Krishna Mukunda Murari:ఆ క్లూ కనిపెట్టలేకపోయింది.. తన ఇంట్లోనే నలుగు పెట్టాలంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -359లో. జరుగుతున్న వాటికి మాకు ఏ సంబంధం లేదని తేలుతుంది కాబట్టి ఆ పెళ్లి ఆగిపోతుందని కృష్ణ కాన్ఫిడెంట్ గా చెప్తుంటే భవాని వింటుంది.  ఆ తర్వాత భవాని గదిలోకి వెళ్లి కృష్ణ మురారిలు మాట్లాడిన విషయాలు గుర్తుకుచేసుకొని ఒకవేళ నేనే తప్పు చేస్తున్నానా అని అనుకుంటుంది. మళ్ళీ నేనేం తప్పు చెయ్యట్లేదని అనుకుంటుంది. అ తర్వాత భవాని దగ్గరకి శకుంతల వచ్చి మీ ఆలోచనని మార్చుకోండని బ్రతిమిలాడుతుంది. అయిన భవాని కఠినంగా మాట్లాడుతుంది. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ నుండి వెళ్ళమని చెప్తుంది. దాంతో శకుంతల అక్కడ నుండి వెళ్లిపోతుంది. మరొకవైపు మురారికి తలనొప్పిగా ఉందని అనడంతో కృష్ణ వచ్చి మురారికి హెడ్ మసాజ్ చేస్తుంది. అప్పుడే శకుంతల వస్తుంది. శకుంతల బాధగా రావడం చూసి.. ఏమైందని కృష్ణ అడుగుతుంది. భవాని దగ్గరాకి వెళ్లిన విషయం చెప్తుంది. నువ్వు ఇంకొకసారి అలా వెళ్ళకని శకుంతలకి కృష్ణ చెప్తుంది. మరొకవైపు దేవ్ వేలికి ఉన్న రింగ్‌ ని ముకుంద చూసి ఎప్పుడు తీసుకున్నావని అడుగుతుంది. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందని దేవ్ చెప్తాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అంటుంది కానీ నాకు ఇంట్రస్ట్ లేదు. ఎప్పుడు బ్రేకప్ అవుతుందో తెలియదు. అడ్జెస్ట్ అవడం నా వాళ్ళ కాదని దేవ్ అంటాడు. అందరూ భోజనం చెయ్యడానికి వస్తారు. కృష్ణ , మురారి కూడా వస్తారు. దేవ్ భోజనం చేస్తుండగా తన వేలికి ఉన్నా రింగ్ చూసిన కృష్ణ షాక్ అవుతుంది. మళ్ళీ ఆ రింగ్ ఈ రింగ్ అయి ఉండదులే అనుకుంటుంది. రేపు ముకుంద, మురారీలకి నలుగు పెడుతున్నామని భవాని అంటుంది. ఆ తర్వాత ముకుందకి పెళ్లి చేస్తున్నారన్న హ్యాపీలో ఉన్నా కానీ నా చెల్లె కృష్ణకి అన్యాయం జరుగుతుందన్న బాధలో తిండి కూడా తినాలి అనిపించడం లేదని దేవ్ అంటాడు. ఏం అన్నావ్ కృష్ణ నీ చెల్లెలు అన్నావ్ కదా.. నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరికింది. నీ కృష్ణ చెల్లె ఇంట్లోనే ముకుందకి నలుగు పెడతానని భవాని అనగానే కృష్ణ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్లిపోతుంది. తన వెనకలే మురారి కూడా వెళ్తాడు. ఆ తర్వాత కృష్ణ బాధపడుతుంటే మురారి తన బాధని పోగొట్టేల మాట్లాడతాడు. తరువాయి భాగంలో ముకుంద, మురారీలకి నలగు పెడుతుంటారు. అప్పుడే శ్రీధర్ ని చంపిన వాళ్లలో ఒకరు దొరికారంట అని భవానికి మురారి చెప్తాడు. ముకుంద టెన్షన్ పడుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నా ఫస్ట్ క్రష్ ఇంటర్ అమ్మాయి...నేవీ జాబ్ అందుకే వదిలేసా

శ్రీహాన్ ఇంటర్ చదివే టైములో ఉన్న తన  ఫస్ట్ క్రష్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. కట్ చేస్తే ఆ అమ్మాయికి పెళ్ళైపోయి ప్రస్తుతం ఒక పాప కూడా ఉందని చెప్పాడు. ఇంటర్ లో ఉండగా ఇద్దరి మధ్య డీప్ లవ్ ఉండేదని ఐతే అది బ్రేకప్ ఐపోయిందని చెప్పాడు. "నేను ఆ అమ్మాయిని చూసిన విధానం వేరు ఆ అమ్మాయి నన్ను ఎలా చూసిందో తెలీదు. ఆ అమ్మాయే ముందుగా ప్రొపోజ్ చేసింది. మొదట్లో నో అని చెప్పాను కానీ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నేను చూడలేక కన్విన్స్ అయ్యి నేను ఓకే చెప్పాల్సి వచ్చింది. తర్వాత అసలు ఈమెకు నేను ఎందుకు ఓకే చెప్పానా అనే బాధ కలిగింది. నన్ను ఇష్టపడింది కానీ తన మనసులో ఇంకెవరో ఉన్నారు...ఐతే ఆ విషయం గురించి నాకు తెలీదు. ఒక రోజు వీధిలో ఆమెతో మాట్లాడుతూ వచ్చి మా నాన్నకు దొరికిపోయాను..రోడ్డు మీద కాబట్టి ఏమీ అనలేదు కానీ ఇంటికి వచ్చాక బాగా క్లాస్ పీకారు. నేను ఐటిఐ చేసాను మా నాన్న నేవీలో జాబ్స్ పడ్డాయి అప్లై చేయమంటే చేశా..జాబ్ వచ్చింది. ఉదయం జాబ్ చేసి  సాయంత్రం ఆడిషన్స్ కి వెళ్ళేవాడిని కానీ నాకు ఇంకా ఏదో కావాలి ఇది నా లైఫ్ కాదు అనిపించింది..నేవీలో జాబ్ చేస్తుండగా ఇక్కడ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యింది. దాంతో నేను చాలా టెన్షన్ పడేవాడిని..నేను జాబ్ రిజైన్ చేసేసి లాంగ్ లీవ్ అని ఇంట్లో అబద్దం చెప్పి హైదరాబాద్ లో వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ ఉన్నాను..చివరికి ఏడాదిన్నర తర్వాత ఇంట్లో విషయం తెలిసింది..పేరెంట్స్ కి జాబ్ సెక్యూరిటీగా అనుకుంటారు..ఇండస్ట్రీకి వస్తే పాడైపోతారు..లైఫ్ రిస్క్ అని అనుకుంటారు. కానీ నాకు లక్కీగా ఇక్కడ ఛాన్సెస్ చూసుకునే జాబ్ రిజైన్ చేశా కాబట్టి ఇంట్లో పెద్దగా ప్రాబ్లమ్ కాలేదు... నా అసలు పేరు అహ్మద్...ఆడిషన్స్ కి వెళ్ళేటప్పుడు నా పేరు విన్నవాళ్ళ ముఖాలు మారిపోవడం చూసా..ఐతే నా పేరుతో ప్రాబ్లమ్ ఉందని తెలిసి ఇంట్లో పేరు మార్చుకోవాలి అని చెప్పగానే మా నాన్నే నాకు శ్రీహాన్ అని పేరు పెట్టారు" అంటూ తన అసలు పేరును, స్క్రీన్ పేరుని, తన ఫస్ట్ లవ్ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు.

Brahmamudi:మాకు విడాకులు ఇష్టమేనని  చెప్పేసిన‌ వాళ్ళిద్దరు.. షాక్ లో భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -298 లో.. అనామిక చేసిన కాఫీ బాగోలేదని ఇంట్లో వాళ్ళు చెప్పలేక ఇబ్బంది పడిన కళ్యాణ్ మాత్రం నిర్మొహమాటంగా కాఫీ బాలేదని అనామిక మొహం మీదే చెప్పేస్తాడు. దాంతో అనామిక ఫీల్ అవుతుంది. అక్కడే ఉన్న రుద్రాణి.. ఈ కావ్య, స్వప్న ఇద్దరు ఎప్పుడు వంటింటి పనులు చేసుకుంటు పెరిగారు. నువ్వు సుకుమారంగ పెరిగావ్. నీకు ఈ పనులు రావు కదా నువ్వేం ఫీల్ కాకంటూ అనామికతో రుద్రాణి చెప్తుంది. మరొకవైపు రాజ్ కి శ్వేత ఫోన్ చేయడంతో కంగారుగా రాజ్ గదిలోకి వెళ్తాడు. అ తర్వాత కావ్య వెళ్లి అందరికి కాఫీ చేసుకొని తీసుకొని వస్తుంది..అందరు కావ్య ఇచ్చిన కాఫీని మెచ్చుకుంటు ఉంటే అనామికకి కోపం వస్తుంది. మరొకవైపు శ్వేత మళ్ళీ రాజ్ కి ఫోన్ చేస్తుంది. రాజ్ లిఫ్ట్ చేసి నేను చేసే వరకు చెయ్యకని చెప్పాను కా దా ఎందుకు చేస్తున్నావని అంటాడు. అ తర్వాత లాయర్ డివోర్స్ గురించి మాట్లాడడానికి ఈరోజు రమ్మని చెప్పాడని శ్వేత అంటుంది. సరే త్వరగా వస్తున్నానని రాజ్ చెప్తాడు. రాజ్ త్వరగా రెడీ అవుతుంటే.. ఏంటి ఈ రోజు ఇంత తొందర అని కావ్య అడుగుతుంది. ఆఫీస్ లో వర్క్ ఉందని రాజ్ చెప్తాడు. మరొకవైపు అందరి ముందు ఇన్సల్ట్ అయిందని అనామిక ఫీల్ అవుతుంటే రుద్రాణి వచ్చి కావ్య గురించి నెగెటివ్ గా మాట్లాడుతుంది. అనామికని పూర్తిగా రుద్రాణి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కావ్య ఇంట్లో అందరిని తన గ్రిప్ లో ఉంచుకుందని రుద్రాణి చెప్తుంది. రుద్రాణి మాటలు అనామిక నమ్ముతుంది. మరొకవైపు కావ్య బయటకు వెళ్తుంటే దారిలో రాజ్ శ్వేత ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ కనిపిస్తారు. ఆ తర్వాత రాజ్ కి కావ్య ఫోన్ చేసి.. ఎక్కడున్నారని అడుగుతుంది. ఆఫీస్ లో అని రాజ్ చిరాకుగా చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నారని కావ్య అనుకుంటుంది. అ తర్వాత కావ్య వెళ్లే ఆటో వెనకాలే రాజ్ కార్ వస్తుంది. ఆటో డ్రైవర్ ఫోన్ మాట్లాడుతు డ్రైవ్ చేస్తున్నాడని రాజ్ కార్ దిగి వచ్చి కావ్య ఉన్నాఆటో డ్రైవర్ తో గొడవపెట్టుకుంటాడు కానీ కావ్యని చూడడు. మరొకవైపు నేను తప్పు చెయ్యలేదని ఋజువు చేస్తే మా అత్తయ్య నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటానని చెప్పింది. కనీసం నాకు ఇష్టమైనవి కూడా తీసుకొని రావడం లేదని రుద్రాణితో స్వప్న అంటుంది. స్వప్న అన్న దంట్లో న్యాయం ఉందని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో కావ్య ఆఫీస్ కి వస్తుంది. అక్కడ రాజ్ , శ్వేత ఇద్దరు కలిసి లాయర్ తో.. మాకు విడాకులు ఇష్టమేనని అంటారు. ఆ మాట కావ్య వింటుంది. కావ్యని రాజ్ చూస్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఐ నీడ్ న్యూ హేటర్స్.. ది ఓల్డ్ వన్ ఈజ్ మై ఫ్యాన్!

సినిమా ఛాన్స్ ల కోసం కొందరు చిన్న సెలబ్రిటీలు ఏం అయినా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు.. ఎంత దూరమైన వెళ్తారు. ఇంతకి ఎవరా సెలబ్రిటీ.. ఏంటా తెగింపు అనే కదా డౌట్?.. తనెవరంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తళుక్కుమన్న బ్యూటీ ఇనయా సుల్తానా ఆ సెలబ్రిటీ. సీజన్ సిక్స్ తర్వాత తన హాట్ అండ్ బోల్డ్ లుక్స్ ఫోటోలతో ఎప్పుడు కుర్రాళ్ళని తనవైపు తిప్పుకుంటుంది ఈ భామ. ఇనయా సుల్తానా తన ఇన్ స్టాగ్రామ్ లో‌ తాజాగా ఓ పోస్ట్ ని షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో అందాలని ఆరబోసింది. మాములుగానే ఇమ్ స్టాగ్రామ్ లో ఇలా అందాలు ఆరబోసేవారికి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఆ జాబితాలో కిరణ్ రాథోడ్,  అషు రెడ్డి, తేజస్విని, ప్రియాంక సింగ్, అరియాన, ఇనయా,  సిరి హనుమంత్ ఉన్నారు.‌ కాగా ప్రస్తుతం ఇనయా చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది. అర్థనగ్న ప్రదర్శనలో డోస్ ని పెంచిన ఇనయాకి రోజు రోజుకి మరింతగా ఎక్స్ పోజ్ అవుతుంది‌. బిగ్ బాస్ కి వెళ్ళే కంటే ముందు ఆర్జీవితో కలిసి ఇనయా ఓ పబ్ లో డ్యాన్స్ చేసింది. అది కాస్త వైరల్ అవ్వడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.  బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మొదట తనని అందరు ఎక్కువ టార్గెట్ చేయడంతో బయట ఇనయాకి సింపతీ పెరిగింది.  అలాగే హౌస్ లో మెల్లి మెల్లిగా అందరితో ధైర్యం మాట్లాడుతూ ఆటల్లో టాస్క్ లలో తన సత్తా చాటుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక సీజన్‌ సిక్స్ లో టికెట్ టు ఫినాలేలో రేవంత్, శ్రీహాన్ ఇద్దరు కలిసి ఇనయాని టార్గెట్ చేసి ఆడినా తనొక్కతే ఎదురునిలబడి ఫైట్ చేయడంతో బయట ఆడియన్స్ అంతా తన గేమ్ స్పిరిట్ కి ఫిధా అయ్యారు. ఇక తనకి ఓట్ల శాతం భారీగా పెరిగింది. ఎంతలా అంటే సీజన్ సిక్స్ మొదటి వారం నుండి రేవంత్ నామినేషన్ లో ఉంటే అతనే టాప్ లో ఉండేవాడు. ఓ గేమ్ తర్వాత ఇనయా టాప్ కి వచ్చేసింది. అలా ఇనయా ఫ్యాన్ బేస్ పెంచుకొని బయటకొచ్చేసింది. బయటకొచ్చాక ఫోటోషూట్స్, టూర్స్ అంటు తిరిగేస్తుంది. ఇక సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని పెట్టిన ఇనయా అందులో తన వ్యక్తిగత విషయాలని షేర్ చేసుకుంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా  ' ఐ నీడ్ న్యూ హేటర్స్.. ది ఓల్డ్ వన్ ఈజ్ మై ఫ్యాన్ 'అంటూ క్యాప్షన్ రాసి ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో చేసిన ఈ అందాల ఆరబోతతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ భామ.   

టాయిలెట్ పేపర్ మీద ప్రేమ కవిత్వం చెప్పిన  ప్రిన్స్

ఆహా ఓటిటి ప్లాటుఫారంపై డగ్ అవుట్ అనే షో నవదీప్ హోస్ట్ గా ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇప్పుడు ఈ షో సీజన్ 1 కాస్త గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వారం షోకి తేజస్విని మడివాడ, నటుడు ప్రిన్స్ వచ్చారు. హోస్ట్ నవదీప్ వాళ్ళతో మంచి గేమ్ ఆడించాడు. ఐతే ఇందులో ఒక టాస్క్ లో భాగంగా "టాయిలెట్ పేపర్ కి లవ్ లెటర్ రాయాలి" అని రావడంతో ప్రిన్స్ దాని మీద లవ్ కవిత చెప్పాడు. "ఓ టాయిలెట్ పేపరు..ఓ టాయిలెట్ పేపరు..ఎంత సన్నగా ఉన్నావో, ఎంత తెల్లగా ఉన్నావో, అవసరం వచ్చినప్పుడల్లా నేను నిన్ను ఎన్ని విధాలుగా వాడుకున్నానో యూఎస్ లో..ఒక్కోసారి నిన్ను చూసి ఎంత చిరాగ్గా ఫీలయ్యానో నాకే తెలుసు...టాయిలెట్ పేపరు...టాయిలెట్ పేపరు... నిన్ను మడతపెట్టి జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాను అవసరం వచ్చినప్పుడు నిన్ను వాడుకుంటాను ..ఐ లవ్ యు టాయిలెట్ పేపర్" అని ప్రిన్స్ కవిత చెప్పాక అదే టాయిలెట్ పేపర్ మీద తేజు కవిత చెప్పింది "డియర్ టాయిలెట్ పేపర్..నిన్ను దానికి తప్ప ఇంకా చాలా వాటికి వాడాను, లిప్ స్టిక్ తుడుచుకోవడానికి , మేకప్ తీసేయడానికి, ఎవరూ లేనప్పుడు జంగల్ లో ఒక్కదాన్నే తిరుగుతున్నప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నావ్..సో ఎప్పటికీ నేను కూడా నీతో ఉంటా..ఇట్లు తేజస్విని" అని ఫన్నీగా లవ్ ఎక్స్ప్రెస్ చేసింది. ఇక ఎపిసోడ్ ఎండింగ్ వరకు అన్ని రకాల టాస్కుల్లో తేజు, ప్రిన్స్ పోటీ పడ్డారు.. లాస్ట్ లో తేజు కప్పు గెలిచింది. తేజు ఇటీవలి కాలంలో "అర్దమయ్యిందా అరుణ్ కుమార్" మూవీలో నటించింది. అలాగే ప్రిన్స్ బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ గా చేసాడు అలాగే త్రి రోజెస్, ది అమెరికన్ డ్రీం, డిజె టిల్లు మూవీస్ లో  నటించాడు. హోస్ట్ నవదీప్ న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

నేహాతో మనోజ్ ముచ్చట్లు..ఆటలో అరటిపండులా విశ్వక్ సేన్... 

ఉస్తాద్ ఈ వారం షోకి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో మంచు మనోజ్ ఆడుకున్నాడు. ఈ ఎపిసోడ్ లో ఆన్సర్ చెప్పి దానికి ప్రశ్నలు అడిగే ఒక సెగ్మెంట్ ఉంది. అందులో భాగంగా ఆగస్ట్ 22 అని ఆన్సర్ చెప్పి ప్రశ్నలు అడిగాడు మనోజ్. నేహాసెట్టి పుట్టినరోజు, నివేత పేతురాజ్ పుట్టినరోజు, అనీషా  అమ్రోస్ పుట్టినరోజు, తరుణ్ భాస్కర్ పుట్టినరోజు అని వీటిల్లో కరెక్ట్ ప్రశ్నచెప్పాలని అడిగాడు. ఆన్సర్ చెప్పకపోయేసరికి "ఆ ప్రశ్నతో ఒక గొడవయ్యేసరికి రెండేళ్లు మాట్లాడుకోలేదు" అని చెప్పాడు. దానికి అనీషా అమ్రోస్ పుట్టినరోజు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు విశ్వక్. ఐతే ఆన్సర్ కరెక్ట్ చెప్పాక ఆడియన్స్ లోంచి జతిన్ అనే  ఒక కుర్రాడు ఫస్ట్ క్వశ్చన్ అంటూ చూపించేసరికి అదే ఆన్సర్ అనుకున్నా కానీ ఇప్పుడు అనిషా ఫోటో చూపించేసరికి క్లాప్స్ కొడుతున్నాడు అని ఫీల్ అయ్యాడు విశ్వక్. తర్వాత నేహాకి ఫోన్ చేయించాడు మనోజ్. "నేనెవరో చెప్పు" అనేసరికి నేహా కరెక్ట్ గా "విశ్వక్" అని చెప్పింది. "ఏంటి నేను లైవ్ లో మాట్లాడుతున్నానా" అని నేహా అనేసరికి "అవును మై బేబీ పొటాటో ఎలా ఉన్నావు" అని కామెడీగా అడిగాడు మనోజ్. ఇక విశ్వక్ కి కోపం వచ్చి "ఫోన్ చేయించి వాళ్ళూవాళ్ళూ మాట్లాడుకుంటున్నారు ..మనం ఆటలో అరటిపండు" అన్నాడు. "ఇంతకు నీ పుట్టినరోజు ఎప్పుడు" అని అడిగేసరికి "డిసెంబర్ 5 " అని చెప్పింది నేహా...తర్వాత ఫోన్ కట్ చేసాక  "నేహాతో చాలా కంఫర్ట్ గా మాట్లాడావుగా అని మనోజ్ కొంచెం ఎక్కువగా మాట్లాడేసరికి "కంఫర్ట్ గా మాట్లాడింది బేబీ అన్నది ఎవరో చూసారుగా మీరంతా" అంటూ ఆడియన్స్ ని అడిగాడు. అలా ఈ వారం షో ఆడియన్స్ ని అలరించింది.  తక్కువ సమయంలో  మంచి నటుడిగా గుర్తింపు పొందాడు విశ్వక్ . 2017 లో వెళ్ళిపోమాకే అనే మూవీతో  తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవ్వగా ఈ సినిమాతో ఉత్తమ తొలి నటుడిగా అవార్డు అందుకున్నాడు. తర్వాత 2018లో ఈ నగరానికి ఏమైంది అనే మూవీలో  నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా కూడా ఉత్తమ నటుడి అవార్డును సొంతం. ఇక ఫలక్ నుమాదాస్ సినిమాకు దర్శకుడిగా పని  చేశాడు. రీసెంట్ గా  అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీలో కూడా నటించాడు.

ఆకాష్ నటనకు తల్లిగా గర్వపడుతున్నా...

సర్కార్ నౌకరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను..ఆకాష్ నటనకు తల్లిగా గర్వపడుతున్నాసునీత చాలా  ఎమోషనల్ అయ్యారు..తన సుపుత్రుడు ఆకాష్ నటించిన మూవీ "సర్కారు నౌకరీ" చూసి ఆనంద బాష్పాలు రాల్చారు. ఈ మూవీ రీసెంట్ గా రిలీజై సక్సెస్ దిశగా అడుగులేస్తోంది. ఈ మూవీలో నటించిన ఆకాష్ సింగర్ సునీత ముద్దు బిడ్డ. ఇక తన నటన గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "ఈరోజు నేను నా బిడ్డను చూసి ఒక ప్రౌడ్ మదర్ గా ఫీలవుతున్నాను. నటన బాగా చేసాడు. కథ నడిపించడం చాలా పెద్ద బాధ్యత..ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. ఎప్పుడూ యాక్ట్ చేస్తా యాక్ట్ చేస్తా అంటే ఏదో అనుకున్నా కానీ.. హీ ఈజ్ రియల్లీ గుడ్.. రాఘవేంద్ర రావు గారికి , శేఖర్ గారికి  థ్యాంక్స్ చెప్పాలి. మూవీ చూసి ఎమోషనల్ అవడం పక్కన పెడితే నా పిల్లలు కన్న కలలు నిజమవుతుంటే ఒక తల్లిగా కన్నీళ్లొస్తున్నాయి అంతే.. రాఘవేంద్ర రావు గారు ఇలాంటి బలమైన సబ్జెక్టు ని ఎంచుకున్నారు. శేఖర్ దాన్ని చాలా ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఎక్కువ డ్రామా లేకుండా రియాలిటీని కళ్ళకు కట్టినట్టు చూపించారు. మంచి సాంగ్స్, మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ని పలికించగలిగే నటులంటే నాకు చాలా ఇష్టం.. మూవీ ఇండస్ట్రీలో  ఇప్పటి వరకు ఎంతోమందిని చూసాను..చూస్తున్నాని. కానీ ఈ సినిమాని చూస్తున్నంత సేపు తాను ఆకాష్  నా కుమారుడు అన్న విషయాన్నే మర్చిపోయాను. సినిమా మొత్తం  గోపాల్ అనే క్యారెక్టర్ మాత్రమే కనిపించింది. తనకు ఏదైతే పని వచ్చిందో దాన్ని బాధ్యతగా నిర్వర్తించాడు. చాలామంది మూవీకి పబ్లిసిటీ చేయకపోతే థియేటర్స్ కి వచ్చి చూడరు అంటున్నారు కానీ మంచి సినిమా అన్నప్పుడు థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది. రాఘవేంద్ర రావు గారికి ఎప్పటికీ మేమంతా రుణపడి ఉంటాం" అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు సునీత.  

 రవితేజ గారి కాల్ కోసం వెయిట్ చేస్తున్నా..అమరదీప్

బిగ్ బాస్-6  లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చిన  కీర్తి భట్ ఆ సీజన్ లో టాప్ సెలెబ్రిటీగా ఆడియెన్స్ మనసులకు బాగా దగ్గరయ్యింది. ఆమె  పలు తెలుగు సీరియల్స్ ద్వారా   ప్రేక్షకులకు సొంత కూతురన్నట్టుగా మారింది.   'కార్తీక దీపం' సీరియల్‌లో హిమ అనే అమాయకపు అమ్మాయి పాత్ర పోషిస్తుంది. ఆమె రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో తనకు ఎంతో ఇష్టమైన బిగ్ బాస్ నాగార్జునని కలిసిన పిక్ కూడా పోస్ట్ చేసింది. "చాలా కాలం తర్వాత నేను నా ఇష్టమైన వ్యక్తిని కలుసుకున్నాను.. అతను మాట్లాడిన విధానం నన్ను రిసీవ్ చేసుకున్న విధానం చూసి షాకయ్యాను. ఆయన  ఒక్క విషయం కూడా మర్చిపోలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను..ఈరోజును ఎంతో ప్రత్యేకమైనదిగా చేసిన నాగార్జున సర్ కి లాట్స్ ఆఫ్ లవ్" అని కామెంట్ పెట్టింది. అలాగే తనకు కాబోయే భర్త విజయ్ కార్తిక్ కూడా నాగార్జునను కలిశారు. "సార్ స్వచ్ఛమైన ప్రేమతో కీర్తిని ఆదరించిన  తీరు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది.  నేను నిన్నెలా మర్చిపోతాను మా అంటూ ఆయన పలకరించిన విధానం చాల నచ్చింది.  నాగ్ సర్‌ని కీర్తిని  చిన్నపిల్లలా చాలా గట్టిగా హగ్ చేసుకోవడం నాకు చాల సంతోషంగా అనిపించింది" అని అన్నాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో కీర్తిని హౌస్ మేట్స్ అంతా కూడా ఆదరించిన విషయం తెలిసిందే. ఇక కీర్తి భట్, విజయ్ కార్తీక్ ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక ఇద్దరూ కూడా ఇండస్ట్రీకి సంబందించిన వారే కావడంతో అభిమానులు కూడా వీళ్ళ ప్రేమకు ఫిదా ఇపోయారు.  

ఆయన ఒక్క చిన్న విషయం కూడా మర్చిపోలేదు

బిగ్ బాస్-6  లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చిన  కీర్తి భట్ ఆ సీజన్ లో టాప్ సెలెబ్రిటీగా ఆడియెన్స్ మనసులకు బాగా దగ్గరయ్యింది. ఆమె  పలు తెలుగు సీరియల్స్ ద్వారా   ప్రేక్షకులకు సొంత కూతురన్నట్టుగా మారింది.   'కార్తీక దీపం' సీరియల్‌లో హిమ అనే అమాయకపు అమ్మాయి పాత్ర పోషిస్తుంది. ఆమె రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో తనకు ఎంతో ఇష్టమైన బిగ్ బాస్ నాగార్జునని కలిసిన పిక్ కూడా పోస్ట్ చేసింది. "చాలా కాలం తర్వాత నేను నా ఇష్టమైన వ్యక్తిని కలుసుకున్నాను.. అతను మాట్లాడిన విధానం నన్ను రిసీవ్ చేసుకున్న విధానం చూసి షాకయ్యాను. ఆయన  ఒక్క విషయం కూడా మర్చిపోలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను..ఈరోజును ఎంతో ప్రత్యేకమైనదిగా చేసిన నాగార్జున సర్ కి లాట్స్ ఆఫ్ లవ్" అని కామెంట్ పెట్టింది. అలాగే తనకు కాబోయే భర్త విజయ్ కార్తిక్ కూడా నాగార్జునను కలిశారు. "సార్ స్వచ్ఛమైన ప్రేమతో కీర్తిని ఆదరించిన  తీరు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది.  నేను నిన్నెలా మర్చిపోతాను మా అంటూ ఆయన పలకరించిన విధానం చాల నచ్చింది.  నాగ్ సర్‌ని కీర్తిని  చిన్నపిల్లలా చాలా గట్టిగా హగ్ చేసుకోవడం నాకు చాల సంతోషంగా అనిపించింది" అని అన్నాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో కీర్తిని హౌస్ మేట్స్ అంతా కూడా ఆదరించిన విషయం తెలిసిందే. ఇక కీర్తి భట్, విజయ్ కార్తీక్ ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక ఇద్దరూ కూడా ఇండస్ట్రీకి సంబందించిన వారే కావడంతో అభిమానులు కూడా వీళ్ళ ప్రేమకు ఫిదా ఇపోయారు.

అఖిల్ సార్థక్ ఎమోషనల్ పోస్ట్.. ఆమె గురించేనా?

అఖిల్ సార్ధక్ ఇప్పుడు సోషల్ మీడియాలఫ డిఫరెంట్ పోస్ట్ లతో ప్రేక్షకులను తన వైపుకి తిప్పుకుంటున్న మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్. ఇతను బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్న ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.  అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్ సార్థక్, మోనల్ గజ్జర్ తో‌ జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయిన కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి‌. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు. బిబి జోడీలోని మొదటి రెండు వారాల్లో అఖిల్-తేజస్విని వాళ్ళ హాట్ పర్ఫామెన్స్ తో జడ్జ్ లకే చెమటలు పట్టించారు. అయితే ఆ షోలో విన్నర్ గా వీళ్ళ జోడి నిలుస్తుందని అనుకున్నారంతా కానీ అనుకోకుండా అఖిల్ కి కాలికి గాయం కారణంగా డాక్టర్స్ డ్యాన్స్ చేయకూడదని చెప్పడంతో వాళ్ళ జోడీ షో నుండి బయటకొచ్చేసారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రతీ ఎపిసోడ్ ని ఫాలో అవుతూ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ ప్రశాంత్ కి అన్యాయం జరుగుతుందని పోస్ట్ లు చేశాడు. సెలబ్రిటీలంతా ఒకవైపు ఉండి ఒక కామన్ మ్యాన్ ని టార్గెట్ చేయడం  కరెక్ట్ కాదంటు చెప్పిన అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ ని కలిసాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే అఖిల్ సార్థక్ తాజాగా ఓ పోస్ట్ చేశాడు.‌ అది తనకి ఇష్టమైన మోనాల్ గురించేనా అనే వార్తలు వస్తున్నాయి. మరి అతను ఎవరి గురించి రాసాడో తెలియాల్సి ఉంది.  అఖిల్ సార్థక్ రాసిన ఆ పోస్ట్ లో ఏం ఉందంటే.. నేను చాలామందిని చూసాను. ఈ రోజుల్లో ఎవరు సీరియస్ రిలేషన్ షిప్‌లో ఉండటం లేదు. ప్రతీఒక్కరు కొంతసమయం వరకు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోతున్నారు. మా తల్లిదండ్రుల జనరేషన్ బాగుండేది. వాళ్ళు ఎలా కలిసి ఉండేవారని నేను ఇప్పటికి ఆశ్చర్యపోతున్నాను. 90's  కిడ్ గా నేను ఓల్డ్ ఫ్యాషన్‌ ని ఓల్డ్ థింకింగ్ చేస్తున్నానని అనిపిస్తుంది కానీ ఈతరంలో ఎవరు వర్త్ కాదని అనిపిస్తోంది. టెక్నాలజీ మారడంతో ప్రతీది వరెస్ట్ గా మారింది. పెళ్ళి అనేది సింపుల్ గా డైవర్స్ గా ముగుస్తుంది. లవ్ ఈజ్ జీరో.. నేను ఈ జనరేషన్ ని తల్చుకొని బాధపడుతున్నాను.  ఓల్డెన్ డేస్ లో పెళ్ళి చేసుకున్నాక భార్యభర్తల మధ్య ఏం అయిన  సమస్య వస్తే పెద్దవాళ్ళు, రిలేటివ్స్ కలిసి కలిపేవారు. కానీ ఇప్పుడు రిలేటివ్స్ కలిసి ఇద్దరిని విడగొడుతున్నారు. ఇది చాలా దారుణమంటూ అఖిల్ సార్థక్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.  

ఏపీకి  సీఎం అయ్యి..పేదలకు సేవ చేయాలని ఉంది : జానీ మాష్టర్...

నెల్లూరుకు  చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ.. జనసేన టికెట్ రేసులో ఉన్నట్టు ఒక న్యూస్ వైరల్ అయ్యింది. జనసేన నేతలతో కలసి హరిరామజోగయ్యను పాలకొల్లులో ఆయన నివాసంలో కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు జానీ మాష్టర్.   ప్రస్తుతానికి ఆయన జనసేన టికెట్ పై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఐతే ఒక ఇంటర్వ్యూలో మాత్రం తనకు ఏపీకి సీఎం కావాలనే కోరుకుంటున్నట్టు చెప్పారు. "ఒక్కడు మూవీలా సినిమాల్లో  సీఎం కావడం ఈజీ కానీ రియల్ లైఫ్ లో చాలా కష్టాలు ఉంటాయి. కులం లేదు అనుకుంటారు కానీ అదే ప్రధాన పాత్ర పోషిస్తుంది" అని అడిగిన ప్రశ్న జానీ మాష్టర్ తెలివిగా ఆన్సర్ చేశారు .."కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది. నేను తిరిగిన సొసైటీలో అన్ని కులాల వాళ్ళతో కలిసి ఉన్నాను..వాళ్ళ ఇళ్లల్లో భోజనాలు చేసాను. వాళ్ళు కూడా అలానే ఉండేవాళ్ళు. నన్ను పెంచిన వాళ్ళ ప్రేమ చాలా గొప్పది" అని చెప్పారు. "ఐతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కూడా ఉంది..అదేంటంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి పార్ట్ టైంలా వస్తారు వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోతారు..మరి మీరు అలా కాదు కదా" అన్న ప్రశ్నకు  "టికెట్ కంఫర్మ్ అయింది...మీరు ప్రత్యక్ష రాజకీయాలలోకి రండి అని చెప్తే మాత్రం నేను వచ్చేస్తాను తిరిగి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు." అని చెప్పాడు జానీ మాష్టర్...ఇక ఈ ఇంటర్వ్యూలో తనకు పవన్ కళ్యాణ్ అన్నా, ఏపీ సీఎం జగన్ అన్న చాల ఇష్టం అని..ఇద్దరూ తల్లితండ్రుల్లాంటి వాళ్ళు అని ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు. తనకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయడం ఇష్టం అని తన చిన్నప్పటి నుంచి ఎంతో పేదరికాన్ని చూశానని చెప్పారు జానీ మాష్టర్...చదువు మధ్యలో ఆపేసి బేల్దార్ పని, కాటి కాపరి, లారీ మెకానిక్, లారీ బోర్ మెకానిక్, బీడీలు చుట్టే పని, బిస్కెట్ ప్యాకెట్ల ప్యాకింగ్ ఇలా రకరకాల జాబ్స్ చేసి చివరికి తన ఇంత జీవితంలో చూసిన ఎంతో మంది పేద ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు చెప్పారు.  

మెగా ఫామిలీకి, చంద్రబోస్, ఆర్పీ పట్నాయక్ కి ఆర్పీ చేపల పులుసు

జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు.  ఐతే అక్కడ వచ్చిన కొన్ని ఇబ్బందుల దృష్ట్యా ఆర్పీ ఎప్పుడో ఈ షో నుంచి బయటికి వచ్చి బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్ ప్రారంభించారు ఇక ఈ రెస్టారెంట్ బాగా క్లిక్ అయ్యింది కూడా. హైదరాబాదులో ఒక బ్రాంచ్ ప్రారంభించిన ఈయన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బ్రాంచెస్ ప్రారంభించారు. ఐతే లేటెస్ట్ గా  ఒక ఇంటర్వ్యూలో తన రెస్టారెంట్ లోని చేపల పులుసును  సెలబ్రిటీలకు కూడా పంపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. "ఆర్పీ పట్నాయక్ గారికి పంపించాను, చంద్రబోస్ గారికి టు టైమ్స్ పంపించాను, రాంచరణ్-ఉపాసన గారికి, చైరంజీవి గారికి కూడా నా చేపల పులుసు వెళ్ళింది. సెలబ్రిటీస్ కి  పంపిస్తున్నాం అనుకున్నప్పుడు ఇంకా ఎంతో శ్రద్ద పెట్టి చేయాలి. ఫీడ్ బ్యాక్ అనవసరం ఎందుకంటే మనం ఎం చేసినా కరెక్ట్ గా  చేయాలి అంతే..అందుకే పసుపు కొమ్ములు తెప్పించి ఆడించి, గుంటూరు నుంచి మిర్చి తెప్పించి అంతా పక్కాగా చేస్తున్నాం...ఫీడ్ బ్యాక్  కోసమే నేను చేపల పులుసు పంపను..చేపల పులుసు టేస్ట్  నచ్చి మరోసారి నాకు కాల్ చేయాలనే ఉద్దేశంతోనే సెలబ్రిటీలకు పంపిస్తున్నాను.  చేపల పులుసు తయారీ విషయంలో ఎక్కడా పడే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి  మణికొండ బ్రాంచ్ కూడా వర్క్ జరుగుతోంది. మా దగ్గర ఉండే లేడీ సీనియర్ షెఫ్స్ ఏదైతే సలహాలు, సూచనలు ఇస్తారో వాటిని ఫాలో ఐతే మాత్రం బిజినెస్ లో మనకు తిరుగే ఉండదు. ఒక పది రూపాయలు పోయినా మంచి రుచికరమైన వంట చేసి అందిస్తే   కస్టమర్లు ఎవరూ మన దగ్గర నుంచి తిరిగి వెళ్ళరు" అంటూ కిర్రాక్ ఆర్పీ ఎన్నో విషయాలు చెప్పాడు.

ఆ పాటకు రీల్ చేయండి...గిఫ్ట్ కొట్టండి...భోలే షావలి బంపర్ ఆఫర్

"అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క" అనే జానపద గీతం సోషల్ మీడియాలో ఎంతగా  వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు . ఈ పాటను రాసి, పాడి, కొరియోగ్రాఫ్ చేసింది భోలే షావలి ..అతనికి జంటగా శుభశ్రీ రాయగురు కూడా పోటీగా డాన్స్ చేసింది. వీళ్ళు బిగ్ బాస్ సీజన్ 7  కంటెస్టెంట్స్ గా అదరగొట్టారు. ఈ మధ్య కాలంలో కొత్త కవర్ సాంగ్స్ ని, ఫోక్ సాంగ్స్ ని, మూవీ సాంగ్స్ ని జనాల్లోకి తీసుకెళ్లి మంచి రేటింగ్స్ సంపాదించడం కోసం కొన్ని కాంటెస్టులు పెడుతూ ఉంటారు. అందులో భాగంగానే భోలే షావలి, శుభశ్రీ ఇద్దరూ కలిసి తమ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆఫర్ ఇచ్చారు. "మీరు కూడా  అత్తగారు  సాంగ్ ని రీల్ గా  చేయండి , నాకు  టాగ్  చేయండి , బెస్ట్  వీడియోకి ఒక  గిఫ్ట్ ఇస్తా " అంటూ భోలే ఒక ఛాన్స్ ఇచ్చాడు.  యూట్యూబ్ లో సాంగ్ రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే 6 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన భోలే సాంగ్‌ ఇప్పటివరకు 1.3 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. భోలే రిలీజ్‌ చేసిన ‘పాలమ్మిన.. పూలమ్మిన’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 లో  వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో అడుగుపెట్టిన భోలే షావలి చాల   తక్కువ సమయంలో ఫేవరెట్‌ కంటెస్టెంట్‌గా మారిపోయాడు. హౌస్ లో తన జర్నీ చాల తక్కువ రోజులే ఐనా కూడా అతని  ఆటతీరు, మాటతీరుతో, పాట తీరుతో ఆడియన్స్ మనసులను కొల్లగొట్టాడు.  పాటలు, మాటలు, కామెడీతో  ఆడియెన్స్‌కు కావాల్సినంత  ఎంటర్‌టైన్మెంట్ అందించాడు భోలే.  గతంలో కొన్ని మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా, లిరిక్‌ రైటర్‌గా పని చేసాడు కానీ ఎక్కడా బ్రేక్ రాలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాక అతని పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.  మరి మీరు కూడా భోలే సాంగ్  రీల్స్‌ చేసి అతనికి టాగ్ చేసి  మీ లక్ ని టెస్ట్ చేసుకోండి .

Brahmamudi:కొత్తకోడలు మొదటి రోజే ఫెయిల్.. పాపం దుగ్గిరాల ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -297 లో.. దుగ్గిరాల ఫ్యామిలీలోని అందరు సరదాగా హాల్లో పడుకొని కబుర్లు చెప్పుకుంటు ఉంటారు.‌ అదే సమయంలో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతారు. అందులో రాజ్ వంతు రాగా కావ్యకి ప్రపోజ్ చెయ్యాలని కళ్యాణ్ చెప్తాడు. దాంతో రాజ్ ఇబ్బంది పడిన ప్రపోజ్ చేస్తాడు. కావ్యకి రాజ్ ఎర్రగులాబీ ఇచ్చి నుదిటిపై ముద్దు పెట్టి ప్రపోజ్ చేస్తాడు. దాంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అందరూ హాల్లోనే పడుకుంటారు. అందరు పడుకున్నారని అనుకొని.. అనామిక దగ్గరకి కళ్యాణ్ వెళ్లి బయటకు తీసుకొని వచ్చి మాట్లాడుతాడు. అందరూ లేచి..  కళ్యాణ్ , అనామిక ల దగ్గరకి వచ్చి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటారు. అనామికకు ఒక్కొక్కరి గురించి కళ్యాణ్ చెప్తూ ఉంటే అందరు కళ్యాణ్ పై కోపంగా ఉంటారు.‌ ఈ ఇంట్లో రాక్షసి సుర్పనక అన్ని మా అత్తయ్య రుద్రాణి అనగానే రుద్రాణి కోపం తట్టుకోలేక ఒరేయ్ మీరు మీరు మాట్లాడుకుంటే నా గురించి ఎందుకని అనగానే కళ్యాణ్, అనామిక ఇద్దరు వాళ్ళని చూసి షాక్ అవుతారు. వీళ్ళని ఇలా వదిలేస్తే లాభం లేదు త్వరగా శోభనం చేసెయ్యాలని అపర్ణ అంటుంది. మరుసటిరోజు ఉదయం కావ్య కిచెన్ లోకి రాకముందే అనామిక వచ్చి కాఫీ చేస్తుంటుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ నేను చేస్తాను కాదా అని కావ్య అనగానే నీకు బాధ్యతలు ఉన్నప్పుడు నాక్కూడా ఉంటాయి కదా అని అనామిక కోపంగా అంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి, రుద్రాణి‌ ఇద్దరు వస్తారు.‌ నువ్వు చాలా గ్రేట్ అపురూపంగా పెరిగిన కూడా నువ్వు ప్రొద్దున లేచి అందరికి కాఫీ పెడుతున్నావంటూ అనామికని రుద్రాణి పొగుడుతుంది. నా కోడలు అంటే ఏమనుకున్నావ్.. ఎవరికి అన్యాయం చెయ్యకుండా ఉంటే సరిపోద్ధని కావ్య వైపు చూస్తూ అనామికని పొగుడుతుంది.  ఆ తర్వాత నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు.. నీకు హెల్ప్ చేస్తానని  అనామికతో ధాన్యలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత అందరు వెళ్ళిపోయాక  టీని కూడా కాఫీ చేసినట్లు చేస్తుంటుంది. అలా కాదని కావ్య చెప్తుంటే అనామిక వినదు.. అ తర్వాత అందరు కాఫీ తాగి.. అదొక రకమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తుంటారు. అనామిక ఫీల్ అవుతుందని అందరు బాగుందని చెప్తారు. అ తర్వాత కళ్యాణ్ వచ్చి తాగి బాలేదని చెప్పగానే అనామిక తాగి తాను కూడ బాలేదని అంటుంది. కాసేపటికి అందరు కావ్యని మళ్ళీ టీ చేసి తీసుకొని రమ్మని చెప్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Krishna Mukunda Murari:రెండు రోజుల్లో పెళ్ళి.. ని‌జం నిరూపించి వాళ్ళు తప్పించుకోగలరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -358 లో.. కృష్ణ, మురారి ఒక దగ్గర ఉండి కేసు గురించి డిస్కషన్ చేస్తారు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరపాలని అనుకుంటుంది పెద్ద అత్తయ్య ఒక్కతే కదా.. ఇంకా ఎవరు అనుకుంటున్నారని  మురారితో‌ కృష్ణ అంటుంది. ఒకవేళ కొత్తగా వచ్చిన దేవ్ ఇదంతా చేస్తున్నాడని అంటారా అని కృష్ణ అనగానే.. అతనికి అంత అవసరం లేదని మురారి అంటాడు. ఆ తర్వాత వీలు అయినంత త్వరగా అ రింగ్ అతన్ని పట్టుకోవాలని కృష్ణ అంటుంది. మరొకవైపు ముకుంద టెన్షన్ పడుతుంటే.. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్? మీ ఫ్రెండ్స్ ని కూడా పెళ్లికి పిలువు అని భవాని అనగానే.. ఒకవేళ పెళ్లి ఆగిపోతే మీ పరువు పోతుంది కదా అత్తయ్య అని ముకుంద అనగానే... భవాని తనపై కోప్పడుతుంది. ఏమి చెయ్యలి అత్తయ్య ఇదంతా చుస్తే అలాగే అనిపిస్తుంది. పెళ్లి చేసుకోవాల్సిన వాడు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెళ్లిలో ఎక్కడికి అయిన పారిపోతే నా పరిస్థితి  ఏంటని ముకుంద అంటుంది. అప్పుడే రేవతి వచ్చి.. అంత మురారిని అర్థం చేసుకున్నప్పుడు పెళ్లికి ఎందుకు సిద్ధపడ్డావని అంటుంది. కృష్ణ ,మురారి ఇద్దరు పెళ్లికి సిద్ధం అయ్యే చేసుకున్నారా అని భవాని అడుగుతుంది. అంటే ఇప్పుడు బానే ఉంటున్నారు కదా అని రేవతి అంటుంది. వాళ్ళు కూడా కొన్ని రోజులకు బానే ఉంటారని భవాని అంటుంది. అప్పుడే ప్రసాద్, సుమలత వస్తారు. నలుగు పెట్టడానికి కావాలసినవి తీసుకొని వచ్చారా అని భవాని అడుగుతుంది. రెండు రోజుల్లో పెళ్లి కాబట్టి మురారి ముకుందలకి రేపు నలుగు పెట్టాలని భవాని చెప్తుంది.  దాంతో ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు శకుంతల బ్యాగ్ సర్దుతుంటే అప్పుడే నందు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. కృష్ణ, మురారీలని కూడా తీసుకొని వెళ్తున్నానని శకుంతల అనగానే.. ఆ విషయం నందు వెళ్లి రేవతికి చెప్తుంది. రేవతికి నందు చెప్తున్నప్పుడు భవాని వింటుంది. ఆ తర్వాత రేవతిని నందు తీసుకొని శకుంతల దగ్గరకి వెళ్తుంది. శకుంతల బ్యాగ్ తో రెడీగా ఉంటుంది. అప్పుడే కృష్ణ, మురారి రేవతి, నందు‌ తన దగ్గరకి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే.. వెళదాం పదా అని శకుంతల అంటుంది. ఇప్పుడు వెళ్తే తప్పు చేసే వెళ్లిపోయారని అంటారు. ఈ పెళ్లి ఏమి జరగదని శకుంతలకి కృష్ణ, మురారి నచ్చజెప్పుతారు.‌వాళ్ళ మాటలు అన్ని పై నుండి భవాని వింటుంది. మరొకవైపు ముకుంద, దేవ్ లు పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే సుమలత వాళ్ళ దగ్గరకి వచ్చి మాట్లాడుతుంది. అదే సమయంలో పెళ్లికి కావలసిన లిస్ట్ రాస్తున్న సుమలత, ప్రసాద్ దగ్గరకి కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. ఎలాగూ ఈ పెళ్లి జరగదు.. మేమ్ నిరూపిస్తామని కృష్ణ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే ఆ‌ మాటలు భవాని వింటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu:జస్ట్ మిస్.. పులి మేక ఆటలో ఎవరు గెలిచినట్లు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -964 లో... వసుధారని కిడ్నాప్ చేశారని ముసలావిడ లోపలికి వచ్చి రిషికి చెప్పగానే కంగారుగా రిషి లెవబోతుంటాడు. అది చూసిన ముసలివాళ్ళు.. వద్దని చెప్పి వసుధార ఫోన్ రిషికి ఇచ్చి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైన చెయ్యండి అంటారు. రిషి ఆలోచిస్తూ డాడ్ కి చెప్తే టెన్షన్ పడుతాడని ముకుల్ కి కాల్ చేయాలని అనుకుంటాడు. కాసేపటికి ముకుల్ కి కాల్ చేస్తాడు రిషి. వసుధార ఫోన్ నుండి కాల్ రావడం ఏంటని అనుకోని.. చెప్పండి మేడమ్ అంటాడు. ఆ తర్వాత రిషి మాటలు విని ఆశ్చర్యపోతాడు. మీరు ఎలా ఉన్నారు రిషి సర్.. అసలు వసుధార ఫోన్ మీ దగ్గరకి ఎలా వచ్చిందంటు అడుగుతాడు. రిషి జరిగిందంతా చెప్తాడు. వసుధార ప్రాబ్లెమ్ లో ఉంది మీరు వచ్చి త్వరగా కాపాడండని రిషి చెప్పగానే ముకుల్ వెంటనే బయలుదేర్తాడు. మరొకవైపు వసుధారని కిడ్నాప్ చేసిన రౌడీలు.. వసుధార నోటికి ప్లాస్టర్ వేస్తారు. అక్కడ రౌడీలంతా కలిసి పులి మేక ఆడుతుంటారు. అప్పుడే అక్కడికి ముకుల్ ఎంట్రీ వస్తాడు. ఇక ఒక్కో రౌడీని చితక్కొడతాడు ముకుల్. కాసేపటికి  ముకుల్ ని చూసి వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా  వసుధారని ముకుల్ అక్కడ నుండి పంపించేస్తాడు. మీ బాస్ ఎవరు అంటు గన్ తో రౌడీ లని బెదిరిస్తాడు. కానీ రౌడీలెవరు చెప్పరు. అప్పుడే శైలేంద్ర ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్తాడు. సరే రండి అని రౌడీలు శైలేంద్రకి చెప్తారు. మరొకవైపు శైలేంద్రకి ధరణి ఫోన్ చేస్తుంటుంది. ఎన్నిసార్లు చేసిన శైలేంద్ర లిఫ్ట్ చెయ్యడు. అప్పుడే దేవయాని వచ్చి ఎందుకు అన్ని సార్లు చేస్తున్నావని కోప్పడుతుంది దాంతో ధరణి ఏడుస్తుంది. అప్పుడే ఫణింద్ర వచ్చి.. ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. మీ అబ్బాయి ఎక్కడికో హడావిడిగా వెళ్లారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదని అనగానే శైలేంద్రకి ఫణీంద్ర ఫోన్ చేస్తాడు. ధరణి అనుకుని ఫణింద్రతో కోపంగా మాట్లాడుతాడు శైలేంద్ర. ఆ తర్వాత ఫణీంద్ర వాయిస్ విని శైలేంద్ర షాక్ అవుతాడు. ఇక శైలేంద్రకి ఫణీంద్ర క్లాస్ పీకుతాడు. మరొకవైపు రౌడీలని కంట్రోల్ చేస్తున్న ముకుల్ ని భద్ర చూసి.. శైలేంద్రకి ఫోన్ చేసి మీరు ఇప్పుడు ఇక్కడికి రాకండని చెప్తాడు. వసుధర ఇక్కడ లేదు. ఆ ముకుల్ ఉన్నాడని చెప్పగానే శైలేంద్ర రాకుండా వెన్నక్కి వెళ్లిపోతాడు. అలా ముకుల్ ని డైవర్ట్ చేసి రౌడీలని తప్పించుకునేలా భద్ర చేస్తాడు. కాసేపటికి రౌడీలు తప్పించుకున్నారని ముకుల్ డిస్సపాయింట్ అవుతాడు. మరొకవైపు రిషిని తీసుకొని వసుధార బయలుదేర్తుంది. అసలు ఏం జరిగిందని వసుధారకి రిషి చెప్తాడు. ఎవరో కిడ్నాప్ చేశారు తప్పించుకొని వెళ్తు ఫారెస్ట్ లో పడిపోయాను. వాళ్ళు కాపాడారని రిషి చెప్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పల్లవి ప్రశాంత్ కి యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయని తెలీదు..నేనే మోనిటైజ్ చేయించా

బిగ్ బాస్ సీజన్ 7 లో నటుడు శివాజీకి, పల్లవి ప్రశాంత్ కి మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలుసు. ఐతే పల్లవి ప్రశాంత్ యుట్యూబ్ అమౌంట్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శివాజీ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. "పల్లవి ప్రశాంత్‌కి యూట్యూబ్‌లో 1.3 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ , ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్‌కి మోనిటైజేషన్ గురించి కానీ.. అది చేస్తే డబ్బులు వస్తాయనే విషయం తెలీదంటూ  ఒక నిజాన్ని రివీల్ చేసాడు  హీరో శివాజీ. ఆ విషయం తెలిసి  నాకు చాలా ఆశ్చర్యమేసింది. అందుకే  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మా ఇంట్లోనే అతనితో మానిటైజేషన్ చేయించా.  వాడు చాలా అమాయకుడు.  బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాడి బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్ చేశాకే అమాయకుడని తెలిసి లోపలి తీసుకొచ్చారని విషయం తెలిసింది. సెకండ్ వీక్ లో నాకు ఎవరెవరు ఏమిటి వాళ్ళ ప్లాన్ ఏమిటి అనే విషయాలన్నీ అర్థమయ్యాయి.  ప్రశాంత్‌కి రెండు ఫేస్‌లు ఉన్నాయని అంటున్నారు నిజమేనా ? అని నాగార్జున గారు అడిగినప్పుడు కూడా లేదు బాబు గారూ.. వాడ్ని నేను నమ్ముతున్నా అని చెప్పాను.. అదే నిజం అయ్యింది. బయటకి వచ్చి చూసాక గాని నాకు తెలిసింది. అతనికి ఉన్నంత మంది సబ్‌స్క్రైబర్స్ కి అతనికి ఈజీగా పది లక్షలు వస్తాయి. నేను కామన్ మ్యాన్ కె సపోర్ట్ చేశాను అని అప్పుడు అనిపించింది. యావర్ చాల మంచోడు..జెమ్...వాళ్లకు నేను చేసింది ఏమీలేదు కొంత టైం మోటివేట్ చేయడానికి కేటాయించేవాడిని అంతే." అంటూ శివాజీ పల్లవి ప్రశాంత్ గురించి చెప్పుకొచ్చాడు.  

శోభాశెట్టికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున!

శోభాశెట్టికి నాగార్జున గిఫ్ట్ ఇచ్చాడంట.. ఇదే విషయం తన యూట్యూబ్ ఛానెల్ లోని ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది. అసలేంటా గిఫ్ట్ అనేది తెలుసుకోవాలని ఇప్పుడు అందరు అనుకుంటున్నారు. అదేంటో తెలుసుకోవడానికి పర్సనల్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి మరీ చూస్తున్నారంట నెటిజన్లు. దాంతో ఈ వీడియో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. బిగ్ బాస్ సీజన్‌ సెవెన్ లో మోస్ట్ పాపులర్ అయిన వారిలో మొదట ప్రశాంత్ అయితే ఆ తర్వాత శోభాశెట్టి. బిగ్ బాస్ హౌస్ లో శోభాశెట్టి ఆటతీరు, మాటతీరుకి ప్రేక్షకులు తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు ప్రియాంక, అమర్ దీప్ లతో కలిసి గ్రూప్ గా ఉంటు టాస్క్ లలో కూడా గ్రూప్ గా ఆడుతూ, నామినేషన్ టైమ్ లో అందరు కలిసి ఎవరెవరిని నామినేషన్ చేయాలని మాట్లాడుకోవడం అన్నీ కూడా తనకి మరింత నెగెటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాయి. అయితే ఆటలో ఉన్నప్పుడు ఫౌల్ చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు కానీ మరీ సంఛాలక్ గా ఉండి కూడా ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేసేది. ఇక మొదటి వారం నుండి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియాంక కలిసి చేసిన నామినేషన్ లు చాలానే ఉన్నాయి. ఇక అందరు కలిసి ప్రశాంత్ ని టార్గెట్ చేయడంతో శివాజీ అతనికి సపోర్ట్ చేస్తూ నిలిచాడు. ప్రతీసారీ ప్రశాంత్ కి వెన్నెంటే ఉండటంతో శోభాశెట్టి, అమర్, ప్రియాంక వాళ్ళు జెలస్ తో ఏదో ఒక కారణంతో నామినేషన్ లో పెట్టేవాళ్ళు. అతడికి గాయాలు చేస్తూ ఇబ్బందిపెట్టేవాళ్ళు. అయితే శోభాశెట్టి హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ముద్దుబిడ్డ అనేవాళ్ళు ఎందుకంటే తనెంత చెత్త ఫర్ఫామెన్స్ ఇచ్చిన, ఓటింగ్ లో ఎంత లీస్ట్ లో ఉన్న తను మాత్రం ప్రతీవారం సేఫ్ అయ్యేది. శోభాశెట్టి సంఛాలక్ గా ఎన్నిసార్లు ఫెయిల్ అయిన బిగ్ బాస్ మాత్రం తననే సంఛాలక్ చేసేవాడు. అలా ప్రతీవారం తను ఎలిమినేట్ అవ్వాలని ప్రేక్షకులు ఓట్లు వేయకుండా తనకన్న దిగువన ఏ కంటెస్టెంట్ ఉన్నా వారికి భారీగా ఓట్లేసేవారు. ఇక బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక వ్లాగ్స్, ఫోటోషూట్ అంటు బిజీ అయింది శోభా అలియాస్ మోనిత. ఇక తాజాగా అప్లోడ్ చేసిన వ్లాగ్ లో శోభాశెట్టి ఏం చెప్పిందంటే.. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆరవ వారంలో ఉన్నప్పుడు వీకెండ్ లో నాగార్జున సర్ ఓ షర్ట్ వేసుకొచ్చారు. అది నాకు చాలా నచ్చింది‌. నాకు కావాలని అప్పుడే అడిగాను. ఇక నేను పదకొండు వారాలు ఉండి ఎలిమినేట్ అయి బయటకొచ్చాక.. మేనేజర్ ని పిలిచి మరీ ఆ టీ షర్ట్ తెప్పించి నాకు ఇచ్చారు. నాకు టాలీవుడ్ లో మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ నాగార్జున సర్. ఇప్పుడు ఆయన చేతుల మీదుగా ఈ గిఫ్ట్ తోసుకోవడం నిజంగా నాకు ప్రౌడ్ మూమెంట్ అని అంది.  తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్ లో ఈ వ్లాగ్ ని అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం దీనికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది.

విష్ణుప్రియ బాయ్ ఫ్రెండ్ ని కలిసిన రీతూ చౌదరి!

ఇదేందయ్యా ఇది.. యాంకర్ విష్ణుప్రియకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? తనని రీతూ చౌదరి కలిసిందా? ఇదెప్పుడు జరిగిందని అనుకుంటున్నారా.. ఏది నిజమో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే తాజాగా రీతు చౌదరి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన వ్లాగ్ ని చూడాల్సిందే. రీతు చౌదరి విష్ణుప్రియ కోసం ప్యారిస్ వెళ్ళింది. అదంతా ఓ వ్లాగ్ లో షేర్ చేసుకుంది రీతూ. రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి. రీతూ తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది.  ఫోటోషూట్ లతో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది. అయితే ఎప్పుడు హాట్ అండ్ బోల్డ్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే రీతూ.. తన ఫ్రెండ్ విష్ణుప్రియని కలవడానాకి ప్యారిస్ కి వెళ్లింది. అక్కడ ప్యారిస్ లో బోట్ లో వెళ్తూ కబుర్లు చెప్పింది. అయితే అక్కడ ప్యారిస్ వీధుల్లో షాపింగ్ చేసి కొత్తగా కొన్న డ్రెస్ లని వేసుకొని కనువిందు చేశారు.‌  " ఫైనల్లీ విష్ణుప్రియ బాయ్ ఫ్రెండ్ ని కలిసాను" అని ఈ వ్లాగ్ కి టైటిల్ కూడా పెట్టేసింది భామ. ఇది చూసి విష్ణుప్రియకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనే డౌట్ అందరిలో ఉంటుంది. కానీ తనకి బాయ్ ఫ్రెండ్ కాదు.. విష్ణుప్రియనే రీతూకి బాయ్ ఫ్రెండ్ లెక్క అంట.. అంటే తనకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా తనే ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది రీతూ. కాగా ఈ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.