ట్రెండింగ్ లో ఉదయభాను చేసిన గోంగూర పప్పు వ్లాగ్ ..‌ అసలేం ఉందంటే!

  ఉదయభాను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఒక షో కి యాంకర్ గా చేసింది. ఇన్ని రోజులు ఫాన్స్ కి దూరంగా ఉన్నా ఇప్పుడు ఫ్యాన్స్ కి దగ్గర ఉండాలనుకుంది కాబోలు.. తనపేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. అందులో తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వ్లాగ్ ల రూపంలో చేస్తూ వస్తుంది.  ఉదయభాను ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. అయితే తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో ట్రెండింగ్ లో ఉన్న వాటికి సంబంధించిన వ్లాగ్ లు అప్లోడ్ చేస్తుంది. కాగా వాటికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. తాజాగా హోమ్ టూర్ వ్లాగ్, స్కిన్ కేర్ వ్లాగ్ చేసి అప్లోడ్ చేసిన ఉదయభాను.. కొన్నిరోజుల క్రితంన గోంగూర పప్ప ఎలా చేయాలో  అనే ఒక వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది ఉదయభాను. ఇక ఇందులో గోంగూర  పప్పు ఎక్కువగా తినకూడదని డాక్టర్స్ చెబుతారు ఎందుకంటే ఇది తింటే కిడ్నీల్లో రాళ్ళు వస్తాయని చాలామంది చెబుతుంటారు. ఒకప్పుడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయిన ఉదయభాను ఉండాల్సిందే.‌ ఏ షో అయిన తను సందడి చెయ్యాల్సిందే అన్నట్లుగా ఉదయభాను క్రేజ్ ఉండేది. ఒకప్పుడు అన్ని ఛానల్స్ కు మోస్ట్ ఛాయస్ గా ఉదయభాను ఉండేది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను సంపాదించుకుంది. లీడర్ లో 'రాజశేఖర ' సాంగ్ లో కన్పించిన ఉదయభాను, ఆ తర్వాత జులాయి మూవీలో  ఐటమ్ సాంగ్ లో మళ్ళీ మెరిసింది. అప్పట్లో రెండు మూడు సినిమాల్లో కనిపించి అందరిని మెప్పించింది. ఉదయభాను పెళ్లి చేసుకొని ఇద్దరి కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే  తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో " మా పిల్లల కోసం నేను చేసే గోంగూర పప్పు" అంటు ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. ఇందుల.. "  పాలకూర తింటే రాళ్ళు వస్తాయని చాలామంది చెప్తారు కానీ రాదు. పాలకూర భుమికి చాలా దగ్గరగా పెరుగుతుంది. అందువలన దానికి మట్టి, ఇసుక ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు కడిగితే కానీ ఆ ఇసుక పోదు. దానిని సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే కిడ్నిల్లో రాళ్ళు వస్తాయి కానీ పాలకూర తింటే ఏమీ రావు " అని ఉదయభాను ఈ వ్లాగ్ లో చెప్పింది. అయితే 21 నిమిషాల నిడివి ఉన్న  ఈ వ్లాగ్ లో.. ఒక నిమిషం కూడా లేని ఈ మాటలని కొందరు నెటిజన్స్ కట్ చేసి తనని నెగెటివ్ చేస్తూ పోస్ట్ చేసారు. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా అనవసరమైన వాటిని కలిపి నెగెటివిటి తేవాలని చూస్తున్నారని కావాలని చేసినట్టుగా తెలుస్తోంది . అయితే ఇందులో ఉదయభాను తప్పుగా ఏం మాట్లాడలేదని యూట్యూబ్ లోని తన  ఛానెల్ లో అప్లోడ్ చేసిన వ్లాగ్ చూస్తే తెలిసిపోతుంది.  మరి ఇలాంటి వాటిని ఉదయభాను చూసిందా లేదా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వ్లాగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

శివాజీ కొడుకు రిక్కీ అందరిని ఏడిపించేశాడుగా!

బిగ్ బాస్ సీజన్-7.. 105 రోజులు, 19 మంది కంటెస్టెంట్స్.. ప్రతీ రోజు టాస్క్ లు.. ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎలిమినేషన్స్, వీకెండ్ ప్రోమోల కోసం ఎదురుచూపులు అన్నీ ముగిసాయి. నిన్నటి ఆదివారం నాటి ఫినాలే వీక్ తో బిగ్ బాస్ సీజన్-7 ముగిసింది. హౌస్ లో ఆరుగురు ఫైనలిస్టులు ఫినాలే వీక్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే.  శివాజీకి చేతిగాయం అయిన తర్వాత కూడా ప్రేక్షకులు అతనికి సపోర్ట్ గా నిలిచారు.‌ అందరు శివాజీనే విన్నర్ అవుతాడని అనుకున్నారు. కానీ ఫ్యామిలీ వీక్ తరువాత లెక్కలు మారిపోయాయి. గురువుని మించిన శిష్యుడిగా ప్రశాంత్ పుంజుకున్నాడు.‌ ఇక ఎప్పుడు ఫౌల్స్ చేస్తూ, అల్లరిచిల్లరగా ఉండే అమర్ దీప్ సైతం తన భార్య చెప్పినట్టుగా గ్రూపిజం చేయకుండా కాస్త హౌస్ లోని మిగిలిన వారితో కలవడంతో అతనికి కలిసొచ్చింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ మూడో స్థానంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. శివాజీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాడంటే అతని రెండో కొడుకు రిక్కీనే కారణం. శివాజీకి బిగ్ బాస్ కి వచ్చినప్పుడు.. ‘నువ్వు ఆడలేవ్ నాన్న.. ఉండలేవ్ నాన్న’ అని రిక్కీ అన్న మాటలు శివాజీలో కసి పెంచాయి. తాడో పేడో తేల్చుకునే వస్తానని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే చాణుక్యుడిగా మారి జెండా పాతేశాడు. హౌస్ లో ఎంతమంది ఉన్న నా దారి నాదే.. నాతో ఎవరు పోటీ రారు అంటూ  శివాజీ తోటి హౌస్ మేట్స్ దృష్టిలోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా మారి చివరికి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. అయితే నిన్నటి గ్రాంఢ్ ఫినాలే రోజున శివాజీ కొడుకు రిక్కీ ఎవరితో షేర్ చేయని ఒక విషయాన్ని నాగార్జునతో షేర్ చేసాడు.  " మా నాన్న గెలిచిన ఓడిన సెలబ్రేట్ చేసుకుంటాం.. నేను ఆయన్ని ఆడలేడని అన్నాను.. కానీ ఆయన ఆడారు.. ఉండలేరన్నాను.. ఉండి చూపించారు.. మా నాన్న గెలిచినట్టే.. ఆయన్ని ఏదైనా నువ్వు చేయాలేవు అని అంటే చేసి చూపిస్తారనే రివర్స్ స్ట్రాటజీ ప్లే చేశా’ అని చెప్పాడు. తీరా శివాజీ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదికి వచ్చేసరికి చిన్న కొడుకు రిక్కీ తట్టుకోలేకపోయాడు. తండ్రిని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు రిక్కీ. "రేయ్ నాన్నా.. ఏడ్వద్దురా.. అరేయ్ నాన్నా.. అయ్యయ్యో ఏడుస్తావ్ ఏంట్రా.. ఇక్కడ ఓడిపోయానంటే.. ఇంకా ఏదో పెద్దది గెలుస్తారా.. నన్ను నమ్ము’ అంటూ కొడుకుని ఓదార్చిన సీన్‌ చూస్తే అందరికి కళ్లు చెమ్మగిల్లాయి. ఇది చూసి నాగార్జున కూడా ఎమోషనల్ అవుతూ.. ఇక్కడి వరకు వచ్చాడు. అందరి మనసులు గెలిచాడని అన్నాడు. విన్నర్ గా నిలుస్తాడని భావించిన శివాజీ మూడవ స్థానంలో  ఎలిమినేట్ అవ్వడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు.  

బిగ్ బాస్ సీజన్-7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్..కారణం ఇదే !

బిగ్ బాస్ సీజన్-7 లో ఎన్నో ట్విస్ట్ లు మరెన్నో టాస్ లతో పదిహేను వారాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తం పదిహేను వారాలుగా సాగిన ఈ షోలో 19మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి ప్రతీవారం ఒక్కరు చొప్పున ఎలిమినేషన్ అవ్వగా చివరి వారంలో టాప్-6 ని ఉంచారు బిగ్ బాస్. ఇక టాప్-6 లో మొదటగా ఓటింగ్ లో ఆరవ స్థానంలో ఉన్న అంబటి అర్జున్ ఎలిమినేషన్ అవ్వగా, ఆ తర్వాత అయుదవ స్థానంలో ఉన్న  ప్రియాంక ఎలిమినేట్ అయింది. ఇక నాల్గవ స్థానంలో ఉన్న యావర్ కి 15 లక్షల సూట్ కేస్ ఆఫర్ ఇవ్వగా దానిని తీసుకొని ‌హౌస్ నుండి బయటకొచ్చాడు యావర్. ఇక మూడవ స్థానంలో శివాజీ  హౌస్ నుండి బయటకొచ్చారు. ఇక హౌస్ లో చివరగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఉండగా హోస్ట్ నాగార్జునే స్వయంగా వచ్చి వీరిద్దరిని బయటకు తీసకొచ్చారు. ఇక స్టేజ్ మీద ఇద్దరిని చూసిన కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులకు ఎవరు విన్నర్ అవుతారనే టెన్షన్ మొదలవ్వగా.. సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అని నాగార్జున అన్నాడు. అది వినగానే పల్లవి ప్రశాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  నాగార్జున కి లవ్ యూ చెప్తూ తనకి ఓట్లు వేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు పల్లవి ప్రశాంత్. తెలుగులోనే కాకుండా.. దేశ చరిత్రలో  కామన్ మ్యాన్‌ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి.  రైతుబిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ప్రతీ టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడి గెలిచాడు. తను సొంతంగా ఆడిన ఆటలో ఓటమి అంటూ లేదంటూ నిరూపించాడు పల్లవి ప్రశాంత్. హౌస్ మేట్సే కాదు హోస్ట్ నాగార్జున సైతం పల్లవి ప్రశాంత్ టాస్క్ లో ఆడిన ఆటతీరుకి ఫిధా అయ్యాడు. బయట సీజన్-7 మొదలైనప్పుడు తనని ట్రోల్స్ చేసిన ప్రతీ ఒక్కరి మాటలని రాళ్ళుగా మలుచుకొని ఒక్కో మెట్టుగా చేసుకున్నాడు ఈ రైతుబిడ్డ. కష్టపడి గెలవాలన్న కసితో ఆడితే ఏదైనా సాధించవచ్చని ఈ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిరూపించాడు. ఇక విజేగా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించాక తనకు వచ్చిన ప్రతీ రూపాయిని అప్పుల్లో, ఇబ్బందుల్లో ఉన్న రైతులకే ఉపయోగిస్తానని పల్లవి ప్రశాంత్ స్టేజ్ మీద చెప్పాడు. యూట్యూబ్ రివ్యూవర్స్, ఇన్ స్టాగ్రామ్ పేజీలలో ఎక్కడ చూసిన రైతుబిడ్డ ‌గెలుపు సరైనది అంటూ చెప్తుండగా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు పల్లవి ప్రశాంత్.  

వామ్మో శ్రీరామ్ గారు ఏంటి ఈ మధ్య ఇంత ఫాస్ట్ గా ఉన్నారు!

సూపర్ సింగర్ 2023 న్యూ సీజన్ డిసెంబర్ 23 నుంచి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి, జడ్జెస్ గా మంగ్లీ, అనంత శ్రీరామ్, రాహుల్ సిప్లిగంజ్, శ్వేతా మోహన్ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో శ్రీముఖి పింక్ కలర్ డ్రెస్ లో అదరగొట్టేసింది. ఈ షో శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతోంది.  ఇక ఈ షోలో ఒక్కొక్కళ్ళ ఎంట్రీ ఒక్కో రేంజ్ లో ఉంది. శ్వేతా మోహన్ స్టేజి మీదకు వచ్చి కంటెస్టెంట్ తో కలిసి ఆదిపురుష్ మూవీలో "ప్రియ మిథునం మనలా" అనే సాంగ్ ని చాల అద్భుతంగా పాడి వినిపించారు. ఇక ఆమె పాడిన ఈ సాంగ్ కి అనంత శ్రీరామ్ వ్వాహ్ అని కామెంట్ ఇచ్చారు. తర్వాత రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒక సాంగ్ అందుకున్నాడు "గట్టా నడుచుకుని గేటులన్నీ దాటుకొస్తే" అనే సాంగ్ డాన్స్ వేస్తూ పాడుతూ స్టేజి మీదకు వచ్చాడు. ఆ సాంగ్ కి అనంత శ్రీరామ్ కి మంచి ఊపొచ్చేసి గాల్లో ఎగిరి మరీ పిల్లి మొగ్గ వేశారు. ఆయన ఫీట్ చూసిన శ్వేతా మోహన్ షాకైపోయారు. "సూపర్ సింగర్ వేదిక మీదున్నానా రాహుల్ చిచ్చా పబ్ లో ఉన్నానా అనిపించింది" అంటూ కామెంట్ చేశారు.  ఇక ఈ షో గురించి నెటిజన్స్ నుంచి వెరైటీ కామెంట్స్ వినిపించాయి. "వామ్మో శ్రీరామ్ గారు ఏంటి ఈ మధ్య ఇంత ఫాస్ట్ గా ఉన్నారు.. అనంత శ్రీరామ్ కి తప్ప మిగతా వాళ్ళు ఎం జడ్జి చేస్తారు... మంగ్లీ జడ్జిమెంట్ అంటే షోలో గొడవలే..గీత మాధురి ఐతే జడ్జిగా బాగుంటుంది.. తమిళ్ వాళ్ళు లేకుండా షో చేయలేరా...సింగింగ్ కాంపిటీషన్ లో డాన్స్ ఎందుకు బాబు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సింగింగ్ కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది...ఎలాంటి కంటెంట్ రాబోతోంది...ఎలా జడ్జిమెంట్ ఉండబోతోంది అనేది.

ప్రాంక్ చేసి ఇంద్రజను అవమానించిన పటాస్ ప్రవీణ్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో చాల ఫన్నీగా ఆది పెళ్లి కాన్సెప్ట్ తో బాగా ఎంటర్టైన్ చేసింది. ఐతే ఈ షోలో పటాస్ ప్రవీణ్ మాత్రం ఈ షోలో జడ్జ్ ఇంద్రజని ఏడిపించేసాడు. ఇంద్రజ కూడా ఎమోషన్ అయ్యింది కానీ బయటకు ఆ ఎమోషన్ ని కనిపించనివ్వకుండా దాచేసుకుంది. ఇంతకు ఎం జరిగింది అంటే ప్రవీణ్ కి ఫైమాకి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందన్న విషయం మనకు ఎప్పటినుంచో తెలుసు కానీ ప్రస్తుతానికి వాళ్ళ మధ్య ఏమీ లేదు అంటూ వాళ్ళ పేరెంట్స్ కూడా తేల్చి చెప్పేసారు.  ఐతే ప్రవీణ్ ఇప్పుడు ఒక అమ్మాయిని శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీదకు తీసుకొచ్చాడు. ఆమె పేరు మమతా అని ఇంట్రడ్యూస్ కూడా చేసాడు. ఓకే ఈవెంట్ కి రాజమండ్రి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది అని చెప్పాడు. ఇక రష్మీ, ఇంద్రజ చాల హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఇంద్రజ కూడా ప్రవీణ్ కి విషెస్ చెప్పారు. కార్ కొన్నది మమతా కోసమేనా అంటూ ఆట పట్టించారు కూడా.. ఐతే ప్రవీణ్ మాత్రం తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ప్రపోజ్ ఎందుకు చేయలేదు అంటూ రష్మీ కూడా ఫైర్ అయ్యింది. ఇంత అందమైన అమ్మాయికి కూడా నువ్వు లవ్ ప్రపోజ్ చేయలేదంటే వేస్ట్ అంటూ కూడా కామెంట్స్ చేసింది. ఐతే ఇంద్రజ మాత్రం ప్రవీణ్ కి ఒక సలహా ఇచ్చారు. పేరెంట్స్ కి చెప్పి వాళ్ళ పర్మిషన్ తో పెళ్లి చేసుకో అంటూ మమతాకి ప్రవీణ్ కి చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత ఇంద్రజ హ్యాపీమూడ్ లో ఉండగా అమ్మా ఇదంతా ప్రాంక్..అసలు ఈ పెళ్లి విషయం చెప్తే మీరు ఎలా ఫీలవుతారో అంటూ సరదాగా ఈ కాన్సెప్ట్ మీద చేసాం అని ప్రవీణ్ ఫైనల్ గా షాకిచ్చేసరికి ఇంద్రజ చాల ఫీలైపోయి తలదించేసుకున్నారు.

రాజ్ కి ముద్దు పెట్టేసిన కావ్య...

ఇయర్ ఎండింగ్  కి వచ్చేసాం. కొత్త ఏడాదిలోకి మరి కొద్ది రోజుల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఇక బుల్లితెర మంచి కలర్ ఫుల్ గా తయారయ్యింది. ఇప్పటినుంచే ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ ని మొదలు పెట్టేసింది. ఈ కాన్సెప్ట్ తో "మోస్ట్ అవైటెడ్ దావత్..మ్యాడ్" పేరుతో ఒక ఈవెంట్ స్టార్ మాలో రాబోతోంది. ఇందులో బ్రాహాముడి సీరియల్ హీరో, హీరోయిన్స్ రెచ్చిపోయారు. "సీరియల్ వెర్సెస్ రియల్" థీమ్‌తో ఈ ఈవెంట్ జరిగింది. సీరియల్ సెలబ్రెటీలంతా ఒకవైపు.. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ ని మరో వైపుకు కూర్చోపెట్టి రచ్చ చేశారు యాంకర్లు రవి, వర్షిణి. ఇక ఈవెంట్‌కి "బబుల్‌గమ్" మూవీ టీమ్, "బలగం" మూవీ  హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్, ఇంద్రజ హాజరయ్యారు. ఐతే స్టేజ్ మీద మానస్‌ను గట్టిగా హగ్ చేసుకుని కావ్య ఒక  ఘాటు ముద్దు పెట్టేసింది.  ఒకప్పుడు డాక్టర్ బాబు- వంటలక్క జోడి ఎంతగా పాపులర్ అయ్యిందో ఇప్పుడు  కావ్య-రాజ్ జోడి బుల్లితెరపై ఆల్‌టైమ్ హిట్ జోడీల్లో ఒకటిగా చేరిపోయింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చేసింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో, కామెడీ సీన్స్ లో ఇద్దరూ సమానంగా నటిస్తున్నారు. బ్రహ్మముడి సీరియల్  హిట్ కావడానికి వీళ్లిద్దరి రోల్ అని చెప్పొచ్చు.  ఎన్నెన్నో జన్మల బంధం ఫేమ్ దేబ్జానీ మోదక్ అలియాస్ వేద, మౌనరాగం ఫేమ్ శివ్, బ్రహ్మముడి బ్యూటీలు హమీదా, దీపికతో పాటు మిగతా బుల్లితెర సెలబ్రిటీస్ అంతా కూడా సందడి చేశారు. ఇక రియల్ సెలబ్రెటీలుగా  బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్లు శుభశ్రీ రాయగురు, భోలే షావలి, ఆట సందీప్, అశ్విని, టేస్టీ తేజతో పాటు మాజీ బిగ్‌బాస్ సెలబ్రెటీలు కూడా వచ్చేశారు. ఇక వీరితో పాటు హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా గట్టిగానే గోల చేసింది. "ఇక్కడ ఉన్నది ఆట సందీప్, హమీద" అంటూ రవి పరిచయం చేసేసరికి కృష్ణ ముకుందా మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణా కౌంటర్ వేసింది " ఆట ఆడాలంటే ఆట అని పేరుకు ముందు పెట్టుకోవాలా" అనేసరికి అందరూ షాకైపోయారు. ఇలాంటి పంచులతో రకరకాల గేమ్స్ తో, డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఈ షో వచ్చేవారం అలరించడానికి రాబోతోంది.

ఇనయా అందాల ఆరబోత.. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్!

సోషల్ మీడియాలో అరకొరా డ్రెస్ లతో, బికినీ ఫోటోలతో కనిపించే తారలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిన్న మొన్నటి దాకా అనసూయ చీరకట్టులో సెగపుట్టించగా, అరియానా గ్లోరీ బికినీలో కుర్రాళ్ళ మతిపోగొట్టింది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఇనయా సుల్తానా చేరింది. అందాల ఆరబోతలో నేనేం తక్కువ కాదన్నట్టుగా రెచ్చిపోయింది ఇనయా. బిగ్ బాస్ సీజన్-6 లో మోస్ట్ డేర్ అండ్ డెవిల్ గా పేరుతెచ్చుకుంది ఇనయా ముజిబుర్ సుల్తానా అలియాస్ ఇనయా సుల్తానా. బిగ్ బాస్ సీజన్-6 లో తనకన్నా స్ట్రాంగ్ ఉన్న రేవంత్, శ్రీహన్ వంటి కంటెస్టెంట్స్ తో ఆడి అప్పట్లో ప్రేక్షకులే కాదు విమర్శకుల ప్రశంసలు పొందింది ఇనయా. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించని క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది. హాట్ డ్రెస్ తో క్లివేజ్ షో చేస్తు ఇనయా తాజాగా షేర్ చేసిన పిక్స్ కి ఫ్లాట్ అవ్వని వారు లేరు. ముఖ్యంగా యూత్ అయితే మత్తుగా ఉండే తన కళ్ళకి తోడు ఇనయా ఇంకొంచం మత్తుగా ఫేస్ పెట్టేసరికి ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన బ్యూటీల్లో ఇనయా సుల్తానా ఒకరు. ఈ షో పుణ్యమా అని ఇనయాకి డిమాండ్ బాగానే పెరిగింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్‌లో కూడా చేస్తూ బాగానే సంపాదించుకుంటుంది. మొన్నటిదాకా విదేశీ టూర్ లతో బిజీగా ఉన్నా ఇనయా సుల్తానా తాజాగా ఇండియాకి వచ్చింది. ఇక వచ్చీ రాగానే ఒక ఫోటోషూట్ చేసింది. ఇందులో  చీరకట్టులో కనిపించిన ఇనయా.. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ళ మతిపోగుడుతుంది.‌ అయితే ఈ ఫోటో షూట్ ని ఇనయా త‌న ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ పోస్ట్ కి భారీగా స్పందన లభిస్తుంది.

Krishna Mukunda Murari : ఆ నిజం మురారి కనిపెట్టగలడా.. భయాందోళనలో ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -342 లో.. ముకుంద లేవకముందే తన దగ్గరికి కృష్ణ వచ్చి ఉంటుంది. ఇక ముకుంద లేవగానే టాబ్లెట్ వేసుకోమని ఇస్తుంది. నన్ను ఎందుకు బతికించావంటూ ముకుంద కోపంగా మాట్లాడుతుంది. నేను బ్రతికేది మురారి కోసమని కృష్ణకి ముకుంద చెప్తుంది. మళ్ళీ ఎప్పటిలాగే మురారి నాకే సొంతమని ముకుంద మాట్లాడగా... తను నా ఏసీపీ సర్ అంటూ కృష్ణ మాట్లాడుతుంది. మరొకవైపు కృష్ణ ఇంట్లో కన్పించడం లేదు. ఎక్కడకు వెళ్ళిందని శకుంతల కంగారుపడుతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న రేవతిని పిలిచి కృష్ణ కన్పించడం లేదని చెప్తుంది. మా ఇంట్లో ఉండి ఉంటుంది. నువ్వు కంగారు పడకని రేవతి చెప్తుంది‌ భవాని గారు తీసుకున్న నిర్ణయానికి మీరు అయినా అడ్డు చెప్పచ్చు కదా అని శకుంతల అడుగగా.. నేను అడగలేనని రేవతి అంటుంది. నేను వెళ్లి వదిన కాళ్ళపై పడి బ్రతిమాలుతానని శకుంతల అనగానే.. వద్దు, నిజంగానే తప్పు చేశారేమో అందుకే క్షమించమని అడుగుతున్నారని అనుకుంటుంది. నా కొడుకు మీరే తప్పు చెయ్యలేదని నిరూపిస్తాడని రేవతి చెప్తుంది. మరొక వైపు కృష్ణ ఫోటోలని మురారి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. అ తర్వాత మురారి స్నానానికి వెళ్లి వస్తాడు. మురారి తలని కృష్ణ తుడుస్తుంటుంది. నిన్ను ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉండాలని అనిపిస్తుందని మురారి అంటాడు. మరొకవైపు ముకుంద లేచిందా అని‌ ఇంట్లో వాళ్లని భవాని అడుగుతుంది. అందరు మౌనంగా ఉంటారు. అప్పుడే ముకుంద  వచ్చి వాళ్ళెందుకు పట్టించుకుంటారని అంటుంది. ఇంకా అలా ముకుంద అనగానే భవాని అందరిపై సీరియస్ గా మాట్లాడుతుంది. ముకుందకి సపోర్ట్ గా భవాని మాట్లాడేసరికి ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి లు సరదాగా మాట్లాడుకుంటూ మేడ పైనుండి కిందకి వస్తుంటారు. భవాని దగ్గరికి మురారి వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతున్నానని ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇప్పుడు కృష్ణ వాళ్ళ చిన్నాన్నని కలిసి, ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళాలని భవానికి చెప్పి.. కృష్ణతో కలిసి మురారి బయల్దేరి వెళ్తాడు. ఇప్పుడు మురారి అక్కడకి వెళ్తే మొత్తం తెలిసిపోతుందని ముకుంద టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో కృష్ణ మురారి ఇద్దరు జైల్ కి వెళ్లి కృష్ణ వాళ్ళ చిన్నాన్నని కలిసి మాట్లాడతారు. మరొకవైపు ముకుంద జైలుకి వెళ్లి తన అన్నయ్యని కలిసి మాట్లాడుతుంది.  అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : శైలేంద్ర కపటధారి.. ఆ విషయం ధరణి తెలుసుకుంటుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం  నాటి ఎపిసోడ్‌ -948 లో.. శైలేంద్రపై ఉన్న కోపంతో‌ మహేంద్ర గన్ తో షూట్ చెయ్యాలని అనుకొని శైలేంద్ర దగ్గరికి వస్తాడు. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని‌ మహేంద్ర అడుగుతాడు. నాకు తెలియదని శైలేంద్ర అనగానే.. మహేంద్రకి ఇంకా కోపం వస్తుంది. ధరణి దేవయాని ఇద్దరు అడ్డు వచ్చినా వాళ్ళని షూట్ చేయబోతాడు. కానీ అనుపమ, వసుధార ఇద్దరు వస్తారు. అది చూసి మహేంద్ర చెయ్యి పట్టుకొని అనుపమ ఆపుతుంది. ఆ తర్వాత నన్ను ఆపకండి అని మహేంద్ర గట్టిగా అరుస్తు ఉంటాడు. అయినా వినకుండా అనుపమ, వసుధార ఇద్దరు మహేంద్రని బయటకు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత హమ్మయ్య బ్రతికి పోయానని శైలేంద్ర అనుకుంటాడు. నీకేం కాలేదు కదా అంటూ శైలేంద్ర గురించి అడిగి తెలుసుకుంటుంది దేవయాని. మరొకవైపు మహేంద్ర వాళ్ళు బయటకు వెళ్ళగానే.. అప్పుడే ఫణీంద్ర వస్తాడు. తనని చూసి మహేంద్ర ఎమోషనల్ అయి హగ్ చేసుకుంటాడు. ఏం బాధపడకు రిషి వస్తాడని ఫణీంద్ర చెప్తాడు. ఫణింద్ర మాట విన్న శైలేంద్ర బయటకు వచ్చి.. నేను అదే చెప్తున్నా రిషి క్షేమంగా ఉంటాడు. నువ్వు ఏం బాధపడకు. నేను వెతికి తీసుకొని వస్తానని చెప్తున్నా అని శైలేంద్ర నటిస్తుంటాడు. కానీ శైలేంద్ర గురించి ఒక్క మాట కూడా మహేంద్ర తన అన్నయ్యకి చెప్పడు. మహేంద్ర వాళ్ళు వెళ్ళిపోతారు. ఫణింద్ర లోపలికి వెళ్లగానే చిందరవందరగా ఉన్న ఇల్లు చూసి ఏమైంది అని అడుగుతాడు. దేవయాని ఏదో కవర్ చెయబోతుఉంటే. నువ్వు ఆగు.. ధరణి ఏం జరిగింది? ఎవరికీ బయపడకని ఫణింద్ర అనగానే.. ధరణి జరిగింది మొత్తం ఫణింద్రకి చెప్తుంది. మరి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పబోయావని దేవయానిపై ఫణీంద్ర కోప్పడతాడు. ఆ తర్వాత మహేంద్రకి ఇంత బాధ, కోపం వచ్చిందంటే అతనికి ఎక్కడో శైలేంద్రపై డౌట్ వచ్చింది. ఎందుకు శైలేంద్రపై డౌట్ వచ్చింది? ఏం చేశారని ఫణింద్ర అడుగుతాడు. ఏం లేదంటూ దేవాయని అంటుంది. ఇక్కడే ఉంటే అంతా బయటపడేలా ఉందని శైలేంద్ర నొప్పి అంటు లోపలికి వెళ్తాడు. అ తర్వాత ధరణిని పిలిచి కూల్ చెయ్యాలని‌‌ శైలేంద్ర చూస్తాడు. నేను మారిపోయాను. నీకు రిషి ఎక్కడ ఉన్నాడో తెలిస్తే నాకు చెప్పని శైలేంద్ర యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: కావ్య పెంచుకున్న ప్రేమని రాజ్ కాలరాస్తాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -281 లో.. అందరూ కోనేటి దగ్గర దీపాలు వదలడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు మాట్లాడుకుంటుంటే చూడలేని అనామిక తల్లి, ఈర్ష్యతో  వాళ్ళు మాట్లాడుకుంటున్నది అనామికని పిలిచి చూపిస్తుంది. దాంతో అనామిక కోపంగా కళ్యాణ్ ని పిలుస్తుంది. అప్పు ఫీల్ అవుతుంది. మరొకవైపు రాజ్ కి శ్వేత ఫోన్ చేసి పక్కకిరా మాట్లాడాలని చెప్తుంది. దాంతో రాజ్ మళ్ళీ వస్తానంటూ ఎవరు చూడకుండా అక్కడ నుండి వెళ్లి శ్వేతని కలుస్తాడు. అదే సమయంలో దీపాలు పెట్టడానికి అగ్గిపెట్టె లేదు, తీసుకోని వస్తానంటూ అపర్ణ అక్కడ నుండి వెళ్తుంది. రాజ్ ని  శ్వేత హగ్ చేసుకొని ఉండడం చూసిన అపర్ణ షాక్ అవుతుంది. అలా చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏం జరిగినా నీకు నేను ఉన్నానని శ్వేతకి రాజ్ చెప్తాడు. అప్పుడే ప్రకాష్ ఫోన్ చెయ్యడంతో శ్వేతను రాజ్ పంపించేసి.. కోనేరు దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఆడవాళ్లు అందరు కోనేటి లో దీపాలు వదులుతారు. కనకం అనామిక వదిలిన దీపం మునిగిపోయేలా చేస్తుంది. అది మునగకుండా కావ్య ట్రై చేస్తుంది కానీ అనామిక తల్లి కావ్యని తప్పు గా అర్థం చేసుకొని.. నీకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు కావాలనే ఇదంతా చేస్తున్నావ్ కదా? అనామికని తప్పించి నీ చెల్లిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తున్నావ్ కదా అని అంటుంది. నేను అలా ఎప్పుడు చెయ్యనని కావ్య అంటుంది. అప్పు నాకు మంచి ఫ్రెండ్ అని కళ్యాణ్ అనామిక వాళ్ళ అమ్మపై కోప్పడతాడు. ఆ తర్వాత నాకంటే ఎక్కవ నువ్వు అప్పుతో ఉంటున్నావని అనామిక అనగానే.. నా వల్ల మీరు ఎందుకు గొడవ పడతారు. నేను ఇక ఎప్పుడు కళ్యాణ్ ని కలవనని అప్పు వెళ్లిపోతుంటే.. అప్పుని కళ్యాణ్ ఆపి, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు అనుకుంది నిజం అవుతుందని అంటాడు. అ తర్వాత ఇందిరాదేవి మధ్యలో కలుగజేసుకొని మీరు చదువుకున్న వాళ్ళు అలా ఎలా అర్ధం చేసుకుంటారని అనగానే.. కావ్య గారు ఏం తప్పు చెయ్యలేదని అనామిక చెప్తుంది. మరుసటి రోజు ఉదయం శ్వేతతో రాజ్ రహస్యంగా ఫోన్ మాట్లాడుతుంటే అపర్ణ వింటుంది. తర్వాత రాజ్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడా అని అనుకుంటుంది.  తరువాయి భాగంలో..  కావ్య నీపై ప్రేమ పెంచుకుంటుందని రాజ్ తో అపర్ణ అనగానే.. నాకు మాత్రం తనపై ప్రేమ పుట్టదు అంటాడు. ఎప్పటి వరకు ఇలా అని అపర్ణ అడుగుతుంది. తాతయ్య బాగయ్యే వరకు, ఆ తరువాత నా జీవితంలో కావ్య ఉండదని రాజ్ చెప్తాడు. వెళ్ళనని చెప్తే ఏం చేస్తావని అపర్ణ అనగానే.. వెళ్లిపోయేలా చేస్తానని రాజ్ అంటాడు.  అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మల్లొచ్చిన అంటే తగ్గేదేలే.. టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్!

బిగ్ బాస్ సీజన్-7 ముగింపుకు వచ్చేసింది. హౌస్ లో ప్రస్తుతం అంబటి అర్జున్, ప్రియాంక, యావర్, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ ఉన్నారు. అయితే వీరిలో టైటిల్ విన్నర్ ఎవరో వారికోసం ప్రేక్షకులు గత రెండు వారాలుగా వేసిన ఓటింగ్ ముగిసింది. ఇక ఈ ఓటింగ్ లో బాటమ్-3 లో ఉన్న అర్జున్ ,ప్రియాంక, యావర్ ఎలిమినేషన్ అయినట్లు తెలుస్తుంది. ఇక టైటిల్ రేస్ లో మిగిలింది ముగ్గురు. అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్. ఈ ముగ్గురి మధ్య ఓటింగ్ లో టఫ్ ఫైట్ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఓటింగ్ పూర్తయ్యే సమయానికి పల్లవి ప్రశాంత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండవ స్థానం కోసం అమర్, శివాజీల మధ్య నవ్వా-నేనే అన్న రేంజ్ లో ఓటింగ్ జరిగిందని పలు సోషల్ మీడియా పోల్స్ లో తెలిసింది. అయితే పల్లవి ప్రశాంత్ అనుకున్నది సాధించాడు రా అంటూ సోషల్ మీడియా లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. " మనం చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఆ ప్రకృతి సైతం మన వెంటే ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టానికి ఫలితం  తప్పక లభిస్తుంది " ఇది అక్షరాల నిజమని ఋజువు చేసాడు రైతుబిడ్డ అంటు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ పోస్ట్ లు చేస్తున్నారు. పొలంలో పండించిన బియ్యం బస్తాతో రైతుబిడ్డగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి అడుగుపెట్టి  తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడయ్యాడు‌ పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ సీజన్-6 ముగిసిన తర్వాత  మోస్ట్ పాపులర్ అయిన వ్యక్తిగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. " అన్న ఒక రైతుబిడ్డగా బిగ్ బాస్ సీజన్-7 కి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ పొలం పనులు చేసేటోడికి ఓ అవకాశం ఇవ్వండి" అంటూ సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ చేసిన పోస్ట్ కొన్ని మిలియన్ల వ్యూస్ వచ్చింది. అయితే ఈ పోస్ట్ కి ప్రతీ గ్రామం నుండి అభిమానులు పుట్టుకొచ్చారు. ఇక అక్కడి నుండి పల్లవి ప్రశాంత్ జాతకమే మారిపోయింది. సీజన్-7 మొదలవుతుందని తెలిసినప్పటి నుండి.. పల్లవి ప్రశాంత్ ఇన్ బిగ్ బాస్ సీజన్-7 అంటూ ఒకటే మ్యూజిక్కు.. ఏ యూట్యూబర్ వ్లాగ్ చూసిన, ఏ ఇన్ స్ట్రాగ్రామ్ పోస్ట్ చూసిన , ఏ సోషల్ మీడియా మధ్యమం చూసిన మన రైతుబిడ్డకి సపోర్ట్ చేయండి, మల్లొచ్చిన అంటే తగ్గేదెలే, జై జవాన్ జై కిసాన్ అంటూ పోస్ట్ లు విపరీతంగా కనిపించేవి.  ఇక సీజన్-7 లో అడుగుపెట్టి ప్రతీ టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడి.. అసలు తను సొంతంగా ఆడిన ఆటలో ఓటమి అంటూ లేదంటూ నిరూపించాడు పల్లవి ప్రశాంత్. హౌస్ మేట్సే కాదు హోస్ట్ నాగార్జున సైతం పల్లవి ప్రశాంత్ టాస్క్ లో ఆడిన ఆటతీరుకి ఫిధా అయ్యాడు. ఇక ఇప్పటికే  సోషల్ మీడియాలో బయటకు వస్తున్న లీకులతో  పల్లవి ప్రశాంత్ విన్నర్ అని కన్ఫమ్ అయిన ప్రేక్షకులు సంబరాలు జరుపుకోవానికి సిద్దమవుతున్నారు.

Prince Yawar Eliminated: ప్రిన్స్ యావర్ ఎలిమినేటెడ్.. అయినా జాక్ పాట్ కొట్టాడు!

బిగ్ బాస్ సీజన్-7 ముగింపుకు వచ్చేసింది. చివరి వారంలో హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆదివారం టీవీలో ప్రసారమయ్యే గ్రాంఢ్ ఫినాలే ఎపిసోడ్ దాదాపు మూడున్నర గంటల పాటు సాగుతుంది. అయితే ఈ షూటింగ్ శనివారమే మొదలవుతుంది. ఈ క్రమంలో గ్రాంఢ్ ఫినాలేలో జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఆరవ స్థానంలో అంబటి అర్జున్ ఎలిమినేషన్ అయ్యాడని, ఐదవ స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది. ఇక ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం నాల్గవ స్థానంలో ఉన్న యావర్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది.  మొదట ప్రియాంక, అర్జున్  ఇద్దరికి.. 10 లక్షల సూట్ కేస్ బిగ్ బాస్ ఆఫర్ చేయగా వాళ్లు తిరస్కరించారు. దాంతో ఖాళీచేతులతో ప్రియాంక ఎలిమినేట్ అయిందట. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ తెలివిగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రశాంత్, అమర్, శివాజీ, యావర్.. ఈ నలుగురు హౌస్‌లో ఉన్నారు. అప్పుడే బిగ్ బాస్ 15 లక్షల సూట్ కేసు ఆఫర్ చేయడంతో యావర్ సూట్ కేసు తీసుకుని నాలుగో స్థానంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు యావర్ సూట్ కేస్ తీసుకోవడం ద్వారా.. అతను పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్టే అయ్యింది.  యావర్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేముందు తను జాబ్ చేసేవాడిని కాదని, తన అన్నయ్యల మీదే ఆధారపడి ఉన్నానని చాలా సందర్భాలలో చెప్పాడు. హౌస్ లోకి వచ్చేముందు రూపాయి కూడా అకౌంట్ లో లేదని శివాజీతో యావర్ చెప్పుకొని ఏడ్వడంతో చాలామంది ప్రేక్షకులు అతనికి కనెక్ట్ అయ్యారు. అయితే ఇది యావర్ ను విన్నర్ గా నిలబెట్టేందుకు దోహదపడలేదని వాస్తవం. ఈ విషయం గ్రహించిన యావర్ తనకి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మనీ తీసుకున్న ఎలిమినేషనే, తీసుకోకపోయిన ఎలిమినేషనే అని గ్రహించిన యావర్ 15 లక్షల సూటు కేసు తీసుకొని బయటకొచ్చాడంట. మరి స్పై బ్యాచ్ లో మోస్ట్ స్ట్రాంగ్ గా ఉన్న యావర్ ఎలిమినేషన్ అవ్వడంతో స్పై బ్యాచ్ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారని తెలుస్తోంది.

Priyanka Jain Eliminated : ప్రియాంక జైన్ ఎలిమినేటెడ్!

బిగ్ బాస్ సీజన్-7 లో గ్రాంఢ్ ఫినాలే రోజు రానే వచ్చేసింది. హౌస్ లో శనివారం ఎవరి ఎలిమినేషన్ చూపించలేదు. అయితే హౌస్ లో శనివారమే గ్రాంఢ్ ఫినాలే షూట్ మొదలైందని ఆరుగురిలో నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది. ఇందులో ఓటింగ్ ప్రకారం పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ టాప్-3 లో ఉండగా.. అంబటి అర్జున్, యావర్, ప్రియాంక బాటమ్-3 లో ఉన్నారు. అయితే వీరిలో అందరికంటే లీస్ట్ లో ఉన్న అంబటి అర్జున్ ఆరవ స్థానంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఇక ప్రియాంక జైన్ ఐదవ స్థానంలో ఎలిమినేట్ అయిందని బయట టాక్ వినిపిస్తుంది. హీరో రవితేజ.. ఈగల్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చాడు. అయితే ప్రియాంక జైన్‌ ఎలిమినేషన్ ప్రక్రియని రవితేజకి ఇచ్చాడు నాగార్జున. హౌస్‌ లో నుంచి ప్రియాంకని ఎలిమినేట్ చేసి స్టేజ్ మీదికి రవితేజ తీసుకొచ్చాడంట. ఇక అయిదవ స్థానంలో ఎలిమినేట్ అయిన ప్రియాంక జైన్‌కి రూ.10 లక్షల సూట్ కేస్ ఆఫర్ చేశారు బిగ్ బాస్. అయితే ఆ సూట్ కేస్ ఆఫర్‌ని తిరస్కరించిన ప్రియాంక.. ఐదవ స్థానంలో ఎలిమినేట్ అయ్యింది. ఈ పదిహేను వారాల జర్నీలో ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లు కలిసి గ్రూప్ గా ఉండి ఆడటం వల్ల వీరికి సీరియల్ బ్యాచ్ అని ముద్రపడింది. దాంతో వీళ్ళు ముగ్గురు ఏం చేసినా ఆడియన్స్ లో ఒక నెగెటివ్ ఇంపాక్ట్ పడింది. కిచెన్ లో ఎక్కువ సేపు గడపటం వల్ల ప్రియాంకకి పెద్దగా స్క్రీన్ స్పేస్ లభించలేదనేది వాస్తవం. సీరియల్ బ్యాచ్‌లో ఉండటం.. దానికి తోడు శివాజీ గారి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం ప్రియాంకకి పెద్ద మైనస్ అయ్యింది. ఇక నామినేషన్స్‌లో భోలే షావలితో థూ.. ఛీ అంటూ దారుణంగా ప్రవర్తించడం కూడా ప్రియాంకపై నెగెటివ్ ఇంపాక్ట్ మరింత పెరిగింది. శోభాశెట్టిపై దారుణంగా నెగెటివిటి ఉండటం వల్ల ప్రియాంక లాస్ట్ వీక్ వరకు ఉంది కానీ లేదంటే గతవారమే బయటకు వచ్చేసేది.  కాగా ఇప్పటి వరకూ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అయ్యింది లేదు.

Ambati Arjun Eliminated: అంబటి అర్జున్ ఎలిమినేటెడ్!

బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ ఫినాలేకి అడుగుదూరంలో ఉంది. హౌస్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అమర్ దీప్,  యావర్, అంబటి అర్జున్ ఫైనలిస్ట్ లుగా ఉన్నారు. అయితే శుక్రవారం హౌస్ లోకి శ్రీముఖి వచ్చి, హౌస్ మేట్స్ తో కలిసి ఆడింది. బిగ్ బాస్ సూట్ కేస్ ఆఫర్ చేసిందంతా శనివారం నాటి ఎపిసోడ్ లో టీవీలో ప్రసారం చేసాడు బిగ్ బాస్. ఇక గ్రాంఢ్ ఫినాలే షూట్ హౌస్ లో శనివారమే మొదలైంది. ఇందులో కొన్ని షాకింగ్ ఎలిమినేషన్లు జరిగినట్టుగా తెలుస్తుంది. సీజన్-7 లో 2.0 గా గ్రాంఢ్ వెల్ కమ్ ఇచ్చిన అయిదుగురు కంటెస్టెంట్స్.. నయని పావని, పూజామూర్తి, అశ్వినిశ్రీ, భోలే షావలి, అంబటి అర్జున్. అయితే వీరిలో నుండి వచ్చిన మొదటివారమే నయని పావని ఎలిమినేషన్ అవ్వగా ఆ తర్వాత వారం పూజామూర్తి ఎలిమినేషన్ అయింది. ఇక ఆ తర్వాత అశ్వినిశ్రీ, భోలే షావలి ఎలిమినేషన్ అవ్వగా.. అంబటి అర్జున్ ఒక్కడే గ్రాంఢ్ ఫినాలే వీక్ వరకు ఉన్నాడు. ఇక హౌస్ లో పవరస్త్ర కోసం జరిగిన టాస్క్ లలో అదరగొట్టి మొదటి ఫైనలిస్ట్ గా అంబటి అర్జున్  నిలిచిన విషయం తెలిసిందే. ఇలా అంబటి అర్జున్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికి తెలిసేసరికే ఆట ముగిసింది. కారణం.. ఐదో వారంలో అర్జున్ వెళ్లడమే మైనస్ అయ్యింది. అదే ముందు నుంచి వెళ్లి ఉంటే అతని ఓటింగ్ గ్రాఫ్ మరో రేంజ్‌లో ఉండేది. ఇక ఫినాలే అస్త్ర గెలుచుకోవడం ద్వారా అతను ఫైనలిస్ట్‌గా నిలిచాడు కాబట్టి హౌస్‌లో ఉన్నాడు కానీ.. లేదంటే అర్జున్ కే లీస్ట్ ఓటింగ్ వచ్చిందని స్వయంగా నాగార్జునే చెప్పడం కూడా అర్జున్‌కి మైనస్ అయ్యింది. నిన్న అనగా శనివారం ఉదయం హౌస్ లో గ్రాంఢ్ ఫినాలే షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ఆరుగురు హౌస్ మేట్స్ లలో ఎవరైతే బాటమ్-3 లో ఉన్నారో వారిని ఎలిమినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొదటి ఎలిమినేషన్ గా.. ఓటింగ్ ప్రకారం లీస్ట్ లో ఉన్న అంబటి అర్జున్‌ ఎలిమినేట్ అయ్యాడు. టికెట్ టు ఫినాలే గెలిచి అర్జున్ మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి అతను హౌస్ లో చివరి వరకు ఉన్నాడు కానీ గత వారమే ఎలిమినేట్ అవ్వాల్సింది ఎందుకంటే అతనికి ప్రేక్షకుల ఓటింగ్ పెద్దగా ఏమీ లేదు. ఇక ఇప్పటి వరకు ఏ సీజన్ లోను టికెట్ టు ఫినాలే గెలిచిన వారికి టైటిల్ లభించలేదనది వాస్తవం. టాప్-6 నుండి ఆరవ స్థానంలో అంబటి అర్జున్ ఎలిమినేషన్ అయ్యాడని తెలుస్తుంది.

అమర్ దీప్ ఎలిమినేటెడ్.. ఉల్టా పుల్టా ట్విస్ట్ మామూలుగా లేదుగా!

ఇదేందయ్యా ఇది‌‌.. గ్రాంఢ్ ఫినాలే పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ల మధ్య అని అన్నారు.‌ అప్పుడే అమర్ దీప్ ఎలిమినేషన్ ఏంటి?..  ఇలా  సీజన్-7  మొత్తం ఉల్టా పుల్టా ట్విస్ట్ లతో అదరగొడుతున్నాడు బిగ్ బాస్. ఇక గ్రాంఢ్ పినాలేలో నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో హౌస్ లోకి శ్రీముఖి వచ్చింది. హౌస్ మేట్స్ తో అంత్యాక్షరీ అంటు పాటలు పాడిస్తూ డ్యాన్స్ లు చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేత ఒక ఫన్ టాస్క్ ఆడించాడు. కళ్ళకి గంతలు కట్టుకుని, తలకి హెల్మెట్ పెట్టుకొని కుర్చీలో కూర్చోవాలన్నాడు. అలా కూర్చొన్న కంటెస్టెంట్ ని డూప్లికేట్ కర్రలతో మిగిలిన కంటెస్టెంట్ కొట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. అలా అమర్ దీప్ ని హౌస్ మేట్స్ అంతా ఒక ఆట ఆడుకున్నారు.‌ కాసేపటిక యావర్ కోసం  ఫుడ్ పంపించారు బిగ్ బాస్. ఇక  హోమ్ ఫుడ్ రాని ప్రియాంకకి కూడా ఇంటి భోజనం పంపించాడు బిగ్ బాస్. ఇక హౌస్ లో సూట్ కేసుల లావాదేవీలు జరిపాడు బిగ్ బాస్. మూడు లక్షలు, ఎనిమిది లక్షల సూట్ కేసులు కావాలా అని బిగ్ బాస్  పంపించాడు. అయితే హౌస్ లోని  ఏ కంటెస్టెంట్ ఆ సూట్ కేసులు తీసుకోలేదు. ఇక హౌస్ లో ఉన్నవారిలో ప్రియాంక, అర్జున్ ఎలిమినేట్‌ అయ్యారని తెలుస్తుంది. మరోవైపు నాల్గవ స్థానంలో ప్రిన్స్ యావర్ పదిహేను లక్షల సూట్ కేస్ తీసుకొని ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది.‌ అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్ ముగ్గురు టాప్-3 లో ఉండగా.. అమర్ దీప్ ఎలిమినేట్ అయి బయటకొచ్చాడని.. పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య గ్రాంఢ్ ఫినాలే రేస్ జరుగుబోతుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. అయితే పల్లవి ప్రశాంత్ విన్నరా లేక శివాజీ విన్నరా? అని ఫినాలేలో తెలుస్తుంది. అయితే అమర్ దీప్ ఎలిమినేట్ అవ్వడంతో తన సీరియల్ అభిమానులు తెగ ఫీల్ అవుతూ, బాధతో పోస్ట్ లు చేస్తున్నారు.

కమల్ హాసన్ మూవీకి నాని కొడుకు మ్యూజిక్...

"ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం" షో ఫస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఈ షోకి నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. ఇక మంచు మనోజ్ నానిని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేసాడు. " నీ రియల్ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు..నువ్వు యాక్టర్ కి కాకుండా డైరెక్టర్ వి ఐతే ఎవరితో మూవీ చేస్తావ్..వాళ్లకు ఎం టైటిల్ పెడతావ్" అంటూ కొన్ని ప్రశ్నలు అడిగేసరికి   "నా కొడుకు జున్ను ఆ తర్వాత ఈ ప్రేక్షకులు" అని చెప్పాడు నాని. " ఇప్పుడు వాడికి ఆరున్నరేళ్ల.. మొన్నటి వరకు వాడికి సినిమా అంటే ఏమిటి..నాన్న యాక్టర్ ఆ..ఈ లాజిక్ లన్నీ అర్దమయ్యేవి కావు. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తున్నాయి..ఇప్పుడు వాడికి పియానో అంటే చాలా ఇష్టం. అది నేర్చుకుంటున్నాడు. పెద్దవాడయ్యాక మ్యూజిక్ చేస్తాడట.. నా సినిమాకు సంగీతం అందిస్తాడట.. సెకండ్ సినిమా ఎవరికీ మ్యూజిక్ చేస్తాడో కూడా చెప్పాడు. కమల్ హాసన్ మూవీకి మ్యూజిక్ చేస్తాడట... నువ్వు నాకు ఫేవరేట్ నాన్న అందుకే నీకు ఫస్ట్ సినిమాకి చేస్తా ..నీ ఫేవరేట్ కమల్ హాసన్ గారు కదా అందుకే ఆయనకు సెకండ్ ఫిలింకి చేస్తా..ఒక వేళా నేను యాక్టర్ కాకపోయి డైరెక్టర్ అయ్యి ఉంటె నేను కమల్ హాసన్ గారితో మూవీ చేసేవాడిని. ఇక టైటిల్ విషయానికి వస్తే ఉస్తాద్ అని పెడతాను..తర్వాత ఈ షోకి నాని ఫ్యాన్ గా పేరు తెచ్చుకున్న శ్రీ ప్రియాని షోకి ఇన్వైట్ చేసి గేమ్ ఆడించాడు మంచు మనోజ్. శ్రీప్రియ స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టి షెల్టర్ ఇస్తుంది. అలాగే నానికి వీరాభిమాని. ఆమె ఏవి ప్లే చేసి చూపించి ఆమెను స్టేజి మీదకు పిలిచాడు. ఇక శ్రీప్రియ కూడా నానికి ఎంతో ఇష్టమైన టమాటో రైస్ చేసి తీసుకొచ్చి మరీ తినిపించింది.  

Brahmamudi:నువ్వు శివయ్య.. నేను గౌరమ్మ.. తను గంగ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -280 లో... రాహుల్, రుద్రాణి లు ప్లాన్ చేసి అరుణ్ ని గుడికి రప్పిస్తారు. " ఒక స్వప్నకి మాత్రమే కన్పించాలి అప్పుడు స్వప్న నీ వెనకాలే వస్తుంది. నువ్వు అక్కడ నుండి వెళ్లిపోవాలి " అని రాహుల్ అరుణ్ కీ చెప్తాడు. మరొక వైపు కావ్య గుడి చుట్టు నూట ఎనమిది ప్రదక్షిణలు చేస్తుంటుంది. రాజ్ లెక్కిస్తూ ఉంటాడు. మరొకవైపు గుడిలో కాయిన్స్ నిలపేడితే అనుకున్నవన్ని జరుగుతాయన్న ఆశతో అనామిక, స్వప్న, కనకం లు కాయిన్ నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. స్వప్నకి అరుణ్ కనిపించేలా నిల్చొని హయ్ చెప్తాడు.. వీడేంటి ఇక్కడ ఉన్నాడని స్వప్న కోపంగా అక్కడ నుండి అరుణ్ వెంట వెళ్తుంది. అప్పుడే కనకం పెడుతున్న  కాయిన్ కిందపడిపోతుంది. కనకం డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత అనామిక కాయిన్ నిలబెడుతుంది దాన్ని ఎవరు చూడకముందు కనకం కిందపడేస్తుంది. అనామిక డిస్సపాయింట్ గా వెళ్లిపోతుంది. మరొకవైపు అరుణ్ వెనకాలే స్వప్న వెళ్తుంటుంది. మరొకవైపు కావ్య ప్రదక్షిణలు చేస్తు.. కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఆ తర్వాత రాజ్ ఎత్తుకొని కావ్య చేత ప్రదక్షిణలు చేపిస్తాడు. అది చూసిన ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు.. కళ్ళు తిరిగి కిందపడిపోయింది అందుకే ఇలా చేశానని రాజ్ చెప్తాడు. మంచి పని చేసావంటు ఇందిరాదేవి అంటుంది. అందరూ స్వప్న ఎక్కడ కన్పించడం లేదని అనుకుంటారు. ఆ తర్వాత అరుణ్ కోసం స్వప్న వెతికే పనిలో అమ్మవారి ముందు ఉన్న శూలంపై పడిపోబోతుంటే అపర్ణ వచ్చి కాపాడుతుంది. ఆ తర్వాత అపర్ణకి స్వప్న థాంక్స్ చెప్తుంది. ఎందుకు ఒక్కదానివే ఇక్కడ ఉన్నావని అడుగగా ఆ అరుణ్ వచ్చాడు వాన్ని నాలుగు ఉతికి మీకు నిజం చెప్పించాలని అనుకున్నానని స్వప్న అనగానే.. అలాంటివేం చేయకు టెస్ట్ చేద్దామని అనుకున్నామని కదా అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ప్లాన్ అంత ఫెయిల్ అయిందని రాహుల్ , రుద్రాణి లు డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత అందరు కలిసి దేవుడికి పూజ చేయిస్తారు. అందరు కళ్ళు మూసుకుని దేవుడికి మొక్కుతుంటే అప్పుడే శ్వేతా చాటుగా రాజ్ దగ్గరికి వస్తుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని రాజ్ కంగారు పడతాడు. తనేనా నీ భార్య.. నువ్వు శివయ్య.. నేను గౌరమ్మ తను గంగా అని శ్వేత అంటుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని తనని రాజ్ పంపిస్తాడు. కావ్య వెంటనే కళ్ళు తెరిచి ఎవరితోనో మాట్లాడుతున్నారని రాజ్ తో అనగానే.. లేదు మొక్కుకుంటున్న అని రాజ్ అంటాడు. ఆ తర్వాత అందరు కోనేటిలో దీపాలు వదులుతుంటారు. అప్పుతో కళ్యాణ్ మాట్లాడుతుంటే.. అనామిక వాళ్ళ అమ్మ చూసి అనామికకి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారని చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu:కొడుకు జాడ చెప్పమంటు షూట్ చేసిన ఆ తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -947 లో.. అనుపమ ఎక్కడికో వెళ్తు ఒంటరిగా ఉన్న మహేంద్రని చూసి ఆగి మాట్లాడుతుంది. ఏమైంది ఇక్కడ ఉన్నావని మహేంద్రని అనుపమ అడుగుతుంది. ఏం లేదు. శైలేంద్ర వల్లే ఇదంతా అని తెలిసి కూడా ఏం చెయ్యలేకపోతున్నానని మహేంద్ర బాధపడుతుంటే.. రిషికి ఏం కాదంటు అనుపమ మహేంద్రకి చెప్తుంది. ఆ తర్వాత నువ్వు నాకొక మాట ఇస్తావా అని అనుపమతో మహేంద్ర అంటాడు. ఏంటి అదని అనుపమ అడుగుతుంది. వసుధార బాధ్యతలు నువ్వు తీసుకుంటావా అని మహేంద్ర అనగానే.. మామయ్యవి నువ్వు ఉండగా నేను తీసుకోవడమేంటని అనుపమ డౌట్ గా అడుగుతుంది. ఏం లేదని మహేంద్ర అంటూ నేను ఏదైనా కరెక్ట్ చేస్తాను కదా.. నేను ఏం చేసిన నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని మహేంద్ర అంటాడు. చేస్తాను కానీ నువ్వు ఇప్పుడేం చెయ్యాబోతున్నావని అనుపమ అడుగుతుంది. కానీ మహేంద్ర ఏం చెప్పడు. ఆ తర్వాత అనుపమ వెళ్తుంటే వసుధార జాగ్రత్త అని చెప్తాడు. ఏంటి ఎందుకు చెప్తున్నావని అనుపమ మళ్ళీ అడుగుతుంది. ఏం లేదు నువ్వు వెళ్లి, నీ పని చూసుకో అని అనుపమని మహేంద్ర పంపిస్తాడు. మరొకవైపు కాబోయే ఎండీని నేనే ఇక నేను ఆడిందే అట.. పాడిందే పాట అని శైలేంద్ర సంబరపడిపోతుంటే అప్పుడే మహేంద్ర వచ్చి.. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతాడు. నాకు తెలియదంటూ శైలేంద్ర బయపడతాడు. ఆ తర్వాత మహేంద్ర రీవాల్వర్ తీసి షూట్ చేస్తానని అనగానే.. శైలేంద్ర భయంతో మమ్మీ అంటు అరుస్తుంటే దేవయాని, ధరణి వస్తారు. దేవాయని వద్దు మహేంద్ర అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ధరణి నువ్వు అయిన కాపాడు‌ అని శైలేంద్ర అనగానే.. మరి రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పండని ధరణి అంటుంది. ఇప్పుడు శైలేంద్రని షూట్ చేస్తే మహేంద్ర జైల్ కి వెళ్తాడని దేవయాని అనగానే.. అవును కదా అని ధరణి వెంటనే వసుధారకి ఫోన్ చేసి చెప్తుంది. ఆ తర్వాత మహేంద్రకి వసుధార ఫోన్ చేసి.. మామయ్య గొడవ జరుగుతుందని అనగానే శైలేంద్ర ని షూట్ చేస్తున్నానంటు చెప్పి‌ మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు.  దాంతో వసుధార ఎలాగైనా ఆపాలి అంటూ కంగారుగా బయలుదేరుతుంది. మరొకవైపు మహేంద్రని నెట్టి‌ శైలేంద్ర డోర్ తీసుకొని బయటకు వస్తాడు. అయిన మహేంద్ర వదలకుండా శైలేంద్ర వెనకాల వస్తాడు. ధరణి, దేవాయనిలని నెట్టి మరి శైలేంద్రని మహేంద్ర షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:గతం గుర్తుకురాగానే ఫుల్ ఫామ్ లోకి వచ్చిన మురారి.. నిజమేంటో నిరూపించగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -341 లో.. మురారికి గతం గుర్తుకు రావడం తట్టుకోలేని ముకుంద సూసైడ్ ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ , గౌతమ్ ఇద్దరు ముకుందకి ట్రీట్ మెంట్ చేస్తారు. ఆ తర్వాత కృష్ణ తప్పు చెయ్యలేదని మురారి నిరూపిస్తానని భవానికి ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత కృష్ణ అవుట్ హౌస్ లో ఉన్న కూడా ఈ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు పోవచ్చని మురారి చెప్తాడు.  మరొకవైపు కృష్ణ వెళ్తుంటే రేవతి పిలుస్తుంది. మురారికి ఎలా గతం గుర్తుకు వచ్చిందో కృష్ణ చెప్తుంది. నా దగ్గరికి వచ్చి నీ భర్త ఎవరని అడిగేవారు. దాంతో మీకు గతం గుర్తుకు వస్తే నా భర్త ఎవరో తెలుస్తుందని అనగానే.. తన గతం గుర్తుకు తెచ్చుకోనే ప్రయత్నం చేశారు. ఇక నేను కోనేటిలో పడగానే.. ఏసీపీ సర్ కి గతం గుర్తుకు వచ్చిందని రేవతికి కృష్ణ చెప్తుంది. మరొకవైపు శకుంతల కృష్ణ జీవితం బాగవుతున్నందుకు దేవుడికి మొక్కుకుంటుంది. ఆ తర్వాత అక్కడికి మురారి వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తాడు. తప్పు చేసిన వాళ్లని పట్టుకుంటానని వాళ్ళకి చెప్పగానే.. కృష్ణ శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత  కృష్ణపై‌ మురారి కోపంగా ఉంటాడు. అసలు ఇన్ని రోజులు నువ్వే నా భార్య అని ఎందుకు చెప్పలేదని‌ మురారి అడుగుతాడు. పెద్ద అత్తయ్య గారంటే ఇంట్లో ఎంత గౌరవం తెలుసు కదా అందుకే చెప్పలేదని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ జరిగింది మొత్తం మురారికి చెప్తుంది. అందులో తన తప్పేం లేదంటు మురారికి క్లారిటి ఇస్తుంది కృష్ణ.  ఆ తర్వాత కృష్ణ చెంపపై మురారి ముద్దు పెడతాడు. మరొకవైపు భవాని తను తీసుకున్న నిర్ణయంపై ఆలోచనలో పడుతుంది. తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని తన అంతరాత్మ చెప్తుంది. మరొకవైపు ముకుంద నిద్రలో నుండి లేచి కృష్ణని చూసి కోపంగా ఎందుకు బతికించావని అనగానే.. నువ్వు ముందు టాబ్లెట్స్ వేసుకోనని కృష్ణ అంటుంది. తరువాయి భాగంలో.. ఇక నేను డ్యూటీలో జాయిన్ అవుతానని భవాని దగ్గర మురారి ఆశీర్వాదం తీసుకొని.. కృష్ణ వాళ్ళ చిన్నాన్న ఏ తప్పు చెయ్యలేదని నిరూపించాలి. అందుకే వాళ్ళ చిన్నన్నని ఆ తర్వాత హాస్పిటల్ లో డాక్టర్ ని కలవాలని అనగానే.. ఎక్కడ తన అన్నయ్య గురించి బయట పడుతుందోనని ముకుంద టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.