రీఎంట్రీ ఇచ్చిన మనో..కామెడీ క్వాలిటీ బాలేదు

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ ఐన మొదట్లో చాల ఎంటర్టైనింగ్ గా ఫుల్ కామెడీ డైలాగ్స్ తో ఇంటిల్లిపాదీ చూసేలా ఉండేది. కానీ రాను రాను ఈ షోస్ కి పిల్లర్స్ లా ఉన్న సీనియర్ కమెడియన్స్ అంతా వెళ్లిపోయారు. కొత్త వాళ్ళు వచ్చారు. ఐతే కొంత కాలం నుంచి ఈ షోకి కమెడియన్స్ తో పాటు జడ్జెస్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. దాంతో ఈ షోస్ కి వున్న రేటింగ్, క్వాలిటీ కామెడీ ఇండెక్స్ తగ్గిపోతూ వస్తోంది. జబర్దస్త్ అంటే జడ్జెస్  ప్లేస్‌లో రోజా, నాగబాబు పడీపడీ నవ్వుతూ పంచులు వేస్తూ, సలహాలు, సూచనలు ఇస్తూ కమెడియన్స్ పాటు కలిసి పోయి జోక్స్ వేస్తూ చాల సందడిగా, సరదాగా ఉండేది షో. కానీ రోజా మంత్రి కావడంతో జబర్దస్త్‌కి గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోయారు. తర్వాత నాగబాబు కూడా చిన్నచిన్న ఇష్యూస్ కి  బైబై చెప్పేసి వెళ్లిపోయారు..తిరిగి రాను అని చెప్పేసారు. తర్వాత వాళ్ళ ప్లేసెస్ ని రీప్లేస్  చేసేందుకు జబర్దస్త్ టీమ్ చాలా ప్రయత్నాలు చేసింది. తర్వాత నాగబాబు కొంతకాలం సీట్ లో కనిపించారు ఆ తర్వాత మళ్ళీ వేరే షోస్ కి జడ్జిగా అవకాశం వచ్చేసరికి వెళ్లిపోయారు. ఇక  ఫైనల్ గా  కృష్ణ భగవాన్, ఇంద్రజ హాట్ సీట్స్ లో సెట్ ఇపోయారు. అయితే ఇటు జబర్దస్త్, అటు ఎక్స్‌ట్రా జబర్దస్త్ రెండూ షోలను మేనేజ్ చేయడం కష్టంగా ఉండటంతో కొద్ది కాలం ఖుష్భూ కూడా జడ్జిగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మరోసారి జడ్జి మారిపోయారు. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత రోజాతో పాటు ఆ ప్లేస్‌లో జడ్జిగా ఉన్న సింగర్ మనో ఇప్పుడు మరోసారి జబర్దస్త్ సెట్‌లో కనిపించారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో కృష్ణ భగవాన్‌తో పాటు మనో వచ్చారు. ఇటీవలే ఖుష్ఫూ ఈ షోకి గుడ్‌బై చెప్పడంతో ఒక ఎపిసోడ్ కి అలనాటి అందాల నటి మహేశ్వరిని జడ్జి తీసుకొచ్చారు. ఇక ఈ వారం మనోను షోకి తిరిగి రప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఇక లేడీ జడ్జి ఉండరు అనే విషయం అర్ధమవుతోంది. జబర్దస్త్‌కి మాత్రం ఇంద్రజ, కృష్ణ భగవాన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ షోస్ ఆగిపోతాయి కామెడీ లేదు అంటూ కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తోంది. మరి ఈ రెండు షోస్ సంగతి ఏమో కానీ నెటిజన్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలను కామెంట్స్ చేస్తున్నారు. "కామెంట్స్ తగ్గిపోయాయి , లైక్ లు తగ్గిపోయాయి, వ్యూస్ తగ్గిపోయాయి...ఇవన్నీ పెరగాలి అంటే సుడిగాలి సుదీర్.. హైపర్ ఆది రావాలి.... అప్పుడు బాగుంటుంది షో ... జబర్దస్త్ రేటింగ్ చాలా పడిపోయింది పాతవారిని మళ్లీ తీసుకురండి..." అని ఎక్స్ట్రా జబర్దస్త్ మేకర్స్ ని అడుగుతున్నారు. మరి వాళ్ళు ఎం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  

ఆదికి జాతక దోషం..ముసలావిడను పెళ్లి చేసుకోమంటూ బాబా సలహా

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో హైపర్ ఆది పెళ్లి తిప్పలు కాన్సెప్ట్ తో ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి అందంగా ముస్తాబై రాబోతోంది. హైపర్‌ ఆదికి నలభై ఏళ్లు దాటినా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. వాళ్ళను వీళ్ళను చూపించి పెళ్లి చేసుకుంటాను అంటాడు కానీ ఆ  పెళ్లి ఊసే ఎత్తడు. మరి వెళ్లేందుకు చేసుకోవడం అని ఆరా తీస్తే  ఆయన జాతకంలో దోషం ఉందని తెలిసి ఒక బాబాను ఆశ్రయించాడు. ఆ బాబా ఎవరో కాదు తాగుబోతు రమేష్.  ఇక ఆ బాబా హైపర్ ఆది చేతి రేఖలు చూసి కుజ దోషం పోవాలంటే ముందుగా ఒక వృద్ధురాలిని పెళ్లి చేసుకున్నాక మళ్లీ ఇంకో  అమ్మాయిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. ఇక హైపర్ ఆదికి స్వయంవరం జరుగుతుంది. కొంతమంది ముసలి వాళ్ళు వచ్చారు.  మొదట వచ్చిన ఆమె బాగానే ఉన్నా వద్దని చెప్తాడు ..ఇక రెండో ముసలావిడ వచ్చి హైపర్ ఆది వద్దు అంటూ ఒక పాట రూపంలో పాడి వినిపిస్తుంది. ఇక తర్వాత ముగ్గురు మహిళలు వచ్చి `కోట బొమ్మాళి` మూవీలోని `లింగిడి లింగిడి` సాంగ్ కి  అదిరిపోయే స్టెప్పులేశారు. అయితే వారి డాన్సులకు ఫిదా అయిన హైపర్‌ ఆది.. అందులో ఒక ముసలామెకు  కనెక్ట్ అయ్యి  ఓకే చెప్పాడు. తీరా చూస్తే లేడీ గెటప్ లో ఉన్న ఒక మేల్ డాన్సర్ . ఇక అతని నెత్తి మీద ఉన్న లేడీ విగ్ తీసేసరికి ఆది, రష్మీ షాకైపోయారు.  ఇందులో రష్మి, ఇంద్రజ పై ఆది  పంచ్‌లు పీక్స్ లో ఉన్నాయి. ఇక పాపం ఎప్పటికప్పుడు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆదికి ఇక్కడ కూడా నిరాశే ఎదురయ్యింది. మరి ఇంకా ఎప్పటికి పెళ్లయేనో..ఇక ఆది స్కిట్ చూసిన నెటిజన్స్ అంతా కూడా ఆది కామెడీ లేనిదే శ్రీదేవి డ్రామా కంపెనీ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

కవులకు కౌంటర్ వేసిన రాకెట్ రాఘవ...ఆడవాళ్లనే పొగుడుతారంటూ ఫైర్

ఈ వారం జబర్దస్త్ షోలో స్కిట్స్ అన్నీ కూడా చాల వెరైటీగా ఉన్నాయి. అందులో రాకెట్ రాఘవ స్కిట్ ఐతే భలే నవ్వు తెప్పించింది. ఈ స్కిట్ లో రాఘవ కవుల మీద ఫైర్ కూడా అయ్యాడండోయ్.. స్కిట్ లో భాగంగా రాఘవ పెళ్ళానికి ఒకసారి నెక్లెస్ దొరికిందట. ఐతే దాన్ని అక్కడే వదిలేసి వచ్చిందట. తీరా ఎందుకు వదిలేసిందో కనుక్కుంటూ దాని డిజైన్ నక్కలేదట. ఇలాంటి తింగరిది ఇంకా ఎక్కడన్నా ఉంటుందా అంటూ ఇంద్రజకి చెప్పాడు. ఇక ఆమె పగలబడి నవ్వింది. "అసలు దీన్ని కాదండి అనాల్సింది..కవుల్ని. కవులు ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ అందాలనే పొగుడుతూ ఉంటారు. మగవాళ్ల అందాల్ని అస్సలు పొగడరు. ఎందుకో తెలుసా అండి మా అందాలను పొగడడానికి పదాలు సరిపోవు." అనేసరికి "ఎందుకు సరిపోవు..సరిపోతాయి" అని రాఘవ వైఫ్ గట్టిగా చెప్పి బ్యాక్ గ్రౌండ్ లో " సచ్చినోడా" అనే సాంగ్ ని ప్లే చేయించి రాఘవ పరువు నిలువునా తీసేసింది. ఇక రాఘవ స్కిట్ చాల ఫన్నీగా సాగింది. అనగనగా రాజు రాజుకు ఏడుగురు కొడుకులు కాన్సెప్ట్ లో అనగనగా రాఘవ...రాఘవకు ఏడుగురు భార్యలు అనే ఈ స్కిట్ లో ఒక భార్యకు తమ్ము గండం ఉందని తుమ్మితే పోతుందంటూ ఏడు పెళ్లిళ్లు చేసుకోవడం రాఘవ రెడీ అవడం చివరికి ఆ పెళ్లిళ్ల ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో రాఘవ పెళ్ళాల చేతుల్లో తన్నులు తినడం ఆడియన్స్ ని బాగా నవ్వించింది. ఇక కృష్ణ భగవాన్ ఐతే రాఘవని తెగ పొగిడేశారు. ఇలాంటి కథ ఎలా ఆలోచించారు. ఈ కాన్సెప్ట్ ఆలోచించడమే చాల కష్టం కదా..ఇంతకు సమరంలో సలహాలు, కాపురంలో కలహాలు డైలాగ్ సూపర్ గా ఉంది. ఎప్పుడు అన్నీ స్కిట్స్ బాగున్నాయని ఊరికే చెప్తుంటాం..కానీ ఇప్పుడు స్కిట్ మాత్రం చాల బాగుంది అని చెప్పారు.

బ్యాక్ టు బ్యాక్ రెండు కొత్త సీరియల్స్ తో సందడి చేయబోతున్న స్టార్ మా

తెలుగు ఆడియన్స్ కి స్టార్ మా గుడ్ న్యూస్ చెప్పేసింది. లేటెస్ట్ గా ఒక అప్ డేట్ ఐతే తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక కొత్త సీరియల్స్ సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. ఒకటి కాదు ఏకంగా రెండు సీరియల్స్ పట్టాలెక్కించింది స్టార్ మా. అదే ఊర్వశివో-రాక్షసివో ఒకటి అలాగే యష్-వేద జోడి నటిస్తున్న సత్యభామ సీరియల్స్. ఈ రెండు సీరియల్స్ కూడా వన్ బై బై రాబోతోన్నయి. సత్యభామ సీరియల్ రాత్రి 9 .30 గంటలకు ప్రసారమవుతుండగా, ఊర్వశివో-రాక్షసివో సీరియల్ రాత్రి 10 గంటలకు రాబోతోంది. ఈ రెండు సీరియల్ ఈ నెల 18  సోమవారం నుంచి బుల్లితెర మీద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఊర్వశివో-రాక్షసివో సీరియల్ లో వినయ్ సింధియా హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో ఇతనికి ఇదే మొదటి సీరియల్.  అలాగే హీరోయిన్ గా కేరళ అమ్మాయి ఆయేషా నటిస్తోంది. ఈమె సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో నటించింది. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా ఆయేషా ఎంట్రీ ఇచ్చి వచ్చింది. ఇక ప్రగతి ఈ సీరియల్ నెగటివ్ రోల్ లో కనిపించబోతోంది. ఇక సత్యభామ సీరియల్ కూడా తెలుగు అభిమానులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. ఎందుకంటే ఈ సీరియల్ లో కనిపించబోతున్న యష్- వేద జోడి ఆల్రెడీ  ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో అలరించింది. ఇక వీళ్ళ కాంబోలోనే మరో సీరియల్ వస్తుండడంతో ఆడియన్స్ కి పండగే పండగ అని చెప్పొచ్చు.  

Krishna Mukunda Murari:కృష్ణని చూసి షాక్.. మురారికి గతం గుర్తొచ్చిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -339 లో.. ముకుంద, మురారి పూజ చేస్తుంటారు. మీ వయసు గల వారు కంకనం కట్టాలని పంతులు అనగానే కృష్ణ ఉంది కదా అని మురారి అంటాడు. అవసరం లేదు నందుని తీసుకుని రమ్మని  ప్రసాద్ కి భవాని చెప్తుంది. కాసేపటికి కృష్ణ, నందుల దగ్గరికి ప్రసాద్‌ వెళ్తాడు. అక్కడే మధు కూడా ఉంటాడు. జరిగింది చెప్పి కృష్ణ నువ్వు పద అని అనగానే మధు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కృష్ణని తీసుకోని ప్రసాద్ పూజ దగ్గరికి వెళ్తాడు.  కృష్ణని చూసి అందరు షాక్ అవుతారు. నందుకి తలనొప్పి గా ఉంటే కృష్ణని తీసుకోని వచ్చానని ప్రసాద్ చెప్తాడు . కాసేపటికి కృష్ణ వెళ్లి మురారికి కంకనం కడుతుంటే మురారికి గతం గుర్తుకు వచ్చినట్లు అవుతుంది. ఆ తర్వాత ముకుందకి కడుతుంది. కాసేపటికి నందు దగ్గరికి వెళ్లి మురారికి గతం గుర్తుకు వస్తున్నట్టు ఉందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు ముకుంద కోనేరు దగ్గరికి  దీపాలు వదలడానికి వెళ్తుంది. తనతో పాటు కృష్ణ కూడా వెళ్తుంది. అసలు ఎందుకు నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావని కృష్ణతో ముకుంస అంటుంది. అప్పుడే కృష్ణ కోనేరులో పడిపోతుంది. కాపాడండి ఏసీపీ సర్ అని కృష్ణ గట్టిగా అరుస్తుంటుంది.  దాంతో మురారి పరుగున వచ్చి కృష్ణని కాపాడతాడు. ఆ తర్వాత కృష్ణ సర్ అంటూ ఏదో చెప్పబోతుండగా.. నీ ఏసీపీ సర్ ని. నాకు గతం గుర్తుకువచ్చిందని మురారి చెప్పగానే.. ఒక్క ముకుంద తప్ప అక్కడున్న అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. గతం మర్చిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని భవానితో మురారి అంటాడు. ఆ తర్వాత అందరు కలిసి ఇంటికి వస్తారు. ముకుంద కోపంగా లోపలికి వెళ్తుంది. కృష్ణ ఈ రాత్రి నువ్వు అవుట్ హౌస్ లోకి వెళ్ళు.. రేపు ప్రొద్దున మాట్లాడుతానని భవాని చెప్తుంది. మధు లోపలికి వెళ్లి చూసేసరికి ముకుంద సూసైడ్ చేసుకొని ఉంటుంది. కృష్ణ తనకి ట్రీట్ మెంట్ ఇస్తుంది. తరువాయి భాగంలో ముకుంద, నువ్వు ప్రేమించుకున్నది నిజం కాద? నీ మీద ప్రేమతో ఆ పిచ్చిది ప్రాణం మీదకి తెచ్చుకుంది. అందుకే వచ్చే శుక్రవారం ముకుందకి నీకు పెళ్లి అని భవాని చెప్తుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నేను నథింగ్.. రతికతో లవ్ ట్రాక్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఫ్యామీలీ వీక్ అంటే జనాలంతా ఆతృతగా ఎదురు చూస్తారు. ఎందుకంటే కొన్ని వారాలుగా ఫ్యామిలీకి దూరంగా హౌస్ లో ఉన్నవారికోసం వస్తారు కాబట్టి దానికంత క్రేజ్. కానీ దానికి మించి ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు కంటెస్టెంట్స్. ప్రతీ సీజన్ లో లాగా ఈ సీజన్-7 లో టాప్-5 ని కాకుండా టాప్-6 ని ఉంచారు బిగ్ బాస్. ఇక గత మూడు రోజులుగా ఈ ఆరుగురికి సంబంధించిన జర్నీ వీడియోలని బిగ్ బాస్ చూపిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో‌ మొదటగా యావర్ జర్నీని ప్లే చేసారు‌ బిగ్ బాస్. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'టెంపర్' సినిమాలోని 'నీ అయ్య టెంపర్'.. పాటతో యావర్ కి స్వాగతం పలికాడు బిగ్ బాస్. ఇక గార్డెన్ లో మంచు కురుస్తున్న వేళ.. తన జర్నీని అద్భుతంగా మలిచాడు బిగ్ బాస్. తను గేమ్  లో ఆడిన విధానం, శివాజీ ఓదార్చిన సీన్,  బాల్ టాస్క్, ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పడిన కష్టం.. ఇలా అన్ని ఫోటోలని చూపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత యావర్ కోసం కొన్ని మోటివేషనల్ మాటలని మాట్లాడాడు బిగ్ బాస్.  ‘మీరు ఏదైనా ఇష్టపడితే దాని కోసం ఎంత కష్టపడటానికైనా సిద్దపడే మీ గుణం అందరికి నచ్చింది. టాస్క్‌లలో మీకు ఎవరు పోటీ కాదు అనే విధంగా ప్రతి టాస్క్‌లో ఇరగదీశారు. యావర్‌తో పోటీ అంటే ఆలోచించాల్సిందే అనేట్టు చేశారు. స్పైగా మీకు దొరికిన అమూల్యమైన స్నేహం కూడా మీ ప్రయాణం సాఫీగా ముందుకు కదిలేందుకు దోహదపడింది. మీ కోపం, పట్టుదల.. మీకు తప్పు కనిపించిన ప్రతీ చోట కనిపించాయి. అదే ధైర్యం మీరు ఎవిక్షన్ పాస్‌ని సాధించేలా చేసింది. ఆ ఎవిక్షన్ పాస్‌ని తిరిగి ఇచ్చేసినప్పుడు.. నీతిగా గెలవాలనే మీ క్యారెక్టర్ అందరికీ నచ్చింది" అంటూ బిగ్ బాస్ చెప్పడంతో.. యావర్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత యావర్ జర్నీ వీడియోని చూపించాడు‌ బిగ్ బాస్. అందులో రతికతో లవ్ ట్రాక్, శివాజీ, ప్రశాంత్ లతో స్పై గా మొదలైన స్నేహం, శోభాశెట్టితో గొడవ, ఆట సందీప్ బ్యాక్ బిచ్చింగ్, రతిక సీక్రెట్ రూమ్ లో చెప్పిన అన్ డిజర్వింగ్ రీజన్, శివాజీతో కలిసి తనకేమీ లేవని, జాబ్ కూడా లేదని చెప్పుకున్నది.. ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అన్నయ్య వచ్చినప్పటి ఫుటేజ్.. ఇలా అన్నింటిని చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు యావర్. అసలు పరిచయం మనుషుల మధ్య భాష రాకపోయిన.. ఉండొచ్చు అని నిరూపిస్తూ సాగిన యావర్ జర్నీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఇక తన జర్నీ వీడియో చూసాక యావర్ మాట్లాడిన ప్రతీ మాట యావర్ ని ఈ స్టేజ్ మీద డిజర్వింగ్ అనేంతలా అనిపించింది. బిగ్ బాస్ నేను మీ బిడ్డను.. నేను నథింగ్.. మీరు నన్ను సంథింగ్ చేశారు. నా జీవితాంతం మీకు ఋణపడి ఉంటానని యావర్ చెప్పిన ప్రతీ మాట టీవీ చూస్తున్న ప్రేక్షకుడిని కదిలించాయి. హౌస్ లో ఒంటరిగా మొదలైన యావర్ ప్రయాణం.. బిగ్ బాస్ సీజన్-7 లో ది బెస్ట్ జర్నీగా నిలిచింది.  

‘కార్తీక దీపం’ వంటలక్క మిస్సింగ్.. వెతికి పెట్టండంటూ అడిగిన నెటిజన్

కొన్ని నెలల క్రితం వరకు స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ మస్త్ ఫేమస్ అయ్యింది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ మూడు క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతూనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెన్సేషన్ సృష్టిస్తూ ఉండేది ఈ సీరియల్. వంటలక్కగా ప్రేమి విశ్వనాధ్ నటన అద్భుతః అనే ఆడియన్స్ చాల ఎక్కువ. ఇక సీరియల్ ఐపోయినా కూడా నిరుపమ్ పరిటాలను డాక్టర్ బాబు అనే పిలుస్తూ ఉంటారు. ఇక ప్రేమి విశ్వనాధ్, నిరుపమ్ జోడీగా కార్తీక దీపం సీక్వెల్ ఉంటుందని అప్పట్లో టాక్ వచ్చింది కానీ దాని గురించి అసలు ఇంతవరకు అప్ డేట్ ఏమీ లేదు. ఇక ప్రేమి విశ్వనాధ్ మాత్రం సీరియల్ ఐపోయిన తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. రీసెంట్ గా వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాధ్ ఇన్స్టాగ్రామ్ లో శారీ ఫోటో షూట్ కి చెందిన పిక్స్ ని పోస్ట్ చేసింది. "మిమ్మల్ని మీరే కాదు మీరు వేసుకునే అవుట్ ఫిట్ కూడా అందంగా మార్చుతుంది" అంటూ ఒక కాప్షన్ పెట్టింది. ఇక వంటలక్క పిక్స్ కి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   " హలో మేడమ్..మా ప్రేమి గారు మిస్ అయ్యారు  కొంచెం వెతికి పెడతారా..మీరు ప్రేమి గారి చిన్న చెల్లెలే  కదా..హాయ్ మై డార్లింగ్, మై స్వీట్ మెమరబుల్,  నా ఫేవరెట్ దీపా, ఎలా ఉన్నావు, నువ్వు ఎప్పుడు వస్తావు.. ప్రపంచంలోని అత్యుత్తమమైన, అందమైన వాటిల్లో ఒకటి నీ చిరునవ్వు, రెండవది నీ ప్రేమ...వావ్ సూపర్ మై ఏంజెల్ ..మీరు చూడడానికి  నయనతారలా, ఉంది, జ్యోతికలా ఉన్నారు  ప్రేమి మామ్ " అంటూ వాళ్ళ ప్రేమను, అభిమానాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేశారు. ఇక కార్తీక దీపం సీరియల్ లో లేడీ విలన్ గా హీరోయిన్ తో సమానగ్గ నటించిన మోనిత బిగ్ బాస్ సీజన్ 7 లో మిగతా కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చి రీసెంట్ గా ఎలిమినేట్ అయ్యింది.. ఇక ఈ ముగ్గురు తిరిగి ఏదైనా సీరియల్ కనిపిస్తారా...? కనిపిస్తే బాగుండు అనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్.  

రైతుబిడ్డకి బిగ్ బాస్ గిఫ్ట్.. అటు లవ్ ట్రాక్.‌. ఇటు స్పైతో స్నేహం!

ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఒక కామన్ మ్యాన్ గ్రాంఢ్ ఫినాలేకి రావడం ఇధే ప్రథమం. బిగ్ బాస్ సీజన్-7 లో కామన్ మ్యాన్ క్యాటగిరీలో అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎవరూ ఊహించనంత స్థాయికి ఎదిగాడు. పల్లవి ప్రశాంత్ ఫైనల్ కప్ కి ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. ప్రస్తుతం అర్జున్, యావర్, శివాజీ, ప్రియాంక, ప్రశాంత్, అమర్‌దీప్ హౌస్ లో ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ పద్నాలుగు వారాలు పూర్తిచేసుకొని పదిహేనవ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ చివరిదైన ఫినాలే వీక్ లో హౌస్ మేట్స్ యొక్క జర్నీ వీడియోలని చూపిస్తున్నాడు బిగ్ బాస్. మొన్న జరిగిన ఎపిసోడ్ శివాజీ జర్నీ వీడియోని టీవీలో చూసినవాళ్ళే ఎక్కువని టీఆర్పీలో చూస్తే అర్థమవుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొదట యావర్ జర్నీ చూపించిన బిగ్ బాస్.. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ జర్నీ వీడియోని చూపించాడు.  చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలోని 'ఘల్లు ఘల్లుమని' పాటతో ప్రారంభించాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో తన ఫోటోలని చూసుకున్నాడు ప్రశాంత్.  కాసేపటికి యాక్టివిటి ఏరియాకి రమ్మన్నాడు బిగ్ బాస్. "మట్టితో మనకున్న బంధం ప్రత్యేకమైనది. ఆ మట్టే మిగతావారికంటే నిన్ను ప్రత్యేకంగా చేసింది. మిమ్మల్ని ఆదరించి ఎంతోమంది మద్దతుగా కామన్ మ్యాన్ గా ఈ ఇంట్లో అడుగుపెట్టారు. మీ ప్రయాణం మొదలైనప్పటి నుండి ఎన్నో అనుభవాలు.. ఎవరి ఉద్దేశాలేంటో, ఎవరు మీవారో? ఎవరు కాదో తెలియక సంకోచంలో పడ్డ మీకు.. మిమ్మల్ని  సరైన  దిశలో నడిపే బంధం మీకు దొరికింది. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాస్క్ లలో గెలవడానికి మీ రక్తాన్ని సైతం చిందించడానికి వెనుకాడలేదు. ఆ తెగింపే మిమ్మల్ని సీజన్-7 మొదటి కెప్టెన్ ని చేసింది " అని బిగ్ బాస్ చెప్పగా.. థాంక్స్ అని ప్రశాంత్ అన్నాడు. "మీ కలని పట్టువదలకుండా ఇక్కడివరకు వచ్చి నెరవేర్చుకున్నారు. మిమ్మల్ని చూసే ఎందరికో పెద్ద కలలు కనడానికి, అవి నెరవేరేందుకు మొండి ధైర్యం ఉంటే సాధ్యమని ఎక్కడ తగ్గేదేలే లేదని నిరూపించారు. ఆకాశం నుండి జారే ప్రతీ నీటి బొట్టు భూమి మీద జీవానికి ఒక అవకాశమే.. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యమే విజయం. మీ జీవితంలో వచ్చే అవకాశాలన్ని  ఒడిసిపట్టే నైపుణ్యం ఈ ఇల్లు మీకు నేర్పిందని మీ ప్రయాణం ఓ సారి చూద్దాం" అంటూ జర్నీ వీడియోని చూపించాడు బిగ్ బాస్. "మహర్షి" సినిమాలోని 'భల్లుమంటు నింగి వొల్లు విరిగెను గడ్డిపరకతోన' పాటతో జర్నీ ప్రారంభించిన బిగ్ బాస్.. పండించిన బియ్యం ప్రశాంత్ గిఫ్ట్ ఇవ్వగా.. నాగార్జున ఒక మిర్చీ మొక్కని ఇచ్చాడు. శివాజీ, ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ ల మధ్య ఉన్న స్నేహాన్ని, రతిక-ప్రశాంత్ ల మధ్య లవ్ ట్రాక్ ని అద్భుతంగా ‌చూపించాడు బిగ్ బాస్.   

Guppedantha Manasu : భర్తను కాపాడుకోవడానికి భార్య ఆ పని చేయగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -945 లో శైలేంద్ర చేసే కుట్రలు మోసాలు చూడలేకపోతుంది ధరణి. వసుధార, మహేంద్ర దగ్గరికి ధరణి వచ్చి.. జగతిని చంపించింది తన భర్తనే అని, వాళ్ళకి తనకి తెలిసింది అంత చెప్తుంది. అది విని వసుధార మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు.. వాళ్ళతో పాటు ధరణి చెప్పేది అనుపమ కూడా వింటుంది. ఎండీ చైర్ కోసం ఇదంతా చేస్తున్నాడని ధరణి చెప్తుంది. ఆ తర్వాత వసుధారపై తను ప్రవర్తించిన తీరుని గుర్తుకు చేసుకొని వసుధారకి  అనుపమ సారీ చెప్తుంది. నీ మీద అనుమానంతో నిన్ను బాధపెట్టానని వసుధారతో అనుపమ అంటుంది. ఆ తర్వాత ధరణిని వసుధార తీసుకోని శైలేంద్ర దగ్గరికి బయలుదేరుతుంది. మరొకవైపు ధరణిని శైలేంద్ర పిలుస్తుంటాడు. ధరణి ఇంట్లో ఉండదు అప్పుడే దేవయాని వచ్చి.. ఎక్కడో ఉంటుందిలే అయిన ఈ మధ్య బాగా కలవరిస్తున్నావని దేవాయని అనగానే.. ధరణితో బాగుంటేనే కదా మనం చేసిన కుట్రలు ఎవరితో చెప్పదని శైలేంద్ర అంటాడు. ఈ మధ్య నువ్వు ఏం చేసిన చెప్పడం లేదు.. ఎటాక్ సంబంధించి చెప్పలేదు.. రిషి కన్పించకుండా పోవడానికి నువ్వేనా అని  శైలేంద్రని దేవయని అడుగుతుంది. శైలేంద్ర మాత్రం  కిడ్నాప్ చేసింది నేనే అని చెప్పకుండా.. రిషి గురించి ఇన్ని రోజులు టెన్షన్ పడ్డావ్  కదా ఇక వాడి వల్ల మనకేం టెన్షన్ ఉండదు. వాడు మనల్ని ఏం చెయ్యలేడని శైలేంద్ర అంటాడు.. ఆ తర్వాత శైలేంద్ర దగ్గరికి వసుధార, ధరణి వస్తారు. నేను శైలేంద్రతో మాట్లాడాలి. నువ్వు కాసేపు బయటకు వెళ్ళు అని  దేవాయనితో వసుధార అనగానే.. దేవాయని బయటకు వెళ్తుంది. మరొక వైపు మహేంద్రని అనుపమ అపార్థం చేసుకున్నందుకు  సారీ చెప్తుంది.  ఇక శైలేంద్రని రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని వసుధార అడుగుతుంది. నాకు తెలియదని  శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత నువ్వు అడగాల్సింది ఇలా కాదు.. బెగ్గింగ్ చెయ్యాలని శైలేంద్ర అనగానే.. వసుధార రిక్వెస్ట్ చేస్తూ రిషి ఎక్కడ అని అడుగుతుంది.. ఇలా కాదు అంటూ వాయిస్ పొగరు తగ్గాలని శైలేంద్ర అనగానే చేతులు జోడించి రిక్వెస్ట్ చేసి అడు

Brahamamudi: అప్పు ఉపవాసం.. రాజ్ లైఫ్ లోని ఆ అమ్మాయి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -278 లో... అనామిక, కళ్యాణ్ ల మొదటి శుభలేక కాలిపోవడం చూసి ఇదంతా కావ్య కావాలనే చేసింది. ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని అనామిక తల్లి అంటుంది. దాంతో మా వదిన అలాంటిది కాదని కళ్యాణ్ కావ్య సపోర్ట్ చేస్తు మాట్లాడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ , అనామికల పెళ్లి జరగాలని కావ్యే మొదటి నుండి సపోర్ట్ చేసింది. అలా కావాలని చెయ్యదని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఇదంతా అనుకోకుండా జరిగింది. దీన్ని వదిలేయండి. పెళ్లి తర్వాత మీ అమ్మాయికి ఈ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని రాజ్ చెప్పగానే.. అనామిక పేరెంట్స్ రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత రాజ్ కి శ్వేత ఫోన్ చెయ్యగానే అక్కడ నుండి తనని కలవడానికి వెళ్తాడు. మరొకవైపు రాజ్ చాలా మంచివాడు. ఇంత ఆస్తులు ఉన్న పెళ్లికి ముందు తన జీవితంలో ఏ అమ్మయి లేదని కనకం మురిసిపోతుంది. అవును నా భర్త ఇప్పుడు ఇప్పుడే నన్ను అర్థం చేసుకుంటున్నాడని కావ్య కూడా మురిసిపోతుంది. మరొకవైపు రాజ్ ఒక దగ్గరికి వెళ్లి శ్వేతా కోసం వెయిట్ చేస్తుంటే శ్వేత వచ్చి రాజ్ ని హగ్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావని శ్వేతని రాజ్ అడుగుతాడు. ఇలాగే ఉన్నాను నా మనసు అలాగే ఉంది. ఆ ప్రేమ అలాగే ఉందని శ్వేత చెప్తుంది. నీకు ఎప్పుడు నేను తోడు ఉంటానని శ్వేతతో రాజ్ ప్రేమగా అంటాడు. మరొకవైపు కళ్యాణ్ శుభలేక కాలిపోయిన విషయం గురించి బాధపడుతు ఉంటాడు. కావ్య ఇంకా ఇంట్లో వాళ్ళు అందరు వచ్చి దాని గురించి వదిలేయ్ అని చెప్తారు. రేపు గుడికి వెళ్లి దీపం వదిలి ఉపవాసం ఉండమని ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ కి చెప్తారు.  ఆ తర్వాత అదే విషయం అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి చెప్తాడు. కాసేపటికి అనామిక పేరెంట్స్ కన్నింగ్ గా అలోచించి.. నువ్వు ఉపవాసం ఉన్నానని అబద్ధం చెప్పు.. కళ్యాణ్ తో పెళ్లి జరగడం కంటే నీకు ఏది ఎక్కువ కాదని వాళ్ళకి తెలిసేలా చెయ్యి. నీకు కళ్యణ్ కి పెళ్లి అయ్యాక,‌ ఆ తర్వాత కథ నేను నడిపిస్తానని అనామిక తండ్రి అంటాడు.  మరొకవైపు అప్పుకి కనకం ఫోన్ చేసి.. ఉపవాసం ఉండమని చెప్తుంది. మొదట అప్పు ఒప్పుకోదు కానీ ఆ తర్వాత అప్పు ఒప్పుకుంటుంది. తరువాయి భాగంలో.. అందరు గుడికి వెళ్తారు.‌ కళ్యాణ్, అనామికల పెళ్లి జరగాలని కావ్య నూట ఎనమిది  ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుందని రాజ్ కావాలనే అంటాడు. ఆ తర్వాత కావ్యని ఎత్తుకొని రాజ్ ప్రదక్షిణలు చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషి సర్ తిరిగి వస్తాడా ? రోల్ ని రీప్లేస్ చేస్తారా ? డైలమాలో ఆడియన్స్

గుప్పెడంత మనసు సీరియల్ అంటే చాలు రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడనే అందరికీ గుర్తొస్తాడు..అందమైన మాష్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి రిషి సర్ క్యారెక్టర్ ని దాచి పెట్టేసి  రెండు వారాలుగా సీరియల్‌ ని నడిపించేస్తున్నారు. ఈ విషయాన్నీ మాత్రం  అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే   జగతి అలియాస్ జ్యోతి రాయ్ క్యారెక్టర్ ని చంపేశారు.. ఆమె మూవీస్ లో నటిస్తున్న కారణంగా ఈ రోల్ ని త్వరగా ముగించేశారు. అలాగే రిషి రోల్ ని కూడా ముగించేసినట్టేనా అంటూ ఫాన్స్ అనుమానిస్తున్నారు. రీసెంట్ గా మరో సీరియల్ "కృష్ణ ముకుంద మురారీ" లో కూడా  మురారీని మార్చేశారు... అసలైన క్యారెక్టర్ కి  యాక్సిడెంట్‌ అయ్యేలా చేసి ఫేస్ కి ప్లాస్టిక్‌ సర్జరీ చేసేసి కొత్త మనిషి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేసారు. ఇవన్నీ చూస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆడియన్స్ లో కూడా ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఐతే ఇంకో విషయం ఏంటంటే ముఖేష్ గౌడ.. గుప్పెడంత మనసు సీరియల్‌ తో సంపాదించుకున్న క్రేజ్‌తో బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయ్యాడు... ఆయన హీరోగా  ‘గీతా శంకరం’ అనే మూవీ త్వరలో రాబోతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ముఖేష్ గౌడ సరసన.. ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్‌  విడుదల చేశారు. ఐతే ఈ మూవీ నవంబర్ నుంచి షూటింగ్ జరుపుకుంటోంది.  ఈ సినిమా షూటింగ్ కోసమే ముఖేష్ గౌడ.. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక సీరియల్ కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ప్రస్తుతానికి ఈ క్యారెక్టర్ కి సంబందించిన కథలో చేంజెస్ చేసి రిషిని తప్పించినట్టు తెలుస్తోంది. ఐతే మూవీ షూటింగ్ పూర్తయ్యాక సీరియల్ లో చేస్తాడా..లేదంటే ఈ రిషి సర్ ప్లేస్ ని ఎవరితో ఐనా రీప్లేస్ చేస్తారా అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.  

ఇండిగో సర్వీసెస్ పై యాంకర్ శ్యామల ఫైర్...దిగొచ్చిన యాజమాన్యం

యాంకర్ శ్యామల గురించి అందరికీ తెలుసు. యాంకర్ గా ఆమెకు ఎంతో పేరుంది. అలాంటి శ్యామలకు ఇప్పుడు కోపం వచ్చింది. రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఒక వీడియోని పోస్ట్ చేసింది. తనకు ఎదురైనా ఒక ఇన్సిడెంట్ గురించి ఆ వీడియోలో చెప్పింది. అలాగే ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసెస్ మీద ఆమె ఫైర్ అయ్యింది. లగేజీ కోసం ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నా స్టాఫ్ ఎవరూ కూడా అప్ డేట్ ఇవ్వడం లేదని, లగేజ్ కోసం అడగడానికి కనీసం ఏ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండరూ అంటూ సీరియస్ అయ్యింది. లగేజ్ కోసం  అనౌన్స్మెంట్ కూడా చేయరని ఇలా జరగడం తనకు ఇది మూడో సారి అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇది వరకు చాలా మంది సెలెబ్రిటీలు ఎయిర్ పోర్టులో ప్రైవేట్ సంస్థల సేవల మీద ఫిర్యాదుల చేశారు. లగేజ్ మిస్ అయిందంటూ, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వరంటూ కూడా   కంప్లైంట్స్ చేసిన విషయం తెలిసిందే . ఇండిగో  డొమెస్టిక్ ఫ్లైట్ దిగాక  లగేజ్ విషయంలో  సంస్థ సరిగ్గా పని చేయడం లేదని ఫైర్ అయ్యింది. తనతో పాటు చాలా మంది పాసెంజర్స్  వెయిట్ చేస్తున్నారని, దాదాపు 45   నిమిషాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ అసహనం వ్యక్తం చేసింది.  అండ్ ఫైనల్లీ  శ్యామల వీడియో దెబ్బకు ఇండిగో  క్షణాల్లో ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసింది.  యాంకర్ శ్యామల ఇన్ స్టా స్టోరీకి రిప్లై ఇచ్చింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని సమస్యను పరిష్కరించింది. ఇలా వెంటనే స్పందించినందు కూడా బదులుగా థాంక్స్ అంటూ శ్యామల కూడా  రిప్లై ఇచ్చింది.  

ఇలా చూడగానే అలా డాన్స్..అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం

అలీతో ఆల్ ఇన్ వన్ షో ఈ వారం చాల సరదాసరదాగా సాగింది. ఈ షోకి జబర్దస్త్ కమెడియన్ సద్దాం, డాన్సర్ పండు, సింగర్ సమీరా భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ముందుగా పండుతో దోచేయ్ గేమ్ ని ఆడించాడు ఆలీ. "మన తెలుగు ఇండస్ట్రీలో స్క్రీన్ మీద చూసినప్పుడు అబ్బా ఎవరా హీరో  ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు అని అడిగితె ఎవరు పేరు చెప్తావ్" అంటూ ఆలీ అడిగేసరికి "జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం..అయన డాన్స్ బాగా వేస్తారు. ఆయన అన్ని మూవీస్ ఫాలో అవుతూ ఉంటాను. ఒకసారి నేను జై లవకుశ మూవీ షూటింగ్ కి వెళ్లాను. ఆ టైంలో ట్రింగ్ ట్రింగ్ అనే సాంగ్ షూటింగ్ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడే లొకేషన్ కి వచ్చారు అప్పుడే చూసి వెంటనే వేసేసారు. డాన్స్ మూవ్మెంట్స్ ని గుర్తుపెట్టుకుని స్టెప్స్  వేయడం అంటే డాన్సర్స్ గా మాకే చాలా కష్టం. 32 కౌంట్స్ ని గుర్తు పెట్టుకోవాలి అంటే చాల టఫ్. కానీ ఆయన మాత్రం అలా కాదు. శేఖర్ మాష్టర్ డాన్స్ స్టెప్స్ ని హాఫ్ హాఫ్ కౌంట్స్ చూపించారు అవి చూసారు..వెంటనే టేక్ కి వెళ్లిపోయారు. టేక్ కూడా ఓకే ఐపోయింది. నాకే చాల ఆశ్చర్యమేసింది. ఇంత షార్ప్ గా ఉన్నారేమిటా అనిపించింది. ఒక డాన్సర్ కి ముందుగా కావాల్సింది అదే. ఏ స్టెప్ చూపిస్తే ఆ స్టెప్ అలాగే షూటింగ్ లో దింపేయడమే. డాన్స్ నేర్చుకుని స్టైలిష్ గా పెర్ఫార్మ్ చేయడం ఒక ఎత్తు కానీ ఇలా చూసి అలా గుర్తుపెట్టుకుని వెంటనే టేక్ లో ఓకే ఐపోవడం అనేది ఆయన గొప్పతనం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాల ఇష్టం. పండు ఈమధ్య బుల్లితెర మీద అన్ని రకాల షోస్ లో కనిపిస్తూ తనదైన స్టైల్ డాన్స్ వేస్తూ అలరిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు.

మంచు మనోజ్ నిద్రపోవాలంటే అది ఉండాల్సిందే..ఛీఛీ డర్టీ ఫెలో

ఈటీవీ విన్ యాప్ లో కొత్త గేమ్ షో రాబోతోంది. అదే "ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం". ఇక ఈ షోకి మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ కి "హాయ్ నాన్న" మూవీ నుంచి నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షో స్టేజి మీదకు నాని ఎంట్రీ ఇచ్చేసరికి ఆడియన్స్ అంతా కలిసి కార్డు బోర్డ్స్ మీద నాని అని లెటర్స్ ని హార్ట్ సింబల్స్ లో రాసి వెల్కమ్ చెప్పారు. ఇక మంచు మనోజ్ అది చూసి షాకయ్యాడు. "ఎన్నో రకాల వెల్కమ్స్ ని చూసా కానీ ఇలాంటి వెల్కమ్ ని చూడలేదు" అన్నాడు. ఇక ఇందులో నానికి టాస్క్ ఇచ్చాడు మనోజ్. "ఇప్పుడు నువ్వు నా నాన్నవు..నేను నీ కొడుకును..నన్ను నిద్రపుచ్చి..నువ్వు లోపలి వెళ్ళాలి" అని మనోజ్ చెప్పేసరికి "నిన్ను పడుకోబెట్టాలంటే ఫుల్ తాగించాలనుకుంటా" అంటూ ఒక సిగ్నల్ ఇచ్చాడు నాని. "నీకు అమ్మకు మధ్యలో వచ్చి పడుకున్నా" అంటూ ఒక డైలాగ్ వేసాడు మనోజ్ ..దానికి నాని "ఉండు మీ అమ్మకు ఫోన్ చేస్తున్నా" అనేసరికి "వొద్దొద్దు" అంటూ లేచి వెళ్ళిపోయాడు. మధ్యలో ఇంకో టాస్క్ ఇచ్చాడు మనోజ్..హీరోయిన్స్ పిక్స్ చూపించి అన్ని వరసగా పెట్టమనేసరికి "నాజియా, మృణాల్ ఎవరు ముందు...మృణాల్ మధ్యలో వస్తుంది.." అనేసరికి "ఎవరి మధ్యలో" అంటూ కొంటె డైలాగ్ వేసాడు మనోజ్.."ఛిఛి డర్టీ ఫెలో" అన్నాడు నాని. ఇక చివరిలో దసరా మూవీ సాంగ్ కి డాన్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు నాని, మనోజ్ . ఇక మంచు మనోజ్ ఎలా హోస్టింగ్ గురించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. " మంచు మనోజ్ హోస్ట్ అంటే ఎలా చేస్తాడో అనుకున్నాను బాస్ ఫస్ట్ లో పర్లేదు బాగానే లీడ్ చేస్తున్నాడు హోస్ట్ గా గుడ్ .. మనోజ్ అన్న ఇంకా  మారలేదు అదే కామెడీ అదే పంచెస్...మనోజ్ అన్నా షో  చాలా మంచి హిట్  అవ్వాలని" ఎన్టిఆర్ ఫాన్స్ కోరుతున్నారు.  

ముగిసిన ఢీ ప్రీమియర్ లీగ్..75 లక్షలు గెలుచుకున్న గ్రీష్మ

  ఢీ ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలే ఆడియన్స్ ని బాగా అలరించింది. ఇందులో హైదరాబాద్ ఉస్తాద్స్ గ్రీష్మ మాస్టర్  వార్సెస్ సైరా రాయలసీమ ప్రభు మాస్టర్ మధ్య గట్టి పోటీ జరిగింది. అన్ని రకాల రౌండ్స్ లో ఈ రెండు టీమ్స్ పోటాపోటీగా పెర్ఫార్మ్ చేశాయి. గ్రీష్మ మాస్టర్  హీరో నాని విన్నింగ్ టైటిల్ తో పాటు కాష్ ప్రైజ్ 75 లక్షలు అందించారు. ఇక చివరిగా నాని కొన్ని మాటలు వీళ్లకు చెప్పారు. "మీరు స్క్రీన్ మీద చాలామంది డాన్స్ చేయడాన్ని చూసి చాల ఇన్స్పైర్ అయ్యి ఈ స్టేజి మీద డాన్స్ చేసి ఉంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా కదా మీకంటే కూడా వాళ్ళెవరూ అంత బాగా చేయలేదు. ఇక గ్రీష్మ గురించి ప్రభుదేవా మాస్టర్ కూడా కొన్ని విషయాలు చెప్పాడు "గ్రీష్మ టైటిల్ విన్ ఐనందుకు చాల సంతోషంగా ఉంది. మేమిద్దరం కలిసి ఢీ జోడిలో చేసాం. గ్రీష్మ చాల కష్టపడుతుంది. ఇక షో స్టార్టింగ్ లో నానిని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగాడు హోస్ట్ ప్రదీప్ "ఇంట్లో మీరు వంట చేసి ఎవరైనా తినగలిగే ఐటెం ఏమిటి" అనేసరికి " ఆ నమ్మకం లేకే ఇంతవరకు వంట చేయలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే వేరుశెనగగుళ్ళను ఉడకపెట్టడం నేను ఒక్కడినే చేస్తాను" అన్నాడు. "మలయాళంలో అమ్మాయిలంతా మిమ్మల్ని బావ అని పిలుచుకుంటారు" అనేసరికి నాని ఆన్సర్ చెప్పకుండా ఇదేదో ఆడియన్స్ అడిగిన ప్రశ్నల్లా లేవు అని కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఆది కూడా శేఖర్  మాస్టర్  ని కొన్ని ప్రశ్నలు అడిగి ఎంటర్టైన్ చేసాడు. ఇలా ఈ వారంతో ఢీ సీజన్ 16 ముగిసింది.  

Brahmamudi:శుభలేకకి నిప్పు.. వారి పెళ్ళిలో మరో ముప్పు...!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -277 లో... అనామికకి కళ్యాణ్ ఫోన్ చేసి.. ఇంటికి రమ్మని చెప్తాడు. ఆ విషయం వెనకాల ఉన్న కనకం వింటుంది. అదే విషయం కనకానికి కళ్యాణ్ చెప్తాడు. మొక్క విషయంలో నా ప్లాన్ ఫెయిల్ అయింది. ఈ సారి సరిగ్గా ప్లాన్ చెయ్యాలని కనకం ఆలోచిస్తుంది. ఇక అనామిక వాళ్ళు ఇంటికి వచ్చి తాంబులాలు మర్చుకున్నట్లు కుంకుమభరని కనకం కిందపడిపోయినట్లు, ఇక అపశకునమని పెళ్లి కాన్సిల్ చేసినట్లు కనకం ఓ కల కంటుంది. కాసేపటికి అప్పు వచ్చి పిలవగానే.. ఇదంతా కల కన్నానా అని అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి సరిగ్గా టైమ్ కీ వచ్చావంటూ అప్పు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. మరొక వైపు ఇంట్లో అందరు బిజీగా ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నవని రుద్రాణిని రాహుల్ అడుగుతాడు. మనకి ఆ స్వప్నని కోడలుగా చేసి వాళ్ళు మాత్రం మంచి ఇంటి నుండి సంబంధం తెచ్చుకుంటున్నారు. నాకు దక్కని అనందం ఎవరికి దక్కడానికి వీలు లేదని రుద్రాణి అంటుంది. ఎలాగు దోషం ఉందని చెప్పారు కదా, ఇప్పుడు ఏం జరిగిన దాని వల్లే జరిగిందని అనుకుంటారు. అది మనం చెయ్యకూడదు కావ్య వల్లే జరిగిందని అనేలా చెయ్యాలని రాహుల్ తో ఒక ప్లాన్ చెప్తుంది రుద్రాణి. మరొకవైపు అనామిక పేరెంట్స్ దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఇరు కుటుంబాలు తాంబులాలు‌ ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక కనకం ఉహించుకున్నట్లుగానే కుంకుమభరని కిందకి పడేయ్యబోతుంటే ధాన్యలక్ష్మి చూసి కిందకి పడకుండా పట్టుకుంటుంది. ఆ తర్వాత మొదట శుభలేకని దేవుడి దగ్గర పెట్టి కావ్య పూజ చేస్తుంటుంది. అయితే దీనికి ముందు.. శుభలేకకి పెట్టిన పసుపులో ఏదో మందు కలుపుతుంది రుద్రాణి. ఇక కావ్య పూజ చేసి.‌. శుభలేకతో హారతి ఇస్తుండగా మంట అంటుకుంటుంది. దాంతో అందరు కంగారుపడతారు శుభలేకకి ఉన్న మంటని కావ్య ఆర్పుతుంది . ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావంటు కావ్యని రుద్రాణి తిడుతుంది. అది విని అనామిక పేరెంట్స్ కూడా కావ్యనే తప్పు పడుతారు. నీ అజాగ్రత్త వల్ల ఏం జరిగిన.. అది నా కూతురు దోషం వల్లే అయిందని అనుకుంటారనే ఇదంతా చేసావా? ఇందాక మీ అమ్మా కుంకుమభరిని పడేయబోతే ధాన్యలక్ష్మి పట్టుకుంది. అసలు ఈ అమ్మయికి ఈ పెళ్లి ఇష్టం లేదు కావచ్చని కావ్యని అనామిక వాల్ల అమ్మ అనగానే.. అలా అనకండి అని కళ్యణ్ అంటాడు. అప్పుడే కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటాడు. తరువాయి భాగంలో.. ఇంత ఆస్తులు ఉన్నా రాజ్ జీవితం లో పెళ్లి కాకముందు అతని జీవితంలో ఏ అమ్మాయి ఉండకపోవడం నీ అదృష్టమని కావ్యతో కనకం చెప్తుంది. అవునని కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు శ్వేత అనే అమ్మాయిని రాజ్ రహస్యంగా కలుస్తాడు. ఆ అమ్మయిని కౌగిలించుకొని.. నీకు నేను ఉన్నానని ఎప్పటికి మర్చిపోకు శ్వేత అని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Guppedantha Manasu:జగతిని చంపింది శైలేంద్రే అని తెలుసుకున్న అనుపమ.. ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -944 లో ముకుల్ చేసిన ఇన్వెస్టిగేషన్ తప్పని శైలేంద్ర డ్రామా క్రియేట్ చెయ్యడంతో ఇక ఎవరికి ఏది నమ్మాలో అర్థం కాదు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర తమ ప్లాన్ సక్సెస్ అని  హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అప్పుడే  ధరణి వచ్చి ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉన్నది మీరే కాదా అని అడుగుతుంది. అవును నేనే కానీ ఇప్పుడు మారిపోయానని శైలేంద్ర నటన మళ్ళీ మొదలుపెడతాడు.  ఆ తర్వాత శైలేంద్ర, దేవాయని ఇద్దరు ఎంత నటించిన ధరణి నమ్మదు. వాళ్లపై కోపంగా బయటకు వెళ్తుంది. ధరణి నమ్మట్లేదని దేవాయని అనగానే.. తనని ఎలా నమ్మించాలో నాకు తెలుసని శైలేంద్ర అంటాడు. మరొకవైపు జగతి ఇన్వెస్టిగేషన్ గురించి ముకుల్, అనుపమ మాట్లాడుకుంటారు. ఈ కేసు ప్రధాన నిందితుడు శైలేంద్ర అని ముకుల్ అంటాడు. మీకేలా తెలుసు అంటూ అనుపమ అడుగుతుంది. ఆధారం దొరికిన వెంటనే తనపై ఎటాక్ జరగడమేంటి? మళ్ళీ ఇప్పుడు రిషి కన్పించకుండా పోవడమేంటి? అంత ఒక పజిల్ లా ఉంది. ఎలాగైనా ఈ కేసుకి సంబంధించిన నిందితులని పట్టుకుంటానని ముకుల్ అంటాడు. ఈ కేసుకి సంబంధించి ఏదైనా కావాలంటే నా ఇన్ ఫ్లుయెన్స్ ఉపయోగిస్తానని అనుపమ చెప్తుంది. మరొకవైపు తనకు తానే ఎటాక్ చేయించుకున్న శైలేంద్ర.. ఎటాక్ చేసిన రౌడీలతో మాట్లాడుతుంటే దూరంగా ఉండి వింటుంది. మీరు చాలా బాగా చేశారు. నేను చెప్పినట్టు నాపై ఎటాక్ చేశారని ఆ రౌడీలతో శైలేంద్ర మాట్లాడుతూ.. వాళ్ళకి డబ్బులు ఇవ్వడాన్ని ధరణి చూసి షాక్ అవుతుంది. మరొకవైపు రిషి గురించి మహేంద్ర, వసుధార ఆలోచిస్తుంటారు. అప్పుడే ధరణి కంగారుగా వసుధార, మహేంద్ర దగ్గరికి వచ్చి... ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉన్న వాయిస్ మా అయన శైలేంద్రదని అనగానే ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత శైలేంద్ర చేసిన తప్పుల గురించి చెప్తూ.. ఈ ఎటాక్ కూడా తనే చెప్పించుకున్నాడు. ఇందాక ఆ ఎటాక్ చేసిన రౌడీలతో మాట్లాడుతుంటే విన్నానని ధరణి చెప్తుంది. అప్పుడే అనుపమ వచ్చి ధరణి మాటలు విని.. నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. నిజమే అంటు ఎండీ చైర్ కోసం ఇదంతా శైలేంద్ర చేస్తున్నాడని ధరణి  చెప్తుంది. ఇన్ని రోజులు జగతిని ఎవరు చంపారంటూ అడిగావ్ కదా? ఇప్పుడు తెలిసిందా అని అనుపమతో‌ మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:కోనేరులో పడిపోయిన కృష్ణ.. మురారికి గతం గుర్తొచ్చేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -338 లో.. కృష్ణ ఒకవైపు మురారి, ముకుందలు ఒక వైపు తులసి పూజా చేస్తుంటారు. కృష్ణ, మురారి దూరంగా ఉన్న.. పక్కన ఉన్నట్టు ఫీల్ అయి మురారిని చూస్తూ పూజ చేస్తుంటుంది కృష్ణ. అటువైపు మురారి పక్కన ముకుంద ఉన్న కూడా పట్టించుకోడు. దాంతో ముకుంద డిస్సపాయింట్ అవుతుంది.  ఆ తర్వాత భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. పూజ అయిపొయిందా అని అనగానే ముకుంద చిరాకుగా చెప్పడం తో ఏమైందని అడుగుతుంది. దాంతో ముకుంద పూజ దగ్గర జరిగింది చెప్తుంది. నీది తప్పు కాదు. నాది తప్పు అసలు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక వాళ్ళని ఇక్కడి వరకు రానివ్వకుండా ఉంటే, ఇక్కడి వరకు  వచ్చేది కాదని భవాని అంటుంది. ఆ తర్వాత కృష్ణకి మీపై చాలా గౌరవం అందుకే ఇప్పుటి వరకు నిజం చెప్పకుండా ఆగింది. నిన్ను రాత్రి కూడా కృష్ణ భర్త ఎవరని అందరిని అడిగి కోపంగా కృష్ణ దగ్గరికి వెళ్లి అడిగాడు కృష్ణ. అప్పుడు కూడా నిజం చెప్పలేదు. చెప్తే ఇంట్లో వేరేలా ఉండేదని ముకుంద అనగానే.. కృష్ణ అంత మోసం చేసిన తన గురించి పాజిటివ్ గా చెప్తున్నావ్. అది నాకు బాగా నచ్చింది. మురారికి కాబోయే భార్యకి ఉండే అర్హత నీకు ఉందని ముకుందతో భవాని అంటుంది. మురారికి పెళ్లి చేస్తానని భవాని చెప్పగానే ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ దగ్గరికి మురారి ఆపిల్ ముక్కలు, చట్నీ తీసుకోని వస్తాడు. అది చూసి మురారికి గతం గుర్తుకు వస్తుందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అందరు గుడికి వస్తారు. కృష్ణ కూడా వస్తుంది. ముకుంద, భవాని తప్ప అందరూ కృష్ణతో సరదాగా మాట్లాడుతుంటే.. చూడండి అందరూ కృష్ణతో ఎలా సరదాగా ఉన్నారో అని ముకుంద అంటుంది. వాళ్ళ దగ్గరికి భవాని వెళ్లి.. అందరు రండి ఒక కృష్ణ తప్ప అంటుంది. దాంతో అందరు వెళ్ళిపోతారు కృష్ణ ఒక్కతే ఉందని బాధపడుతు ఉంటుంది. మరొక వైపు ముకుంద మురారి ఇద్దరు పూజ చేస్తుంటారు. అది చూడలేక నందు, మధు ఇద్దరు కృష్ణ దగ్గరికి వస్తారు.  నిన్న రాత్రి నీ భర్త ఎవరని మురారి అడిగినప్పుడు.. ఏమని చెప్పావ్ అని నందు అడుగుతుంది. గతం గుర్తుక వస్తే నా భర్త ఎవరో తెలుస్తుందని చెప్పానని నందుకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత మీ ఈడు గల మూత్తయిదువులతో కంకనాలు కట్టించాలని పంతులు చెప్తాడు. ఎవరు.. ఉన్నారని భవాని అనగానే కృష్ణ ఉంది కాదా అని మురారి అంటాడు. తరువాయి భాగంలో.. కృష్ణ, ముకుంద ఇద్దరు మాట్లాడుకుంటు ఉండగా కృష్ణ కోనేరులో పడిపోతుంది. ఏసీపీ సర్ కాపాడండని కృష్ణ అరుస్తుంటే.. మురారికి గతం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శివంగి ప్రియాంక గేమ్ ఆన్.. జర్నీ అదుర్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో‌ ఇప్పటికే పద్నాలుగు వారాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న అమర్, ప్రశాంత్,‌యావర్, శివాజీ, ప్రియాంక ఫినాలే వీక్ లో‌ ఉన్నారు. ‌కాగా మొదటి రోజు అనగా సోమవారం నాటి ఎపిసోడ్ లో అమర్ దీప్,‌ అంబటి అర్జున్ ల జర్నీ వీడియోలని చూపించిన బిగ్ బాస్ .. నిన్నటి ఎపిసోడ్ లో మొదట శివాజీ బ్లాక్ బస్టర్ జర్నీ చూపించి ఆ తర్వాత ప్రియాంక జర్నీని చూపించాడు‌ బిగ్ బాస్. మొదటగా గార్డెన్ ఏరియాలో ప్రియాంక హౌస్ లో‌ గడిపిన కొన్ని జ్ఞాపకాలని ఫోటలలో చూపించగా.. ఒక బిబి మెమరీ గిఫ్ట్ అని శివ్ వచ్చినప్పటి ఫోటో చూసి ఇంప్రెస్ అయింది. ఎవరితో స్నేహం సరైనదో, ఆటలో ముందుకు వెళ్లేందుకు ఏ దారిని ఎంచుకోవాలో మీకు స్పష్టత ఉంది. ఇంటికి ఆయువుపట్టు లాంటి కిచెన్‌కి ఉన్న శక్తిని అర్థం చేసుకొని అక్కడి నుంచే మీ ఆటని కొనసాగించారు. సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు శివంగి ప్రియాంకగా మారి నామినేషన్లలో విరుచుకపడ్డ తీరు మీరేంటో అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఎవరు ఎన్ని మాటలన్న వాటి నుంచి తేరుకొని మీ లక్ష్యంపై దృష్టి పెట్టారు తప్ప ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు అంటూ ప్రియాంక గురించి బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. ఇక తన జర్నీ వీడియో చూసుకొని ప్రియాంక తెగ ఎమోషనల్ అయిపోయింది. అసలు బిగ్‌బాస్ మాట్లాడుతుండగానే ప్రియాంక కంట్లో నీళ్లు వచ్చేశాయి. తన జర్నీని ఇంత అద్భుతంగా చూపించినందుకు సంతోషంతో ఉప్పొంగిపోయింది ప్రియాంక. అయిన ఫైనలిస్టుగా చోటు సంపాదించిన ప్రియాంక ఈ నాలుగు రోజులు హౌస్ లో ఉంటుందా లేదా చూడాలి మరి.