ఎటో వెళ్ళిపోయింది మనసు ...సీతాకాంత్ కోసం ఆడియన్స్ వెయిటింగ్

స్టార్ మాలో వరుసగా కొన్ని సీరియల్స్ లైన్ లో ఉన్నాయి...సత్యభామ, ఊర్వశివో-రాక్షసివో అనే సీరియల్స్ ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ లో ఉండగా  ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సీరియల్ కూడా ఆ లైన్ లోకి వచ్చి చేరింది. ఈ సీరియల్ కి సంబంధించి "కమింగ్ సూన్ ప్రోమో" రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ సీరియల్ లో సీతాకాంత్ నటిస్తున్నాడు. "కలియుగ రామాయణం, ఇంద్రాణి" సీరియల్స్ లో ఆయన నటించాడు. ఆ తరువాత " అమెరికా అమ్మాయి" అంతఃపురం" అనే సీరియల్ లో నటించి అభిమానుల నుంచి మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఇక సీతాకాంత్ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు "ఎటో వెళ్ళిపోయింది మనసు" సీరియల్ ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. 40 ఏళ్ళ వ్యక్తిగా అలాగే బిజినెస్ మాగ్నెట్ గా, అమ్మాయిలను హేట్ చేస్తూ పెళ్లి చేసుకోని ముదిరిపోయినా బ్రహ్మచారి రోల్ లో సీతాకాంత్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సీతాకాంత్ రోల్ కి సెట్ అయ్యేలా అందమైన కన్నడా అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమె పేరు రక్షా నింబర్గి. ఉదయ టీవీ సీరియల్ ప్రీతియా అరసి సీరియల్ లో నటిస్తోంది. ఈమె తెలుగులో నటిస్తున్న ఫస్ట్ సీరియల్ ఇదే. ఇక ఈ సీరియల్ లో ఫామిలీకి అన్నీ తానె అయ్యి చూసుకోవడం, ఎవరికీ ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా నిలబడడం అనేది ఆమె రోల్. ఇక ఈ 40 ఏళ్ళ పెర్ఫెక్షనిస్ట్ కి, 20 ఏళ్ళ అమ్మాయి రామలక్ష్మికి  ముడిపడితే అనే కాన్సెప్ట్ లో ఈ సీరియల్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ ప్రోమో చూసిన వారంతా ఆల్రెడీ ప్రేమ ఎంత మధురం సీరియల్ కాన్సెప్ట్ కదా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

ఏమిటో బిగ్ బాస్ సెలబ్రిటీస్ అంతా తిరుమలకు చెక్కేస్తున్నారు

బిగ్ బాస్ సీజన్ 6  సెలబ్రిటీస్ అంతా కూడా గ్రూప్ గా తిరుమల వెళ్లి ఆ శ్రీవారిని దర్శనం చేసుకుని వస్తున్నారు. అదేంటో తెలీదు కానీ నిన్న గీతూ, శ్రీ సత్య వెళ్లారు. ఇక ఇప్పుడు ఇద్దరూ వెళ్లారు. ఇక ఈ పిక్స్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. "ఓం నమో వెంకటేశాయ" అని టాగ్ పెట్టుకున్నారు కూడా...అర్జున్ కళ్యాణ్ నార్మల్ కాస్ట్యూమ్ లో కనిపించగా ఆర్జె సూర్య మాత్రం సాంప్రదాయక దుస్తుల్లో కనిపించారు. ఇక వీళ్ళ పిక్స్ ని చూసిన నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇదే బిగ్ బాస్ సీజన్ లో తన అందమైన ముఖంతో, నవ్వుతో, అద్భుతమైన హెయిర్ స్టైల్ తో  అందరినీ మెస్మోరైజ్ చేసిన వాసంతి కృష్ణన్ కూడా కామెంట్ చేసింది. "బ్లెస్సింగ్స్ రా నాన్న" అని కామెంట్ చేసేసరికి . "నీకు ఈవెనింగ్ బ్లెస్సింగ్స్ ఇస్తాం లే" అని ఆర్జే సూర్య రిప్లై ఇవ్వగా "థ్యాంక్స్ పాపా, సి యు సూన్" అంటూ అర్జున్ కళ్యాణ్ రిప్లై ఇచ్చాడు. ఉదయాన్ని తిరుమల వెళ్లిన ఈ ఇద్దరూ కూడా రాజ గోపురం దగ్గర నిలబడి ఒక వీడియో చేసి దాన్ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. "నడక దర్శనానికి వెళ్తున్నాం...నేను తిరుమలకు రావడం ఇదే మొదటి సారి అర్జున్ కళ్యాణ్ కి రెండో సారి..స్వామి వారు ఆయన సన్నిధానానికి చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అని కోరుకుంటున్నాం" అంటూ ఆర్జే సూర్య ఆ వీడియోలో చెప్పాడు. ఆర్జే సూర్య ఈమధ్య కాలంలో స్క్రీన్ మీద ఎక్కడా కనిపించడం లేదు. ఇక అర్జున్ కళ్యాణ్ ఇండస్ట్రీ మీద ఇష్టంతో, ప్రేమతో  అమెరికాలో నటనలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘ప్రేమమ్’ లో ఒక క్యారెక్టర్ చేశాడు. సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.   

హౌస్ మేట్స్ పై పొగరు చూపిస్తున్న డమ్మీ కెప్టెన్ అమర్ దీప్!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఒక ఇంటెన్స్ డ్రామాని అందిస్తుంది. ఈ సీజన్-7 ఉల్టా పుల్టా థీమ్ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో విజయం సాధించిందనే చెప్పాలి. గతవారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవ్వడంతో ఈ వారం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. వీరిలో అంబటి అర్జున్ ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలిచి ఫినాలేకి అర్హత సాధించాడు. ఇక హౌస్ లో ఈ వారం మొత్తం ఓట్ అప్పీల్ కోసం కంటెస్టెంట్స్ చేత ఫన్ గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్.‌ ఇందులో హౌస్ మేట్స్ లో గొడవలు జరుగుతున్నాయి.  మొన్నటి ఎపిసోడ్‌లో.. ఆ రోజు జరిగిన టాస్క్ లలో గెలిచి శోభాశెట్టి ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అంబటి అర్జున్, అమర్ దీప్ ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లలో గెలిచి అర్హత సాధించారు. ఇక వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసుకోవాలో డిసైడ్ చేయడానికి హౌస్ మేట్స్ మద్దతు కావాలని బిగ్ బాస్ చెప్పడంతో.. ఒక్కో‌ హౌస్ మేట్ తమ అభిప్రాయం చెప్పారు. ప్రశాంత్ తన మద్దతుని అంబటి అర్జున్ కి ఇచ్చాడు. నేను ఎందుకు అనర్హుడని అనుకుంటున్నావని అమర్ దీప్ అనగా.. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు లాస్ట్ వీక్ నిన్ను సపోర్ట్ చేసినందుకు నాకు బాగానే చేసావ్.. అందుకనే అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నానని ప్రశాంత్ అన్నాడు. శివాజీ, యావర్ లు కూడా అర్జున్ కి సపోర్ట్ చేయడంతో.. అమర్ దీప్ కి కోపం పెరిగిపోయింది. ఇక హౌస్ కి నేను కెప్టెన్.. నేను చెప్తున్నాను నువ్వు అక్కడికి వెళ్ళు అంటూ యావర్ పై డమ్మీ కెప్టెన్ అమర్ దీప్ రెచ్చిపోయాడు. యావర్ లా ఇమిటేట్ చేస్తూ.. వాళ్ళు నీ దగ్గర మంచివాళ్ళు అనిపించుకోవాలని నీకు సపోర్ట్ చూస్తున్నారంటూ అర్జున్ తో అన్నాడు‌ అమర్. ఇక ఎప్పటిలాగే శోభాశెట్టి, ప్రియాంక ఇద్దరు అమర్ దీప్ కే సపోర్ట్ చేసారు. అయితే ఈ వారం నామినేషన్ లో‌ ఉన్న అమర్ దీప్ కి ఓటింగ్ తక్కువ ఉందనేది వాస్తవం. కానీ శోభాశెట్టి, ప్రియాంక లీస్ట్ లో ఉన్నారు. మరి వారిద్దరిని హౌస్ లో ఉంచి అమర్ ని బయటకు పంపిస్తారా లేక అమర్ ని కాకుండా అత్యధిక ఓటింగ్ ఉన్న యావర్ ని బయటకు పంపిస్తారా చూడాలి మరి. ఇక ఓట్ అప్పీల్ లో అమర్-ప్రశాంత్, యావర్-అమర్ ల మధ్య గొడవ గట్టిగానే జరిగినట్టు ఈ ప్రోమోలో తెలుస్తుంది.  

జపాన్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో సత్తా చాటిన ఆరడుగుల అందగాడు

టాలీవుడ్ లో అంత పేరు లేకపోయినా క్యూట్ గా కనిపిస్తూ అప్పుడప్పుడు అలరించే హీరో అరవింద్ కృష్ణ...ఆరడుగుల బుల్లెట్టు అనే సాంగ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కటౌట్ మనోడిది. ఇక ఈ అందగాడు కొన్ని మూవీస్ లో కూడా నటించాడు. 'ఇట్స్ మై లవ్ స్టోరీ', 'అడవి కాచిన వెన్నెల', ఋషి' వంటి మూవీస్ లో యాక్ట్ కూడా చేసాడు.   'ప్రేమమ్',  'రామారావు ఆన్ డ్యూటీ' మూవీస్ లో స్పెషల్ రోల్స్ లో కనిపించదు. అలాగే అరవింద్ కృష్ణ నటించిన   'గ్రే : ది స్పై హూ లవ్డ్ మి' మూవీ ఈ ఇయర్ రిలీజ్ అయ్యింది. ఇక రీసెంట్ గా  'సుడిగాలి' సుధీర్ హీరోగా నటించిన 'కాలింగ్ సహస్ర'లో ఆయన గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. అలా ఒక పక్క మూవీస్ లో చేస్తూ టైం దొరికినప్పుడల్లా బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటాడు. ఆ పిక్స్ ని తన గేమ్ ని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు  ది ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్  లీగ్‌లో పాల్గొన్నాడు స్పోర్ట్స్ పర్సన్ అరవింద్ కృష్ణ.  ఫైబా  జపాన్‌లో లాస్ట్ వీక్ సాగామిహర 3BL లీగ్‌ను నిర్వహించింది . ఇందులో ఒక్కొక్క టీమ్ నుంచి ముగ్గురు బాస్కెట్ బాల్ ప్లేయర్స్‌ పార్టిసిపేట్ చేయగా మన హైదరాబాద్ టీమ్  కెప్టెన్ గా అరవింద్ కృష్ణ కూడా పాల్గొన్నాడు.  అందులో అరవింద్ కృష్ణ టీమ్ క్వాలిఫైయర్స్‌కి ఎంపికైంది. ఈ లీగ్‌లో తదుపరి గేమ్స్‌ని వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. ఇక ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక ప్లేయర్  అరవింద్ కృష్ణ మాత్రమే. అలాగే అరవింద్ కృష్ణ "ఏ మాస్టర్ పీస్" అనే మూవీ లో కూడా నటించాడు. ఇలాంటి ప్రతిష్టాత్మక చాంపియన్ షిప్‌లో పార్టిసిపేట్ చేయడం తనకు  ఎంతో గర్వంగా, గౌరవంగా ఉందన్నాడు  అరవింద్ కృష్ణ .  

పోలీస్ గెటప్ లో  దర్శనం ఇచ్చిన జగతి మేడం

జ్యోతి రాయ్ అంటే ఇప్పుడిప్పుడే కొంతమందికి తెలుస్తోంది ఆమె హాట్ పిక్స్ ద్వారా..కానీ గుప్పెడంత మనసు జగతి మేడం అంటే అందరికీ బాగా తెలుస్తుంది. అలాంటి జ్యోతి ఇప్పుడు రీసెంట్ గా ఒక పోలీస్ డ్రెస్ లో ఉన్న పిక్ ని పోస్ట్ చేసింది. ఆ లుక్ ఫుల్ గా వైరల్ అవుతోంది. "అండర్ వరల్డ్ బిలియనీర్స్" పేరుతో ఒక వెబ్ సిరీస్ సిరీస్ చేసింది జగతి మేడం. యాక్షన్ థ్రిల్లర్ గా డిఫరెంట్ కథా కథనంతో  రూపొందిన ఈ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలో చేస్తుండగా  రాధిక - ప్రీతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సీరీస్ లో మధుసూధన్ ,జ్యోతి రాయ్ ,షవర్ అలీ,అలోక్ జైన్, లీనా కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీదకు రాబోతోంది అంటూ తన పిక్ కి టాగ్ పెట్టింది జగతి. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ మాత్రం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "ప్రెట్టిగర్ల్ మూవీని చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తే పోలీస్ గర్ల్ వచ్చిందేమిటి, జ్యోతి రాయ్ ఎలాంటి డ్రెస్ లో ఉన్నా హాట్ గానే ఉంటుంది, సో హాట్, ప్రెట్టి, బ్యూటిఫుల్, డియర్ ఏసీపీ సమర్ధన ప్లీజ్ నన్ను జైలులో పెట్టవా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో జగతి మేడం అలియాస్ జ్యోతి రాయ్ నార్కోటిక్ ఏసీపీ సమర్ధనగా నటిస్తోంది.  ఇక ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. కన్నడ పరిశ్రమ నుంచి వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తోంది జ్యోతీరాయ్. వీటన్నిటి కారణంగా  గుప్పెడంత మనసు సీరియల్ లో అర్దాంతరంగా ఆమె పాత్రను చంపేశారు. అలా ఆ రోల్ చచ్చిపోయిందో లేదో జ్యోతి సోషల్ మీడియాలో పట్టపగ్గాలు లేకుండా అందాలు ఆరబోస్తోంది.   స్లిమ్ బాడీని  మెయింటేన్ చేస్తూ..బ్యూటిఫుల్ లుక్స్ తో అదరగొడుతోంది జ్యోతి.  

అమర్ దీప్ ఎలిమినేషన్ ఫిక్స్.. ఇవే కారణాలు!

బిగ్ బాస్ సీజన్-7 లో అసలేం ఆడకపోయిన శోభాశెట్టి, ప్రియాంకల సపోర్ట్ తో ఇప్పటికీ ఉన్న ఏకైక కంటెస్టెంట్ అమర్‌దీప్. ఒక్కటంటే ఒక్క గేమ్ కూడా తన స్వయంకృషితో గెలిచింది లేదనేది అందరికి తెలిసిన నిజం. అయిన బిగ్ బాస్ మాత్రం అమర్ దీప్ ని లాలిస్తున్నాడు. బుజ్జగిస్తున్నాడు కేకులు తినిపిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే దత్తపుత్రిక శోభాశెట్టిని సేవ్ చేసే ప్రాసెస్ లో భాగంగా అమర్‌దీప్ ఎలిమినేట్ అయ్యేలా అనిపిస్తుంది. ఒకవేళ అమర్ దీప్ ఎలిమినేట్ అయితే ఈ సీరియల్ బ్యాచ్ మేట్స్ శోభాశెట్టి, ప్రియాంక ఎలా ఉంటారో చూడాలి. అయితే నిన్న మొన్నటి దాకా జరిగిన ఓటింగ్ పోల్స్ లో శివాజీ, ప్రశాంత్ మొదటి రెండు స్థానాలలో ఉండగా అమర్ దీప్ మూడవ స్థానంలో ఉండేవాడు. నిన్న జరిగిన ఓటింగ్ లో యావర్ కి 20 శాతం ఓటింగ్ పడి అతను మూడవ స్థానంలోకి వచ్చాడు. దీంతో అంబటి అర్జున్ ఎలాగు ఎలిమినేట్ అవ్వడు కాబట్టి అమర్ దీప్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ చాలావరకు ఉంది. గత రెండు వారాలుగా హౌస్ లో ఏ పని చేయకుండా కెప్టెన్ అని ఖాళీగా ఉంటు అందరి చేత పనులు‌ చేపిస్తున్నాడు. అయితే ఇందులో‌ ఓవారాక్షన్ కూడా ఉంది. శోభాశెట్టి, ప్రియాంకలకి అధిక పనులు చెప్పకుండా మిగిలిన వారికి ఎక్కువ పనులు చెప్పడం అందరికి నచ్చట్లేదు. పైగా టాస్క్ లు కూడా ఏం ఆడలేదు.  అమర్ దీప్ కెప్టెన్ అయిన నుండి అతని బిహేవియర్ మరీ రూడ్ గా ఉంది. అందులోను పల్లవి ప్రశాంత్, యావర్ లని ట్రీట్ చేసే విధానంతో ఇది స్పష్టంగా తెలుస్తుంది. తోటి హౌస్ మేట్స్ అని కూడా లేకుండా శోభాశెట్టి, ప్రియాంకలని కూర్చోబెట్టి యావర్ , ప్రశాంత్ లకి అధికంగా పనులు చెప్పడం.. మాటల్లో చులకన చేసి చూడటం ఇదంతా చూసే ప్రేక్షకులకు సైతం చిరాకు తెప్పిస్తుంది. శోభాశెట్టి అయితే మరీ పనివాడు కంటే దారుణంగా ప్రశాంత్ ని చూస్తుంది.‌ ఇది చూస్తున్న జనాలు శోభాశెట్టిపై తీవ్రంగా స్పందిస్తూ.. ప్రతీ ప్రోమో కింద కామెంట్లలో శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వాలని తెలుపుతున్నారు. అయితే బిగ్ బాస్ కి శోభాశెట్టి దత్తపుత్రిక కాబట్టి ఎలాగు తనని ఎలిమినేట్ చేయడు. ఏదైన అద్భుతం జరిగితే తప్ప శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వదు. ఇక మిగిలింది అమర్ దీప్. ప్రతీసారీ అన్ ఫెయిర్ గేమ్ లు ఆడే కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకి వస్తే అది ప్రేక్షకులకు కూడా ఫెయిర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది.  

దెయ్యాలు తిరిగే టైంలో డాన్సులు..యానిమల్ 2 కి ప్లానింగా..ఆ ఆనందానికి కారణం ?

బుల్లితెర మీద అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ . ఈ షో  ద్వారా ఎంతో మంది బుల్లితెర న‌టీన‌టులు ఫేమస్ ఇపోయారు.. సోష‌ల్ మీడియాలో అప్పుడే అడుగు పెట్టి రీల్స్, ఫన్నీ వీడియోస్ చేసే వాళ్లకు మాత్రం ఈ బిగ్ బాస్ చాలా ప్లస్ అయ్యిందనే చెప్పొచ్చు. వాళ్లకు బిగ్ బాస్ లో ఆఫర్స్ రావడం అలాగే మూవీ ఛాన్సెస్ రావడం ఫుల్ ఫేమ్ తెచ్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిలో అలీ రెజా కూడా ఒకరు.  అలీ రైజా బిగ్ బాస్ సీజ‌న్ 3 లో సంద‌డి చేశాడు. ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. అలాంటి అలీ రెజా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టి సందడి చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒక పోస్ట్ పెట్టి డాన్స్ వేసాడు. "మంచి వైబ్స్‌లో మునిగిపోవడం ఆ క్షణాన్ని ప్రేమించడం చాల ఆనందంగా ఉంటుంది" అంటూ కామెంట్ చేసాడు. ఈ పిక్ ని చూసిన నెటిజన్స్ ఫుల్ గా కామెంట్స్ చేస్తున్నారు..."దెయ్యాలు తిరిగి టైం ఈ డాన్సులు ఏందన్నా...యానిమల్ 2 లో నటించడానికి ఇప్పటినుంచే ప్లానింగ్ గాని చేస్తున్నావా" అంటే "అన్నా సూపర్..నువ్వు ఇంత సింపుల్ గా డాన్స్ ఎలా చేస్తావ్..నాకు నీ డాన్స్ అంటే అంటే ఇష్టం" అని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఊర్వశి రాయ్ మాత్రం " ఈ సాంగ్ నీకోసమే రాసినట్టున్నారు" అంటూ కామెంట్ చేసింది. ఐతే ఊర్వశి రాయ్, అలీ రెజా, అరవింద్ కృష్ణ కలిసి గతంలో " గ్రే ద స్పై హూ లవ్డ్ మి" అనే మూవీలో నటించారు. ఐతే ఆలీ రెజా అసలు ఆనందానికి కారణం ఏమిటి అంటే ఇవన్నీ కాదు తానూ నందు, అవికా గోర్ తో కలిసి నటించిన మూవీ "వధువు" రేపు అంటే డిసెంబర్ 8 న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఇక తన మూవీ ఇలా ఓటిటి వేదిక మీదకు వస్తుండడంతో ఆలీ రెజా ఆనందానికి అంతే లేకుండా పోయింది. అందుకే సమయం చూసుకోకుండా ఇలా డాన్స్ చేస్తూ ఉన్నాడు అనే విషయం అర్థమైపోతుంది.

Brahmamudi:జాతకాలు కుదరవని పంతులుతో చెప్పించిన తల్లి.. వ్యూహం ఫలించినట్టేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -272 లో.. అరుణ్ ని కావ్య పట్టుకోవాలని ఒక బోర్డుపై ప్లాన్ గీస్తూ ఉంటుంది. అది చూసిన రాజ్.. ఏంటి ఇలా చేస్తున్నావంటూ చిరాకు పడుతుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కాసేపు గొడవపడతారు. మరొకవైపు అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంటుంది. ఏంటి గుడ్ న్యూస్ చెప్పడానికి నేను ఫోన్ చేస్తుంటే ఇలా చేస్తుందని కళ్యాణ్ అనుకుంటాడు. అప్పుడే అటుగా వస్తున్నా కనకాన్ని  చూసి టైమ్ వచ్చారని కళ్యాణ్  అంటాడు. అప్పుకి గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేస్తుంటే తను కట్ చేస్తుందని కళ్యాణ్ అంటాడు. గుడ్ న్యూస్ ఏంటని కనకం అనగానే రేపు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు కదా అని అనగానే.. నేను చెప్పాను వస్తుందని కనకం అంటుంది. అది విని కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు కనకం తన గదిలోకి వస్తుందని రుద్రాణి తన గదికి లాక్ వేసి బాల్కనీలోకి వెళ్తుంది. ఆ తర్వాత కనకానికి రుద్రాణి  ప్లాన్ అర్థం అయి కనకం పిన్ తో లాక్ తీసి గదిలోకి వెళ్తుంది. ఆ తర్వాత రుద్రాణి వచ్చేసరికి తన నైటీ వేసుకొని ఉంటుంది కనకం‌. దాంతో రుద్రాణికి కోపం వస్తుంది. ఇద్దరు కాసేపు వాదించుకుంటారు. మరుసటి రోజు ఉదయం రాజ్ దగ్గరికి ఇందిరాదేవీ వచ్చి పంతులు గారు వస్తున్నారా అని అడుగుతుంది. మరోవైపు కనకానికి అప్పు ఫోన్ చేసి.. ఇంటి బయటకు వచ్చానని చెప్పగానే కనకం వెళ్లి తనని లోపలికి రమ్మని చెప్తుంది. కానీ అప్పు రాదు. కాసేపటికి కళ్యాణ్ వచ్చి అప్పుని లోపలికి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత పంతులు గారు దుగ్గిరాల ఇంటికి రాగానే మళ్ళీ కనకం నేను చెప్పినట్టు చెప్పండి అని  బ్లాక్ మెయిల్ చేస్తుంది. అనామిక పేరెంట్స్ ఒక వైపు, దుగ్గిరాల కుటుంబం మరోవైపు ఇలా అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. కనకం చెప్పినట్టు అబ్బాయి జాతకం బాగుంది కానీ అమ్మాయి జాతకం బాలేదని పంతులు చెప్పగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో.. ఇన్ని అనర్థాలు జరిగే కంటే పెళ్లి ఆపడం మంచిది అని ధాన్యలక్ష్మి అనగానే.. కళ్యాణ్ కోపంగా అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇక రాజ్ కావ్య అతడిని ఆపుతారు. మా పెళ్లి ఏమైనా అనుకొని జరిగిందా? మేం ఎంత హ్యాపీగా ఉంటున్నాం. ట్రావెల్ ఏజెన్సీ లో హానీమున్ ప్యాకేజీ కోసం ప్లాన్ చేశారని కావ్య అనగానే.. అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శ్రీసత్యను చిరుతపులితో పోల్చిన గీతూ...

ఈమధ్య కాలంలో యూత్ కి వర్క్ ప్యాషన్ తో పాటు డివోషనల్ గా కూడా బాగా డెవలప్ అవుతున్నారు. ఇక ఏ కొంచెం టైం దొరికినా సరే గుళ్లకు, గోపురాలకు, విదేశాలకు, బీచ్ లకు చెక్కేసి ఆ ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేసి వాళ్ళ ఫాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లాస్ట్ సీజన్ బ్యూటీస్ గీతూ రాయల్, శ్రీ సత్య అలాగే తిరుమల కార్ లో వెళ్లారు. ఇక వాళ్ళ టీమ్ అంతా కూడా తిరుమలలో ఫుల్ ఎంజాయ్ చేసినట్టే కనిపిస్తోంది. ఇక తిరుమల ఘాట్ రోడ్స్ లో ఈ మధ్య కాలంలో చిరుతలు తిరుగుతున్నాయని వార్తల్ని కూడా మనం వింటూనే ఉన్నాం. గీతూ కూడా ఆ విషయాన్నే చెప్పింది.."తిరుమలలో చిరుతలు వస్తున్నాయంట కానీ మేమేమీ భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే మా కార్లోనే ఒక చిరుత పులి ఉంది కాబట్టి" అంటూ శ్రీ సత్యను చిరుత పులితో పోల్చి ఫన్నీ కామెంట్ చేసింది. ఇక గీతూ కామెంట్ కి శ్రీసత్యకి కోపం వచ్చి "చిరుత పులి వస్తే ముందు లాక్కెళ్లేది నిన్నే ఎందుకంటే కొవ్వెక్కువుంది కాబట్టి" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక తిరుమలకు వెళ్లి అక్కడ స్వామి వారి దర్శనం చేసుకున్నాక చేతికి గాజులు కొనుక్కున్నారు. అలాగే మామిడి కాయ ముక్కలు కొనుక్కుని తిన్నారు. గీతూ, శ్రీసత్య లాస్ట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మంచి ఫ్రెండ్స్ ఇపోయారు. ఇక వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి కలిసి వెళ్తూ ఉంటారు అలాగే వీళ్లకు ఫైమా కూడా మంచి ఫ్రెండ్ అయ్యింది. వీళ్ళ టీమ్ మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫాన్స్ ని పెంచుకుంటూ ఉంటారు.

Guppedantha Manasu:గుప్పెడంత మనసు సీరియల్ లో కీలక మలుపు.. రిషి మిస్సింగ్‌!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -948 లో.. మహేంద్ర దగ్గరికి ఫణీంద్ర వచ్చి ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. అప్పుడే దేవయాని కూడా వస్తుంది. నువ్వు కూడ ఇంటికి వెళ్ళు అని మహేంద్ర అనగానే.. నేను వెళ్తే శైలేంద్ర పరిస్థితి ఏంటని దేవాయని మనసులో అనుకుంటుంది. నేను వెళ్ళను ఇక్కడే ఉంటానని దేవాయని చెప్తుంది. మరొకవైపు మహేంద్ర, వసుధార కలిసి ఇంటికి వెళ్తుంటారు. వసుధార మాత్రం ఇంక రిషి రాలేదని అతని ఫోన్ కి ట్రై చేస్తు ఉంటుంది. కానీ రిషి ఫోన్ స్విచాఫ్ వస్తుంది. దాంతో వసుధార ఇంక టెన్షన్ పడుతుంటుంది.  ఏం కంగారు పడకని మహేంద్ర దైర్యం చెప్తాడు. ఆ తర్వాత మహేంద్ర, వసుధార ఇంటికి రాగానే అనుపమ వస్తుంది. శైలేంద్ర గురించి అడిగి తెలుసుకుంటుంది. అనుపమని ఇంట్లోకి కూడా పిలిచేందుకు మహేంద్ర ఇష్టపడడు. ఆ తర్వాత  అనుపమతో వసుధార మాట్లాడుతుంది. నిన్ను పోలీస్ లు పట్టుకొని వెళ్లేలా చేసిన నాపైన నీకు కోపం లేకుండా మాములుగా మాట్లాడుతున్నావ్ అంటున్నానే.. అలా అని నిన్ను ఎండీగా ఆర్హురాలివి అని ఒప్పుకోవడం లేదని అనుపమ అనగానే.. మహేంద్రకి ఇంక కోపం వస్తుంది. ఆ తర్వాత వాళ్ళతో పాటు అనుపమ ఇంట్లోకి వెళ్తుంది. కాఫీ నేనే తీసుకోని వస్తానని అనుపమ లోపలికి వెళ్లి కాఫీ చేసుకొని వస్తానని వెళ్ళిపోతుంది. మరొకవైపు శైలేంద్రని ఆ సిచువేషన్ లో చూసిన ధరణి ఎమోషనల్ అవుతుంది. కానీ శైలేంద్ర మాత్రం తనని నటనతో నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడు. మరొకవైపు అనుపమ కాఫీ తీసుకొని వస్తుంది. వసుధార మాత్రం టెన్షన్ గా రిషికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి.. రిషి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే ఎందుకు అలా ఉన్నావని వసుధారని అనుపమ అడగగానే.. రిషి ఇంకా ఇంటికి రాలేదు. మెసేజ్ చేసాడని అనగానే. ఆ మెసేజ్ రిషి చేసాడో రిషి ఫోన్ నుండి ఎవరు చేశారో అని అనుపమ అంటుంది. వసుధార ఇప్పటికే టెన్షన్ పడుతుందంటే.. నువ్వు ఇంకా టెన్షన్ పెడుతావ్ అంటూ మహేంద్ర కోప్పడతాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని మహేంద్రకి అనుపమ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:కృష్ణకి పెళ్ళి అయిందని చెప్పిన భవాని.. షాక్ లో మురారి!

 స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -333 లో.. భవాని ఇంట్లో అందరిని తీసుకోని కృష్ణ దగ్గరికి వస్తుంది. అలా ఇంటికి అందరు రావడం చూసిన కృష్ణ ఎందుకు వచ్చారని ఆశ్చర్యంగా చూస్తుంది. ఇది ముకుంద మురారీల పెళ్లి పత్రిక.. మొదటి శుభలేక మీకే ఇస్తున్నా అని కృష్ణకి ఇస్తుంది భవాని. ఆ తర్వాత కార్డ్ ఓపెన్ చేసి చూస్తూ కృష్ణ బాధపడుతుంది. నాకేంటి నా మనసు ఇంత కష్టంగా అనిపిస్తుంది. నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిది అని మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణకి భవాని వార్నింగ్ ఇస్తుంది. పెళ్లి ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చెయ్యవద్దని భవాని చెప్తుంది. పసుపు దంచి పెళ్లి పనులు స్టార్ట్ చెయ్యాలని సుమలత అంటుంది. ఆ తర్వాత నేను పెళ్లి ఆపడానికి ఏదైనా ప్రయత్నం చేస్తానని మీకు అనుమానం ఉండొచ్చు. నేను మీ కళ్ల ముందే ఉంటే మీకు ఎలాంటి అనుమానం ఉండదు కదా, అందుకే నేను పసుపు దంచే దగ్గరికి వస్తానని కృష్ణ అనగానే భవాని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత శకుంతల జరుగుతున్న విషయాల గురించి కృష్ణకి చెప్తూ బాధపడుతుంది. మరొక వైపు కృష్ణ గురించి నందు ఆలోచిస్తుంటుంది. అప్పుడే నందు దగ్గరికి గౌతమ్ వచ్చి.. భవానిపై కోపంగా ఉంటాడు. మీ అమ్మా ఏం చేసిందో తెలుసా? మొదటి పెళ్ళి కార్డు తీసుకొని వెళ్లి కృష్ణకే ఇచ్చిందని చెప్పగానే నందు షాక్ అవుతుంది. మరొకవైపు రేవతి, నందు, మధు కలిసి కృష్ణ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే‌ అక్కడికి వచ్చిన భవాని అన్ని సిద్ధం చేసావా అని రేవతిని అడుగుతుంది. ఆ తర్వాత మొదటి కార్డు ఎవరికి ఇచ్చావ్ అక్క అని భవానిని రేవతి అడుగుతుంది. నాకే ఇచ్చారంటూ కృష్ణ వస్తుంది. ఆ తర్వాత నువ్వేంటి  కృష్ణ ఇక్కడ అని మురారి అడుగుతాడు. మేడమ్ హెల్ప్ చెయ్యడానికి రమ్మని పిలిస్తే వచ్చానని చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ పసుపు ఎందుకు దంచుతారని అందరికి వివరంగా చెప్తుంది. దాని తర్వాత కృష్ణ అందరికి గంధం పూస్తూ ఉంటుంది. తరువాయి భాగంలో కృష్ణకి పెళ్లి అయిన విషయాన్ని భవాని చెప్పకనే చెప్తుంది.  అది విన్న మురారి.. కృష్ణకి పెళ్లి అయిందా అని షాక్ అవుతాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పెళ్లి గురించి క్లారిటీ ఎప్పుడొస్తుంది.. ఏంటి మీకు లవ్ స్టోరీ ఉందా?

  ఫామిలీ నంబర్  1  నెక్స్ట్ సండే ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి గెస్ట్ గా నవదీప్ వచ్చాడు. ఇక రాగానే హోస్ట్ రవికి కో-హోస్ట్ గా చేస్తున్న రౌడీ రోహిణి వచ్చి అల్లరల్లరి చేసి పారేసింది. "దీప్..దీప్ నువ్వంటే నా దిల్లో డిబ్ డిబ్" అంటూ కామెడీ చేసేసరికి అందరూ నవ్వేశారు. వెంటనే రోహిణి నవదీప్ నడిచిన చందమామ మూవీలో "ముక్కుపై ముద్దు పెట్టు" అని పాట పాడింది. దానికి నవదీప్ నవ్వుతూ " ఈ పాట పడితే కాజల్ గుర్తొస్తుంది" అన్నాడు. ఇక తర్వాత ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న రియల్ కపుల్స్ కొంతమంది నవదీప్ ని కొన్ని ప్రశ్నలు వేశారు. సీద్విష్ణు కపుల్ లేచి " పెళ్లి గురించి ఎంత క్లారిటీ రావాలి మీరు పెళ్లి చేసుకోవాలంటే" అని అడిగారు తర్వాత యాంకర్ మృదుల వచ్చి "ఇంట్లో ఎవరూ లేనప్పుడు హూ ఆర్ యు" అని అడిగింది. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా చాలా సీరియస్ గా విన్నాడు నవదీప్. తర్వాత హోస్ట్ రవి వచ్చి "నవదీప్ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా " అని అడిగాడు "ఎందుకు లేదు గురు" అని అడిగేసరికి "ఉందా మీకు" అంటూ రోహిణి వచ్చి అడగడంతో వెంటనే "లేదా మీకు" అంటూ ఠకీమని కౌంటర్ పంచ్ ఇచ్చేసాడు నవదీప్. ఇక నవదీప్  సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ఆయన నటించిన  ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐతే నవదీప్ ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే ప్రశ్న పెళ్ళెప్పుడు అని..దానికి ఆన్సర్ చెప్తూనే ఉంటాడు. టైం వచ్చినప్పుడు అవుతుంది.కానీ  లాక్‌డౌన్ టైమ్‌లో తనకు బ్రేకప్ అయ్యిందని, దాని నుంచి బయటపడేందుకు థెరపీకి కూడా వెళ్లినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .ప్రస్తుతం తన మైండ్ అంతా కూడా  ఇండస్ట్రీలో మంచి మంచి షోస్ చేయాలనీ ఉందంటున్నాడు నవదీప్.

ప్రశాంత్ ని తోసేసి గెలిచిన అర్జున్.. ఇదేం ఆట సామి!

బిగ్ బాస్ సీజన్-7 చివరి దశకు చేరుకుంది. ఒకవైపు హౌస్ లో ఓట్ అప్పీల్ కోసం ఫన్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.‌ ఇందులో కంటెస్టెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇ గొడవలు ఒకరికొకరు కావాలని పెట్టుకుంటున్నారా లేక స్ట్రాటజీనా అనేది హౌస్ మేట్స్ కు ఒకలా, ప్రేక్షకులకు ఒకలా ఉంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కోసం ఇసుకతో చేసిన కేక్ మీద ఒక చెర్రీని ఉంచి, ఆ చెర్రీ కింద పడకుండా పీస్ లుగా కడ్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు. ఇక ఇందులో మొదటి రౌండ్‌ లోనే ఓడిపోయిన అర్జున్ ని తదుపరి రౌండ్ లకి సంచాలకుడిని చేశాడు బిగ్ బాస్. మొదటి టాస్కులో భాగంగా ఇసుకతో తయారు చేసిన కేకులపై చెర్రీలు పెట్టాడు బిగ్‌బాస్.  ఈ టాస్క్ లో ఎవరి చెర్రీ పడిపోతే వాళ్లు ఓడిపోయినట్లే. టాస్క మొదలవగానే కాసేపటికి అర్జున్, యావర్, శివాజీ, ప్రియాంక, శోభాశెట్టి ఓడిపోయారు. ఇక చివరగా ప్రశాంత్, అమర్ దీప్ ఉండగా.. ప్రశాంత్ ఓడి, అమర్ దీప్ గెలిచాడు. అలా ఓటు అప్పీల్ కి అమర్ దీప్ మొదటగా అర్హత సాధించాడు. రెండవ టాస్కులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఓ గంట పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో బజర్ మోగినప్పుడు ఎవరైతే‌ మొదటగా వచ్చి గంట కొడతారో వాళ్లే.. ఓట్ అప్పీల్ కోసం రెండవ కంటెండర్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇక బజర్ మోగిన వెంటనే పక్కనే ఉన్న ప్రశాంత్‌, యావర్ లని చేతితో పక్కకి తోసేశాడు అర్జున్. అప్పుడు అర్జున్ చేయి ప్రశాంత్ దవడక తగిలి బాగా దెబ్బ తగిలింది. ఇక ఆ పక్కన ఉన్న యావర్‌ని కూడా ఇలానే చేశాడు అర్జున్. దీంతో అందరూ వెళ్లి గంట మీద పడేసరికి ముగ్గురు కింద పడిపోయారు. గంటకి దూరంలో ప్రశాంత్, యావర్ ఉండగా, దాని దగ్గరగా అర్జున్ ఉన్నాడు. తొందరగా అందుకొని గంట కొట్టి ఓట్ అప్పీల్ కోసం అర్హత సాధించాడు అర్జున్.  

రిటర్న్ గిఫ్ట్స్ తో నేను రెడీ..మీరు రెడీనా...

చాలా ఏళ్ళ విరామం తర్వాత మంచు మనోజ్ మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే  హోస్ట్‌గా ‘ఉస్తాద్‍ - ర్యాంప్‍ ఆడిద్దాం’  పేరుతో  సరికొత్త సెలబ్రిటీ గేమ్ షో ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ.విశ్వ ప్రసాద్ ఈ గేమ్ షో‌ను రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ గేమ్ షో డిసెంబర్‌ 15 నుంచి ఈటీవీ విన్‌ యాప్ లో ప్రసారం కానుంది. ఇప్పుడు ఈ షో ప్రోమో కూడా విడుదల చేశారు మేకర్స్. ‘నేను మీ మనోజ్.. నా కథ మీరు రాసుకున్నది, నా రాక మీరు పిలుస్తున్నది..ప్రతీ హీరోని నడిపించే సైన్యం ఫాన్స్ ప్రతీ స్టార్ సంపాదించుకునే ధైర్యం ఫాన్స్ ..అలంటి  ఫ్యాన్స్ కి నేనివ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ " అంటూ డైలాగ్ చెప్పాడు మంచు మనోజ్. ఈయన ఆరేళ్ల క్రితం "ఒక్కడు మిగిలాడు" అనే మూవీలో కనిపించాడు.  ఇప్పుడు బుల్లితెరపై అలరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ షోకు సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ షోలో గెలిచిన ప్లేయర్స్‌కు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్లు కూడా ప్రకటించారు. బిగ్ స్క్రీన్స్ నుంచి అందరూ ఓటిటి వైపు చూస్తున్న ఈ టైంలో మనోజ్ కూడా ఆవైపు ద్రుష్టి సారించారు.  ఇంతకాలం వెండితెరపై అలరించిన ఈ రాకింగ్ స్టార్.. ఇక ఓటీటీ, టీవీ ప్రేక్షకులను అలరించడానికి మరో వారంలో అందరి ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఓటిటి వేదిక మీద "ఫామిలీ ధమాకా" తో విశ్వక్ సేన్, "అన్స్టాపబుల్ " షోతో బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఆ రూట్ లోనే వెళ్ళడానికి రెడీ అయ్యారు. మరి ఈ షోతో మంచు మనోజ్ ఎలా అలరిస్తాడు, అసలు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాడా లేదా అనే విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.    

గువ్వలతో గోవాలో బిగ్ బాస్ టేస్టీ తేజ!

బిగ్ బాస్ సీజన్ 7 పర్లేదు అనిపించేలా సాగుతోంది...ఈ సీజన్ మరీ లాస్ట్ సీజన్ అంత కాకపోయినా పర్లేదనిపించేలా వెళ్తోంది. ఇక ఈ సీజన్ లో హౌస్ నుంచి ఎలిమినేట్ ఐన రతికా రోజ్, టేస్టీ తేజ, శుభశ్రీ రాయగురు ముగ్గురు కలిసి టైం దొరకడంతో గోవా టూర్ కి చెక్కేశారు.  టేస్టీ తేజతో కలిసి శుభశ్రీ, రతికా  ఫుల్ గా ఫొటోస్, సెల్ఫీస్ దిగేసారు. ఇక అక్కడ రెస్టారెంట్ లో నానా హంగామా చేసేసారు. ఆ ఫుడ్ ఐటమ్స్ పేర్లను వెరైటీగా పలుకుతూ తేజ మస్త్ ఎంటర్టైన్ చేసాడు.   బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈ ఇద్దరు లేడీస్ తో తేజ చేసిన హంగామా గురించి ఆడియన్స్ అందరికీ బాగా తెలుసు. తేజ రతికా అందాన్ని బయట చూసి ఫుల్ గా ఫ్లాటైపోయాడు. 'నువ్వెంటే బిగ్ బాస్ లో కంటే బయటే బాగున్నావ్ కదా" అంటూ పదేపదే ఆ మాట అంటూనే ఉన్నాడు. ఇక తర్వాత వీళ్ళ వీడియోకి "గోవాలో గువ్వలం అని తేజ అనేసరికి "అంటే ఏమిటి" అంటే శుభశ్రీ రివర్స్ ప్రశ్నించింది. "రతికా సీరియస్ గా చెప్తున్నా చాలా క్యూట్ గా ఉన్నావ్" అని మళ్ళీ అనేసరికి "హౌస్ లో అందరినీ ఒకదగ్గర పెట్టేసరికి నాకు ఎం అర్ధం కాలేదు. ఇక్కడ చూడు ఎంత బాగుందో" అంటూ క్యూట్ గా ఆన్సర్ ఇచ్చింది రతికా. "నువ్వెలా ఉన్నావో తెలుసా గోడ్జిల్లా " లా ఉన్నావ్ అంటూ శుభశ్రీని అనేసరికి కొంచెం ఫీలయ్యింది పాప. ఇక తర్వాత లెబనీస్ చికెన్ అని రతికా ఒక ఫుడ్ ఐటెం పేరు చెప్పేసరికి "లెస్బియన్ చికెన్..నాకు ఇంగ్లీష్ అంతే వచ్చు" అంటూ కౌంటర్ ఇచ్చారు తేజ. ఇక వీడియో మొత్తం కూసే ఇద్దరు పాపలు తింటూనే కనిపించారు. "ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్స్ తింటేనే పాపకు ఊపొస్తుంది" అంటూ రతికా గురించి కామెంట్ చేసాడు తేజ. బిగ్ బాస్ హౌస్ లో సరైన తిండి లేక బక్కచిక్కిన ఈ ముగ్గురూ కలిసి తిండి మీద దాడి చేస్తూనే అన్ని ఐటమ్స్ ని డెజార్ట్స్ ని లాగించేసారు.  

మీ సోషల్ మీడియా అకౌంట్స్ ని చూడడానికి ఎవరినైనా పెట్టుకోండి...సోహైల్ కి సలహా

బిగ్ బాస్ సీజన్ వచ్చిందంటే చాలు ఆ సీజన్ ఎండ్ అయ్యే లోపు ఎవరో ఒకరు ఫేమస్ ఐపొతూ ఉంటారు. అలాగే ఈ 7 సీజన్స్ లో చాల మంది పాపులర్ అయ్యారు కూడా. అలాంటి ఈ గేమ్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో సయ్యద్ సోహైల్ కూడా ఉన్నాడు. హౌస్ లో ఉన్నపుడు ఆడియన్స్  ని ఆకట్టుకున్న సోహైల్ తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాక హీరోగా సినిమాల్లో చేస్తూ ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నాడు.  ప్రేక్షకులను ఆకట్టుకున్న సోహెల్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు, లక్కీ లక్ష్మణ్ , ఇలాంటి మూవీస్ లో నటించాడు. ఇక ఇపుడు సోహైల్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాకి వెళ్లి అక్కడ అక్కడ వార్నర్ బ్రదర్స్ "స్కూబి డూ పోకీ కోస్టర్ నెక్స్ట్ జనరేషన్" అనే బ్యానర్ దగ్గర నిలబడి దిగిన ఫోటోని పోస్ట్ చేసాడు. ఇక ఆ బ్యానర్ కలర్స్ లో సోహైల్ డ్రెస్ కలర్ కూడా కలిసిపోయింది. ఇక ఈ ఫోటోకి ఒక నెటిజన్ మాత్రం వెరైటీ గా కామెంట్ చేస్తూ ఒక సలహా కూడా ఇచ్చారు. "అంత మంచి కంట్రీకి వెళ్లి మంచి డ్రెస్ కూడా వేసుకుని సెలెక్టివ్ పిక్స్ పోస్ట్ చేయడం మాత్రం రావడం లేదు..ప్లీజ్ ఎవరినైనా మీ సోషల్ మీడియా అకౌంట్స్ ని చూసేవాళ్లను పెట్టుకోండి ..ఇది నా సజెషన్ మాత్రమే" అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చాడు. ఇక కొంతమంది సూపర్ బ్రో అంటే మీరు ఆ బ్యానర్ లో ఏం చూపిస్తున్నారో అర్థంకాలేదు అంటూ ఒకరు...స్కూబిడూ కార్టూన్ చిన్నప్పుడు నా ఫేవరేట్ అంటూ ఇంకొకరు కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ముగ్గురు ఫైనలిస్టులు సెలెక్ట్ అయ్యారు. అప్పుడు హోస్ట్ నాగార్జున వీళ్లకు  25 లక్షలు ఆఫర్ ఇచ్చేసరికి సోహైల్ ఆ డబ్బు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు.

ఓట్ అప్పీల్ పేరుతో‌ అర్జున్ కు చుక్కలు చూపించిన బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో ఫన్ గేమ్ అంటు రెండు బ్యాచ్ ల మధ్య చిచ్చుపెడుతున్నాడు బిగ్ బాస్. ఒక్కో టాస్క్ కి ఒక్కో గొడవ జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో రెండవ కంటెండర్ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు గాను ఒక టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో‌ హౌస్ లోని వారందరిని తోసుకొని వచ్చి గంట కొట్టి అర్హత సాధించాడు అర్జున్. దీంతో తనని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్నాడు బిగ్‌బాస్. తీరా వచ్చిన తర్వాత ఎదురుగా క్లాత్స్ కప్పేసిన రెండు ప్లేట్స్ ఉంచి, అందులో నీకు నచ్చినది ఎంచుకోమని బిగ్‌బాస్ కోరాడు. దీంతో ఒక క్లాత్ తీసి చూస్తే ఆ కప్పులో మూడు పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి. ఇదేంటి బిగ్‌బాస్ అని అర్జున్ అడుగగా.. ఓట్ అప్పీల్ చేసుకునేందుకు కంటెండర్ కావాలంటే ఆ మూడు పచ్చి ఉల్లిపాయలని పది నిమిషాల్లో తినాలని, లేకపోతే రెండో బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముంటే అది చేయాలనే కండీషన్ పెట్టాడు బిగ్‌బాస్. ఇక అది విని.. వద్దు బిగ్‌బాస్ ఇవే తినేస్తానని మొత్తానికి అర్జున్ ఎలాగోలా వాటిని తిన్నాడు. అయిన ఈ మధ్య ఫుడ్‌కి సంబంధించిన టాస్కులన్నీ మీకే వస్తున్నాయ్ ఎందుకని అనుకుంటున్నారు అర్జున్ అని బిగ్ బాస్ అడిగాడు. "చూడటానికి దున్నపోతులా ఉన్నాను కదా తింటానని మీ అభిప్రాయం బిగ్‌బాస్" అని అర్జున్ అన్నాడు.  ఇక మరో మూసి ఉన్న క్లాత్ ని ఓపెన్ చేయమంటాడు. అందులో ఆరు ఉల్లిపాయలు‌ ఉంటాయి. వామ్మో అని దండం  పెడతాడు అర్జున్.  కాస్త స్వీట్ ఇప్పించండి బిగ్ బాస్ అని అర్జున్ అడుగగా.. స్వీట్ తినడానికి ఇష్టపడతారా? లేక  స్వీట్ లాంటి కేక్ పంపించమంటారా అని బిగ్ బాస్ అడుగుతాడు. అతిగా తింటే ఏదైనా దారుణమే బిగ్‌బాస్. నేను రెండు ఎంచుకోను అంటూ అర్జున్ సమాధానమిచ్చాడు. మొత్తానికి ఇచ్చిన టైమ్ లోపే టాస్క్ పూర్తి చేశాడు అర్జున్. దీంతో మీరు ఓట్ అప్పీల్ చేసుకునేందుకు ముందుకు వెళ్లారు.. కంగ్రాట్స్ అని బిగ్‌బాస్ అన్నాడు. వెళ్లేముందు పక్క బాక్స్‌లో ఏముందో చూడాలనుకుంటున్నారా అని బిగ్‌బాస్ అడగడంతో అవును అంటూ క్లాత్ తీశాడు అర్జున్. తీరా అందులో ఐదు ఉల్లిపాయలు చూసి వామ్మో అనుకున్నాడు అర్జున్. ఇక ఆ ఘాటుకి తట్టుకోలేక స్వీట్‌గా ఏమైనా ఇవ్వొచ్చుగా బిగ్‌బాస్.. అంటూ అర్జున్ అడిగాడు. కేకు పంపించమంటారా అని బిగ్ బాస్ అనగానే.. వామ్మో వద్దయ్యా.. ఇక్కడి నుంచి వెళ్లేవరకు ఇక స్వీట్ కూడా అడగను బిగ్‌బాస్ అంటూ దండం పెట్టేశాడు అర్జున్.  

నితిన్ భార్య డేంజర్ పిల్ల అంటున్న వక్కంతం వంశీ!

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ షోకి ప్రొమోషన్స్ కోసం "ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్" మూవీ టీం నుంచి  దర్శకుడు వక్కంతం వంశీ, హీరో నితిన్, నటుడు బ్రహ్మాజీ, హైపర్ ఆది వచ్చారు. ఇక బ్రహ్మాజీ, హైపర్ ఆది ఎక్కడుంటే అక్కడ ఫుల్ కామెడీ ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు..అలాగే ఈ షోలో కూడా కామెడీ ఫుల్ గా ఉండబోతోందనే సంగతి ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. అలాగే ఈ షోకి వచ్చిన మూవీ టీమ్ అంతా నార్మల్ గా వస్తే బ్రహ్మాజీ మాత్రం బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని వచ్చాడు..ఇక నితిన్ కూడా ఈ పాయింట్ మీద కౌంటర్ కూడా వేసాడు. "మేం ముగ్గురం ఈ షోకి నార్మల్ గా వచ్చాము..ఈయనేందుకు కళ్ళజోడు పెట్టుకున్నారు...కళ్ళ కింద క్యారీ బాగ్స్ ని దాచుకోవడానికా" అంటూ కామెడీ కౌంటర్ వేశారు. ఇక హైపర్ ఆది మధ్యలో వచ్చి "బ్రహ్మాజీ గారిని మీరంతా తక్కువంచనా వేయకండి...ఆయన కూడా నెక్స్ట్ ఒక షో చేయబోతున్నాడు. మీది సుమా అడ్డా ఐతే ఆయనది ఇందిరానగర్ గడ్డ" అని అనేసరికి "ఇందిరానగర్ గడ్డయితే పర్లేదు..సెగ్గడ్డ కాకుండా చూసుకుంటే చాలు" అని సుమారు రివర్స్ పంచ్ వేసి పడీ పడీ నవ్వేసింది. ఇక ప్రోమో లాస్ట్ లో హీరో నాని అతని భార్య గురించి ఒకరు దసరా, ఒకరు దీపావళి అని చెప్పాడు. తర్వాత నితిన్ తన వైఫ్ తో ఉన్న ఫోటోని ప్లే చేశారు. "ఒక్క మాటలో మీ ఆవిడ గురించి" అని సుమ అడిగేసరికి "ఆమె గురించి ఏముంది ఎక్స్ట్రా ఆర్డినరీ" అని చెప్పేసరికి "బయటకు ప్రతీ వైఫ్ గురించి ఎక్స్ట్రా ఆర్డినరీ చెప్పాలి మొబైల్ లో మాత్రం డేంజర్ పిల్ల అని ఫీడ్ చేసుకోవాలి" అంటూ వక్కంతం వంశీ నితిన్ నిజాన్ని రివీల్ చేసేసాడు. ఇక నితిన్ షోలో అతన్ని ఏమీ అనలేక "అంతేగా..అంతేగా" అనేసి సైలెంట్ గా ఉండిపోయి..ఎందుకురా బాబు నిజాన్ని ఇలా లీక్ చేసావ్ అన్నట్టుగా తలాడించేసుకున్నాడు నితిన్.

అమ్మతో ఫస్ట్ రైడ్ లో ఎంజాయ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్

తన ట్రెండీ సాంగ్స్ తో యూత్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళను కూడా ఒక ఊపు ఊపేసే  రాహుల్ సిప్లిగంజ్ గురించి అందరికీ తెలుసు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ తనకో సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక రేంజ్ లో టాలీవుడ్ ని ఊపేసిన  ‘నాటు నాటు’సాంగ్  కు తన గాత్రం అందించి ఆస్కార్ కోసం హిస్టరీ క్రియేట్ చేయడంలో భాగమయ్యాడు కూడా. అలా రాహుల్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అక్కడ కూడా హిస్టరీ క్రియేట్ చేసాడు. తెలుగులో మాస్ సాంగ్స్‌ ఎన్నో పాడాడు. రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్, మహర్షి వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు.   బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ను  గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. అలాంటి రాహుల్ టైం దొరికితే తన ఫామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. ఇక వాళ్ళ అమ్మను తీసుకుని ఛాపర్ లో రైడ్ కి తీసుకెళ్లాడు అలాగే ఆస్ట్రేలియా, మెల్బోర్న్ తిప్పి తీసుకొచ్చాడు. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఇక ఇది చూసిన నెటిజన్స్ మాత్రం "పేరెంట్స్ ని సంతోషపెట్టడమే నిజమైన సక్సెస్ , తల్లి తండ్రుల మీద  ప్రేమ,  గౌరవం ఎంత ఉందొ  తెలిపే రీల్ ఇది. ఇది  వారి పెంపకంలో ఉన్న గొప్పతనం. హాట్స్ ఆఫ్ టు ప్రౌడ్ పేరెంట్స్, సూపర్ వావ్ వేరీ నైస్ , ఇదే నిజమైన జీవితం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఐతే తాను రాజకీయాలకు చూలా దూరం..ఇండస్ట్రీలో చేయాల్సిన పని చాలా ఉంది అంటూ ఆ న్యూస్ నమ్మొద్దంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు.