ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను : పల్లవి ప్రశాంత్

నాన్న.. ప్రతీ ఒక్కరిని వెంటాడే ఒక ఎమోషన్. ప్రతీ కూతురికి నాన్నే సూపర్ హీరో. ప్రతీ కొడుక్కీ నాన్నే రోల్ మోడల్. అలాంటి నాన్నని ఆ కొడుకు ముందే ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే.. నీ‌ కొడుకు అంత చదివి రైతుగా ఉన్నాడా అని అవహేళన చేస్తే ఆ కొడుకు ఏం చేశాడు. బిగ్ బాస్ సీజన్‌ సెవెన్ లోకి వచ్చాడు.. గెలిచాడు.‌ అవును పల్లవి ప్రశాంత్ కి జీవితంలో జరిగిన అవమానం నుండి తనలో కలిగిన ఈ లక్ష్యమే బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీలతో పోటీ పడీ రైతు తల్చుకుంటే ఏదైన సాధించగలడని నిరూపిస్తానని చెప్పాడు.. చేసి చూపించాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టాడు ప్రశాంత్.‌ మొదట్లో అందరు రైతుల పేరు చెప్పుకొని కావాలని నటిస్తున్నాడని అన్నారు.‌ కానీ రోజులు గడిచేకొద్దీ అతని పట్టుదల, గెలవాలనే కసి, ప్రతీ టాస్క్ అతను చూపే ఎఫర్ట్స్ అన్నీ కూడా ప్రతీ ఒక్క బిగ్ బాస్ అభిమానికి కనెక్ట్ అయ్యాయి. హౌస్ లో అందరితో ఒకేలా ఉన్న‌ ప్రశాంత్‌కి  శివాజీ తన సపోర్ట్ ఇచ్చాడు. ఎవరితో ఎలా ఉండాలో చెప్పాడు. ఇక హౌస్ లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా.. అందరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. ఒక్క పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న రాకపోవడంతో పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఎదురుచూసాడంట ప్రశాంత్. శోభాశెట్టి, ప్రియాంక తినమని చెప్పిన తినని మొండిగా ఉన్నాడంట ప్రశాంత్. ఆ తర్వాత బంతిపూలని పంపించాడు బిగ్ బాస్. ఆ పూలని చూసిన శివాజీ.. ' రేయ్ పల్లవి.. మీ చేనులో పూసిన బంతిపూలు రా' అని చూపించడంతో కంటతడి పెట్టుకున్నాడు ప్రశాంత్. ఇక కాసేపటికి.. బాబు బంగారం అంటూ పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాన్నని చూసిన ఆనందంలో పరుగున వెళ్ళి కాళ్ళమీద పడిపోయాడు ప్రశాంత్. నాన్నని పైకి ఎత్తుకొని.. జై కిసాన్ జై జవాన్. మళ్లొచ్చిన అంటే తగ్గేదేలే అంటూ అరవడంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం దద్దరిల్లిపోయింది. నా బిడ్డని మంచిగా చూసుకోండ్రి అని హౌస్ మేట్స్ అందరికి చేతులెక్కి మరీ మొక్కాడు. " గొడవలు పెట్టుకోకండి. కొట్టుకోకండి.. కలిసి మెలిసి ఉండండి" అంటూ అమర్ దీప్ తో పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న అన్నాడు. ఇక నాన్నకి ఆప్యాయంగా అన్నం తినిపించాడు పల్లవి ప్రశాంత్. ఓ ప్లేట్ లో అన్నం మెతుకుల్లా మీరంతా కలిసి మెలిసి ఉండాలే. ఎవరి ఆట వారిదే. ఆట అయిపోయాక అంతా మరిచిపోయి కుటుంబం మాదిరి ఉండాలి అని హౌస్ మేట్స్ తో అన్నాడు ప్రశాంత్ వాళ్ళ నాన్న. ఇక గ్రాంఢ్ ఫినాలేలో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఇద్దరు ఉండగా విజేతగా‌ ప్రశాంత్ ని ప్రకటించాడు నాగార్జున. ఒక కామన్ మ్యాన్  కేటగిరీలో వచ్చిన ఏ కంటెస్టెంట్స్ టాప్-5 వరకు రాలేదు.‌ దేశంలో ఏ బిగ్ బాస్ లోను కామన్‌మ్యాన్ గెలిచింది లేదు. ‌ఇక ట్రోఫీ తీసుకొని వచ్చిన పల్లవి ప్రశాంత్ కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు.‌ ఇక‌ నానా‌ రచ్చచేసి ట్రాఫిక్ వాయిలెన్స్ ‌ని క్రియేట్ చేశారు. దాంతో ప్రశాంత్‌ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ప్రశాంత్ కోసం వాళ్ళ నాన్న చంచల్‌గూడ జైలు బయట ఫుట్ పాత్‌ మీద పడుకొని ఎదురుచూసాడు.‌ ఇక ఆ వార్త అప్పడు ఫుల్ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ గా మారింది. ‌ఇక ఇప్పుడు ‌ఆ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ప్రశాంత్.. వాళ్ళ‌ నాన్న పాదాలకి నమస్కరించాడు.‌ ఇక అమ్మనాన్నల ఆశీర్వాదం తీసుకొన్నాడు‌‌ ప్రశాంత్. ఎన్ని జన్నలెత్తిన మీ రుణం తీర్చుకోలేను‌ బాపు, అమ్మ ‌అని పోస్ట్ కి రాసుకొచ్చాడు ప్రశాంత్. కాగా ఈ పోస్ట్ కి తెగ కామెంట్ లు వస్తున్నాయి. ‌ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లా మారింది.

Guppedantha Manasu : తృటిలో తప్పించుకుంది.. ఇక అసలు కథ మొదలైనట్టేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -960 లో.. కొందరు రౌడీలు వసుధారని రిషి ఉన్న దగ్గరకి తీసుకొని వచ్చి.. నువ్వు డోర్ తియ్యకపోతే వసుధారని చంపేస్తామంటూ రౌడీలు రిషిని బెదిరిస్తున్నట్లు రిషి కలకంటాడు. ఒక్కసారిగా నిద్రలో నుండి లేచి వసుధార అంటూ గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న ముసలివాళ్ళు ఏమైందంటు అడుగుతారు.  తొందరలోనే మీ వాళ్ళని కలుస్తావ్.. నువ్వు ఏమి బాధపడకంటు ఆ ముసలివాళ్ళు రిషికి చెప్తారు. మరొకవైపు భద్ర ఇంట్లో కరెంటు ఆఫ్ చేసి.. వసుధార అనుకొని అనుపమ ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తుంటే లోపల నుండి వసుధార వాయిస్ వినిపిస్తుంది. అక్కడ వాయిస్ వినిపిస్తే మరి ఇక్కడ ఉందెవరని చూసేసరికి అనుపమ ఉంటుంది. దాంతో తనని కిందపడుకోపెట్టి పక్కకి వెళ్లిపోతాడు భద్ర. మరొకవైపు అనుపమ కన్పించడం లేదని మహేంద్రకి వసుధార చెప్తుంది. దాంతో వాళ్ళు బయటకు వచ్చేసరికి అనుపమ కిందపడిపోయి ఉంటుంది. ఏమైందని వసుధార, మహేంద్రలు కంగారుపడుతుంటారు. అప్పుడే భద్ర వచ్చి ఎవరో రౌడీలు మేడమ్ ని తీసుకొని వెళ్తుంటే సౌండ్  వచ్చి లేచాను. నేను వాళ్ళని పట్టుకుందామని వెళ్లేసరికి వాళ్ళు పారిపోయారని భద్ర చెప్తాడు. ఆ తర్వాత అనుపమని ఇంట్లోకీ తీసుకొని వస్తారు. స్పృహ లొకి రాగానే జరిగిందంతా మహేంద్ర చెప్తాడు. నిన్ను ఎవరో కిడ్నాప్ చేయాబోతుంటే భద్ర కాపాడాడని అనుపమకి మహేంద్ర చెప్తాడు. అతను కిడ్నాప్ చేయాలి అనుకుంది నన్ను కాదు వసుధారని అని అనుపమ చెప్తుంది. అవునని మహేంద్ర అంటాడు. మీరు జాగ్రత్తగా ఉండండని మహేంద్ర చెప్తాడు. వసుధారని ప్రొటెక్ట్ చేస్తూ ఉండమని భద్రకి మహేంద్ర చెప్తాడు. దానికి భద్ర సరే అంటాడు. నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావ్ కానీ ఈసారి మిస్ అవ్వదని భద్ర అనుకుంటాడు. మరొకవైపు భద్ర ఇంక ఫోన్ చెయ్యలేదని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే భద్ర ఫోన్ చేస్తాడు. అది చూసిన శైలేంద్ర కంగారుగా పక్కకి వెళ్లి మాట్లాడతాడు. అలా వెళ్లడం ధరణి చూసి.. ఈయన ఇక మారరని అనుకుంటుంది. అ తర్వాత భద్ర జరిగింది మొత్తం శైలేంద్రకి చెప్పగానే తను డిజప్పాయింట్ అవుతాడు. ఆ తర్వాత నా మాటలు ధరణి ఏమైనా విందా అని శైలేంద్ర అనుకుంటాడు. మరొకవైపు రిషి మాత్రం వసుధార గురించి ఆలోచిస్తుంటాడు. మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉందా అని రిషి అడుగుతాడు. లేదని అక్కడున్న ముసలివాళ్ళు చెప్తారు. నేను ఇప్పుడు మా వాళ్ళని కలవకున్నా కూడా ఫోన్ మాట్లాడాలని రిషి అనగానే.. సరే ఎవరినయినా అడిగి తీసుకొని వస్తానని ఆ పెద్దాయన వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తెల్ల జుట్టు వచ్చేస్తోంది..మా అన్నను పెళ్లి చేసుకో

 రష్మీ వయసు పెరుగుతున్న తరగని అందంతో హోస్ట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ తో బుల్లితెర మీద రచ్చ చేస్తూ ఉంటుంది. స్మాల్ స్క్రీన్ మీద హిట్ పెయిర్ గా అందరి హృదయాలను దోచుకున్న సుధీర్ - రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకు వీళ్ళు లేనిదే ఏ షో లేదు అన్నట్టుగా ఉండేది. కానీ సుధీర్ మాత్రం సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్లిపోయేసరికి బుల్లితెర మీద ఒంటరిగా మిగిలిపోయింది రష్మీ. ఇక ఇప్పుడు ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ లో మునిగితేలుతోంది రష్మీ. ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "2023 ఆఖరి క్షణాలను నాకు ఇష్టమైన వాళ్ళతో ఇలా స్పెండ్ చేశా" అంటూ కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో వదిలింది.ఇక నెటిజన్స్ కామెంట్స్ మస్త్ పెడుతున్నారు. "తెల్ల జుట్టు వచ్చేస్తోంది..త్వరగా సుదీర్ అన్నను పెళ్లి చేసుకో" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఆదివారం నాడు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా రష్మీ పెళ్లి పార్టీ పేరుతో ఒక ఈవెంట్ రాబోతోంది. ఆ ప్రోమోలో ఆది ఒక డైలాగ్ వేసాడు "ఇన్ని రోజులు నువ్వు టీవీ రేటింగ్స్ కోసం ఏదేదో చేశావ్ .. కానీ నిజంగా నువ్వు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావో అతడ్ని మేమూ చూడాలనుకుంటున్నాం" అని అడిగేసరికి .  రష్మీ సిగ్గుపడుతూ "ఒక అమ్మాయికి కాబోయే వాడు ఇలా ఉండాలని కొన్ని కోరికలు ఉంటాయి.. పొడుగ్గా ఉండాలని"  అంటూ ఏదో చెప్తుండగానే ఆమె వెనక నుంచి ఒక తెల్లటి వ్యక్తి స్టేజి మీదకు వచ్చి రష్మీ పక్కన నిలబడ్డాడు. ఇంతకు ఎవరతను అంటూ సుధీర్ ఫాన్స్ అంతా ప్రోమో కింద కామెంట్స్ లో అడుగుతున్నారు.  "రష్మీకి ఎన్నిసార్లు పెళ్లి చేస్తారయ్యా, అన్న ఉండాల్సిన చోట వీడెవడ్రా,  ఆపండ్రా బాబు పెళ్లి గోల" అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇతను ఎవరో తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.  

నా కోడ్ వర్డ్ సైతాన్...సంయుక్త అడిగిన ప్రశ్న కామెడీగా సుమ ఆన్సర్

సుమ అడ్డా ఈ వీక్ షోలో డెవిల్ మూవీ మెరిసింది. ఈ మూవీ హీరో హీరోయిన్స్ సంయుక్తా మీనన్, నందమూరి కళ్యాణ్ రామ్ వచ్చారు. ఐతే సంయుక్త సుమని ఒక ప్రశ్న అడిగింది "మీకు ఒక కోడ్ నేమ్ పెట్టుకోవాల్సి వస్తే" అని అడిగింది "ఎనర్జీ" అని టక్కున చెప్పింది సుమ. "కరెక్ట్" అని కళ్యాణ్ రామ్ చప్పట్లు కొట్టాడు. "కానీ మనం పేరు అలా పెట్టకూడదు కదా ..కళ్యాణ్ రామ్ గారికి రివర్స్ లో డెవిల్ అని పెట్టినట్లు నేను సైతాన్" అని పెట్టుకుంటాను అని సుమ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. "అది రాజీవ్ గారు పిలిచే పేరా" అని కామెడీ చేసాడు కళ్యాణ్ రామ్. తరువాత సంయుక్తాని, కళ్యాణ్ రామ్ ని సుమ కొన్ని ప్రశ్నలు అడిగింది "సంయుక్త మీ అందం రహస్యం" అనేసరికి "మా అమ్మా..తను అందంగా ఉంటుంది కాబట్టి నేను అందంగా ఉన్నాను. ఐతే ఈ రోజు త్రి లేయర్స్ మేకప్ లో ఉన్నాను" అనేసరికి అందరూ నవ్వేశారు. "తారక్, అద్విత, సౌర్య రామ్, అభయ్ రామ్, భార్గవ్ రామ్.. వీళ్లల్లో అల్లరి బాగా ఎవరు చేస్తారు" అని కళ్యాణ్ రామ్ ని అడిగేసరికి " భార్గవ్ బాగా అల్లరి చేస్తాడు. అందరికంటే చాలా చిన్నవాడు కాబట్టి అల్లరిగా ఉంటాడు" "ప్రొడ్యూసర్, హీరో, బెస్ట్ హజ్బెండ్ ..ఈ రోల్స్ లో ఏ రోల్ చేయడం అంటే మీకు ఇష్టం" అనేసరికి "హజ్బెండ్ రోల్ చేయడం ఇష్టం అది కరెక్ట్ చేస్తే మిగతా రెండు హ్యాపీగా జరిగిపోతాయి" అని చెప్పాడు కళ్యాణ్ రామ్. ఆ ఆన్సర్ కి సుమ చాల ఎగ్జాయిట్ ఫీల్ అయ్యింది "ఈ జీవిత సత్యాన్ని ప్రతీ భర్తా తెలుసుకోవాలి... రాజీవ్ కనకాల కూడా మిమ్మల్ని అలాగే ఫాలో అవుతాడు" అని చెప్పింది సుమ. ఇలా ఈ వారం సుమ అడ్డా షో ఎంటర్టైన్ చేసింది. నందమూరి హీరో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటించిన డెవిల్ మూవీ  మిక్స్‌డ్ రెస్సాన్స్ సొంతం చేసుకుంది  

బిగ్ బాస్ కంటెస్టెంట్ పేరుతో బుక్ రిలీజ్...

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర స్టార్స్ అంతా వచ్చారు. "వీళ్ళందరూ ఓకే కానీ తెల్ల గడ్డాన్ని కూడా వదలడం లేదు..ఇంతకూ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏమిటి" అంటూ ప్రభాకర్ ని అడిగింది శ్రీముఖి. "ఇదే నా న్యూ ఇయర్ ప్లాన్.. సాల్ట్ అండ్ పెప్పర్ అంటూ అమ్మాయిలంతా నా వెంట పడుతున్నారు." "పేరుకు 90 కానీ చేసే పనులన్నీ 20 ఏళ్ళ వాళ్ళు చేసినట్టు ఉన్నాయి" అని కౌంటర్ వేసింది శ్రీముఖి. తర్వాత షోకి వచ్చిన జాకీని చూసి షాకయ్యింది. "ఏమిటి జాకీ గారు పార్టీకి మీరు మొదటి సారి హరిత గారు లేకుండా రావడం..ఏమిటది " అనేసరికి "ఆ ఆనందం చూస్తున్నారా నాలో" అంటూ తెగ ఉత్సాహంతో మెలికలు తిరిగాడు జాకీ. ఇక సీరియల్ బ్యాచ్ వాళ్ళు వచ్చారు ... అందులో మానస్ ని చూసిన శ్రీముఖి "31st నైట్ ప్లాన్స్ ఏమిటి" అని అడిగేసరికి " పెళ్లయ్యింది కదా" అని మానస్ చెప్తుండగా మధ్యలో కావ్య ఎంట్రీ ఇచ్చి " మల్లెపూలు, హల్వా" ఉంటాయి అని ఆన్సర్ చెప్పింది. దానికి మానస్ ఎం మాట్లాడాలో తెలీక సైలెంట్ గా ఉన్నాడు. ఇక ఈ షోకి అమరదీప్ ఫాన్స్ వచ్చారు..రావడమే కాదు ఒక సర్ప్రైజ్ కూడా తెచ్చారు. " అన్నా అందరికి మీరు రన్నర్ కావొచ్చు కానీ మాకు మాత్రం మీరు విన్నర్...అమర్ అన్న తోపు..దమ్ముంటే ఆపు" అంటూ నినాదాలు చేశారు. తర్వాత "బుక్ ఆఫ్ విన్నర్" అనే టైటిల్ తో పబ్లిష్ చేసిన ఒక బుక్ ని  అమరదీప్ చేతుల మీదగా రిలీజ్ చేయించారు ఆయన ఫాన్స్ . "ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మీద ఒక బుక్ వచ్చిందంటే మా తమ్ముడు నిజంగా సాధించాడురా " అంటూ శ్రీముఖి పొగిడేసింది.    

కూతురి పేరు రివీల్ చేసిన అర్జున్...శోభా లవర్ ఫ్యూచర్ ఫినిష్

అంబటి అర్జున్ బుల్లితెర మీద సీరియల్స్ లో నటిస్తూ అందరినీ అలరిస్తూ ఉంటాడు. అలాంటి అర్జున్ ఇంటికి త్వరలో ఒక బేబీ రాబోతోంది. ప్రస్తుతం అంబటి అర్జున్ వైఫ్ సురేఖ ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్‌లో భాగంగా అర్జున్‌ను చూడడం కోసం బిగ్ బాస్ మేకర్స్  హౌస్‌ లోకి  సురేఖని పంపించారు అలాగే అక్కడే సురేఖ సీమంతాన్నిచేశారు. లేడీ హౌస్‌మెట్స్ అందరూ  సురేఖకి చీర, పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి అక్షింతలు వేసి దీవించారు. ఇప్పుడు అర్జున్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వచ్చాడు . రాగానే శ్రీముఖి అర్జున్ కి ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది. అది ఓపెన్ చేసిన అర్జున్ కి అందులో పిల్లలు ఆడుకునే బొమ్మలు కనిపించాయి. "అబ్బాయి పుడితే ఈ పేరని, అమ్మాయి పుడితే ఈ పేరు అని అనుకుంటారు కదా మీరు ఏమైనా అనుకున్నారా" అని శ్రీముఖి అడిగేసరికి " ఆర్కా అని పేరుపెట్టాలని అనుకున్నాం. అర్జున్ లో ఏఆర్, సురేఖలో కేహెచ్ఏ కలిపి పెట్టుకుంటాం." అని చెప్పాడు. బాబు విషయం వచ్చేసరికి బాగా ఎమోషనల్ అవుతావు ఎందుకు అనేసరికి "ప్రెగ్నన్సీ టైంలో పేరెంట్స్ లేకపోయినా హజ్బెండ్ అనే అతను దగ్గర ఉండాలి అనుకుంటాడు. ఫస్ట్ ప్రెగ్నన్సీలో పక్కన లేను ..సో అది నాకు ఒక వన్ వీక్ బాధ అనిపించింది" అని చెప్పాడు అర్జున్. తర్వాత శోభా శెట్టితో పాటు ఆమె  లవర్ యశ్వంత్ స్టేజి మీదకు వచ్చి రెడ్ రోజ్ ఇచ్చి ఫింగర్ రింగ్ పెట్టి "నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు" అది విని శోభా కూడా షాకయ్యింది. "ఇతన్ని ఒప్పుకోవడానికి కారణం ఏమిటి" అని శ్రీముఖి అడిగేసరికి "బాగా కేరింగ్ గా చూసుకుంటాడు. అలాగే అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేసాను. అమ్మాయిల్ని కూడా ఎక్కువగా ఎవరినీ ఫాలో అవ్వడు..." అని శోభా ఆన్సర్ ఇచ్చేసరికి "బ్రో నీ ఫ్యూచర్ అర్ధమవుతోంది" అంటూ మానస్ కౌంటర్ ఇచ్చాడు.

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కి సన్నాహాలు స్టార్ట్

తెలుగు  బిగ్ బాస్  సీజన్ 7  పూర్తి కావడంతో.. బిగ్ బాస్ ఓటీటీ 2ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కి  కంటెస్టెంట్స్ ని కూడా  ఫైనల్ చేస్తున్నట్లు  సమాచారం.  ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’  పేరుతో 2022  ఫిబ్రవరీ నుండి మే వరకు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అయ్యింది. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2ను కూడా దాదాపు జనవరి, ఫిబ్రవరీలో ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఐతే కంటెస్టెంట్స్ లో సోషల్ మీడియా  స్టార్ బర్రెలక్క ఫైనల్ ఐనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్.. తనతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.  బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చి కొన్ని ఎపిసోడ్స్ వరకు తన పాటలతో  అందరినీ అలరించిన భోలే షావలి కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో రీఎంట్రీ ఇవ్వనున్నట్టు సోషల్ మిడిల్ లో ఒక న్యూస్ వైరల్ గా మారింది.  హీరోయిన్ రిచా, సింగర్ పార్వతి, హీరోయిన్ సోనియా, డ్యాన్స్ మాస్టర్ యశ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ భద్రం పేర్లు కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. నవాబ్‌ కిచెన్‌ తో  ట్రెండ్‌ అవుతోన్న మోయిన్ భాయ్‌ను కూడా బిగ్‌ బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.  సోషల్‌ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే వీళ్లంతా ఈ రెండేళ్లలో బుల్లితెర మీద, సోషల్ మీడియాలో మెరిసిన వాళ్ళు, మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నవాళ్ళే. ఇకపోతే రీసెంట్ గా ఎండ్ ఐన  బిగ్ బాస్  సీజన్ 7 సూపర్ హిట్ అయ్యింది. అందులోనూ  రైతు బిడ్డ టాగ్ తో  పల్లవి ప్రశాంత్ విన్నర్ గ సీరియల్ బ్యాచ్  అమర్ దీప్ రన్నర్ గ నిలిచారు . తెలుగులో సీజన్ 1 ఒకటే సెలబ్రిటీ షోగా అద్భుతమైన రేటింగ్ తో సాగింది . ఆ తరువాత సెకండ్ సీజన్  నుంచి సినిమా వాళ్లు.. సీరియల్స్ బ్యాచ్.. యాంకర్లు.. యూట్యూబర్లు , కామన్ మ్యాన్స్  రావడం మొదలుపెట్టేసరికి ఎవరెవరో ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. మరి ఈ  బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఎలా ఉంటుందో ఎవరెవరు వస్తారో తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాలి.

నా వల్ల మీ టైమ్ వేస్ట్ చేస్కోని ఉంటే క్షమించండి

బిగ్ బాస్ ద్వారా ఫేమస్ ఐన వ్యక్తి  సయ్యద్ సోహైల్ ర్యాన్ ...బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక కొన్ని మూవీస్ లో నటించాడు టాలెంటెడ్ యంగ్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు.  హీరోగా   ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఇందులో మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో సోహైల్ కనిపించాడు..ఇక ఇప్పుడు "బూట్ కట్ బాలరాజు" మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక రీసెంట్ గా ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఇక దానికి ఒక లాంగ్ కాప్షన్ పెట్టాడు.  "ఓషన్  అంటే సముద్రం..అందులో ఫుల్గా నీళ్లుంటాయి..ఆ నీటి మొత్తంలో ఉప్పు ఉంటుంది...ఈ  సముద్రం పక్కన బూట్‌కట్‌ బలరాజులు ఉన్నారు ఒక్కటి నేను ఇంకోకటి నా ఫ్రెండ్ ..మంచోడే వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు ...ఎందుకో తెలియదు. అసలు ఈ సముద్రాన్ని చూస్తూ  ఏం ఆలోచిస్తున్నామో ఏం సాధించామో అర్థం కాలే... కానీ ఈ పిక్స్ మాత్రమే బాగా వచ్చాయి  అని పోస్ట్ చేస్తున్న..,ఇది చదివి మీరు  ఒక్క నిమిషం టైమ్ వేస్ట్ చేస్కోని ఉంటే క్షమించండి . " అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఫన్నీ పోస్ట్ పెట్టాడు "బాడీ పెంచుతా ఇక..ఆగేది లేదు...ఈ బూట్ కట్ బాలరాజు ప్రొమోషన్స్ అయ్యి రిలీజ్ అయ్యాక న్యూ అవతార్ చూస్తారు. అలా వంద సార్లు అనుకున్నాం అంతే ఇప్పటికీ ఐతలేదు " అని పెట్టాడు. ఇక ఈ బూట్ కట్ బాలరాజు మూవీలో ఇంద్రజ కూడా ఒక కీరోల్ లో నటించారు.  

నీ కార్ లో ఎయిర్ బాగ్ లేదా .. ఐతే ఇది వేస్ట్ కార్

గుప్పెడంత మనసు సీరియల్ అంటే చాలు యూత్ అంతా మై హార్ట్ ఈజ్ బీటింగ్ అనే సాంగ్ వేసుకుంటారు. అందులో రిషి సర్, వసుకి ఎంత మంది ఫాన్స్ ఉన్నారో అంతేమంది ఫాన్స్ కొత్త రోల్ అనుపమకు, మహేంద్ర భూషణ్ కి కూడా ఉన్నారు. ఇక మహేంద్ర భూషణ్ గా సాయి కిరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేసే వెరైటీ  రీల్స్ కి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. సాయికిరణ్ చేసే రీల్స్ అన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒక రీల్ ని పోస్ట్ చేశారు. అది మంచి ఫన్నీగ ఉంది. సీరియల్ జగతి రోల్ పూర్తయ్యాక ఎంట్రీ ఇచ్చిన అనుపమతో ఈ వీడియో చేసాడు. సాయికిరణ్ తన కొత్త కార్ ని నీట్ గా తుడుచుకుంటూ ఉంటాడు. ఇంతలో అనుపమ వచ్చి "కొత్త  కారా" అనేసరికి "అవును మొన్ననే తీసుకున్నా" అన్నాడు సాయికిరణ్. "బాగా క్లీన్ చేస్తున్నారు" అని అను అనేసరికి సిగ్గుపడిపోతూ "థ్యాంక్యూ" అని చెప్పాడు. "నేను డ్రైవ్ చేసి చూడాలి" అని అను అడిగేసరికి "మీకు డ్రైవింగ్ రాదు కదా"  అని అడిగాడు సాయికిరణ్. "ఎవరు చెప్పారు లాస్ట్ మినిట్ లో నేర్చుకున్నా, బాగా డ్రైవ్ చేస్తాను" అని అను చెప్పింది. "ఓహ్ నేర్చుకున్నారా" అని ఆశ్చర్యపోయాడు సాయి కిరణ్. "ఐతే ట్రై  చేయండి..బాగుంటుంది " అని ఇద్దరూ కార్ లో కూర్చుకున్నారు. "ముందుగా  హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి" అనేసరికి "ఒహ్హ్ అది రివర్స్ బ్రేక్ కదా" అని టెన్షన్ పడిపోయాడు సాయికిరణ్. అన్నట్టుగా కార్ రివర్స్ లో వెనక్కి  వెళ్ళిపోయింది దాని గురించి ఏమీ  ఫీల్ కాకుండా "ఇందులో ఎయిర్ బాగ్ లేదు ఐతే ఇది వేస్ట్ కార్" అని సింపుల్ గా కార్ ని వదిలేసి వెళ్ళిపోయింది అనుపమ. అసలు అక్కడ ఎం జరిగిందో అర్ధం కాకా సాయికిరణ్ నోరెళ్లబెట్టాడు. ఈ వీడియో ఫాన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది.  

భార్యని కాపాడుకోడానికి భర్త ధైర్యం చేయగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.  ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-959 లో.. శైలేంద్రకి వసుధార కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడం ఫణీంద్ర వింటాడు. ఇక అదేంటో తెలుసుకోవాలని కాలేజీకి వస్తాడు ఫణీంద్ర. అప్పటికే ఏదో ఆలోచిస్తున్న వసుధార దగ్గరికి ఫణీంద్ర వస్తాడు. శైలేంద్ర మీద నీకు, మహేంద్రకి ఎందుకు అనుమానమొచ్చింది వాడే తప్పు చేయడు.. నాది గ్యారెంటీ.. శైలేంద్రతో లెటర్ కూడా రాసి తీసుకొచ్చానని చెప్పి వసుధారకి ఆ లెటర్ ని ఇస్తాడు. ఇక మీదట శైలేంద్ర మీ జోలికి రాడని వసుధారతో ఫణీంద్ర చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరోవైపు అనుపమ, మహేంద్ర ఒక దగ్గర ఉండి మాట్లాడుకుంటారు. రిషి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియట్లేదని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. ఏమీ కాదని ధైర్యంగా ఉండమని అనుపమ చెప్తుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి వసుధార వస్తుంది. ఏం అయిందని‌ మహేంద్ర అంటే ఫణీంద్ర సర్ లెటర్ ఇచ్చాడు. శైలేంద్ర వల్ల రిషికి ఏం కాదని చెప్పాడని వసుధార అంటుంది. ఇక మహేంద్ర ఎమోషనల్ అవుతూ.. కన్నకొడుకు పాశం అన్నయ్యని ఆలోచింపచేయనిది. మనందరిని మాయచేసిన శైలేంద్ర అన్నయ్యని మాయచేయలేడా అని మహేంద్ర అంటాడు. అదేం ఉండదు.. చట్టం ముందు అందరు సమానమే.. నేరం చేస్తే ఎవరైన శిక్ష అనుభవించాల్సిందేనని వసుధార, మహేంద్రలతో అనుపమ అంటుంది‌. మరోవైపు ఇద్దరు ముసలి వాళ్ళు రిషికి నాటు వైద్యం చేస్తుంటారు. రిషి మెలుకవలోకి వచ్చి.. నేను ఇక్కడి ఎలా వచ్చాను అని అడుగుతాడు. అక్కడ దూరంలో చెట్ల పొదలలో గాయాలతో పడి ఉన్న నిన్ను చూసి ఇక్కడికి తీసుకొచ్చి మాకు తెలిసిన నాటువైద్యం చేస్తున్నామని ముసలివాళ్ళు చెప్తారు. మధ్యమధ్యలో వసుధార అంటూ అరుస్తున్నావ్ ఎవరు ఆ పోరీ అని అడుగుతారు. ఆ దేవుడు మా ఇద్దరి కోసమే మీ ఇద్దరిని పంపించాడని వారితో రిషి చెప్తూ ఎమోషనల్ అవుతాడు. ఇక కాసేపటికి శైలేంద్ర పంపిన రౌడీలు రిషి కోసం ఆ ముసలివాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ ఒకడు గాయాలతో ఉన్నాడు కనిపించాడా అని అడుగుతారు. మాకేం తెలియదని ఆ ముసలి వాళ్ళు బయపడుతూ చెప్పేసరికి వారికి డౌట్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళింట్లోకి వెళ్ళి వెతుకుతుంటారు.‌ఇక రిషి గోడపక్కన దాక్కుంటాడు. అంతా వెతికి రిషి లేడని రౌడీలు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రిషిని చూసిన ఆ ముసలివాళ్ళిద్దరు మళ్లీ పడుకోబెడతారు. కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని రిషితో ఆ ముసలివాళ్ళు చెప్తారు. మరోవైపు భద్ర కొత్త ప్లాన్ వేస్తాడు. ఒక ఖర్చీఫ్ మీద మత్తుమందు చల్లి వసుధారకి ఇవ్వాలనుకుంటాడు. ఇక తరువాయి భాగంలో వసుధారని శైలేంద్ర మనుషులు బలవంతంగా రిషి ఉన్న ఇంటి దగ్గరికి వచ్చి.. డోర్ కొడుతూ రిషిని బయటకు రమ్మని బెదిరిస్తుంటారు. నువ్వు బయటకు రాకుంటే ఈ వసుధార ప్రాణాలతో మిగలదని బెదిరిస్తారు. ఇక లోపల ఉన్న ముసలివాళ్ళు వద్దు బాబు అని చెప్తుంటారు. మరి రిషి ప్రాణలను లెక్కచేయకుండా బయటకు వచ్చాడా? వసుధారని ప్రాణాలతో కాపడుకున్నాడా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi:అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిన అప్పు.. రాహుల్ చెంప చెల్లుమనిపించిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -292 లో... అప్పు, కళ్యాణ్ తో డాన్స్ చేసి కళ్యాణ్ ని హగ్ చేసుకొని ఐ లవ్ యు అని చెప్తుంది. దాంతో కళ్యాణ్ తో పాటు అందరు షాక్ అవుతారు. అది విని అనామిక వాళ్ళ అమ్మ వచ్చి కళ్యాణ్ దగ్గర నుండి అప్పుని లాగుతుంది. ఫ్రెండ్ అని చెప్తూ నాకు కాబోయే అల్లుడిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నావని అంటుంది. అ తర్వాత అ విషయంలో రుద్రాణి కలుగుజేసుకొని.. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ దొరికింది ఛాన్స్ అని కనకాన్ని తిడుతుంది. అలా తన తల్లిని తిడుతుందని స్వప్న, కావ్య ఇద్దరు కలిసి రుద్రాణిని కోప్పడతారు. ఆ తర్వాత కళ్యాణ్ మధ్యలో కలుగుజేసుకొని మీరు అందరు ఏ కాలంలో ఉన్నారు. ఇప్పుడు ఐ లవ్ యు అనే పదం అందరు చెప్పుకుంటున్నారు. మేమ్ మంచి ఫ్రెండ్స్ అంతే అని కళ్యాణ్ అందరికి క్లారిటీగా చెప్తాడు. కాసేపటికి మళ్ళీ సంగీత్ మొదలు పెడతారు. రాజ్ , కావ్య ఇద్దరు డాన్స్ చేస్తి అందరిని అలరిస్తారు. మరొకవైపు స్వప్న, కనకం ఇద్దరు అరుణ్ దగ్గరకీ వెళ్తుంటే అప్పుడే మురళి చూసి వాళ్ళని ఫాలో అవుతాడు. వాళ్లే అరుణ్ ని కిడ్నాప్ చేసాడని రాహుల్, రుద్రాణీలకి దగ్గరికి చెప్పి అరుణ్ దగ్గరకి తీసుకొని వస్తాడు. వీళ్లే అరుణ్ ని కిడ్నాప్ చేశారని అందరు ఎలా నమ్ముతారని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న తాగుబోతు స్వప్న, కనకం ఇద్దరు అరుణ్ ని కిడ్నాప్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తాడు. ఆ వీడియోని రుద్రాణి చూస్తుంది. ఆ తర్వాత రుద్రాణి వెళ్లి అందరికి ఆ వీడియో చూపిస్తోంది. అందరు కనకాన్ని తప్పు పడతారు. కానీ అరుణ్ ని బెదిరించి అందరి ముందుకి పద్మావతి తీసుకొని వస్తుంది. నిజం చెప్పు అని పద్మావతి బెదిరిస్తుంది అంతే కాకుండా రాజ్ , విక్కీ లు సైతం అరుణ్ ని బెదిరించడంతో.. ఎక్కడ తన పేరు చెప్తాడో అని రాహుల్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత  అరుణ్  తప్పుని ఒప్పుకుంటాడు. మా తర్వాత నేను హాస్పిటల్ పెడుదామని అనుకుంటున్నాను. ఆ డబ్బులు స్వప్నని బ్లాక్ మెయిల్ చేసి తీసుకోవాలని అనుకున్నాను అందుకే అలా చెప్పాను కానీ స్వప్న కడుపులో పెరుగుతున్న బిడ్డకి రాహులే తండ్రి అని అరుణ్ చెప్తాడు. అ తర్వాత రాహుల్ చెంప పగులగొడుతుంది స్వప్న. తప్పు మీరు చేసి నా గురించి తప్పుగా మాట్లాడావని రాహుల్, రుద్రాణికి స్వప్న  స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. కాసేపటి తర్వాత రాహుల్ , రుద్రాణి, మురళి వాళ్ళు  జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు. తరువాయి భాగంలో అప్పు ప్రేమిస్తున్న విషయం అందరికి తెలుస్తుంది. అప్పు కూడా నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నానని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఏమిటి రోజు రోజుకు నువ్వు ఆర్జీవీలా తయారవుతున్నావ్!

విజయవాడలో పుట్టిన మంగళంపల్లి శ్రీసత్య అంటే  చాలా మందికి తెలియకపోవచ్చు కానీ బిగ్ బాస్ శ్రీసత్య అంటే తెలిసిపోతుంది. విజయవాడలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసిన శ్రీసత్య హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. అక్కడే తన కెరీర్ స్టార్ట్ చేసింది. బుల్లితెరపై అవకాశాల కోసం వెతుకుతున్న టైములో  వెండితెర ఛాన్స్ వచ్చింది. "నేను శైలజ" మూవీలో  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి బాగా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 6లో  యాక్టివ్ గా యాక్టివ్ గా ఉంటూ  చికెన్ కావాలంటూ  ఆమె చేసిన అల్లరి ఆడియన్స్ ఎవరూ మర్చిపోలేదు.  ఆ తరువాత శ్రీసత్య కొన్ని టీవీ షోస్ లో సందడి చేసింది.  గతంలో కొన్ని  సీరియల్స్ లో చేసింది శ్రీ సత్య. ఐతే ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద కాన్సంట్రేషన్ చేసింది.  'డీజే టిల్లు 2'లో కనిపించనున్నట్లు ఆ మూవీ షూటింగ్ కూడా పూర్తయ్యింది అని అలాగే మరో మూవీ షూటింగ్ కి అమెరికా వెళుతున్నట్లు చెప్పింది. ఐతే ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేసింది. మన్మధుడు మూవీలో నాగ్ చెప్పే పెళ్లి సలహాని రీల్ గా చేసింది.."ఒక్క విషయం విను సుబ్బారావు..పెళ్లంటే నూరేళ్ళ పంట కాదు ఎవ్రీ డే మంట" అని చెప్పింది శ్రీసత్య. ఇక ఆ వీడియోకి నెటిజన్స్ చాల కామెంట్స్ పోస్ట్ చేశారు. "ఏమిటి రోజు రోజుకు నువ్వు ఆర్జీవీలా తయారవుతున్నావ్ ... మేకప్ లేకుండానే బాగున్నావ్. మిమ్మల్ని చేసుకుంటే మాత్రం చికెన్ పంట వేయాల్సిందే వచ్చేవాడు " అంటూ వెరైటీగా రెస్పాండ్ అవుతున్నారు. "తొందర పడకు సుందర వదనా సీజన్ 1 & 2 "సిరీస్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. జోయాలుక్కాస్ జ్యువెలరీ, కృష్ణ జ్యువెలర్స్ లాంటి   బ్రాండ్‌ల ఫోటోషూట్స్ లో  కూడా కనిపించింది ఈ అమ్మడు.  

Krishna Mukunda Murari:భవానికి సవాలు విసిరిన మురారి.. ఏం జరుగనుందో తెలుసా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -353 లో.. కృష్ణకి కాలు బెణికి నడవరాకపోవడంతో స్వయంగా మురారీనే తన కాలుకి మసాజ్ చేస్తూ తన దగ్గరే ఉంటాడు. మురారి తనని ప్రేమగా చూసుకోవడం చూసి కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెద్దమ్మకి ఈ విషయంలో నీ ప్రమేయం ఏమి లేదని తెలిస్తే ఆదర్శ్ ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుందని, ఏం టెన్షన్ పడకని మురారి చెప్తాడు. మరొకవైపు దేవ్ ఇంకా రావడం లేదని ముకుంద టెన్షన్ పడుతుంది. అప్పుడే దేవ్ వస్తాడు. ఎందుకు ఇంత లేట్ అయిందని ముకుంద అడుగుతుంది శ్రీనివాస్ కాల్ చేసాడని అనగానే.. ఎవరైన కన్నతండ్రిని పేరు పెట్టి పిలుస్తారా అని ముకుంద అనగానే.. కన్నతండ్రిగా నీకు ఏం చేశాడని దేవ్ అడుగుతాడు. తను సక్రమంగా చేస్తే నేను ఇదంతా చేసే అవసరం ఉండేది కాదని దేవ్ అంటాడు. ఆ తర్వాత ముకుంద టెన్షన్ పడుతుంటే.. ఏం టెన్షన్ పడకు అని చెప్తాడు. మురారిని మాటల్లో పెట్టి మురారి రాకుండా చూడు మిగతాది నేను మ్యానేజ్ చేస్తానని దేవ్ అంటాడు. అసలు మురారి నా మాట వింటాడా అని ముకుంద అనగానే.. నువ్వు మురారిని ప్రేమిస్తున్నావ్. ఎందుకు మాలాగా ఎప్పుడు అతనికి దూరంగా ఉంటావ్. అతను ఎంత మంచి వాడైన మగాడు ఇంతకు మించి నేను ఎక్కవ ఏమి చెప్పలేనని ముకుందతో దేవ్ చెప్తాడు. మరొకవైపు నందు, రేవతి కలిసి కృష్ణ, మురారీల గురించి మాట్లాడుకుంటు ఉంటే అప్పుడే మురారి వస్తాడు. నిన్ను పెద్దమ్మ రమ్మని చెప్పిందని మురారికి రేవతి చెప్తుంది. ఆ కృష్ణని ఇంట్లోకి రావద్దని చెప్తుంది కావచ్చని రేవతి అనగానే.. అలా ఎలా చెప్తుంది నేను ముందే చెప్పాను కదా.. కృష్ణ ఇంట్లోకి వస్తుందని అని మురారి అంటాడు. అ తర్వాత భవాని దగ్గరకి మురారి వెళ్తాడు. అప్పుడు మురారి గతం మర్చిపోయినప్పుడు తను పడ్డ బాధని గురించి మురారి చెప్తు ఏడుస్తుంది. నువ్వు బాధపడడానికి కారణం అయిన వాళ్ళని మాత్రం వదిలి పెట్టనని మురారి అంటాడు. నీకు వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళని శిక్షించడం నీకు నిమిషాలలో పని కానీ నువ్వు అది చెయ్యట్లేదని భవాని అంటుంది. కృష్ణ ఏం తప్పు చేయలేదని తెలిస్తే నువ్వు గెలిచినట్లేనని మురారి అంటాడు. మరొకవైపు నందు, రేవతి దగ్గరకి కృష్ణ వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత దేవ్ వస్తాడు.  కృష్ణని దేవ్ కిట్టమ్మ అని పిలుస్తాడు. అలా పిలువడంతో మా నాన్న,  చిన్నాన్న‌ కూడా అలాగే పిలిచేవాళ్ళని కృష్ణ అంటుంది. దేవ్ అన్నయ్యని మధు ఎందుకు అపార్థం చేసుకుంటున్నాడని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ అన్ని సీజన్లలో అత్యధిక టీఆర్పీ సీజన్-7 కే!

బిగ్ బాస్ సీజన్‌ సెవెన్ ఎంత గ్రాంఢ్ గా హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే దీనికి కారణం ఎవరు? కంటెస్టెంట్సా? హోస్ట్ నాగార్జున వల్లనా? వీటితో పాటు గ్రాంఢ్ పినాలే టీఆర్పీ ఎంత వచ్చిందని ఎందరో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ 7 మాత్రం నేషనల్ లెవల్‌లో తలెత్తుకునే రేటింగ్‌ని రాబట్టిందనే అందరికి తెలిసిన నిజం. డిసెంబర్ 17 ఆదివారం నాడు జరిగిన బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌‌ 21.7 TVR రేటింగ్ సాధించి సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది. ఈ సీజన్ మొదలైనరోజు నుండి ఉల్టా పుల్టా అంటు భారీ హైప్ క్రియేట్ చేసాడు హోస్ట్ నాగార్జున.  ఇక ఆరో సీజన్‌కి బిగ్ బాస్ హిస్టరీలోనే ది వరస్ట్ రేటింగ్‌లు రావడంతో.. ఫినాలే ఎపిసోడ్ రేటింగ్‌లను కూడా ప్రకటించలేదు. ఫినాలే వీక్‌లో అత్యల్పంగా 0.86 రేటింగ్ సాధించిందంటే.. ఆ సీజన్ ఎంత వరెస్ట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు ఏ భాషలోను ఇంత దారుణమైన రేటింగ్ నమోదు కాలేదు. వీకెండ్‌లో 3.62.. వీక్ డేస్‌లో సరాసరి 2.33గా రేటింగ్ వచ్చేది. సీరియల్స్ రేటింగ్ కంటే తక్కువ రావడంతో.. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే రేటింగ్స్‌ని ప్రకటించనేలేదు. ఈ బిగ్ బాస్ సీజన్-7 తాజా రేటింగ్స్ ప్రకారం.. 21.7 TVR రేటింగ్స్‌ని సాధించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సీజన్ 4కి సరిగ్గా 21.7 రేటింగ్ వచ్చింది. ఇప్పటివరకు ఇండియాలో జరిగిన ఏ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి రానంత వ్యూవర్ షిప్ అభిజిత్ విన్నర్ అయిన సీజన్-4కి వచ్చింది. మళ్ళీ అదే రేటింగ్ ఈ సీజన్-7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాక వచ్చింది. అసలు ఏలా ఇంత హిట్ అయిందంటే.. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లో అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి ఉన్నారు. యాక్టర్ శివాజీ, కామన్ మ్యాన్ క్యాటగిరీలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఇక వచ్చిన మొదటి వారంలోనే రైతుబిడ్డని టార్గెట్ చేసి సెలబ్రిటీ లిస్ట్ లో ఉన్నవాళ్ళంతా నామినేషన్ చేయడంతో.. ఆ హీటెడ్ ఆర్గుమెంట్స్ లో రైతులు వర్సెస్ బిటెక్ స్టూడెంట్స్ అనే ఇష్యూ బయటకు రావడంతో అది రెండు రాష్ట్రాలలో విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. దానితో పాటు యాక్టర్ శివాజీ ఫెయిర్ అండ్ క్లీన్ గేమ్ స్ట్రాటజీ, యావర్ అటిట్యూడ్, రైతుబిడ్డ ప్రశాంత్ టాస్క్ లలో వందకి వంద శాతం కష్టం.. కార్తీక దీపం మోనిత నటవిశ్వరూపం, టేస్టీ తేజ కామెడీ, ఆట సందీప్ స్ట్రాటజీ, అమర్ దీప్ ఫౌల్ గేమ్స్ ఆడటం, రతిక లవ్ ట్రాక్,  శుభశ్రీ రాయగురు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పడం, అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్ కృష్ణ చెప్పడం, సీరియల్ బ్యాచ్ కి  భోలే  షావలి  ఇచ్చిన మాస్ పంచ్ లు..  ఇలా చెప్పుకుంటు పోతే అన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఈ సీజన్ గ్రాంఢ్ గా హిట్ అయింది. అత్యధిక టీర్పీతో దూసుకెళ్లింది.‌ ఇక ఈ సీజన్ టీఆర్పీని స్టార్ మా అఫీషియల్ సైట్ లో తెలిపారు.   

అసలు పాత తెలుగు పాటలు కూడా వింటారా.. నేను వింటాగా!

జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైన మైన, చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, ప్రియా ప్రియతమా రాగాలు,  మాటే రానీ చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి... ఈ పాటలన్నీ ఇప్పటి తెలుగు సినీ లవర్స్ కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ 90's  లోని తెలుగు సినిమా అభిమానులకి ఈ పాటలు‌ ఎంతో‌ సుపరిచితం. ఎందుకంటే అప్పటి పాటల్లో సాహిత్యం అంత బాగుండేది.‌ ఇక ఇప్పుడు పాప్, వెస్టర్న్, రిథమ్, రీమిక్స్, అంటూ మ్యూజిక్ పై దృష్టి పెట్టి పాటలని యువతను ఆకట్టుకునేలా చేస్తున్నారు.  వేటూరి, సినారే, బాపు, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతోమంది పాత సినిమాలలోని పాటలకి ఓ అర్థాన్నిస్తూ గొప్పతనాన్నిచ్చారు. అయితే ఇప్పుడు ఆనాటి హిట్ సాంగ్స్ ని మళ్ళీ ట్రెండింగ్ లోకి తెచ్చారు ఇన్ స్టాగ్రామ్ లోని సెలబ్రిటీలు. " అసలు పాత తెలుగు‌ పాటలు కూడా వింటారా.. నేను వింటాగా " అంటూ సాగే ఈ ట్యాగ్ లైన్ కి వెనకాల తమ ఫేవరెట్ పాత పాటలని జోడించి, తమ ఫోటోలని కూడా జతచేయొచ్చు. జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తిక్  తన ఇన్ స్టాగ్రామ్ స్టాటస్ లో చుక్కలు తెమ్మన్నా తెంపుకురానా అంటూ పాతపాటని ఆడ్ చేసుకున్నాడు. జిలిబిలి పలుకల చిలిపిగ పలికిన అంటూ సావిత్రి తన ఫోటోతో ఈ పాత పాటని ఆడ్ చేసుకుంది. సుందరి నేనే నువ్వంట చూడని  నీలో నన్నంట అనే పాత పాటని బిగ్ బాస్ సీజన్‌ సెవెన్ కంటెస్టెంట్ నయని పావని ఆడ్ చేసుకొని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.  మౌనమేలనోయి ఇది మరుపురానీ రేయి అంటూ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ ఆరోహీరావ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వేవేల గొపెమ్మల మా మువ్వా గోపాలుడే, నా ముద్దు గోవిందుడే అంటూ రోహిణి తన పేజ్ లో పాత పాటని షేర్ చేసింది. కమ్మని నీ ప్రేమ లేఖలే,‌ కన్నుల్లో నీ రూపమే,  నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా అంటు ఇలా అందరు ట్రెండ్ ఫాలో అవుతుంటే దీప్తి సునైన తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. యువత ఎప్పుడు ట్రెండింగ్ ని ఫాలో అవుతుంటారు. అదే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోని సెలబ్రిటీలంతా ఫాలో అవుతున్నారు.‌ ఏదైతేనేం పాత సినిమాలని, అందులోని పాటలని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారంటు మరికొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. 

మానవత్వాన్ని చాటుకున్న ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్!

కొందరు సెలబ్రిటీలు సోసైటీలో మంచిపేరు తెచ్చుకోవాలని, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం కొన్ని మంచి పనులు చేస్తుంటారు. అయితే మరికొందరు అలాంటివేం ఆశించకుండా సహాయం చేస్తుంటారు. అలాంటివారిలో బుల్లితెర, వెండితెర ఫేమస్ యాంకర్ సుమ ఉండగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి తాజాగా జ్యోతిరాజ్ చేరింది. ఆటసందీప్ తో కలిసి జ్యోతిరాజ్ 'ఆట' డ్యాన్స్ షోలో‌ కో డ్యాన్సర్ గా చేసి టైటిల్ గెలుచుకుంది.  ఆట డ్యాన్స్ షో టైటిల్ గెలుచుకున్నాక ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు జ్యోతిరాజ్ ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నీతోనే డ్యాన్స్ షోలో భర్త సందీప్ తో‌ కలిసి పాల్గొంది‌. అందులో వీరిద్దరు కలిసి అదరహో అనిపించేలా డ్యాన్స్ చేసి విజేతలుగా నిలిచారు. ఇక ఈ షో తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆట సందీప్. అయితే సీజన్ సెవెన్ మొదలయ్యే ముందు వీరిద్దరు కలిసి వెళ్తారని అనుకున్నారంతా కానీ ఆట సందీప్ ఒక్కడే వెళ్ళాడు.‌ ఇక బయట ఉన్న జ్యోతి రాజ్ తన భర్త కోసం బాగా ఫైట్ చేసింది‌. తన భర్తకి సపోర్ట్ చేయండి అంటూ పోస్ట్ లు చేస్తూ ఎంకరేజ్ చేసింది. ఇక ఆట సందీప్ లోపల ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తో గొడవ జరిగింది. అయితే మొదట్లో వీరికి గొడవ జరిగిన ఆట సందీప్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఎవరేంటని ఆట సందీప్, జ్యోతిరాజ్ తెలుసుకున్నారు. హౌస్ లో ప్రియాంక, శోభాశెట్టి, అమర్ దీప్ లు కలిసి గ్రూప్ గా ఆడుతున్న విషయం గ్రహించి రైతుబిడ్డ ప్రశాంత్ జెన్యున్ ప్లేయర్ అని అతనికి సపోర్ట్ గా నిలిచారు.  సీజన్ సెవెన్ టైటిల్ గెలిచాక జైలుకెళ్ళిన ప్రశాంత్ కి ఇద్దరు సపోర్ట్ గా నిలిచారు.  ఇక ప్రస్తుతం జ్యోతిరాజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ ని షేర్ చేసింది. ‌ఇందులో వీధుల్లో, ఆరుబయట, రోడ్ల పక్కన పడుకునే వారికి, ఏమీ లేనివారికి సహాయం చేసింది. ఇది చలికాలం కాబట్టి వారికి కప్పుకోవడానికి దుప్పట్లు ఇచ్చింది జ్యోతిరాజ్. నేనేం గొప్ప పని చేయట్లేదు. నాకు ఉన్నదానిలో‌‌ ఇలా సహాయం చేస్తున్నానంటూ దుప్పట్లు పంచింది జ్యోతి రాజ్. మీ ఇంట్లో పాత దుప్పట్లు ఉంటే ఇలా చలిలో పడుకునేవారికి, ఏమీ లేనివారికి ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చింది జ్యోతిరాజ్.‌ తను చేసే చిన్న సాయం చూసి మరికొంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారనే ఆశయంతో జ్యోతిరాజ్ చేసిన ఈ పనికి నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.‌ కాగా మానవత్వాన్ని చాటుకున్న జ్యోతిరాజ్ చేసిన ఈ సాయాన్ని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

కుక్క మీద కూర్చున్న క్యూటీ ..వాట్ ఏ నాటీ గర్ల్

ఐస్ క్రీం మూవీ  హీరోయిన్ తజస్విని మాదివాడ బిగ్ బాస్ బ్యూటీగా నాటీ గర్ల్ గా అందరికీ బాగా తెలుసు.. ఈమె  కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే వంటి మూవీస్ లో నటించి తన అందాలతో అదరగొట్టింది. అలాగే "అర్దమయ్యిందా అరుణ్ కుమార్" అనే  వెబ్ సిరీస్‌ లో నటించి కేక పుట్టించింది. సినిమాల కంటే బిగ్ బాస్ షో వల్ల చాలా పాపులర్ అయ్యింది తేజస్విని.  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్ లో నటించింది...అలాగే కొన్ని తమిళ్ మూవీస్ లో కనిపించింది. బిగ్ బాస్ తర్వాత కొన్ని డాన్స్ షోస్ లో కూడా తేజు కనిపించింది. ఇక ఇప్పుడు ఆమె తన బాడీ మీద చాలా శ్రద్ద పెట్టింది. జిమ్ కి వెళ్లి బాడీని మంచి షేప్ లోకి తెచ్చుకుంది. ఇక ఆ బాడీతో మంచి హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఫాన్స్ కి కిక్కెక్కిస్తోంది. ఇక ఇప్పుడు రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన పిక్ వైరల్ అవుతోంది. ఎవరైనా గుర్రం మీదెక్కి రైడ్ చేయడం చూసాం..కానీ తేజు మాత్రం వెరైటీగా కుక్క మీదెక్కి ఎంచక్కా గిరగిరా తిరిగేస్తోంది. ఇక తన గదిలో ఉన్న అన్ని కుక్కలతో చాలా ఫ్రెండ్లీగా తన ప్రేమను కురిపించింది తేజు...ఐతే తేజు ఎం చేసిన వెరైటీగా ఉంటుందని అంటున్నారు ఫాన్స్.. ఇక ఇండస్ట్రీలో తేజస్వినికి నవదీప్ చాలా మంచి ఫ్రెండ్.  ఆర్జీవీ డైరెక్షన్లో  2014లో వచ్చిన "ఐస్ క్రీం" మూవీ అప్పట్లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ నుంచే నవదీప్, తేజస్వి మంచి ఫ్రెండ్స్ అయ్యారు.  ఐతే ఈ ఇద్దరికీ బుల్లితెర మీద  సినిమా అవకాశాలు తగ్గేసరికి  ఓటీటీపై ద్రుష్టి పెట్టి అక్కడ దూసుకుపోతున్నారు.  

ఆదిరెడ్డి హెల్ప్ తోనే అలాంటి ప్రశ్నలు అడిగేదాన్ని!

బిగ్ బాస్ అంటే చాలు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ని బయటకు వచ్చాక మరో యాంకర్ వంకటింకరగా, కాంట్రవర్సీగా ప్రశ్నలు అడిగే ఒక ప్రాసెస్ అనేదాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఐతే ఈ బిగ్ బాస్ సీజన్ 7  లో గలాటా గీతూ అలాగే హౌస్ మేట్స్ ని ఎన్నో ప్రశ్నలు అడిగింది. ఏ విషయాన్ని ఐనా ముఖం మీదే అడిగేసి కడిగేసి, కౌంటర్ వేసి మరీ  రచ్చ చేసేస్తుంది ఈ అమ్మడు. ఐతే ఆడియన్స్ అంతా కూడా ఈ గీతూనే ఈ క్వశ్చనీర్ ని ప్రిపేర్ చేసుకుంది అనుకున్నారు.. కానీ ఆ ప్రశ్నలు రాసుకుంది తానూ కాదనే విషయాన్నీ ఆ సీక్రెట్ ని ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఐతే బిగ్ బాస్ బజ్ స్టార్ట్ చేసే టైంకి వాళ్ళ అమ్మగారికి బాగోకపోవడం అలాగే తన పిల్లి పిల్లకు కూడా అనారోగ్యం పాలవడం వంటి విషయాలను అప్పట్లో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన విషయం మనకు తెలుసు. ఐతే ఈ టెన్షన్స్ మధ్య తనకు బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూడడం కుదరక తాను ప్రశ్నలను ప్రిపేర్ చేసుకోలేకపోయాను అని చెప్పింది. అందుకే తనకు ప్రశ్నలు రాసివ్వమంటూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6  ఆదిరెడ్డిని హెల్ప్ అడిగినట్లు చెప్పింది గీతూ. ఐతే ఆదిరెడ్డి విజయవాడలో తన సలోన్ నిర్మాణంలో ఎంతో బిజీగా ఉన్నా కూడా తనకు ప్రశ్నలను ప్రిపేర్ చేసి ఇచ్చేవాడని చెప్పింది.  ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కి కూడా హెల్ప్ అడగడంతో అందరి నుంచి తీసుకున్న క్వశ్చన్స్ నుంచి కొన్నిటిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని కంటెస్టెంట్స్ అడిగినట్లు చెప్పింది. ఆదిరెడ్డి రీవ్యూల కోసం షో మొత్తం ఫాలో అయ్యేవాడని కాబట్టి తనకు   ప్రశ్నలు రాసివ్వడం పెద్ద కష్టమయ్యేది కాదని అసలు సీక్రెట్ రివీల్ చేసింది గలాటా గీతూ.  

Guppedantha Manasu:ఆ సీక్రెట్ తెలిసిపోయిందిగా.. ఇక మొదలెడదామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -958 లో... భద్రకి డ్రైవర్ గా మహేంద్ర ఉద్యోగం ఇచ్చి ఇంటికి తీసుకొని వస్తాడు. అతన్ని అనుపమ, వసుధారలకి పరిచయం చేస్తాడు. అతను ఎక్కడ ఉంటాడని అనుపమ అడుగుతుంది. ఎక్కడో బయట ఉంటాడని మహేంద్ర అనగానే.. బయట ఎందుకు ఇక్కడే ఉండమని చెప్పమని అనుపమ చెప్తుంది. మరొకవైపు ఇప్పుడు నేను ఇంకొక రౌడీని పెట్టానని దేవయానికి శైలేంద్ర చెప్తాడు. ఇప్పటివరకు చాలా మంది రౌడీలను పెట్టావని దేవయాని అనగానే ఇప్పటివరకు వేరు ఇప్పుడు వేరు.. ఇప్పుడు ఏర్పాటు చేసిన రౌడీ మాములు రౌడీ కాదు అంటూ భద్ర గురించి దేవయానికి శైలేంద్ర గొప్పగా చెప్తుంటాడు. ఆ తర్వాత నువ్వు అలా చెప్తూ ఉంటే అతని గురించి తెలుసుకోవాలనిపిస్తుందని, అతని పేరేంటని దేవయాని అడుగుతుంది. చెప్పను మమ్మీ అది సీక్రెట్ అంటూ భద్ర గురించి దేవయానికి కూడా చెప్పడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరకి ధరణి వస్తుంది. ఏంటి మేమ్ కాఫీ తీసుకొని రమ్మని చెప్పకుండానే తీసుకొని వచ్చావని ధరణితో దేవయాని అంటుంది. నేను మీకు కాఫీ ఏం తీసుకొని రాలేదు.. ఇవి జస్ట్ ఖాళీ కాఫీ కప్ లు అక్కడ పెడుదామని తీసుకొని వచ్చానని ధరణి వాళ్లకి కౌంటర్ వేస్తుంది. మరొకవైపు వసుధారకి తెలియని నెంబర్ నుండి.. ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తావ్? ఎండీ సీట్ కావాలా? రిషి కావాలా అంటూ మెసేజ్ వస్తుంది. అ మెసేజ్ చూసి ఇది ఖచ్చితంగా శైలేంద్ర పంపి ఉంటాడని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత వసుధార గది దగ్గరకి ఎవరో వచ్చినట్లు అనిపించి బయటకు వెళ్తుంది. తీరా చుస్తే భద్ర ఉంటాడు. నువ్వు ఏంటి ఇక్కడ అని వసుధార డౌట్ గా అడుగుతుంది. వాటర్ కోసం వచ్చనని చెప్పగానే వసుధార వాటర్ ఇస్తుంది. మరొకవైపు రిషి స్పృహలోకి వచ్చి వసుధారని గుర్తుకు చేసుకుంటాడు. నాగురించి వసుధార ఎంత బాధపడుతుందో.. నేను పక్కన లేకుంటే తను నా గురించి అలోచిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నట్లు వసుధారకి ఎలాగైనా చెప్పాలని రిషి అనుకుంటాడు. మరొకవైపు వసుధార రాత్రి వచ్చిన మెసేజ్ గురించి ఆలోచిస్తుంటుంది. వెంటనే శైలేంద్రకి ఫోన్ చేస్తుంది. కానీ అ ఫోన్ ఫణీంద్ర లిఫ్ట్ చేస్తాడు. కానీ శైలేంద్ర లిఫ్ట్ చేసాడని వసుధార అనుకుని.. నువ్వు రాత్రి నాకు మెసేజ్ చేసావని నాకు తెలుసు. కాలేజీని మాత్రం నీ చేతులో పెట్టను అంటూ వార్నింగ్ ఇస్తుంది. వసుధార అని ఫణీంద్ర అనగానే.. వసుధార ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత శైలేంద్రని ఫణీంద్ర పిలిచి.. ఇందాక నీకు ఒక కాల్ వచ్చింది ఎవరు ఏంటి అని నీకు చెప్పను కానీ ఒకటి చెప్పు. ఎండీ సీట్ పై నీకు ఆశ ఉందా అని అడుగుతాడు. దానికి శైలేంద్ర కంగారుపడుతు లేదని అంటాడు అయితే ఎండీ చైర్ పై ఎలాంటి ఆశ లేదని నాకు ఒక లెటర్ రాసి ఇవ్వు అనగానే శైలేంద్రకి ఇష్టం లేకున్నా ఫణింద్రకి డౌట్ వస్తుందని రాసి ఇస్తాడు. మరొక వైపు ఫోన్ ఫణీంద్ర సర్ లిఫ్ట్ చేసాడు. ఏం అనుకుంటున్నారో అని వసుధార అనుకుంటుంది అప్పుడే ఫణింద్ర తన క్యాబిన్ కి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.