మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండు ఒక్కసారన్నా

  జయమ్ము నిశ్చయమ్మురా సెలబ్రిటీ టాక్ షో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక న్యూ ఎపిసోడ్ కి ఇంటర్నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వచ్చింది.  జగపతి బాబు ఆమె ఎన్నో ప్రశ్నలు అడిగారు. అలాగే ఈ షోలో మరో ఇంటరెస్టింగ్ సెలబ్రిటీ కూడా యాడ్ అయ్యారు. ఆయనే రాహుల్ రవీంద్రన్. "మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండు అని ఫీలైనట్టున్నావ్" అని జగపతి బాబు అడిగేసరికి "ఎస్..మగాళ్లకు ఒక్కసారి వచ్చి అది ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలంటే అబ్బాయిలకు రావాలి" అని చెప్పింది. దానికి ఆడియన్స్ అలాగే హోస్ట్ జగపతి బాబు కూడా చప్పట్లు కొట్టారు. "స్కూల్ లో పేరెంట్, టీచర్ మీటింగ్ లో ఒక కంప్లైంట్ వచ్చిందట ఏంటది" అని జగ్గు భాయ్ అడిగారు. రష్మీక విషయం చెప్పకుండా ఆశ్చర్యంగా రివర్స్ లో జగ్గు భాయ్ ని చూసేసరికి "సరే ఆ విషయాన్నీ కంఫర్మ్ కింద తీసేసుకుందాం"? అని చెప్పారు దాంతో రష్మిక రెస్పాండ్ అయ్యి నో అనేసింది. ఇక గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి అడిగేసరికి "గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ఎందుకు చేస్తున్నా అంటే ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదండీ అవన్నీ" అని చెప్పబోయింది. ఇంతలో రాహుల్ రవీంద్రన్ వచ్చి ఆమెను సర్ప్రైజ్ చేసాడు. "ఏంటి నా స్టైల్ కాపీ కొడుతున్నావ్ నువ్వు" అని జగ్గు భాయ్ రాహుల్ ని అడిగాడు. "మీలాంటోళ్ళు ఇలా బయటకు వచ్చాక నాకు కూడా ధైర్యం వచ్చింది అరె ఎంత బాగున్నారు సర్ " అనిపించింది అంటూ కామెంట్ చేసాడు.

ఈ రీల్ తో మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ?

  బుల్లితెర మీద కొంతమంది సీరియల్ యాక్టర్స్ మరీ అతి చేయడం జనాలకు వెగటు పుట్టిస్తోంది. ప్రియాంక జైన్, శివ్ కుమార్ ఒక సీరియల్ లో నటించి తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అలాగే కొన్ని షోస్ లో ఇద్దరూ కలిసే వస్తున్నారు. వీళ్లిద్దరి మీద సోషల్ మీడియాలో రకరకాల నెగటివ్ కామెంట్స్ రావడం చూస్తూనే ఉన్నాం. ఇద్దరికీ పెళ్లి కాకుండానే కలిసి పూజలు చేయడం,  అలాగే ప్రియాంక జైన్ వాళ్ళ అమ్మను ప్రెగ్నెంట్ లేడీగా కాస్ట్యూమ్స్ వేయించి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూసాం. అలాగే ప్రియాంక  ఒక డాన్స్ షోకి మెంటార్ గా చిట్టి పొట్టి డ్రెస్ వేసుకురావడం చూస్తూనే ఉన్నాం..ఈ విషయాలన్నిట్లో కూడా ఈమెను సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది. ఐతే ప్రియాంక జైన్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అది చూస్తే శివ్ కుమార్ అర్ధనగ్నంగా ఉన్నాడు. అతని భుజాల మీద ప్రియాంక జైన్ ఎక్కి కూర్చుని తన లాంగ్ ఫ్రాక్ ని శివ్ కుమార్ ముఖం మీద వేసేసి ఒక ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ చేయడం చూస్తుంటే బాబోయ్ ఏంటిది అన్నట్టుగా ఉంది. "నేను నాతో కలిసి డాన్స్ చేయమని అతన్ని అడిగినప్పుడు" అని చిన్న లైన్ పెట్టి "కామెంట్స్ లో మీ డాన్స్ పార్టనర్స్ ని టాగ్ చేయండి" అని కూడా చెప్పింది. ఇక నెటిజన్స్ ఐతే మాములుగా కామెంట్స్ చేయలేదు. "అన్నా మీరు లెగ్గిన్ వేసుకుని ఉంటే బాగుండేది బ్రో, ఏందిరా అయ్యా ఈ చండాలం, ఫస్ట్ లో మీ జోడికి ఒక పేరు ఉండేది..ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చిరాకొస్తోంది..ఎందుకు ఇలాంటి చెత్త వీడియోస్...మీకే ఎందుకు ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఈ రోజున ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఈ రీల్ తో మీరు సమాజానికి ఎం మెసేజ్ ఇస్తున్నారు. ఎం నేర్పిస్తున్నారు మీ పేరెంట్స్. క్రింజ్ కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మరీ ఇంతలానా ..మీరిద్దరూ ఒకరికి ఒకరు ఏమవుతారు..ఫ్రెండ్స్ ? రేలషన్ షిప్ ? జనరల్ గా అడుగుతున్నా ? " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అఖిల్ సార్థక్ కి సర్‌ప్రైజ్‌ చేసిన మోనాల్

బిగ్ బాస్ సీజన్ 4 అంటే చాలు ముందు గుర్తొచ్చేది అఖిల్ సార్థక్, మోనాల్ గుజ్జర్. ఈ బిగ్ బాస్ తర్వాత వీళ్ళిద్దరూ దూరమైపోయారు. మళ్ళీ ఇన్నాళ్లకు అఖిల్ సార్థక్ తో కలిసి వాళ్ళ సలోన్ కి వచ్చింది. అలాగే లైవ్ లోకి వచ్చింది. కాసేపు ఫాన్స్ తో మాట్లాడారు. అల్లరి నరేష్ నటించిన "సుడిగాడు" అనే మూవీతో మోనాల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో మూవీస్ చేసింది. ఇక తర్వాత ఆమె గుజరాత్ వెళ్ళిపోయి అక్కడ గుజరాతి మూవీస్ లో నటిస్తోంది. ఇక అఖిల్ కి కూడా చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేసింది. ఇక ఈ వీడియోని, పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.  "చాలా ధన్యవాదాలు, సర్‌ప్రైజ్‌చేసినందుకు...కొంతకాలంగా నేను చాలా నిరుత్సాహంగా ఉంటున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా రావడం నిజంగా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను  చూడటం నా మనసుకు సంతోషంగా అనిపిస్తోంది. నీ రాకతో నేను  షాక్ అయ్యాను...నిన్ను చూసేసరికి నా  నోట మాట రాలేదు..ఎల్లప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. ఎప్పటికీ మనం ఫ్రెండ్స్" అంటూ కొన్ని లైన్స్ ని పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే "మీ ఇద్దరి కోసం ఈ బిగ్ బాస్ సీజన్ చూసాను. ఈ కాంబోని చాలా రోజులు మిస్సయ్యాం. ఓజి పెయిర్, ఎన్ని బిబి జోడీస్ వచ్చినా మీరు ఇద్దరు చాలా స్పెషల్ అంతే..మిమ్మల్ని ఇలా కలిపి చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఇలా చూడడం బాగుంది. సోహైల్ కూడా ఉంటే బాగుండేది." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్.. అదొక పెయిన్ ఫుల్ షో..సుధీర్‌తో నాకు కుదిరింది!

బుల్లితెర మీద విష్ణు ప్రియా గురించి తెలియని వారు ఎవరూ లేరు. అలాంటి ఆమె ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి చెప్పుకొచ్చింది. "బిగ్ బాస్ నుంచి ఎం లేదు నేర్చుకోవడానికి. ఆల్రెడీ నా లైఫ్ నాకు అన్నీ నేర్పించేసింది. బిగ్ బాస్ లోకి వెళ్లి నేర్చుకునేంత ఐతే ఏమీ లేదు. కాకపొతే నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు. యాష్మి, సీత, పృథ్వి, నిఖిల్, ప్రేరణ వంటి వాళ్లంతా దొరికారు. బిగ్ బాస్ 9 కి కాల్ వస్తే నేను మాత్రం వెళ్ళను. ఒక్కసారి వెళ్ళినందుకే నన్ను నేను తిట్టుకున్నా. ఎందుకు వెళ్ళావ్, ఎందుకు వెళ్ళావ్ అని చెప్పు తీసుకుని కొట్టుకోకుండా ఆగిపోయా..బయటకు వచ్చాక షోని తిడదాం అనుకున్నా కానీ జనాలు ఇంత ప్రేమ చూపించేసరికి ఏమీ అనలేకపోయా. ఇంట్లో ఐతే నేను వర్క్ చేసుకుని కావలసినప్పుడు మసాజ్ చేయించుకుని మళ్ళీ శక్తి వచ్చాక వర్క్ చూసుకునేదాన్ని. కానీ బిగ్ బాస్ హౌస్ లో నిద్ర లేదు, మసాజ్ లేదు, కాఫీ లేదు, టీ లేదు అదొక పెయిన్ ఫుల్ షో. జారీ జరీ సాంగ్ తర్వాత నాకు కాల్స్ వస్తాయి, సెలెక్షన్స్ లో నేను బిజీ ఐపోతానేమో అనుకున్నా. అవకాశాలు వచ్చాయి కానీ గ్రేట్ సాంగ్స్ కాదు. బెస్ట్ సాంగ్స్ అన్నీ వేరే వాళ్లకు వెళ్లిపోతున్నాయి. బిగ్ బాస్ నుంచి వచ్చాక అవకాశాలు వచ్చేస్తాయి అనుకున్నా. కానీ ఏమీ లేదు..స్లోగా వెళ్తోంది బండి..నేను స్టార్టింగ్ యాంకరింగ్ చేసే టైములో ఇలా రాగానే అలా పేరు తెచ్చేసుకుంది ఏమిటి అనేవాళ్ళు. అప్పుడేదో సుధీర్ ఉన్నాడు కాబట్టి యాంకరింగ్ అలా టామ్ అండ్ జెర్రీలా కుదిరింది. కానీ ఇప్పుడు సోలోగా చేయలేను. నాకు ఉన్న నత్తికి, నాకున్న మెంటల్ కాన్సంట్రేషన్ కి అస్సలు చేయలేను. యాంకరింగ్ టైములో నా వీక్ నెస్ లు ఈజీగా తెలిసిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కవర్ సాంగ్స్ అని, మూవీస్ నుంచి సాంగ్స్ ఆఫర్స్ వస్తున్నాయి" అని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియా.

Bigg Boss 9 Telugu: భరణి కోసం బిగ్ ఫైట్...హీటెడ్ ఆర్గుమెంట్స్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అవ్వగా తొమ్మిదవ వారం నామినేషన్ ప్రక్రియ సాగింది. ఇందులో క్లోజ్ ఉన్న కంటెస్టెంట్స్ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇక బిగ్ బాస్ మామ నామినేషన్ రూల్స్ డిఫరెంట్ గా పెట్టాడు. కంటెస్టెంట్స్ అందరిని గార్డెన్ ఏరియాకి పిలిచాడు బిగ్ బాస్.  మీ ముందు కొన్ని బొమ్మలున్నాయి వాటి మీద ఇంటి సభ్యుల ఫొటోలు ఉన్నాయి.. బజర్ మోగిన వెంటనే బొమ్మల్లోని వేరే వాళ్ల ఫొటోలు ఉన్న బొమ్మని తీసుకొని సేఫ్ జోన్‌లోకి ముందుగా పరిగెత్తాలి.. అందరికంటే ఆలస్యంగా ఆఖరిగా చేరుకునే సభ్యులు మరియు వారి దగ్గర ఉన్న బొమ్మ మీద ఎవరి ఫొటో ఉంటే వారిద్దరూ నామినేషన్ జోన్‌ లోకి వస్తారు.. చివరికి వారిద్దరిలో ఒకరు నేరుగా ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అవుతారని. దివ్య మొదటి రౌండ్‌కి సంచాలకులని బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఇక ఫస్ట్ రౌండ్ లో సంజన లాస్ట్ ఉండటంతో తను రీతూని నామినేట్ చేస్తుంది. సెకెండ్ రౌండ్ లో సుమన్ శెట్టి లీస్ట్ రావడం అతని చేతిలో తనూజ బొమ్మ ఉండటంతో తప్పక తనని నామినేట్ చేయాల్సి వస్తుంది కానీ అతను సెల్ఫ్ నామినేట్ అవుతానని అంటాడు. ఇక దివ్య సుమన్ శెట్టిని నామినేట్ చేస్తుంది. భరణి, తనూజ ఇద్దరికి నామినేషన్ సాగుతోంది . ఇక అందరి నామినేషన్ తర్వాత ఇంటి కెప్టెన్‌గా ఉన్న దివ్యకి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. మీరు తగిన కారణాలు చెప్పి మీరు ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో తనూజని దివ్య నామినేట్ చేసింది. ఒక మనిషికి నీకంటే నేను ఎక్కువ ప్రయారిటీ అనే అభిప్రాయం నీకు ఉందనిపిస్తుంది.. నేను వచ్చి ఇద్దరి మధ్య బాండ్‌ని బ్రేక్ చేశానన్నట్లుగా బయటికి వెళ్లిందని భరణి గురించి చెప్పింది దివ్య. నేను ఆయన్ని నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేశావ్.. అంతకంటే ఇందులో ఏం లేదంటూ తనూజ అంది. ఈ మాటకి దివ్య రెచ్చిపోయింది. అసలు నువ్వు ఏం గేమ్స్ ఆడావ్.. ప్రతి గేమ్‌లోనూ సపోర్ట్ లేకుండా ఆడలేకపోయావ్.. నువ్వు ఒక పర్ సెప్షన్ లో ఉంటావంటూ తనూజపై ఫైర్ అయింది. భరణి, దివ్య ఇద్దరు కలిసి ఆడుతున్నట్టుగా తనూజ తన నామినేషన్ పాయింట్లు చెప్పింది. దీనిపై దివ్య ఫైర్ అవుతూ తనూజ టాస్కుల తర్వాత ఏడ్చి సింపథీ కోసం ట్రై చేస్తావ్..తను ఆట ఆడకుండా చేసే వాటి గురించి చెప్పింది. దీంతో నీ గేమ్ నువ్వు ఆడుకో.. పక్కవాళ్ల గేమ్ ఆడకు అంటూ తనూజ అంది. నా గేమ్ నేను ఆడుతున్నాను.. నీకు కళ్లు కనిపించట్లేదేమోనని దివ్యపై ఫైర్ అయింది తనూజ. అవునవును అందరిని సపోర్ట్ అడుక్కుంటూ ఉంటావ్.. ఇలా చేతులు కట్టుకొని ఇదే కదా నీ ఆట.. అయినా ఏడుపు గురించి నువ్వే చెప్పాలి.. ప్రతీ గేమ్ తర్వాత ఏడుస్తూనే ఉంటావంటూ తనూజపై దివ్య రెచ్చిపోయింది.

మేమందరం జబర్దస్త్ వదిలేస్తున్నాం... కొందరు తిట్టారు, కొందరు పొగిడారు!

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక అనూహ్య సంఘటన జరిగింది. ముందుగా అందరూ స్కిట్స్ గురించి చెప్పారు. టీమ్ లీడర్స్ , లేడీస్, లేడీ గెటప్స్, చిన్నపిల్లలు అంతా ఎవరికీ వాళ్ళు గ్రూప్ గా ఏర్పడి స్కిట్స్ చేస్తామని చెప్పారు. అలా ప్రోమో ఫైనల్ లో టీం లీడర్స్ అంతా కలిసి ఒక స్కిట్ వేశారు. ధనరాజ్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో శ్రీదేవి గెటప్ వేసాడు, రాకెట్ రాఘవ అమ్రిష్ పురిగా, రాంప్రసాద్ పుష్పగా, బులెట్ భాస్కర్ ఖైదీలో చిరంజీవి గెటప్ లో, చలాకి చంటి ఐతే మౌత్ ఆర్గాన్ తో నరసింహ మూవీలోని రజనీకాంత్ గెటప్ లో వచ్చాడు, రాకింగ్ రాకేష్ ఐతే అరుంధతి మూవీలోని పశుపతి గెటప్ లో వచ్చాడు. ఇక వీళ్ళ స్కిట్ ఐపోయాక నార్మల్ గా వచ్చి "అందరికీ నమస్కారం, మేమందరం జబర్దస్త్ వదిలేద్దాం అనుకుంటున్నాం, కొత్తవాళ్లు వస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయండి. ఎవరు స్కిట్స్ చేసినా అదే ప్రేమ, అభిమానాలు చూపిస్తారని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్యూ సో మచ్" అని చెప్పారు. ఈ మాటతో రష్మీ, మానస్, కృష్ణ భగవాన్ షాకయ్యారు. ఇక నెటిజన్స్ కామెంట్స్ మాములుగా లేవు. కొందరు తిట్టారు, కొందరు పొగిడారు. "మీరు వెళ్ళిపోతే మేము జబర్దస్త్ చూడము. జబర్దస్త్ వెంటిలేటర్ మీద ఉంది." అంటున్నారు. ఐతే ఇదంతా ప్రాంక్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఇది నిజమా, అబద్దమా తెలియాలంటే షోలో చూడాల్సిందే..

Bigg Boss 9 Telugu: తనూజ వర్సెస్ భరణి.. దివ్య వ్యాలిడ్ నామినేషన్!

బిగ్ సీజన్-9 లో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ముఖ్యంగా తనూజ వర్సెస్‌ ఇమ్మాన్యుయల్, భరణి వర్సెస్‌ తనూజ, దివ్య వర్సెస్ తనూజ. హౌస్ లో తనూజ ఎవరితో అయితే కాస్త క్లోజ్ గా ఉందో వారితోనే ఆర్గుమెంట్స్ కి దిగడం హైలైట్ గా నిలిచింది. నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ భిన్నంగా సాగింది. మొదటి రౌండ్ లో రీతూని సంజన నామినేట్ చేసింది. రెండో రౌండ్ లో సుమన్ శెట్టి సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఇలా రౌండ్ లు జరుగుతున్న కొద్దీ నామినేషన్ లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.    ఒక రౌండ్ లో బజర్ మోగగానే ముందుగా సేఫ్ జోన్‌లోకి పవన్ వెళ్లాడు. కానీ సంచాలకులుగా ఉండాల్సిన పవన్ బొమ్మ సాయి దగ్గర ఉన్న కారణంగా ఈ రౌండ్‌కి దివ్యనే సంచాలకులని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ముందుగా భరణిని డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. మొదటి నుంచి భరణి సేఫ్ ఆడుతున్నాడని.. ఏదో ఒక తప్పు చేసి సారీలు చెప్పడమే పని అంటూ డీమాన్ అన్నాడు. ఇక చివరిగా వచ్చిన సాయి.. తనూజని నామినేట్ చేశాడు.  దీంతో భరణి, తనూజ ఇద్దరు వచ్చి తమలో ఎవరు హౌస్‌లో ఉండేదుకు ఎక్కువ అర్హులో చెప్పాల్సి వచ్చింది.  భరణి తను హౌస్ లో ఉండటానికి ఎందుకు డిజర్వ్ అని స్ట్రాంగ్ పాయింట్లు చెప్పాడు. నేను ఈ హౌస్‌లో తనూజకి మూడు టాస్కుల్లో గెలిచేందుకు హెల్ప్ చేశాను.. తనకంటే బాగా టాస్కులు ఆడతాను.. తనలో రేషన్ మేనేజర్‌గా చేసినప్పుడు ఇరిటేట్ అవ్వలేదు.. అందరి చేత నేను చాలా మంచి రేషన్ మేనేజర్ అనిపించుకున్నానంటూ భరణి అన్నాడు. దీనికి తనూజ డిఫెండ్ చేసుకుంది. టాస్క్ విషయంలో ఆయన ఎందుకు సపోర్ట్ చేశారంటే సపోర్టింగ్ గేమ్ కాబట్టి..అయిన ఆయన హౌస్‌లో నుంచి మొదటిగా వెళ్లిపోయింది రిలేషన్స్ వల్ల కానీ తిరిగి హౌస్‌లోకి వచ్చాక కూడా ఆయన అందులోనే ఉండిపోయారని తనూజ అంది. మొన్న కెప్టెన్సీ టాస్కులో ఎవరికి సపోర్ట్ చేయకుండా ఆయన డైలమాలో ఉండిపోయారు.. అది కరెక్ట్ కాదంటూ తనూజ చెప్పింది. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత దివ్య తన పాయింట్లు చెప్పింది. తనూజతో పోలిస్తే భరణి గారి పాయింట్లు రెండు తక్కువ అనిపించాయి‌. మాటల్లో చెప్పడం వేరు యాక్షన్ లో చేసి చూపించడం వేరు.. ఆయన దివ్యకి సపోర్ట్ చేస్తానని చెప్పారు కానీ తను ఎవరికి సపోర్ట్ చేయకుండా నిల్చుండిపోయాడు. టైమ్ అయిపోయింది.. అది కరెక్ట్ కాదంటు పాయింట్లు చెప్పి భరణిని నామినేట్ చేసింది. ఇక నామినేట్ అయిన తర్వాత భరణి ఒంటరిగా కూర్చున్నాడు. ఆ గ్యాప్‌లో తనూజ-దివ్య మాట్లాడుకుంటుంటే భరణి అక్కడికెళ్లి.. మీ ఇద్దరూ ఏదైనా మాట్లాడుకుంటే మీ ఇద్దరికి సంబంధించిన టాపిక్‌ మాట్లాడండి కానీ నా టాపిక్ మాత్రం తీసుకురావద్దు.. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని భరణి అన్నాడు. ఇక భరణి, తనూజ మధ్య జరిగిన ఈ హీటెడ్ ఆర్గుమెంట్స్ వారి మధ్య బంధాన్ని బ్రేక్ చేసిందనే చెప్పాలి. వీళ్ళిద్దరూ మొదట్లో ఉన్నట్టుగా కలిసి ఉంటారో ఉండరో చూడాలి మరి.

ఆ రింగ్ నాకు చాలా ఇంపార్టెంట్...

జయమ్ము నిశ్చయమ్మురా షో మంచి రేటింగ్ తో ముందుకు సాగుతోంది. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో చూస్తే ఇంకేముందు రాబోతోంది వరల్డ్ వైడ్ క్రష్ రష్మిక మందన్న. ఇక ఈవిడ స్టేజి మీద ఎంట్రీ ఇచ్చేసరికి శ్రీవల్లి సాంగ్ కూడా ప్లే అయ్యింది. ఒక రకంగా నేను నీకు ఒక నిక్ నేమ్ పెట్టాను గాలి పిల్లా అని అంటూ జగ్గు భాయ్ రష్మికకు చెప్పేసరికి అయ్యయ్యో అనేసింది. "విజయ్ దేవరకొండ ఫ్రెండ్ షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్, దళపతి విజయ్ ఆల్ టైం ఫ్యాన్..అంటే విజయ్ ని, విజయం మొత్తాన్ని సొంతం చేసేసుకున్నావా నువ్వు" అని జగ్గు భాయ్ అడిగారు. ఇక ఆ ప్రశ్నకు రష్మీక ఎం ఆన్సర్ చెప్పకుండా ఆడియన్స్ వైపు తిరిగి కన్ను కొట్టింది. ఇక బ్యాక్ గ్రౌండ్ లో "ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస" అనే సాంగ్ ప్లే అయ్యింది. "అప్పుడున్న రష్మికను చూద్దామా ఒకసారి" అంటూ రష్మిక చిన్నప్పటి గౌన్ వేసుకున్న ఫోటోని చూపించారు. "ఐ థింక్ ఇది చెన్నైలో తీసింది" అని చెప్పింది. "అప్పటికే విజయ్ ఫ్యాన్ ఆ" అని జగ్గు భాయ్ అడిగారు. "అలాగే కనిపిస్తోంది మరి" అని చెప్పింది రష్మిక. "ఒక చేతిని వెనక పెట్టుకుని వీధి మొత్తం ఆ పాట పాడుతూ వెళ్లేదాన్ని"..వెంటనే "రోజావే చిన్ని రోజావే" అనే సాంగ్ ప్లే అయ్యింది. "చిన్నప్పుడు ఎలా నడిచావో నడిచి చూపించవా" అనేసరికి రష్మిక అలాగే స్టేజి మీద కాసేపు నడిచి చూపించింది. ఇక ఆమె చేతికి ఉన్న ఉంగరాల గురించి అడిగారు. "ఆ రింగ్స్ ఏమన్నా సెంటిమెంటా లేకపోతే" అని అడిగారు. "అంటే చాలా ఇంపార్టెంట్ రింగ్స్" అని చెప్పింది. "అంటే అందులో ఒక రింగ్ ఫేవరేట్ అయ్యి ఉంటుంది. దాని వెనక ఏదన్నా హిస్టరీ ఉంది" అని జగ్గు భాయ్ చెప్పేసరికి రష్మిక ఆన్సర్ చెప్పకుండా నవ్వేసింది. ఇక ఆడియన్స్ గోల చేస్తూ అరిచారు.

Bigg Boss 9 Telugu: కన్నీళ్ళు పెట్టుకున్న సుమన్ శెట్టి.. రీతూని నామినేట్ చేసిన సంజన!

బిగ్ బాస్ సీజన్-9 లో మొదటి రెండు వారాలు ఒక లెక్క ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా సుమన్ శెట్టి ఆటతీరు ఉంది. హౌస్ లో తన నామినేషన్ అయిన ఆటతీరు అయిన అందరికి నచ్చేస్తుంది. అంతలా కనెక్ట్ అయిన సుమన్ శెట్టి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ కాస్త కొత్తగా సాగింది. బిగ్ బాస్ రూల్ చెప్పాడు. బజర్ మోగిన వెంటనే మీ ముందున్న బొమ్మల్లోని వేరే వాళ్ల ఫొటోలు ఉన్న బొమ్మని తీసుకొని సేఫ్ జోన్‌లోకి ముందుగా పరిగెత్తాలి.. అందరికంటే ఆలస్యంగా ఆఖరిగా చేరుకునే సభ్యులు మరియు వారి దగ్గర ఉన్న బొమ్మ మీద ఎవరి ఫొటో ఉంటే వారిద్దరూ నామినేషన్ జోన్‌లికి వస్తారు.. చివరికి వారిద్దరిలో ఒకరు నేరుగా ఇంటి నుంచి బయటికివెళ్లేందుకు నామినేట్ అవుతారు.. దివ్య మొదటి రౌండ్‌కి సంచాలకులు అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో అందరూ రెడీగా బజర్ కోసం వెయిట్ చేశారు. ఇక మొదటి రౌండ్ లో సంజన లాస్ట్ వస్తుంది. ఇక తను రీతు చౌదరిని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లి ఏడుస్తుంది. ఇక రీతూ తన దగ్గరికి వెళ్ళి.. ఇది ఒక ప్రక్రియ., దీనికి ఏడ్వాల్సిన అవసరం లేదని చెప్పి సంజనని ఓదారుస్తుంది.  ఇక రెండో రౌండ్ లో చివరిగా సుమన్ శెట్టి మిగిలిపోయాడు. అయితే సుమన్ చేతిలో తనూజ బొమ్మ ఉంది. దీంతో సుమన్ శెట్టి-తనూజ ఇద్దరూ ఒకరితో ఒకరు వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తనూజ ఇక్కడ చాలా సూటిగా ఒక ముక్క చెప్పింది. నేను అయితే సుమన్ అన్నని నామినేట్ చేయాలనుకోవడం లేదు.. అంతకుముందు నేను ఒకసారి అన్నని నామినేట్ చేశాను.. మీరు యాక్టివ్‌గా లేరు అంటూ కానీ తర్వాత తను సూపర్ హీరో అయిపోయాడు.. కనుక ఇప్పుడు నాకు సుమన్ అన్నని నామినేట్ చేసే పాయింట్స్ ఏం లేవని తనూజ చెప్పింది. ఇక సుమన్ శెట్టి అయితే ఎమోషనల్ అయిపోయాడు. నేను త్వరగా లోపలికి పరిగెత్తలేకపోయాను.. నా చేతిలో తనూజ బొమ్మ ఉండిపోయింది.. నాకు తనూజని నామినేట్ చేయాలని లేదు.. అందుకే నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటున్నా అని సుమన్ అన్నాడు. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఆ రౌండ్ సంచాలక్ అయిన సంజన.. సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇది చాలా ఎమోషనల్ గా సాగింది. 

Bigg Boss 9 Telugu: తొమ్మిదో వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిది వారాలు పూర్తయ్యాయి. ‌ఇక తొమ్మిదవ వారం హౌస్ లో సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. మరి నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో ఓసారి చూసేద్దాం. నిన్నటి ఎపిసోడ్ లో బొమ్మల టాస్క్ పెట్టాడు. అదే ఎవరైతే టెడ్డీని పట్టుకొని ఫాస్ట్‌గా సేఫ్ జోన్‌కి వెళ్తారో వాళ్లు సేఫ్. అవుతారు. ఎవరైతే టెడ్డీతో లాస్ట్ వరకూ గేటులోకి ఎంటర్ అవ్వకుండా ఉంటారో వాళ్లు నామినేషన్ జోన్‌లో ఉంటారు.. అలానే వాళ్ల చేతిలో ఉన్న టెడ్డీపై ఎవరి ఫొటో ఉంటుందో వాళ్లు కూడా నామినేషన్ జోన్‌లోకి వస్తారు. అప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు వ్యాలిడ్ పాయింట్లతో ఫైట్ చేస్తే వాళ్లు సేఫ్ అయి ఇంకో పర్సన్ నామినేషన్స్‌లో ఉంటారు. ఇలా బజర్ మోగిన ప్రతిసారి ఒకరు నామినేట్ అవుతారు. ఈ నామినేషన్ ప్రక్రియలో సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, సాయి, తనూజ, రాము రాథోడ్ ఉన్నారు. వీళ్ళలో ఖచ్చితంగా తనుజ అయితే బయటకు వెళ్ళదు ఎందుకంటే తను అన్నపూర్ణ ప్రోడక్ట్ కాబట్టి.. అంతేకాకుండా ఆమెకు విపరీతంగా యాజమాన్యం సపోర్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి గేమ్ చూస్తే అర్థమవుతుంది కూడా అయితే ఈ ఆరుగురిలో ఎవరు బయటకు వెళ్లిపోతారు అని ఆశక్తి అందరికీ నెలకొంది. భరణి రీసెంట్ గానే మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి భరణి అంత త్వరగా బయటికి వెళ్లే అవకాశం లేదు. తర్వాత కొన్ని టాస్కులు పెడతారు కాబట్టి కచ్చితంగా సంజన దానిలో పెర్ఫార్మ్ చేయకపోవచ్చు. సంజన బయటికి వెళ్లిపోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఇమ్మాన్యుయల్ తనూజను నామినేట్ చేశాడు. నామినేషన్ చేసిన వెంటనే తనుజ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. తర్వాత ఇమ్మాన్యుయల్ కూడా కళ్యాణ్ , శ్రీనివాస్ సాయి దగ్గర ఎమోషనల్ అయిపోయాడు. నేను మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ వాళ్ల దగ్గర అన్నాడు. ఇమ్మాన్యుయల్ ఇన్ సెక్యూర్ గేమ్ ఆడుతున్నాడని తెలుస్తోంది. ఇంత జరిగిన తర్వాత ఇమ్మాన్యుయల్ తనలోని ప్లేయర్ని బయటకు తీస్తాడా లేక తనూజకి సపోర్ట్ గా ఆడతాడా తెలియాలంటే ఈ వారం అతని గేమ్ చూడాల్సిందే.

Jayam serial : ముసుగులో ఉన్నది గంగ.. పెద్దసారు ప్లాన్ ఇదే!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -102 లో....రుద్ర ఎక్కడ గంగ ప్రేమలో పడతాడోనని శకుంతల ప్లాన్ ప్రకారం రుద్రకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడే రుద్ర వస్తాడు. రుద్ర ని పెళ్లి గురించి అడుగగా అతను సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు పెళ్లి చెయ్యకపోతే ఏ పెదీంటి పిల్లనో ప్రేమిస్తావో.. మళ్ళీ నువ్వు బాధపడుతావోనని ఈ నిర్ణయం తీసుకున్నాను అని శకుంతల అనగానే నా జీవితంలో ప్రేమకి చోటు లేదని రుద్ర అంటాడు. అమ్మ చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది కదా అని రుద్రతో ప్రీతి చెప్తుంది పెళ్లి చేసుకునేది వాడు వాడిష్టం ఉండాలని పెద్దసారు చెప్తాడు. అత్తయ్య ఏది ఏమైనా మంచి నిర్ణయం తీసుకున్నారని ఇషిక, వీరు అనుకుంటారు. అప్పుడే పెళ్లిళ్ల పేరయ్య కూడా వస్తాడు. అమ్మాయి ని తీసుకొని వచ్చానని చెప్తాడు. మేం వెళ్లి తీసుకొని వస్తామని ప్రీతీ, ప్రమీల, స్నేహ ముగ్గురు వెళ్లి అమ్మాయిని తీసుకొని వస్తారు. అమ్మాయి ముసుగులో వస్తుంది తనని చూసి అమ్మాయి ఎంత సంప్రదాయం అయినా పిల్ల అని శకుంతల అనుకుంటుంది. ముసుగు తీసి చూసేసరికి గంగ ఉంటుంది. తనని చూసి అంతా షాక్ అవుతారు. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. నేనే తీసుకొని వచ్చానని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత  గంగని పెళ్లి చేసుకోమని రుద్రకి పెద్దసారు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : జ్యోత్స్నకి ఇచ్చిపడేసిన శివన్నారాయణ.. కార్తీక్ ఆన్ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 505 లో.. సుమిత్ర, దశరథ్ ల పెళ్ళి రోజు కోసమని కార్తీక్, దీప కేక్ తీసుకొస్తారు. దానికి శ్రీధర్, కాంచన కూడా వస్తారు. కాసేపటికి ఇద్దరు కేక్ కట్ చేస్తారు. శివన్నారాయణ, పారిజాతం, జ్యోత్స్న, అందరు వరుసగా కేక్ తినిపిస్తారు. ఇక జ్యోత్స్న పుల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది.   మీరంతా అన్నట్లుగా బావకు దీపకు నిజంగానే భార్యభర్తలను కలిపేంత సమర్థత ఉంటే అత్తను మావయ్యను ఇంత వరకూ ఎందుకు కలపలేదు.. ఏం బావా... మా అమ్మనాన్నల గురించే ఆలోచిస్తావా.. మీ అమ్మానాన్నల గురించి ఆలోచించావా అంటూ జ్యోత్స్న వెటకారంగా అడుగుతుంది. జ్యోత్స్నా అని దశరథ్ అనగానే.. ఏం డాడీ.. మీ బావ మీ చెల్లెలు కలిసి ఉండాలని మీరు కోరుకోవడం లేదా.. నాకు ఏదో గుర్తొస్తుంది. కన్నతల్లి పిన్నతల్లి.. మా గ్రానీ నువ్వే ఆ సామెత చెప్పేదానివి ఏంటదని జ్యోత్స్న అంటుంది. ఇక శివన్నారాయణ అందుకొని వాళ్లు కలిసే ఉన్నారంటూ మాటలతోనే కలిపేస్తాడు. దీప, కార్తీక్‌ల పెళ్లికి మీ శ్రీధర్ మావయ్య భార్యతో వచ్చాడా ఒంటరిగా వచ్చాడా అని అడుగుతాడు.. అత్తతోనే వచ్చాడని జ్యోత్స్న అంటుంది. సత్యనారాయణ వ్రతం జంటగా ఉన్నారా లేదా అని అనగా..జంటగానే ఉన్నారని జ్యోత్స్న అంటుంది. మరి ఈ రోజు.. జంటగానే కనిపిస్తున్నారు కదా అని శివన్నారాయణ అనగానే.. కనిపిస్తున్నారని జ్యోత్స్న అంటుంది. మరి విడిపోయారని నువ్వు ఎలా చెబుతావ్.. కళ్లు కనిపిస్తున్నాయి కదా.. నోటికి ఏదొస్తే అది అంటావా అని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న తలదించుకుంటుంది. ముందు ఆలోచిస్తే నోటికి రావాల్సిన మాటలే వస్తాయని కార్తీక్ కోపంగా అంటాడు. నేను కాంచన వేరు అని నేనెప్పుడు అనుకోలేదు.. మేమంతా ఒకటే అని శ్రీధర్ అంటాడు. విన్నావ్‌గా.. ఈసారైనా వినపడిందా.. ఏదొకటి అవకాశం చూసుకుని ఎదుటివారిని అనడమే.. అసలు నీ చేతకానీతనం వల్లే కదా ఇదంతా జరిగిందంటూ శివన్నారాయణ అరుస్తాడు. పారు అడ్డుపడుతుంది. దాంతో కాస్త శాంతించిన శివన్నారాయణ.. పదండి అంతా తిందాం.. దశరథా పదా.. పారిజాతం రా అని అనవడంతో అందరు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: అమూల్యకి ప్రపోజ్ చేసిన విశ్వ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-306 లో.. అమూల్యని గుడికి తీసుకొని వస్తుంది శ్రీవల్లి. ఇక అప్పుడే విశ్వ బండి మీద ఎంట్రీ ఇస్తాడు. ఏంటి ఇక్కడున్నావంటూ స్టార్ట్ చేస్తాడు విశ్వ కానీ అమూల్య సైలెంట్ గా ఉంటుంది. మొన్నటి వరకూ నేను మీద ప్రతీకారం తీర్చుకోవాలనే చూశాను.. కానీ ఇప్పుడు మన రెండు కుటుంబాలు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అందుకే ఆ గుడిలో ఉన్న దేవుడి సాక్షిగా నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని అనుకుంటున్నా. ఐ లవ్యూ అమూల్యా.. ఐ లవ్యూ.. అని తన మనసులో ఉన్న మాటని అమూల్యతో చెప్పేస్తాడు విశ్వ. ఏంట్రా లవ్ చేస్తున్నావా.. లవ్వూ.. ఒళ్లు ఎలా ఉందిరా.. పిచ్చి పిచ్చిగా ఉందా.. లవ్వు గివ్వు అని కూస్తే చంపేస్తానని అమూల్య అంటుంది.  లేదు అమూల్య.. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని విశ్వ అంటాడు. ఇక అదంతా విని విశ్వకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అమూల్య. ఏది ఏమైనా సరే.. అమూల్యని బుట్టలో వేసుకుని ఆ రామరాజుతో పగతీర్చుకోవాలని అనుకుంటున్నాడు విశ్వ. అయితే ఈ విషయం శ్రీవల్లికి తెలియక.. అతను నిజంగానే తన ఆడపడుచుని ప్రేమిస్తుందని సాయం చేస్తుంది. ఇక కాసేపటికి శ్రీవల్లి అద్దం ముందుకు వెళ్లి.. తనని తనే పొగిడేసుకుంటుంది. ఇక అప్పుడే చందు వచ్చి తనని వెనకాల నుండి వాటేసుకుంటాడు. ఇక శ్రీవల్లి కెవ్వుమని అంటుంది. నేనే నీ బావని.. చందుని అని చందు అనగానే.. హో అవునా‌‌.. నువ్వు అయితే ఒకే బావ అంటుంది. ఈ రోజు చాలా అందంగా ఉన్నావని చందు అనగానే.. ఏంటే ఏంటి ఇన్నిరోజులు బాలేనా అని శ్రీవల్లి అంటుంది.  మా వాళ్ళు పది లక్షలు ఇవ్వలేదని నన్ను శత్రువులా చూసావ్ కదా అని శ్రీవల్లి అనగానే.. ప్రేమగా దగ్గరికి వస్తే ఇలానే అంటావా.. నువ్వు మారవే అని చందు అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక శ్రీవల్లి మళ్ళీ అద్దం ముందుకెళ్ళి తనని తాను తిట్టుకుంటుంది. మొగుడు ప్రేమగా దగ్గరికి వస్తే ఎందుకే గెలుక్కుంటావ్.. ఇప్పుడు చూడు ఏమైందో.. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆ అవకాశం అని శ్రీవల్లి తిట్టుకుంటుంది. ఆ తర్వాత ఏఙ జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi:  కోయిలికి చుక్కలు చూపించిన రాజ్, కావ్య.. నిజం కనిపెట్టేశారుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-868లో రాజ్, కావ్య ముసలివాళ్ళ గెటప్ లో కోయిలి, రాహుల్ ఉండే ఇంటికి వస్తారు. ఏంటే ఈ ఇంట్లో పనివాళ్ళు లేరు.. దీనిది బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని రాజ్, కావ్య అంటారు. పని వాళ్లు ఉన్నారని కోయిలి అంటుంది. అవునా ఎక్కడా అని ఇద్దరు అడగడంతో.. ఉండేవారు.. మా కంపెనీ సీక్రేట్స్ అన్నీ పక్కింటి వాళ్లకు చెప్పేస్తున్నారని మేమే తీసేశామని రంజిత్ అంటాడు. హో మరి ఇప్పుడు ఎలా.. నాకు ఒకరు వడ్డించకపోతే తినలేనే ఎలా పోదాం పదా ఈ ఇంట్లోంచి.. పదరా రాహుల్.. మనకు ఈ పిల్ల సెట్ అయ్యేలా లేదని రాజ్, కావ్య అంటారు. దాంతో రంజిత్, కోయిలి ఇద్దరూ బ్రతిమిలాడటం మొదలుపెడతారు. అయ్యో అయ్యో.. బామ్మగారు తాత గారు మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ అంటూ కూర్చోబెట్టి కోయిలీనే వడ్డిస్తుంది. తినడం మొదలుపెట్టి రుచిగా లేని ఫుడ్ అంటూ.. కాకా హోటల్ నుంచి తెచ్చారా.. కాస్టీ ఫుడ్ కాదంటూ రాజ్, కావ్య తిడతారు. ఇక రాహుల్ వాళ్ళనే చూస్తుంటే.. నువ్వు చెప్పవేంట్రా అని రాజ్ బెదిరించడంతో ఫుడ్ బాలేదని రాహుల్ అంటాడు. రేపు వేరే మంచి హోటల్ నుంచి తెప్పిస్తాం ఫుడ్ అని రంజిత్ అంటారు. గుండరాయి లాంటి ఆడది ఇంట్లో ఉండగా బయట ఫుడ్ ఏంటని కావ్య అంటుంది. మా కోయిలీకి వంట రాదు కదా అని రంజిత్ అంటాడు. రాదా.. అయితే పదరా రాహుల్ అని రాజ్, కావ్య అంటారు. వంట నేర్చుకుంటాను.. బామ్మగారి దగ్గరే నేర్చుకుంటానని కోయిలీ అంటుంది. ఆ తర్వాత కోయిలీ తిట్టుకుంటూ ప్లేట్స్ తీసుకుని వంట గదిలోకి వెళ్తే.. రంజిత్ వెనుకే వస్తాడు. కోయిలీ వాళ్ల ఫుడ్ బిల్ ఒక్కరోజుకే ముప్పై వేలు అయ్యిందే.. ఇంకా నాలుగు రోజులుంటే మనల్ని నమిలేస్తారా అని రంజిత్ అంటాడు. వాళ్లేం మాట్లాడుకుంటున్నారో రాజ్, కావ్య గుమ్మం దగ్గరకు వచ్చి వింటారు. నమిలితే నమిలారు.. మనకు రెండు లక్షలు అవుతుంది. వాళ్ల దగ్గర కోట్లున్నాయి.. ఆ ముసలోళ్లను నాలుగు రోజులు చక్కగా చూసుకుంటూ ఆస్తి మొత్తం రాహుల్ గాడికి రాసేస్తారు.. వాడికి పెళ్లి పేరు చెప్పి వాడి దగ్గర లాగేసి గెంటేస్తాం అంతే అని కోయిలీ అంటుంది. ఇక రాజ్, కావ్య అక్కడి నుంచి పక్కకు జారుకుని క్లారిటీ చూసుకుంటూ.. ఇది అసలు మ్యాటర్.. వీళ్లదగ్గర ఆస్తిపాస్తులేం లేవు.. అప్పులే ఉన్నాయి.. రాహుల్ గాడి కళ్లు తెరిపించాలంటే ఏదొకటి చెయ్యాలని ఇద్దరు అనుకుంటారు. చాలా సేపు ఆలోచిస్తారు. వీళ్లను మనం పెట్టే టార్చర్ చాలదు.. అలా పెట్టాలంటే వీళ్లకు గోల్డ్ బాబు అని ఒకడు ఉన్నాడు వాడ్ని దింపుతాను.. దుబాయ్ నుంచి వచ్చేశాడు.. వాడు కాస్త ఓవర్ చేస్తాడు కానీ వీళ్లకు వాడే కరెక్ట్ అని రాజ్ అంటాడు. సరే అయితే ఆ పని చెయ్యండి.. నేను కోయిలీ ఒళ్లు వంచే పనిలో పెడతానంటూ కావ్య అక్కడి నుంచి వెళ్తుంది. ఇక రంజిత్ భుజం మీద కోయిలీ చెయ్యి వేసి.. రంజిత్.. అవసరం అయితే ఇంకో పది లక్షలు అప్పు చేద్దాం. కోట్లు ఆస్తి పక్కా లాగాలి వాళ్ల దగ్గర నుంచి అంటూ ఉంటుంది. ఇంతలో ముసలమ్మ కళావతి గుమ్మం దాకా వస్తుంది. నువ్వు చెప్పింది జరుగుతుంది అంటావా అని రంజిత్  అంటాడు. అలాంటి డౌట్ ఏం పెట్టుకోకు కచ్చితంగా జరుగుతుందని కోయిలీ నమ్మకంగా. నాకు మాత్రం డౌట్ ఉందే ఎండుకప్ప అంటూ దగ్గరకు వస్తుంది కళావతి. ఇక రంజిత్, కోయిలీ కాస్త దూరం జరుగుతారు. ఏంటి బామ్మగారు అని కోయిలీ అనగానే.. నువ్వు పెళ్లి చేసుకునేది మా రాహుల్‌నా..? లేక ఈ దరిద్రుడినా రంజిత్ ని చూపిస్తూ అంటుంది. అయ్యో అదేం లేదు బామ్మగారు.. ఎంతైనా మా అక్క కూతురు కదా అందుకే కాస్త క్లోజ్‌గా ఉంటామని రంజిత్ కవర్ చేస్తాడు. అదంతా నాకెందుకులే కానీ.. రా.. రా వంట నేర్చుకుంటా అన్నావ్ కదా.. సాయంత్రానికి డిన్నర్ చేద్దువుగానీ.. ముందు డ్రెస్ మార్చుకో.. వచ్చి ముందు ఇల్లంతా శుభ్రం చెయ్ అని కావ్య అంటుంది. ఏంటి పని చేయడానికి చీర కట్టుకున్నావ్ అంటూ జుట్టు ముడేయించి.. పని మనిషిలా మార్చి.. ఇంటి పని చేయిస్తుంటుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మరో ఎపిసోడ్ కోసం వేచి ఉండాల్సిందే.

వీళ్ళ గొంతెమ్మ కోరికలు మాములుగా లేవుగా...

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో కార్తీక పౌర్ణమి స్పెషల్ తో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. "మనం ప్రతీ పండక్కి దేవుడిని ఏదో ఒకటి కోరుకుంటాం. మన దేవుళ్ళు ఎవరు..ప్రేక్షక దేవుళ్ళు. ప్రతీ మనిషికి ఒక గొంతెమ్మ కోరిక అనేది ఉంటుంది. బయటకు ఎప్పుడూ చెప్పుకోనిది. ఇప్పుడు వీళ్లంతా వాళ్ళ కోరికలు బయట పెడతారు. ఆడియన్స్ ఎస్ ఆర్ నో అని చెప్పండి" అంటూ శ్రీముఖి ఒక ఫన్నీ సెగ్మెంట్ ని నిర్వహించింది. ముందు ప్రిన్సి వచ్చింది. "దేవుడా ఇంతకు శ్రీముఖికి ఇదే షోలో స్వయంవరం జరిగినట్టు నాకు కూడా స్వయంవరం జరగాలి" అంటూ కోరుకుంది. తర్వాత గాయత్రీ వచ్చింది. "కార్తీక దీపం అనగానే కార్తిక్, దీప మాత్రమే గుర్తొస్తారు కానీ ఈ కార్తీక దీపం నవ వసంతంలో జోత్స్న మాత్రమే అందరికీ గుర్తు రావాలి. ఇదే నా కోరిక" అంది. అందరూ నో అని చెప్పారు ఆడియన్స్ ని. "అందరికీ మీ వంటలక్కే ఇష్టమమ్మా మా వాంప్ లు ఎందుకు ఇష్టంఉండరమ్మా, నాకు కూడా ఇష్టం లేదనుకో" అంటూ శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది. తర్వాత సిరి హన్మంత్ వచ్చింది. పరివారం షోకి యాంకర్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసరికి అందరూ నో అని చెప్పారు ఆడియన్స్. తర్వాత రోహిణి వచ్చి "నాకో తీరని కోరిక ఉంది. నేను నడుస్తూ ఉంటె వెనక 10 మంది అబ్బాయిలు పడాలి. అందులో నేను ఒక అబ్బాయిని ఎంచుకుని పెళ్లి చేసుకోవాలి." అని చెప్పింది. తర్వాత సమీరా భరద్వాజ్ వచ్చింది. "సింగింగ్, యాంకరింగ్ ఐపోయింది. యాక్టింగ్ కోసం నన్ను ఏ రాజమౌళి గారో, సుకుమార్ గారో నాకు ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చారంటే ఆ కిక్కే వేరప్పా" అని కోరుకుంది. తర్వాత కావ్య వచ్చింది "ఏ షోస్ కి వెళ్లినా లేదా బయటకు ఎక్కడికి వెళ్లినా ఆర్టిస్ట్స్, యాంకర్స్  అందరూ కలిసి ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్ నను ఎప్పుడూ,  ఎవరూ నన్ను అడగకూడదు.. ఎవరైనా అడిగితే వాళ్లకు కూడా నాలాంటి సిట్యువేషన్ రావాలి" అని నేను కోరుకుంటాను అంది. ఆడియన్స్ అంతా ఎస్ అని చెప్పారు. ఇక తర్వాత సుహాసిని వచ్చి "మీ అందరికీ వంట చేసి పెడతాను" అనేసరికి ఆడియన్స్ అంతా నో అన్నారు. ఇలా వీళ్లంతా వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పారు.  

ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టి పెద్దవాళ్ళను చూసుకునే శక్తి ఇవ్వు శివయ్యా

  ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్తీక పౌర్ణమి స్పెషల్ గా వచ్చింది. ఐతే ఇందులో కొంతమంది వాళ్ళ వాళ్ళ కోరికలు ఆ శివయ్యకు విన్నవించుకున్నారు. వాటిని ప్లే చేసి అందరూ విన్నారు. ఇక మంజుల పరిటాల ఒక మంచి కోరికను కోరుకున్నారు. "శివయ్య తండ్రి ఒక కూతురిగా కొడుకుగా మా అమ్మానాన్నను చూసుకునే శక్తీ, ధైర్యం ఇచ్చావ్. అలాగే చాలామంది ఆడపిల్లలు వాళ్ళ తల్లితండ్రులను చూసుకోలేక బాధపడుతున్నారు. సో అలాంటి తల్లితండ్రులను ఓల్డేజ్ హోమ్ లో పెట్టి చూసుకునేంత అదృష్టం, శక్తీ నవ్వు ఇవ్వు తండ్రి" అని మంజుల పరిటాల కోరుకుంది. "ఇలాంటి ఒక కోరికకు ఇక్కడ ఉన్న చాలామంది కూడా హెల్ప్ చేస్తారు. ఐతే ఇలాంటి ఒక కోరికను కోరుకోవడానికి కారణం ఏమిటి" అని రష్మీ అడిగింది. "నిజానికి మా అమ్మకు మేము నలుగురం ఆడపిల్లలం. ఐతే చూసిన వాళ్లంతా కూడా నలుగురు ఆడపిల్లలా అని ఆమె బాధపడేలా కామెంట్స్ చేసేవారట చిన్నప్పుడు. అప్పుడు అమ్మ చాలా బాధపడిందట. ఆడపిల్లలు కూడా ఎందులోనూ తక్కువ కారు. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటున్నారు. కానీ కొంతమందికి మాత్రం వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోవాలి అనుకున్నా చూసుకోవడానికి అవ్వట్లేదు. వాళ్ళు ఆ విషయంలో బాధపడడం నేను చూసాను కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికీ రాకున్నా వాళ్ళను నేను ఒక చోట ఉంచి చూసుకోవాలి అనుకునేదాన్ని. చూడాలి ఎంత వరకు అవుతుంది అని. దానికి నాకు శక్తి ఇవ్వమని ఆ శివయ్యను కోరుకున్నా" అంటూ మంజుల తన మనసులో కోరికను బయట పెట్టింది. "మీ కోరికను ఎలా బయట పెట్టారో మీ ప్లాన్ ని కూడా ఆఫ్ - కెమెరా డిస్కస్ చేయండి. కచ్చితంగా ఇక్కడ ఉన్నవాళ్ళంతా మనఃస్ఫూర్తిగా సహాయం చేస్తారు. ఇలాంటి ఒక మంచి పనిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు అవుతారు" అంటూ రష్మీ చెప్పింది.

కన్నీళ్లు పెట్టుకున్న సత్య శ్రీ...ఒక్క పూట టాబ్లెట్ వేసుకోకపోయినా ....

  కార్తీక పౌర్ణమి స్పెషల్ గా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఆడియన్స్ ని అలరించింది. ఇక ఇందులో శివుడికి క్షీరాభిషేకం చేశారు ఈ షోకి వచ్చిన లేడీస్ అలాగే నంది చెవిలో వారి కోరికలను కూడా చెప్పుకుని వాటిని తీర్చమని కోరుకున్నారు. "కోరికలు బయటకు చెప్పుకుంటే నెరవేరవు అనే నమ్మకం ఉంది. కానీ ఇక్కడ మీ కోరికలు చెప్పుకుంటే అవి నెరవేర్చడానికి మేము కూడా ఎంతో కొంత సహాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నంది చెవిలో కోరుకున్న కోరికలేంటో" విందాం అంటూ రష్మీ చెప్పడంతో అలా ఒక్కొక్కరు ఎంఎం కోరుకున్నారో తెలిసింది. ముందుగా సత్యశ్రీ కోరికను ప్లే చేసి వినిపించారు. "శివయ్యా మా అమ్మ హెల్త్ అసలు బాలేదు. మా అమ్మ ఆరోగ్యం బాగవ్వాలి మునుపటిలా నవ్వుతూ ఉండేలా చేయవా ప్లీజ్..శివయ్యా ఆమె బాగుంటే మేము బాగుంటాం " అని కోరుకుంది. "ఏమయ్యింది అమ్మకు" అని ఇంద్రజ అడిగేసరికి "అమ్మకు హార్ట్ లో బ్లడ్ సర్క్యూలేషన్ అనేది లో. ఆమె ఒక్క పూట టాబ్లెట్ వేసుకోకపోయినా స్ట్రెస్ వచ్చి పెరలాసిస్ బారిన పడి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. అందుకే మేము ఆమెను ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాం. ఇప్పటి వరకు అమ్మ అసలు నార్మల్ గానే లేదు. మాట్లాడుతుంది కానీ మర్చిపోతుంది. ఎన్నో హాస్పిటల్స్ కి తిప్పాం. ఆమె అలా పడుకుని ఉంటుంది అంతే అసలు ఏంటో కూడా మాకు ఏమీ అర్ధం కావడం లేదు. మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం ఉంటుందన్నారు. టాబ్లెట్స్ ఇచ్చారు. వాటిని లైఫ్ లాంగ్ వాడాలి." అని చెప్పింది. దాంతో ఇంద్రజ "అంతా మంచి జరగాలి. అమ్మ కోలుకోవాలి అని ఇక్కడ అందరం కూడా ప్రే చేసుకుంటాం" అని భరోసా ఇచ్చింది. "ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. మేము ఎవరికీ చెప్పుకోలేదు. నాకంటూ నాకో ఫామిలీ ఉన్నారు అనే ధైర్యాన్ని ఇచ్చారు థాంక్యూ" అని చెప్పింది.

సన్యాసం తీసుకుంటున్న బుల్లితెర నటి

బుల్లితెర మీద విష్ణుప్రియ కనిపిస్తే చాలు విపరీతమైన నవ్వు ముంచుకొస్తుంది. ఇక ఈమె జోడి ప్రిథ్వి శెట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆడియన్స్ కి పండగే పండగా. అలాంటి విష్ణు ప్రియా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. "నీకు నచ్చే హజ్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి" అనేసరికి "ఈషా మెడిటేటర్ అయ్యి ఉండాలి..వేదాలు గురించి తెలిసి ఉండాలి, డాన్స్, సింగింగ్ వస్తే ఇంకా మంచిది, కుకింగ్ కూడా వచ్చి ఉండాలి, అట్లీస్ట్ బేసిక్స్ అన్నా అంటే అన్నం, పప్పు అన్నా చేయగలగాలి." అని చెప్పింది విష్ణు ప్రియా. ఇక హోస్ట్ ఐతే "వస్తాడా ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి" అని అడిగింది. "అంటే వస్తే చేసుకుంటా లేదంటే సన్యాసం పుచ్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను" అని చెప్పింది. "నచ్చిన అబ్బాయి రాకపోతే సన్యాసంలోకి వెళ్ళిపోతావా" అని అడిగింది హోస్ట్. "అవును నేను ఎప్పుడూ అదే ఆలోచించుకుంటూ ఉంటా. 50 , 58 వచ్చేసరికి నేను హరే రామ హరే కృష్ణ అనుకుంటూ నేను గుండుతో తులసి మాల వేసుకుని భగవద్గీత గురించి చెప్తూ ఉండాలి అనుకుంటూ ఉంటాను, లేదంటే కాశీకి వెళ్లి అక్కడ అలా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండిపోదామా అనుకుంటూ ఉంటాను." అని చెప్పింది. "విష్ణు నువ్వు ఇలా చేంజ్ ఐపోవడానికి కారణాలు ఏమిటి" అని హోస్ట్ అడిగింది. "చిన్నప్పటి నుంచి కృష్ణుడి ఆశీస్సులు నాతోనే ఉన్నాయనుకుంటాను. నేను ఉన్న హాస్టల్ లో భగవద్గీత ఒక సబ్జెక్టు. అలా నాకు భగవద్గీత నోటికి వచ్చేసింది. దేవుడు నిన్ను భూమిలోకి పాతేసి తర్వాత నిన్ను నెమ్మదిగా పైకి తీసుకొస్తాడు అని చెప్తూ ఒక భగవద్గీతా శ్లోకం కూడా చెప్పేసింది." ఇక హోస్ట్ ఐతే ఆ శ్లోకం విని "తర్వాత నీకు ఏ దేవిశ్రీ ప్రసాద్ గారో ఫోన్ చేసి ఒక పాట పాడాలి విష్ణు అని చెప్తారు అంది. తర్వాత ఇక లింగాష్టకం, అయిగిరి నందిని భక్తి గీతాలు కూడా తనకు వచ్చు అని చెప్పింది. ఇక దేవుళ్ళే తన ఫామిలీ అని చెప్పింది.

తనూజకి ఫేక్ ఓటింగ్.. జెన్యున్ ప్లేయర్స్ కి అన్యాయం జరుగుతుందా!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటివరకు ఎనిమిది వారాలు గడిచాయి. ఇక ఈ ఎనిమిది వారాల్లో ప్రియా, ఫ్లోరా సైనీ, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, రమ్య మోక్ష, అయేషా,  శ్రీజ ఎలిమినేషన్ అయ్యారు. అయితే భరణి ఎలిమినేషన్ అయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అయి బయటకొచ్చేసింది. బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటివరకు జరిగిన ప్రతీ నామినేషన్లో తనూజ దాదాపుగా ఉంది. అయితే తను హౌస్ లో ఎక్కువ టైమ్ కిచెన్ లో ఉంటుంది. అయితే తన బిహేవియర్ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే తినే ఫుడ్ ని చిరాకుగా సర్వ్ చేయడం ఎవరిది నచ్చదు‌‌.. అందుకే మాస్క్ మ్యాన్ హరీష్ కూడా తనని ఇదే పాయింట్ మీద నామినేషన్ చేశాడు. ఇక తనూజ చిరాకుకి సంజన, మాధురి, రాము, ఇమ్మాన్యుయల్ ఇలా చాలామంది బలయ్యారు కానీ ఎవరు అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే తనూజ గేమ్ ఆడినా ఆడకపోయిన తనకి మాత్రం ఓటింగ్ భారీగానే ఉంది. అయితే తనకి పడే ఓటింగ్ అంతా ఫేక్ అని, పీఆర్ లు డూప్లికేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎంతలా అంటే తనూజకి ప్రతీ నామినేషన్ లో యాభై నుండి అరవై శాతం ఓటింగ్ పడుతోంది. ఆ తర్వాత కళ్యాణ్ కి ఇరవై నుండి ముప్పై శాతం ఓటింగ్ పడుతోంది. అయితే హౌస్ లో జెన్యున్ గా ఆడే డీమాన్ పవన్, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, దివ్య, భరణి లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన అన్నీ ఎపిసోడ్ లలో చాలా కాన్ఫిడెంట్ గా జెన్యున్ గా ఆడే వాళ్ళ లిస్ట్ లో సుమన్ శెట్టి నెంబర్ వన్ ఉండగా ఆ తర్వాత దివ్య ఉంది. ఇక మూడో స్థానంలో భరణి ఉన్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్ ఉన్నారు. అయితే వీళ్ళు నామినేషన్ లోకి వచ్చినా వీరికంటే ఎక్కువగా తనూజ, కళ్యాణ్ లకి ఓటింగ్ పడుతోంది. అయితే వీళ్ళిద్దరు ఆడి గెలిచింది ఒక్క గేమ్ కూడా లేదు. పైగా కంటెంట్ కూడా ఏం ఇవ్వలేరు. కానీ ఓటింగ్ మాత్రం గట్టిగా పడుతోంది. అంటే ఇదంతా ఫేక్ ఓటింగ్ అని ఆడియన్స్ కి అర్థమైంది. అయితే తనూజ, కళ్యాణ్ లలో ఎవరో ఒకరిని విన్నర్ చేయడానికే బిగ్ బాస్ ప్లాన్ చేశాడనిపిస్తుందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.