సరైన సమయంలో సరైన పావులు కదిపిన చాణక్యుడు.. బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది!

బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ కప్ కి మరికొన్ని రోజులే ఉండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారి జర్నీ వీడియోలతో సర్ ప్రైజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. రోజుకి ఇద్దరి జర్నీ వీడియోలతో ప్రేక్షకులకు మళ్లీ కంటెస్టెంట్ ఆటతీరు, మాటతీరుని చూపిస్తున్నాడు. మొన్న అమర్, అర్జున్ ల జర్నీ చూపించగా.. నిన్న శివాజీ, ప్రియాంకల జర్నీ చూపించాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో మొదట శివాజీని గార్డెన్ ఏరియాకి పిలిచాడు బిగ్ బాస్. అక్కడ తను హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన జ్ఞాపకాలని గుర్తుచేస్తూ తీసిన ఫోటోలని చూసి మురిసిపోయాడు. ఇక ఆ తర్వాత యాక్టివిటి ఏరియాకి పిలిచి తన జర్నీ వీడియో చూపించాడు బిగ్ బాస్. ఇక ఈ జర్నీ చూస్తూ.. నా ఇరవై సంవత్సరాల సినిమా కెరీర్ ఒక ఎత్తు, లైఫ్ లో బిగ్ బాస్ ఒక ఎత్తు అని శివాజీ చెప్పాడు. శివాజీ.. మిమ్మల్ని ఒక వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు వాళ్ళ వైపే ఉండేలా చేయగల మాటకారి మీరు అని బిగ్ బాస్ చెప్తూ.. రాజుగారి పెద్ద పెళ్ళాం మంచిదంటే చిన్నపెళ్ళాం చెడ్డదని కాదని శివాజీ చెప్పిన మాటలని ప్లే చేసి చూపించాడు బిగ్ బాస్. మీ గాయం మిమ్మల్ని ఎంత వేధించిన ఓటమి వైపు చూడలేదు. మీ అబ్బాయి డాక్టర్ గా వచ్చినప్పుడు మీ బాధనంతా మర్చిపోయారని బిగ్ బాస్ చెప్తుండగా శివాజీ ఎమోషనల్ అయ్యాడు. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణక్యుడులా నిలిచాడని టాస్క్ లో శోభాశెట్టితో శివాజీ డిఫెండ్ చేసిన వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. ఈ పూర్తి సీజన్ లో మీ మీద పైచేయి సాధించిన ఒకే ఒక విషయం ఏంటో తెలుసా.. కాఫీ. అలా చెప్పి శివాజీ కాఫీ కోసం పడే ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపించాడు. కంటెస్టెంట్ గా మొదలై కన్ఫమేషన్ పొంది హౌస్ మేట్ అయ్యారు. మీ ఆటతీరే మిమ్మల్ని ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని బిగ్ బాస్ చెప్పగా.. థాంక్స్ బిగ్ బాస్ అని శివాజీ చెప్పాడు. పంజా సినిమాలోని " నీ చిరు చిరు చూపులే పంజా" పాటని ఏవీ చివరలో ప్లే చేసాడు. ఇది పవర్ ఫుల్ జర్నీగా బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది. శివాజీ బిగ్ బాస్ టైటిల్ విజేత అని దీన్ని బట్టే తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే శివాజీ తన ఫెయిర్ గేమ్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. హౌస్ లో ఏదైన టాస్క్ తర్వాత శివాజీ పక్కన ఎవరైన హౌస్  మేట్ ఉంటే.. వారిద్దరిలో ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేయండి అని బిగ్ బాస్ చెప్తే.. మిగిలిన అందరు కలిసి శివాజీకే ఓట్ వేస్తారనేది అందరికి తెలిసిన నిజం. ఎందుకంటే శివాజీలో ఆటలో ఫౌల్,  మాటల్లో నెగెటివ్ అంటు ఏమీ ఉండవు. అందుకే అతడిని శివాజీ.. ది బాస్  అంటు ప్రేక్షకులు కామెంట్లలో తెలుపుతున్నారు. 

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ప్రియాంక.. అర్జున్ కి ఉల్టా పుల్టా ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-7 విజయవంతంగా పద్నాలుగు వారాలు పూర్తిచేసుకుంది. ఇక ముగింపుకి వచ్చేసింది. హౌస్ లో ఫినాలే వీక్ నడుస్తోంది. ఇందులో ఒక్కో‌ కంటెస్టెంట్ యొక్క జర్నీ వీడియోలని చూపిస్తున్నాడు బిగ్ బాస్. అయితే మొదట అమర్ దీప్ జర్నీ వీడియోని చూపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత అంబటి అర్జున్, నిన్నటి ఎపిసోడ్ లో మొదట శివాజీ జర్నీ, ఆ తర్వాత ప్రియాంక జర్నీ వీడియోలని చూపించాడు బిగ్ బాస్. ఇంకా యావర్, ప్రశాంత్ ల జర్నీ వీడియోలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే యావర్, ప్రశాంత్, శివాజీ ఇప్పటికే అత్యధిక ఓటింగ్ తో టాప్-3 లో ఉన్నారు. కానీ అమర్ దీప్, అంబటి అర్జున్, ప్రియాంకకి లీస్ట్ ఓటింగ్ పడుతోంది. అయితే ఇప్పటికి జరిగిన ఓటింగ్ ప్రకారం బాటమ్-2 లో.. అర్జున్, ప్రియాంక ఉన్నారు. అందుకే వారి జర్నీ వీడియోలని బిగ్ బాస్ త్వరగా చూపించాడేమోనని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీనికి కారణం కూడా ఉంది‌. హౌస్ లో ప్రతీ సీజన్ ఫినాలేకి టాప్-5 మాత్రమే ఉంటారు. అదే ప్రక్రియలో భాగంగా గతవారం శోభాశెట్టిని బయటకు పంపించేశారు బిగ్ బాస్. దాంతో హౌస్ లో  ఇప్పుడు ఆరుగురు ఉన్నారు. ఇక మిగిలింది నాలుగు రోజులే కావడంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్ గనుక జరిగితే ప్రియాంక, అర్జున్ లలో ఎవరో ఒకరు బయటకు రావాల్సిందే. ఎందుకంటే వీరికి ఓట్లు వేసేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. హౌస్ లో అంబటి అర్జున్ కన్నింగ్ గేమ్ ప్లాన్ అర్థమైంది కాబట్టి ప్రేక్షకులు అతనికి  ఓట్లు వేయడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇక ప్రియాంక ఎప్పుడూ గ్రూప్, అమర్, శోభాశెట్టిలకి సపోర్ట్ చేయాలంటూ తన దాకా వస్తే తన స్వార్థమే చూసుకుంటు చాలావరకు హౌస్ లో గొడవలు జరగడానికి ప్రధాన కారణం అయ్యింది. కిచెన్ లో తప్ప బయట ఎక్కువ కనిపించని ప్రియాంక ఆటలో గెలిచినవి తక్కువే. ఈమె సింపతీ డ్రామా కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. మరీ అర్జున్, ప్రియాంకల జర్నీ వీడియోలు మొదట చూపించడానికి ప్రధాన కారణం వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలనేదే రీజన్ లా అనిపిస్తుంది. మరి జర్నీ వీడియోలని బట్టి చూస్తే అంబటి అర్జున్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటూ ట్విస్ట్ ఇస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ప్రియాంక బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

శివాజీని బీట్ చేయలేకపోతున్న ప్రశాంత్.. టైటిల్ రేస్ నుంచి తప్పుకున్నాడా?

ఓటింగ్ లో శివాజీ హవా నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్-7 లో మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఫెయిర్ కంటెస్టెంట్ గా శివాజీ రికార్డులు సృష్టిస్తున్నాడు. అతని మైండ్ గేమ్, స్ట్రాటజీ, ‌మాటతీరుతో జనాలే కాదు హోస్ట్ నాగార్జున కూడా ఫిధా అయ్యారు. ఎంతలా అంటే శివాజీ చేతికి గాయం అయిందని మిగతా హౌస్ మేట్స్ అందరు ఆడట్లేదని అన్నా సరే శివాజీకే మద్దతు ఇస్తూ వచ్చారు. రెండు మూడు సార్లు కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి మరీ మోటివేషన్ ఇచ్చి మరీ ఉండేలా చేశారు బిగ్ బాస్. సీజన్ విన్నర్‌గా నిలిచేందుకు అవకాశం ఉన్న వారిలో శివాజీ ఒకడు. శివాజీ సినిమా హీరోగా ఉన్నప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడం మాత్రం శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా హౌస్‌లో అడుగుపెట్టిన శివాజీ ప్రస్తుతం టైటిల్ రేసులో గట్టి పోటీ ఇస్తున్నాడు. నిజానికి ఫ్యామిలీ వీక్ వరకు శివాజీనే హాట్ ఫేవరెట్‌గా ఉన్నాడు. ఆ వీక్‌లో తన పెద్ద కొడుకు వెంకట్ హౌస్‌లోకి వచ్చినప్పుడు శివాజీ ఎమోషనల్ అవ్వడంతో  ఆడియన్స్‌కి శివాజీ మరింత కనెక్ట్ అయ్యాడు. తండ్రి, కొడుకుల మధ్య ఉన్న ఆ బాండింగ్‌ను అందరికీ గుర్తు చేసి మరింత ఎమోషనల్ చేసాడు బిగ్ బాస్. అయితే ఫ్యామిలీ వీక్ ఈసారి పదవ వారంలోనే  జరిగింది. ఇక హౌస్ లో అందరితో మంచి రాపో ఉంది కేవలం శివాజీకే అని నిన్నటి జర్నీ వీడియోలో‌ స్పష్టత వచ్చేసింది. చాణక్యుడిగా, పల్లవి ప్రశాంత్, యావర్ లకి గురువుగా ఎంతో మంది అభిమానాన్ని పొందాడు శివాజీ. దీంతో అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో శివాజీ ఉన్నాడు. అమర్ దీప్ టైటిల్ రేస్ నుండి తప్పుకున్నట్టే ఎందుకంటే గతవారం ముందు వరకు మూడవ స్థానంలో ఉన్న అమర్ దీప్.. పద్నాలుగవ వారంలో ప్రశాంత్‌తో బిహేవియర్ చూసి ఆడియన్స్ షాకయ్యారు. ప్రశాంత్‌ను కొరకడం, తోసేయడం, తోసుకుంటూ రూడ్‌గా బిహేవ్ చేయడంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువైంది. అంతకుముందు వరకు ఫౌల్ గేమ్స్ తో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించిన అమర్ దీప్.. ప్రియాంక, శోభాల సపోర్ట్ తో‌ ఇన్నివారాలు ఉన్నాడనేది వాస్తవం. గత ఆరు వారాలుగా దత్తపుత్రిక  శోభాశెట్టిని కాపాడిన బిగ్ బాస్ గతవారం తనని ఎలిమినేట్ చేసి జనాలకి ఓట్లు వేయాలనే ఆసక్తిని కలుగజేసారు. ఇక రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. గ్రామాల నుండి అత్యధిక ఓట్లు వస్తున్నా.. శివాజీని బీట్ చేయలేకపోతున్నాడు ప్రశాంత్.   ఇక ప్రియాంక,  అర్జున్ బాటమ్-2 లో ఉన్నారు.  

టాప్-5 జర్నీ వీడియోలు చూస్తూ ఎమోషనల్ అయిన గీతు రాయల్!

బిగ్ బాస్ సీజన్-7 లో ప్రస్తుతం టాప్-6 లో ఉన్న హౌస్ మేట్స్ జర్నీ వీడియోలు ప్లే చేస్తున్నాడు బిగ్ బాస్.‌ ఇది చూసి ఎంతోమంది కనెక్ట్ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్-7 కి బజ్ ఇంటర్వ్యూ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న గీతు రాయల్‌‌.. ఈ జర్నీ వీడియోలు చూస్తూ ఎమోషనల్ అవుతుంది. గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు  నాగార్జున. ఇక గీతు రాయల్ ఎలిమినేషన్ చూసి అందరు ఎమోషనల్ అయ్యారు. అయితే గీతు టాప్-5 లో ఉండకుండానే బయటకు వచ్చేసింది. దాంతో ప్రస్తుతం టాప్-6 లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం సాగుతున్న జర్నీ వీడియోలని చూసి ఎమోషనల్ అవుతుంది. దాని గురించి తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది గీతు. అందులో ఏం ఉందంటే.. " అందరి టాప్-5 జర్నీ చూస్తుంటే  నేను చాలా మిస్ అయిపోయా అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకో.. నా డ్రీమ్ ఒకప్పుడు అట్ల గార్డెన్  ఏరియాలో నిల్చున్నప్పుడు బిగ్ బాస్ నా గురించి మాట్లాడితే వినాలని, ఒక 20 మినట్స్ 'AV' చూసుకోవాలని, అందరి ఫోటోస్ తీసుకెళ్ళాలని, మా‌ఇంటి నిండా ఆ ఫోటోలని ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవాలని ఉంది. కలలు కల్లోలం అయినప్పుడు హృదయం గాయపడుతుంది.. కన్నీళ్ళుగా మిగిలిపోతుంది" అంటూ గీతు ఎమోషనల్ వర్డ్స్ రాసుకొచ్చింది. కాగా ఇప్పుడు ఇది ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.  

చాణక్యుడు శివాజీ మోస్ట్ పవర్ ఫుల్ జర్నీ.. ప్రోమో అదుర్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో ప్రస్తుతం హౌస్ మేట్స్ జర్నీ వీడియోలు ప్లే చేస్తున్నారు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్, అంబటి అర్జున్ ల జర్నీ వీడియోలని చూపించగా.. నేడు హౌస్ లో శివాజీ జర్నీ చూపించబోతున్నారనే ప్రోమో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రోమో ఫుల్ వైరల్ గా మారింది. నా ఇరవై సంవత్సరాల సినిమా కెరీర్ ఒక ఎత్తు, లైఫ్ లో బిగ్ బాస్ ఒక ఎత్తు అని శివాజీ చెప్పాడు. శివాజీ.. మిమ్మల్ని ఒక వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు వాళ్ళ వైపే ఉండేలా చేయగల మాటకారి మీరు అని బిగ్ బాస్ చెప్తూ.. రాజుగారి పెద్ద పెళ్ళాం మంచిదంటే చిన్నపెళ్ళాం చెడ్డదని కాదని శివాజీ చెప్పిన మాటలని ప్లే చేసి చూపించాడు బిగ్ బాస్. మీ గాయం మిమ్మల్ని ఎంత వేధించిన ఓటమి వైపు చూడలేదు. మీ అబ్బాయి మీ డాక్టర్ గా వచ్చినప్పుడు మీ బాధనంతా మర్చిపోయారని బిగ్ బాస్ చెప్తుండగా శివాజీ ఎమోషనల్ అయ్యాడు. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణక్యుడులా నిలిచాడని టాస్క్ లో శోభాశెట్టితో శివాజీ డిఫెండ్ చేసిన వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. ఈ పూర్తి సీజన్ లో మీ మీద పైచేయి సాధించిన ఒకే ఒక విషయం ఏంటో తెలుసా.. కాఫీ. అలా చెప్పి శివాజీ కాఫీ కోసం పడే ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపించాడు. కంటెస్టెంట్ గా మొదలై కన్ఫమేషన్ పొంది హౌస్ మేట్ అయ్యారు. మీ ఆటతీరే మిమ్మల్ని ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని బిగ్ బాస్ చెప్పగా.. థాంక్స్ బిగ్ బాస్ అని శివాజీ చెప్పాడు. ఇప్పటికి శివాజీతో కలిపి ముగ్గరి జర్నీ వీడియోలు యూట్యూబ్ లో రిలీజ్ చేయగా.. శివాజీ జర్నీ వీడియోకే  అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది. ఇది పవర్ ఫుల్ జర్నీగా బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది. శివాజీ బిగ్ బాస్ టైటిల్ విజేత అని దీన్ని బట్టే తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే శివాజీ తన ఫెయిర్ గేమ్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. హౌస్ లో ఏదైన టాస్క్ తర్వాత శివాజీ పక్కన ఎవరైన హౌస్  మేట్ ఉంటే.. వారిద్దరిలో ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేయండి అని బిగ్ బాస్ చెప్తే.. మిగిలిన అందరు కలిసి శివాజీకే ఓట్ వేస్తారనేది అందరికి తెలిసిన నిజం. ఎందుకంటే శివాజీలో ఆటలో ఫౌల్,  మాటల్లో నెగెటివ్ అంటు ఏమీ ఉండవు. అందుకే అతడిని శివాజీ.. ది బాస్  అంటు ప్రేక్షకులు కామెంట్లలో తెలుపుతున్నారు.   

బిగ్ బాస్ చరిత్రలో రికార్డు.. శివాజీ గెలవాలని అన్నదానం చేసిన అభిమానులు!

బిగ్ బాస్ సీజన్-7 లో శివాజీ ఈజ్ అల్టిమేట్. అంతే కొందరు ఆడటం కోసం వస్తారు. మరికొందరు ఎంజాయ్ చేయడం కోసం వస్తారు. కానీ జనాలకి మంచిని అలవర్చాలని, కుర్రాళ్ళకి ఇన్ స్పైరింగ్ గా ఉండాలని, నిరంతరం హౌస్ లో ఏ సపోర్ట్ లేని యావర్, ప్రశాంత్ లకి అండగా నిలిచాడు‌. ఎంతలా అంటే ప్రశాంత్, యావర్ లలో ఎవరు నీకిష్టమని నాగార్జున అడుగగానే.. రెండు కళ్ళలో ఏ కన్ను ఇష్టమంటే ఏం చెప్పాలని చెప్పాడు. అంతలా వీరి ముగ్గురి బాండింగ్ ఉంది‌.  హౌస్ లో ఇంతవరకు ఎవరి గురించి నెగెటివ్ గా మాట్లాడకుండా.. నామినేషన్ లో గ్రూప్ గా వేయకుండా, ఫెయిర్ అండ్ క్లీన్ గా ఆడింది ముగ్గురే ముగ్గరు.. వాళ్ళే SPY(శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్). ఇక గత వారం వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడు హౌస్ మేట్స్ అందరు మిగిలిన వారిలో నుండి ఏదో ఒక క్వాలిటి నేర్చుకుంటారు కదా ఏంటని ఒక్కొక్కరిని అడిగాడు. శివాజీ గారి దగ్గర లౌఖ్యంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాని అంబటి అర్జున్ అన్నాడు. ఎదుటివాళ్ళు ఎంత బాధలో ఉన్న మనం మనసారా నవ్వితే చాలు ఆటోమేటిక్ గా ఆ భాద నుండి మనం బయటకు వస్తామనేది శివాజీ అన్న దగ్గరే నేర్చుకు‌న్నాని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. ఓపికగా ఎలా ఉండాలో శివాజీ అన్న దగ్గర నేర్చుకున్నానని యావర్ అన్నాడు. ఒకవేళ నామినేషన్ లో ఏదైన జరిగితే అది అయిపోయింది వదిలేయ్ అని చెప్పేస్తాడని యావర్ అన్నాడు. నవ్వుతూ ఏ సిచువేషన్ అయిన ఎదర్కోవడమే జీవితం అని అది శివాజీ దగ్గర ఉంటే నేర్చుకుంటావని నాగార్జున అన్నాడు. ఇక తాజాగా శివాజీకి సపోర్ట్ చేయమని చెప్తూ.. కొంతమంది అనాధలకి అన్నదాన కార్యక్రమం జరిపారు అభిమానులు‌‌. ఈ వీడియోని శివాజీ అఫీషియల్  పేజీలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. ఒక మనిషిని అభిమానిస్తే ఇంతలా చేస్తారా అనేదానికి మరో సాక్ష్యమంటు చేసిన ఈ గొప్ప పనికి జనాలు నీరాజనాలు తెలుపుతున్నారు. దీంతో శివాజీకి మరింత హైప్ వచ్చేసింది. ఇప్పటికే ఓటింగ్ లో నెంబర్ వన్ ర్యాంకింగ్ తో శివాజీ దూసుకెళ్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ఉన్నప్పుడు ఆ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయమని చెప్తూ అన్నదానం నిర్వహించడం ఇదే ప్రథమం. కాగా ఇప్పుడు ఇది బిగ్ బాస్ చరిత్రలో ఒక రికార్డుగా నమోదైంది.

అమర్ దీప్ జర్నీ వీడియో.. సినిమా ట్రైలర్ లా ఉందంట!

బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే పద్నాలుగు వారాలు పూర్తయింది. ఇక పదిహేనవ వారంలో హౌస్ లో మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.  పద్నాలుగవ వారం శోభాశెట్టి ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొదట అమర్ దీప్ జర్నీ వీడీయోని ప్లే చేసి చూపించాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ అందరిని లోపలే ఉంచి అమర్ దీప్ ని మాత్రం గార్డెన్ ఏరియాలోకి రమ్మని బిగ్ బాస్ చెప్పాడు. ఇక లోపలికి రాగానే మంచు కురుస్తుంది. ఇక లాంతరు దీపాలతో అలంకరించిన సెటప్ చూసి అమర్ దీప్ ఫిధా అయ్యాడు. ఇక అక్కడ తనకి సంబంధించిన ఫోటోలని చూసి  మురిసిపోయాడు అమర్ దీప్. తను పవరస్త్రని కోల్పోయినప్పటి ఫోటో, శోభాకోసం ఆడిన బీన్ బ్యాగ్ ఫోటో, లేడీ గెటప్ లో ఉన్న ఫోటో, నామినేషన్ లోని ఫోటో , ఫ్యామిలీ వీక్ లో తేజస్విని గౌడ వచ్చినప్పటి ఫోటో ఇలా అన్ని ఫోటోలని బిబి మెమోరీస్ బుక్ అనే బుక్ లో ప్రింట్ చేసి ఇచ్చాడు బిగ్ బాస్. అదంతా అమర్ దీప్ కి ఒక సర్ ప్రైజ్ గా అనిపించింది. ఇక బిగ్ బాస్ యాక్టివిటి ఏరియాకి పిలిచి తన మాటలతో అమర్ దీప్ ని మరింత మోటివేషనల్ చేసాడు.   అమర్‌దీప్.. మీ పేరుకి అర్థం ఎప్పటికీ వెలిగే జ్యోతి. అదే విషయం మీ ప్రయాణంలో ప్రతిబింబించింది. ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లాలనే కసి నిరంతరం మీలో జ్వలిస్తూ ఎలాగైనా ప్రతి ఆటలో గెలిచి చివరి వరకు చేరాలనే మీ తపన మీ ప్రయాణాన్ని మలిచింది. మీ చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని మీ అల్లరిని మీ వెటకారాన్ని మీ స్నేహితులకన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నవారు లేరు. మిగతా వారికి తెలీకుండా మీరు మీ గోడౌన్‌లో దాచిన ఆహారం గురించి బిగ్ బాస్ కు తెలుసు. ఎవరెన్ని నిందలు వేసిన మీలోని పట్టుదల ఒక్క శాతం కూడా తగ్గకుండా రెట్టింపు ఉత్సాహంతో పోరాడి ఫైనలిస్ట్ గా నిలిచారు. అమర్‌దీప్.. ఈ భూమి మీద పొరపాటు చేయని మనుషులు ఎవ్వరు లేరు. పొరపాట్లను తెలుసుకొని ముందుకు కదిలేవారిని ఎవ్వరు ఆపలేరని బిగ్ బాస్ అనగానే.. మీ మాటలు బాగున్నాయి బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అని అమర్ దీప్ అన్నాడు. ఆ తర్వాత తన జర్నీ వీడియోని బిగ్ బాస్ చూపించగా, అది చూసిన అమర్ ఫిధా అయ్యాడు. బిగ్‌బాస్.. గెలుపు, ఓటములు, నా గమ్యం, జనం సమాధానం తప్ప నాకు ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏం లేదు బిగ్‌బాస్. ఇది నా లైఫ్‌లో చాలా పెద్ద గిఫ్ట్. నా ఎమోషన్స్, నా పెయిన్, నా కోపం ప్రతీదీ చూపించారు. ఇంత బావుంటుందని అనుకోలేదు. ఎఫ్ అండ్ ఎఫ్.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఓకే తిట్టే వాళ్లు తిట్టుకోని ఎవరు ఏమైనా అనుకోని, చూడటానికి నాకు మాత్రం ఒక సినిమా ట్రైలర్‌లానే ఉంది బిగ్‌బాస్ అంటూ ఆడియన్స్ కి, బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పాడు అమర్ దీప్.

అమ్మానాన్న డివోర్స్ ఫేక్... పాట పాడిన రోషన్!

‘బబుల్‌ గమ్‌’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రోషన్ కనకాల. తల్లీతండ్రి  నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.  ఈ సినిమా  29న రిలీజ్ కాబోతోంది. మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మూవీ టీమ్ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది.  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన  తల్లిదండ్రుల గురించి పలు ఆసక్తికర విషయాలు వివరించాడు. చిన్నప్పటి నుంచే తనకు నటన పట్ల ఆసక్తి ఉందని చెప్పాడు రోషన్ కనకాల. చిన్నప్పుడు అమ్మతో కలిసి ఓ యాడ్ లో నటించడం సంతోషంగా అనిపించిందన్నారు. అప్పుడే నటుడిని కావాలనే కోరిక కలిగిందని చెప్పుకొచ్చాడు. “చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే  ఇష్టం. ఓసారి అమ్మతో కలిసి సర్ఫ్ ఎక్సెల్ యాడ్ లో నటించాను. చాలా సంతోషం కలిగింది. స్టూడెంట్ నంబర్ 1 మూవీ ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు.  అప్పుడే యాక్టింగ్ సైడ్ రావాలని  ఇంటరెస్ట్ కలిగింది. ఆ కోరికతోనే యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశాను. తర్వాత ‘ఒక మనసు’ మూవీలో  చిన్న క్యారెక్టర్ చేశాను. తర్వాత  ‘నిర్మలా కాన్వెంట్’లోనూ ఒక రోల్ చేసాను. ఇప్పుడు ‘బబుల్‌ గమ్‌’ మూవీతో  హీరోగా వస్తున్నాను” అని చెప్పాడు. అలాగే రాజీవ్ కనకాల, సుమ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలపైనా రోషన్ స్పందించాడు. అవన్నీ కేవలం పుకార్లుగా కొట్టి పారేశారు. “అమ్మానాన్న డివోర్స్ తీసుకుంటున్నట్లు వార్తలు సెల్ లో కనిపించింది అవి నేను చదువుతున్నా. అదే టైంలో నా ముందే అమ్మా నాన్న కూర్చుని మాట్లాడుకుంటున్నారు.  ఆ న్యూస్  చదువుతూ అమ్మానాన్న నవ్వుకున్నారు. విడాకుల విషయం గురించి ముందుగా ఇంట్లో వాళ్లకు తెలీకుండా మీడియాకి ఎలా తెలిసిందా అనుకున్నా.. ఇక మూవీ విషయానికి వస్తే బబుల్ గం లో ఇజ్జత్ అనే సాంగ్ ని పాడాను నేను." అని చెప్పాడు రోషన్.

పల్లవి ప్రశాంత్, శివాజీలలో ఎవరో ఒకరే విజేత.. శోభాశెట్టి సెన్సేషనల్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో‌ గత వారం రోజులుగా ఎన్నో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ దత్తపుత్రిక శోభాశెట్టిని ఎలిమినేట్ చేయరని అనుకున్నారంతా కానీ అందరికి ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చి ఎలిమినేట్ చేశాడు‌ బిగ్ బాస్. ఇక సీరియల్ బ్యాచ్ లో అమర్ దీప్, ప్రియాంక మిగిలారు. అర్జున్ గేమ్స్ లో గెలవడం వల్లే ఇప్పటిదాకా ఉన్నాడనేది వాస్తవం. లేదంటే అతని బిహేవియర్ కి ఎప్పుడో బయటకొచ్చేవాడు.  బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేముందు.. నేను తెలియక మిమ్మల్ని ఏం అయిన అని ఉంటే నిజంగా క్షమించండి అంటు శివాజీ కాళ్ళమీద పడింది శోభాశెట్టి. అయితే ఎలిమినేషన్ తర్వాత కొన్నిచోట్ల తన ఫ్యాన్స్ మీట్ అయ్యారు. అందులో కొందరు. ‌ ఎప్పుడో బయటకు రావాల్సింది. ఇప్పుడు వచ్చావంటూ కామెంట్ చేయగా శోభాశెట్టి అలియాస్ మోనిత ముఖం వాడిపోయింది. ఇక ఎలిమినేషన్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కొన్ని రోజులు రెస్ట్ కావాలి. జనరల్ గా అయితే బెంగుళూరుకు వెళ్ళాలి కానీ ఫినాలే ఉంది కదా అని అంది. హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారని ఒకరు అడుగగా.. నాకేం తెలియదు. ఫినాలే వీక్ కదా, ఎవరేం మాట్లాడుతున్నారో? బయటకు ఎలా ప్రొజెక్ట్ అయిందో తెలియదని అసలేం గుర్తులేదని శోభాశెట్టి అంది. టైటిల్ విన్నర్ ఎవరని మీరనుకుంటున్నారని అడుగగా.. నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే లోపల ఒకలా ఉంటుంది. బయట టీవీలో ఒకలా కన్పిస్తుందని అంది. బయట ఉన్న బజ్ ప్రకారం అమర్, ప్రశాంత్, శివాజీలలో ఒకరే టైటిల్ గెలుస్తారని అంటున్నారని ఒకరు అడుగగా.. అయ్యయ్యో అమర్ దీపా వాడెప్పపుడు ఫౌల్ గేమ్సే ఆడతాడు‌. వాడికి అంత లేదు‌‌. అయితే ప్రశాంత్, శివాజీలలో ఎవరో ఒకరే అని శోభాశెట్టి అంది. భోలే షావలితో నామినేషన్ లో జరిగిన గొడవ మీకేమైనా నెగెటివ్ అవుతుందని అనుకున్నారా అని అడుగగా. ‌ అసలు అనుకోలేదని శోభా అంది. మోనితలాగా వాయిస్ పెద్దగా చేసి మాట్లాడటం వల్ల మీరు మరింత బ్యాడ్ అయ్యారని అనుకుంటున్నారా అని అడుగగా.. లేదంటి. అసలెప్పుడు అలా అనుకోలేదు. ఎందుకంటే నేను ఒక అబ్బాయికి స్టాండ్ తీసుకున్నాను. అందుకే అంత గట్టిగా మాట్లాడాను‌. అబ్బాయి అయిన అమ్మాయి అయిన మాట్లాడొచ్చు ఎందుకంటే హౌస్ లో జెండర్ ఢఫరెన్స్ లేదు. శివాజీ మైండ్ గేమ్ ఆడుతున్నారని అనిపించిందా అని అడుగగా.‌. అని బిగ్ బాస్ హౌస్ అక్కడ స్ట్రాటజీ, మైండ్ గేమ్ అన్నీ ఉండాలి లేదంటే మనం ఉండలేం అక్కడ అని శోభా అంది. ఇక ఫైనల్ గా ఎవరికి మీ సపోర్ట్ అని అనగా‌‌.. అర్జున్, ప్రియాంకకి నా  సపోర్ట్ అని శోభా అంది.  

అమర్ దీప్ ఇలాంటివాడని అనుకోలేదు.. శోభాశెట్టి బయటపెట్టిన నిజాలు!

బిగ్ బాస్ సీజన్-7 లో‌ అతి‌ ఎక్కువ మందికి తెలిసిన కంటెస్టెంట్ శోభాశెట్టి.‌ ఎందుకంటే తన ఆటతీరుతో మాటతీరుతో‌ ప్రేక్షకులకి పిచ్చెక్కించింది.‌ శోభాశెట్టి సంఛాలక్ అంటే చాలు ఆ టాస్క్ మొత్తం గొడవలే అన్నంతగా మారిపోయింది సీన్.‌ ఒక పాములగా పగపట్టి కాటేస్తుందని అశ్విని‌ అన్నట్టుగా.. ఎవరితోనైన గొడవపడితే చాలు నామినేషన్ లో‌ ఆ గొడవ జరిగిన అవతలి వ్యక్తి ఉండాల్సిందే. శివాజీని టార్గెట్ చేస్తూ చేసిన ప్రతీ మాట‌ తన ఎలిమినేషన్ లో‌ ముఖ్య పాత్ర వహించాయి. ఇక బిబి బజ్ ఫుల్ ఇంటర్వ్యూ వచ్చేసింది. ఇందులో గీతు అడిగే ప్రశ్నలన్నింటిలో కొన్నింటికి మాత్రమే సమాధానాలని చెప్పింది.‌‌ మీరు‌ గ్రూప్ గా కలిసి నామినేషన్ చేశారా అని అడుగగా.. మేం‌ ఒక్కసారి కూడా గ్రూప్ గా ఆడలేదని, మేం ఫ్రెండ్స్ అని శోభా అంది. దాంతో‌‌ శివాజీ, ప్రశాంత్, యావర్ లని నామినేషన్ పెట్టాలని తేజని పిలిచి చెప్పిన వీడియో ఒకటి, సింక్ అండ్ ఫ్లోట్ టాస్క్ లో‌ అమర్ దీప్ కి హెల్ప్ చేసిన వీడియో ప్లే చేసి చూపించి ఇది గ్రూపిజం కాదా అని అడుగగా.. కాదు మేం ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకున్నామని శోభా అంది. తేజ నువ్వు వెళ్ళిపోతే నేను హౌస్ లో ఉండలేనని అన్నావ్? అతను బయటకు వచ్చాక ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడుకోలేదని అడుగగా.. నేను తేజ కోసం బిగ్ బాస్ కి రాలేదంటూ సూటిగా చెప్పింది. " బడ్డీ టాస్కులో ప్రియాంక వల్లే మీరు ఓడిపోయారనే ఫీలింగ్ మీకు ఉంది కదా" అని అడుగగా.. మా మధ్య ఆ డిస్కషనే రాలేదని శోభా అంది. ప్రియాంక ఫీల్ అయిన వీడియో చూస్తారా అని గీతూ అడుగగా.. దీంతో బిగ్‌బాస్ డేస్ నా లైఫ్‌లో అయిపోయాయని శోభా అంది. ఇంకా అయిపోలేదు, బిగ్‌బాస్ బజ్ కూడా అయితేనే అయినట్లంటు కౌంటర్ వేసింది గీతు. ఇక అమర్ విన్నర్ అవ్వాలని అనుకుంటున్నారు కదా మరి తను మీ గురించి ఏమన్నాడో చూడండి అంటూ ఓ వీడియో వేసింది చూపించింది. ఇందులో ప్రియాంకతో శోభా గురించి మాట్లాడుతూ.. తను బ్యాక్ బిచ్చింగ్ అని అమర్ అన్నాడు. ఈ వీడియో చూడగానే శోభా షాకైంది. ఆ తర్వాత హౌస్‌మెట్స్ ఫొటోలు ఒక్కొక్కరివి చేత్తోనే ఇరగ్గొట్టేసి వారి గురించి చెప్పింది. శివాజీ ఫొటో పట్టుకొని "బిగ్‌బాస్ హౌస్‌లో నువ్వు నెగ్గుకు రావాలంటే శివాజీ సర్ ఆడుతున్న స్ట్రాటజీతో ఆడితే నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవుతావ్" అంటూ శోభా చెప్పింది. ఇక ఇది విని సేఫ్ శోభా అని చెప్పేసరికి.. శోభాకి కోపం వచ్చేసింది. ఒక కొశ్చన్‌కి ఆన్సర్ లేకపోతే సింపుల్‌గా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని అంటారా అని గీతు అడుగగా.. బిగ్ బాస్ ముగిసిపోయింది. ఇక నేను మర్చిపోవాలనుకున్నా కానీ ఏదీ చెప్పనని శోభాశెట్టి అంది. " నా బెస్ట్ ఫ్రెండ్. తను బాగా ఆడుతుంది. నేను లేనే అని జెలస్ ఫీల్ అవుతున్నాను" అని ప్రియాంక ఫోటో చూపించి శోభా అంది. నాకు ఫౌల్ గేమ్ అనే పేరొచ్చిందే వీడివల్ల అంటు అమర్ దీప్ ఫోటోని చూపించింది.  యావర్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, మిస్ అండర్ స్టాండింగ్ ఎక్కువ, కోపం ఎక్కువ అని యావర్ గురించి చెప్పింది.  అన్నా మల్లొచ్చినా.. ప్రశాంత్ ఇన్నోసెంట్ అని మనం అనుకుంటాం కానీ అతనికి అన్నీ తెలుసు. చాలా బ్యాలెన్స్ గా ఆడుతున్నాడు. చాలా స్టార్ట్ గా ఆడుతున్నాడని శోభా అంది.  

ఏం ఉంటుందిలే అనుకున్నా కానీ సంపి వదిలాడు:అంబటి అర్జున్!

బిగ్ బాస్ సీజన్-7 లో‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ అంబటి అర్జున్. పవరస్త్రని గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా ఫైనల్ కి చేరుకున్న కంటెస్టెంట్ అంబటి అర్జున్. ‌ఇక ఫినాలే వీక్ లో హౌస్ లో అరుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారి జర్నీ వీడియోలని బిగ్ స్క్రీన్ మీద వేసి చూపించాడు. మొదట అమర్ దీప్ జర్నీ వీడియో వేశాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ జర్నీ వీడియోని ప్లే చేసి చూపించాడు బిగ్ బాస్. అర్జున్‌ ఒక్కడినే గార్డెన్ ఏరియాలోకి రమ్మని పిలిచాడు బిగ్ బాస్. అందులో మంచు పడుతుంటే మధ్యలో లైట్స్ అండ్ డెకరేషన్ ఆ సెటప్ తన జర్నీ ఫొటోలు చూసి అర్జున్‌ ఫిధా అయ్యాడు. ఇక తన ఆల్బమ్ ఓపెన్ చేయగానే అందులో తన భార్య హౌస్‌లోకి వచ్చిన ఫొటోలు చూసి ఎమోషనల్ అయ్యాడు అర్జున్. పప్పీ.. ఫొటోస్ చూడు భలే వచ్చాయ్.. థాంక్యూ బిగ్‌బాస్.. ఈ మూడు ఫొటోలు నా బెస్ట్ అంటూ అర్జున్ అన్నాడు. ఇక అక్కడే ఒక గిన్నెలో ఉల్లిపాయలు కూడా పెట్టాడు బిగ్‌బాస్. వీటిని చూసి తన టాస్కు గుర్తొచ్చి నవ్వుకున్నాడు అర్జున్. ఈ పది వారాలు నా లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేని జర్నీ బిగ్‌బాస్ అంటూ అర్జున్ చెప్పాడు. కళ్ల ముందు ఒకసారి అలా తొమ్మిది వారాలు కనిపించాయి. థాంక్యూ సోమచ్ బిగ్ బాస్ అంటు అర్జున్ చెప్పాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అర్జున్ వచ్చిన క్షణాల నుంచి ఫినాలే అస్త్ర గెలిచినంత వరకూ అర్జున్ జర్నీని వీడియోని రూపొందించాడు బిగ్ బాస్. ముఖ్యంగా అడుగుపెట్టిన తర్వాతి రోజే రెండు చేతులతో రెండు రాకెట్లను పట్టుకొని యావర్‌ని ఓడించిన టాస్కు హైలెట్‌గా చూపించారు. ఇక నాగార్జునని ఇమిటేట్ చేసిన సీన్,  అమర్, ప్రశాంత్ ల మధ్య గొడవని ఆపిన సీన్, పోల్ డ్యాన్స్ చేసే సీన్, బేబిలతో అర్జున్ ఆడుకున్నప్పుడు.. నువ్వు మంచి తండ్రివి అవుతావని ఆ బేబీ డాల్స్ చెప్పే సీన్ అంతా కూడా బాగా ఆకట్టుకుంది. ఇక గేమ్ మొదలుపెట్టి ప్రతి టాస్కులోనూ దూసుకెళ్లిపోయిన తన ఆట చూసి అర్జున్ నవ్వుకున్నాడు. ఇక హౌస్‌లోకి తన భార్య వచ్చినప్పుడు ఎమోషనల్ అయిన సీన్లు చూసి అర్జున్ ఏడ్చేశాడు. ఇక శివాజీ ఫ్రెండ్ షిప్ బ్యాండ్ తీసేసింది, అందరూ నామినేషన్లు వేసింది నీట్ గా ఉంది. ఇక చివరిలో వరుసగా టాస్కులు గెలిచి ఫినాలే అస్త్ర గెలిచినవి చూపిస్తూ వెనకాల బాహుబలి మ్యూజిక్ వేసి ఇరగదీశాడు బిగ్ బాస్. తన జర్నీ వీడియో పూర్తి కాగానే అర్జున్‌ ఫిధా అయ్యాడు. అసలేం మాట్లాడాలో తెలీక కాసేపు సైలైంట్ అయ్యాడు అర్జున్. లైఫ్‌లో ఫస్ట్ చైల్డ్ అంటే అందరికీ స్పెషలే కానీ ఇలాంటి సమయంలో కూడా నన్ను సపోర్ట్ చేసి పంపించింది నా వైఫ్. నిజంగా తన కల పూర్తిగా నెరవేర్చాలనే ఉంది. ఒక్కడినే ఉన్నాను. నా కోసమే ఆడాను. ఒక్కడినే ఇక్కడి వరకు వచ్చాను. మీరిచ్చిన మెమోరీస్ ఎప్పటికీ మర్చిపోలేను బిగ్‌బాస్. నిజంగా ఈ జర్నీ మెమోరీస్‌కి రుణపడి ఉంటాను. థాంక్యూ సో మచ్ బిగ్ బాస్ అంటూ అర్జున్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు అర్జున్.  జర్నీవీడియో ఎలా ఉందని హౌస్ మేట్స్ అడగ్గానే "నేను ఏముంటుందిలే అనుకున్నా.. సంపి వదిలారు అసలు " అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు.    

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అతనే.. రతిక సంచలన కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో‌ ప్రతీవారం ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఇప్పటికి పద్నాలుగు వారాలు ముగిసాయి. అయితే ఇందులో  రతిక రోజ్ మాత్రమే రెండుసార్లు హౌస్ లోకి వెళ్ళి రెండుసార్లు ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. అయితే ఈ రెండుసార్లు కూడా పల్లవి ప్రశాంత్ ఎఫెక్ట్‌తోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిందనేది వాస్తవం. అయితే తాజాగా రతిక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ ఆట గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది‌. ‘నాకు ఫేమ్ లేకుండానే బిగ్ బాస్‌కి వెళ్లాను. బిగ్ బాస్ ఆట ఎలా ఆడాలని తెలుసుకునే లోపే నా సెకండాఫ్ జర్నీ కూడా అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో వెళ్లిన వాళ్లు.. బయట జరిగింది మొత్తం పూస గుచ్చినట్టు హౌస్‌లో ఉన్న వాళ్లకి చెప్పేశారు. వాళ్లని కంట్రోల్ చేయాల్సింది. కానీ అలా చేయకపోవడం వల్ల బయట జరిగిన విషయాలతో నన్ను ట్రిగ్గర్ చేసి మాట్లాడేవారు. బయట చాలా ఇబ్బందుల్ని తట్టుకుని రెండోసారి హౌస్‌లోకి వెళ్లాను. కానీ అక్కడ కూడా నన్ను పొడుస్తున్నట్టుగానే మాట్లాడేవాళ్లు. నా ప్రయత్నం నేను చేశాను.. కానీ హద్దులు దాటేయడంతో నేను తట్టుకోలేకపోయాను. ఫస్ట్ టైమ్ వెళ్లినప్పుడు ఎలా ఆడాలో తెలియలేదు. కానీ రెండోసారి వెళ్లినప్పుడు ఏం మాట్లాడితే ఏమౌతుందనే భయంతో ఆడాను. నాకు భయం అంటే ఏంటో తెలియదు. కానీ ఆడియన్స్ నన్ను ట్రోల్స్ చేస్తారేమో అనే భయం చాలా ఉంది. దాంతో నేను నాలాగా ఉండలేకపోయాను. ఎందుకంటే లోపల నేను ప్రశాంత్ మాట్లాడిన మాటలతో నన్ను ఆడియన్స్ వేరేలే చూశారు. అది నన్ను బాధపెట్టింది. సోషల్ మీడియాని పట్టించుకోకుండా వెళ్లాల్సింది. నేను రెండోసారి వెళ్తున్నాననే విషయం ముందే రివీల్ చేయడంతో.. నువ్వు వెళ్తున్నావ్ కానీ వారంలోని లాక్కొస్తామనే నా ఇన్ స్ట్రాగ్రామ్ పోస్ట్ ల కింద కామెంట్లు పెట్టేవారు. దీంతో ఫస్ట్ టైమ్ ఉన్నంత ఫైర్ రెండోసారి వెళ్లినప్పుడు లేదు. అందుకే జనాలు నన్ను బయటకు తీసుకొచ్చేశారు. ఇక ప్రశాంత్ గురించి చెప్పాలంటే.. అతనికి నేను చెప్పే విధానం సరిగా లేకపోవడం వల్ల నేను బ్యాడ్ అయ్యాను. నువ్వు నా పైన కాకుండా గేమ్‌పై కూడా ఫోకస్ పెట్టి ఆడు అని స్వీట్‌గా చెప్పి ఉంటే బాగుండేది. " సోఫాపై పేర్లు రాయడం, కిస్ లు అవి కాదు ప్రశాంత్.. ఇంత కష్టపడి వచ్చావ్ కదా, ఇవన్నీ వదిలేసి గేమ్‌పై ఫోకస్ పెట్టి బాగా ఆడు అని కూల్ గా చెప్పి ఉంటే అది క్యూట్‌గా ఉండేది. అదొక స్టోరీ అయ్యేది. కానీ వేరేలా చెప్పడం అది వేరేలా జనంలోకి వెళ్లడంతో నేను బ్యాడ్ అయ్యాను" అని రతిక చెప్పుకొచ్చింది.  ప్రశాంత్‌కి ఎక్కడో మచ్చ ఉంది. అదృష్టం ఉంది. నేను బయటకు వచ్చేసిన తర్వాత ప్రశాంత్ ఆట బాగా ఇంప్రూవ్ అయ్యింది. బాగా ఆడుతున్నాడు. అతడు విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రతిక తన మనసులో మాట చెప్పుకొచ్చింది.  

ఆదిరెడ్డి న్యూ సెలూన్ ..రిబ్బన్ కట్ చేసిన రాహుల్ సిప్లిగంజ్

బిగ్ బాస్ రివ్యూ వీడియోస్ తో పేరు తెచ్చుకున్న ఆదిరెడ్డి గురించి అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ కేటగిరీలో  బిగ్ బాస్ లోకి పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ చేంజ్ ఐపోయింది.   బిగ్ బాస్ సీజన్ 6 తో స్టార్ ఐపోయాడు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక  పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. రీసెంట్ గా  ఆదిరెడ్డి విజయవాడలోని కాస్ట్లీ ఏరియా ఐన లోటస్ ల్యాండ్ మార్క్ లో  ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్   బ్రాంచ్ ని స్టార్ట్ చేసాడు. ఈ సెలూన్ ని  సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో రిబ్బన్ కటింగ్ చేయించాడు.   ఈ ఫొటోస్ ని, వీడియోస్ ని ఆదిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి అవి వైరల్ అయ్యాయి. "మా కోసం విజయవాడ వచ్చి సెలూన్ ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ రాహుల్ సిప్లిగంజ్ అన్న. నా లైఫ్ లో ఇది మొదటి బిజినెస్. దీని వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం 15 మందికి వర్క్ ఇస్తున్నాము, దానికి చాలా సంతోషంగా ఉంది" అంటూ తన స్టయిల్లో  ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి వైఫ్ కవిత వాళ్ళ ఫామిలీ మెంబర్స్ అంత పాల్గొన్నారు.  దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆదిరెడ్డికి కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పని చేసిన ఆదిరెడ్డి  బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నుంచి యూట్యూబ్‌లో రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మొదట ఏమంత ఫాలోయింగ్ లేకపోయినా  ఆ తర్వాత మాత్రం ఆదిరెడ్డి రివ్యూస్ కి అతని ఛానల్ కి  మంచి ఫాల్లోవింగ్ వచ్చి  పాపులర్ అయ్యారు. అలాగే ఆదిరెడ్డి భార్య ‘కవిత నాగ వ్లాగ్స్’ పేరుతో ఒక  యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఆది రెడ్డికి ఓ చెల్లి కూడా ఉన్నారు. ఆమె పేరు నాగలక్ష్మి.. ఆమెకు కళ్ళు కనిపించవు.. ఇక ఈమె ఆదిరెడ్డి ఫామిలీతోనే కలిసి ఉంటుంది.

శివాజీకి షాకిచ్చిన కొడుకు రిక్కీ.. అతన్ని గెలిపించండి అంటూ రిక్వెస్ట్!

బిగ్ బాస్ సీజన్-7 కథ క్లైమాక్స్  వచ్చింది. హౌస్ లో‌ఎన్నో గొడవలు, ఎన్నో టాస్క్ లు ఎంతోమంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళి, వచ్చారు. ఇక గతవారం శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వడంతో హౌస్ లో ప్రశాంత్, శివాజీ, అర్జున్, యావర్, అమర్ దీప్, ప్రియాంక జైన్ మాత్రమే ఉన్నారు. దాంతో  ఈ ఆరుగురిలో టైటిల్ గెలిచేదెవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే హౌస్ లో ఉన్నవారిలో ఎవరు విజేత అవ్వాలని భావిస్తున్నారో వారికి ఓటు వేయండి అని కంటెస్టెంట్స్ కి ఇచ్చిన నెంబర్ లకి మిస్డ్ కాల్ ఇస్తూ ఒక ఓట్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆప్ లో మరో ఓట్ ని వేసే సదుపాయాన్ని కల్పించాడు బిగ్ బాస్. దాంతో కంటెస్టెంట్స్ యొక్క అభిమానులు తమ ప్రియమైన వారికి ఓట్ చేస్తున్నారు‌. అయితే వీరిలో రైతుబిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ నెంబర్ కి కాల్ చేస్తుంటే కలవట్లేదనే మొన్నటి నుండి సాగుతుంది.  అయితే ఇది కావాలనే చేస్తున్నారా లేక టెక్నికల్ ప్రాబ్లమా? అని తెలియట్లేదు‌. ఇదే విషయాన్ని శివాజీ చిన్న కొడుకు రిక్కీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు.  ఇప్పటి దాకా మీ శివన్నకి ఓట్ చేసి గెలిపించారు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి‌. మీరు చేసే ఓటింగ్ చాలా కీలకం.. ఇదే చివరి వారం. నేను ఒక ఛాలెంజ్ విసిరాను. దానికి మా నాన్న బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. నేను మార్నింగ్ 6AM నుండి ఓట్ వేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. మీరు ట్రై చేస్తూనే ఉండండి ఏదో ఒక టైమ్ లో ఓట్ పడుతుంది. శివన్నకి మీ సపోర్ట్ అవసరం అంటూ రిక్కీ ఈ వీడియోలో తెలిపాడు‌. ఈ వీడియో ఇప్పటికే ఫుల్ వైరల్ గా మారింది. దాంతో శివాజీతో పాటు పల్లవి ప్రశాంత్ కి ఓట్లు బాగా పడే అవకాశం ఉంది‌. మరికొన్ని రోజుల్లో బిబి ఫినాలే ఉంటుంది.  కాగా ఈ బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ గెలిచేదెవరనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది.

కీరవాణి నాకు మామ..తమన్ మా బాబా

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ చాల ఫన్నీగా సాగిపోయింది. ఇందులో సద్దాం వేసిన జోక్స్ కి ఆడియన్స్ పడీపడీ నవ్వుకున్నారు. కీరవాణి తనకు మామ అవుతాడని కూడా చెప్పాడు. ఈ షోకి ఎంట్రీ ఇచ్చిన సద్దాం "కీరవాణి గారిని నేను వాణి అని పిలుస్తాను.. ఆయన అసలు పేరు వాణి..ఆయన కీరాలు బాగా గట్టిగా తింటాడు కాబట్టి కీరవాణి అయ్యాడు. బేసిక్ గా ఆయన నాకు మామ. ఒకసారి బాహాబాబు కంపోజింగ్ జరుగుతున్నప్పుడు మామ, నేను, రాజమౌళి గారు అందరం కూర్చుని ఉన్నాం..అప్పుడు ఎందుకో నేను డల్ గా ఉంది బాధపడుతున్నా...ఏంటి అల్లుడు బాధపడుతున్నావ్ అని అడిగాడు. ఎం లేదు మామ నేను ఒక సినిమా ఒప్పుకున్నా. ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మధ్య ఇరుక్కుపోయాయి అని చెప్పా. వెంటనే కీరవాణి మామ నా పీక పట్టుకున్నాడు..అప్పుడు ఇరుక్కుపో అనే సాంగ్ లైన్ వచ్చింది.. అదే బాహుబలిలో కంపోజ్ చేశారు. మొత్తం సెట్ లో బల్లులు, ఎలకలు ఉంటాయా..ఒకసారి బల్లి కింద పడింది..మామ బల్లి బల్లి అన్నాను.. అంతే బలిబలిబలిరాబలి...సాహోరే బాహుబలి అనే సాంగ్ రాసేశారు...ఇక మా బాబాయ్ తమన్ గురించి చెప్పాలంటే..ఒక మూవీ గురించి నేను బాబాయ్ కూర్చున్నప్పుడు టీ తెమ్మని చెప్పాను..అక్కడ ఒకతను దుప్పటి కప్పుకుని కూర్చున్నాడు. ఇక మా దగ్గరకు రకరకాల టీలు వస్తూ ఉన్నాయి.. అప్పుడే ఈ లైన్ వచ్చింది సిమ్మటి సీకటి..కమ్మటి సంగటి అని సాంగ్ ని కంపోజ్ చేశారు" అంటూ సద్దాం సరదాగా వాళ్ళతో కామెడీ రిలేషేన్స్ కంటెంట్ ని జెనెరేట్ చేసి నవ్వించాడు. 

Krishna Mukunda Murari:ఆ క్లూతో మురారి తన గతాన్ని గుర్తుకుతెచ్చుకోగలడా?

స్టార్  మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -337 లో.. కృష్ణ భర్త ఎవరు? ఎక్కడ ఉంటారని ఎవరిని అడిగిన చెప్పడం లేదని  మురారికి కోపం వచ్చి అందరితో ఎవరు చెప్పకండి. నేనే ఆ కృష్ణ దగ్గరికి వెళ్లి అడుగుతానని అనగానే.. కృష్ణ ఎక్కడ నిజం చెప్తుందోనని‌ ముకుంద టెన్షన్ పడుతు నేను వస్తానని అంటుంది. అవసరం లేదంటూ మురారి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.  ఆ తర్వాత మురారి అలా కృష్ణ దగ్గరికి వెళ్లడంతో మధు హ్యాపీగా ఫీల్ అవుతు.. ఇది కదా కావలిసింది అటూ ముకుందకి కోపం వచ్చేలా మాట్లాడుతాడు. మరొకవైపు పెద్ద అత్తయ్య నన్ను దూరం పెడుతున్నారు. ఒక్క నిమిషం నా గురించి అలోచిస్తే బాగుండు అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. పెళ్లి అయ్యిన అమ్మాయితో ఇలా వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయిన పెద్దమ్మ నేను కృష్ణకి దూరంగా ఉండడానికి అబద్ధం చెప్పిందేమోనని మురారి ఇబ్బంది పడుతూనే కృష్ణ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత కృష్ణ మెడలో తాళి చూసిన మురారి.. పెద్దమ్మ అబద్దం చెప్పలేదు. అసలు ఇన్ని రోజులు ఆ తాళిని నేనెందుకు గమనించలేదు. గమనిస్తే ఇక్కడి వరకు వచ్చేది కాదని మురారి అనుకుంటాడు. నా మెడలో తాళి చూసి సర్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మీ భర్త ఎక్కడ అని కృష్ణని మురారి అడుగుతాడు. కృష్ణ చాలా తెలివిగా సమాధానం చెప్తుంది. నా భర్త ఎవరో మీక్కూడా తెలుసు. మీకు గతం గుర్తుకు వస్తే నా భర్త ఎవరో తెలుస్తుంది. మరొకవైపు లోపల ఉన్న శకుంతల.. ఇప్పటికి అయిన నిజం చెప్పు అని అనుకుంటుంది. కృష్ణ అలా అనగానే నాకు గతం గుర్తుకు వస్తే.. మీ భర్త ఎవరో తెలియడమేంటని మురారి ఆశ్చర్యపోతాడు. మీరు గతం గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి. ఒక డాక్టర్ గా చెప్తున్నానని కృష్ణ అంటుంది. అంతే కాకుండా నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళను ఇంకా నా భర్తకి నాకు ఎలాంటి విబేధాలు లేవని మురారికి క్లూ కూడా ఇస్తుంది కృష్ణ. ఇక ఆ తర్వాత మురారి ఆలోచనలో పడతాడు. మరుసటిరోజు ఉదయం ఒకవైపు కృష్ణ మరొక వైపు  ముకుంద, మురారి తులసి పూజ చేస్తుంటారు. మురారిని కృష్ణ చూస్తు పూజ చేస్తుంటుంది. అలాగే మురారి పక్కన ముకుంద ఉన్న పట్టించుకోకుండా కృష్ణ వంకే చూస్తుంటాడు. తరువాయి భాగంలో.. కృష్ణ దగ్గరికి మురారి ఆపిల్ ముక్కలు, చట్నీ తీసుకోని వస్తాడు. అది చూసిన కృష్ణ.. ఏసీపీ సర్ కి గతం గుర్తుకు వస్తుందని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi:రాజ్ తో  రహస్యంగా మాట్లాడిన ఆ అమ్మాయి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్  సోమవారం నాటి ఎపిసోడ్ - 276 లో.. కళ్యాణ్, అనామికల పెళ్లి జరగాలని అక్కడ ఎండిపోయిన మొక్కని మారుస్తుంది కావ్య. ఉదయం మొక్కని చూసిన ఇంట్లో వాళ్ళంతా.. పచ్చగా ఉందని కళ్యాణ్, అనామికల పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అవుతారు. ఆ తర్వాత కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి నీవల్లే ఇదంతా మొక్క మార్చడం నేను చూసాను వదిన. ఈ పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం మీరే థాంక్స్ అంటూ కళ్యాణ్ చెప్తాడు. ఆ మాటలు అన్ని కూడా రాజ్ విని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు.  ఆ తర్వాత రాజ్ విని లోపలికి వెళ్లడం చూసిన కావ్య.. ఇప్పుడు ఎంత గొడవ చేస్తారో అని రాజ్ వెనకాలే వెళ్లిపోతుంది. కానీ రాజ్ మాత్రం తన తమ్ముడి సంతోషం కోసం ఇదంతా చేస్తున్నావని అంటాడు. మరి మీ తమ్ముడి విషయంలో చేస్తే మీకు న్యాయం అనిపించింది. నా అక్క విషయంలో చేస్తే మోసం అనిపించిందా అని కావ్య అడుగుతుంది. ఇలా ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది. మరొక వైపు అప్పుతో కళ్యాణ్ పెళ్లి ఎలా చెయ్యాలని కనకం ఆలోచిస్తుంటుంది. ఈ కనకం నిద్రపోకుంటే నాకు టార్చర్ చూపిస్తుంది. ఎలా అయినా పడుకునేలా చెయ్యాలని రుద్రాణి తను డ్రింక్ చేస్తూ కొంచెం కనకానికి జ్యూస్ అని చెప్పి తాగమని ఇస్తుంది. ఇక మందు తగిన కనకం మత్తులో రుద్రాణినిని ఒక అట ఆడుకుంటుంది. నా కూతుళ్లు ఈ ఇంట్లో ప్రశాంతంగా లేకుండా చేస్తున్నావ్ కదే అంటూ రెచ్చిపోయి రుద్రాణిని కొట్టబోతుంటే రుద్రాణి తప్పించుకొని బాత్రూమ్ లో దాక్కుంటుంది. మరొకవైపు తను చేసిన పని గురించి దేవుడికి చెప్పుకుంటు ఉంటుంది కావ్య. ఆ ప్రేమికులని కలపాలని ఇలా చేస్తున్నానంటూ దేవుడికి మొక్కుకుంటుంది. ఆ తర్వాత రాజ్ కి శ్వేత అనే అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కాల్ చూసి రాజ్ టెన్షన్ పడుతు.. లిఫ్ట్ చేసి ఎందుకు చేసావ్ నైట్ ఒక మెసేజ్ చేస్తే చూసుకొని ఫోన్ చేసేవాడిని కదా అంటూ రహస్యంగా మాట్లాడుతుంటే.. అప్పుడే కావ్య వస్తుంది. తనకి వినిపించకుండా కంగారుగా రాజ్ మాట్లాడతాడు.  రేపు మన ఫేవరెట్ ప్లేస్ లో కలుద్దామని ఆ అమ్మాయి అనగానే రాజ్ సరే అని ఫోన్ కట్ చేస్తాడు. ఆఫీస్ కాల్ కూడా అలా నాకు వినిపించకుండా మాట్లాడాలా? ఆఫీస్ విషయలు ఎవరితో అయిన చెప్తాననా అని కావ్య అనగానే.. హమ్మయ్య వినలేదని రాజ్ అనుకుంటాడు. మరొక వైపు అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. ఆ విషయం కనకం విని పెళ్లి ఎలాగైనా క్యాన్సిల్ చెయ్యాలని ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu:ఇంటరాగేషన్ లో ముకుల్ కి షాకిచ్చిన శైలేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -943లో.. ఇంటరాగేషన్ కోసం శైలేంద్ర దగ్గరికి ముకుల్ వస్తాడు. ఇక అన్ని ప్రశ్నలతో ముకుల్ శైలేంద్రని టెన్షన్ పెడుతాడు. చివరికి జగతి హత్యకి సంబంధించి రౌడీతో శైలేంద్ర ఫోన్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ని వినిపిస్తాడు. అందరి ముందు ఆ వాయిస్ నీదేనా అని ముకుల్ అడుగుతాడు. నాదే అని శైలేంద్ర అనగానే.. ఎంత పని చేసావు రా అంటూ ఫణీంద్ర శైలేంద్రపై చెయ్యి చేసుకుంటాడు. ఆ తర్వాత ఇక అన్ని నిజలు బయటపడుతాయని మహేంద్ర, వసుధారలు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక స్టేషన్ కి వెళదామా తప్పు ఒప్పుకున్నారు కదా అని ముకుల్ అనగానే.. వస్తాను ఒక నిమిషం అంటూ మమ్మీ నా ఫోన్ తీసుకోని రా అని చెప్పగానే దేవయాని ఫోన్ తీసుకోని వస్తుంది. నేను హాస్పిటల్ లో ఉండగా నాకు ఒక ఫోన్ వచ్చింది అంటు ఒక వాయిస్ రికార్డింగ్ ని వినిపిస్తాడు. అందులో జగతి కేసు లో మీరే నిందితుడుగా ఉన్నారు. మిమ్మల్ని తప్పిస్తాను. నాకు డబ్బులు ఇవ్వండి అంటు ముకుల్ వాయిస్ తో ఆడియో ఉండడం చూసి అందరు షాక్ అవుతారు. ఆ వాయిస్ నాది కాదని ముకుల్ అంటాడు. మీరు ఇప్పుడు వినిపించింది నా వాయిస్ అయినప్పుడు ఇది మీ వాయిస్ ఎందుకు కాదని శైలేంద్ర అంటాడు. మంచికే కాదు చెడుకి కూడా టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. ఎవరు ఈ పని చేస్తున్నారో అంటు శైలేంద్ర అంటాడు.  ఆ తర్వాత శైలేంద్రకి‌ రిషి ఫోన్ చేసినట్లుగా మరొక రికార్డింగ్ ని శైలేంద్ర వినిపిస్తాడు. అందులో ఎండీ చైర్ లో వసుధారని కూర్చోపెట్టడానికి జగతిని తొలగించాను. ఇప్పుడు నిన్ను కూడా అడ్డు తొలగించాలని ఇలా ఎటాక్ చేసానని రిషి మాట్లాడినట్టుగా ఆ వాయిస్ రికార్డింగ్  ఉంటుంది. రిషి అలాంటి వాడు కాదని మహేంద్ర అంటాడు.  రిషి అలాంటి వాడు కాదని నాక్కూడా తెలుసు. ఎవరో మన కుటుంబంపై ఇలా చేస్తున్నారు. నాపై ఎటాక్ చేసినప్పుడు.. మీ కుటుంబంలో ఎవరిని వదిలి పెట్టానంటూ చెప్పి వెళ్ళారని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి అసలు ఎక్కడ ఉన్నాడో? బ్రతికి ఉన్నాడో? లేదో అనగానే వసుధార కోపంగా.. ఆపండి ఇంకొసారి రిషి సర్ గురించి అలా మాట్లాడకండి. రిషి సార్ కీ ఏమైనా అయితే ఎవరిని వదిలి పెట్టనని వసుధార వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ముకుల్ అన్ని విషయలు కనుక్కుంటాను. మీకు వచ్చిన ఫోన్ కాల్స్ గురించి ఎంక్వయిరీ చేస్తానంటూ చెప్పి ముకుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార, మహేంద్ర.. ఇంత నాటకం ఆడిన శైలేంద్ర గురించి మాట్లాడుకుంటారు. ముకుల్ కి నిజం తెలిసిపోయిందని ఇదంతా డ్రామా క్రియేట్ చేసాడని అనుకుంటారు.  రిషి సర్ ఇంకా రాలేదని వసుధార టెన్షన్ పడుతు‌ ఉంటుంది. మరొక వైపు దేవయాని హ్యాపీగా శైలేంద్ర దగ్గరికి వెళ్లి... ఏం ప్లాన్ చేశావ్ నాన్న అంటూ మెచ్చుకుంటుంది.  అప్పుడే ధరణి డోర్ కొడుతుంది. దేవయాని వెళ్లి డోర్ తియ్యగానే ధరణి కోపంగా చూస్తుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చీరకట్టులో గీత మాధురి బేబీ బంప్... విడాకుల రూమర్స్ కి బ్రేక్!

తెలుగు ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా  మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ గీతామాధురి  ఒకరు. ఈమె పాడిన పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆమె వాయిస్ కి చాలామంది ఫాన్స్ కూడా ఉన్నారు. సాంగ్స్ పాడడమే కాదు పలుషోలకు జడ్జ్ గా కూడా  వ్యవహరిస్తూ  బిజీగా ఉన్నారు. ఇక ఈమె నటుడు నందుని  లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కపుల్ కి  మొదట సంతానంగా  దాక్షాయిని ప్రకృతి అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిన్నారి వయసిప్పుడు ఐదేళ్లు.  ఇప్పుడు మరోసారి గీతామాధురి తల్లి కాబోతున్నారని తెలుస్తోంది. ఇక తాను తల్లి కాబోతున్నాను అంటూ శుభవార్తను ఇన్స్టాగ్రామ్  వేదికగా చెప్పారు . తన కుమార్తె దాక్షాయిని ప్రకృతి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో అక్కగా ప్రమోట్ కాబోతుంది అంటూ ఈమె తాను ప్రెగ్నెంట్  అనే విషయాన్ని షేర్ చేసుకున్నారు.  తన భర్త కూతురితో కలిసి దిగిన ఫోటోలను ఈమె చీర కట్టుకొని ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఈ శారీ పిక్స్ లో గీత మాధురి బేబీ బంప్  క్లియర్ గా కనిపిస్తుంది. ఈమె చెప్పిన గుడ్ న్యూస్ కి  ఎంతోమంది అభిమానులు,  తోటి సింగర్లు, నటీనటులు విషెస్ చెప్తున్నారు.  గీత భర్త  నందు క్రికెట్ కి కామెంటరీ చెప్తూ మరో వైపు  పలు సినిమాలు,  వెబ్ సిరీస్ లో  నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన వధువు అని వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఐతే కొంత కాలం క్రితం గీత మాధురి, నందు డివోర్స్ తీసుకుని విడిపోతున్నారంటూ రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అదంతా ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మొద్దని తాము చాల సంతోషంగా ఉన్నామని ఈ లవబుల్ కపుల్.