Ramu Rathod: తనూజ కాళ్ళు మొక్కిన రాము రాథోడ్. ‌. గౌరవ్ కోసమేనా!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అయింది. ఫేక్ బాండింగ్స్ ఎక్కువయ్యాయి.. వాటిని తీసేయడానికే వెళ్తున్నాని హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది మాధురి. అయితే తనే తనూజతో బాండింగ్ ఏర్పరుచుకుంది.  ఇక ఎలిమినేషన్ జరిగే కొంచెం ముందు ఇచ్చిన బ్రేక్ టైమ్‌లో తనూజ దగ్గరికి రాము వెళ్లి ఎమోషనల్ అయ్యాడు. ప్లీజ్ అక్కా నీకు దండం పెడతా.. నా వల్ల ఒకరి లైఫ్ పాడైపోతుందంటూ తనూజని రిక్వె్స్ట్ చేశాడు రాము. నిజానికి రాము ఇంతగా తనూజని బతిమాలింది గౌరవ్ కోసం. ఎందుకంటే గౌరవ్‌ని రాము నామినేట్ చేసాడు. చాలా సిల్లీ రీజన్‌తో గౌరవ్‌ ని రాము సేఫ్ నామినేషన్ చేశాడు. ఇక తన వల్ల గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడేమోనని రాము భయపడ్డాడు. దీంతో తనూజని తన దగ్గర ఉన్న సేవింగ్ పవర్ యూజ్ చేసి మాధురిని సేవ్ చేయొద్దంటూ రాము రిక్వెస్ట్ చేశాడు. నీకు దండం పెడతా అక్కా అని రాము అడిగితే నేను కూడా నీకు దండం పెడతారా.. ఎలారా రామ్ ఇది గేమ్.. చిన్న పాయింట్ తెచ్చి నామినేషన్‌ చేసేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్.. నేను ఆలోచిస్తా రామ్ అని తనూజ చెప్పింది.  కూర్చో అక్కా ప్లీజ్ అంటూ రాము మళ్లీ బ్రతిమాలుతూనే ఉన్నాడు. దీంతో రామ్ ఒక్కటే రిక్వెస్ట్ నా గేమ్ నన్ను ఆడనివ్వు అని తనూజ అంది. నీకు నేను సపోర్ట్ చేస్తా అక్కా.. అని రాము అంటే నాకెవరి సపోర్ట్ వద్దంటున్నాను అయినా మాటల్లో చెప్పడం వేరు చేతల్లో చూపించడం వేరు.. కానీ నేను ఆలోచిస్తానని తనూజ చెప్పింది. ఎలిమినేషన్ రౌండ్ లో భాగంగా మాధురి, గౌరవ్ ఇద్దరి కళ్లకి గంతలు కట్టి కారులో ఎక్కించారు. ఇక ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మాధురి ఎలిమినేషన్ అని డిస్ ప్లే లో చూపించాడు నాగార్జున. ఇక తనూజని గోల్డెన్ బజర్ పవర్ ఉపయోగిస్తావా అని నాగార్జున అడుగగా లేదని తనూజ చెప్పడంతో మాధురి ఎలిమినేషన్ అయింది ‌.. గౌరవ్ కార్ లో లోపలికి వచ్చాడు. ఇక గౌరవ్ ని చూసి రాము ఎమోషనల్ అయ్యాడు. ఎక్కడ తను బయటకు పోతాడేమోనని రాము ఫుల్ టెన్షన్ పడ్డాడు. ‌అయితే తనూజ కాళ్లు మొక్కడం కరెక్ట్ కాదని రాముని ఆడియన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 

Duvvada Madhuri Remuneration: దువ్వాడ మాధురి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అయింది. ఏడో వారం భరణి ఎలిమినేషన్ అయి ఎనిమిదో వారం హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వగానే అందరు.. భరణి, మాధురిని కలిపి ట్రోల్స్ చేశారు. అయితే మాధురి ఎలిమినేషన్ తనే కావాలని కోరుకుందంట.   మాధురి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో రోజే పవన్ కళ్యాణ్ తో గొడవకి దిగింది. ఆ తర్వాత రేషన్ మేనేజర్ దివ్యతో గొడవ, ఆ తర్వాత సంజనతో గొడవకి దిగింది. ‌ఇక హౌస్ మేట్స్ ని ఇష్టమోచ్చినట్టు తిట్టడంతో తనకి నెగెటివిటీ పెరిగింది‌ ఇక అదే వారం హౌస్ నుండి పంపించాలని ఆడియన్స్ కోరుకున్నారు. కానీ ఆ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరు నామినేషన్లో లేకపోవడంతో తను సేవ్ అయింది. ఇక ఆ వారం వీకెండ్ లో నాగార్జున తన మీద ఫైర్ అవ్వడంతో తను కాస్త తగ్గింది. ఇక హౌస్ లో కిచెన్ దగ్గర ఉండే తనూజకి క్లోజ్ అయింది మాధురి. ఇక తనేమో రాజా అని మాధురి ఏమో రాజు అని‌ పిల్చుకోవడం మొదలెట్టారు. ఇక ఇద్దరు ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇక మాధురి ఎలిమినేషన్ అవ్వగానే తనని చూసి తనూజ ఏడ్చేసింది. ఆమె ఏడ్వడం చూసి మాధురి ఎమోషనల్ అయింది. మాధురి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మూడు వారాల వ్యవధిలో వారానికి మూడు లక్షలు వరకు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. మొత్తంగా తొమ్మిది లక్షలు వరకు మాధురి సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ మాధురి అని బయట ప్రచారం జరుగుతోంది. అయితే తనకి వచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డబ్బులు వికలాంగులు, క్యాన్సర్ రోగులు, పేద ప్రజలకు ఉపయోగపడాలి. మాకు దైవం ఇచ్చినదే చాలింది, ఈ మొత్తాన్ని సర్వీస్‌లో కలుపుతామని మాధురి అంది. 

Shivaji Buzz : భయం నా బ్లడ్ లోనే లేదు.. బజ్ ఇంటర్వ్యూలో మాధురి బోల్డ్ డైలాగ్స్!

  బిగ్‌బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అయింది. చివరి రౌండ్ లో గౌరవ్, మాధురి ఉండగా తనూజ తన గోల్డెన్ బజ్ పవర్ ని యూజ్ చేయకపోవడంతో మాధురి ఎలిమినేషన్ అయింది.  ఇక ఎలిమినేషన్ తర్వాత శివాజీ బజ్ ఇంటర్వ్యూకి వచ్చింది మాధురి. ఇక తను వచ్చీ రాగానే శ్రీజతో జరిగిన గొడవ గురించి ప్రస్తావించాడు శివాజీ. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి మాధవినా లేక మాధురీనా అని శివాజీ అనగానే.. నా పేరు మాధురి మాధవి కాదని తను చెప్పింది. ఇదే ఆ రోజు చెప్పుంటే మనకి గొడవ ఉండేది కాదు కదా ఆ అమ్మాయితో అని శివాజీ అనగానే.. అందరికీ ఎలా చెప్తాను.. నాకు నచ్చితే చెప్తానంటూ మాధురి సమాధానమిచ్చింది. 100 పర్సెంట్ నేను తెలుగు ఇళ్లల్లోకి వెళ్లాలి అనుకున్నారు.. అని శివాజీ అడిగితే వెళ్లాను.. అని మాధురి చెప్పింది. వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు.. అని శివాజీ సూటిగా అడిగాడు. నేను రావాలి అనుకున్నాను కాబట్టి వచ్చాను.. నాకు యాక్టింగ్ రాదు .. మాస్క్‌లు లేనే లేవు నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నా.. అని మాధురి చెప్పింది. అది ఎవరూ అడగలేదే.. అంటూ శివాజీ సెటైర్ వేశాడు.  బిగ్‌బాస్‌లో ఎప్పుడూ కూడా ఎంత పెద్ద తోపున్నా సరే.. అని శివాజీ ఏదో చెప్పబోతుంటే ఇప్పుడెవరూ తోపులని అనుకోవడం లేదు.. తోపు అనట్లేదు.. అని మాధురి ఫైర్ అయింది. నేను మీ గురించి అనట్లేదు మీరు తోపని ఎవరూ అనలేదు కానీ.. అంటూ శివాజీ కౌంటర్ ఇచ్చాడు.  బయటైతే జుట్టు పట్టుకొని ఈడ్చి కొడతా అన్నారు.. అలా ఎలా కొడతారండీ అని శివాజీ అడుగగా..‌ నాకు ఆటిట్యూడ్ ఉంది..‌ట్రిగ్గర్ అయితే నాకు కోపం వచ్చేస్తుందని మాధురి అంది. ఈ విధంగా మాట్లాడితే ఉండనిస్తారా ఆడియన్స్ అని శివాజీ అడుగగా.. ఉండనిస్తారా ఉండనివ్వరా అంటే ఆడియన్స్ ప్రకారమే నేను మాట్లాడాలా అంటూ మాధురి అంది. మీరు అందుకే ఇక్కడికి వచ్చారు కదా అని శివాజీ ఏదో అడిగితే నేను వెళ్లాలనుకున్నాను వెళ్లాను.. రావాలనుకున్నాను వచ్చానంటూ మాధురి సూటిగా చెప్పింది. అంటే ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయానంటే ఎలాగండీ.. అంటూ శివాజీ అన్నాడు. కూర్చోండి అన్నప్పుడు కూర్చోపోతే మాట్లాడరా అంటే అర్థమేంటి అని శివాజీ అడిగాడు. ఏ అంటే తప్పా అని మాధురి అంది. దీంతో శివాజీ ఏదో చెప్పబోతుంటే.. డాక్టర్ దగ్గరికెళ్తే ఏమన్నాడంటే గట్టిగా అరవకు.. గట్టిగా మాట్లాడకు.. నువ్వు మాట్లాడిన ప్రతిసారీ నీకు తెలీకుండా ఒక నెగెటివిటీ స్టార్ట్ అవుతుంది.. మీరు హౌస్‌లో కూర్చొని చేసే ప్రతీ వాదన భయపెట్టేలా ఉందని శివాజీ చెప్తుంటే మీకా అంటూ మాధురి అంది. దీంతో అమ్మా తల్లి నాకు కాదమ్మా.. లోపల ఉన్న సాయికి.. అని శివాజీ దండం పెట్టాడు. శ్రీజ రీఎంట్రీ ఇచ్చాక తనని చూసి కాస్త భయపడ్డట్టు అనిపించిందే ఒక దశలో అని శివాజీ అడిగాడు. భయమనేది నా బ్లడ్‌లో కూడా లేదండి అని మాధురి అనగానే సినిమా డైలాగ్ వద్దండి అని శివాజీ అన్నాడు. అది నా డైలాగ్ .. సినినా వాళ్ళు కాపీ కొట్టారని మాధురి అంది. అయినా నేను చాలావరకు కంట్రోల్ లో ఉన్నాను.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో నాకు తెలుసని మాధురి అనగానే మళ్ళీ సినిమా డైలాగ్ అని శివాజీ అన్నాడు. అయినా నాకు ఏది అనిపిస్తే అది చేస్తాను.. ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటానని మాధురి అంది. సరే అండి మీ ఇష్టమని శివాజీ అన్నాడు. 

Jayam serial : గంగ బాక్సింగ్ స్కిల్ చూసి ఇంప్రెస్ అయిన రుద్ర.. శకుంతల ఇచ్చిన ట్విస్ట్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'( Jayam).ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -101 లో..... గంగని పారు మనుషులు కిడ్నాప్ చేస్తారు. గంగని సేవ్ చెయ్యడానికి రుద్ర అక్కడికి వస్తాడు. రుద్ర ట్రైనింగ్ ఇచ్చినట్లు గంగ రౌడీలని కొడుతుంది. అది చూసి రుద్ర ఇంప్రెస్ అవుతాడు. అదేంటి గంగ అలా కొడుతుందని పారు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సూపర్ గంగ చాలా బాగా కొట్టావ్.. నువ్వు ట్రైనింగ్ తీసుకున్న బాక్సర్ లా కొట్టావని రుద్ర మెచ్చుకుంటాడు. అంతే అంటారా మీ ట్రైనింగ్ దూరం నుండి చూసే ఇలా నేర్చుకున్నానని గంగ అంటుంది. దూరం నుండి అయితేనే ఇలా ఉంది.. ఇక పర్ ఫెక్ట్ గా నేర్చుకుంటే ఇంకా ఎలా ఉంటుందోనని రుద్ర అంటాడు. ముందు మనం ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ కి వెళ్లి నన్ను ఎందుకు కిడ్నాప్ చేసారో కనుక్కోవాలని రుద్రతో గంగ అంటుంది. మరొకవైపు పారు, వీరు మాట్లాడుకుంటారు. ప్లాన్ ఫెయిల్ అయిందని పారు చెప్తుంది. ఈసారి కాకుంటే నెక్స్ట్ టైమ్ అని వీరు అంటాడు. ప్రాబ్లమ్ అది కాదు.. ఆ గంగ పెద్ద బాక్సర్ లాగా రౌడీలని కొట్టింది.. అలా రౌడీలని కొట్టడం చూసి రుద్ర ఇంప్రెస్ అయ్యాడు.. తన టాలెంట్ చూసి ట్రైనింగ్ ఇచ్చి బాక్సర్ ని చేస్తే పరిస్థితి ఏంటని వీరుతో పారు అంటుంది. ఆ తర్వాత నువ్వు శకుంతల అత్తకి నచ్చేలా ఉండాలి.. రుద్రకి భార్య అవ్వాలని వీరు చెప్తుంటే పారు షాక్ అవుతుంది. మరొకవైపు గంగ ఇంటికి వచ్చి రుద్ర గురించి చెప్తుంటే.. లక్ష్మీ తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత శకుంతల తన ఫ్యామిలీని తీసుకొని ఫామ్ హౌస్ కి వస్తుంది. ఎందుకు తీసుకొని వచ్చావని అందరు అడుగగా.. రుద్రకి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నానని అందుకు సంబంధించిన ఏర్పాట్లు అని అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Madhuri Elimination : మాధురి ఎలిమినేషన్.. తనూజ వెన్నుపోటు!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఒక్కో కంటెస్టెంట్ ఆటతీరు ఒక్కోలా ఉంటుంది. అప్పటిదాకా కలిసి ఉన్న ఇద్దరు ఆ తర్వాత గొడవ పడుతున్నారు. లేదా స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. ఎందుకంటే మాధురి, తనూజ క్లోజ్ అయ్యారు. కానీ మాధురి ఎలిమినేషన్ రౌండ్ లో ఉండగా తనని సేవ్ చేసే అవకాశం వచ్చినా తనూజ సేవ్ చేయలేదు. ఆ వివరాలేంటో ఓసారి చూసేద్దాం. సండే ఫన్ డే గేమ్స్ తో పాటుగా ఒక్కో సేవింగ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ‌ఇక చివరగా గౌరవ్, మాధురి ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు‌. ఇక మాధురి ఎలిమినేషన్ అయినట్లు  హౌస్ లోని డిస్ ప్లే లో కంటెస్టెంట్స్ కి చూపించాడు నాగార్జున.  ఇక తనూజ దగ్గరున్న గోల్డెన్ పవర్ యూజ్ చేసి మాధురిని సేవ్ చేస్తావా అని నాగార్జున అడిగాడు. అయితే తనూజ తన సేవింగ్ పవర్ ని వాడలేదు. దాంతో మాధురి ఎలిమినేట్ అయి గౌరవ్ ఒక్కడే హౌస్ లోకి వచ్చాడు. అతడిని చూసి రాము రాథోడ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక మాధురి బయటకు వచ్చిందని తనూజ ఎమోషనల్ అయింది.  మాధురి స్టేజ్ మీదకి రాగానే ఎక్స్‌పెక్ట్ చేశారా.. అని నాగార్జున అడిగారు. చేశా సర్ నిజానికి ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నా.. ఎల్లుండి నవంబర్ 4 మా ఆయన బర్త్‌ డే సర్.. అని మాధురి చెప్పింది. ఓహో అంటూ నాగార్జున నవ్వారు. కానీ హౌస్ చాలా బావుంది.. హౌస్ నాకు చాలా నేర్పించింది.. చాలా నేర్చుకున్నానని మాధురి చెప్పింది. సరే మీ జర్నీ చూద్దామంటూ ఏవీ ప్లే చేశారు. ఏవీ చివరిలో చూస్తూ మాధురి ఎమోషనల్ అయింది. లైఫ్ లాంగ్ మెమోరీ సర్ అంటు మాధురి చెప్పింది. ఇక స్క్రీన్ మీద హౌస్‌మేట్స్‌ని చూపించగానే ఏమ్మా తనూజ అంత ఫీలవుతున్నావని నాగార్జున అడిగారు. అనుకోకుండా క్లోజ్ అయిపోయింది సర్.‌ తను రాక్షసి కానీ చాలా మంచిది సర్.. అని తనూజ చెప్పింది.  ఇక హౌస్ లో రోజ్ ఎవరు ముళ్ళు ఎవరో చెప్పమంటూ నాగార్జున అడుగగా.. మొదటిది తనూజకి ఇచ్చింది మాధురి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ ల కి రోజ్ ఇచ్చింది మాధురి. ఇక ముళ్ళు ఎవరికి ఇస్తావని నాగార్జున అడుగగా.. భరణికి మొదటి ముళ్ళు గిఫ్ట్ గా ఇచ్చింది. తను ఫేక్ గా ఉంటున్నాడని, అందరు వెన్నుపోటు పొడిస్తే ఈయన డైరెక్ట్ గానే పొడుస్తాడని మాధురి అంది. ఆ తర్వాత దివ్యకి ముళ్ళు ఇచ్చింది. తన గేమ్‌ కంటే కూడా పక్కవాళ్ల గేమ్‌పైనే ఎక్కువ కాన్సట్రేషన్ పెడుతుంది.. పక్కవాళ్ల గేమ్ ఎక్కువ ఆడటానికి ట్రై చేస్తుంటుంది.. వాళ్ల వాయిస్ కూడా ఆమే అయిపోతుంది.. అవన్నీ తగ్గించుకొని ఆడితే బావుంటుంది సర్ అని మాధురి చెప్పింది. ఇక ఆ తర్వాత మాధురికి బై చెప్పేసి పంపించేశాడు. 

Bigg Boss Telugu 9: ప్యాక్ యువర్ బ్యాగ్ డీమాన్.. డోర్స్ ఓపెన్ చేసిన బిగ్ బాస్!

  బిగ్ బాస్ సీజన్-9 లో నాగార్జున వచ్చీ రాగానే సంజనకి క్లాస్ తీసుకున్నాడు. మాధురి, భరణిల మధ్య జరిగిన బిర్యానీ గొడవ గురించి డిస్కస్ చేశాడు‌. ఆ తర్వాత దివ్య కెప్టెన్ అయినందున తనకి కంగ్రాట్స్ తెలిపాడు.   ఆ తర్వాత డీమాన్ పవన్ ని లేవమని చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత డోర్లు తెరవండి.. ప్యాక్ యువర్స్ బ్యాగ్ అంటూ డీమాన్ పవన్ కి నాగార్జున చెప్పడంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు. రీతూ చౌదరి అయితే కన్నీళ్ళు పెట్టుకుంది. తన తప్ఫేం లేదు సర్ అని ఏడ్చేసింది.    మాధురి గారు నామినేషన్స్ అప్పుడు మీ ఇద్దరిదీ అన్ హెల్దీ బాండ్ అని చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. మీ బాండింగ్‌ని అన్ హెల్దీ అని అనడానికి ఆమెకి ఏం హక్కు ఉందని అనిపించింది. కానీ.. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే.. మీది ఖచ్చితంగా అన్ హెల్దీ బాండింగ్ అనే అనిపిస్తుందని నాగార్జున చెప్పాడు. నో సర్.. నో అని రీతు అన్నది. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది రీతూకి మాత్రమే కాదు.. హౌస్‌లో ఉన్న ఆడియన్స్‌కి.. చూసే ఆడియన్స్‌కి క్షమాపణ చెప్పమని డీమాన్ తో నాగార్జున అన్నాడు.   ఇక మోకాళ్లపై కూర్చున్నాడు డీమాన్.. నేను అలా చేసి ఉండకూడదు. ఫ్యూచర్‌లో రిపీట్ చేయను. మీరు నాకు వేరే ఎలాంటి శిక్ష వేసినా భరిస్తానని డీమాన్ క్షమాపణ చెప్పాడు. ఇదే మాట రీతూ చౌదరికి కూడా చెప్పు అన్నాడు నాగార్జున. దాంతో డీమాన్.. రీతూ చౌదరి కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. ఓ పక్క రీతూ.. లే పవన్ అని అంటున్నా కూడా.. మోకాళ్లపైనే కూర్చుని ఆమె చేతుల్ని పట్టుకుని.. రీతూ.. సారీ.. నిన్ను తోసి ఉండకూడదు.. ఫ్యూచర్‌లో మళ్లీ ఇలా చేయనని మోకాళ్లపై కూర్చుని క్షమాపణ చెప్పాడు డీమాన్.   ఇది లైఫ్ లెస్సన్ పవన్.. నీకోసం హౌస్ మొత్తం స్టాండ్ తీసుకున్నారు.. నీ క్యారెక్టర్‌కి సర్టిఫికేట్ ఇచ్చారు.. నువ్వు కూడా అవతల వాళ్ల క్యారెక్టర్‌పై నింద పడినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలంటూ నాగార్జున చెప్పాడు. మరి డీమాన్, రీతూ  మధ్య జరిగిన గొడవలో ఎవరిది తప్పో కామెంట్ చేయండి.  

రామరాజు ఇంట దీపావళి సెలబ్రేషన్స్.. భద్రవతి డిజప్పాయింట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -305 లో.. వేదవతి ఇంకా తన ముగ్గురు కోడళ్ళు కలిసి శోభని వెతుక్కొని తీసుకొని వచ్చి ధీరజ్ ని విడిపిస్తారు. థాంక్స్ అన్నయ్య.. మీరు నన్ను కాపాడారు కానీ ఆ విషయం మా నాన్నకి తెలియక మీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని ధీరజ్ తో శోభ అంటుంది. చూసారా నా కొడుకులని తప్పు చేసేలా పెంచలేదు.. అది నా కొడుకులు అంటే అని రామరాజు తన కొడుకుల గురించి గొప్పగా చెప్తాడు.   మరొకవైపు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది విశ్వ.. ఆ రామరాజు ఇల్లు చీకటి అయిందని భద్రవతి అంటుంది. ఇప్పుడే మనకి అసలైన దీపావళి అని సేనాపతి అంటాడు. అందరూ సంతోషంతో క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. అప్పుడే రామరాజు కుటుంబం దీపావళి సెలబ్రేషన్స్ కి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి భద్రవతి కుటుంబం షాక్ అవుతుంది. నా కొడుకు గురించి ఎవరో తప్పుగా మాట్లాడారు.. వాడు ఒక అమ్మాయి జీవితం కాపాడాడని ధీరజ్ గురించి రామరాజు గొప్పగా చెప్తాడు. ఇప్పుడు మొదలు పెట్టండ్రా టపాసులు పేల్చడం అని రామారాజు అనగానే ధీరజ్ టపాసులు స్టార్ట్ చేస్తాడు.    ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి థాంక్స్ అని చెప్తాడు. నాకు ఇలా హెల్ప్ చెయ్యడం అలవాటు అని ప్రేమ కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. అసలు ఎలా ఆ శోభని సేవ్ చేశారని ధీరజ్ అడుగుతాడు. నాలో కూడా పోలీస్ దాగుంది అని ప్రేమ అనగానే ధీరజ్ నవ్వుతాడు. నీ హైట్ కి పోలీస్ అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. దమ్ముంటే రేపు ఇద్దరం రన్నింగ్ రేస్ చేద్దామని ప్రేమ, ధీరజ్ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు.   ఆ తర్వాత నర్మద దగ్గరికి సాగర్ వస్తాడు. చాలా థాంక్స్ నువ్వు ధీరజ్ ని సేవ్ చేసావని నర్మదని సాగర్ పొగుడుతాడు. తరువాయి భాగంలో ధీరజ్ ప్రొద్దున నిద్ర లేవకపోయేసరికి ప్రేమ వచ్చి వాటర్ కొట్టి నిద్ర లేపుతుంది. ఇద్దరు కలిసి మార్నింగ్ వాకింగ్ కి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ముగిసిన ఇండియన్ ఐడల్ సీజన్ 4.. విన్నర్ గా  లేడీ రాక్ స్టార్ బృందా

  ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఫైనల్స్ కి వచ్చేసింది. ఫైనలిస్టులందరినీ స్టేజి మీదకు పిలిచారు. బృందా, సృష్టి చిల్ల, పవన్ కళ్యాణ్, ధీరజ్, స్నిగ్ధ, కూర్మ సహస్ర వీళ్లంతా అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో మంచి సాంగ్స్ పాడి అందరినీ అలరించారు.    ఐతే ఈ ఆరుగురిలో టాప్ 3 లోకి పవన్ కళ్యాణ్, బృంద, ధీరజ్ ఎంపికయ్యారు. ఫైనల్ సాంగ్ గా బాయ్స్ మూవీ నుంచి "సరిగమే పదనిసే" అనే చరణాన్ని ముగ్గురూ పాడి జడ్జెస్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నారు.    ఇక విన్నర్స్ ని అనౌన్స్ చేశారు. ఫస్ట్ రన్నరప్ గా పవన్ కళ్యాణ్ ని సెలక్ట్ చేశారు. అతనికి 5 లక్షల కాష్ ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ సీజన్ ట్రోఫీని బృందా గెలుచుకుంది. ఆహా సి.ఈ.ఓ, థమన్, కార్తీక్ వచ్చి ట్రోఫీ ఇచ్చి 10 లక్షల కాష్ ప్రైజ్ ని అందించారు. ఇక ఈ సీజన్ ఇలా ముగిసిపోయింది.    సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో ఎప్పుడు ఎండ్ అయ్యిందో కూడా తెలీనట్టుగా ఈ సీజన్ ముగిసిపోయింది. ఇక ఈ సీజన్ లో చాలామంది కంటెస్టెంట్స్ కి థమన్, కార్తిక్ కలిసి సినిమాల్లో పాడే అవకాశాలు అలాగే కన్సర్ట్స్ కి కూడా షో స్టాపర్స్ గా ఉండే ఛాన్స్ లు ఇచ్చారు.    

Bigg Boss 9 Telugu: బిర్యానీ కోసం అలిగిన మాధురి.. బ్రతిమిలాడిన భరణి!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం వీకెండ్ వచ్చేసింది. నాగార్జున ఫైర్ మీద కాకుండా కూల్ గా వచ్చాడు. ఇక వచ్చీరాగానే శుక్రవారం నాడు జరిగిన టాస్క్ ని చూపించాడు. థమ్స్ అప్ టాస్క్ అది.. ఆ టాస్క్ లో భరణి టీమ్  గెలుస్తుంది. వాళ్ళు బిర్యానీతో పాటుగా కూల్ డ్రింక్స్ గెల్చుకుంటారు. భరణి తన టీమ్ లోని మెంబర్స్ కి బిర్యానీ సర్వ్ చేస్తాడు. అప్పుడే ఆపోజిట్ టీమ్ అయిన మాధురి ప్లేట్ తీసుకొని భరణి దగ్గరికి వస్తుంది. ఒక నిమిషం మాధురి గారు మా టీమ్ వాళ్ళకి వేసాక వేస్తానని భరణి అంటాడు. దాంతో మధురి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.   మాధురి దగ్గరికి భరణి వచ్చి తినడానికి రండి అని అంటాడు. వద్దని మాధురి అంటుంది. ప్రతీ చిన్న విషయానికి మీరు ఇలా చెయ్యొద్దు మాధురి గారు అని భరణి అంటాడు. ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది.. ప్లేట్ పట్టుకొని తినడానికి నిల్చుంటే అలా వద్దని ఎవరైనా అంటారా అని మాధురి బాధపడుతుంది. భరణిని మాధురి అడుగుతుంటే దివ్య మధ్యలో ఇన్వాల్వ్ అయి ఏదో మాట్లాడుతుంటే.. నేను నీతో ఏం మాట్లాడట్లేదు.. నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని దివ్యపై మాధురి కోప్పడుతుంది.   ఆ తర్వాత భరణి దగ్గరికి తనూజ వచ్చి.. మీ విషయాల్లో ప్రతీ దాంట్లో ఎందుకు తను ఇన్వాల్వ్ అవుతుంది. టాస్క్ పరంగా అయితే ఒకేగానీ ఇలా ప్రతీదానికి తనే ముందకూ వస్తుంటే చూసేవాళ్ళకి చిరాకుగా ఉంటుందని భరణికి తనూజ సలహా ఇస్తుంది. అదే టాపిక్ గురించి వీకెండ్ లో నాగార్జున అడుగుతాడు. నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావ్ దివ్య.. అసలు అక్కడ నీ అవసరం ఏముందని నాగార్జున అడుగుతాడు. గొడవ అవుతుంది కదా.. కెప్టెన్ గా కూల్ చేద్దామని ట్రై చేశానని దివ్య వివరణ ఇస్తుంది.  

సుమిత్ర, దశరథ్ ల పెళ్ళిరోజుని సెలబ్రేట్ చేసిన కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -504 లో... సుమిత్ర, దశరథ్ ఇద్దరు ఇంట్లోకి వస్తారు. సుమిత్ర వచ్చిందంటే కారణం కార్తీక్ అని అందరు పొగుడుతుంటే జ్యోత్స్న కోపంగా పైకి వెళ్తుంది. తనతో పాటు తన వెనకాలే పారిజాతం వెళ్తుంది.    ఏంటే మీ అమ్మ వచ్చింది కనీసం దగ్గరికి కూడ వెళ్ళాలేదని పారిజాతం ఆడుగుతుంది. కనీసం మా మమ్మీ నా మొహం కూడా చూడలేదని జ్యోత్స్న కోప్పడుతుంది. ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని రిక్వెస్ట్ చెయ్.. నువ్వు తప్పు చేసావ్.. ఇప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు.. నువ్వు చేసిన తప్పు మర్చిపోతారని పారిజాతం అంటుంది. జ్యోత్స్నని పారిజాతం కిందకి తీసుకొని వెళ్తుంది.    మరొకవైపు స్వప్న, కావేరి ఇద్దరు సుమిత్ర గురించి టెన్షన్ పడుతుంటే.. స్వప్నకి కార్తీక్ మెసేజ్ చేస్తాడు. సుమిత్ర అత్త ఇంటికి వచ్చింది.. అందరం ఇక్కడే ఉన్నామని.. మీరు రండీ అని కార్తీక్ మెసేజ్ చేస్తాడు. దాంతో స్వప్న హ్యాపీగా ఫీల్ అయి వాళ్ళ అమ్మకి చెప్తుంది. మనం వెళదామని స్వప్న, కాశీ అంటారు. వద్దని కావేరి అంటుంది.    మరొకవైపు పాపం జ్యోత్స్న పైకి వెళ్లి వాళ్ళ అమ్మ గురించి బాధపడుతుంటే తీసుకొని వచ్చానని పారిజాతం కవర్ చేస్తుంది. తనకి కౌంటర్ వేస్తూ కార్తీక్ మాట్లాడతాడు. ఆ తర్వాత సుమిత్ర జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. దీప లేకపోయి ఉంటే నేను ఇలా మీ అందరి ముందు ఉండేదాన్ని కాదని సుమిత్ర అంటుంది.   నేను చెప్పాను కదా మమ్మీ గురించి దీపకి తెలుసని జ్యోత్స్న అంటుంది. ఏది ఏమైనా సుమిత్ర ఇంటికి వచ్చిందంటే అది ఖచ్చితంగా దీప, కార్తీక్ వల్లనే అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ ల పెళ్లి రోజుని కార్తీక్ సెలబ్రేట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Jayam serial: గంగకి పట్టీలు గిఫ్ట్ గా ఇచ్చిన రుద్ర.. ఫ్లాప్ అయిన వీరు కిడ్నాప్ ప్లాన్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -100 లో... రుద్ర ఇచ్చిన పట్టీలు  చూసి గంగ మురిసిపోతుంది. అవి నీకు ఎక్కడివి అని లక్ష్మీ అడుగుతుంది. ఒకరు గిఫ్ట్ ఇచ్చారని గంగ చెప్తుంది. అప్పుడే పైడిరాజు వస్తాడు. ఎక్కడ ఆ పట్టీలు చూస్తాడో అని తల్లికూతుళ్లు ఆ పట్టీలు అతని కంట పడకుండా జాగ్రత్తపడతారు.    మరొకవైపు రుద్ర ఇంటికి వస్తాడు. పెద్దసారుతో మాట్లాడుతుంటే రుద్రకి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతుంటే రుద్ర జేబులో నుండి పట్టీలు కొన్న రిసీప్ట్ కిందపడుతుంది. అది చూసి నువ్వు పట్టీలు తీసుకున్నావా.. ఎవరికి అని పెద్దసారు అడుగుతాడు. గంగకి తీసుకున్నా.. తను నాకూ అకాడమీ విషయంలో హెల్ప్ చేసింది.. డబ్బు ఇస్తే తీసుకోలేదు.. అందుకే గిఫ్ట్ ఇచ్చానని రుద్ర చెప్తాడు. అదంతా శకుంతల వింటుంది. స్వామి అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది.    మరొకవైపు గంగకి మార్టిన్ కనిపిస్తాడు. ఆ విషయం రుద్రకి గంగ ఫోన్ చేసి చెప్తుంది. అంతలోనే గంగని వీరు మనిషి కిడ్నాప్ చేస్తాడు. గంగ ఏదో ప్రాబ్లమ్ లో ఉందని రుద్రకి అర్థమవుతుంది. మరొకవైపు శకుంతల, ఇషిక ఇద్దరు లక్ష్మీ దగ్గరికి వస్తారు. నీ కూతురు నా ఇంటికి కోడలు కావాలని చూస్తుంది. నిన్న రుద్ర ఇచ్చిన పట్టీలు తీసుకుందని శకుంతల చెప్తుంది‌. శకుంతల ఇరవై రూపాయలు ఇచ్చి ఇది మీ స్థాయి అని చెప్తుంది. దాంతో లక్ష్మీ హర్ట్ అవుతుంది. ఇంకెప్పుడు మా గంగ మీ ఇంటివైపు రాదని వాళ్ళతో లక్ష్మీ చెప్తుంది.   మరొకవైపు రౌడీలు గంగని తీసుకొని వెళ్తారు. గంగని సేవ్ చెయ్యడానికి రుద్ర వస్తాడు. అమ్మాయిని కిడ్నాప్ చేసినవాళ్ళు తన దగ్గర ఫోన్ లాక్కోవాలి కదా లొకేషన్ ట్రేస్ చేసి వచ్చాను.. మీరంతా ప్రొఫెషనల్ కిడ్నాపర్లు కాదా అని రుద్ర అంటాడు. గంగ నన్ను ఫాలో అవుతూ వాళ్ళని కొట్టు అని గంగకి రుద్ర ట్రైనింగ్ ఇస్తాడు. తరువాయి భాగంలో గంగ మెడలో తాళి కట్టమని పెద్దసారు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: వాళ్ళిద్దరూ కలిసి రాహుల్ బండారం బయటపెడతారా.. జస్ట్ మిస్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -867 లో... రాజ్, కావ్య ముసలి వాళ్ళ గెటప్ లో వచ్చి కోయిలి టెంప్ట్ అయ్యే విధంగా మాట్లాడుతారు. ఇక మేమ్ వెళ్తాము ఆస్తులన్నీ ఎవరికైనా రాసిచ్చేస్తామని కావ్య అనగానే వద్దు బామ్మా గారు మీరు ఇక్కడే ఉండండి అని కోయిలి అంటుంది. నువ్వు మమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నావా.. మమ్మల్ని బాగా చూసుకుంటావ్.. అలాగే ఆస్తులు కూడా బాగా చూసుకుంటావని అర్థమవుతుందని కావ్య అంటుంది.   ఆ తర్వాత రాజ్, కావ్యని రాహుల్ బయటకు తీసుకొని వస్తాడు. అసలు మీరెందుకు వచ్చారని రాహుల్ అడుగతాడు. గుర్తు పట్టేశావా అని రాజ్ అంటాడు. నువ్వు మాతో రావాలని రాజ్ అంటాడు. నేను రాను.. మీ గురించి వెళ్లి కోయిలికి చెప్తానని రాహుల్ అనగానే చెప్పు మేమ్ కూడా నీ గురించి చెప్తాము.. ఇంట్లో నీ స్థాయి ఏంటో చెప్తామని రాజ్, కావ్య బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రాహుల్ సైలెంట్ గా ఉంటాడు.    అప్పుడే రాజ్, కావ్యలకి కోయిలి కాఫీ తీసుకొని వస్తుంది. అది తాగి ఏం బాలేదని చెప్తారు. తమకి భోజనం ఏర్పాట్లు చేయమని రాజ్, కావ్య ఇద్దరు ఒక పెద్ద లిస్ట్ నే చెప్తారు. అది చూసి కోయిలి, రంజిత్ షాక్ అవుతారు. వాళ్ళు పక్కకు వచ్చి మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏంటి అంత ఆర్డర్ చేశారు.. ఇప్పటికే మనం అప్పుల్లో ఉన్నామని రంజిత్ అంటాడు. ఎన్ని ఖర్చు పెట్టినా అన్నీ వసూలు చెస్తాను కదా అని కోయిలి అంటుంది.   మరొకవైపు రాజ్, కావ్య రూమ్ కి వెళ్లి గెటప్ తీసేస్తారు. అప్పుడే అటుగా వెళ్తు రంజిత్ చూస్తాడు. మళ్ళీ వెనక్కి వచ్చి చూసేసరికి రాజ్, కావ్య ఇద్దరు ఓల్డ్ గెటప్ లో ఉంటారు. ఆ తర్వాత రంజిత్ వెళ్లిపోతాడు. అమ్మో జస్ట్ మిస్.. వాడిని చూసాను కాబట్టి మేనేజ్ చేసాం.. లేదంటే దొరికిపోయేవాళ్ళమని రాజ్ అంటాడు. మరొకవైపు స్వప్న బాధపడుతుంటే.. అప్పు వచ్చి తనతో మాట్లాడుతుంది.    తరువాయి భాగంలో రాజ్, కావ్య యాక్టింగ్ లో భాగంగా రాజ్ తన ఫ్రెండ్ ని రంగంలోకి దించుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss 9 Telugu: శ్రీజ ఎలిమినేషన్.. ‌భరణి కోసం ఆమెకు అన్యాయం!

  బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ ఛాన్స్ అంటే మాములు విషయం కాదు. శ్రీజ ఆరో వారం అనుకోకుండా ఎలిమినేట్ అయింది. అది ఆడియన్స్ ఓటింగ్ తో పని లేకుండా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ ఒపీనియన్ ద్వారా శ్రీజ ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఆ తర్వాత శ్రీజ ఎలిమినేట్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. స్టూడియో ముందు గొడవలు కూడా జరిగాయి. గొడవ ముదిరే కొద్దీ బిగ్ బాస్ టీమ్ శ్రీజని రీఎంట్రీ ఇస్తున్న గాసిప్ లీక్ అయింది.   అంతా బానే ఉంది.. కానీ అక్కడ అన్యాయం జరిగింది శ్రీజకి.. తనని రీఎంట్రీ ఇవ్వడంలో న్యాయం ఉంది.. కానీ మళ్ళీ భరణిని రీఎంట్రీ ఎందుకు చేసారు. చేస్తే చేసారు.. అన్యాయం జరిగిన శ్రీజనే మళ్ళీ ఎందుకు ఎలిమినేట్ చేసారని బిగ్ బాస్ ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీజ రెండోసారి హౌస్ లో నుండి వచ్చాక.. ఒక వీడియో పోస్ట్ చేసింది. నేను మళ్ళీ రెండోసారి హౌస్ నుండి బయటకు వచ్చాను.. భరణి గారు ప్రేక్షకుల ఓటింగ్ ద్వారానే బయటకు వచ్చారు.. నాకు అక్కడ అన్యాయం జరిగింది. నేను, భరణి గారు హౌస్ లోకి ఎంట్రీ వచ్చేటప్పుడు.. గేట్ ఓపెన్ చేసే వాళ్ళు భరణి గారితో మాట్లాడారు. ఈసారి అయినా బాగా ఆడండి భరణి గారు.. బాగా ఆడండి.. ఉంటారు కదా అని అక్కడున్న వాళ్లు అన్నారు. అప్పుడే నాకు అర్థం అయింది.. నేను ఎంత బాగా ఆడినా నేనే బయటకు వస్తానని శ్రీజ ఆ వీడియోలో చెప్పింది.   నేను ఒక కామనర్ గా వెళ్ళాను కాబట్టి ఇలా చేశారు.. అదే సెలబ్రిటీ అయితే ఇలాగే చేస్తారా అనే తంబ్ నెయిల్ తో శ్రీజ వీడియో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కి అందరు శ్రీజకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేసినా శ్రీజకి అన్యాయం అయితే జరిగింది కదా.... సో ఫైనల్ గా బిగ్ బాస్ ఏది అనుకుంటే అది చేస్తాడు. ఇందులో నో డౌట్ అని మరొకసారి ఋజువు అయింది అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.  

డేంజర్ జోన్ లో ఆ నలుగురు.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం చాలా మార్పులు జరిగాయి. హౌస్ లోకి ఇప్పటివరకు ఎలిమినేషన్ అయి బయటకు వెళ్ళిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్లు చేయగా.. శ్రీజ, భరణి ఇద్దరు హౌస్ లోకి  రీఎంట్రీ ఇచ్చారు. ‌ఇక వీరిద్దరి మధ్య టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. భరణి , శ్రీజ ఇద్దరిలో ఆడియన్స్ ఓటింగ్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే పర్మినెంట్ హౌస్ మేట్ అనే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఇందులో భరణికి ఎక్కువగా ఓటింగ్ రావడంతో తను పర్మినెంట్ హౌస్ మేట్ అయ్యాడు. శ్రీజ ఎలిమినేట్ అయ్యుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కోసం పోటీ జరగగా.‌. అందులో దివ్యకు మెజారిటీ హౌస్ మేట్స్ సపోర్ట్ చేయడంతో తను హౌస్ కి కొత్త కెప్టెన్ అయింది. ఇక హౌస్ లో ఈ వారం తనూజ, రాము రాథోడ్, సంజన గల్రానీ, కళ్యాణ్ పడాల, రీతూ చౌదరి, డీమాన్ పవన్, గౌరవ్ నామినేషన్లో ఉన్నారు. ఇక వీరిలో ఈ వారం హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యేదెవరో ఓసారి చూసేద్దాం. తనూజకి అత్యధిక ఓటింగ్ పడింది. ముప్పై ఒక్క శాతం ఓటింగ్ తో తనూజ టాప్ లో ఉండగా, పదిహేడు శాతం ఓటింగ్ తో కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానంలో రాము రాథోడ్, నాల్గవ స్థానంలో సంజన గల్రానీ ఉంది. ఇక చివరి నాలుగు స్థానాలలో అంటే డేంజర్ జోన్ లో ఉన్నారు.  డీమాన్ పవన్, రీతూ చౌదరి, దువ్వాడ మాధురి, గౌరవ్ గుప్తా లీస్ట్ లో ఉన్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే గౌరవ్, రీతూ చౌదరి ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. లేదంటే కంటెంట్ కావాలంటే రీతూని ఎలిమినేషన్ నుండి తప్పించి డీమాన్ పవన్ ని ఎలిమినేషన్ చేస్తారు. లేదంటే సింగిల్ ఎలిమినేషన్ గా గౌరవ్ ని చేసే అవకాశం ఉంది. అయితే దువ్వాడ మాధురికి కూడా ఓటింగ్ తక్కువే ఉంది‌ కానీ తను కంటెంట్ ఇస్తుంది సో ఎలిమినేషన్ చేసే అవకాశాలు అయితే లేవు. ఎనిమిదో వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పవన్ కళ్యాణ్ పెద్ద పులిహోర రాజ!

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. ఇక ఫైనల్స్ కి డాలస్ డైనమైట్ స్నిగ్ద, లేడీ రాక్ స్టార్ బృంద, పవన్ కళ్యాణ్, కూర్మ సహస్ర, ధీరజ్ సెలెక్ట్ అయ్యారు. ఇక ఈ ఫినాలే ఎపిసోడ్ కి మాస్ మహారాజని ఇన్వైట్ చేశారు. ఐతే శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. మద్యమద్యలో రవితేజ వేసే జోకులతో అందరిలో ఎనర్జీ వచ్చింది. ఐతే రవితేజ ఈ కంటెస్టెంట్స్ కోసం ఒక స్పెషల్ సెగ్మెంట్ ని ప్లాన్ చేశారు. అదేంటంటే డైమండ్ లాంటి పెర్ఫార్మెన్సెస్ ని గుర్తించి అవార్డ్స్ అందించారు. అవే "ఆహా పెర్ఫార్మెన్స్ అవార్డ్స్" అన్నమాట. ఇక రవితేజ స్టేజి మీదకు వెళ్లి కంటెస్టెంట్స్ కి ఈ అవార్డ్స్ ని అందించారు. ముందుగా బెస్ట్ స్పీకర్ అవార్డు ఇవ్వబోతున్నాం అని ఒక మైక్ తీసుకుని కూర్మ సహస్రని ఇన్వైట్ చేశారు. "బేసిక్ ఈ అవార్డుని సహస్రకి ఎందుకు ఇస్తున్నామంటే ఆవిడ చాలా అనుకుంటారు కానీ అవన్నీ లోపలే ఫినిష్ ఐపొతాయి బయటకు రావు" అని చెప్పాడు హోస్ట్ శ్రీరామ్. ఐతే రేస్ గుర్రంలో శృతి హాసన్ క్యారక్టర్ అనుకుంటా అని రవితేజ కామెడీ చేశారు.   "బెస్ట్ బొమ్మ అవార్డు" అని చెప్పగానే స్నిగ్ధ అని పిలిచారు రవి తేజ. తర్వాత "బెస్ట్ బిస్కెట్ అవార్డు" డెఫినిట్ గా ధీరజ్ ఉంటాడు అంటూ రవితేజ గెస్ చేసి పిలిచి ఒక పెద్ద బిస్కెట్ ని అవార్డుగా ఇచ్చారు. "బెస్ట్ రాకెట్ అవార్డు" అని చెప్పి సృష్టిని పిలిచారు రవితేజ. బ్యాక్ టు బ్యాక్ ఫారెన్ నుంచి ఫినాలే వరకు వచ్చినందుకు సృష్టి చిల్లకు బెస్ట్ రాకెట్ అవార్డుని అందించారు. "బెస్ట్ రాక్ స్టార్ అవార్డు" అంటూ బృందాని పిలిచారు రవితేజ. ఒక రాయి మీద ఒక స్టార్ ని పెట్టి ఆ అవార్డుని అందించారు. తర్వాత "బెస్ట్ పులిహోర రాజ అవార్డు" నేను గెస్ చేస్తా అంటూ పవన్ కళ్యాణ్ ని స్టేజి మీదకు పిలిచి ఒక బాక్స్ లో పులిహోర పెట్టి అదే అవార్డుగా ఇచ్చి ఎవరెవరితో పులిహోర కలుపుతావో వాళ్లందరితో కలిసి తినండి అన్నారు. ఫైనల్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అవార్డుని హోస్ట్ శ్రీరామ్ కి ఇచ్చారు. తర్వాత తన పాటలతో, రీల్స్ తో జనాలని సోషల్ మీడియాలో అలరించింది అలాగే ఈ సీజన్ కి యాంకర్ గా వచ్చి ఇక్కడి ఆడియన్స్ ని కూడా బాగా అలరించింది కాబట్టి బెస్ట్ డెబ్యూటేన్ట్ గా సమీరా భరద్వాజ్ కి కూడా అవార్డుని అందించారు.

Brahmamudi : రాహుల్, కావ్యల మాటలకి టెంప్ట్ అయిన కోయిలి.. రంజిత్ చూసేశాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -866 లో...... రంజిత్, కోయిలి మాట్లాడుకుంటారు. ఎలాగైనా ఆ ఇంటికి కోడలు అయి ఆస్తులన్నీ లాగేసుకుంటానని రంజిత్ తో కోయిలి అంటుంది. అప్పుడే రాహుల్ బ్యాగ్ తో ఎంట్రీ ఇస్తాడు. ఏంటి రాహుల్ ఈ టైమ్ లో వచ్చావ్.. చేతిలో ఈ బ్యాగ్ ఏంటని రాహుల్ ని కోయిలి అడుగుతుంది. నన్ను అక్కడ అర్ధం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు.. అందుకే అక్కడ నుండి వచ్చేసానని రాహుల్ అనగానే అలా ఎందుకు వచ్చావ్.. నీ కుటుంబం చూసే కదా నేను నిన్ను లవ్ చేసింది అని కోయిలి అనగానే రాహుల్ షాక్ అవుతాడు. అంటే నాకు కుటుంబం లేదు.. మీలాంటి ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నా కోరిక అని రాహుల్ కవర్ చేస్తుంది. రాహుల్ కి అక్కడ ఉండబుద్ది కాలేదేమో వచ్చేసాడు.. పర్లేదులే నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో రాహుల్ అని రంజిత్ అనగానే రాహుల్ లోపలికి వెళ్తాడు. వీడెంటి ఇలా చేసాడని కోయిలి అంటుంది. మెల్లగా మ్యానిపులేట్ చేసి వాడిని నువ్వే పంపించు అని కోయిలితో రంజిత్ అంటాడు. మరొకవైపు అసలు ఇంతలా ఎవరు రాహుల్ ని మార్చేసింది.. ఎవరని ఇంట్లో వాళ్లంతా ఆలోచిస్తూ ఉంటారు. అది ఎవరో కనుక్కోమని అప్పుకి చెప్పానని కావ్య అంటుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. అది ఎవరో కనుక్కున్నాను అక్క.. తన పేరు కోయిలి అని, తన గురించి అప్పు మొత్తం చెప్తుంది. దాంతో రాహుల్ కి, వాళ్ళకి ఎలా బుద్ది చెప్పాలో మాకు తెలుసు అని కావ్య, రాజ్ అంటారు. మరొకవైపు రాహుల్ ని ఇంటికి వెళ్ళడానికి రంజిత్, కోయిలి కన్విన్స్ చేస్తారు. నేను ఇంటికి వెళ్లను.. నాకు ఎవరు లేరని రాహుల్ అంటాడు. అప్పుడే రాజ్, కావ్య ముసలి వాళ్ళ గెటప్ లో ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. నీకు ఎవరు లేకపోవడం ఏంట్రా.. భార్య ఇంకా ఇంటికి వద్దనుకొని వచ్చావని రాజ్ అంటాడు. నో డౌట్ వీళ్ళు కచ్చితంగా రాజ్, కావ్య అని రాహుల్ అనుకుంటాడు. మేమ్ ఇక్కడ నీతో పాటు ఉంటాం.. ఆస్తులన్నీ ఎవరు చూసుకుంటారు.. మీ చేతుల్లో పెట్టాలని అనుకుంటున్నామని కావ్య అంటుంది. దాంతో కోయిలి టెంప్ట్ అయి వాళ్ళతో మంచిగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్య  రూమ్ లోకి వెళ్లి గెటప్ లు తీసేస్తారు. వాళ్ళని రంజిత్ చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : ఇంటికి తిరిగొచ్చిన సుమిత్ర.. షాక్ లో జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -503 లో.....సుమిత్ర కన్పించడం లేదని జ్యోత్స్న కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దీపని అరెస్ట్ చేస్తారు. దీపతో కాంచన కూడా స్టేషన్ కి వస్తుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి జ్యోత్స్నపై కోప్పడతాడు. మా మమ్మీని ఈ దీప కిడ్నాప్ చేసిందని జ్యోత్స్న అంటుంది. అందుకు ఆధారాలు ఉన్నాయా అని శివన్నారాయణ అడుగుతాడు. తనే చేసిందని జ్యోత్స్న అంటుంది. ఇన్‌స్పెక్టర్ మీ దగ్గర ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారని ఇన్‌స్పెక్టర్ ని శివన్నారాయణ అడుగుతాడు.. గతంలో దీప కి మీకు పడదు కదా అని ఇన్‌స్పెక్టర్ అనగానే అది గతం ఇప్పుడు కాదు.. నా కోడలు నా కొడుకు దగ్గర క్షేమంగా ఉంది.. వాళ్ళని వదలేయ్ నా కూతురికి సారీ చెప్పమని ఇన్‌స్పెక్టర్ తో శివన్నారాయణ అనగానే కాంచన కి ఇన్‌స్పెక్టర్ సారీ చెప్తాడు. అప్పుడే కాంచనకి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. జరిగింది మొత్తం కాంచన చెప్తుంది. ఫోన్ పారిజాతం తీసుకొని అల్లుడు అందరం ఇంటికి వెళ్తున్నాం.. తర్వాత చేస్తామని పారిజాతం ఫోన్ కట్ చేస్తుంది. నా భార్యని అరెస్ట్ చెయ్యడమేంటి జ్యోత్స్న.. నీ సంగతి చెప్తానని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు ఇంటికి వచ్చి మా మమ్మీ ఉందని బావ నీతో అబద్దం చెప్పి స్టేషన్ కి పంపించాడు తాత అని జ్యోత్స్న అంటుంటే.. తనపై శివన్నారాయణ కోప్పడతాడు. అప్పుడే శ్రీధర్ కూడా వచ్చి జ్యోత్స్నని తిడుతాడు. అందరు నన్ను అంటున్నారేంటి ఖచ్చితంగా మమ్మీని దీపనే కిడ్నాప్ చేసిందని జ్యోత్స్న అంటుంది అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. దీప వెళ్లి ఎర్రనీళ్లు తీసుకొనిరా అని అంటాడు. వెనకాల గుమ్మం దగ్గర దశరత్, సుమిత్ర ఉంటారు. వాళ్ళని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప దిష్టి తీస్తుంది.. అత్త నువ్వు ఈ గడప ఒక్కదానివి ఎప్పుడు దాటకూడదని ఎమోషనల్ డైలాగ్ చెప్తాడు. కాసేపటికి సుమిత్ర, దశరథ్ ఇద్దరు ఇంట్లోకి వస్తారు. నన్ను క్షమించండి మావయ్య అని శివన్నారాయణతో సుమిత్ర చెప్తుంది. దాంతో జ్యోత్స్న కోపంగా పైకి వెళ్తుంది. తన వెనకాలే పారిజాతం వెళ్తుంది. మీ అమ్మ వచ్చిందే కనీసం దగ్గరికి అయినా వెళ్ళు అంటుంది. నా మొహం కూడా చూడట్లేదు.. బావ ఎక్కువ అయిపోయాడని జ్యోత్స్న కోపంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Ilu illalu pillalu : శోభని రౌడీల దగ్గరి నుండి తీసుకొచ్చిన వేదవతి అండ్ కో.‌. ధీరజ్ సేఫ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -304 లో.....అత్త ముగ్గురు కోడళ్ళు కలిసి శోభని వెతకడానికి వెళ్తారు. ధీరజ్ ని గుర్తు చేసుకొని వేదవతి ఎమోషనల్ అవుతుంటే నర్మద ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత శోభని ఎలా కనుక్కోవాలని ఆలోచిస్తారు. అందరం ఒక్కో ఇంటికి వెళ్ళాలని శ్రీవల్లి ఐడియా ఇస్తుంది. పనికిరాని తెలివే అనుకున్నా కానీ బానే చెప్పావని నర్మద అంటుంది. అందరు వాళ్ళ అవతారాలు మార్చి చేతిలో బుక్ మెడలో ఐడి కార్డ్ వేసుకొని ఇంటింటికి వెళ్తారు. శోభ కి సంబంధించినది ఏం కన్పించదు. అప్పుడే కొంతమంది వాళ్లకి ఎదురవుతారు. వాళ్ళే అసలైన నిజమైన జనాభా లెక్కల ఎంక్వయిరీకి వచ్చిన వాళ్ళు.. దాంతో వేదవతి వాళ్ళని చూసి ఏంటి మీరు దొంగతనాలు చేస్తున్నారా అని అడుగుతారు. దాంతో వేదవతి వాళ్ళు అందరూ అక్కడ నుండి పారిపోతారు. ఆ తర్వాత శోభని కిడ్నాప్ చేసిన వారిలో ఒకడు వాళ్ళకి కన్పిస్తాడు.. వాటిని పట్టుకొని శోభ అడ్రెస్ చెప్పమని నలుగురు కొడుతారు. వాడు వీళ్ళ టార్చర్ భరించలేక శోభని కిడ్నాప్ చేసిన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత శోభని ఇంకా కిడ్నాప్ చేసిన వాళ్లని వేదవతి వాళ్ళు స్టేషన్ కి తీసుకొని వస్తారు. శోభ జరిగింది అంతా ఇన్‌స్పెక్టర్ కి చెప్తుంది. దాంతో ధీరజ్ ని వదిలిపెడతారు. నేను చెప్పాను కదా.. నా కొడుకు ఎలాంటి తప్పు చెయ్యడని  అని శోభ వాళ్ళ నాన్నతో రామరాజు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రని సెటిల్ చెయ్యాలని చెప్పిన ఇషిక.. ఆ స్వామి చెప్పింది జరుగుతుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -99 లో.. ఇషిక, వీరు ఇద్దరు కలిసి ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి తాము చెప్పినట్లు యాక్టింగ్ చెయ్యమని చెప్తారు. అందుకు అతను ఒప్పుకుంటాడు. ఆ తర్వాత పెద్దసారు చాలా హ్యాపీగా ఉంటాడు. రుద్ర అకాడమీ సక్సెస్ ఫుల్ గా అడ్మిషన్స్ తో నిండి పోయిందని ఇంట్లో వాళ్ళకి చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఇషిక ఎంట్రీ ఇస్తుంది. రుద్ర బావ గారిని ఇక జీవితంలో కూడా సెటిల్ చెయ్యాలంటే పెళ్లి చెయ్యాలని ఇషిక ఆంటుంది. అప్పుడే ఇషిక, వీరు మాట్లాడిన మనిషి స్వామి వేషంలో ఇంటి ముందుకి వస్తాడు. కుటుంబం సమస్యల్లో పడబోతుందని చెప్తాడు. ఇలా ఎన్నో చెప్తారు డబ్బు కోసమని వీరు డబ్బు ఇవ్వబోతుంటే.. నీ డబ్బు ఎవరికి కావాలి.. నేను మీ కుటుంబం గురించి చెప్తున్నానని స్వామి అంటాడు. వద్దని వీరు అంటాడు. అప్పుడే శకుంతల ఎంట్రీ ఇచ్చి.. స్వామి ఏదో చెప్తున్నాడు కదా చెప్పనివ్వు అంటుంది. దాంతో స్వామిని లోపలికి పిలుస్తారు. ఈ కుటుంబంలోకి వచ్చిన కోడళ్ళు గొప్పింటి నుండి వచ్చారు కానీ ఇప్పుడు రాబోయే కోడలు పేద కుటుంబం నుండి వస్తుంది. తన వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని స్వామి చెప్తాడు. ఆ రుద్రుడి కోపాన్ని శాంతింపచేసి తనపై ఉండేదని స్వామి అంటాడు. శివుడి తలపై ఉండేది గంగ అని ఇషిక అనగానే అందరూ షాక్ అవుతారు. గంగ ఈ ఇంటికి కోడలా అని ఇందుమతి ఆశ్చర్యంగా చూస్తుంది. మరొకవైపు గంగ కోసం రుద్ర పట్టిలు తీసుకొని వెళ్తాడు. నువ్వు చేసిన హెల్ప్ కి డబ్బు తీసుకోలేదు కనీసం గిఫ్ట్ అయినా తీసుకోమని పట్టిలు ఇస్తాడు రుద్ర. గంగ అవి తీసుకొని పెట్టుకోబోతుంటే తనకి పెట్టుకోవడం రాదు.. దాంతో రుద్రనే గంగ కాలికి పెడతాడు. మరొకవైపు శకుంతల స్వామి చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. పెద్దసారు వస్తాడు. అసలు ఆ గంగని ఇంటికి తీసుకొని వచ్చి పెద్ద తప్పు చేసానని  పెద్దసారుతో శకుంతల అంటుంది. తరువాయి భాగంలో గంగని పారు కిడ్నాప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.