళ్ళ డాడ్ పెళ్లిలో ఏవైనా నగలు పెట్టలేదని అంటారేమోనని టెన్షన్ పడుతుంటే.. అప్పుడే అనామిక వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి చాలా ఉన్నాయి వాళ్ళు ఎందుకు అడుగుతారని చెప్తుంది. అప్పుడే  అనామిక వాళ్ళ నాన్నకి గోల్డ్ షాప్ సేట్ ఫోన్ చేస్తాడు. వాళ్లకి ఇవ్వాలిసిన రెండు కోట్ల గురించి కాల్ చేస్తున్నారని అనుకుంటారు. ఆ తర్వాత అనామిక వాళ్ళ నాన్న లిఫ్ట్ చేస్తాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తావని సేట్ అడుగుతాడు. మా కూతురు గొప్ప ఇంటికి కోడలు అవుతుంది. పెళ్లి అయిన తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తానని అనామిక వాళ్ళ నాన్న చెప్తాడు.  మరొకవైపు శ్వేతతో రాజ్ ఫోన్ మాట్లాడుతుంటాడు. అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. కావ్యని చూసిన రాజ్ టెన్షన్ పడుతూ పక్కకి వెళ్తుంటాడు. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా అని అనగానే రాజ్ షాక్ అవుతాడు. మరి ఆఫీస్ విషయాలకి  బయటకు వెళ్లడం ఎందుకని కావ్య అంటుంది. అ తర్వాత  శ్వేతకి పెళ్లి జరగబోయే రిసార్ట్ పేరు చెప్తాడు రాజ్. ఫోన్ కట్ చేసాక ఎలాగైనా పెళ్లికి వెళ్లి రాజ్ కి సర్ ప్రైజ్ ఇవ్వాలని శ్వేత అనుకుంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఆ డబ్బులు వాళ్ళవే... శివాజీ అన్నకి ఋణపడి ఉంటాను!

బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్‌లలో ఒక కామన్ మ్యాన్ కప్ గెలవడం ఇదే ప్రథమం. దాంతో పల్లవి ప్రశాంత్ ఎంతోమందికి ఇన్ స్పిరేషన్ గా నిలిచాడు. ఇక విజేత అయిన తర్వాత జరిగిన బజ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు పల్లవి ప్రశాంత్. ఎవిక్షన్ పాస్ ఎవరికోసం యూజ్ చేద్దామని అనుకున్నావని అడుగగా.. రతిక కోసం వాడుదామని అనుకున్నా కానీ తను నాతో ఫస్ట్ ఉన్నట్టు లేదు. అందుకే వాడలేదు. యావర్, శివాజీ ఇద్దరిలో ఒకరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడాలంటే ఎవరికి వాడతావని అడుగగా.. అయ్యో పెద్ద ప్రశ్నే వేశారు కదా. ఇద్దరు నాకు ఎక్కువే. కానీ శివాజీ అన్నకే ఇస్తాను‌ ఎందుకంటే నేను హౌస్ లోకి వచ్చినప్పుడు ఒక భయం ఉండేది. నాకు అన్ననే మొదట కనెక్ట్ అయ్యాడు. కామన్ మ్యాన్ అంటు దగ్గరికి తీసుకున్నాడు. ఎలా ఉండాలో చెప్పాడు. నాకోసం ఇంటినుండి వచ్చిన లెటర్ ని సాక్రిఫైజ్ చేశాడు. ఇక అప్పుడే డిసైడ్ అయ్యా గెలిచి చూపిస్తా అని శివాజీ అన్నకి మాటిచ్చా మొట్టమొదటి కెప్టెన్ గా నిలిచానని ప్రశాంత్ అన్నాడు. అర్జునుడికి కృష్ణుడి బాణం తోడైనట్టు శివాజీ అన్న నీకు తోడుగా నిలిచాడు‌ కదా అని అడుగగా.. అవును.‌ నేను పొలం దగ్గర పనిచేస్తున్నప్పుడు మా నాన్న ఎలా అయితే నాతో‌ ఉన్నాడో‌ అలాగే హౌస్ లోకి వచ్చాక అన్నే నాతో ఉన్నాడు. సపోర్ట్ ఇచ్చాడు. ఆ రోజు స్మైల్ టాస్క్ లో.. పళ్లు (టీత్) తీసుకొచ్చేప్పుడు అన్న పడ్డాడు. ఇక మెల్లిగా వెళ్తుండు ఏం అయింది అన్న పరుగెత్తు అంటే నాతో అయితలేదు రా, చేయి లేత్తలేదురా అన్నాడు.‌ షాక్ అయ్యాను ఆ తర్వాత అయ్యో  ఏం అయింది అన్న నేను మస్త్ బాధపడ్డాను.  నా‌ లైఫ్ లో నా కోసం ఎవరు త్యాగం చేయలేదు. ఫస్ట్ టైమ్ అన్నే నాకోసం త్యాగం చేశాడు. నువ్వు ఉండాలే, గెలవాలే‌ కామన్‌ మ్యాన్ గా వచ్చావ్. ఎంతో‌మంది రైతులకి ఆదర్శం కావాలని అన్న నాకోసం లెటర్ ని త్యాగం చేశాడంటూ ఏడ్చేశాడు ప్రశాంత్. విన్ అయ్యావ్ ప్రశాంత్ ఎందుకు ఏడుస్తున్నావని అడుగగా.. లెటర్‌ సాక్రిఫైజ్ చేసాక గెలిచి చూపిస్తా అని‌ చెప్పాను. ఇక కలర్ పూసుకునే టాస్క్ లో అన్న నా దగ్గరికి వచ్చి అరేయ్ నిన్ను అందరు టార్గెట్ చేసారురా, నిన్ను ఆడనవ్వరురా వచ్చేయ్‌ అని చెప్పి అన్న లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను గెలిచి అన్న దగ్గరికి వెళ్ళాను. చూపెట్టినవ్ రా కామన్ మ్యాన్ పవర్ చూపెట్టినవర్ రా అని అన్న ప్రతీసారీ నాకు సపోర్ట్ గా ఉన్నాడని ప్రశాంత్ అన్నాడు. ఒకవేళ శివాజీ అన్న సపోర్ట్ లేకుంటే నువ్వు గెలిచేవాడివి కాదా అని అడిగినప్పుడు.. లోపల నాకు ఎవరు తెలియదు అన్న మాటలు నాకు ధైర్యమిచ్చాయి.‌ అన్న గేమ్ ఎలా ఆడాలో చెప్పడు. ఎవరైన ఏం అయిన అన్నప్పుడు నా దగ్గరికొచ్చి సపోర్ట్ గా, నాకు ధైర్యంగా ఉండేవాడని ప్రశాంత్ అన్నాడు.  రైతుబిడ్డ అనే పేరుని నీకు‌ సింపతీ కోసం వాడుకున్నావేమోనని కొందరు అనుకుంటున్నారని అడిగినప్పుడు.. అటువంటేదేమీ లేదు. రెండో వారంలో అందరు నామినేషన్ చేసినప్పుడు అదే చెప్పాను. బయట నేను రైతుబిడ్డని కానీ హౌస్ లో‌ ఎప్పుడు అది వాడ లేదని రతికతో‌ కూడా అన్నానని, మళ్ళీ పదోవారంలో గెలిచాక రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అని అన్నట్లుగా చెప్పాడు.  నీకొచ్చిన ముప్పై అయిదు లక్షలు ఏం చేస్తానని అడుగగా.. రైతులకోసమే ప్రతీ రూపాయి వాడతాను. ఒక్కో రూపాయి కష్టాల్లో ఉన్న రైతులేవరో కనుక్కొని,  లేనివాళ్ళకి ఇస్తూ వీడియోలు కూడా పెడతానని అన్నాడు. నీకోసం నువ్వు ఆడినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోవా అని అడిగినప్పుడు.. ‌నేను వచ్చిందే రైతుల కోసం, ఆ డబ్బులు వాళ్ళవే అని ప్రశాంత్ అన్నాడు. ఆ తర్వాత కొన్ని మీమ్స్ చూపించగా కాసేపు నవ్వుకున్నాడు ప్రశాంత్. ఆ తర్వాత తన మిర్చీ మొక్కని ప్రశాంత్ కి గిఫ్ట్ గా ఇచ్చింది గీతు.   

వాళ్ళిద్దరి వెనుక ఒక శక్తిలా నిల్చున్నాను:శివాజీ

బిగ్ బాస్ హౌస్ లో చాణక్యుడిగా ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఏకైక కంటెస్టెంట్ శివాజీ. కామన్ మ్యాన్ కి సపోర్ట్ గా ఉండి తనని విజేతను చేయడానికి చేతికి గాయం చేసుకొని.. ఒంటి చేత్తో హౌస్ లో కొన్ని వారాల పాటు‌ పోరాడి టాప్-3  లో ఉన్న కంటెస్టెంట్ శివాజీ. బిగ్‌బాస్ హౌస్ లో యావర్, ప్రశాంత్ లకి ఒక గురువుగా ఉండి వారి ప్రతీ గెలుపులో, వారికెదురైన సవాళ్ళలో అతనొక అడ్డుగోడగా నిలిచాడనేది అందరికి తెలిసిన నిజం.‌ ఈ బిగ్ బాస్ సీజన్ కి శివాజీనే విజేత అని చాలామంది ప్రేక్షకులు భావించారు. అలాగే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు. బిబి బజ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నాడు శివాజీ. టాప్-3 లో ఒకడిగా ఉంటారని ఎక్సెపెక్ట్ చేశారా అని అడుగగా.. టాప్-3 ఏంటి.. విన్నర్ ని నేను. ఇది గర్వం కాదు కానీ నేను అంతగా ప్రయత్నించలేదు. జనరల్ గా బయట ఎలా ఉంటానో అలానే ఉన్నాను. ఎంత దూరం ఉంటానని ఆడియన్స్ కే బాగా తెలుసని శివాజీ అన్నాడు. హౌస్ లో చాలాసార్లు బయటకొచ్చేస్తానని అన్నారు‌ కదా ఎందుకు రాలేదని అడుగగా.. బయటకొస్తానని అన్నా రాలేదు కదా.. ఆడియన్స్ ఆపారు కాబట్టి ఆగాలి వాళ్ళు చెప్పినప్పుడు బయటకు రావాలని శివాజీ అన్నాడు. టాప్ వరకు వచ్చి ఎందుకు వెనుకపడ్డారని అడుగగా.‌. ఒక అబ్బాయి ఎక్కడో పల్లెటూరి నుండి వచ్చి ఆడాలని అన్నప్పుడు మిగతా వారంతా కలిసి ఆడనీయకూడదని అనుకున్నప్పుడు వాడికి సపోర్ట్ గా ఉండాలనే సంకల్పంలో నుండి నా ఫోకస్ వాడి మీదకి వచ్చిందని, వాడిని కాపాడుకోవడంలోనే కొంతభాగం నేను ఉన్నానని శివాజీ అన్నాడు.  వీకెండ్ లో నాగార్జున వచ్చి అందరు ప్రశాంత్ లో కలర్స్ ఉన్నాయని అంటున్నారని అడిగినప్పుడు ఒక్కటే చెప్పా.. వాడు ఇన్నోసెంట్, జెన్యున్ బాబు గారు అని చెప్పానని శివాజీ అన్నాడు. యావర్, ప్రశాంత్ లు మీరు లేకుంటే ఇక్కడిదాకా వచ్చేవారు కాదా అని అడుగగా.. వాళ్ళ గేమ్ వల్ల, వాళ్ళ ట్యాలెంట్ వల్ల ఇక్కడి దాకా వచ్చారని వాళ్ళ వెనుక ఒక శక్తిలా ఉన్నానని శివాజీ అన్నాడు.  అంటే మీరు శక్తిలా లేకుండే ఉండేవారు కాదా అని అడుగగా.. లేదు. కొంతవరకు ఉండేవారు ఆ తర్వాత మానసికంగా బాధపడేవారు. అమాయకంగా వచ్చిన ఒక కుర్రాడు, భాష రాని ఒక కుర్రాడు..‌ఇద్దరు లైఫ్ మీద ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చారు. అలాగే నేను కూడా ఇక్కడికి వచ్చినవాడినే. వాళ్లకి ఆ ధైర్యమిచ్చానంతే అని శివాజీ అన్నాడు. కావాలనే అమర్ ని మీరు టార్గెట్ చేశారని కొందరు అంటున్నారని అడుగగా.. లేదు, నెనెప్పుడు టార్గెట్ చేయలేదు. వాడికి వీళ్ళు(ప్రశాంత్, యావర్) అంటే భయం ఉంది.  ఆటలో తనకంటే ముందుకెళ్తారో అనే భయం ఉంది.  వాడి ఫౌల్ గేమ్ లే చెప్పాయి కదా అని శివాజీ అన్నాడు.  అమర్ ట్యాలెంటెడ్ కానీ ఎంతసేపు వారిచుట్టే తిరుగుతూ గేమ్ పాడు చేసుకున్నాడు. వాడికి నేను చాలాసార్లు చెప్పాను. అరెయ్ నువ్వు ఇది కాదురా అని చాలాసార్లు అన్నాను కానీ వాడు మారలేదు. మా ఇద్దరి మధ్య బాండింగ్ వేరే అని శివాజీ అన్నాడు. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలని బిబి బజ్ ఇంటర్వ్యూలో శివాజీ పంచుకున్నాడు.  

మనసా వాచా కర్మణా ఈ గేమ్ ని నేను ఆరాధించాను:శివాజీ

బిగ్ బాస్ హౌస్ లో ఫెయిర్ గా, ఫౌల్స్ లేకుండా టాస్క్ లు ఆడుతూ తోటి హౌస్ మేట్స్ తో మంచి మాటతీరుతో ఉన్న కంటెస్టెంట్ శివాజీ. తన ఆటతీరు, మాటతీరుతో ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు శివాజీ. ఈ సీజన్  విజేత శివాజీనే అని ఎంతోమంది భావించారు. అలాగే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు. బిబి బజ్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలని షేర్ చేసుకున్నాడు శివాజీ. స్పై బ్యాచ్ కి మీరు ఫెవరెటిజం చూపించారా అని అడుగగా.‌ అదేం లేదు. వాళ్ళు గ్రూప్ గా ఆడారు. టార్గెట్ చేసి నామినేషన్లు చేశారు. అందరు అనుకొని మొదటి వారం నుండి ఆడుతున్నారని, ఇది ఒక ఇండివిడ్యువల్ గేమ్ ఎవరి గేమ్ వారు ఆడాలని శివాజీ అన్నాడు. ఇది ఇండివిడ్యువల్ గేమ్ అని చెప్పిన మీరే ప్రశాంత్, యావర్ లతో కలిసి  వాళ్ళని ఆడనీయకుండా వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా ఆడుతున్నారని  మీ మాస్టర్ మైండ్ తో మానిపులేట్ చేశారా అని అడుగగా.. నీ దగ్గర పదిహేను వారాల ఫుటేజ్ ఉంది‌. అన్నీ చూసుకో ఒక్కసారి కూడా అరేయ్ ప్రశాంత్ వాళ్ళని నామినేట్ చెయ్. అరెయ్ ఈ గేమ్ లో వీళ్ళతో జాగ్రత్తగా ఉండు అని ఏ రోజు వారితో చెప్పలేదని శివాజీ అన్నాడు. అమర్ వచ్చి మీ కాళ్ళ‌ మీద పడ్డప్పుడు .. అరెయ్ పిచ్చోడా ఇది గేమ్ రా.. వద్దురా.. లేరా అన్న మీరే ఆ తర్వాత రోజు నామినేట్ చేశారెందకని అడుగగా.. వాళ్ళు సిల్లీ నామినేషన్ తో వేశారు కానీ నాది ఒక వ్యాలిడ్ రీజనే కదా అని శివాజీ అన్నాడు. అయిదో వారంలో వచ్చి‌న అర్జునే అన్నాడు. వాడి గేమ్ వాడు ఆడట్లేదని, ఫౌల్స్ అడుతున్నాడని అతనే అన్నాడని శివాజీ అన్నాడు. హౌస్ లో ఒకరోజు వీళ్ళు ఇలా ఉంటే రేపు పొద్దున ఎలారా అని శోభా గురించి అన్నారు కదా అని అడుగగా.. అమర్ ని చాలా చులకనగా చూశారు. వాడితోనే నేను ఆ మాట అన్నాను. వీళ్ళు ఇలా ఉంటే ఈ ఎపిసోడ్ లు అన్నీ చూసిన వాళ్ళు ఎలా ఉంటారురా అని అన్నాను. ఎందుకంటే అమర్ ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేంటి.. అరేయ్ అంటాను రా అని ఒక ఆడపిల్ల అలా అనడమేంటి? అది నాకు నచ్చలేదని అందుకే తనని అలా అన్నట్లు శివాజీ అన్నాడు. మీరు మీరు అంతా కూడబల్లుకొని వచ్చి గ్రూప్ గా ఆడుతుంటే‌ ఇక్కడ నేను చూసేది పిచ్చోడినా.. మనసా వాచా కర్మణా ఈ గేమ్ ని నేను ఆరాధించాను‌. నా వల్ల ఎంత వీలైతే అంతవరకు లాగానని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. చూస్తారా లేదా అనేది వారి అభిప్రాయం. నచ్చకపోయి ఉంటే నేను ఇన్ని వారాలు ఉండేవాడిని కాదని శివాజీ అన్నాడు. రాబోయో కంటెస్టెంట్స్ కి ఒక్కటే చెప్తున్నా.. ఈ సీజన్, గత సీజన్ లో వచ్చిన వారి మాటలు వినకండి వారి మాయలో పడకండి. మీరు మీలా ఆడండి. మీలా ఉండండి. ఎవరి మాయలో పడకండి. తప్పు చేస్తే బిగ్ బాస్ హౌస్ నేర్పిస్తుందని శివాజీ అన్నాడు. ఎవరి గేమ్ ప్లాన్ వారిది, ఎవరి స్ట్రాటజీ వారిది అంటు శివాజీ బజ్ లో తన అనుభవాన్ని పంచుకున్నాడు.  

అమర్ దీప్ కి సపోర్ట్ చేసి నీ వాల్యూ‌ నువ్వే తీసుకున్నావ్!

బిగ్ బాస్ సీజన్‌-6 విన్నర్ సింగర్ రేవంత్ అంటే తెలియని వారుండరు. బిగ్ బాస్ కి వెళ్ళకముందు బహుబలి సినిమాలో 'మనోహరి' అనే పాటని పాడి ఎంతో మందికి సుపరిచితమైన రేవంత్.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు శ్రీసత్య, శ్రీహాన్ లతో కలిసి ఉన్న రేవంత్ ఫైనల్ లో విజేతగా నిలిచాడు. ఆ సీజన్ లో రేవంత్ టాస్క్ లలో ఆడిన ఆటతీరుకి నాగార్జున అయితే.. ఆటని ఆటలా ఆడు వేటలా కాదంటు పలుసార్లు చెప్పాడు. ఒకనొక దశలో నీకు రెడ్ కార్డ్ ఇస్తానని రేవంత్ తో అన్నప్పుడు అందరు షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఫ్యామిలీ లో వాళ్ళ భార్య శ్రీమంతపు వేడుక జరిపినప్పుడు రేవంత్ చిన్న పిల్లాడిలా ఎమోషనల్ అవుతుంటే అందరు అతడికే కనెక్ట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ తర్వాత సాంగ్స్ పాడుతూ ఎప్పుడు షూటింగ్ లతో  బిజీగా కన్పిస్తున్నాడు రేవంత్. ఈ మధ్యకాలంలో వచ్చిన సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమాలో "మై డియర్ మార్కండేయ" పాటని పాడి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే తాజాగా ముగిసిన బిగ్ బాస్ సీజన్‌-7 లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా , అమర్ దీప్ రన్నర్ గా నిలిచిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అమర్ దీప్ హౌస్ లో జరిగిన దాదాపు‌ అన్ని టాస్క్ లలో ఫౌల్ ఆడుతూ, గ్రూప్ గా ఆడుతూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే అమర్ దీప్ ని ద్వేషించే వారంతా ఇప్పుడు అతను హౌస్ లో‌ ఉన్నప్పుడు ‌సపోర్ట్ చేసిన వారి‌మీద పడ్డారు. హౌస్ లో అమర్ దీప్ ఉన్నప్పుడు అతనికి ఓట్ చేయండి అంటూ రేవంత్ ఒక పోస్ట్ చేశాడంట. ఇక దానికి  కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అన్ని ఫౌల్ గేమ్స్ ఆడిన అమర్ కి ఎలా సపోర్ట్ చేసావంటూ కొందరు నెటిజన్లు రేవంత్ కి నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. " అమర్ దీప్ కి సపోర్ట్ చేసి నీ వాల్యూ నువ్వే తీసుకున్నావ్. ఒక అభిమానిగా నిన్ను ఇన్ని రోజులు ఫాలో అయ్యాను. నీ క్యారెక్టర్ నచ్చలేదు అన్ ఫాలో చేస్తున్నాను" అంటు ఒకతను‌ కామెంట్ చేయగా.. ఒక వ్యక్తిగా అమర్ ఏంటో నాకు తెలుసు కానీ హౌస్ లో అతను అలా లేడు. తను అలా ఉంటే బాగుండేది. అయినా ఇది‌ ఒక గేమ్ షో. గేమ్ ని గేమ్ లా చూడాలి కదా అని రేవంత్ రిప్లై ఇచ్చాడు. మరి ఈ కామెంట్ ని అమర్ చూస్తే ఏమైపోతాడో. అమర్ కు ఇంత నెగెటివ్ రావడానికి కారణమైన ప్రియాంక, శోభాలని మళ్ళీ కలుస్తాడా? పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తున్న అభిమానులు అమర్ ని ఇంకా హేట్ చేస్తున్నారా లేదా పక్కనపెడితే సీజన్-6 కంటెస్టెంట్ అయిన రేవంత్ ని ఇలా అనడం‌ ఎంత వరకు కరెక్ట్ అంటూ‌ పలువురు విమర్శిస్తున్నారు.  

Krishna Mukunda Murari:కూపీలాగుతున్న మురారీ.. అసలు దోషిని పట్టుకోగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -343 లో.. కృష్ణ మురారి కలిసి అసలు నేరస్తుడిని కనిపెట్టడానికి జైల్లో ఉన్న ప్రభాకర్ దగ్గరకు బయల్దేరి వెళ్తుంటారు.. దార్లో కృష్ణ సినిమాకి వెళదామా అని అనగానే.. మురారి బండి ఆపి ఇప్పుడు మనం ఉన్న సిచువేషన్ లో సినిమా అవసరమా అంటాడు. అ తర్వాత మనకి ఎక్కువ రోజులు టైమ్ లేదు. శుక్రవారం లోపల నిజానిజాలు సాక్ష్యాలతో బయటపెట్టాలని మురారి అంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఐస్ క్రీమ్ ని చూసి కృష్ణ చిన్నపిల్లల కావాలి అంటూ మురారిని అడుగుతుంది. మురారి ఐస్ క్రీం కొనిస్తాడు.ఆ తర్వాత కృష్ణ, మురారి కలిసి ప్రభాకర్ ని కలవడానికి వెళ్తారు. మరొకవైపు ముకుంద తన  అన్నయ్య దేవ్ ని కలవడానికి జైలుకి వస్తుంది.. ఆ తర్వాత ముకుంద తన అన్నయ్యకి.. కృష్ణ మురారీల గురించి చెప్తుంది. గతం గుర్తుకు వచ్చింది. ఒకవైపు ప్రభాకర్ ఏ తప్పు చేయలేదని మురారి, మరోవైపు ప్రభాకర్ తప్పు చేశాడని భవాని అత్తయ్య ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నరు. ఒకవేళ ప్రభాకర్ ఏ తప్పు చెయ్యలేదని మురారి నిరూపిస్తే మురారికి నాకు పెళ్లి జరగదని ముకుంద చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకు.. నేను రెండు రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తాను. నేను వచ్చాక ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా చేస్తానని దేవ్ అంటాడు. మరొకవైపు రేవతి , మధు ఇద్దరు శంకుతల దగ్గరికి వస్తారు. కృష్ణ , మురారి ఇద్దరు కలిసి బయటకు వెళ్లారని రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు దేవ్ తో ముకుంద మాట్లాడి వస్తుంటే కృష్ణ, మురారీలు ప్రభాకర్ ని కలవడానికి వస్తారు. వాళ్ళని చూసినాముకుంద తనని చూస్తారేమోనని టెన్షన్ పడుతు వాళ్ళు చూడకుండా పక్కకి వెళ్తుంది. మరొక వైపు కృష్ణ, మురారి ఇద్దరు ప్రభాకర్ తో మాట్లాడుతారు. వాళ్ళని అలా చూసి ప్రభాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిమ్మల్ని తప్పకుండా బయటకు తీసుకొని వస్తానని ప్రభాకర్ కి మురారి చెప్తాడు. మరొకవైపు టెన్షన్ పడకని ముకుందకి దేవ్ చెప్పిన ముకుంద టెన్షన్ పడుతూనే ఉంటుంది. తరువాయి భాగంలో.. కృష్ణ, మురారి ఇద్దరు కలిసి భవాని దగ్గరికి వచ్చి.. పరిమళ మేడమ్ ని కలిసి వివరాలు అడిగాం. నాకు సర్జరీ చేయించిన అతని పేరు తను చెప్పిందని మురారి అంటాడు. అది విన్న ముకుంద టెన్షన్ పడుతుంది. దాంతో కృష్ణ గమనించి ముకుంద ఎందుకు టెన్షన్ పడుతుందని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu:బోర్డ్ మీటింగ్ లో వసుధార ఏం చెప్పనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -949 లో... మహేంద్ర, వసుధార, అనుపమ ఇంటికి వస్తారు. శైలేంద్రని షూట్ చేయకుండని ఆపినందుకు అనుపమపై మహేంద్ర విరుచుకుపడుతాడు. ఈ విషయం లో నువ్వు ఎందుకు కలుగుజేసుకుంటున్నావ్. నువ్వు ఆపకుంటే వాడు నా చేతిలో చనిపోయేవాడని మహేంద్ర అనగానే.. వాడు ఇన్ని తప్పులు చేసాడు శిక్ష అనుభవించాలి. అనవసరంగా నువ్వు జైలుకి వెళ్తవని అనుపమ అంటుంది. అ తర్వాత అయిన పరవాలేదు. వాడు ఎన్ని తప్పులు చేసిన చూస్తూ ఉండాలా అని మహేంద్ర అంటాడు.  అయిన అసలు ఎవరు నిన్ను రమ్మన్నారని మహేంద్ర అనగానే.. నేనే రమ్మని చెప్పాను మామయ్య.. అక్కడ జరిగే గొడవ తెలిసి మీరు ఉన్న సిచువేషన్ లో నాకు ఆగలేరని మేడమ్ కి ఫోన్ చేసానని వసుధార చెప్తుంది. ఇప్పుడు మనం తొందరపడితే సఫర్ అయ్యేది ఫణీంద్ర సారే.. అందుకే ఇప్పుడు మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ముందు రిషి సర్ ఎక్కడ ఉన్నడో కనుక్కోవాలని వసుధార అంటుంది. ముకుల్ కాల్ చెయ్ అని వసుధారకి మహేంద్ర చెప్తాడు. ముకుల్ కి వసుధార కాల్ చెయ్యాబోతుంటే అప్పుడే రిషి కార్ తీసుకోని ముకుల్ ఇంటికి వస్తాడు. ఆ కార్ చూసి రిషి వచ్చాడని వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వచ్చింది ముకుల్. ఆ తర్వాత ముకుల్ కీ శైలేంద్ర తనతో మాట్లాడిన మాటల గురించి ముకుల్ కీ చెప్తుంది. తనపై తనే శైలేంద్ర ఎటాక్ చేయించుకున్న విషయం గురించి ముకుల్ కి‌ మహేంద్ర చెప్తాడు. ఇలా శైలేంద్ర గురించి ముకుల్ కి చెప్తాడు. మొదట రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలని ముకుల్ అంటాడు. ఆ తర్వాత వసుధార, రిషి కార్ లో ఎక్కి రిషి పక్కన కూర్చొని ఉన్నట్టుగా అనుకొని బాధపడుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వసుధార కాలేజీలో ఉండగా.. మీటింగ్ కండక్ట్ చెయ్యాలని బోర్డు మెంబెర్స్ అంటున్నారని మహేంద్ర అంటాడు. రిషి సర్ లేకుండా ఎలా అని వసుధార అంటుంది. మీరు ఒకే అంటే రిషి సర్ మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద టూర్ వెళ్ళాడని చెబ్దామని వసుధార అనగానే ఫణింద్ర, మహేంద్ర సరేనని ఒప్పుకుంటరు. అ తర్వాత అదే విషయం వసుధార నోటీసు బోర్డుపై పెట్టిస్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi:నువ్వు నేను ప్రేమ , బ్రహ్మముడి సీరియల్ ల మహాసంగమం!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -282 లో... రెండు సీరియల్ ల సంగమం జరిగింది. "నువ్వు నేను ప్రేమ" మరియు "బ్రహ్మముడి" రెండు‌ సీరియల్స్ ని కలుపుతూ ఒకే ఎపిసోడ్ గా మలిచారు మేకర్స్. ఈ రెండు సీరియల్స్ లలో హిందు సంప్రదాయం యొక్క గొప్పతనం వివరిస్తూ గ్రాంఢ్ గా కథనం సాగింది. నువ్వు నేను ప్రేమ సీరియల్ లో పద్మావతి, విక్రమాదిత్య ప్రధాన పాత్రల్లో‌ నటిస్తున్నారు. వీరిద్దరు కొన్ని అనుకోని‌ పరిస్థితులలో పెళ్ళి చేసుకున్నారు. అయితే పద్మావతికి మాత్రం విక్రమాదిత్య అంటే ప్రేమ. కానీ విక్రమాదిత్య కాస్త చిన్నచూపు.. చదువుకోలేదనే చులకనభావం దాంతో ఏమీ తెలియదని అమాయకురాలని భావిస్తూ తనని ఎప్పుడు తక్కువగా చూస్తుంటాడు విక్రమాదిత్య అలియాస్ విక్కి. అయితే విక్కీ స్థాపించన కంపెనీలో పద్మావతిని సీఈవోగా అపాయింట్ చేస్తాడు. ఇక ఫారెన్ నుండి ఒక పెద్ద ప్రాజెక్టు వీరి కంపెనీకి వస్తుంది. అదే సమయంలో‌ పద్మావతి, విక్కీలని వొడగొట్టాలని విలన్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు.  దాంతో పద్మావతి, విక్కీలు చేసిన ప్రాజెక్టు కోసం ఎంపిక చేసుకున్న మాడల్స్ ని విలన్ కిడ్నాప్ చేసి బంధిస్తాడు. అదే సమయంలో ఫారెన్ డెలిగేట్స్‌ ప్రాజెక్టు ప్రెజెంటేషన్ చూడటం కోసం వస్తారు.‌ ఇక తను ఎన్నో నెలలుగా కష్టపడుతున్న ప్రాజెక్టు ఆగిపోతుందని పద్మావతిని విక్కీ తిడుతుంటాడు. అదే సమయంలో పద్మావతి ఒక తెలివైన నిర్ణయం తీసుకుంటుంది. మాడల్స్ లాగా పద్మావతి, విక్కీలు ఉండేలా చేసి ప్రాజెక్టు ప్రెజెంట్ చేయగా.. అది చూసిన ఫారెన్ డెలిగేట్స్ ఇంప్రెస్ అవుతారు. ఇక విలన్ కి ఈ నిజం తెలిసి నిరాశ చెందుతాడు. మరో ప్లాన్ తో పద్మావతి, విక్కీలని దూరం చేస్తా అని శపథం చేస్తాడు. ‌ బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ ఫోన్ లో శ్వేతతో మాట్లాడటం అపర్ణ చూస్తింది.‌ ఇక రాజ్ ఆ రోజు కౌగిలించుకొని ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమోనని అనుమానంతో‌ రాజ్ ని నిలదీస్తుంది. అయితే సూటిగా అడుగకుండా.. కావ్యతో నిజంగానే ప్రేమగా ఉంటున్నావా? నటిస్తున్నావా? తనలో లేనిపోని ఆశలు పెంచకు అని అపర్ణ అంటుంది. అదేం లేదమ్మా..‌ తనకి నాకు  సెట్ కాదు నేనేం ఆశలు పెంచట్లేదు త్వరలోనే తనని వదిలించుకుంటానని కాన్ఫిఢెంట్ గా అంటాడు రాజ్.‌ ఇక అదే సమయంలో కళ్యాణ్ కి కావ్య కంకనం కడుతుంది. ఏంటి వదిన అని కళ్యాణ్ అనగానే.. నీ మీద చెడుదృష్టి ఉందని అది పోవడానికే ఈ కంకనం అని కావ్య అంటుంది.‌ ఇక అనామిక, కళ్యాణ్ ల ప్రేమని గుర్తించి తనకి సపోర్ట్ చేస్తుందని కావ్య చెప్తుంటే దూరంగా ఉన్న కనకం ఆ మాటలు విని.‌.‌ ఇన్ని రోజులు అడ్డుగా ఉంది కావ్య అని అనుకుంటుంది కనకం. అయితే ఆ రోజు పెళ్ళి ఆగిపోతుందని అందరు అన్నప్పుడు ‌నా గుండె అయిపోయింత పని అయిందని కావ్యతో కళ్యాణ్ అనగానే కనకం ఎమోషనల్ అవుతుంది. నా కూతురు కోసం ఇంకో ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయాలా అని కనకం అనుకొని ఇకనుండి కళ్యాణ్ అనామికల పెళ్ళికి అడ్డుపడకూడదని కనకం రియలైజ్ అవుతుంది. ఇక కళ్యాణ్ పెళ్ళి కోసం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి పసుపు దంచుతారు‌.‌ ఇక మనతరుపు బంధువులని అందరిని పిలిచారా అని అనగానే.. మా తరుపు బంధువులని పిలిచాం మీ తరుపు బంధువులని పిలవు చిట్టి అని ఇందిరాదేవితో సీతారామయ్య అంటాడు. ‌ ఆ తర్వాత విక్రమాదిత్య కి రాజ్ ని కాల్ చేయమని ఇందిరాదేవీ చెప్తుంది. ఇక వీడియో కాల్ చేయు రాజ్ అందరం మాట్లాడతామని అపర్ణ అనగానే రాజ్ వీడియో కాల్ చేసి మాట్లడతాడు. ఇక కళ్యాణ్ పెళ్ళికి రమ్మని విక్రమాదిత్య-పద్మావతిలకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి ఆహ్వానిస్తారు. ఆ తరువాయి భాగంలో.. విక్రమాదిత్య-పద్మావతిల ఫ్యామిలీ కలిసి కళ్యాణ్-అనామికల పెళ్ళికి వస్తారు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌కి రంగం సిద్ధం!

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయి బయటకు వచ్చాక ప్రశాంత్ కి చుక్కెదురైంది. గ్రాంఢ్ ఫినాలే ముగిసిన తర్వాత అన్నపుర్ణ స్టూడియో ముందు ప్రశాంత్ కి ప్రేక్షకులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పడానికి భారీగా తరలి వచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ కోసం అలా ర్యాలీలా వెళ్తు సిటీలో డిస్టబెన్స్ క్రియేట్ చేశారంట. దాంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రశాంత్ పై ట్రాఫిక్ వాయిలెన్స్‌ కింద కేసు నమోదు చేశారంట‌ పోలీసులు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగించుకొని వస్తున్న అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసిన విషయం తెలిసిందే. మరొక వైపు అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అశ్వినిశ్రీ, గీతు రాయల్ కార్లపై కూడా ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. వారిపై కూడా ఆశ్వినిశ్రీ, గీతు రాయల్  కేసు పెట్టారు. గీతూ రాయల్ తన కార్ అద్దాలు పగులగొట్టిన వారిని పట్టిస్తే పదివేల‌ రూపాయల రివార్డ్ ఇస్తానని ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో  షేర్ చేసింది గీతు. బిబి ఎగ్జిట్ ఇంటర్వ్యూలు పూర్తిచేసుకొని బయటకు వస్తున్న గీతు రాయల్ పై ఇలా చేయడం అన్ ఫెయర్ అంటూ తన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. అమర్ దీప్ ఫ్యాన్స్ , పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య ఇంకా గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఈ దాడికి పరిష్కారమేంటో తెలియాలి. బిగ్ బాస్ ఇన్ని సీజన్ లలో ఇప్పటి వరకు ఇలా ఎప్పుడు జరగలేదనే చెప్పాలి. మొదటి నుండి మంచి టీఆర్పీతో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ సీజన్ చివరికి ఇలా అయిందంటు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంత దారుణంగా చేస్తారా షోని షో లాగా, గేమ్ ని గేమ్ లాగా చూడాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ప్రశాంత్ ని విన్నర్ ని చేసిన తన ఫ్యాన్సే  ఇలా చేసి  తనని చిక్కులో నెట్టారు. బిగ్ బాస్ సీజన్‌లో కామన్ మ్యాన్ కేటగిరీలో రైతుబిడ్డగా అడుగుపెట్టి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ కి విన్నర్ అయిన ఆనందాలని కొన్ని గంటలు కూడా ఉంచలేదు ఫ్యాన్స్. మితిమీరిన అభిమానం కూడా పనికిరాదని మరోసారీ ఈ డై హార్డ్ ఫ్యాన్స్ ఋజువు చేశారు. కాగా పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.  

బయటపడ్డ అఖిల్ బాగోతం.. ఫోటో కాస్త మంచిది పెట్టండి!

బిగ్ బాస్ సీజన్-7 విజయవంతంగా ముగిసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా అమర్ దీపు రన్నర్ గా నిలిచి కోట్లాది ప్రేక్షకుల ఉత్సాహానికి తెర దించారు. అయితే బిగ్ బాస్ రన్నర్ అయిన అమర్ దీప్ తన భార్య తేజస్విని గౌడ, తల్లితో కలిసి అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వస్తుండగా కొంతమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అతని కార్ పై దాడి చేశారు. ఇది నిన్నంతా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్తను హైలైట్ చేయడానికి కొన్ని యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు అఖిల్ సార్థక్ పేరుని వాడుకున్నారంట. ఇది మరీ దారుణం రా అంటూ అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లోకి పల్లవి ప్రశాంత్ ఒక రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు ఒక ఎమోషన్ క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన  మాటల యుద్ధమే జరిగింది. అది కాస్త చిలికి చిలికి‌ పెద్ద గాలి వాన అయినట్లు.. గొడవ పెద్దగా అయింది. ఇక ఆ నామినేషన్ ప్రక్రియలో గొడవ కాస్త..  రైతులు వర్సెస్ బిటెక్ స్టూడెంట్స్ గొడవలా మారింది. ఇక ఈ ఇష్యూ మీద పలువురు రైతులు అమర్ దీప్ ని తీవ్రంగా విమర్శించారు. అది అప్పట్లో వైరల్ గా మారింది. రైతులని అమర్ దీప్ తక్కువ చేసి మాట్లాడడంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ పై కోపంగా ఉన్నారు అందుకే అమర్ బయటకు రాగానే తన కారు అద్దాలు పగులగొట్టారు. అసలు విషయనికి వస్తే.. అఖిల్ సార్థక్ మొదట నుండి పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తు వస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అయిన అఖిల్ సార్థక్.. మొదటి నుండి పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ ఇస్తున్నాడు. అయితే హౌస్ లోని మరే ఇతర కంటెస్టెంట్ గురించి తక్కువ చేసి కూడా మాట్లాడలేదు. అలా ప్రశాంత్ గురించి ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో సపోర్ట్ ఇస్తు పోస్ట్ లు చేసాడు అఖిల్ సార్థక్. అయితే మొన్న జరిగిన గొడవ వల్ల కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అమర్ పై దాడి చేసింది ఎవరంటూ.. "బయటపడ్డ ఓల్డ్ కంటెస్టెంట్ బాగోతం" అని  ఓ టైటిల్ పెట్టి అఖిల్ సార్థక్ ఫోటోతో ఒక వీడియో చేశారు. అది చూసిన అఖిల్ సార్థక్‌.. ఒక సెటైరికల్ రిప్లై ఇచ్చాడు. మీరు ఇదంతా వ్యూస్ కోసమే చేస్తున్నారు. కానీ నా ఫోటో ఇంకాస్త మంచిది పెట్టి ఉంటే బాగుండేది. ఇలా న్యూస్ స్ప్రెడ్ చెయ్యడం ఆపండి. ఏది ఏమైనా అమర్ పై అలా దాడి చెయ్యడం కరెక్ట్ కాదంటు తన అభిప్రాయం తెలియజేశాడు అఖిల్ సార్థక్. ఇదంతా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది ఫుల్ వైరల్ గా మారింది.  

నామినేషన్ లో తప్ప ఎవరితో ఆ విషయాలు మాట్లాడలేదు: అంబటి అర్జున్!

బిగ్ బాస్ సీజన్‌-7 ఎట్టకేలకు ముగిసింది. ‌ఇక హౌస్ లో మిగిలిన టాప్ కంటెస్టెంట్స్ యొక్క బజ్ ఇంటర్వూలు ఇప్పుడు అఫీషిలయల్ గా యూట్యూబ్ లోకి వచ్చేస్తున్నాయి. ఇందులో అంబటి అర్జున్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోపల జరిగేది వేరు. బయటకి చూపించేది వేరు అంటూ మొదలెట్టాడు అర్జున్. శివాజీని కావాలనే టార్గెట్ చేశారా అని యాంకర్ అడుగగా.. నాకు టార్గెట్ అనేమీ లేదు. అతను మైండ్ గేమ్ బాగా ఆడతాడు. అది శివాజీ గారికి అనుభవం వల్ల వచ్చింది. కానీ నా దాకా వస్తే నేను అలానే రియాక్ట్ అవుతానని అర్జున్ అన్నాడు.  ఫ్యామిలీ వీక్ లో పప్పీ రావడం వల్లనే ఆ తర్వాత నామినేషన్ లో అగ్రెసివ్ గా ఉన్నారా అని అడుగగా.. అదేం లేదు. యావర్ నా మీద  నామినేషన్ వేశాడు కాబట్టి ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అగ్రసెవ్ అయ్యానని అర్జున్ అన్నాడు. మీరు మాస్క్ వేసుకున్నారని అందరు అనుకుంటున్నారు? మీరేమంటారని గీతు అడుగగా.. అది వాళ్ళ అభిప్రాయం కానీ నేను ఆట ఆడాను. నాలాగే ఉన్నాని అర్జున్ అన్నాడు. స్టేజ్ మీద నాగార్జున గారితో హౌస్ లో దమ్ము, దుమ్ము ఎవరని అడిగినప్పుడు మీరు శివాజీ గారిని ఎక్స్ పోజ్ చేస్తానని అన్నారు? మరి చేశారా అని అడుగగా.. నాదాకా వస్తే నేను మాట్లాడేవాడిని. ఎదురు చూసాను కానీ ఆయన రాలేదు. అవకాశం రాలేదని అర్జున్ అన్నాడు. గౌతమ్ కి నామినేషన్ ముందు ఒకటి అన్నారు. శివాజీ టైమ్ వచ్చినప్పుడు మాట దాటేస్తారని అని గౌతమ్ అన్నప్పుడు.. మీరు అతనికి సపోర్ట్ గా మాట్లాడి దానిని తీసుకెళ్ళి నామినేషన్ గా చేశారని గీతు అడుగగా.. అవును, వాడు అలా చెప్పడం నాకు నచ్చలేదు అందుకే నామినేషన్ చేసి చెప్పానని అర్జున్ అన్నాడు. ఆ రోజు పప్పీ గురించి మీకోసం శివాజీ స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడే ఆ రీజన్ నాకు నచ్చ లేదని చెప్పొచ్చు కదా అని గీతు అడుగగా.. నాకు నిజంగా ఆ రోజు శివాజీ గారు చెప్పిన పాయింట్ నచ్చలేదు ఆ విషయం చెప్పాను కానీ వాడు వెళ్ళి అదే రీజన్ తో నాకే సపోర్ట్ చేశాడు. నా గేమ్, నా ఎఫర్ట్స్, నా కెప్టెన్సీ బాగున్నాయని చెప్పి అంతటితో ఆపేస్తే బాగుండేది కానీ వైఫ్ ని అడ్డుపెట్టుకొని కెప్టెన్ అవ్వలానుకోలేదు. ఇక చివరగా అమర్ దీప్, నేను ఉన్నప్పుడు.. ఏం చేద్దాం అర్జున్ అని శివాజీ గారు నా దగ్గరకి వచ్చి అడిగారు.. కెప్టెన్సీ ఇచ్చేయన్న వాడికే అని చెప్పాను కానీ అప్పటికే ఇచ్చిన టైమ్ అయిపోయిందని బిగ్ బాస్ ఇద్దరి ఫోటోలు కాల్చేశాడు.‌ ఇక అలా నేను చేసిన ఆలస్యం వల్ల అది తిరిగి తిరిగి‌ నాకే చుట్టుకుందని అర్జున్ అన్నాడు. ఇక ఆ తర్వాతి శివాజీ‌ గారు నామినేషన్ లో నా గురించి అంతలా చెప్పడం నాకు బాగనిపించేలదని అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలని అర్జున్ షేర్ చేశాడు.  

బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున హిట్టా? ఫట్టా?

బిగ్ బాస్ సీజన్-7 సక్సెస్ అవ్వడానికి కంటెస్టెంట్స్ ఒక కారణం అయితే హోస్ట్ మరోక కారణం. మరి గత సీజన్ లతో పోలిస్తే నాగార్జున ఈ సీజన్ లో ఏం చేసాడో ఓసారి చూద్దాం... బిగ్ బాస్ హౌస్ లో 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రతీ వారం కంటెస్టెంట్స్ చేసిన మిస్టేక్స్ చెప్తూ వారికి క్లాస్ పీకుతూ అదరగొట్టాడు నాగార్జున.  ఇక సీరియల్ బ్యాచ్ చేసే ప్రతీ ఫౌల్ ని ప్రతీ వీకెండ్ లో పెద్ద టీవీలో చూపిస్తూ అదరహో అనిపించాడు. అయితే అమర్ దీప్ చాలాసార్లు ఫౌల్ గేమ్ ఆడాడు. పల్లవి ప్రశాంత్ ని చులకన చేసి మాట్లాడాడు. అయిన ఎక్కువగా తిట్టకపోగా.. నువ్వింతేనా అన్నట్టు సరదాగా మాట్లాడటం చాలామందికి నచ్చలేదు. అయితే శివాజీ చేతి గాయం గురించి ప్రతీ వీకెండ్ లో నాగార్జున అడిగి తెలుసుకున్న విధానం,  టాస్క్ లలో పక్షపాతం లేకుంటా నిర్ణయాలు తీసుకువాలని కంటెస్టెంట్స్ సూచిస్తుండటం .. ఇవన్నీ కూడా అదనపు బలాన్ని చేకూర్చాయి. పల్లవి ప్రశాంత్ ఆటతీరుని గుర్తించి తోటి హౌస్ మేట్స్ తో చప్పట్లు కొట్టించడం ఎంతగానే ఆకట్టుకుంది. యావర్ అటిట్యూడ్  కరెక్ట్ కాదని.. గౌతమ్ కి మాస్ వార్నింగ్ ఇవ్వడం.. టేస్టి తేజతో శోభా టాటు వేయించుకోమని చెప్పడం ఇవన్నీ నాగార్జున నోటివెంట రావడం ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఇక ఒక టాస్క్ లో ఆట సందీప్ సంఛాలక్ గా ఉండి.. బొక్క అని వాడతాడు. ఇక దానిని వీకెండ్ లోకి నాగార్జున తీసుకొచ్చి.. తొక్కలో సంఛాలక్, బొక్కలో గేమ్ అని నాగార్జున అనడంతో హోస్ట్ గా ప్రతీ ఎపిసోడ్ దగ్గరుండి చూసినట్లుగా అనిపించింది. ‌ ఈ సీజన్ లో ఉల్టా పుల్టా ట్విస్ట్ లకు పెద్దపీట వేసాడు బిగ్ బాస్. అసలు ఏ సీజన్ లో ఇన్ని గేమ్ లు ఆడించలేదు. హాలోగ్రామ్, పవరస్త్ర, హౌస్ మేట్ అంటూ కొన్ని కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులకు అదిరిపోయో ట్విస్ట్ లు ఇవ్వగా నాగార్జున వాటిని సరైన సమయంలో సరైన విధంగా హౌస్ మేట్స్ తో మాట్లాడటానికి వాడాడు. ఇక ప్రతీ వీకెండ్ కంటెస్టెంట్స్ లని ఒకవైపు తిడుతూ, మరోవైపు ఆటపాటలతో అలరించాడు నాగార్జున. ఇక హౌస్ లో మొక్క బ్యాచ్, చుక్క బ్యాచ్, తొక్క బ్యాచ్ అని నాగార్జున చెప్పడంతో హౌస్ మేట్స్ బుర్రలు పాడయ్యాయి.‌ సీరియల్ బ్యాచ్ చుక్క బ్యాచ్ అని గ్రహించి ఇంక ఆ తర్వాత మరీ రెచ్చిపోయారు. ఇక అమర్ దీప్ అయితే నా ఫ్రెండ్ కి నేను సపోర్ట్ చేస్తా అంటు తెగించి చెప్పసాగాడు. ప్రతీ వీకెండ్ ఎపిసోడ్‌ లలో నాగార్జున ఇచ్చిన క్లూస్ తో  హౌస్ మేట్స్ తమ ఆటని మరింత మెరుగుపరుచుకున్నారనేది కాదనలేని నిజం. ఇక ఈ సీజన్ గ్రాంఢ్ విక్టరీ సాధించాడానికి రైతుబిడ్డ, శివాజీ, యావర్, సీరియల్ బ్యాచ్ ఓ కారణమైతే.. హోస్ట్ నాగార్జున మరో కారణమని చెప్పొచ్చు.

బిగ్‌బాస్ విన్న‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌.. నిజాలు చెప్పిన రన్నర్ అమర్ దీప్!

బిగ్ బాస్ సీజన్-7 విజేతగా పల్లవి ప్రశాంత్, రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. టాప్ లో ఉన్నవారి ఎగ్జిట్‌ ఇంటర్వూలని గీతు రాయల్ తీసుకుంది. ఇందులో హౌస్ లో ఏ కంటెస్టెంట్ తమతో ఎలా ఉన్నారో ఫైనలిస్టులు చెప్తూ తమ అభిప్రాయాలని షేర్ చేసుకున్నారు. మొదటగా అంబటి అర్జున్ బజ్ ఇంటర్వూ అప్లోడ్ చేయగా అందులో తన అటతీరుని చెప్పుకున్నాడు అర్జున్. అలాగే అమర్ దీప్ తన బిహేవియర్ హౌస్ లో ఎలా ఉందో చెప్పాడు. హౌస్ లో శివాజీ వల్లే ప్రశాంత్ విన్నర్ అయ్యాడని అందరు అంటున్నారని గీతు అడుగగా.. ఎవరన్నారు?.. అది కరెక్ట్ కాదు. వాళ్ళు సొంతంగా ఆడి గెలిచారు కానీ శివాజీ అన్న వారికి సపోర్ట్ ఇచ్చాడు. తెలుగు సినిమా పరిశ్రమలో అన్ని సినిమాలు చేశాడు. ఎక్కడ ఎలా ఉండాలో అయనకి తెలుసు కాబట్టి అతని మైండ్ గేమ్ తో యావర్, ప్రశాంత్ లకి సపోర్ట్ ఇచ్చాడు అంతే కానీ ఆయన్ని పైకి లేపకండి అని అమర్ దీప్ అన్నాడు. హౌస్ లో నువ్వు జెన్యునా అని అడుగగా.. హౌస్ లో ఎనభై కెమెరాలు ఉన్నాయి. ప్రతీ టాస్క్ లో మనల్ని చూస్తుంటాయి‌ కదా మరి నాకేందుకు అది గుర్తులేదో తెలియదు. హౌస్ లో ఎలా ఉంటుందంటే గేమ్ లో ఎలాగైనా గెలవాలని, ఏదో ఓ కాలేజ్ లో ఉన్నాని అనుకున్నానే తప్పా అసలు కెమెరాలు ఉన్నాయనే ఆలోచనే రాలేదని అమర్ అన్నాడు. ఎటో వైపు ఉండాలి.. ఒకవైపు పాజిటివ్ మరోవైపు నెగెటివ్ ఉంటే నేను నెగెటివ్ వైపు ఉన్నానని అమర్ అన్నాడు. అంటే నీకు బిబి బీపీలాగా ఎక్కేసిందంటావా అని అడుగగా.. ‌అవునని అమర్ అన్నాడు. హౌస్ లో సరిగ్గా అయిదు వారాలకే అర్థమైంది. అమ్మో వీళ్ళతో నేను పడలేనురా బయటకు వెళ్ళిపోదాం రా అనుకున్నా అని అమర్ అమ్నాడు. రవితేజ సినిమాలో ఆఫర్ ఇస్తా అని అనగానే అలా బయటకు వచ్చేశావేంటని అడుగగా.. ఆయన అంటే పిచ్చి.‌ మాస్ మహారాజ్ ని చూస్తూ పెరిగాను. ఆయనలా అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. అలాంటి నా ఫేవరేట్ హీరో నా కళ్ళముందు నిల్చొని నా సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే బయటకు వచ్చేశా అని అమర్ దీప్ అన్నాడు. నీకు ప్రియాంక, శోభాశెట్టిలలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడుగగా.. నాకు ఇద్దరు సమానమే అని అమర్ అన్నాడు. ఒక్కరే అని చెప్పాలని అనగా.. శోభా నన్ను కెప్టెన్ గా చేయాలని శివాజీ అన్నని రిక్వెస్ట్ చేసింది. ప్రియాంక తో సీరియల్ లో చేశాను. తనతో నాకు మంచి స్నేహం ఉంది. తను నా కోసం గౌతమ్ ని పాయింట్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని ఇద్దరు సమానమే అని అమర్ అన్నాడు.  అసలు రన్నర్ గా ఉంటావని అనుకున్నావా అని అడుగగా.‌. అసలు ఊహించలేదు. కానీ ఇక్కడి వరకు వచ్చాను సంతోషం. పల్లవి ప్రశాంత్ గెలిచాడనే రీగ్రెట్ లేదు. అలా అని బాధ లేదా అంటే ఉంది కానీ నేను ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచాను. నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరి దృష్టిలో నేను గెలిచానని అమర్ దీప్ అన్నాడు. ఇలా హౌస్ లో  తనేంటో? తనతో తోటి హౌస్ మేట్స్ ఎలా ఉన్నారో కొన్ని ఆసక్తికరమైన విషయాలని బజ్ ఇంటర్వూలో అమర్ దీప్ పంచుకున్నాడు.  

ట్రెండింగ్ లో ఉదయభాను చేసిన గోంగూర పప్పు వ్లాగ్ ..‌ అసలేం ఉందంటే!

  ఉదయభాను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఒక షో కి యాంకర్ గా చేసింది. ఇన్ని రోజులు ఫాన్స్ కి దూరంగా ఉన్నా ఇప్పుడు ఫ్యాన్స్ కి దగ్గర ఉండాలనుకుంది కాబోలు.. తనపేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. అందులో తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వ్లాగ్ ల రూపంలో చేస్తూ వస్తుంది.  ఉదయభాను ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. అయితే తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో ట్రెండింగ్ లో ఉన్న వాటికి సంబంధించిన వ్లాగ్ లు అప్లోడ్ చేస్తుంది. కాగా వాటికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. తాజాగా హోమ్ టూర్ వ్లాగ్, స్కిన్ కేర్ వ్లాగ్ చేసి అప్లోడ్ చేసిన ఉదయభాను.. కొన్నిరోజుల క్రితంన గోంగూర పప్ప ఎలా చేయాలో  అనే ఒక వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది ఉదయభాను. ఇక ఇందులో గోంగూర  పప్పు ఎక్కువగా తినకూడదని డాక్టర్స్ చెబుతారు ఎందుకంటే ఇది తింటే కిడ్నీల్లో రాళ్ళు వస్తాయని చాలామంది చెబుతుంటారు. ఒకప్పుడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయిన ఉదయభాను ఉండాల్సిందే.‌ ఏ షో అయిన తను సందడి చెయ్యాల్సిందే అన్నట్లుగా ఉదయభాను క్రేజ్ ఉండేది. ఒకప్పుడు అన్ని ఛానల్స్ కు మోస్ట్ ఛాయస్ గా ఉదయభాను ఉండేది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను సంపాదించుకుంది. లీడర్ లో 'రాజశేఖర ' సాంగ్ లో కన్పించిన ఉదయభాను, ఆ తర్వాత జులాయి మూవీలో  ఐటమ్ సాంగ్ లో మళ్ళీ మెరిసింది. అప్పట్లో రెండు మూడు సినిమాల్లో కనిపించి అందరిని మెప్పించింది. ఉదయభాను పెళ్లి చేసుకొని ఇద్దరి కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే  తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో " మా పిల్లల కోసం నేను చేసే గోంగూర పప్పు" అంటు ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. ఇందుల.. "  పాలకూర తింటే రాళ్ళు వస్తాయని చాలామంది చెప్తారు కానీ రాదు. పాలకూర భుమికి చాలా దగ్గరగా పెరుగుతుంది. అందువలన దానికి మట్టి, ఇసుక ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు కడిగితే కానీ ఆ ఇసుక పోదు. దానిని సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే కిడ్నిల్లో రాళ్ళు వస్తాయి కానీ పాలకూర తింటే ఏమీ రావు " అని ఉదయభాను ఈ వ్లాగ్ లో చెప్పింది. అయితే 21 నిమిషాల నిడివి ఉన్న  ఈ వ్లాగ్ లో.. ఒక నిమిషం కూడా లేని ఈ మాటలని కొందరు నెటిజన్స్ కట్ చేసి తనని నెగెటివ్ చేస్తూ పోస్ట్ చేసారు. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా అనవసరమైన వాటిని కలిపి నెగెటివిటి తేవాలని చూస్తున్నారని కావాలని చేసినట్టుగా తెలుస్తోంది . అయితే ఇందులో ఉదయభాను తప్పుగా ఏం మాట్లాడలేదని యూట్యూబ్ లోని తన  ఛానెల్ లో అప్లోడ్ చేసిన వ్లాగ్ చూస్తే తెలిసిపోతుంది.  మరి ఇలాంటి వాటిని ఉదయభాను చూసిందా లేదా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వ్లాగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

శివాజీ కొడుకు రిక్కీ అందరిని ఏడిపించేశాడుగా!

బిగ్ బాస్ సీజన్-7.. 105 రోజులు, 19 మంది కంటెస్టెంట్స్.. ప్రతీ రోజు టాస్క్ లు.. ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎలిమినేషన్స్, వీకెండ్ ప్రోమోల కోసం ఎదురుచూపులు అన్నీ ముగిసాయి. నిన్నటి ఆదివారం నాటి ఫినాలే వీక్ తో బిగ్ బాస్ సీజన్-7 ముగిసింది. హౌస్ లో ఆరుగురు ఫైనలిస్టులు ఫినాలే వీక్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే.  శివాజీకి చేతిగాయం అయిన తర్వాత కూడా ప్రేక్షకులు అతనికి సపోర్ట్ గా నిలిచారు.‌ అందరు శివాజీనే విన్నర్ అవుతాడని అనుకున్నారు. కానీ ఫ్యామిలీ వీక్ తరువాత లెక్కలు మారిపోయాయి. గురువుని మించిన శిష్యుడిగా ప్రశాంత్ పుంజుకున్నాడు.‌ ఇక ఎప్పుడు ఫౌల్స్ చేస్తూ, అల్లరిచిల్లరగా ఉండే అమర్ దీప్ సైతం తన భార్య చెప్పినట్టుగా గ్రూపిజం చేయకుండా కాస్త హౌస్ లోని మిగిలిన వారితో కలవడంతో అతనికి కలిసొచ్చింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ మూడో స్థానంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. శివాజీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాడంటే అతని రెండో కొడుకు రిక్కీనే కారణం. శివాజీకి బిగ్ బాస్ కి వచ్చినప్పుడు.. ‘నువ్వు ఆడలేవ్ నాన్న.. ఉండలేవ్ నాన్న’ అని రిక్కీ అన్న మాటలు శివాజీలో కసి పెంచాయి. తాడో పేడో తేల్చుకునే వస్తానని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే చాణుక్యుడిగా మారి జెండా పాతేశాడు. హౌస్ లో ఎంతమంది ఉన్న నా దారి నాదే.. నాతో ఎవరు పోటీ రారు అంటూ  శివాజీ తోటి హౌస్ మేట్స్ దృష్టిలోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా మారి చివరికి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. అయితే నిన్నటి గ్రాంఢ్ ఫినాలే రోజున శివాజీ కొడుకు రిక్కీ ఎవరితో షేర్ చేయని ఒక విషయాన్ని నాగార్జునతో షేర్ చేసాడు.  " మా నాన్న గెలిచిన ఓడిన సెలబ్రేట్ చేసుకుంటాం.. నేను ఆయన్ని ఆడలేడని అన్నాను.. కానీ ఆయన ఆడారు.. ఉండలేరన్నాను.. ఉండి చూపించారు.. మా నాన్న గెలిచినట్టే.. ఆయన్ని ఏదైనా నువ్వు చేయాలేవు అని అంటే చేసి చూపిస్తారనే రివర్స్ స్ట్రాటజీ ప్లే చేశా’ అని చెప్పాడు. తీరా శివాజీ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదికి వచ్చేసరికి చిన్న కొడుకు రిక్కీ తట్టుకోలేకపోయాడు. తండ్రిని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు రిక్కీ. "రేయ్ నాన్నా.. ఏడ్వద్దురా.. అరేయ్ నాన్నా.. అయ్యయ్యో ఏడుస్తావ్ ఏంట్రా.. ఇక్కడ ఓడిపోయానంటే.. ఇంకా ఏదో పెద్దది గెలుస్తారా.. నన్ను నమ్ము’ అంటూ కొడుకుని ఓదార్చిన సీన్‌ చూస్తే అందరికి కళ్లు చెమ్మగిల్లాయి. ఇది చూసి నాగార్జున కూడా ఎమోషనల్ అవుతూ.. ఇక్కడి వరకు వచ్చాడు. అందరి మనసులు గెలిచాడని అన్నాడు. విన్నర్ గా నిలుస్తాడని భావించిన శివాజీ మూడవ స్థానంలో  ఎలిమినేట్ అవ్వడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు.