Jayam serial : నిజం తెలుసుకున్న ప్రీతీ.. ఆ పట్టీలు చూసి గంగ షాక్!

  ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -109 లో......రుద్ర, పారు పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసి.. గంగ షాక్ అవుతుంది. రుద్రతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకుంటుంది. మరొకవైపు మన ప్లాన్ సక్సెస్ అయిందని ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. అసలు ఈ ఐడియా శకుంతల అత్తయ్యకి ఇచ్చి మంచి పని చేసామని ఇషిక అంటుంది. వెనకాల నుండి ప్రీతి వచ్చి మీరు ఐడియా ఇచ్చారా ఎందుకు ఇలా చేశారని వాళ్ళపై కోప్పడుతుంది. అది కాదు ప్రీతీ అని ఇషిక చెప్పబోతుంటే వద్దు అని ప్రీతీ అంటుంది. అప్పుడే శకుంతల ఎంట్రీ ఇచ్చి ఎవరేం చెప్పలేదు.. ఇదంతా నా నిర్ణయమే.. అయినా రుద్ర ఒప్పుకున్నాక నీకెందుకు ప్రాబ్లమ్ అని ప్రీతిపై శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత గంగ ప్రాక్టీస్ చేస్తుంటే పారు వస్తుంది. ఇవన్నీ నీకేందుకూ అని డిస్సపాయింట్ గా మాట్లాడుతుంది. దాంతో తనకి కౌంటర్ ఇచ్చేలా గంగ మాట్లాడుతుంది. గంగకి రుద్ర గిఫ్ట్ ఇచ్చిన పట్టీలు పారు పెట్టుకుంటుంది. అది చూసి గంగ షాక్ అవుతుంది. పట్టీలు బాగున్నాయా గంగా అని పారు అడుగుతుంది. అప్పుడే రుద్ర ఎంట్రీ ఇస్తాడు. ఏంటి గంగ ప్రాక్టీస్ చెయ్యడం లేదని అడుగుతాడు. నా పట్టీలు బాగున్నాయట చూస్తుందని పారు అంటుంది. ఆ  పట్టీలు నువ్వు ఎందుకు పెట్టుకున్నావని రుద్ర అనగానే.. నీ వస్తువు అయితే నాదే కదా.. అయినా నా కోసమే కొని ఉంటావ్.. నువ్వు ఎవరి కోసమో అంటే నేను హర్ట్ అవుతానని రుద్ర చెయ్ పారు పట్టుకుంటుంది. ఇది అకాడమీ అని రుద్ర అంటాడు. గంగ కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. తన వెనకాలే రుద్ర వెళ్తాడు. నాకు గిఫ్ట్ ఇచ్చినవి తాను ఎందుకు తీసుకుందని గంగ అడుగుతుంది‌. నువ్వు వద్దని ఇచ్చావ్ కదా.. ఎవరు తీసుకుంటే ఏంటి.. నువ్వు గేమ్ పై పోకస్ పెట్టు  పోటీకి సంబందించిన డేట్ వచ్చింది. నిన్ను నమ్మాను.. నువ్వు ఆ నమ్మకం నిలబెట్టు అని గంగతో రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీపే సీఈఓ.. కార్తీక్ మాటతో పారిజాతం, జ్యోత్స్న షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -511 లో.....దీప ఆఫీస్ కి క్యారేజ్ తీసుకొని వెళ్తుంది. వెనకాలే పారిజాతం, సుమిత్ర వస్తారు. మీరెందుకు వచ్చారని శివన్నారాయణ అడుగుతాడు. రావాల్సి వచ్చిందని సుమిత్ర అంటుంది. మీతో మాట్లాడాలని శివన్నారాయణతో పారిజాతం అంటుంది. దాంతో శివన్నారాయణ పక్కకి వస్తాడు. సీఈఓగా ఎవరిని చేస్తున్నారని పారిజాతం అడుగుతుంది.. ఎవరు అయితే నీకెందుకని శివన్నారాయణ అంటాడు.‌ ఆ దీపనే కదా అని పారిజాతం అంటుంది. మనవరాలిని కాదని పని మనిషిని చేస్తున్నారని పారిజాతం అంటుంది. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇచ్చి దీప సీఈఓ ఏంటి.. ఎవరు చెప్పారని కార్తీక్ అంటాడు. నాకు దీప సీఈఓ అన్న ఆలోచన రాలేదు.. ఇప్పుడు నువ్వు చెప్పావ్ ఖచ్చితంగా దీపని సీఈఓ చేస్తానని శివన్నారాయణ అనగానే పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. శివన్నారాయణ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళపోతారు. పారిజాతం కత్తి చూపించి ఆ దీప సీఈఓగా ఒప్పుకోవాలి వెంటనే దీంతో పొడుస్తానని పారిజాతం అనగానే.. నిజంగానే చంపేస్తావా అని జ్యోత్స్న అంటుంది. అది సీఈఓ అయితే నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పారిజాతం అంటుంది. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు. జ్యోత్స్న దగ్గరికి సుమిత్ర వచ్చి ఇక్కడ అందరికి తోడున్నారు.. నీకు తప్ప.. నీకు ఒక జోడి కావాలి.. అదే నా కోరిక అని సుమిత్ర అంటుంది. నేను అనుకున్నది సాధించాలని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుంది. సుమిత్ర మాట్లాడుతు.. మావయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదేనని అంటుంది.‌ ఇది కూడా హ్యాండ్ ఇచ్చిందని పారిజాతం అనుకుటుంది. కొత్త సీఈఓగా మా భార్యని సజెస్ట్ చేస్తున్నా అని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : భార్యకి నచ్చింది చేయడానికి సిద్దమైన భర్త.. రాహుల్ లో మార్పు వస్తుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -874 లో..... రుద్రాణి, స్వప్న కలిసి స్టేషన్ లో ఉన్న రాహుల్ దగ్గరికి వెళ్తారు. నేనేం తప్పు చెయ్యలేదు.. నన్ను విడిపించండి అని రాహుల్ రిక్వెస్ట్ చేస్తాడు.. నిన్ను ప్రతిసారీ నమ్ముతున్నా.. మోసపోతున్నా.. నువ్వు ఇలా చేస్తుంటే ఎవరు మాత్రం నీకు హెల్ప్ చేస్తారని స్వప్న అంటుంది. నువ్వు ఎవరిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు రాహుల్.. నేను నిన్ను బయటకు తీసుకొని వస్తానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత స్వప్న, కావ్య కలిసి రంజిత్ ఇంటికి వస్తారు. అక్కడ పోలీసులు ఉండడంతో కిటికీ లోపల నుండి లోపలికి వెళ్తారు. వెళ్లి వాళ్ళు హాల్లో పెట్టిన కెమెరా తీసుకొని వెళ్తారు. కార్ లోకి వచ్చి అందులో రికార్డు అయింది చూసి షాక్ అవుతారు. వెంటనే ఇది పోలీసులకి చూపించాలని బయల్దేరతారు. మరొకవైపు పోలీస్ స్టేషన్ ముందు రంజిత్ వచ్చి రుద్రాణితో మాట్లాడుతుంటే అప్పుడే రాజ్, కావ్య వచ్చి.. అసలు నేరం చేసింది నువ్వు అని మాకు తెలుసురా అని స్టేషన్ లోపలికి తీసుకొని వెళ్తారు. ఆ వీడియో పోలీసులకి చూపిస్తారు. అందులో కోయిలిని రంజిత్ చంపినట్లు ఉంటుంది. దాంతో రాహుల్ ని వదిలేసి రంజిత్ ని సెల్ లో వేస్తారు పోలీసులు. ఆ తర్వాత రాహుల్ ని ఇంటికి తీసుకొని వస్తారు. అందరు రాహుల్ కి చివాట్లు పెడుతారు. ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యనని రాహుల్ చెప్తాడు. తరువాయి భాగంలో కావ్య తనకి ఇష్టమైనవన్నీ ఒక లిస్ట్ చేస్తుంది.. అందులో మొదటిది తనకి నచ్చింది వండి పెట్టడం అని ఉంటుంది. సరే నీకు నచ్చింది చేస్తానని రాజ్ కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తాడు. అప్పుడే ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నాకు బిడ్డ పుడితే చైతన్య మాష్టర్ పేరు పెట్టుకుంటా...

  బుల్లితెర మీద ఢీ డాన్స్ షోలో చైతన్య మాష్టర్ ఒక సంచలనం. ఆయన శిష్యుడే రాజు. అలాంటి చైతన్య మాష్టర్ గురించి రాజు ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు. "రాజు అసలు నువ్వు డాన్సర్ ఎలా అయ్యావు. ఢీ షోలో ఛాన్స్ ఎలా వచ్చింది" అని అడిగింది హోస్ట్. "నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. స్టేజి మీద వేయాలంటే భయం కానీ టెన్త్ క్లాస్ లో డేర్ చేసి స్టేజి మీద వేసాను. మా టీచర్స్ అంతా పొగిడారు. తిట్టేవాళ్ళు పొగిడేసరికి నేను అదే డాన్స్ ని వినాయక చవితిలో వేసాను. అప్పుడు చైతన్య మాష్టర్ చూసి బాగా వేస్తున్నావ్ అని తనతో పాటు సూర్యాపేట తీసుకెళ్లారు. ఆయనకు నేను ఎందుకు నచ్చాను అంటే నేను మినిమం 70 సాంగ్స్ నేర్చుకున్నా మూడు నెలల్లో అలాగే బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేస్తూ మిగతా సాంగ్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. మాష్టర్ అది చూసి నన్ను ఢీ షోకి తీసుకెళ్లారు. ఐతే అప్పటికి నాకు 104 ఫీవర్ ఉంది. ఆ విషయం చెప్తే మాష్టర్ నన్ను పక్కన పెట్టేస్తాడేమో అని భయమేసింది. తర్వాత ఆయన నన్ను చూసి ఫీవర్ గా ఉంటె ఎందుకు చెప్పలేదు అన్నారు. మీరే తీసేస్తారేమో అని భయపడ్డా అని చెప్పాను. ఆ తర్వాత ఎగ్జామ్స్ అని చెప్పి మా ఇంటికి వెళ్లాను. ఆ తర్వాత చైతన్య మాష్టర్ ఫోన్ చేసి నేను చదివిస్తా నువ్వొచ్చాయి అని చెప్పాడు. ఆ తర్వాత రెండేళ్లు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేసాను కంటెస్టెంట్ అయ్యాను టైటిల్ కొట్టాను. చైతన్య మాష్టర్ చనిపోయారు అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఎందుకంటే రెండు నిమిషాల ముందు నాకే ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పారు. వాళ్లకు అప్పులు ఉన్నాయన్న విషయం నాకు ముందు నుంచి తెలుసు. అప్పులు నెమ్మదిగా తీరుద్దాం మీరు టెన్షన్ పడకుండా హైదరాబాద్ వచ్చేయండి అని చెప్పా. అంతే వెంటనే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా చైతన్య మాష్టర్ ఇంట్లో ఉరేసుకున్నారని చెప్పాడు. నాకు షాక్. మా బాండింగ్ ఎలా ఉంటుంది అంటే నా పేరును ఆయన పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఏడాది పాటు నేను బయటకు రాలేకపోయాను. ఒక్కసారి చైతన్య మాష్టర్ కనిపిస్తే హగ్ చేసుకుని మిస్ యు మాష్టర్ అంటాను. లాస్ట్ లో ఒక్క మాట డాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్ టైటిల్ కొట్టు అన్నారు కొట్టాను. నేను పెళ్లి చేసుకుంటే నాకు బిడ్డ పుడితే చైతన్య మాష్టర్ పేరు పెట్టుకుంటా" అని చెప్పాడు ఢీ 10 రాజు.  

దివ్య, కళ్యాణ్ ల మధ్య చిచ్చుపెట్టిన తనూజ

  బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు జరిగిన దాంట్లో లేడీ కంటెస్టెంట్స్ లో దివ్య టాప్. ఎందుకంటే తను స్ట్రాటజీలు వాడుతుంది.. గేమ్ ఆడుతుంది.. అందరితో బాగుంటుంది. కానీ మన బిగ్ బాస్ మామ తనూజనే విన్నర్ ని చేద్దామని ఫిక్స్ అయ్యారు. అందుకే తను ఎంత ఇరిటేట్ అయిన అవేం చూపించకుండా ఫేక్ ఓటింగ్ వేస్తూ తనూజ టాప్(Tanuja Fake) అన్నట్టుగా చూపిస్తున్నారు బిగ్ బాస్. ఒకవేళ మేల్ కంటెస్టెంట్స్ అయితే కళ్యాణ్ ని విజేత చెయ్యాలని గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకేనేమో స్ట్రాంగ్ అండ్ జెన్యున్ కంటెస్టెంట్ అయినటువంటి దివ్య, డీమాన్ పవన్ లాంటి కంటెస్టెంట్స్ ని ఛాన్స్ దొరికినప్పుడే బ్యాడ్ చేయాలని వీడియోలు ప్లే చేసి మరీ చూపిస్తున్నారు.  నిన్నటి ఎపిసోడ్ లో దివ్యని కార్నర్ చేస్తూ వీడియోలు వేసి చూపించి కళ్యాణ్, తనూజ దృష్టిలో దివ్యని బ్యాడ్ చేశాడు బిగ్ బాస్ మామ. దివ్య ట్రైన్ టాస్క్ లో భరణికి సపోర్ట్ చేస్తూ తనూజని తీసేయ్యమని గౌరవ్ తో చెప్తుంది. అది వీడియో చూపించాడు నాగ్‌. దాంతో తనూజ దివ్యపై ఓ అభిప్రాయం ఏర్పర్చుకుంది. దివ్య ఎవరిని గెలిపించాలనేది తన ఆట.. తన ఆట గురించి ఎవరికీ ఏ అభ్యంతరం ఉండకూడదు.. కానీ నీ బాధ ఏంటంటే మాట ఇచ్చి మాట తప్పింది అని అంతేకదా అని కళ్యాణ్ ని నాగార్జున అడుగగా‌.. కొంచెం సర్ అని కళ్యాణ్ అన్నాడు. ఎవరికి వాళ్ల ఫేవరెట్స్ ఉంటారు కదా.. డీమాన్‌కి రీతూ కావాలని ఉంటుంది.. ఇంకెవరికో ఇమ్మాన్యుయల్ కావాలని ఉంటుంది.. నీకు తనూజ కావాలని ఉంది.. అది వాళ్ల ఛాయిస్‌ల బట్టి ఉంటుంది.. ఎవరిని గెలిపించాలనేది వాళ్ల ఇండివిజల్ ఛాయిస్ అని నాగార్జున అన్నాడు. అంటే దివ్య అలా మాట ఇచ్చి తప్పే రకం కాదు.. కానీ ఆ టైమ్‌లో తను ఇమ్మూ-తనూజ మధ్య ఓటింగ్ పడుతుందేమో అనుకొని అలా చేసి ఉండొచ్చని కళ్యాణ్ చెప్పాడు.  నేను చూపించిన వీడియో టాస్క్ స్టార్ట్ కాక ముందు.. ఒకరికి గెలిపించడానికి మనం సపోర్ట్ చేయడం, టాస్కులో ప్రాణం పెట్టడమనేది కరెక్ట్.. ఖచ్చితంగా అది చేయాలి.. కానీ ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి కానీ ఒకరి ఓటమి కోసం ఉండకూడదంటూ సోది చెప్పాడు నాగ్ మామ.  హౌస్ లో ఓ గేమ్ జరిగితే ఒకరు ఓడిపోతేనే ఇంకొకరు గెలుస్తారు.. అది బేసిక్ కదా.. ఇదంతా ఎందుకు.. తనూజ‌ని దివ్య తీసేసింది కాబట్టి తనూజ, దివ్య, కళ్యాణ్ ల మధ్య చిచ్చుపెట్టి దివ్యకి సపోర్ట్ లేకుండా చేసి తనని పంపించేద్దామని ప్లాన్ చేశామని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా బిగ్ బాస్ మామ.. దివ్య ఆడిన ఆటతీరు కరెక్ట్ కానీ దానిని బిగ్ బాస్ మామ చూపించిన తీరు రాంగ్ అని మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి.

Jayam serial : పారు ప్లాన్ అదేనని రుద్ర కనిపెడతాడా.. గంగ షాక్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -108 లో..... పారుకి రుద్రతో పెళ్లి చెయ్యాలని శకుంతల నిర్ణయం తీసుకొని పారుని ఒప్పిస్తుంది. అదంతా రుద్రపై ప్రేమతోనో ఇష్టంతోనో కాదు.. ఈ రుద్ర ఎక్కడ గంగని పెళ్లి చేసుకుంటాడో అన్న స్వార్థంతో శకుంతల ఆలోచిస్తుంది కానీ రుద్ర మాత్రం తన పెద్దమ్మ తనని క్షమించిందని నమ్ముతున్నాడు. ఇక పెళ్లి కూతురు పారు అని తెలిసి ఇంట్లో వాళ్లంతా వద్దని అంటారు. రుద్ర నువ్వు ఎంత నన్ను ఇష్టపడ్డావో.. నేను నిన్ను అంతగానే ఇష్టపడ్డను కానీ నువ్వు నా కోసం రాలేదని కోపంతో నీకు ఎదురు వచ్చాను అంతే అని పారు యాక్టింగ్ చేస్తుంది. పారు ఎంత చెప్పినా ఇంట్లో అందరు వద్దని అంటారు. అందరు ఆగండి.. ఈ పెద్దమ్మ ఏం చేసిన రుద్ర మంచి కోసమే.. మీరందరు కాదు నిర్ణయం తీసుకోవాల్సింది రుద్ర తీసుకోవాలి. చెప్పు రుద్ర అని శకుంతల అడుగుతుంది. ఈ పెళ్లి నాకు ఇష్టమే అని రుద్ర అన్నాడు. దాంతో అందరు షాక్ అవుతారు. శకుంతల, పారు మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. శకుంతల వెంటనే తాంబులాలు మారుస్తుంది. గంగ నువ్వు ఎప్పుడు ఇక ఇంటికి కోడలు కాలేవని శకుంతల అనుకుటుంది. రుద్ర నన్ను పెళ్లి చేసుకున్నాక నీ అకాడమీ, నిన్ను నా గ్రిప్ లో పెట్టుకుంటానని పారు అనుకుంటుంది. ఆ తర్వాత పారు, ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఇదంతా మీ వళ్లే సాధ్యం అయిందని పారు వాళ్లిద్దరికి థాంక్స్ చెప్తుంది. పెళ్లి అయ్యాక నాకొక గది సపరేట్ కావాలని పారు అనగానే రుద్ర బావ గది ఉంది కదా అని ఇషిక అంటుంది. నాకు ప్రైవసీ కావాలి అందుకేనని పారు అంటుంది. మరొకవైపు రుద్ర దగ్గరికి ప్రీతి వచ్చి ఎందుకు అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకున్నావని అడుగుతుంది. అప్పుడే పారు వచ్చి‌ రుద్రని బయటకి తీసుకెళ్తుంది. కాసేపటికి గంగ టిఫిన్ సెంటర్ దగ్గర పని చేస్తుంటే పారు వచ్చి పొగరుగా మాట్లాడుతుంది. అక్కడున్న కస్టమర్స్ బిల్లు మొత్తం తనే కడతానని పారు చెప్పగానే.. ‌డబ్బు ఎక్కువగా ఉంటే అనాధాశ్రమంకి వెళ్లి డొనేట్ చేసుకోమని గంగ అంటుంది. అదేం కాదు.. నాకు పెళ్ళి ఫిక్స్ అయిందని పారు అంటుంది. ఎవరో ఆ బలిపశువు అని గంగ అనగానే.. రుద్రని చూపిస్తుంది పారు. దాంతో గంగ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss Buzz Ramu Rathod: బజ్ ఇంటర్వ్యూలో రాము రాథోని ఉతికారేసిన శివాజీ.. బిగ్ బాస్ కోట్ల మంది కల!

  బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం నాటి ఎపిసోడ్ లో రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే రాము రాథోడ్ ఆడియన్స్ ఓటింగ్ తో బయటకు రాలేదు కానీ సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక రాము రాథోడ్ బజ్ ఇంటర్వ్యూకి వచ్చాడు. బజ్ ఇంటర్వ్యూకి రాము రాథోడ్ రాగానే శివాజీ క్వశ్చన్స్ మొదలెట్టాడు. నాతో ఫ్రీగా ఉండు.. భయపడకుండా ఉండు అని శివాజీ అన్నాడు. ఇక రాము రాథోడ్ ని కాస్త హుషారు చేయడానికి.. 'రాను బొంబాయి కి రాను' అనే పాటకి డ్యాన్స్ చేపించాడు. ఈ పాటని చేయడానికి ఎన్ని రోజులు పట్టిందని శివాజీ అడగగా.. దాదాపు ఐదు సంవత్సరాలు పట్టిందని రాము చెప్పాడు. ఒక సక్సెస్ రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో కప్పు కొట్టడానికి పదిహేను వారాలే చాలు కదా అంటూ శివాజీ అన్నాడు. ఎవరైనా బిగ్ బాస్ షో చూడడానికి మాత్రమే వస్తామనుకుంటే హౌస్ లోకి రాకండి. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం అంటే బస్సు ఎక్కడం కాదు. ఇది కోట్ల మందికి కల. నీకు కావాలంటే వస్తా, వెళ్లిపోతానని అనడం సరైంది కాదంటూ శివాజీ ఫైర్ అయ్యాడు. బయట కూడా ఇలానే ఉంటావా రామూ.. నీ క్లారిటీ ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించాడు. బయట క్లారిటీగా ఉంటానని రాము సమాధానం ఇవ్వగానే.. మరి కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావని శివాజీ అడిగాడు. హౌస్‌లో ప్రతీ ఒక్కరి మెంటాలిటీ వేరుగా ఉంటుంది. మాటలతో మాయ చేస్తారన్నాడు. అంటే మాటలతో మాయ చేస్తే మారిపోతావా అని శివాజీ అడిగాడు.  లేదని రాము చెప్పాడు. బయట కూడా ఇలా జరిగితే దూరం అవుతావా అని శివాజీ అడుగగా.. అదేం లేదని రాము అన్నాడు.  ఇక ఆ తర్వాత హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌పై అభిప్రాయం అడిగాడు. మొదట సంజనా ఫోటో చూపించగా.. లక్కీ అనే బోర్డు చూపించాడు రామ్. అంటే సంజన లక్కీ తో లాక్కొస్తుందా అని శివాజీ అడుగగా.. అక్కడ స్కోప్ లేకుండా సరే.. ఆమె అందులోకి దూరిపోతుందంటు రాము చెప్పాడు. నువ్వు దూరతావు కానీ మాట్లాడవు, ఆమె దూరితే ఏదో చేస్తుంది కదా అంటూ శివాజీ అన్నాడు. అవును సర్ అంటూ రాము జవాబిచ్చాడు. మొన్నటి ఎపిసోడ్ లో గౌరవ్ సంజనను లాగాడా లేక ఆమెనే దిగిందా అని శివాజీ ప్రశ్నించగా.. నేను సరిగ్గా చూడలేదని బదులిచ్చాడు రాము. వెంటనే శివాజీ రాము బాయ్, తుమారా కన్ఫ్యూజ్ హోరా బాయ్ అంటూ శివాజీ అన్నాడు. ఇలా శివాజీ అడిగే ప్రశ్నలకి కాసింత కన్ఫ్యూజ్ అవుతూనే సమాధానమిచ్చాడు రాము. మరి రాము సెల్ఫ్ ఎలిమినేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Sai Srinivas Buzz : హౌస్ మొత్తం కట్టప్పలే .. నన్ను వెన్నుపోటు పొడిచారు..

బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఇద్దరు ఎలిమినేట్ అయి బయటకొచ్చేశారు. బిగ్ బాస్ హౌస్ లో  ఓటింగ్ లో అందరి అంచనాల ప్రకారం ఈ వారం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు.  ఇక హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యాక బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సాయి శ్రీనివాస్. అలా సాయి రాగానే ఆహా సాయిరాం తృప్తిగా ఉంది నాయనా అని శివాజీ అన్నాడు. నువ్వు హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నీకు పాజిటివ్ అయిందనుకుంటున్నావా.. నెగెటివ్ అయిందనుకుంటున్నావా అని శివాజీ అడిగాడు. నేను కనిపించీ కనిపించనట్లున్నాను కాబట్టి రెండూ 50-50 వేసుకోవచ్చు అని సాయి ఆన్సర్ ఇచ్చాడు. దీనికి అసలు ఏమీ కాలేదు నువ్వుంటే కదా అవ్వడానికి.. నీ అదృష్టం ఏంటంటే నువ్వు నెక్స్ట్ సీజన్‌కి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.. ఫ్రెష్ అనుకుంటారు ఎందుకంటే నువ్వు ఇక్కడ కనపడలేదు కదా అంటూ శివాజీ వెటకారంగా మాట్లాడాడు. ఇక శివాజీ మరీ ఫైరింగ్‌గా ఉండటంతో సాయి కూల్ చేయడానికి ఒక బిస్కెట్ వేశాడు. ఎప్పుడైతే మీరు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరై.. మీరు ఆడిన విధానం చూసి కానీ అంటూ సాయి ఏదో చెప్పబోయాడు. దీనికి నేను అందరికీ సోప్ వేస్తాను.. నువ్వు నాకు ఆముదం వేస్తున్నట్లుందంటూ శివాజీ కౌంటర్ వేశాడు. నేను పోరాడటానికి వచ్చాను ప్రాధేయపడటానికి రాలేదు అన్నావ్ కదా.. ఏం పోరాడావని నీకు అనిపించిందని శివాజీ అడుగగా.. తర్వాత స్క్రీన్ మీద బాహుబలిలో రాజమాత శివగామి ఫొటో చూపించాడు. ఇలా ఫీలయ్యేది తనూజ అని నా ఫీలింగ్ అంటూ సాయి అన్నాడు. ఆ తర్వాత కట్టప్ప ఫొటో రాగానే కట్టప్పలు చాలా మంది ఉన్నారు.. హౌస్ మొత్తం కట్టప్పలే.. రీతూ ప్రస్తుతానికి నన్ను పొడిచింది నేను ఇక్కడున్నానని సాయి చెప్పాడు. దీనికి సీజన్-9 మొత్తం కట్టప్పలేనంటయ్యా సాయి చెప్తున్నాడు. అందరికన్నా ఎక్కువ కన్నింగ్ రీతూ అని సాయి శ్రీనివాస్ చెప్పాడు.‌ ఇలా హౌస్ లో అందరి గురించి తమ అభిప్రాయలు చెప్పుకొచ్చాడు సాయి శ్రీనివాస్.

Sai Srinivas Remuneration: సాయి శ్రీనివాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  బిగ్‌బాస్ సీజన్-9లో తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్ జరగింది. నిజానికి అసలు ఈ వారం సింగిల్ ఎలిమినేషనే ప్లాన్ చేశారు. కానీ ఊహించని విధంగా హౌస్ నుంచి రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో మరో ఎలిమినేషన్ జరగుతుందా లేక రాముతో సరిపెడతారా అని అందరు అనుకున్నారు. కానీ బిగ్‌బాస్ టీమ్ మాత్రం డబుల్ ఎలిమినేషన్‌కే నిర్ణయం తీసుకుంది. దీంతో శనివారం ఎపిసోడ్‌లో రాము ఔట్ కాగా ఆదివారం ఎపిసోడ్‌లో సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అయ్యాడు. సాయి శ్రీనివాస్ బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగు వారాలు ఉన్నాడు. ప్రతీ వారం రెండు లక్షల చొప్పున ఆయనకు మొత్తం ఎనిమిది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకొక్క వారం ఉంటే నేనేమిటో చూపించేవాడిని అని సాయి బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి శ్రీనివాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.‌ నామినేషన్ నుండి సేవ్ అయ్యే పవర్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. ‌తన కోసం రెండో వారం వాడుకున్నాడు సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ హౌస్ లోకి వెళ్లి అందరిని మొదటగా అబ్జర్వ్ చేశాడు.‌ కానీ ఒకరి గురించి మరొకరి దగ్గర చెప్పాడు. ఇలా అందరికి తెలిసింది. దాంతో అందరి దృష్టిలో బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడనే ముద్ర సాయి శ్రీనివాస్ పై పడింది. టాస్క్‌లు, మైండ్ గేమ్, స్క్రీన్ స్పేస్ విషయంలోనూ అతను వెనుకబడిపోయాడు. ఇదే సమయంలో పలు విషయాల్లో తనది కన్నింగ్ మైండ్ సెట్ అని జనాల్లోకి సంకేతాలు రావడంతో ఓటింగ్‌పై ప్రభావం చూపింది. దాంతో సాయిని బయటకు పంపడమే కరెక్ట్ అని బిగ్‌బాస్ టీమ్ భావించింది. అయితే బిగ్‌బాస్ వల్ల శ్రీనివాస్ సాయికి పాపులారిటీ లభించిందని చెప్పొచ్చు. గతంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఇతని గురించి బయట జనాలకి తెలియదు.. ఎప్పుడైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడో నాటి నుంచి ప్రేక్షకులకు నోటెడ్ అయ్యాడు. ఇకపై శ్రీనివాస్ నటించే సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కే అవకాశం ఉంది.

Bigg Boss 9 Telugu : కప్ కి దగ్గరగా కూతురు.. ఎగ్జిట్ కి దగ్గరగా నాన్న!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటికే తొమ్మిది వారాలు గడిచిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారని, ఎవరు వీక్ గా ఉన్నారని అడుగుతూ ఓ టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే గార్డెన్ ఏరియాలో అందరిని కూర్చోబెట్టి.. వారి ఫోటోలతో ఉన్న జెండాలని ఉంచాడు. ఇక అక్కడ ట్రోఫీ అండ్ ఎగ్జిట్ అని రెండు ఉంచాడు బిగ్ బాస్. సాధారణంగా హౌస్ లో ప్రతీ సండే ఎపిసోడ్ ని సండే ఫండే అంటు స్టార్ట్ చేస్తాడు నాగార్జున. కానీ ఈ వీక్ సీరియస్ డిస్కషన్ తో సండే అలా గడిచిపోయింది. అదే విన్నర్ ఎవరు అని డిస్కషన్. గార్డెన్ ఏరియాలో లో  ట్రోఫీ పెట్టి.. ట్రోఫికి ఎవరు దగ్గరున్నారు ఎగ్జిట్ కి ఎవరు దగ్గరున్నారని కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా అడిగాడు నాగార్జున. అందులో సుమన్ ని మొదట పిలిచాడు. కప్ కి దగ్గరగా ఇమ్మాన్యుయల్, ఎగ్జిట్ కి దగ్గరగా భరణి ని పెడతాడు సుమన్ శెట్టి. ఇలా కంటెస్టెంట్స్ అందరు తమ పర్ స్పెక్టివ్ ప్రకారం పెడతారు. అయితే ఇందులో ఎక్కువ మంది ట్రోఫీకి దగ్గరగా ఇమ్మాన్యుయల్ ని సెకెండ్ తనూజకి ఎక్కువ మంది పెట్టారు. ఎగ్జిట్ కి దగ్గరగా అందరు సాయి అని పెట్టారు. సెకండ్ పోసిషన్ లో భరణిని పెట్టారు. భరణి అన్నకి సెకెండ్ ఛాన్స్ వచ్చిన ఉపయోగించుకోవడం లేదని అందరూ రీజన్ చెప్పారు. మొదటి నుండి నాన్న కూతురు బాండింగ్ ద్వారా భరణి గేమ్ లో వెనక్కి వెళ్ళాడు.. ఒక్కసారి ఎగ్జిట్ అయి మరొక ఛాన్స్ వచ్చింది. రీఎంట్రీ తర్వాత కూడా ఇద్దరు కూతుళ్ల మధ్య భరణి నలిగిపోతున్నాడు అటపై ఇంకా ఫోకస్ చెయ్యడం లేదు. ఎలిమినేషన్ రౌండ్ లో భరణి, సాయి ఉంటారు. నా కోసం నీ గోల్డెన్ బజర్ వాడుతావా అని తనూజని భరణి అడుగగా.. వేరొకరికి మాటిచ్చానని తనూజ చెప్పింది. ఆల్రెడీ ప్రేక్షకులు టాప్-6 కంటెస్టెంట్స్ ఎవరో డిసైడ్ చేసారు. ఇప్పుడు ట్రోఫికి దగ్గరున్న వాళ్ళు కూడా వాళ్లే. ఇప్పుడు టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరనేది అందరికి ఒక క్లారిటీ వచ్చింది. ఇమ్మాన్యుయల్, తనూజ, భరణి, కళ్యాణ్, డీమాన్ పవన్ టాప్ 5 కంటెస్టెంట్స్. ఈ సారి అయిన ఉమెన్ కంటెస్టెంట్ విన్నర్ అవుతుందో లేదో చూడాలి.  

Ramu Rathod Remuneration: రాము రాథోడ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

  బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్ గా అడుగుపెట్టిన రాము రాథోడ్ కి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ప్రతీ వారం అతను నామినేషన్లో ఉండగా అతనికి అత్యధిక ఓటింగ్ పడింది. అందులోను అతనికి ఎవరితో అంతగా గొడవలు లేవు. అయితే కంటెంట్ కూడా ఏం ఇవ్వకపోవడంతో అతనికి కాస్త ఓటింగ్ తగ్గింది. రాము రాథోడ్ హౌస్ లో మొదటి నుండి భరణితో క్లోజ్ గా ఉండేవాడు. ఆ తర్వాత గౌరవ్ తో మాట్లాడేవాడు. అయితే గతవారం గౌరవ్ ని నామినేట్ చేశాడు రాము రాథోడ్. దాంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి‌. ఇక హౌస్ లో ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఉన్నానంటూ రాము బయటకు వచ్చేముందు చెప్పాడు. రాము రాథోడ్ లో నిరుత్సాహం పెరగడం.. టాస్క్‌లలో మధ్యలోనే గివప్ చెప్పడం, నామినేషన్ల సమయంలో కూడా చాలా నీరసంగా వ్యవహరించడం వల్ల ప్రేక్షకుల్లో నెగెటివ్ ఇమేజ్ స్టార్ట్ అయ్యింది. అయితే రాము ఇలా ఉండటానికి కారణం లేకపోలేదు. గత కొన్నిరోజులుగా రాము తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల , ఒంటరితనం, ఇంటి జ్ఞాపకాలతో హోమ్ సిక్ అయ్యాడు. ఈ కారణాలతోనే రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. రాము రాథోడ్ హౌస్ లో తొమ్మిది వారాలున్నాడు.  అతను ఉన్నన్ని రోజులకు గాను ప్రతీవారం సుమారు రెండు లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మీద రాముకి పద్దెనిమిది లక్షల వరకు రెమ్యునరేషన్ లభించినట్లు సమాచారం. రాము సెల్ఫ్ ఎలిమినేషన్ ని కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు అతనికి సపోర్ట్ గా ఉంటున్నారు. 

Sai Srinivas Elimination: సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్.. కంటెంట్ ఇవ్వకపోవడమే మైనస్!

  బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటితో తొమ్మిది వారాలు పూర్తయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే శనివారం నాటి ఎపిసోడ్ లో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ (ఎవిక్ట్) అయ్యాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. సండే ఫండే ఎపిసోడ్ లో మొదలవ్వగానే నామినేషన్లో ఉన్న సుమన్ శెట్టిని సేవ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికి నామినేషన్లో ఉన్నావారిని నిల్చోమన్నాడు నాగార్జున. అందులో నుండి సంజన, తనూజని సేవ్ చేశాడు. ఇక ఆ తర్వాత గేమ్ లు ఆడించాడు. పాటలు ప్లే చేసి అందులో నుండి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు.‌ ఇలా రెండు టీమ్ లుగా డివైడ్ చేసి ఎపిసోడ్ అంతా నడిపించాడు. ఇక ఎలిమినేషన్ ని భరణి, సాయి శ్రీనివాస్ మధ్య పెట్టాడు. గార్డెన్ ఏరియాలోనే ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. భరణి ట్రైన్, సాయి శ్రీనివాస్ ట్రైన్ అంటూ రెండు రైల్వేస్టేషన్ ల్లో ఉంచాడు. ఇక ఎవరి ట్రైన్ అయితే టన్నెల్ లో ఉంటుందో వారు ఎలిమినేట్, టన్నెల్ దాటి బయటకొస్తే వారు సేఫ్ అని నాగార్జున చెప్పాడు. కాసేపటికి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక సాయి ట్రైన్ టన్నెల్ లో ఆగిపోగా భరణి ట్రైన్ బయట ఉంది. దాంతో సాయి యూ ఆర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పాడు. ఇక హౌస్ మేట్స్ అందరికి బై చెప్పేసి వచ్చేశాడు సాయి శ్రీనివాస్. నిజానికి ఈ వారం ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ జరిగింది కాబట్టి సాయికి మరో ఛాన్స్ ఇవ్వాలంటే ఇచ్చి ఉండొచ్చు. కానీ బిగ్‌బాస్ టీమ్ అలా ఆలోచించలేదు. దీంతో ఈ వారం లక్ వచ్చినట్లే వచ్చి సాయికి కిక్ ఇచ్చింది.  సాయి శ్రీనివాస్ హౌస్ లో ఒకరి గురించి ఇంకొకరి దగ్గర ఛాడీలు చెప్పాడు. అది వీడియో ప్లే చేసి మరీ చూపించాడు నాగార్జున. దాంతో హౌస్ మేట్స్ దృష్టిలో సాయి శ్రీనివాస్ నెగెటివ్ అయ్యాడు. పైగా తనూజని నామినేట్ చేశాడు సాయి. బిగ్ బాస్ దత్తపుత్రిక తనూజని నామినేట్ చేస్తే ఊరుకుంటాడా..ఫేక్ ఓటింగ్ తో తనూజని టాప్ లో ఉంచి‌న బిగ్ బాస్ కి.. సాయి శ్రీనివాస్ ని లీస్ట్ లో ఉంచడం పెద్ద పనేం కాదుగా.. అందుకే సాయికి లక్ కలిసి రాలేదు.. మరోవైపు మొన్నే రీఎంట్రీ ఇచ్చిన భరణికి కూడా పెద్దగా ఓటింగ్ పడట్లేదు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా భరణి ఆటలో తనూజ-దివ్యల ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ల నుంచి దూరంగా ఉండాలని భరణి ఎంత ట్రై చేస్తున్నా ఈ ఇద్దరూ మాత్రం వదలడం లేదు. వాళ్లు వాళ్లు గొడవపడి మరీ భరణిని మధ్యలో బుక్ చేస్తున్నారు. దీంతో ఆడియన్స్ దృష్టిలో భరణి ఆట ఏం కనిపించట్లేదు. మరి రాబోయే వారాలైన భరణి ఇందులో నుంచి బయటపడతాడేమో చూడాలి.

రష్మిక ఈ దేశానికే గర్ల్ ఫ్రెండ్!

  రష్మిక మందన్న వుంటే చాలు ఆ మూవీ హిట్ అన్న నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. అందుకే ఇప్పుడు ఏ మూవీలో చూసినా రష్మిక మస్ట్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ మూవీలో కూడా నటించింది. ఇక డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, హీరోయిన్ రష్మిక కలిసి జయమ్ము నిశ్చయమ్మురా షోకి వచ్చి వాళ్ళ మూవీ గురించి చెప్పుకొచ్చారు.    "రష్మిక గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ కోసం ఎలా పని చేయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అనే దాని కోసమే కష్టపడింది తప్ప నేను యానిమల్ మూవీ చేసాను, పుష్ప మూవీ చేసాను, నేను పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ చేసాను. నేను పెద్ద హీరోయిన్ ని అని ఒక్కసారి కూడా ఆవిడ నోటి నుంచి ఇలాంటి మాటలు నేను వినలేదు. కంట్రీ మొత్తం ఆమె ట్రావెల్ చేస్తూ ప్రతీ రోజూ గర్ల్ ఫ్రెండ్ మూవీలో తన రోల్ కోసం వాయిస్ మెసేజెస్ పెట్టమని రోల్ కి సంబంధించి స్క్రిప్ట్ పంపమని అడిగి ప్రిపేర్ అవుతూ ఉండేది. ఇంత కంఫర్ట్ మనకు యాక్టర్ ఇస్తున్నప్పుడు ఆ ప్రెజర్ డైరెక్టర్ మీద ఎక్కువగా ఉండదు. అందుకే నేను కూడా ఒక్కటే అనుకున్నా ఈ క్యారక్టర్ ని ఆమె ఎలా చేయాలో చెప్తూ ఉండేవాడిని. రోజూ సెట్ కి ఒక కొత్త అమ్మాయిలా అప్పుడే నేర్చుకుంటున్న అమ్మాయిలా వచ్చి అన్ని తెలుసుకునేది. ఆమె సోలో రోల్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది. అలాగే ఆమెతో సోలో రోల్ లో నటించేలా చేసిన ఫస్ట్ డైరెక్టర్ ని నేనే" అంటూ చెప్పుకొచ్చారు గర్ల్ ఫ్రెండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్.    "మాకు అవకాశాలు ఇంకా పెరగాలి. మాకోసం కూడా స్క్రిప్ట్స్ రాయాలి..ఆడియన్స్ సపోర్ట్ చేయాలి..అవకాశం వచ్చినప్పుడే మాలో టాలెంట్ ని షోకేసు చేసుకోగలుగుతాం" అని రష్మిక చెప్పింది. ఇక జగపతి బాబు ఐతే "ఒక్క రష్మికాకు, రాహుల్ కె కాదు దేశానికే గర్ల్ ఫ్రెండ్" అని రష్మికకి కితాబిచ్చారు.  

పీరియడ్ పెయిన్ అనుభవించడానికి నేను సిద్ధం: జగపతి బాబు

  పీరియడ్ పెయిన్ అబ్బాయిలకు ఒక్కసారి ఇలా వచ్చి అలా పొతే బాగుండు అంటూ రష్మిక తన మనసులోని కోరికను జయమ్ము నిశ్చయమ్మురా షోలో చెప్పుకొచ్చింది.    "పీరియడ్ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేను. స్కాన్స్ చేయించాను, బ్లడ్ టెస్ట్ లు చేయించాను కానీ ఆ నొప్పి తగ్గదు. ఆ టైములో ఎందుకు ఎలా బిహేవ్ చేస్తామో తెలీదు. ప్రతీ నెలా ఈ నొప్పి ఎందుకు దేవుడా అనుకుంటూ ఉంటాను. అందుకే అబ్బాయిలకు అది ఎక్ష్ప్లైన్ చేయలేము కాబట్టి ఒక్కసారన్నా ఆ పెయిన్ భరిస్తే చాలు" అని చెప్పింది.    దానికి జగపతి బాబు "నేను నీ మాటలతో ఏకీభవిస్తాను అంతే కాదు నేను ఆ పీరియడ్ పెయిన్ ని భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఆ పీరియడ్ లో ఉన్నప్పుడు యాక్టింగ్ పర్ఫెక్ట్ గా చేయాలి, అందంగా కనిపించాలి, నవ్వాలి, నీ నొప్పి ఎవరికీ తెలీకుండా పెర్ఫార్మ్ చేయాలి" అంటూ చెప్పారు జగపతి బాబు.    దాని మీద ఒక ఇన్సిడెంట్ ని చెప్పింది రష్మిక. "పుష్ప మూవీ జాతర సీక్వెన్స్ చాలా లాంగ్ పీరియడ్ లో జరిగింది. సాంగ్ ముందు నేను పుష్పతో మాట్లాడే ఒక పోర్షన్ షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ లో నాకు విపరీతమైన కడుపు నొప్పి. నేను నిల్చోలేకపోయాను. ఇలా కడుపు నొప్పి వచ్చింది అని వెళ్లి టీమ్ తో చెప్పడం ప్రొఫెషనల్ గా ఉండదు. అదే టైములో వర్షంలో, మంచులో డాన్స్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రీమ్ వెథర్స్ లో షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తుంది. ఐతే నాకు అదే టైంలో పాదం దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది. ఒక కాలికి లిగమెంట్ గాయం అయ్యింది, అలాగే ఇంకో కాలి పాదంలో ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యింది. ఐతే ఫ్రాక్చర్ ఐనప్పుడు కూడా నేను నవ్వుతూనే ఉన్నాను. నేను ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్ కి చెప్పాను. ఐతే వాళ్ళు బెణికి ఉంటుంది పాదంలో ఎముక ఫ్రాక్చర్ ఐతే నువ్వు ఇలా నవ్వుతూ ఉండవు. అంటే నేను ఏదైనా బాధ కలిగినప్పుడు నవ్వుతూ ఉంటాను ఎందుకో మరి తెలీదు నా బుర్రలో ఏదైనా వైర్ ఆఫ్ అయిందేమో" అని ఫన్నీగా చెప్పింది.  

సోది రీజన్స్ చెప్పకు.. ఆటిట్యూడ్ చూపించకు.. కీర్తిపై ఆదర్శ్, ఇంద్రజ ఫైర్!

  శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఐతే ఒక సెగ్మెంట్ లో మాత్రం కీర్తి భట్ కి, ఆదర్శ్ కి మధ్యలో మాటామాటా పెరిగి స్టేజి మీదనే గట్టిగా అరుచుకున్నారు.    ఈ షోలో రష్మీ మూడు వరసలో బుడగలు పెట్టి మూడు జంటలతో పగలగొట్టించేలా చేసింది. ఐతే ఆ మూడు జంటలు ఎవరంటే సిద్ధిపేట మోడల్ - భవాని, నాటీ నరేష్ - ప్రియాంక, ఆదర్శ్ - కీర్తి. అమ్మాయిలను అబ్బాయిలు సెలెక్ట్ చేసుకున్నారు. తరువాత ఒక్కో జంటకు ఒక గోనె సంచి ఇచ్చి అందులో ఇద్దరూ నిలబడి గెంతుకుంటూ వెళ్లి ఆ బుడగలు పగలగొట్టాలి. ఐతే కీర్తి మొదట్లో పడిపోబోయింది. వెంటనే ఆదర్శ్ పట్టుకున్నాడు. దాంతో వాళ్ళు ఓడిపోయారు.    వెంటనే ఆది వచ్చి "ఆదర్శ్ అన్నా నువ్వు ఎప్పుడూ గేమ్ లో ముందుంటావ్" అన్నాడు. "నేను సోలోగా ఐతే గెలిచేవాడినేమో తను మధ్యలోనే పడిపోయింది నేను చెప్తూనే ఉన్నాను. కోఆర్డినేషన్ లేక. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. ఫస్ట్ నేను తర్వాత నువ్వు అని. మధ్యలో మిస్ చేసి తర్వాత పడిపోయాను అంటున్నావ్ " అన్నాడు ఆదర్శ్. "కాలు బయటకు వచ్చేసింది అందుకే ఆడలేకపోయా" అని కీర్తి చెప్తే "ఆ రీజన్స్ అన్ని ఎందుకు ఎవరు గెలిచారు" అంటూ ఆదర్శ్ రెట్టించాడు. దానికి కీర్తి ఐతే ఒక్కరే ఆడాల్సింది మరి అంది. ఇలా అంటే ఎవరన్నా గెలుస్తారా అని ఆదర్శ్ కూడా అడిగాడు. "పక్కనున్న మనుషుల గురించి ఆలోచించాలి గేమ్ తర్వాతన్నా ఆడుకోవచ్చు" అంది కీర్తి. "కెమిస్ట్రీతో ఆడితే గెలుస్తాము రీజన్స్ చెప్తే అంతే" అన్నాడు.      దానికి రష్మీ కూడా "ఇలాంటి ఒక గేమ్ కి కోఆర్డినేషన్ అవసరం. సరే ఆదర్శ్ హర్ట్ అవ్వకు" అంది. "ఎప్పుడు గేమ్ పెట్టినా గెలుస్తాను ఇప్పుడు ఎవరి వలన ఓడిపోయాను. అది చెప్తే ఏదేదో సోది రీజన్స్ అన్నీ చెప్తది" అనేసరికి రష్మీ షాకయ్యింది. వెంటనే కీర్తి వచ్చి "నన్ను అడగకుండా నా పేరు చెప్పావ్ అనేసరికి.. రాకుండా ఉండాల్సింది అన్నాడు. రాను అంటే ఈ అమ్మాయికి పొగరు అంటారు అంది కీర్తి. ఇప్పుడు అదే కనిపిస్తోంది అన్నాడు ఆదర్శ్. మనుషులు ఏమైనా పర్లేదు అంటే కుదరదు అని కీర్తి అనేసరికి నేను గేమ్ గెలవాలనే వస్తాను అని గట్టిగా చెప్పాడు.    వెంటనే ఇంద్రజ "కాదు కీర్తి సారీ ఆదర్శ్ అని చెప్తే సరిపోయేది కానీ అలా కాకుండా నేను చేయలేదు అని ఆటిట్యూడ్ చూపించావుగా అది రెచ్చగొట్టేటట్టు ఉంది" అని చెప్పింది. "అమ్మాయిలేందుకు మేడం ఎప్పుడూ తగ్గాలి" అని అడిగింది కీర్తి. "మీరు ఎంతున్నా చెప్పండి ఏదో ఒక రీజన్స్ చెప్తుంది వేస్ట్" అనేశాడు ఆదర్శ్. "సరే ఇది జస్ట్ గేమ్ దీని వలన మీ ఫ్రెండ్ షిప్ పాడవకూడదు ఇక వదిలేయండి" అంది ఇంద్రజ.  

Bigg Boss 9 Telugu: ఆ కండిషన్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఆర్జీవి..!

  బిగ్ బాస్ సీజన్-9 తొమ్మిదో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ వారం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరిగాయి. ఇందులో ముఖ్యంగా తనూజ క్రైయింగ్ హైలైట్ అవ్వగా, సుమన్ శెట్టి, దివ్య ఆటతీరు అదుర్స్ అనిపించింది. ఇక నామినేషన్లో ఉన్నవాళ్ళలో శనివారం నాటి ఎపిసోడ్ లో ఎవరు సేవ్ అయ్యారో చూసేద్దాం.   నిన్నటి ఎపిసోడ్ లో‌ మొదటగా నాగార్జున 'శివ' గెటప్ లో ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ‘వాయిదా పద్ధతుంది దేనికైనా’ అంటూ నాగార్జునతో కలిసి స్టెప్పులు వేసింది అమల.  36 ఏళ్ల క్రితం ‘శివ’ సినిమాతో అలరించిన నాగార్జున, అమలలు మళ్లీ ఇప్పుడు ఇలా బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపించి కనువిందు చేశారు. 36 ఏళ్ల క్రితం మేమిద్దరం శివ సినిమాతో మీ ముందుకు వచ్చాం.. ఇప్పుడు మళ్లీ ఈ నవంబర్ 14న శివ రీ రిలీజ్ చేస్తున్నామంటూ ఆడియన్స్‌లో ఉత్సాహం నింపారు.      ఆ తర్వాత ‘శివ’ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడమే రాము రాథోడ్ గాలి తీసేశారు ఆర్జీవీ. ‘ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి సర్' అంటే.. స్టుపిడ్ క్వశ్చన్ అని అనేశాడు. రాములోని రాము బయటకు వచ్చారంటూ నాగార్జున సెటైర్ వేసి కాస్త కూల్ చేశాడు. ఇక లాస్ట్ పంచ్ అయితే మామూలుగా లేదు. నిన్ను బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజులు ఉంచితే ఉంటావా అని నాగార్జున అడిగారు. అందరూ సంజన లాంటి అమ్మాయిలు ఉంటే ఉంటానని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఆ టైమ్‌లో సంజన మొహం చూడాలబ్బా.. ఆనందో బ్రహ్మా అంతే. ఇక తనూజ, రీతూ మొహాలు వాడిపోయాయి. ఇక శివ సినిమా గురించి కంటెస్టెంట్స్ నాగార్జున, ఆర్జీవీని క్వశ్చన్స్ అడుగగా కూల్ గా సమాధనమిచ్చారు.    ఇక హౌస్ లో నామినేషన్లో ఉన్నవారిని నిల్చోమని చెప్పాడు. అందులో ఒకరిని ఆర్జీవి ముందు సేవ్ చేద్దామని అన్నాడు. నామినేషన్లో ఉన్నవారిలో నుండి కళ్యాణ్ సేవ్ అయ్యాడు. హౌస్ మేట్స్ కి ఫ్యామిలీ నుండి కొన్ని వాయిస్ మెసేజ్ లు, షర్ట్స్, ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి. అయితే అవి దక్కించుకోవాలంటే హౌస్ లోని మిగతా వారు కొన్ని త్యాగం చేయాలంటూ కండిషన్ పెట్టాడు నాగార్జున.   

Ramu Rathod Elimination: అమ్మ యాదిలో ఎలిమినేట్ అయిన రాము రాథోడ్.. ఎమోషనల్ జర్నీ!

  తిన్నా తీరం పడతలే.. కూసున్నా తీరం పడతలే.. భాదైతుందో యాదిలో మనసంతా.. అమ్మ యాదిలో మనసంతా అంటూ బిగ్ బాస్ హౌస్ లో రాము రాథోడ్ పాడిన పాట అందరి గుండెల్ని హత్తుకుంది. బిగ్ బాస్ హౌస్ లో గత తొమ్మిది వారాలుగా తన ఆటతీరుతో ఆకట్టుకున్న రాము రాథోడ్ నిన్న సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు.   అమ్మ యాదికొస్తుందంటు రాము రాథోడ్ పాడగానే.. ఒంటరిగా అనిపిస్తుందా? నీకంటూ ఎవరూ లేరా? హౌస్‌లో చాలామంది ఉన్నారు కదా రామూ అని నాగార్జున అన్నాడు. ఉన్నారు సర్ ఉన్నారు.. కానీ, మా ఫ్యామిలీ గుర్తొస్తుంది. మాది పెద్ద ఫ్యామిలీ.. నేను లేకుండా వాళ్లు ఎలా ఉంటారో అని బాగా బెంగగా ఉందని రాము అన్నాడు.    వాళ్లంతా నువ్వు ఈ హౌస్‌లో ఉండాలని కోరుకుంటున్నారేమో.. అంత పెద్ద ఫ్యామిలీకి నువ్వు హీరోవి రామూ. వాళ్ల హీరో ఇలా ఉంటే నచ్చుతుందా.. హీరోస్ ఎప్పుడూ ఆట అంతు చూస్తారు.. అంతే కానీ ఇలా గివప్ ఇవ్వరు. నిలబడు, కలబడు. నామినేషన్స్‌లో ఉన్నాననే భయం ఏమైనా ఉందా అని నాగార్జున అడిగాడు‌‌. అదేం లేదు సర్.. నేను వెళ్దానని డిసైడ్ అయ్యానని రాము అన్నాడు.      అంటే ఏంటి.. ఇప్పుడు వెళ్లిపోతావా‌‌‌.. సరే నిర్ణయం నీకే వదిలేస్తున్నా.. ఆలోచించుకుని చెప్పు.. నీకు పది సెకన్లు మాత్రమే టైమ్ ఇస్తున్నా.. వెళ్తానంటే గేట్లు ఓపెన్ అవుతాయని నాగార్జున అన్నాడు. పది సెకన్ల తరువాత కూడా వెళ్తాననే రాము అన్నాడు.    అఆ అనే పుస్తకం గురించి ఎప్పుడైనా విన్నావా.. మా నాన్న గారు ఆ పుస్తకంలో తన ఫీలింగ్స్ అన్నీ రాశారు. మనల్ని మనం తెలుసుకోవడం కోసం ఒక ఆర్ట్ ఫామ్ వెతుక్కుంటాం. నీకు పాట పాడటం తెలుసు.. డాన్స్ చేయడం తెలుసు.. కంపోజ్ చేయడం తెలుసు.. ఇంకేం కావాలి నీకు.. ఇంతమంది హౌస్‌లో ఉన్నారు. నీ ఫైనల్ నిర్ణయం ఏంటో చెప్పమని నాగార్జున అడిగాడు. భయంగా ఉంది అని రాము అన్నాడు. భయం వదిలేస్తేనే గెలుపు నీ దరి చేరుతుందని నాగార్జున అన్నాడు.   హౌస్‌లో ఉన్న వాళ్లలో రాము వెళ్లిపోతేనే హ్యాపీగా ఉంటాడు అన్నవాళ్లు చేయి ఎత్తండి అని నాగార్జున అడుగగా.. తనూజ, రీతూ, కళ్యాణ్, సంజనా, దివ్యలు చేతులు ఎత్తేశారు. వాడు ఇక్కడ ఉండలేకపోతున్నాడు సర్.. ఒంటరిగానే ఉంటున్నాడు.. రాత్రి నిద్రపోవడం లేదని చెప్పింది రీతూ.   చూడు రామూ.. నువ్వేం భయపడకు.. నిన్ను హౌస్‌లో బలవంతంగా ఉంచాలని మాకెవరికీ లేదు. నీకు ఉండాలనిపిస్తే ఉండు.. నువ్వు ఉండాలని ఆడియన్స్ నిన్ను ప్రేమించి ఓట్లేస్తున్నారు. నువ్వు సమాధానం చెప్పాల్సింది వాళ్లకి మాత్రమే.. మాకు కాదు. అందుకే నిన్ను ఇంతసేపు అడుగుతున్నామని నాగార్జున అన్నాడు. ఇక ఉండనని చెప్పేశాడు రాము రాథోడ్. ‌దాంతో నాగార్జున మెయిన్ డోర్ నుండి బయటకు వచ్చేశెయ్ అని చెప్పాడు. కాసేపటికి అందరికి బై చెప్పేసి నాగార్జున దగ్గరకి వచ్చేశాడు రాము రాథోడ్.  

Jayam Serial: పారుని చూసి ఇంట్లో వాళ్లు షాక్.. పెళ్ళికి ఓకే చెప్పేసిన రుద్ర!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -107 లో... రుద్రకి శకుంతల అమ్మాయిని చూసిందని ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. అన్నయ్య పెళ్లికి నేనే రెడీ చేస్తానని ఒకరు, షాపింగ్ చేస్తానని ఇంకొకరు ఇలా రుద్రని ఆటపట్టిస్తారు. నా కొడుకుని ఇబ్బంది పెట్టకండి అని రుద్రపై శకుంతల లేని ప్రేమని చూపిస్తుంది. అదంతా రుద్ర ఇంకా ఇంట్లో వాళ్లు నిజమని నమ్ముతారు.   ఇంతకు అమ్మాయి ఎవరు.. అమ్మాయి పేరు అయిన చెప్పు పెద్దమ్మ అని స్నేహ వాళ్ళు అడుగుతారు. అప్పుడే పార్వతి అంటూ పారు ఎంట్రీ ఇస్తుంది. తనని చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఎందుకు వచ్చావ్.. మా అన్నయ్య హ్యాపీగా ఉంటే చూడలేవా.. ప్రతీదానికి వచ్చి ఇలా ఇర్రిటేట్ చేస్తావని ప్రీతీ కోప్పడుతుంది.    ఎందుకు వచ్చావ్.. సారీ చెప్పడానికి వచ్చావా అని ప్రీతీ అడుగుతుంది‌‌‌. కాదు కన్యాదానం చెయ్యడానికి వచ్చానని పారు వాళ్ళు అనగానే అందరు షాక్ అవుతారు. అంటే శకుంతల నువ్వు చూసింది ఈ అమ్మాయినా అని పెద్దసారు అడుగుతాడు. అవునని శకుంతల అంటుంది. నువ్వు ఏదో అన్నయ్యని అర్థం చేసుకునే భార్యని తీసుకొని వస్తావని అనుకుంటే ఇలా అన్నయ్యని వద్దనుకొని వెళ్ళిపోయినా దాన్ని తీసుకొని వచ్చావా అని ప్రీతీ అంటుంది.    తరువాయి భాగంలో ఈ పెద్దమ్మ తీసుకున్న నిర్ణయం నీకు తప్పు అనిపిస్తుందా అని రుద్రని శకుంతల ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఈ ఎంగేజ్ మెంట్ నాకు ఇష్టమేనని రుద్ర అంటాడు. రుద్ర ఒప్పుకోవడంతో తాంబులాలు మార్చుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: నర్మదని అర్థం చేసుకున్న వేదవతి.. ప్రేమ వెళ్ళిపోయింది!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -311 లో... నర్మద ఇంటికి వస్తుంది. తనని చూసి భద్రవతి, సేనాపతి నవ్వుకుంటారు. నిన్న ఏదో నీతులు మాట్లాడింది.. ఈ రోజు లంచం తీసుకుంటూ దొరికిపోయిందని సేనాపతి అంటాడు. వాళ్ళ మాటలకి నర్మదకి కోపం వచ్చినా కూడా సైలెంట్ గా లోపలికి వెళ్తుంది.    ఇంట్లో అందరు నర్మద కోసం వెయిట్ చేస్తారు. ధీరజ్ ఏమైంది వదిన అని అడుగుతాడు. ఏమైంది నర్మద న్యూస్ లో వచ్చింది నిజమేనా నిజమే అయి ఉంటుందిలే.. ఇలాంటి తప్పు ఎవరైనా చేస్తారులే.. పాపం మావయ్య పరువు గురించి కూడా ఆలోచించాలి కదా అని శ్రీవల్లి అనాల్సిన మాటలన్నీ అంటుంది. ఇప్పుడు హ్యాపీనా అని నర్మద అనేసి లోపలికి వెళ్తుంది.    ఆ తర్వాత నర్మద డల్ గా కూర్చొని ఉంటుంది. ఎందుకు ఇలా చేసావని వేదవతి వచ్చి అనగానే అత్తయ్య నేను తప్పు చేసానని అనుకుంటుందా అని నర్మద అనుకుంటుంది. నువ్వు లంచం తీసుకోలేదు అయినా ఎందుకు ఎదురు తిరగలేదు.. నిన్ను ఈ కేసు లో ఇరికించింది మా వాళ్లే కదా.. ప్రేమ, నేను గుర్తువచ్చి ఎదురు తిరగలేదు కదా అని వేదవతి అనగానే నర్మద తనని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది.      నాకు ఈ ఇంట్లో ప్రేమ, మీరు మాట్లాడకపోతే ఒంటరిని అవుతానని నర్మద అంటుంది. నువ్వు మా గురించి ఏం ఆలోచించకు.. ఈ కేసు నుండి బయటపడడానికి ఏం చెయ్యాలో అది చెయ్ అని వేదవతి చెప్తుంది. ఆ తర్వాత ప్రేమ వచ్చి కూడా మా గురించి ఆలోచించకు అక్క అని చెప్పి సపోర్ట్ చేస్తుంది.    ఆ తర్వాత మీ వాళ్ళు మా వదిన జాబ్ పోయేలా చేశారని ప్రేమతో ధీరజ్ అంటాడు. దాంతో మా ఇంటికి వెళ్లిపోతున్నానని ప్రేమ అక్కడ నుండి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ధీరజ్ షాక్ అవుతాడు. అదంతా భాగ్యం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.