Illu illalu pillalu : శోభ మిస్సింగ్ కేసులో ధీరజ్ ని తీసుకెళ్ళిన పోలీసులు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -300 లో......ముగ్గురు కోడళ్ళు కొడుకులు కలిసి రామరాజు, వేదవతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత మూడు జంటలు పూజపై కూర్చుంటారు. వాళ్ళని అలా చూసి వేదవతి మురిసిపోతుంది. ప్రేమ బ్లౌజ్ కి, ధీరజ్ షర్ట్ ఇరుక్కుంటుంది. దాంతో షర్ట్ కొంచెం చిరుగుతుంది. అది చూస్తే నాన్న ఫీల్ అవుతాడని ధీరజ్ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత కాసేపటికి ఇంటికి పోలీసులు వస్తారు. పోలీసులని చూసి అందరు బయటకు వస్తారు. ఏమైందని అడుగుతారు. ధీరజ్ అంటే ఎవరు అని ఇన్‌స్పెక్టర్ అడుగుతాడు. అసలు ఏమైంది చెప్పండి అని రామరాజు అడుగుతాడు. అప్పుడే ధీరజ్ ఎంట్రీ ఇస్తాడు. నేనే ధీరజ్ ఏమైందని ఇన్‌స్పెక్టర్ ని ధీరజ్ అడుగుతాడు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఏమైందని అడుగుతావా అని ఇన్‌స్పెక్టర్ అనగానే అందరు షాక్ అవుతారు. ఒకమ్మాయి నీ క్యాబ్ బుక్ చేసుకుంది కదా.. ఆ అమ్మాయి కన్పించడం లేదని వాళ్ళ నాన్న నీపై కంప్లైంట్ ఇచ్చాడని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. ధీరజ్ ని ఇన్‌స్పెక్టర్ తీసుకొని వెళ్తుంటే రామరాజు అడ్డుపడతాడు.. అయిన సరే వాళ్ళు వినకుండా ధీరజ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తారు. అదంతా భద్రవతి కుటుంబం చూసి వీడికి అలాంటివేం కొత్త కాదు.. డబ్బున్న అమ్మాయిని  పెళ్లి పేరుతో మాయ చెయ్యడం అలవాటే అని సేనాపతి అంటాడు. ఆగండి నాన్న.. ధీరజ్ నన్నేం తీసుకొని వెళ్ళలేదు.. అసలు ధీరజ్ నన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడో తెలుసా అని ప్రేమ అసలు విషయం చెప్పబోతుంటే వేదవతి, నర్మద అడ్డుపడుతారు. ఆ తర్వాత రామరాజు స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ శోభ వాళ్ళ నాన్న ఉంటాడు. మా అబ్బాయి అలాంటివాడు కాదని రామరాజు చెప్తాడు. అయిన అతను వినిపించుకోడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam 2: దశరథ్ మనసు మార్చడానికి శివన్నారాయణ ప్లాన్.. శౌర్యకి చెల్లి రాబోతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -499 లో.....శివన్నారాయణ, కార్తీక్ ఇంటికి వస్తారు. మావయ్యతో అత్త గురించి చెప్పకని కార్తీక్ అనగానే చెప్పను కానీ ఈ రోజు మీ తాతయ్యలోని మరొక కోణం చూస్తావని శివన్నారాయణ అంటాడు. దశరథ్ బాధపడుతుంటే శివన్నారాయణ వెళ్లి ఎందుకు సుమిత్ర గురించి భాదపడుతున్నావ్.. నిన్ను అర్థం చేసుకోలేక వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళ గురించి వెతకడం బాధపడడం అనవసరమని శివన్నారాయణ అంటుంటే పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు.   ఏంటి తాత అలా మాట్లాడుతున్నావని కార్తీక్ అంటాడు. నువ్వు డ్రైవర్ వి.. డ్రైవర్ లాగా ఉండు అంతేగాని ఎక్కువ మాట్లాడకని శివన్నారాయణ అంటాడు. శివన్నారాయణ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నిన్నటి వరకు మమ్మీ గురించి బెంగ పెట్టుకొని ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు. బయటకు వెళ్ళాడు బావతో తిరిగి వచ్చాడు. అసలేం జరిగిందని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. మరొకవైపు కాశీ ఇంటికి వచ్చి ఆఫీస్ లో టైడ్ అయినట్లు బిల్డప్ ఇస్తుంటే.. శ్రీధర్ ఫోటో చూపిస్తాడు. రోడ్డుపై నీ ఫ్రెండ్ తో బాతకానీ కొడుతుంటే నేను అక్కడే ఉన్నాను.. అక్కడే ఉండి నీకు ఫోన్ చేసానని శ్రీధర్ చెప్తాడు. దాంతో కాశీ టెన్షన్ పడతాడు. కాశీ ఏదో మాట్లాడబోతుంటే నోరు ముయ్ రా అని శ్రీధర్ అంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. స్వప్న నేనొక విషయం చెప్పాలని శ్రీధర్ అంటాడు. చెప్పకండి అని కాశీ మెల్లిగా రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో శ్రీధర్ సైలెంట్ గా ఉంటాడు.   ఆ తర్వాత అత్త, మావయ్యలని కలపాల్సింది పోయి. అలా మాట్లాడతావా అని శివన్నారాయణతో కార్తీక్ అంటాడు. దశరథ్ లో సుమిత్రపై ఉన్న ప్రేమని బయటకు తీసుకొని రావడానికి అలా మాట్లాడాను.. రేపు వాళ్ళ పెళ్లి రోజు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.. నువ్వు రేపు త్వరగా రారా అని కార్తీక్ తో శివన్నారాయణ చెప్తాడు. ఆ తర్వాత శౌర్య బొమ్మ పట్టుకొని ఆ బొమ్మకి పేరు పెట్టమని దీప దగ్గరికి వస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఆ బొమ్మని చెల్లి అని పిలవమని చెప్తారు. ఆ తర్వాత శౌర్య చెల్లి కావాలని అంటుందని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. వెళ్లి పాల గ్లాస్ తో రా మనకి చాలా పనుంది అని కార్తీక్ అనగానే దీప సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కావ్యని చూసి రాజ్ షాక్.. అసలేం జరిగిందంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -862 లో... కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. నేనంటే ఎంత ఇష్టం నా కోసం మీ బిడ్డని వదులుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నామని కావ్య అంటుంది. కావ్య వంక రాజ్ డౌట్ గా చూస్తుంటే.. ఏంటండి అలా చూస్తున్నారని కావ్య అడుగుతుంది. నేను ఏమైనా డాక్టర్ తో అబద్ధం చెప్పించానా ఏంటి అలా చూస్తున్నారని కావ్య అనగానే.. నువ్వు డాక్టర్ ని రిక్వెస్ట్ చెయ్యడం నేను చూసానని రాజ్ అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. కావ్య డాక్టర్ తో మాట్లాడింది రాజ్ గుర్తుచేసుకుంటాడు. ఎందుకు ఇలా ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పావని రాజ్ అడుగుతాడు. మీరు ఎలా నా కోసం అబద్ధం ఆడారో.. నేను ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం అబద్ధం ఆడానని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాజ్ కోపంగా ఉంటాడు. తన కోపం పోగొట్టడానికి తనకి చెక్కిలిగింతలు పెడుతుంది కావ్య‌. రాజ్ నార్మల్ అవుతాడు. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. మరొకవైపు స్వప్న బీరువా ఓపెన్ చెయ్యడంతో తన నెక్లెస్ కన్పించదు.. దాంతో రాహుల్ ని పిలిచి నా నెక్లెస్ నువ్వు తీసావ్ రేపటి లోగా నెక్లెస్ తీసుకొని రాకుంటే మర్యాద ఉండదని రాహుల్ కి స్వప్న వార్నింగ్ ఇస్తుంది. నాకు కావలసింది కూడా ఇదేగా అని రాహుల్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య ఉదయం లేచి వ్యాయామం చేస్తుంది. అప్పుడే రాజ్ వస్తాడు. తరువాయి భాగంలో ఉదయం కావ్య మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ తో రాజ్ దగ్గరికి వస్తుంది. ఇదంతా ఏంటే అని రాజ్ అడుగగా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu: హౌస్ లో రమ్య చెప్పిన ట్రాష్ కంటెస్టెంట్స్ వీళ్ళే.. బిగ్ బాంబ్ ఇచ్చింది ఎవరికంటే!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ అవ్వగా ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. బాండింగ్స్ ని దూరం చేయాలనే ఇంటెన్స్ తో వచ్చిన రమ్య ఎవరితో మాట్లాడకుండా ఇండివిడ్యువల్ గా ఆడాలని ప్రయత్నించి బయటకొచ్చేసింది. నిన్నటి సండే ఎపిసోడ్ లో రమ్య బయటకొస్తూ కొంతమంది హౌస్ లో ఉండటానికి అర్హులు కారు అంటు వారికి ట్రాష్ ఇచ్చింది‌. ఆ కంటెస్టెంట్స్ ఎవరో ఓ సారి చూసేద్దాం. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ ని రెండు టీమ్ లుగా విభజించాడు.  నిఖిల్, గౌరవ్ ఇద్దరిని టీమ్ లీడర్లుగా చేశాడు నాగార్జున. ఇక ఆ తర్వాత ఇరు టీమ్ లకి  'సెలబ్రిటీ ఐటెం సాంగ్' అనే టాస్క్ పెట్టాడు. ఇందులో నిఖిల్ టీమ్ గెలిచింది. ఆ తర్వాత 'బ్లైండ్ ఫోల్డ్ లో ఫుడ్ ఎక్స్ప్లెనేషన్' అనే టాస్క్ పెట్టాడు నాగ్. ఇందులో గౌరవ్ టీమ్ గెలిచింది. ఇమ్మాన్యుయేల్ ను పవరస్త్రాకు సేవింగ్ పవర్ లాస్ట్ టైమ్ అయిపోయింది. ఇక దానికి పవర్ లేదు. అలాగే తనూజా దగ్గర ఉన్న 'గోల్డెన్ బజర్'కు వచ్చే వారం సేవ్ చేసే పవర్ ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత డేంజర్ జోన్ లో ఉన్న సంజన - రమ్యలలో ఎవరిని సేవ్ చేస్తావని తనూజను నాగార్జున అడుగగా.. సంజన అని తనూజ అంది. కాసేపటికి హౌస్ ఎలిమినేషన్ రౌండ్ జరుగగా అందులో సంజన సేవ్ అయి రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఇక అందరికి బై చెప్పేసి రమ్య బయటకొచ్చేసింది. ‌ఇక స్టేజ్ మీదకి వచ్చాకా తన జర్నీ వీడియోని చూపించాడు నాగార్జున. ప్రస్తుతం హౌస్ లో పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఐదుగురిని ట్రాష్ క్యాన్ లో వేసి, రీజన్ చెప్పమన్నాడు నాగార్జున. కళ్యాణ్ నిబ్బా నిబ్బిలా బిహేవ్ చేస్తున్నాడు. దివ్య ఒక్కరితోనే ఉండేది, భరణి వెళ్లాక కోపం ఎక్కువ అవుతోంది. తనూజా  ఎవరో చెప్పింది విని మాట్లాడుతుంది అందుకే తను మానిప్యులేటర్. గౌరవ్ మాటల రాక్షసుడు.. ఇగో ఎక్కువ అని చెప్పింది. ఆ తర్వాత ఎమోషనల్ గా గేమ్ ఆడకు. బుర్రవాడు కళ్యాణ్  అంటూ రమ్య చెప్పింది. ఇక ఆ తర్వాత ఈ అయిదు మంది ఇమేజెస్ ను ట్రాష్ క్యాన్ లో వేసింది.  ఇక హౌస్ లోని వాళ్ళతో రమ్యని నాగార్జున మాట్లాడించాడు. అందులో ఇమ్మాన్యుయల్ లేచి.. మిస్ యూ రమ్య అని చెప్పాడు.నా దురదృష్టం ఏంటో నాకోసం వచ్చిన ఇద్దరు దేవతలు రమ్య, అయేషా వెళ్ళిపోయారని ఇమ్మాన్యుయల్ బాధపడ్డాడు. ఇక వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబుగా వాష్ రూమ్ బాధ్యతలను రీతూకి అప్పగించింది రమ్య. 

Ramya Moksha Remuneration: రమ్య మోక్ష రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. అయితే తన ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూశారు. నెగెటివ్ టాక్ తో హౌస్ లోకి వెళ్ళిన రమ్య అంతే నెగెటివ్ తో బయటకొచ్చేసింది.  వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా వచ్చిన రమ్య మోక్ష సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమెకు వారానికి రెండు నుండి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఆమె రెండు వారాలు హౌస్‌లో ఉన్నందుకు గానూ తను నాలుగు నుండి ఆరు లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఇది చాలా ఎక్కువ అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్ లో ఎవరితోను బాండింగ్స్ పెట్టుకోకూడదని సింగిల్ ఎజెండాతో వెళ్ళి, హౌస్ లో ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్ గా గేమ్స్ ఆడి, చివరికి సింగిల్ గా బయటకొచ్చేసింది. ఆయితే రమ్య మోక్ష ఫస్ట్ వీక్ ఏ బయటకొచ్చేసేది కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని ఫస్ట్ వీక్ నుండి సేవ్ చేసాడు బిగ్ బాస్. వారికి ఉన్న స్పెషల్ పవర్స్ వల్ల వారు హౌస్ లో సర్వైవ్ అవుతున్నారు లేదంటే అందరు నామినేషన్లోకి వచ్చేవారు. హౌస్ లో‌ మాధురితో ఎక్కువగా ఉన్న రమ్య మోక్ష.. తన నుండి బాండింగ్(బంధం) కోరుకుంది. కానీ మాధురి తనకు దూరంగా ఉండి తనూజకి దగ్గరైంది. అలా మాధురి తనతో ఉండకుండా తనూజకి దగ్గరగా ఉండటం తీసుకోలేకపోయింది. చివరికి తనూజని నామినేట్ చేసి.‌. చెత్త రీజన్లు చెప్పి అందరి దృష్టిలో బ్యాడ్ అయింది. ఇక ఆడియన్స్ ఎవరు కూడా రమ్య మోక్షకి ఓట్లు వేయలేదు ఎందుకంటే హౌస్ లో శ్రీనివాస్ సాయి పెద్దగా ఆడట్లేదు.‌ అతని వల్ల కంటెంట్ కూడా ఏం లేదు.‌. అతనే ఎలిమినేషన్ అవ్వాల్సింది కానీ నెగెటివ్ టాక్ ఎక్కువగా తెచ్చుకున్న రమ్య మోక్ష మరింత నెగెటివ్ తెచ్చుకొని ఆడియన్స్ ఓటింగ్ లేక  బయటకొచ్చేసింది. 

Bigg Boss 9 Telugu:  దువ్వాడ మాధురిని డైరెక్ట్ నామినేట్ చేసిన తనూజ.‌ అసలు కారణమిదే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం ఎన్నో ట్విస్ట్ లతో సాగింది. ప్రతీ వారం లాగే ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. రమ్య మోక్ష ఎలిమినేషన్ తో ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. హౌస్ లోని కొంతమందికి గోల్డెన్ బజర్ పొందడానికి అవకాశం ఇచ్చాడు నాగార్జున. ఇక ఈ గోల్డెన్ బజర్ టాస్క్ లో తనూజా, డెమోన్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి పాల్గొనగా... తనూజా గోల్డెన్ బజర్ ను గెలుచుకుంది. 'గోల్డెన్ బజర్' పవర్ ను గెలుచుకున్న తనూజానే దువ్వాడ మాధురికి పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఇందులో భాగంగా మూడు ఆప్షన్స్ ఇచ్చాడు నాగార్జున. ఒకటి డైరెక్ట్ నామినేషన్. రెండు వాష్ రూమ్, గార్డెన్ క్లీనింగ్.. మూడు వీక్ అంతా ఇన్విజిబుల్ అనే ఆప్షన్లు ఇచ్చాడు నాగార్జున. కానీ తనూజా మాత్రం ఊహించని విధంగా దువ్వాడ మాధురిని డైరెక్ట్ నామినేట్ చేసింది. ఆ ఇన్విజిబుల్ కేప్ ను ఎవరికి ఇస్తావని అడగ్గా, నా మమ్మికే అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. కానీ సంజన ఒప్పుకోకపోవడంతో వంద సెకెండ్ల టైమ్ ఇస్తా. హౌస్ మేట్స్ ను కన్విన్స్ చేసుకోమన్నాడు నాగార్జున. ఈ బంపర్ ఆఫర్ నాకెందుకంటూ గట్టిగా అరవడానికి ట్రై చేసింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ ఓటింగ్ అడిగి, టై కావడంతో మళ్ళీ ఇమ్మూని నాగార్జున ఇరికించాడు. దీంతో ఇమ్మాన్యుయల్ సంజనాకే కేప్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో సుమన్ శెట్టి దొంగతనం చేసిన వీడియోను ఫన్నీగా ప్లే చేశాడు. సుమన్ శెట్టి, తనూజాతో పాటు పానీపూరీ టాస్క్ లో దొంగతనంగా తిన్న వీడియోను కూడా ప్లే చేసి నవ్వించారు. 

Bigg Boss 9 Telugu Buzz:  డీమాన్ పవన్ తో పులిహోర ఏంటి.. బజ్ లో రమ్య మోక్షని బయటపెట్టిన శివాజీ!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. హౌస్ లో బాండ్స్ ఉన్నాయి.. లవ్ పార్క్ లా ఉంది.‌‌ వాటిని తీసేస్తా అంటు లోపలికి వెళ్ళిన రమ్య మోక్ష ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది.  రమ్య మోక్ష ఎలిమినేషన్ తర్వాత బజ్ ఇంటర్వ్యూ కి వచ్చేసింది. అందులో శివాజీ అడిగిన ప్రశ్నలకు తడబడింది రమ్య. హౌస్ కి బాండింగ్స్ వద్దని వెళ్ళిన నువ్వు.. మాధురితో బాండింగ్ ఎందుకు కోరుకున్నావని శివాజీ అడుగగా.. లేదు తనతో బాండింగ్ లేదు... తనతో ఉంటే బాగుంటుందని చెప్పాను.. ఫస్ట్ లో తను నాతో ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు తనుతో కలిసి ఫేక్ బాండింగ్ లో ఉందనిపించిందని అలా చెప్పానని రమ్య మోక్ష అంది. ఇక హౌస్ లో ఎవరెలాంటి వారో ఒక్కో జంతువుతో పోల్చాలని సరైన కారణం చెప్పాలని శివాజీ అన్నాడు. స్క్రీన్ మీద తాబేలు ఫొటో చూపించి ఎవరికి సూట్ అవుతుందని శివాజీ  అడుగగా.. రాము పేరు చెప్పింది రమ్య. చీతా బొమ్మ కనిపించగానే గౌరవ్.. అని ఆన్సర్ ఇచ్చింది. గౌరవా ఆర్ యూ షూర్.. అని శివాజీ అడిగాడు. బయటున్నప్పుడు ఎపిసోడ్స్ చూడలేదు అనుకున్నానే కానీ లోపల కూడా ఏం అబ్జర్వ్ చేయలేదు అమ్మడూ నువ్వు అని శివాజీ అన్నాడు. నక్క ఎవరని అడుగగా.. తనూజ అంది. గాడిద ఎవరని అడుగగా.. ఇమ్మాన్యుయల్ పేరు చెప్పింది. ఇలా ఒక్కొక్కరి పేరు చెప్పుకొచ్చింది. హౌస్‌లో మీరే నెగెటివ్ అని హౌస్‌మేట్స్ అందరూ అన్నారు.. అని శివాజీ చెప్పాడు. అందరూ అనలేదు సర్ ఇద్దరు అన్నట్లున్నారు.. అది వాళ్ల ఆలోచన అని రమ్య చెప్పింది. ఆది గారు వచ్చినప్పుడు మీకు ఒక హింట్ ఇచ్చారు.. ఏం జరుగుతుంది అనేది.. చాలా ఆటిట్యూడ్‌ తోటి థాంక్యూ.. అని అన్నారంటూ శివాజీ ఇమిటేట్ చేసి చూపించాడు. అలా రీచ్ అయి ఉంటుందేమో.. అని రమ్య అంటే ఆ రీచ్ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది.. అంటూ శివాజీ మళ్లీ కౌంటర్ వేశాడు. మీరు ఈ హౌస్‌కి కరెక్ట్ కాదని మీకు ఏమైనా అనిపించిందా.. మీరు బాండ్ క్రియేట చేసుకోవడానికి సుమన్ గారికి దగ్గరగా ఉన్నారేమోనని అందరూ అడుగుతున్నారు.. అని శివాజీ కొశ్చన్ చేశాడు. ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్లతోటే ఉండాలనిపిస్తుంది సర్.. అని రమ్య అంది. దీంతో మీకు సింపథీనా.. అని శివాజీ అడిగితే నాకేం సింపథీ కాదు సర్.. అని రమ్య ఆన్సర్ ఇచ్చింది. నేను పవన్‌తో పులిహోర ఏం కలపలేదు సార్.. అని రమ్య అడగ్గానే వీడియో ప్లీజ్.. అంటూ ప్లే చేశాడు శివాజీ. అందులో నీకు ఎవరు నచ్చారు ఈ హౌస్‌లో.. అని మాధురి అడిగితే పవన్ చాలా ఇన్నోసెంట్.. పవన్‌యే ఇష్టం నాకు.. అంటూ రమ్య చెప్పింది. వెంటనే కట్ అంటూ రమ్య వైపు సూటిగా చూశాడు శివాజీ. ఇక ఆ తర్వాత రమ్యకి ఏం చెప్పాలో తెలియక తడబడింది. మరి ఈ బజ్ ఇంటర్వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి.

Jayam serial : కొత్త అకాడమీ ఓపెన్ చేసిన రుద్ర.. ఛాంపియన్ పై అతను గెలుస్తాడా! 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -94 లో..... సూర్యని ఇంట్లో నుండి పంపించడానికి రుద్ర ఒప్పుకుంటాడు. సూర్య వెళ్లిపోతుంటే వీరు తన దగ్గరికి వెళ్లి నీకు నిజం తెలియదని బ్రతికించాలనుకున్నాను.. నీకు నిజం తెలిసాక ఆ పని ఎందుకు చేస్తానని సూర్యని కోమాలోకి వెళ్లే ఇంజక్షన్ వేస్తాడు వీరు. మరొకవైపు రుద్ర అకాడమీ ఓపెన్ చేస్తారు. అప్పుడే గంగ స్వీట్ పట్టుకొని వచ్చి నేను రాకుండానే చేస్తారా అని అందరికి స్వీట్ ఇస్తుంది. రుద్ర స్వీట్ తీసుకోబోతుంటే పారు ఎంట్రీ ఇస్తుంది. ఏ ధైర్యంతో ఇలా అకాడమీ పెట్టుకుంటున్నావ్.. నిన్ను నమ్మి ఇందులో జాయిన్ అవ్వాలా.. ఏమని నేర్పిస్తావ్ మోసం చేసి గెలవాలని నేర్పిస్తావా అని పారు అంటుంది. నువ్వు ఎందుకు వచ్చావని పెద్దసారు మాట్లాడుతాడు. రుద్ర సర్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని పారుకి గంగ ఎదురుతిరుగుతుంది. అంటే నువ్వేనా నన్ను నిన్న చేయి మెలిక పెట్టి వార్నింగ్ ఇచ్చిందని పారు అనగానే అవునే నేనే రుద్ర సర్ జోలికి వస్తే ఊరుకోమని గంగ వార్నింగ్ ఇస్తుంది. ముందు నువ్వు ఛాంపియన్ అని ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత అకాడమీ మొదలు పెట్టమని పారు అంటుంది. నేను చెప్పిన అతనితో తలపడు.. గెలువు.. అప్పడే నువ్వు ఛాంపియన్ అవుతావని పారు అనగానే అందుకు కూడా రుద్ర ఒప్పుకుంటాడు. మరొకవైపు రుద్ర గెల్వకుండా చూడాలి గెలిస్తే పూర్వ వైభవం వచ్చి మన ఆటలు సాగవని ఇషికతో వీరు అంటాడు. ఛాలెంజ్ కి రుద్ర ప్రాక్టీస్ చేస్తాడు. ఆ తర్వాత పారు దగ్గరికి గంగ వచ్చి వార్నింగ్ ఇస్తుంది. గెలవబోయేది మా రుద్ర సర్ అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Ramya Moksha Elimination: రమ్య మోక్ష ఎలిమినేషన్.. ఆడియన్స్ రివేంజ్ సక్సెస్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఆడియన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురుచూసిన ఎలిమినేషన్ ఏదైనా ఉందంటే అది ఇదే.. నిన్నటి రమ్య ఎలిమినేషన్. ఎందుకంటే తన నెగెటివ్ మాటలు, తన ఆటతీరు ఆడియన్స్ ఎవరికి నచ్చలేదు. అందుకే తనకి అసలు ఓట్లే వేయకుండా ఎలిమినేషన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అలానే చేసారు.  అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. ఆదివారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్లో ఉన్నవారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక చివరగా సంజన, రమ్య మోక్ష మిగిలారు. వారిమధ్య ఎలిమినేషన్ రౌండ్ జరుగుతుందని వారిని యాక్టివిటీ ఏరియాకి రమ్మని పిలిచాడు నాగార్జున. ఇక అక్కడ వారిద్దరిపై మేఘాలతో సెటప్ చేశాడు బిగ్ బాస్.  రమ్య-సంజన ఈరోజు మీ ఆట మీద మబ్బులు అలుముకున్నాయి.. మీ ఇద్దరి పైనా క్లౌడ్స్ ఆర్ వెయిటింగ్.. ఎవరి మేఘం నుంచి అయితే వర్షం పడుతుందో వాళ్లు సేఫ్.. ఎవరి మేఘం అయితే వర్షించదో వాళ్లు ఎలిమినేటెడ్.. నేను వారి కోసం స్టేజ్ మీద వెయిట్ చేస్తూ ఉంటానని నాగార్జున అన్నాడు. ఇంతలో ఇమ్మాన్యుయల్ నీ దగ్గర పవరాస్త్ర ఉంది.. దానికి సేవింగ్ పవర్ కేవలం లాస్ట్ వీక్ మాత్రమే ఉంది.. ఆ పవర్ నీకు లేదు ఇక.. నీ క్లారిటీ కోసం ఆడియన్స్ క్లారిటీ కోసం మళ్లీ ఈ విషయం నీకు చెప్తున్నానని నాగార్జున అన్నాడు. అలానే తనూజ నీ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది.. దానికి ఒకరిని సేవ్ చేసే పవర్ ఉంది.. కానీ అది వచ్చే వారం నుంచే.. ఇప్పుడే గెలుచుకున్నావ్ కాబట్టి దానికి ఆ పవర్ లేదంటూ నాగార్జున చెప్పాడు.  ఇక సంజన తల మీద ఉన్న మేఘం నుంచి వర్షం కురిసింది. దీంతో రమ్య యూఆర్ ఎలిమినేటెడ్.. సంజన నువ్వు సేఫ్.. అని నాగ్ ప్రకటించారు. వెంటనే సంజనకి హగ్ ఇచ్చి చెప్పా కదా నువ్వు ఉంటావని అని రమ్య అంది. అప్పుడే వెళ్లిపోతున్నావ్ ఏంట్రా అని సంజన అంటే టైమ్ వచ్చింది నన్ను బయట పిలుస్తున్నారు వెళ్లాలని రమ్య నవ్వుతూ చెప్పింది. యాక్టివిటీ రూమ్ నుంచి బయటికి రాగానే డీమాన్ నిల్చొని ఉన్నాడు. బై పవన్.. అని చెప్పేసి సుమన్ శెట్టి నుదుటి మీద కిస్ ఇచ్చి బై చెప్పింది రమ్య. ఇంతలో మాధురి వచ్చి రమ్యని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టింది. ఏడవద్దు మీరు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది.. నేను నవ్వుతూ వెళ్లాలి.. నువ్వు ఫస్ట్ ఏం చెప్పావో అలాగే చెయ్ సరేనా.. బై లవ్యూ.. బయటికొచ్చాక కలుద్దాం సరేనా జాగ్రత్తా.. ఎక్కువ అరవకు.. అంటూ మాధురితో రమ్య అంది. నేను నెక్స్ట్ వీక్ వచ్చేస్తానంటూ మాధురి ఏడుస్తూ చెప్పింది. ఆ తర్వాత తనూజ సహా అందరికి బై చెప్పేసి రమ్య వెళ్తుంటే రేయ్ నాకు బై కూడా చెప్పవా రమ్య అంటూ రీతూ అడిగింది. సారీరా.. బాగా ఆడు రీతూ ఓకేనా అంటూ రమ్య చెప్పింది. గేటు దగ్గరికి వెళ్లే ముందు జాగ్రత్త నువ్వు బాగా ఆడు ఫ్యామిలీని గుర్తు తెచ్చుకో నేను సపోర్ట్ చేస్తా బయటికెళ్లాక అంటూ డీమాన్‌కి రమ్య మరీ మరీ చెప్పింది.

ఎవరి వయసు ఎంతో తెలుసా.. ?

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. 90 స్ వెర్సెస్ జెన్ జి జెనెరేషన్స్ వాళ్ళు వచ్చారు. వీళ్ళ వయసు పుట్టిన ఏడాది కూడా శ్రీముఖి చెప్పించేసింది. 90 స్ టీమ్ లో గుప్పెడంత మనసు సీరియల్ ముఖేష్ అలియాస్ రిషి సర్ వచ్చాడు.  తర్వాత శ్రీకర్ కృష్ణ వచ్చాడు. 1996 లో పుట్టినట్లు చెప్పాడు. అటు 90 స్ కాదు అలాగే జెన్ జి కాదు బోర్డర్ లో పుట్టాను అన్నాడు. ఇతను బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్నాడు. అలాగే విష్ణు ప్రియా వచ్చింది. ఈమె 1995 లో పుట్టినట్లు చెప్పింది. ప్లీజ్ మీరంతా నా ఫాన్స్ ఐతే నా డేట్ ఆఫ్ బర్త్ ని బాగా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నా. గూగుల్ లో నా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు 38 ఏజ్ అని ఉంది అని చెప్పింది విష్ణు ప్రియా. ఇంతకు ప్రిద్వి నీ ఫేస్ చూసి ఏజ్ అలా పెట్టారు అన్నాడు. వెంటనే విష్ణుకి కోపం వచ్చేసింది. చెడ్డీ అంకుల్ రిలాక్స్ అనేసింది. ఓకే ఆంటీ అంటూ కౌంటర్ ఇచ్చాడు ప్రిద్వి. ఇక డెబ్జానీ వచ్చింది. ఈమె 1996 లో పుట్టినట్లు చెప్పింది.  తర్వాత శ్రవణ్ వచ్చాడు. 90 స్ లో పుట్టాను. అటు 80 స్ వాళ్ళను ఇటు 2000 లో పుట్టిన అన్నిటినీ చూసాం అని చెప్పాడు.  మగువ ఓ మగువ సీరియల్ లో కృతికతో కలిసి నటించాడు. జెన్ జి జనరేషన్ టీమ్ ని రిప్రెజెంట్ చేయడానికి ప్రిద్వి వచ్చాడు. నాగ పంచమి సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఇతను 1998 లో పుట్టినట్లు చెప్పాడు. అంటే నువ్వు కూడా పిల్ల బచ్చాగాడివే అనేసింది శ్రీముఖి.  ఇక అన్విత బుల్లితెర మీద సందడి చేసే ఈమె 2002 లో పుట్టిందట. ఇక శ్రీముఖి ఆమె వయసు విని 23 ఏళ్ళ నీకు ఇంత పిల్ల బచ్చాదానివా అంటూ కామెంట్ చేసింది. ఇక కృతిక కూడా వచ్చింది. మగువ ఓ మగువ సీరియల్ లో ఈమె నటించింది. ఈమె కూడా 2002 లో పుట్టినట్లు చెప్పింది. ఇక ఢీ షో ద్వారా ఫేమస్ ఐన మహేశ్వరీ వయసు అడిగేసరికి 1999 అని చెప్పింది. అంటే నువ్వు నిబ్బి కిందకు రాదు నిబ్బా కిందకు వస్తుంది అంటూ ఫన్నీ కౌంటర్ వేసింది శ్రీముఖి . ఇక  నైనికా అనసుర సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ఫుల్ ఫేమస్ ఐన ఈమె 2001 లో పుట్టినట్లు చెప్పుకొచ్చింది.

డాక్టర్ ని రిక్వెస్ట్ చేసిన కావ్య.. రాజ్ చూసేసాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -861 లో..... కావ్య అబార్షన్ చేయించుకోవడం లేదని ఇంట్లో వాళ్లంతా తనపై కోపంగా ఉంటారు. కావ్య ప్రసాదం తీసుకొని వస్తుంది.. ఎవరు తీసుకోరు. మేమ్ చెప్పినట్టు వినేవరకు నీతో అసలు మాట్లాడము.. అసలేం తినమని ఇందిరాదేవి చెప్తుంది. అయితే మీ ఇష్టమని కావ్య అక్కడ నుండి వెళ్లిపోతుంటే కళ్ళు తిరిగి కిందకిపడిపోతుంది కావ్య. అది చూసి అందరు కావ్య యాక్టింగ్ చేస్తుందనుకుంటారు. కావ్య నువ్వు చేసింది చాలులే.. లేవు ఇక అని స్వప్న అంటుంది. అయిన లేవకపోవడంతో దగ్గరికి వెళ్లి చూస్తారు.. అయ్యో కావ్య నిజంగానే పడిపోయిందనగానే అందరు వస్తారు. దాంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. డాక్టర్ కావ్యకి ట్రీట్ మెంట్ ఇస్తుంది. కావ్య ఇప్పుడు స్పృహలో లేదు కదా.. ఇప్పుడు అబార్షన్ చేయించి కావ్య ప్రాణాలు కాపాడాలని ఇందిరాదేవి, అపర్ణ కలిసి రాజ్ కి చెప్తారు. అలా చెయ్యడం తప్పని రుద్రాణి అంటుంది. తప్పే నిన్ను ఉండనిచ్చి తప్పు చేశామని రుద్రాణిపై అపర్ణ కోప్పడుతుంది. ఆ తర్వాత కావ్యకి అబార్షన్ చెయ్యండని రాజ్, అపర్ణ, ఇందిరాదేవి చెప్తారు. అలా పేషెంట్ కి తెలియకుండా చెయ్యడం తప్పని డాక్టర్ అంటుంది. అప్పుడే కావ్య రిపోర్ట్స్ నర్సు తీసుకొని వస్తుంది. అవి చూసిన డాక్టర్ రాజ్ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ రాజ్ ఇన్ని రోజులు అబార్షన్ చెయ్యాలని చెప్పాను కదా.. ఇక అవసరం లేదు బేబీ బాగుందని చెప్తుంది. దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత కావ్యని ఇంటికి తీసుకొని వస్తారు. ఇక ఇన్ని రోజులు జరిగిందంతా మర్చిపోండి.. మీకు నచ్చినట్లు డాక్టర్ చెప్పింది కదా అని ఇంట్లో వాళ్లతో కావ్య అంటుంది. తరువాయి భాగంలో ఎందుకు ఇలా చేసావ్ కావ్య అని రాజ్ అడుగుతాడు. నువ్వు డాక్టర్ ని రిక్వెస్ట్ చెయ్యడం నేను చూసానని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శివన్నారాయణ షాక్.. కాశీ అబద్ధం చెప్పాడని తెలుసుకున్న శ్రీధర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -498 లో.....సుమిత్ర మీ ఇంట్లోనే ఉన్నా మాకు చెప్పలేదు.. తన గురించి నా కొడుకు ఎంత క్షోభ అనుభవిస్తున్నాడు అయినా మీకు తన గురించి చెప్పాలనిపించలేదా అని శివన్నారాయణ అందరిపై విరుచుకుపడతాడు. నేను చెప్పేది వినండి అని కార్తీక్ మాట్లాడబోతుంటే.. నువ్వు నాకేం చెప్పకు నా కోడలుని నా ఇంటికి తీసుకొని వెళ్తాను.. అడ్డుపడితే నా మీద ఒట్టే అని శివన్నారాయణ అంటాడు. అత్తని తీసుకొని వెళ్తే అత్త బ్రతకదని కార్తీక్ అనగానే శివన్నారాయణ షాక్ అవుతాడు. నిజం తాతయ్య అని సుమిత్ర అన్న మాటలు  శివన్నారాయణకి దీప చెప్తుంది. నేను ఇక్కడ ఉన్నట్లు చెప్తే నేను చచ్చినంత ఒట్టే అని అమ్మ అంది అందుకే చెప్పలేదు తాతయ్య అని దీప అనగానే ఇంతసేపు వాళ్ళని తిట్టినందుకు గిల్టీగా ఫీల్ అవుతాడు శివన్నారాయణ. అత్తని మాములు మనిషిని చేసి ఇంటికి తీసుకొని వస్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఇక్కడ నుండి కూడా వెళ్తుందని కార్తీక్ అనగానే నువ్వు నాతో రా కార్తీక్.. అక్కడ నా కొడుకుని కూడా మార్చాలని శివన్నారాయణ అంటాడు. మరొకవైపు కాశీ హడావిడి గా ఆఫీస్ కి వెళ్తాడు. ఏంటి అంత హడావిడి అని స్వప్న తో శ్రీధర్ అంటాడు. మీటింగ్ ఉందట నాన్న అని స్వప్న చెప్తుంది. మరొకవైపు సుమిత్రతో కాంచన, దీప మాట్లాడుతారు. దశరథ్ అన్న మాటలు సుమిత్ర గుర్తుచేసుకొని బాధపడుతుంది. కాంచన, దీప తనని మార్చే ప్రయత్నం చేస్తారు అయిన సుమిత్ర నేను ఆ ఇంటికి వెళ్ళనని అంటుంది. ఆ తర్వాత కాశీ తన ఫ్రెండ్ తో ఉండడం శ్రీధర్ చూసి కాశీకి ఫోన్ చేస్తాడు. మావయ్య నేను మీటింగ్ లో ఉన్నానని అబద్దం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. నాకు జాబ్ రాలేదని మావయ్యకి తెలియకూడదని కాశీ అనుకుంటాడు. జాబ్ రాకున్నా వచ్చింది అని నాకే అబద్దం చెప్తావా అని కాశీ ఫోటో తీస్తాడు శ్రీధర్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దీపావళి పండుగకి కొడుకులకి కొత్త బట్టలు తీసుకున్న రామరాజు.. బొమ్మరిల్లు ఇదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -299 లో.....వేదవతి రెడీ అయి హాల్లోకి వచ్చి పేరుకే ముగ్గురు కోడళ్ళు కానీ ఒక్కరు కూడ  పూజకి ఏర్పాట్లు చెయ్యడం లేదని వేదవతి అంటుంది. ప్రేమ రెడీ అయి వచ్చి శ్రీవల్లి అక్క అని పిలుస్తుంది. శ్రీవల్లి రాత్రి జరిగింది గుర్తుచేసుకొని ప్రేమ ని చూసి బయపడి టేబుల్ కింద దాక్కుంటుంది. ఏంటి అక్క అక్కడ ఉన్నావని ప్రేమ అడుగుతుంది. ఏం లేదని శ్రీవల్లి కవర్ చేస్తుంది. నాకు తలనొప్పిగా ఉంది నువ్వు టీ బాగా పెడుతావ్ కదా అందుకే పెట్టమని పిలిచానని ప్రేమ అనగానే అంటే నీకు రాత్రి జరిగింది గుర్తు లేదా అని శ్రీవల్లి అడుగుతుంది. లేదు ఏం జరిగిందని ప్రేమ అడుగుతుంది. దాంతో వెంటనే శ్రీవల్లి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నర్మద, వేదవతి ఇద్దరు వచ్చి రాత్రి ఏం చేసావో తెలుసా అని జరిగింది చెప్తారు. అయ్యో అలా చేసానా నేను కూల్ డ్రింక్ తాగాను అంతే అని ప్రేమ చేప్తుంది. తిరుపతి వచ్చి కూల్ డ్రింక్ లో మందు కలిపానని చెప్తాడు. దాంతో తిరుపతిని వేదవతి తిడుతుంది. మరొకవైపు సేనాపతి డల్ గా ఉంటాడు. రేవతి వచ్చి త్వరగా రెడీ అవ్వండి.. దీపావళి సెలెబ్రేషన్స్ దగ్గరికి వెళ్ళాలనగానే సేనాపతి కోప్పడతాడు. నా చెల్లి, నా కూతురు ఈ ఇంటిని చీకటి చేశారని సేనాపతి ఆవేశపడుతుంటే.. విశ్వ వచ్చి నెక్స్ట్ దీపావళి వరకు ప్రేమ ఈ ఇంట్లో ఉంటుందని సేనాపతికి విశ్వ చెప్తాడు. విశ్వ పక్కకి రాగానే భద్రవతి వస్తుంది. ఇక లేట్ చేయను అత్త.. అనుకున్నది చేస్తానని భద్రవతితో చెప్తాడు. ఆ తర్వాత రామరాజు ముగ్గురు కొడుకులకి బట్టలు తీసుకొని వస్తాడు. ముగ్గురు కోడళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏం చూసారు ఇప్పుడు బొమ్మరిల్లు సీన్ నడుస్తుంది. ఆ బట్టలు వాళ్ళకి నచ్చవు అయినా మీదికి యాక్టింగ్ చేస్తారు. ఎప్పుడు అవే బట్టలని ముగ్గురు కొడుకులు అనుకుంటారు. కానీ పైకి మాత్రం బాగున్నాయ్ నాన్న అని చెప్తారు. అదంతా ముగ్గురు కోడళ్ళు చూసి నవ్వుకుంటారు. ముగ్గురు కొడుకు కోడళ్ళు వరుసగా వచ్చి రామరాజు, వేదవతి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పూజ దగ్గర కూర్చొని ఉంటారు. ప్రేమ జాకెట్ కి ఉన్న స్టోన్ లో ధీరజ్ షర్ట్ ఇరుక్కుంటుంది. మీ బంధం అంత త్వరగా వదలదని నర్మద అంటుంది. తరువాయి భాగంలో  రామరాజు ఇంటికి పోలీసులు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 రుద్రపై శకుంతల ఫైర్.. పెద్దసారు కూడా ఏం చేయలేకపోయాడుగా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -93 లో......మణి పైడిరాజు ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు . నేను మీ కూతురిని ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. నిద్రలో ఉంది కదా వెళ్లి తాళి కడతానని మణి చెప్పగానే పైడిరాజు సరే అంటాడు. ఆ తర్వాత గంగ నిద్రపోతుంటే మణి వచ్చి తాళి కట్టాలని అనుకుంటాడు. కానీ గంగని చూసి పెళ్లి తర్వాత మొదట శోభనం చేసుకుందామని తన దగ్గరికి వెళ్తాడు.  మరొకవైపు రుద్ర ఇంట్లో ఉన్న సూర్యని చంపడానికి సైదులు వెళ్తాడు. సూర్య అనుకోని రుద్ర దగ్గరికి వెళ్లి కత్తితో పొడవబోతుంటే రుద్ర ఆపుతాడు. సైదులు అక్కడ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. మరొక వైపు గంగ దగ్గరికి మణి వెళ్లి తనని ముట్టుకోబుతుంటే తన కడుపులో ఏదో ప్రాబ్లమ్ అయి ఆగిపోతాడు. ఆ తర్వాత సైదులు వెళ్లిపోతుంటే రుద్ర పట్టుకోవాలని ట్రై చేస్తాడు. ప్రీతి పీకపైన కత్తి పెట్టి దగ్గరికి వస్తే చంపేస్తానని ఇంట్లో అందరిని బెదిరిస్తాడు. రుద్ర బావ చెప్పింది నిజమే ఇతను ఆ సూర్యని చంపడానికే వచ్చాడని వీరు అంటాడు. దాంతో రుద్ర వంక శకుంతల కోపంగా చూస్తుంది. ఆ తర్వాత తనని వదిలిపెట్టమని సైదులుకి రుద్ర వార్నింగ్ ఇస్తాడు. వీరు వెళ్లినట్టు సైదులు దగ్గరికి వెళ్లినట్టు యాక్టింగ్ చేసి చేతికి గాయం చేసుకుంటాడు. సైదులు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎవరికోసమే వీళ్ళ ప్రాణాలు తీస్తావా అని రుద్రపై శకుంతల కోప్పడుతుంది. ఇప్పుడే అతన్ని ఇక్కడ నుండి పంపించాలని శకుంతల కోప్పడుతుంది. పెద్దసారు కూడా శకుంతలకి సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ సీజన్-9 లో ఇక ఆ ట్రిక్ ఉండదు.. అదేంటంటే!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం పూర్తయింది. ‌ఇక ఈ ఏడో వారంలో హౌస్ లో ఎవరేం తప్పులు చేశారో చెప్తూ వారిని నాగార్జున తిడుతుంటాడు.  కంటెస్టెంట్స్ కి హోస్ట్ కి మధ్య యుద్ధం.. ఇది చూడటానికి మేమంతా సిద్ధం అన్నట్టుగా ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. అయితే నాగార్జున మంచి సాంగ్ కి డ్యాన్స్ చేసి వచ్చేశాడు. అయితే ఈ వారం ఎవరిపై అంత సీరియస్ అవ్వలేదు నాగార్జున. ఎందుకంటే అంతగా పొరపాట్లు ఏం చేయలేదు కంటెస్టెంట్స్. ఇక ప్రతీ శనివారం, ఆదివారం నాగార్జునతో పాటుగా కొంతమంది ఆడియన్స్ వస్తారు. అయితే ఈ సీజన్-9 లో ఏం జరిగిందంటే.. మొదటి వారం ఓ ఆడియన్ అమెరికా నుండి వచ్చినట్టు చెప్పగా, రెండో వారం ఆడియన్ ఒకరు లండన్ నుండి వచ్చానని చెప్పింది. అయితే తను కరెక్ట్ గా లండన్ నుండే వచ్చింది. ఎందుకంటే తనకి ఓ‌ యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. లండన్ కి తను వెళ్తున్న వీడియోస్, అక్కడ తను చేసిన వ్లాగ్స్ కూడా ఉన్నాయి. తన మీద మొదట ట్రోల్స్ వచ్చినా అందరు నిజం తెలుసుకొని వదిలేశారు. అయితే గత వారం ఓ ఆడియన్ తను దుబాయ్ నుండి వచ్చానని చెప్పింది. అయితే తను ఇన్ స్టాగ్రామ్ లో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతు రీల్స్ చేస్తుంటుంది. ఇక తను బిగ్ బాస్ షోకి వచ్చింది. అందులో ఆడియన్ గా వచ్చి .. దుబాయ్ నుండి వచ్చానని చెప్పటంతో .. బిగ్ బాస్ మావపై ఫుల్ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక ఈ ట్రోల్స్ బిగ్ బాస్ దాకా చేరినట్టుగా ఉన్నాయి అందుకే నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో లండన్,అమెరికా, దుబాయ్,  ఆస్ట్రేలియా లాంటి  పేర్లేమీ వినబడలేదు. మరి బిగ్ బాస్ వాడిన ఈ ట్రిక్ ని మానేశాడని మీకు అర్థం అయ్యిందా.. అయితే ఏం అబ్జర్వ్ చేసారో కామెంట్ చేయండి.

రాము మనిషిలా కనపడట్లేదా.. తనూజకి నాగార్జున వార్నింగ్!

తనూజకి వార్నింగ్.. రీతూకి చివాట్లు.. సంజనకి పెద్ద క్లాస్.. ఇమ్మాన్యుయల్ ఇన్ కన్ఫ్యూషియస్.. ఇదంతా చేసింది మన నాగార్జున. అదే బిగ్ బాస్ సీజన్-9 హోస్ట్ నాగార్జున. అయితే ఒక్కో దానికి ఒక్కో కారణం ఉంది. అయితే వాటిల్లో ప్రతీ నామినేషన్లో ఉండే తనూజ నిజస్వరూపాన్ని ఆడియన్స్ కి వీడియో వేసి మరీ చూపించాడు నాగార్జున. నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో.. తనూజని లేపి అసలు మీ ప్రాబ్లమ్ ఏంటమ్మా అంటూ నాగార్జున అడిగాడు. దాంతో తను షాక్ అయింది. రాము రాథోడ్ నీకు మనిషిలా కనిపించడం లేదా.. మెతకగా ఉన్నాడని చులకనా అంటూ తను రాముని అవమానించిన వీడియోని ప్లే చేసి మరీ చూపించాడు నాగ్ మామ.  నిన్నటి వరకు జరుగిన దొంగల టాస్క్ లో జరిగిన ఈ ఇష్యూని పెద్ద ఇష్యూగా చూపించాడు నాగ్ మామ. అసలేం జరిగిందంటే.. వాంటెడ్ పేట టాస్క్ లో తనూజ, సాయి, రీతూ మాట్లాడుకుంటుండగా.. రాము రాథోడ్ మధ్యలో వెళ్లి కూర్చుంటాడు. తనూజ అసహనంతో అక్కడి నుంచి రీతూ, సాయిని తీసుకుని వెళ్లి రాముని అవమానపరుస్తుంది. ఇది కరెక్ట్ కాదని, మనుషులకు వాల్యూ ఇవ్వాలంటూ తనూజకి నాగార్జున చీవాట్లు పెట్టాడు.  ఆ తర్వాత తనూజ, రీతు చౌదరి ఇద్దరి అసలేం జరిగిందో నాగార్జునకి తెలియజేశారు.

హౌస్ లో‌ ఎవరికి ఏం ట్యాగ్ వచ్చిందంటే!

బిగ్‌బాస్ సీజన్-9 లో ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ క్రేజీగా సాగింది. ఇందులో నాగార్జున ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ గట్టిగా కోటింగ్ ఇచ్చేశాడు. అయితే వారి తప్పులని చెప్పేముందు హౌస్ మేట్స్ చేత ట్యాగ్‌లు వేపించాడు. ఎవరేంటో.. ఎందుకో కారణం చెప్తూ ప్రతీ కంటెస్టెంట్ ఈ ట్యాగ్ లని వేయాలంటూ కొన్ని ట్యాగ్ లు తీసుకొచ్చాడు నాగార్జున. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. ముందుగా కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ కు కంగ్రాట్స్ చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత బ్యాండ్ లు ఇవ్వమన్నాడు నాగార్జున. మొదటగా రమ్య లేచి మాధురికి ఫేక్ బాండ్స్ అనే ట్యాగ్ ఇచ్చింది. తను హౌస్ లోకి వచ్చినప్పుడు బాండ్స్ వద్దు అన్నది. ఇప్పుడు తనూజాతో అవే బాండ్స్ పెట్టుకుంటోంది. అది కూడా ఫేక్ అని నాకు అనిపిస్తోందంటూ రమ్య చెప్పింది. బాండ్స్ వద్దు అనుకుంటున్న ఆమె నాతో ఎందుకు బాండ్స్ ఎందుకు కోరుకుంటోందని మాధురి ప్రశ్నించగా.. తనూజను ఇదే బాండ్ రీజన్ తో నామినేట్ చేశావు. బాండ్ అనుకుని గేమ్ లో వెనకబడుతున్నావని నాగార్జున అన్నాడు. తనూజా నీది మాధురిది ఫేక్ బాండా..  నాన్నను రాజుతో రీప్లేస్ చేశావా అని తనూజని నాగార్జున అడుగగా.. నాన్న బాండ్ అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు దగ్గర అవుతున్నారు. ఇది నా గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పాను. ఆమె లేదు నేను జెన్యూన్. నీతోనే ఉంటానని అన్నారని తనూజకి మాధురి చెప్పిందని ఓ క్లారిటీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత రమ్యకు తనూజా మానిప్యులేట్ ట్యాగ్ ఇచ్చింది. సాయి - రమ్య - మాధురి గొడవ మిస్ కమ్యూనికేషన్ అంటూ నాగ్ క్లియర్ చేశాడు. ఆ తర్వాత ఏం ఆడావ్ పవన్  అంటూ డీమాన్ పై ప్రశంసలు కురిపించాడు నాగార్జున. మేము చేస్తే బ్యాక్ స్టాబింగ్, మీరు చేస్తే ఆటనా అంటూ కళ్యాణ్ కి ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ ను ఇచ్చాడు డీమాన్ పవన్‌.  ఫౌల్ మౌత్డ్ ట్యాగ్ ను మధురికి ఇచ్చింది రీతు. కెప్టెన్సీ టాస్క్ లో రీతూ చేసింది వెన్నుపోటు అంటూ రీతూ మొహం మీదే చెప్పేశాడు నాగార్జున. మాధురి బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి. బిగ్ బాస్ హౌస్ లో కాదు. ఇలాంటి కఠినమైన పదాలు వాడొద్దంటూ మాధురికి నాగార్జున వార్నింగ్ ఇవ్వగా తను సారీ చెప్పింది. ఆ తర్వాత ఇన్ సెక్యూర్ ట్యాగ్ ను మాధురికి ఇచ్చింది సంజన. 

 సేఫ్ గేమ్ ఆడొద్దంటూ ఇమ్మాన్యుయల్ ని నెగెటివ్ చేసిన హోస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం ఆసక్తికరంగా సాగింది. అందులో కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, తనూజల మధ్య నామినేషన్  లో జరిగిన ఇష్యూ గురించి నాగార్జున మాట్లాడాడు. మొదటగా నువ్వు మాట్లాడినప్పుడు నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని ఇమ్మాన్యుయల్ తో చెప్పావని కళ్యాణ్ ని నాగార్జున అడిగాడు. తనూజ సర్ అని కళ్యాణ్ చెప్పాడు. మరెందుకు చేయలేదని నాగార్జున అడుగగా.. అంటే అప్పటికే తనూజని రమ్య నేను అనుకున్న పాయింట్స్ తో నామినేట్ చేసింది.. అందుకే చేయలేదు .. అందులో నాదే తప్పు సర్.. నేను చెప్పిన పేరు నామినేట్ చేయలేదని కళ్యాణ్ ఒప్పుకున్నాడు. నువ్వు స్లిప్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మాట స్లిప్ అయ్యాడని ఫీలయ్యావా అని ఇమ్మాన్యుయల్ నాగార్జున అడిగాడు. అవును సర్.. అంటే అప్పటికప్పుడు పేరు ఎందుకు మార్చుకున్నాడు.. అవతలి వ్యక్తికి తను నామినేట్ చేద్దామనుకున్న విషయం తెలియకూడదని అలా చేశాడా.. అనేది నాకు అర్థం కాలేదు సర్.. అందుకే కళ్యాణ్.. తనని నామినేట్ చేద్దామనుకున్న పాయింట్ తనూజకి తెలియాలనే అక్కడ ఆపి మరీ చెప్పాను సర్.. అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. అతను చెప్పినట్లు తనూజని నామినేట్ చేయలేదని నీకు కోపం వచ్చిందా లేక సంజనని చేశాడని నీకు కోపం వచ్చిందా అని ఇమ్మాన్యుయల్ ని నాగార్జున అడిగాడు. సంజన గారిని చేశాడని నాకు కోపమేమి రాలేదు సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు.  స్లిప్ కోసం నిన్ను మోసం చేశాడు అంతేనా.. నువ్వు కళ్యాణ్‌ని సేఫ్ అంటున్నావ్.. మరి నీ దగ్గరున్న స్లిప్ కళ్యాణ్‌కి ఇచ్చే బదులు అది నీ దగ్గరే ఉంచుకొని నువ్వే నామినేట్ చేయొచ్చు కదా.. సేఫ్ ఆడావా.. అని నాగార్జున అడుగగా.. లేదు సర్ తనూజని నామినేట్ చేయాలన్నది నా లక్ష్యం కాదు సర్.. ఒకవేళ తనూజని నేను నామినేట్ చేయాలంటే నాకు సింగిల్ పాయింట్ మాత్రమే ఉంది.. అది కూడా పాయింటా లేక నేను అపార్థం చేసుకున్నానా అన్నది నాకు అర్థం కాలేదు.. అందుకే ఆ ఒక్క పాయింట్ మీద తనని నామినేట్ చేయాలని నేను అనుకోలేదు.. అందుకే తనకి ఇచ్చేశానని ఇమ్మాన్యుయల్ అన్నాడు. అంటే నీకు నామినేట్ చేయాలని అనిపించలేదు కానీ కళ్యాణ్‌తో నామినేట్ చేయించాలని అనిపించింది అంతేనా అని నాగార్జున అడుగగా.. కళ్యాణ్‌తో నామినేట్ చేయించాలని అనుకోలేదు సర్.. ఎందుకంటే అలా అయితే రమ్య ఆల్రెడీ తనూజని నామినేట్ చేస్తానని చెప్పింది.. అందుకే వాళ్లు వాళ్లు చూసుకుంటారని వాళ్లిద్దరికి ఇచ్చేశా.. కళ్యాణ్ అనే వ్యక్తి తనూజ పేరు చెప్పగానే నేను షాకయ్యాను.. తన చుట్టూనే ఉంటాడు కదా అలాంటి వ్యక్తి ఏం చెప్తాడా అని నేను చూశాను.. అంతేకానీ తను నామినేట్ అవ్వాలి తను ఎలిమినేట్ అవ్వాలనేది నా మైండ్‌లో లేదు సర్.. అని ఇమ్మాన్యుయల్ క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ కళ్యాణ్ నీ దగ్గర స్లిప్ తీసుకునే టైమ్‌లో సంజనని నామినేట్ చేస్తానని చెప్తే ఇచ్చేవాడివా అని నాగార్జున అడిగితే.. ఇవ్వను సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. తనూజనే కాదు ఎవరిని నామినేట్ చేస్తానన్నా కళ్యాణ్‌కి స్లిప్ ఇస్తానని ఇప్పుడే చెప్పావ్ కదా అని నాగార్జున అన్నాడు. లేదు సర్ సంజన గారిని నామినేట్ చేస్తానంటే ఆలోచించేవాడ్ని అన్నాను సర్ అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఇమ్మాన్యుయల్ మాటలు విన్న తర్వాత నాగార్జున వీడియో ప్లే చేశాడు. ఇందులో కళ్యాణ్‌తో ఇమ్మాన్యుయల్ చాలా క్లియర్‌గా తనూజని నామినేట్ చేయడం గురించి మాట్లాడాడు. నీరు పోసి చచ్చిపోతున్న మొక్కని పెంచినట్లయిందంటూ కళ్యాణ్ తో ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఈ వీడియో చూసి తనూజ షాకైంది. ఇప్పుడు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినదానికి అక్కడ వీడియోలో ఉన్నదానికి ఏమైనా సంబంధం ఉందా ఇమ్మాన్యుయల్ అని నాగార్జున అడుగగా.. సర్ అంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత వాడొచ్చి సారీ చెప్తుంటే నేను అది చెప్పాను సర్.. ఇచ్చిన మాట తప్పితే నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది.. సర్లే అయిపోయింది ఏదో అయిపోయింది అన్నట్లు చెప్పాను సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. నీళ్లు పోసి పెంచడం అన్న పాయింట్ అవసరమా అని నాగార్జున అన్నాడు. అది పర్సన్ గురించి చెప్పలేదు సర్.. అన్నా నాకు నమ్మకం పోతుందని వీడు చెప్పాడు.. నా వల్ల కావట్లేదని చెప్పుకుంటూ వచ్చాడు.. నీకు నమ్మకం పోయినప్పుడు నువ్వు ఉన్నదాని మీదే ఉండాలి కదా.. ఆల్రెడీ పోయినదాన్ని నువ్వు నీళ్లు పోసుకొని పెంచుకుంటున్నావ్.. ఒకసారి నువ్వు చూడు ఈరోజు కూడా గమనించు అని చెప్పా సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. వెంటనే చచ్పిపోయిన మొక్క ఒకసారి లే అమ్మా అంటూ తనూజని పిలిచాడు నాగార్జున. ఆ వీడియో మీద నీ అభిప్రాయం ఏంటని అడిగితే.. నేను షాకవుతున్నా సర్.. నిజానికి మీరు అడిగిన ప్రశ్నే నేను ఇమ్మాన్యుయల్ ని అడిగా.. ఒకవేళ నీకు నామినేట్ చేయాలంటే నువ్వే చేయొచ్చు కదా అని అన్నా.. ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని అడిగా.. కానీ ఇంత జరిగిందని నాకు తెలీదు సర్ అని తనూజ చెప్పింది. ఇమ్మాన్యుయల్ నువ్వు గ్యారెంటీగా సేఫ్ ఆడావ్ ఇక్కడ.. నీ దగ్గరున్న పాయింట్ చిన్నదా పెద్దదా అన్న విషయం పక్కన పెట్టు.. నువ్వు స్లిప్ ఇచ్చి తనూజని నామినేట్ చేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేశావ్.. నువ్వు అనుకున్నది జరగకపోయేసరికి చిన్న కోపం వచ్చింది.. దీనికి తోడు సంజనని నామినేట్ చేసేసరికి బాధ వచ్చేసింది.. నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఒక్కటే.. మనం అందరినీ మెప్పించలేం.. అందరి దృష్టిలో మంచిగా ఉండలేం.. సేఫ్ మాత్రం ఆడొద్దు.. నీకు పాయింట్ ఉంటే నువ్వే చెప్పు.. వేరే వాళ్లని అస్త్రాలు చేయాల్సిన పని లేదు.. నీ దగ్గరే పవరాస్త్ర ఉందంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి తనూజ దృష్టిలో ఇమ్మాన్యుయల్ ని సేఫ్ గేమర్ ని చేశాడు నాగార్జున. ఈ ఇష్యూలో ఎవరిది తప్పో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu Voting: డేంజర్ జోన్ లో రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి.. బిగ్ షాక్ ఇవ్వనున్న బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం దొంగల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో సంజన వర్సెస్ మాధురి ఆడారు. ఈ  టాస్క్ లో సుమన్ శెట్టి, తనూజ, రీతూ, దివ్య నిఖిత బాగా ఆడారు. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నుండి ఒకరు ఎలిమినేషన్ ఫిక్స్. ఎందుకంటే లీస్ట్ లో వాళ్ళిద్దరే ఉన్నారు.  రీతూ చౌదరి, సాయి, రాము రాథోడ్, తనూజ, రమ్య మోక్ష, కళ్యాణ్ పడాల, సంజన, దివ్య నిఖిత ఈ ఏడుగురు ఏడవ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో డేంజర్ కంటెస్టెంట్‌గా ఉన్న రమ్య మోక్షని ఇంటికి పంపేందుకు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకే తమకి అన్ అఫీషియల్ పోలింగ్ లో ఎందులో చూసినా లీస్ట్ ఓటింగ్‌ పడుతోంది. అయితే తనూజ మాత్రం ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్‌ తో నెంబర్ వన్ లో కొనసాగుతుంది. తనూజ తర్వాత స్థానంలో కళ్యాణ్ పడాల ఇరవై శాతం ఓటింగ్ తో ఉన్నాడు. ఇక దివ్య నిఖిత పదకొండు శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంది. దివ్య హౌస్ లో పర్ ఫెక్ట్ గెస్ చేస్తోంది. వ్యాలిడ్ రీజన్లు చెప్తూ నిజాలు మాట్లాడుతూ ఫెయిర్ గా ఆడుతున్న దివ్యకి ఓటింగ్ గట్టిగానే ఉంది. ఈ వారంలో దివ్య టాప్-3లోకి వచ్చేసింది. శ్రీనివాస్ సాయికి పెద్దగా ఓటింగ్ లేదు.. అతని కంటెంట్ ఏం లేదు.. ఇంతవరకు ఏ టాస్క్ లో అతను కనపడలేదు. ఏదో నామమాత్రం హౌస్ లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అయితే ఎలాగైనా రమ్య మోక్షని హౌస్ నుంచి బయటకు పంపాలనే ఉద్దేశంతో ఎవరు ఓటింగ్ వేయడం లేదు. అంటే ఈ రమ్య మోక్ష హౌస్ లో ఉండటం కంటే బయటకి పంపించాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయమనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.