లవ్ ట్రాక్ లో సుధీర్...స్మైల్ తో పడేశాడుగా!

   ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వారం ఈ ఎపిసోడ్ కి "రౌడీ గర్ల్స్ వెర్సెస్  రౌడీ బాయ్స్ " కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇక ఢీ డాన్సర్ పండు ఐతే సై మూవీలో భిక్షు యాదవ్ గెటప్ లో ముక్కుకు రింగు పంచెతో వచ్చాడు. ఇక అష్షు రెడ్డి వచ్చి భిక్షు యాదవ్ అనేసరికి "గట్టిగా కొడితే బిక్కు బిక్కు మంటూ ఏడుస్తాడు వీడు భిక్షు యాదవా" అంటూ సుధీర్ పండు మీద సెటైర్ వేసాడు. తర్వాత కావ్య బ్లాక్ శారీలో క్రాక్ మూవీలో జయమ్మ గెటప్ లో వచ్చింది. "జయమ్మ నీ గుండెల్లో కత్తి దింపుతా" అంటూ చేతిలో కత్తి తీసుకుని వచ్చి సుధీర్ ని బెదిరించింది. "నీకే ప్రమాదం" అన్నాడు సుధీర్. ఏ అని కావ్య అడిగేసరికి "అక్కడ ఉన్నది మీరే కదా మరి" అంటూ రొమాంటిక్ డైలాగ్ చెప్పేసరికి కావ్య నవ్వు ముఖం పెట్టింది. ఇక రియాజ్ ఐతే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో అమ్రిష్ పూరి గెటప్ వేసుకుని వచ్చాడు. ఇక ఫైనల్ లో సౌమ్యశారదా నరసింహ మూవీలో రమ్యకృష్ణ అలియాస్ నీలాంబరి గెటప్ లో బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చింది. "నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతా అనే ఒకే లవ్ ట్రాక్ తో అందరినీ బకరా చేసావే ఆ ట్రిక్ నాకు బాగా నచ్చింది...అన్నా ఏయ్ అన్నా ఏయ్ అని నీ ఫాన్స్ చెప్తున్నప్పుడు అందరితో వేసిందంతా వేసి అయ్యో నాకేం తెలీదురా బాబు అని ఒక దొంగ స్మైల్ ఇస్తావే ఆ స్మైల్ నాకు బాగా నచ్చింది" అంటూ చెప్పిన డైలాగ్స్ కి సుధీర్ పడీపడీ నవ్వాడు. ఇక తర్వాత షోలో ఉన్న వాళ్లందరితో గేమ్స్ ఆడించాడు.

ఫేక్ అకౌంట్స్ నడుపుతున్న భాస్కర్

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ఫుల్ కామెడీగా ఉంది. శాంతి స్వరూప్ పట్టు చీర కట్టుకుని వచ్చేసరికి రాంప్రసాద్ వెంటనే "శారీ మాత్రం చాలా బాగుందమ్మా" అన్నాడు. దాంతో "మా మావయ్య ఆయన చేతుల మీద పట్టు చీర కొట్టాడు. ఈ చీర కోసం 100  పట్టు పురుగులు చచ్చాయి" అన్నాడు. దాంతో దొరబాబు "ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయా" అంటూ శాంతి స్వరూప్ మీద సెటైర్ వేసాడు. ఇక ఫైనల్ లో బులెట్ భాస్కర్, ఫైమా స్కిట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. "ఏవండీ ఈ రోజు నైట్ కి ములక్కాడ చారు చేయమంటారా, ములక్కాయ పులుసా " అని అడిగింది. "వద్దు, వద్దు, వద్దు" అన్నాడు భాస్కర్. "ఎందుకండీ" అంటూ ఫుల్ ఫెయిర్ అయ్యింది. "అవి తిన్న తర్వాత తిట్టించుకునేకన్నా తినకముందు తిట్టించుకోవడం మంచిది" అన్నాడు. ఇక వర్ష వచ్చింది. ఆమె ముందు నాటీ నరేష్ తెగ కుప్పిగంతులు వేసి ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేసాడు. "కాఫీ పెట్టుకుని తీసుకునిరా" అన్నాడు నరేష్. "నేను కాఫీ తేను" అని చెప్పింది వర్ష. "ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్" అన్నాడు నరేష్. "ఏంట్రా" అని వర్ష ఫైర్ అయ్యేసరికి " ఏంటే నరుకుతా. మొగుడంటే ఏళాకోళంగా ఉందా, ఎకసెక్కాలుగా ఉందా" అన్నాడు. "నువ్వున్నది ఇంతా నీ ఆరుపెంట్రా ఇంత ఉంది" అంటూ వర్ష కౌంటర్ వేసింది. ఇంతలో భాస్కర్ వచ్చాడు. "ఎంత ఉన్నామన్నది కాదు అరిపించామా లేదా అన్నది ముఖ్యం" అన్నాడు నరేష్. ఇంతలో భాస్కర్ వచ్చాడు.."నాటీ నరేష్ పేరుతో ఫేస్ బుక్ లో నాలుగు ఫేక్ అకౌంట్స్ పెట్టి 40 మంది అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నాను. కొట్టుకు చచ్చిపోతున్నారు సర్ ఆడోల్లు మీకోసం అక్కడ" అంటూ ఆడియన్స్ గా వచ్చిన కాలేజ్ గర్ల్స్ ని చూపించాడు. దాంతో వాళ్లంతా వచ్చి నరేష్ ఆడిపాడారు. అందులో ఒక కాలేజీ గర్ల్ ఐతే మనిషి చిన్నోడే ఐనా మనసు చాలా పెద్దది అంటూ హార్ట్ సింబల్ చూపించింది నరేష్ కి.

Bigg Boss 9 Telugu : నిఖిల్ నామినేషన్ తో తనూజ షాక్.. దివ్య పాపం!

  బిగ్ బాస్ సీజన్-9 ఎనిమిదో వారానికి చేరుకుంది.  సోమవారం మొదలైన నామినేషన్ ప్రక్రియ నిన్నటివరకు ఆసక్తికరంగా సాగింది.  నామినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్  భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  తనని చూసి దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి భరణిని హగ్ చేసుకుంటుంది. భరణిని చూసి తనూజ ఎమోషనల్ అవుతుంది. కట్టప్పా వచ్చాను..  అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచావు.. మహేంద్ర బాహుబలి వచ్చాడని ఇమ్మాన్యుయల్ తో భరణి అంటాడు. భరణి తన మొదటి నామినేషన్ సంజనని చేస్తాడు. మీరు మాట్లాడే మాటలు ఇతరులని హర్ట్ చేసే విధంగా ఉన్నాయి. హరీష్ ఒక మాట ఏదో అన్నందుకు బాడీ షేమింగ్ అన్నారు.. మరి మీరు చేస్తోంది ఏంటి? కెప్టెన్ ని ఇష్టం వచ్చినట్లు మాటలు అనొచ్చా అని భరణి తన పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్పాడు. రెండో నామినేషన్ కి నాకు ఛాన్స్ ఇవ్వండి అని భరణిని దివ్య అడుగుతుంది. అది పట్టించుకోకుండా నిఖిల్ కి ఇస్తాడు‌ భరణి.  దాంతో దివ్య బాధపడుతుంది. తనూజని నిఖిల్ నామినేట్ చేస్తాడు. కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మాన్యుయల్ మీరున్నప్పుడు.. నాకు ఛాన్స్ ఇవ్వండి అని బెగ్గింగ్ చేసావ్.. అలా చెయ్యొచ్చా.. ఆడాలి కదా.. రేపు ట్రోఫీ విషయంలో కూడా ఇలాగే చేస్తావా అని తనూజతో నిఖిల్ ఆర్గుమెంట్ చేస్తాడు. అసలు ఇన్ని రోజులు మీరేం ఆడారని తనూజ అడుగగా అసలు మీరేం ఆడారుని నిఖిల్ అంటాడు. నేను ఆడాను కాబట్టి ఇక్కడున్నానని తనూజ అంటుంది. అయితే కెప్టెన్ బోర్డులో మీరు లేరు కదా అని నిఖిల్ వెటకారంగా మాట్లాడతాడు. చూస్తావేమో త్వరలో అని తనూజ అంటుంది. ఆ తర్వాత భరణి నామినేషన్ అనంతరం వెళ్లిపోతుంటే భరణి దగ్గరికి తనూజ వచ్చి నా వాళ్లే మీరు బయటకు వెళ్లిపోయారా అని అడుగుతుంది. అదేం లేదు మంచిగా ఆడమని తనూజకి చెప్తాడు. దివ్యని అసలు పట్టించుకోకపోవడంతో తను ఫీల్ అవుతుంది. మరి దివ్య, భరణి కలిసారా..‌లేక ఆ గ్యాప్ ని‌ దివ్య అలానే మెయింటేన్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Bigg Boss 9 Telugu : దివ్య ఎమోషనల్.. భరణి అలా చేశాడేంటి!

  బిగ్ బాస్ సీజన్-9 లో రోజుకొక ట్విస్ట్ జరుగుతుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి నామినేషన్ ప్రక్రియ చేసి తర్వాత వెళ్లిపోయారు కానీ ఇద్దరు కంటెస్టెంట్స్ ని మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు.. భరణి, శ్రీజ హౌస్ లో కి వెళ్లారు. వీళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రమే హౌస్ లో ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే భరణి, శ్రీజ హౌస్ లోకి రాగానే అందరు షాక్ అవుతారు. భరణి తన కుటుంబాన్ని ఎప్పటిలాగే కలిసి మాట్లాడాడు. ఇక నామినేషన్స్ అప్పుడు తనూజ తో మాట్లాడావ్ కానీ నాతో మాట్లాడలేదని భరణితో చెప్పుకుంటూ దివ్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత  తనూజ, సుమన్, దివ్య, రాము అందరితో గేమ్ ఇలా ఆడండి.. అలా ఆడండి అని చెప్తాడు. దివ్య పక్కకి వెళ్లి నాకు ఏదైనా చెప్పాలని ఉంటే నాకు సపరేట్ గా చెప్పండి.. అందరితో కాదని భరణితో దివ్య చెప్తుంది. ఆ తర్వాత భరణి, శ్రీజ ఇద్దరిలో..  వాళ్లలో ఏం మార్చుకోవాలి.. ఎందువలన హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారో చెప్పండి అని కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ చెప్పాడు. ఒక్కో కంటెస్టెంట్స్ వచ్చి ఒక్కో రీజన్ చెప్పారు. ఎక్కువగా భరణికి చెప్పారు. ట్రస్ట్ వద్దు.. బాండ్ వద్దు గేమ్ ఆడండి అని చెప్తారు. శ్రీజకి మాట్లాడడం వాదించడం తగ్గిస్తే బెటర్ అని చెప్తారు.. భరణి, శ్రీజ ఇద్దరిలో ఈ వారంలో ఎవరు తమని తాము ప్రూవ్ చేసుకుంటారో వాళ్లే హౌస్ లో ఉంటారు.. మిగతా కంటెస్టెంట్స్ బయటకు వస్తారు.. ఏ కంటెస్టెంట్ ఉంటారో.. చూడాలి మరి. భరణి ఉంటే 'బలగం-2' సిద్ధమతుందా లేక.. శ్రీజతో మాధురి 'జగడం' ఉండనుందా తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu : డీమాన్ కి బుద్ధి లేదు.. శ్రష్టి వర్మ బోల్డ్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్-9 లో నామినేషన్ ప్రక్రియ వరుసగా రెండు రోజులు జరిగింది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ లోని కంటెస్టెంట్స్ ని నామినేట్ చేశారు. దీంతో వీరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో మొదటి వారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన శ్రష్టి వర్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తను హౌస్ లోకి వెళ్ళగానే రాము ఎదురుగా వచ్చి హగ్ చేసుకున్నాడు. శ్రష్టి తన మొదటి నామినేషన్ డీమాన్ పవన్ ని చేసింది. నీకు కండ బలం ఉంది కానీ బుద్ధి బలం లేదని శ్రష్టి అంటుంది. నీకు టాస్క్ లో ఎక్కడ బుద్ధి బలం లేదని అనిపించిందని శ్రష్టి ని డీమాన్ అడుగుతాడు. నీకు ఏదైనా చెప్తే అందరిని ఇలాగే అడుగుతావు .. ఫస్ట్ నీకు ఏ విషయంపై క్లారిటీ లేదని శ్రష్టి అంటుంది. రీతూకి ప్రతీ విషయంలో క్లారిటీ గా ఉందని శ్రష్టి అంటుంది. వీరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇక ఆ తర్వాత సెకెండ్ నామినేషన్ కి రాముకి  ఛాన్స్ ఇస్తుంది శ్రష్టి. గౌరవ్ ని రాము నామినేట్  చేస్తాడు. కెప్టెన్ గా ఇద్దరున్నారు.. ఇద్దరిది బాధ్యత కానీ సుమన్ అన్న ఏం చేయడం లేదని ఫీల్ అయ్యావ్.. ఏదైనా గొడవ జరిగితే ఆడవాళ్ళ మధ్యలోకి వెళ్ళనని చెప్పావ్ కానీ కెప్టెన్ అన్నప్పుడు నీ బాధ్యతలు కూడా ఉంటాయని రాము అనగానే గౌరవ్ షాక్ అవుతాడు. నామినేషన్ అయ్యాక ఒక నిన్ను మాత్రమే ఫ్రెండ్ అని ట్రస్ట్ చేశాను.. ఇక హౌస్ లో ఎలాంటి బాండ్ లేదు.. ఎవరిని ట్రస్ట్ చెయ్యొద్దని రాముతో గౌరవ్ అంటాడు. ఇప్పటివరకు రాము, గౌరవ్ కలిసి ఉండేవారు.. ఈ నామినేషన్ తో వీరిమధ్య దూరం పెరిగింది. వీకెండ్ ఎపిసోడ్ లో వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అని నాగార్జున చెప్తారో లేదో చూడాలి మరి.

Jayam serial : మార్టిన్ కి నిజం చెప్పిన వీరు.. గంగ మాటలని శకుంతల నమ్ముతుందా!

  జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -96 లో.....రుద్రని ఓడించాలని మార్టిన్ తో పారు అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది. మరొకవైపు రుద్రని పోటీలో చంపేస్తే నీకు రెండు కోట్లు ఇస్తానని మార్టిన్ తో డీల్ కుదుర్చుకుంటాడు వీరు. రుద్ర, మార్టిన్ పోటీపడుతారు మొదటి రౌండ్ కి రుద్ర విన్ అవుతాడు‌. మీ తమ్ముడిని చంపింది ఎవరో నాకు తెలుసు నువ్వు ఓడిపోతే నిజం చెప్తానని మార్టిన్ అనగానే రుద్ర సెకండ్ రౌండ్ కి ఓడిపోతాడు. ఆ తర్వాత వీరు చెప్పినట్లు రుద్రని మార్టిన్ ని చంపాలని ట్రై చేస్తాడు. దాంతో ముందే పసిగట్టిన రుద్ర తన కాలు విరగ్గొడతాడు. ఆ తర్వాత రుద్ర దగ్గర గంగ వాళ్ళు వచ్చి ఎందుకు ఓడిపోయారని అడుగుతారు. అప్పుడే పారు వస్తుంది. నువ్వు రాంగ్ రూట్ లో ఎటాక్ చేసి మార్టిన్ ని ఆడకుండా చేసావ్.. నువ్వు ఓడిపోయినట్లే అని పారు అనగానే తను అలాగే చేసాడు.. నేను అలా చేశాను.. అలాగని మార్టిన్ గెల్వలేదు.. నేను ఓడిపోలేదని పారుకి రుద్ర స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. మార్టిన్ ని కార్ ఎక్కించి రుద్ర కంట కనపడకుండా వెళ్ళమని వీరు చెప్తాడు. అసలు వాళ్ళ తమ్ముడిని చంపింది ఎవరని మార్టిన్ అడుగుతాడు. నేనే అని వీరు తన పగ గురించి మార్టిన్ కి చెప్తాడు. అదంతా గంగ విని షాక్ అవుతుంది. ఆ తర్వాత గంగ పెద్దసారు ఇంటికి వెళ్లి ఇన్ని రోజులుగా రుద్ర సర్ దోషి అనుకుంటున్నారు కానీ అసలు దోషి ఎవరో తెలిసింది.. అంతా చేస్తుంది ఈ వీరు సర్ అనగానే అందరు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావని వీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. రుద్ర వాళ్ళ తమ్ముడిని ఎవరు చంపారో నిజం నాకు చెప్పండి అని మార్టిన్ అనగానే వీరు సర్ చెప్పారు.. అసలు ఆ మార్టిన్ తో వీరు సర్ నే అలా చెప్పించి ఉంటాడని గంగ చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని శకుంతల కోప్పడుతుంది. గంగ చెప్పింది నిజమే వీరు తప్పు చేసాడనట్లేదు కానీ మార్టిన్ మాత్రం నాతో అలాగే అన్నాడని రుద్ర అంటాడు. ఇక ఇషిక, వీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : నిజం తెలుసుకున్న ప్రేమ, నర్మద.. ధీరజ్ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తాడా!

  స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -301 లో..... ధీరజ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ధీరజ్ వెనకాలే రామరాజు, తిరుపతి ఇంకా తన ఇద్దరు కొడుకులు వెళ్తారు. స్టేషన్ లో శోభ వాళ్ళ నాన్న ఉంటాడు. ప్లీజ్ అండి మా అబ్బాయి అలాంటి వాడు కాదు.. కంప్లైంట్ వెనక్కి తీసుకోమని రామరాజు రిక్వెస్ట్ చేస్తాడు. నా కూతురిని కిడ్నాప్ చేసాడు. ఎలా కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానని అతను అంటాడు. ప్రేమ, నర్మద కూడా స్టేషన్ కి వెళ్తారు. మరొకవైపు అత్తింటి విషయం శ్రీవల్లి తీసుకొని వెళ్లి పుట్టింట్లో చేరవేస్తుంది. ఇప్పుడు ధీరజ్ పై ఇంకా కోపం వచ్చేలా చేస్తే ప్రేమ, ధీరజ్ ని ఇంట్లో నుండి గెంటెస్తారని శ్రీవల్లి ప్లాన్ చేస్తుంది. కానీ అలా వద్దు.. ఇప్పుడు మనం మీ మావయ్య దగ్గర సింపథీ కొట్టెయ్యాలని రామరాజుకి భాగ్యం ఫోన్ చేస్తుంది. మీరు ఏం కంగారు పడకండి అన్నయ్య.. నాకు తెల్సిన లాయర్ ని పంపిస్తాను.. బెయిల్ ఇప్పిస్తాడని భాగ్యం చెప్తుంది. వద్దని రామరాజు అంటున్నా భాగ్యం చిరాకు తెప్పిస్తుంది. దాంతో నర్మద ఫోన్ తీసుకొని లాయర్ ని పంపించండి పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలని చెప్పగానే భాగ్యం భయపడి ఫోన్ వినపడనట్లు యాక్ట్ చేసి కట్ చేస్తుంది. మరోవైపు ధీరజ్ ని చూస్తూ ప్రేమ ఎమోషనల్ అవుతుంది. అదేసమయంలో సాగర్, చందు బెయిల్ కోసం లాయర్ దగ్గరికి వెళ్తారు కానీ అలాంటి కేసుకి బెయిల్ రాదని లాయర్ చెప్తాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో తెలిస్తే శోభని మనం వెతకొచ్చు అని ప్రేమతో నర్మద అంటుంది. అక్కడ కానిస్టేబుల్ ని రిక్వెస్ట్ చేసి ధీరజ్ దగ్గరికి వెళ్లి అసలేం జరిగిందో కనుక్కోమంటారు. కాసేపటికి ధీరజ్ దగ్గరికి కానిస్టేబుల్ వెళ్తాడు. అసలు విషయం కనుక్కొని వచ్చి ప్రేమ, నర్మదకి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : గుడికి వెళ్ళిన సుమిత్ర.. దశరథ్ ని చూసి షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -500 లో......పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. గెలవాలంటే మనం అనుకున్నది చెయ్యాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. మరుసటి రోజు శివన్నారాయణ హాల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను బయటకు వెళ్తున్నాను నాన్న ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యండి అని అంటాడు. వీడు ఖచ్చితంగా గుడికి వెళ్తున్నాడని కార్తీక్, శివన్నారాయణ అనుకుంటారు. సరే వెళ్ళు కానీ కార్తీక్ ని కూడా తీసుకొని వెళ్ళమని శివన్నారాయణ అంటాడు. కార్తీక్, దశరథ్ ఇద్దరు బయల్దేర్తారు. మరోవైపు జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటారు. అసలు ఏం జరుగుతుంది మమ్మీ ఖచ్చితంగా ఆ దీప దగ్గర ఉంటుందని జ్యోత్స్న అనగా.. ఇప్పుడు మరొక తప్పు చెయ్యకని పారిజాతం అంటుంది. ఇప్పుడు తప్పు చేసే సిచువేషన్ కాదు తప్పుని సరిదిద్దుకునే సిచువేషన్ అని జ్యోత్స్న అక్కడ నుండి బయల్దేర్తుంది. మళ్ళీ ఇదేమో చేయబోతుందని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు ఎందుకు జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పవని కాశీని శ్రీధర్ అడుగుతాడు. నాకు జాబ్ వచ్చింది అంటేనే మీరు సైలెంట్ గా ఉన్నారు.. లేదంటే రోజు నన్ను ఏదో ఒకటి అనేవారు.. అందుకే అబద్ధం చెప్పాను.. ప్లీజ్ మావయ్య ఈ విషయం స్వప్నకి చెప్పకండి అని శ్రీధర్ కాళ్ళు పట్టుకుంటాడు. సరే చెప్పనులే అని శ్రీధర్ అంటాడు. అది స్వప్న చూసి ఏంటి కాశీ మా డాడీ కాళ్ళు పట్టుకున్నాడని అనుకుటుంది. ఆ తర్వాత కార్తీక్, దశరథ్ గుడికి వెళ్తారు. కార్తీక్ వెటకారంగా మాట్లాడుతుంటే.. నాన్న, నువ్వు ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారేంట్రా అని దశరథ్ అంటాడు. అప్పుడే దీపకి కార్తీక్ ఫోన్ చేసి.. ఇదే కరెక్ట్ టైమ్ అత్తని గుడికి తీసుకొని రా అని చెప్తాడు. దానికి దీప సరే అంటుంది. ఆ తర్వాత సుమిత్రని గుడికి తీసుకొని వెళ్ళాలని దీప తన గదిలోకి వెళ్తుంది. అక్కడ సుమిత్ర ఉండదు‌. అప్పుడే మా అమ్మ ఎక్కడ అని జ్యోత్స్న పోలీసులని తీసుకొని వస్తుంది. ఇల్లంతా వెతుకుతుంది. ఒకవైపు సుమిత్ర అమ్మ ఎక్కడ అని దీప టెన్షన్ పడుతుంటే జ్యోత్స్న వచ్చి అలా అడుగుతుంది. దీప, కాంచన ఇద్దరు టెన్షన్ పడుతారు. మరొకవైపు సుమిత్ర గుడికి వెళ్తుంది. దేవుడికి మొక్కుకొని వెనక్కి చూసేసరికి దశరథ్ ఉంటాడు. తనని చూసి సుమిత్ర షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : పాలగ్లాస్ తో గదిలో కావ్య.. స్వప్నకి విడాకులు ఇస్తానన్న రాహుల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -863 లో..... కావ్య వ్యాయామం చేస్తూ ఉంటే రాజ్ వస్తాడు. ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా.. ఎగ్జిట్ గోల్స్ అంటూ నీకు నచ్చింది చేస్తున్నావని రాజ్ కోప్పడతాడు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి వీడు ఏమంటున్నాడని కావ్యని ఇందిరాదేవి అడుగుతుంది. మీకేం అర్థం కాలేదు కదా అని కావ్య అనగానే.. కాలేదని ఇందిరాదేవి చెప్తుంది.  దాంతో కావ్య రిలాక్స్ అవుతుంది. మరొకవైపు అప్పు అద్దం దగ్గర ఉంటుంది. వెనకాల నుండి కళ్యాణ్ వచ్చి హగ్ చేసుకుంటాడు. ఏంటి ఈ రోజు ఇలా చేస్తున్నావని అప్పు అడుగుతుంది. అప్పుడే అప్పుని ధాన్యలక్ష్మి పిలవడంతో అప్పు వెళ్ళిపోతుంది. మమ్మీ కరెక్ట్ టైమ్ కి పిలుస్తుందని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ తర్వాత స్వప్న, కావ్య హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ పక్కనే రాహుల్ ఇంకా తన లవర్ ఐస్ క్రీమ్ తింటూ కన్పిస్తారు. అది చూసిన కావ్య ఇంకా రాహుల్ మారలేదా అని స్వప్నని అడుగుతుంది. ఇప్పుడే వెళ్లి నాలుగు కొట్టి నిలదియ్ అని కావ్య అనగానే.. ఇంటికి వచ్చాక వాడి సంగతి చెప్తానని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాహుల్ తో షాపింగ్ చేసి బిల్ కట్టించాలని తన లవర్ అనుకుటుంది. ఇప్పుడు దీంతో షాపింగ్ కి వెళ్తే బిల్ నన్నే కట్టమంటుందని రాహుల్ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. ఆ తర్వాత కావ్య మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ తో గదిలోకి వెళ్తుంటే.. ఇదేంటి కొత్తగా అని ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కావ్యని అడుగుతారు. మీ మనవడు అలా రమ్మన్నాడని కావ్య చెప్తుంది. నువ్వు ప్రెగ్నెంట్ వి జాగ్రత్తగా ఉండాలని కావ్యతో అపర్ణ, ఇందిరాదేవి అంటారు. ఆ విషయం మీ మనవడికి చెప్పండి అని కావ్య చెప్పి వెళ్లిపోతుంది. రాజ్ రాగానే నువ్వు చేస్తుంది ఏంట్రా తను ప్రెగ్నెంట్.. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని ఇందిరాదేవి అనగానే ఆ విషయం మీ మనవరాలికి చెప్పండి అని రాజ్ లోపలికి వెళ్తాడు. లోపల కావ్య పాల గ్లాస్ తో సిగ్గుపడుతుంటే ఏంటే ఈ అవతారమని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో స్వప్నకి రాహుల్ విడాకులు ఇస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కన్నీళ్లు పెట్టుకున్న భావన.. భాను డాన్స్ లో డెప్త్ కాదు విడ్త్ కూడా ఉంది

కార్తీక మాసం స్పెషల్ గా "కార్తీక వైభోగమే" పేరుతో ఈ ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ కార్తీక పౌర్ణమిని స్పెషల్ గా చేసుకోబోతున్నాం అలాగే అక్కాచెల్లెళ్ల సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నాం. ఈ షోకి శ్రీవాణి తన అక్కని తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసింది. ఇక ఢీ డాన్సర్ మహేశ్వరీ ఐతే ఆ నటరాజుడు కలిపినా అక్కచెల్లెళ్ళం మేము అని చెప్పింది. ఇక అందరూ శివలింగానికి క్షీరాభిషేకం చేసి ఆ నందీశ్వరుడి చెవిలో ఎం చెప్తే ఆ కోరిక నెరవేరుతుందని అందరూ వారి వారి కోరికలు కోరుకున్నారు. ఇక భావన ఐతే కన్నీళ్లు పెట్టుకుంది. "ఎందుకు అని రష్మీ అడిగింది" ." నాకు ఒక సొంత అక్క ఉంది. కానీ చాల రోజుల నుంచి మాటలు లేవు. ఇంతమంది అక్కాచెల్లెళ్లను చూసేసరికి బాధ కలిగింది. అక్కను దగ్గర చేసుకుంటే అమ్మ దూరమైపోతుంది. అమ్మను దగ్గర చేసుకుంటే అక్క దూరమైపోతుంది. ఎవరు కావాలి అని డిసైడ్ చేసుకోవాలో తెలీట్లేదు" అని ఏడ్చేసింది. ఇక అల్లరి ప్రియుడు మూవీ సీన్ ని స్పూఫ్ గా చేశారు మహేశ్వరి, సత్యశ్రీ, నాటీ నరేష్. "చెప్పవే చిరుగాలి" సాంగ్ కి భానుశ్రీ డాన్స్ చేసింది. వెంటనే రష్మీ "మేడం భాను పెర్ఫార్మెన్స్ లో డెప్త్ ఉందా" అని అడిగింది. "డెప్త్ కాదు విడ్త్ కూడా ఉంది" అంటూ ఇంద్రజ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ఇక డాన్సర్స్ అంతా కలిసి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర మహిమను వర్ణిస్తూ చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

లెజెండ్ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాములుగా లేపలేదు!

  జయమ్ము నిశ్చయమ్మురా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ దేవిశ్రీప్రసాద్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. "లెజెండ్ ..నువ్వు నాకిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాములుగా లేపలేదు నువ్వు నన్ను." అన్నారు జగ్గు భాయ్. థ్యాంక్యూ సర్ అన్నాడు డిఎస్పీ. "నాన్న గారు రాసిన పాట తెలీదు కానీ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు రాసిన పాట మాత్రం బాగా తెలుసు" అని జగ్గూభాయ్ అనేసరికి "ఎం పాట సర్ అది" అంటూ డిఎస్పీ రివర్స్ లో ఆయన్నే అడిగారు. వెంటనే "నిన్ను చూడగానే చిట్టి గుండె" సాంగ్ ప్లే అయ్యింది బ్యాక్ గ్రౌండ్ లో. "రోడ్డు మీద అనుకోకుండా వచ్చిన పాట సర్ ఇది. ఈ లైన్ పడేసరికి ఇటు నుంచి ఇంకో అమ్మాయి వెళ్తోంది.  సరదాగా కళ్యాణ్ గారిని పిలిచి ఈ పాటను వినిపిద్దామా అని అంటే వీడు ఆరడుగుల బుల్లెట్టు అని పాడి అక్కడ ఒక కెమెరా స్టాండ్ ఉంది. అది తీసి ఒక గన్ లా ధడ్ ధడ్ ధడ్ అని "చెప్తూ నవ్వేసాడు. "మళ్ళీ లవ్ స్టోరీలకు వస్తే" అంటూ జగ్గు భాయ్ అనేసరికి "మీరు మీ ఇంటర్వ్యూ అనుకుంటున్నారేమో సర్ ఇది నా ఇంటర్వ్యూ సర్" అంటూ కౌంటర్ వేసాడు డిఎస్పీ. "రొమాంటిక్ బాయ్" అంటూ జగ్గు భాయ్ కి కాంప్లిమెంట్ ఇచ్చాడు డిఎస్పీ. "ఫస్ట్ రాసిన పాట పాడితే బాగుంటుంది" అని జగపతి బాబు అనేసరికి వెంటనే డిఎస్పీ తన బ్యాండ్ తో రెడీగా ఉన్నాడు. "లెట్స్ గో ఏ నీయొక్క అందం చూసి" అంటూ ఒక సాంగ్ పడేసరికి జగ్గు భాయ్ ఫిదా ఐపోయి క్లాప్స్ కొట్టారు.

ఇండస్ట్రీకి కొత్త యాంకర్..భయంతో శ్రీముఖి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. అందమైన అమ్మాయిలతో జరుపుకునే కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ గా దీన్ని టెలికాస్ట్ చేయబోతున్నారు. పండగ రోజు వీళ్ళ కట్టు, బొట్టు అందం చూస్తుంటే కొలికేయాలనిపిస్తోంది, కొలికేయాలనిపిస్తోంది అంటూ చెప్పింది శ్రీముఖి. ఇక ఈ షోకి సుహాసిని ఫుల్ బుట్టబొమ్మలా రెడీ అయ్యి వచ్చింది. "పండగ రోజు నువ్వు మీ ఆయన ఎం చేస్తారో చెప్పు" అంటూ శ్రీముఖి అడిగింది. దానికి అవినాష్ ఆన్సర్ ఇచ్చాడు. "పొద్దున్న లేవగానే డజన్ రైస్ పెడుతుంది." అనేసరికి శ్రీముఖి వెంటనే "లీటర్ కర్రీ వండుద్ది" అనేసరికి సుహాసిని షాకైనట్టుగా ఒక ఫేస్ పెట్టింది. ఇక కార్తీక దీపం 2  లో నటిస్తున్న గాయత్రి కూడా వచ్చింది. వెంటనే శ్రీముఖి ఆమె దగ్గరకు వెళ్లి "నీకు ఎలాంటి హజ్బెండ్ కావాలి చెప్పు" అని అడిగింది. "శ్రీముఖికి ఎలాంటి హజ్బెండ్ ఐతే వస్తాడో నాకు అలాంటి హజ్బెండ్ కావాలి " అని చెప్పింది. దాంతో శ్రీముఖి భయపడిపోయి "ఓరి నాయనో ఇది నా మొగుడి మీద కన్నేసేటట్టుందిరా" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక కావ్య శ్రీముఖిని చూసి "ఏంటి నీకు నిజంగా అబ్బాయి కావాలా" అని అడిగింది చిరాకు మొహంతో. దాంతో శ్రీముఖి ఎం చెప్పాలో తెలీక నవ్వేసింది. ఇక ఈ ఎపిసోడ్ కి సిరి హన్మంత్ ఫస్ట్ టైం వచ్చింది. ఆ విషయాన్నీ శ్రీముఖి చెప్పింది. "సిరి బిజినెస్ ని చూసుకుంటుంది అని విన్నాను. ఎందుకు ఇట్లా చేస్తున్నావ్ నువ్వు" అనేసరికి "నో ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ " అంటూ రోహిణి ఆన్సర్ ఇచ్చింది. అలాగే సమీర్ భరద్వాజ్ కూడా ఈ షోకి వచ్చింది. "ఇన్నాళ్లు మీరు ఆమెలో సింగర్ ని, ఎంటర్టైనర్ ని మాత్రమే చూసారు. కానీ ఇండస్ట్రీకి కొత్త యాంకర్ వచ్చింది" అంటూ ఆమె గురించి గొప్పగా ఎలివేషన్ ఇచ్చింది. "ఇది చదరంగం కాదు రణరంగమే" అంటూ సమీరా బిగ్ బాస్ డైలాగ్ చెప్పింది. "ఈ డైలాగ్ మా హరి రాసాడు" అంటూ శ్రీముఖి సమీరాకి చెప్పింది.

Bigg Boss 9 Telugu : కళ్యాణ్ ని నామినేట్ చేసిన శ్రీజ.. రీతూ, మాధురి మధ్య ముదిరిన గొడవ!

  బిగ్ బాస్ సీజన్-9 ఎనిమిదో వారానికి ఎంట్రీ అయింది. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా శ్రీజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వగానే మాధురితో గొడవ మొదలైంది. మీ పేరు మాధురినే కదా నేను బయట కూడా కనుక్కున్నాను చాలా మందికి తెలియదట అని శ్రీజ అనగానే నాక్కూడా మీరు ఎవరో తెలియదని మాధురి అంటుంది. ఆ తర్వాత మీరు హౌస్ లోకి ఎందుకు వచ్చారో నాకు అర్థం అవ్వడం లేదు.. బాండింగ్ కోసం వచ్చారా అని మాధురిని శ్రీజ అడుగుతుంది. అవునని మాధురి వెటకారంగా సమాధానం చెప్తుంది. తనూజ నీపై తప్పుడు అలిగేషన్ వేసిన వాళ్ళతో బాండింగ్ పెంచుకుంటావ్ ఎందుకని తనూజని సూటిగా అడుగుతుంది శ్రీజ. అప్పుడే బిగ్ బాస్ మాట్లాడుతూ.. మీరు నామినేట్ చెయ్యడానికి వచ్చారు. ఆ ప్రక్రియ చెయ్యండి అని శ్రీజకి చెప్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ ని శ్రీజ నామినేట్ చేసి అందరికి ట్విస్ట్ ఇస్తుంది. నిన్ను రమ్య, మాధురి గారు ఇద్దరు కలిసి ఆడోళ్ళ పిచ్చోడు అన్నారు. అది నిజమేనా అని కళ్యాణ్ ని శ్రీజ అడుగుతుంది. లేదని కళ్యాణ్ చెప్పగానే.. మరెందుకు సైలెంట్ గా ఉన్నావ్.. నామినేషన్ లో వాళ్ళని ఎందుకు నామినేట్ చేయ్యలేదు. తనూజని చెయ్యాలని అనుకున్నావ్ కానీ తనని కూడా చెయ్యలేదు.. ఎందుకు తన నామినేషన్ అప్పుడు చెయ్ వెయ్యరా అన్నప్పుడు ఇక ఇద్దరం పాజిటివ్ గా ఉన్నాము.. ఇప్పుడు నామినేట్ చేస్తే నెగెటివ్ అవుతానని చేయలేదా అని శ్రీజ తన పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్తుంది. అలా ఏం కాదు ఆల్రెడీ తనని ఆ పాయింట్స్ మీద అయేషా నామినేట్ చేసింది అందుకేనని కళ్యాణ్ సమాధానం చెప్తాడు. శ్రీజ ఇంకొకరిని నామినేట్ చేసే ఛాన్స్ మాధురికి ఇస్తుంది. దాంతో రీతూని మాధురి నామిమేట్ చేస్తుంది. టాస్క్ లో మా టీమ్ నుండి వాళ్ళ టీమ్ కి వెళ్లావని రీజన్ చెప్తుంది. దానికి రీతూ, మధురి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఇద్దరిలో ఎవరూ తగ్గకుండా ఆర్గుమెంట్స్ చేసుకున్నారు‌. కళ్యాణ్ ని శ్రీజ నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్ట్.. ఎందుకంటే కళ్యాణ్ నిబ్బా.. కాబట్టి అతనికేం అర్థం కాలేదు.. అదే శ్రీజ చెప్పింది. రీతూ, మాధురి మధ్య జరిగిన డిస్కషన్ లో ఎవరిది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu : రీతూకి ఇచ్చిపడేసిన ఫ్లోరా.. సుమన్ శెట్టి బెస్ట్ నామినేషన్!

  బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటి సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ లోకి ఫ్లోరా సైనీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తను రీతూని నామినేట్ చేసింది. నువ్వు హౌస్ లోకి ఒక పర్పస్ తో వచ్చావ్.. ఇక్కడ ఒక లవ్ స్టోరీ నడిపోతే ఎక్కువ రోజులు ఉండొచ్చు అన్న ఆలోచనలో ఉన్నావ్.. అంతేకాకుండా ఎలాంటి బాండ్ లేని సంజన కోసం హెయిర్ కట్ చేసుకున్నావ్ కానీ నీతో మంచి బాండ్ ఉన్న డీమాన్ పవన్ కి టాస్క్ లో మనీ ఇవ్వలేదు. అలా సంజన గురించి హెయిర్ కట్ చేసుకుంటే ఓట్స్ పడుతాయని అలా చేసినట్టు అనిపించిందని ఫ్లోరా తన పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్పింది. రీతూ కూడా డిఫెన్డ్ చేసుకుంటుంది. ఆ తర్వాత సెకండ్ నామినేషన్ కి సుమన్ శెట్టికి ఛాన్స్ ఇస్తుంది ఫ్లోరా. దాంతో సంజనని సుమన్ శెట్టి నామినేట్ చేస్తాడు. మీరు హౌస్ లో అనే మాటలు బాగుండడం లేదు.. మీకు మాటలు అనడం అలవాటు అయింది.. మాకూ వినడం అలవాటు అయిందని సుమన్ శెట్టి చెప్తాడు. నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు డిస్ రెస్పెక్ట్ తో చూసారు.. నన్ను తొక్కలో కెప్టెన్ అన్నారని సుమన్ శెట్టి చెప్పాడు. దానికి సారీ చెప్పాను కదా అని సంజన చెప్పగానే.. మిమ్మల్ని లాగి పెట్టి కొట్టి సారీ అంటే ఊరుకుంటారా అని సుమన్ అంటాడు. సుమన్ తన పాయింట్స్ ని చాలా క్లారిటీగా చెప్పాడు. నేను సారీ చెప్పాను కదా మళ్ళీ మీరే హైలైట్ చేసుకుంటున్నారని సంజన అనగానే.. ఇది నా బాధ.. ఇది మీకేందుకు అర్థం కావడం లేదని సుమన్ శెట్టి తన పాయింట్స్ తో కరెక్ట్ గా మాట్లాడతాడు. కాసేపు ఇద్దరు ఆర్గుమెంట్స్ చేసుకుంటారు.   సుమన్ శెట్టి వ్యాలిడ్ రీజన్ తో నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి నామినేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu : మాధురి వర్సెస్ సంజన.. ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్!

  బిగ్ బాస్ సీజన్-9 లో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఒకరినొకరు కొట్టుకునే దాకా వచ్చారు. నిన్నటి నామినేషన్లో మాధురి, సంజనల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. అసలేం జరిగిందో చూసేద్దాం.. సంజనని సుమన్ శెట్టి నామినేట్ చేస్తాడు. ఇక నామినేషన్ ప్రక్రియ అయ్యాక సుమన్ శెట్టి దగ్గరికి సంజన వచ్చి.. మీరు నన్ను ఆ పాయింట్స్ తో ఎలా నామినేట్ చేస్తారండి. మీరు ఫెయిల్యూర్ కెప్టెన్ అసమర్ధత గల కెప్టెన్ అని సుమన్ శెట్టిపై సంజన గొడవకి దిగుతుంది. సరే అమ్మా నాకూ నామినేషన్ కి మరొక పాయింట్స్ ఇచ్చావని సుమన్ అంటాడు. ఇక అక్కడే ఉన్న మాధురి మధ్యలో దూరుతుంది. అసమర్ధత కెప్టెన్ అంట.. ఇలాంటి తెలుగు పదాలు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కానీ ఏదైనా తప్పు మాట్లాడారని అడిగితే మాత్రం నాకు తెలుగు సరిగ్గా రాదు.. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటుందని మధురి అంటుంది. అది సంజన విని నన్నే అంటున్నారు కదా అని మాధురితో గొడవపడుతుంది. నీకు బుర్ర లేదు.. సెన్స్ లేదని సంజనని మాధురి అంటుంది. దాంతో సంజనని ఇమ్మాన్యుయల్ పక్కకి తీసుకొని వెళ్లి జరిగిన దాంట్లో తప్పు నీదే.. సుమన్ శెట్టి అన్నని అసమర్ధత కెప్టెన్ అనొచ్చా.. తప్పు కదా.. ఇన్ని రోజులు ఎలా ఉన్నావ్.. ఇప్పుడు ఎలా ఉంటున్నావని సంజనకి చెప్తాడు. దాంతో సంజన పక్కకి వచ్చి నాకు బ్రెయిన్ లేదట.. సెన్స్ లేదట అని ఏడుస్తుంది. సంజన వర్సెస్ మాధురి మధ్య గొడవలు మొదటి నుండి కొనసాగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో ఎవరిది తప్పో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu : డీమాన్ తో ఫేక్ బాండ్ పెట్టుకున్నావ్.. రీతూపై మాధురి ఫైర్!

  బిగ్ బాస్ సీజన్-9 ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఎనిమిదో వారం నామినేషన్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో నామినేషన్లు ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ తో జరిగాయి. రీతూని మాధురి నామినేట్ చేస్తుంది. నువ్వు మా టీమ్ లో ఉన్నావ్.. నిన్ను నమ్మొద్దని అందరు చెప్పారు కానీ నేను నమ్మినా.. మళ్ళీ టీమ్ నుండి వెళ్లిపోయావ్.. అంతేకాకుండా డీమాన్ కి డబ్బు ఇవ్వలేదు. డీమాన్ సపోర్ట్ లేకుండా అసలు ఒక్క గేమ్ అయినా ఆడావా అని మాధురి అడుగగా.. ఏ గేమ్ ఆడలేదు.. ఏ గేమ్ అయినా, నేను సింగిల్ గానే ఆడానని రీతూ చెప్పింది. ఒక బాండ్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నావని మాధురి అనగానే ఇక్కడ ఎవరికి లేవు బాండ్స్.. ఒక్క మా బాండ్ నే కన్పిస్తుందా అని రీతూ అంటుంది. మీ బాండ్ ఫేక్.. అన్ హెల్తీ బాండ్ అని మాధురి అంటుంది. మీది ఫేక్ బాండ్ మీకు తనూజకి ఒక బాండ్ ఏర్పడింది కదా అని రీతూ మాట్లాడుతుంది. నీ వల్ల పాపం మంచి కంటెస్టెంట్ అయిన డీమాన్ పవన్ గేమ్ కూడా చెడగొడుతున్నావని మాధురి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది.. ఒకరికి ఒకరి ఇద్దరు మీద మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటారు. . ఒక నిమిషం వీళ్ళు కొట్టుకుంటారా అనిపించింది.. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతారని మాధురి అంటుంది. అసలు మిమ్మల్ని చూస్తేనే చిరాకులాగా ఉంటుంది. ఎప్పుడు ఇద్దరు పక్కపక్కనే ఉంటారని మాధురి అనగానే.. ఉంటాం నీకేంటి.. హౌస్ లోకి గేమ్ ఆడడానికి వచ్చావా మమ్మల్ని చూడడానికి వచ్చావా అని రీతూ అంటుంది. ఇలా ఇద్దరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. వీకెండ్ లో నాగార్జున వీరిద్దరికి గట్టిగానే క్లాస్ తీసుకుంటాడనిపిస్తుంది. మరి వీరిద్దరి గొడవ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Bigg boss 9 Telugu : ముద్దుమాటలు చెప్పి ముద్దమందారం చెవిలో పెడుతున్నారు.. మర్యాద మనీష్ సూపర్ నామినేషన్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ భిన్నంగా సాగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మర్యాద మనీష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి నామినేషన్ గా కళ్యాణ్ ని చేస్తాడు. నువ్వు గేమ్ పై ఫోకస్ చెయ్యడం లేదు.. ముద్దు చేసి ముద్దమందారం చెవిలో పెడుతున్నారని తనూజని ఉదేశ్యించి కళ్యాణ్ తో మనీష్ చెప్తాడు. నువ్వు ఇమ్మాన్యుయల్ కి ఎందుకు వెన్నుపోటు పొడిచావ్.. నామినేషన్ ముందు తనూజని నామినేట్ చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళాక ఎందుకు ఒపీనియన్ మార్చుకున్నావని కళ్యాణ్ ని మనీష్ అడుగుతాడు. నా నామినేషన్ తనూజ ఉండే కానీ నా పాయింట్స్ అన్నీ ఆల్రెడీ అయేషా చెప్పి తనూజని నామినేట్ చేసింది. అప్పుడు మళ్ళీ నేను చేస్తే కాపీ పేస్ట్ అవుతుందని అందుకే చెయ్యలేదని కళ్యాణ్ సమాధానం చెప్తాడు. ఆ తర్వాత రెండో నామినేషన్ కి మనీష్ తనకి ఇష్టమైన వారికి ఛాన్స్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో ఇమ్మాన్యుయల్ కి ఛాన్స్ ఇస్తాడు మనీష్. ఇక తనుజని ఇమ్మాన్యుయల్ నామినేట్ చేస్తాడు. మొన్న నేను తనుజని నామినేట్ చెయ్యాలి.. కానీ చిన్న పాయింట్ ఉందని చెప్పాను కదా అదేంటో ఇప్పుడు చెప్తానని ఇమ్మాన్యుయల్ అంటాడు. అయేషాకి పవర్ వచ్చింది కదా వీకెండ్ లో నాగ్ సర్ ఆ పవర్ కి అయేషా అర్హురాలు అవునా కదా అని అడిగినప్పుడు నాతో అర్హురాలు కాదని అన్నావ్.. మళ్ళీ పైకి లేచి అర్హురాలు అన్నావ్.. దాంతో నా మైండ్ పని చెయ్యలేదు. ఆ తర్వాత మనం టెనెంట్స్ గా ఉన్నప్పుడు ఎవరో ఒకరికి మాత్రం ఓనర్ అయ్యే ఛాన్స్ అన్నప్పుడు నాతో ఒకమాట అన్నావ్.. మళ్ళీ అందరి ముందు ఒకలా మాట్లాడావు.. అది నీ స్ట్రాటజీ నో లేక గేమో అర్ధం కావడం లేదని ఇమ్మాన్యుయల్ అనగానే తనుజకి తనకి గొడవ జరుగుతుంది. మొత్తానికి ఇమ్మాన్యుయల్ గత రెండు వారాలుగా నామినేట్ చేస్తానన్నది ఈ వారం చేసాడన్నమాట.

Bigg Boss 9 Telugu : సంజనని కత్తితో పొడిచిన ప్రియా.. కళ్యాణ్ చెత్త నామినేషన్!

  బిగ్ బాస్ సీజన్-9 లో భాగంగా హౌస్ లో ఇప్పుడు రణరంగం కాదు చదరంగం అన్నట్టు గానే సాగుతుంది. ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అవ్వగా.. ఎనిమిదో వారం నామినేషన్ల కోసం ఆడియన్స్ ఫుల్ గా వెయిట్ చేశారు. ఇక సోమవారం రానే వచ్చింది. ఈసారి నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ఇప్పటివరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ  ఇచ్చి ప్రెజెంట్ ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేశారు. మొదటగా హౌస్ లోకి మూడవ వారం ఎలిమినేట్ అయిన ప్రియా ఎంట్రీ ఇచ్చింది‌. తను లోపలికి రాగానే కళ్యాణ్ ఎదురుగా వెళ్లి ఎమోషనల్ అవుతాడు. థర్మకోల్ తో చేసిన ఓ బోర్డుని కంటెస్టెంట్స్ మెడలో ధరించగా, నామినేట్ చేసే కంటెస్టెంట్స్ వచ్చి ఆ బోర్డుపై కత్తితో పొడవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక మొదటగా సంజన ధరించిన ఆ బోర్డుపై కత్తితో పొడిచి నామినేషన్ చేసింది ప్రియా. మీరు హౌస్ లో కొన్ని వర్డ్స్ వాడుతారు. క్లాస్, స్టాండర్డ్ అంటూ వాడుతారు. అలా వాడడం కరెక్టేనా అని ప్రియా అడుగుతుంది. అంటే నేను ఏం మాట్లాడినా అది జోక్ గా ఫన్ వే లో పోతుందని ఆలోచిస్తానని సంజన అంటుంది. మీరు రోడ్డు రోలర్ లాగా మీదకి వస్తుందని దివ్యని అన్నారు.. ఇప్పుడు నిఖిల్ రాగానే కళ్యాణ్ ని వదిలేసిందన్నారు.. ఇలా ఒక అమ్మాయి క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తున్నారని ప్రియా తన మైండ్ లో పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్పింది. ఆ తర్వాత ఇంకొకరిని నామినేట్ చేసే ఛాన్స్ హౌస్ లో ఎవరికి ఇస్తావని బిగ్ బాస్ అడుగగా కళ్యాణ్ కి ఇస్తానని ప్రియా చెప్పింది. కళ్యాణ్ తన నామినేషన్ గా రాముని చేస్తాడు. నువ్వు గతవారం టాస్క్ లో గివప్ ఇవ్వడం నాకు నచ్చలేదు. మా టీమ్ కి రమ్మని రిక్వెస్ట్ చేసాను కానీ నువ్వు రాలేదు.. జీరోతో ఉండి గేమ్ ఆడలేకపోయావని కళ్యాణ్ తన పాయింట్స్ చెప్పాడు. నువ్వు ఆడావు కదా.. నువ్వు కూడా కాలేదు కదా అని రాము అనగానే అలా పోక్ చెయ్యకని రాముతో కళ్యాణ్ అంటాడు. ఇలా ఈ ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. అయితే కళ్యాణ్ చెప్పిన నామినేషన్ నిజంగానే తుప్పాస్ అనిపించింది. ఎందుకంటే రాము గేమ్ అతడి ఇష్టం.. తన స్ట్రాటజీ ప్రకారం రాము ఆడాడు.. ‌అయితే కళ్యాణ్  చెప్పిన ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ అనిపించలేదు. అందుకే కళ్యాణ్ ని ఇమ్మెచ్యూర్ అండ్ నిబ్బా అని అంటారేమో.. మరి కళ్యాణ్ నామినేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jayam serial : బాక్సింగ్ లో రుద్రని చంపడానికి వీరు ప్లాన్.. మార్టిన్ గెలుస్తాడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -95 లో......రుద్రతో పోటీ పడడానికి పారు మలేషియా నుండి ఒక ఛాంపియన్ ని రప్పిస్తుంది. అతను రాగానే రుద్ర తో పోటీ అని తెలుస్తుంది. తనతో పోటీ అంటే కచ్చితంగా ఓడిపోతాను.. నేను పోటీ పడను అని మాలేషియా నుండి వచ్చిన మార్టిన్ అంటాడు. నువ్వు గెలిస్తే పాతిక లక్షలు ఇస్తాను.. నీకు ఏదైనా అయితే నీ ఫ్యామిలీకి కోటి ఇస్తానని పారు అనగానే మార్టిన్ ఒప్పుకుంటాడు. రుద్ర ప్రాక్టీస్ చేస్తుంటే మార్టిన్ భయపడుతాడు. అప్పుడే వీరు తన దగ్గరికి వస్తాడు. ఏంటి రుద్రని చూసి బయపడుతున్నావా అని మార్టిన్ ని అడుగుతాడు. నువ్వు రుద్రని బాక్సింగ్ లో చంపెయ్.. నీకు రెండు కోట్లు ఇస్తానని చెప్తాడు. దాంతో మార్టిన్ సరే అంటాడు. పోటీకి మార్టిన్ ఇంకా రుద్ర సిద్ధం అవుతారు. అప్పుడే పారు ఎంట్రీ ఇచ్చి.. ఈ పోటీలో ఓడిపోతే ఇక ఎప్పుడు బాక్సింగ్ ఆడనని ఆ అగ్రిమెంట్ పై సంతకం చెయ్యమని పారు మెలిక పెడుతుంది. దాంతో అందరు సంతకం పెట్టకని రుద్రకి చెప్తారు. రుద్ర సర్ మీరు సంతకం చెయ్యండి అని గంగ చెప్తుంది. రుద్ర సంతకం చేస్తాడు. పోటీ మొదలవుతుంది. మొదటి రౌండ్ కి మార్టిన్ ని రుద్ర చిత్తు చేస్తాడు. దాంతో వీరు, పారు డిస్సపాయింట్ అవుతారు. పారు బయటకు వెళ్తుంటే తన వెనకాలే వీరు వెళ్లి ఆ మార్టిన్ కి.. మీ తమ్ముడు బానుని చంపింది ఎవరో నాకు  తెలుసని రుద్రకు చెప్పు.. ఓడిపోతే చెప్తానని అబద్ధం చెప్పించండి అని పారుకి వీరు సలహా ఇస్తాడు. దాంతో మార్టిన్ దగ్గరికి పారు వెళ్లి.. రుద్రని ఇలా బ్లాక్ మెయిల్ చెయ్ అని చెప్తుంది. ఆ తర్వాత రుద్ర, మార్టిన్ రెండో రౌండ్ లో పోటీ పడుతుంటే మీ తమ్ముడిని చంపింది ఎవరో నాకు తెలుసు.. నువ్వు ఓడిపోతే చెప్తానని రుద్రని మార్టిన్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో మార్టిన్ కొట్టిన కూడా రుద్ర సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.