బిగ్ బాస్ తర్వాత మా మొదటి శుభవార్త!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొట్టమొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ప్రియాంక జైన్. 'జానకి కలగనలేదు' సీరియల్ లో అమర్ దీప్ తో కలిసి చేసిన ప్రియాంక తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. సొంతూరు బెంగుళూరు. తెలుగు టీవీ సీరియల్స్ లో అవకాశం రావడంతో హైదరాబాద్ కి వచ్చిన ఈ భామ.. తెలుగుని నేర్చుకుంది. ఇక్కడ తను నటించిన మరో సీరియల్  శివ్ తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కలిసి లివింగ్ రిలేషన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో పొట్టి పిల్లగా అడుగుపెట్టిన ప్రియాంక గట్టిపిల్లగా టాప్-5  కి చేరుకుంది. సీరియల్ బ్యాక్ గ్రౌండ్ నుండి సీజన్ సెవెన్ లో అడుగుపెట్టిన వారిలో అమర్ దీప్, ప్రియాంక, శోభాశెట్టి, పూజామూర్తి, అంబటి అర్జున్ ఉన్నారు. ఇక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన అశ్వినిశ్రీతో గొడవకి దిగడంతో ప్రియాంక కాస్త నెగెటివిటి సంపాదించుకుంది‌. హౌస్ లో ఎక్కువ టైమ్ కిచెన్ లో ఉన్న ప్రియాంకని వంటలక్క అని కూడా అనేవారు. అయితే టాస్క్ లలో కూడా బాగా ఆడేసరికి బిగ్ బాస్ ఫినాలే వీక్ లో తన జర్నీ వీడియో చూపిస్తూ‌‌.. పొట్టిపిల్లవి‌ కాదు గట్టిపిల్లవి నువ్వు అంటు చెప్పాడు. హౌస్ లో అమర్ దీప్, శోభాశెట్టిలతో ఎక్కువ సమయం గడిపిన ప్రియాంకని గ్యాంగ్ లీడర్ అని బయట అనేవాళ్ళు. ఎందుకంటే అమర్, శోభాశెట్టి ఇద్దరు ప్రియాంక ఏం చెప్తే అది చేసేవాళ్ళు. ఇక నామినేషన్ లో అందరు కలిసి గ్రూప్ గా నామినేట్ చేయడం, ప్రతీ టాస్క్ లో ఫౌల్ ఆడటం, అమర్ కి సపోర్ట్ చేయడం వల్ల ప్రియాంక వెనుకపడిపోయింది. ఇక హౌస్ లో ఎలిమినేషన్ లో ఉన్నా తనకంటే అన్ డిజర్వింగ్ వాళ్ళు ఎక్కువ ఉండటంతో ప్రియాంక టాప్-5 కి చేరుకుందనేది వాస్తవం. అయితే పద్నాలుగవ వారంలో శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వడంతో ప్రియాంక ఎమోషనల్ అయింది. ప్రియాంక, శివ్ కలిసి 'నెవెర్ ఎండింగ్ టేల్స్' అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశారు. ఇందులో మోస్ట్ పాపులర్ వీడియోలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ కి వెళ్ళేముందు ప్రియాంక మేకోవర్ అనే వ్లాగ్ అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. ' బిగ్ బాస్ తర్వాత మా మొదటి శుభవార్త' అంటూ అప్లోడ్ చేసిన ఈ వ్లాగ్ లో.. వాళ్ళిద్దరు కలిసి ప్రేక్షకులకి ఒక శుభవార్తని చెప్పారు. ఇప్పటివరకు లివింగ్ లో ఉన్న శివ్, ప్రియాంక కలిసి త్వరలో అంటే 2024 లో పెళ్లి చేసుకుంటున్నారంట. ప్రియాంక మాట్లాడుతూ.‌. పెళ్ళి అనేది ప్రతీ అమ్మాయికి ఒక కల. దీనికోసం ఎంతగానో ఎదురిచూస్తుంటారు. ఎవరిని చేసుకోవాలి. పెళ్ళి తర్వాత ఫ్యూచర్ ఏంటి ఇలా ఎన్నో ప్రశ్నలు అమ్మాయిలకి ఎదురవుతాయి. నాకు శివ్ దొరికాడు. బాగా చూసుకుంటున్నాడు. మేం ఇప్పటికి ఎప్పటికి కలిసే ఉంటాం‌మంటూ చెప్పింది. కాగా ఈ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ వైరల్ గా మారింది.

బిగ్ బాస్ తర్వాత అమ్మనాన్నని కలిసాను.. వాళ్ళు ఎమోషనల్ అయ్యారు!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మోస్ట్ పాపులర్ అయిన కంటెస్టెంట్స్ లలో శోభాశెట్టి ఒకరు. ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభాశెట్టి కలిసి టాస్క్ లని గ్రూప్ గా ఆడుతూ సీరియల్ బ్యాచ్ గా బాగా నెగెటివ్ ఇంపాక్ట్ ని తెచ్చుకున్నారు. వీరందరు కలిసి టాస్క్ లలో కామన్ మ్యాన్ రైతుబిడ్డని టార్గెట్ చేస్తూ చేసిన నామినేషన్ లు అన్నీ కూడా ప్రేక్షకులలో వీరిపై ఎక్కువ ప్రభావాన్ని చూపాయి. శోభాశెట్టిని బిగ్ బాస్ దత్తపుత్రిక అని కూడా అనేవాళ్ళు. ఎందుకంటే తను ఎలిమినేట్ అవ్వాలని చాలామంది ఆడియన్స్ ఓట్లు వేయకుండా తనని లీస్ట్ లో ఉంచిన బిగ్ బాస్ ఎలిమినేషన్ చేయకపోవడంతో తనని కావాలని సేవ్ చేస్తూ వచ్చారని ఆడియన్స్ భావించారు. అయితే పద్నాలుగు వారాలు హౌస్ లో ఉన్న శోభాశెట్టి.. హౌస్ లో ఉన్నన్ని రోజులు అమర్, ప్రియాంకలకి సపోర్ట్ చేసి తన ఆటని మరచిందనే విశ్లేషకులు భావించారు. ప్రతీ కంటెస్టెంట్ మీదకి నోరేసుకొని పడిపోవడం, ప్రతీ చిన్న ఇష్యూకి గొడవపడటం, వామ్మో ఈమెతో నామినేషన్ వద్దురా అనేంతలా చిరాకు తెప్పించిన శోభాశెట్టి. హౌస్ లోకి వెళ్ళాక ఎక్కువగా టేస్టీ తేజతో కలిసి ఉన్న శోభా.. వీరిమధ్య స్నేహాం ఉందని చెప్తూ చేసిన పనులన్నీ చిరాకు తెప్పించేవి. ఇక టేస్టీ తేజ ఎలిమినేషన్ రోజున నువ్వు లేకపోతే నేను హౌస్ లో ఎలా ఉండాలిరా అంటూ ఏడ్చేసింది శోభా. ఇక మోనిత ఎప్పుడు బయటకు వస్తుందా అంటు ట్రోల్స్ చేసేవాళ్ళు రోజు రోజుకి పెరిగిపోవడంతో తనమీదకి ఫుల్ గా నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది. కొన్నిరోజుల క్రొతం వాళ్ళ అమ్మకోసం ఒక జ్యువలరీ తీసుకుందనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా దానికి అత్యధిక వ్యూస్ వచ్చాయి. ఈ కన్నడ భామకి తెలుగులో 'కార్తీక దీపం' సీరియల్ లో మోనిత పాత్ర ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ' బిగ్ బాస్ తర్వాత అమ్మనాన్నని కలిసాను' అంటూ ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది శోభా. ఇందులో వాళ్ళ అమ్మనాన్నలని తనే స్వయంగా వెళ్ళి పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళింది.  ఇక హౌస్ లో ఉన్నప్పుడు తను ఎలా ఉందని, నామినేషన్ ప్రక్రియ ఎలా అనిపించిందని అడుగగా.. నామినేషన్ లో నువ్వు అగ్రెసివ్ గా ఉండటం బాగుందని వాళ్ళు పేరెంట్స్ చెప్పారు. ఇక హౌస్ లో శోభా ఉన్నప్పుడు యశ్వంత్ తనని బాగా చూసుకున్నాడని చెప్పగా శోభాశెట్టి మురిసిపోయింది. కాగా యూట్యూబ్ లో ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

94 లక్షల మెర్సిడెస్ బెంజ్ తో మానస్ ఫ్యామిలీ

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, బుల్లితెర స్టార్ నటుడు  మానస్‌ రీసెంట్ గా ఒక ఇంటి వాడయ్యాడన్న విషయం అందరికీ తెలిసిందే..ఇక ఇప్పుడు ఒక కార్ వాడు కూడా అయ్యాడు.  బ్యాచిలర్‌ జీవితానికి ఫుల్ స్టాఫ్ పెట్టి పెళ్లి చేసుకుని తన లైఫ్ లోకి ఒక అమ్మాయిని ఆహ్వానించిన కొద్దీ రోజులకే మంచి ఎక్స్పెన్సివ్ కార్ ని కొనేసాడు. 94 లక్షల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ ఈ 220 డి అనే కార్ ని కొనేసి ఫామిలీతో సహా ఫోజులిచ్చారు. మానస్ అసలు పేరు సాయి రోహిత్‌.   చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా ఎన్నో సినిమాల్లో నటించాడు మానస్. బుల్లితెర మీద  ప్రసారమైన పలు సీరియల్స్ లో మానస్‌ నటించి ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఐతే  ‘కోయిలమ్మ’ సీరియల్‌ తో  మంచి క్రేజ్ తెచ్చుకున్న మానస్, వరుస సీరియల్స్‌ తో బుల్లితెర స్టార్‌గా మారారు. 2021లో ప్రసారమైన ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5’లో కంటిస్టెంట్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడి ఆటతీరుకు బుల్లి తెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒత్తిడిలోనూ ఏమాత్రం కంట్రోల్ తప్పకుండా చక్కగా గేమ్ ఆడి అలరించాడు. ఆ తర్వాత ‘బ్రహ్మముడి’ సీరియల్‌ లో నటిస్తూ  ఫుల్ పాపులారిటీ సంపాదించాడు. ఈ సీరియల్ లో రాజ్  క్యారెక్టర్ లో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక  వరుస సీరియల్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓవైపు సీరియల్స్ చేస్తూనే, మరోవైపు కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ లోనూ నటిస్తున్నాడు. టీవీ షోస్ లో కూడా యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉన్నాడు. ఓంకార్‌ తెరకెక్కించిన ‘మ్యాన్షన్‌ 24’తో ఇటీవల మానస్‌ అలరించారు. "మా ఇంటికి వచ్చిన కొత్త సభ్యురాలిని మీకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది" అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ తో తన కార్ ఎదురుగా నిలబడిన తన ఫామిలీ పిక్ ని పోస్ట్ చేసాడు. ఇక మానస్ ఫాన్స్ అంతా ఆయనకు విషెస్ చెప్తున్నారు. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో మానస్ డాన్స్ కి హీరో మెటీరియల్ అంటూ ఇంద్రజ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. మానస్ ఫాన్స్ కూడా ఆయన్ని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తామా అని ఆశ పడుతున్న టైంలో మానస్ కూడా త్వరలోనే ఆ అవకాశం వస్తుందంటూ ఒక హింట్ ఇచ్చాడు.  

Brahmamudi: తెలియకుండా మందు తాగిన భర్తలు.. మత్తులో భార్యలతో అలా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -288 లో.... రుద్రాణి కుట్రలో భాగంగా అరుణ్ ని రాహుల్ రెసార్ట్ కి రప్పిస్తాడు. స్వప్న కడుపులో బిడ్డకి నేనే తండ్రిని అని అరుణ్ ని చెప్పమని రాహుల్, రుద్రాణి చెప్తారు. దాంతో రాహుల్ వచ్చి చెప్పాలని అనుకుంటాడు. ఆలోపు కావ్య, స్వప్న, పద్మావతి ముగ్గురు అరుణ్ ని చూసి ఒక తాగుబోతు సహాయంతో అరుణ్ ని పట్టుకొని కొడతారు. వారి నుండి అరుణ్ తప్పించుకోబోతుంటే కనకం కర్రతో అరుణ్ ని కొడుతుంది. ఆ దెబ్బకు అరుణ్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఇక అందరు కలిసి అరుణ్ ని ఒక గదిలోకి తీసుకోని వెళ్లి, ఆ తాగుబోతు సహాయంతో అరుణ్ ని కట్టివేసి నోటికి ప్లాస్టర్ వేస్తారు.  మరొకవైపు అరుణ్ ఫోన్ కి రాహుల్ ఫోన్ చేస్తుంటాడు. ఒకసారి రింగ్ అవుతుంది.. ఆ ఫోన్ ని అరుణ్ జేబులో నుండి కావ్య తీసి చూసేలోపు ఫోన్ స్విచాఫ్ అవుతుంది. వీడు నాతో మాట్లాడలేక ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడని రాహుల్ అనుకుంటాడు. ఒకవైపు రాహుల్, మరొకవైపు రుద్రాణి, ఇంకొకవైపు విక్కీ వాళ్ళ బావ కలిసి అరుణ్ కోసం రెసార్ట్ మొత్తం వెతుకుతుంటారు. అదేసమయంలో రాజ్ , విక్కీ ఇద్దరు బార్ కి వెళ్తారు. కానీ డ్రింక్ చెయ్యడానికి కాదు ప్రశాంతంగా మాట్లాడుకోవడానికని విక్కీతో రాజ్ అంటాడు. బేరర్ ని రాజ్ పిలిచి.. మేం తాగుబోతులం కాదు, మాక్ టేల్ తీసుకోని రమ్మని చెప్పగా.. అతను కాక్ టేల్ తీసుకోని వస్తాడు. అది రాజ్ , విక్కీ ఇద్దరు తాగుతారు. అలా రెండు మందు గ్లాసులు కాస్త నాలుగు గ్లాసులుగా మారతాయి. కాసేపటికి ఇద్దరు మత్తులోకి వెళ్తారు. నీ పెళ్లి గురించి చెప్పమని విక్కీని రాజ్ అడుగుతాడు. పద్మావతి అంటే ఇష్టమని విక్కీ చెప్తుంటాడు. మరొక వైపు కావ్య, పద్మావతి ఇద్దరు తమ భర్తలు ఎక్కడికీ వెళ్లారోనని ఎదురుచూస్తూ కూర్చొని ఉంటారు. అలాగే పద్మావతి విక్కీ గురించి కావ్యకి చెప్తుంటుంది. మరొకవైపు అనామిక మెహందీ కంటే అప్పు మెహందీ బాగుందని కళ్యాణ్ చెప్పడంతో అనామిక అలుగుతుంది‌. దాంతో అనామికని బుజ్జగించే పనిలో కళ్యాణ్ ఉంటాడు. అదేసమయంలో రాజ్, విక్కీ ఇద్దరు కూల్ డ్రింక్ బదులు వాళ్ళకే తెలియకుండా ఫుల్ డ్రింక్ చేస్తుంటారు. అంతే కాకుండా వాళ్ళ రూమ్స్ కి కూడా తీసుకోని వెళ్తారు. రాజ్, విక్కీ ఇద్దరు తమ గదులలోకి వెళ్లిపోగానే వాళ్ళు తీసుకోని వెళ్లిన డ్రింక్స్ ని కావ్య, పద్మావతి కూడా తాగి తమ భర్తలతో మైకంతో మాట్లాడతారు. ఒక గదిలో కావ్య తనలో ఉన్న ప్రేమని రాజ్ కి చెప్తుంటుంది. మరోగదిలో పద్మావతిపై ఉన్న ప్రేమని విక్కీ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : డెడ్ బాడీని గుర్తుపట్టాలంటూ ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళంతా షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -955 లో.. వసుధార, అనుపమ వెళ్తున్న కార్ టైర్ పంచర్ అయ్యేలా చేస్తారు శైలేంద్ర పంపిన రౌడీలు. ఆ తర్వాత కార్ దిగి ఏమైందని వసుధార, అనుపమ ఇద్దరు చూస్తారు.. అంతలోనే కొంతమంది రౌడీలు వాళ్ళని చుట్టముడతారు. వసుధార, అనుపమ ఇద్దరు భయపడతారు. వాళ్ళపై రౌడీలు ఎటాక్ చెయ్యబోతుంటే ఎవరో ఒకతను వచ్చి.. రౌడీలని చితక్కొట్టి వసుధార, అనుపమలని కాపాడతాడు. అ తర్వాత అతనికి వసుధార, అనుపమ ఇద్దరు థాంక్స్ చెప్తుంటారు. ఏం ఇచ్చి మీ ఋణం తీర్చుకుంటామని అనుపమ అనగానే.. ఒక వంద ఇవ్వండి అని అతను అంటాడు. అప్పుడు అనుపమ అయిదు వందల నోటు ఇవ్వబోతుంటే.. వద్దు వంద చాలు అని తీసుకుంటాడు. ఇప్పుడు ఎలా వెళ్తారు పంచర్ అయింది కదా? నేను  మారుస్తానని అతనే టైర్ మరస్తుంటాడు. అసలు మనపై ఎటాక్ ఎవరు చేయించి ఉంటారు. ఇది శైలేంద్ర తప్ప ఎవరు చెయ్యరని అనుపమ, వసుధార ఇద్దరు అనుకుంటారు. కాసేపటికి శైలేంద్రకి వసుధార ఫోన్ చేసి మాట్లాడుతుంది. మాపై ఎటాక్ చేయించింది నువ్వే కాదా అని వసుధార అడుగగానే.. శైలేంద్ర ఏం తెలియనట్టు మాట్లాడుతుంటాడు. ఎవరు ఎటాక్ చేశారు? ఎంత మంది వచ్చారు? ఎవరు కాపాడరంటూ శైలేంద్ర అడుగుతుంటే.. నువ్వు నా నుండి కూపి లాగడానికి ట్రై చేస్తున్నావా? అసలు నీ గురించి ముకుల్ కి చెప్పి ఆ వీడియో పంపించడం ఎంత సేపు అవ్వదు నాకు. నువ్వు రిషి సర్ ని తీసుకోని రా.. రిషి సర్ పై ఈగ వాలిన నీ సంగతి చెప్తానంటు శైలేంద్రకి వసుధార మాస్ వార్నింగ్ ఇస్తుంది. కాసేపటికి .. అసలు ఈ వసుధార ఎలా తప్పించుకుంది. ఇప్పుడు ఫోన్ ఎవరికి చేసిన ఫోన్ ట్రాప్ లో ఉందని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత రిషి ఫోన్ నుండి వసుధారకి ఫోన్ వస్తుంది. రిషి చేస్తన్నాడని వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చుస్తే.. హాస్పిటల్ బాయ్ ఫోన్ చేసి ఒక ఐడెంటిఫికేషన్ కోసం మీరు హాస్పిటల్ కి రావాలని అంటాడు‌. అలా అతడు అనగానే వసుధార టెన్షన్ పడుతుంది. ఆ విషయం మహేంద్రకి చెప్తుంది వసుధార. ఆ తర్వాత ‌కాసేపటికి మహేంద్ర, వసుధార, అనుపమ హాస్పిటల్ కి వెళ్తారు. అలా వాళ్ళు వెళ్తుంటే వసుధార, అనుపమలని సేవ్ చేసిన అతను కూడా వాళ్ళతో వెళ్తాడు. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ వచ్చి ఈ ఫోన్ డెడ్ బాడీ దగ్గర దొరికిందని ఫోన్ చూపిస్తాడు.   అ ఫోన్ రిషిది అని వసుధార ఏడుస్తుంటుంది.  మీరు అ బాడీ ఎవరిదో గుర్తుపట్టండి అని ఇన్‌స్పెక్టర్ అనగానే వసుధార బయపడుతు చూస్తుంది. చూసిన తర్వాత రిషి సర్ కాదని చెప్తుంది. మహేంద్రణ అనుపమ కూడా చూసి రిషి కాదని చెప్తారు. ఆ ఫోన్ ఆ బాడీ దగ్గర దొరికిందని హాస్పిటల్ బాయ్ చెప్పగానే.. అక్కడకు వెళ్లి చుసిన అతను రిషి కాదని చెప్తారు. మహేంద్ర, వసుధారణ అనుపమని సేవ్ చేసిన అతను.. ఆ బాడీని ఫోటో తీసుకుంటాడు. వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి సర్ బాగుంటారని వసుధార అనుకుంటుంది. మరొకవైపు రిషికి చెట్టు మందులతో ఒక ముసలావిడ వైద్యం చేస్తుంటుంది. అప్పుడే ఒక్కసారిగా వసుధర అంటు రిషి కళ్ళు తెరిచి చూస్తాడు.  అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:భవానిని రెచ్చగొట్టిన దేవ్.. ఏడుస్తూ వెళ్ళిపోయిన కృష్ణ!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 349లో.. రేవతి, మధు ఇద్దరు మాట్లాడుకుంటారు. విన్నావు కదరా మధు.. ముకుంద ఇంట్లో వాళ్ల మాట కూడా వినడం లేదట ఎలారా అని రేవతి అనగానే.. ఆ మాట పక్కన పెడితే ముకుంద తనకు అన్న ఉన్నట్లు, శ్రీనివాస్‌ గారికి కొడుకు ఉన్నట్లు ఇంతవరకు మనకు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. నీ మొహం శ్రీనివాస్ అన్నయ్యని మనతో తీరికగా కూర్చొని మాట్లాడే అవకాశం ఎప్పుడు ఇచ్చింది ముకుంద అని రేవతి అంటుంది. అది నిజమేలే అని మధు అంటుండగా మురారి అక్కడికి వస్తాడు. హాయ్ మురారి కేసు ఎంత వరకు వచ్చిందని మధు అడుగుతాడు. ఓ కొలిక్కి వచ్చినట్లే నేను కృష్ణ మాట్లాడుకుంటున్నప్పుడు దేవ్.. అదే ముకుంద బ్రదర్ నా దగ్గరకు ముకుందను తీసుకొచ్చాడని మురారి చెప్తాడ. " ఏం అన్నాడు. అటు ఇటు చూసి ఠక్కున నీ కాళ్ళు పట్టుకొని నా చెల్లిని పెళ్లి చేసుకో అన్నాడా" అని మధు అంటాడు. దానికి ఫుల్లుగా రివర్స్ అనుకో అని దేవ్ మాటలన్నీ చెప్తాడు. ఈ కేసులో సహాయం చేస్తా అన్నాడు. ఏం కేసో ఏంటో వచ్చే శుక్రవారం లోపు ఇవన్నీ తేలకపోతే అంతే అని రేవతి అనగానే.. అమ్మా.. ఆ దేవ్ ముకుందను ఇంటికి తీసుకెళ్తాడేమో కానీ పెళ్లి మాత్రం చేయడు. ఆ నమ్మకం నాకు ఇచ్చాడు. అలా అని నేను రిలాక్స్ అవ్వనని మురారి‌ అంటాడు. నిజంగా ఆ దేవ్‌కు చెల్లిమీద అంత ప్రేమ ఉందా? అయితే నువ్వు ఎటు కేసు చూస్తున్నావ్ ఆ అబ్బాయిని ఆదర్శ్ ని వెతకడానికి వెళ్లమని చెప్పొచ్చు కదా అని రేవతి అంటుంది. ముకుంద ఎలా ఊరుకుంటుంది. తెలియకుండా వెళ్లడం కష్టం. వాళ్ల నాన్న గారు కూడా ఇంట్లో లేరంట. మరి చెప్పకుండా ఎలా వెళ్తాడు. ఆదర్శ్ రాడు అమ్మా. కృష్ణ ఏదో వస్తాడు అంటుంది కాదు. నాకు అయితే నమ్మకం లేదని మురారి అంటాడు. మరోవైపు దేవ్, కృష్ణ కలిసి మురారి ఇంటికి క్యారేజ్ తీసుకొని వస్తారు. దేవ్ ఇంట్లో వాళ్లందరిని హాల్లోకి రమ్మని పిలుస్తాడు. ఇంతలో మురారి కృష్ణతో ఓ గెస్ట్‌ అంతే ఇతనేనా.. అని అంటాడు. ఇక రేవతి మనసులో అక్కయ్య ఏం అంటుందో ఏంటో అని అనుకుంటుంది. మరోవైపు ముకుంద మనసులో దేవ్‌ని ఉద్దేశించి వీడి ఓవర్ యాక్షన్ ఎటు దారితీస్తుందో ఏంటో అని అనుకుంటుంది. మేడమ్ నేను మా చెల్లి కృష్ణ కలిసి మనందరికి చేపల పులుసు చేశాం. మా బావకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం అంట కదా. కృష్ణ చెప్పిందని దేవ్ అంటాడు. ఇక అక్కడే ఉన్న భవానిని చూసి మురారి తన మనసులో.. పెద్దమ్మ ఎలాంటి రచ్చ చేయకముందే నేనే ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. దేవ్ థ్యాంక్యూ. ఫిష్ కర్రీ తిని చాలా రోజులు అయిందని మురారి అంటాడు. సారీ పెద్దత్తయ్య చేపల పులుసు ఇవ్వడానికి మాత్రమే వచ్చాను ఇచ్చేసి వెళ్లిపోతానని కృష్ణ అనగానే.. కృష్ణ నువ్వు ఈ ఇంటికి రావొచ్చు వెళ్లొచ్చని చెప్పాను కదా దానికి నవ్వు ఏదో తప్పు చేసినట్లు అని మురారి చెప్తుంటాడు. తప్పే చేసింది. ముమ్మాటికి తప్పు చేసింది. అసలు మన ఇంటి పరువు తీసి మనకి మనస్శాంతి లేకుండా చేసిన ఈ కృష్ణని మీరంతా ఎలా అంగీకరిస్తున్నారో. నీకు అంత పెద్ద యాక్సిడెంట్ చేసి నీ రూపాన్నే మార్చేసిన వారిని నువ్వు అంత తేలికగా క్షమించేశావేమో మురారి.. నేను క్షమించలేను. ఈ ఇంట్లో క్రమశిక్షణకు అర్థం లేకుండాపోయింది. నువ్వు వచ్చిన తర్వాతే వాళ్లు మారారని భవాతి అనగానే.. అక్కయ్య వదిలేయ్. కృష్ణ వెళ్లు, చేపలు పులుసు వద్దు ఏం వద్దు నువ్వు తీసుకెళ్లు దేవ్ అని రేవతి అనగానే.. నేను రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అని దేవ్ మొదలెడతాడు. కృష్ణ మంచిది అనేది పచ్చి నిజం. భార్యాభర్తల బంధాన్ని మీరు తప్పుగా అని చెప్పలేపే.. షటప్ ఆ మాటకి వాళ్లిద్దరూ అర్హులు కారు. అవును వీళ్లది అగ్రిమెంట్ పెళ్లి. గౌరవప్రదమైన మా వంశ గౌరవం ఎక్కడ బయటపడుతుందోనని వీళ్ల దారుణాన్ని క్షమించానని భవాని అంటుంది. పెద్దమ్మ ప్లీజ్.. అని మురారి అంటాడు. బావ కృష్ణని నమ్ముతున్నాడు. మీరు దాని గురించి తెలీకముందు కృష్ణని యాక్సెప్ట్ చేశారు కదా అని దేవ్ అడిగేసరికి.. అదే నేను జీవితంలో చేసిన మొదటి తప్పు. మళ్లీ వీళ్లని క్షమించి రెండో తప్పు చేయలేనని భవాని చెప్తుంది.  ఇక్కడ అందరు ఆ కేసు గురించి మర్చిపోండి. నేను చూసుకుంటా కదా అని మురారి అంటాడు. ఏం చూసుకుంటావ్ మురారి. కేసు క్లోజ్ చేసి ఆ జనాల్ని చూసుకుంటావా.. ఇదే కదా నువ్వు చూసేదని భవాని అంటాడు. నా గురించి మీరందరూ గొడవ పడకండి నేనే వెళ్లిపోతానని కృష్ణ అంటుంది. కృష్ణ ఎక్కడికి.. నువ్వు నేరస్తురాలివి అని తెలిసే వరకు నువ్వే ఈ ఇంటి కోడలివి. ఒకవేళ నేరం రుజువు అయినాక అప్పుడు మీరు ఇచ్చిన మాట ప్రకారం ముకుంద ఈ ఇంటి కోడలు అవుతుంది. అప్పటి దాక నువ్వు ఈ ఇంటి కోడలివే. ఎటూ ఈ కేసులో నువ్వు నిర్దోశివి అని తేలుతుంది. అప్పుడు ఇప్పుడు నువ్వే కోడలివి అని దేవ్ అంటుండగానే.. ఆపు దేవ్.. ఈ ఇంటి కోడలు ఎవరు అని చెప్పాల్సింది నువ్వు కాదు. నీకేం తెలుసు? నీకు ఏం తెలీకుండానే మనుషుల్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని భవాని అంటుంది. దేవ్ నోరు మూసుకొని ఉండలేవా? అయిన సొంత చెల్లి నన్ను చూడ్డానికి వచ్చినవాడివి ఇలా అవుట్ హౌస్‌లోను ఇంకెక్కడో ఉన్నవారి కోసం ఎందుకని ముకుంద అనగానే.. అవుట్ హౌసో ఇంకెక్కడో అసలు నువ్వు పెళ్లి అయిన వాడి ప్రేమలో పడకపోతే అని దేవ్ అంటాడు. దేవ్.. ఇప్పటి దాకా ముకుందకు అన్నయ్యవి అన్న గౌరవంతో ఇప్పటి వరకు ఏం అనడం లేదు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చనువు తీసుకున్నావు ఇక చాలు. ఇప్పుడు చెప్తున్నా విను నేరం రుజువు అవుతుంది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ఇంటి కోడలు, మురారి భార్య ముకుందనే. నాకు ఆ నమ్మకం ఉంది నా నమ్మకం ఎప్పుడు ఒమ్ముకాలేదు. వచ్చిన వాళ్లు వచ్చిన దారినే వెళ్లొచ్చని భవాని అంటుంది. ఆ తర్వాత కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటు వెళ్ళిపోతుంది. ఇక ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోతారు. ముకుంద, దేవ్ వాళ్ళ గదిలో ఉంటారు. ముకుంద గదిలో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక ఏదో‌ ఆలోచించి దేవ్ నవ్వగానే.‌. అతడిని చూస్తుంది ముకుంద. ఎందుకు దేవ్ నవ్వుతున్నావు. చెప్పు అని ముకుంద అనగానే.. ఇందాక మీ అత్త దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తూ కృష్ణని పొగిడాను కదా. అవన్నీ నిజాలే అనిపించాయి ముకుంద లేకపోతే అంత ఫ్లో ఎలా వస్తుంది చెప్పని దేవ్ అంటాడు. ఏంటి జోకా. అవన్నీ నిజాలే కావొచ్చు నేను ఒప్పుకుంటాను కానీ. మురారి కృష్ణతో ఉంటే మాత్రం నేను ఒప్పుకోనని ముకుంద అంటుంది. నేను ఒప్పుకోను అనుకో అయిన వాళ్లది అగ్రిమెంట్ పెళ్లి అని తెలిసి మీ అత్త దగ్గర నువ్వు ఇన్నాళ్లు దాచావ్ చూడు అది మాత్రం కచ్చితంగా నీ తప్పే ముకుంద అని దేవ్ అంటాడు. టైం కోసం వెయిట్ చేశానని ముకుంద‌ అనగానే.. కరెక్టే నువ్వు అప్పుడు కాకుండా ఇంకెప్పుడో చెప్తే.. యాక్సిడెంట్ కావడం గతం మర్చిపోవడం నేను కెన్యా నుంచి రావడం ఇవన్నీ జరిగేవి కాదు. సో నాకు ఎందుకో నీకు మురారికి పెళ్లి గ్యారెంటీగా జరుగుతుంది అనిపిస్తుందని దేవ్ అంటాడు. నిజమేరా దేవ్ నువ్వు రావడం కృష్ణ మురారిలకు అండగా ఉన్నట్లు నటించడం అది మాత్రం హైలెట్. ఇక ఇప్పట్లో నువ్వు నేను చెప్తే తప్ప ఎవరికి నీ గురించి చెప్పక్కర్లేదు. కానీ.. ఒక వేళ మా పెళ్లి అయ్యాక నీ విషయం తెలిసిందే అనుకో. అగ్రిమెంటో అరెంజ్‌నో కృష్ణ, ముకుందలకు పెళ్లి కాలేదో అత్తయ్య విడదీయడం లేదా.. అసలే ఆ మురారి కనీసం ఒక రెండు నిమిషాలు కూడా నాతో  మాట్లాడటం లేదని ముకుంద అంటుంది. నేను మీ పెళ్లి అయ్యాక నా దారిన నేను కెన్యా వెళ్లి పోతే ఆ శ్రీనివాస్‌ ని ఇంట్లో దిగబెట్టి వెళ్లిపోతా అని దేవ్ అంటాడు. చూడు ముకుంద నువ్వు ఏ టెన్షన్ పడకు. పెళ్లి అయ్యాక నువ్వు అమెరికా వెళ్లిపో ఇక పెళ్లికి ముందు నా గురించి బయట పడినా నువ్వేం భయపడకని దేవ్ అనగానే.. బయట ఎందుకు పడుతుంది దేవ్ అని ముకుంద అంటుంది. చెప్పలేం కదా.. ఏం జరిగిన ఎటాక్ చేయడానికి రెడీ గా ఉండు.. ఇక నేను వెళ్తున్నా గుడ్ నైట్ అని దేవ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

శివన్న ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు..  ఇది కదా స్పై బ్యాచ్ క్రేజ్ అంటే!

బిగ్ బాస్ సీజన్‌ -7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇక గ్రాంఢ్ పినాలే రోజున అతని ఆబిమానులు భారీగా అన్నపూర్ణ స్టూడియోస్ ఎదురుగా నిల్చొని ట్రాఫిక్ వాయిలెన్స్ క్రియేట్ చేశారు. దీంతో పాటుగా కొందరు దుండగులు కారు అద్దాలని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసారు. దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ విధ్వంసం జరగడానికి కారణమైన ‌పల్లవి ప్రశాంత్ ని A1గా, అతని డ్రైవర్ రాజుని  A2 గా పరిగణించి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారిని చంఛల్ గూడ జైలుకి రిమాండ్ కి పంపించింది. ఇక రెండు రోజుల తర్వాత అతనిని బెయిల్ మీద విడిపించాడు భోలే షావలి.  రైతుబిడ్డకి పాటబిడ్డ భోలే షావలి తోడుగా నిలిచాడు. సుమారుగా యాభై మంది లాయర్లతో భోలే షావలి మాట్లాడి ప్రశాంత్ కి బెయిల్ వచ్చేలా చేశాడు‌. ఇక ప్రశాంత్ బయటకొచ్చాక.. శివాజీ, యావర్, భోలే షావలి, నయని పావని,‌ టేస్టీ తేజ, శుభశ్రీ కలిసారు. వీరితో పాటు శివాజీ కొడుకు రిక్కీ కూడా ఉండటంతో శివాజీ ఫ్యామిలీకి ప్రశాంత్ ఎంత దగ్గర అయ్యాడో తెలుస్తుంది.  ఇక అందరు కలిసి భోలే షావలి ఇంట్లో భోజనం చేశారు.  జైలులో ప్రశాంత్ ఉన్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వారి పేరెంట్స్ తో శివాజీ  మాట్లాడుతూ ధైర్యం చెప్పి అండగా నిలిచాడు. ఇక శివాజీ, నయని పావని, భోలే, యావర్, టేస్టీ తేజ అందరు కలిసి సరదాగా ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు స్పై బ్యాచ్ గా ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్ బయటకొచ్చాక ఒకే స్క్రీన్ మీద కనిపించేసరికి వీరి అభిమానులకు ఒకరకంగా పండుగలా అనిపించింది. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన వీరి ముగ్గురు కలసి ఉన్న వీడియోలే కనిపిస్తున్నాయి. " ఏం తప్పు చేయని వాడు దేనికి భయపడడు. వాడు చట్టాన్ని గౌరవించాడు. వాడు నేరస్తుడు కాదు భాదితుడు. ఎవరో చేసిన పనికి వాడు కారణమయ్యాడు వాడేం తప్పు చేయలేదు" అంటు శివాజీ మాట్లాడిన మాటలన్నీ పల్లవి ప్రశాంత్ అభిమానులకి జరిగిన గాయానికి మందుల్లా పనిచేశాయి.  పల్లవి ప్రశాంత్ జైలులో ఉన్నప్పుడు ఆట సందీప్ అతని భార్య జ్యోతి, అశ్వినిశ్రీ, ఆదిరెడ్డి బాగా సపోర్ట్ చేశారు. ఇక బయటకు రాగానే వెన్నంటే ఉన్న శివాజీని కలిసాడు ప్రశాంత్.‌  శివాజీ తన అఫీసియల్ ఇన్ స్ట్రాగ్రామ్ పేజ్ లో ప్రశాంత్‌తో కలిసి లైవ్‌లో మాట్లాడాడు. "బిడ్డా.. ఏరా వారి.. చెప్పరా వాళ్లందరికీ.. శివన్న ఎక్కడ ఎక్కడా అని ఓ అరుపులు.." అంటూ ప్రశాంత్‌తో అన్నాడు. "శివన్న ఎప్పుడూ నా గుండెల్లో ఉంటాడు.. మీ అందరి ప్రేమను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. నాకు అన్న లేడు అని ఉండే.. కానీ నేను చచ్చిపోయేంతవరకూ అన్ననే నాకు అన్నా.. థాంక్యూ సో మచ్ అన్నా.." అంటూ ప్రశాంత్ అన్నాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు శివాజీ, ప్రశాంత్ లని చూసిన ఎవరైన గురుశిష్యులనే అంటారు. బయటకొచ్చాక ప్రశాంత్, యావర్ కలిసి శివాజీని ఎత్తుకోవడంతో శివాజీకి కుడిభుజం, ఎడమ భుజంలా ఇద్దరు ఉన్నట్టుగా అనిపించింది. బిగ్ బాస్ సీజన్-7 లో స్పై బ్యాచ్ కి ఉన్న క్రేజ్ మాములుగా లేదని మరోసారీ ఋజువైంది.  

ఎడారిలో సెగలు పుట్టిస్తున్న మల్లి సీరియల్ భావన లాస్య!

ఒకవైపు బిగ్ బాస్, మరోవైపు బుల్లితెర ధారావాహికలు.. తెలుగు టీవీ అభిమానులకు మంచి కాలక్షేపాన్ని ఇస్తున్నాయి. అయితే యాంకర్ అనసూయ, రష్మీ ఎప్పుడు తమ అందాల ఆరబోతతో ట్రెండింగ్ లో ముందు వరుసలో ఉంటారు. అయితే వీరికి పోటీగా కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు జాయిన్ అయ్యారు. బ్రహ్మముడి సీరియల్ లో అత్త పాత్ర చేస్తున్న రుద్రాణి అలియాస్ షర్మితా గౌడ తన అందాలతో ట్రెండింగ్ లో ఉంటే గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి అమ్మగా జగతి పాత్రలో చేస్తున్న జ్యోతి రాయ్ ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతతో కనువిందు చేస్తుంటుంది. ఇప్పుడు ఈ అందాల‌ ఆరబోత‌ జాబితాలోకి స్టార్ మా టీవీలో‌ ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ లోని మల్లి అలియాస్ భావన లాస్య‌ చేరింది. మల్లిగా అందరికి పరిచయమైన భావన లాస్య.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కరోనా లాక్ డౌన్ సమయంలో తను చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి విశేషమైన స్పందన రావడంతో, మల్లి సీరియల్ మేకర్స్ తనని సంప్రదించగా తను నటించడానికి ఒకే అంది.‌ ఇప్పటివరకు టెలివిజన్ సీరియల్స్ లో నటించిన భావన లాస్యకి 'మల్లి' తన తొలి తెలుగు సీరియల్. కాగా ఇందులో లాస్య ప్రియ ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. టీవి యాక్టర్స్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అవుతున్నారు. అందులో బ్రహ్మముడి సీరియల్ టీమ్ టాప్ లో ఉన్నారు. కాగా ఇప్పుడు మల్లి సీరియల్ లోని లాస్య ప్రియ కూడా చేరింది.  ఆ మధ్య 'సమ్మోహనుడ' పాటకి అదిరిపోయే లుక్స్‌తో హాట్ సారీతో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు తాజాగా ఎడారిలో ఇసుకతెన్నెల మీద తను రకరకాల స్టిల్స్ తో కనువిందు చేసింది. తన అందానికి ఇప్పటికే కుర్రాళ్ళు ఫిధా అవ్వగా.. ఇన్ స్టాగ్రామ్  లో హాట్ అండ్ బోల్డ్ స్టిల్స్ ని అప్లోడ్ చేసింది లాస్య.‌ ఇక ఇప్పటికే ఈ ఫోటోకి తెగ కామెంట్లు వస్తున్నాయి. భావన లాస్య ఈ ఫోటోలతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

కాంట్రవర్సీ యాంకర్ పై ఫైర్..షో నుంచి లేచి వెళ్లిపోయిన శేఖర్ మాష్టర్!

శేఖర్ మాష్టర్ ఇప్పుడు బుల్లితెర మీద స్టార్ కొరియోగ్రాఫర్...ఆయన రకరకాల ఈవెంట్స్ తో   ఫుల్ బిజీ ఐపోయాడు. స్టార్ హీరోల మూవీస్ కి  కొరియోగ్రాఫర్‌గా చేస్తూ  బుల్లితెర మీద ఢీకి జడ్జిగా చేస్తున్నాడు. అలాంటి శేఖర్ మాష్టర్ ఢీ షో మధ్యలోంచి లేచి వెళ్లిపోయాడు.  ఢీ షో కొత్త సీజన్ మొదలైన విషయం తెలిసిందే.  సెలెబ్రిటీ స్పెషల్ వస్తున్న ఈ షోలో ఎంతోమంది సెలెబ్స్ స్టెప్పులేస్తున్నారు.  సీరియల్ తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఢీ షోలో కనిపించనున్నారు. యాంకర్‌గా నందు వచ్చేశాడు. జడ్జ్‌గా ప్రణీత కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి యాంకర్ శివను తీసుకొచ్చారు ఈ షో మేకర్స్. సెలబ్రెటీల ఇంటర్వ్యూలతో వాళ్ళను అడిగే సిల్లీ క్వశ్చన్స్ తో అతను బాగా  ఫేమస్ అయిపోయాడు.  ఇక ఇప్పుడు తన పైత్యాన్ని ఈ స్టేజి మీద ప్రదర్శించాడు.  " మీకు ఒక హీరోయిన్ కి   అఫైర్ ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయి మాష్టర్ ?" అని స్టేజ్ మీదే అందరి ముందే శేఖర్ మాస్టర్‌ను అడిగేసరికి శేఖర్ మాష్టర్ ఫుల్ ఫైర్ ఐపోయి " ఎవడ్రా  వీడ్ని తీసుకొచ్చింది.." అని అడిగాడు.  "మాష్టర్, మాష్టర్ " అని శివ ఏదో చెప్పబోతున్నంతలో "నోరుమూసుకుని ఉండు..నాకు ఒక ఫామిలీ ఉంది..పిల్లలున్నారు. అతన్ని పంపిస్తారా నన్ను వెళ్ళిపోమంటారా" అని సీరియస్ గా అడిగేసి లేచి స్టేజి మీద నుంచి వెళ్లిపోయారు. ఇలా  ప్రోమోను కట్ చేశారు.  దీంతో సెట్లోని వారంతా షాక్ అయ్యారు అసలక్కడ ఎం జరుగుతుందో అర్ధం కానీ మరో జడ్జ్  ప్రణతి కూడా షాక్ లో ఉండిపోయింది . మరి ఇక ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. డిసెంబర్ 27న ప్రసారం అయ్యే ఎపిసోడ్ ను చూడాల్సిందే.  

నేను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించడానికి కారణం ఆయన!

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి డెవిల్ టీమ్ స్టేజి మీదకు వచ్చింది. హీరో నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ సంయుక్తా మీనన్, మరో నటుడు షఫీ, స్టోరీ రైటర్ శ్రీకాంత్ విస్సా వచ్చారు. బింబిసారా మూవీలో సాంగ్ ప్లే చేసేసరికి సంయుక్త డాన్స్ వేసింది. ఐతే సుమ కళ్యాణ్ రామ్ ని డాన్స్ వేయమని అడిగేసరికి ఆ సాంగ్ లో తాను డాన్స్ వేయలేదని జస్ట్ నడుచుకుంటూ వెళ్లానని చెప్పారు. ఇప్పుడు చేయకపోయినా ఈ ఎపిసోడ్ లో ఎలాగైనా సరే డాన్స్ చేయించేస్తాం అని సుమ అనేసరికి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి..ఇలా ఉన్నా డాన్స్ చేయిస్తారా అనేసరికి స్టెప్ వద్దు అంటూ సుమ సర్దుకుపోయింది. ఇక వెంటనే కళ్యాణ్ రామ్ ఐతే ఓకే కాలు సెట్ ఐపోయింది అంటూ కామెడీ చేశారు. ఇక సుమ సీనియర్ ఎన్టీఆర్ మూవీలోని "ఆకు చాటు పిందె" సాంగ్ కి సంయుక్తతో కలిసి డాన్స్ వేసి ఎంటర్టైన్ చేసింది. షఫీ మధ్యలో వచ్చి సుమని అమ్మా అని పిలిచేసరికి "హలో ఎవరు మీరు మా చెలికత్తె వైపు చూస్తున్నారు చూస్తే గీస్తే నేను చూడాలి" అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత కళ్యాణ్ రామ్ తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని చెప్పారు.. "ఫస్ట్ టు ఫిలిమ్స్ ప్లాప్ అయ్యాయి. దాంతో కొంచెం బాధగా అనిపించింది. చాలామంది కూడా నన్ను నిరుత్సాహ పరిచారు...ఎందుకు నీకు యాక్టింగ్ అవసరమా వెళ్ళిపో అన్నారు. ఐతే మా నాన్న మాత్రం ఎప్పుడూ నన్ను ఏమీ అనేవారు కాదు. అస్సలు బాధపడొద్దు..నేను ఏది అనిపిస్తే అది చేసుకో..నేను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించడానికి కారణమే ఆయన" అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యారు కళ్యాణ్ రామ్. ఇలా తన జీవితంలో ఎదుర్కున్న కొన్ని సంఘటనలు వివరించారు.  

వంటలక్కే ఈ జనరేషన్ మహానటి సావిత్రి... డాక్టర్ బాబు ఎం చేసావ్ ..వంటలక్క ఏడుస్తోంది అన్న నెటిజన్

కార్తీకదీపం ఐపోయినా ఆ జ్ఞాపకాల నుంచి కానీ ఆ సీరియల్ అనుభూతుల నుంచి తెలుగు ఆడియన్స్ ఎవరూ ఇంకా బయట పడలేదు. ఈ సీరియల్ లోని పాత్రలు పాత్రధారులు బుల్లి తెర మీద ఎక్కడ కనిపించినా సరే కార్తీక దీపం సీరియల్ నే గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఈ సీరియల్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన వంటలక్క అంటే చాల ఆమెను దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతలా చూస్తున్నారు మన తెలుగు ఆడియన్స్. ఐతే వంటలక్క సీరియల్ కార్తీక దీపం ఐపోయినా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. అలాగే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ కూడా సోషల్ మీడియాలో తన క్రియేటివిటీని కొత్తకొత్తగా ఫాన్స్ కి పరిచయం చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది ఈ దేవత..ఇక నెటిజన్స్ కూడా ఓ రేంజ్ లో వంటలక్కను అభినందించేస్తున్నారు. ఇంతకు ఆమె చేసిందంటే మహానటి సావిత్రి మూవీలోని సాంగ్ "నీ కోసమే నీ జీవించునది" అనే పాటకు బ్లాక్ అండ్ వైట్ వీడియో చేసి అందులో తన ఎక్స్ప్రెషన్స్ పలికించింది..ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. "మహానటి సావిత్రిగారు చేసిన ఏ క్యారెక్టర్ అయినా న్యాయం జరగాలంటే ..నేటి మహానటి  ప్రేమివిశ్వనాథ్  గారికె సాధ్యం...సూపర్ అక్క మళ్ళీ మాటీవీకి ఎప్పుడు వస్తారు..డాక్టర్ బాబు  ఎం  చేసావ్ మళ్ళీ ఏడుస్తోంది...మీ నటన తెలుగు ఫాన్స్ అందరికీ ఎంతో ఇష్టం .. మహానటి  సావిత్రి, సౌందర్యలా నటించారు. వాళ్ళ తర్వాత మీరే..వావ్ సో ఎక్స్ప్రెసివ్" అంటూ నెటిజన్స్ అంతా మెచ్చుకోలు కామెంట్స్ తో ముంచెత్తారు.  

Brahmamudi : మెహందీ వేడుకలో భార్యభర్తలు.. ఆ గుట్టు రట్టవనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -287 లో.. దుగ్గిరాల ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మెహందీ ఫంక్షన్ ని అందరు సరదాగా జరుపుకుంటారు. భార్యలకి భర్తలే మెహందీ పెట్టాలని ఇందిరదేవి చెప్తుంది. అందరు దానికి ఇష్టంగానే ఉన్నా రాజ్, విక్కీ ఇద్దరు మాత్రం అయిష్టంగా ఉంటారు. ఫోన్ వచ్చి మాట్లాడుకుంటు వెళ్లినట్టు నటిస్తు పక్కకి వెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్ళ చేత ఎలాగైన మెహందీ పెట్టించుకోవాలని కావ్య అనుకుంటుంది. అలాగే విక్కీని తోసుకొని రావడానికి పద్మావతి వెళ్తుంది. అలా వెళ్లి ఇద్దరు కన్విన్స్ చేసి రాజ్ , విక్కీ లని తీసుకోని వచ్చి వాళ్ళ చేత మెహందీ పెట్టించుకుంటారు.. మరొకవైపు అందరి ముందు స్వప్న పరువు తీయాలని, తనని బయటకు పంపిచెయ్యాలని, అరుణ్ ని రమ్మని అందరి ముందు స్వప్న కడుపులో బిడ్డకు తండ్రిని నేనే అని చెప్పమని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. అరుణ్ ని రాహుల్ రమ్మని చెప్తాడు. రాజ్ ,  విక్కీ ఇద్దరు మెహందీ పెడుతున్నంత సేపు అయిష్టంగానే ఉంటారు. కానీ కావ్య, పద్మావతి ఇద్దరు మాత్రం వాళ్ళు మెహందీ పెడుతుంటే ప్రేమగా చూస్తుంటారు.  మరొకవైపు అనామికకి కళ్యాణ్ మెహందీ పెట్టడం అయిపోయాక.. అప్పు నీకు మెహందీ  పెడతాను రా అని కళ్యాణ్ పిలుస్తాడు. అప్పు నాకు వద్దని చెప్పినా కళ్యాణ్ బలవంతపెట్టడంతో అప్పు వచ్చి మెహందీ పెట్టించుకుంటుంది. అలా అప్పుకి కళ్యాణ్ మెహందీ పెట్టడం అనామికకి ఇంక తన పేరెంట్స్ కి నచ్చదు. అప్పు వైపు అనామిక కోపంగా చూస్తూ  ఉంటుంది. మరొకవైపు స్వప్నకి అరుణ్ కనిపిస్తాడు. అదే విషయం పద్మావతి, కావ్యలకి చెప్తుంది స్వప్న. అనామిక మెహందీ కంటే అప్పు మెహందీ బాగుందని కళ్యాణ్ అనగానే.. అనామిక విని కోపంగా వెళ్లిపోతుంది. మరొకవైపు అరుణ్ ని ఒక తాగుబోతు ఆపుతాడు. అప్పుడే కావ్య, స్వప్న, పద్మావతి వెళ్లి అరుణ్ ని పట్టుకొని కొట్టాలని అనుకుంటారు కానీ అరుణ్ తప్పించుకుంటాడు. అప్పుడే కనకం వచ్చి అరుణ్ ని కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Krishna Mukunda Murari : ఆయనే కపట నాటక సూత్రధారి.. ఇదేం ట్విస్ట్ రా మామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -348 లో.. ముకుంద దగ్గరకి దేవ్ వస్తాడు. దేవ్ ని చూసి ముకుంద షాక్ అవుతుంది. ఏంటి ఏదో మాట వరుసకి అన్నాడని అనుకుంటే నిజంగానే వచ్చేసాడని ముకుంద మనసులో అనుకుంటుంది. దేవ్ ని భవాని, రేవతిలకు పరిచయం చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరిని ముకుంద పిలుస్తుంది. దేవ్ తన అన్నయ్య అంటూ పరిచయం చేస్తుంది. మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. అప్పుడే దేవ్ ని ముకుంద తీసుకొని కృష్ణ, మురారి దగ్గరికి  వస్తుంది. నేను నీకు రివర్స్ గా మాట్లాడితే నవ్వుతు తీసుకో, నాకు రివర్స్ అవ్వకు. ఏం చేసిన నీ గురించే అని అని ముకుందకి దేవ్ చెప్తాడు. ముకుంద దేవ్ ని లోపలికి తీసుకొని వచ్చి.. కృష్ణ మురారికి పరిచయం చేస్తుంది.. ఏంటి ఇప్పుడు ముకుంద, మురారీలకి పెళ్లి చెయ్యాలని వచ్చాడా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత నాకు ముకుంద ఎలాగో నువ్వు కూడా అంతే, ఇంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళకి ఎందుకు విడదియ్యలి అనుకుంటావా? వీళ్ళని ఎవరు విడదియ్యలేరని దేవ్ కన్నింగ్ గా మాట్లాడతాడు. దాంతో ముకుంద దేవ్ పై కోపంగా వెళ్లినట్టు వాళ్ళ ముందు నటిస్తుంది. మీరు అసలు నేరస్తులని వెతికే పనిలో ఉన్నారు కాదా.. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏమి అప్డేట్ ఉన్న నాకు చెప్పండి అని కృష్ణ, మురారిలతో దేవ్ అంటాడు. వాళ్ళు నిజంగానే దేవ్  హెల్ప్ చేస్తాడని అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను మీకు హెల్ప్ చేస్తున్నట్లు ముకుందతో చెప్పకండని దేవ్ అంటాడు. ఆ తర్వాత దేవ్ బయటకు వచ్చి వాళ్ళు నమ్మేసారని అనుకుంటాడు. మరొకవైపు ముకుందని రేవతి పిలిచి మాట్లాడుతుంది. మా అక్క మొత్తం నీ గురించి ఆలోచిస్తుంది. నువ్వు అన్యాయంగా వెళ్తున్నావ్. మా అక్క ని కూడా నీ దారిలో వెళ్లేలా చేస్తున్నావని ముకుందతో రేవతి అంటుంది. కానీ ముకుంద ఎప్పటిలాగే మురారి కావాలని అంటుంది. కృష్ణ క్యాంపు అని చెప్పి వెళ్ళిపోబోతుంటే మీరే కాదా తీసుకోని వచ్చారని ముకుంద అనగానే.. కానీ కృష్ణ వెళ్ళేది కాదని రేవతి అంటుంది. వెళ్తానని వెళ్ళింది కదా.. నేను అయితే మురారిని ఒక్క క్షణం కూడ వదిలి పెట్టి వెళ్ళనని ముకుంద చెప్తుంది. నాకు మురారి కచ్చితంగా కావాలని చెప్పి ముకుంద వెళ్లిపోతుంది. మరొకవైపు మురారిని కృష్ణ ఆటపట్టిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu : ఆ రౌడీల నుండి వాళ్ళిద్దరిని కాపాడిందెవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -954 లో...అనుపమ, మహేంద్ర ఇద్దరు కలిసి వసుధార దగ్గరకు వచ్చి.. నిన్ను శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేసాడని ముందే ఎందుకు చెప్పలేదు అని మహేంద్ర అడుగుతాడు. మీకు చెప్తే వాడు రిషి సర్ ని ఏమైనా చేస్తాడేమోనని భయం వేసి చెప్పలేదని వసుధార చెప్తుంది. అ తర్వాత అనుపమ మేడమ్ సమయస్పూర్తితో నన్ను ఫాలో అయి వీడియో తీసింది. అది ఇప్పుడు మనకి చాలా హెల్ప్ అవుతుంది. దీంతో అ శైలేంద్ర బయపడి రిషిని తీసుకోని వస్తాడని వసుధార చెప్తుంది.  ఈ విషయం ముకుల్ కి చెప్పాలని అనుపమ ముకుల్ కి ఫోన్ చేసి.. శైలేంద్రే వసుధారని బ్లాక్ మెయిల్ చేసిన విషయం చెప్తుంది. ముకుల్ అది విని షాక్ అవుతాడు. ఇప్పటి వరకు శైలేంద్ర తప్పించుకున్నాడు ఇక మీద తప్పించుకోలేడని ముకుల్ అంటాడు. ఎందుకైన మంచిది మీరు అందరు జాగ్రత్తగా ఉండండి అని ముకుల్ చెప్తాడు. ఇప్పుడు శైలేంద్ర ఫోన్ ట్రాప్ లో ఉంది. ఎవరికి ఫోన్ చేసిన మొత్తం బయటపడుతుందని ముకుల్ అనుకుంటాడు. మరొక వైపు శైలేంద్ర వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని రిషిని కిడ్నాప్ చేసిన రౌడీలకి ఫోన్ చేస్తాడు. అ రౌడీ రిషి తప్పించుకున్నాడని చెప్పగానే శైలేంద్ర వాళ్లపై కోప్పడతాడు. మరొకవైపు వసుధార బ్రాస్ లైట్ చూస్తు బాధపడుతుంది. శైలేంద్ర దగ్గరకి ధరణి వచ్చి.. చెంపపై ఆ వాతలేంటని అడుగుతుంది. గొడ గీసుకుపోయిందని శైలేంద్ర అంటాడు. గోడ గీసుకుపోయినట్టు లేదు. ఎవరో కొట్టినట్టుంది అయిన మిమ్మల్ని ఎవరు కొడతారని ధరణి అంటుంది. ఆ తర్వాత దేవయానికి రిషి తప్పించుకున్నాడని శైలేంద్ర చెప్పగానే.. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సమస్య నుండి ఎలా బయటపడటమని దేవయాని టెన్షన్ పడుతుంటుంది.  వసుధారని చంపేయ్యలని శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఎవరో రౌడీతో శైలేంద్ర మాట్లాడుతాడు. మరొకవైపు అనుపమ, ముకుల్ , వసుధార ముగ్గురు.. రిషిని తీసుకొని శైలేంద్ర వస్తాడో లేక మరి ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడోనని మాట్లాడుకుంటారు. అ తర్వాత వసుధార, అనుపమ ఇద్దరు కార్ లో వెళ్తుంటే కొందరు రౌడీలు మేకులతో ఉన్న కర్రని రోడ్డుకి అడ్డంగా పెట్టడంతో వాళ్ళు వెళ్తున్న కార్ టైర్ పంచర్ అవుతుంది. దాంతో వాళ్ళు కార్ లో నుండి బయటకు వచ్చి.. ఏమైందని చూస్తారు. వాళ్ళ దగ్గరకి రౌడీలు వస్తారు. తరువాయి భాగంలో వసుధార, అనుపమలపై రౌడీలు ఎటాక్ చేస్తుంటే.. ఎవరో ఒకతను వచ్చి వాళ్ళని కాపాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మనాలి మంచులో బిగ్ బాస్ ప్రేమజంట!

బిగ్ బాస్ సీజన్-6 లో టాప్-5 లో ఉన్న కంటెస్టెంట్స్ లలో‌ కీర్తిభట్ ఒకరు. హౌస్ లోకి వెళ్ళిన మొదటి వారం నుండి ప్రతీదానికి ఏడుస్తుంటే ఏంట్రా బాబు ఈ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందా అని ప్రేక్షకులు మొదట్లో అనుకునేవారు. అయితే ఒకరోజు మీ కుటుంబం గురించి చెప్పుకోండి అని బిగ్ బాస్ ప్రతీ కంటెస్టెంట్ కి అవకాశం ఇచ్చినప్పుడు కీర్తిభట్ తన గురించి చెప్పుకుంది. తన ఫ్యామిలీ అంతా ఒక యాక్సిడెంట్ లో చనిపోయారని, ఆ తర్వాత ఒక పాపని దత్తత తీసుకొని పెంచుకుంటే తను కూడా దూరమైందని భాదపడుతూ చెప్పుకుంది. ఇక హౌస్ లోకి వచ్చేముందు మరో పాపని దత్తత తీసుకుందంట మరి ఆ పాప ఎలా ఉందోనని బాధపడుతూ చెప్పుకోవడం, కీర్తిభట్ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళని చూసి ఎంతో మంది అభిమానులు అయ్యారు. కీర్తిభట్ హౌస్ లో కెప్టెన్ అయ్యాక హౌస్ మేట్స్ అందరితో మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ముగ్గురితో కీర్తిభట్ హౌస్ లో గొడవలు రావడంతో తన గేమ్ కాస్త డిస్టబ్ అయింది. ఆ తర్వాత తను ప్రతీ టాస్క్ లో బాయ్స్ తో గట్టి పోటి ఇస్తూ శివంగిలా ఎదురునిలబడటంతో ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది. ఇక తను టాప్-5 లోకి చేరుకుంది. అయితే కీర్తిభట్ కంటే రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డికి అప్పట్లో ఫ్యాన్ బేస్ కాస్త ఎక్కువ ఉండటంతో తను ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ షో తర్వాత మీ ఇంటి కీర్తి అనే యూట్యూబ్ ఛానెల్ ని మొదలెట్టింది కీర్తిభట్. ఇక అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. బిగ్ బాస్ షో తర్వాత కార్తీక్ అనే తన ఫ్రెండ్ ని పెళ్ళిచేసుకోబోతున్నట్టు ఒక పోస్ట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా దానికి చాలామంది సపోర్ట్ చేస్తూ అభినందనలు తెలిపారు. దాంతో  కొన్ని రోజుల తర్వాత కార్తీక్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుంది కీర్తి. అయితే కార్తిక్ మంచివాడని ఎప్పుడు చెప్తుంటుంది కీర్తి. ఇక తాజాగా " మనాలి మంచులో షూట్ ఎలా చేశామంటే" అనే ఒక వ్లాగ్ ని తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. ఇందులో మొదట కార్తిక్ మాట్లాడాడు.. నేను ఒకప్పుడు సెల్ఫీ అంటేనే సిగ్గుపడేవాడిని. ఇప్పుడు కీర్తీకోసం వ్లాగ్స్ చేస్తున్నాను. తెలుగులో ఒక సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. మీ ఇంటి కీర్తిని బాగా చూసుకుంటున్నాను. మమ్మల్ని సపోర్ట్ చేయండి‌. మేం ఇప్పుడు మనాలిలో ఉన్నాం. ఇక్కడ మధ్యాహ్నం మూడు గంటకి మూడు డిగ్రీలు ఉంది. మాట్లాడుతుంటేనే పొగ బయటకు వస్తుంది. కీర్తి చూడంటి చిన్నపాపతో ఎలా ఆడుకుంటుందో అంటూ కార్తిక్ చెప్పుకొచ్చాడు. మనాలి మంచులో ఈ క్యూట్ ప్రేమజంట కనువిందు చేశారు. షూటింగ్ అంటు చేసిన ఈ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

అమ్మకోసం సర్ ప్రైజ్ షాపింగ్ చేసిన శోభాశెట్టి!

బిగ్ బాస్  సీజన్-7 లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో మొదట రైతు బిడ్డ ప్రశాంత్ ఉంటే ఆ తర్వాత కార్తీక దీపం మోనిత అలియాస్ శోభాశెట్టి ఉందనే చెప్పాలి. హౌస్ లోకి వెళ్ళినప్పుడు మొదట్లో చాలా సాధారణంగా కనిపించిన శోభాశెట్టి.. మెల్లి మెల్లిగా చంద్రముఖిలా మారిపోయిందంటూ ప్రతీవారం ఫుల్ ట్రోల్స్ వచ్చేవి. వాటిని వీకెండ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ లో హోస్ట్ నాగార్జున బిగ్ స్క్రీన్ మీద వేసి చూపించాడు.  బిగ్ బాస్ హౌస్ లో శోభాశెట్టి ఆటతీరు, మాటతీరుకి ప్రేక్షకులు తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు ప్రియాంక, అమర్ దీప్ లతో కలిసి గ్రూప్ గా ఉంటు టాస్క్ లలో కూడా గ్రూప్ గా ఆడుతూ, నామినేషన్ టైమ్ లో అందరు కలిసి ఎవరెవరిని నామినేషన్ చేయాలని మాట్లాడుకోవడం అన్నీ కూడా తనకి మరింత నెగెటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాయి. అయితే ఆటలో ఉన్నప్పుడు ఫౌల్ చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు కానీ మరీ సంఛాలక్ గా ఉండి కూడా ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేసేది. ఇక మొదటి వారం నుండి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియాంక కలిసి చేసిన నామినేషన్ లు చాలానే ఉన్నాయి. ఇక అందరు కలిసి ప్రశాంత్ ని టార్గెట్ చేయడంతో శివాజీ అతనికి సపోర్ట్ చేస్తూ నిలిచాడు. ప్రతీసారీ ప్రశాంత్ కి వెన్నెంటే ఉండటంతో శోభాశెట్టి, అమర్, ప్రియాంక వాళ్ళు జెలస్ తో ఏదో ఒక కారణంతో నామినేషన్ లో పెట్టేవాళ్ళు. అతడికి గాయాలు చేస్తూ ఇబ్బందిపెట్టేవాళ్ళు. అయితే శోభాశెట్టి హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ముద్దుబిడ్డ అనేవాళ్ళు ఎందుకంటే తనెంత చెత్త ఫర్ఫామెన్స్ ఇచ్చిన, ఓటింగ్ లో ఎంత లీస్ట్ లో ఉన్న తను మాత్రం ప్రతీవారం సేఫ్ అయ్యేది. శోభాశెట్టి సంఛాలక్ గా ఎన్నిసార్లు ఫెయిల్ అయిన బిగ్ బాస్ మాత్రం తననే సంఛాలక్ చేసేవాడు. అలా ప్రతీవారం తను ఎలిమినేట్ అవ్వాలని ప్రేక్షకులు ఓట్లు వేయకుండా తనకన్న దిగువన ఏ కంటెస్టెంట్ ఉన్నా వారికి భారీగా ఓట్లేసేవారు. అయిన బిగ్ బాస్ తననే సేవ్ చేసేవాడు. అందుకే ఈ దత్తపుత్రికని లాస్ట్ వీక్ వరకు ఉంచాడు. ఇక ఫినాలేకి ఒక్క వారం ముందు శోభాశెట్టిని ఎలిమినేషన్ చేసి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించాడు. అయితే శోభాశెట్టి ఎలిమినేషన్ తర్వాత ఎంతోమంది ప్రేక్షకులు.. నువ్వు ఎప్పుడో బయకు రావాల్సింది, చాలా లేట్ గా వచ్చవంటూ కామెంట్లు చేశారు. అయితే శోభాశెట్టి బిగ్ బాస్ తర్వాత తన షూటింగ్ పనుల్లో బిజీ అయింది. ఇప్పుడు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ని  అప్లోడ్ చేసింది. ఇందులో వాళ్ళ అమ్మ కోసం ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ తీసుకుంటున్నట్టు చెప్పింది శోభా. ప్రస్తుతం షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న శోభా త్వరలో వాళ్ళ అమ్మ కోసం బెంగుళూరు వెళ్తున్నట్టు, అందుకే తనకి గుర్తుండిపోయేలా ఏదైన సిల్వర్ జ్యువలరీ తీసుకోవాలనుకుందంట‌. అందుకే కొత్తగా ప్రారంభమైన ఓ జ్యువలరీ షోరూమ్ లోకి షాపింగ్ కి వెళ్ళింది. ఇక వాళ్ళ అమ్మ కోసం సర్ ప్రైజ్ షాపింగ్ చేశానంటు తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

సలార్ మూవీని రెండు సార్లు చూడాలి...ఫస్ట్ టైం అర్ధం కాదు!

ఇప్పుడు ఎటు చూసిన సలార్ మూవీ ఫీవర్ తో జనం ఊగిపోతున్నారు. ఈ మూవీని  చూసిన ప్రతీ ఒక్కరూ కూడా ఫ్రూట్ సలాడ్ అంత టేస్టీ రివ్యూస్ ని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అమ్మడు గీతూ రాయల్ కూడా ఈ సలార్ బెనిఫిట్ షోకి వెళ్లి దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. ఈ మూవీ మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  గీతూ ఈ మూవీ గురించి చెప్తూ "ఫస్ట్ టైం చూస్తే ఈ సినిమా ఎవరికీ అర్ధం కాదు. ముందు ఈ మూవీ నేను ఫ్లాప్ అవుతుందని అనుకున్నాను.. ప్రభాస్ నటించిన ఈ  సినిమా కూడా ఫ్లాపేనా అని ఫీల్ అయ్యాను. ప్రభాస్ కటౌట్ ఈ సినిమాలో అదిరిపోయింది. ఈ సినిమా నాకు అర్థం కాలేదు... ఇందులో వచ్చే ఫైట్ సీన్స్ అసలెందుకు తెలియని కొన్ని ట్విస్టులు.. నాకు అసలు  అర్థం కాలేదు. బహుశా నా బుర్ర తక్కువ కాబట్టి ఈ సినిమా అర్థం కాలేదేమో మరి.  కానీ ఒకసారి సినిమా చూస్తే అర్థం కాదు రెండు సార్లు చూడాల్సిందే...లాస్ట్ మూవీలో ప్రభాస్ అందమే పోయింది అనుకున్నాం..ఐతే ఆ అందమంతా ఈ మూవీతో తిరిగొచ్చేసింది. ప్రభాస్ కటౌట్ ఏముందిలే...కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్టుగా ఉంది మూవీ. స్టోరీ వైజ్ సూపర్ గా ఉంది. కానీ రెండు సార్లు చూస్తే అర్ధమవుతుంది." అని గీతూ చెప్పేసరికి ఈమెపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా  బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కి సపోర్ట్ చేస్తున్నాం అనే ముసుగులో  విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ కారుని బద్దలు కొట్టి.. అతని ఫ్యామిలీపై దాడి చేశారు. అలాగే  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లను,  బిగ్ బాస్ బజ్ యాంకర్ గీతు రాయల్ కారును పగలగొట్టారు. అల్లరి మూకల దాడిలో భయాందోళనకు గురైన గీతూ రాయల్.. హైదరాబాద్‌లో మాదాపూర్ పోలీస్ట్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

నన్నెవరూ పెళ్లి చేసుకుంటారు అన్న దీప్తి!

  సోషల్ మీడియాతో సెలబ్రిటీ అయ్యింది దీప్తి సునయన..డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో కూడా మెరిసింది. ఈమె షన్నుతో  కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొన్ని రోజులు వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. అలాంటి దీప్తి సునయన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయింది. ప్రశ్నలు అడగమని చెప్పింది. ఒక నెటిజన్ ఐతే " పిచ్చిదానివి ఐపోతావ్ జాగ్రత్త అక్కో..నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావ్" అనేసరికి "ఎవరికీ లేదురా పిచ్చి" అనే సాంగ్ ని ఆ నెటిజన్ కోసం పోస్ట్ చేసింది. "మీరు ఇంట్రావర్ట్ ఆ లేదా ఎక్సట్రావెర్ట్ ఆ" అనేసరికి " నచ్చితే ఎక్సట్రావెర్ట్ ని, నచ్చకపోతే ఇంట్రావర్ట్" అని చెప్పింది. "నీ ఫ్రెండ్ పెళ్ళికి పోయావు మరి నీ పెళ్ళెప్పుడు దీపు" అని మరో నెటిజన్ అడిగేసరికి " నన్నెవరూ చేసుకుంటారు నాన్న ఎవడో ఒకడు ఉంటాడు" అని ఆన్సర్ ఇచ్చింది. "నీకు తెలీదు కానీ నీకు ఒక ఇమాజినరీ వరల్డ్ ఉంది.. అందుకే నీలో నువ్వే మాట్లాడుకుంటావ్ అక్క " అని అడిగేసరికి " అంతేనా బ్రో...అంతే అంటావా.. మే బి అదే అయ్యుండొచ్చు. మీరు కూడా అప్పుడప్పుడు అలాగే మాట్లాడతారేమో ఎవరికీ తెల్సు" అంది సీరియస్ గా దీప్తి. ఇక దీప్తి ఎప్పుడూ రకరకాల వెరైటీ డ్రెస్సులో ఫోటో షూట్స్ చేస్తుండడం మనం చూసాం. లేటెస్ట్ వీడియోలో ఒక నెటిజన్ "నేను చనిపోయే లోపు నిన్ను షన్ను అన్నని ఒకే వీడియోలో చూడాలి" అని కామెంట్ చేసాడు.  అలాగే రీసెంట్ గా ఒక పోస్ట్ లో ది డెవిల్ వేర్ హ్యూమిన్ అనే బ్రాండ్ కి చెందిన ఒక గ్రీన్ కొమ్ములున్న టీ షర్ట్ ని వేసుకుని మరీ ఫొటోస్ కి ఫోజులిచ్చింది. ఆ టీ షర్ట్ కాస్ట్ వచ్చి 6500  రూపాయలు... ఇక ఈ టీ షర్ట్ కాస్ట్ చూసి నెటిజన్స్ కూడా షాకయ్యారు. నీకే ఎందుకు ఇలాంటి డ్రెస్సులు దొరుకుతాయి అంటూ కామెంట్ కూడా చేశారు. దీప్తి నటించిన చిలక అనే ఆల్బం రేపు జనవరిలో రిలీజ్ కాబోతోందని కూడా చెప్పింది దీప్తి.  

Guppedantha Manasu:శైలేంద్రకి దిమ్మతిరిగే షాకిచ్చిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -953 లో.. ఎండీగా ఉండలేనని వసుధార బోర్డు మెంబెర్స్ కి చెప్తుంది.. వసుధార ఏం చేస్తున్నావ్ నిన్ను ఎవరో బయపెట్టి ఇలా చేయిస్తున్నారు. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవద్దని మహేంద్ర అమగానే.. ఈ నిర్ణయం సరైనదేనని వసుధార చెప్తుంది. మరి ఇప్పుడు కొత్త ఎండీ గా ఎవరు ఉంటారని బోర్డు మెంబర్స్ అడుగుతారు.  ఇంకెవరు శైలేంద్ర భూషన్ అని వసుధార అనగానే.. మహేంద్ర అనుపమ ఇద్దరు కోపంగా చూస్తారు. దేవయాని, శైలేంద్ర ఇద్దరు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అందరు సంతకలు చేస్తే శైలేంద్ర ఎండీగా ఛార్జ్ తీసుకుంటారని బోర్డు మెంబర్స్ అంటారు. సరే ఇప్పుడు దానికి కావాలిసిన పేపర్స్ తీసుకోని వస్తానని వసుధార వెళ్తుంది. వసు వెళ్లి ఎండీ చైర్ దగ్గరికి వెళ్లి బాధపడుతుంటే మహేంద్ర, అనుపమ ఇద్దరు వచ్చి.. ఎందుకిలా చేస్తున్నావని అడుగుతారు.  నా కారణాలు నాకు ఉంటాయని వసుధార చెప్తుంది. మరొక వైపు దేవయాని, శైలేంద్ర ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. తన కొడుకుని చూసి అనుకున్నది సాధించావంటు దేవయాని మురిసిపోతుంది. మరొకవైపు మళ్ళీ మీటింగ్ మొదలు అవుతుంది. శైలేంద్ర ఎండీగా అందరూ బోర్డు మెంబర్స్ సంతకం పెడుతారు. వసుధార సంతకం పెట్టబోతు ఆగిపోతుంది. ఏమైందని దేవయాని అడుగుతుంది. రిషి సర్ వచ్చాక రిషి సర్ ముందు శైలేంద్ర ఎండీ అయితే బాగుంటుంది. ఇందాక అతనే అన్నాడు కదా.. ఈ టైమ్ లో రిషి ఉంటే బాగుండేదని అందుకే రిషి సర్ వచ్చాక ఎండీగా బాధ్యతలు అప్పగిస్తానని వసు చెప్పగానే బోర్డు మెంబర్స్ కూడా సరే అంటారు. అ తర్వాత కాసేపటికి వసుధర ఇలా చేసిందేంటని వసుధార దగ్గరికి శైలేంద్ర వెళ్లి.. నువ్వు చెప్పిందేంటి? చేసిందేంటని అడుగుతాడు. రిషి నీకు అవసరం లేదా అని శైలేంద్ర అంటాడు. మీరు రిషి సర్ ని తీసుకోని రండి. అ తర్వాత మీరు చెప్పింది చేస్తానని వసుధార అంటుంది. రిషి సర్ కి ఏమైనా అయితే మీకు మాములుగా ఉండదు. ఈ బ్రాస్ లైట్ పంపించారు. అంతే కాకుండా సాక్ష్యం కూడా ఉందని వసుధారని శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేసిన వీడియోని చూపించగానే శైలేంద్ర షాక్ అవుతాడు. ఈ వీడియో ఎక్కడదని శైలేంద్ర అడుగుతాడు. వసుధార కంగారుగా శైలేంద్ర చెప్పిన అడ్రస్ కి వెళ్తుంటే డౌట్ వచ్చి అనుపమనే ఫాలో అయి వసుధారని శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేస్తున్నది వీడియో తీస్తుంది. అ వీడియోని వసుధార మీటింగ్ నుండి పేపర్స్ కోసం బయటకు వచ్చినప్పుడు అనుపమ చూపిస్తుంది. అందుకే వసుధార సంతకం చెయ్యకుండా ఆగుతుంది. అదే విషయం వసుధార గుర్తుకు చేసుకుంటుంది. కానీ అనుపమ తీసినట్లు చెప్పదు. రిషిని చంపేస్తానని శైలేంద్ర అనగానే.. శైలేంద్ర చెంప చెల్లుమనిపిస్తుంది వసుధార. రిషి సర్ మీ దగ్గర ఉన్నాడని అందరికి చెప్తాను. ఈ వీడియో చూపిస్తాను. రెండు, మూడు రోజుల్లో రిషి సర్ ని తీసుకోని రావాలని శైలేంద్రకి వసుధార మాస్ వార్నింగ్ ఇస్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.