Karthika Deepam 2: కొత్త సీఈఓ దీప.. జ్యోత్స్న, పారిజాతం షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -510 లో... దీప కిచెన్ లో వంట చేస్తుంది. అక్కడికి పారిజాతం వెళ్లి తనని మాటల్లో పెట్టి కొత్త సీఈఓ కార్తీక్ ఆ కాదా? అని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. నాకేం తెలియదని దీప చెప్తుంది.    మరొకవైపు పాత సీఈఓ అయిన జ్యోత్స్న సీఈఓగా కొనసాగడానికి ఎవరు ఒప్పుకోరు.. దాంతో కార్తీక్ ని శివన్నారాయణ పిలిపిస్తాడు. బావనే కొత్త సీఈఓ దీన్ని ఎలాగైనా ఆపాలని జ్యోత్స్న అనుకుంటుంది. బావ సీఈఓగా ఉండడం నాకు ఇష్టం లేదు.. అగ్రిమెంట్ లో అంతా నా ఇష్టప్రకారం అని ఉంది.. నన్ను కాదని బావ ఒప్పుకోడు అని జ్యోత్స్న అంటుంది. ఏం కార్తీక్ చెప్పు నువ్వేమంటావని శివన్నారాయణ అడుగుతాడు. అగ్రిమెంట్ నియమాలకి కట్టుబడి ఉంటానని కార్తీక్ అంటాడు.    అయినా కొత్త సీఈఓ కార్తీక్ అని ఎవరు చెప్పారని శివన్నారాయణ అంటాడు. మీరే ఉహించుకున్నారు.. కార్తీక్ ని వేరే పని మీద పిలిచాను.. కొత్త సీఈఓ ఎక్కడ వరకు వచ్చారని శివన్నారాయణ అడుగగా వస్తున్నారని కార్తీక్ చెప్తాడు. అప్పుడే దీప క్యారియర్ పట్టుకొని వస్తుంది. నా భార్య వచ్చిందని కార్తీక్ చెప్తాడు. అందరం భోజనం చేసాక కంటిన్యూ చేద్దామని శివన్నారాయణ అంటాడు.     దీప రావడంతో దీపనే కొత్త సీఈఓ అని జ్యోత్స్న షాక్ అవుతుంది. వెంటనే పారిజాతం కి ఫోన్ చేసి దీప కొత్త సీఈఓ అని చెప్తుంది. దాంతో దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసని పారిజాతం అంటుంది.    వెంటనే సుమిత్ర దగ్గరికి వెళ్లి పని మనిషిని సీఈఓ చేశారట, నీ కూతురికి అన్యాయం జరుగుతుంది.. పదా ఆఫీస్ కి వెళదామని పారిజాతం అంటుంది. వాళ్ళ నిర్ణయానికి అడ్డు చెప్పనని సుమిత్ర అంటుంది. అయినా బలవంతంగా తీసుకొని వెళ్లాలని పారిజాతం ప్రయత్నం చేస్తుంది. నా మానవరాలికి అన్యాయం చేస్తే ఎవరినైనా చంపేస్తానని పారిజాతం కత్తి పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

హత్య కేసులో రాహుల్ ని అరెస్టు చేసిన పోలీసులు..!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -873 లో... కావ్య కిచెన్ లో వంట చేస్తుంటే.. రాజ్ వచ్చి మాట్లాడుతాడు. అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ రాహుల్ ఎవరని అడుగుతారు. నేనే అని రాహుల్ చెప్పగానే.. మీరు కోయిలిని హత్య చేసారని తన భర్త రంజిత్ కంప్లైంట్ ఇచ్చాడు.. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పగానే అందరు షాక్ అవుతారు. నేను చంపలేదు జెస్ట్ ఇలా కొట్టానని రాహుల్ చెప్తాడు. ఆ విషయాలన్నీ కోర్ట్ లో తేలుతాయని పోలీస్ లు రాహుల్ ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు.    నా కొడుకుని పోలీసులు తీసుకొని వెళ్తుంటే అలా సైలెంట్ గా ఉన్నారని రుద్రాణి అంటుంది. మరేం చేయమంటావ్ పోలీసులు అంతా చెప్తుంటే అని సుభాష్ అంటాడు. ఆ తర్వాత రుద్రాణికి కోయిలి భర్త రంజిత్ ఫోన్ చేసి.. నీ కొడుకు, నా భార్యని చంపుతున్న వీడియో నా దగ్గర ఉంది. అది కోర్ట్ లో చూపించకుండా ఉండాలంటే రెండు కోట్లు ఇవ్వాలని రంజిత్ అంటాడు. దానికి రుద్రాణి సరే అంటుంది.     రంజిత్ ఫోన్ చేసిన విషయం రుద్రాణి కిందకి వచ్చి అందరికి చెప్తుంది. రెండు కోట్లు ఇవ్వండి. నా కొడుకుని కాపాడండి అని చెప్తుంది. రాహుల్ చంపాడని మేమ్ అనుకోవడం లేదు దానికి సాక్ష్యం కనిపెడుతామని రాజ్, కావ్య అంటారు. మీతో ఉంటే పని అవ్వదని రంజిత్ దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. రుద్రాణి వెంట స్వప్నని వెళ్ళమని రాజ్, కావ్య పంపిస్తారు.    ఆ తర్వాత సాక్ష్యం ఎలా తెస్తారని రాజ్ ని సుభాష్ అడుగుతాడు. మేమ్ అక్కడికి వెళ్లే ముందు అక్కడ కెమెరా పెట్టాము.. కోయిలి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి.. ఇప్పుడు అందులో రికార్డు ఉంటుంది కదా అని కావ్య అంటుంది.    తరువాయి భాగంలో రాజ్, కావ్య వెళ్లి ఆ కెమెరా తీసుకొని వచ్చి అందులో ఉంది చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

36 సంవత్సరాల తర్వాత నాగార్జునతో అమల!

  బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న  వీకెండ్ రానే వచ్చింది. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జున 'శివ' మూవీ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు. తన 'శివ' సినిమా రీ రిలీజ్ గురించి ప్రేక్షకులకు చెప్పాడు.. అంతేకాకుండా తనతో పాటు తన భార్య  'అమల' ని వెంట తీసుకొని వచ్చాడు. ఇద్దరు కలిసి 'శివ' మూవీలో సాంగ్ కి రెండు స్టెప్పులు కుడా వేశారు. కంటెస్టెంట్స్ అందరు శివ సినిమాలోని సాంగ్స్ కి డ్యాన్స్ చేశారు. తనూజ-కళ్యాణ్ ఒక జోడీగా , దివ్య-ఇమ్మాన్యుయల్ ఒక జోడీగా, డీమాన్ కళ్యాణ్-రీతూ ఒక జోడిగా పర్ఫామెన్స్ ఇచ్చారు. వాళ్ళ డాన్స్ లకి 'అమల' ఫిదా అయింది. ఆ తర్వాత డైరెక్టర్ ఆర్జీవీ స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చాడు. రాము తనని ఒక క్వశ్చన్ అడిగాడు. శివ సక్సెస్ అయినప్పుడు మీకెలా అనిపించిందని ఆర్జీవీని అడిగాడు. సాడ్ గా అనిపించింది.. అదేం స్టుపిడ్ క్వశ్చన్ అని రాము మొహం పైనే ఆర్జీవీ చెప్పాడు. మీరు హౌస్ లో ఉండమంటే ఉంటారా అని నాగార్జున అడుగుతాడు. సంజనలాంటి అందమైన అమ్మాయిలు ఇరవై మంది ఉంటే ఉంటానని ఆర్జీవీ బోల్డ్ గా సమాధానమిచ్చాడు. అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున-అమల జంటని చూసిన ఆడియన్స్ కి మాత్రం ఫుల్ పండగే.. ఈ రోజు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఈ ఎపిసోడ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వారం హౌస్ లో ఏఏ కంటెస్టెంట్స్ మీద నాగార్జున ఫైర్ అయ్యాడనేది ఈ ప్రోమోలో లేదు. ఆర్జీవీ అభిమానులు కూడా ఈ ప్రోమో చూసి ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.

Bigg Boss Telugu 9: దివ్యని తప్పుగా అర్థం చేసుకున్న క్రయింగ్ బేబీ!

బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం నామినేషన్లు ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా సంజన, సాయి శ్రీనివాస్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ‌ఇక నిన్నటి వరకు సాగిన కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ లో చివరికి రీతూ, ఇమ్మాన్యుయేల్ ఉండగా ఇమ్మాన్యుయేల్ గెలిచాడు.  తనూజని బిగ్ బాస్ దత్తపుత్రిక అంటారు. ఎందుకంటే తనని పాజిటివ్ చేయడం కోసం మిగతా కంటెస్టెంట్స్ ని బలి చేస్తున్నారు. నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో రీతూ , ఇమ్మాన్యుయేల్ , తనూజ ఉండగా వారిలో నుండి ఒకరిని తీయాలని దివ్యకి ఛాన్స్ వచ్చింది. ఇక తన పర్ స్పెక్టివ్ లో ఇమ్మాన్యుయల్ ని కెప్టెన్ గా చూడాలని అనుకుంది‌. అలా చేయాలంటే రీతూని తీసేస్తే.. అందరు ఇమ్మాన్యుయేల్ ని తీసేస్తారు. సో తనూజని తీసేస్తే కొంతమంది సపోర్ట్ అయినా ఇమ్మాన్యుయల్ కి దక్కుతుంది. అందుకే తనూజని తీసేసి ఇమ్మాన్యుయల్ ని కెప్టెన్ ని చేసేసింది. మరి ఇమ్మాన్యుయేల్ ఈ కృతజ్ఞత ఉంచుకుంటాడా లేదా అనేది తరువాతి వారం టాస్క్ లలో తెలుస్తోంది.  తనూజ తన దృష్టిలో ఏం అనుకుంటుందంటే.. భరణి, దివ్య మధ్యలో తను అడ్డుగా ఉందనుకొని అందుకే తనని కెప్టెన్సీ రేస్ నుండి తొలగించిందని ఏడుస్తూ వెళ్ళిపోయింది. నువ్వు పర్సనల్ గా తీసుకొని భరణి గారు నాకు సపోర్ట్ చేస్తున్నారని నన్ను కెప్టెన్సీ రేసు నుండి తొలగించావని దివ్యని ఇష్టమొచ్చినట్టు మాటలు అనేసింది తనూజ. తనూజ ఏడుస్తూ బెడ్ పైకి వెళ్ళి పడుకొని ఏడ్చేసింది. ఇక భరణి ఓదార్చడానికి వెళ్తే.. భరణి సర్ నాతో మాట్లాడొద్దు ప్లీజ్.. మీ వల్ల తను నన్ను కెప్టెన్సీ రేస్ నుండి తొలగించిందని ఏడ్చేసింది. అందుకే తనూజని అందరు క్రైయింగ్ బేబీ అని అంటున్నారు. ‌ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా తనూజ క్రైయింగ్ బేబీ అంటు ట్రోల్స్ చేస్తున్నారు.

దివ్య వెన్నుపోటుతో రెండో సారి కెప్టెన్‌గా ఇమ్మాన్యుయల్!

బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ముగిసింది. ఇక తొమ్మిదో వారం ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన కెప్టెన్సీ రేస్ లో తనూజ, రీతూ, ఇమ్మాన్యుయల్ మిగిలారు.  తొమ్మిదో వారం మొత్తం ఆరుగు కంటెండర్లు పోటీపడ్డారు. దివ్య, సుమన్ శెట్టి, తనూజ, రీతూ, ఇమ్మానుయేల్, భరణి.. కంటెండర్లుగా రేసులో ఉన్నారు. ఇక వీరికి 'వే టూ కెప్టెన్సీ' అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ట్రైన్ ఇంజిన్‌లోకి కంటెండర్లు కాని వాళ్లు ఎక్కాలి. అందరినీ దాటుకొని ఎవరు అయితే అందులో చోటు దక్కించుకుంటారో వారికి రేసు నుంచి ఒకరిని తప్పించే పవర్ వస్తుంది.  భరణి, తనూజ ఇద్దరు ఉండగా భరణిని తీసేస్తాడు రాము. అలా టాస్కులో ముందుగా భరణి తప్పుకుంటాడు. ఆ తర్వాత సాయి ఇంజిన్‌లోకి ఎక్కి దివ్యని రేసు నుంచి ఔట్ చేశాడు. ఆ సమయంలో దివ్య పెద్ద గొడవ చేసింది. ఎందుకంటే ముందు దివ్య కంటే రీతూ పేరు చెప్పాడు సాయి. కానీ రీతూ మళ్లీ బతిమాలడంతో చివరికి దివ్యని సాయి ఔట్ చేశాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి ఔట్ అయ్యాడు‌. ఇలా ఒక్కొక్కరు గేమ్ నుండి అవుట్ అవ్వగా తనూజ, రీతూ, ఇమ్మాన్యుయల్ ముగ్గురు మిగులుతారు.  ఈ ముగ్గురిలో తనూజ-రీతూ ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు. ఇమ్మాన్యుయల్ ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయ్యాడు. కానీ అక్కడ డెసిషన్ మేకింగ్ దివ్య చేతిలోకి వెళ్లింది. దీంతో దివ్య తనూజని రేసు నుంచి తప్పించింది. చాలా వారాలుగా కెప్టెన్ అయ్యేందుకు తనూజ ట్రై చేస్తుంది. అయితే కొన్నిసార్లు చివరి అడుగులో మిస్ అయింది. ఈసారి కూడా ఒక్క అడుగు దూరంలో తనూజని ఆపేసింది దివ్య. ఇక రీతూ, ఇమ్మాన్యుయల్ ఇద్దరు కెప్టెన్సీ రేసులో నిలవగా వారికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఇమ్మాన్యుయల్ చకచకా రీతూ కంటే ముందు టాస్క్ ని ముగించి గెలిచాడు. ఇక తొమ్మిదో వారం హౌస్ కెప్టెన్ గా ఇమ్మాన్యుయల్ నిలిచాడు. ఇక దివ్య చేతుల మీదుగా ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ బ్యాండ్ ని పొందాడు.

Bigg Boss 9 Ninth week Voting : అతనికి ఓటింగ్ పడటం లేదు... ఈ వార‌ం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 తొమ్మిదో వారం కంటెస్టెంట్స్ మధ్య కెప్టెన్సీ రేస్ ముగిసింది. ఇందులో ఇమ్మాన్యుయల్ సెకెండ్ టైమ్  కెప్టెన్సీ‌ని గెలుచుకున్నాడు.  ఇక తొమ్మిదోవారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన, భరణి, రాము, సాయి శ్రీనివాస్ ఈ ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో.. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం. తనూజ ఎప్పటిలాగే మొదటి స్థానంలో ఉంది. ముప్పై శాతంతో మొదటి స్థానంలో ఉండగా, కళ్యాణ్ పడాల పంతొమ్మిదవ శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు. సుమన్ శెట్టి పదమూడవ శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. భరణి పది శాతం ఓటింగ్ తో నాలుగో స్థానంలో ఉన్నాడు. రాము రాథోడ్ ఎనిమిది శాతం ఓటింగ్ తో అయిదో స్థానంలో ఉన్నాడు. ఇక చివరగా నాలుగు శాతం ఓటింగ్ తో.. సంజన, సాయి శ్రీనివాస్ చివరి స్థానంలో ఉన్నారు. ‌దీన్ని బట్టి చూస్తే సాయి శ్రీనివాస్, సంజన ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఈ ఇద్దరు ఇంటి నుండి బయటకొచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ వారం సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ ఫిక్స్. ఎందుకంటే అసలు అతనికి ఓటింగ్ పడటం లేదు. సాయి శ్రీనివాస్‌ ఎలిమినేషన్‌కి మెయిన్ రీజన్ అంటే.. అతను తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చాడు. బయట ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పీఆర్ నెట్ వర్క్ లేదు. గత వారమే నామినేషన్‌లోకి రావాల్సి ఉండగా.. తన దగ్గర ఉన్న స్పెషల్ పవర్‌తో సేవ్ అయ్యాడు. ప్రత్యేకించి.. ఇతనిపై పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. ఉన్నంతవరకూ ఫెయిర్‌గానే ఉన్నాడు. తొండి ఆటలు ఆడలేదు. అడ్డమైన వాదనకి దిగలేదు. ఫుటేజ్ ఇవ్వడం కోసం కక్కుర్తి పడలేదు. బయట పీఆర్ టీం స్ట్రాటజీలు చేయలేదు. ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. బయట ఐదు వారాలు ఆట చూసి.. ఎవరి స్ట్రాంగో అని తెలిసి కూడా.. వాళ్లతో బాడింగ్‌లు పెట్టుకుని అడ్డదారిలో హౌస్‌లో ఉండే కక్కుర్తి పనులు చేయలేదు.  దానితో పాటుగా తనూజని నామినేట్ చేశాడు.‌ బిగ్ బాస్ తన దత్తపుత్రికగా భావించే తనూజని నామినేట్ చేస్తే చూస్తూ ఊరుకుంటాడా ఎలిమినేషన్ చేస్తాడుగా.. ఇంకా దీనికి తోడు ఆడియన్స్ ఓటింగ్ వేయడం లేదు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది సాయి శ్రీనివాస్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Jayam serial : గంగకి బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్న రుద్ర.. తాంబూలాలకి శకుంతల ఏర్పాట్లు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -106 లో....ఇషిక, వీరు ఇద్దరు కలిసి పారుని కలుస్తారు. అసలు రుద్ర ఎలా ఒప్పుకున్నాడని పారు అడుగుతుంది. పెళ్లికూతురు నువ్వే అని తెలియదని ఇషిక చెప్తుంది. ఒకవేళ నేను అని తెలిసాకా రిజెక్ట్ చేస్తే పరిస్థితి ఏంటని పారు అడుగుతుంది. నో.. రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు.. ఎందుకంటే శకుంతల అత్తయ్య ఎమోషనల్ గా లాక్ చేసిందని వీరు చెప్తాడు. మరొకవైపు నా ప్రేమ అంత నిజం అనుకుంటున్నావా రుద్ర అంత నాటకం అని శకుంతల అనుకుంటుంది. అప్పుడే ఇంట్లో వాళ్లంతా శకుంతల దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. మీరు రుద్ర అన్నయ్య క్షమించడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు రుద్ర అన్నయ్యకి కాబోయే భార్య ఎవరని ప్రీతి అడుగుతుంది. తినబోతు రుచి ఎందుకు.. తనని ఇంటికి రమ్మని చెప్పాను.. వస్తుంది అప్పుడే చూడండి అని శకుంతల అంటుంది. తాంబులాలు కూడా మార్చుకోవాలని శకుంతల అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్ని మరి ఇంత ఫాస్ట్ గానా అని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. మరొకవైపు గంగని రుద్ర ప్రాక్టీస్ చేపిస్తాడు. రన్నింగ్ చెయ్ అని రుద్ర అనగానే ఎందుకు రన్నింగ్ ఇవన్నీ వద్దు బాక్సింగ్ నేర్పించండి అని గంగ అంటుంది. ఇవ్వన్నీ నేర్చుకుంటేనే బాక్సింగ్ సులువు అవుతుందని రుద్ర అంటాడు. మరొకవైపు రుద్రకి పెళ్లిచూపులు అని హడావిడి చేస్తుంది శకుంతల. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : నర్మద జాబ్ పోయేలా చేసిన భద్రవతి.. ప్రేమ వెళ్ళిపోయిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -310 లో...... నర్మద ఆఫీస్ కి వెళ్తూ వేదవతి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది కానీ వేదవతి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అత్తయ్య నేను ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడాలి లేదంటే నాకు మంచి జరగదని నర్మద అంటుంది అయినా సైలెంట్ గా వేదవతి ఉంటుంది. అర్ధం అయింది నేను మీ వాళ్లకి ఎదురువెళ్తున్నానని కోపంగా ఉంది కదా.. నా డ్యూటీ నేను చేసానని నర్మద చెప్పి వెళ్ళిపోతుంది. కోపం కాదు బాధ మా వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తారని భయంగా ఉందని వేదవతి అనుకుటుంది. మరొకవైపు నర్మద ఆఫీస్ కి వెళ్తుంది. ఒకతను బయట ఫోన్ మాట్లాడి లోపలికి నర్మద దగ్గరికి వెళ్లి ఫైల్ ఇస్తాడు. అందులో డబ్బు ఉంటుంది. ఏంటి ఇది అని నర్మద అడుగుతుంది. ఆ లోపే మీడియా పోలీసులు అధికారులు అందరు వస్తారు. నన్ను లంచం అడిగింది అని సేనాపతి మనిషి చెప్పగానే నర్మదని సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత టీవీ లో ఆ న్యూస్ వస్తుంది. అది శ్రీవల్లి చూసి ఇంట్లో అందరిని పిలిచి చెప్తుంది. అదంతా చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. రామరాజు కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కల్వదు. మరొక వైపు శ్రీవల్లి ఇంకా తన పేరెంట్స్ ఇద్దరు బయటకి వెళ్లి నర్మద జాబ్ పోయిందని డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత సేనాపతి, భద్రవతి న్యూస్ లో అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి ఎదురు వస్తుందా అని మాట్లాడుకుంటారు. అప్పుడే నర్మద ఇంటికి వస్తుంది. తనని చూసి భద్రవతి, సేనాపతి ఇద్దరు నవ్వుకుంటాడు. ఇంత అవినీతిగా పని చేస్తావా అని నర్మదకి కోపం వచ్చేలా మాట్లాడుతారు. తరువాయి భాగంలో మీ వాళ్ళు మా వదిన జాబ్ పోయేల చేశారని ప్రేమతో ధీరజ్ అంటాడు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను.. ఇంకెప్పుడు రానని ప్రేమ అంటుంది.. వెళ్ళు అని ధీరజ్ కోపంగా అనగానే నిజంగానే ప్రేమ తన పుట్టింటికి వెళ్తుంది. అదంతా భాగ్యం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 :  సుమిత్ర కోసం జ్యోత్స్న పెళ్ళికి రెడీ.. మరి సీఊఓ ఎవరు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -509 లో.. జ్యోత్స్న పట్ల సుమిత్ర తన నిర్ణయం చెప్తుంది. నా కూతురిని నేను పెళ్లి కూతురిగా చూడాలని అనుకుంటున్నానని చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. అత్త భలే ట్విస్ట్ ఇచ్చిందని దీపతో కార్తీక్ చెప్తాడు. ఒకసారి సీఈఓ గురించి ఆలోచించండి అని శివన్నారాయణతో పారిజాతం  అనగానే.. ఆలోచిస్తాను., ఇప్పుడు కాదు బోర్డు మీటింగ్ లో అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఇలా చేస్తే పని అవనప్పుడు శత్రువు దగ్గరికి వెళ్లి కాకా పట్టాలని పారిజాతం అంటుంది. దాంతో కిచెన్ లో ఉన్న దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్లి.. నువ్వు నాకొక హెల్ప్ చెయ్యాలి.. సీఈఓగా నాకు సపోర్ట్ చెయ్యమని బావకి నువ్వు చెప్పాలి.. అలా చేస్తే ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని జ్యోత్స్న అంటుంది. అయినా మా బావ నా మాటేందుకు వింటాడని దీప అంటుంది. అలా అనకు దీప నాకు ఎవరు సపోర్ట్ లేరని జ్యోత్స్న ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. ప్లీజ్ ఈ ఒక్కసారి హెల్ప్ చెయ్ అని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత అందరు బోర్డు మీటింగ్ కి వెళ్తారు. బావ నీతో మాట్లాడాలి అని జ్యోత్స్న బయటే కార్తీక్ ని ఆపుతుంది. నాకూ హెల్ప్ చెయ్యాలని అడుగుతుంది. నువ్వు నా భార్యతో బేరం మాట్లాడడం చూసానని కార్తీక్ అంటాడు.‌సపోర్ట్ చెయ్యనని కార్తీక్ చెప్తాడు. కోపంగా జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. బోర్డు మీటింగ్ లో అందరూ జ్యోత్స్న సీఈఓగా వద్దని చెప్తారు. నేను మీ నిర్ణయం అంగీకరిస్తున్నాను కానీ కొత్త సీఈఓ ఎవరని జ్యోత్స్న అడుగుతుంది. కార్తీక్ ని శివన్నారాయణ పిలుస్తాడు. నో డౌట్ కచ్చితంగా బావనే సీఈఓ చేస్తారు ఎలాగైనా దీన్ని ఆపాలని జ్యోత్స్న అనుకుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : తప్పు తెలుసుకొని స్వప్నని రిక్వెస్ట్ చేసిన రాహుల్.. క్షమించేసిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -872 లో..... రాజ్, కావ్య కలిసి కోయిలి నిజస్వరూపం బయటపెడుతారు. ఒరేయ్ రాహుల్ ఇప్పటికైనా స్వప్న గొప్పతనం అర్థం చేసుకొని దీన్ని వదిలేసెయ్ రా అని రాహుల్ కి రాజ్, కావ్య చెప్పి బయటకు వెళ్తారు. బయటకు వచ్చి రాజ్, కావ్య, గోల్డ్ బాబూ ముగ్గురు కలిసి ప్లాన్ సక్సెస్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా రంజిత్ విని ఇదంతా రాహుల్ ని తీసుకొని వెళ్ళడానికి చేసిన ప్లానా అని రంజిత్ అనుకుంటాడు. మరొకవైపు కోయిలిని రాహుల్ తిడుతాడు. నీ కోసం నా పెళ్ళాన్ని కూడా వదిలెయ్యాలనుకున్నాను. కానీ నన్ను వదిలేసి డబ్బు ఉన్నవాడు రాగానే వాడితో పోయావని రాహుల్ అంటాడు. అవును రా నిన్ను ట్రాప్ చెయ్యాలనుకున్నా.. మరి నువ్వు ఏమైనా తక్కువా.‌. భార్యా బిడ్డ ఉన్నా కూడా నా కోసం వచ్చావని కోయిలి అంటుంది. కొట్టినా, తిట్టినా నా భార్య గొప్పది అని రాహుల్ అంటాడు. కోయిలి స్వప్న గురించి తప్పుగా మాట్లాడుతుంటే కోయిలి చెంప చెల్లుమనిపిస్తాడు రాహుల్. అదంతా రంజిత్ వీడియో తీస్తాడు. మరొక వైపు రాజ్, కావ్య ఇంటికి వచ్చి జరిగింది చెప్తూ నవ్వుకుంటారు. అప్పుడే రాహుల్ ఎంట్రీ ఇస్తాడు. నన్ను క్షమించమని స్వప్నతో అంటాడు. ఎన్నిసార్లు ఇలా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావని స్వప్న కోప్పడుతుంది. ఈ ఒక్కసారికి క్షమించమని రాజ్, కావ్య ఇద్దరు స్వప్నకి సర్ది చెప్తారు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని స్వప్నతో రాహుల్ చెప్పాడు. దాంతో స్వప్న క్షమిస్తుంది. ఆ తర్వాత ఎందుకురా ఇలాంటివి చేసి వాళ్ళ ముందు తల దించుతావ్. ఇక మీదట నేను చెప్పినట్టు చెయ్ నన్ను ఫాలో అవ్వమని రుద్రాణి చెప్పగానే రాహుల్ సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చిరంజీవితో మురళి బాబాయ్.. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీపై పోలీస్ కేసు!

ఢీ 20 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో పెర్ఫార్మెన్స్ ఒక్కో లెవెల్ లో ఉంది. ముందుగా శ్రీవాణి తన కూతురు నందినితో వచ్చి డాన్స్ చేసింది. "రాను రానంటూనే" సాంగ్ కి శ్రీవాణి కూడా డాన్స్ చేసింది. ఇక ఆది ఐతే "ఏదేమైనా శ్రీవాణి గారి కుర్రతనం పోలా" అంటూ కామెంట్ చేసాడు. తర్వాత జతిన్ వచ్చి "నాయిరే నాయిరే" సాంగ్ కి డాన్స్ చేసాడు. అన్షు రెడ్డి "గోంగూర తోటకాడ" సాంగ్ కి డాన్స్ చేసింది. ఇక ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అభి తీసుకొచ్చిన మురళి బాబాయ్. చిరంజీవి సాంగ్స్ కి డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ ఐన మురళి బాబాయ్ కి ఒక షోలో నాగబాబు ప్రామిస్ చేశారు..చిరంజీవిగారితో మాట్లాడించి, ఒక కప్పు కాఫీ తాగేలా ఒక ఫోటో తీసుకునే అవకాశం కల్పిస్తాను అన్నారు. ఆ బాధ్యతను ఆదికి అప్పగించారు. ఇప్పుడు స్టేజి మీదకు మురళి బాబాయ్ వచ్చారు. అన్నట్టుగానే చిరంజీవి, అనిల్ రావిపూడి, మురళి బాబాయ్, ఆది అంతా కలిశారు. ఇక మురళి బాబాయ్ కూడా మాట్లాడాడు. "నేను ఇంత తొందరగా సర్ ని కలుస్తానని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. సర్ తో చెప్పాను చనిపోతే చాలు ఇంకా అని" అన్నాడు.  ఇక ఆది మాట్లాడుతూ "అతను ఎంత మాట్లాడాడు అంటే చివరిగా చిరంజీవి గారు ఇచ్చిన హామీ ఏంటంటే ఏదో ఒక రోజు నా సినిమాలో నా పక్కన ఒక మూవ్మెంట్ వేస్తావు" అని మాట ఇచ్చారు. తర్వాత మణికంఠ మాష్టర్ వచ్చి "నువ్వు పెద్ద పులి లెక్క" సాంగ్ కి పెర్ఫార్మ్ చేసాడు. ఇక మణికంఠతో కలిసి హోస్ట్ నందు కూడా డాన్స్ ఇరగదీసాడు. "మణికంఠ పక్కన చేయడం అంత ఈజీ కాదు కానీ ఇరగదీసారు" అంటూ నందుకు కాంప్లిమెంట్స్ ఇచ్చాడు జడ్జి విజయ్ బిన్నీ మాష్టర్.. ఇక పల్సర్ బైక్ ఝాన్సీ వచ్చి ఒక మాస్ సాంగ్ కి చేసిన డాన్స్ కి అందరికీ పూనకాలు వచ్చేసాయి. తర్వాత పండు, ఆది కూడా వెళ్లి ఆ మాస్ స్టెప్స్ వేశారు. ఇక ఆది ఫన్నీగా కొన్ని మాటలు చెప్పాడు. "మా గంగారాం తిరునాళ్ళకు విచ్చేసిన ఎంఎల్ఏ రెజీనా కాసాండ్రా గారికి, మా మంత్రి విజయ్ బిన్నీ గారికి ఒక సారి చప్పట్లు" అన్నాడు. తర్వాత విజయ్ బిన్నీ మాష్టర్ మిగతా డాన్సర్స్ అంతా వచ్చి డాన్స్ చేశారు. "మన మంత్రి విజయ్ బిన్నీ గారి అమ్మాయిలతో డాన్స్ వేయడం వేయడం వలన ఒక చిన్న పోలీస్ కేసు అయ్యింది." అంటూ వార్తలు చెప్పాడు ఆది.

పృద్వి కోసం విష్ణు ప్రియ...ఆ షోకి అందుకే వెళ్లాను!

  బిగ్ బాస్ లో రొమాంటిక్ కపుల్ గా విష్ణు ప్రియా - పృథ్వి జోడి మంచి పేరు తెచ్చుకుంది. ఒకరు లేకపోతె ఇంకొకరు లేరు అన్నట్టుగా ఉండేవాళ్ళు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక పృథ్వి విష్ణు ప్రియను పట్టించుకోవడం మానేసాడు. విష్ణు ప్రియా మాత్రం పృద్వి జపం చేస్తూ ఉంటుంది. కానీ అతను ఇద్దరం ఫ్రెండ్స్ అని మాత్రమే అనేవాడు. అలాంటి పృద్వి గురించి విష్ణు ప్రియా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పింది . "కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో గురించి చెప్పాలంటే ఎం చెప్తావ్" అని విష్ణు ప్రియను హోస్ట్ అడిగింది. "నాకు దేవుడు రెండు సార్లు షోకి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్ లో బేవార్సు వాళ్ళతో ఫ్లర్ట్ చేసాను. సెకండ్ సీజన్ లో నాకు ఇష్టమైన అబ్బాయి ఉన్నాడు...డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అతన్ని చూడడం కోసమే వెళ్లాను. ఈ విషయాన్నీ నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. నేను పృద్వి కోసం ఈ షో సెకండ్ సీజన్ కి వెళ్లాను. అక్కడ మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అంటే షూటింగ్ కి ముందు మేము ఛిల్ల్ అయ్యేవాళ్ళం..షూటింగ్ మధ్యలో నేను పృథ్వి కోసం బర్గర్స్ వంటివి ఆర్డర్ పెట్టి తెప్పించేదాన్ని. ఇక నిఖిల్ కూడా ఇదంతా చూసి పృథ్వికె ఇస్తావా అనేవాడు ఇక అతనికి నా బర్గర్ ఇచ్చేసేదాన్ని. అలా ఆ షో టైంలో కలిసి ఫుడ్ తినేవాళ్ళం. ఫైటింగ్ చేసుకునే వాళ్ళం. ఆ పృథ్వి ఐతే గేమ్ ని గేమ్ లానే ఆడాలి అనేవాడు." అంటూ పృద్వి గురించి చెప్పింది విష్ణు ప్రియా.

Bigg Boss 9 Telugu : తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ లో నిలిచింది వీళ్లే!

  బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మూడు టీమ్ లు పోటీపడుతున్నాయి. అందులో రెబల్స్ కి సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. సీక్రెట్ టాస్క్ లు పూర్తి చేసిన వారికీ బిగ్ బాస్ డైరెక్ట్ కంటెండర్స్ ని చేసారు. అయితే రీతూ సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అవ్వడంతో డైరెక్ట్ కంటెండర్ అవలేకపోయింది.  ఎవరు అయితే రెబల్స్ అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పమని బిగ్ బాస్ చెప్పగా అందరూ గౌరవ్, ఇమ్మాన్యుయల్, రీతూ అని చెప్తారు. అయితే బిగ్ బాస్ చివరికి అసలైన రెబల్స్ ని రీవీల్ చేస్తాడు. సుమన్, దివ్య డైరెక్ట్ కంటెండర్స్ అని బిగ్ బాస్ చెప్పాడు. నిఖిల్, కళ్యాణ్,  శ్రీనివాస్ సాయి వీళ్లంతా రెబల్స్ తో కిల్ అయ్యారు. సంజన ముందు నుండే టాస్క్ లో లేదు. గౌరవ్ కెప్టెన్సీ టాస్క్ నుండి రిమూవ్ అయ్యాడు. ఇమ్మాన్యుయల్, రాము, భరణి, తనూజ, రీతూ. అయిదుగురు చర్చించుకొని ఒకరు రిమూవ్ చేయాలని నలుగురు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు‌. ఇక అయిదుగురు డిస్కషన్ చేసుకుంటారు. ఆల్రెడీ రాము, ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యారు కాబట్టి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం తప్పుకోండి అని భరణి చెప్తాడు. నేను రిమూవ్ అవుతున్నానని రాము చెప్తాడు. ఏంటి నువ్వు ఇలా ప్రతీదానికి త్వరగా గివప్ ఇస్తున్నావ్.. ఆర్గుమెంట్స్ చెయ్యాలి కదా.. నీ ఛాన్స్ కోసం నువ్వు మాట్లాడాలని రాముతో తనూజ అంటుంది. అయిన రాము సైలెంట్ గా ఉంటాడు. తనూజ, భరణి, దివ్య, సుమన్, రీతూ, ఇమ్మాన్యుయల్ ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్నారు. భరణి దగ్గరికి తనూజ వెళ్లి కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చెయ్యమని అడుగుతుంది. మరి వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి మరి.

Bigg Boss 9 Telugu : దివ్య కెప్టెన్సీ కంటెండర్స్.. రీతూ ఒక్కటే గెలిచింది!

  బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా కెప్టెన్సీ టాస్క్ కోసం సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. దివ్య, సుమన్ శెట్టి ఇద్దరిని రెబల్స్ చెయ్యగా వాళ్ళకి రెండు సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అయితే వాళ్ళిద్దరూ సక్సెస్ ఫుల్ గా టాస్క్ ఫినిష్ చేస్తారు. ఫస్ట్ సీక్రెట్ టాస్క్ ఫినిష్ చేసి రెబల్ గా కళ్యాణ్ ని అట లో నుండి తొలగించారు. ఇక ఆ తర్వాత రెబల్ గా బిగ్ బాస్ రీతూకి చెప్తాడు. తనకి రెండు సీక్రెట్ టాస్క్ లు ఇస్తాడు. ఒకటి ఎవరితో అయినా పెద్ద గొడవ పెట్టుకోవాలి. రెండోది ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ ఫోటోని కొట్టేయ్యాలి. అందులో ఒక టాస్క్ గెలిచి శ్రీనివాస్ సాయిని అట నుండి తొలగిస్తుంది. రెండో టాస్క్ ఫెయిల్ అవుతుంది. హౌస్ లో ఒకరికొకరు నువ్వే రెబల్ ఆ అంటూ ఒకరికొకరు అడుగుతారు కానీ ఎవరు బయటపడరు. బిగ్ బాస్ మూడు టీమ్ లకి ఒక టాస్క్ ఇస్తాడు. అందులో ఆరేంజ్ టీమ్ విన్ అవుతుంది. వాళ్ళలో ఎవరికీ గ్రీన్ బ్యాడ్జ్ ఉంటుందో వాళ్ళలో ఒకరికి రెబల్ తొలగించే టాస్క్ నుండి తొలగించే ప్రక్రియ నుండి రిలీఫ్ అవుతారు. ప్రస్తుతం ఆ బ్యాడ్జ్ తనూజ దగ్గర ఉంటుంది. ఇమ్మాన్యుయల్, గౌరవ్ నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు గొడవ పెట్టుకుంటారు కానీ రాము ఇలాంటి రియాక్ట్ లేకుండా డైరెక్ట్ నాకు వద్దని చెప్తాడు. దాంతో బ్యాడ్జ్ ని గౌరవ్ కి ఇస్తారు.

Jayam serial : గంగకి బాక్సింగ్ కోచ్ గా రుద్ర.. శకుంతల డ్రామా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -105 లో.....గంగ తన కాలికి పెన్ తో పట్టీల డిజైన్ వేసుకొని మురిసిపోతుంది. పాపం రుద్ర సర్ తనకి గిఫ్ట్ రిటర్న్ ఇచ్చినందుకు ఫీల్ అయిండెమో అని గంగ అనుకుటుంది. మరొకవైపు పారుని ఇషిక, వీరు కలుస్తారు. రుద్ర పెళ్లికి ఒప్పుకున్నాడు కానీ నీతో అని తెలియదని ఇషిక చెప్తుంది. మరుసటి రోజు ఉదయం శకుంతల త్వరగా లేచి పూజ చేస్తుంది. రుద్ర వెళ్తుంటే అగు నాన్న అని కూర్చొపెట్టి నీకోసమే పూజ చేసాను అకాడమీ సక్సెస్ అవుతుంది. ఈ రక్ష కట్టుకోమని కడుతుంది. పాయసం తినిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం కి భోజనం కూడా పంపిస్తుంది. అదంతా చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. పెద్దసారు మాత్రం ఇదంతా నీ నటన ఏమోనని భయంగా ఉంది శకుంతల అని అనుకుంటాడు. రుద్ర  అకాడమీకి వెళ్తుంటే  శకుంతల ఎదురువస్తుంది. ఆ తర్వాత మన ప్లాన్ సక్సెస్ అని ఇషిక, వీరు అనుకుంటారు. మరొకవైపు రుద్ర అకాడమీ వెళ్తాడు. అక్కడ ప్రాక్టీస్ కి దీప్తి రాదు.. ఎందుకు రాలేదో కనుక్కోమని రుద్ర కోచ్ కి చెప్తాడు. అప్పుడే పారు వచ్చి ఇక దీప్తి ఇక్కడికి ఎప్పటికి రాదు.. రాకుండా చేసానని చెప్తుంది. ఇప్పుడు నువ్వు సెలక్షన్ కి ఎవరిని పంపిస్తావ్.. అసలు స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరున్నార‌ని పారు అంటుంది. నేనున్నానని గంగ ఎంట్రీ ఇస్తుంది. నువ్వా అంటూ పారు వెటకారంగా నవ్వుతుంది. దాంతో గంగ ఫోర్స్ గా తన మొహంపై పంచ్ ఇవ్వబోతు ఆగుతుంది. దాంతో పారు భయపడుతుంది. నాకు ట్రైనింగ్ ఇవ్వండి రుద్ర సర్ మీ నమ్మకం నిలబెడతానని రుద్రతో  గంగ అంటుంది. తరువాయి భాగంలో శకుంతల చూసిన అమ్మాయి పారు అని రుద్రతో పాటు ఇంట్లో అందరికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : నర్మద లంచం తీసుకుందంటూ వార్తలు.. అదంతా భద్రవతి ప్లాన్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -309 లో......సేనాపతి అన్న మాటలు వేదవతి గుర్తుచేసుకొని బాధపడుతుంది. అప్పుడే నర్మద వస్తుంది. నీతో మాట్లాడాలి నర్మద అని వేదవతి అంటుంది. నువ్వు మా వాళ్ళ జోలికి వెళ్ళకు వాళ్ళ పగ నీకు తెలియదు ఇరవై అయిదేళ్లుగా నేను వాళ్ళ పగని చూస్తున్నాను..పరువు కోసం ఏమైనా చేస్తారని నర్మదతో వేదవతి చెప్తుంది. అలాగని నా వృత్తికి అన్యాయం చెయ్యలేనని నర్మద చెప్తుంది. అంటే నా మాట అంటే నీకు లెక్కలేదా అని వేదవతి కోప్పడుతుంది. సారీ అత్తయ్య అని నర్మద చెప్తుంది. అదంతా శ్రీవల్లి విని హమ్మయ్య అత్త కోడళ్ళకి గొడవ స్టార్ట్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు ప్రేమ బయట కూర్చొని ఆలోచిస్తుంది. అప్పుడే ధీరజ్ వచ్చి ఇంత చల్లగాలిలో ఏం చేస్తున్నావ్.. పదా లోపలికి వెళదామని అంటాడు‌ రానని మొండి గా అక్కడే కూర్చుంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ బట్టలు తీసుకొని వచ్చి బయటే పడుకోవడానికి సిద్ధం చేస్తుంటే.. వెళ్లి ప్రేమ పడుకుంటుంది. నేను నీ బాధ్యత అన్నావ్ కదా ఇక్కడ పడుకుంటున్నా.. నన్ను చూస్తూ ఉండు అని ప్రేమ అంటుంది. ప్రేమ మంచిగా పడుకుంటుంది.. ధీరజ్ తనని చూస్తూ ఉంటాడు. మరొకవైపు అప్పుల వాళ్లు భాగ్యం, ఆనందరావుని వెంబడిస్తుంటే వాళ్లిద్దరు దాక్కుంటారు. ఈ బాధ తీరాలంటే రామరాజు దగ్గరికి వెళ్లి బిజినెస్ పెట్టుబడికి డబ్బు అడగాలని ఇద్దరు ప్లాన్ చేసుకొని రామరాజు ఇంటికి వెళ్తారు మావయ్య ఇంట్లో లేరని శ్రీవల్లి చెప్తుంది. దాంతో తామెందుకు వచ్చారో శ్రీవల్లికి చెప్తారు‌ రెండు రోజులు ఇక్కడే ఉంటామని భాగ్యం అనగానే.. శ్రీవల్లి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత నర్మద ఆఫీస్ కి వెళ్తుంటే వేదవతిని పలకరించినా కూడా నర్మదతో మాట్లాడదు. తరువాయి భాగంలో నర్మద లంచం తీసుకుంటుందని మీడియా వాళ్ళు నర్మద దగ్గరికి వస్తారు. అది న్యూస్ లో చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: సీఈఓ పదవి నుండి జ్యోత్స్నని పీకేసిన శివన్నారాయణ.. షాక్ మీద షాక్!

  స్టార్ట్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -508 లో.....శివన్నారాయణ దగ్గరికి పారిజాతం వస్తుంది. రేపు బోర్డు మీటింగ్ లో జ్యోత్స్ననే సీఈఓగా కొనసాగుతుందని చెప్పండి అని పారిజాతం అనగానే జ్యోత్స్న నీతో చెప్పమని చెప్పిందా నీపై నమ్మకం లేక తను కూడా వచ్చిందా అని శివన్నారాయణ గోడకి తొంగి చూస్తున్న జ్యోత్స్నని ఉద్దేశ్యించి అంటాడు. జ్యోత్స్నని లోపలికి పిలుస్తాడు. నువ్వు సీఈఓ పోస్ట్ కి రాజీనామా చెయ్.. ఆ తర్వాత ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. మరుసటిరోజు ఉదయం కార్తీక్ కి దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. దీప డల్ గా ఉంటుంది. ఏమైందని అడుగుతుంది. ఈ రోజు జ్యోత్స్న సీఈఓగా ఉండాలో లేదో నిర్ణయం తీసుకునే రోజు .. దానివల్ల కుటుంబంలో ఎన్ని గొడవలు వస్తాయోనని భయంగా ఉందని అని దీప అంటుంది. నువ్వేం కంగారు పడకు ఇంట్లో ఏ గొడవ జరిగిన కూడా నేను చూసుకుంటాను.. ఇంట్లో అన్ని సమస్యలు తీరాకే నీ గురించి ఇంట్లో చెప్తానని కార్తీక్ అంటాడు. మరొకవైపు శివన్నారాయణని కాకా పడితే ప్లాన్ ఫెయిల్ అయిందని ప్రొద్దున దశరథ్ దగ్గరికి జ్యోత్స్న, పారిజాతం వచ్చి సీఈఓ గా తననే కంటిన్యూ చెయ్యమని అడుగుతారు. అసలు నేను మీ కూతురినే కదా నాకే బాధ్యతలు ఇవ్వాలని జ్యోత్స్న అంటుంది. ఇప్పటివరకు ఇస్తేనే ఇలా చేసావని దశరథ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ ఎంట్రీ ఇస్తాడు. ఏదైనా మా ఇష్టం కాదు బోర్డు మెంబర్స్ ఇష్టమని శివన్నారాయణ అంటాడు. అప్పడే కార్తీక్, దీప ఎంట్రీ ఇస్తారు. ఇంట్లో మగవాళ్లకేనా నిర్ణయం తీసుకునే అర్హత ఆడవాళ్లకి లేదా జ్యోత్స్నకి తల్లిగా సుమిత్రకి ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు లేదా అని పారిజాతం అడుగుతుంది. నువ్వు మాట్లాడిన దాంట్లో న్యాయం ఉందని శివన్నారాయణ అంటాడు. చెప్పు సుమిత్ర నువ్వేం చెప్తే అది అని శివన్నారాయణ అన్నాడు. చెప్పు మమ్మీ అని జ్యోత్స్న హుషారుగా అడుగగా సుమిత్ర తన నిర్ణయం చెప్తుంది. జ్యోత్స్నని పెళ్లి కూతురుగా చూడాలని అనుకుంటున్నానని చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కోయిలి నిజస్వరూపాన్ని రాహుల్ కు చూపించిన రాజ్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -871 లో.....గోల్డ్ బాబూ కోసం కోయిలి పార్టీ ఏర్పాటు చేస్తుంది. గోల్డ్ బాబుతో కలిసి డ్రింక్ చేస్తూ డాన్స్ చేస్తుంది. అదంతా రాహుల్ చూసి.. నువ్వేం చేస్తున్నావ్.. నీకు అర్థం అవుతుందా అని కోప్పడుతాడు. గోల్డ్ బాబుని సంతోషపరచాలి కదా అని కోయిలి అంటుంది. నువ్వు వాడితో కాదు నాతో డాన్స్ చేయాలని రాహుల్ కోపంగా కోయిలిని తన వైపుకి లాగుతాడు. నాకూ బోరింగ్ గా ఉంది.. నేను వెళ్ళిపోతానని గోల్డ్ బాబూ అంటాడు. దాంతో రాహుల్ ని వదిలేసి కోయిలి, గోల్డ్ బాబూ దగ్గర కి వెళ్లి డాన్స్ చేస్తుంది. రాహుల్ ని ఇద్దరికి డ్రింక్ కలిపి ఇవ్వమని చెప్తుంది. దాంతో రాహుల్ కోపంగా డ్రింక్ కలిపి వాళ్ళిద్దరికి ఇస్తాడు. ఆ తర్వాత సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారు.. రాజ్, కావ్య ఇద్దరు డాన్స్ చేస్తారు మీరు ముసలి వాళ్ళు కదా అని కోయిలి అడుగుతుంది. మేమ్ ముసలి వాళ్ళమే అని మళ్ళీ ముసలి వాళ్ళలాగా యాక్టింగ్ స్టార్ట్  చేస్తారు. ఆ తర్వాత కోయిలి తన గదిలో పడుకుంటుంది. రాజ్, కావ్య ఇద్దరు గోల్డ్ బాబూ దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడ పడుకున్నావేంటీ వెళ్లి కోయిలి గదిలో పడుకోమని పంపిస్తారు. గోల్డ్ బాబూ వెళ్లి కోయిలి పక్కన పడుకుంటాడు. తన షర్ట్ కి లిప్ స్టిక్ మార్క్ పెట్టుకుంటాడు. ఉదయం రాజ్, కావ్య ఇద్దరు రాహుల్ దగ్గరికి వెళ్లి కొయిలిని గోల్డ్ బాబూ గదిలో చూసామని చెప్తారు. దాంతో రాహుల్ వెళ్లి చూడగా గోల్డ్ బాబు పక్కన కోయిలి ఉండడం చూసి షాక్ అవుతాడు. చూసావా ఇది ఏలాంటిదో.... అది కేరాఫ్ ఫ్లాట్ ఫామ్.. అది కోటీశ్వరురాలు కాదని రాహుల్ తో రాజ్ చెప్తాడు. తరువాయి భాగంలో దుగ్గిరాల ఇంటికి పోలీసులు వస్తారు.. రాహుల్ ని అరెస్ట్ చెయ్యాలి.. కోయిలి అనే అమ్మాయిని హత్య చేసాడని పోలీసులు చెప్తారు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నేను వన్ డే సిఎం ఐతే ..ఎం మారుస్తానంటే?

బుల్లితెర మీద ఒకప్పుడు ప్రసారమైన గృహలక్ష్మి సీరియల్ కి చాలామంది ఫాన్స్ ఉన్నారు. ఈ సీరియల్ చూసిన వాళ్లంతా ఇంట్లో అమ్మ అంటే ఇలా ఉండాలి అనుకునేలా నటించారు కస్తూరి శంకర్. ఐతే ఆమె ఒక రోజు సీఎం ఐతే ఎం చేస్తారో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. "నేను వన్ డే సిఎం ఐతే శంకర్ తో ఒక మూవీ చేస్తా..నో.నో కామెడీగా చెప్పాను. నాకు చాలా రివొల్యూషనరీ థాట్స్ ఉన్నాయి. సీఎం ఐతే గనక నేను మార్చాలనుకునేది చెత్త. ఎక్కడ చూసినా ఆ సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడబడితే అక్కడ చెత్తే వేసేస్తున్నాయి. చూడడానికి ఎత్తైన భవనాలు ఉన్నాయి. పైకి చూస్తే సింగపూర్ లా ఉంది. కానీ కింద చూస్తే అంతా గలీజ్ గలీజ్ గా ఉంది. అది మార్చాలి. అది ఒక్క రోజులో అవ్వదు కానీ దానికి ఒక దారుణమైన లా పెట్టేయాలన్నా ఒక శాసనం చేయాలన్నా చేస్తా. స్కూల్ లో శుభ్రతకు సంబంధించి ఒక డ్రిల్ల్, ఒక ప్రాక్టీస్ క్లాస్ ఉండేలా చూస్తా. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా నిన్న సోషల్ మీడియాలో ఒకటి షేర్ చేసారు. బెంగళూరులో మంచి మంచి బయో కెమికల్ లాబ్స్, ఫార్మా లాబ్స్ వంటివి చాల ఉన్నాయి. ఐతే ఇక్కడికి వచ్చే టూరిస్టులు రోడ్స్ చూసి ఇంత చెత్తగా ఉన్నాయేమిటి ఇక్కడి రోడ్లు అంటున్నారని పోస్ట్ చేశారు. ఇక నేను ఫిట్నెస్ ఫ్రీక్ ని ఏటిఎం వరకు వాకింగ్ చేస్తూ వెళ్లాను. అటుగా వస్తున్న ఒక బస్ లోంచి ఒకళ్ళు నామీద కిళ్ళీ ఓసి వెళ్లిపోయారు. ఫుల్ నా హెయిర్ అంతా రెడ్ ఐపోయింది. నేను ఒక ఇల్లు కొత్తగా కొన్నాను. దానికి  పెయింట్ చేయడానికి వచ్చిన వాళ్ళు నార్త్ నుంచి వచ్చారు. నా హెయిర్ మీద ఉమ్ము ఊసిన వాళ్ళే వచ్చి పెయింట్ చేసి వెళ్లారు." అని చెప్పింది