అసలు పాత తెలుగు పాటలు కూడా వింటారా.. నేను వింటాగా!
జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైన మైన, చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, ప్రియా ప్రియతమా రాగాలు, మాటే రానీ చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి... ఈ పాటలన్నీ ఇప్పటి తెలుగు సినీ లవర్స్ కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ 90's లోని తెలుగు సినిమా అభిమానులకి ఈ పాటలు ఎంతో సుపరిచితం. ఎందుకంటే అప్పటి పాటల్లో సాహిత్యం అంత బాగుండేది. ఇక ఇప్పుడు పాప్, వెస్టర్న్, రిథమ్, రీమిక్స్, అంటూ మ్యూజిక్ పై దృష్టి పెట్టి పాటలని యువతను ఆకట్టుకునేలా చేస్తున్నారు.
వేటూరి, సినారే, బాపు, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతోమంది పాత సినిమాలలోని పాటలకి ఓ అర్థాన్నిస్తూ గొప్పతనాన్నిచ్చారు. అయితే ఇప్పుడు ఆనాటి హిట్ సాంగ్స్ ని మళ్ళీ ట్రెండింగ్ లోకి తెచ్చారు ఇన్ స్టాగ్రామ్ లోని సెలబ్రిటీలు. " అసలు పాత తెలుగు పాటలు కూడా వింటారా.. నేను వింటాగా " అంటూ సాగే ఈ ట్యాగ్ లైన్ కి వెనకాల తమ ఫేవరెట్ పాత పాటలని జోడించి, తమ ఫోటోలని కూడా జతచేయొచ్చు. జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తిక్ తన ఇన్ స్టాగ్రామ్ స్టాటస్ లో చుక్కలు తెమ్మన్నా తెంపుకురానా అంటూ పాతపాటని ఆడ్ చేసుకున్నాడు. జిలిబిలి పలుకల చిలిపిగ పలికిన అంటూ సావిత్రి తన ఫోటోతో ఈ పాత పాటని ఆడ్ చేసుకుంది. సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట అనే పాత పాటని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ నయని పావని ఆడ్ చేసుకొని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
మౌనమేలనోయి ఇది మరుపురానీ రేయి అంటూ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ ఆరోహీరావ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వేవేల గొపెమ్మల మా మువ్వా గోపాలుడే, నా ముద్దు గోవిందుడే అంటూ రోహిణి తన పేజ్ లో పాత పాటని షేర్ చేసింది. కమ్మని నీ ప్రేమ లేఖలే, కన్నుల్లో నీ రూపమే, నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా అంటు ఇలా అందరు ట్రెండ్ ఫాలో అవుతుంటే దీప్తి సునైన తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. యువత ఎప్పుడు ట్రెండింగ్ ని ఫాలో అవుతుంటారు. అదే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోని సెలబ్రిటీలంతా ఫాలో అవుతున్నారు. ఏదైతేనేం పాత సినిమాలని, అందులోని పాటలని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారంటు మరికొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.