దుబారా.. బాధ్యులెవరు? వ్యవస్థ లోపాలపై వాస్తవ వేదిక లో ప్రశ్నల పిడుగులు!
Publish Date:Jan 8, 2026
సమాజం పట్ల అక్కర, బాధ్యత ఉన్న ఇద్దరు వ్యక్తులు వర్తమాన రాజకీయాలలో భ్రష్ఠత్వంపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. ఈ భ్రష్టత్వం అఖిల భారత సర్వీసు అధికారులకూ విస్తరించడాన్ని నిలదీశారు. తెలుగువన్ వాస్తవ వేదిక ద్వారా తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ వ్యవస్థ లోపాలపై విమర్శల శస్త్రాలు గుప్పించారు.
రాజకీయ నాయకుల దుబారా ఖర్చులు, ఆడంబర ప్రయాణ వ్యయాలు రాజకీయాలలో నాయకుల ఆర్థిక అరాచకత్వం చూస్తుంటే, ఆర్థిక నిబంధనలన్నవి సామాన్యులకేనా, నేతలకు వర్తించవా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇదే విషయాన్ని ‘వాస్తవ వేదిక‘ ద్వారా తెలుగువన్ ఎండీ కంఠం నేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్రప్రసాద్ మరోసారి లేవనెత్తారు.
ఉపముఖ్యమంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఖర్చుతోనే చార్టర్డ్ విమానాల్లో తిరుగుతున్నారనీ, ప్రభుత్వం దగ్గర సొంత విమానం లేనందున గంటకు 6 నుండి 8 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారన్న ప్రచారం, అలాగే విజయవాడ నుండి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే ట్రిప్పుకు 10 నుండి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇది వ్యక్తిగత దుబారా అని విమర్శించారు. లోకేష్ తన ప్రయాణ ఖర్చులకు సొంత డబ్బులు వినియోగిస్తున్నారన్న ఆర్టీఐ వివరణ నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు. ఆయన ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణించడం వల్ల ఆ ఖర్చు ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్తోందని పేర్కొన్నారు. అయితే ఇలా ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు. ఐఏఎస్ అధికారులు నిబంధనల్లో లొసుగులను ఆసరా చేసుకుని వాటని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు ఎలక్షన్ బడ్జెట్‌తో కార్లు కొనుక్కుంటున్నారని, ఒక్కో అధికారికి మూడు నుండి ఐదు కార్లు ఉంటున్నాయనీ అన్నారు.
గతంలో కలెక్టర్లు సొంత పనులకు రిక్షాల్లో వెళ్లేవారని, కానీ ఇప్పటి అధికారులకు ఆ నిబద్ధత లేదని, వారు ఉద్యోగంలో చేరగానే విల్లాలు, అపార్ట్‌మెంట్ల గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు. దుబారాకు, ఆ దుబారాకు అధికారుల వత్తాసుకు నిలువెత్తు ఉదాహరణగా రుషికొండ ప్యాలెస్ ను చెప్పుకోవచ్చన్న వారు.. తొలుత రుషికొండ ప్యాలెస్ కు 200 కోట్ల రూపాయలు మంజూరైతే.. అది పూర్తయ్యే నాటికి మొత్తం వ్యకం 600 కోట్లకు చేరిదనీ, అంత ఖర్చు చేసీ సిఆర్జెడ్, ఎన్విరాన్మెంట్, అటవీ నిబంధనల ఉల్లంఘనా యథేచ్ఛగా జరిగిందనీ దీనిని అడ్డుకోవలసిన అధికారులు ఏం చేస్తున్నారనీ ప్రశ్నించారు. అదే విధంగా జగన్ హయాంలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడానికి, తీరా వేసిన తరువాత హైకోర్టు మొట్టికాయలు వేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆ రంగులను తొలగించడానికి దాదాపు ఐదువేల కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయం చేశారనీ, ఇంకా చెప్పుకుంటూ పోతే.. గతంలో విజయవాడలోని ఒక స్టార్ హోటల్ నుండి ముఖ్యమంత్రి కుటుంబం కోసం రోజుకు లక్షన్నర రూపాయల వరకు భోజన బిల్లులు ఉండేవని, ఐదేళ్లలో ఇది సుమారు 400 కోట్లు అయి ఉండవచ్చనీ పేర్కొన్నారు.
ఇక ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చలు ఇసుమంతైనా జరగడం లేదనీ, కేవలం స్వోత్కర్ష, పరనిందకే అసెంబ్లీని నేతలు వేదికగా చేసుకుంటున్నారనీ సోదాహరణంగా వివరించారు. తెలుగుదేశం, వైసీపీలు ప్రజల ముందే కొట్టుకుంటున్నట్టు కనిపిస్తాయి కానీ, అంతర్లీనంగా అవి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటి ఫెన్సింగ్‌కు 14 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై ఎవరూ ప్రశ్నించడంలేదన్నారు. నేతల తప్పులను నిలదీయాల్సిన ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి నామావశిష్టంగా మిగిలాయన్నారు. విమర్శించారు.
మొత్తంగా వ్యవస్థలో అలీబాబా మారాడు తప్ప, 40 మంది దొంగలు (అధికారులు, కాంట్రాక్టర్లు, దోపిడీదారులు) అలాగే ఉన్నారనీ, నాయకులు మారినా వ్యవస్థలో దోపిడీ విధానం మారలేదనీ చెప్పారు. ఇక రాష్ట్ర ఉత్పాదకత పెరిగినా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోవడానికి కారణం దుబారా, అవినీతేనన్నారు.
ఈ చర్చకు కొనసాగింపు గురువారం (జనవరి 8) రాత్రి ఏడు గంటలకు తెలుగువన్ ‘వాస్తవ వేదిక‘లో ఈ దిగువన ఉన్న లింక్ ద్వారా చూడండి.
పేదలపై కక్షతోనే ఉపాధిహామీ పథకం నిర్వీర్యం.. మోడీ సర్కార్ పై రేవంత్ ధ్వజం
Publish Date:Jan 8, 2026
గోబెల్స్ ను మించి జగన్ అసత్య ప్రచారం!
Publish Date:Jan 8, 2026
ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ రెయిడ్స్.. మమత ఫైర్
Publish Date:Jan 8, 2026
డేంజర్ జగన్నాథం.. దొంగలే దోస్తులు.. క్రిమినల్సే కావాల్సినోళ్లు
Publish Date:Jan 8, 2026
కేటీఆర్ క్లూలెస్.. కవిత డామినేట్స్!
Publish Date:Jan 6, 2026
తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ను కవిత విమర్శలు ఫేడౌట్ చేస్తున్నాయా? ఆమె విమర్శలకు దీటుగా బదులివ్వడంలో బీఆర్ఎస్ తడబడుతోందా? సొంత అన్నపై కూడా కవిత నేరుగా విమర్శలు సంధిస్తున్నా.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మౌనం ఆ పార్టీ రాజకీయ పునాదులను కదిపేస్తోందా? అంటే ఔననే అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మండలి వేదికగా కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన ఉద్వేగభరిత ప్రసంగాన్ని సభలో బీఆర్ఎస్ సభ్యులు కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించకుండా మౌనంగా ఉండిపోవడం, మండలి చైర్మన్ సైతం సమయ నియమాన్ని పట్టించుకోకుండా ఆమె ప్రసంగాన్నికొనసాగించడానికి అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన వారైనప్పటికీ.. ఆ పార్టీని విమర్శలతో చెండాడేస్తున్న కవితను కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అదే సమయంలో కవిత తన భావోద్వేగ ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీలో తాను ఎలా అవమానాల పాలైనదీ, తనను ఎలా పక్కన పెట్టేశారు. ఎలా బయటకు పంపేశారు అన్న విషయాన్ని చాలా చాలా ఎమోషనల్ గా చెప్పారు. అదే సమయంలో తాను పార్టీకి చేసిన సేవలనూ ప్రస్తావించారు. ఆమె ఎమోషనల్ గా చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుకుంటే ఆమెకు సానుభూతి మరింత పెరుగుతుందన్న భయంతో బీఆర్ఎస్ సభ్యులు మౌనం వహించి ఉంటారని అంటున్నారు.
అయితే సభలో తన చివరి ప్రసంగం చేసి ఇప్పుడు వ్యక్తిగా ఒంటరిగా వెడుతున్నా.. కానీ ఒక శక్తిగా మళ్లీ తిరిగొస్తానంటూ ఆమె సభను వీడారు. ఇక మండలిలో ఇదే ఆమె చివరి ప్రసంగం అనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్రసంగం ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం తథ్యమన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా కవితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అవినీతిని వేలెత్తి చూపుతుంటే.. దానిని ఖండించడం మాని.. కవిత కూడా అవినీతికి పాల్పడ్డారన్నకోణంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంటే పరోక్షంగా బీఆర్ఎస్ హయాంలో కవిత చెప్పినట్లుగా అవినీతి జరిగిందని అంగీకరిస్తున్నటుగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజకీయంగా కవితను ఎలా ఎదుర్కొనాలన్న విషయంలో పార్టీలో గందరగోళం నెలకొందన్న విషయాన్ని ఈ పరిస్థితి తేటతెల్లం చేస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇక కేటీఆర్ పై నేరుగా కవిత విమర్శల వర్షం కురిపిస్తున్నా ఆయన నేరుగా స్పందించకపోవడం పొలిటికల్ గా కవితకు అడ్వాంటేజ్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. కవిత విషయంలో కేటీఆర్ క్లూ లెస్ గా ఉంటే.. కవిత మాత్రం బీఆర్ఎస్ ను డామినేట్ చేసి పోలిటికల్ మైలేజ్ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్.. క్రెడిట్ వార్.. వాస్తవమేంటంటే?
Publish Date:Jan 5, 2026
కొండగట్టు, కోనసీమ ఓ పవన్ కళ్యాణ్?
Publish Date:Jan 3, 2026
దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా జగన్ తీరు!
Publish Date:Jan 2, 2026
వైసీపీ వారికి అప్పనంగా వైకుంఠ ద్వార దర్శనాలు!?
Publish Date:Dec 30, 2025
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
టీ తాగే సరైన విధానం మీకు తెలుసా?
Publish Date:Jan 8, 2026
టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు. సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు. నలుగురు స్నేహితులను అయినా, ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం. అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది. టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం, దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు, ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు. టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే..
కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం. తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు. అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి. టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు.
టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి. ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది.
టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు, బొటన వేలును ఉపయోగించాలి. ఉంగరపు వేలు, చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి.
టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి. కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు. టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు. అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి.
పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు. అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు. చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి.
టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.
*రూపశ్రీ.
వ్యాపారంలో ఎదగడానికి సూపర్ టిప్స్ ఇవి..!
Publish Date:Jan 7, 2026
జనవరిలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
Publish Date:Jan 6, 2026
పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరినొకరు ఈ ప్రశ్నలు వేసుకోవాలి..!
Publish Date:Jan 5, 2026
అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులు ఇవి..!
Publish Date:Jan 2, 2026
బ్రేక్ఫాస్ట్ విషయంలో ఈ మిస్టేక్స్ చేశారంటే మీ బాడీ డ్యామేజ్ ని ఎవరూ ఆపలేరు..!
Publish Date:Jan 8, 2026
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం. ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతుంటారు. అందుకే అల్పాహారం ఆరోగ్యకరంగా, పోషకాలతో నిండి ఉండాలని కూడా చెబుతారు. అందరూ ఒకే విధమైన బ్రేక్పాస్ట్ తీసుకోరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం బ్రేక్పాస్ట్ లో తీసుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే బ్రేక్పాస్ట్ విషయంలో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల టోటల్ గా బాడీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంతకీ బ్రేక్ పాస్ట్ విషయంలో అస్సలు చేయకూడని మిస్టేక్స్ ఏంటి? అసలు బ్రేక్పాస్ట్ చేయడం వల్ల జరిగే మేలు ఏంటి? తెలుసుకుంటే..
బ్రేక్పాస్ట్ ప్రయోజనం..
అల్పాహారం లేదా బ్రేక్పాస్ట్ రోజులో మొదటగా తీసుకునే ఆహారం. ఇది రోజంతా శక్తివంతంగా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. జీవక్తియ రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ కారణంగా ఉదయాన్నే సరైన బ్రేక్పాస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యంగా పరిగణించబడుతుంది.
బ్రేక్పాస్ట్ విషయంలో చేసే తప్పులు..
ఖాళీ కడుపుతో టీ..
ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటే ఇది చాలా పెద్ద మిస్టేక్ అంటున్నారు వైద్యులు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆమ్లత్వం పెరుగుతుంది కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయని, డీహైడ్రేషన్‌కు కారణమవుతుందని, ఆకలి కూడా తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.
చపాతీ, పరాటా..
మీరు ప్రతిరోజూ బ్రేక్పాస్ లో చపాతీలు లేదా పరాటాలు తింటే ఉదయాన్నే ఎక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకోవడానికి కారణం అవుతుంది. ఇది ప్రోటీన్ లోపానికి కూడా దారితీస్తుంది. ఉదయాన్నే చపాతీలు లేదా పరాటాలు తినడం వల్ల కడుపు నిండినట్టు అనిపిస్తుంది కానీ ఇది ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతుందట. మధ్యాహ్నం తీసుకునే ఆహారం వల్ల మరింత హెవీగా మారుతుందని ఇది శరీరాన్ని బరువుగా , పనుల మీద ఆసక్తి మరల్చేలా మారుస్తుందని చెబుతున్నారు.
ఇన్స్టంట్ ఓట్స్..
అల్పాహారంలో చాలామంది ఇన్‌స్టంట్ ఓట్స్ తింటుంటారు. ఇది చాలా ఆరోగ్యకరమని కూడా అనుకుంటారు. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిదని కూడా అనుకుంటారు. కానీ ఈ ఓట్స్ అధికంగా ప్రాసెస్ చేసి ఉంటారు. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. బరువు తగ్గడానికి దీనిని తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
టీ తో బిస్కెట్, జ్యూస్..
ఉదయాన్నే టీతో పాటు బిస్కెట్లు లేదా జ్యూస్‌లు తీసుకోవడం చాలా మందికి అలవాటు. దీన్నే బ్రేక్పాస్ట్ గా సరిపేట్టేస్తుంటారు కూడా. అయితే వీటిలో శుద్ధి చేసిన పిండి, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌లకు కారణమవుతాయి, ఊబకాయాన్ని పెంచుతాయి.
బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే..
చాలామంది డైటింగ్ పేరుతో ఉదయాన్నే బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తుంటారు. బరువు తగ్గాలనే తాపత్రయంతో బ్రేక్పాస్ట్ స్కిప్ చేసి నేరుగా బోజనం చేస్తుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదని వైద్యులు చెబుతున్నారు. బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే జీవక్రియ మందగిస్తుందట. ఉదయం బ్రేక్పాస్ట్ స్కిప్ చేసే చాలామంది ఉదయం సమయంలో బిస్కెట్లు, జంగ్ ఫుడ్స్, ఇన్స్టంట్ డ్రింక్స్, ఇన్స్టంట్ ఫుడ్స్ తింటుంటారు. పైగా అవి చాలా లైట్ ఫుడ్స్ అని కూడా అనుకుంటారు. ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
రెడీ టూ యూజ్ ఫుడ్స్.. ఈ నిజం తెలిస్తే అస్సలు ముట్టరు..!
Publish Date:Jan 7, 2026
ఇనుప పాత్రలో ఈ ఆహారాలను వండితే చాలా డేంజర్..!
Publish Date:Jan 6, 2026
తిప్పతీగ.. ఇలా వాడి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!
Publish Date:Jan 5, 2026
సయాటికా నొప్పి ఎందుకు వస్తుంది... ఎలా వస్తుంది తెలుసా?
Publish Date:Jan 5, 2026