Krishna Mukunda Murari:మొదటిసారి అక్కకి ఎదురు తిరిగిన చెల్లి.. ఆ నిజం తెలిసిపోనుందా?

 స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -347 లో...  భవాని దగ్గరకి ముకుంద వచ్చి మనం ఏదో తప్పు చేస్తున్నట్లు ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. ఇంట్లో అందరు బ్రేక్ ఫాస్ట్ కోసం అ కృష్ణ దగ్గరకు వెళ్లారంటు భవానిని మరింత రెచ్చగొట్టేలా ముకుంద మాట్లాడుతుంది. అసలు ఈ కోర్ట్? ఈ నిజం తేలడమేంటి అత్తయ్య? నాకు మురారితో జీవితం పంచుకోవడం కావాలంతే అని భవానితో ముకుంద చెప్పుకుంటూ బాధపడుతుంది. మరొకవైపు ఇంట్లో అందరు బ్రేక్ ఫాస్ట్ కోసం కృష్ణ దగ్గరకి వెళ్తారు. సరదాగా అందరూ నవ్వుతు ఉంటారు. అప్పుడే భవాని వస్తుంది. మీరేం చేస్తున్నారో మీకు అయిన అర్థం అవుతుందా అని భవాని కోపంగా అంటుంది. ఆనందంగా ఉండడం కూడా తప్పేనా అని రేవతి అంటుంది. ఆనందం కాదు పైసాచిక ఆనందం.. ఇంట్లో ముకుంద జీవితం ఏం అవుతుందోనని చావడానికి కూడా సిద్ధపడింది. మీరు అవేమి పట్టించుకోకుండా ఇలా నవ్వుకుంటూ ఉంటున్నారా అని భవాని అంటుంది. కృష్ణ, మురారి ఇద్దరు ఎదో చెప్పబోయే ప్రయత్నం చేస్తుంటే భవాని వినదు. నేను ఆ ఇంటికి ఏసీపీ సర్ రమ్మని చెప్పిన ఎందుకు రాలేదు. ముకుంద ఇంక బాధపడుతుందని రాలేదని కృష్ణ అనగానే.. నువ్వు అందుకు రాకుండా ఉండలేదు.‌ ఎక్కడ నిజం బయట పడుతుందో అనే భయానికి రాలేదని భవాని అంటుంది. అ తర్వాత భవాని కోపంగా వెళ్ళిపోతుంది. భవాని వెనకాలే రేవతి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కృష్ణ వాళ్ళు సరదాగా ఉన్నది భవాని గుర్తుచేసుకొని ముకుంద బాధపడడంలో అర్థం ఉందని అనుకుంటుంది. అప్పుడే రేవతి వస్తుంది. అప్పుడే వచ్చేసావా ఇంకా కాసేపు ఉండలేకపోయావా అని భవాని అనగానే.. ఉంటే తప్పేంటంటు భవానికి రేవతి ఎదురు తిరుగుతుంది. కృష్ణనే తప్పు చేసి ఉంటే మీ కంటే ముందే వాళ్ళకి డివోర్స్ ఇప్పించేదాన్ని. మీరు కృష్ణ తప్పు చెయ్యలేదని తెలిస్తే వాళ్ళిద్దరి బంధాన్ని అంగీకారిస్తారా అని రేవతి అనగానే.. నిజం తేలాక చెప్తానని భవాని అంటుంది. మరొకవైపు భవాని కోపంగా మాట్లాడింది అని శకుంతల బాధపడుతుంది. ఇంతవరకు ఎవరు అక్కకి ఎదరు తిరుగలేదు ఏమనుకుంటుందోనని రేవతి అనుకుంటుంది.. అప్పుడే అక్కడికి సుమలత, ప్రసాద్, కాసేపటికి నందు, గౌతమ్, మధు వచ్చి  మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ముకుంద వాళ్ళందరి దగ్గరికి వచ్చి.. నా గురించి మాట్లాడుకుంటున్నారా? నేను వచ్చేవరకు ఆపేసారంటూ కోపంగా వెళ్తుంటుంది. అప్పుడే దేవ్ వస్తాడు. దేవ్ రావడం చూసి ముకుంద షాక్ అవుతుంది. ఎవరు నువ్వు అంటు రేవతి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే   

Brahmamudi:బ్రహ్మముడి సీరియల్ లో ఊహించిన మలుపు.. ఆ పెళ్ళి జరిగేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -286 లో... అప్పుని అనామిక పేరెంట్స్ అవమానిస్తూ ఉంటారు. అది చూసిన కనకం, కృష్ణమూర్తి ఇద్దరు వాళ్ళ దగ్గరకు వచ్చి.. మా అమ్మాయిని ఎందుకు అలా అంటున్నారని అడుగుతారు. మీరు కళ్యాణ్ కి మీ కూతురుని ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు కదా అని అనామిక పేరెంట్స్ అంటారు. అయిన మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అంతా అంటూ కనకాన్ని కూడా అవమానిస్తారు. ఆ తర్వాత వాళ్ళ మాటలని తట్టుకోలేని అప్పు.. అనామిక వాళ్ళ నాన్న కాలర్ పట్టుకొని బెదిరిస్తుంది. ఏమి చేస్తున్నావ్ ఆగు అంటు అప్పుపై కృష్ణమూర్తి చెయ్యి ఎత్తుతాడు. మా కూతురు, మీ అమ్మాయికి ఏమి అన్యాయం చెయ్యదంటూ అప్పుని కనకం అక్కడ నుండి తీసుకొని వెళ్తుంది. ఏంటి అంత జరిగిన సైలెంట్ ఉన్నారని అనామిక అమ్మ తన భర్తని అడుగుతుంది. గొడవ ఎందుకు? ఈ పెళ్ళి జరగాలి..‌ మన అప్పులు తీరాలని అనామిక నాన్న అంటాడు. మరొకవైపు కావ్య, స్వప్న  ఇద్దరు అరుణ్ ఎక్కడ వచ్చి.. అందరి ముందు స్వప్న కడుపులో బిడ్డకి నేనే తండ్రిని అని చెప్తాడోనని స్వప్న టెన్షన్ పడుతుంది. నీ వల్లే ఇదంతా.. నీ మాటలు విని నువ్వు చెప్పినట్టు వింటే వాన్ని రెచ్చగొట్టినట్లు అయిందని స్వప్న అంటుంది. అప్పుడే కళ్యాణ్, అనామికల పెళ్లికి వచ్చిన పద్మావతి.. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆ అరుణ్ ని పట్టుకొని అందరి ముందు నిజం చెప్పేలా చేద్దామని అనుకుంటారు. నాకు మీరు ఒక హెల్ప్ చెయ్యాలి విక్కీ.. వాళ్ళ బావ నిజస్వరూపం అందరికి తెలిసేలా చెయ్యాలని పద్మావతి అంటుంది. దానికి కావ్య, స్వప్న ఇద్దరు సరే అంటారు. మరొకవైపు రాహుల్, రుద్రాణి కలిసి స్వప్నని నెగెటివ్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అరుణ్ తో కలిసి ప్లాన్ చేస్తుంటే.. విక్కీ వాళ్ళ బావ వస్తాడు. మీరు బానే ప్లాన్ చేస్తున్నారు. నేను మీ ప్లాన్ లో భాగం అవుతాను. మీరు నాకొక హెల్ప్ చెయ్యాలి. నాకు కావాలని అనుకున్న ఆ పద్మావతి నాకు దక్కకుండా పోయింది.‌ అది నాకు సొంతం అయ్యేలా చేయాలని విక్కీ వాళ్ళ బావ, రుద్రాణి, రాహుల్ తో డీల్ కుదర్చుకుంటాడు. మరొకవైపు విక్కీ-పద్మావతి, రాజ్- కావ్య జంట ఇద్దరు సరదాగా ఒకరికొకరు ఆట పట్టించుకుంటారు. అ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పల్లవి ప్రశాంత్ తో పెళ్ళికి రెడీ అంటున్న రతిక!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎన్నో ఊహించని ట్విస్ట్ లతో ఉల్టా పుల్టా థీమ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుందనేది అందరికి తెలిసిందే. సీరియల్ బ్యాచ్ గ్రూపిజం ఓ వైపు, ఇండివిడ్యువల్ గా ఆడే కంటెస్టెంట్స్ , స్పై బ్యాచ్ మరోవైపు.. ఇలా అందరు తమ ఆటతీరుని వినూత్నంగా మలుచుకున్నవారే. ఈ సీజన్ మొదట్లోనే రతిక, పల్లవి ప్రశాంత్ ల మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. ఒక ఫ్రెండ్ షిప్ బ్యాండ్ రతికకి పల్లవి ప్రశాంత్ ఇవ్వడంతో మొదలైన ఈ బంధం అంచెలంచెలుగా ఎదిగింది. ఇద్దరు ఒకరికొకరు మాటలు ఎక్సేంజ్ చేసుకోవడం రాత్రి ఇద్దరే కబుర్లు చెప్పుకోవడం, సోఫా మీద పీ, ఆర్ అంటూ అక్షరాలు రాసుకోవడం ఇలా సాగుతుంటే మన బిగ్ బాస్ మామ వీళ్ళ లవ్ ట్రాక్ ని ప్రేక్షకులకి మరింత కనెక్ట్ అయ్యేలా మంచి లవ్ సాంగ్ తో తీర్చిదిద్దారు. అలా వీరిమధ్య లవ్ ట్రాక్ ఈ సీజన్ మొదట్లోనే బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ పై అందరు కలిసి ఎదురిదాడికి దిగారు. ఇందులో బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి కుక్క లెక్క తిరిగినా అని ప్రశాంత్ అనగా.. మరి ఇప్పుడు లోపలకి వచ్చాక ఏం చేశావంటూ రతిక అనడంతో ప్రశాంత్ కి నోట మాట రాకపోయింది. ఆ తర్వాత ఇక రతికతో ప్రశాంత్ దూరంగా ఉండటం మొదలెట్టాడు. ఇక ఒకరోజు టాస్క్ లో ప్రశాంత్ ని రెచ్చగొట్టేలా మాట్లాడింది. నీకు సిగ్గులేదు, బుధ్ది లేదు, మీ అమ్మనాన్నలకి ఇదేనా నువ్వు చేసేది అంటూ రెచ్చిపోయి మాట్లాడింది‌. ఇక ఒక గొడవలో నువ్వు నాకేమైన చుట్టానివా, నేను తమ్ముడు అని పిలుస్తానని రతిక అనడంతో అప్పటి నుండి అక్క అని పిలవడ‌ం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హౌస్ నుండి ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక ప్రశాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఫిధా అయినట్టుంది రతిక. ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక ప్రశాంత్ చుట్టూ తిరుగుతూ అక్క అని అనొద్దంటు శివాజీ చేత చెప్పించి పల్లవి ప్రశాంత్ ని రతిక అనేలా చేసుకుంది. ఆ తర్వాత రతిక తన ఆటతీరుతో ప్రేక్షకులని డిస్సాపాయింట్ చేసింది అందుకే తొందరగా బయటకు వచ్చేసింది. బయటకొచ్చాక పల్లవి ప్రశాంత్ గురించి మీరేమనుకుంటున్నారని ఒక ప్రశ్న వేయగా.. అతను నాకు మంచి ఫ్రెండ్. అతడికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని రతిక అంది. పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ టైటిల్ గెలిచాక బిగ్ బాస్ బజ్ ఇంటర్వూ లో మరి ఆ అమ్మాయికి ఏం చెప్తావని అడుగగా.. మా అమ్మనాన్న ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటానని ప్రశాంత్ చెప్పాడు. అయితే హౌస్ లో రతిక, ప్రశాంత్ ల మధ్య సాగిన లవ్ స్టోరీ ఈ సీజన్ లో బాగా పాపులరైంది.  

పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్‌ -7 లో శివాజీ, ప్రశాంత్, యావర్ లని కలిసి గురుశిష్యులనే అంటారు. ముఖ్యంగా ప్రశాంత్, శివాజీల మధ్య బాండింగ్ అలాగే ఉంటుంది. శివాజీ ఓ మాట చెప్తే.. ఎందుకన్నా అని తిరిగి మాట్లాడకుండా చేసేవాడు ప్రశాంత్.. అంతలా బాండింగ్ ఉండటం వల్లే శివాజీ, ప్రశాంత్ లని గురుశిష్యులని బయట అందరు పిలిచేవారు. హౌస్ లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ శివాజీ సపోర్ట్ తో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయాన్ని రెండు రోజులు కూడా ఆనందించకముందే అతనిపై పోలీసు కేసు నమోదవ్వడం, పోలీసులు గాలించి మరీ అతడిని అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అతడిని రెండు వారాల పాటు రిమాండ్ లో ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. ‌ప్రస్తుతం చంఛల్ గూడ జైలులో ఉన్న ప్రశాంత్ కి  సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తమ సపోర్ట్ ని తెలియజేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గ్రాంఢ్ ఫినాలే రోజున వాహానాలు ధ్వంసం చేసినందుకు గాను, ట్రాఫిక్ వాయిలెన్స్ ని క్రియేట్ చేసినందుకు గాను కొందరిపై‌ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా చేసినట్టు తెలిసింది. అయితే ఇందులోని ప్రధాన నిందితులని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్న పల్లవి ప్రశాంత్, రాజుని చంచల్ గూడ జైలుకి తరలించిన పోలీసులు.. నిన్న రాత్రి మిగతా దుండగులని పోలీసులు అరెస్ట్ చేసినట్టు మీడియాకి తెలియజేశారు. అయితే ఫ్యాన్స్ చేసిన తప్పు వల్ల రైతుబిడ్డ జైలుకెళ్ళాడు. కామన్ మ్యాన్ గా వెళ్ళి టాస్క్ లలో ఎంతో కష్టపడి కాళ్ళు, చేతులు విరగ్గొటుకొని చివరికి టైటిల్ గెలిచి బయటకొస్తే ఆ విజయాన్ని రెండు రోజులు కూడా ఆస్వాదించకముందే ఇలా అవ్వడం చాలా బాధాకారమని పలువురు బిబి కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భోలే షావలి ఏడుస్తూ తనని వదిలిపెట్టమని రిక్వెస్ట్ చేయగా, అశ్వినిశ్రీ తన మద్దతు తెలిపింది. ఇక ఆటసందీప్ భార్య జ్యోతి సైతం తన ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేయండి అని పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా శివాజీ తన సపోర్ట్ ఉందని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసాడు. " యావర్, ప్రశాంత్ ఇద్దరు నాకు బిడ్డల్లాంటి వారు. గత రెండు రోజులుగా ప్రశాంత్ మీద వస్తున్న వార్తలని, ఇష్యూలని అన్నింటిని చూస్తున్నాను. వాడి(పల్లవి ప్రశాంత్) తో, వాళ్ళ నాన్నతో ఎప్పుడు టచ్ లోనే ఉన్నాను. అయిన నేను ప్రతీది ఫ్రూవ్ చేసుకోనవసరం లేదు. ఎందుకంటే వాడేంటో నాకు తెలుసు. నేనేంటో వాడికి తెలుసు.  వాడు  చేయని తప్పుకి లోపలికి వెళ్ళాడు. ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి, అందుకే లోపలికి వెళ్ళాడు. ఈరోజు కాకపోతే రేపు బయటకు వస్తాడు. వాడికెప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. ఎవరు భయపడాల్సిన పనిలేదు. భాదపడాల్సిన అవసరం లేదు. అంతా కంట్రోల్ లోనే ఉంది " అంటు శివాజీ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకి స్పై బ్యాచ్ అభిమానులు..  మా సపోర్ట్ అంటు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. కాగా ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Krishna Mukunda Murari:ఆమె జీవితం బాగుచేయడానికి తనెవరు.. భవాని హైపర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -346 లో.. కృష్ణ, శకుంతల ఇద్దరు ప్రభాకర్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే మురారి వచ్చి కృష్ణ బట్టలు సర్దుకో వెళ్ళిపోదామని అనగానే కృష్ణ షాకింగ్ గా చూస్తుంది. ఏంటి భవాని గారు ఒప్పుకున్నారా అని శకుంతల అడుగుతుంది. నేను తీసుకుని వస్తానంటే సైలెంట్ గా ఉంది, ఏమి అనలేదని మురారి చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ రానని చెప్తుంది. మనం అత్తయ్యకి మాట ఇచ్చాము. అ మాటకి కట్టుబడి ఉంటాను. ఇప్పుడు నేను వస్తే ముకుంద నాపై ఇంకా నెగెటివ్ గా మాట్లాడుతుంది. పెద్ద అత్తయ్య వినే స్టేజ్ లో ఉన్నారని, ఇప్పుడు ముకుంద జీవితం కూడా బాగుచెయ్యాలని కృష్ణ అంటుంది. అసలు నేరస్తునితో పాటు ఆదర్శ్  ని కూడా ఇంటికి వచ్చేలా చెయ్యాలని మురారి అంటాడు. అ తర్వాత శకుంతలని పొయ్యిపై ఏదో పెట్టారని తనని మురారి ఇంటి లోపలికి పంపిస్తాడు. శకుంతల వెళ్ళగానే కృష్ణ చెంపపై మురారి ముద్దు పెడతాడు. మళ్ళీ శకుంతల వచ్చి నేను పొయ్యిపై ఏమి పెట్టలేదని అనగానే కృష్ణ మురారి ఇద్దరు నవ్వుకుంటారు. మరొకవైపు కృష్ణని మురారి తీసుకోని వస్తాడని భవాని హాల్లో ఎదురుచూస్తుంటుంది. అక్కడే ఉన్న భవాని.. కిచెన్ లోకి వెళ్ళనని చెప్పింది ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తుందని భవాని అంటుంది. అప్పుడే మురారి వచ్చి కృష్ణ రానని చెప్పింది. ముకుంద జీవితం బాగుచెయ్యాలని చెప్పిందని మురారి అనగానే.. తను ఎవరు? ముకుంద జీవితం బాగుచెయ్యడానికి మనం లేమా అంటూ భవాని కోపంగా మాట్లాడుతుంది. మరొకవైపు కృష్ణ దగ్గరికి రేవతి వచ్చి ఇంటికి పిలిస్తే ఎందుకు రానని అన్నావంటు అడుగుతుంది. కాసేపటికి దేవ్ దగ్గరికి ముకుంద వస్తుంది. నన్ను మురారి దగ్గరికి తీసుకొని వెళ్ళు.. నన్ను తను గుర్తుపట్టడని ముకుందతో దేవ్ చెప్తాడు. ఆ తర్వాత ముకుంద చాటుగా ఇంటికి వెళ్తుంటే కృష్ణ చూసి.. ఈ టైమ్ కి ఎక్కడకి వెళ్లి వస్తుందని అనుకుంటుంది. ముకుంద లోపలికి వెళ్ళాక.. ఎక్కడికి వెళ్ళావని భవాని అడుగుతుంది. మా నాన్న దగ్గరికి వెళ్ళానని ముకుంద చెప్పి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం ముకుంద, భవాని తప్ప ఇంట్లో అందరు కృష్ణ దగ్గరికి టీ,  బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్తారు. ఆ విషయం భవానికి ముకుంద చెప్తూ ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అరియానా అందాల విందు... అందుకే ఈ పరిస్థితి!

నీకొక విషయం చెప్పాలి పల్లవి ప్రశాంత్ గెలిచాడు.. ఇదేంట్రా బాబు ఓవైపు అతను జైలుకి వెళ్ళి, ఎప్పుడు వస్తాడో అని అందరు ఎదురుచూస్తుంటే ఇదేంట్రా బాబు అనుకుంటే కాదు. ఇది ఒక పోస్ట్ కి నెటిజన్ చేసిన కామెంట్. ఏంటా పోస్ట్? అసలెంటా పోస్ట్ అంటే.. అరియానా గ్లోరీ.. ఒక హాట్ ఫోటోస్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కి ఓ నెటిజన్ కామెంట్ గా పల్లవి ప్రశాంత్ గెలిచాడని చేశాడు. ఇలా అతను అనడానికి ఓ కారణం  ఉంది. యాంకర్‌గా కెరీయర్‌ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియాన గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చిన వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో మరింత పాపులర్‌ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను అరియాన సొంతం చేసుకుంది. అరియాన అప్లోడ్ చేసిన ఫోటోలకి పల్లవి ప్రశాంత్ గెలిచాడనేదానికి సంబంధమేంటంటే.. అరియాన ఫ్రెండ్ అమర్ దీప్ బిగ్ బాస్ సీజన్-7 లోకి వెళ్ళిన నుండి అతనికి సపోర్ట్ చేయమని తెగ పోస్ట్ లు చేసింది. ఇక అతను గెలవలేదు. పల్లవి ప్రశాంత్ గెలిచాడు అని చెప్పడానికి తనని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. పొట్ట లోపలకి లాక్కొనొ ఫోటో దిగింది, చివరికి బట్టలు లేకుంటా ఫోటోలు పెట్టేలా ఉన్నావ్ కదా, నువ్వు సపోర్ట్ చేసినందుకు అమర్ దీప్ ఓడిపోయాడు, "అసలు నువ్వు సెలబ్రిటీ ఎలా అయ్యావ్.. నీలో ఏ ట్యాలెంట్ ఉంది. కామెడీ చెయ్యలేవు, యాక్టింగ్ రాదు, అందం లేదు, అయిన ఇండస్ట్రీ లో ఉంటున్నావ్ ఇది మా కర్మ" అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్లని చూసిందా అరియానా, చూస్తే రిప్లై ఇవ్వాలి కదా.. మరి తను ఈ కామెంట్లని చూస్తే ఎలా స్పందిస్తుందో‌ చూడాలి.

Guppedantha Manasu:ఎండీ భాద్యతల నుండి తప్పుకున్న  వసుధార.. శైలైంద్ర ప్లాన్ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -952 లో.. వసుధార బ్రాస్ లైట్ పట్టుకొని లెటర్ లో చెప్పిన అడ్రెస్ కి వచ్చి రిషి కోసం చూస్తుంటుంది. అయిన రిషి ఎక్కడ కన్పించడు. అప్పుడే శైలేంద్ర వచ్చి.. అ లెటర్ ని పంపించింది నేనే. మీరు అందరు అనుకుంటున్నారు కదా అసలు రిషి నా దగ్గర ఉన్నడో లేడో అనే డౌట్ ఉంది కదా ఇప్పుడు నమ్ముతున్నావా రిషి నా దగ్గరే ఉన్నాడని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఇంత మృగంలాగా ఎలా మాట్లాడుతున్నావని వసుధార ఎమోషనల్ అవుతుంది. అవును నేను యానిమల్ నే అంటు శైలేంద్ర రాక్షసంగ అరుస్తుంటాడు. నువ్వు ఇకనైనా త్వరగా నిర్ణయం తీసుకో లేకపోతే ఇప్పుడు బ్రాస్ లైట్ వచ్చింది. ఇంకొక సారి అది పెట్టుకున్న హ్యాండ్ వస్తుందని శైలేంద్ర అనగానే.. వసుధార కోపంగా శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది. నువ్వు ఏమి చెయ్యలేవు. త్వరగా నువ్వు నిర్ణయం తీసుకో ఎండీ చైర్ నాకు వదిలేసి రిషిని కాపాడుకోమని శైలేంద్ర చెప్తాడు. నువ్వు ఈ విషయం గురించి ఎవరితోను చెప్పకూడదు అని కండిషన్ పెడతాడు శైలేంద్ర. వసుధార నిస్సహయoగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఎండీ అయి ఉండి మీటింగ్ కి లేట్ గా వస్తుందా? ఇప్పటికే టైమ్ అయిపొయిందంటు బోర్డు మెంబెర్స్ అందరు తమకి తోచింది మాట్లాడుతుంటారు. వాళ్ళని రెచ్చగొట్టేలా దేవయాని మాట్లాడుతు ఉంటుంది. అ తర్వాత బోర్డు మెంబర్స్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు.  అసలు వసుధార ఎందుకు రాలేదు కనుక్కుంటానని మహేంద్ర వెళ్ళిపోతాడు. మరొకవైపు నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు మీటింగ్ కి వచ్చావ్ ఇలా అయిందంటు దేవయాని మీదకి ఫణీంద్ర విరుచుకుపడుతాడు. కాసేపటికి ఇంటి దగ్గరకి వచ్చి వసుధార బాధపడుతుంది. మహేంద్ర వచ్చి మీటింగ్ కి ఎందుకు రాలేదని వసుధారని అడుగుతాడు. రిషి కోసం వెళ్ళానని మాత్రమే చెప్తుంది కానీ శైలేంద్ర గురించి ఏమి చెప్పదు. రేపు మీటింగ్ అరెంజ్ చెయ్యండి అందులో ఒక నిర్ణయం తీసుకోబోతున్నానని మహేంద్రకి వసుధార చెప్తుంది. అ తర్వాత అదే విషయం శైలేంద్రకి వసుధార ఫోన్ చేసి మీటింగ్ కి రమ్మని చెప్పగానే.. శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు.  దేవయాని వచ్చి ఏంటి అంత హ్యాపీగా ఉన్నావని శైలేంద్రని అడుగుతుంది. రేపు మీటింగ్ కి వెళ్తే నీకే తెలుస్తుందని శైలేంద్ర అంటాడు. మరుసటి రోజు ఉదయం మీటింగ్ జరుగుతుంది. రిషి కన్పించడం లేదు.. నేను ఎండీగా బాధ్యతలు సక్రమంగా చెయ్యడం లేదు.. అందుకే నేను ఎండీగా తప్పుకుంటున్నానని వసుధార అనగానే మహేంద్ర షాక్ అవుతూ.. ఏంటి ఏమైందని అడుగుతాడు. ఏమి లేదని వసుధార అనగానే.. మహేంద్ర కోపంగా శైలేంద్ర వంక చూస్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సమస్యలో ఉన్న అక్కకు సలహా ఇచ్చిన చెల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -285 లో.. కళ్యాణ్, అప్పు ఇద్దరు మాట్లాడుకుంటుంటే అనామిక వచ్చి.. అప్పుని బయటకు వెళ్లి ఎవరు రాకుండా కాపలా ఉండమని చెప్తుంది. ఏంటి అప్పుని అలా అంటున్నావని కళ్యాణ్ అంటాడు. ఏమి పర్లేదులే నువ్వు వెళ్ళు డోర్ దగ్గర ఉండని అనామిక చెప్పగా.. అప్పు బాధగా వెళ్లిపోతుంది.  అ తర్వాత నేను ఒకతే కూతురిని, మా వాళ్ళకు పెళ్లి తర్వాత కూడా సపోర్ట్ గా ఉంటాను. నువ్వు కూడా ఉండాలని కళ్యాణ్ కి అనామిక చెప్తుంది. ఉంటాను కానీ ఎందుకు అలా చెప్తున్నావని కళ్యాణ్ అడుగుతాడు. ఏమి లేదు నువ్వు ఉంటానని మాట ఇవ్వని అనామిక అనగానే.. తన చేతిలో చెయ్యి వేసి కళ్యాణ్ మాట ఇస్తాడు. దాంతో అనామిక హ్యాపీగా ఫీల్ అవుతు కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి,  ప్రకాష్ ఇద్దరు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళబోతుంటే అప్పు ఆపుతుంది. అయిన వాళ్ళు ఆగకుండా లోపలికి వెళ్తారు. అనామిక, కళ్యాణ్ ఇద్దరు వాళ్ళని చూసి సిగ్గుపడతారు. అప్పు మాత్రం బాధగా చూస్తుంది.‌ మరొకవైపు రాహుల్, రుద్రాణి ఇద్దరు కలిసి మళ్ళీ స్వప్నకి ప్రాబ్లమ్ క్రియేట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా అరుణ్ కి రాహుల్ ఫోన్ చేసి.. వచ్చి స్వప్నకి మాత్రమే కన్పించు అని చెప్తాడు. మరోక వైపు అరుణ్ ఫోన్ చేసిన విషయం కావ్యకి స్వప్న చెప్తుంది. నువ్వు ఏమి టెన్షన్ పడకు. ఏమి చేసుకుంటావో చేసుకో, నాకు సంబంధం లేదని చెప్పమని స్వప్నకి కావ్య సలహా ఇస్తుంది. మరొకవైపు అనామిక, కళ్యాణ్ ల హల్ది జరుగుతుంది. అందరు సరదాగా ఉంటారు. కళ్యాణ్ అప్పుని పక్కనే ఉండమని చెప్తాడు. కళ్యాణ్ పసుపుని అనామికకి పూయబోతుంటే అప్పుకి అంటుతుంది. దాంతో అనామిక వాళ్ళ అమ్మ కోపంగా అక్కడ ఉన్న అప్పుని పక్కకి తీసుకోని వెళ్తుంది. మరొకవైపు అన్ని జంటలు హల్ది సంబరాలలో ఉంటారు. అదేసమయంలో కళ్యాణ్ తో అంత క్లోజ్ గా ఉంటున్నావ్ సిగ్గు లేదా అంటు అనామిక పేరెంట్స్ అప్పుని తిడుతుంటారు. అది కనకం కృష్ణమూర్తి ఇద్దరు చూసి.. మా అమ్మాయి ఏమి తప్పు చెయ్యలేదని కనకం అంటుంది. అప్పు బాధపడుతు ఉంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రిషి సర్ త్వరలో వస్తున్నాడు!

  స్టార్ మా సీరియల్స్ లో అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తున్న సీరియల్  " గుప్పెడంత మనసు". ఈ సీరియల్ లో రిషి, వసుధారల ప్రేమకథకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే రిషికి అమ్మ పాత్రలో చేసిన జగతిని.. కొన్ని రోజుల క్రితం చనిపోయిందంటూ ముగింపు చెప్పారు. ఇక ఇప్పుడు ఈ సీరియల్ లో రిషి కనపడుట లేదు. గత వారం నుండి రిషి లేకుండానే ఈ సీరియల్ ని కొనసాగిస్తున్నారు మేకర్స్. అసలు రిషి ఎక్కడ? అతనికి ఏం అయిందంటూ ఈ సీరియల్ అభిమాలు తెగ కామెంట్లు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ‌ఈ సీరియల్ లో శైలేంద్ర మీద ఎటాక్ జరిగింది. అది తెలిసి అందరు తన దగ్గరికి వెళ్తుండగా.. మళ్ళీ వస్తానని వసుధారకి చెప్పి బయటకు ఎక్కడికో వెళ్తాడు. ఇక అలా వెళ్ళిన రిషి ఆ తర్వాత ఏ ఎపిసోడ్ లో కనపడలేదు.‌ అయితే ప్రస్తుతం రిషి ఎక్కడా అంటే శైలేంద్ర కిడ్నాప్ చేసినట్టుగా వసుధారని బ్లాక్ మెయిల్ చేసి ఎండీగా భాద్యతల నుండి తప్పుకోమని చెప్పాడు. మరి రిషి నిజంగానే ఉన్నాడా లేక వెళ్ళిపోయాడా..‌ అసలు ఈ సీరియల్ లో మళ్ళీ కన్పిస్తాడా? లేదా? అంటూ ప్రేక్షకులు తెగ ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే ఈ సీరియల్ లో రిషికి నాన్న పాత్రలో చేస్తున్న మహేంద్ర అలియాస్ సాయికిరణ్ ఈ విషయాల గురించి ప్రేక్షకులకు శుభవార్త చెప్పాడు. మహేంద్ర తన ఇన్ స్టాగ్రామ్ లో‌ వీడియో పోస్ట్ చేశాడు. అందులో ఏం చెప్పాడంటే.. జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా రిషి(ముఖేష్) గాయపడ్డాడని, ఆ గాయం కాస్తా ఎక్కువ ఉండటంతో ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసారంట. దాని తర్వాత డాక్టర్స్ బెడ్‌ రెస్ట్‌ కావాలని చెప్పారంట. దాంతో రిషి అలియాస్ ముఖేష్ గౌడ షూటింగ్‌కి కొన్నిరోజులు దూరం కావాల్సి వచ్చింది. అంటే రిషి కావాలని గ్యాప్ ఇవ్వలేదు గాయం వల్ల ఆ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే గత కొన్ని వారాలుగా 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో హీరో పాత్ర కనిపించడం లేదు. దాదాపు మూడు వారాలుగా గుప్పెడంత మనసు సీరియల్‌ లో హీరో రిషి లేకుండానే కథను లాక్కొస్తున్నారు. దీంతో ఆయనకి ఏమైందనే రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ.. రిషి ఫ్యాన్స్‌కి గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు సాయి కిరణ్ అలియాస్ మహేంద్ర భూషన్. కాగా మరికొన్ని రోజుల్లో రిషి కమ్ బ్యాక్ ఉంటుందని అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

పల్లవి ప్రశాంత్ కు మీ సపోర్ట్ అవసరం:ప్రిన్స్ యావర్!

  ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 ప్రిన్స్ యావర్ అంటే అందరికి సుపరిచితమే.‌ మోడల్ గా కొన్ని సీరియల్స్ లో చేసిన నటుడిగా‌ కొంతమందికే తెలుసు. కానీ బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాకే ఈయన గురించి అందరికి తెలిసింది. ఇప్పుడు బయట ఎక్కడ కనిపించిన.. అందరు బిగ్ బాస్ యావర్ అని గుర్తుపడతారు. మొదట కండలవీరుడిగా గుర్తింపు తెచ్చుకోగా మెల్లి మెల్లగా ‌శివాజీ చెంత చేరి కొన్ని మెళుకువలు నేర్చుకున్నాడు యావర్. మొదట‌ యావర్ హౌస్ లో ఎవరు రెచ్చగొట్టిన వారి మీదకి చాలా అగ్రెసివ్ గా దూకుడుగా వెళ్ళేవాడు కానీ ఎప్పుడైతో శివాజీతో‌ స్నేహం చేశాడో అంతా మారిపోయాడు. కీప్ కాప్ అండ్ కూల్ అన్నట్టుగా యావర్ సాధారణంగా ఉన్నాడు. బిగ్‌బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లాంటి ఒక అమూల్యమైన అవకాశం అంత ఈజీగా ఎవరికి‌ రాదు. సాధారణంగా తెలుగు షోలలో ఎవరైన కొత్తవారు పాల్గొంటున్నారంటే ఎవరైనా సరే కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. బిగ్‌బాస్ షోలో అయితే ఇది మరీ పక్కాగా ఉండాలి. కానీ యావర్ విషయంలో నిర్వహకులు చాలాసార్లు దీన్ని పక్కనపెట్టేశారు. ఇక మనోడు శివాజీ బ్యాచ్‌లోకి చేరిపోయేసరికి.. ఎలిమినేషన్ నుంచి ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చాడు. అలా ఫినాలే వీక్‌లోకి కూడా అడుగు పెట్టేశాడు. అయితే టాప్-6లో ఉన్న వాళ్లలో యావర్ కప్ కొట్టే ఛాన్స్ లేదు. దీంతో రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని ఫినాలే ఎపిసోడ్‌లో తనకు తానే ఎలిమినేట్ అయిపోయాడు యావర్. అయితే గత నాలుగు రోజుల నుండి పల్లవి ప్రశాంత్ మీద కేసులు నమోదయ్యాయని, అతడి కోసం పోలీసులు గాళింపు చర్యలు అంటు వార్తలు రాగా మొన్న ఛంచల్ గూడ జైలుకి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట.  కోర్ట్ ప్రశాంత్ కి‌ పద్నాలుగు రోజులు రిమాండ్ ను విధించింది. అయితే అతనికి బెయిల్ ఇవ్వడానికి పాటబిడ్డ భోలే షావలి రంగంలోకి దిగాడు. ‌మోస్ట్ ఎమోషనల్ గా మాట్లాడాడు. ‌కాగా ఇది వైరల్ అయింది.‌ ఇప్పుడు‌ పల్లవి ప్రశాంత్ కి యావర్ తన సపోర్ట్ ఇచ్చాడు. పల్లవి ప్రశాంత్ నాకు మంచి స్నేహితుడు. హౌస్ లో చూసాను వాడు చాలా మంచివాడు. అతడి తప్పు లేదు. దయచేసి అతనికి అభిమానులు  సపోర్ట్ చేయండి. త్వరగా బయటకు రావాలని ప్రిన్స్ యావర్ తన సపోర్ట్ ని పల్లవి ప్రశాంత్ కి తెలిపాడు.  నా ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, శివాజీ అన్న ఫ్యాన్స్, స్పై ఫ్యాన్స్ ప్రశాంత్ కి సపోర్ట్ చేయండి అంటు యావర్ ఈ వీడియోలో తెలిపాడు. మరి ప్రశాంత్ కు బెయిల్ లభిస్తుందా? లభిస్తే ఎన్ని రోజుల్లో బయటకు వస్తాడో తెలియాలి.

రైతుబిడ్డ కోసం కన్నీళ్లు పెట్టుకున్న పాటబిడ్డ.. పాపం వాడికేం తెలియదు!

బిగ్ బాస్ హౌస్ లో అటు రైతు బిడ్డ కప్పు గెలిచి అందరిని ఆకట్టుకోగా, ఇటు పాట బిడ్డగా అడుగుపెట్టిన భోలే షావలి తన పాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజలని ఎంటర్ టైన్ చేశాడు. 2.0 లో అశ్వినిశ్రీ, పూజామూర్తి, నయని పావని, అంబటి అర్జున్ లతో పాటు పాట బిడ్డగా భోలే షావలి ఎంట్రీ ఇచ్చాడు. ఇక హౌస్ లో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ లతో ఎక్కువగా కన్పించిన భోలే తన సపోర్ట్ ని‌ స్పై బ్యాచ్ కి ఇచ్చాడు. హౌస్ లో తన మాటతీరుతో, ఆటతీరుతో పంచులతో ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు భోలే. బిగ్ బాస్ హౌస్ లో భోలే పాడిన అమ్మ పాట ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలని కరిగించింది. నాగార్జున సైతం అతని పాటని ఆస్వాదిస్తూ ప్రతీ వీకెండ్ ఓ పాటని కూడా పాడమనేవాడు. సీరియల్ బ్యాచ్ తో నామినేషన్ లో అతని డిఫెడింగ్ చూసి ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ పేజీలు పుట్టుకొచ్చాయి. సీరియల్ బ్యాచ్ తో గొడవల్లో భోలే షావలి మాస్ పంచ్ లకి క్లాస్ పీపుల్స్ కూడా క్లాప్స్ కొట్టారు. బిగ్ బాస్ షో మీద అతను లిరిక్స్ రాసి పాడిన ఆ పాట ఎంతో ఫేమస్ అయింది. ఇప్పుడు భోలే అంటే హీరో అంటూ మరో కొత్త పాటతో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు. కాగా ఇప్పుడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని అలా కావాలని అన్నీ ప్లాన్ చేసి ఇలా ఇరికించారంటూ ఎమోషనల్ అయ్యాడు భోలే. మీడియా వాళ్లతో పల్లవి ప్రశాంత్ ఏమైనా మిస్టేక్‌గా ప్రవర్తించి ఉంటే నా తరఫున సారీ చెబుతున్నా.. అతనికేం తెలీదండి.. అతను మట్టి బిడ్డ.. పోరాటం చేసి గెలిచాడు.. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతుబిడ్డగా ఇంత సాధించాడు. హౌస్‌లో ఆటాడేటప్పుడు నాకు తెలుసు.. ఎన్నో దెబ్బలు తాకించుకున్నాడు.. రొమ్ము మీద దెబ్బ తగిలితే "అన్నా ఇక్కడ నొస్తంది నాకేమైనా అయితదా" అని అడిగాడు.. అంటే లేదు తమ్ముడు నువ్వు జనం కోసం ఆడాలి.. నీకోసం ఎదురుచూస్తుర్రు జనం.. అని చెప్పేవాడిని. నేను వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లాను.. "తమ్ముడు నీకు మంచి పేరుంది.. నువ్వు ఆడాలి.. నువ్వు గెలవాలి.. నేను నీకోసం పాట పాడటానికి వచ్చినా అని చెప్పాను.. నేను లేకున్నా ఫర్లేదు తమ్ముడు.. నేను పాటతోటి బతుకుతా బయట.. కానీ నువ్వు ఆటతోనే బతకాలి బయటికొచ్చి అని నేను అన్నా.." అంటూ భోలే చెప్పుకొచ్చారు. నిన్న అశ్వినిశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. " పాపం అండి వాడికేం తెలియదు. ఎవరో ఏమో చేస్తే ప్రశాంత్ ని ఎందుకు అరెస్ట్ చేశారు. విన్ అయి కనీసం రెండు రోజులు కూడా కాలేదు. వాడికి విన్ అయిన సంతోషం కూడా లేకుండా చేశారు" అంటూ చెప్పింది. ఇలా పల్లవి ప్రశాంత్ ఏం తప్పు చేశాడంటూ అశ్వినిశ్రీ, భోలే షావలి, ఆటసందీప్ అతడి భార్య ఇన్ స్టాగ్రామ్ లలో పోస్ట్ లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు భోలే చెప్పిన మాటలకు ఫ్యాన్స్ తమ‌ మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. రైతుబిడ్డ కోసం పాటబిడ్డ పెట్టిన కన్నీళ్ళకు బిగ్ బాస్ ప్రేక్షకులు స్పందిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. కాగా ఇది ఫుల్ వైరల్ గా మారింది.

Guppedantha Manasu:తన‌ భర్త కోసం భార్య ఆ అడ్రస్ కి వెళ్తుందా..!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -951 లో... వసుధార క్యాబిన్ లోకి శైలేంద్ర వెళ్లి ఎండీ చైర్ లో కూర్చోవాలని అనుకుంటాడు. అప్పుడే వచ్చిన వసుధార... ఎవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చారని కోప్పడుతూ ఫ్యూన్ ని పిలుస్తుంది. వీళ్ళని మెడపట్టుకొని బయటకు గెంటెయ్యమని ఫ్యూన్ తో వసుధార చెప్తుంది. దాంతో దేవయాని , శైలేంద్ర ఇద్దరు వెళ్లిపోతుంటారు. ఇంకొకసారి పర్మిషన్ లేకుండా లోపలికి రాకండి అని వాళ్ళకి వసుధార వార్నింగ్ ఇస్తుంది. అడ్డమైన వైరస్ లు అన్ని చైర్ కి తాకాయి. చైర్ ని క్లీన్ చెయ్యమని అక్కడే ఉన్న ఫ్యూన్ కి వసుధార చెప్తుంది. వసుధార మాటలు విని మరింత కోపంగా దేవయాని, శైలేంద్ర ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు అనుపమ, మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటు ఉంటారు. ఎప్పుడు ఇక్కడే జగతి , నేను కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఎప్పుడు జగతి స్టూడెంట్స్ గురించి ఆలోచించేదని మహేంద్ర అంటాడు. అ తర్వాత పాపం వసుధార.. రిషి గురించి చాలా బాధపడుతుందని అనుపమ అంటుంది. వాళ్ళ  ప్రేమే వాళ్ళని దగ్గరికి చేస్తుందని మహేంద్ర అంటాడు. మరొకవైపు వసుధార అన్న మాటలు దేవయాని గుర్తుకు చేసుకొని ఏడుస్తుంటే శైలేంద్ర వచ్చి.. ఎందుకు ఏడుస్తున్నావ్ ? అ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావని అంటాడు. నిన్ను అంత చీప్ గా తీసి పారేస్తుంది. పైగా మెడ పట్టుకొని గెంటేయ్యమని చెప్పిందని దేవయాని అనగానే.. అప్పుడే ధరణి వచ్చి అయ్యో మిమ్మల్ని మెడపట్టి బయటకు గెంటేసారా అంటూ కావాలనే వెటకారంగా మాట్లాడుతుంది. ఇద్దరిని గెంటేసారా అని ధరణి అంటుంది. అ తర్వాత దేవయాని చిరాకుపడుతూ ధరణిని పంపిస్తుంది. వసుధార అన్న మాటల కంటే దీని మాటలు ఎక్కువ బాధపెడుతున్నాయని దేవయాని అంటుంది.  వసుధార ఎన్ని మాటలు అందో దానికి రెట్టింపు పగ తీర్చుకుంటానని శైలేంద్ర అంటాడు. మరొకవైపు రిషి గురించి వసుధార ఆలోచిస్తుంటే.. అప్పుడే మహేంద్ర వచ్చి మీటింగ్ కీ వెళ్తున్నాను, నువ్వు త్వరగా రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. అదే మీటింగ్ కి దేవయాని కూడా వెళ్తుంది. నువ్వు ఎందుకు వచ్చావని దేవయానిని ఫణింద్ర అడుగుతాడు. నేను తెలుసుకోవాలి కదా అని దేవయాని అంటుంది. ఇంకా ఎండీ గారు రాలేదా అని అనగానే వసుధారకి మహేంద్ర ఫోన్ చేసి.. ఎక్కడ ఉన్నావని ఆడుగుతాడు. ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరుతున్నానని వసుధార చెప్తుంది. వసుధార బయలుదేర్తుండగా అప్పుడే తనకి ఒక కొరియర్ వస్తుంది. అందులో రిషి బ్రాస్ లైట్, ఒక లెటర్ ఉంటుంది.  చెప్పిన అడ్రస్ కి వస్తే రిషి ఉంటాడు. త్వరగా రావాలని, ఈ విషయం ఎవరికి చెప్పకూడదని ఆ లెటర్ లో ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:కృష్ణ ముకుంద సీరియల్ లో సరికొత్త మలుపు.. దేవ్ ఎందుకొచ్చాడంటే?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -345 లో.. కృష్ణ, మురారి ఇద్దరు కమీషనర్ గారిని కలుస్తారు. జరిగిందంతా చెప్పి అసలు నేరస్తులెవరో కనుక్కోవాలని కమీషనర్ కీ మురారి చెప్పి డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్తాడు. ఇన్ని రోజులు కన్పించకుండా వెళ్లి రూపం మారి రావడం ఇదంతా కాంప్లికేటెడ్ గా ఉంది. పై అధికారులతో మాట్లాడాలని కమీషనర్ చెప్తాడు. ఆ తర్వాత కమీషనర్ కి  భవాని చెప్పిన కండిషన్ గురించి చెప్తాడు. ఎలాగైనా ఈ శుక్రవారం లోపు నేరస్తులను పట్టుకోవాలని కృష్ణ చెప్తుంది. సరే కొన్ని రైట్స్ మురారికి ఇస్తున్నాను. అలాగే ఈ విషయంలో ఏం హెల్ప్ కావాలన్న చేస్తానని కమీషనర్ చెప్తాడు. మరొకవైపు భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. ఒకవేళ మురారి ఈ విషయం ఛేదిస్తే నా పరిస్థితి ఏంటని ముకుంద అనగానే.. నువ్వు నెగెటివ్ గా అలోచించకని భవాని చెప్తుంది. మరొకవైపు ముకుందకి ఎదరుగా మధు వచ్చి.. టెన్షన్ పడుతున్నావా అని అడుగుతాడు. లేదని ముకుంద అనగానే.. టెన్షన్ పడాలి మురారికి గతం గుర్తుకు వచ్చింది. నీకు మురారికి పెళ్లి జరగదని మధు అంటాడు. మరొకవైపు నిజం తెలుసుకుంటామని వెళ్లి ఇంకా రాలేదని భవాని అనుకుంటుండగా.. అప్పుడే కృష్ణ , మురారి ఇద్దరు వస్తారు. జైలుకి , హాస్పిటల్ కి వెళ్ళాం నేరస్తుడు ఎవరో తెలిసిందని మురారి అనగానే ముకుంద టెన్షన్ పడుతుంది. ఎవరో శేఖర్ అంట పరిమళ మేడమ్ చెప్పిందని మురారి అంటాడు. ముకుంద టెన్షన్ పడడం కృష్ణ చూస్తుంటుంది. ముకుంద ఎందుకు టెన్షన్ పడుతుంది తన హస్తం ఏమైనా ఉందా అని కృష్ణ అనుకుంటుంది. అ తర్వాత శేఖర్ అనే వ్యక్తి కూడా అ ప్రభాకర్ మనిషే అయి ఉండొచ్చు కదా అని భవాని అంటుంది మరొకవైపు కృష్ణ దగ్గరికి రేవతి వస్తుంది. అ తర్వాత మురారి కూడా వస్తాడు. శ్రీనివాస్ బాబాయ్ మంచివాడు. కూతురు గురించి కాకుండా న్యాయంగా ఆలోచించి నాకు సపోర్ట్ చేస్తున్నాడని కృష్ణ అంటుంది. మరొకవైపు దేవ్ బెయిల్ మీద బయటకు వచ్చి శ్రీనివాస్ దగ్గరికి వస్తాడు. మురారికి శ్రీనివాస్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలని అనుకుంటాడు. అప్పుడే దేవ్ తన మనుషులని పిలిచి శ్రీనివాస్ ని తీసుకొని వెళ్ళమని చెప్పి ఫోన్ పడేస్తాడు. మరొకవైపు కృష్ణ దగ్గరికి మురారి వచ్చి బట్టలు సర్దుకో ఇంటికి వెళదామని అనగానే కృష్ణ శకుంతల ఆశ్చర్యపోతారు. తరువాయి భాగంలో కృష్ణ, మురారిల దగ్గరికి దేవ్ ని తీసుకుని ముకుంద వస్తుంది. అతడిని వారికి పరిచయం చేస్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

చంఛల్ గూడ జైలులో బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్!

బిగ్ బాస్ సీజన్‌ -7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయాన్ని రెండు రోజులు కూడా ఆనందించకముందే అతనిపై పోలీసు కేసు నమోదవ్వడం, పోలీసులు గాలించి మరీ అతడిని అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న ఉదయం పల్లవి ప్రశాంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ పెట్టాడు. అందులో నా తప్పేం లేదు. నన్ను నెగెటివ్ చేయడానికి‌ కొంతమంది ఇలా చేస్తున్నారని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. అయితే నిన్న రాత్రి సమయంలో పోలీసులు వెళ్ళి పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు.‌ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గ్రాంఢ్ ఫినాలే రోజున వాహానాలు ధ్వంసం చేసినందుకు గాను, ట్రాఫిక్ వాయిలెన్స్ ని క్రియేట్ చేసినందుకు గాను కొందరిపై‌ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా చేసినట్టు తెలిసింది. అయితే ఇందులో తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. నిన్న రాత్రి పల్లవి ప్రశాంత్ వాళ్ళ  సొంతింటి దగ్గర అందరిముందు జూబ్లీ హిల్స్ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి విచారణ అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. ఇక కేసుని పరిశీలించిన న్యాయమూర్తి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో పల్లవి ప్రశాంత్, రాజుని చంచల్ గూడ జైలుకి తరలించారు పోలీసులు. ఇక ఆ రోజు కారు అద్దాలు ధ్వంసం చేసిన మరికొంతమంది దుండగుల కోసం గాలిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్  ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని జూబ్లీ హిల్స్ పోలోసులు మీడియాకి తెలియజేశారు. అయితే ఫ్యాన్స్ చేసిన తప్పు వల్ల రైతుబిడ్డ జైలుకెళ్ళాడు. కామన్ మ్యాన్ గా వెళ్ళి టాస్క్ లలో ఎంతో కష్టపడి కాళ్ళు, చేతులు విరగ్గొటుకొని చివరికి టైటిల్ గెలిచి బయటకొస్తే ఆ విజయాన్ని రెండు రోజులు కూడా ఆస్వాదించకముందే ఇలా అవ్వడం చాలా బాధాకారమని పలువురు బిబి కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఇన్ని సీజన్‌ లలో టైటిల్ గెలిచిన ఓ కంటెస్టెంట్ కి ఇలా జరగడం ఇదే ప్రథమం. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ చంఛల్ గూడ జైలుకి వెళ్ళాడనే వార్త వైరల్ గా మారింది.

Brahmamudi:వాళ్ళ పెళ్ళిలో ఊహించని ట్విస్ట్.. అనామిక నిజస్వరూపం అదేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -284 లో.. అనామిక, కళ్యాణ్ ల పెళ్లి గ్రాంఢ్ గా చెయ్యాలని అనుకుంటారు. ఒక పెద్ద రెసార్ట్ దగ్గరికి దుగ్గిరాల ఫ్యామిలీ మరొకవైపు అనామిక ఫ్యామిలీ లు వస్తారు. ఇరు కుటుంబాలు కళ్యాణ్, అనామికలపై సరదాగా సెటైర్స్ వేస్తు నవ్వుకుంటారు.  మరొకవైపు అప్పు, కృష్ణమూర్తి, కనకం కలిసి రెసార్ట్ దగ్గరికి వస్తారు. నువ్వు వెళ్ళిపో.. కళ్యాణ్ పెళ్లి అవుతుంటే చాలా బాధపడతావని కనకం అనగానే.. లేదు వాళ్లని చూస్తుంటే అయిన నా ప్రేమ చచ్చిపోతుందేమో అని అప్పు అంటుంది. అప్పుడే అప్పుని చూసిన కళ్యాణ్.. అప్పు ఈ రోజంతా నువ్వు నా పక్కనే ఉండు, తోడి పెళ్లికొడుకుగా ఉండమని కళ్యాణ్ అంటాడు. అబ్బాయి ఉంటారు కానీ అమ్మాయి ఉండడం ఏంటని అక్కడ ఉన్నవాళ్ళు అంటారు. అప్పు అమ్మాయి అని ఎవరన్నారు అబ్బాయే అని కళ్యాణ్ అనగానే.. అప్పు ఇంకా బాధపడుతుంది. మరోకవైపు స్వప్నకి అరుణ్ కాల్ చేస్తాడు. స్వప్న దూరంగా వెళ్లి అరుణ్ తో మాట్లాడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావంటూ  అరుణ్ తో స్వప్న కోపంగా మాట్లాడుతుంది. నీ కడుపులో బిడ్డకి తండ్రి ని నేనే అని మనం కాలేజీ లో ఉన్నప్పుడు ఎంత క్లోజ్ గా ఉన్నామో అన్ని రాహుల్ కి చెప్తానంటూ స్వప్నని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ విషయం డీల్ చెయ్యడం నా వాళ్ళ అవడం లేదు కావ్యకి చెప్పాలని స్వప్న అనుకుంటుంది. మరోవైపు విక్కీ ఫ్యామిలీకి దుగ్గిరాల ఫ్యామిలీ వెల్ కమ్ చెప్పడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే విక్కీ ఫ్యామిలీ వస్తుంది. అందరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అనామిక, కళ్యాణ్ లా పెళ్లి గ్రాంఢ్ గా చెయ్యాలని విక్కీ, రాజ్ ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత రాజ్, కావ్య, విక్కీ పద్మావతి లకి ఒక రూమ్ ఇస్తారు. అలా ఆ జంట, ఇంకొక జంటతో మాట్లాడుతుంటారు. మరోకవైపు కావ్య ఇంక గదిలోనుండి రావడం లేదని స్వప్న చిరాకుగా ఉంటుంది.  అప్పుడే రాహుల్ వచ్చి స్వప్నకి ఇంకా చిరాకు తెప్పిస్తాడు. అప్పుతో కళ్యాణ్ మాట్లాడుతుంటాడు.. ఆ సేట్ కీ రెండు కోట్లు ఇవ్వకుంటే అందరి ముందు పరువు తీస్తానని అంటున్నాడు. ఎలాగైనా కళ్యాణ్ ని ఒప్పించి అ డబ్బులు ఇచ్చేలా చెయ్యాలని కళ్యాణ్ దగ్గరికి అనామిక వస్తుంది. అప్పుని బయటకు వెళ్ళమని చెప్పి డోర్ దగ్గర ఎవరు రాకుండా చూడు అని అప్పుతో అనామిక అనగానే.. అప్పు బాధపడుతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్, అనామికల హల్ది ఫంక్షన్ జరుగుతుంది. అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు.  అ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ షాక్.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్

బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశాడు. బుధవారం అతని స్వగ్రామం కొలుగూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు మనోహర్ ని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఫినాలే రోజు ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానుల ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో అమర్ దీప్ కారుతో పాటు, పోలీస్ వాహనం, ఆర్టీసీ బస్సుల అద్దాలు పగిలాయి. దీంతో ప్రశాంత్, మనోహర్ తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

A1 ముద్దాయిగా పల్లవి ప్రశాంత్.. నన్ను క్షమించండి!

బిగ్ బాస్ సీజన్‌-7 ‌పదిహేనువారాల పాటు ఈ సాగి, ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ షోలో కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్టుగా ప్రతీ వారం సాగుతూ చివరికి కామన్ మ్యాన్ గా వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కే దక్కింది. బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ క్యాటగిరీలో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టున్న ఈ రైతుబిడ్డ బిగ్ బాస్ టైటిల్ విజేత అయ్యాడు. నాగార్జున విజేత అని ప్రకటించగానే పట్టరాని సంతోషంతో‌ నోట‌ మాట రాకుండా ఎమోషనల్ అయ్యాడు. ‌బయటకు వచ్చాక తనకోసం వందలకొలదీ ప్రేక్షకులు రావడంతో వాళ్ళని చూసి ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్.  గ్రాంఢ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట జనాలు భారీగా రావడంతో ట్రాఫీక్ వాయిలెన్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే దానితో పాటు కొందరు అభిమానులు వాహనాల ధ్వంసం చేశారు. అమర్ దీప్ , గీతు రాయల్ కార్ పై దాడి చేసి ద్వంసం చేశారు. దాంతో పోలీసులకి కంప్లైంట్ చేసింది గీతు.  జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ కేసులో విన్నర్ ప్రశాంత్ ని A1 ముద్దాయిగా చేర్చి కేసు నమోదు చేశారట. అతడి సోదరుడు మనోహర్ ని పోలీసులు  A2 గా, అతడి ఫ్రెండ్ వినయ్ ను A3, డ్రైవర్లు సాయి, రాజులని A4 గా చేర్చారని సమాచారం. ట్రాఫిక్ వాయిలెన్స్ కి కారణం పల్లవి ప్రశాంత్ అని అతడిని పోలీసులు వెళ్ళమని చెప్పిన వెళ్ళలేదని అందుకే కేసు నమోదు చేశారంట. అయితే కార్లని ద్వంసం చేయడం కరెక్ట్ కాదని, ఒక గేమ్ షోని గేమ్ షోలాగా తీసుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు.  అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య జరుగుతున్న ఈ వార్ ని ఇంతటి ఆపాలని అంటున్నారు. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని అప్లోడ్ చేశాడు.‌ ఇందులో తను మాట్లాడుతూ.. ఆ రోజు రాత్రి చాలామంది యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు ఇంటర్వూ, ఫోటోలు కావాలని అడిగారు. తనకు ఓపిక ఉన్నంతవరకు ఇచ్చానని, అప్పటికే బాగా లేట్ అయిందని, ఆకలి అవుతుందని చెప్పాన. కానీ తర్వాత రమ్మని చెప్పానని ప్రశాంత్ అన్నాడంట కానీ మీడియా వాళ్ళు అది చెప్పకుండా తనని నెగెటివ్ చేయడానికి ఏదో చెప్తున్నారని ఎమోషనల్ అయ్యాడు.

ముద్దు సీన్లు చూపించి సిద్ధు పరువు తీసిన మనోజ్‌!

  ఉస్తాద్ నెక్స్ట్ వీక్ ప్రోమోతో మంచు మనోజ్ వచ్చేసాడు. ఇక ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా సిద్దు జొన్నలగడ్డ అలియాస్ డిజె. టిల్లు ఎంట్రీ ఇచ్చాడు.స్టేజి మీదకు రాగానే "ఎక్కడో రెండు మూడు బొక్కలున్నాయి..పడిపోతానేమో అని టెన్షన్ గా ఉందంటూ" కామెడీ చేసాడు టిల్లు.. "నీకు బొక్కలిష్టం అని సెట్ చేశారు బాబాయ్" అంటూ మంచు మనోజ్ రివర్స్ కౌంటర్ వేసాడు. "స్క్రిప్ట్ నువ్వు మొదలు పెట్టేముందు నువ్వు రాసేది కే ఐ ఎస్ ఎస్" అంట కదా అని మనోజ్ అడిగేసరికి  టిల్లు తెగ సిగ్గుపడిపోయాడు. ఇక ఆ పక్కన స్క్రీన్ మీద డిజె టిల్లు మూవీ నుంచి రాధికాతో ముద్దు సీన్స్ ని వేసి చూపించారు. తర్వాత ఐరన్ రాడ్  ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి లేచి "మీ లైఫ్ లో మీకు వచ్చిన బెస్ట్ ప్రొపోజల్ ఏమిటి టిల్లు" అని అడిగింది. " నాకు ఎవరూ ప్రొపోజ్ చేయలేదు" అని ఆన్సర్ ఇచ్చాడు. "ప్రొపోజ్ చేసేంత టైం ఇవ్వలేదు వాళ్లకు" అంటూ మనోజ్ కవర్ చేసాడు. ఇక మనోజ్ ఒక కార్డు తీసుకునేసరికి "ఏ చూసావా" అని అడిగేసరికి "ప్రామిస్ చూడలేదు" అన్నారు టిల్లు.."రాధికా మీద ప్రామిస్ చెయ్యి" అనేసరికి వెనక నుంచి రాధికా రాధికా అనే సాంగ్ ని ప్లే చేశారు. తర్వాత టిల్లు ఎవరితోనే ఫోన్ లో మాట్లాడాడు.. "ముందుగా ఇది షోలా లేదు...ఇంట్లో సోఫాలో దొర్లుతున్నట్టు దొర్లుతున్నాడు. "ఇంతకు బయట నీకు ఎన్ని రాడ్లు పడ్డాయి" అంటూ మనోజ్ అడిగేసరికి టిల్లు నవ్వేసాడు. ఈ వారం ఇలాంటి డబుల్ మీనింగ్ కామెడీ పంచ్ డైలాగ్స్ తో ఈ షో ఆడియన్స్ ని అలరించడానికి రాబోతోంది. ప్రోమో లాస్ట్ లో మంచు మనోజ్ నటించిన మూవీలోని సాంగ్ "ప్యార్ మీ పడిపోయానే" అంటూ పడుతూ ఉంటె టిల్లు మాత్రం తబలా వాయిస్తూ మ్యూజిక్ ఇచ్చాడు.

ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో ఆడియన్స్ ముందుకు!

ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ షో అంతా కొత్తకొత్తగా ఉంది.. పాత వాళ్లంతా ఈ షోకి బైబై చెప్పేసారు. ఈ ఢీ సీజన్ 17 కి యాంకర్ గా నందు బ్లాక్ కలర్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చాడు. అలాగే జడ్జెస్ లో శేఖర్ మాష్టర్ మాత్రమే ఉన్నారు. ఇక లేడీ జడ్జి ఉన్న పూర్ణ ప్లేస్ లో కన్నడ నటి "బావ" మూవీ హీరోయిన్ గా ప్రణీత సుభాష్ ని తీసుకొచ్చారు. ఇక డాన్సర్స్ కూడా అందరూ లేడీస్ ఎక్కువగా కనిపించారు. ఇక ఈ షో మెగా లాంచ్ కాబోతోంది. ఈ లాంచ్ ఈవెంట్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా ఉంది. ఈ ఈవెంట్ కి "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" మూవీ టీమ్ కూడా వచ్చి నందుతో కలిసి డాన్స్ వేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక స్టేజి మీద ఒక భవిష్య వాణి పుస్తకం కనిపించేసరికి ఆది వచ్చి ఆ విరూపాక్ష శాసనాల గ్రంథమా అంటూ హడావిడి చేసాడు. ఈ బుక్ లో నా పేరు మీద ఏదో రాసి ఉందంటూ చదవడం స్టార్ట్ చేసాడు.." ఈ సీజన్ మొత్తం ఈ బుక్ ఏది చెప్తే అదే నువ్వు ఫాలో అవ్వాలి. ఈ ఎపిసోడ్ మొత్తం నువ్వు జడ్జిలా బిహేవ్ చేయాలి.." అనేసరికి ఆది వెళ్లి శేఖర్ మాష్టర్ పక్కన కుర్చీ వేసుకుని సెటిల్ ఐపోయాడు. శ్వేతా నాయుడు, శ్రీ ప్రియా, గలాటా గీతూ, కార్తీక దీపం హిమ అలియాస్ సహృద వచ్చి డాన్స్ వేసి అందరినీ అలరించారు. ఇక శ్వేతా నాయుడు గ్రీన్ కలర్ డ్రెస్ లో వచ్చి చేసిన హాట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి స్టేజి మొత్తం హీటెక్కిపోయింది. సహృద కూడా ఇరగదీసే డాన్స్ వేసి అందరి చేతా వావ్ అనిపించుకుంది. ఈ పెర్ఫార్మెన్స్ హైలైట్ అంటూ ప్రణీత్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చేసారు. "ఆరనీకుమా ఈ దీపం  కార్తీక దీపం .. చేరనీ ఫైనల్స్ వరకు కర్పూర దీపం" అంటూ సహృద డాన్స్ కి కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆది.