Jayam serial : రుద్రని సెటిల్ చెయ్యాలని చెప్పిన ఇషిక.. ఆ స్వామి చెప్పింది జరుగుతుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -99 లో.. ఇషిక, వీరు ఇద్దరు కలిసి ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి తాము చెప్పినట్లు యాక్టింగ్ చెయ్యమని చెప్తారు. అందుకు అతను ఒప్పుకుంటాడు. ఆ తర్వాత పెద్దసారు చాలా హ్యాపీగా ఉంటాడు. రుద్ర అకాడమీ సక్సెస్ ఫుల్ గా అడ్మిషన్స్ తో నిండి పోయిందని ఇంట్లో వాళ్ళకి చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఇషిక ఎంట్రీ ఇస్తుంది. రుద్ర బావ గారిని ఇక జీవితంలో కూడా సెటిల్ చెయ్యాలంటే పెళ్లి చెయ్యాలని ఇషిక ఆంటుంది. అప్పుడే ఇషిక, వీరు మాట్లాడిన మనిషి స్వామి వేషంలో ఇంటి ముందుకి వస్తాడు. కుటుంబం సమస్యల్లో పడబోతుందని చెప్తాడు. ఇలా ఎన్నో చెప్తారు డబ్బు కోసమని వీరు డబ్బు ఇవ్వబోతుంటే.. నీ డబ్బు ఎవరికి కావాలి.. నేను మీ కుటుంబం గురించి చెప్తున్నానని స్వామి అంటాడు. వద్దని వీరు అంటాడు. అప్పుడే శకుంతల ఎంట్రీ ఇచ్చి.. స్వామి ఏదో చెప్తున్నాడు కదా చెప్పనివ్వు అంటుంది. దాంతో స్వామిని లోపలికి పిలుస్తారు. ఈ కుటుంబంలోకి వచ్చిన కోడళ్ళు గొప్పింటి నుండి వచ్చారు కానీ ఇప్పుడు రాబోయే కోడలు పేద కుటుంబం నుండి వస్తుంది. తన వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని స్వామి చెప్తాడు. ఆ రుద్రుడి కోపాన్ని శాంతింపచేసి తనపై ఉండేదని స్వామి అంటాడు. శివుడి తలపై ఉండేది గంగ అని ఇషిక అనగానే అందరూ షాక్ అవుతారు. గంగ ఈ ఇంటికి కోడలా అని ఇందుమతి ఆశ్చర్యంగా చూస్తుంది. మరొకవైపు గంగ కోసం రుద్ర పట్టిలు తీసుకొని వెళ్తాడు. నువ్వు చేసిన హెల్ప్ కి డబ్బు తీసుకోలేదు కనీసం గిఫ్ట్ అయినా తీసుకోమని పట్టిలు ఇస్తాడు రుద్ర. గంగ అవి తీసుకొని పెట్టుకోబోతుంటే తనకి పెట్టుకోవడం రాదు.. దాంతో రుద్రనే గంగ కాలికి పెడతాడు. మరొకవైపు శకుంతల స్వామి చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. పెద్దసారు వస్తాడు. అసలు ఆ గంగని ఇంటికి తీసుకొని వచ్చి పెద్ద తప్పు చేసానని  పెద్దసారుతో శకుంతల అంటుంది. తరువాయి భాగంలో గంగని పారు కిడ్నాప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu : కొత్త కెప్టెన్ గా దివ్య.. మాధురి బ్యాక్ బిచ్చింగ్ తో తనూజ ఏడుపు!

బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం క్రేజీగా సాగుతోంది. హౌస్ లో ఎవరు.. ఎప్పుడు.. ఎలా.. ఎవరితో ఉంటున్నారో అర్థం అవ్వడం లేదు.. అప్పుడే కోపాలు.. అప్పుడే అలగడాలు.. అప్పుడే బుజ్జగించడాలు.. ఇవన్నీ అందులో ఉన్నవాళ్ళకి కామన్ అయ్యాయి. చూసేవాళ్ళకి కామన్ అయ్యాయి. కెప్టెన్సీ టాస్క్ లో భరణి తన కూతురు ఇద్దరు టాస్క్ లో ఉన్న ఎవరికి సపోర్ట్ చెయ్యకుండా మిడిల్ లో ఉన్నాడు. ఇక కెప్టెన్ దివ్య అవుతుంది. అసలు మీరేంటి సపోర్ట్ చెయ్యకుండా సైలెంట్ గా ఉన్నారు.  ఇప్పుడు ఎక్స్ ప్లనేషన్ ఇచ్చే టైమ్ ఇదా అని భరణిపై దివ్య కోప్పడుతుంది. ఇక తనూజ విషయానికి వస్తే దివ్య కెప్టెన్ అవ్వడంతో వెళ్లి ఏడుస్తుంది. తనని ఓదారుస్తూ మాధురి ఉంటుంది. నాన్న నాన్న అంటూ చుట్టూ తిరిగావ్ కదా అవన్నీ ఫేక్ ఇలాంటి టైమ్ వస్తే ఎవరు రారు.. అసలు నీదే తప్పు అని భరణిపై తనుజకి నెగటివ్ ఫీల్ వచ్చేలా రెచ్చగొడుతుంది.  దివ్య కి సపోర్ట్ గా సుమన్, గౌరవ్, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, శ్రీనివాస్ సాయి ఉన్నారు. చూసావా వాళ్ళు అందరు భరణి సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు దివ్యకు చేస్తున్నారు.. నీకంటు ఎవరు లేరని తనూజని మాధురి రెచ్చగొడుతుంది. అప్పుడే దివ్య వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది.  నా ప్లేస్ లో ఉంటే నవ్వుకుంటూ ఉండేదానివా అని తనూజ అంటుంది. ఇక అ తర్వాత నాకు సపోర్ట్ చెయ్యలేదని శ్రీనివాస్ సాయితో తనూజ గొడవ పెట్టుకుంటుంది. ఆ తర్వాత భరణి గారి కుటుంబం అందరు అటు వైపే ఉన్నారు.. అన్నయ్య, బాబాయ్, తమ్ముడు అటువైపే ఉన్నారని రీతు అంటుంది.  ఇలా భరణి టీమ్ గురించి మాధురి, రీతూ, డిమాన్, తనూజ మాట్లాడుకుంటారు. అదంతా విన్న తనూజ.. ఇక నుండి ఏ బాండ్ లేదని క్లియర్ గా చెప్తుంది. తర్వాతి నుండి భరణిని నాన్న అని పిలుస్తుందో లేదో చూడాలి మరి.  

Bigg Boss 9 Telugu : భరణి కోసం మాధురి డ్యాన్స్.. అతనికి మాత్రమే సపోర్ట్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం ఒక్కొక్కరి ఆటతీరు ఒక్కోలా ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. భరణికి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అతనే కెప్టెన్సీ కంటెండర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.  భరణి, దివ్య, తనూజ, శ్రీనివాస్ సాయి, నిఖిల్ కెప్టెన్సీ కంటెండర్స్ గా భరణి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక టాస్క్ విషయానికి వస్తే ఎవరు పేరు అయితే పిలుస్తారో వాళ్ళు వెళ్లి స్టేజ్ పై డాన్స్ చెయ్యాలి.. మరొక స్టేజ్ పై తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి అలా సాంగ్ సాగేవరకూ ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు స్టేజ్ పై ఎంత మంది ఉంటారో వాళ్ళని లెక్కలోకి తీసుకొని ఎక్కువ మంది సపోర్ట్ కలిగి ఉవన్నవాళ్లు కెప్టెన్ అవుతారు.  అలా కంటెండర్స్ అందరు తమకు సపోర్ట్ చెయ్యమని హౌస్ మేట్స్ ని అడుగుతారు. మాధురి దగ్గరికి భరణి వెళ్తాడు. నాకూ సపోర్ట్ చెయ్యండి నా కోసం డాన్స్ చెయ్యండి అని మాధురిని భరణి రిక్వెస్ట్ చేస్తాడు. అలా మొదట ఛాన్స్ శ్రీనివాస్ సాయికి వస్తుంది. తనకి సపోర్ట్ గా ఒక్కరు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత దివ్యకి ఛాన్స్ రాగా దివ్య కి సపోర్ట్ గా అయిదుగురు ఉంటారు. ఆ తర్వాత నిఖిల్ కి  సపోర్ట్ గా ముగ్గురు ఉంటారు. భరణి కి నలుగురు ఉంటారు‌. భరణికి సపోర్ట్ చెయ్యాలని మాధురి స్టేజ్ పైకి వెళ్తుంది కానీ రీతూ కిందకి లాగేస్తుంది. చివరగా తనూజ ఉంటుంది. తనకి ఎనమిది మంది ఉంటారు... బిగ్ బాస్ టాప్-2 ఉన్నవాళ్లు ఫైనలిస్ట్ గా సెలెక్ట్ చేస్తాడు. కాసేపటికి ఫైనల్ తనూజ, దివ్యల మధ్య కెప్టెన్సీ పోటీ జరుగుతుంది. ఇద్దరికి చెరొక ఆరుగురు సపోర్ట్ చేస్తూ స్టేజ్ పై ఉంటారు. ఎవరికి సపోర్ట్ చెయ్యకుండా భరణి సైలెంట్ గా మిడిల్ లో ఉంటాడు. తనూజ టీమ్ నుండి నిఖిల్ కిందకి వస్తాడు. ఇక ఎక్కువ సపోర్ట్ ఉన్న దివ్య కెప్టెన్ అవుతుంది.  

Bigg Boss 9 Telugu: శ్రీజ ఎలిమినేషన్.. కెప్టెన్సీ రేస్ లో భరణి కుటుంబం!

బిగ్ బాస్ ఏ సీజన్ లో చూడని వింతలు విశేషాలు ఈ సీజన్-9 లో చూస్తున్నాం. ఎందుకంటే ఈ వారం శ్రీజ, భరణిలని రీఎంట్రీగా తీసుకొచ్చాడు‌‌ బిగ్ బాస్. వాళ్లు పర్మినెంట్ హౌస్ మేట్ కావాలంటే ప్రేక్షకుల ఓటింగ్ లో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్లే పర్మినెంట్ హౌస్ మేట్. ఓటింగ్ ప్రకారం ఎవరు లీడ్ లో ఉన్నారో బిగ్ బాస్ హ్యామర్ తో బాక్స్ ని పగులగొట్టి చూడమని నిఖిల్, గౌరవ్ లకి చెప్తాడు. హ్యామర్ తో కొట్టి చూడగా భరణి ఫోటోకి స్టే అని, శ్రీజ ఫోటోకి ఎగ్జిట్ అని రాసి ఉంటుంది. దాంతో భరణి కుటుంబం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కళ్యాణ్ బాధపడుతుంటే శ్రీజ ధైర్యం చెప్పి హౌస్ లో నుండి ఎలిమినేట్ అవుతుంది. ఇక భరణి పర్మినెంట్ హౌస్ మేట్ అయ్యాడు.  భరణికి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు.  అయిదుగురిని కెప్టెన్సీ కంటెండర్స్ గా సెలక్ట్ చేసుకోమని,  అందులో మీరు కూడా ఉండొచ్చని భరణితో బిగ్ బాస్ చెప్తాడు. కాసేపటికి భరణి దగ్గరికి మాధురి వస్తుంది. బాయ్స్ తో పోటీ పడలేము కదా ఉన్న అయిదుగురికి ఉమెన్స్ కి ఛాన్స్ ఇవ్వండి అని మధురి అడుగుతుంది కానీ తన మాట పట్టించుకోకుండా భరణి తన డెసిషన్ చెప్తాడు . దివ్య, తనూజ, శ్రీనివాస్ సాయి, నిఖిల్, ఇంకా నేను అని భరణి చెప్తాడు. ఇక కెప్టెన్సీ రేస్ లో భరణి తన ఇద్దరు కూతుళ్ళతో బరిలో ఉన్బాడు. దివ్య అంటే తన తరపున టాస్క్ ఆడి గెలిచింది దివ్యని తీసుకున్నాడు.  తనూజని తీసుకోకుంటే ఫీల్ అవుతుందని అలా తనని కూడా తీసుకున్నాడు. ఇప్పటివరకు కెప్టెన్ కానీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చానని భరణి చెప్పాడు కానీ అసలు కెప్టెన్ కానీవాళ్లు రీతూ ఉంది, మాధురి ఉంది కదా వాళ్ళని ఎందుకు కన్సిడర్ చెయ్యలేదని రీతూ, మాధురి ఫ్యాన్స్ అడుగుతున్నారు. మరి భరణి డెసిషన్ మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.  

శైలజ గారిని స్నేక్ అన్న ఈర్య...

సరిగమప లిటిల్ చాంప్స్ ప్రోమో చూసి నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఏంటి డైలాగ్స్ మార్చండి అంటూ కామెంట్స్ లో మండిపడుతున్నారు. విషయం ఏమిటి అంటే ఈ షోకి డ్రామా జూనియర్స్ లో చేసిన ఈర్య వచ్చింది. రాగానే పెద్ద పెద్ద డైలాగ్స్ వేసింది. ఆ షోలో ఉన్నంత వరకు అనిల్ మామ అనిపించారు. ఇక ఇందులో అనంత్ మామ అనిపించడం మొదలుపెట్టారు. "నువ్వెందుకు వచ్చావమ్మ" అని శైలజ అడిగేసరికి "అందరి లెక్కలు తెలుస్తా ఈర్య తిక్కేంటో చూపిస్తా" అంది. "ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మా అంటారు కానీ నేను మామ" అంటాను అనేసరికి అనిల్ రావిపూడి థ్యాంక్యూ ఈర్య అన్నారు. వెంటనే ఆ పిల్ల "ఐ లవ్ యు అనంత్ మామ" అనేసింది. "ఎందుకె అటెల్లిపోయావ్" అని అనిల్ అడిగేసరికి "అయ్యో సర్ ఎవరండీ మీరు" అంది. "నువ్వేం తింటున్నావ్" అని అనంత్ శ్రీరామ్ ని అడిగింది. "స్నాక్స్ అమ్మ" అన్నాడు. "మీరు చాలా గ్రేట్. స్నేక్స్ పక్కన కూర్చుని స్నాక్స్ తింటున్నావా" అనేసింది. దానికి శైలజ వెంటనే ఏయ్..నోరు కొంచెం తగ్గించు..అన్నారు. "నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకపోతే నే వెళ్ళిపోతా" అన్నారు శైలజ. వెంటనే సెల్ చూసింది ఈర్య. "ఏంటి సెల్ చూస్తున్నావ్" అన్నారు. "మీరే వెళ్ళిపోతా అన్నారుగా అందుకే క్యాబ్ బుక్ చేస్తున్నా" అంది ఈర్య. ఇక అనిల్ రావిపూడి వెంటనే "సుధీర్ నువ్వు ఆ అమ్మాయిని బయటకు పంపిస్తే నీకు సినిమాలో వేషం ఇస్తా" అన్నాడు. ఇలా పెద్దా చిన్నా లేకుండా స్నేక్స్ అనేసరికి నెటిజన్స్ ఘాటుగా రిప్లైస్ ఇస్తున్నారు. "ఆ పాప మాట్లాడితే క్యూట్ ఉంటది...బట్ ఇలాంటి మాటలు, వేషాల వల్ల ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయిపోతుంది శైలజ గారితో అలా మాట్లాడటం నచ్చలేదు..ఒకే వయసు పిల్లలపై పంచ్‌లు వేయడం వేరు, కానీ ఇక్కడ పెద్దలపై హద్దు మీరు డైలాగ్స్ వేయడం మంచిది కాదు, తల్లిదండ్రులు ఇలాంటి పంచ్‌లు అంగీకరించే ముందు ఆలోచించాలి. దయచేసి శైలజా మేడమ్ మీద కాదు, మంచి విషయాల మీద పంచ్ లు రాయండి. శైలజ మేడంకి గౌరవం ఇవ్వాలి.. శైలజా గారితో అలా మాట్లాడే విధానం మార్చండి..ఇంతకు ముందు కూడా ఆమె శైలజ గారితో అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు  సుధీర్ ఆపడానికి ప్రయత్నించాడు కానీ ఆమె ఆపలేదు. తల్లిదండ్రులు ముందు మర్యాద నేర్పించాలి. ఈ ప్రోగ్రాంలో సరిగమల కన్నా. ఇలాంటి పదనిసలు ఎక్కువగా ఉన్నాయి..పెద్ద వాళ్ళను చిన్న పిల్లల చేత అలా అనిపించకూడదు, అసలు ఈ ప్రోగ్రాం తీసెయ్యండి." అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

కళ్యాణం కోసం కంకణం కట్టించుకున్న రోహిణి...

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ గా ఇది రాబోతోంది. ఈ షోకి రోహిణి, సుహాసిని, ప్రిన్సి, సమీరా భరద్వాజ్, కావ్య, సిరి హన్మంత్, నయని పావని, లాస్య మంజునాథ్, ప్రియాంక జైన్, గాయత్రి అంతా వచ్చారు. ఇక గోదావరి మూవీలో హిట్ సాంగ్ "అందంగా లేనా అస్సలేం బాలేనా" అనే సాంగ్ ని ఒక్కో లైన్ కి ఒక్కొక్కరు భలే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇక లాస్య ఎక్స్ప్రెషన్ కి ఐతే శ్రీముఖి ఫుల్ ఫిదా ఐపోయింది. "మంజు ఇది చూసాకా ఐపోతావ్ పుంజు" అంటూ శ్రీముఖి లాస్య గురించి చెప్పుకొచ్చింది. సమీరా ఐతే అదే సాంగ్ పాడుతూ కైపుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టేసరికి అవినాష్ చూసి "ఇది చూసి అబ్బాయిలంతా అల్లాడిపోతారు" అన్నాడు. ఇక హరి వచ్చి "మా సైడ్ నుంచి రోహిణిని డ్రాప్ చేస్తాం అటు నుంచి ప్రిన్సిని డ్రాప్ చేయండి" అని శ్రీముఖికి చెప్పాడు. తర్వాత రోహిణి కూడా అదే పాట పాడుతూ అందంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఐతే లాస్ట్ లో సమీరా ఆ సాంగ్ ని ఖూనీ చేసేసరికి హరి ఫీలయ్యాడు "మీ వలన వచ్చిన రెండు పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్లిపోయాయి ఆవిడకి" అన్నాడు. వెంటనే రోహిణి "ఎస్క్యూజ్ మీ... కళ్యాణానికి కంకణం కట్టారు ఐపోతుంది" అనేసరికి హరి చూసి "కంకణం కడతారు తాళి కట్టరు" అనేశాడు పుసుక్కున. ఇక శ్రీముఖి ఇంకో టాస్క్ ఇచ్చింది "అందంగా లేనా" సాంగ్ ని సీరియస్ గా చేయమనేసరికి ప్రిన్సి పాడుతూ అవినాష్ ని, హరిని కొట్టింది. వెంటనే హరి "ప్రిన్సి ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేసావ్" అన్నాడు. "చాలా చేసాను" అంది. "ఈ యాక్టింగ్ తో అన్ని సీరియల్స్ ఎలా చేసావ్" అంటూ కౌంటర్ వేసరికి ప్రిన్సి అవాక్కయ్యింది.

శృతి హాసన్ కోసం కవిత చెప్పిన ధీరజ్...

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాస్ట్ వీక్ ఎపిసోడ్ కి శృతి హాసన్ వచ్చి థమన్ తో కలిసి మంచి మంచి పాటలు పాడి అలాగే కంటెస్టెంట్స్ కి బ్లేసింగ్స్ ఇచ్చి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. ఇక కంటెస్టెంట్ ధీరజ్ ఒక సాంగ్ పాడి ఆ తర్వాత శృతి హాసన్ మీద ఒక కవిత చెప్పాడు. "మీరు పాట పాడితే ఒక సెన్సేషన్, మీరు డాన్స్ వేస్తె అదొక సెలబ్రేషన్, మీకు ఆసక్తికరమైన విషయం ఏదైనా ఉంది అంటే అది మ్యూజికల్ క్రియేషన్, మీ యాక్టింగ్ లో మీరే కమల్ హాసన్, మిమ్మల్ని చూస్తే కరిగిపోతుంది ఆ సన్, ఈరోజు మా అందరితో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో మా అందరితో శృతి కలపడానికి వచ్చారు మా శృతి హాసన్" అంటూ చాల భావయుక్తంగా చెప్పాడు. "నాకు నీ కవిత మొత్తం అర్ధమయ్యింది. థ్యాంక్యూ సో మచ్" అని రిప్లై ఇచ్చింది శృతి. "మీరు చేసిన మొట్ట మొదటి తెలుగు సినిమా అనగనగా ఒక ధీరుడు. అందుకే మీకు ఈ కవితను అంకితం చేస్తున్నాడు ఈ ధీరుడు" అని కూడా చెప్పేసాడు ధీరజ్. ఇక మరో కంటెస్టెంట్ ఐతే శృతి హాసన్ తో ఒక టు స్టెప్స్ వేయాలని కోరేసరికి ఆమె స్టేజి మీదకు వచ్చి డాన్స్ చేసేసింది. అలాగే పవన్ కళ్యాణ్ షర్ట్ మీద హార్ట్ సింబల్ వేసి సైన్ చేసింది. ఇక ఆ కుర్రాడేమో శృతి హాసన్ బొమ్మతో ఉన్న ఒక కలర్ ఫుల్ రెడ్ పిల్లోని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక శృతి డాన్స్ కి థమన్ ఫిదా ఐపోయి..శృతి ఎంత గ్రేస్ తో చేసావో డాన్స్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

కొత్త సీరియల్ "పొదరిల్లు" త్వరలో...

  స్టార్ మాలో త్వరలో ఒక కొత్త సీరియల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అదే "పొదరిల్లు" పేరుతో రాబోతోంది. దాని ప్రోమో కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. తమిళ్ లో సూపర్ హిట్ ఐన "అయ్యనార్ తునై" అనే సీరియల్ ని కన్నడలో "గంధదగుడి" అనే పేరుతో రీమేక్ చేశారు.  ఇప్పుడు దీన్ని "పొదరిల్లు" పేరుతో తెలుగులో రీమేక్ చేసి లాంఛ్ చేయబోతున్నారు. ఇక ఇందులో దీపక్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా కృత్తికా ఉమాశంకర్ నటిస్తోంది. ఈమె ఇప్పటికే "మగువ ఓ మగువా" అనే సీరియల్ లో నటిస్తోంది. ఇందులో హీరో తల్లి చనిపోయి హీరో ఒంటరి వాడైపోతాడు. ఎవరూ ఉండరు. మేనత్త కూడా పట్టించుకోదు. "నేను ఎలాగైనా పెళ్లి చేసుకుని ఈ ఇంటికి మహాలక్ష్మిని ఆడ దిక్కుగా తెస్తాను ఇదే నా శపధం" అంటాడు హీరో. "డబ్బు అక్కరలేదు, కులం పట్టింపు లేదు, అమ్మాయి ఐతే చాలు..నవ మన్మధుడు లాంటి పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు" అంటూ పామ్ప్లేట్స్ వేసి అమ్మాయిలకు పంచుతూ ఉంటాడు. "శపధం చేసి తెస్తానన్న మహాలక్ష్మి ఈ భూమి మీద ఉందా" అని హీరో ఫీలవుతున్న టైములో గుళ్లో గంట మోగడం "ఏ టాక్సీ వస్తారా" అంటూ ఒక అందమైన అమ్మాయి హీరోని పిలవడం జరిగిపోతాయి. "వీడు ఊహించుకుంటున్న ఆ ఇంటి మహాలక్ష్మి ఈమేనా..తప్పకుండ సీరియల్ చూడండి" అంటూ రిలీజయినా ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో ఒక టాక్సీ డ్రైవర్. పెళ్లి చేసుకోవడం కోసం ఒక గొప్ప ఆఫర్ కూడా ఇచ్చాడు. "పెళ్లి కానీ ఆడవాళ్లకు 50 % డిస్కౌంట్" అని బోర్డు పెట్టుకున్నాడు. మరి ఈ సీరియల్ త్వరలో అన్నారు కానీ డేట్ టైం ప్రస్తుతానికి రివీల్ చేయలేదు.

Duvvada Madhuri vs Tanuja : కడుపు మాడ్చుకున్న దువ్వాడ మాధురి.. భరణి కోసమేనా!

  బిగ్ బాస్ సీజన్-9 లో దువ్వాడ మాధురి హౌస్ లోకి వెళ్ళిన నుండి కంటెంట్ ఇవ్వడానికి ఫుల్ ట్రై చేస్తోంది. ఎక్కడ స్కోప్ దొరికితే అక్కడ గొడవేసుకొని, జనాల మీద అరిచేసి కంటెంట్ ఇస్తుంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో మార్నింగ్ సాంగ్ కి అందరు డ్యాన్స్ చేసి ఎక్కడివాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. ఇక సంజన, మాధురి ఒక సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నారు.  రాత్రి తనూజతో జరిగిన గొడవ గురించి సంజనతో మాధురి చెప్పింది. నాకు నిన్న వచ్చిన కోపానికి బీపీ పైవరకు వెళ్లిపోయింది‌‌.. ఎందుకులే గొడవ అని పడుకుండిపోయానని మాధురి అంది. ఇంతలో మార్నింగ్ తినడానికి ఏం చేస్తున్నారంటూ తనూజ వచ్చి అడిగింది. అది మీరే చెప్పాలంటూ మాధురి అంది. కూరగాయలు ఉండేదాన్ని బట్టి వండేది నువ్వు కదా అని తనూజ అంటుంది‌‌. నువ్వేం చెప్తే అది వండాలని చెప్పావ్ కదా అని మాధురి అంటుంది‌. ఇన్ని రోజులు నేను ఏం చెప్తే అది వండావా అని తనూజ అడిగింది. నిన్న కూడా నువ్వు చెప్పావ్ కదా రైస్ ఇంత వండాలని, ఇలా చపాతీ కావాలనంటూ మాధురి చెప్పింది. సరే మార్నింగ్ రైస్ ఏం వండుతావని అడుగుతున్నానని తనూజ అంటే అందుకే అడుగుతున్నా నువ్వేం రైస్ చేయమంటే అది చేస్తా.. నాకు తెలియట్లేదు తనూజ..నిన్న నాకు ఆకలేసింది.. ఒక చపాతీ ఎక్స్‌ట్రా అడిగాను దానికే నువ్వు అరిచావ్. అందుకే నీతో డిస్కస్ చేయాలని లేదంటూ మాధురి ఆకలి మంటని బయటపెట్టింది.  ఫుడ్ విషయంలో కూడా దెబ్బలాడితే మా ఇంట్లో వాళ్లు చూస్తే హర్ట్ అవుతారు.. మధ్యాహ్నం అన్నం తినకే కదా నీతో ఒక చపాతీ ఎక్స్‌ట్రా అడిగానంటూ మాధురి ఎమోషనల్ అయింది. దీంతో ఏం తెలీనట్లు దివ్యని పిలిచి ఆవిడ ఎక్స్‌ట్రా చపాతీ అడిగితే ఇవ్వలేదా అంటూ తనూజ అడిగింది. అదేంటి ఇచ్చా కదా అని దివ్య అంటే.. అది కాదు ఇంకొకటి అడిగా.. లేవు అంటే పిండి చేసుకుంటానని కూడా అన్నా.. తనూజయే కదా వద్దున్నావంటూ మాధిరి సూటిగా అడిగింది. ఆకలేస్తేనే కదా అడుగుతాను.. నేను ఈ పద్నాలుగు రోజుల్లో ఎప్పుడైనా అడిగానా అని మాధురి చెప్పింది. ఇక తనూజ ఆన్సర్ ఇవ్వకుండా కుకింగ్ టీమ్ ప్లస్ కెప్టెన్‌ని పిలిచి మీటింగ్ పెట్టింది. భరణి హౌస్ లోకి వెళ్ళిన నుండి మాధురి తనకి కేరింగ్ చూపిస్తుంది. నిన్న భరణికి ప్రేమగా ప్లేట్ లో అన్నం పెట్టి ఇచ్చింది. తనకి సంభందించిన ప్రతీ విషయంలో మాధురి ఇంట్రెస్ట్ చూపిస్తుందంటూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి‌. ఇక ఇన్ స్టాగ్రామ్ లో అయితే భరణి, మాధురి కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు రీల్స్ కూడా చేస్తున్నారు. మరి మాధురిని భరణి ఏం అయినా అన్నాడా లేక తనూజపై ఉన్న కోపంతో మాధురి కడపు మాడ్చుకుందా తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu : డీమాన్ మాట వినకుండా ఓడిపోయిన శ్రీజ.. లీడ్ లో భరణి!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఒక్కో రోజు ఒక్కోలా కంటెస్టెంట్స్ ఆటతీరు సాగుతోంది. ఇక భరణి, శ్రీజల మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. హౌస్ పర్మినెంట్ హౌస్ మేట్ ఎవరవుతారని ఇద్దరి మధ్య టాస్క్ ల మీద టాస్క్ లు జరుగుతున్నాయి. మొన్నటి టాస్క్ లో శ్రీజ విన్ అయింది. అందులో సంచాలక్ నిర్ణయం సరిగ్గా తీసుకోలేదు.. తర్వాత మాధురికి సంఛాలక్ ఇవ్వగా శ్రీజ టీమ్ విన్ అయింది. దాంతో ఆ టాస్క్ ని నిన్న బిగ్ బాస్ రద్దు చేసాడు. నిన్న హౌస్ లో మొత్తం మూడు టాస్క్ లు జరుగగా.. మొదటి టాస్క్ మెయిజ్ టాస్క్.  అందులో భరణి చెయ్ కి గాయం ఉండడంతో తన తరుపున దివ్య ఆడింది. ఫస్ట్ టాస్క్ లో దివ్య, శ్రీజ పోటీ పడగా అందులో దివ్య గెలుస్తుంది. దాంతో శ్రీజ డిస్సపాయింట్ అవుతుంది. అసలు లక్ కలిసి రావడం లేదు.. గెలిచిన ఒక్క టాస్క్ కూడా రద్దు అయిందని శ్రీజ బాధపడుతుంది. రెండో టాస్క్ లో భరణి, రాము ఒక జట్టు.. శ్రీజ, కళ్యాణ్ ఒక జట్టుగా ఉన్నారు. అందులో భరణి టీమ్ టాస్క్ ని ఎనిమిది నిమిషాల్లో పూర్తిచేస్తే శ్రీజ టీమ్ రెండు నిమిషాల్లో పూర్తిచేసింది. ఇందులో కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ గా ఆడటంతో శ్రీజ టీమ్ విన్ అయింది. మూడో టాస్క్ లో భరణి టీమ్ నుండి ఇమ్మాన్యుయల్ ని తోసుకోగా.. శ్రీజ టీమ్ నుండి ఎవరిని తీసుకువాలో శ్రీజ కన్ఫ్యూషన్ లో పడింది. అయితే నేను ఆడుతానని డీమాన్ అంటాడు. నీకు ఎవరిపై నమ్మకం ఉంటే వాళ్ళని ఆడించమని డీమాన్ అంటాడు. దాంతో కళ్యాణ్ ని శ్రీజ సెలక్ట్ చేసుకుంటుంది. ఆ టాస్క్ లో ఇమ్మాన్యుయల్ విన్ అవుతాడు. మూడు టాస్క్ లలో భరణి రెండు విన్ అయి కోటపై తన రెండు జండాలని ఎగురవేస్తాడు. శ్రీజ ఒక్క గేమ్ విన్ అవుతుంది ఒక్క జెండా ఎగురవేస్తుంది. ఇక టాస్క్ లలో భరణి టీమ్ తనూజకి ఛాన్స్ ఇవ్వలేదని తను మాధురికి చెప్తూ ఎమోషనల్ అవుతుంది. నన్ను ఆడనివ్వలేదంటే నాపై నమ్మకం లేదన్నట్లే కదా అని తనూజ చెప్తుంది‌. మాధురి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

బిగ్ బాస్ హౌస్ లో మేకప్ వేసుకోలేదు అంటున్న రమ్య మోక్ష

  రమ్య మోక్ష అంటే తెలియకపోవచ్చు కానీ చిట్టి పికిల్స్ అంటే అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో ఈమె చాలా ఫేమస్. దాని కారణంగానే బిగ్ బాస్ సీజన్ 9 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చాలామంది ట్రోలింగ్ కూడా చేశారు. ఐతే ఇప్పుడు ఆమె ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. "నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడి నీరు వాతావరణం అస్సలు పడలేదు. పైగా  థైరాయిడ్ సమస్యలు కూడా ఉన్నాయి. వాటి కారణంగా నా చేతులు, మెడ, శరీరం మొత్తం మీద స్కిన్ ఇన్ఫెక్షన్స్, దద్దుర్లు రావడం మొదలుపెట్టాయి. అలాగే నాకు టాన్సిల్స్, ఇంకా  గొంతు సమస్యలు కూడా ఉన్నాయి. ఇక ఈ టైములో నేను జంక్ ఫుడ్ తిన్నాను, సోడాలు వంటివి తాగడంతో నాకు హై ఫీవర్ వచ్చింది అలాగే డయేరియా బారిన పడ్డాను. ఈ ఆరోగ్య సమస్యలేవీ టీవీలో చూపించలేదు. బిగ్ బాస్ హౌస్ లో రియల్ గా  జరిగిన ప్రతిదాన్ని వివరిస్తూ నేను త్వరలో ఒక వీడియో చేస్తాను.  నేను నెగటివిటీ పట్టించుకోను, దాన్ని ఇగ్నోర్ ఎలా చేయాలో బాగా తెలుసు" అంటూ చెప్పింది. అలాగే మరో స్టేటస్ లో "ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో నన్ను చూడండి జనాలు ఈ వీడియోను తీసి పోస్ట్ చేశారు. ఎడిటింగ్ చేసిన ఫోటో కాదు. టీవీలో ఎవరైనా సరే సహజంగానే కొంచెం బొద్దుగా  కనిపిస్తారు. నేను ఎలాంటి మేకప్ కూడా వేసుకోను ఎందుకంటే ఆ మేకప్ వలన నా కళ్ళ నుంచి నీళ్లు వస్తూ ఎర్రగా మారిపోతాయి అంతే కాదు మేకప్ వలన నాకు జలుబు, తలనొప్పి కూడా వచ్చేస్తాయి. త్వరలో నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ కి వస్తాను. నా మంచి, చెడు సమయాల్లో నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు." అంటూ పోస్ట్ చేసింది.

Bigg Boss 9 Telugu : భరణికి బిగ్ బాస్ సపోర్ట్.. శ్రీజకి మరోసారి అన్యాయం జరగనుందా!

  బిగ్ బాస్ సీజన్-9 ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతోంది. అసలు ఎవరు ఊహించనిదే బిగ్ బాస్  చేస్తున్నాడు. అగ్నిపరీక్ష ద్వారా మొదటగా ఆరుగురు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. అంతవరకు బానే ఉంది.. మళ్ళీ వాళ్ళని వరుసగా ఎలిమినేట్ చేసాడు. ఇప్పుడు కామనర్స్ లో ఎలిమినేట్ అయిన శ్రీజకి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో తనకి మళ్ళీ రీఎంట్రీ ఉంటుందని బజ్ క్రియేట్ చేశారు. ఇక దీనితో పాటుగా అంతకుముందు వారం ఎలిమినేట్ అయిన భరణిని తీసుకొని వచ్చి ఇద్దరిలో ఎవరో ఒకరు పర్మినెంట్ హౌస్ మేట్  అని చెప్పాడు. వాళ్ళకి టాస్క్ లు ఇచ్చి ఎక్కువ పర్ఫామెన్స్ ఇచ్చిన వాళ్ళు పర్మినెంట్ హౌస్ మేట్ అని బిగ్ బాస్ మామ చెప్పాడు. ఇంతవరకు బానే ఉంది కానీ హౌస్ లో మొదటివారం నుండి ఎలిమినేషన్ అయిన వాళ్లున్నారు. వారికి  టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. మరి వాళ్ళని వదిలేసి, రెండు వారాల క్రితం ఎలిమినేట్ అయిన భరణికి సెకెండ్ ఛాన్స్ ఇవ్వడం ఏంటని ఆడియన్స్ అంటున్నారు. భరణి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యాడు.. తనకి అన్యాయం ఎక్కడ జరిగింది.. శ్రీజ అంటే తను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్ ఒపీనియన్ ద్వారా బయటకు వచ్చింది కనుక తనకి సెకెండ్ ఛాన్స్ పర్లేదు.. ఇప్పుడు ఈ ఇద్దరిలో కూడా ఓటింగ్ లో భరణి ముందు ఉన్నాడు. మూడు టాస్క్ ల్లో రెండు టాస్క్ లు భరణి టీమ్ విన్ కాగా ఒక్క టాస్క్ మాత్రమే శ్రీజ విన్ అయింది. ఇప్పుడు ఏ రకంగా చుసిన మళ్ళీ శ్రీజ ఎలిమినేట్ అవ్వకు తప్పదు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరిని ఉంచాలనుకుంటే వాళ్ళని ఉంచుతాడు. ఎవరిని ఎలిమినేట్ చెయ్యాలనుకుంటే చేస్తాడు. విన్నర్ కూడా అంతే బిగ్‌బాస్ ఏది డిసైడ్ అయితే అదే ఫైనల్. భరణి కంటే స్ట్రాంగ్ ఉండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లేరా అనేది ఆడియన్స్ భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే భరణిని హౌస్ లో పర్మినెంట్ కంటెస్టెంట్ చేయాలని, బాండింగ్ కంటెంట్ ఇవ్వాలని బిగ్‌బాస్ చూస్తున్నాడని తెలుస్తోంది.

Jayam serial : గంగ ఇంటికోడలు అవుతుందా‌.. అబద్ధం చెప్పించడానికి ఆ ఇద్దరు ప్రయత్నం!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -98 లో.....రుద్ర అకాడమీకి వస్తాడు. ఎవరు స్టూడెంట్స్ రాకపోవడంతో డల్ గా ఉంటాడు. అప్పుడే పెద్దసారు వచ్చి ఏం డిస్సపాయింట్ అవ్వకూ వస్తారని చెప్తాడు. అప్పుడే పారు వచ్చి అది జరగదు.. ఎవరు రారు ఒకవేళ వచ్చిన ఈ అగ్రిమెంట్ చూపిస్తానని పారు అంటుంది. అప్పుడే గంగ కొంతమంది స్టూడెంట్స్ ని తీసుకొని అకాడమీకి వస్తుంది. ఏంటి రోడ్డుపై ఎవరు కన్పిస్తే వాళ్ళని తీసుకొని వచ్చావా అని పారు అంటుంది. అలా కాదు వాళ్లు చదువుకునేవాళ్ళు.. అన్నింట్లో ముందున్నా వాళ్ళు.. పాపం తమ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు.. అంతేకాక ఆర్థిక స్థోమత లేని వాళ్ళు అని గంగ అనగానే అలా చెప్పు అని పారు వెటకారంగా మాట్లాడుతుంది. నాకు కావాలిసింది కూడా అదే అని రుద్ర అంటాడు. వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మీలా గొప్పగా చెయ్యండి అని రుద్రతో గంగ అంటుంది. మరొకవైపు ఒక స్వామి దగ్గరికి ఇషిక, వీరు వెళ్లి మేం చెప్పినట్లు మా ఇంటికి వచ్చి గంగ మీ ఇంటికి కొడలు అవుతుందని చెప్పండి అని చెప్తారు. అలా అబద్ధం చెప్పడం ఏంటి.. అదే నిజం అని స్వామి అనగానే స్వామిని తిట్టుకుంటు ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు ఇక్కడ ఎవరికో కాలుతున్నట్లు ఉందని పారుని ఉద్దేశ్యించి గంగ, పెద్దసారు మాట్లాడుకుంటారు. దాంతో పారు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రీతి కిచెన్ లో వంట చేస్తుంటే ఎవరు చెయ్యనివ్వరు. అప్పుడే శకుంతల వచ్చి స్నేహా పెద్దనాన్నని పిలువు అంటుంది. రుద్ర అన్నయ్యతో నాన్న అకాడమికి వెళ్లాడని ప్రీతీ చెప్తుంది. అకాడమీకి ఎందుకు.. నిన్న ఓడిపోయాడు కదా.. ఎవరు జాయిన్ అవుతారు మూసేస్తాడు అకాడమీ అని శకుంతల కోపంగా మాట్లాడతుంది. మరొకవైపు ఇషిక, వీరు ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తారు. తనకు ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

llu illalu pillalu : శోభ కోసం ఇద్దరు కోడళ్ళు వెతుకులాట.. వేదవతి వల్లే దొరికిపోయారుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్‌  'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-303 లో..... నర్మద, ప్రేమ, వేదవతి ముగ్గురు కలిసి శోభని కిడ్నాప్ చేసిన వాళ్ళని వెతకడానికి వెళ్తారు. వేదవతి తన తింగరి చేష్టలతో ఇద్దరు కోడళ్లకి చిరాకు తెప్పిస్తుంది. అసలు ఏమైంది అత్తయ్య.. నీ అత్త పోరు ఇంటికి వెళ్ళాక చూసుకుందాం కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉండమని నర్మద అంటుంది. మరొకవైపు శోభని కిడ్నాప్ చేసినవాడు.. తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఇంటికి ఎవరైనా వస్తే.‌‌ నా గురించి చెప్పకని చెప్తాడు. అప్పుడే అత్తాకోడళ్ళు కిడ్నాప్ చేసిన వాడి ఫ్రెండ్ ని చూసి అతనికి ఏమైనా తెలుసో కనుక్కుందామని వేదవతి అంటుంది. అలా డైరెక్ట్ గా ఎవరిని అడగొద్దని నర్మద అంటుంది. అయినా వినపకుండా.. బాబు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు.. వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా అని అడుగతుంది. తెలుసు చూపిస్తానంటూ ఒక గదిలోకి తీసుకొని వెళ్లి బయట నుండి తాళం  వేస్తాడు వాడు.. చూసారా అత్తయ్య అందుకే ఎవరిని నమ్మొద్దనేది అయిన వినలేదని ఇద్దరు కోడళ్ళు అత్తపై కోప్పడతారు. ఆ తర్వాత అప్పుడే శ్రీవల్లి వస్తుంది. ఈ తాళం తియ్యమని అంటుంది. దాంతో తాళం పగులగొడుతుంది. వాళ్ళు బయటకు వస్తారు. నువ్వేంటి ఇక్కడ అని వేదవతి ఆడుగగా.. ఏం ఉంది., ఎప్పుడు మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది కదా అని నర్మద అంటుంది. ముగ్గురు కోడళ్ళు అత్త కలిసి శోభ గురించి వెతకుతూ వెళ్తారు. మరొకవైపు రామరాజు దగ్గరికి సాగర్, చందు వస్తారు‌. లాయర్ ఎక్కడ అని రామరాజు అడుగగా రాలేదు తమ్ముడు ఈ కేసు నుండి బయటకు వచ్చేలా లేదని వాళ్ళు అంటుంటే.. రామరాజు ఇంకా బాధపడతాడు. ఆ తర్వాత అత్తాకోడళ్ళు శోభ గురించి వెతుకుతూ ఉంటారు. ప్రేమ ఒక దగ్గర కూర్చొని ధీరజ్ గురించి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కలిసిపోయిన దశరథ్, సుమిత్ర.. పోలీస్ స్టేషన్ లో దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -502 లో....కార్తీక్ తో దశరథ్ మాట్లాడతాడు. నేను సుమిత్ర విషయంలో తప్పు చేసానని పశ్చాతాపడుతుంటే సుమిత్ర విని వెళ్ళిపోతుంది. సుమిత్ర వెళ్లడం కార్తీక్ చూస్తాడు.. మరొకవైపు కార్తీక్ ఇంకా ఫోన్ చెయ్యలేదని శివన్నారాయణ వెయిట్ చేస్తుంటే.. అప్పుడే పారిజాతం వచ్చి శివన్నారాయణకి చిరాకు తెప్పిస్తుంది. మరొకవైపు సుమిత్ర వెళ్లిపోతుంటే కార్తీక్ చూసి..అత్త ఆగు., ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. నేను మీ మావయ్యకి ఎదరుపడలేనని సుమిత్ర అంటుంది. అప్పుడే సుమిత్ర అంటూ దశరథ్ వస్తాడు. ఇద్దరు ఎమోషనల్ అవుతారు. నువ్వు ఎక్కడికి వెళ్లడం లేదు.. ఇంటికి వస్తున్నావ్ అంతే అని దశరథ్ అంటాడు. దీప ఎక్కడా అని సుమిత్రని కార్తీక్ అడుగుతాడు. నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదని సుమిత్ర అనగానే అవునా దీప ఫోన్ చేసి ఉంటుంది.. ఫోన్ కార్ లో ఉందని ఫోన్ తీసుకొని దీపకి ఫోన్ చేస్తాడు. దీప ఫోన్ జ్యోత్స్న తీసుకొని మాట్లాడుతుంది. మా మమ్మీని కిడ్నాప్ చేసినందుకు కంప్లైంట్ ఇచ్చాను.. దీప పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్తుంది. మర్యాదగా ఇంటికి పంపించమని కార్తీక్ అంటాడు. అది జరగదని జ్యోత్స్న అంటుంది . ఇంకా పావుగంట అక్కడే ఉండమని కార్తీక్ అనగానే వెయిట్ చేస్తానని జ్యోత్స్న అంటుంది. దశరథ్, సుమిత్రని తీసుకొని కార్తీక్ గుడి నుండి బయల్దేరతాడు. మరొకవైపు బావ ఇంకా రావడం లేదేంటని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే శివన్నారాయణ, పారిజాతం ఎంట్రీ ఇస్తారు. తాత కరెక్ట్ టైమ్ కి వచ్చావని జ్యోత్స్న అంటుంది. నా కూతురు(కాంచన)ని పోలీస్ స్టేషన్ కి రప్పిస్తారా అని జ్యోత్స్న పై శివన్నారాయణ కోప్పడతాడు. నేనేం అత్త(కాంచన) తీసుకొని రాలేదు తనే వచ్చిందని జ్యోత్స్న అంటుంది. నా కొడుకు లేని టైమ్ చూసి కోడలిని పోలీసులు తీసుకొని వెళ్తుంటే.. నేను చూస్తూ ఎలా ఊరుకోను.. తన వెంటే వచ్చానని కాంచన అంటుంది. శభాష్ నా కూతురు అనిపించుకున్నావని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రుద్రాణి మాట వినకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయిన రాహుల్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -865 లో.. రాహుల్ అలా బెహేవ్ చేస్తున్నాడని కావ్య బాధపడుతుంటే.. రాజ్ వచ్చి వాడితో మాట్లాడి వాడికి బుద్ది చెప్తాను కానీ నువ్వు భోజనం చేయమని చెప్తాడు.  ఆ తర్వాత స్వప్న దగ్గరికి రాహుల్ వస్తాడు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. ఇక అవసరం లేదులే ఈ విడాకుల పత్రాలపై సంతకం చెయ్యమని రాహుల్ అనగానే స్వప్న షాక్ అవుతుంది. రాహుల్ ని తిడుతుంది.. ఒక కూతురు ఉంది తన గురించి కూడా ఆలోచించాలి కదా అని అనగానే తనకేంటే ఈ ఇంట్లో లోటు లేదని రాహుల్ అంటాడు. దాంతో స్వప్న కోపంగా ఆ విడాకుల పత్రాలు తీసుకొని రుద్రాణి దగ్గరికి వెళ్లి తన ముందు పెడుతుంది. మీ అబ్బాయి విడాకులు అడుగుతున్నాడని స్వప్న చెప్పగానే అందరు షాక్ అవుతారు. అప్పుడే రాహుల్ వచ్చి అవును.. నాకు స్వప్న అంటే ఇష్టం లేదు.. నాకు పిల్ల వద్దు తల్లి వద్దని అందరి ముందే చెప్తాడు. దాంతో సుభాష్ తనపై కోప్పడతాడు. రాహుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అందరు రుద్రాణిని తిడుతుంటే రాహుల్ దగ్గరికి వెళ్తుంది. రాహుల్ వెళ్లేసరికి లగేజ్ తో బయల్దేరతాడు. రుద్రాణి వెళ్లి రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది.  మమ్మీ నాకూ స్వప్న అంటే ఇష్టం లేదు.. నాకు కోయిలా అనే అమ్మాయి అంటే ఇష్టం.. తను కోటీశ్వరురాలు.. తనతో ఉంటే లైఫ్ సెటిల్ అని అంటాడు. బయటవాళ్లని నమ్మడానికి లేదని రుద్రాణి అంటుంది. అంత నాకు తెలుసు.. అందరి ముందు నువ్వు నన్ను తిట్టినట్లు యాక్టింగ్ చెయ్ చాలు అని రుద్రాణితో రాహుల్ చెప్తాడు. మరొకవైపు రాహుల్ ఎందుకు ఇలా చేస్తున్నాడో కనుక్కోవాలని రాజ్, కావ్య అనుకుంటారు. తరువాయి భాగం లో కోయిలా దగ్గరికి రాహుల్ వెళ్తాడు. రాజ్, కావ్య ముసలి వాళ్ళ గెటప్ లో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మనం పన్నులు చెల్లించట్లేదు..అవినీతికి మూల్యం కడుతున్నాం

  రేణు దేశాయ్ గురించి ఒక మంచి నటి మాత్రమే కాదు, ఒక మంచి తల్లి అలాగే ఎలాంటి సోషల్ కాజ్ కోసం ఐనా కానీ తన వంతు ప్రయత్నం చేయడంలో ముందుంటుంది. మూగ జీవాల కోసం ఆమె చాలా చేస్తూ ఉంటుంది. అలాంటి రేణు దేశాయ్ రీసెంట్ గా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది. "ఎందుకు పాలిటిక్స్ లో ఉన్న మహిళలు, పురుషులు అలాగే ప్రభుత్వ రంగాల వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ?ఇది 2025 ఐనా కానీ ఇప్పటికీ మనం సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సరైన రోడ్లు కానీ లేక అవస్థలు పడుతున్నాం..మనం కేవలం పన్నులు చెల్లించడం లేదు, అవినీతికి మూల్యం చెల్లిస్తున్నాము. " అంటూ పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైకి దగ్గరలో 250 కోట్లతో నిర్మించి ప్రారంభించిన కొన్ని రోజులకే రోడ్డు నాశనమవడం మీద ఆమె ఇలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రేణు దేశాయ్. వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు రోడ్లు బాలేని కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోడ్లు బాలేని కారణంగా ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. రేణు దేశాయ్ ఈ రోడ్ల విషయంలో చాలా రోజుల నుంచి తనదైన ఫైట్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా మందికి సూటైన ప్రశ్నలు వేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. రోడ్లు ఏ కాంట్రాక్టర్ కట్టాడు ..ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అప్రూవ్ చేసాడు. ఎంత ఖర్చు అయింది. ఏ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు . ఏ ఫర్మ్  మెయింటెనెన్స్ చేస్తోంది ? అంటూ ఉన్న ఒక పోస్ట్ ని కూడా ఆమె తన స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు.

సుమ అడ్డా లో సోనియా సీమంతం..

  సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోని కపుల్స్ స్పెషల్ ఎపిసోడ్ గా డిజైన్ చేశారు. ఈ షోకి మహేష్ - సాండ్రా, యష్-సోనియా, పవన్ కళ్యాణ్ - వాసంతి కృష్ణన్ వచ్చారు. ఇక ఈ షో ప్రోమో చూస్తే సోనియాకి సీమంతం ఎంతో ఘనంగా చేశారు. "ఒక పవర్ ఫుల్ అమ్మాయితో చేతుల మీదుగా ఇలా సీమంతం చేసుకోవడం బాగుంది. మీ బ్లేసింగ్స్ కావాలి. మీ లాగా నాకు పుట్టబోయే అమ్మాయి కూడా మీలా ఎన్నో అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. యష్ లాంటి  ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే సపోర్ట్ గా ఉంటే ఏ అమ్మాయైనా ఆకాశమంత ఎత్తు ఎదగొచ్చు, ఏదైనా సాధించొచ్చు కూడా. ఈ విషయాన్ని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. అందరమ్మాయిలకు కూడా ఇలాంటి ఒక సపోర్టివ్  స్ట్రాంగ్ మెన్ ఉండాలి" అని కోరుకుంది. ప్రోమో స్టార్టింగ్ లో ఐతే ప్రతీ జంటకు ఒక గ్లాస్ లో డ్రింక్ పోసి రెండు స్ట్రాలు వేసి ఇచ్చింది. సోనియా తాగేస్తుందేమో అనుకుని యష్ గబగబా తాగేస్తుంటే సుమ కౌంటర్ వేసింది "ఆవిడ తాగేస్తుందేమో అని తొందరగా తాగేయొద్దు" అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత భార్యల్ని ఒకవైపు, భర్తల్ని ఒక వైపు పెట్టి టాస్కులు ఆడించింది సుమ. "మీరు మీ భార్యను ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి యష్ గారు" అని సుమ అడిగేసరికి "వీళ్లిద్దరి కంటే ఎక్కువ" అన్నాడు.   "ఇప్పటి వరకు మీ వైఫ్ కి కూడా తెలియనటువంటి ఒక విషయం పాస్ట్ లో ఉన్న మీ లవ్ స్టోరీ వైఫ్ కి తెలీకుండా దాచిన ప్రెజెంట్ లవ్ స్టోరీ" ఏంటి అని యష్ ని అడిగేసరికి సోనియా కూడా షాకయ్యింది. యష్ మాత్రం ఏమీ ఆన్సర్ చెప్పలేక నవ్వుకున్నాడు.

సుమ అడ్డా షోలో మహేష్-సాండ్రా పెళ్లి.. 

  బుల్లితెర మీద మహేష్ కాళిదాసు - సాండ్రా గురించి అందరికీ తెలుసు. ఇక వీళ్ళ ప్రేమ, పెళ్లి గురించి తమ ఫాన్స్ అందరికీ కూడా చెప్పారు. ఐతే వీళ్ళు సుమ అడ్డా షోకి వచ్చారు. రీసెంట్ గా రిలీజయిన నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి వీళ్ళు రాబోతున్నారు. ఈ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. రాగానే సుమ వీళ్లకు ఒక గ్లాస్ లో డ్రింక్ పోసి రెండు స్ట్రాలు కూడా వేసి ఇచ్చింది. ముందు సాండ్రా ఆ డ్రింక్ తాగి ఇచ్చింది. "చూసారా ఇదే నా స్ట్రా.." అన్నాడు. దాంతో సుమ "అబ్బా అబ్బా" అంటూ ఒక లాంగ్ అండ్ ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఒక టాస్క్ లో "ఇంకా ప్రేమలో ఎం చేస్తారు అని అడిగేసరికి" "ఇంకేం చేస్తారు ముద్దులు పెట్టుకుంటారు " అని చెప్పాడు మహేష్. దాంతో ఒక్కసారిగా సుమా షాకయ్యింది. ఇక భార్యల్ని పిలిచి "కొత్త జంట అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి" అని సుమ అడిగేసరికి మహేష్ వెంటనే "ముద్దులు ముద్దులు" అని మళ్ళీ ఆన్సర్ చెప్పేసాడు. ఇక తర్వాత అందరూ కలిసి వీళ్లకు స్టేజి మీద పెళ్లి చేసేసారు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నట్టు ఒక పోజ్ లో సాండ్రా మహేష్ తల మీద చెయ్యి పెట్టేసరికి సుమ వెంటనే అలెర్ట్ అయ్యి " ఏమ్మా గట్టిగా లాగకూడదు బిట్ ఊడిపోతుంది " అంటూ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత తాళి కట్టాడు మహేష్. ఇక కనకాంబరాలు, గులాబీ రేకుల్ని అక్కడ పెట్టేసరికి తలంబ్రాలు పోసుకున్నట్టు పోసుకున్నారు. సాండ్రా ఐతే మహేష్ మొహం మీద గట్టిగా కొట్టింది పూలతో. అంతే సుమ మధ్యలో వచ్చి "ఏంటమ్మా పొద్దున్నే చెత్త మొహాన కొట్టినట్టు" అనేసింది. ఇక ఫైనల్ గా సాండ్రాని ఎత్తుకుని అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపించేసాడు. తర్వాత రాపిడ్ ఫైర్ రౌండ్ లో "వీరిలో ఎక్కువ ఎవరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ. మీ ఆవిడకి బి. మీ పేరెంట్స్ కి " అని సుమా అడిగింది. మహేష్ ఆన్సర్ చెప్పలేక టాయిలెట్ కి వెళ్ళొస్తా అనేశాడు. దాంతో సుమ "మేము పంపించం" అనేసింది. "ఈ రెండిట్లో ఒకటి ఆపేయాలంటే ఏది ఆపేస్తారు ఏ. యాక్టింగ్ బి. మీ యూట్యూబ్ ఛానెల్ " అని అంది. దాంతో సాండ్రా "ఈ యూట్యూబ్ ఆపేసి వేరేది స్టార్ట్ చేస్తా" అంటూ వెరైటీ ఆన్సర్ ఇచ్చింది.