భార్య డెలివరీ ముందు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 2.0 లో గ్రాంఢ్ ఎంట్రీ ఇచ్చాడు అంబటి అర్జున్. బిగ్ బాస్ ముందు వరకు 'దేవత' సీరియల్ లో హీరోగా ఒక్క ఆ సీరియల్ అభిమానులకే పరిచయ అయిన అర్జున్ బిగ్ బాస్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు‌ సుపరిచితుడయ్యాడు.  బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరు దుమ్ము, ఎవరు దమ్మో చెప్పమని నాగార్జున అడిగినప్పుడు.. శివాజీ దమ్ము, అమర్ దీప్ దుమ్ము అని చెప్పాడు. హౌస్ లోకి వెళ్ళగానే మొదటి నామినేషన్ లో తన ఫ్రెండ్  అమర్ దీప్ నామినేషన్ చేసి హౌస్ లోని వారందరికి షాకిచ్చాడు. ఆ తర్వాత తోటి హౌస్ మేట్స్ తో అంతంత మాత్రం కలిసి ఉంటూ ఎవరితో పెద్దగా బాండింగ్ పెంచుకోలేదు అర్జున్. హౌస్ లో వారమంతా ఎవరెలా ఉన్నారు.. రూల్స్ ఫాలో అయ్యారా లేదా.. టాస్క్ లలో ఎవరైన ఫౌల్స్ చేశారా.. అన్నీ జాగ్రత్తగా పరిశీలించి నామినేషన్ లో.. ఆ ఫౌల్ చేసిన వారిని నామినేట్ చేసి మీరు ఆ టాస్క్ లో ఆ ఫౌల్ చేశారంటు చెప్తాడు. దాంతో ఎవరైన సరే అతనితో మాట్లాడటానికి కాస్త ఇబ్బందిపడేవారు. ఇక పల్లవి ప్రశాంత్ పై అరవడం అతనికి కాస్త మైనస్ అయింది. అర్జున్ వాళ్ళ భార్య పప్పీ ఫ్యామిలీ వీక్ లో వచ్చినప్పుడు మోస్ట్ ఎమోషనల్ అయ్యాడు. ఇక వాళ్ళ భార్య శివాజీకి ఓ మాట చెప్పిందంట.. అర్జున్ ని కెప్టెన్ గా చూడాలని ఉంది అని  శివాజీకి పప్పీ  చెప్పిందంట. అదే విషయాన్ని శివాజీ కెప్టెన్సీ టాస్క్ లో చెప్పాడు. అర్జున్ కోసం స్టాండ్ తీసుకున్న శివాజీ.. అమర్ దీప్ కి విలన్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వారం నామినేషన్ లో ఇదే పాయింట్ మీద శివాజీని నామినేట్ చేశాడు అర్జున్. దాంతో అప్పటిదాకా మంచి అభిప్రాయం ఉన్న శివాజీకి ఒక్కసారిగా అతను గేమ్ ఆడుతున్నాడని అర్థం చేస్కొని అర్జున్ తో దూరంగా ఉన్నాడు. ఇక టికెట్ టూ ఫినాలే లో పన్నెండు టాస్క్ లు పెడితే దాదాపు అన్నింట్లో విజయం సాధించాడు. అయితే అతను ఎవరి సపోర్ట్ తీసుకోకపోవడం కొన్ని టాస్క్ లలో మైనస్ అయింది. తాజాగా అంబటి అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో కొన్ని ఫోటోలని షేర్ చేశాడు. బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే రోజు వాళ్ళ భార్య పప్పీని స్టేజ్ మీదకి నాగార్జున రమ్మని చెప్పడం.. అతనితో కలిసి ఫోటోలు దిగడం తనకెంతో ఆనందంగా ఉందని అర్జున్ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చాడు. " వెడ్డింగ్ డైరీస్ " అనే ఓ‌ లఘుచిత్రాన్ని చేస్తున్నట్టు.. అందులోని ' పెళ్ళైతే ఇంతేనా' అనే లిరికల్ వీడియో రీలీజ్ అయినట్టు మరో పోస్ట్ ని షేర్ చేశాడు అర్జున్. అయితే తన భార్యతో పెద్దగా ఫోటోలేం లేవని చాలాసార్లు బాధపడ్డ అర్జున్.. నాగార్జున గారు స్వయంగా స్టేజ్ మీదకి తనకు ఓ మర్చిపోలేని జ్ఞాపకమంటు చెప్పుకొచ్చాడు. కాగా భార్య డెలివరీ ముందు ఎమోషనల్ పోస్ట్ చేశాడంటూ నెట్టింట ఈ వార్త వైరల్ గా మారింది.  

మానవత్వాన్ని చాటుకున్న నూకరాజు ఆసియా!

సినిమాలపై ఉన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన ఓ మధ్యతరగతి అబ్బాయి నూకరాజు. తన కామెడీ టైమింగ్ తో అతి త్వరగా జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. తను ఉన్నంతలో నలుగురకి సేవ చెయ్యాలని అనుకునే దృక్పధంతో నూకరాజు ఉంటాడు. తన ఆలోచనలకు తగ్గట్టుగానే తన పార్టనర్ గా ఆసియాని ఎంచుకున్నాడు. అయితే తాజాగా నూకరాజు ఆసియా ఇద్దరు కలిసి తమ ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని పెట్టారు. హైదరాబాద్ లో‌ బ్రతకడానికి  చాలామంది వస్తుంటారు. అందులో కొంతమంది ఒక్కపూట తినడానికి కూడా ఫుడ్ దొరకనివాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి కష్టాల్లోనే ఉన్న ఒక మహిళ తను కష్టాల్లో ఉండి రాపిడో నడుపుకుంటుంది. తన కష్టం చూడలేని నూకరాజు ఆసియా ఇద్దరు కలిసి కొంత డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చారు. దాంతో ఆ మహిళ వాళ్ళకి థాంక్స్ చెప్పింది. ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే నూకరాజుకి కొన్ని ఫోక్ సాంగ్స్ పాడి ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీళ్ళు తమ ఛానెల్ లో చేసే వ్లాగ్స్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. కాగా ఇప్పుడు నూకరాజు, ఆసియా చేసిన సాయానికి నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మానవత్వాన్ని చాటుకున్నారు.. మీరు గ్రేట్, సూపర్ అంటు నెటిజన్లు కామెంట్లతో తమ అభినందనలు తెలుపుతున్నారు.

Guppedantha Manasu:అనుకున్నదే అయింది.. ఆమెను కిడ్నాప్ చేసిన రౌడీలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -963 లో... వసుధారని రిషి దగ్గరకి తీసుకొని పెద్దాయన వస్తాడు. ఆ పరిస్థితులలో ఉన్న రిషిని చూసి వసుధార ఎమోషనల్ అవుతుంది. ఎలా ఉండేవారు ఎలా అయ్యారంటు  బాధపడుతుంది. రిషి కూర్చొని వసుధారతో మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. ఇన్ని రోజులు తను అనుభవించిన బాధని రిషికి వసుధార చెప్తుంది. డాడ్ ఎలా ఉన్నారని రిషి అడుగుతాడు. మీపై బెంగ పెట్టుకున్నాడు. నేను, మావయ్య అనుపమ మేడమ్ .. మీ గురించి వెతకని ప్లేస్ లేదని వసుధార చెప్తుంది. ఆ తర్వాత రిషిని వసుధార కాపాడిన ముసలివాళ్ళకి థాంక్స్ చెప్తుంది. అసలు ఏం జరిగిందని వసుధార అడుగుతుంది.‌‌ అప్పుడే రిషికి నొప్పిగా ఉండడంతో వసుధారనే రిషి కీ తైలం రాస్తుంది. మరొకవైపు మహేంద్రకి అనుపమ భోజనం వడ్డీస్తుంది. మహేంద్ర భోజనం చెయ్యకుండా ఆలోచిస్తుంటాడు. రిషి ఎక్కడ ఉన్నాడో ఏమోనని టెన్షన్ పడుతుంటాడు. ఈ వసుధార ధర ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలి కదా, ఫోన్ కూడా కలవడం లేదని మహేంద్ర అంటాడు. మరొకవైపు రౌడీలు వసుధరపై కోపంగా ఉంటారు. నన్ను కొట్టి పారిపోతుందా దాన్ని వదిలి పెట్టవద్దు. అ ముసలోడు ఎక్కువ దూరం తీసుకొని వెళ్లి ఉండడు. పదా వెతుకుదామని రౌడీలు అనుకుంటారు. మరోవైపు  రిషికి వసుధార తైలం రాస్తుంటుంది. రిషి పరిస్థితిని చూసి వసుధార ఏడుస్తుంటే.. ఏడవకని రిషి చెప్తాడు. ఆ తర్వాత ముసలావిడ వెళ్లి రిషికి గంజినీళ్లు తీసుకొని వస్తుంది. వాటిని రిషికి తాగిపిస్తుంది వసుధార. ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత నా మనసు తేలికగా అయిందని రిషి అంటూ ఉంటే.. అవును ఈ రోజు హుషారుగా కన్పిస్తున్నాడని పక్కనే ఉన్న ఆ ముసలావిడ అంటుంది. అ తర్వాత వసుధార చెయ్యి కడుక్కోవడానికి బయటకు వెళ్తుంది. దాంతో రౌడీలు వచ్చి వసుధారకి మత్తు మందు ఇచ్చి తీసుకొని వెళ్తారు. అప్పుడే వసుధారకి ఫోన్ రావడంతో ముసలావిడ ఫోన్ తీసుకొని వస్తుంది. వసుధార కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లడం చూసి లోపలికి వెళ్లి రిషికి చెప్తుంది. రిషి లెవబోతుంటే.. నువ్వు ఇప్పుడు లేవలేవు.. ఎవరికైనా ఫోన్ చేయమని వసుధార ఫోన్ ని రిషికి ఆ  పెద్దయన ఇస్తాడు. ఎవరికి చెయ్యాలని రిషి అనుకుంటాడు. మరొకవైపు రౌడీలు వసుధారని కిడ్నాప్ చేసి శైలేంద్రకి వీడియో కాల్ లో చూపిస్తారు. శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతు దేవయానికి చెప్తాడు. అప్పుడే ధరణి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు.. నేను వస్తానని అనగానే వద్దని చెప్పి శైలేంద్ర వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ట్యాలెంట్ చూపిస్తున్న బిగ్ బాస్ అశ్వినిశ్రీ!

అశ్వినిశ్రీ ఇప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 2.0 లో అడుగుపెట్టి గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ గేమ్ పై తక్కువ ఫోకస్ చేస్తూ ఎలాగోలా చివరివరకు నెట్టుకొచ్చింది. అశ్వినిశ్రీ బిగ్ బాస్ లో సింపతి ప్లే చేసి చాలా రోజులే హౌస్ లో ఉంది. అశ్విని పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్ లోనే.. ఇంజినీరింగ్ చదివి తండ్రికి ఇష్టం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఫేమస్ అయింది.  అయితే చిన్న చిన్న సినిమాలలో నటించి తన కెరీర్ ని మొదలు పెట్టింది. అయిన అంత గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ తర్వాత అశ్వినీకి ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చిందని అనడంలో ఆశ్చర్యమే లేదు. బిగ్ బాస్ సీజన్ పూర్తైన తర్వాత  ఫ్రెండ్స్ మీట్ అంటూ తన తోటి కంటెస్టెంట్స్ ని కలవడం వారితో కలిసి వీడియోలు, రీల్స్  చేస్తూ బిజీగా ఉంటు వస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో భోలే షావలితో మంచి రాపో ఏర్పరుచుకున్న అశ్వినిశ్రీ.. ఒక నామినేషన్ లో ఆయనేమైనా హీరోనా నేను ఆయన హీరోయిన్ అనడానికి అని అశ్విని అనగా.‌. సారీ నువ్వు అలా అనకు అశ్విని.. నేను హీరోనే అంటు భోలే చెప్పడంతో ఆ నామినేషన్ ఫుల్ కామెడీ అయింది. ఆ తర్వాత ప్రియాంక, శోభాశెట్టిలతో నామినేషన్ లో పెట్టుకున్న గొడవలు ఎలా ఉండేవంటే.. బోరింగ్ దగ్గర నీళ్ళ కోసం ఆడాళ్ళు కొట్టుకునేట్టుగా ఉండేవని అప్పట్లో తెగ ట్రోల్స్ వచ్చాయి. బిగ్ బాస్ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని మొదలిపెట్టిన అశ్వినిశ్రీ.. క్రిస్మస్ కి వ్లాగ్ చేసి అందరికి మరింత దగ్గరైంది. ఇక తన ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే ఈ భామని తన ఫ్యాన్స్ ముద్దుగా అరేబియన్ గుర్రమని అంటారు. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది అశ్వినిశ్రీ. ఐ లవ్ డ్రైవింగ్ అంటూ కాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ వీడియోలో తన డ్రైవింగ్ ని కాకుండా తన హొయలని చూపిస్తు కన్పించింది ఈ భామ. అరేబియన్ గుర్రం కార్ డ్రైవ్ చేస్తుంది.. ఏంటి కార్ చూపిస్తున్నావా, ట్యాలెంట్ చూపిస్తున్నావా అంటు నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.

Krishna Mukunda Murari:తెల్లారితే నలుగు పెట్టాలి.. ఆ రింగ్ ని చూసేసారు కదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -357 లో.. కృష్ణ తప్పు చెయ్యలేదని చెప్పడానికి మురారీనే ఇదంతా చేస్తున్నాడని భవాని అంటుంది. ఎక్కడైనా అనుమానం ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకుంటారని భవాని అనగానే.. అనుమానం రావలిసింది నాకు. అంటే పోలీస్ లకి.. మీకు కాదని మురారి అంటాడు. రెండు రోజుల్లో నా భార్యని కాదని వేరేవాళ్ళని పెళ్లి చేసుకోవాలి. నాకు ఇంకా గుర్తు ఉంది మీరు అర్థం చేసుకోండని మురారి అంటాడు. ఎవరి నమ్మకం వాళ్ళది అని భవాని అంటుంది. మరొకవైపు కృష్ణ దగ్గరకి మురారి వస్తాడు. మురారి టెన్షన్ పడుతుంటే కృష్ణ ఇడ్లీ కారం చేస్తుంటుంది. ఏంటి నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఇలా ఇడ్లీ కారం చేసుకుంటున్నావా అని మురారి అంటాడు. అ తర్వాత నాకు ఒక డౌట్.. ఇదంతా ముకుంద చేపిస్తుదేమోనని అనిపిస్తుందని కృష్ణ అంటుంది. ముకుందది అంత క్రిమినల్ మైండ్ ఏమి కాదని మురారి అంటాడు. మరొక వైపు రేవతి, నందు ఇద్దరు ఎవరో కావాలనే కృష్ణ , మురారిలు కలిసి ఉంటే చూడలేని వాళ్ళు ఇదంతా చేస్తున్నారని మాట్లాడుకుంటారు. ఇలా డైవర్ట్ చేస్తుంటే ఈ లోపు పెళ్లి అవుతుందని అనుకుంటున్నారని నందుతో రేవతి అంటుంది. మరొకవైపు కృష్ణ, మురారీ ఇద్దరు ఒక దగ్గర శ్రీధర్ హత్య ఫోటోస్ కోసం వెయిట్ చేస్తుంటారు. కాసేపటికి మురారి జైలులో ఉన్న కృష్ణ చిన్నాన్నకి ఫోన్ చేస్తాడు. కృష్ణ మురారి ఇద్దరు ప్రభాకర్ తో మాట్లాడతారు. మరొకవైపు భవాని దగ్గరకి రేవతి వచ్చి ఇదంతా ముకుంద మనుషులు చేస్తున్నారనిపిస్తుంది అంటూ చెప్తుంది. అలా అనగానే నేనేమో కృష్ణ మనుషులు చేస్తున్నారంటే నువ్వు అలా అంటున్నావా అని భవాని అంటుంది. మరొకవైపు కృష్ణ, మురారీల దగ్గరకీ శ్రీధర్ ఫొటోస్ వచ్చాక అందులో వాళ్ళకి ఒక క్లూ దొరుకుతుంది. శ్రీధర్ చెంపపై అతన్ని కొట్టినవాడి రింగ్ అచ్చులు ఉంటాయి. ఈ రింగ్ ఎవరిదో ఫస్ట్ కనుక్కోవాలని మురారి అంటాడు. అప్పుడే ఎవరో మురారికి కాల్ చేసి శ్రీధర్ అకౌంట్ కి డబ్బులు క్రెడిట్ అయినట్టు.. ఆ నెంబర్ కాశ్మీర్ నెంబర్ అని చెప్తారు. ముందు ఈ రింగ్ ఎవరిదో కనుక్కోవాలని మురారి అంటాడు. మరొకవైపు ముకుంద బాధపడుతు ఉంటుంది. అది చూసిన దేవ్.. ఎలాగైనా మీ పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్తాడు. మరొకవైపు కృష్ణకి మురారి ఐస్ క్రీం తీసుకొని వస్తాడు. తరువాయి భాగంలో అందరూ భోజనం కలిసి చేస్తుంటారు. రేపు మురారి ముకుందలకి నలుగు పెట్టాలని భవాని అంటుంది.  దేవ్ భోజనం చేస్తుండగా తన వేలుకి ఉన్న రింగ్ ని కృష్ణ, మురారి ఇద్దరు చూస్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మేం బక్కోళ్ళం బ్రో..లావవ్వడం మాకు అసలు పాజిబుల్ కాదు

జోర్దార్ సుజాత బక్కగా ఉంటుంది కానీ మంచి బలంగా ఉంటుంది. ఐతే సుజాత తనకు ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటోంది. ఇంతకు ఆ టాలెంట్ ఏంటబ్బా అని చూస్తీ ఇది... ఆమె బలం, ఆమె టాలెంట్ ఆమె చేసే స్కిట్స్ లో కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి సుజాత రాకేష్ తో అన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్..ఐతే పెళ్ళికి ముందు సుజాత ఎలా ఉందొ పెళ్లయ్యాక కూడా సుజాత అలాగే ఉంది. కొంచెం కూడా బాడీ రాలేదు. స్లిమ్ గా ట్రిమ్ గా అలానే ఉంది. ఐతే చాలామందికి పెళ్లయ్యాక లావైపోతూ వచ్చిన బాడీని తగ్గించుకోలేక అవస్థలు పడుతూ ఉంటారు. ఐతే సుజాత ఈ విషయంలో చాలా గొప్పగా ఫీలవుతోంది. దాని మీద ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "మేం బక్కోళ్ళం బ్రో..లావవ్వడం మాకు అసలు పాజిబుల్ కానీ కాదు..ఎంత తిన్నాసరే చెప్తున్నాగా ఎంత తిన్నా సరే వంద గ్రాముల వెయిట్  కూడా పెరగం..అదిదా మా స్పెషల్ టాలెంట్" అంటూ తానూ వేసుకున్న డ్రెస్ లో తానెంత సన్నగా ఉందో చూపించింది సుజాత. ఇక నెటిజన్స్ ఐతే "అంతే ఆంటీ..మరి లావుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి" అని అడుగుతున్నారు. కమెడియన్ రాకింగ్‌ రాకేశ్ తో, జోర్దార్‌ సుజాత ప్రేమ లవ్ స్టోరీ  సోష‌ల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సుజాత బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చింది.  వీరిద్దరి లవ్‌   రీల్‌ లైఫ్‌లోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ రొమాన్స్ పండిస్తోంది.  ఈ ఇద్దరూ టీవీ షోస్ లో ఎన్నో సార్లు ప్రొపోజ్ చేసుకున్నారు. ఇక చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. "సేవ్ ది టైగర్స్" వెబ్ సిరీస్ లో జోర్దార్ సుజాత నటన పీక్స్ ఉంటుంది. తెలంగాణ యాసతో చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ పడీపడీ నవ్వుకున్నారు.  

Brahmamudi:ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.. భార్య ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -296 లో....దుగ్గిరాల కుటుంబం మొత్తం  భోజనం చేసి హాల్లో కూర్చొని ఉంటారు. పాయసం ఇయ్యడం మర్చిపోయానని కావ్య అందరికి పాయసం ఇస్తుంది కానీ అపర్ణ వద్దని అంటుంది. అలాగే ధాన్యలక్ష్మి విషం కక్కే వాళ్ళు పాయసం ఇచ్చిన విషం లాగే ఉంటుందని అనడంతో కావ్య బాధపడుతుంది.  ఆ తర్వాత ఆ మాటలు విన్న రాజ్ పాయసం తిని చాలా బాగుందంటూ అపర్ణ, ధాన్యలక్ష్మికి ఇస్తాడు. అందరు తింటున్నారా అని అడుగుతాడు అందరము తింటున్నామని అనామిక అంటుంది. ఎప్పుడు నానమ్మ చెప్తుంది ఉమ్మడి కుటుంబం అంటే ఇలా ఉండాలని అంటు ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతనం రాజ్ అందరికి చెప్తాడు. మరోవైపు అప్పు చికెన్ వండి అందరిని పిలిచి వడ్డిస్తుంది. తను తినబోతు కళ్యాణ్ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకొని బాధపడి తినకుండానే వెళ్లిపోతుంది. అలా అప్పు వెళ్లిపోవడం చుసిన కనకం, కృష్ణమూర్తి, అన్నపూర్ణలు బాధపడతారు. మరొక వైపు దుగ్గిరాల ఫ్యామిలీ అందరు హాల్లో పడుకోవడానికి రెడీ అవుతారు. అందరు సరదగా ట్రూత్ ఆర్ డేర్ ఆడాలని అనుకుంటారు. ఆడవాళ్లు అంత ఒకవైపు మగవాళ్ళు అంత ఒకవైపుగా ఉంటారు. మొదటగా ఇందిరాదేవికి ఛాన్స్ వస్తుంది. నువ్వు బయపడిన సందర్బం చెప్పమని ఇందిరాదేవిని సీతారామయ్య అడుగగా.. తను వయసులో ఉన్నప్పుటి విషయం చెప్తుంటే అది విని అందరు సరదాగా నవ్వుకుంటారు. ఆ తర్వాత అనామిక వంతు వస్తుంది. నా కొడుకుని ఆస్తి చూసి ప్రేమించావా? అందం చూసి ప్రేమించావా అని అనామికని ధాన్యలక్ష్మి అడుగుతుంది. తన కవితలు చూసి ప్రేమించానని చెప్తుంది. అ తర్వాత రాజ్ వంతు వస్తుంది. నువ్వు వదినకి కిస్ ఇచ్చి ప్రపోజ్ చెయ్యలని కళ్యాణ్ అంటాడు. కావ్యని ప్రపోజ్ చెయ్యడానికి రాజ్ రెడీ అవుతాడు. తరువాయి భాగంలో రాజ్, శ్వేత ఇద్దరు కలిసి ఐస్ క్రీం తింటుంటారు. అలా వాళ్ళిద్దరు తినడం కావ్య చూస్తుంది. ఆతర్వాత  రాజ్ కి కావ్య ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. మీటింగ్ లో ఉన్నానని రాజ్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ తో  లావ‌ణ్య త్రిపాఠి వెబ్ సిరీస్

  అభిజిత్ అని చెప్తే ఎవరూ గుర్తుపట్టారు కానీ బిగ్ బాస్ సీజన్ 4 అభి అంటే గతంలోకి వెళ్లి మరీ గుర్తుచేసుకుంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ లా బిహేవ్ చేసి ఒక స్టైలిష్ ఆటిట్యూడ్ తో అఖిల్ తో పోటీ పడి మరీ టైటిల్ విన్ ఐన అభి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఈ సీజన్ విన్నర్‌ ఐన  తర్వాత అభిజిత్‌కి ఇండస్ట్రీ నుంచి చాల ఆఫర్స్ వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోలేదు. ట్రావెలింగ్‌లో బిజీగా ఉండే అభి తన ఫ్యాన్స్‌కి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ ఆ పోస్టర్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.  ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్ స్టార్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు అభి . "మిస్ పర్ఫెక్ట్" అనే ఈ సిరీస్‌లో మెగా ఫామిలీ  కోడలు లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో కనిపిస్తోంది. అలాగే  అభితో పాటు గీతా సుబ్రహ్మణ్యం-3 ఫేమ్ అభిజ్ఞ్య కూడా కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజయిన ఈ పోస్టర్ లో లగేజి సూట్ కేస్ మీద లావణ్య త్రిపాఠి  కూర్చొని ఉండగా వెనకాల అభి ల్యాప్ టాప్ పట్టుకొని క్యూట్ గా చూస్తూ ఉంటాడు. ఆ పక్కన అభిజ్ఞ్య నిల్చొని కనిపించింది . 'మిస్ పర్ఫెక్ట్ సార్ మిస్ పర్ఫెక్ట్' అంతే అంటూ ఈ పోస్ట్‌కి అభి  క్యాప్షన్ పెట్టుకుంటే అభిజ్ఞ మాత్రం "ఏ ఫన్ రైడ్" అని కాప్షన్ ఇచ్చింది .  లావణ్య త్రిపాఠి మెగా ఫామిలీ కోడలిగా అడుగు పెట్టాక  చేస్తున్న ఫస్ట్  ప్రాజెక్ట్ ఇదే. ఇది లావణ్యకు సెకండ్  వెబ్ సిరీస్. ఫస్ట్ వెబ్ సిరీస్ ఏంటంటే  జీ5లో 'పులి మేక'. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా లావణ్యా నటన అదిరిపోతోంది. ఇక ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.  ఇక అభిజిత్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్‌లో ఓ రోల్ చేశాడు కానీ అది ఏమంత పెద్దగా అతనికి పేరు తెచ్చిపెట్టలేదు.  ఆ తర్వాత  వీటికి లాంగ్ గ్యాప్ ఇచ్చి తన  ట్రావెలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాడు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ద్వారా మళ్ళీ అభి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

పల్లవి ప్రశాంత్, రతిక.. త్వరలో ఓ శుభవార్త!

బిగ్ బాస్ సీజన్‌ సెవెన్ విజేతగా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ప్రశాంత్ తో మొట్టమొదట స్నేహం చేసింది రతిక రోజ్. అయితే అది స్నేహమో, ఆకర్షణో మరేంటో ప్రేక్షకులకి ఇప్పటికి అర్థం కానీ ప్రశ్నే. అయితే ప్రశాంత్ మొదట్లో రతికతో కలిసి ముచ్చట్లు, లవ్ సింబల్ వేయడం, నా పిల్ల అని తోటి హౌస్ మేట్స్ తో చెప్పుకోవడం అంతా చూసి వాళ్ళిద్దరు లవ్ స్టోరీ నడిపిస్తున్నారని అందరు అనుకున్నారు. అయితే రెండవవారం నామినేషన్ లో హౌస్ లో దాదాపు పదిమంది కంటెస్టెంట్స్ ప్రశాంత్ పై నామినేషన్ చేసారు. ఈ ఇష్యూలో రైతులు వర్సెస్ బిటెక్ స్టూడెంట్స్ అనే టాపిక్ పెద్ద ఎత్తున పాపులర్ అయి అమర్ దీప్ కి రైతులంతా నెగెటివ్ అయ్యారు. ఇక ఆ నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ హీరో అయ్యాడు. అయితే అదే నామినేషన్ లో.. బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి కుక్కలెక్క తిరిగానని పల్లవి ప్రశాంత్ అనగా.. మరి లోపలికి వచ్చి ఏం చేస్తున్నావని రతిక అంది. దాంతో మనోడికి ఫ్యూజ్ లు అవుటయ్యాయి. ఇదేంది ఇన్నిరోజులు లవ్ సింబల్ వేసింది, నా గుండెలో నీకే స్థానం అంది ఇప్పుడేంది అని ఇలా మాట్లాడుతుందని ప్రశాంత్ కి అర్థం కాక సైలైంట్ అయి కంటనీరు తెచ్చుకున్నాడు. ఈ ఇష్యూ  తర్వాత శివాజీ వెళ్ళి ఓదార్చడంతో తన మనసు మార్చుకొని గేమ్ మీద దృష్టి పెట్టి చివరిదాకా ప్రతీ గేమ్ లో అంతే కసిగా పోరాడాడు ప్రశాంత్. రతిక, ప్రశాంత్ లు కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత రతిక ఎలిమినేట్ అయింది బయటకు వచ్చేముందు అసలు ప్రశాంత్ వైపు కూడా చూడలేదు. ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి తప్పు తెలుసుకొని తనని అక్క అని పిలవొద్దని అంది. అయితే ప్రశాంత్ దానికి ఒప్పుకోలేదు‌.‌ ఇక శివాజీ వచ్చి ఇద్దరిని మంచి స్నేహితులుగా ఉండమని చెప్పడంతో అంతా సద్దుమణిగింది. అయితే బిగ్ బాస్ బయటకొచ్చాక రతిక ఓ ఇంటర్వూ లో ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. తనంటే ఎప్పుడు నాకు ఒకే అభిప్రాయం.. మనోడు.. మంచోడు నాకు బాగా కనెక్ట్ అయ్యాడని అంది‌. అయితే దీన్ని బట్టి ప్రశాంత్ అంటే రతికకి కూడా సంథింగ్ సంథింగ్ అని తెలుస్తోంది. మరి ప్రశాంత్, రతికలు మళ్లీ కలిసుస్తారా? కలిసి ఓ శుభవార్త చెప్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.  

ఆదికి మాస్ వార్నింగ్ ఇచ్చిన రోషన్!

ఢీ సెలబ్రిటీ స్పెషల్ ఈ వారం షోలో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా అవతారం ఎత్తాడు. ఈ వారం షోకి బబుల్ గం టీమ్ నుంచి రోషన్ కనకాల, మానస వచ్చారు.. ఐతే బబుల్ గం సీక్వెల్ కి ఒక డాన్స్ కి కోరియోగ్రఫీ చేయాలంటూ రోషన్ హైపర్ ఆదిని అడిగాడు. ఆయనలో ఒక స్టైల్, ఒక స్వాగ్ ఉంది అందుకే ఆయన్నే కొరియోగ్రాఫ్ చేయమని అడిగానన్నాడు రోషన్. ఆది రోషన్ కి నేర్పించిన స్టెప్స్ సరిగా వేయకపోయేసరికి "బబుల్ గం - 2 కి నువ్వు హీరోవి కాదు నేనే హీరోని, ఈమె హీరోయిన్" అని చెప్పి షాకిచ్చాడు. ఇక రోషన్ కి ఆది అసలు కొరియోగ్రాఫర్ కాదన్న విషయం తెలిసి "అసలు మేము నేర్పించమన్నది ఏమిటి నువ్వు నేర్పించింది ఏమిటి " అని ఆది కాలర్ పట్టుకుని అడిగాడు రోషన్. "సుమ గారి కొడుకువని ఊరుకుంటున్నా" అని ఆది అన్నాడు " నేను సుమ గారి కొడుకునే కాదు ఏమిటిప్పుడు బుధవారం అంటున్నావు  కాబట్టి వదిలేస్తున్నా శనివారం కలుద్దాం...ఫైటింగ్ చేసుకుందాం..ఎవరో తేల్చుకుందాం " అని రోషన్ అనేసరికి "శనివారం నేను ఫైటింగులు గట్రా  చేయను..నెల్లూరు లో ఈవెంట్ ఉంది నన్ను వదిలేయ్  " అన్నాడు ఆది. "మీరు పేరు ఆది కాబట్టి ఆదివారం కలుద్దాం" అన్నాడు రోషన్. ఇంతలో ఆది అక్కడి నుంచి వెళ్ళిపోతూ "నా పేరు హైపర్  ఆది..కమెడియన్ అసలు నీకు నేను కొరియోగ్రాఫర్ అని ఎవరు చెప్పారు" అని ఫీలైపోయాడు ఆది. "నువ్వు హైపర్ ఆది.. నేను హైపర్ ఐతే ఎలా ఉంటుందో చెప్పనా రేపొద్దున్న ట్యాంక్ బండ్ లో తేలుతావ్ చెప్తున్నా" అని రోషన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి "నేను ఢీలోనే తేల్తా" అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

సంచలక్ అంటే అదేమన్నా అర్జున అవార్డా బ్రో..

బిగ్ బాస్ సీజన్ 7 లో ఆట సందీప్ గేమ్ ఒక రేంజ్ లో ఆడారు. సీరియల్ బాచ్ తో పోటాపోటీగా తలపడ్డారు. బిగ్ బాస్ లోకి ఎవరు వెళ్లి గేమ్ ఆడి బయటకు వస్తారో వాళ్లకు దశ తిరుగుతుంది అనే ఒక కామెంట్ ఐతే ఉంది. మరి ఆట సందీప్ దశ కూడా తిరిగే ఛాన్స్ వచ్చేసింది. హౌస్ లోంచి రాగానే ఆయన నటించిన మూవీ "ది షార్ట్ కట్" రిలీజ్ కాబోతున్న విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా తన ఫాన్స్ కి షేర్ చేసాడు. ఈ మూవీ  పోస్టర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యింది. ఇక ఈ పోస్టర్ మీద "బెస్ట్ సంచలక్" అని రాసి బిగ్ బాస్ తెలుగు లోగోతో సహా పోస్ట్ చేసాడు. ఆ పోస్టర్ చూసిన సందీప్ వైఫ్ జ్యోతి "కంగ్రాట్యులేషన్స్ మై లవ్" అని కామెంట్ పెట్టేసరికి " మీ ఆయనకు చెప్పండి అమ్మ బెస్ట్ సంచలక్ ఏందీ. ఏదో అర్జున అవార్డులాగా పెట్టుకున్నాడు. పైగా చేసిన సంచలక్ లో కూడా అన్ని తప్పు డెసిషన్స్ తీసుకున్నాడు. ఒక దానిలో వేరే వాళ్ళ మాటలు విని చేసాడు" అని కౌంటర్ ఇచ్చారు ఒక నెటిజన్. అలాగే " సంచలక్ అనే పెట్టుకొనేసరికి సందీప్ ని నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. "సంచలక్ ఏందీ..ఏదో క్లాస్ లీడర్ లాగా , కొంచెం మెచ్యూరిటీతో పెట్టండి. బెస్ట్ సంచాలక్కా...బ్రో సొంత డబ్బాలా ఉంది..సంచలక్ అని తీసేయ్ బ్రో..ఎం మాట్లాడుతున్నావ్ బ్రో నరాలు కట్ ఐపోతున్నాయి" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట‌ర్‌లో రివాల్వ‌ర్ పట్టుకుని సీరియస్ లుక్ లో  ఆట సందీప్ కనిపించాడు. గ‌తంలో ఆట సందీప్ ల‌వ్ యూ టూ అనే మూవీలో నటించాడు. ఆట సందీప్ భార్య జ్యోతి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ప‌లు సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా ఆట సందీప్ వ‌ర్క్ చేశాడు. ఇక ఆట సందీప్ హౌస్ లోంచి బయటకు వచ్చి ఒక్కొక్కరిగా అందరి కంటెస్టెంట్స్ ని కలుస్తున్నాడు.

సుమ పరువు తీసేసి..నన్ను వాడుకోండి అంటూ ఆఫర్ ఇచ్చిన గెటప్ శీను

సుమ అడ్డా లాస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ వారం షోకి "హనుమాన్" మూవీ టీమ్ వచ్చింది. ఇందులో హీరో హీరోయిన్స్  తేజ సజ్జ, అమృతా అయ్యర్, గెటప్ శీను, ప్రశాంత్ వర్మ వచ్చారు. రాగానే తేజ సజ్జ హనుమంతుడు గధను ఎత్తినట్టు ఆయన అరటిపండు గెలను ఎత్తేసరికి  సుమ ఖుషి ఐపోయింది. తర్వాత "అమ్మా గెటప్ శీను ఆ గెలను తీసుకో" అనేసరికి శీను ఒక అరటిపండు తీసుకున్నాడు దానికి తేజ రియాక్ట్ అయ్యి "తీసుకో అంది పండును కాదు గెలను" అన్నాడు సీరియస్ గా. ఇంతలో  అమృత అయ్యర్, సుమ ఇద్దరు బస్ స్టాండ్ లో కూర్చుని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో మరో వైపు నుంచి తేజ, ప్రశాంత్ వర్మ వాళ్లకు బీట్ కొడుతూ ఉంటారు. " ఆ అమ్మాయిని గమనించావా..బాగుంది కదా " అని తేజా అడిగేసరికి "బాగుంది..పర్పుల్ కలర్ డ్రెస్ లో చాలా బాగుంది" అని ప్రశాంత్ వర్మ అనేసరికి "సుమ గారు కాదు" అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మరీ ప్రశాంత్ వర్మని తిట్టాడు తేజ.."సైట్ కొట్టడంలో కూడా నాకు మర్యాద ఇస్తున్నారు వావ్" అంటూ సుమ ఫుల్ ఖుషీ ఐపోయింది. ఇంతలో అటుకేసి గెటప్ శీను వచ్చేసరికి "ఇదిగో అక్కడ ఇద్దరు నిలబడ్డారు కదా వాళ్ళు మా గురించి ఇందాకట్నుంచి కామెంట్స్ చేస్తున్నారు" అని సుమ అనేసరికి "ఎందులో యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తున్నారా " అనేసరికి సుమ షాకైపోయింది. ఇంతలో గెటప్ శీను తన సూటుకేసిలో బోల్డంత కాష్ తీసుకెళ్తూ సుమ వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసి తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి వచ్చి డబ్బులు అన్నీ క్లీన్ చేయాలని చెప్పేసరికి సుమ వచ్చి ఆ డబ్బును చూసి ఇందాకటి నుంచి ఆ సూట్కేస్ లో కట్ డ్రాయర్లు బనీన్లు ఉన్నాయన్న డబ్బు ఉందని తెలీదు ఎందుకు ఈ డబ్బును మేం క్లీన్ చేస్తాం అని చెప్పేసరికి "ఏమిటి మీరు క్లీనర్సా" అని అడిగి సుమ పరువు తీసేసాడు గెటప్ శీను. తర్వాత అమృతను పటాయించాడు శీను .."హలో ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ యూజ్ మీ" అనేసరికి ఆమె షాకయ్యింది. ఇలా ఈ వారం సుమ అడ్డాలో వీళ్లంతా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు.  

యశ్వంత్ శోభ నిలయంని ఇలా మాకు నచ్చినట్టు చేయించుకుంటున్నాం

కార్తీక దీపం సీరియల్ లో మోనిత రోల్ లో ఎంతో ఫేమస్ అయ్యింది సోబాశెట్టి. ఆ నేమ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 లో స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్స్ లో ప్రియాంక జైన్, శోభా శెట్టి ఇద్దరూ పోటా పోటీగా ఆడారు. ఇక చివరికి శోభా  14వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.  హౌస్ నుంచి బయటకు వచ్చాక తన కెరియర్ లో బిజీ అయ్యింది. అలాగే తన లవర్ యశ్వంత్ ని కూడా అందరికీ పరిచయం చేసింది. యశ్వంత్ ఎవరో కాదు కార్తీక దీపం సీరియల్ లో ఆదిత్య రోల్ లో కనిపించిన వ్యక్తి. రీసెంట్ గా ఒక షోలో వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. మూడేళ్ళుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు తమ ప్రేమను అందరికీ చెప్పారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈమె బుల్లితెర సీరియల్స్ నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది. అలాగే ఈమె బ్యూటిషియన్ గా క్లాసెస్ కూడా చెప్తూ ఉంటుంది. ఆ క్లాసెస్ కి సంబందించిన వీడియోస్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజాగా తన పేరెంట్స్ తో, తన లవర్ తో కలిసి హోమ్ టూర్ వీడియో చేసింది మోనిత. ఈమె కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆ వీడియోలో చెప్పింది. ఐతే  ప్రస్తుతం  ఇంటి పనులు జరుగుతున్నాయనే విషయాన్నీ తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది.  ఇందులో భాగంగా ఈమె లివింగ్ ఏరియా కిచెన్ తో సహా  ప్రతి ఒక్క రూమ్ ని చూపించి ఆ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం హౌస్  కన్స్ట్రక్షన్ పూర్తయ్యిందని ఇంటీరియర్ డిజైన్ మిగిలే ఉందని చెప్పింది శోభా శెట్టి. ఇక ఆ ఇంటికి మొత్తం యశ్వంత్ టేస్ట్ కి తగ్గట్టుగా  ఇంటీరియర్ డిజైనర్ గా పని చేయిస్తున్నట్లు అతను ఎలా చెప్తే అలా  డిజైన్ చేయిస్తున్నట్లు చెప్పింది శోభా.  అంతేకాకుండా ఈ ఇంటికి యశ్వంత్ శోభ నిలయం అని పేరు కూడా పెట్టుకున్నట్లు చెప్పింది శోభా.  

ఆదిరెడ్డి సెలూన్ లో గీతూ పిచ్చుక గూడు జుట్టుకు కలర్...

బిగ్ బాస్ రివ్యూలతో ఫేమస్ అయిన గీతూ రాయల్ అంటే సోషల్ మీడియాలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బుల్లితెర షోస్ తో  పాటు జబర్దస్త్ వేదికపై కూడా మెరిసింది. అంతేకాదు  బిగ్ బాస్ 6లో కూడా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఒక రేంజ్ లో ఆ సీజన్ ని రక్తి కట్టించింది. బిగ్ బాస్ సీజన్ 6 అంటే చాలు ఆడియన్స్ కి గీతూ రాయల్ మాత్రమే గుర్తొస్తుంది. అంతలా ఏడ్చి అల్లరి చేసి ఎలిమినేట్ ఐనా కూడా హౌస్ లోంచి రాను అంటూ మారాం చేసింది ఈ అమ్మడు. ఇక హౌస్ లోంచి వచ్చాక కొద్ది రోజులకు తేరుకుని తన ఫ్రెండ్స్ అందరితో కలిసిపోయింది. గీతూ రాయల్ ఆదిరెడ్డికి మంచి ఫ్రెండ్ కూడా ఐపోయింది. వీళ్ళు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. మరి అలాంటి గీతూ విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్ లో రీసెంట్ గా స్టార్ట్ చేసిన జావేద్ హబీబ్ హెయిర్ సెలూన్ కి వచ్చింది. తన జుట్టుకు రకరకాల రంగులు వేసుకునేసరికి  పిచ్చుకు గూడులా మారిపోయింది జుట్టు. అందుకే  ఇప్పుడు ఆదిరెడ్డి సెలూన్ లో ఆ కలర్ మార్పించుకున్నట్లు చెప్పింది. "ఆదిరెడ్డి ఫ్రీగానే కదా హెయిర్ కలర్ వేసేది లాస్ట్ లో మళ్ళీ బిల్ వేయవు కదా" అనిగీతూ  అడిగేసరికి దణ్ణం పెట్టాడు ఆదిరెడ్డి. "అంటే ఫ్రీ అన్నానని వచ్చావా" అని అడిగేసరికి "నేను ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తాను" అని చెప్పింది గీతూ. "పర్లేదు నువ్వు కూడా మా తిరుపతి స్టడ్ అండ్ టాటూస్ కి వస్తే నీకు ఫ్రీగా టాటూస్ వేస్తా" అని ఆదిరెడ్డికి  ఆఫర్ ఇచ్చింది గీతూ. "నా సెలూన్ లో  నీ షాప్ పేరును ప్రమోట్ చేస్తున్నావన్నమాట" అన్నాడు ఆది ..."మీకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ మా ఆదిరెడ్డి సెలూన్ లో చేయించుకోండి" అని గీతూ చెప్పింది. "ఫ్రీ మాత్రం కాదు" అని ఆది అనేసరికి  "అవును మీకు ఫ్రీ కాదు నాకు మాత్రమే ఫ్రీ" అంది గీతూ. "నీకు కూడా ఫ్రీ కాదు గీతూ" అని చెప్పేసరికి "ఐతే నేను రీల్ పోస్ట్ చేయడం లేదు నో ప్రమోషన్" అని మొహమాటం లేకుండా చెప్పేసింది గీతూ. ఇలా వీళ్ళ ప్రమోషన్ వీడియోని తమ తమ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పోస్ట్ చేసుకున్నారు..

వెంకీ మామ వచ్చాడంటే పండుగే పండుగ

త్వరలో సంక్రాంతి రాబోతోంది. ఈ సంక్రాంతి మూడు రోజుల సెలెబ్రేషన్స్ మాములుగా ఉండవు. ఇక బుల్లితెర మీద ఈ వేడుకలు చూడాలంటే రెండు కళ్ళూ చాలవని చెప్పాలి. ఇక ఈ సంక్రాంతి  వేడుకల్ని ఈటీవీ చాల ప్రత్యేకంగా డిజైన్ చేసింది. "ప్రతీ సంక్రాంతికి ఇంటికి అల్లుళ్ళు వస్తారు కానీ ఈ సంక్రాంతికి మాత్రం మొగుడొచ్చాడు" అంటూ సుధీర్ హోస్ట్ గా వచ్చి ప్రోమో లింక్ చెప్పాడు. "అల్లుడా మజాకా" పేరుతో రాబోతున్న  ఈ షోకి మహామహులంతా వచ్చారు. ఈ మధ్య కాలంలో ఏ మూవీ రిలీజ్ కావాలి అన్నా కూడా ముందు బుల్లితెర మీద ప్రొమోషన్స్ చేసుకోకుండా పట్టాలెక్కడమే లేదు. ఇప్పుడు "సైంధవ్" మూవీ ప్రొమోషన్స్ కోసం విక్టరీ వెంకటేష్ ఈ స్టేజి మీదకు అడుగుపెట్టారు. అలాగే అలనాటి అందాల నటులు వెంకటేష్ తో కలిసి నటించిన మీనా, ఖుష్బూ కూడా వచ్చి వెంకటేష్ తో స్టెప్పులేశారు. ఇక వెంకటేష్ సిగ్నేచర్ డైలాగ్ "అయ్యో అయ్యో అయ్యయ్యో" అనే డైలాగ్ చెప్పి బుల్లితెర కమెడియన్స్ తో డాన్స్ లు వేశారు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ అంతా కూడా  "ఓకే ఫ్రేమ్ లో వెంకటేష్ గారిని మీనా గారిని కుష్బూ గారిని చూడడం సంథింగ్ స్పెషల్ బాస్ చాలా సూపర్ హిట్ సినిమాలు గుర్తుకొస్తున్నాయి ...సైంధవ్ సినిమా ప్రమోషన్ కోసం వెంకటేష్ గారు రావడం హ్యాపీ బాస్... వెంకీ మామ వచ్చాడంటే పండుగే పండుగ ...బొబ్బిలి రాజా ఈజ్  బ్యాక్...సుదీర్ అన్న మీరు రావడం చాలా చాలా యాఫీగా ఉన్నాము జై సుదీర్ అన్న ..." అంటూ వెంకీని, సుధీర్ ని వాళ్ళ అభిమానంతో ముంచెత్తారు. విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’ త్వరలో విడుదలవుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఒకటి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి  రెస్పాన్స్ వస్తోంది. అలాగే చిరంజీవికి ఒక ల్యాండ్ మార్క్ మూవీ ఉంది ఆయన 150 వ చిత్రాన్ని "ఖైదీ నంబర్ 150 " గా వచ్చి హిట్ కొట్టింది. మరి ఇప్పుడు వెంకీ ల్యాండ్ మార్క్ మూవీ రిలీజ్ కాబోతోంది.

Guppedantha Manasu:గుండెల్ని పిండేసే ఎపిసోడ్.. వాళ్ళిద్దరు ఒక్కటైన వేళ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -962 లో... ఫణింద్ర, మహేంద్ర ఇద్దరు కాలేజీలోకి వస్తారు. వసుధార తన క్యాబిన్ దగ్గర ఉండకపోయేసరికి ఎక్కడకు వెళ్లిందని అనుకొని ఆఫీస్ బాయ్ ని పిలిచి అడుగుతారు. మేడమ్ కి ఫోన్ రావడంతోనే త్వరగా వెళ్లి పోయిందని చెప్తాడు. ఏదో వర్క్ పై వెళ్లి ఉండి ఉంటుందని మహేంద్ర అంటాడు. అ మాటలు శైలేంద్ర వింటాడు. ఫోన్ మాట్లాడి వెళ్ళిందంటే రిషి గురించి ఏమైనా క్లూ దొరికిందా? అసలు ఈ భద్ర ఏం చేస్తున్నాడని అతని దగ్గరకి శైలేంద్ర వెళ్తాడు. వసుధారని కనిపెట్టుకొని ఉండమని చెప్తే.. నువ్వేంటి తను బయటకు వెళ్లిన కూడా ఏమి పట్టించుకొనట్లున్నావని శైలేంద్ర అనగానే ఆవిడా కాలేజీ లోనే ఉందని చెప్తాడు.  లేదు ఇందాకే వెళ్ళింది రిషి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్‌ తెలిసి ఉండవచ్చు అందుకే వెళ్ళింది. వాళ్ళు ఇద్దరు కలవకూడదు. ఆ వసుధార ఎంతో దూరం వెళ్లి ఉండదు త్వరగా ఫాలో అవ్వమని భద్రకి శైలేంద్ర చెప్తాడు. మరొకవైపు రిషి కోసం వసుధార పెద్దయన ఫోన్ చెప్పిన అడ్రెస్ కు వెళ్తుంటుంది. అక్కడ ఉన్న షాప్ అతన్ని పెద్దాయన గురించి అడుగుతుంది. అతను తెలుసు కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదని చెప్తాడు. ఇక్కడే కూర్చోండి అతనే వస్తాడని అ షాప్ అతను చెప్తాడు. దాంతో వసుధార అక్కడే కూర్చొని పెద్దయన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. మరొక వైపు వసుధార వెనకాలే ఇద్దరు రౌడీలు తనని ఫాలో అవుతు వస్తారు. కొద్దిసేపటికి పెద్దయన వసుధార దగ్గరకి వస్తాడు. రిషి గురించి వసుధార అన్ని అడిగి తెలుసుకుంటుంది... అ తర్వాత వసుధారని పెద్దాయన తీసుకొని రిషి దగ్గరకీ వెళ్తుంటే అ రౌడీలు వాళ్ళిద్దరిని ఫాలో అవుతుంటారు. అదే సమయంలో వసుధార ఇంకా రాలేదేంటని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత రౌడీలు తమ వెనకాలే వస్తున్న విషయం గమనించిన వసుధార.. ఒక దగ్గర దాక్కోని ఆ రౌడీలని పక్కదారి పట్టిస్తుంది. అంతేకాకుండా రౌడీల వెనకాల నుండి వచ్చి కర్రతో కొడుతుంది వసుధార. అ తర్వాత పెద్దయనతో కలిసి రిషి దగ్గరకి వెళ్తుంది వసుధార. రిషిని చూసిన వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషి కూడా ఎమోషనల్ అవుతాడు. రిషిని వసుధార హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.  

Krishna Mukunda Murari:శ్రీధర్ ని చంపి కొత్త డ్రామా మొదలెట్టిన దేవ్.. వాళ్ళు కనిపెట్టగలరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -356 లో.. కృష్ణ తప్పు చేసిందని భవాని అనుకుంటుంది. అది అవాస్తవమని ఋజువు చేసే పనిలో మురారి ఉంటాడు. అలా ఋజువు చేసే క్రమంలో ఫెయిల్ అవుతుంటాడు. శ్రీధర్ వేసిన బొమ్మ సర్జరీ చేయించిన అతనిది కాదని పరిమళ చెప్తుంది. దాంతో అ శ్రీధర్ ఎందుకు అలా వేసాడోనని మురారి కృష్ణ ఇద్దరు అనుకుంటారు. ఎవరో కావాలనే మాన ఫ్యామిలీని కేసులో డైవర్ట్ చెయ్యడానికి ఇలా చేశారని మురారి అంటాడు.  ఆ శ్రీధర్ ఎందుకు అలా చేసాడో రేపు వాడిని నాలుగు కొట్టి నిజం చెప్పిస్తానని మురారి అంటాడు. మీకు నమ్మకం లేకపోతే మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ తో మీరే, మీ ముందు ఇంట్రాగేషన్ చెయ్యించండని మురారి అంటాడు. మరుసటి రోజు ఉదయం పడుకున్న మురారి దగ్గరకి కృష్ణ వచ్చి సరదాగా ఆటపట్టిస్తుంది. ముకుంద లాగా మిమిక్రీ చేసి మురారిని నిద్ర లేపుతుంది. దాంతో ముకుంద వచ్చిందని అనుకుని మురారి కోపంగా నిద్ర లేస్తాడు. కృష్ణని చూసి.. ఏంటి కృష్ణ ప్రొద్దున్నే అని అంటాడు. ముకుందపై చాలానే కోపం ఉంది కదా.. మరి నాపై ప్రేమ ఎంత ఉందని కృష్ణ అడుగుతుంది. అప్పుడు కృష్ణ జుట్టుని చూపిస్తూ.. ఇన్ని సంవత్సరాలు నీతో కలిసి ఉండాలని ఉందని మురారి అంటాడు. ఆ మాటకి కృష్ణ  చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాసేపటికి అందరు హాల్లో కూర్చొని ఉంటారు. శ్రీధర్ ని వెళ్లి కలిసావా అని మురారిని భవాని అడుగుతుంది. లేదు ఇప్పుడు వెళ్తున్నాను.. ఎందుకు అలా చేసాడో కనుక్కుంటానని మురారి అనగానే.. ఎన్నిసార్లు వెళ్తే ఏంటి అని భవాని అంటుంది. అంటే నేను వెళ్లట్లేదు పట్టించుకోవట్లేదని అంటున్నారా అని మురారి అంటాడు. కాసేపటికి దేవ్ తలకి కట్టుతో ఇంటికి వస్తాడు. ఏమైందని ఇంట్లో వాళ్ళు అడుగగా.. శ్రీధర్ ని తీసుకొని రావడానికి వెళ్ళాను. అక్కడ రౌడీలు ఉన్నారు. నన్ను కొట్టారు స్పృహ తప్పి పొడిపోయాను. నేను లేచేసరికి శ్రీధర్ చనిపోయి ఉన్నాడని దేవ్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. అది విని ముకుందపై కృష్ణకి డౌట్ వస్తుంది. మరొకవైపు దేవ్ తో శ్రీధర్ గురించి మాట్లాడతాడు మురారి. నేరస్తుడిని పట్టుకుంటానని మురారి చెప్పగానే దేవ్ టెన్షన్ పడుతాడు. మరొకవైపు నిజం బయటకు రాకుండా ఉండడానికి ఇదంతా చేస్తున్నారు. వాళ్ళతోనే కలిసి ఉంటానంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరని భవాని అంటుంది. తరువాయి భాగంలో.. శ్రీధర్ కి సంబంధించిన ఫొటోస్ చూస్తూ అతని చెంపపై కొట్టడం.. వాళ్ళ హత్య చేసిన అతని వేలుకి ఉన్న రింగ్ అచ్చులు శ్రీధర్ చెంపపై ఉండడం.. కృష్ణ, మురారి గమనించి ముందు ఈ రింగ్ ఎవరికి ఉందో కనుక్కోవాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi:అత్తింట్లో కొత్త కోడలి మొదటి కాఫీ.. ఇదేందయ్యా ఇది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -295 లో... అనామిక- కళ్యాణ్ ల పెళ్లి అనంతరం ఇరు కుటుంబాలు దుగ్గిరాల ఇంటికి వస్తారు. పెళ్లి తర్వాత జరిగే తంతు మా ఇంట్లో జరపడం మా ఆచారమని అనామిక వాళ్ళ పేరెంట్స్ అంటారు. మా ఇంట్లో జరపడం మా ఆచారమని అంతే కాకుండా పూజ కూడా జరిపించలని ఇందిరాదేవి చెప్తుంది. సరేనని అనామిక పేరెంట్స్ అంటారు. ఆ తర్వాత అనామికని కళ్యాణ్ చేతిలో పెట్టి అప్పగింతలు జరిపించి వెళ్లిపోతు.. రాజ్ ని పక్కకు పిలిచి అనామిక పేరెంట్స్ మాట్లాడుతారు.  పెళ్లిలో అంత గొడవ జరిగింది.. ఆ కావ్య తన చెల్లిని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యలని అనుకుంది. అది కుదరలేదు కదా.. ఇంట్లో నా కూతురుకి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందని అనామిక నాన్న అంటాడు. మీరు ఏం టెన్షన్ పడకండని వాళ్ళకి సర్ది చెప్పి రాజ్ వాళ్ళని పంపిస్తాడు. మరొకవైపు కనకం, కృష్ణమూర్తి పెళ్లిలో జరిగిన గొడవ గురించి బాధపడుతుంటారు. అప్పుడే అప్పు గదిలో నుండి బయటకు వచ్చి సైకిల్ 'కీ' ఇవ్వు అని అప్పు అడుగుతుంది. ఎక్కడకి అని అన్నపూర్ణ అడుగుతుంది. చికెన్ తినాలని అనిపిస్తుంది. అందుకే తీసుకొని రావడానికి వెళ్తున్నాను.. అన్ని రెడీ చెయ్ అని అప్పు చెప్పి వెళ్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. అప్పు మొహంలో ఎలాంటి బాధ కన్పించడం లేదని అనుకుంటారు. మరొకవైపు అనామిక- కళ్యాణ్ లు ఇంట్లోకి వచ్చేటప్పుడు.. అనామిక,  ధాన్యలక్ష్మి అన్న మాటలు గుర్తుకు చేసుకొని కావ్య బాధపడుతుంటుంది. అప్పుడే రాజ్ వచ్చి అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావని అంటాడు. ఆ తర్వాత దుగ్గిరాల ఇంట్లో అందరు కలిసి భోజనం చేస్తుంటారు. అపర్ణ , ధాన్యలక్ష్మి కలిసి  కావ్యని పిలువకుండా వాళ్ళే వడ్డించుకుంటారు. కావ్య కర్రీ వెయ్యాలా అని ధాన్యలక్ష్మి ని అడిగితే ధాన్యలక్ష్మి చిరాకు పడుతుంది. ఏంటి ఎప్పుడు కావ్యని ఒక్క మాట కూడా అననివ్వవు.. ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావని రుద్రాణి అనగానే.. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని, ఎవరినీ ఎక్కవ నమ్మోద్దని అర్థం అయిందని ధాన్యలక్ష్మి అంటుంది. ఇలా భోజనం చేస్తున్నప్పుడు ఆర్గుమెంట్ జరుగుతుంటే ఇందిరాదేవి తన ఇద్దరి కోడళ్ళపై కోప్పడుతుంది. కావ్యకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. వంట బాగా చేసావని మెచ్చుకుంటుంది. తరువాయి భాగంలో ప్రొద్దున లేచి అనామిక అందరికి కాఫీ చేసి తీసుకొని వస్తుంది. అందరూ కాఫీ తాగి ఇదేం కాఫీ అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సూపర్ సింగర్ కంటెస్టెంట్ వెంకటేష్ కి లక్ష ఇస్తానన్న రాహుల్ చిచ్చా...

సూపర్ సింగర్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో అనంత శ్రీరామ్, రాహుల్ చిచ్ఛ కలిసి కల్లు తాగి షోని కిక్కెకించారు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ మాత్రం తన ఉదారతను చాటుకున్నాడు. ఈ షోలో శ్రీకాకుళం నుంచి  వెంకటేష్ అనే వ్యక్తికి లక్ష రూపాయలను ఇస్తున్నట్టు ప్రకటించాడు. వెంకటేష్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో "దారి చూడు దుమ్ము చూడు" సాంగ్ పాడి వినిపించాడు. తర్వాత అతని ఏవిని వెనక స్క్రీన్ మీద ప్లే చేశారు. "నేను జాబ్ చేయడం కోసమే వైజాగ్ వచ్చాను. పగటి పూట పాట్లు, రాత్రి పూట పాటలు..ఇదే నా జీవితం...దాని కోసం నేను మ్యూజిక్ అకాడెమీలో కూడా చేరాను. ఉదయం పూట ఫుడ్ డెలివరీ చేస్తూ వచ్చే డబ్బును మ్యూజిక్ క్లాస్ కి ఇచ్చేవాడిని..." అని చెప్పేసరికి "చాల ఇన్స్పైరింగ్ గా ఉంది బ్రో..నీ లైఫ్ సీరియస్లీ...నేను ఏ స్థాయి నుంచి వచ్చానో కూడా నాకు తెలుసు. నేను ఒక బార్బర్ ని..ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను అంటే నాకు తెలుసు కింది స్థాయి కస్టాలు ఎలా ఉంటాయో...అందుకే నేను నీకు ఒక లక్ష రూపాయలు ఇద్దామనుకుంటున్నా నువ్వు మ్యూజిక్ నేర్చుకోవడానికి" అనేసరికి అందరూ చప్పట్లు కొట్టారు..ఇక శ్రీముఖి హనుమకొండ నుంచి వచ్చిన కంటెస్టెంట్ సుకుమార్ వీర అనే వ్యక్తితో కామెడీ స్కిట్ వేసి మంచి ఫన్ జెనెరేట్ చేసింది. "ఏంటి శ్రీముఖి" అని సుకుమార్ అడిగేసరికి "ఓహ్ మా ఆయనే..కానీ వాసన వస్తోంది" అనేసరికి "తాగుతానా శ్రీముఖి నేనెంతో సిన్సియర్ అనే విషయం నీకు తెలుసు కదా" అన్నాడు. "ఎన్నిసార్లు చెప్పమనండి మీరు తాగితే నాకు కూడా తీసుకురమ్మని చెప్పి" అనేసరికి కంటెస్టెంట్ షాకైపోయాడు. మంచి మంచి సింగర్స్ ఈ షోలో ఉండడం నిజంగా చాల గర్వంగా ఉందంటూ చెప్పింది జడ్జ్ శ్వేతా మోహన్...