నాగార్జున కోసం మరో అమల.. ఏం మాట్లాడాలో అర్థంకావట్లేదన్న కింగ్ నాగ్
సంక్రాంతి వస్తుందంటే చాలు మూడు రోజుల పాటు బుల్లితెర మంచి కలర్ ఫుల్ గా ముస్తాబవుతుంది. స్పెషల్ ఈవెంట్స్ తో ధూమ్ మచాలే అన్నట్టుగా ఉంటుంది. ఇక ఇప్పుడు స్టార్ మా సంక్రాంతి కానుకగా వస్తున్న నాగార్జున నటించిన మూవీ 'నా సామిరంగా' పేరుతోనే ఒక స్పెషల్ ఈవెంట్ కి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఈ షోకి స్పెషల్ గెస్టుగా నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ వచ్చారు. ఇప్పుడు ఈ షో ప్రోమో ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేస్తోంది. ఇక బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్లు ఈ షోలో మళ్ళీ తళుక్కుమన్నారు. సీరియల్ సెలబ్రిటీస్ ని కూడా తీసుకొచ్చారు మేకర్స్. ప్రోమో స్టార్టింగ్ లో నటుడు శివాజీ పంచె కట్టులో ఎంట్రీ ఇచ్చాడు. మా ఊరి పేరు మొగ్గాపురం" అనడంతో స్పై టీమ్ శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్‌దీప్ "మా ఊరు చుక్కాపురం" అంటూ రచ్చ రంబోలా రేంజ్ లో డైలాగ్ చెప్పారు. నాగార్జున సార్ మా ఊరంటే మా ఊరొస్తారంటూ రెండూ టీమ్‌లు గొడవపడుతుండగా అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌తో కలిసి నాగార్జున ఎంట్రీ ఇచ్చి డాన్స్ చేశారు .
ఇంతలో సడెన్‌గా బ్రహ్మముడి సీరియల్ లో లీడ్ రోల్ లో నటిస్తున్న కావ్య అలియాస్ దీపిక రంగరాజు నాగార్జున దగ్గరికి వచ్చి "ఒక 10 మినిట్స్ నేనే మీ అమల" అని కావ్య ఫన్నీగా అడిగేసరికి నాగార్జున సిగ్గుపడుతూ పక్కకి పారిపోయారు. కావ్య తన అల్లరితో కింగ్ ని వదలకుండా నాగార్జున చేయి పట్టుకొని "నా సామిరంగా" మూవీలో రామ్ మిరియాల పాడిన పాట "ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల" సాంగ్ కి డాన్స్ చేయించింది. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు.. నాగార్జున మాత్రం కావ్యను చూసి "నాకు ఏం మాట్లాడాలో కూడా తెలీడం లేదు" అంటూ నవ్వేశారు.
ఈ షోలో బ్రహ్మముడి సీరియల్ హీరో రాజ్ అలియాస్ మానస్, కార్తీక దీపం డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల, ప్రియాంక లవర్ శివ్, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు భోలే, నయని పావని, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, దామిని, శ్రీసత్య, ముక్కు అవినాష్, నిఖిల్ సందడి చేశారు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‌కి సుమ హోస్ట్ గా ఉన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నాగ్ నటించిన "నా సామి రంగ" మూవీ ప్రమోషన్స్ కూడా ఐపోయాయి. ఇక ఈ షో సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతోంది.