నేను జబర్దస్త్ రావడానికి కారణం వీళ్ళే!

జబర్దస్త్ స్టేజ్ మీద ఎంతోమంది కమెడీయన్స్ తమ సత్తా చాటుకొని ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతున్నారు.  పాతనీరు పోయి కొత్తనీరు వచ్చినట్టుగా పాత కమెడీయన్స్ అందరు వెళ్ళిపోయాక కొత్త వాళ్ళు వచ్చారు. అలా ఎంతో మంది వచ్చి వారి ప్రతిభ చాటుకుంటున్నారు. వారిలో కెవ్వు కార్తిక్, జోర్దార్ సుజాత, రాకెట్ రాఘవ, ఇమ్మాన్యుయల్ , వర్ష, బుల్లెట్ భాస్కర్, నూకరాజు, సద్దాం, పవిత్ర, రోహిణి ఇలా కొత్తవాళ్ళ కామెడీతో జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వులు పూస్తున్నాయి. జబర్దస్త్ కొత్త యాంకర్ గా సిరి హనుమంత్ చేస్తుండగా...  జడ్జెస్ గా కృష్ణ భగవాన్, ఇంద్రజ చేస్తున్నారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా రష్మీ చేస్తుండగా.. జడ్జెస్ గా కృష్ణ భగవాన్, ఖుష్బూ వ్యవహరిస్తున్నారు. ఇమ్మాన్యుయేల్.. జబర్దస్త్ షో ద్వారా తన కామెడీతో తెలుగు టీవి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జబర్దస్త్ లో మొదట వర్షతో కలిసి లవ్ ట్రాక్ నడిపిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు అదంతా జబర్దస్త్ షో కోసమే అన్నట్టుగా చేస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో జబర్దస్త్ స్టేజ్ మీద చేసిన ప్రతీ స్కిట్ దాదాపు హిట్ అయిందనే చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఎంతో మంది కమెడియన్స్ తమని తాము మరింత నిరూపించుకోవడానికి సినిమాల్లోకి వెళ్తున్నారు.  ఇమ్మాన్యుయేల్ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు రీల్స్ చేస్తూ తనలోని కామెడీని అక్కడ కూడా నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇక సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో తన పర్సనల్ లైఫ్ ని ఓవైపు, జబర్దస్త్ షోలో జరిగిన సంఘటనలని మరోవైపు వ్లాగ్స్ గా  చేస్తూ  ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు.‌ అయితే కొన్ని రోజుల క్రితం ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. యూట్యూబ్ లో ఈ వెబ్ సిరీస్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ తాజాగా ' నేను జబర్దస్త్ కి రావడానికి కారణం వీళ్ళే' అంటూ మరో వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు.  ఇందులో తన గాలి బ్యాచ్ ని పరిచయం చేశాడు. వారి ఊరిలో వాళ్ళందరిని గాలి బ్యాచ్ అంటారని, వాళ్ళు మొత్తం అయిదుగురు ఫ్రెండ్స్ అంటు ఒక్కొక్కరి గురించి చెప్తూ తీసిన ఈ వ్లాగ్ కి ఇప్పుడు విశేష స్పందన లభిస్తుంది. ఇందులో తమ బాల్య మిత్రుల గురించి ఇమ్మాన్యుయేల్ చెప్పడంతో చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. మీ ఫ్రెండ్స్ లాగా మాకు ఉన్నారంటు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.  

టేస్టి తేజ తన వెంటపడ్డాడంట.. పాపం యశ్వంత్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ‌అందులోకి  వెళ్ళిక కంటెస్టెంట్స్ లలో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, నయని పావని, భోలే షావలి, అశ్వినిశ్రీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టీ తేజ, ఆట సందీప్, అంబటి అర్జున్ ఇలా దాదాపు అందరు ఎంటర్‌టైన్మెంట్ చేసి మెప్పించారు. ఒక్కోక్కరిది ఒక్కో స్ట్రాటజీ.. ఒక్కో గేమ్ ప్లే.. ఇలా అందరు తమ మాటతీరు, ఆటతీరుతో ఎంతో ఆకట్టుకున్నారు. ఇక శోభాశెట్టి అయితే బిగ్ బాస్ దత్తపుత్రికగా ట్రోలర్స్, యూట్యూబర్స్ అభివర్ణిస్తారు. దానికి కారణం లేకపోలేదు.. శోభాశెట్టి ఎలిమినేషన్ కోసం ఎంతోమంది అభిమానులు తనకి ఓటు వేయకుండా ప్రతీవారం చూసారు.. కానీ బిగ్ బాస్ మాత్రం తనని ఎలిమినేషన్ చేయలేదు. ఇక మరో వారంలో గ్రాంఢ్ ఫినాలే ఉంటందనగా శోభాశెట్టిని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ పై కాస్త ఇంట్రెస్ట్ కలిగించారు మేకర్స్. అయితే బిగ్ బాస్ హౌస్ లో శోభాశెట్టి, టేస్టీ తేజ కలిసి ఎక్కువగా ఉండేవారు. వీరిద్దరి మధ్య మంచి రాపో ఉంది. ఇద్దరి మధ్య గొడవలు, సాక్రిఫైజ్ లు, గేమ్స్,‌ జోక్స్, ఇలా ప్రతీది అందంగా ఫ్రేమ్ చేసి ఇద్దరి జర్నీ వీడియోలలో చూపించారు బిగ్ బాస్. అయితే హౌస్ లో ఉన్నన్ని రోజులు టేస్టి తేజని శోభా పేరుని టాటుగా వేయించుకోమని బిగ్ బాస్ కోరాడు.  అలా బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే రోజున శోభాశెట్టి పేరుని టేస్టీ తేజ వేయించుకున్నాడు.  బిగ్ బాస్ హౌస్ నుండి టేస్టీ తేజ ఎలిమినేషన్ అయిన రోజున శోభాశెట్టి చాలా ఏడ్చింది. ఎంతలా అంటే నువ్వు లేకుండా నేనుండలేనురా అని శోభాశెట్టి అంది. ఆ తర్వాత హౌస్ లో మాములుగానే ఉన్న శోభాశెట్టి.. మూడు వారాల తర్వాత ఎలిమినేషన్ అయింది. ఇక ఎలిమినేషన్ తర్వాత టేస్టీ తేజతో కలిసింది. ఇక తాజాగా టేస్టీ తేజ యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ ని ఇద్దరు చేసారు. జైలు మండి బిర్యానీ తినడానికి శోభాశెట్టి, టేస్టీ తేజ, శోభాశెట్టి వాళ్ల అమ్మ వెళ్ళారు.  అక్కడ ఏంటీ గొడవలు, దీనితో నేను పడలేకపోతున్నా అని నీకు ఎప్పుడైన అనిపించిందారా తేజ అని శోభాశెట్టి అడుగగా.. ఒక్కటా రెండా చాలాసార్లు అలానే అనిపించేదని టేస్టీ తేజ అన్నాడు. నాతో నీకున్న బెస్ట్ మెమోరీ ఏంట్రా తేజ అని అడుగగా.. చాలాసేపు ఆలోచించాడు తేజ. ఏరా అంత ఆలోచిస్తున్నావేంటని శోభా అడుగగా.. అంత గుర్తుంచుకోవాల్సినవేంటా అని ఆలోచిస్తున్నానని తేజ అన్నాడు. బేబీ సినిమాలో అటో డ్రైవర్ గా తేజ, లవర్ గా యశ్వంత్ ట్రోల్ చూసి ఇద్దరు నవ్వుకున్నారు. అలా వాళ్ళిద్దరిపై వచ్చే ట్రోల్స్ అన్నీ చూస్తూ నవ్వుకున్నారు. ఇక నువ్వు నా వెంట పడ్డావ్ కదారా అని శోభా అనగా.. అంతలేదని తేజ అన్నాడు. ఇలా ఇద్దరు కలిసి చేసిన ఈ వ్లాగ్ ఇప్పుడు  ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ ఇంటర్వూ కోసం వెయిటింగ్ అంటూ వీళ్ళిద్దరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.   

యూట్యూబ్ వ్లాగ్స్ తో నూకరాజు సంపాదన ఎంతో తెలుసా?

యూట్యూబ్ లో ఎన్నో ఛానెల్స్ ఉంటాయి. అందులో కొన్ని ట్రావెల్ వ్లాగ్స్, స్ట్రీట్ వ్లాగ్స్, రేసింగ్, గేమింగ్, టెక్నాలజీ వ్లాగ్స్,  విలేజ్ వ్లాగ్స్,  ఫుడ్ వ్లాగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద లిస్టే వస్తుంది. అయితే ఈ వ్లాగ్స్ కి ఎన్ని వ్యూస్ కి ఎంత మనీ వస్తాయనేది తెలియని వారికి ఓ ప్రశ్నగా ఉంటుంది. అలాంటిదే వివరిస్తూ జబర్దస్త్ నూకరాజు ఓ వ్లాగ్ చేసాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టిన ఒక్కో వ్లాగ్ కి ఎంత మనీ వచ్చిందో చెప్తూ మరో వ్లాగ్ చేశాడు. కాగా ఇప్పుడు ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తుంది. ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు.  నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే నూకరాజుకి కొన్ని ఫోక్ సాంగ్స్ పాడి ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీళ్ళు తమ ఛానెల్ లో చేసే వ్లాగ్స్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి.  కొన్నిరోజుల క్రితం రాపిడో నడుపుకుంటున్న ఓ అమ్మాయికి తమకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న ఆసియా, నూకరాజులు.. యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా అది ఫుల్ వైరల్ అయింది. ఇక ఇప్పుడు తన వీడియోలకి ఎంత మనీ వస్తుందో వివరించాడు నూకరాజు. ఓ వీడియో మీద నాలుగువేలు వస్తే అందులో థంబ్ నెల్ కి అయిదు వందలు తీసుకుంటారంట.. కెమెరా, సౌండ్, ఎడిటింగ్... ఇలా అన్నీ కలిపి పదిహేను వందల నుండి రెండు వేల వరకు వెళ్ళిపోతుంది. ఇక మిగిలేది రెండు వేలు మాత్రమేనంటూ నూకరాజు చెప్పుకొచ్చాడు. ఇలా అత్యధిక వ్యూస్ వచ్చినవాటికి వచ్చే డబ్బులతో ఇలా సాయం చేస్తామని తమకి సపోర్ట్ చేయమని నూకరాజు ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు.  

బోల్డ్ ఫోటోతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న దివి!

అటు బుల్లితెర.. ఇటు వెండితెర.. ఏదైన సరే కథ, కథనం ముఖ్యం. అయితే వీటిల్లో రొమాన్స్ అండ్ ఐటమ్ సాంగ్స్ కి ఉండే క్రేజే వేరు. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో పద్దతిగా చీరకట్టులో రీల్స్ చేసేవాళ్ళు, మరోవైపు బోల్ట్ లుక్ లో మిడ్డీలు, చెడ్డీలు వేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే పాజిటివ్ రీల్స్ చేసేవాళ్ళ కంటే బోల్డ్ ఫోటోలు, రీల్స్ చేసేవాళ్ళకే డిమాండ్ ఎక్కువ. కొందరు సరదా సరదాకే ఎక్స్ పోజింగ్.. మరికొంతమంది చిన్న తారలు దర్శక, నిర్మాతల కంట్లో పడడానికి ఎంతవరకైనా వెళ్తారు.‌ ఆ జాబితాలోకి ఇప్పుడు దివి వాద్య చేరింది. హాట్ అండ్ బోల్డ్ పిక్ తో మరోసారి ఇన్ స్టాగ్రామ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ భామ. దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది.  అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. దివి వాద్య ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది. ఇంకా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'భోలా శంకర్' మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ సొట్ట బుగ్గల సుందరి. అయితే దివి గతకొంత కాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో  హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తోంది. అలా తను పోస్ట్ చేసిన ఆ ఫొటోస్ చూసిన కొందరు నెటిజన్లు.. నీ అందంతో చంపేస్తావా ఏంటిని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తను పోస్ట్ చేసిన హాట్ ఫోటో వైరల్ గా మారింది. ఇలా తను ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తుంది. దివి త్వరలో కవర్ సాంగ్స్, మరికొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జీ-5లో విడుదలైన 'ఏటీఎమ్' వెబ్ సిరిస్ లో నటించిన దివి.. తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ భామని కొందరు నెటిజన్లు హీరోయిన్ మెటీరియల్ అని అంటున్నారు. మరి ఏ స్టార్ హీరో పక్కనైనా తనకి హీరోయిన్ గా ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి మరి.  

గుప్పెడంత మనసు జగతి అందాల జాతర!

సీరియల్ నటీమణులలో‌ ఎక్కువ ఫ్యాన్ బేస్ కంటెంట్ తో మొదట ఏర్పడుతుంది. బుల్లితెర ధారావాహికల్లో వచ్చే సీరియల్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో తెగ క్రేజ్ ఉంటుంది. అయితే సీరియల్స్ లో అందంతో పాటు అభినయాన్ని ప్రదర్శించేవారికి తెలుగు టీవీ అభిమానులు ఎక్కువే ఉంటారు. అలాగే వారిని ఆదరిస్తారు కూడా.. అలా ఆదరణ పొందిన వారిలో గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి తల్లి పాత్ర చేసిన జగతి అలియాస్ జ్యోతిరాయ్ ఒక్కతి. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లోని కొందరు నటీనటుల ఆన్ స్క్రీన్ కి వారి పర్సనల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ లోని రుద్రాణి(షర్మిత).. అందులో కాస్త పద్దతిగా ఉన్న బయట పాప్ స్టార్ లా ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో గుప్పెడంత మనసు సీరియల్ లోని జగతి అలియాస్ జ్యోతిరాయ్ ఉంటుంది. ఆమె తన పర్సనల్ లైఫ్ లో పొట్టి పొట్టి డ్రెస్ లతో దిగిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. జ్యోతి రాయ్.. ఈ పేరు విని ఉండకపోవచ్చు గానీ జగతి మేడమ్ అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత  'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది. తాజాగా జ్యోతిరాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రతీరోజు "గుప్పెడంత మనసు" సీరియల్ లో చీరకట్టులో ఒక అమ్మ పాత్రలో జగతిని చూసే ప్రేక్షకులకు, ఈ ఫోటోస్ నచ్చకపోవచ్చు. అంతలా హాట్ అండ్ బోల్డ్ పిక్ ని అప్లోడ్ చేసి కుర్రాళ్ళ మతిపోగొడుతుంది ఈ భామ. 

పండుగ మొదలైంది.. భోగి మంటల్లో కృష్ణ ముకుంద మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -365 లో.. సంక్రాతి పండుగ సందర్బంగా ఇంట్లో పిండి వంటలు చెయ్యడంలో కుటుంబం మొత్తం బిజీగా ఉంటుంది. శకుంతల అరిసెలు చేస్తుంటే ముకుంద పిండి కలుపుతుంటుంది. మధు వీడియో షూట్ చేసే పనిలో ఉంటాడు. నన్ను నా తప్పుని క్షమించి నాతో కలిసి మెలిసి ఉంటున్నారని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. కృష్ణ స్వెటర్ లో రావడం చూసి ఏంటి అలా వస్తున్నారని నందు అడుగుతుంది. తనకి స్వెటర్ కావాలని అడిగింది. అది కూడా ఇలా లూస్ ఉంటేనే ఇష్టమట అనగానే అందరు నవ్వుతారు. మీరు నవ్వుకున్నా ఏం చేసిన నాకు ఇలాగే ఇష్టమని కృష్ణ అంటుంది. అయిన మీకు పెళ్లి అయింది. ఇప్పుడు స్వెటర్ ఎందుకని ముకుంద అనగానే.. కృష్ణ, మురారి సిగ్గు పడుతారు. ఆ తర్వాత పంతులు గారికి ఫోన్ చేశాను. పండుగ అయ్యేంత వరకు మంచి రోజులు లెవ్వట అని మురారికి రేవతి చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ మురారి ఇద్దరు కలిసి సరదాగా ఒక గేమ్ అడుతారు. మురారి వీపుపై దువ్వెనతో కృష్ణ ఒక నేమ్ రాస్తుంది దానిని మురారి గెస్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. మరొకవైపు పిండి వంటలు పూర్తి చేస్తారు. ముకుంద మారిపోయి మనతో మంచిగా ఉంటుంది కానీ మధుకి ముకుంద నటిస్తుందని అంటున్నాడు అని శకుంతల అనగానే.. నాక్కూడా ముకుంద మారింది అనిపిస్తుందని రేవతి నందు ఇద్దరు అంటారు కానీ మధు మాత్రం ఇంకా డౌట్ గానే ఉంటాడు. మరొకవైపు గౌతమ్ ఇంటికి వస్తాడు. అ తర్వాత భోగి మంటల కోసం ఇంట్లో పనికి రానివాటిని తీసుకొని రమ్మని భవాని అనగానే అందరు తమ గదుల్లో ఉన్న వెస్ట్ సామాన్లని తీసుకొని వస్తారు. అ తర్వాత కృష్ణ ఇనుప వస్తువు తీసుకొని వస్తే అందరు నవ్వుతారు. ఈ వేస్ట్ సామాను వేరేవాళ్ళకి ఉపయోగపడుతాయ్.. భోగి మంటలకు వేరే ఏర్పాటు చేశానని భవాని చెప్తుంది. మరొక వైపు శకుంతల భోగి మంటలకు ఏర్పాటు చేస్తు.. భవాని వదిన నాతో మాట్లాడిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అ తర్వాత అందరు భోగి మంటల దగ్గరికి వస్తారు. ముకుంద ఒక్కర్తే ఇంట్లో ఉంటుంది. పాపం ముకుంద ఒక్కర్తే ఉంది. ఫీల్ అవుతుంది.. తీసుకొని రావాలా అని భవానిని కృష్ణ అడుగుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే  

రౌడీలని కొట్టి పంపేసిన చక్రపాణి.. శైలేంద్ర ప్లాన్ ఫెయిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -971 లో.. రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం శైలేంద్ర రౌడీలని వసుధార ఇంటికి పంపించి.. అక్కడ రిషి ఉన్నాడో‌? లేడో చూడమని చెప్పి పంపిస్తాడు. రౌడీలు వసుధార వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఇంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తారు కానీ ఇంట్లోకి వెళ్లకుండా చక్రపాణి అడ్డుగా ఉంటాడు. ఆ తర్వాత రౌడీలని చక్రపాణి కర్రలతో కొడుతాడు. దాంతో రౌడీలు పారిపోతారు. మరొకవైపు వసుధార ఏమైందంటు బయటకు వచ్చి చక్రపాణిని అడుగుతుంది. అతను జరిగింది మొత్తం వసుధారకి చెప్తాడు. ఆ రౌడీ ల నుండి రిషి సర్ ని ఎలాగైనా కాపాడుకోవాలని వసుధార అనగానే.. నన్ను దాటి లోపలికి ఎవరు రాలేరు. మీరు నిశ్చింతగా ఉండండి అని వసుధారకి చక్రపాణి దైర్యం చెప్పి లోపలికి పంపిస్తాడు. అ తర్వాత డోర్ బయటే చక్రపాణి ఎవరు రాకుండా కాపలాగా ఉంటాడు. మరొకవైపు రౌడీలు శైలేంద్రకి ఫోన్ చేసి అక్కడ రిషి లేడని అబద్ధం చెప్తారు. మీరు అబద్ధం చెప్తున్నట్లు అనిపిస్తుందని శైలేంద్ర అనగానే లేదు నిజమే చెప్తున్నామని రౌడీలు అంటారు. మరొకవైపు ముకుల్, వసుధార కలిసి శైలేంద్ర గురించి మాట్లాడుకుంటారు. శైలేంద్ర ఎప్పటికప్పుడు చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడని ముకుల్ అంటాడు. నిన్న కూడా ఎటాక్ జరిగిందంటు వసుధార చెప్తుంది. రిషి సర్ ని ఎక్కడ ఉంచాలో అర్థం కావడం లేదని వసుధార అంటుంది. మరొకవైపు దేవయాని ఎన్నడు లేని విధంగా ధరణికి జ్యూస్ తీసుకొని వచ్చి మంచిగా మాట్లాడుతుంది. ఏమైంది ఇలా చేస్తుంది.. ఏదో ప్లాన్ ఉందని ధరణి అనుకుంటుంది. రిషి ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని దేవయాని అడుగుతుంది. తెలియదు అయిన తెలుసుకొని నేనేం చెయ్యలని ధరణి అంటుంది. ఆ తరువాత ధరణి వెళ్ళిపోయాక శైలేంద్ర వచ్చి.. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పిందా అని అడుగుతాడు. తెలియదట ఈ మధ్య మాటలు బాగా నేర్చింది నీ భార్య అంటు శైలేంద్రతో దేవయాని చెప్తుంది. మరొకవైపు అనుపమ, మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటుండగా.. భద్ర వచ్చి నాకేం వర్క్ చెప్పడం లేదు.. వసుధార మేడమ్ కి సెక్యూరిటీ అన్నారు. మేడం లేదు ఇంకేం చెయ్యాలి జాబ్ మానేస్తానని భద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ప్రేమికురాలికి బ్లడ్ ఇచ్చి కాపాడుకున్న కళ్యాణ్.. మోస్ట్ ఎమోషనల్ సీన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -304 లో....ఇంట్లో అందరు కావ్య పూజ జరగకూడదని ఇలా చేసింది అంటుంటారు. అంత ఇంపార్టెంట్ అయితే చెప్పి వెళ్ళాలి కదా అని అనామిక అంటుంది. కావ్య తన భర్తకి చెప్పి వెళ్ళింది. తనకి చెప్తే అందరికి చెప్పినట్టే అయిన రాజ్ నీ బావ తనని అడగడమేంటి? కళ్యాణ్ నీ భర్త వాన్ని ఏమైనా అడుగు అంతే గాని అలా రాజ్ ని ప్రశ్నించకని అనామికని ఇందిరాదేవి తిడుతుంది. అసలు అనామిక, ధాన్యలక్ష్మి అన్న దాంట్లో తప్పేం ఉంది. అసలు ఏమైందని చెప్పాలి కదా? కావ్య కావాలనే చేసిందని రుద్రాణి అంటుంది. అలా కావ్య కావాలని ఏం చెయ్యదు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వెళ్ళిందని రాజ్ అంటాడు. కావ్య ఎందుకు వెళ్లిందో చెప్పు రాజ్ అప్పుడే వీళ్ళ నోరు మూతపడుతుందని సుభాష్ అంటాడు. అప్పుకి ఆక్సిడెంట్ అయింది. అందుకే వెళ్ళింది. ఇప్పటివరకు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడారు.. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు పూజ ఆగవద్దని కావ్య చెప్పి వెళ్ళిందని రాజ్ చెప్తాడు. దాంతో అప్పుకి ఎలా ఉంది నేను వెళ్తానని కళ్యాణ్ అంటాడు. వద్దు ఇప్పటికే అందరు కావ్యని అంటున్నారు ఇప్పుడు నువ్వు వెళ్తే ఇంకా కావ్యని తిడుతారు పూజ జరగాలని రాజ్ అంటాడు. నా చెల్లెకి అలా ఉంటే నేను హ్యాపీగా ఎలా పూజ చెయ్యగలనని స్వప్న పూజ చెయ్యదు. కళ్యాణ్ .. నువ్వు అనామిక చెయ్యండి లేదంటే మీ ఆవిడ పుట్టింటికి వెళ్లిన వెళ్తుందని స్వప్న అంటుంది. ఆ తర్వాత అనామిక, కళ్యాణ్ ఇద్దరు పూజ చేస్తుంటారు. అయిన కళ్యాణ్ మాత్రం అప్పు గురించి ఆలోచిస్తు ఉంటాడు. మరొకవైపు కావ్య ఎంత ట్రై చేసిన బ్లడ్ దొరకదు. దాంతో చేసేదేమీ లేక రాజ్ కి ఫోన్ చేస్తుంది కావ్య. అర్జంట్ గా ఓ నెగెటివ్ బ్లడ్ కావాలి.. లేదంటే అప్పు కోమాలోకి వెళ్తుందంట అని కావ్య ఏడుస్తూ ఉంటుంది. కానీ రాజ్ ఫోన్ తీసుకొన్న కళ్యాణ్.. నాది ఆదే బ్లడ్  వస్తున్నా వదిన అని కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ వెళ్ళబోతుంటే ఇంట్లో అందరు వద్దని చెప్తారు. కానీ కళ్యాణ్ వినకుండా వెళ్తాడు. వెళ్లనివ్వండి హెల్ప్ చెయ్యడానికి వెళ్తున్నాడని సుభాష్, ప్రకాష్ ఇద్దరు అంటారు. మరొకవైపు కళ్యాణ్ అప్పుకి బ్లడ్ ఇస్తాడు. త్వరగా మాములుగా అవ్వు అప్పు అంటూ కళ్యాణ్ భాదడతాడు. మరొకవైపు కావ్య ఈ సిచువేషన్ ని బాగా ఉపయోగించుకోవాలని అనుకుందంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మి, అపర్ణ ముగ్గురు కలిసి కావ్య గురించి నెగెటివ్ గా మాట్లాడుతుంటారు. మరొకవైపు డాక్టర్ వచ్చి అప్పుకి ఏం పర్లేదని చెప్తుంది. తరువాయి భాగంలో కళ్యాణ్, కావ్య ఇద్దరు ఇంటికి వస్తారు. ఇక అందరు కావ్య ఏదో తప్పు చేసింది అన్నట్లుగా తిడతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

యావర్ తో నయని పావని పాట. శివాజీ ఏం చేశాడంటే!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ  చూసిన 'గుంటూరు కారం' సినిమాలోని ఆ కుర్చీ మడతబెట్టి సాంగ్ నడుస్తుంది. చిన్న సెలబ్రిటీల నుండి పెద్ద స్టార్స్ దాకా ఈ పాటకి అదే కాస్ట్యూమ్ వేసుకొని అదిరిపోయే డ్యాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ నయని, యావర్ కలిసి ఈ పాటకి డ్యాన్స్ చేసారు. కాగా ఈ వీడియోకి ఇప్పుడు అత్యధిక వ్యూస్ వచ్చాయి. నయని పావని హౌస్ లో ఉంది వారం రోజులే అయిన శివాజీని నాన్న అని పిలవడంతో అందరికి దగ్గరైంది. హౌస్ లోని వారందికి నయని దగ్గరవ్వడం, దీనికి తోడు శివాజీతో ఉన్న రాపో తెలిసిందే.  హౌస్ లో శివాజీ ఉన్నప్పుడు ఎలాగైతే ఓట్లు వేసేవారో ఇప్పుడు అదే రేంజ్ లో వీరిద్దరి కలిసి చేసిన డ్యాన్స్ రీల్ ని చూస్తున్నారు. కాబట్టే ఈ పాట అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తమ ఆటతీరు, మాటతీరుతో ఫ్యాన్ బేస్ పెంచుకున్న యావర్, నయని పావని కలిసి ఈ పాటకి చిందలేశారు. బాస్ 2.0 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాద్  అమ్మాయి నయని పావని. ఈ అమ్మడు పెద్దగా పరిచయం లేని పేరే. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా అంత ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఢీ-14 షో కి వచ్చిన నయని.. కమెడియన్ హైపర్ ఆదితో కలిసి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది.  టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది నయని. తను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే... నయనీకీ డాన్స్, షాపింగ్ అంటే ఇష్టమంట. నయని కలహం, మధురం అనే వెబ్ సిరీస్ లలో నటించింది. అదేవిధంగా  సూర్యకాంతం మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా నటించింది నయని. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫోటలతో, రీల్స్ తో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. ఇప్పటికే తనకి ఇన్ స్ట్రాగ్రామ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉండగా, బిగ్ బాస్ ఎంట్రీ ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకోవాలని వెళ్ళింది. 2.0 లో ఎంట్రీ ఇచ్చిన నయని.. లోపల ఉన్నవాళ్ళ ఆటతీరుకి, బయట ప్రేక్షకుల స్పందననలని అన్నింటిని అనాలసిస్ చేసి వెళ్లింది. భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చిన ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ నయని.. హౌజ్ లోకి వెళ్ళి వారం రోజుల్లో‌ బయటకి వచ్చేసింది కానీ ఎంతో ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. కాగా నయని పావని, ప్రిన్స్ యావర్‌తో కలిసి కుర్చీ మడతపెట్టి సాంగ్‌కి స్టెప్పులేసింది. ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. యావర్, నయని పావని ఇద్దరికి శివాజీ సపోర్ట్  ఉంటుంది కాబట్టి వారి ఫ్యాన్స్ ఈ పాటని ప్రమోట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.  

Brahmamudi:ప్రాణాపాయ స్థితిలో అప్పు.. తన ప్రేమని బ్రతికించుకోగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -303 లో.... స్వప్న పూజకి రెడీ అవుతుంది.‌ అత్త అంటూ రుద్రాణిని పిలిచి.. నా చీరలు కుచ్చులు సెట్ చెయ్ అనగానే రుద్రాణి, రాహుల్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. స్వప్న అలా తనతో పని చేయించుకోవడంతో రుద్రాణికి కోపం వస్తుంది కానీ ఏం చెయ్యలేదు. స్వప్న చీర కుచ్చులు సెట్ చేస్తుంది. ఆ తర్వాత పూజకి రండి అని పంతులు గారు పిలుస్తాడు. అనామిక, కళ్యాణ్ ఇద్దరు జంటగా వస్తుంటే ధాన్యలక్ష్మి చూసి మురిసిపోతుంది. అ తర్వాత స్వప్న, రాహుల్ లు వస్తారు. తన కొడుకు కోడలు వస్తుంటే వాళ్ళ అమ్మ ఎలా మురిసిపోతుంది.. మీరేంటి మొహం అలా పెట్టారని రుద్రాణిని స్వప్న అడుగుతుంది. నా మొహం అంతే అని రుద్రాణి కోప్పడుతుంది. మరొక వైపు కావ్య, రాజ్ ఇద్దరు రెడీ అయి వస్తుంటే.. అప్పుడే కనకం ఫోన్ చేసి  అప్పుకి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. దాంతో పద వెళదామని రాజ్ అనగానే.. నేను వెళ్తాను మీరు కిందకి వెళ్ళండి. పూజ ఆగకూడదని రాజ్ తో కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ ఒక్కడే కిందకి రావడం చూసి ఇంట్లో వాళ్ళు కావ్య ఎక్కడ అని అడుగుతారు. బయటకు వెళ్ళింది.. మీరు పూజ జరిపించండి అని రాజ్ అనగానే.. మంచి మాట చెప్పావని ధాన్యలక్ష్మి అంటుంది. అంటే ఏంటి అర్ధం నీ కొడుకు కోడలు పూజ చేస్తే సరిపోతుందా కావ్యపై కోపాన్ని రాజ్ పై చూపిస్తున్నావా? కావ్య పై నాకు కోపం ఉన్నా కూడా నా కొడుకు భార్యనే అని అపర్ణ అంటుంది. నీ కోడలు వచ్చినప్పటి నుండి పూర్తిగా స్వార్థంగా మారిపోయావని అపర్ణ అంటుంది. కావ్య వచ్చాకే పూజ జరుగుతుందని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు కావ్య హాస్పిటల్ కి వెళ్లి కనకాన్ని కలిసి బాధపడుతుంది. అప్పుని ఆ సిచువేషన్ లో చూసి కావ్య బాధపడుతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి బ్లడ్ కావాలని చెప్తుంది. సరే నేను ట్రై చేస్తానని కావ్య వెళ్తుంది. మరొకవైపు అనామిక పూజ దగ్గర నుండి లేచి వెళ్ళబోతుంటుంది. ఏమైందని ఇంట్లో వాళ్ళ అడుగుతారు. కావ్యకి ఈ పూజ జరగడం ఇష్టం లేదని అనామిక అంటుంది. అంత ఇంపార్టెంట్ వర్క్ అయితే ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళాలి కదా అని అనామిక అనగానే.. భర్తకి చెప్పి వెళ్లినా చెప్పినట్టే అని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో అప్పుకి యాక్సిడెంట్ అయిన విషయం రాజ్ ఇంట్లో అందరికి చెప్తాడు. అదే సమయంలో బ్లడ్ త్వరగా ఎక్కించకపోతే పేషెంట్ కోమాలోకి వెళ్తుందని డాక్టర్ చెప్తుంది. దాంతో కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedanatha Manasu:గుప్పెడంత మనసులో కీలక మలుపు..  విలన్ ని వెతుక్కుంటు వచ్చిన వాళ్ళిద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -970 లో.. రిషిని సేవ్ చేసిన ముసలి వాళ్ళ దగ్గరికి శైలేంద్ర వస్తాడు. శైలేంద్ర రావడంతో వాళ్లకి అతన్ని  చూడగానే అనుమానం వస్తుంది. దాంతో ఎందుకు వచ్చావని అడుగుతారు. నడుము నొప్పిగా ఉంది వైద్యం కోసం వచ్చానని శైలేంద్ర అనగానే.. ఆ ముసలివాళ్ళు వైద్యం పేరిట శైలేంద్రని కర్రతో నడుముపై కొడుతుంటారు. ఎన్నో రోజుల పగతో ఉన్నట్లుగా ముసలి వాళ్ళు శైలేంద్రని కొడుతారు. కాసేపటికి వైద్యం మధ్యలో ఆపితే నరాలు పని చెయ్యవని శైలేంద్రని ఆ ముసలాయన బెదిరిస్తాడు. ఆ తర్వాత శైలేంద్రకు బాడీ మొత్తం మసాజ్ చేస్తుంటారు. కొడితే కొట్టారు కానీ ఇలా బాగుందంటు శైలేంద్ర రిలాక్స్ అవుతున్న టైమ్ లో ముసలాయన సెకండ్ కోటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎడాపెడ ఆ ముసలాయన కొడుతుంటే శైలేంద్ర పడే బాధ వర్ణనాతీతం.. మరొకవైపు శైలేంద్ర ఎక్కడికి వెళ్ళాడంటు ధరణిని దేవయాని అడుగుతుంది. నాకేం తెలుసు ఏక్కడకైన వెళ్తుంటే.. నేను అడిగితే నీకెందుకు అంటారు కదా అని దేవయానితో ధరణి చెప్తుంది. అంటే నీ భర్త ఎక్కడికి వెళ్తున్నాడని నువ్వు తెలుసుకోవా? అయిన ఈ మధ్య మమ్మల్ని ఎదరించి మాట్లాడడం బాగా అలవాటైందని దేవాయని అంటుంది. అ తర్వాత శైలేంద్ర ఫోన్ కి దేవయాని కాల్ చేస్తుంది.‌ అప్పుడు ముసలావిడ ఫోన్ లిఫ్ట్ చేసి ఈ అబ్బాయికి నరాలు పని చెయ్యడం లేదని అనగానే.. మీరెవరని దేవయాని అడుగుతుంది. అలా‌ అనేసరికి వెంటనే శైలేంద్ర ఫోన్ తీసుకొని.. నీకు అన్ని తర్వాత చెప్తాను మమ్మీ అంటాడు. ఆ తర్వాత శైలేంద్రకి వాళ్ళు ఇచ్చిన వైద్యం పూర్తవ్వగానే లేచి నిల్చొని.. మీకు రిషి అనే అతను తెలుసా అంటూ రిషి ఫోటో చూపిస్తాడు. ముసలివాళ్ళు శైలేంద్రపై డౌట్ రావడంతో తెలియదని చెప్తారు. అప్పుడే అక్కడికి వసుధార, ముకుల్ లు వస్తారు. వాళ్ళని అక్కడ చుసిన శైలేంద్ర షాక్ అవుతాడు. ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది.. ముకుల్  ఇండైరక్ట్ గా శైలేంద్రకి కౌంటర్ వేస్తుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర వెళ్ళిపోతాడు. ఏంటి వీళ్ళు నన్ను ఫాలో అవుతు ఉంటున్నారా అని శైలేంద్ర అనుకుంటాడు. అసలు రిషి వసుధార ఇంట్లోనే ఉంటాడా తెలుసుకోవాలి.. ఎలా తెలుసుకోవాలని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:భవానీ పశ్చాత్తాపం.. ముకుంద కొత్త డ్రామా వారికి కొత్త సమస్య కానుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -364 లో.. శకుంతల జైలర్ ఫోన్ కి కాల్ చేసి ప్రభాకర్ తో మాట్లాడుతుంది. జైలులో ఎవరితోనో గొడవ పడ్డావంట కదా అలా ఎవరితోనూ గొడవ పడకని శకుంతల చెప్తుంది. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు.. బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని ప్రభాకర్ చెప్తాడు. నువ్వేం బాధపడకు చిన్నమ్మ.. ఎలాగూ చిన్నాన్న వారం రోజుల్లో బయటకు వచ్చేస్తాడు కదా అని ముకుంద అంటుంది. ఆ తర్వాత ముకుంద పూర్తిగా మారిపోయింది అనేలాగా తన మాటతీరు ఉంటుంది. ఈ సంక్రాతిని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ముకుంద హుషారుగా మాట్లాడుతుంటుంది.కానీ మధుకి మాత్రం ఎక్కడో చిన్న డౌట్ ముకుంద నటిస్తుందని. మరొకవైపు కృష్ణ మురారి ఇద్దరు ఆదర్శ్ గురించి కనుక్కోవడానికి బయటకు వెళ్తారు. ఆదర్శ్ గురించి చెప్పడానికి మెహత అనే పర్సన్ వచ్చి.. కృష్ణ, మురారీలని కలిసి నేను తన గురించి కనుకొని మీకు చెప్తానని వెళ్ళిపోతాడు. కాసేపటికి నాకు చలి గా ఉందని మురారిని స్వెటర్ కొనివ్వమని కృష్ణ అడుగుతుంది. మురారి స్వెటర్ కొనిస్తాడు. మరొకవైపు భవానిని చూసి.. అక్క తప్పుకి సపోర్ట్ చేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతుంది. అక్కని అడిగాకనే పంతులుకి ఫోన్ చేస్తాను. లేదంటే తనని పక్కన పెట్టామని  ఫీల్ అవుతుందని రేవతి అనుకొని భవాని దగ్గరకి వస్తుంది. నాపై నీకు కోపంగా లేదా అని రేవతిని భవాని అడుగుతుంది. లేదు అక్క మీరు తప్పుని నిజం అనుకొని భ్రమపడ్డారు అంతేనని రేవతి చెప్పగానే.. భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణ, మురారిల అగ్రిమెంట్ పెళ్ళిని పర్మినెంట్ చెయ్యలని మురారి అన్నాడని చెప్పారు కదా పంతులు గారిని పిలువమంటారా అని రేవతి అంటుంది. వాళ్ళ బంధాన్ని శాశ్వతం చేద్దామని భవాని అనగానే రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు చలిలో ఐస్ క్రీమ్ కావాలని కృష్ణ అనగానే.. మురారి నవ్వుకుంటాడు. ఆదర్శ్ పని మీద బయటకు వస్తే స్వెటర్ అంటుంది. ఐస్ క్రీమ్ అంటుంది.. ఇందుకే నాకు కృష్ణ నచ్చిందని మురారి అనుకుంటాడు.. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కొత్త వ్లాగ్స్ తో ప్రియాంక, శోభాశెట్టి.. ఇకమీదట సీరియల్ ఆఫర్స్ కష్టమేనా!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో సీరియల్ బ్యాచ్ కి ఉండే ప్రత్యేకతే వేరు. ఎందుకంటే వారెన్ని ఫౌల్స్ చేసిన బిగ్ బాస్ వాళ్ళకే సపోర్ట్ చేసేవాడు. ప్రియాంక, శోభాశెట్టి, అమర్ దీప్ ఎన్ని ఫాల్స్ చేసినా, వారు నామినేషన్ లో‌ లీస్ట్ లో ఉన్నా వారిని ఎలిమినేషన్ చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే శోభాశెట్టి, ప్రియాంకలని అన్ని వారాలు హౌస్ లో ఉంచినందుకు చాలామంది బిగ్ బాస్ అభిమానులు తెగ ట్రోల్స్ చేశారు.‌ అయితే బిగ్ బాస్ హౌస్‌ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూ మారిపోతుంది. తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. రియల్ లైఫ్‌‌లో వాళ్ల వ్యక్తిత్వం ఏంటనేది బయటకు తెలిసిపోయిన తరువాత ఆయా పాత్రలకు పూర్తి న్యాయం చేయలేరు. జీవం పోయలేరు. నిజానికి వాళ్ల నటనలో ఎలాంటి తేడా ఉండదు కానీ.. చూసే ఆడియన్స్‌ మాత్రం వాళ్లని రిసీవ్ చేసుకోలేరు. బిగ్ బాస్‌కి వెళ్లొచ్చిన నటీనటీలకు సరైన అవకాశాలు రావకపోవడానికి ప్రధాన కారణం ఇదే. వాళ్ల రియల్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిన తరువాత.. వాళ్ల రియాలిటీకి దగ్గరగా ఉండే పాత్రల్లో మాత్రమే మెప్పించగలరు. కాదని కొత్త పాత్రలు ఇస్తే వాళ్ల వ్యక్తిత్వానికి పూర్తి అపోజిట్‌గా ఉండే పాత్రల్ని క్రియేట్ చేస్తే అవి ఖచ్చితంగా బెడిసికొడతాయి. కాబట్టే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ఏదైన సినిమాలో‌ ఛాన్స్ ఇవ్వాలంటే దర్శక నిర్మాతలు అంతలా ఆలోచిస్తుంటారు. వీళ్లని జనం మొత్తం చదివేశారు. వీళ్లని మనం ఎలా చూపించినా మెప్పించలేం. ఎందుకుంటే వాళ్లేంటో జనానికి తెలుసు కాబట్టి కొత్త వాళ్లే బెటర్ అని వేరే ఆప్షన్‌కి వెళ్లిపోతుంటారు. శోభాశెట్టి కెరియర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమెకు అవకాశాలు లేవు.. దానికి తోడు ఇప్పుడు బిగ్ బాస్ తరువాత.. ఆమె నిజస్వరూపం ఏంటన్నది బిగ్ బాస్ బయటపెట్టేశాడు కాబట్టి ఇక ఆమె చేస్తే తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే నెగిటివ్ పాత్రలే చేసుకోవాలి తప్పితే మంచి పాత్రలు వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు. దీంతో శోభాశెట్టికి ఇక్కడ తెలుగులో నటించే అవకాశాలు కన్పించడం లేదు. తిరిగి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళడం తప్పితే మరో దారి కనిపించడం లేదు. శోభాశెట్టితో పాటుగా ప్రియాంక పరిస్థితి కూడా అంతేలా ఉంది. ఆమె రియల్ క్యారెక్టర్ ఏంటో తెలియనప్పుడు.. ‘మౌనరాగం’లో అమ్ములుగా.. జానకి కలగనలేదులో జానకిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. కానీ బిగ్ బాస్‌లో ఆమె ఒరిజినాలిటీ ఏంటో అందరికి తెలిసిపోయింది కాబట్టి గతంలో మాదిరిగా.. జానకి, అమ్ములుగా కనిపించడం అయితే కష్టమే. కాబట్టి బిగ్ బాస్‌లో కన్నడ కంత్రీలుగా పేరొందిన శోభాశెట్టి, ప్రియాంకలు తిరిగి కన్నడ సీరియల్స్‌ వైపే అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఎలాగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఇక వాటిల్లోనే వాళ్లని చూడాల్సిన పరిస్థితి.  

ఎడారిలో ఫోటోషూట్.. ట్రెండింగ్ లోకి బిగ్ బాస్ సుదీప!

కొందరు సెలబ్రిటీలు ఏం చేసిన ట్రెండింగ్ లో ఉంటారు. మరికొందరు  సాధారణంగా ఎక్కడికి వెళ్ళిన వైరల్ న్యూస్ గా మారుతుంటారు. కజకిస్తాన్ లో అశ్వినిశ్రీ, కులుమనాలిలో కీర్తిభట్, దుబాయ్ లో అనిల్ జీలా, థాయ్ లాండ్ లో శ్రీముఖి.. ఇలా కొంతమంది కొన్ని విదేశీ ట్రావెల్స్ చేసినప్పుడు వారు చేసిన వ్లాగ్స్ ట్రెండింగ్ లోకి వెళ్తాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ లలో ఇనయా, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, గీతు రాయల్, ఫైమా, ఆదిరెడ్డి రెగ్యులర్ గా రీల్స్, పోస్ట్, వ్లాగ్స్ అంటూ ఏదో ఒక సోషల్ మీడియా వేదికలో కన్పిస్తూనే ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ జాబితాలోకి పింకీ చేరింది.  పింకి అలియాస్ సుదీప.. బిగ్ బాస్ సీజన్ -6 తో అందరికి సుపరిచితమైన నటి. అంతకముందు 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి చెల్లి పింకీగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుండి అందరూ ఆ సినిమాలో చేసిన పింకి కదా అని తనని అనేవారంట. దాంతో తన పేరుని సుదీప పింకీ అని మార్చేసుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ ఎక్కువ సమయం కిచెన్ లోనే గడిపిన సుదీపని అందరూ ఒక అమ్మగా చూసేవారే తప్ప.. తోటి కంటెస్టెంట్ గా ఎవరూ చూసేవారు కాదు. హౌస్ లో బాలదిత్య, చలాకీ చంటి, ఫైమాలతో ఎక్కువ సమయం గడిపిన సుదీప.. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసిన పని పని అంటూ గడిపిన సుదీప.. బయటకొచ్చాక ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. అయితే బిగ్ బాస్ సీజన్‌-6 తర్వాత ఇంట్లోనే ఫ్యామిలీతో గడుపుతూ బిజీగా ఉంటున్న పింకి అలియాస్ సుదీప.‌. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒమన్ వెళ్ళినట్టుగా చెప్పింది.‌ అక్కడ ఎడారిలో ఓ ఫోటో షూట్ ప్లాన్ చేయగా డిఫరెంట్ గా ఓ క్యాప్ పెట్టుకొని కన్పిస్తుంది. ఇక ఈ ఫోటోలని తన  అకౌంట్ లో చూసిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో బాల ఆదిత్య, రాజ్, ఫైమాలతో ఎక్కువగా ఉన్న సుదీప బయటకొచ్చాక నేహా పెళ్ళికి కలిసింది. ఆ తర్వాత కీర్తి భట్ ఎంగేజ్ మెంట్ లో అందరితో కలిసి రీల్స్ చేసింది. ఇక ఇప్పుడు తన భర్తతో కలిసి ఫారెన్ లో ఉంటున్న ‌సుదీప.. ఎడారిలో దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. కాగా ఇప్పుడు సుదీప‌ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.  

బి -గ్రేడ్ స్టోరీస్ వస్తున్నాయి..ఫ్రెండ్స్ అంతా ఫేక్...

‘బిగ్ బాస్ 4’ ద్వారా ఆడియన్స్ కి పరిచయమైన అఖిల్ సార్ధక్ ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఐతే బిగ్ బాస్ హౌస్ కొంతమందికి బీభత్సంగా కలిసొచ్చేస్తుంది కానీ కొంతమందికి అస్సలు కలిసి రాదు అనడానికి అఖిల్ ఒక ఉదాహరణ. ఆయనకు హౌస్ నుంచి బయటకు వచ్చాక అవకాశాలైతే పెద్దగా రాలేదు. ఐతే త్వరలో స్టార్ట్ అయ్యే బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 కి వెళ్లాడంటూ టాక్ ఐతే వస్తోంది. ఇక అఖిల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు. " చాలా మంది నెక్స్ట్ ఏమిటి అని అడుగుతారు. అదసలు నాకు నచ్చదు. ఆడియన్స్ నా నుంచి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవి చేయకపోవడం వలన వాళ్లంతా కొంచెం డిజప్పోయింట్ అవుతున్నారు. ఐతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మూవీ ఆఫర్స్ వచ్చాయి కానీ అవి బి -గ్రేడ్, ఫుల్ లస్ట్ స్టోరీస్ వచ్చాయి. ఐతే నా ఫామిలీ ఆడియన్స్ ఆ మూవీస్ చూడడానికి ఇష్టపడరు. నేను డబ్బు కోసం ఏ సినిమా ఐనా చేయొచ్చు.. ఇలాంటి ఒక్క సినిమా రిలీజ్ ఐతే గనక ఆ తర్వాత నుంచి అందరూ నన్ను అలాగే జడ్జి చేయడం స్టార్ట్ చేస్తారు. అలాంటి రోల్స్ మాత్రమే రావడం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మూవీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. కొంచెం లేట్ ఐనా పర్లేదు కానీ మంచి మూవీతో వస్తాను. నాకు దైవ భక్తి ఎక్కువ..అందుకే కేదార్నాథ్ లాంటి ప్లేసెస్ కి వెళ్తూ ఉంటాను. మన జీవితంలో వచ్చేవాళ్ళు మనకు ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పిస్తారు. కానీ ఎవరో ఎదగడం కోసం మిగతా వాళ్ళను తొక్కేయడం అనేది కరెక్ట్ కాదు. ఫ్రెండ్ షిప్ అంటే భయమేస్తోంది. వాళ్ళు ఏం పెంట పెడతారా అనే టెన్షన్ ఎక్కువయ్యింది. చిన్నప్పుడు ఉండే ఫ్రెండ్స్  బెటర్..ఇప్పటి ఫ్రెండ్ షిప్ అంతా ఫేక్.. చివరికి మనకు మనమే ఉండాలి. ఫ్రెండ్ షిప్ లో గ్రాంటెడ్ నెస్ ఎక్కువైపోయింది. వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేసిన, వాళ్ళు నా ఫ్రెండ్ అని చెప్పినా నెక్స్ట్ మినిట్ వాళ్ళు మనల్ని ఏం చేస్తారో అనే భయం ఉండిపోయింది. మోనాల్ కి ఫోన్ చేసి ఇలా ఇంటర్వ్యూలో ఫ్రెండ్ పేరు చెప్పామన్నారు ఎవరూ లేరు అన్నాను అనేసరికి  మరి నేను అని అడిగింది..ఐతే ఇప్పుడు పేరు చెప్తాను కానీ రేపు నన్ను నువ్వు వదిలేసి వెళ్ళిపోతే అని అడిగా దానికి నవ్వేసింది అంతే..." ఇలాగే ఉంటుంది ఫ్రెండ్ షిప్ అంటే అని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు అఖిల్.

బిగ్ బాస్ బ్యూటీ అశ్వినితో పాటలు పాడించిన పవన్ కళ్యాణ్!

బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అశ్విని కూడా  ఒకరు అని చెప్పొచ్చు. వైల్డ్ కార్డు ఎంట్రీ  ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన అశ్విని 12వ వారం వరకు హౌస్ లో కొనసాగిన సంగతి మనకు తెలిసిందే. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇంటర్వ్యూలు ఇస్తోంది అశ్విని. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చాలా విషయాలు చెప్పింది. "నాకు ఎప్పటికీ ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ (pawankalyan ) ..ఆయన ఎప్పుడూ నావాడే. ఆయన నటించిన మూవీ ఓజి (OG ) సూపర్ డూపర్ హిట్ ఐపోవాలని కోరుకుంటున్నా. దేవుడి దయతో పవన్ కళ్యాణ్ సీఎం ఐపోతేనా ..రోజూ ఆయన్ని పాలిటిక్స్ లో ఆయన్ని చూసుకోవచ్చు, స్క్రీన్ మీదన్నా చూసుకునే అవకాశం ఉంటుంది. ఆయన్ని మీట్ అయ్యే ఛాన్స్ వస్తే మాటలే రావు. ఆయనతో గబ్బర్ సింగ్ చేస్తున్నప్పుడు మూడు నెలలు ట్రావెల్ చేసాను. షూటింగ్ టైంలో ఎప్పుడైనా ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ నాతో పాటలు కూడా పాడించుకునేవారు. ఆయన తినే డ్రై ఫ్రూప్ట్స్ కూడా ఇచ్చేవారు. ఆయన చాలా ఫ్రెండ్లీ యాక్టర్ కూడా.. మనసులో ఏదీ పెట్టుకోరు. బయటకు ఓపెన్ గా చెప్పేస్తారు. చాలా డౌన్ టు ఎర్త్. ప్రస్తుతానికి నేను సింగల్.. ఐతే నాకు మంచి మనసు ఉన్న అబ్బాయి వస్తే చాలు. అతను నల్లగా ఉన్నా నాకేం పర్లేదు..నన్ను బాగా చూసుకోవాలి..ఆల్రెడీ చాలామంది ట్రై చేస్తున్నారు.. కానీ నాకు కూడా వాళ్ళు  నచ్చాలి కదా...ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మేం అందరం ఫ్రెండ్స్ ఐపోయాం. పల్లవి ప్రశాంత్ టచ్ లోనే ఉన్నాడు. జనవరి ఫస్ట్ అక్క హాపీ న్యూ ఇయర్ అంటూ విష్ కూడా చేసాడు " అని చెప్పింది అశ్విని.  

కొత్త తెలుగు యాంకర్ గా అవతారమెత్తిన శోభా శెట్టి..

కార్తీకదీపం సీరియల్ లో హీరో, హీరోయిన్ కి ఎంత పేరొచ్చిందో లేడీ విలన్ గా మోనిత అలియాస్ శోభా శెట్టికి కూడా అంతే పేరొచ్చింది. ఆ నేమ్ అండ్  ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చింది శోభా.. మిగతా హౌస్ మేట్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక తన ఫాన్స్ కి చాలా శుభవార్తలు చెప్పింది. ఒక ఇల్లు కొనుక్కుంది..అలాగే తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి కూడా త్వరలోనే చేసుకోబోతోంది..వీటి గురించి ఆల్రెడీ వీడియోస్ కూడా చేసింది.  ఇక ఇప్పుడు మరో శుభవార్త కూడా చెప్పింది. అదే తాను యాంకర్ అయ్యానని ఆనందం  వ్యక్తం చేసింది . సీరియల్స్ లో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలను అంటూ అభిమానులు చెప్పారు. ఆ సపోర్ట్ తో, ఆ ప్రేమతో ఇప్పుడు  ఫస్ట్ టైం యాంకరింగ్ కూడా చేయబోతున్నానంది. అలాగే రెండు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తయ్యాయంది మోనిత పాపా. "బిగ్ బాస్ తర్వాత ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నా. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం కన్నడలో ఆల్రెడీ ఒక కుకింగ్ షోకి యాంకరింగ్ చేసాను.. కానీ తెలుగులో మాత్రం ఇదే ఫస్ట్ టైం. తెలుగులో యాంకరింగ్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే తెలుగు మీద ఇంకా గ్రిప్ రాలేదు కాబట్టి ఫ్లూయెంట్ గా నేర్చుకుంటున్నా" అని  చెప్పింది శోభా శెట్టి. ఇక ఇప్పుడు "నేను కూడా యాంకరింగ్ చేయగలను అని తెలుసుకుని సుమన్ టీవీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. ఆ షో పేరు "కాఫీ విత్ శోభా'. ఎప్పుడూ నేను ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ ఐనా తమను తాము ప్రూవ్ చేసుకోవాలంటే వచ్చిన అవకాశాలను వదులుకోకూడదు. ఇక ఈ షోకి ప్రోమో ఎలాంటి ప్రామ్ప్టింగ్ లేకుండా చెప్పాను..మీరంతా ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి..మూడు ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పాను..ఇది ఫస్ట్ ప్రాజెక్ట్" అంటూ శోభా శెట్టి తన లేటెస్ట్ అప్ డేట్ ని సోషల్ మీడియాలో ఫాన్స్ తో షేర్ చేసుకుంది.  

ట్రెండింగ్ లో 90's వెబ్ సిరీస్ బుడ్డోడు..!

కుటుంబంతో కలిసి చూసే సినిమాలు, సిరీస్ లు చాలా తక్కువగా వస్తుంటాయి. అందులోను ఈ మధ్యకాలంలో యూత్ ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది దర్శక నిర్మాతలు రొమాన్స్, థ్రిల్లర్ జానర్ ల వైపు వెళ్తుంటే.. ఆదిత్య హసన్ మాత్రం కుటుంబంతో కలిసి చూసేలా 90's టైమ్ లో విద్య, సమాజంలో పెద్దలకి పిల్లలకి మధ్య బంధం ఎలా ఉండేదో వివరిస్తూ, అప్పటి పరిస్థితులను మళ్ళీ రీక్రేయిట్ చేసాడు. ఇక ఆ సీన్లని చూస్తే మళ్ళీ ఆ రోజులకి తీసుకెళ్తాయి.  మన ఇంటికి మావయ్య వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం పిల్లలు చేసే యాక్టింగ్.. అలా వాళ్ళు వెళ్తూ ఇచ్చిన డబ్బులని తిరిగి మన అమ్మనాన్నలు తీసుకోవడం.. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోతే వాటిని సంపాదించుకోవడం కోసం రూపాయి రూపాయి పోగుచేసుకోవడం..  కేబుల్ టీవీలో ఆదివారం వచ్చే సినిమా కోసం నాన్నని ఒప్పించడానికి పడే ఇక్కట్లు.. ఇలా ప్రతీ చిన్నది  ఎన్నో జ్ఞాపకాలని పరిచయం చేస్తుంది. ఇది ఓ వెబ్ సిరీస్ అనేకంటే మనల్ని మళ్ళీ బాల్యానికి తీసుకెళ్ళిన ఓ జ్ఞాపకం అనొచ్చు.  ఈ సిరీస్ లో  చంద్రశేఖర్ గా చేసిన శివాజీ, రఘు పాత్రలో మౌళి చక్కగా నటించాడు. ఆదిత్యగా నటించిన రోహన్ పాత్ర ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ సిరీస్ మొత్తంలో ఆదిత్య పాత్రకి ఎక్కువ మంది ఇంప్రెస్ అవుతున్నారు. ఇమ్ స్ట్రాగ్రామ్ లో ఎక్కడ చూసిన ఈ బుడ్డోడి రీల్సే కన్పిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ఆదిత్య కామెడీని ఇన్ స్టా లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నతనంలో పరీక్షల్లో మార్కులు  వచ్చినప్పుడు నాన్న దండించే సీన్ లో ఆదిత్య హావభావాలు ప్రతీ ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అప్పట్లో వెంకీ సినిమాలో మాస్టర్ భరత్ చేసిన కామెడీలా అనిపిస్తుంది. అప్పట్లో భరత్.. ఇప్పుడు రోహన్ అనేలా ఈ బుడ్డోడి నటన ఉంది. అంతేకాదు రోహన్ ఇప్పటికి చాలా సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఈ ఒక్క సిరీస్ తో వచ్చేసింది. ఇక నెట్టింట ఈ రీల్ చూసిన 90's సిరీస్ తాలుకా కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ రోహన్ కామెడీకి నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

బిగ్ బాస్ ఇన్సిడెంట్ పై అమర్ కామెంట్స్...

అమర్ దీప్  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక రోడ్డు మీద జరిగిన గలాటా గురించి అందరికీ తెలుసు. దానికి గురించి  అమర్ దీప్ ఫ్రెండ్ లోలా నరేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను ఈరోజు ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు. "నేను బిగ్ బాస్ హౌస్ నుంచి రన్నర్ గా బయటకు  ఓడిపోయి వచ్చాను. దాక్కోమని మీరంతా చెప్పారు. దాక్కోవడానికి నేనేమన్నా దొంగనా, డ్రగ్ మాఫియాలోంచి ఏమన్నా బయటకు వచ్చానా లేదంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వచ్చానా.. అసలు విషయం ఏమిటో నాకు అర్ధం కాలేదు. కొన్ని కార్లు, కొంతమంది మనుషులు వెంటబడి కార్లు పగలగొట్టి..నా తల్లి, నా భార్య పక్కనుండగానే అనరాని మాటలు అన్నారు. మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టారు. మా నాన్న ఆర్టీసీ మెకానిక్ ఆయన ఇప్పటికీ పాస్ తీసుకుని దాని మీద బస్సులో ప్రయాణిస్తారు.. మా అమ్మ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్...మహిళలకు హెల్ప్ చేసే ఆవిడ ఇవన్నీ ఏం చేస్తుంది. అసలు మా అమ్మ, నాన్నకు నేను హ్యాపీగా ఉంటే చాలు...అంతకంటే ఏమీ కోరుకోరు. అలాంటిది ఈ ఇష్యూ మొత్తం వాళ్ళే చేసారని ఎలా అంటారు. మా బ్యాక్ గ్రౌండ్ తెలిసింది కాబట్టి మేమే చేయించామన్నట్టుగా మా మీద అపవాదు ఎలా వేస్తారు.  నన్ను ఏదైనా అనండి, ఏదైనా చేయండి, ఎక్కడికైనా వస్తా ఫామిలీ జోలికి రావొద్దు..మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారు. వాళ్ళను ఇలా అంటే మీరు ఊరుకుంటారా...నేను కూడా అంతే.. నాకు ఫామిలీ ఇంపార్టెంట్. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే  కొన్ని విషయాల్లో పూర్తిగా మారాను అంటే అది కేవలం షకీలమ్మ వల్లనే..ఆమె నాకు ఇంకో తల్లి. నేను అనుకున్నది సాధించాను. నాకు నచ్చిన వాళ్ళతో పని చేసే అవకాశం వచ్చింది. అది చాలు నాకు. నేనే విన్నర్ ని అని  ఫీలవుతున్నాను "అని చెప్పాడు అమర్ దీప్. ఐతే లోల్ల నరేష్ కూడా  పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కి అమర్ దీప్ కారణం కాదు...పోలీసులు చెప్పింది పట్టించుకోకపోని కారణంగా ఈ అరెస్ట్ జరిగింది అని క్లారిటీ ఇచ్చాడు.