గోల్డెన్ లేడీ ఆఫ్ జీ తెలుగు ఈజ్ బ్యాక్ : ఉదయభాను రీఎంట్రీ

బుల్లితెర మీద ఒకప్పటి ఫేమస్ లేడీ యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఉదయభాను మాత్రమే...ఎవరేం అడిగిన చాలా డేర్ అండ్ డాషింగ్ గా ఆన్సర్స్ ఇస్తుంది. అలాగే షోస్ కి హోస్టింగ్ కూడా చేస్తుంది. అప్పట్లో అన్ని షోస్ కి ఉదయభాను యాంకరింగ్ చేసేది. తర్వాత కొంతకాలానికి ఆమె టీవీకి దూరమైపోయింది. ఇక  చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ యాంకరింగ్ షురూ చేసింది ఉదయభాను.. జీ తెలుగులో త్వరలో ప్రసారం కాబోతోన్న షోతో హోస్ట్‌గా మరోసారి తన కెరీర్‌ను రీస్టార్ట్ చేయడానికి రెడీ ఐపోయింది. ‘‘అమ్మ చెప్పేది అమ్మగా గెలిస్తేనే అన్నింటిలో గెలిచినట్టు అని. అమ్మను అయ్యాకే అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. అన్నీ పక్కన పెట్టేశాను. పిల్లలే జీవితం అయిపోయారు. నాకు అమ్మలు అయిపోయారు’’ అంటూ ఉదయభాను.. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన మాటలు ఈ ప్రోమోలో వినిపిస్తాయి. ఇక ఒక రూమ్ లో పిల్లలంతా డాన్స్ చేస్తూ ఉంటే ఆమె కాళ్ళు కూడా డాన్స్ చేస్తాయి. అప్పుడు వాళ్ళ పిల్లలు ‘‘ఆపొద్దు అమ్మ’’ అని చెప్పేసరికి "డాన్స్ ఫ్లోర్ లో నీ ఎనెర్జీ మళ్ళీ చూడాలనుంది" అనేసరికి ఉదయభాను ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇలా ‘సూపర్ జోడీ’ షోతో హోస్ట్ గా రీఎంట్రీ ఇవ్వనుంది ఉదయభాను. ‘గోల్డెన్ లేడీ ఆఫ్ జీ తెలుగు ఈజ్ బ్యాక్’ అనే ట్యాగ్‌తో ఉదయభాను ప్రోమోను విడుదల చేసింది జీ తెలుగు. ఇక ఈ ప్రోమోలో ‘సూపర్ జోడీ’ షో జనవరి 28న లాంచ్ కాబోతోంది. ఇక ఈ  ‘సూపర్ జోడీ’ షోకు మీనాతో పాటు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మరో సీనియర్ నటీమణి శ్రీదేవి విజయ్ కుమార్ జడ్జిలుగా వ్యవహరించనున్నారు.  ఐతే ఈ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీ పెయిర్స్ ఎవరన్న విషయం ఇంకా రివీల్ కాలేదు.

ShobhaShetty:నాకు కాబోయే వారితో నా మొదటి సంక్రాంతి!

ప్రతీ సంక్రాంతికి చాలామంది ఇంటికి వెళ్ళి అమ్మ చేసిన పిండివంటలు తిని మళ్ళీ సిటీకి వచ్చేసి తమ పనుల్లో బిజీగా ఉంటారు. అయితే ఇలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పండుగని గొప్పగా జరుపుకుంటారు. అయితే కొందరు సెలెబ్రిటీలు సిటీలోనే ఉండి వారి కంఫర్ట్ లో వాళ్ళు జరుపుకుంటున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తమ సొంతూరికి పోకుండా ఇక్కడే పండుగని సెలబ్రేట్ చేసుకునేవారు చాలామందే ఉన్నారు. వారిలో శోభాశెట్టి ఉంది. ఎప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో ముందుకు వస్తూ ఫ్యాన్ బేస్ ని మరింత పెంచుకుంటుంది ఈ భామ. బిగ్ బాస్  సీజన్-7 లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో మొదట రైతు బిడ్డ ప్రశాంత్ ఉంటే ఆ తర్వాత కార్తీక దీపం మోనిత అలియాస్ శోభాశెట్టి ఉందనే చెప్పాలి. హౌస్ లోకి వెళ్ళినప్పుడు మొదట్లో చాలా సాధారణంగా కనిపించిన శోభాశెట్టి.. మెల్లి మెల్లిగా చంద్రముఖిలా మారిపోయిందంటూ ప్రతీవారం ఫుల్ ట్రోల్స్ వచ్చేవి. వాటిని వీకెండ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ లో హోస్ట్ నాగార్జున బిగ్ స్క్రీన్ మీద వేసి చూపించాడు. బిగ్ బాస్ హౌస్ లో శోభాశెట్టి ఆటతీరు, మాటతీరుకి ప్రేక్షకులు తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు ప్రియాంక, అమర్ దీప్ లతో కలిసి గ్రూప్ గా ఉంటు టాస్క్ లలో కూడా గ్రూప్ గా ఆడుతూ, నామినేషన్ టైమ్ లో అందరు కలిసి ఎవరెవరిని నామినేషన్ చేయాలని మాట్లాడుకోవడం అన్నీ కూడా తనకి మరింత నెగెటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాయి. అయితే ఆటలో ఉన్నప్పుడు ఫౌల్ చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు కానీ మరీ సంఛాలక్ గా ఉండి కూడా ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేసేది. ఇక మొదటి వారం నుండి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియాంక కలిసి చేసిన నామినేషన్ లు చాలానే ఉన్నాయి. శోభాశెట్టి హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ముద్దుబిడ్డ అనేవాళ్ళు ఎందుకంటే తనెంత చెత్త ఫర్ఫామెన్స్ ఇచ్చిన, ఓటింగ్ లో ఎంత లీస్ట్ లో ఉన్న తను మాత్రం ప్రతీవారం సేఫ్ అయ్యేది. బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక యూట్యూబ్ లో సొంతంగా వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోటోషూట్స్, రీల్స్ తో బిజీగా ఉంటున్న ఈ భామ.. తాజాగా "నాకు కాబోయే వారితో నా‌ మొదటి సంక్రాంతి" అనే వీడియోని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఇందులో తనకు కాబోయే భర్త యశ్వంత్ అని చెప్తూ.. అతనితో కలిసి పూజ చేసింది‌. కన్నడవారికి ఇష్టమైన బొప్పట్లని ఇంట్లో చేసింది శోభాశెట్టి.‌ ఇక ఇంటిని అందంగా అలంకరించి.. యశ్వంత్ దగ్గర తొలిసారి ఆశీర్వాదం కూడా తీసుకుంది. ప్రస్తుతం ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తుంది.  

విష్ణుప్రియ చేసిన ఆ డ్యాన్స్ కి ఫుల్ క్రేజ్!

గుంటూరు కారం సినిమాలో ' ఆ కుర్చీని మడతబెట్టి' సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఆ పాటకి బుల్లితెర నుండి వెండితెర వరకు ఉన్న నటీమణులు వారి స్టైల్ లో డ్యాన్స్ తో అదరహో అనిపించేలా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ జాబితాలో విష్ణుప్రియ కూడా ఉంది.  కొన్ని రోజుల క్రితం ఓ డ్యాన్సర్ తో కలిసి ఈ పాటకి డ్యాన్స్ చేసిన విష్ణుప్రియ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది.  బుల్లితెరపై యాంకర్ గా విష్ణుప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోవా పోరే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడంతో తను కొన్నిరోజులు డిప్రెషన్ కి కూడా పెళ్ళింది. అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. కొంతకాలం క్రితం మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' కూడా యూట్యూబ్ లో మంచి వీక్షకాదరణ పొందుతోంది. విష్ణుప్రియకి బిగ్ స్క్రీన్ మీద తనని తాను చూసుకోవాలని ఆశంట.. ఎందుకంటే అది వాళ్ళ నాన్న డ్రీమ్ అంట. తనలోని నటనను ఎవరు గుర్తించకపోయేసరికి డ్యాన్స్ మీద దృష్టి పెట్టి కసరత్తులు చేస్తుంది. యోగాలు, జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ డ్యాన్స్ కోసం తన బాడీనీ మలుచుకుంటుంది విష్ణుప్రియ. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే విష్ణుప్రియ.. తనకి సంబంధించిన ఒక ప్రతీ విషయాన్ని అప్డేడ్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా తన ఇమ్ స్టాగ్రామ్ లో ' ఆ కుర్చీని మడతబెట్టి' పాట 3 మిలియన్ వ్యూస్ దాటింది. అదే విషయాన్ని విష్ణుప్రియ చెప్పుకుంటూ ఓ పోస్ట్ చేసింది. నా పాటని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి థాంక్స్ అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.‌ కాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.  

Krishna Mukunda Murari:ముకుందకి సపోర్ట్ గా కృష్ణ.. తను నిజంగానే మారిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -368 లో.. ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత మొక్కకి దంపతులిద్దరూ కలిసి నీరు పోస్తుంటారు. ముందుగా కృష్ణ మురారీలు నీరు పోయగా... మీ భర్త ఎక్కడ అని పంతులు గారు ముకుందని అడుగుతాడు. అందరు సైలెంట్ గా ఉండిపోతే కృష్ణ మధ్యలో కలుగుజేసుకొని.. ఇండియా బార్డర్ లో ఉన్నాడని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత నందు, గౌతమ్,  సుమలత, ప్రసాద్ లు కలిసి నీరు పోస్తారు. కాసేపటికి కృష్ణ హారతి ఇస్తు ముకుందకి పట్టుకోమని ఇచ్చి కృష్ణ హారతి తీసుకుంటుండగా.. ఆ హారతి ఆరిపోతుంది. దాంతో కృష్ణ డిస్సపాయింట్ అవుతుంది. అందరు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ముకుంద ఏడుస్తు నా వల్లే ఇదంతా అంటుంది.  అనుకోకు నీకేం జరగదని ముకుందతో కృష్ణ అంటుంది. నువ్వేం కంగారు పడకు.. మంచి మనస్సుతో మొక్కుకో అంత మంచే జరుగుతుందని పంతులు గారు ముకుందకి చెప్తాడు. కాసేపటికి భవాని దగ్గరికి రేవతి వచ్చి.. ఇప్పుడు పూజలో ఇలా జరిగిందని బయటపడుతుంది. ఏం కాదులే ఇన్ని రోజులు భ్రమలో ఉండి మనకి మనమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నామని భవాని అంటుంది. అ తర్వాత అందరు ‌కలిసి భోజనం చెయ్యడానికి వస్తారు.‌ నువ్వు స్పీడ్ గా నడవకు పంచే ఊడిపోతుందని మురారీతో మధు అంటాడు. అంత లేదు.. పంచె కట్టింది కృష్ణ ఊడిపోదంట అనగానే అందరు నవ్వుకుంటారు. కాసేపటికి భవాని తన గదిలో ఫోన్ ని తీసుకొని మురారికి రమ్మని చెప్పగానే.. తను తీసుకొని రావడానికి వెళ్తాడు. కాసేపటికి పంచె ఊడిపోవడం గమనించిన కృష్ణ.. మురారి రాగానే తనకి చెప్తుంది. దాంతో మురారి తినడం అయిపోయిన కూడా లేవడు. అ తర్వాత కృష్ణ అందరికి చెప్పడంతో అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అ తర్వాత అందరూ సరదాగా గాలిపటాలు ఎగురవేస్తారు.. కాసేపటికి కృష్ణ గదిలోకి వచ్చి.. ఆదర్శ్ ని తీసుకొని వచ్చి ముకుంద జీవితం బాగు చెయ్యలని అనుకుంటుంది. అ తర్వాత మురారి వస్తాడు. మురారి రొమాంటిక్ గా మాట్లాడుతుంటే కృష్ణ సిగ్గు పడుతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ లేచి ముగ్గు వేద్దామని వచ్చేసరికి ముగ్గు వేసి ఉండడంతో ఎవరు వేశారంటు ఇంట్లో అందరిని అడుగుతుంది. తరువాయి భాగంలో కృష్ణ ఎక్కడ అని మురారి మధుని అడుగుతుంటే.. అప్పుడే ముకుంద కృష్ణని బయటనుండి అందంగా రెడీ చేసి తీసుకొని వస్తుంటుంది. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedanatha Manasu:ఆ పోస్ట్ చేసింది ఎవరు.. ఇదంతా వాడి ప్లానేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 974లో..  కాలేజీ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ కలిసి ధర్నా చేస్తుంటారు. అసలు వసుధార మేడమ్ గారు ఎండీగా పదవీ చేపట్టిన తర్వాత జీతాలు పెంచమంటే పనే లేకుండా చేశారు. సరే ఉన్న జీతంతో ఎలాగోలా సరిపెట్టుకుందామంటే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. అసలేంటి సర్ ఇలా జరుగుతుందని ఒక మేడమ్ ప్రశ్నిస్తుంది. వసుధార మేడమ్ సంతకం పెట్టందే మాకు జీతాలు పడవు. ఇప్పుడు ఎలా సర్ అని మరో మేడమ్ ప్రశ్నిస్తుంది. వసుధార మేడమ్ వచ్చేస్తారు. తను వచ్చిన వెంటనే అన్నీ క్లియర్ చేసేస్తారని ఆ మేడమ్స్ తో ఫణీంద్ర అంటాడు. లేదు సర్ అప్పటివరకు మేము వెయిట్ చేయం.. రిషి సర్ రావాల్సిందేనని మిగతా ఫ్యాకల్టీతో పాటు స్టూడెంట్స్ కూడా.. వీ వాంట్ రిషీ సర్ అంటు గట్టిగా అరుస్తుంటారు.  రిషి సర్ చనిపోయారు కదా.. ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి స్టూడెంట్స్ అందరు వెళ్ళిపోతారని ఆ నిజాన్ని కప్పిపుచ్చారు కదా అంటూ స్టూడెంట్స్ ప్రశ్నించగా.. ఏం మాట్లాడుతున్నారు మీరు నిజానిజాలు తెలియకుండా మాట్లాడకండి అని మహేంద్ర చెప్తాడు. అయిన స్టూడెంట్స్ వినకుండా ' వి వాంట్ రిషి సర్' అంటు గట్టిగా అరుస్తూనే ఉంటారు. ఇక కాసేపటికి స్టూడెంట్ గ్రూప్ లో రిషి సర్ చనిపోయాడంటూ ఆర్ఐపీ  అని పోస్ట్ ఎందుకు వచ్చిందంటూ మహేంద్ర, ఫణింద్ర , అనుపమలకి చూపిస్తారు. అది చూసి అందరు షాక్ అవుతారు. కాసేపటికి మహేంద్ర తేరుకొని రిషికి ఏం కాలేదు.. ఎక్కడో ఓ చోట బ్రతికే ఉన్నాడని అంటాడు. అతి త్వరలో మా రిషి సర్ మాకు కావాలని స్టూడెంట్స్ చెప్పేసి‌ వెళ్ళిపోతారు. ఆ తర్వాత రిషి జాడ కనుక్కోమని మహేంద్రతో ఫణీంద్ర అంటాడు. దీనితర్వాత ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని కొడుతుంటాడు మహేంద్ర. ఇక అనుపమ మహేంద్రని ఆపుతుంది. నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావని అనుపమ అంటుంది. సమస్యకి పరిష్కారం వెతుక్కోవాలి కానీ ఎమోషనల్ అవ్వకూడదు. రిషి గురించి మాట్లాడటం, జీతాల గురించి అడగడం అన్నీ ఒకేసరి జరిగాయంటే దీని వెనుక శైలేంద్ర ఉన్నాడు. అతని ఆలోచనలని ఎలా తిప్పికొట్టాలో ఆలోచించమని అనుపమ అంటుంది. ఇవన్నీ చెప్తే రిషి ని మనం బయటకు తీసుకొస్తామని శైలేంద్ర ప్లాన్ అని అనుపమ, మహేంద్ర మాట్లాడుకుంటారు.  మహేంద్రకి మినిస్టర్ కాల్ చేస్తాడు.  నాకో ఇన్ఫర్మేషన్ వచ్చింది రిషి కన్పించడం లేదంట కదా? కాలేజీలో గొడవ జరుగుతుందంట కదా.. అసలేమైందని మహేంద్రని మినిస్టర్ అడుగుతాడు. అవన్నీ మిమ్మల్ని కలిసి వివరంగా చెప్తానని మహేంద్ర అంటే.. సరే నేను కాలేజీకి వస్తానని మినిస్టర్ కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత వసుధారకి మహేంద్ర కాల్ చేస్తాడు.  అప్పటివరకు రిషి ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడమే బెటర్ అని వసుధార అంటుంది. ఈ రోజు కాలేజీలో రచ్చ చేశాడని కాలేజీలో జరిగిందని మహేంద్ర అంటాడు. ముందైతే ఆ సోషల్ మీడియాలో  ఆ పోస్ట్ ని తీసేయమని చెప్పండి. సిలబస్ అయ్యేలా చూడాలి. సాలరీస్ ఫైల్ ఈ రోజే చూసి అప్రూవ్ చేస్తానని మహేంద్రతో వసుధార అంటుంది. ఇక కాలేజీ పేజీలో రిషి ఫోటో కింద ఆర్ఐపీ అని పెట్టారంటే అది నా కొడుకే చేసి ఉంటాడని శైలేంద్రకి దేవయాని కాల్ చేస్తుంది. అక్కడేదో చిచ్చు పెట్టినట్టున్నావని దేచయాని అడుగుతుంది. లేదంటే ఆ రిషి గాడు ఎక్కడ ఉన్నాడో బయటపెట్టట్లేదని శైలేంద్ర అంటాడు. ఇక అప్పుడే దేవయానికి ధరణి వస్తుంది.  సోషల్ మీడొయాలో ఇలా వచ్చిందని ధరణి అడుగగా.. ఏమో నిజమేమోనని దేవయాని అంటుంది. అత్తయ్య.. అలాంటి అపశకునం మాటలు నోటికెలా‌ వస్తాయి. అది నోరా ఇంకేమన్నానా అని ధరణి గట్టిగా అంటుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi:శోభనానికి రమ్మని పిలిచిన భార్య.. కంగుతిన్న భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ - 307 లో..  రాహుల్, రుద్రాణి మాట్లాడుకుంటారు. ఆ స్వప్న టార్చర్ చేస్తుంది రా.. చెప్పింది చేయకుంటే కేస్ పెడుతదంటరా అని రుద్రాణి అనగానే.. తను చెప్పింది నువ్వు చేస్తున్నావు కదా మమ్మీ అని రాహుల్ అనగానే.. ఇంకెంతకాలం చేయాలిరా అని రుద్రాణి అంటుంది. దానికి డెలివరీ అయ్యేవరకు చాలు అని రాహుల్ అనగానే.. రేపు పుట్టాక వాడి ముడ్డి కడుగు, మూతి కడుగు అని తర్వాత ఇంకా పనులు చెప్తుందంటు భాదపడుతుండగా.. ఏయ్ బయటేంటి ముచ్చట్లు అని స్వప్న అనగానే ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇక కళ్యాణ్-అనామికల గదిని వారి శోభనం కోసం ఓ పనివాడు వచ్చి పూలతో డెకరేట్ చేస్తుంటాడు. రాజ్ చూసి ఎవరు నువ్వు? నువ్వెందుకు డెకరేట్ చేస్తున్నావని అడుగగా.. కావ్య మేడమ్ చేయమందని అతను చెప్తాడు. తనే డెకరేట్ చేస్తానని ఇప్పుడు మనిషిని పెట్టిందేంటని రాజ్ అనుకొని కావ్య కోసం ఇల్లంతా చూస్తుంటాడు. కావ్య  ఒక దగ్గర ఉండి ఆలోచిస్తుంటుంది. తన దగ్గరికెళ్ళిన రాజ్.. ఏంటి గది డెకరేట్ చేయకుండా ఏం చేస్తున్నావని అడుగగా..‌ ఎవరు చేస్తే ఏంటి.. పని జరుగుతుంది కదా అని కావ్య అంటుంది. నీ చేయి పడట్లేదేంటి పని తప్పించుకుంటున్నావా అని రాజ్ అనగానే.. అదేం లేదని కావ్య అంటుంది. ఇక మధ్యలో వచ్చిన అనామిక.. తనకి చేయడం ఇష్టం లేదేమో బావ అందుకే ఇలా చేస్తుందని రాజ్ తో అనామిక అంటుంది. అదేం లేదని కావ్య అంటుంది. ఎందుకు నాకు కళ్యాణ్ కి సంబంధించిన విషయం అంటే నీకు అంత అయిష్టత అని అనామిక అనగానే.. అయిష్టమేం కాదు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి కావ్య వెళ్ళిపోతుంది. ‌ఇక  కిచెన్ లో ఏడుస్తూ ఉన్న కావ్య దగ్గరికి కళ్యాణ్ వెళ్ళి.. బాధకండి వదిన నేను ఉన్నాను. మీరు నాకు తోడుగా ఉండాలి కదా వదిన అని ధైర్యం చెప్తాడు.  ఎవరు ఏం చెప్పిన ఎన్ని అన్నా నేను మీ వైపే ఉంటానని కావ్య అంటుంది. అన్నయ్య అలిగి వెళ్ళాడని కళ్యాణ్ అనగానే.. మీ అన్నయ్యని ఎలా పిలవాలో నాకు తెలుసని కావ్య అంటుంది. ఇక గదిలో రాజ్ ఉండగా కావ్య వెళ్లి.. ఏంటండి మీకు సామాజిక భాధ్యత లేదా?.. అని కావ్య అడుగుతుంది. శోభనానికే రమ్మంటున్నానని కావ్య అనగానే.. రాజ్ కంగారు పడతాడు. బుద్ది ఉందా అని రాజ్ అంటాడు. శోభనానికి రా అనడానికి, శోభనం గదిని డెకరేట్ చేయడామికి రా అని అనడానికి తేడా లేదా అని రాజ్ అంటాడు. మన్మధుడు పూలబాణం తొడుక్కొని రెడీగా ఉంటాడు. కానీ బాణం విరిగిపోతుంది. పూలు వాలి పోతాయి. తెల్లారిపోద్దని కావ్య కాసేపు ఆటపట్టిస్తుంది. అలా ఇద్దరు కలిసి కళ్యాణ్-అనామికల గది డెకరేట్ చేయడానికి వెళ్తారు. తెలివిగా మాట్లాడుతున్నావని అనుకుంటున్నావా అని రాజ్ అంటే.. నాకే తెలివి ఉంటే నా శోభనం స్టోర్ రూమ్ లో ఎలా ఉంటుందని కావ్య అంటుంది. ఇందాక ఎందుకు డెకరేట్ చేయనన్నావ్? ఇప్పుడు ఎలా వచ్చావని రాజ్ అనగానే.. ఇందాక ఎవరో నన్ను బాధపెట్టారు. ఇప్పుడు ఎవరో నాకు సర్దిచెప్పారంటూ కావ్య తికమకగా చెప్పేసరికి రాజ్ కి అర్థం కాదు. ఆ తర్వాత అనామికని శోభనం గదికి అందరు కలిసి పంపిస్తారు. శోభనం గదిలోకి వెళ్ళిమ అనామిక.. పాలు తాగనని చెప్పి కళ్యాణ్ ని తాగమంటుంది‌. గదిలో ఉన్న పూలని చూస్తూ వర్ణిస్తుంటాడు కళ్యాణ్. ఇక అనామిక ఆపమని చెప్తుంది. ‌ఇక గదిలో పూలు బాగా డెకరేట్ చేశారు కదా అని కళ్యాణ్ అనగానే.. అవునని అనామిక అంటుంది. తర్వాయి భాగంలో ఈ గది కావ్య డెకరేట్ చేసిందని కళ్యాణ్ అంటాడు. ఈ నక్లెస్ కావ్య సెలెక్ట్ చేసిందని అనామికతో కళ్యాణ్ అనగానే.. మన మధ్యకు కావ్య, అప్పులను ఎందుకు తీసుకొస్తున్నావంటూ అనామిక అనగానే.. నువ్వు అనవసరంగా గొడవ చేస్తున్నావని కళ్యాణ్ అంటాడు. అలా ఇద్దరి మధ్య గొడవ జరిగి అనామిక వచ్చి హాల్లో పడుకుంటుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

థర్డ్ యానివర్సరీ... ఫైమా, ప్రవీణ్ బ్రేకప్ కి కారణం అదేనా?

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో ఇప్పుడు థర్డ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ షో మొత్తం ఆది, రాంప్రసాద్ మాత్రమే కనిపించారు. ఇందులో రష్మీ ఒక టాస్క్ ఇచ్చింది కొంతమంది జోడీస్ కి...స్టేజికి లెఫ్ట్, రైట్ సైడ్ కొన్ని యెల్లో లైన్స్ ఇచ్చి ఆ లైన్స్ మీదే నిలబడాలంటూ చెప్పింది రష్మీ. అలా కొన్ని ఎల్లో లైన్స్ మీద పటాస్ ఫైమా, ప్రవీణ్ ఇద్దరూ అతుక్కుని నిలబడ్డారు. ఇక వాళ్ళ వెనకాలకు ఆది వచ్చి నిలబడ్డాడు. "ఇక్కడ ఆగండి...ఇప్పుడు చెప్పండి..అసలు ఏం జరిగింది..ఎందుకు మాట్లాడుకోవట్లేదు" అని అడిగాడు ఆది. "అంటే తనకు నచ్చలేదంతే" అని చెప్పాడు ప్రవీణ్. "ప్రాబ్లమ్ ఏమీ లేదన్నా..మాట్లాడుతున్నా" అని కొంచెం ఇష్టం లేనట్టుగా ఫైమా చెప్పేసరికి మధ్యలో వచ్చింది రష్మీ.."ప్రాబ్లమ్ లేదు, మాట్లాడుతున్నా అంటున్నావ్..అసలు నువ్వు వాడిని ముట్టుకోవడానికే నీ బాడీ షాక్ కొట్టేస్తోంది..." అని రష్మీ అనేసరికి ఫైమా ముఖం తిప్పేసుకుంది. ఫైమా, ప్రవీణ్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే... వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్స్ గా మంచి సక్సెస్ సాధించారు. వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఇప్పటిది కాదు పటాస్ లోకి ఎంట్రీ ఇవ్వక  ముందు నుంచీ ఉన్నదే..ఇద్దరూ సరదాగా పెళ్లి ప్రాంక్ వీడియో కూడా చేసి అందరికీ షాకిచ్చారు. వీరి మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని కూడా వీళ్ళే ఆడియన్స్ ముందు చెప్పిన విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఇటీవల కాలంలో బ్రేకప్ కూడా చెప్పేసుకున్నారు. ఫైమాకి బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం వచ్చేసరికి అందులోకి వెళ్ళింది..ఆ తర్వాత ప్రవీణ్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడా కలిసి కనిపించిన సందర్భాలు లేవు. ఫైమా బిగ్ బాస్ నుంచి వచ్చాక స్టార్ మా ప్రోగ్రామ్స్ లో మాత్రమే తప్ప ఈటీవీ ప్రోగ్రామ్స్ అస్సలు కనిపించడం మానేసింది. చాలా రోజుల తర్వాత థర్డ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ లో ఫైమా ఇలా కనిపించేసరికి ఆది, రష్మీ ఇద్దరూ అసలు విషయం రాబట్టాలనుకున్నారు... కానీ ఫైమా మాత్రం అస్సలు ఒక్క విషయం కూడా బయట పెట్టలేదు.

హిమజ అరిసె కోసం పోటీపడుతున్న నెటిజన్లు!

ప్రతీ సంక్రాంతి పండగకి సిటీలో ఉన్న ఉద్యోగస్తులు, రోజు కూలీ చేసుకునేవారు, కళాకారులు..‌ ఇలా అన్ని రకాల వారు తమ తమ సొంత ఊర్లకి వెళ్తుంటారు. అయితే కొంతమంది సెలెబ్రిటీలకి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి వీలు కాదు. కాబట్టి వారున్న ఇంట్లోనే పండుగ జరుపుకుంటారు. పిండివంటలు చేసుకుంటూ తమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు తను చేసిన అరిసెను చూపిస్తూ హిమజ ఓ వీడియోని షేర్ చేసింది. హిమజ.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా సినిమాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలలో‌ నటించిన హిమజ..‌ మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. విజయవాడలో పుట్టిన హిమజ.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమారంగంలోకి వచ్చింది. బిగ్ బాస్-3 లోకి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళిన హిమజ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో తను ఒక సెలబ్రిటీగా మారిపోయింది. హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో‌ నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది. హిమజకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్ట్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. నిన్న మొన్నటిదాకా విదేశాలలో ట్రావెల్ చేసి వచ్చి‌న హిమజ.. సంక్రాంతికి అరిసెలు చేస్తూ ఓ‌ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అరిసెను అరిపించానంటూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అరిసెను అరిపించాను. ఆలస్యం చేసిన ఆశాభంగం అనే క్యాప్షన్ కూడా పెట్టేసింది ఈ భామ. ఇక ఈ స్పెషల్ అరిసె ఎవరికి కావాలంటూ హిమజ అడుగగా.. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.  

ఇంద్రధనుస్సు చీర కట్టి....అందానికి టాక్స్ కట్టాలనే రూల్ ఉంటేనా....

అనసూయ అంటే చాలు సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్. మంచిగా కామెంట్స్ పోస్ట్ చేస్తే పద్దతిగా రిప్లై ఇస్తుంది. అంతకు మించి ప్రవర్తిస్తే అలాగే ఘాటుగా వ్యవహరిస్తోంది.  అనసూయ డోంట్ కేర్ అనే టైపు...హార్ట్ వరకు ఏ విషయాన్ని కూడా తీసుకోదు. అలాంటి అనసూయ తన లేటెస్ట్ అప్ డేట్స్ ని అన్నిటినీ కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మకర సంక్రాంతి సందర్భంగా క్యూట్, లేటెస్ట్ పిక్స్ ని, తన ఫామిలీతో కలిసి ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. అలాగే ట్విట్టర్ లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పండగ శుభాకాంక్షలు  అంటూ ఒక మెసేజ్ ని షేర్ చేసింది . అలాగే అనసూయ ఇంటి ముందు అందమైన రంగవల్లి వేసి ఇంకా అందమైన ఇంద్రధనుస్సు రంగుల చీరతో కన్ను కొడుతూ మరీ ఫోటో దిగేసరికి ఫాన్స్ అందరూ ఫిదా ఇపోయారు. ఈ పిక్స్ ని చూసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. "అందంగా ఉండే వాళ్లకు టాక్స్ కట్టాలని పెడితే మీరే ఎక్కువ కట్టాల్సి వస్తుంది..ఇంత అందాన్ని చూడడానికి  రెండు కళ్ళు సరిపోవడం లేదు...ఒక అమ్మాయిగా నేను చాలా షాకవుతున్నా మీ బాడీని ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మీ శారీ చాలా బాగుంది.." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ యాంకరింగ్‌ ఆపేసి, వరుసగా మూవీస్ మీదే కాన్సన్ట్రేట్  చేస్తోంది.. రీసెంట్ గా ఆమె విమానం అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే.. సముద్రఖని ప్రధాన పాత్రలో కనిపించరు. ఈ సినిమాలో అనసూయాది  చిన్న పాత్రే అయిన ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ రోల్స్ లో అదరగొడుతోంది. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. ప్రస్తుతం యాంకరింగ్‌కు గుడ్’బై చెప్పిన అనసూయ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నారని తెలుస్తోంది.  మధురవాణి  క్యారెక్టర్‌లో  అనసూయ కనిపించనుంది అనే టాక్ ఎప్పుడో వచ్చేసింది. ఐతే దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు.  

వాళ్ళ శోభనం గదిలో ప్రేమికురాలి గురించి చెప్పిన కవిగారు.. ఇక రచ్చ రంబోల!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 306  లో..  హాస్పిటల్ బెడ్ పై ఉన్న అప్పు.. బిల్ బావ కట్టాడా అని కనకాన్ని అడుగుతుంది. లక్ష ఇరవై రెండు వేలు బిల్ అయింది. ఎక్కడ తేవాలా అని ఆలోచిస్తుంటే మాతో ఏం చెప్పకుండా మేనేజర్ ను పంపించి బిల్ మొత్తం కట్టేశాడని రాజ్ గురించి అప్పు, కృష్ణమూర్తిలతో కనకం చెప్తుంది. వెంటనే ఫోన్ చేసి థాంక్స్ చెప్పమని కనకంతో కృష్ణమూర్తి చెప్తాడు. అప్పుడే రాజ్ కి కనకం ఫోన్ చేస్తుంది. రాజ్ కి కనకం ఫోన్ చేయగానే.. అప్పుకి ఎలా ఉంది ఆంటీ అని రాజ్ అడుగుతాడు. ఒక దేవుడు రక్తం ధానం చేశాడు. ఇంకో దేవుడు డబ్బు ధానం చేసి కష్టం తీర్చాడు. ఏమిచ్చి మీ ఋణం తీసుకోమంటావు బాబు అని కనకం అంటుంది.  అప్పు క్షేమంగా ఉంది కదా అది చాలు.. మీరు నన్ను దేవుడిని చేయొద్దు. నా చేతుల్లో ఉన్నదే చేసాను. మీరున్న పరిస్థితులలో అంత డబ్బు కట్టలేరని మేనేజర్ ను పంపించి కట్టేశాను. ఇకమీదట మీకే అవసరమొచ్చిన నాకే కాల్ చేయండి. మీ కూతురు మళ్ళీ ఆత్మగౌరవమని నాకు చెప్పదని రాజ్ అంటాడు. ఇక అవన్నీ రాజ్ వెనకాలే ఉన్న కావ్య వింటుంది. బిల్ మీరు కట్టేశారా అని కావ్య ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇక రాజ్ చిరాకు పడతాడు. ఈయనేంత ఇంత ప్రేమగా, ఆప్యాయంగా ఉంటాడు. మాకు సపోర్ట్ గా ఉంటాడు. మరి ఆ అమ్మాయి విషయంలో అలా ఉన్నాడేంటి, నేనే అనుమానిస్తున్నానా అని కావ్య అనుకుంటుంది.‌ మరోవైపు అప్పు హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంది. తనని ఆ సిచువేషన్ లో చూసి అన్నపూర్ణమ్మ ఎమోషనల్ అవుతుంది. ‌ఇక అప్పుడే అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. ఇక అన్నపూర్ణమ్మ ఫోన్ తీసుకొని.. అప్పుని ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ కోపంగా  మాట్లాడుతుంది. అదేస సమయంలో కనకం ఫోన్ తీసుకొని కవర్ చేస్తుంది. ఇక రాజ్ కావ్య కలిసి సరదాగా మాట్లాటుకుంటారు. కళ్యాణ్ అనామికల శోభనం కోసం పూలు ఆర్డర్ చేస్తుంది. ఇక అదంతా ధాన్యలక్ష్మి విని.. వాళ్ళ శోభనం గది నువ్వు డెకరేట్ చేయొద్దని అనేసరికి కావ్య భాదపడుతుంది. ఇక అదేసమయంలో కళ్యాణ్ రెండు  రకాల జ్యువలరీ నెక్లెస్ లు తీసుకొని కావ్య దగ్గరికి వస్తాడు. ఈ రెండింటిలో ఏది బాగుందో చెప్పండి వదిన.. అనామికకి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా అని కావ్యతో చెప్తాడు. ఇక దూరం నుండి కావ్యని ధాన్యలక్ష్మిని గమనిస్తుంది. నా అభిప్రాయమెందుకు మీ అమ్మని అడగమని కావ్య అంటుంది‌.‌ మా అమ్మకు వీటిగురించి తెలియదని కళ్యాణ్ అనగానే.. ధాన్యలక్ష్మి వచ్చి కావ్య సెలెక్ట్ చేసిన నెక్లెస్ కాకుండా వేరేది సెలెక్ట్ చేసి అదే బాగుందని చెప్తుంది. నాకు వదిన సెలెక్ట్ చేసిందే నచ్చిందని, నువ్వు సెలెక్ట్ చేసింది నువ్వే తీసుకోమని చెప్పి‌ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇక రుద్రాణానిని పాయసం తీసుకురమ్మని స్వప్న ఆర్డర్ చేస్తుంది.  తరువాయి భాగంలో అనామిక-కళ్యాణ్ శోభనం రోజున వారి మధ్య గొడవ జరుగుతుంది. మన మధ్య కావ్య, అప్పులను తీసుకురావొద్దని చెప్పాను కదా అని అనామిక అంటుంది. హాల్లోని సోఫాలో అనామిక పడుకోవడం చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు. మా‌ఇద్దరి మధ్యలోకి కావ్య, అప్పులని తీసుకొస్తున్నాడని కళ్యాణ్ గురించి అనామిక చెప్తుంది.  ఇక ధాన్యలక్ష్మి కావ్యని తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu:అటు స్టూడెంట్స్ ఇటు ఫ్యాకల్టీ చేస్తోన్న ధర్నాలో ఏం జరగనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -973  లో...  రిషి కోసం చక్రపాణి ఇంట్లోకి వస్తాడు శైలేంద్ర. ఎందుకొచ్చావని శైలేంద్రని చూసి వసుధార తిడుతుంది. రిషి కోసం శైలేంద్ర వెతుకుతుంటాడు. వసుధార అడ్డుపడిన శైలేంద్ర వినకుండా వెతుకుతుంటాడు. అయిన రిషి ఎక్కడ కన్పించడు. దాంతో శైలేంద్ర కోపంగా తిరిగి వెళ్ళిపోతు.. ఆ రిషిని బ్రతకనివ్వనని వసుధారతో శైలేంద్ర అంటాడు. మరొకవైపు వసుధారకి మహేంద్ర ఫోన్ చేస్తుంటాడు. శైలేంద్ర ఉన్నంతసేపు లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత మహేంద్ర ఫోన్ చేసి.. వసుధారతో మాట్లాడతాడు. ధరణి కాల్ చేసిన విషయం మహేంద్ర చెప్తాడు. రిషి కోసం ఆ శైలేంద్ర ఇక్కడికి కూడా వచ్చాడని మహేంద్రకి వసుధార చెప్తుంది. కానీ రిషి సర్ ని సీక్రెట్ ప్లేస్ లో దాచి ఉంచానని వసుధార చెప్తుంది. ఎక్కడ ఉన్నాడని మహేంద్ర అడుగగా.. కలిసినప్పుడు చెప్తానని వసుధార చెప్తుంది. రిషిని మాత్రం జాగ్రత్తగా చూసుకోమని మహేంద్ర ఎమోషనల్ అవుతుంటాడు. మరుసటి రోజు ఉదయం రిషిని  కాపాడిన ముసలివాళ్ళ దగ్గర రిషి ఉంటాడు. వాళ్ళు వైద్యం చేస్తూ ఉంటే వసుధార, చక్రపాణి ఇద్దరు బయట ఉంటారు. ఇక్కడ అయితే రిషి సర్ సేఫ్ గా ఉంటారు. ఇక్కడికి ఆల్రెడీ శైలేంద్ర వచ్చాడు కదా మళ్ళీ ఇక్కడికి రాడు. ఇక్కడ ఉన్నట్లు అసలు డౌట్ కూడా రాదు కానీ మీ దగ్గర కాకుండా రిషి సర్ ని ఇక్కడ ఉంచినందుకు బాధగా ఉందని వసుధార అంటుంది. మరొకవైపు  శైలేంద్ర ఎండీ చైర్ ని చూస్తూ మురిసిపోతు ఉంటాడు. ఇక తన ప్లాన్ లో భాగంగా శైలేంద్ర ఒక స్టూడెంట్ ని పిలిచి.. నీకు డబ్బులు ఇస్తాను నేను చెప్పింది చెయ్యాలని అంటాడు. రిషి సర్ చనిపోయాడు. అందుకే వసుధార మేడమ్ రావడం లేదు. నువ్వు ఈ విషయం అందరికి చెప్పాలంటూ శైలేంద్ర చెప్తాడు. దాంతో స్టూడెంట్ వెళ్లి అందరికి చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్ర ఆ విషయం సోషల్ మీడియాలో కూడ పోస్ట్ చేయడంతో.. కాలేజీలో అందరు అది చూసి మహేంద్రని అడగడానికి వస్తారు. ఏమైందంటు మహేంద్ర అడుగుతాడు. మాకు రిషి సర్ కావాలి సర్. ఎక్కడ ఉన్నాడంటు అడుగుతారు. మాకు సిలబస్ కావడం లేదంటూ స్టూడెంట్స్ ఓవైపు.. మాకు జీతాలు రావడం లేదంటూ ఫాకల్టీ మరోవైపు అందరు కలిసి మహేంద్రకి చెప్తారు. వసుధార మేడమ్ ఎందుకు రావడం లేదని స్టూడెంట్స్, ఫాకల్టీ అడుగుతారు. మేడమ్ వస్తుంది అని మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Krishna Mukunda Murari:వాళ్ళ శోభనానికి ముందు టీజర్ కావాలంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -367 లో.. సంక్రాతి పండుగ సందర్భంగా ఇంట్లో అందరు కలిసి అరిటాకులో భోజనం చేస్తుంటారు. అందరికి భవాని భోజనం వడ్డీస్తు ఉంటుంది. ఆ తర్వాత భవాని కూర్చొని భోజనం చేస్తే కృష్ణ వడ్డీస్తుంది. వంటలన్ని బాగున్నాయంటూ మధు, గౌతమ్ కలిసి కృష్ణని పొగుడుతుంటారు. వంటలు చేసింది నేను కాదు ముకుంద అని కృష్ణ చెప్తుంది. దాంతో ముకుంద నీకు ఈ టాలెంట్ కూడా ఉందా అని మధు అంటాడు. కాసేపటికి మధు, గౌతమ్ ఇద్దరు మాట్లాడుతూ.. ఎవరికి ఎంత బలం ఉందోనంటు ఇద్దరు చేతులు పట్టుకొని గేమ్ ఆడుతారు. అప్పుడే భవాని రావడంతో బయపడి గేమ్ ఆపేస్తారు. ఇక భవాని అందరికి బట్టలు తీసుకొని వస్తుంది. అందరికి బట్టలిచ్చిన భవాని.. ముకుందకి ఇవ్వదు. ముకుంద బాధపడుతుందేమోనని ఇవ్వండి అత్తయ్య అని కృష్ణ అంటుంది. కాసేపటికి నేను ఇస్తానంటు మిగిలిన ఒక కవర్ ని కృష్ణ ముకుందకి ఇస్తుంది. ఆ తర్వాత మురారి కృష్ణ గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే కృష్ణ మురారీకీ కాఫీ తీసుకొని వస్తుంది.. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మధు రెడీ అవుతు తనని తాను అద్దంలో చూస్తూ పొగుడుకుంటాడు. పక్కరూమ్ లో నందు అందంగా రెడీ అవుతుంది. దాంతో గౌతమ్ వచ్చి చాలా బాగున్నావంటు పొగుడుతాడు. ఆ తర్వాత మురారి పంచె కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే కృష్ణ వస్తుంది. ఈ పంచే ఎవరు కనిపెట్టారో కానీ అంటు మురారి చిరాకు పడుతుంటాడు. పంచె అంటే తెలుగు సంసృతి అంటూ కృష్ణ గొప్పగా చెప్తుంది. కాసేపటికి మురారికి‌ కృష్ణే పంచె కడుతుంది. ఆ తర్వాత అందరు పూజకి రెడీ అయి కిందకి వస్తారు. అలా వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత సుమలత పూజకి కావాల్సిన పండ్లు తీసుకొని వస్తుంటే కింద పడిపోబోతు.. ఫ్రూట్స్ కిందపడేస్తుంది. చూసుకోవాలి కాదా అంటూ భవాని కోప్పడతుంది. ఆ తర్వాత కృష్ణ మురారి కలిసి పూజ చేస్తారు. తరువాయి భాగంలో సినిమాకి ముందు టీజర్ విడుదల చేసినట్లుగా ఫస్ట్ నైట్ కి ముందు టీజర్ విడుదల చేద్దామా అని మురారి అంటుంటే.. కృష్ణ సిగ్గు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మా పెళ్లి ఆ దేవుడి చేతుల్లో ఉంది.. బ్రహ్మానందం బయోపిక్ లో చేస్తా

బుల్లితెర మీద జబర్దస్త్ అంటే ముందుగా గుర్తొచ్చే కమెడియన్స్ గెటప్ శీను, రాంప్రసాద్, సుడిగాలి సుధీర్. జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళు చేసే కామెడీకి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. అలాగే ఆన్ స్క్రీన్ మీద సుధీర్ - రష్మీ పెయిర్ సృష్టించిన ప్రేమ మాయ కూడా అలాగే ఉంది. వాళ్ళు షోస్ నుంచి విడిపోయి వేరేవేరే షోస్ కి వెళ్ళిపోయినా కూడా వీళ్ళ పెయిర్ పేరు లేకుండా ఒక్క స్కిట్ కూడా పూర్తవదు.  ఐతే ఇప్పుడు గెటప్ శీను హనుమాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో సుధీర్ లగ్గం గురించిన అసలు నిజాన్ని బయట పెట్టించాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా శీను సుధీర్ కి ఫోన్ చేసాడు. "అరేయ్..నీ లగ్గం ఎప్పుడురా.. ? అనేసరికి నువ్వు ఇంటర్వ్యూలో ఉన్నావా.. అందుకే కదా ఇలా అడుగుతున్నావు.. మాములుగా బయట ఉన్నప్పుడు ఇలాంటివి అసలు అడగవు కదా. నీ పెళ్ళెప్పుడు అని నన్ను నువ్వెప్పుడైనా అడిగావా అసలు.. ఐనా ఇప్పుడు నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నా...ఇక పెళ్లంటావా మన చేతుల్లో ఏముంది... ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. అలాగే రష్మీ గారినే పెళ్లి చేసుకుంటావా అని అడిగేసరికి అది కూడా మన చేతుల్లో ఉండదు..అన్ని ఆ దేవుడు రాసినట్టే జరుగుతుంది..అని చెప్పాడు సుధీర్. స్క్రీన్ మీద గుడ్ పెయిర్ కానీ..ఆఫ్ స్క్రీన్ మేము మాట్లాడము అని చెప్పాడు గెటప్ శీను.  "ఒకవేళ బయోపిక్ లో ఏదైనా రోల్ చేయాల్సి వస్తే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చేస్తాను.. ఎందుకంటే మేమంతా కామెడీకి సంబంధించిన క్యాటగిరీలో ఉన్నాం కదా. చిరంజీవి బయోపిక్ వస్తే ఆయనలా నటించడానికి రామ్ చరణ్ ఉన్నారు కదా.. నాకు గెటప్ శీను అనే బిరుదు మల్లెమాల వాళ్ళు ఇచ్చింది కాదు ఆడియన్స్ నుంచి వచ్చింది.." అని చెప్పాడు శీను.

Krishna Mukunda Murari : ఆటపాటలతో ఆ ఫ్యామిలీ.. ముకుంద అంతరార్థం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -366 లో.. అందరు రెడీ అయి భోగి మంటల దగ్గరికి వస్తారు. శకుంతల సంతోషంగా భోగి మంటల కోసం ఏర్పాట్లు చేస్తుంది.. అప్పుడే భవాని కూడా వస్తుంది. అందరు సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ముకుంద ఒక్కతే ఇంట్లో ఉండి చూస్తు ఉంటుంది. ముకుందని చూసిన కృష్ణ.. అత్తయ్య ముకుంద ఒక్కతే ఇంట్లో ఉంది. పాపం ఫీల్ అవుతుంది. నేను వెళ్లి తీసుకొని వస్తానంటూ కృష్ణ వెళ్తుంది. ఆ తర్వాత ముకుందని  కృష్ణ రమ్మని పిలుస్తుంది. నేను రాను అక్కడ నీకు ఒకదానికే నేను ఇష్టం.. ఎవరికి నేను ఇష్టం లేనని ముకుంద అంటుంది. అలా ఎం లేదని కృష్ణ చెప్పి ముకుందని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత అందరు సరదాగా డాన్స్ చేస్తుంటారు. కృష్ణ, మురారి మాత్రం మాస్టారు మాస్టారు అంటూ రొమాంటిక్ గా డాన్స్ చేస్తుంటారు. ఆ తర్వాత నందు, గౌతమ్ లు చెయ్యగా.. కాసేపటికి షకుంతల కూడా డాన్స్ చేస్తుంటుంది. తను డ్యాన్స్ చేస్తుండటం చూసి అందరు ఆశ్చర్యంగా చూస్తుంటారు. చివరగా అందరు కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం కృష్ణ లేచి ముగ్గు వేస్తుంటే తన దగ్గరికి మురారి వచ్చి... కృష్ణని పొగుడుతూ ఉంటాడు. చాలా అందంగా ఉన్నావంటూ కృష్ణని పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత రేవతి పెద్దమ్మ నువ్వు ఈ రోజు చాలా అందంగా ఉన్నావ్. ఈ చీరతోనే వచ్చిన అందం కాదు.. నీ కొడుకు కోడలు కలిసిపోయారు దానివల్ల వచ్చిన అందమేమోనని మధు అంటాడు. ఆ తర్వాత నువ్వు మా అమ్మవి అని రేవతిని కృష్ణ హగ్ చేసుకుంటుంది. అందరు రెడీ అయి వచ్చి సరదాగా మాట్లాడుకుంటు ఉంటారు. సరదాగా ఈరోజు అరిటాకులో కింద కూర్చొని భోజనం చేద్దామని భవాని అంటుంది. ఆ తర్వాత భవాని అందరికి భోజనం వడ్డీస్తుంది. మురారి, మధు ఇద్దరు సెటైర్ లు వేస్తుంటే.. నువ్వు వడ్డించు అంటు కృష్ణకి భవాని ఇస్తుంది. తరువాయి భాగంలో కృష్ణ, మురారి ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. కృష్ణ హారతి ఇస్తు ముకుందకి పట్టుకోమని ఇస్తుంది. అప్పుడే దీపం ఆరిపోతుంది. అందరు షాక్ అవుతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అసలు మా ఆయన అలా చేయరు.. కానీ గ్రేట్ టైంని ఎంజాయ్ చేసాం!

టాలీవుడ్‌ 90 స్ లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఇంద్రజ.. ఆమె  గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగిన ఇంద్రజ 80 కి పైగా సినిమాల్లో నటించింది. ఇంద్రజ ఓ సింగర్ కూడా. ‘చిన్ని చిన్ని ఆశ’ ‘ సొగసు చూడతరమా’ ‘యమలీల’ ‘పెద్దన్నయ్య’ ‘ఒక చిన్నమాట’ వంటి సినిమాల్లో ఈమె నటించి మంచి పేరు సంపాదించుకుంది. వివాదాలు అంటని స్టార్ గా పేరు తెచ్చుకుంది. అలాంటి ఇంద్రజ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ కి జడ్జ్ గా చేస్తోంది. అలాగే కొన్ని ఈవెంట్స్ లో కూడా అప్పుడప్పుడు జడ్జ్ గా కనిపిస్తోంది. ఇక ఇంద్రజ తన పేమెంట్స్ లో కొంత అమౌంట్ ని బుల్లితెర షోస్ లో ఉండే వాళ్ళ కోసమే ఎక్కువగా ఖర్చుపెడుతూ వాళ్ళ బాగోగులు చూసుకుంటుంది అని చెప్తూ ఉంటారు.  ఇక ఈమె రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో తన భర్త, తన కూతురు కూడా కనిపించారు. సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు వీరు. హాలిడే మోడ్ ఆన్ అయ్యింది అంటూ  తన వాయిస్ తో ఒక వీడియోని కూడా స్టేటస్ లో పోస్ట్ చేశారు.  "అర్ధరాత్రి 12 గంటలు దాటేసింది. అసలు మా ఆయన ఇలా ఎప్పుడూ అలౌ చేయరు.. ఏమో మరి.. అలాంటి ఆయన ఈరోజు బయటకు తీసుకొచ్చారు. ఇంకా మేము బయటే ఉన్నాము. ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ అని కొత్తగా స్టార్ట్ చేసారు. చెన్నైలోని కతిపర బ్రిడ్జి దగ్గర. సడెన్ సర్ప్రైజ్ గా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక ఇక్కడ ఫుల్ ఫన్ అన్నమాట. మేం ముగ్గురం మంచి క్వాలిటీ టైంని ఎంజాయ్ చేసాం." అంటూ ఫుల్ జోష్ తో చెప్పారు ఇంద్రజ.  ఇంద్రజని జబర్దస్త్ కమెడియన్స్ అంతా కూడా ఆమె చాలా డౌన్ టు ఎర్త్ అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆమె వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడి పెద్దలకు తనకు తోచిన సాయం చేస్తూ ఉంటుంది. అందుకే బుల్లితెర మీద ఇంద్రజాని అందరూ ముద్దుగా ఇంద్రజమ్మా అని పిలుచుకుంటారు.

Guppedantha Manasu : ఆ గదిలో చూసి‌ షాకైన శైలేంద్ర.. సూపర్ ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -972 లో... మహేంద్ర దగ్గరికి భద్ర వచ్చి నేను జాబ్ మానేస్తాను.. నాకేం వర్క్ చెప్పడం లేదు మేడమ్ కి సెక్యూరిటి అన్నారు, మేడమ్ కూడ ఇక్కడ లేరని భద్ర అంటాడు. మేడమ్ ని రమ్మని చెప్పండి అని భద్ర అనగానే.. సరే నేను వసుధారతో మాట్లాడి చెప్తాను. నువ్వు ఏం పని చెప్పడం లేదు అంటున్నావ్ కదా బండిలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించమని భద్రని మహేంద్ర పంపిస్తాడు. మరొకవైపు రిషి ఎక్కడ ఉన్నాడని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. ఆ వసుధార రిషిని వాళ్ళ ఇంట్లోనే ఉంచి నా మనుషులకు కనిపించకుండా దాచి ఉంచిందేమోనని శైలేంద్ర అనుకుంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ధరణిని చూసి.. నాకు ఇలాంటి టైమ్ లో ధరణినే ఉపయోగపడుతుందని భావిస్తాడు. కావాలనే ధరణికి వినపడేలా రిషి దొరికాడా? వాన్ని వదలొద్దు అంటూ ఫోన్ మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తాడు. దాంతో ధరణి నిజంగానే శైలేంద్రకి రిషి ఎక్కడ ఉన్నాడో తెలిసింది అనుకొని రిషిని కాపాడుకోవాలని అనుకుంటుంది. మరొకవైపు అనుపమ, మహేంద్ర ఇద్దరు కలిసి భద్ర గురించి మాట్లాడుకుంటారు. నాకు ఎందుకో భద్ర శైలేంద్ర మనిషే అని ప్లాన్ ప్రకారం మన దగ్గరికి వచ్చినట్టు తెలుస్తుందని అనుపమ అనగానే.. నాకు డౌట్ గానే ఉంది.. వసుధార దగ్గరికి ఎందుకు వెళ్ళాడని ఇంకా అర్ధం కావడం లేదని మహేంద్ర అంటాడు. వాడిని జాబ్ లోనే  ఉంచితే వాడి ప్రతి మూమెంట్ అబ్సర్వ్ చెయ్యొచ్చని అనుపమ అంటుంది. అప్పుడే భద్ర వచ్చి డబ్బులు ఇవ్వలేదని అనగానే మహేంద్ర డబ్బులు ఇస్తాడు. మరొకవైపు వసుధారకి‌ ధరణి ఫోన్ చేసి రిషి ఎక్కడ ఉన్నాడు? మా అయనకి దొరికాడంట.. ఇప్పుడే ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నానని ధరణి అనగానే.. వసుధారకి మాత్రం శైలెంద్ర ఇదేదో ప్లాన్ చేసినట్లే ఉన్నాడని అర్థం అవుతుంది. అప్పుడే ధరణి ఫోన్ శైలేంద్ర లాక్కొని వసుధార మాటలు వింటాడు. నువ్వు రిషి సర్ గురించి టెన్షన్ పడకు నేను ఉన్నంత వరకు రిషి సర్ ని ఎవరేం చెయ్యలేరని వసుధార అంటుంది. వెంటనే ధరణి శైలెంద్ర దగ్గర ఉన్న తన ఫోన్ లాక్కొని కట్ చేస్తుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసాక ధరణిని శైలేంద్ర తిడుతాడు. రిషి వచ్చాక మీ సంగతి చెప్తాడని ధరణి అంటుంది. కాసేపటికి వసుధార వాళ్ళు ఉన్న ఇంట్లో రిషి ఉన్నాడేమో చూడడానికి శైలేంద్ర గోడ దూకి వెళ్తాడు. అప్పుడే వసుధార చూసి శైలేంద్రని తిడుతుంది. మరొకవైపు మహేంద్రకి ధరణి ఫోన్ చేసి జరిగింది చెప్తుంది. అదే సమయంలో రిషి కోసం శైలేంద్ర లోపలికి వెళ్తుంటే వసుధార అడ్డుపడుతుంది. అయిన శైలేంద్ర వినడు. వసుధారకి‌ మహేంద్ర ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యదు. శైలేంద్ర గది లోపల చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అన్నా నీదెంత మంచి మనసో.. ఆ దేవుడు మీకు మంచే చేస్తాడు

అద్భుతమైన స్టెప్స్ తో, డాన్స్ మూవ్మెంట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆట సందీప్. బిగ్‌ బాస్‌ సీజన్ 7 లో  కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.  హౌస్ లో తన డాన్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేసాడు.  గేమ్స్‌, టాస్కులు బాగా ఆడాడు. అయినప్పటికీ కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. సందీప్‌ మాస్టర్  "లవ్‌ యూ టూ" అనే మూవీలో హీరోగా నటించాడు.  తాజాగా "ది షార్ట్‌ కట్‌" పేరుతో ఒక మూవీ చేశాడు. విజయానికి అడ్డ దారులుండవు అనేది ఆ మూవీ క్యాప్షన్.  ఇక సందీప్ తన సంక్రాంతిని స్పెషల్ గా చేసుకున్నాడు. సర్వ్ నీడి అనే సంస్థతో కలిసి కొంతమందికి ఫుడ్ డొనేట్ చేసాడు. డొనేట్ చేయడం మాత్రమే కాదు దగ్గర ఉండి చూసుకున్నాడు.  "ఇలాంటి మంచి పనులు చేస్తూ మీరు మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను అన్న.. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం నేను చాలా చూశాను కోవిడ్ టైంలో మీరు చాలామందికి ఆకలి తీర్చారు... ధైర్యాన్ని ఇచ్చారు, బలంగా నిలబడ్డారు.. మీరు ఇలాంటివి మరిన్ని చేయాలని దానికి ఆ దేవుడు మీకు పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాను...బిగ్ బాస్ లో చూసి నువ్వు చాలా బాడ్ బాయ్ అనుకున్నా కానీ...రియల్ లైఫ్ లో నువ్వు వెరీనైస్...మీరు ఇలాంటి మంచి పనులు చేయాలి.. ఆ దేవుడు మీకు అంతా మంచే చేస్తాడు." అంటూ నెటిజన్స్ సందీప్ చేసిన మంచి పనికి హ్యాపీగా ఫీలవుతున్నారు. సందీప్ వైఫ్ జ్యోతి రీసెంట్ గా కొంతమంది పేదలకి దుప్పట్లు కూడా పంపిణీ చేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక సందీప్ తన కో-కంటెస్టెంట్స్ అందరినీ కలిసాడు.

Brahmamudi: అతని దగ్గర మాట తీసుకున్న అనామిక.. కావ్య ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -305 లో.. కళ్యాణ్ పూజ మధ్యలో వదిలేసి వచ్చి మరీ అప్పుకి బ్లడ్ ఇచ్చి సేవ్ చేస్తాడు. దాంతో కనకం కృష్ణమూర్తి ఇద్దరు తనకి థాంక్స్ చెప్తారు. నా ఫ్రెండ్ ని కాపాడుకోవడం నా బాధ్యత అని కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత కావ్య, కళ్యాణ్ ఇద్దరు ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఇంటికి వెళ్లడంతో  ధాన్యలక్ష్మి, అనామిక ఇద్దరు కావ్య వంక కోపంగా చూస్తుంటారు. కావ్య లోపలికి రావడంతో ఇందిరాదేవి అప్పు గురించి అడిగి తెలుసుకుంటుంది. కళ్యాణ్ వచ్చి సేవ్ చేసాడని కావ్య చెప్తుంది. కోపంగా ఉన్న అనామిక దగ్గరికి కావ్య వచ్చి.. తన వల్ల పూజ ఆగిపోయిందని సారీ చెప్తుంది.. దాంతో ధాన్యలక్ష్మి మధ్యలో కలుగుజేసుకొని కావ్య కావాలనే ఇదంతా చేసింది అన్నట్లుగా మాట్లాడుతుంది. కానీ అనామిక అందరి ముందు కళ్యాణ్ మంచి పని చేసాడంటూ మెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఈ గొడవ అంతా మర్చిపోయి రాత్రికి జరగబోయే శోభనానికి ఏర్పాటు చెయ్యండని ఇందిరాదేవి చెప్తుంది.  కనకానికి స్వప్న ఫోన్ చేసి.. మీరు కావ్యని పిలవడం వల్ల అందరు కావ్య వల్లే పూజ ఆగిపోయిందంటు తిడుతున్నారు. బాగా అవసరం అయితేనే కావ్యకి ఫోన్ చెయ్యండని కనకానికి స్వప్న చెప్తుంది. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగానే జరిగిందని కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధపడుతారు. ఆ తర్వాత డాక్టర్ వాళ్లని పిలిచి అప్పుకి ఇప్పుడు పర్వాలేదు. బిల్ కట్టి తీసుకొని వెళ్ళండని చెప్తుంది. మరొకవైపు అనామిక గదిలోకి వచ్చి కళ్యాణ్ పై కోపంగా ఉంటుంది. దాంతో కళ్యాణ్ వచ్చి సారీ చెప్తాడు. ఇంకెప్పుడు అయినా సరే నువ్వు నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి.. అలా అని మాట ఇవ్వమని అనామిక మాట తీసుకుంటుంది. దాంతో చేసేదేమీ లేక కళ్యాణ్ కూడా మాట ఇస్తాడు. మరొకవైపు హాస్పిటల్ బిల్ చూసి కనకం, కృష్ణమూర్తి షాక్ అవుతారు. ఇంత డబ్బు ఎక్కడ నుండి తీసుకొని వస్తామని బాధపడుతారు. మరొకవైపు కావ్య రావడంతోనే రాజ్ మళ్ళీ చేస్తానంటూ ఫోన్ కట్ చెయ్యగానే కావ్య వచ్చి రాజ్ తో గొడవ పెట్టుకుంటుంది. మరొకవైపు కనకం, కృష్ణమూర్తి  ఇద్దరు అప్పు దగ్గరికి వెళ్లి.. కళ్యాణ్ బ్లడ్ ఇచ్చిన విషయం చెప్తాడు. మన బాధలు మనం పడుదాం కానీ వాళ్ళకి చెప్పొద్దని అప్పు అంటుంది. ఆ తర్వాత రాజ్ బిల్ పే చేసాడు. మీరు వెళ్ళండని నర్సు వచ్చి చెప్పడంతో కనకం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో నా కొడుకు, కోడలు శోభనానికి సంబంధించిన ఏర్పాట్లు నువ్వు చెయ్యనని నాకు మాటివ్వని కావ్యతో ధాన్యలక్ష్మి మాట తీసుకుంటుంది. మరొకవైపు ఏంటి అన్ని పనులు చేసేదానికి శోభనానికి సంబంధించిన ఏర్పాటు చెయ్యడం లేదని కావ్యని రాజ్ అడుగుతాడు. అప్పుడే వచ్చిన అనామిక విని ఈ కావ్యకి నాపై ఎప్పుడు కోపం పోతుందో అని రాజ్ తో అంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అర్థరాత్రి పబ్బుల్లో చిందులేసిన బిగ్ బాస్ జోడి!

సిటీ కల్చర్ లో భాగంగా రాత్రి వేళల్లో సెలబ్రిటీలు పబ్ , రేవ్ పార్టీ,  ధావత్ అంటు తెగ తిరిగేస్తుంటారు. బిగ్ బాస్ ఓటిటి నాన్ స్టాప్ సీజన్ లో చైతు, అరియాన, తేజస్విని, ఆర్జే కాజల్ కంటెస్టెంట్స్ గా ఉన్న విషయం తెలిసిందే. వీళ్ళ ముగ్గురు కలిసి నానా సందడి చేశారు. ఇక ఆ బాండింగ్ వీరిమధ్య అప్పటి నుండి అలానే ఉంది.  బిగ్ బాస్ హౌస్ లో ఎవరెలా ఉంటారో? ఏ టాస్క్ లో ఎవరెలా మారిపోతారో తెలియదు. అప్పటిదాకా ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్ళు టాస్క్ ని సీరియస్ గా తీసుకొని దూరమైన రోజులు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆర్జే చైతుని తేజస్విని నామినేట్ చేసి ఓ చెత్త రీజన్ చెప్తుంది‌. దానికి చైతు ఫీల్ అయిపోయాడు. ఆ తర్వాత వారిమధ్య దూరం పెరిగింది. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ  చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. దాంతో అరియానా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు.అరియానా అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వళ్ళ అరియనాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని  అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియానా చాలా బాధపడింది. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత RGV తో కలిసి జిమ్ లో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఆ తర్వాత అరియానా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. ఇలా అరియనా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. బిగ్ బాస్-5 బజ్ కి  ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా అరియానా పాపులర్ అయింది. ఇంటర్వ్యూలో అరియానా కంటెస్టెంట్ తో సూటిగా మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకుంది.   ఇక ఈ మధ్య  ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అమర్ దీప్ కి సపోర్ట్ చేసిన అరియానాకి తెగ ట్రోల్స్ వచ్చాయి. ఎప్పుడు బోల్డ్ అండ్ హాట్ ఫోటోస్ తో కుర్రాళ్ళ మతిపోగోట్టే ఈ భామ.. ఇప్పుడు ఆర్జే చైతుతో కలిసి నైట్ పబ్ లో డ్యాన్స్ చేసింది. అదీ మాములు పాట కాదు. ఐటమ్ సాంగ్.. రెడ్ డ్రెస్ లో హాట్ స్టెప్పులతో ఇరగదీసింది. ఇక ఇది తనకు మర్చిపోలేని రోజు అంటు తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది ఈ భామ.