నా ఆపరేషన్ సక్సెస్ అవడానికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు!

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి చెప్పాల్సిన పని లేదు. వెరైటీ పంచ్ డైలాగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ చేయించుకున్నాడు.  ఆరోగ్యం సరిగా లేకపోయినా తన ఫామిలీ, ఫ్రెండ్స్ సాయంతో స్టేజి మీదకు అప్పుడప్పుడూ వచ్చి కామెడీ చేసి ఆడియన్స్ ని నవ్వించేవాడు. అలాంటి ప్రసాద్ ఇప్పుడు కోలుకున్నాడు. మంచి హుషారుగా కామెడీ చేయడానికి తనను తాను ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా యూట్యూబ్ లో తన ఛానల్ లో ఒక వీడియోని పోస్ట్ చేసాడు. నెటిజన్స్ కి, ఫాన్స్ కి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చెప్పాడు. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్లనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నట్లు ఆనందంగా చెప్పుకొచ్చాడు. అలాగే రోజాకి, ఏపీ ప్రభుత్వానికి, జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ, ప్రత్యేకంగా నాగబాబు గారికి ధన్యవాదాలు చెప్పారు. ఈరోజు ఇలా హ్యాపీగా ఉండడానికి కారణం ప్రజా అభిమానమే అని చెప్పాడు ప్రసాద్ , అతని వైఫ్ కూడా. "ఆపరేషన్ సక్సెస్ అయ్యింది..పూర్తిగా కోలుకున్నాను..ఇక నా ఛానల్ లో ఇక నుంచి వీడియోస్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మేమిద్దరం రీల్స్ చేసేటప్పుడు చాలామంది నా ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసారు. వారందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్..ఐతే ఈ వీడియో చేయడానికి కొంత లేట్ అయ్యింది. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మెసేజ్ చేస్తే ఆ టైపు వీడియోస్ ని చేస్తాం.. ఐతే ఇలాంటి ఆపరేషన్ ని  చేయించుకోవాలా.. వద్దా అని చాలా మంది భయపడుతూ ఉంటారు.  నేను కూడా ఈ ఆపరేషన్ చేయించుకోవడానికి భయం వేసి ఐదేళ్లు అలాగే ఉండిపోయాను.  ఫైనాన్సియల్ గా కొంతమందికి సపోర్ట్ కూడా ఉండదు కాబట్టి ఈ ఆపరేషన్ ని చేయించుకోరు చాలా మంది. ఇక ఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి నాలాంటి ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు భయపడకుండా ఆపరేషన్ చేయించుకోండి. దానికి సంబంధించిన డైట్ గురించి ఇంకా ఏవన్నా సలహాలు కావాలన్నా మెసేజ్ పెడితే నేనే వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడి చెప్తాను. సర్జరీ ముందు కానీ, సర్జరీ అయ్యాక కానీ డైట్ లో ఉంటేనే బాడీ సెట్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ మా ఫామిలీ మీద ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నా" అంటూ ప్రసాద్ ఆయన వైఫ్ అందరికీ చేతులు జోడించి నమస్కరించారు.  

Brahmamudi:అప్పుకి యాక్సిడెంట్.. ఆ పూజలో కావ్య పాల్గొనగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -302 లో.. అప్పుకి పెళ్లి చెయ్యాలని కనకం కృష్ణమూర్తి అనుకుంటారు. అలా అనుకొని పెళ్లి సంబంధం చూడటం కోసం పెళ్ళిల్ల పేరయ్యకి కబురు పంపిస్తారు. కాసేపటికి అబ్బాయిల ఫోటోలు పట్టుకొని అతను వచ్చి కనకం-కృష్ణమూర్తిలకి చూపిస్తాడు.‌ అబ్బాయికి ఆస్తులు లేకున్నా పర్లేదు కానీ మా అప్పుని బాగా చూసుకోవాలని కనకం అంటుంది. ఇదంతా జరుగుతున్నప్పుడే అక్కడికి అప్పు వస్తుంది. ఈ అబ్బాయి ఎలా ఉన్నాడని అనగానే అప్పు కోపంగా సంబంధాలు తీసుకొని వచ్చిన పేరయ్యని కొట్టలని అనుకుంటుంది. దాంతో వాడు పరుగెత్తుతాడు. ఒకరిని ప్రేమించి వాడికి పెళ్లి అవగానే మర్చిపోయి వేరేవాళ్ళని చేసుకోమంటే ఎలా అంటూ అప్పు అనేసి కోపంగా లోపలికి వెళ్తుంది. అసలే బాధలో ఉంది.. ఇంకా బాధ పెడుతున్నామేమోనని కృష్ణమూర్తి అంటాడు. అ తర్వాత అప్పు ఇలా బాధ పడుతుంటే చూడలేకపోతున్న తన మనసు మార్చాలని కనకం అనుకుంటుంది. మరొకవైపు పూజకి కావ్య అంతా సిద్ధం చేస్తుంది. అప్పుడే రుద్రాణి వచ్చి అక్కడ ఉన్న ఓ దీపం పడేస్తుంది. అది పడేసింది కావ్య అని క్రియేట్ చేసి తనపై రుద్రాణి‌ అరుస్తుంటే.. ఇంట్లో అందరు వస్తారు. నీకు నా కొడుకు, కోడలు పూజ చెయ్యడం ఇష్టం లేదు అందుకే ఇలా చేశావంటు ధాన్యలక్ష్మి తిడుతుంది. అపర్ణ కూడా కావ్యనే అంటుంటే.. సుభాష్ మధ్యలో కలుగుజేసుకొని మీ అందరి కంటే ముందుగా లేచి అవ్వన్నీ సిద్ధం చేస్తే ఇలా అంటారా? ఏదో పొరపాటు జరిగిందని సైలెంట్ గా ఉండలేరా అంటూ అపర్ణ, ధాన్యలక్ష్మిలపై కోప్పడతాడు. వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటారు.. ధాన్యలక్ష్మి కావ్యపై ఉన్న కోపాన్ని చూపించాలి. అపర్ణకేమో తన పెద్దరికం చూపించాలని ఇందిరాదేవి అంటుంది. ఇక్కడ పూజ చేస్తుంది మూడు జంటలు. రాజ్ రాహుల్ ల పెళ్లి అప్పుడు పూజ చెయ్యలేదు. ఇప్పుడు మూడు జంటలు పూజ చెయ్యాలి. కావ్య, స్వప్న మీరు రెడీ అయి రండి అని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు అప్పు తిరిగి పిజ్జా డెలివరీ జాబ్ లో జాయిన్ అవ్వాలని వెళ్తుంది. ఇక ఆ స్టోర్ ఓనర్ జాబ్ చేయడం వద్దని చెప్పడంతో అప్పు డిస్సపాయింట్ అవుతుంది.. మరొకవైపు కావ్య స్వప్నలతో పాటు కలిసి పూజ చెయ్యడం నాకు ఇష్టం లేదని ధాన్యలక్ష్మికి అనామిక చెప్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి వెళ్లి అపర్ణ ఇందిరదేవిలకి వాళ్ళతో కలిసి పూజ చెయ్యడం అనామికకి ఇష్టం లేదట అని అనగానే.. నువ్వు నీ కోడలికి సర్ది చెప్పు ఇలా కోడళ్ళ మాటల వల్లే కుటుంబం విడిపోతుంది. కావ్యపై నీ కోడలి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చెయ్ అని ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి చెప్తుంది. ఆ మాటలు అనామిక వింటుంది. మరొకవైపు స్వప్న రెడీ అవుతు రుద్రాణిని పిలిచి చీర సెట్ చెయ్ అనగానే.. రుద్రాణి ఆశ్చర్యంగా చూస్తుంది. తరువాయి భాగంలో అప్పుకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ విషయం కావ్యకి కనకం ఫోన్ చేసి చెప్తుంది. పూజ జరిపించండి నేను వెనకాల డోర్ నుండి వెళ్తున్నానని వెళ్తుంది. కావ్య బయటకు వెళ్ళిందని రాజ్ చెప్పగానే.. రాజ్,  కావ్య ఇద్దరు పూజ చేయాలని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రాముడికి ఆదిరెడ్డి లక్ష విరాళం..జై శ్రీరామ్..

బిగ్ బాస్ హౌస్ లోకి రివ్యూస్ చెప్పే ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కేటగిరిలో ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన పేరు ప్రతిష్టలు ఇంకా పెరిగి పోయాయి. ఇప్పుడు ఆదిరెడ్డి తన ఉదారతను చాటుకున్నాడు. మనకు   ఒక పది రూపాయలు వస్తే అందులో ఎంతో కొంత వేరేవాళ్లకు సాయం చేయాలని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనం ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండిపోతే వాటికి చెదలు పడతాయి తప్ప వాటికి విలువ పెరగదు అని  మన పురాణాలు కూడా చెప్తున్నాయి. మరి ఆ మాటలను నిజం చేస్తూ ఆదిరెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ నెల 22 న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే శ్రీ రామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర సంస్థ వారు దేశవ్యాప్తంగా విరాళాలని ఆహ్వానిస్తున్నారు.. చాలా మంది కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ డబ్బులు కూడా పంపిస్తున్నారు. ఇక ఆ శ్రీరాముడి ఆశీస్సులు తన మీద తన కుటుంబం మీద అలాగే లోటస్ ల్యాండ్ మార్క్ లో పెట్టిన తన జావేద్ హబీబ్ సెలూన్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన ఫామిలీ తరపున ఒక లక్ష రూపాయలను ఆ స్వామి వారికి విరాళంగా ఇచ్చాడు ఆదిరెడ్డి. ఇక ఆదిరెడ్డి చేసిన ఈ పనికి అందరూ ఫిదా అవుతున్నారు. ఆదిరెడ్డికి దైవ భక్తితో ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు కూడా సాయం చేసే గుణం కూడా ఎక్కువే అంటున్నారు.  రీసెంట్ గా రోడ్ సైడ్ చలిలో పడుకున్న వారి కోసం దుప్పట్లు, భోజనం వగైరా వంటివి పంపిణీ చేసాడు. ఆ పిక్స్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.  ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆదిరెడ్డి.  

Guppedantha Manasu:శైలేంద్రకి ముసలివాళ్ళు ఇచ్చిన జలక్ అదుర్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -969 లో....ధరణి చెయ్యి లాక్కొని శైలేంద్ర ఇంట్లోకి వస్తాడు. ఏమైంది నన్ను లాక్కొని వస్తున్నారని ధరణి అడుగుతుంది. అసలు నువ్వు బాబాయ్ ఇంటికి ఎందుకు వెళదామని అనుకున్నావని అడుగుతాడు. రిషి గురించి వెళ్ళానని ధరణి చెప్పగానే రిషి ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని శైలేంద్ర అడుగుతాడు. రిషి ఎక్కడ ఉన్నాడోనని నాకెలా తెలుస్తుంది. మావయ్య గారిని అడిగి తెలుసుకుందామనుకున్నానని ధరణి అంటుంది.. శైలేంద్ర చిరాకు పడుతు ఉంటాడు. శైలేంద్ర చూడకుండా ధరణి ఫోన్ లో రికార్డర్ ఆన్ చేసి దూరంగా ఉంచుతుంది. అది తెలియని మన వెంగళప్ప శైలెంద్ర తన తప్పులు చేసిన కుట్రలు అన్ని ధరణి చెప్తుంటే శైలేంద్ర సైలెంట్ గా ఉంటాడు. మీరు ఎండీ సీట్ మీద ఆశతో రిషిపై ఎన్ని ఎటాక్ లు చేయించారు. మీ గురించి ఒక మావయ్యకి తప్ప అందరికి తెలుసని ధరణి అనగానే.. శైలేంద్ర ధరణిపై కోప్పడతాడు. ఆ తర్వాత ఈ వీడియోని అవసరం వచ్చినప్పుడు వాడతానని ధరణి అనుకుంటుంది. మరొకవైపు రిషి వసుధార ఇద్దరు బయటకు వెళ్తారు. సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే కార్ లో జగతి మేడమ్ రాసిన లెటర్స్ కిందకి పడతాయి. ఇవి అప్పుడు పాండియన్ తీసుకొని వచ్చినవి కదా ఇంత వరకు చదవలేదు.. టైమ్ ఉన్నప్పుడు చదువుతానని రిషి అంటాడు. మరొక వైపు రౌడీలు శైలేంద్రని తీసుకొని రిషిని కాపాడిన ముసలి వాళ్ళ ఇంటికి వస్తాడు. నువ్వు వెళ్ళు అని రౌడీలని శైలేంద్ర పంపిస్తాడు. నేను వస్తాను సర్ అని రౌడీ అనగానే.. అడ్రస్ చెప్పడం వరకే నీ పని అ తర్వాత అంత నేను చూసుకుంటానని ఆ రౌడీని పంపించి శైలేంద్ర ఒక్కడే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లి ముసలివాళ్లని కలుస్తాడు. ఎవరు మీరు అని వాళ్ళు అనగానే.. నాకు వైద్యం చెయ్యాలి నడుము నొప్పిగా ఉంటుందని శైలేంద్ర అనగానే శైలేంద్రపై ముసలి వాళ్ళకి డౌట్ వస్తుంది. దాంతో అతనికి వైద్యం పేరిట కాషాయం తాగిస్తారు. నడుము నొప్పికి మంచి వైద్యం అంటూ శైలేంద్రని పడుకోబెట్టి కర్రతో నడుముపై ఆ ముసలాయన వాయిస్తుంటాడు. ఆ సమయంలో శైలేంద్ర పడ్డ బాధగా కామెడీగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda murari:కృష్ణ కోసం దిగొచ్చిన‌ భవాని.. శోభనానికి ముహుర్తం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -363 లో.. కృష్ణకి సంబంధించిన ఫొటోస్ అన్నీ చూస్తూ మురారి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. ఇద్దరు సరదాగా కాసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు. కృష్ణ బల్లి వచ్చిందంటు బయపడి మురారిని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మురారికి కృష్ణ కాఫీ కలిపి ఇస్తుంది. మరొక వైపు నిద్ర మత్తులో వస్తున్న మధుని చూసిన భవాని.. తనపై కోప్పడుతుంది. బిజినెస్ చూసుకోమని చెప్తే చూసుకోవు. సినిమాలపై ఇంట్రెస్ట్ పెట్టు అంటే అలా చెయ్యవ్. ఇంక ఏం చేస్తావని మధుకి భవాని క్లాస్ పీకుతుంది.‌ అప్పుడే ముకుంద కాఫీ తీసుకొని వచ్చి భవానికి ఇస్తుంది కానీ తాను తీసుకోదు.‌ అప్పుడే రేవతి సుమలతలు వస్తే వాళ్ళకి ముకుంద కాఫీ ఇస్తుంది. అప్పుడే కృష్ణ మురారి ఇద్దరు వస్తుంటే నువ్వు ఎప్పుడు వచ్చావని రేవతి అడుగుతుంది. ప్రొద్దున్నే మురారికి కాఫీ తీసుకొని వచ్చిందని ముకుంద అనగానే.. నన్ను చూసావా అని కృష్ణ అడుగుతుంది. చూసాను కానీ పలకరించులేదు. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది కదా అని నేను సైలెంట్ గా ఉన్నానని ముకుంద అంటుంది.‌ ఆ తర్వాత ముకుంద భవాని కాళ్ళు పట్టుకొని కృష్ణని ఇంట్లో  ఉండనివ్వండి. అవసరమైతే నేను అవుటౌస్ లో ఉంటానని ముకుంద అంటుంది. అ తర్వాత మురారి కూడా కృష్ణని ఇంట్లో ఉండనివ్వండి పెద్దమ్మ అని అంటాడు. ఇక కాసేపటికి కృష్ణ ఇంట్లో ఉండడానికి భవాని ఒప్పుకుంటుంది.‌ కృష్ణ థాంక్స్ అంటూ ఓవర్ గా ఎక్సైట్ మెంట్ అవుతు ఉంటే చూడలేక భవాని వెళ్ళిపోతుంది. అందరు నవ్వుకుంటారు. అదంతా గమనించిన‌ మధు.. ముకుంద మారలేదేమో నటిస్తుందేమోనని నాకు‌ డౌట్ ఉందంటు రేవతితో‌ చెప్తాడు. మరొక వైపు కృష్ణ, శకుంతల దగ్గరికి ముకుంద వెళ్లి క్షమించమని అడుగుతుంది. ఆ తర్వాత రేవతిని ఇండైరెక్ట్ గా శోభనానికి ముహూర్తం పెట్టించమని మురారి అడుగుతాడు. అది ఎవరికి అర్థం కాదు దాంతో ముకుంద అందరికి అర్థం అయ్యేలా చెప్తుంది. మరొకవైపు భవాని తను చేసిన తప్పుని సరిచేసుకోవాలని లాయర్ ని పిలిపించి.. ప్రభాకర్ ని బయటకు తీసుకొని రమ్మని చెప్తుంది. తరువాయి భాగంలో కృష్ణ, మురారి సరదాగా బయటకు వెళ్తారు. మరొక వైపు కృష్ణ, మురారీల అగ్రిమెంట్ పెళ్లిని పర్మినెంట్ చెయ్యలని మురారి అన్నాడని చెప్పారు కదా అని  భవానితో రేవతి చెప్తుంది. ఆ బంధం శాశ్వతం కావాలంటే త్వరలోనే ముహూర్తం పెట్టిద్దామని భవాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ హనుమంతుడే పాన్ ఇండియా స్టార్...ఉస్తాద్ షోలో బాహుబలి డైలాగ్

హనుమాన్' చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ మూవీ హీరో, చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఉస్తాద్ షోకి గెస్ట్ గా వచ్చాడు. "సరే నా షోకి వచ్చేవాళ్లను బాబాయ్, డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాను..మరి నిన్నేమని పిలవాలి.. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్ వి కదా" అని షో హోస్ట్ మంచు మనోజ్ అడిగేసరికి "నేను కాదన్నా..ఆ హనుమంతుడు పాన్ ఇండియా స్టార్" అని చాలా పొలైట్ గా, హుందాగా చెప్పాడు మూవీ హీరో తేజా సజ్జ. ఈ ఆన్సర్ కి ఆడియన్స్ స్టేజి దద్దరిల్లిపోయేలా ఈలలు, కేకలు పెట్టారు. "మరి నీ లైఫ్ లో ఉస్తాద్ ఎవరు" అని మనోజ్ తేజాని అడిగాడు "చిరంజీవి గారు నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, ఉస్తాద్, మెగాస్టార్ ఎవ్రీథింగ్ ఆయనే" అని ఆన్సర్ ఇచ్చాడు తేజ. ఇంతలో బ్యాక్ గ్రౌండ్ లో "ఇంద్ర" మూవీలో చిరంజీవి చిన్నప్పటి రోల్ లో నటించిన తేజ సజ్జ వీడియో ప్లే చేశారు. "నీ ఫ్రేమ్ పడుతూ మెగాస్టార్ అని టైటిల్ పడింది చూడు..అలాంటి అదృష్టం ప్రపంచంలో ఎవరికైనా దొరుకుతుందా" అంటూ మనోజ్ అనేసరికి ఆడియన్స్ అంతా చప్పట్లు కొట్టారు. తర్వాత మనోజ్ ఒక క్రేజీ క్వశ్చన్ అడిగాడు.."సరే మన నేషనల్ క్రష్ రష్మిక కదా మరి ఆమె క్రష్ ఎవరో తెలుసా" అని కొంటెగా అడిగేసరికి "నేనైతే బాగుంటుంది అని నా ఫీలింగ్" అని కౌంటర్ ఇచ్చాడు తేజ. తర్వాత ఈ షోకి హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వచ్చాడు. "నేను ఎన్నోసార్లు క్రికెట్ , బాడ్మింటన్ ఆడదాము అని రమ్మంటానా... రాడు. ఈ గేమ్ లో డబ్బులు వస్తాయని తెలిసేసరికి వచ్చేసాడు" అంటూ తేజ అసలు క్యారెక్టర్ ఇదే అన్నట్టుగా చెప్పాడు ప్రశాంత్...తర్వాత బాహుబలి మూవీలో "ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదు తల" అంటూ కత్తి తీసుకుని మంచి ఫోర్స్ లో డైలాగ్ చెప్పి ఎంటర్టైన్ చేసాడు ప్రశాంత్ వర్మ. ఇక ఈ మూవీ చూసిన కొంతమంది సినీ ప్రముఖుల నుంచి  పాజిటివ్ టాక్ బయటికి వచ్చింది. ఇక ఈ మూవీ  భారీ విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. చూడాలి ఆ హనుమాన్ ఏం మాయ చేయబోతున్నాడో అని.

ఎవరి చావుకు కారణం కావొద్దు...

సంక్రాంతి వస్తోందంటే చాలు పతంగులు కూడా ఎగరేయొచ్చని చిన్నా పెద్దా అంతా ఆశ పడుతూ ఉంటారు... ఐతే ఈ పతంగులు ఎగరేయడం మాట అలా ఉంచితే ఆ పతంగులు కట్టడానికి వాడే నైలాన్ మాంజ మాత్రం ఎన్నో పక్షుల ప్రాణాలను అప్పుడప్పుడు మనుషుల ప్రాణాలను కూడా తీసేస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ వస్తోంది. దీంతో అటవీ శాఖ అధికారులు అందరినీ అలెర్ట్ చేస్తున్నారు. ఇక సినీ సెలెబ్స్ అందులోనూ కొంత మంది పెట్ లవర్స్, బర్డ్ లవర్స్ కూడా వీటి మీద సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. రీసెంట్ గా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్, నటి సదా కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇలాంటిదే ఒకటి పోస్ట్ చేసింది. "రాబోయే సంక్రాంతి పండగ నాడు వేరే వారి బాధకు, నొప్పికి, వారి మరణానికి మీరు కారణం కావొద్దు" అని అలెర్ట్ మెసేజ్ ఇచ్చింది. సంక్రాంతి వస్తోందంటే చాలు ఈవిషయం గురించి  పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎంత అవగాహన కల్పించిన కొంతమంది లైట్ తీసుకుంటారు... "పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దాం" అనే నినాదంతో పండగ జరుపుకోవాలని అటవీశాఖ ప్రతీ ఏడాది పిలుపునిస్తూనే ఉంటుంది. నైలాన్, సింథటిక్ మాంజా దాన్నే చైనీస్ మాంజా అని కూడా అంటాం కదా.   పతంగులను ఎగుర వేసేందుకు ఉపయోగించే చైనీస్ మాంజా కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం మనకు తెలుసు. కేంద్ర పర్యావరణ చట్టం  ప్రకారం చైనీస్ మాంజా వాడకాన్ని నిషేధించింది ప్రభుత్వం. ఎందుకంటే  పండగ తర్వాత ఎక్కడి దారాలు అక్కడే వేళ్ళాడుతూ ఉండిపోతుండడం వలన పక్షులు వాటికి చిక్కుకుని చనిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మనుషులు కూడా గాయపడుతున్నారు. చైనీస్ మాంజా బదులు సాంప్రదాయ కాటన్ దారాలను పతంగుల కోసం వాడాలని అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మన వల్ల ఎవరికీ హానీ జరగకుండా చూసుకునే ఉద్దేశమే పండగ లక్ష్యం అని సదా చెప్పకనే చెప్పింది తన సందేశం ద్వారా..

ఇద్దరు డాక్టర్ బాబులతో మీ మోనిత !

బుల్లితెర అభిమానులకి మోనితగా పరిచయమైన శోభాశెట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. కాగా ఈ మధ్య శోభాశెట్టిని చూసి నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అతడి బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ తాజాగా ఓ ప్రోగ్రామ్ లో శోభాకి రింగ్ తొడిగాడు.  అది చూసి రింగ్ తొడిగే ముందే ఆలోచించాల్సింది యశ్వంత్ బ్రో అంటూ నెటిజన్లు తెగ జాలిపడుతున్నారు. కాగా శోభాశెట్టి మాత్రం ఆ వార్తలని పట్టించుకోకుండా తనకి నచ్చిన వ్లాగ్స్ చేసుకుంటు నా రూటే సపరేటు అంటూ వెళ్ళిపోతుంది.  బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది. కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మోనితగా పరిచయం అయిన ఈ కన్నడ భామ.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంట్రీతో ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కార్తీక దీపం సీరియల్ లో యశ్వంత్ పరిచయం కాగా అప్పటి నుండి మా పరిచయం మొదలైందని శోభాశెట్టి చాలాసార్లు చెప్పింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాకే తన బాయ్ ఫ్రెండ్ గురించి అందరికి తెలిసింది. హౌస్ లో ఉన్నప్పుడు యశ్వంత్ వస్తాడని శోభాశెట్టి అనుకుందంట. కానీ వాళ్ళ అమ్మ వచ్చింది. ‌ఇక వాళ్ళ అమ్మ రాగానే మోస్ట్ ఎమోషనల్ అయిన శోభాశెట్టి తన ఆటతీరు, ప్రవర్తన అన్నీ అడిగి తెలుసుకుంది. అయితే హౌస్ లో అమర్ దీప్, ప్రియాంక జైన్ లతో కలిసి తను ఆడిన గ్రూప్ గేమ్స్, కన్నింగ్ ఆలోచనలు అన్నీ బిగ్ బాస్ అభిమానులకి గుర్తున్నాయి. ఇక కార్తీక దీపంలో శోభాశెట్టి నటనకి తాజాగా ఓ అవార్డు కూడా వచ్చింది. హౌస్ లో తను ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడినా,  నామినేషన్ లో లీస్ట్ లో ఉన్నా బిగ్ బాస్ మాత్రం  ఎలిమినేషన్ చేయలేదు. దాంతో శోభాశెట్టిని బిగ్ బాస్ దత్తపుత్రిక అని కూడా అన్నారు. ఇక ఎంత ట్రోల్స్ చేసిన ఎలిమినేషన్ చేయకపోవడంతో మరో వారంలో గ్రాంఢ్ ఫినాలే వీక్ మొదలవుతుందనగా శోభాశెట్టిని ఎలిమినేషన్ చేసి అభిమానులకి కాస్త ఊరట కల్పించాడు బిగ్ బాస్. బిగ్ బాస్ తర్వాత శోభాశెట్టి తన యూట్యూబ్ ఛానెల్ లో ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేసింది. వారానికి రెండు వీడియోల చొప్పున వదులుతూనే ఉంది. మొదటగా అమ్మ కోసం ఓ నక్లెస్ తీసుకున్నానంటూ..  అ తర్వాత మా అమ్మనాన్నలని రీసీవ్ చేసుకున్నానంటూ వ్లాగ్ లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఇద్దరు డాక్టర్ బాబులతో  నేను అంటు ఓ వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. కార్తీకదీపం ఫేమ్  నిరుపమ్ అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణలని కలిసింది శోభా. ఇక టేస్టి తేజతో కలిసి అలా సరదాగా ర్యాంప్ వాక్ చేసిన శోభాశెట్టి.. గౌతమ్ కృష్ణ చేసిన సినిమా త్వరలో వస్తుందంటూ,  దానికి సపోర్ట్ చేయండి అంటు చెప్పుకొచ్చింది.‌ కాగా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వ్లాగ్ ‌ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.  

Arjun Kalyan : అర్జున్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్.. శ్రీసత్య కోసమేనా?

బిగ్ బాస్ తో తెలుగు టీవీ అభిమానులకి అర్జున్ కళ్యాణ్ పరిచయమ్యాడు.  బిగ్‌బాస్‌ సీజన్‌ సిక్స్ లో ఏడవ కంటెస్టెంట్‌గా అర్జున్‌ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు.  ఇండివిడ్యువల్ గా ఆడి తన సత్తా చాటుకునే ఓ షోలో తను ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్ళిన ఏకైక కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్. అర్జున్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో న్యూయార్క్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా పూర్తీ చేశాడు. 2013లో ‘చిన్న సినిమా’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత లవర్ ఫరెవర్, సూడోసైడ్, ఉప్మా తినేసింది, అన్ స్పోకెన్, పరిచయం, మిస్సమ్మ వంటి వెబ్‌ సిరీస్‌లతో గుర్తింపు పొందిన అర్జున్‌ ప్లేబ్యాక్‌, పెళ్లి కూతురి పార్టీ వంటి సినిమాల్లో నటించాడు. ఆంధ్రప్రదేశ్‌ కొవ్వూరుకి చెందిన అర్జున్ ఇప్పుడు బిగ్‌బాస్‌-6లోకి ఎంట్రీ ఇవ్వడంతో నాగార్జున అతని లవ్ స్టోరీల గురించి తెలుపమని అడగా..”జెంటిల్మెన్ ఎంత మందిని ప్రేమించాడో అన్నది అలా చెప్పాడంటూ మాటదాటేసాడు”. అయితే ట్రూత్ అండ్ డేర్ అంటూ..ఎవ్వరికీ తెలియని నిజం చెప్పమని అడగా, “తనకు జరిగిన బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చాడు”. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో శ్రీసత్య కోసమే వెళ్ళినట్లు చాలాసార్లు చెప్పాడు అర్జున్. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ చాలాసార్లు శ్రీసత్య కోసమే టాస్క్ లు ఆడాడు. ఇక ఒకానొక దశలో చూసే ప్రేక్షకులకే చిరాకేసింది. మరీ ఇంత ఫేవరిజం ఉండకూడదని అర్జున్ కళ్యాణ్ ని బయటకి పంపించేశారు. అయితే ఎలిమినేషన్ తర్వాత తెలిసిన నిజాలేంటంటే.. అతను శ్రీసత్య కోసమే హౌస్ లోకి వెళ్ళాడంట. హౌస్ లోకి వెళ్ళేముందు శ్రీసత్యతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించిన అర్జున్ కళ్యాణ్ .. తనని ఇష్టపడ్డాడంట. ఇక తను బిగ్ బాస్ కి వెళ్తుందని తెలుసుకొని తను అప్లికేషన్ ఇచ్చాడంట. అయితే తనది ట్రూ లవ్ అంటూ ఎంత చెప్పిన శ్రీసత్య మాత్రం తనది స్నేహమే అని అంది. ఇక అర్జున్ బిగ్ బాస్ తర్వాత బిబి జోడీలో వాసంతితో కలసి జోడిగా వచ్చి డ్యాన్స్ ఇరగదీశాడు. కుక్క గెటప్ లో చేసిన డ్యాన్స్ కి జడ్జులతో పాటు టీవీ అభిమానులంతా ఫిధా అయ్యారు. ప్రస్తుతం అర్జున్ కళ్యాణ్ తాజాగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు అర్జున్. అందులో ఏం ఉందంటే..  నీ లైఫ్ లో నీకోసం ఎవరైతే టైమ్ కేటాయిస్తారో వాళ్ళే ముఖ్యమైనవాళ్ళు. నువ్వు ఒకవేళ ఏదీ‌ సాధించకపోయిన ఏదైనా కోల్పోయిన నీతో ఉండేవాళ్ళే నీ వాళ్ళు. అప్పటివరకు నీకోసం ఎవరున్నారో, ఎవరుంటారో చూసుకో.. ఎవరి కోసమో నీ లైఫ్ ని అలా వదిలేయకు. నీ లైఫ్ ని నువ్వు మాక్సిమమ్ పొటెన్షియల్ గా జీవించు. వితవుట్ ఎనీ రీగ్రేట్స్ అంటు అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.  అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు శ్రీసత్య కోసమే చేశాడమోనని అనుకుంటున్నారు. మరి అర్జున్ ఇది ఎవరికోసం చేశాడో చూడాలి. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సురేఖ వాణి

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సురేఖ వాణి సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అత్తగా, అమ్మగా, పిన్నిగా, పెద్దమ్మగా ఇలా రకరకాల సపోర్టింగ్ రోల్స్ లో ఆమె చేసే నటన అద్భుతంగా ఉంటుంది. ఈమె ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే టీవీ షోతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత ఆ  షో డైరెక్టర్ సురేష్ తేజని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి సుప్రీత  సంతానం. 2019 లో సురేఖ వాణి భర్త సురేష్ తేజ అనారోగ్యం కారణంగా మరణించారు.  ఆ తర్వాత సురేఖ వాణి డిప్రెషన్ కు గురై ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. కొంతకాలం తర్వాత తనని తాను డిప్రెషన్ నుంచి బయటపడేసుకుని తన  కూతురి కోసం తన మనసు మార్చుకుని ఆ బాధ నుంచి బయటపడి  సింగిల్ మదర్ గా ఉంటూ ఆమెను చూసుకుంటోంది. సోషల్ మీడియాలో  కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి చేసే  రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, డాన్స్ వీడియోలు బాగా ఫేమస్.  అలాంటి సురేఖ వాణి రీసెంట్ గా తన   కూతురు సుప్రీతతో కలిసి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమె ఆ ఏడుకొండల వాడికి తలనీలాలు కూడా సమర్పించుకుంది. ఎన్నడూ లేని విధంగా సురేఖావాణి ఇలా గుండులో కనిపించి ఫాన్స్ కి షాకిచ్చింది. ఐతే తన తల నీలాలను అర్పించిన విషయం గురించి చెప్తూ  "  18 ఏళ్ళ క్రితం గుండు చేయించుకున్న..అప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ లేవు. మళ్ళీ ఇన్నేళ్లకు శ్రీవారికి తలనీలాలు ఇచ్చాను. అప్పుడు మా వారి కోసం తల నీలాలు ఇచ్చాను. ఇప్పుడు ఆ పెద్దాయన కోసం ఇచ్చాను..గోవిందా గోవిందా" అంటూ ఆ శ్రీవారిని తలుచుకున్నారు సురేఖ వాణి, సుప్రీతా.

కుర్చీ మడతపెట్టిన కొత్తపెళ్ళికొడుకు

కుర్చీ తాత కుర్చీ మడతపెట్టేసి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఇక  అప్పటినుంచి సోషల్ మీడియా మొత్తం కూడా కుర్చీ మడతపెడుతూనే ఉంది. కుర్చీ పాట ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సాంగ్ ని థమన్ గుంటూరు కారం మూవీలో పెట్టి ఇరగదీసే కూతలతో సాంగ్ ని కంపోజ్ చేసాడు. ఆ సాంగ్ మ్యూజిక్ కి అందరికీ ఊపొచ్చేసి సోషల్ మీడియాలో కుర్చీ ఫీవర్ తో ఊగిపోతున్నారు చిన్నా పెద్ద సెలబ్రిటీస్ అంతా. ఈ పాటకి మహేశ్ బాబు-శ్రీలీల వేసిన స్టెప్పులు అద్దిరిపోయాయి.   ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తుంది, కూతపెట్టిస్తోంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతీ ఒక్కరూ ఈ పాటకి స్టెప్పులేస్తూ రీల్స్ షేర్ చేస్తున్నారు. లేటెస్ట్ గా  ఈ పాటకి బ్రహ్మముడి సీరియల్ హీరో, బిగ్‌బాస్ ఫేమ్, కొత్త పెళ్ళికొడుకు  మానస్ నాగులపల్లి కూడా అదిరిపోయే స్టెప్పులేశాడు.  ఢీ డ్యాన్సర్, యూట్యూబర్ శ్వేత నాయుడితో కలిసి మాస్ డ్యాన్స్ చేసి కేకపెట్టించాడు. శ్రీలీల వేసిన సేమ్ ఔట్‌ ఫిట్‌లో శ్వేత నాయుడు ఓ ఊపు ఊపేసింది. మానస్ హీరో మెటీరియల్ మాత్రమే కాదు మంచి డాన్స్ మెటీరియల్ అని ఇప్పటికీ ప్రూవ్ చేసుకున్నాడు.   ఇక ఈ మాస్ బీట్‌కి రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశాడు. వీళ్ళ  డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్‌బాస్‌తో బుల్లితెర ఆడియన్స్‌కి దగ్గరైన మానస్ కార్తీక దీపం, కోయిలమ్మ సీరియల్స్‌ నటించాడు.  బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక బ్రహ్మముడి  సీరియల్ ద్వారా  మానస్ కెరీర్ మంచి సక్సెస్ రూట్ లో దూసుకుపోతోంది. ఇదే టైంలో మూవీస్ లో కూడా ఛాన్సెస్ వస్తున్నాయని వాటి గురించి త్వరలో అనౌన్స్ చేస్తానని కూడా ఒక షోలో చెప్పాడు.  ఇప్పటికే హీరోగా కూడా కొన్ని సినిమాలకి సైన్ చేసినట్లు చెప్పాడు మానస్. అలాగే జరీ జరీ పంచెకట్టు కవర్ సాంగ్ తో  మానస్ చాలామంది ఆడియన్స్ కి ఫ్యాన్ గా మారిపోయాడు.    

Brahmamudi:కళ్యాణ్ ని ట్రెండీగా రెడీ చేసిన అనామిక.. పాపం రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -301 లో...  రాజ్ తో ఉన్న అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయితో అంత క్లోజ్ గా ఎందుకు ఉన్నాడని గుర్తుకుచేసుకొని కావ్య బాధపడుతు ఉంటుంది. అప్పుడే రాజ్ వచ్చి.. ఏమైంది అలా వున్నావ్ అని అడుగుతాడు. కావ్య తన మనసులో ఉన్న బాధని రాజ్ కి చెప్పకుండా మాటలతో టార్చర్ చేస్తుంది. రాజ్ కి ఏం జరిగిందో అర్థం కాదు. మరొకవైపు కళ్యాణ్ రెడీ అయి ఎలా ఉందని అనామికని అడుగుతాడు. నువ్వు ఏమైనా అంకుల్ వా? ఎందుకు ఇలా రెడీ అవుతావని అనామిక అంటుంది. ఇలా ఉంటే బాగుంటావని అప్పు చెప్తూ ఉండేదని కళ్యాణ్ అనగానే.. అనామిక కోపంగా నాకు నచ్చలేదని అంటుంది‌. కాసేపటికి నేను రెడీ చేస్తానని చెప్తుంది. మరొకవైపు రాజ్ కి కావ్య కాఫీ తీసుకొని వచ్చి రాజ్ తో అర్ధం కాకుండా మాట్లాడేసరికి.. అసలు ఏమైందో అని అనుకుంటాడు. మరొకవైపు కళ్యాణ్ ని అనామిక ట్రెండీ గా రెడీ చేస్తుంది. ఇలా బయటకు వెళ్తే అందరూ ఏమంటారో అని కళ్యాణ్ అంటాడు. ఇలా బాగున్నావని అనామిక చెప్తుంది. మరొక వైపు అప్పు పిజ్జా డెలివరీకి రెడీ అవుతుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని కృష్ణమూర్తి అప్పుని అడుగుతాడు. పిజ్జా డెలివరీకి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇంకా వెళ్లకుంటే ఇక ఎప్పటికి రాకని చెప్తారని అప్పు అంటుంది. అయిన ఇప్పుడు నువ్వు జాబ్ చెయ్యకుండా ఉంటే గడవలేని స్థితి లో ఏం లేమని కనకం అంటుంది. అయిన వినకుండా అప్పు వెళ్ళిపోతుంది. అది జరిగిన విషయం నుండి బయటకు రాలేదని కనకం అనగానే.. దానికి పెళ్లి చెయ్యాలి అప్పుడు ఆ విషయం మార్చపోతుందని అన్నపూర్ణ అంటుంది. అయిన దానికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని కనకం అనగానే.. పెళ్లి చెయ్యడం మన బాధ్యత అని అన్నపూర్ణ చెప్తుంది. మరొకవైపు అందరు కలిసి భోజనం చేస్తుంటే కావ్య వడ్డీస్తూ ఉంటుంది. అప్పుడే ట్రెండీ గా రెడీ అయిన కళ్యాణ్ ని తీసుకొని అనామిక వస్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. అందరి ముందుకు కళ్యాణ్ రావడానికి సిగ్గు పడుతుంటే.. అనామిక తీసుకొని వస్తుంది. అందరు కళ్యాణ్ ని బాగున్నావని అంటారు. ఆ తర్వాత రాజ్ పై కోపంతో అర్థం కాకుండా కావ్య ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఆ తర్వాత రాజ్ గదిలోకి వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని‌ కావ్యని అడుగుతాడు. ఎందుకో మీకు నిజం గా తెలియదా అని కావ్య అడుగుతుంది. తెలియదని రాజ్ అనగానే.. నాకు క్లారిటీ వచ్చాక అడుగుతాను. అది మిమల్ని మాత్రమే అడుగుతానని కావ్య చెప్తుంది. రాజ్ కీ కావ్య పై కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu:ఆ భద్ర శైలేంద్ర మనిషే అని డౌట్.. నిలదీసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -968 లో.. మహేంద్రతో వసుధార ఫోన్ మాట్లాడి కట్ చేసాక.. అ భద్ర అనే అతను సెక్యూరిటీ అంటున్నావ్ కదా ఎందుకు అతనికి రిషి ఇక్కడ ఉన్నట్లు చెప్పడం లేదని చక్రపాణి అడుగుతాడు. రిషి సర్ ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పొద్దు.. తెలియద్దు.. ఆ భద్ర శైలేంద్ర మనిషేమోనని డౌట్ అందుకే చెప్పకూడదని అంటున్నానని వసుధార అంటుంది. మరోకవైపు భద్ర ఇంటికి రాగానే.. ఎక్కడకి వెళ్ళావని భద్రని మహేంద్ర కోపంగా అడుగుతాడు. మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారని భద్ర అడుగుతాడు.. ఎక్కడ నుండి వస్తున్నావో చెప్పమని భద్ర కాలర్ పట్టుకొని మహేంద్ర అడుగుతాడు. వసుధర మేడమ్ దగ్గర నుండి వస్తున్నానని అనగానే నువ్వు ఎందుకు వెళ్ళావని మహేంద్ర అంటాడు. వసుధార మేడమ్ క్షేమంగా చూడడం నా బాధ్యత అని భద్ర అంటాడు.  వసుధార అక్కడ ఉన్నట్లు నీకెలా తెలుసని అనగానే ఫణింద్ర సర్ తో వసుధార మేడమ్ చెప్పారట కాలేజీలో అందరు అనుకుంటుంటే విన్నానని భద్ర చెప్తాడు. మీకు నాపై నమ్మకం లేదా అని యాక్టింగ్ చేస్తూ మీకు నమ్మకం లేకపోతే నేను వర్క్ చెయ్యనని భద్ర అంటాడు. అదేం లేదు  ఇప్పుడు ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నాం. అందుకే ఇలా అని మహేంద్ర అంటాడు. మరొకవైపు వసుధార, రిషి ఎటాక్ గురించి మాట్లాడుకుంటారు. అసలు మనపై ఇంత కుట్రలు చేస్తుంది ఎవరని రిషి అంటాడు. శైలేంద్ర అన్నయ్య తప్పు చేసాడు అని దాని గురించి ఏమైనా తెలిసిందా అని రిషి అడుగుతాడు. అప్పుడు జరిగింది మొత్తం వసుధార చెప్తుంది. నిజంగానే మా అన్నయ్య తప్పు చేసాడని అంటావా అని రిషి అనగానే.. ముందు ముందు తెలుస్తుంది. నేను తేలుస్తానని వసుధార అంటుంది. మరొకవైపు రిషి, వసుధారల గురించి ధరణి ఆలోచిస్తుంది. మావయ్య దగ్గరకి వెళ్లి వసుధారని కలవాలని అనుకొని ధరణి వెళ్తుంటే.. తనని ఫాలో అవుతు శైలేంద్ర వెళ్తాడు. మరొకవైపు రిషి అక్కడే ఉన్నాడేమో.. అందుకే అక్కడ ఆ వసుధార.. ఇక్కడ మహేంద్ర ఇంత ఎక్కువ చేస్తున్నారని భద్ర అనుకుంటాడు. అప్పుడే ధరణి  మహేంద్రని కలవడానికి వస్తుంది. సర్ లేరు అని భద్ర చెప్పగానే.. అయ్యో మావయ్య గారు ఉంటే వసుధార దగ్గరకి వెళదామని అనుకున్నాను. మావయ్య గారు లేరా అంటూ వెనక్కి వెళ్తుంటే.. నేను తీసుకొని వెళ్తానని భద్ర ఆపాలని అనుకుంటాడు. మళ్ళీ ఏమైనా అంటారేమోనని ఆగిపోతాడు. తన వెనకాలే వచ్చిన శైలేంద్రని చూసి ఎందుకు వచ్చారంటూ సెటైర్ గా మాట్లాడుతు.. పదండి వెళదామని శైలేంద్రతో ధరణి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయలుల్దేరి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:మోసగాళ్ళకు మోసగాడు దొరికేశాడు.. కథలో సరికొత్త ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -362 లో.. దేవ్ తప్పు చేసాడని ఇంట్లో అందరికి తెలుస్తుంది. దాంతో  నేనే నా చెల్లెలి లైఫ్ బాగుండాలని ఇలా చేసాను. ఈ విషయాలన్ని ముకుందకి తెలియదు అని దేవ్ అంటాడు. ఇక తనకి ఏం తెలియదు అన్నట్లు గా ముకుంద పర్ఫార్మెన్స్ ఉంటుంది. నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదని దేవ్ ని ముకుంద తిడుతు ఏడుస్తుంది. ఆ తర్వాత పోలీసులు దేవ్ ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఇక నువ్వే నా కోడలు అని కృష్ణని రేవతి దగ్గరకి తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రేవతితో పాటు మురారి, నందు, గౌతమ్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు కృష్ణ ఇంకా ఇంటికి రాలేదు ఏం జరిగిందో ఏమో.. నేను వెళ్లి చూస్తానని శకుంతల అనుకుంటుంది. అప్పుడే కృష్ణ హుషారుగా వచ్చి జరిగింది మొత్తం శకుంతలకి చెప్తుంది. శకుంతల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను వెళ్లి ఏసీపీ సర్ ని తీసుకొని వస్తాను. భోజనం చేద్దామని కృష్ణ వెళ్తుంది. మరొకవైపు ముకుంద ఏడుస్తుంటే.. నువ్వు ఫస్ట్ ఆ ఏడవడం ఆపు ఈ నాటకాలన్నీ ఆపు. మీ అన్నలాగే నువ్వు నాటకం ఆడుతున్నవని భవాని అనగానే.. నాకేం తెలియదని ముకుంద అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవరు నమ్మరు. నేను మా అన్న కలిసి మోసం చేశామని మీరు అందరూ నమ్ముతున్నారా అని ముకుంద అనగానే.. నేను నమ్మట్లేదని కృష్ణ అంటుంది. అ తర్వాత మీరు ముకుంద ని క్షమించండి అత్తయ్య అని భవానిని‌ కృష్ణ  అడుగుతుంది. నేను క్షమించను. చట్టం నీ అన్నకి శిక్ష వేస్తే నేను నీకు వేస్తున్నాను. ఆ తర్వాత ఎన్ని తప్పులు చేసిన నాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నవ్ ఇక నేను మారిపోయానని కృష్ణకి ముకుంద చెప్తుంది. ఇక ఎప్పటికే కృష్ణనే నీ భార్య అని మురారితో ముకుంద చెప్తుంది. అత్తయ్య ముకుందని క్షమించండి అని భవానిని కృష్ణ  రిక్వెస్ట్ చేస్తుంది. సరే చేస్తాను.. కానీ భవిష్యత్తులో ఏం జరిగిన నీదే బాధ్యత అని నువ్వు  అంటే క్షమిస్తానని భవాని అంటుంది. దానికి కృష్ణ సరేనని అంటుంది. తరువాయి భాగంలో ఇన్ని రోజులు కృష్ణ తప్పు చేసిందని తనని అవుట్ హౌస్ లో ఉంచారు కదా.. ఇప్పుడు తను ఏం తప్పు చెయ్యలేదని తెలిసింది కదా.. ఇప్పుడు ఇంట్లోకి రమ్మని చెప్పండి నేను అవుట్ హౌస్ లో ఉంటాను అత్తయ్య అని భవానితో ముకుంద చెప్తుంది. దానికి మురారి.. అవును కరెక్ట్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బ్రహ్మముడి సీరియల్ అరుదైన రికార్డు.. 300 ఎపిసోడ్ లు కంప్లీట్!

బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియళ్ళకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటిల్లో "కార్తీక దీపం" సీరియల్  ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే.  అదే టైమ్ స్లాట్ లో వచ్చిన "బ్రహ్మముడి" ఇప్పుడు అంతే క్రేజ్ సంపాదించుకుంది.  ఈ సీరియల్ తో పాటు 'కృష్ణ ముకుంద మురారి', 'గుప్పెడంత మనసు' సీరియల్స్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. బ్రహ్మముడి సీరియల్ లో మొదటగా  దుగ్గిరాల కుటుంబంలోని వినాయకుడి పూజకి కనకం-కృష్ణమూర్తి కుటుంబం వస్తారు. కనకం-కృష్ణమూర్తిలకి స్వప్న, కావ్య, అప్పు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు. ఇక తను అనుభవిస్తున్న పేదింటి కష్టాలని కూతుళ్ళకి రాకూడదనుకుంటు తన పెద్ద కూతురు స్వప్నని పెద్దింటికి కోడలిని చేస్తానంటు చెప్పడంతో తను మరింతగా ఆశలు పెంచుకుంటుంది‌.‌  ఇక దుగ్గిరాల ఇంటికి వచ్చి ఆ ఇంటికి తన కూతుళ్ళని కోడళ్ళుగా చేయాలని కనకం శపథం చేస్తుంది. ఇక కొన్ని కీలక ఎపిసోడ్ ల తర్వాత ఇరుకుటుంబం వాళ్ళు రాజ్, స్వప్నలకి పెళ్ళి సంబంధం ఫిక్స్ చేస్తారు. ఇక రాజ్ తో పెళ్ళి అనగా రాజ్ కన్నా రాహుల్ పెద్దోడని భావించిన స్వప్న లేచిపోతుంది.‌ ఇక అదే ముహుర్తానికి పెళ్ళి పీటలమీద కావ్యని కూర్చోబెట్టి రాజ్ తో పెళ్ళి జరిపిస్తారు. ఇక బలవంతంగా రాజ్ ఇష్టంలేకుండా కావ్యని పెళ్ళి చేసుకోవడంతో రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక కావ్యకి అత్తపోరు అంటే ఏంటో చూపిస్తుంది. ‌ఇక కొన్నిరోజులకి స్వప్న మళ్ళీ తిరిగొచ్చి రాహుల్ నన్ను ప్రేమించాడని చెప్పడంతో దుగ్గిరాల కుటుంబంతో పాటు కనకం-కృష్ణమూర్తి షాక్ అవుతారు.‌ ఇక రాహుల్-స్వప్నల వివాహం జరుగుతుంది. ఇక తాజా ఎపిసోడ్ లలో కళ్యాణ్-అనామికల పెళ్ళి జరుగుతుంది. కళ్యాణ్ ని అప్పు ప్రేమించిన విషయం దుగ్గిరాల ఫ్యామిలీకి తెలస్తుంది. ఇక అప్పటివరకు కావ్యతో మంచిగా ఉన్న ధాన్యలక్ష్మి కాస్త కావ్యని దోషిగా చేస్తూ కక్ష సాధిస్తుంటుంది. ప్రతీ చిన్నదానికి కావ్యదే తప్పు అన్నట్టు నిందించడంతో కావ్యకి అందరు శత్రువులే అన్నట్టుగా సీరియల్ సాగుతుంది. మరి అనామిక-కళ్యాణ్ ల పెళ్ళి విషయంలో కావ్య చేసిన సాయం ధాన్యలక్ష్మి తెలుస్తుందా? తెలుసుకొని కావ్యకి అండగా నిలబడుతుందా చూడాలి. బ్రహ్మముడి సీరియల్ తాజాగా మూడు వందల ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇక ఈ సీరియల్ యూనిట్ అంతా కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సీరియల్ డైరెక్టర్ కుమార్(చింటు) పంతం  ప్రతీ ఎపిసోడ్ ని తన ఇన్‌ స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తుంటాడు. రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ.. అటు మూడు వందల ఎపిసోడ్ లు పూర్తి చేసుకోవడంతో కవిగారుగా చేస్తున్న కళ్యాణ్, అనామిక, అపర్ణ, ధాన్యలక్ష్మి అందరు కలిసి రీల్స్ చేస్తు సెలెబ్రేట్ చేసుకున్నారు. మరో అరవై ఎపిసోడ్ పూర్తిచేసుకుంటే ఈ సీరియల్ సంవత్సరం పూర్తిచేసుకునన్నట్టవుతుంది. ఇక ఇన్ని ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ కి ఉండే క్రేజ్ తగ్గట్లేదు. టీఆర్పీలో ఈ సీరియల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది.  

రాకేష్-సుజాత మధ్య సత్య...ఇమ్ముని అన్న అన్న వర్ష

జబర్దస్త్ షో ప్రతీ వారం ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. ఎంతో మంది కమెడియన్స్ కి మంచి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే..అలాంటి  ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఐతే బుల్లితెర మీద  కమెడియన్ ఇమ్మానుయేల్, వర్ష లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలుసు.. అలాంటి వర్ష ఇమ్మానుయేల్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈమె హీరోయిన్ కంటే అందంగా, యాక్టివ్ గా, మంచి జోష్ తో అలరిస్తూ ఉంటుంది. జబర్దస్త్ స్కిట్ల ద్వారా బాగా పాపులర్ అయిపోయింది.    ఒకానొక టైంలో వీరు పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఓపెన్ గా చెప్పడం అది కాస్త  సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. వీళ్ళ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అంటూ ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి వర్ష షాకిచ్చింది. నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే అందులో ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ టీమ్ లో ఉన్న వర్ష  ఇమ్మానుయేల్ ని అన్నా అంటూ పిలిచింది . దీంతో ఇమ్మానుయేల్ కి బాగా కోపం వచ్చేసింది. మర్యాదగా మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళ స్కిట్ తర్వాత రాకింగ్ రాకేష్- సత్య కలిసి స్కిట్ చేశారు. "నీకేమన్నా నోటీసు పంపించారా ఇంత అందంతో మత్తెక్కిస్తున్నావ్ కదా" అని రాకేష్ సత్య అందాన్ని పొగిడేసరికి స్టేజి కింద కూర్చున్న రాకేష్ వైఫ్ సుజాత ఫుల్ ఫైర్ అయ్యింది. "నువ్వు స్టేజి దిగి రా నీకు ఇవ్వాల్సిన నోటీసులు నేను ఇస్తా" అంటూ ఒక దుడ్డు కర్ర తీసుకుని  సీరియస్ గా రాకేష్ మీదకు విసిరేసింది. ఇక ప్రోమో ఫైనల్ లో  బులెట్ భాస్కర్ స్కిట్ లో ఇంద్రజ మీద కౌంటర్ వేసాడు   .."అమ్మ ఎప్పుడొస్తది" అని నరేష్ ని అడిగేసరికి "20 న వస్తుంది" అని చెప్పాడు. " ఏ అమ్మ" అని భాస్కర్ రివర్స్ లో అడిగాడు "ఇంద్రజమ్మ" అని చెప్పాడు నరేష్. "మీరు ఆవిడని అమ్మ అని పిలవడం ఏమిటి ఆమె అమ్మాయిలా డాన్స్ చేస్తూ ఉంటే" అని ఫన్నీ  కౌంటర్ వేసాడు భాస్కర్.

ఆట సందీప్ కొత్త సినిమా టీజర్ లాంఛ్.. అటెండ్ అయిన స్పై బ్యాచ్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. దీనికి కారణం శివాజీనే అనేది అందరికి తెలిసిందే. ‌యావర్ , ప్రశాంత్ లని సీజన్ సెవెన్ ఫినాలే వరకు కాపాడుకుంటూ వచ్చాడు శివాజీ. ఇక హౌస్ లో శివాజీ, ప్రశాంత్, యావర్ ముగ్గురు కలిసి ఓకే మాట ఒకే బాణంలాగా ఉండేవాళ్ళు. అందుకే వీరిని స్పై అని ముద్దుగా పిలుచుకుంటారు. ‌కాగా స్పా బ్యాచ్ తో ఎక్కువగా ట్రావెల్ అయిన హౌస్ మేట్ ఆట సందీప్. ఆట సందీప్, అమర్ దీప్ తో కలిసి ఎన్నో గేమ్స్, టాస్క్ లలో ఫౌల్ చేశాడు. ఇక మొట్ట‌మొదటి హౌస్ మేట్ గా గెలిచి ఆరువారాల ఇమ్యూమిటీ పొంది నామినేషన్ లో లేడు. ఆ తర్వాత కెప్టెన్ గా గెలిచి మరో వారం నామినేషన్ లో మిస్ అయ్యాడు.‌ ఇక తొమ్మిదవ వారం టేస్టీ తేజ నామినేషన్ చేయడంతోనే ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు ఆట సందీప్.‌ తొమ్మిది వారాలు ఓ కంటెస్టెంట్ నామినేషన్ లో ఉండకుండా హౌస్ లో ఉండటం ప్రథమం అయితే బయటకు రావడం ఇదే తొలిసారి జరిగింది. ‌ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లతో ఎక్కువ స్నేహంగా ఉన్న ఆటసందీప్.. ఆ తర్వాత ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక‌ ఎవరు జెన్యున్ ప్లేయర్? ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారో‌ తెలుసుకొని పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేశాడు. ఇక భోలే షావలి ఎలిమినేషన్ తర్వాత ఆటసందీప్, అతని భార్య జ్యోతిరాజ్ వాళ్ళింటికి వెళ్ళి మరీ కలిసారు. ఇక శుభశ్రీ, టేస్టీ తేజ కలిసి రీల్స్ తో‌ బిజీగా ఉంటున్నారు. ఇక తాజాగా మూవీ షూటింగ్ లో‌ బిజీ ఉన్నానని చెప్పిన ఆట సందీప్.. ఆ కబురు చెప్పేశాడు. ఆట సందీప్ బిగ్ బాస్ ఫ్రెండ్స్ తో కలిసి తన సినిమా టీజర్ లాంఛ్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశాడు. ఆట సందీప్ కొత్త సినిమా ' షార్ట్ కట్' టీజర్ లాంఛ్ నిన్న జరిగింది. దీనికి బిగ్ బాస్ హౌస్ మేట్స్..  శివాజీ,‌‌ ప్రశాంత్, యావర్ భోలే షావలి, అశ్వినిశ్రీ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ అటెండ్ అయ్యారు.‌‌ఇక ప్రశాంత్ ని కలిసిన ఆటసందీప్ భార్య.. అన్నా అంటూ ఆత్మీయంగా హత్తుకుంది.‌ ఆ తర్వాత జై జవాన్ జై కిసాన్ అంటు గట్టిగా అరుస్తూ తనకి రైతులపై ఉన్న ఇష్టాన్ని, ప్రశాంత్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఆ తర్వాత టీజర్ లాంఛ్ లో భాగంగా.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ మాట్లాడారు. శివాజీ బాగుందని చెప్పాడు. ఇక ప్రశాంత్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే అశ్వినిశ్రీ, భోలే షావలి తమ అభినందనలు తెలిపారు. ఇక గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. నా డ్యాన్స్ ని చాలామంది ట్రోల్స్ చేశారు. చాలామంది నా డ్యాన్స్ చూసి నవ్వుకున్నారు. అఫ్ కోర్స్ నేను కూడా నవ్వుకున్నాను. ఇక ఇప్పుడు ఆట సందీప్ కి ఓ భాద్యత అప్పగించాను. నాకు డ్యాన్స్ నేర్పించమని చెప్పానని గౌతమ్ కృష్ణ అన్నాడు. ఇక యావర్, ఆట సందీప్ తో‌ కలిసి కొన్ని డ్యాన్స్ స్టెప్పులు కూడా వేశాడు. ఇక స్పై బ్యాచ్ ని ఒకే స్క్రీన్ మీద చూసిన స్పై బ్యాచ్ అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లలో స్టాటస్ లు పెట్టేస్తున్నారు.   

అతి త్వరలో పల్లవి గౌడ కొత్త సీరియల్.. ఎందులోనో తెలుసా?

బుల్లితెర ధారావాహికల్లో కొన్ని సీరియల్స్ ఇప్పటికి, ఎప్పటికి గుర్తుండిపోతాయ్. ఎంతలా అంటే ఎప్పుడో వచ్చిన మొగలిరేకులు, చక్రవాకం, పిన్ని నుండి ఈ మధ్యే ముగిసిన కార్తీక దీపం వరకు అన్నింటిని ప్రేక్షకులు ఆదరించారు.  కంటెంట్ లో కొత్తదనం ఉంటే అది సినిమా అయిన, సీరియల్ అయిన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. కొందరు జీ తెలుగు సీరియల్స్ కి అభిమానులైతే మరికొందరు స్టార్ మాటీవి ,‌జెమినీ టీవీ సీరియళ్ళకి అభిమానులు. అయితే కొత్త సీరియళ్ళకి ఉండే టీఆర్పీ వేరే లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే ఆ సీరియల్ మొదటి ఎపిసోడ్ చూసి బాగుందా? లేదా అనే ఓ అంచనాకి వచ్చి దానిని ఆడియన్స్ రెగ్యులర్ గా చూస్తుంటారు. అయితే స్టార్ మా టోవీలో తాజాగా మొదలైన సత్యభామ, ఊర్వశివో రాక్షసివో సీరియల్స్ మంచి వీక్షకాధరణ పొందుతున్నాయి. కాగా జెమిని టీవీలో రెండు రోజుల క్రితం మొదలైన స్రవంతి సీరియల్ కి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అయితే త్వరలో జెమిని టీవీలో ఓ ధారవాహిక ప్రారంభం కానుంది‌.  దీనిలో పసుపు-కుంకుమ సీరియల్ ఫేమ్ పల్లవి గౌడ హీరోయిన్ గా, తొలి పరిచయంగా హర్షిత్ శెట్టి హీరోగా చేస్తున్నాడు. ఈ సీరియల్ ' ఏవండోయ్ శ్రీవారు' . ఇందులో ఇద్దరు భార్యభార్తలకి గొడవల కారణంగా ఎవరి టైమ్ వారు డిసైడ్ చేసుకొని ఉంటారు.  ఇక పల్లవి టైమ్ లో హర్షిత్ తన బట్టలను ఐరన్ చేసుకుంటాడు‌. దాంతో నా టైమ్ లో ఎందుకు చేస్తున్నావంటూ గొడవకి దిగుతుంది పల్లవి. ఇక ఇద్దరి గొడవలో ఆ ఐరన్ చేస్తున్న షర్ట్ కాలిపోతుంది‌. ఇంతలో స్మైల్ అని ఒకతను అనగానే అందరు కలిసి ఫోటోకి ఫోజిస్తారు. మరీ ప్రతీ చిన్నదానికి టైమ్ కేటాయించుకొని ఫోటో అనగానే అందరు కలిసి ఫొజులిచ్చే ఈ విచిత్ర కుటుంబ కథతో వస్తున్న ఈ సీరియల్ ని ఎంతమంది ఆదరిస్తారో చూడాలి మరి. కాగా ఈ సీరియల్ అతి త్వరలో ప్రారంభం కానుంది.   

అమ్మా..నా కూతురిలో నిన్ను చూసుకుంటున్నా..ప్రతి క్షణం

బిగ్ బాస్ సీజన్స్ లో బాగా గుర్తుండే సీజన్ సెకండ్ సీజన్  ..ఇందులో కౌశల్ ఆర్మీ ఫుల్ పాపులర్ అయ్యింది. అయితే కౌశల్ ఆర్మీతో తర్వాత కౌశల్ మందా చాల  ఇబ్బందులు కూడా పడిన విషయం అందరికీ తెలుసు.  ఆ తర్వాత కొంతకాలం అసలు కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక ఈ మధ్య యూట్యూబ్‌లో కొంచెం కొంచెంగా  కనిపిస్తున్నాడు. అలాగే రీసెంట్ గా ఒక డాన్స్ షోలో కూడా పెర్ఫార్మ్ చేసి అలరించాడు. అలాంటి కౌశల్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అది కూడా వాళ్ళ అమ్మ గురించి.. "అమ్మా నువ్వు నన్ను వదిలి 22 ఏళ్లు అయ్యింది. అయినప్పటికీ, మీ పట్ల నా ప్రేమ , శ్రద్ధ అలాగే ఉన్నాయి.  ప్రతిరోజూ నా కూతురిలో మిమ్మల్ని చూసుకుంటున్నా... నేను నీకు చేసిన వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకున్నాను. అది నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పుడు అన్నీ గెలవాలని పోటీ పడ్డాను, ఇప్పుడు కూడా నన్ను నేను నిరూపించుకోవడానికి, నన్ను నెగిటివ్‌గా చూసే వారి నోరు మూయించడానికి ప్రతి క్షణం పోరాడుతున్నాను.  మీరు నన్ను పైనుంచి చూస్తున్నారని, నాకు మార్గనిర్దేశం చేస్తున్నారని, నాకు శక్తిని ఇస్తున్నారని నాకు తెలుసు. నువ్వు ఎలా కోరుకున్నావో నేను అలాగే ఉన్నాను. ఇప్పుడు నువ్వు మాతో లేవనే నిజాన్ని నమ్మడం కష్టంగా ఉంది.  కానీ నా కళ్ల ముందు నువ్వు ఉన్నట్లు ప్రతి క్షణం నీ ఉనికిని అనుభవిస్తున్నాను. మీ లోకంలో మీరు ప్రశాంతంగా ఉండండి అమ్మ. మీ ప్రేమ, జ్ఞాపకాలు ఎప్పుడూ నాతో ఉంటాయి." అంటూ బాధతో ఒక సుదీర్ఘ మెసేజ్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఐతే  కౌశల్ ఎక్కడుంటే అక్కడ కాంట్రవర్సీలు అతని వెంటే ఉంటాయి.  త్వరలో  తాను ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని అది కూడా రూ. 250 కోట్లు బడ్జెట్ మూవీ చెప్పాడు కౌశల్...