కరవద్దంటే పాముకి కోపం... కరవమంటే కప్పకి కోపం మధ్యలో అమర్ దీప్!

బిగ్ బాస్ సీజన్-7 లో ది మోస్ట్     వరెస్ట్ కంటెస్టెంట్ ‌ఎవరంటే శోభాశెట్టి అని అందరు చెప్తుంటారు. బిగ్ బాస్ సీజన్-7 తుదిదశకు చేరుకోవడంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం శివాజీ, ప్రియాంక, శోభాశెట్టి, అమర్ దీప్, యావర్, ప్రశాంత్, అర్జున్ హౌస్ లో ఉన్నారు. కాగా ఓట్ అప్పీల్ కోసం గత వారం రోజులుగా టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో వండర్ ఉమెన్ గా రెడీ చేయాలని రెండు టీమ్ లకి  చెప్పాడు. శోభా శెట్టిని యావర్-అర్జున్ కలిసి రెడీ చేశారు. ఇక ప్రియాంకను శివాజీ-ప్రశాంత్‌లు ముస్తాబు చేశారు. దీనికి అమరం సంచాలక్‌గా వ్యవహరించాడు. ఇక రెడీ అయిన ఇద్దరూ బాగానే స్టిల్స్ ఇచ్చారు. ఇద్దరూ సమానమే కానీ వండర్ ఉమెన్‌గా ప్రియాంకను డిక్లర్ చేస్తున్నానని అమర్ అనౌన్స్ చేయగానే శోభాశెట్టి ముఖం మాడిపోయింది. అయిన శోభా థండర్ ఉమెన్‌ కానీ వండర్ ఉమెన్ కాదుగా అనుకున్నాడో ఏమో కానీ అమర్ దీప్ మాత్రం ప్రియాంకకే ఓటు వేశాడు. ఇక  టాస్క్ ముగిసాక.. " ఇది నేను ఊహించిందే" అంటూ అర్జున్‌తో శోభా అంది. అలా శోభాశెట్టి అన్నది విన్న అమర్ దీప్ ఫైర్ అయ్యాడు. ఫన్ టాస్క్ ఫన్‌గా తీసుకో పిచ్చిదానా అని అనగా.. పిచ్చి గిచ్చి అనకు అమర్.. ఏం మాట్లాడుతున్నావ్? ఊహించినవాళ్లకే ఇచ్చినప్పుడు అలానే వస్తాయ్ మాటలు అంటూ శోభా పొగరు చూపించింది. అమర్ దీప్ కోపంగా లోపలికి వెళ్లి.. మనకి మనకి మధ్య యునిటీ లేకపోతే ఎలా శోభా.. కాసేపు ప్రశాంతంగా ఉండవే.. ప్రతి చిన్న విషయానికి కొట్లాడి చస్తావ్ అంటూ ఫ్రస్ట్రేషన్‌తో పక్కకి పోయాడు. తర్వాత కెమెరా దగ్గరికెళ్లి వండర్ ఉమెన్స్ కాదు నాకు సెవన్ వండర్స్ కనిపించాయంటూ కెమెరాలకు చెప్పుకున్నాడు అమర్ దీప్. అయితే అక్కడే ఉన్న అర్జున్ వెంటనే కెమెరా దగ్గరికెళ్లి.. "బిగ్‌బాస్ నాకు ఒక సామెత గుర్తొచ్చింది. కరవద్దంటే పాముకి కోపం, కరవమంటే కప్పకి కోపం అన్నట్టు మధ్యలో వీడు ఉండిపోయాడు" అని అమర్ ని ఉద్దేశించి అర్జున్ చెప్పాడు. దీంతో ఏమనాలో తెలిక అమర్ అలా నవ్వుకుంటూ లోపలికి పోయాడు. కానీ శోభా దెబ్బకి మాత్రం అమర్‌కి చుక్కలు కనిపించాయనేది వాస్తవం.  

Brahmamudi:ప్రేమకి, పెళ్ళికి మధ్య ఆ జంట చేసిన పూజ ఫలిస్తుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -274 లో.. అనామిక జాతకంలో దోషం ఉందని పంతులు గారు చెప్పడం, దానికి తోడు కనకం జాతకాలు కలవకుంటే మంచి జరగదని చెప్పడంతో, అన్ని మనసులో పెట్టుకొని భోజనం చెయ్యకుండా ధాన్యలక్ష్మి అలోచిస్తుంటుంది. ఏంటి భోజనం చెయ్యకుండా అలోచిస్తున్నావని ఇంట్లో వాళ్ళంతా ధాన్యలక్ష్మిని అడుగుతారు. జాతకాలు కలవనప్పుడు పెళ్లి ఆపేయడమే బెటర్ అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత భోజనం దగ్గర నుండి కళ్యాణ్ వెళ్ళిపోబోతుంటే రాజ్, కావ్య ఇద్దరు తనని అపి మా జాతకాలు చూసి పెళ్లి చేసారా? మేం ఎంత హ్యాపీగా ఉన్నాం..  మీ అన్నయ్య హనీమూన్ కి కూడా ప్లాన్ చేసాడని కావ్య చెప్తుంటే రాజ్ ఆశ్చర్యంగా చూస్తాడు. అలా అందరూ కళ్యాణ్ లో దిగులు పోగొట్టేలా మాట్లాడుతారు. పూజ చేస్తే దోషం పోతుందని చెప్పారు కదా అది చేద్దామని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రాజ్ కోపంగా కావ్య దగ్గరకి వెళ్లి అందరి ముందు హనీమూన్ ప్లాన్ చేశానని ఎందుకు అబద్ధం చెప్పావని అడుగుతాడు. ఇక కావ్య వెటకారంగా మాట్లాడేసరికి రాజ్ కి చిరాకు వేస్తుంది. మరొక వైపు స్వప్న పూజకి రెడీ అవుతుంటే కనకం వచ్చి.. నువ్వు పూజ దగ్గరికి వద్దు ఇక్కడే రెస్ట్ తీసుకోమని చెప్తుంది. ఆ తర్వాత అప్పు నిమ్మ మొక్కలు తీసుకోని వస్తుంది. ఒక్కటే అవసరం కదా నువ్వు ఎందుకు మూడు తీసుకొని రమ్మన్నావని అప్పు అడుగుతుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి అవును ఒక్కటే అవసరం కదా? ఎందుకు అన్ని తీసుకోని రమ్మన్నారని అడుగుతాడు. కనకం ముందు జాగ్రత్త కోసం అని కవర్ చేస్తుంటుంది. ఆ తర్వాత అప్పు వెళ్తానంటే ఇక్కడే ఉండు అంటు కళ్యాణ్ తన భుజాలపై చెయ్యి వేసుకొని తీసుకుని వెళ్తాడు. అది చూసి కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తుంటుంది అప్పు.  కాసేపటికి అనామిక, కళ్యాణ్ ఇద్దరు కలిసి పూజ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి నిమ్మ మొక్కని నాటుతారు. ఈ మొక్క ప్రొద్దున వరకు బాగుంటే దోషం పోయినట్టే వాడిపోతే జాతకాలు కలవనట్టేనని పంతులు గారు చెప్తారు. మన ప్రేమ నిజం అయితే మనం అనుకున్నది జరుగుతుందని కళ్యాణ్ అంటాడు. అలా అందరూ దోషం పోయి మొక్క పచ్చగా ఉండాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Guppedantha Manasu:గుప్పెడంత మనసులో కీలక మలుపు.. అనుపమ 2.0 మొదలైందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -950 లో.. మహేంద్ర దగ్గరికి అనుపమ వచ్చి.. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంటి ఈ ఎటాక్ లు?  కన్పించకుండా పోవడమేంటని అనుపమ అనగానే.. శైలేంద్ర వల్లే ఇదంతా అని అనుపమకి చెప్తే ఇప్పుడే వెళ్లి నిలదీస్తుంది.. చెప్పకపోవడం బెటర్ అని  మహేంద్ర సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరకి ముకుల్ వస్తాడు. అసలు రిషి ఎప్పటినుండి కన్పించకుండా పోయాడని అడిగి తెలుసుకుంటాడు.  నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని ముకుల్ అడుగుతాడు. వర్క్ మీద బయటకు వెళ్లి వస్తాడని అనుకున్నామని మహేంద్ర అంటాడు. అన్నింటికీ లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. శైలేంద్ర మీద అనుమానం రాగానే అతనిపై ఎటాక్ జరిగిందని ముకుల్ అనగానే.. శైలేంద్రపై అనుమానమేంటని అనుపమ అడుగుతుంది. జగతి మేడమ్ కేసు లో అతనే ప్రధాన నిందితుడని అనుమానం ఉందని ముకుల్ అనగానే అనుపమ షాక్ అవుతుంది. మీరు శైలేంద్ర కండిషన్ ఎలా ఉందో చెప్పండి అనగానే.. చెప్తాను ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తున్నానని మహేంద్ర చెప్తాడు. మరొకవైపు రిషి కోసం వసుధార వెతుక్కుంటూ తిరుగుతుంది. మరొకవైపు అనుపమ, మహేంద్ర ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. హాస్పిటల్ కి వెళ్లగానే.. శైలేంద్ర ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడంటు దేవయానిని అనుపమ అడుగుతుంది. అదేంటి ఎలా ఉన్నాడని? ఏంటి అని ఏం అడగవా డైరెక్ట్ అలా అడుగుతున్నావని దేవాయని అంటుంది. నేను అడిగితే ఏంటి ఆడగకపోతే ఏంటని అనుపమ పొగరుగా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ వచ్చి శైలేంద్రని  మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తామని చెప్తాడు. కాసేపటి తర్వాత మహేంద్రకి వసుధార కాల్ చేస్తుంది. రిషి సర్ ఎక్కడ ఉన్నాడోనని, ఎవరిని అడిగిన తెలియదని అంటున్నారని వసుధార చెప్తుంది. ఆ తర్వాత శైలేంద్ర డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తున్నాడు. నువ్వు డైరెక్ట్ ఇంటికి రా అని మహేంద్ర చెప్తాడు. కాసేపటికి శైలేంద్ర డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. అప్పుడే వసుధార కూడా ఇంటికి వస్తుంది. కావాలనే వసుధారని దిష్టి తియ్యమని దేవయాని చెప్తుంది. ఆ తర్వాత దేవాయనితో వసుధార మాట్లాడుతుంది. ముకుల్ వస్తున్నాడు. ఇక మీ తప్పులు బయటపడతాయంటు దేవయానికి వార్నింగ్ ఇస్తుంది వసుధార. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

గౌరవనీయులైన వెధవలకు..అంటూ నెటిజన్స్ పై విజయ్ కార్తీక్ ఫైర్

అమర్ దీప్ ఫాన్స్ కి కీర్తి భట్ కి మధ్య సోషల్ మీడియా వార్ ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు. కీర్తి భట్ ఒక వీడియోలో నెటిజన్స్ కి ఘాటు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమెను పెళ్లి  చేసుకోబోయే విజయ్ కార్తీక్ కూడా రంగంలోకి దిగాడు. "గౌరవనీయులైన వెధవలు, సన్నాసులు, పోరంబోకులు" అని సంబోధిస్తూ తిట్లు మొదలుపెట్టాడు.   "కీర్తి ఎవరిని సపోర్ట్ చేస్తే మీకేంట్రా, అడగడానికి మీరెవర్రా..నువ్వెందుకు కీర్తికి పర్సనల్ గా మెసేజ్ పెడుతున్నావ్..చెత్త వెధవ ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వలేని వాడు మనిషి కాదు..బిగ్ బాస్ లో కీర్తి సపోర్ట్ చేయగానే వాళ్ళు విన్ ఐపోతారా..యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ చూసేసి కంటెంట్ ఏంటో వినకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటమేమిటి.. ఒకమ్మాయికి నువ్వు చెత్త కామెంట్స్ పెడుతున్నావంటే నీ తల్లిని తిడుతున్నట్టు..నీ తల్లితో నువ్వు ఇలాగే మాట్లాడతావా..ఎదవా, సన్నాసి, అడ్డగాడిద..ప్రత్యేకంగా కామెంట్స్ పెట్టిన వాళ్లకు చెప్తున్నా...ఇలాంటి కామెంట్స్ నువ్వు పెట్టావు అంటే..సైబర్ క్రైమ్ కింద నీ సెల్ ని ట్రాక్ చేసి మూడు నెలలు జైల్లో పెడతారు. అవును తాను మేకప్ ఎంత వేసుకుంటే నీకేంటి..మీ నాన్న మేకప్ కిట్ కొన్నాడా లేదా నువ్వేమన్నా కొనిచ్చావా...గేమ్ ని గేమ్ లా చూడండి. రేపొద్దున్న హౌస్ నుంచి బయటకి వచ్చాక అమరదీప్, శోభా, ప్రియాంక కలిసి తిరుగుతారు. జాగ్రత్తగా లేకపొతే ఇలాంటి కామెంట్స్ పెట్టి అకౌంట్ డిలీట్ చేసిన సైబర్ క్రైమ్ వాళ్ళు నీ డేటా మొత్తం లాగుతారు. రేపు నువ్వే సోషల్ మీడియాలో ఒక టాపిక్ అవుతావు గుర్తు పెట్టుకో. లాస్ట్ సీజన్ లో కీర్తికి మహేష్, మానస్ తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదు. కీర్తికి ఫామిలీ లేదు కాబట్టి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు పిలిచారు కాబట్టే ప్రియాంక వాళ్ళు వచ్చారు..అమ్మాయిల ప్రైవేట్ పార్ట్శ్ గురించి మాట్లాడుతున్నావ్...నువ్వోచ్చింది నువ్వోచ్చింది అక్కడి నుంచే..ఈ ప్రపంచాన్ని చూసింది కూడా అక్కడి నుంచే  అని గుర్తుపెట్టుకో  అంటూ చెత్త వెధవలు ఘాటు వార్నింగ్ ఇచ్చాడు.  

Krishna Mukunda Murari:‌కృష్ణ భర్త ఎవరో మురారి కనిపెట్టగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -335 లో.. మురారితో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి జరిగేలా చూడమని ముకుంద దేవుళ్ళకి మొక్కుకుంటుంది. అప్పుడే అక్కడికి సుమలత వచ్చి.. నీకు నచ్చిన మురారిని పెళ్లి చేసుకుంటున్నావ్  కదా ఇంకా టెన్షన్ ఎందుకని అంటుంది. ఎలా అంటున్నావని ముకుంద అనగానే.. భవాని అక్క నిర్ణయం కాబట్టి ఎట్టి పరిస్థితిలో అయిన పెళ్లి జరుగుతుందని సుమలత చెప్తుంది.   మరొకవైపు మురారి, కృష్ణతో గడిపిమ క్షణాలు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. కృష్ణ భర్త ఎవరో తెలుసుకోవాలని మురారి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు. కృష్ణ భర్త గురించి గౌతమ్ ని అడగాలని మురారి అనుకుంటాడు. కానీ అతను ఎప్పుడో ఒకసారి వస్తాడు. అతనికి ఏం తెలుసని అడగకుండా సైలెంట్ గా ఉంటాడు మురారి. అప్పుడే మధు వచ్చి.. టీ తాగడానికి బయటకు వెళదాం వస్తావా అని అడుగుతాడు. బయటకు వెళ్లి మధుని కృష్ణ భర్త గురించి కనుక్కోవాలని భావించి.. వస్తానని మురారి అంటాడు. మరొకవైపు కృష్ణ తన పెళ్లి ఫోటోని ఇంట్లో అంత వెతుకుతుంది అయిన ఎక్కడ కన్పించదు మరొకవైపు కృష్ణ గురించి రేవతి ఆలోచిస్తు ఉంటుంది. అసలు ఏంటి కృష్ణ ఇంత జరుగుతున్నా, ఏం పట్టనట్టు ఉంది. అదే ఇంకెవరైన అయితే వేరేలా ఉండేవారు ఇది ఏకంగా ఇక్కడికి వచ్చి పనులు చేస్తుందంటూ రేవతి మనసులో అనుకుంటుంది. అప్పుడే నందు వచ్చి అమ్మా.. కృష్ణకి పెళ్లి అయిందని చెప్పింది కదా? ఇక కృష్ణతో మురారి క్లోజ్ గా ఉండడని రేవతికి నందు చెప్తుంది. మరొక వైపు నందు, మురారి బయటకు వస్తారు. మురారి నిన్ను ఒకటి అడగాలని మధు తో అనగానే.. ఇప్పుడు మురారి ఏది అడిగిన నిజం చెప్పేయాలని అనుకుంటాడుమ. కృష్ణ భర్త ఎవరు నువ్వు చూసావా అని అడుగుతాడు. చూసాను అంటాడు. అప్పుడే ముకుంద ఫోన్ చేసి మురారికి ఎలాంటి విషయాలు చెప్పకంటూ వార్నింగ్ ఇస్తుంది..ఆ తర్వాత మురారితో ముకుంద మాట్లాడతుంది. ఎప్పుడు కృష్ణ గురుంచే మురారి అడిగేసరికి ముకుందకి కోపం వచ్చి అనవసరం అయిన విషయాలేం పట్టించుకోకని చెప్తుంది.  కృష్ణ భర్త గురించి మధు తెలుసని అన్నాడు.  ముకుంద నుండి కాల్ రాగానే టెన్షన్ పడ్డాడు. ఎందుకు ఏదైన లింక్ ఉందా అని మురారి అనుకుంటాడు. అప్పుడే మధు వస్తాడు. మళ్ళీ కృష్ణ భర్త ఎవరని అడుగుతాడు మురారి. అప్పుడే మధుని ప్రసాద్ పిలుస్తాడు.  తరువాయి భాగంలో.. ఇంట్లో అందరిని కృష్ణ భర్త ఎవరని మురారి అడుగుతాడు. నువ్వే వెళ్లి డైరెక్ట్ గా కృష్ణని అడుగు అని మధు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అమర్ దీప్ కి ప్రశాంత్ అంటే పగా? లేక చిన్న చూపా?

బిగ్ బాస్ సీజన్-7 లో ఆటలతో కంటెస్టెంట్స్ మధ్య దూరం పెరుగుతుంది. ఫన్ గేమ్ అంటు ఓ వైపు బిగ్ బాస్ చిచ్చుపెడుతుంటే.‌ కంటెస్టెంట్స్ గెలవాలన్న ధీమాతో ఒకరినొకరు తిట్టుకుంటు, వారి మధ్య దూరం పెంచుకుంటున్నారు. ఈ వారం మొత్తం ఫన్ టాస్క్ లు అంటు ఓట్ అప్పీల్ కోసం కంటెస్టెంట్స్ చేత కొత్త కొత్త గేమ్ లని ఆడిస్తున్న విషయం తెలిసిందే. అయితే అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ల మధ్య గొడవ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. కాగా టాస్క్ మధ్యలో శివాజీ, ప్రశాంత్ మాట్లాడుకుంటున్నారు. " ఎందుకన్న నా మీద అమర్ అన్నకి అంత పగ" అని శివాజీకి ప్రశాంత్ చెప్పుకుంటూ బాధపడ్డాడు.  అది పగ కాదురా భయం అంటూ శివాజీ కరెక్ట్‌గా చెప్పాడు. ఇక అమర్ అయితే ప్రశాంత్ గురించి శోభా, ప్రియాంకలకి తన వెర్షన్ చెప్పాడు. ఎదుటోడిని కన్ఫ్యూజ్ చేసి ఎలా టెంపర్‌మెంట్ లేపాలో వాడికి తెలిసినట్లుగా వేరే ఎవరికీ తెలీదంటూ అమర్ అన్నాడు. అమర్ దీప్ కి నెగెటివిటి రావడానికి ప్రధాన కారణం ప్రియాంక, శోభాశెట్టికి సపోర్ట్ చేయాలని భావించి మిగిలిన హౌస్ మేట్స్ తో గొడవలకి దిగడం ఒకటైతే‌‌.‌ హౌస్ లోకి వచ్చిన నుండి కామన్ మ్యాన్ అని ప్రశాంత్ మీద ఒకరకమైన చిన్న చూపు అని అందరికి తెలిసిపోతుంది. ఇక ప్రతీసారీ టాస్క్ లలో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి అరేయ్, ఒరేయ్ అంటాను నా ఇష్టం, ఇప్పుడు నేను కెప్టెన్  అని గర్వంగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూసే ప్రేక్షకులకు అమర్ దీప్ పై చిరాకేస్తుంటుంది. మరోవైపు శోభాశెట్టి చేసే పిచ్చి చేష్టలకి యావర్ట ట్రిగ్గర్ అవుతూ తన అగ్రెసివ్ ని బయటపెట్టుకుంటున్నాడు. దీంతో సీరియల్ బ్యాచ్ కి స్పై బ్యాచ్ కి మధ్య చిన్న గొడవలైన సీరియస్ గా మారుతున్నాయనే చెప్పాలి.  

అప్పుడే నాయనమ్మ...ఇంకా పెళ్లేకాలేదు

ఈమధ్య హోస్ట్స్ మీద కమెడియన్స్, కంటెస్టెంట్స్ వంటివాళ్ళు జోక్స్ వేయడం సర్వసాధారణం ఐపోయింది. ఇక ఇప్పుడు కూడా అలాగే జరిగింది. జబర్దస్త్ కామెడీ షో లేటెస్ట్ ప్రోమోలో అది తెలుస్తుంది. నూకరాజు ఈ వారం స్కిట్ లో "జవాన్" మూవీలోని హీరో షారుఖ్ ఖాన్ ని ఇమిటేట్ చేసాడు. "నా మీనమ్మ ఇక్కడే ఎక్కడో తప్పిపోయింది" అంటూ షారుఖ్ ఖాన్ వాయిస్ తో నూకరాజు డైలాగ్ చెప్పేసరికి "నేనే నీ మీనమ్మ" అంటూ హోస్ట్ సిరి హన్మంత్ డైలాగ్ చెప్పింది. "నేను నమ్మనమ్మా...నువ్వు నాయనమ్మ" అంటూ అంతటి అందాల సిరిని పట్టుకుని నాయనమ్మ అనేసరికి షాక్ అయ్యింది సిరి. ఈ డైలాగ్ కి కృష్ణ భగవాన్, ఇంద్రజ ఇద్దరూ పగలబడి నవ్వేశారు. సిరి హన్మంత్ ఈ "జవాన్" మూవీ షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక చిన్న రోల్ లో నటించింది. ఒక పోలీస్ గెటప్ లో కనిపించింది సిరి. ఇక నూకరాజు ఈ మధ్య వెరైటీ స్కిట్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు. దీనిపై నెటిజన్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. "నూకరాజు మంచి కాన్సెప్ట్స్ లో మంచి నటనతో అలరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఇదే బెస్ట్ స్కిట్" అంటూ కామెంట్స్ చేశారు. జబర్దస్త్ లో ఈమధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో ఫుల్ ఫేమస్ ఐన శ్రీదేవి అనే ఆమె ఈ మధ్య కెవ్వు కార్తీక్- పటాస్ ప్రవీణ్ టీమ్ లో చేస్తోంది...ఇక ఈ స్కిట్ లో శ్రీదేవి పెద్ద డైలాగ్ వేసేసింది "రెండో స్కిట్ కె వాడి కాలు, వీడి కాలు పట్టుకోవాల్సి వస్తోంది" అనేసరికి  ఇంద్రజ నవ్వేసింది.  

సంఛాలక్ గా శోభాశెట్టి ఫెయిల్.. నిలదీసిన శివాజీ!

  బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా సాగుతుంది. సీజన్-7 చివరి దశకి రావడంతో కంటెస్టెంట్స్ మధ్య ఆర్గుమెంట్స్ బీభత్సంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో ఓటు అప్పీల్ కోసం టాస్క్ లు‌ ఇస్తూ కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు‌ బిగ్ బాస్. హౌస్ లో ఉన్న వారిలో  మోస్ట్ అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ ఎవరైన ఉన్నారంటే  అది శోభాశెట్టి అని అందరికి తెలుసు. తను ఎలిమినేట్ అయితే చూడటానికి జనాలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో సంఛాలక్ గా శోభాశెట్టిని పెట్టాడు బిగ్ బాస్. బిగ్ బాస్‌కి తన దత్త పుత్రికపై ఎంత అభిమానమో.. ఎంత ప్రేమ, ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఆడియన్స్‌తో ఓట్లు వేయించుకుని, వాళ్ళని పిచ్చొళ్ళని చేస్తూ శోభాశెట్టిని సేవ్ చేస్తూ వస్తున్నాడు బిగ్ బాస్. చివరి వారాల్లో కూడా తన సీరియల్ బ్యాచ్‌ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇన్ని సీజన్లు జరిగాయి కానీ.. పబ్లిక్‌గా ఇంత ఏకపక్షంగా సపోర్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ ఏదైనా ఉందంటే అది సీజన్ 7 మాత్రమే. కనీసం చివరి వారాల్లో అయిన శోభాశెట్టి దత్త పద్దతి మార్చుకుంటుందా అంటే అదీ లేదు. మరింతగా రెచ్చిపోతు ప్రేక్షకులకి చిరాకు తెప్పిస్తుంది. ఈ సారి శివాజీని టార్గెట్ చేస్తూ శోభాశెట్టి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. దీంతో శివాజీ.. ఈ ఆట నేను ఆడను.. ఆమె సంచాలక్‌గా ఉండి.. మాటి మాటికీ ప్రియాంక ప్రియాంక అంటే.. ఏం పీకడానికి మేం ఉన్నది అంటూ బాల్స్‌ని విసిరికొట్టి గేమ్ నుంచి తప్పుకున్నాడు శివాజీ. దీంతో శోభాశెట్టి.. ‘అది నా ఇష్టం.. నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తా’ అని అన్నది. సంచాలక్‌గా ఉండి సపోర్ట్ చేయొచ్చా? అని శివాజీ అడిగితే.. ‘సంఛాలక్ అయిన శోభా అయిన నా ఇష్టం.. నేను ఎవరికైన సపోర్ట్ చేస్తా.. నేనేం బాల్స్ తెచ్చి ప్రియాంకకి ఇచ్చి కొట్టమనలేదు కదా.. ప్రియాంకకి సపోర్ట్ చేయాలని ఉంది చేశాను’ అని శోభాశెట్టి అంది. ఒక సంఛాలక్ అయి ఉండి టాస్క్ లో ప్లేయర్స్ తప్పు చేస్తే చెప్పేది పోయి వారికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ . దీనిపై వీకెండ్ లో శోభాశెట్టికి  నాగార్జున గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే ఇప్పటికే శోభాశెట్టి సంఛాలక్ గా ఉండి చాలా టాస్క్ లని ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు జెన్యున్ గా ఆడే ప్లేయర్స్ కి అడ్డుకట్టలా నిల్చొని ఆ ఇద్దరికే సపోర్ట్ చేసిన శోభాశెట్టి మరింత నెగెటివిటి మూట గట్టుకుంటుంది.  

శోభాశెట్టి ఎలిమినేటెడ్.. తన జర్నీ వీడియో కూడా రెడీ చేసారంట!

బిగ్ బాస్ సీజన్-7 లో ఒక్కో కంటెస్టెంట్స్ ఒక్కో‌ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ఉల్టా పుల్టాతో హౌస్ లో ప్రతీవారం ఒక్కో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ప్రస్తుతం ఓట్ అప్పీల్ కోసం హౌస్ మేట్స్ కి భిన్నమైన టాస్కు లు ఇస్తున్నాడు ‌బిగ్ బాస్. దీంతో స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ మధ్య వార్ సాగుతుంది. ఇక శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలంటూ గత కొన్నివారాలుగా ఆడియన్స్ తనకి అసలు ఓట్లే వేయకుండా లీస్ట్ లో ఉంచినా బిగ్ బాస్ సేవ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక శోభాశెట్టి ఎలిమినేషన్ కోసం ఎదురుచూసి,  చూసీ జనానికి చిరాకు వచ్చేసింది. ఎంత చిరాకు వచ్చిందంటే.. ఫినాలే వీక్‌లో మొత్తానికి ఓట్లు వేయడమే మానేస్తున్నారు. శోభాశెట్టి వరుస సేవింగ్‌లతో ఎలిమినేషన్, ఓటింగ్‌లపై జనానికి నమ్మకం పోయింది. మనం ఓట్లేసిన బిగ్ బాస్ వాటిని లెక్కలోకి తీసుకోడుగా, అలాంటప్పుడు ఓట్లేసి ప్రయోజనం ఏముందని ఫినాలే వీక్‌లో ఓట్లు వేయడానికి జనం ఇష్టపడటం లేదు. ప్రతి సీజన్‌లో అయితే.. పోటీ పడి ఓట్లు గుద్దేవారు చివరి వారాల్లో కానీ శోభాదెబ్బకి ఓట్లు వేయడానికి బిగ్ బాస్ రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. ఇక శోభాశెట్టి ఎలిమినేటెడ్ అనే వార్త వినడం కోసం జనాలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. ఎంతలా అంటే బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయితే చాలు.. శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఒక సీజన్‌లో ఇంత నెగెటివిటి ఉన్న కంటెస్టెంట్ ని ఇన్నివారాలు ఉంచడం ఇదే తొలిసారి. మరి బిగ్ బాస్ మామ తన దత్తపుత్రిక ఈ వారం పంపిస్తాడా లేక మరోసారీ జనాల ఓటింగ్ ని పక్కన పెడతాడా చూడాలి. అయితే తాజాగా సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సమాచారం ప్రకార శోభాశెట్టి, ప్రియాంక జైన్ ల జర్నీ వీడియోలని కూడా రెడీ చేసారని వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.    

బన్నీ తల్లి కల్పలత కూతురి పెళ్ళిలో బుల్లితెర నటుల సందడి

పుష్పలో అల్లు అర్జున్ కి మదర్ రోల్ లో నటించిన కల్పలత అందరికీ గుర్తుండిపోయే రోల్.  ఎక్స్ప్రెషన్స్ తో ఎలాంటి సీన్ ని ఐనా పండించేస్తుంది. అలాంటి కల్పలతకు ఇద్దరు ఆడపిల్లలు. రూపశ్రీ, దేవిశ్రీ..వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీరిలో ఒక కూతురు దేవిశ్రీ పెళ్లిని గత ఏడాది చేయగా ఇప్పుడు రూపశ్రీ పెళ్లిని ఘనంగా చేశారు. ఇక ఈ పెళ్లి వేడుకకు బుల్లితెర నటులు సన, లలిత, మిర్చి మాధవి, రవి కిరణ్ వంటి సెలబ్రిటీస్ వచ్చి వధూవరులైన  రూపశ్రీ-రోహిత్ ని విష్ చేశారు. సన ఈ మొత్తాన్ని ఒక వ్లాగ్ చేసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. పుష్ప మూవీతో  పాపులర్ అవుతున్న కల్పలత తెలంగాణలోని ఖమ్మంజిల్లా మణుగూరులో పుట్టి పెరిగింది. పుష్ప మూవీకి ముందు ఆమె  దాదాపు 55 చిత్రాల్లో , 10 సీరియల్స్ లో నటించారు. బాహుబలి,వివాహ భోజనంబు, అర్జున్ రెడ్డి, ఎక్ప్‌ ప్రెస్ రాజా, నేనే రాజు నేనే మంత్రి, భాగమతి, హిట్, గల్లీ రౌడి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో కూడా సందడి చేసింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన కల్పలత కు ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఎన్ని మూవీస్ లో నటించినా రాని గుర్తింపు పుష్ప మూవీలో తల్లి క్యారెక్టర్ కి వచ్చి ఆమె బాగా హైలైట్ అయ్యింది. ఇక ఈ పెళ్ళిలో కలిసిన బుల్లితెర నటులంతా ఫుల్ గా ఎంజాయ్ చేసి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకుని వెళ్లారు.  

Brahmamudi:జాతకాలు కలవలేదని ధాన్యలక్ష్మిలో మొదలైన భయం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -273 లో.... అనామిక, కళ్యాణ్ ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చెయ్యడానికి అనామిక పేరెంట్స్ దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఆ తర్వాత పంతులు వచ్చి జాతకలు చూస్తుంటాడు. కానీ కనకం రాత్రి వెళ్లి జాతకాలు కలవలేదని అబద్ధం చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుంది. దాంతో పంతులు ప్రతీసారి కనకం వైపు చూస్తుంటాడు. ఆ తర్వాత పంతులు మాటిమాటికీ కనకాన్ని చూస్తుంటే.మ ఏంటి అలా చూస్తున్నాడని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరి జాతకాలు కలువలేదని పంతులు అబద్ధం చెప్తాడు. అలా ఒక వేళ వీళ్ళ ఇద్దరికి పెళ్లి చేస్తే ఇంటి పెద్ద ఆరోగ్యం బాగుండదని పంతులు అనగానే.. అవును ఈ పెళ్లి అనుకుంటున్నప్పటి నుండి మామయ్య గారికి ఆరోగ్యం బాగోలేదని ధాన్యలక్ష్మి అంటుంది. వీటికి పరిష్కారం చుడండి అని ఇంట్లో వాళ్ళు అనగానే.. ఒక నిమ్మ మొలక రాత్రి పెట్టి తెల్లవారే సరికి అది అలాగే ఉంటే ఈ దోషం తొలగిపోయినట్టు వాడిపోయి ఉంటే దోషం తొలగిపోనట్లని, అలా కాదని పెళ్లి చేస్తే ఇద్దరు విడిపోతారని పంతులు చెప్తాడు. ఆ తర్వాత కనకానికి అప్పు చెప్పి ఇంటికి వెళ్తుంది.   మరొకవైపు కావ్య బుక్ చూస్తూ  జాతకం చూస్తుంటుంది. రాజ్ వచ్చి ఏం చేస్తున్నవని అడుగుతాడు. ఇక రాజ్ కి తన మాటలతో చుక్కలు చూపిస్తుంది. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి కనకం వెళ్తుంది. నిజంగా జాతకాలు కలవకుంటే అలా జరుగుతుందా అని అనగానే.. జరుగుతుందని ధాన్యలక్ష్మిని ఇంకా బయపెడుతుంది కనకం. ఆ తర్వాత కనకం చెప్పిన దాని గురించి ఆలోచిస్తుటుంది ధాన్యలక్ష్మి. తరువాయి భాగంలో.. రాజ్ కావ్య ఇద్దరు కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఇంట్లో వాళ్ళని కాదని వాళ్ళ పెళ్లి చెయ్యాలేమని రాజ్ అంటాడు. మరొకవైపు నిమ్మమొక్క వాడిపోయేలా కనకం చేస్తుంది. తెల్లవారి నిమ్మమొక్క వాడిపోవడం చుసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు  ఆగాల్సిందే.  

Guppedantha Manasu:భర్త కోసం అర్థరాత్రి బయటకొచ్చిన భార్య.‌. తన ఆచూకీ తెలిసేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -949 లో. రిషి ఇంకా ఇంటికి తిరిగి రాలేదని వసుధార కంగారు పడుతుంది. ఆ విషయం తెలియని అనుపమ.. మహేంద్ర ని తన మాటలతో చిరాకు తెప్పిస్తుంది.‌ ఇలాంటి పరిస్థితులలో జగతి ఉంటే రిషిని అలా బయటకు పంపించేది కాదంటు మాట్లాడుతుంది. ఆ తర్వాత ఎప్పుడు దైర్యంగా ఉంటావ్ నువ్వు. నిన్ను  ఇలా ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. రిషి వస్తాడు నువ్వు ఏం టెన్షన్ పడకని వసుధారకి అనుపమ దైర్యం చెప్తుంది. వసుధార చూడు ఎంత బాధపడుతుంది? నీలో ఎలాంటి రియాక్షన్ లేదని అనుపమ అనగానే తనపై మహేంద్ర సీరియస్ అవుతాడు. నేను పడే బాధ నీకేం తెలుసని మహేంద్ర అనగానే.. బాధపడే వాళ్ళు ఇలా సైలెంట్ గా ఉంటారా? వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని అనుపమ అనగానే.. ఈ రోజు నుండే కాదా రిషి కన్పించట్లేదు? రేపటి వరకు చూసి కంప్లైంట్ ఇస్తానని మహేంద్ర అంటాడు. మరొక వైపు  ధరణికి వసుధార కాల్ చేసి.. రిషి వచ్చాడా అని అడుగుతుంది. రాలేదని‌ ధరణి చెప్పగానే.. వసుధార ఇంకాస్త టెన్షన్ పడుతుంది. మరొకవైపు అనుపమ తనకి తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి.. రిషి గురించి కనుక్కోమని చెప్తుంది. ఆ తర్వాత అనుపమ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఫణీంద్ర దగ్గరికి దేవయాని వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నారని అనగానే ముకుల్ వినిపించిన వాయిస్ రికార్డు గురించి.. అందులో వాయిస్ శైలేంద్రది అనగానే.. అంటే మీరు మన కొడుకుని అనుమానిస్తున్నారా అని దేవయాని అంటుంది. అనుమానం కాదు సాక్ష్యం ఉందని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత ఫణీంద్ర దగ్గరికి ధరణి వచ్చి.. రిషి ఇంకా ఇంటికి వెళ్లలేదట.. ఇందాక వసుధార ఫోన్ చేసి టెన్షన్ పడుతుందని చెప్తుంది. ఫణింద్ర వెంటనే మహేంద్రకి ఫోన్ చేస్తాడు. రిషి గురించి కనుక్కోమని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో  వసుధార ఎక్కడ కన్పించక పోవడంతో మహేంద్ర కంగారుపడుతుంటాడు. అప్పుడే అనుపమ వచ్చి.. ఏమైందని అడుగుతుంది. వసుధార కన్పించడం లేదని అనగానే.. ఒకసారి ఫోన్ చేసి చూడు అని అనుపమ అంటుంది. ఆ తర్వాత వసుధారకి మహేంద్ర ఫోన్ చేస్తాడు. రాత్రి బయటకు వచ్చాను.. రిషిని వెతుక్కుంటు వచ్చానని వసుధార చెప్తుంది.. ఆ తర్వాత మహేంద్ర రిషి కన్పించడం లేదు అన్న విషయం ముకుల్ కి ఫోన్ చేసి చెప్తాడు. మరొకవైపు కాలేజీ లో తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది వసుధార. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అమర్ దీప్ ఫ్యాన్స్ కి బుర్ర లేదంటు వార్నింగ్ ఇచ్చిన కీర్తిభట్!

బిగ్ బాస్ సీజన్-7 లో అమర్ దీప్ కి ఉన్న ఫ్యాన్స్ కంటే సీజన్-6 లో కీర్తిభట్ కి ఉండే ఫ్యాన్సే ఎక్కువ. సీజన్-6 లో  ఏ కంటెస్టెంట్ సపోర్ట్ లేకుండా టాప్-5 లో ఉన్న ఏకైక ఫీమేల్ కంటెస్టెంట్ కీర్తిభట్. బిగ్ బాస్ సీజన్-6 షో ముగిసాక కీర్తిభట్ కి ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆ తర్వాత "మధురానగరిలో" అనే సీరియల్ లో నటిస్తుంది. ఇక ఇలా బుల్లితెరపై విశేష అభిమానాన్ని పొందిన ఈ కన్నడ భామ తెలుగు రాష్ట్రాలలోని ప్రతీ ఇంట్లో అమ్మాయిలా ఆదరణ పొందుతుంది. దాంతో "మీ ఇంటి కీర్తి" అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో తనకి సంబంధించిన వ్లాగ్ లు చేస్తుంది కీర్తిభట్. ‌ప్రస్తుతం వాటికి విశేష స్పందన లభిస్తోంది. కీర్తిభట్ తన ఫ్రెండ్ ని పెళ్ళి చేసుకొని ప్రస్తుతం హ్యాపీగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా రాంగ్ మెసెజ్ లు, రాంగ్ కాల్స్, రాంగ్ ఈమెయిల్స్ వస్తున్నాయంటూ ఒక పోస్ట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ పోస్ట్ లో తను ఏం చెప్పిందంటే.. బయట కొన్ని ఇంటర్వ్యూలకి హాజరయిమప్పుడు.. బిగ్ బాస్ సీజన్-7 లో‌ ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరికి మీ సపోర్ట్ అని అడుగగా.. అప్పుడు నేను చూసిన ఆట ప్రకారం అంబటి అర్జున్ హౌస్ లో బాగా టాస్క్ లు ఆడుతున్నాడు. ఒంటరిగా ఆడి ఎవరి సపోర్ట్ లేకుండా పోరాడి టికెట్ టు ఫినాలే గెలిచాడు. నా సపోర్ట్ అర్జున్ కి అని చెప్పాను. అది విని అమర్ దీప్ ఫ్యాన్స్ నాకు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. అంత వల్గర్ గా మెసెజ్ లు చేయాల్సిన అవసరం ఏం ఉంది. నా పాయింటాఫ్ వ్యూలో నేను చెప్పాను. అంతే కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. అంతేకానీ అమర్ ని తక్కువ చేసి మాట్లాడానని నన్ను ఇలా తిడుతూ కామెంట్లు చేయడం కరెక్టేనా, అసలు సెన్స్ ఉందా మీకు? బుర్రలు పనిచేస్తున్నాయా మీకు నేను వాళ్లకి సపోర్ట్ చేస్తున్నానో లేదో మీకు తెలుసా? అసలెందుకని ఇలా వల్గర్ గా మెసెజ్ లు చేస్తున్నారంటూ అమర్ దీప్ ఫ్యాన్స్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కీర్తిభట్. ఇప్పుడు ఇది ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ గా మారింది. ఇలా అమర్ దీప్ ఫ్యాన్స్ కి నిజంగానే బుర్రలేదని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఒక్క గేమ్ కూడా ఫెయిర్ గా ఆడని అమర్‌దీప్ కి ఓట్ చేసే ఫ్యాన్స్ ని ఇప్పటికే సోషల్ మీడియాలో నిబ్బాలని అంటూ ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.       

Krishna Mukunda Murari:కృష్ణకి పెళ్లి జరిగిందని తెలుసుకున్న మురారి.. ఏం చేయనున్నాడు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -334 లో.. ముకుంద మురారీల పెళ్లి చెయ్యడానికి భవాని అన్నీ సిద్ధం చేస్తుంది.  పసుపు కొట్టి, పెళ్లి పనులు మొదలు పెడుతారు. దానికి కృష్ణ కూడా వస్తుంది. అందరితో కలివిడిగా ఉంటుంది కృష్ణ. మరొక వైపు మురారి ఒంటరిగా కృష్ణ అన్న మాటలు గుర్తుకు తెచ్చకుంటాడు. ఆ తర్వాత మురారి దగ్గరికి మధు వచ్చి.. పసుపు దంచే ప్రోగ్రామ్ అంత వీడియో తీసాను ఇది అప్లోడ్ చేయాలని అనగానే నువ్వు రీల్స్ తీస్తావ్ కదా అని మురారికి గతం గుర్తుకు వచ్చినట్లు మాట్లాడతాడు. మరొక వైపు ముకుంద, మురారీల పెళ్లి గురించి ముకుంద తొందరపడుతుంది. అక్క ఇటు వైపు చుస్తే కృష్ణ మురారి లు ఇలా ఉన్నారని సుమలత అనుకుంటుంది. మరొక వైపు మురారి, మధుల దగ్గరికి కృష్ణ వస్తుంది. ఈ వీడియో రీల్స్ అంటూ మురారి మాట్లాడేసరికి మురారికి గతo గుర్తుకు వస్తుందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇది వరకు తీసిన రీల్స్ చూయించు అని మురారి అనగానే వద్దని మధుకి చెప్తుంది కృష్ణ. ఆ తర్వాత కృష్ణ మురారీ రీల్స్ తీస్తుంటే మధు వీడియో తీస్తాడు. భవాని చూస్తుందేమోనని మధు వీడియో తియ్యడం ఆపేస్తాడు. మరొకవైపు రేవతి, మధు ఇద్దరు కలిసి కృష్ణ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కృష్ణకి చాలా దైర్యం ఉంది. ఈ ప్రాబ్లమ్ నుండి బయట పడుతుందంటు కృష్ణ గురించి రేవతి చెప్తుంది. మరొకవైపు ఎప్పటిలాగే కృష్ణ, ముకుందల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మరొకవైపు  అందరూ హాల్లోకి వస్తారు. కృష్ణ ఇక నువ్వు వెళ్ళు అని భవాని అనగానే.. ఎందుకు కృష్ణని అంత చీప్ గా చూస్తున్నారు. అన్ని విషయాలు తెలియాలి అంటే జైల్లోకి వెళ్లి వాళ్ళ చిన్నాన్నని అడిగి తెలిసికోవాలని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ దీపాలు వదలాలి. మీరు వస్తారా అని రేవతిని కృష్ణ అడుగుతుంది . రాదని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అసలు దీపాలు వదలడం ఏంటి అని మురారి అనగానే.. దొరికింది మంచి ఛాన్స్ అని భవాని అనుకుని కృష్ణ తన భర్త బాగుండాలి అని అలా చేస్తుందని అనగానే మురారి ఒక్కసారిగా కృష్ణకి పెళ్లి అయిందా అని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత అదే విషయం గుర్తుకు చేసుకుంటు ఉంటాడు. అప్పుడే నందు వస్తుంది. నందుని కృష్ణ గురించి అడుగగా.. కృష్ణ ఇండైరెక్ట్ గా నిన్ను అక్కడికి రమ్మంది అని నందు చెప్తుంది. మరొక వైపు మురారికి గతం గుర్తుకు వస్తుందని టెన్షన్ పడుతుంది ముకుంద. అదే విషయాన్ని భవాని దగ్గరికి వెళ్లి చెప్తుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..  

 నెక్స్ట్ ఇయర్ ప్రదీప్ పెళ్లి...స్ట్రాంగ్ సోర్స్ నుంచి న్యూస్ వచ్చిందంటూ రివీల్ చేసిన నాని

ఇన్ని నెలలుగా అలరించిన  ఢీ ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఫినాలేకి "హాయ్ నాన్న" మూవీ హీరో నాని, మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఎప్పటిలాగే జడ్జెస్ శేఖర్ మాస్టర్, పూర్ణతో పాటు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్స్ చిన్ని ప్రకాష్, రేఖ ప్రకాష్ , బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మహేష్ విట్టా, విజె సన్నీ వచ్చారు. తర్వాత నానిని ప్రదీప్ ఒక ప్రశ్న వేసాడు..ఐతే నాని మాత్రం దానికి ఆన్సర్ చెప్పకుండా ప్రదీప్ పెళ్లి గురించి న్యూస్ ని లీక్ చేసాడు. " ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు అలిగితే వాళ్ళను బుజ్జగించడానికి మీరేం చేస్తారు" అని అడిగేసరికి "జెన్యూన్ గానే అడుగుతున్నావా...నెక్స్ట్ ఇయర్ నీ పెళ్ళని రూమర్స్ వచ్చాయి..ఎప్పటినుంచో ఈ రూమర్స్ వింటున్నా కూడా ప్రెజంట్ రూమర్ మాత్రం చాల పకడ్బందీగా, స్ట్రాంగ్ సోర్స్ నుంచి వచ్చింది" అని నాని అనేసరికి "ఎవరు చెప్పినా పర్లేదయ్యా, మీరు చెప్తే జనాలు నిజంగా నమ్మేస్తారు" అంటూ నానికి ఒక దణ్ణం పెట్టి నిజం చెప్పొద్దంటూ దణ్ణం పెట్టాడు. "ఎప్పుడైనా లవ్ లెటర్స్ రాసివ్వడం కానీ, డైరెక్ట్ గా లైవ్ లో వచ్చి లవ్ లెటర్ ఇవ్వడం కానీ జరిగిందా" అని మృణాల్ ఠాకూర్ ని అడిగాడు ప్రదీప్..."లవ్ లెటర్స్ వచ్చాయి" అని ఆన్సర్ ఇచ్చింది మృణాల్. ఇక తర్వాత నాని తాను నటించిన దసరా మూవీ హిట్ సాంగ్ ని కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ తో కలిసి వేసాడు. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో గ్రీష్మ మాస్టర్, ప్రభుదేవా మాస్టర్ పోటీ పడ్డారు. ఐతే నెటిజన్స్ మాత్రం ప్రభుదేవా మాష్టర్ టైటిల్ విన్ అవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

గుప్పెడంత మనసు జ్యోతిరాయ్ పెళ్ళి.. ఇదేం ట్విస్ట్!

నిన్న మొన్నటి దాకా గుప్పెడంత మనసు జగతి అలియాస్ జ్యోతిరాయ్ ఒక డైరెక్టర్ తో లివింగ్ రిలేషన్ లో ఉందని అనుకున్నారంతా కానీ ఇప్పుడు ఏకంగా పెళ్ళి జరిగిందని తనే ఇమ్ స్టాగ్రామ్ లో ఒక అభిమానితో‌ షేర్ చేసుకుంది‌. కన్నడ పరిశ్రమ నుంచి జ్యోతిరాయ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దాదాపు 20కిపై సీరియల్స్‌లో నటించిన జ్యోతిరాయ్‌.. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతిగా తల్లి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.  నిన్నటివరకు ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకోబోతోందన్న వార్త వైరల్‌గా మారగా ఈరోజు ఏకంగా పెళ్ళి జరిగిందని చెప్పింది. తన 20 ఏళ్ళ వయసులోనే పద్మనాభం అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న 38 సంవత్సరాల జ్యోతి రాయ్‌ అతనితో కొన్నాళ్ళు కాపురం చేసింది. వారికి ఒక బాబు. కారణాలు తెలియవు కానీ అతనికి ఇప్పుడు దూరంగా ఉంటోంది జ్యోతి. అయితే గత కొంతకాలంగా యంగ్‌ డైరెక్టర్‌ సుకు పుర్వాజ్‌ను జ్యోతి పెళ్ళి చేసుకోబోతోందని రూమర్లు వచ్చాయి. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని వారు పోస్ట్‌ చేస్తున్న ఫోటోల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు ఆ రూమర్స్‌ అన్నీ నిజమేనని తెలిసింది. తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో " ఆస్క్ మీ క్వశ్చన్" ని స్టార్ట్ చేసింది. కన్నడలో సినిమాలు చేశారా అని ఒక అభిమాని అడుగగా.. హా చేశాను నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతాయని జ్యోతి అంది. టాలీవుడ్ లో నటిస్తున్నారా అని మరొకరు అడుగగా.. హా చేసాను కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయని అంది. తమళ భాషలో నటిస్తున్నారా అని ఒకరు అడుగగా.. లేదు మూవీ స్క్రిప్ట్స్ చూస్తున్నా అని అంది. అయితే ఒకతను మీరు మ్యారీడ్ ఆ అని అడుగగా.. ఎస్ అని సమాధానమిచ్చింది జ్యోతి. కాగా ఇప్పుడు బహిరంగంగా తనకి పెళ్ళి అయినట్టు ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. నిన్న తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది.  పోలీస్ డ్రెస్ లో తళుక్కుమన్న జగతి.. అండర్ వరల్డ్ బిలియనీర్స్ అనే ఒక వెబ్ సిరీస్ లోని గెటప్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.   

బిగ్ బాస్ చరిత్రలో శివాజీ రికార్డు.. ఓటింగ్ లో ఎదురులేని మనిషి!

బిగ్ బాస్ అన్నీ ‌సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ఎంతో ప్రత్యేకం అదేంటంటే ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన రైతిబిడ్డ ఫైనల్ వీక్ వరకు ఉండడం, మరోవైపు నలభై ఏళ్ళ పైబడి ఉన్న ఏ కంటెస్టెంట్ చివరి వరకు ఉండకపోవడమే కారణం.  ఇప్పటివరకు సీజన్-7 లో జరిగిన నామినేషన్ లో శివాజీ ఉంటే అతనే టాప్.. అతన్ని కొట్టేవాడే లేడన్నది నిజం. ఆ తర్వాత స్థానంలో ఒక్క పల్లవి ప్రశాంత్ కి మాత్రమే ఆ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంది. ఇక మన అమరదీపం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా తన పిచ్చి చేష్టలతో పోగొట్టుకుంటున్నాడు. ఇది అమర్‌దీప్ కి మరింత నష్టాన్ని కలిగిస్తుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండటమంటే టాస్క్ లో ఫెయిర్ గా ఉండి, తమ వందకి వంద శాతం ఇస్తూ పోరాడాలి. కానీ అలా కాకుండా ప్రతీ టాస్క్ లో ఇతర హౌస్ మేట్స్ పై ఆధారపడి వాళ్ళ సహాయంతో గెలిస్తే అది గెలిచినట్టు కాదని అందరికి తెలుసు. శివాజీకి పడే ఓటింగ్, అమర్ దీప్ కి పడే ఓటింగ్ ని ఒకసారి సీరియల్ బ్యాచ్ కి చూపిస్తే వాళ్ళు ఎంత నెగెటివిటితో హౌస్ లో ఉన్నారో అర్థం అవుతుంది. హౌస్ లో ఇప్పటివరకు ఎంత మంది కెప్టెన్ లు అయిన శివాజీ కెప్టెన్ కోసం ఎంతోమంది ఎదురు చూసారంట అతనెంత ప్రత్యేకమో అర్థమవుతుంది. శివాజీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ఓటింగ్ పడేది పల్లవి ప్రశాంత్ కే దక్కుతుంది.  సీజన్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. వెళ్లడమే కాదు.. అనూహ్య రీతిలో ఆట ఆడి.. బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత టాస్క్ లలో ఆడి హౌస్ మేట్ అయ్యాడు. ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు.. 14 వారాల పాటు తన ఆటకి సాటే లేదు అన్నట్టుగా రైతు బిడ్డ చెమటచిందించి సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌కి చెమటలు పట్టించాడు. ఓటింగ్ లో శివాజీ, ప్రశాంత్ లని బీట్ చేసే కంటెస్టెంట్ ఎవరు లేరనేది అందరికి తెలిసిన నిజం. ఈ ఇద్దరి లోనే ఎవరికో ఒకరికి టైటిల్ ప్రైజ్ దక్కుతుందనేది ఇప్పటికే కన్ఫమ్ అయింది.  

పవన్ కళ్యాణ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘బిగ్ బాస్ సీజన్  6 ద్వారా పాపులర్ అయిన వారిలో  కాస్త ఎక్కువగా విన్న పేరు వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ బ్యూటీల్లో ఈమె కూడా ఒకరు. అలాంటి ఈమె ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక తన కాబోయే భర్త పేరు పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు బిగ్ బాస్ సెలబ్రిటీస్ అంతా వచ్చారు. అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, శ్రీసత్య, ఇనాయ సుల్తానా, ఆర్జే సూర్య, యాంకర్ ధనుష్  అంతా వెళ్లి సందడి చేశారు. తిరుపతిలోని తాజ్ హోటల్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది. అందుకే నిన్న మొన్న అంతా కూడా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ అంతా వన్ బై వన్ తిరుమల వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుని పనిలో పనిగా వాసంతి ఎంగేజ్మెంట్ లో సందడి చేసి వచ్చారు. వాసంతి పుట్టింది తిరుపతిలో, ఈమె కన్నడ మూవీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. సిరిసిరి మువ్వలు అనే సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే గోరింటాకు, గుప్పెడంత మనసు సీరియల్స్ లో కూడా ఈమె నటించింది. గుప్పెడంత మనసులో రిషిని మొదట ప్రేమించే అమ్మాయి సాక్షి రోల్ లో వాసంతి మొదట నటించింది.  కాలిఫ్లవర్ అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. వాంటెడ్ పండుగాడు, భువన విజయం, సిఎస్ఐ సనాతన్  అనే మూవీస్ లో కూడా నటించింది. ఎందులో చేసిన కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ మెట్ గా మాత్రం అందరి హృదయాలను దోచేసింది ఈ అమ్మడు. ఇక ఈ ఎంగేజ్మెంట్ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసేసరికి నెటిజన్స్ విషెస్ చెప్తూనే ఆశ్చర్యపోతున్నారు. "వాసంతి అక్కకు అప్పుడే పెళ్లా, మా వాసంతి అక్కను బాగా చూసుకోండి" అంటున్నారు.  

అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ లలో ఎవరు కరెక్ట్?

బిగ్ బాస్ సీజన్-7 మొదలైన రెండవ వారంలోనే.. కామన్ మ్యాన్ , సెలబ్రిటీ ల మధ్య జరిగిన గొడవ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. మళ్ళీ పద్నాలుగు వారాల తర్వాత రిపీట్ అయింది. ఇప్పటికి హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా పద్నాలుగవ వారం కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగింది. ఈ వారం ఓట్ అప్పీల్ కోసం హౌస్ లో‌ టాస్క్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. కాగా మొన్నటి టాస్క్ లో యావర్,‌ శోభాశెట్టి ఉండగా.. కన్నింగ్ అర్జున్ వేసిన ఒక్క నమ్మకద్రోహం పనివల్ల శోభాశెట్టి అధిక మద్దతు పొంది ఓట్ అప్పీల్ కి అర్హత సాధించింది. ఆ తర్వాత జరిగిన టాస్క్ లలో అంబటి అర్జున్, అమర్ దీప్ గెలవడం వల్ల వారిద్దరు ఓట్ అప్పీల్ కి అర్హత సాధించగా.. హౌస్ మేట్స్ అభిప్రాయంతో అంబటి అర్జున్ ఓట్ అప్పీల్ కి అర్హత సాధించాడు.  ఇక ఆ తర్వాత జరిగిన టాస్క్ కాస్త అమర్ దీప్, ప్రశాంత్ ల మధ్య పెద్ద గొడవకి దారితీసింది. ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ఒక జాకెట్ వేసుకోవాలి.  మిగిలిన వాళ్ళు వారిపైకి బాల్స్ విసిరేస్తుంటారు. ఎవరి జాకెట్ కి ఎక్కువ బాల్స్ అతుక్కుంటావో వాళ్ళు అవుట్ అని బిగ్ బాస్ చెప్పాడు. మొదట యావర్ ని రెచ్చగొట్టి తనని లైన్ నుండి బయటకు వచ్చేలా చేసింది శోభాశెట్టి. ‌ఆ తర్వాత యావర్ మరింత రెచ్చిపోయాడు. అయితే ఇందులో శోభాశెట్టి కావాలని చేసిందని తనే ఒప్పుకుంది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని అమర్ దీప్ టార్గెట్ చేసి బాల్స్ వేశాడు. ఇక దగ్గరికి వెళ్ళి ప్రశాంత్ ని పట్టుకొని ఫిజికల్ అయ్యాడు అమర్ దీప్. ఇందులో పల్లవి ప్రశాంత్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. అమర్ దీప్ కావాలని తనని గోళ్ళతో గీకాడని ప్రశాంత్ అనగా.. నన్ను రెచ్చగొట్టకు రా ప్రశాంత్ అని అమర్‌దీప్ అన్నాడు‌.‌ ఇక " నన్ను రా అని అనొద్దు" అన్న అని ప్రశాంత్ అనగా.. నన్ను నెగెటివ్ చేయాలని చూస్తున్నావ్? చేయు రా అంటు ఓవర్ అగ్రెసివ్ అయ్యాడు అమర్ దీప్. ఇక ఈ ఆర్గుమెంట్ లో పల్లవి ప్రశాంత్ ని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం చాలా పెద్ద తప్పు.. వీకెండ్ లో‌ నాగార్జున దీనిపై గట్టిగా క్లాస్ పీకే ఛాన్స్ ఉంది.‌ అయితే‌ ఇప్పుడు సోషల్ మీడియాలో అమర్ దీప్, ప్రశాంత్ లలో ఎవరు కరెక్ట్ అనే క్వశ్చన్ ట్రెండింగ్ లో ఉంది.