పవన్ కళ్యాణ్ తెలిసే మాట్లాడటం లేదు..నాగబాబు అలా చెప్పడం కరెక్ట్ కాదు

  నటి మాధవి ఏ విషయంలో ఐనా కానీ కరెక్ట్ కాదు అనుకుంటే వెంటనే ఫైర్ ఐపోతుంది. అలాంటి మాధవి ఇప్పుడు జానీ మాష్టర్ విషయంలో మండిపడింది. దీని మీద ఒక వీడియోని రిలీజ్ చేసింది "పవన్ కళ్యాణ్ ఈ విషయం పై ఎందుకు మాట్లాడ్డం లేదు..ఆయనకు ఈ విషయం గురించి తెలిసే ఆయన అసలు మాట్లాడ్డం లేదు. పార్టీ వేరు..వ్యక్తిత్వం వేరు..జానీ మాష్టర్ గిరినుంచి నాగబాబు పోస్ట్ పెట్టడం ఎం బాలేదండి. ఐనా నాగబాబు గారు మీకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి చాలా చిన్నది. జనసేనకు సపోర్ట్ చేసాడు కదా అని మీరు జానీకి సపోర్ట్ చేయడం ఏమీ బాలేదు. అలాగే మహాసేన రాజేష్ కూడా ఈ విషయం మీద ట్రోల్ చేసాడు. మీ ఫాలోయర్స్ ని తప్పు దారి పట్టించొద్దు. జానీ అనే వాడు మీకు మంచి వ్యక్తి అయ్యుండొచ్చు కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం విలన్ ..పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్ లో జానీ మాష్టర్ వచ్చి ఆ అమ్మాయిని కొట్టి తిట్టి రచ్చ చేసాడు సుకుమార్ గారు దాని పంచాయతీ చేశారు తర్వాత విశ్వక్ సేన్ మూవీ షూటింగ్ లో ఆ అమ్మాయి కోరియోగ్రఫీ చేస్తుంటే అక్కడికి జానీ మాష్టర్ వచ్చి రచ్చా చేసాడు. జానీ మాష్టర్ ఆ అమ్మాయి సెల్ కి వందల మెసేజెస్ పంపించాడు. ఐ మిస్ యు, ఐ లవ్ యు, మతం మారు, పెళ్లి చేసుకో, షూటింగ్ స్టాప్ చేసి నన్ను కలవు లేదంటే చంపేస్తాను ఇలా టార్చెర్ మెసేజెస్ అన్నీ పంపిస్తూ ఉంటాడు. ఎన్నో మూవీస్ కి ఛాన్సెస్ వస్తే వాటిని క్యాన్సిల్ చేయించాడు జానీ మాష్టర్. టాలెంట్ పరంగా గొప్పోడు అయ్యుండొచ్చు కానీ వ్యక్తిత్వం పరంగా మాత్రం గొప్పోడు అయ్యుండక్కర్లేదు.    

అభయ్ నవీన్.. బూతు పురాణం!

  బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు పెరిగే కొద్దీ కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ గొడవలు జరుగుతున్నాయి. ఈ వారం మొదలైన అన్ని టాస్క్ లలో కంటే ప్రభావతి 2.0 టాస్క్ లో హౌస్ మేట్స్ మధ్య తీవ్రమైన ఆర్గుమెంట్స్ జరుగుతున్నాయి. సోనియా, నిఖిల్, పృథ్వీ కలిసి ఆడే ఆటలో మిగిలిన వాళ్ళంతా మానసికంగా బాధపడుతున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు అభయ్ నవీన్ చేరాడు. అసలేం జరిగిందో‌ ఓసారి చూసేద్దాం. నిన్న హౌస్ లో బిగ్ బాస్ కొన్ని రూల్స్ చెప్పాడు. కంటెస్టెంట్స్ అందరిని సోఫాలో‌ కూర్చోబెట్టి.. బిగ్‌బాస్ ఇంటి కిచెన్‌లో ఇక నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్‌లో ఒక్క సమయంలో ఒక్క టీమ్ మాత్రమే వంట చేయాలి. అలానే ఒక టీమ్ వంట చేసేటప్పుడు ఆ టీమ్‌కి సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్‌లో ఉండాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయడం కూడా లెక్కలోకి తీసుకుంటామంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇది విన్న వెంటనే కంటెస్టెంట్ల ముఖాలన్నీ మాడిపోయాయి. ఇక కాంతార చీఫ్ అభయ్ అయితే మనిషి పుట్టుక పుట్టారా లేదా అసలు ఈ రూల్స్ రాసినోళ్లు.. అంతమందికి ముగ్గురు ఎలా వండుతారా ధమాక్ లేదు మీకు.. తినడానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండటానికి పెడుతున్నారా.. నీయమ్మా సైకోగాళ్లు.. పిచ్చి రూల్స్.. సైకోగాడు బిగ్‌బాస్ అంటూ రెచ్చిపోయాడు. ఇక ప్రభావతి ఎగ్స్ టాస్క్ లో  అభయ్ నవీన్ చేతులెత్తేశాడు. వాళ్ళ టీమ్ అంతా ఎగ్స్ కోసం కష్టపడుతుంటే ఏం పట్టనట్లు కూర్చున్నాడు. ఇది చూసి బిబి ఆడియన్స్ అతడిని ట్రోల్స్ చేస్తున్నారు. ఈట్ ఫై స్టార్ డూ నథింగ్ అనే క్యాప్షన్ పెట్టి అభయ్ ఖాళీగా కూర్చొని ఉన్న ఫోటోని ఆడ్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. బెలూన్స్ టాస్క్ లో నిఖిల్ కి ఫెయిర్ గా సోనియా రిజల్ట్స్ చెప్పడంతో అలిగిన అభయ్.‌. కోపంతో బిగ్ బాస్ పెట్టే ఏ టాస్క్ ఆడనని ఫుల్ ఫ్రస్టేషన్ తో చెప్పాడు. ఇక మరోవైపు వాళ్ళ టీమ్ లోని ఆదిత్య, ప్రేరణ, నబీల్, యష్మీ, మణికంఠ అంతా కలిసి ఛీఫ్ లేకుండా సరైన గేమ్ ని ఆడలేకపోతున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ వారం అభయ్ కి ఓటింగ్ కూడా తక్కువే ఉండేలా ఉంది. మరి హౌస్ లో అభయ్ ఇలా ఉండటం ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.  

నిఖిల్ ని టచ్ చేస్తూ సోనియా...బిగ్ బాస్ హౌసా లేక ఓయో రూమా!

బిగ్ బాస్ హౌస్ లో గత సీజన్ లో రతిక, ఈ సీజన్ లో సోనియా ఇద్దరు ఇద్దరే అన్నట్టుగా ఉంది.‌ అయితే  సోనియా మాత్రం చిన్నోడు, పెద్దోడు అంటు కొత్తగా ట్రాయాంగిల్ ట్రాక్ నడిపిస్తోంది. హౌస్ లో ఫస్ట్ వీక్ నిఖిల్ సూపర్ ఫామ్ లో ఉండేవాడు. హౌస్ కి లీడర్ గా అనిపించేవాడు కానీ పృథ్వీ, సోనియా, నిఖిల్ కలిసి చేసే యవ్వారాలు తేడాగా ఉన్నాయి. అయితే మిగిలిన హౌస్ మేట్స్ ఇవన్నీ గమనిస్తున్నారా లేదా అనేది తెలియదు కానీ హౌస్ లో ఇలా కిస్, హగ్గుల‌ కోసం పరితపించే బ్యాచ్ అది. బిగ్ బాస్ సాంగ్ వేస్తే హౌస్‌లో ఉన్న వాళ్లు డాన్స్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ అస్సలు కష్టపడటం లేదు.. పాట వేసి డాన్స్ కాదు కదా.. కనీసం నిద్రలో నుంచి లేవడం కూడా చేయడం లేదు. అయితే ప్రతిరోజు లాగే పాట వేశారు.. సోనియా కుర్చీలో కూర్చోని ఉండగా.. పెద్దోడు నిఖిల్ వెళ్లి.. ఏంటి స్టెప్‌లు వేయలేదు అని అడిగాడు. దాంతో సోనియా.. ‘స్టెప్ రావడం లేదురా నాకు నువ్వు లేకపోతే అంటూ.. అతని కుడిచేతి పై బాగాన్ని వెనుక వైపు నుంచి పట్టుకుంది. ఆమె చేతి వేళ్లతో మెల్లగా తడుముతూ అలా ముందుకు పోనిచ్చింది. అయితే పెద్దోడు ఓ వైపు ఈ సరసాలను ఎంజాయ్ చేస్తూనే చెయ్ తియ్ అని అన్నాడు. అప్పుడు సోనియా నవ్వుతూ.. నిన్ను కూడారా.. నెక్స్ట్ నువ్వే.. నీ దగ్గరక వస్తున్నానంటూ అతని చేతిని వదిలిపెట్టి.. మెల్లగా అతని గుండెలపైకి వేళ్లని పోనిస్తూ.. ప్రైవేట్ పార్ట్‌ని నొక్కుతూ కనిపించింది సోనియా. దాంతో నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ.. రేయ్ రేయ్ ఏం చేస్తున్నారా.. యాక్ థూ.. ఏం చేస్తున్నావ్ సోనియా.. ఇది బిగ్ బాస్ హౌసా లేదంటే ఓయో రూమా నా.. అతన్ని ఎక్కడ టచ్ చేస్తున్నావో.. ఏం చేస్తున్నావో అర్థమౌతుందా అటూ కామెంట్లు చేస్తున్నారు. మరి సోనియా బిహేవియర్ కరెక్టేనా.. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

మణికంఠ హగ్గు భాగోతం.. నువ్వు చేసే పనులేంట్రా అంటూ నెటిజన్లు ఫైర్!

  బిగ్‌బాస్ హౌస్ లో‌ నాగ మణికంఠ బిహేవియర్ మరీ వరెస్ట్ గా ఉంది.‌ ఎంతలా అంటే  లేడి కాంటెస్టెంట్స్ తో అతను ప్రవర్తిస్తున్న తీరు‌ వైరల్ గా మారింది.‌ అసలేం జరిగిందో‌ ఓసారి చూసేద్దాం. ప్రభావతి టాస్క్ మధ్యలో కాస్త గేమ్ పాజ్ అయినప్పుడు..‌బయట ఉన్న ‌సోనియాని లోపలికి తీసుకెళ్ళాడు మణికంఠ.  ఇక అక్కడికెళ్ళాక‌ అటు‌ ఇటు‌ చూడగా.. ఏంట్రా మ్యాటర్ చెప్పమని సోనియా అడిగితే నాకు ఒక హగ్గు కావాలి అక్కా అంటూ బాంబు పేల్చాడు మణికంఠ. దీనికి కాస్త షాకైన సోనియా ఏం కావాలంటూ మళ్లీ అడిగింది. అయినా సరే నాకు హగ్గు కావాలంటూ మళ్లీ అడిగాడు మణికంఠ. వామ్మో.. నేను గేమ్ ఆడాలిరా ఇప్పుడు.. హగ్గు ఇస్తే ఎనర్జీ అయిపోతుందంటూ సోనియా అంది. దీనికి నవ్విన మణికంఠ.. ఏంటో ఏడ చూసినా కెమెరాలే ఉన్నాయంటూ దిక్కులు చూశాడు. కాసేపటికే సరే రా అంటూ సోనియా ఓ టైట్ హగ్గు ఇచ్చింది. అయితే ఇక్కడ అక్కా అక్కా అంటూ వెంటపడుతూ హగ్గులేందిరా అయ్యా అంటూ నెటిజన్లు మణికంఠను ఉతికారేస్తున్నారు. ఏదో బాధలో ఉన్నప్పుడు దగ్గరికి తీసుకొని ఓదారిస్తే ఓ అర్థం ఉంది కానీ మాటిమాటికి ఇలా వచ్చి హగ్గు కావాలంటూ తీసుకోవడం ఏంటో అర్థం కాలేదు. ఇదేదో ఒక్కసారి జరిగితే ఓకే కానీ మొన్నా మధ్య ఇలానే సోనియా బుగ్గ మీద అందరి ముందూ ఓ కిస్ కూడా ఇచ్చాడు మణికంఠ. అలానే నైనికకి కూడా మొదట్లో ఓ ముద్దు ఇచ్చాడు. రీసెంట్‌గా యష్మీ వద్దన్నా మణికంఠ వెనకాల నుంచి వాటేసుకున్నాడు. ఇక హౌస్ లో మణికంఠ వేషాలు చూసి నైనిక గడ్డి పెట్టింది. నువ్వు ఇక్కడ అందిరితోనూ ప్రేమలో ఉన్నావ్ అంటూ నైనిక అంది. దీనికి అది ప్రేమ కాదు ఎఫెక్షన్ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు మణికంఠ. కానీ నైనిక మాత్రం వదల్లేదు. మరి అందరితో వద్దమ్మా.. నీకు వైఫ్ ఉన్నప్పుడు వైఫ్‌తో ఉండాలి.. ఇలా ముద్దులు పెడుతూ హెల్తీ ఫ్లర్టింగ్ అనకూడదు.. పెళ్లి అయిన తర్వాత ఫ్లర్టింగే ఉండకూడదంటూ నైనిక  చెప్పగా మణికంఠ మొఖం మాడ్చేశాడు.  

Karthika Deepam2 : మామయ్య అక్రమ సంబంధం చూసి జ్యోత్స్న షాక్.. ఆమె ప్లాన్ ఏంటంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -154 లో..... కార్తీక్ దగ్గరికి దీప వస్తుంది. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ మీ అమ్మగారికి నిజం చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుందని దీప అనగానే.. మా నాన్నని దేవుడు అనుకుంటుంది అమ్మ.. ఇప్పుడు ఈ విషయం చెప్తే తట్టుకోలేదని కార్తీక్ అంటాడు. నిజం ఎప్పటికైనా తెలుస్తుందని కాంచన అంటుంది. అంతా వినేసిందా అని కార్తీక్ , దీపలు టెన్షన్ పడుతారు. ఏంటి ఏదో నిజం తట్టుకోలేదనుకుంటున్నారని కాంచన అంటుంది. అదేం లేదని కార్తీక్ డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత అమ్మ మీకు ఇలా కాళ్ళు లేకున్నా గుండె దైర్యంతో బ్రతుకుతున్నారు. అదే మనసుకి గాయమైతే తట్టుకుంటారా అని దీప అడుగుతుంది.  నా భర్త నా కొడుకు వీళ్ళ విషయం లో ఏం జరిగిన నేను తట్టుకోలేను దీప అని కాంచన అంటుంది. అమ్మకి నాన్న రెండో పెళ్లి విషయం ఎప్పటికి తెలియనివ్వకూడదని కార్తీక్ అనుకుంటాడు. మీకు నిజం తెలియకుండా జాగ్రత్త పడాలని దీప అనుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతంలు కాశీ చెప్పిన ప్లేస్ కి వస్తారు. నన్ను ఎందుకు పిలిచారని జ్యోత్స్న అంటుంది. ఎంతైనా కాశీ నీ తమ్ముడు అని పారిజాతం అనగానే.. అలాంటి డైలాగ్ కొట్టకు.. నేను సుమిత్ర, దశరత్ ల కూతురిని అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత కాశీ వస్తాడు. అదే స్వప్న వాళ్ళ ఇల్లు ఎలాగైనా మా పెళ్లికి మీరే వాళ్ళ నాన్నని ఒప్పించాలని కాశీ అంటాడు. సరే అంటూ పారిజాతం వెళ్తుంటే.. శ్రీధర్ ఫోన్ మాట్లాడుతూ కన్పిస్తాడు. అతన్ని చూసి పారిజాతం షాక్ అవుతుంది. జ్యోత్స్నకి చూపిస్తుంది. అతనే మా మావయ్య అని కాశీ చెప్తాడు. అప్పుడే కావేరి వస్తుంది. తను మా అత్తయ్య అని చెప్పగానే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు షాక్ అవుతారు. నాకేం అర్థం అవ్వడం లేదని  జ్యోత్స్న అనగానే.. నాకు అర్థం అయిందని పారిజాతం అంటుంది. కాశీ నువ్వు వెళ్ళు మేం మాట్లాడుకుంటామని అతన్ని పారిజాతం పంపిస్తుంది. మావయ్య ఏంత మోసం చేసాడని జ్యోత్స్న అంటుంది. ఈ విషయం తాతయ్యకి చెప్తానని జ్యోత్స్న అనగానే.. ఇప్పుడు చెప్తే కార్తీక్ తో నీ పెళ్లి జరగదు. ఇప్పుడు మనం ఒకరిని కలవాలని చెప్పి జ్యోత్స్నని తీసుకొని వెళ్తుంది పారిజాతం. మరొక వైపు కార్తీక్ మెల్లిగా నడుస్తుంటాడు. దీప పక్కనే ఉండి జాగ్రత్త చెప్తుంది. కార్తీక్ సెట్ అవ్వడంతో కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భర్తకి తన ప్రేమ విషయం చెప్పిన‌ భార్య!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -205 లో.....శ్రీవల్లి ఇచ్చిన మత్తుతో రామలక్ష్మి స్పృహ తప్పి పడిపోతుంది. అయిన కూడా యాగం ఆపకండి. మీరు మంత్రాలు చదవండి అని స్వామి చెప్తాడు. సీతాకాంత్ రామలక్ష్మిని పట్టుకొని యాగం చేస్తుంటాడు. రామలక్ష్మి కాసేపటికి స్పృహలోకి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి యాగం చేస్తారు. ఈ వస్త్రాలు కట్టుకొని రండి అని పంతులు చెప్తాడు. ఆ తర్వాత అసలు నువ్వు మత్తు మాత్రలు వేసావా అని శ్రీవల్లిని శ్రీలత అడుగతుంది. వేసాను అత్తయ్య అని శ్రీవల్లి చెప్తుంది. అసలు అన్ని ప్లాన్ లు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి అనుకుంటారు. ఇప్పుడు ఇది చివరి ప్లాన్ అని శ్రీలత అంటుంది. రౌడీకి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సిరి వెళ్లి మాట్లాడుతుంది. రామలక్ష్మి వస్తుంటే రౌడీ చూసి వదిలి పెట్టకూడదనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి ఇక రాదని శ్రీవల్లి, శ్రీలత, సందీప్ లు అనుకుంటారు. కానీ రామలక్ష్మి రావడం చూసి షాక్ అవుతారు. మరొకవైపు సిరిని రౌడీ వెనకాల నుండి చూసి రామలక్ష్మి అనుకొని కత్తి తీస్తాడు. మొహం చూసి రామలక్ష్మి కాదని తెలిసి నగలు ఇవ్వమంటూ బెదిరిస్తాడు. దాంతో సిరి అరుస్తుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రౌడీ పారిపోతాడు. మాణిక్యానికి సిరి జాగ్రత్త అని చెప్పి రౌడీ వెనకాలే సీతాకాంత్ పరిగెడతాడు. ఆ తర్వాత సీతాకాంత్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. రౌడీని సీతాకాంత్ కొడతాడు. సీతాకాంత్ ని  రౌడీ కత్తితో పొడుస్తాడు. యాగం పూర్తి చెయ్యాలని నడుంకి సీతాకాంత్ గట్టిగా కట్టు కట్టుకొని వస్తాడు. మాణిక్యం ఏమైందని అడగడంతో ఎవరికి చెప్పొద్దని సీతాకాంత్ ప్రామిస్ వేస్తాడు. సీతాకాంత్ అలాగే యాగం దగ్గరికి వెళ్లి యాగం పూర్తి అయిన వెంటనే కింద పడిపోతాడు. తనకి ఉన్న రక్తం చూసి అందరు షాక్ అవుతారు. నీకు ఏమైనా అవుతుందోనని టెన్షన్ పడ్డా లక్కీగా నాకు అయిందని.. నువ్వు హ్యాపీగా ఉండాలని సీతాకాంత్ అనగానే.. ఇప్పుడు కూడా నా ప్రేమ విషయం చెప్పకుంటే నా ప్రేమకి అర్థం లేదని తన ప్రేమ విషయం సీతాకాంత్ కి చెప్తుంది రామలక్ష్మి. దాంతో సీతాకాంత్ హ్యాపీ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : నీకు మంత్లీ పేమెంటా? వీక్లీ పేమెంటా?

  స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -519 లో..... కావ్యని రాజ్ రమ్మని చెప్తే రానని కచ్చితంగా చెప్తుంది. ఇంకొకసారి నీ ఇంటిలో అడుగుపెట్టనని రాజ్ కోపంగా చెప్తాడు. నేను కూడా మీ ఇంట్లో అడుగుపెట్టనని కావ్య కూడా చెప్తుంది. ఆ తర్వాత రాజ్ వెళ్తాడు. ఏంటి నువ్వేం చేస్తున్నావని కావ్యని కనకం అడుగుతుంది. తను ప్రేమ గా మాట్లాడితే నేను అలాగే మాట్లాడేదాన్ని అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ అపర్ణ అన్న మాటలు గుర్తు చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి కావ్య దగ్గరికి వెళ్తాడు. ఇంకా మీరు అనాల్సిన మాటలు ఉన్నాయా అని కావ్య అనగానే ఇంకా నువ్వు పెల్చాల్సిన తూటాలు ఏమైనా ఉన్నాయా అని రాజ్ అంటాడు. నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను. ఏ భర్త తన భార్యకి ఇవ్వని ఆఫర్ నేను నీకు ఇస్తున్నాను.. నువ్వు మా ఇంట్లో కోడలిగా నటించడానికి ఎంత తీసుకుంటావనగానే కావ్య షాక్ అవుతుంది. చెక్ తీసుకొని వచ్చాను. ఎంత కావాలి మంత్లీ పేమెంటా? వీక్లీ పేమెంటా అని రాజ్ అంటాడు. ఎంతైనా ఇస్తారా.. ఆగండి ఒక నిమిషం అంటూ కావ్య లోపలికి వెళ్లి కొన్ని నగలు తీసుకొని వస్తుంది. మీకు నెల జీతం ఎంత అని అడుగుతుంది. నా ఆఫీస్ లో నాకు జీతమేంటి? నేనే ఖర్చులకి అయిదు లక్షలు తీసుకుంటానని రాజ్ అంటాడు. అయితే ఈ నగలు అమ్మితే అయిదు లక్షలు వస్తాయ్.. అవి తీసుకొని నాకు భర్తగా ఇక్కడికి వచ్చి మీరు నటించాలి.. ఇక్కడ పనులన్ని చెయ్యాలని కావ్య అనగానే.. రాజ్ షాక్ అవుతాడు. నువ్వు నేను ఒకటేనా అంటూ రాజ్ పొగరు చూపిస్తాడు. ఒకటే అంటూ కావ్య తగ్గదు. ఇంకోసారి నీ దగ్గరికి రానంటూ రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ ఇంటికి వెళ్ళగానే అందరు కావ్య ఎక్కడ అని అడుగుతారు. రానని చెప్పిందని రాజ్ అనగానే.. నువ్వు ఎంత బాధపెడితే అలా అంటుందని అపర్ణ అంటుంది. ఇక నన్ను తన కోసం వెళ్ళమని చెప్పకండి అని రాజ్ అంటాడు. నా కోడలు ఎప్పుడు వస్తుంది. నా కొడుకు కాపురం ఎప్పుడు బాగుంటుంది.. ఎలాగైనా కావ్యని ఇంటికి తీసుకొని రావాలని అపర్ణ అంటుంది. మరొకవైపు కళ్యాణ్, అప్పుల దగ్గరికి ఓనర్ వచ్చి.. రెండు రోజుల్లో రెంట్ ఇవ్వాలని చెప్తాడు. ఆ తర్వాత రాజ్ తన అంతరాత్మతో మాట్లాడతాడు. తరువాయి భాగంలో రాజ్ ని కావ్య నిద్ర లేపి కాఫీ ఇస్తుంది. నువ్వు వచ్చావా అని రాజ్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శుభశ్రీ, రోల్ రైడా కలిసి అవినాష్ ని ఎంత  స్టైల్ గా దోచుకున్నారో

  ఈ మధ్య కాలంలో అన్నీ ఫ్యాషనైపోయాయి. దొంగతనం కూడా మన కళ్ళముందే జరిగిపోతున్నా మనం ఏమీ చేయలేకపోతున్నాం. అలాగే అమ్మాయిలు ఎదురుగా వచ్చేసరికి అబ్బాయిలు సైలెంట్ ఐపోవడం సినిమాల్లోనే కాదు బయట కూడా జరుగుతోంది. ఇక వాళ్ళు నిలువు దోపిడీ చేసుకుని వెళ్ళిపోయినా అబ్బాయిలు  ఎం మాట్లాడరు... తర్వాత ఎప్పటికో నిద్రలేచి చూసుకుంటే అన్నీ స్వాహా. ఇదే కాన్సెప్ట్ ని రోల్ రైడా కొంచెం పోష్ గా చూపించాడు. రోల్ రైడ అంటే మాటల్నే పాటలుగా మార్చి పాడే వ్యక్తి అని తెలుసు. ఇప్పుడు కూడా అలాంటి ఒక కవర్ సాంగ్ ని రాసాడు. దానికి శుభశ్రీ రాయగురు, అవినాష్ తో కలిసి ఒక వీడియో చేసాడు. రోల్ రైడా పాడుతుంటే వీళ్ళు డాన్స్ చేస్తూ కనిపించారు. ఐతే శుభశ్రీ తన అందంతో రోల్ రైడా తన పాటతో ఇద్దరూ కలిసి అవినాష్ ని దోచుకుంటారు. అవినాష్ కూడా వాళ్ళ మాయలో పడి ముందుగా గోల్డ్ చైన్ ని, తర్వాత కాస్టలీ వాచ్ ని, ఆ తర్వాత బ్రాండెడ్ కళ్లజోడుని కూడా శుభశ్రీకి ఇచ్చేస్తాడు. తర్వాత తన టీ షర్ట్ కూడా తీసి ఇచ్చేయబోతుంటే శుభశ్రీ అది దాచుకో అని కాస్ట్లీ ఐటమ్స్ ని తీసుకుని రోల్ రైడాతో కలిసి ఎంచక్కా చెక్కేస్తుంది. ఇది ఈ సాంగ్ వెనక అసలు థీమ్. ఈరోజున అమ్మాయిలు ఒకళ్ళను ప్రేమించి వాళ్ళను దోచుకుని మరొకరితో చెక్కేస్తున్నారన్న కాన్సెప్ట్ కూడా ఇందులో కనిపిస్తోంది. ఏదేమైనా సొసైటీలో జరిగే ఇష్యూతో వీళ్ళు ఒక వీడియో చేశారు. ఐతే నెటిజన్స్ మాత్రం తమకు ఈ సాంగ్ బాలేదని చెప్పేసారు. ఈ ముగ్గురూ కలిసి ఈ వీడియోని వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పోస్ట్ చేసుకున్నారు.

రొమాన్స్ అనేది బేసిక్ నీడ్..అది అందరికీ అవసరం

    రోటి, కపడా, రొమాన్స్ అనే మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఐతే దీనికి సంబంధించి మూవీలో మెయిన్ లీడ్స్ గా ఉన్న సుప్రాజ్ రంగా, మేఘలేఖతో ఆరియానా ఇంటర్వ్యూ చేసింది. అసలు ఈ టైటిల్ ఏమిటి అనేసరికి "మొదటి రెండు అందరికీ తెలుసు..ఐతే రొమాన్స్ అనేది ఈ మధ్య కాలంలో" అని సుప్రాజ్ అనబోతుంటే "తగ్గిందా తగ్గిందా" అంటూ గారంగా అడిగింది ఆరియానా. అందరికీ రోటి, కపడా, మకాన్ అనే తెలుసు  కానీ రొమాన్స్ అనేది ఇంపార్టెంట్ అనే విషయం  ఎవరికీ తెలీదు కదా" అని సుప్రాజ్ అనేసరికి..రొమాన్స్ అనేది బేసిక్ నీడ్" అంటూ మేఘలేఖ కొత్త పాయింట్ చెప్పింది. "ఈ మూవీకి ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి" అని మేఘలేఖను అడిగేసరికి "వేరే ఆప్షన్ లేక" అంటూ సుప్రాజ్ చెప్పాడు. "ఇంట్రావర్ట్స్ ఇష్టమా ఎక్స్ట్రావర్ట్స్ అంటే ఇష్టమా" అని సుప్రాజ్ ని  అడిగేసరికి "మాటలు రాని డంబ్ పీపుల్ అంటే ఇష్టం" అని చెప్పాడు. తర్వాత మేఘలేఖతో డంబ్ షో ఆడించింది ఆరియానా. అప్పుడు ఒక ప్రశ్నకు సుప్రాజ్ "ఎఫ్ టీవీ" అన్నాడు. "నాకు అర్ధమయ్యింది. రాత్రి అందరూ నిద్రపోయాక నువ్వు ఎఫ్ టీవీ చూస్తావు అని మాకు తెలిసిపోయింది" అని కామెడీ చేసింది.

Shekhar basha reveals about manikanta: మణికంఠ వస్తువులు చూసి అలాంటోడని అనుకోలేదు!

  బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అందరికి ఠక్కున గుర్తొచ్చే పేరు మణికంఠ. ఎందుకంటే మొదటివారమే తన ఫ్యామిలీ సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు.  మణికంఠ హౌస్ లో అంత పర్ఫెక్ట్ అనిపించిన కానీ కంటెస్టెంట్స్ కి తను అంటే కొంచెం చులకన భావం కన్పిస్తుంది. ఎందుకంటే ప్రతీసారీ తన ఎమోషన్ ని బయటపెట్టి సింపథీ కార్డు యూజ్ చేస్తున్నాడు. కానీ గేమ్ పరంగా పర్లేదు.. మళ్ళీ నామినేషన్ లలో అన్నీ పనికిరాని రీజన్స్ తో అడ్డంగా బుక్కవుతున్నాడు. ఇప్పుడిప్పుడే మనుషుల్లో కలవడానికి వస్తున్నాను.. నా మైండ్ సెట్ కాస్త డిఫరెంట్ ఉంటదని మణికంఠనే చాలాసార్లు చెప్పాడు. బిగ్ బాస్ సీజన్-8 లో మొదటగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ ఇవ్వగా సెకెండ్ వీక్ శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. అయితే విచిత్రమేంటంటే వీరిద్దరు కలిసి హౌస్ లోకి వెళ్ళారు. బయటకు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఇక ఎవరు ఊహించని విధంగా హౌస్ ల్ నుండి శేఖర్ బాషా బయటకు వచ్చాడు. ఇది నిజంగా అన్ ఫెయిర్ అనే చెప్పాలి. శేఖర్ బాషా హౌస్ నుండి బయటకు వచ్చాక తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మణికంఠ గురించి కొన్ని నిజాలు బయటపెట్టాడు. మణికంఠ ఎలా ఉండేవాడని అడగ్గా... తను చాలా డిఫరెంట్ మనుషుల్లో కలిసేవాడు కాదని అన్నాడు. ఎప్పుడు నేను మణికంఠ ఒకే బెడ్ పై పడుకుంటాం కానీ ఒక్కొక్కసారి నేను సోఫాపై పడుకుంటా ఒకరోజు సడెన్ గా రాత్రి బెడ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అమ్మాయికి వాడే కాటుక, విగ్గు చూసి షాక్ అయ్యానని శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. మణికంఠ ఒకానొక సందర్భంలో ఎమోషనల్ అవుతూ.. తన విగ్గుని తీసిపారెస్తూ.. ఇంతకంటే ట్రాన్స్ పరెంట్ గా ఉండలేనని అన్నాడు. అది చూసి కంటెస్టెంట్స్ తో సహా ప్రేక్షకులు కూడా అది విగ్గా అంటు ఆశ్చర్యపోయారు.

ప్రేరణ ఇంట్లో విషాదం ...

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా మారుతోంది. ఎందుకంటే ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అమ్మాయిల్లో యాష్మి, ప్రేరణ, బెబక్క, సీత, విష్ణు ఇలా ఈ టీమ్ అంతా కూడా అబ్బాయిలతో ఢీ అంటే ఢీ అనే టైపు. ఐతే ఇందులో బెబక్క ఎలిమినేట్ ఐపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ప్రేరణ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్.. మహానటి అని చెప్పొచ్చు. అన్ని రకాలుగా ఎవరినీ నొప్పించని మనస్తత్వం. గేమ్స్ బాగా ఆడుతుంది. మంచి కామెడీ పీస్ కూడా. అలాంటి ప్రేరణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ప్రేరణ భర్త శ్రీపద్‌ వాళ్ల అమ్మమ్మ కన్నుమూశారు.  ఐతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆమెకు ఇంకా ఈ విషయం గురించి తెలీదు. ఐతే మరి బిగ్ బాస్ ఈ విషయం గురించి ఆమెతో ఎలా చెప్తాడు అన్న పాయింట్ ఇప్పుడు ఇంటరెస్టింగ్ గా మారింది. ఐతే బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపించేస్తాడా లేదా ఆమెకు నచ్చజెప్పి హౌస్ లో కొనసాగేలా ఛాయస్ ని ఆమెకే వదిలేస్తాడా  అనేది తెలియాల్సి ఉంది.  ఎందుకంటే ఈ సీజన్ లో ప్రేరణ స్ట్రాంగ్ కంటెస్టెంట్ మాత్రమే కాదు మంచి కంటెంట్ ఇస్తున్న హౌస్ మెట్ కూడా. మరి ఇలాంటి టైంలో ఆమె బయటకు వెళ్ళిపోతే ఆమె ఫ్యాన్స్ బాధపడే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ ప్రేరణ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతే మాత్రం అది షోకి తీవ్ర నిరాశే అని చెప్పొచ్చు. మరైతే బిగ్ బాస్ సముదాయించి ప్రేరణాని వెళ్లకుండా చేస్తాడా ? ప్రేరణ నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది చూడాలి.      

ఆదితో సుస్సు పోయించిన శేఖర్ మాష్టర్

ఢీ డాన్స్ షోలో డాన్స్ తో సమానంగా ఆది కామెడీ కూడా పీక్స్ లో ఉంటోంది ఈ మధ్య. ఐతే ఈ షోలో శేఖర్ మాష్టర్ ఇచ్చిన ఛాలెంజ్ లో ఆది ఓడిపోయాడు. దాంతో ఆదిని బట్ట బుర్రతో షోకి రమ్మని పిలిచారు. ఐతే వైట్ హెయిర్ విగ్ పెట్టుకుని ముసలివాడు గెటప్ లో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఐతే శేఖర్ మాష్టర్ చెప్పినట్టు చేసాడు ఆది. మోకాళ్ళ మీద కూర్చుని మైథిలి దగ్గరకు, జాను దగ్గరకు పంపించి "మానవరాలా బాగున్నారా" అని మాట్లాడించాడు. తాతయ్య అక్క పిలుస్తోంది అంటూ మైథిలి హన్సిక వైపు చూపిస్తే..."నేను తాతయ్య ఐతే హన్సిక నీకు అమ్మమ్మ అవుతుంది" అన్నాడు. దానికి హన్సిక కామెడీగా ఫైర్ అయ్యింది. చంపేస్తా ఆది అంది. మోకాళ్ళ మీద అలాగే రా...అప్పుడు నీకు ఐ లవ్ యు టూ అని చెప్తా అని ఆఫర్ ఇచ్చేసరికి "నేను మోకాళ్ళ మీద నీ వరకు రావాలంటే ఐ లవ్ యు అని నా డెడ్ బాడీకి చెప్పాల్సి ఉంటుంది" అన్నాడు ఆది. ఇక శేఖర్ మాష్టర్ ఆదిని డాగ్ పొజిషన్ లో కూర్చునేలా చేసాడు.."ఐతే ముసలి కుక్కకు ఇప్పుడు అర్జెంట్ గా సుస్సు వచ్చింది అప్పుడు కాళ్ళెత్తి ఎలా పోస్తుంది" చేసి చూపించాలంటూ శేఖర్ మాస్టర్ టాస్క్ ఇచ్చేసరికి హోస్ట్ నందు ఒక మొక్కను తెచ్చి దాన్ని వాసన చూసి దాని మీద సుస్సు పోయామని చెప్పాడు. వాళ్ళ మాటలకు ఆది షాక్ అయ్యాడు. "ముసలి కుక్క ఎం చేయాలో కూడా చూడాలనుకుంటున్నారా" అని శేఖర్ మాష్టర్ కి దణ్ణం పెట్టేసాడు.  

ఎంత అరిస్తే అంత లేస్తుంది...

  శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రతీ వారం వెరైటీ సెగ్మెంట్స్ తో ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇందులో రష్మీ పెట్టె కాన్సెప్ట్స్ కి ఎవ్వరైనా పడీపడీ నవ్వాల్సిందే. అలాంటి ఒక కాన్సెప్ట్ ని రష్మీ డిజైన్ చేసింది "అదే ఎంత అరిస్తే అంత లేస్తుంది" అంటే ఇందులో బూతేమీ లేదు. ఈ షోలో ఆది అండ్ టీమ్ తో ఈ గేమ్ ఆడించింది. ముందు ఉమాదేవిని పిలిచింది రష్మీ .. గట్టిగా అరవమని చెప్పింది. అలా ఎంత గట్టిగా అరిస్తే అంతలా ఆ స్పీకర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అదన్నమాట అసలు రష్మీ మాటకు అర్ధం. ఐతే ఉమాదేవి హాఫ్ సెంచరీ దాటేలా అరిచింది. ఆ తర్వాత వీణాని పిలిచాడు ఆది. ఒక్క గట్టి అరుపుతో 50 స్కోర్ చేసింది. దాంతో ఆది వేసిన డైలాగ్ మాములుగా లేదు. "ఒక్క అరుపుకే 50 కొట్టావంటే" అన్నాడు. దానికి సిగ్గుపడిపోయింది వీణ. తర్వాత మళ్ళీ అరిచి 80 స్కోర్ కొట్టింది. ఫైనల్ గా మహతిని  పిలిచాడు. ఇక మహతి ఐతే "ఆది హగ్ చేసుకో" అనడం రష్మీ కూడా "మహతి ఆదిని హగ్ చేసుకుని అరువు" అనేసరికి ఆది భయపడి వెళ్ళిపోయాడు. మహతి అరిచినా లెవెల్స్ పెరగలేదు. ఇక మహతి అరుస్తుందో, అడుక్కుంటుందో అర్ధం కావట్లేదని రష్మీ తలపట్టుకుంది. తర్వాత రష్మీ అరిచేసరికి 100 లెవెల్స్ వరకు వెళ్లాయి. భావనతో ఆరోపించారు అంతా ఆమె వాయిస్ లెవెల్స్ 60 వరకు వెళ్తే ఫైనల్ గా ఈ సెగ్మెంట్  క్లోజింగ్ లో ఆది వెళ్ళాడు. సింపుల్ గా ఒక దగ్గు దగ్గాడు అంతే 100 కి లేచాయి లెవెల్స్.

పృథ్వీ లఫూట్ గేమ్ స్టార్ట్ చేశాడు.. వార్నింగ్గా బొక్కా!

  బిగ్ బాస్ హౌస్ లో సీజన్-5 లోని టాస్క్ ని తీసుకొచ్చాడు బిగ్ బాస్ అదే ప్రభావతి గేమ్. ఈ సారి ప్రభావతి (కోడి) 2.0 గా కాస్త బొద్దుగా ఎంట్రీ ఇచ్చింది. నేను అప్పుడప్పుడు గుడ్లను పంపిస్తాను. వాటిని జాగ్రత్తగా కాపాడాలి.. ఏ టీమ్ అయితే ఎక్కువ గుడ్లు తిరిగి ఇస్తారో వాళ్లకి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయంటూ ప్రభావతి చెప్పింది. దీంతో బుట్టలు పట్టుకొని కంటెస్టెంట్స్ రెడీ అయిపోయారు. ఈ టాస్కు మొదలుకాగానే పృథ్వీ అయితే రెచ్చిపోయాడు. ఆడ మగా తేడా లేకుండా ఒక్కొక్కరిని విసిరి పారేశాడు. దీంతో పృథ్వీని ఆపడానికి నబీల్, అభయ్, ఆదిత్య ముగ్గురూ ట్రై చేశారు. ఇక మధ్యమధ్యలో యష్మీ కూడా ట్రై చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన పృథ్వీ.. ఆదిత్య మెడ పట్టుకొని ఓ పక్కకి విసిరేశాడు. దీంతో మీరు నా నెక్ ప్రెస్ చేసి తిప్పేశారు.. ఇది కరెక్ట్ కాదంటూ ఆదిత్య కాసేపు అరిచాడు. అయిన సరే పృథ్వీ వెనక్కి తగ్గలేదు. ఇక పృథ్వీని సోనియా కమాన్ కమాన్ అంటు రెచ్చగొట్టింది. ఇక గేమ్ మధ్యలో బ్రేక్ రావడంతో తన టీమ్ మెంబర్స్‌తో పృథ్వీ గురించి అభయ్ చెప్పాడు. పృథ్వీ గాడు స్టార్ట్ చేశాడు లఫూట్ గేమ్.. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పనికిమాలిన గేమ్ స్టార్ట్ చేసింది వాడే.. వాడు ఎవడిదైనా పానం పోయినా ఆగడు.. ఒన్ ఆఫ్ ది వరస్ట్ ప్లేయర్ ఇన్ బిగ్‌బాస్ హౌస్.. కామన్ సెన్స్, బ్రెయిన్ వాడని ఒకే ఒక ప్లేయర్ వాడే అంటు అభయ్ ఫైర్ అయ్యాడు. మళ్లీ గేమ్ మొదలవ్వగానే అభయ్ టీమ్ దాచుకున్న గుడ్లను లాగేందుకు ట్రై చేశాడు పృథ్వీ. దీంతో ఇది చాలా తప్పు అంటూ ఆదిత్య మీదకి వెళ్లాడు. వెంటనే వాడు వీడు అంటూ బూతులు అందుకున్నాడు పృథ్వీ. వార్నింగ్ ఇస్తున్నా అలా అనొద్దు అంటూ ఆదిత్య అంటే.. వార్నింగా నా బొక్కా అంటూ ఎఫ్ వర్డ్ బూతు వాడాడు పృథ్వీ. గతవారమే నాగార్జున ఈ విషయంలో పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు కానీ ఈసారి రెడ్ కార్డు ఇస్తాడో లేదో చూడాలి మరి. ఇక టాస్క్ మధ్యలో మణికంఠకి తీవ్ర గాయమైన కారణంగా అతడిని మెడికల్ రూమ్ కి పిలిచి గేమ్ ని పాస్ చేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత అభయ్ వెళ్లి.. ఇది గేమ్.. ఇందులో అందరు ఇలానే ఆడతారు.‌. గేమ్ కంటే నీ లైఫ్ ఇంపార్టెంట్ అని మణికంఠతో అభి చెప్పగా.. నాకు విన్ అవ్వడం ఇంపార్టెంట్ అంటు ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ టాస్క్ మొదలైంది. ఇక బిగ్ బాస్ రెండు పెద్ద గంపలు పంపించాడు. వాటిలో రెండు టీమ్ ల మధ్య ఎన్ని గుడ్లు ఉన్నాయో వేసి, లెక్క చెప్పమని చెప్పాడు బిగ్ బాస్. శక్తి టీమ్ దగ్గర 66 గుడ్లు ఉండగా కాంతార టీమ్ 34 గుడ్లు ఉన్నాయి. దాంతో కాంతారా టీమ్ నుండి ఒకరిని తప్పించాలని శక్తి టీమ్ ని బిగ్ బాస్ కోరాడు. దాంతో నబీల్ ని శక్తి టీమ్ చెప్పడంతో.. అతడిని గేమ్ నుండి తీసేసి సంఛాలక్ గా పెట్టేశాడు బిగ్ బాస్. మరి ఈ రోజు టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

జైల్లో ఫుడ్ వేస్తారు కదా అలా విసిరింది.. ఏడ్చేసిన విష్ణుప్రియ!

  బిగ్‌బాస్ హౌస్ లో ముందుగా నిన్న జరిగిన బెలూన్ టాస్కు గురించి రచ్చరచ్చ అయింది. సంచాలక్‌గా సోనియా డెసిషన రాంగ్ అంటూ యష్మీ గొడవకు దిగింది. నిఖిల్-అభయ్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే పెద్దపెద్దగా అరిచింది. దీంతో నిఖిల్‌కి బీపీ పెరిగి పక్కకెళ్లి అరువు అంటూ యష్మీపై ఫైర్ అయ్యాడు. దీంతో నువ్వెవడు నాకు చెప్పడానికి అంటూ యష్మీ కూడా రివర్స్ అయింది. ఇలా మొత్తానికి సోనియాను కార్నర్ చేస్తూ యష్మీ అయితే గట్టిగానే తగులుకుంది. సంచాలక్ అంటే మహారాణిలా నిల్చోవాలా అన్నీ చూసుకోవాలి కదా అంటూ సోనియా గురించి ప్రేరణతో చెబుతూ యష్మీ ఫైర్ అయింది. ఇక సోనియా తీసుకున్న డెసిషన్ నచ్చలేదంటూ అభయ్ తమ టీమ్‌ అందరికి చెప్పాడు. ఇక నుంచి ఏ టీమ్ పని వాళ్ల టీమ్ వాళ్లే చేసుకోవాలని.. వాళ్ల పనులు ఏమీ మనం చేయక్కర్లేదని.. ఇందుకు బిగ్‌బాస్ తనని బయటికి పంపేసిన ఫర్లేదంటూ అభయ్ గట్టిగానే మాట్లాడాడు. దోస చేసిన పెంట అంటే ఇదేనేమో.. ప్రేరణ, మణికంఠ దోసలు వేస్తుండగా.. అక్కడికి విష్ణుప్రియ వచ్చి ఒక దోస కావాలని అంది. దాంతో ప్రేరణ చిరాకుగా ఫేస్ పెట్టి ముష్టివాళ్ళకి విసిరేసినట్టు విష్ణుప్రియ ప్లేట్ లో పడేసింది. అది చూసి విష్ణుప్రియ డీప్ గా హర్ట్ అయ్యింది. ఒంటరిగా కూర్చొని ఏడుస్తుండటంతో విష్ణు ఏమైందంటూ తన టీమ్ మొత్తం వచ్చారు. ప్రేరణ ఫుడ్ విషయంలో.. తను దోస వేసి ఇచ్చిన విధానం హర్ట్ అయింది.. జైల్లో ఫుడ్ వేస్తారు కదా అలా విసిరింది ప్లేట్‌లో.. ఎవరిదైనా ఆకలే కదా అంటూ విష్ణుప్రియ ఏడ్చింది. ఇంతలో మణికంఠ అక్కడికి వచ్చి అవును అంటూ ప్రేరణ ఏం చేసిందో సాక్ష్యం చెప్పాడు. అంతేకాకుండా విష్ణును అక్కడికి తీసుకెళ్లి అందరి ముందు డిస్కషన్ పెట్టాడు. దీంతో ప్రేరణ ఫైర్ అయ్యింది. నువ్వు మాట్లాడకు, పో ఇక్కడి నుంచి అంటూ మణికంఠ మీద కోప్పడింది. దీంతో ఏం మాట్లాడొద్దు.. నా కళ్ల ముందే రాంగ్ జరిగింది ఇక్కడ.. నీకు అసలు పెట్టే బుద్ధే లేదు.. అందుకే నీకు కోపం వచ్చింది.. ఇలా వేశావంటూ మణికంఠ ఫైర్ అయ్యాడు. ఇలా విష్ణుప్రియ, ప్రేరణ, మణికంఠ మధ్య గొడవ ముదిరింది. వీరి ముగ్గురిలో ఎవరు కరెక్ట్ అని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.  

Brahmamudi : ఏ భర్త ఇవ్వని ఆఫర్ భార్యకి ఇచ్చిన రాజ్..  షాక్ లో కావ్య!

  స్టార్ మా టీవీలో  ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -518 లో.....ఇందిరాదేవి సీతారామయ్యలు కావ్య దగ్గరికి వస్తారు. తను రానని చెప్పడంతో తిరిగివెళ్ళిపోతారు. ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్లేసరికి అందరూ కావ్య కోసం వెయిట్ చేస్తుంటారు. కావ్య రాకపోవడంతో ఆ మహారాణి ఎక్కడ కార్ లో ఉందా కార్ డోర్ నేనే తీసి తనని తీసుకొని రావాలా అని రాజ్ వెటకారంగా మాట్లాడతాడు. కావ్య ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. రానని చెప్పిందని ఇందిరాదేవి చెప్తుంది. నాకు తెలుసు తనకి పొగరు అని నేను ఇప్పుడు వెళ్లి కాళ్ళు పట్టుకొని రమ్మని బ్రతిమాలాలా అని రాజ్ అంటాడు. నువ్వు వెళితే కావ్య వస్తుందని ఇందిరాదేవి చెప్తుంది. ఎక్కడ రాజ్ వెళ్లి తీసుకొని వస్తాడో అని రుద్రాణి... కావ్య అంత పొగరు గా వెళ్ళిందంటూ అనగానే రుద్రాణిపై స్వప్న విరుచుకుపడుతుంది. మొదట రాజ్ వెళ్ళానని చెప్పినా అపర్ణ కోసం వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు రాజ్ వెళ్తే కావ్య వస్తుంది. కావ్యని ఎలా ఆపాలని రాహుల్ తో రుద్రాణి అంటుంది. అప్పుడే స్వప్న రావడం చూసి కావాలనే రాహుల్ తో.. ఇప్పుడు కావ్య ఇంటికి వస్తే గొడవలు అవుతాయి. దాంతో అపర్ణ వదిన ఆరోగ్యం ఎలా ఉంటుందని రుద్రాణి అనడం విన్న స్వప్న వెంటనే.. కావ్యకి ఫోన్ చేసినట్టు నటిస్తూ.. ఇప్పుడు రాజ్ వచ్చాడు. నువ్వు రాకు.. ఒకవేళ వస్తే.. మా అత్త, రాహుల్ చేసే ప్లాన్ లు వర్కవుట్ అవ్వవని స్వప్న అంటుంది. ఏంటి ఒకసారి ఫూల్ అయ్యానని ఎప్పుడు అలాగే అవుతానా అంటూ స్వప్న తన అత్త కీ జలక్ ఇస్తుంది. ఇంత తెలివి గల దానివి.. నువ్వు ఎలా పడగొట్టావ్ రా అని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. కావ్య తన పని తను చూసుకుంటుంది. ఏంటి పట్టించుకోవడం లేదని రాజ్ అంటాడు. ఏం చేయమంటారు ఎదరువచ్చి మీ కాళ్ళపై పడమంటారా అంటూ కావ్య వెటకారంగా మాట్లాడుతుంది. పదా ఇంటికి వెళదాం.. నువ్వు లేకపోతే మా ఇల్లు చీకటి అయిందట.. నువ్వు వచ్చి దీపం వెలిగించమని రాజ్ వెటకారంగా మాట్లాడతాడు. నేను రాను. ఈ జన్మలో ఆ ఇంట్లో అడుగుపెట్టను.. మీరేం చెప్పినా, ఏం చేసిన రానని కావ్య కచ్చితంగా చెప్తుంది. తరువాయి భాగంలో నీకు ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను.. ఏ భర్త ఏ భార్యకి ఇవ్వని ఆఫర్ అని రాజ్ అనగానే.. ఏంటని కావ్య అడుగుతుంది. మా ఇంట్లో కోడలిగా నటించడానికి ఎంత కావాలంటూ చెక్ పై సైన్ చేస్తుంటే.. కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : నేను సొంతకూతురిని కాదా.. కార్తిక్ కి కాశీ షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -153 లో..  శౌర్యని దీప తీసుకొని రావడం చూసి జ్యోత్స్న ఓర్వలేకపోతుంది. దీప కిచెన్ లో వంట చేస్తుంది. జ్యోత్స్న వచ్చి నువ్వెందుకు మా బావకి దగ్గర అవ్వాలని చూస్తున్నావ్.. నువ్వు పెద్ద జానవి అని జ్యోత్స్న అనగానే.. తనపైకి దీప చెయ్ ఎత్తుతుంది. నాపైకి చెయ్ లేపుతావా అంటూ జ్యోత్స్న అనగానే తప్పుగా మాట్లాడితే చెంప పగులగొడతాను. నువ్వు ఎందుకు నీ స్థానంలోకి వస్తానని భయపడుతున్నావని జ్యోత్స్నపై దీప కోప్పడుతుంది. ఆ తర్వాత శౌర్యతో కార్తీక్  మాట్లాడుతాడు కానీ కాశీ, స్వప్నల గురించి ఆలోచిస్తాడు. అప్పుడే కాశీ ఇంటికి వస్తాడు. ఏంటి కాశీ అర్జంట్ గా మాట్లాడలన్నావని దీప అడుగుతుంది. ఇద్దరు కార్తీక్ దగ్గరికి వెళ్తారు. శౌర్యని బయటకు పంపిస్తారు. ఏంటి కాశీ సర్ ప్రైజ్ ఇచ్చావని కార్తీక్ అంటాడు. కాశీ జరిగింది చెప్తాడు. స్వప్న వాళ్ళ నాన్న ఫోన్ చేసి స్వప్నని వదిలేయమని బెదిరించాడు. నీ దగ్గరికి వచ్చాడా అని కార్తీక్ అడుగుతాడు. లేదని కాశీ అంటాడు. అంటే ముందే నాన్న దాస్ మావయ్యని చూసి ఉంటాడు. అందుకే వెళ్ళలేదేమోనని కార్తీక్ అనుకుంటాడు. సరే టెన్షన్ పడకండి అని కార్తీక్ కాశీకి ధైర్యం చెప్తాడు. మరొకవైపు జ్యోత్స్న ఇంట్లో అందరికి దీప తనపై చెయ్ ఎత్తిందని చెప్తుంది.  నువ్వేదో అని ఉంటావ్ అందుకే నిన్ను అలా అందని అందరు అంటారు. దాంతో అసలు నేను మీ కూతురినా.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అంటు రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది జ్యోత్స్న..ఇదేంటి కొంపదీసి మీ కూతురిని కాదని చెప్తుందా అని పారిజాతం టెన్షన్ పడుతుంది. నేను సొంత కూతురు కాదని తెలిసేకంటే ముందే బావకి భార్యని అవ్వాలని.. మరి ఏంటి మీరు నాకు సపోర్ట్ చెయ్యడం లేదు.. వెంటనే బావకి నాకు పెళ్లి చెయ్యండి అనగానే అందరు సరే అంటారు. మరొకవైపు స్వప్న బాధపడుతుంటే కాశీ ఎవరు చూడకుండా కిటికి దగ్గరికి వస్తాడు. కాశీని చూసి స్వప్న వస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. మా నానమ్మకి నేనంటే ఇష్టం. తనతో మాట్లాడిస్తానని కాశీ చెప్తాడు. కాశీ వెళ్ళిపోతాడు ఎవరు వచ్చారంటూ కావేరి వస్తుంది. కానీ కావేరికి కాశీ వచ్చాడని తెలియదు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి దీప వచ్చి దీనికి ఒక్కటే సొల్యూషన్ బాబు మీ అమ్మగారికి నిజం చెప్పాలని దీప అంటుంది. మా నాన్నని అమ్మ దేవుడని అనుకుంటుంది. మా నాన్న ప్రేమని చూసి నేను జెలస్ గా ఫీల్ అయ్యేవాడినని దీపతో కార్తిక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : యాగం ఆపడానికి దుష్టశక్తులు ప్రయత్నం.. మరి అది జరిగేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 204 లో.....యాగం ఆపాలని శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. శ్రీలత యాగం పనులు చేస్తుంటే.. మాణిక్యం వద్దని అనడం తో మాణిక్యాన్ని రెచ్చగొట్టి యాగం ఆపాలని శ్రీవల్లి అనుకుంటుంది. మాణిక్యంతో మా అత్తయ్యతో అలా అంటావా అని అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. చూడండి బావ గారు అత్తయ్యని అలా అన్నాడంటూ చెప్తుంది.. నేను అలా అనలేదని మాణిక్యం అంటాడు. అప్పుడే స్వామిజీ కలుగుజేసుకుని అలా అంటే తప్పేంటి ఇది పవిత్రమైంది.. అందుకే అందరు ముట్టుకోకుడదు అన్నాడని అనగానే.. అందరు సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత ఇంకా స్వామి రాలేదని పెద్దాయన అంటాడు. సీతాకాంత్ స్వామికి ఫోన్ చేస్తుంటే కలవదు. తను రాడని తెలిస్తే గుండె ఆగిపోతుందేమోనని శ్రీవల్లి అనుకుంటుంది. ఇక ఇది ఎలా చేస్తావ్ రామలక్ష్మి అని శ్రీలత అనుకుంటుంది. ఆ తర్వాత ఇంకో స్వామి ఫోన్ మాట్లాడుతు.. స్వామికి ఆక్సిడెంట్ అయిందా అంటూ షాక్ అవుతాడు. దాంతో అందరు ఇక యాగం ఆగినట్లేనని టెన్షన్ పడతారు. శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు హ్యాపీ గా ఫీల్ అవుతారు.ఇక అంతా దేవుడు దయ అంటూ రామలక్ష్మి సీతాకాంత్ లు మొక్కుకుంటారు. అప్పుడే స్వామి వస్తుంటాడు. అతన్ని చూసి హ్యాపీ గా ఫీల్ అవుతారు. మీకు ఆక్సిడెంట్ అయిందట అని సీతాకాంత్ అంటాడు. చెప్పాను కదా దుష్టశక్తులు యాగం ఆపాలని చూస్తారని అని స్వామి అంటాడు.ఆ తర్వాత యాగాన్ని మొదలుపెడతారు. ఇది నిష్టతో చెయ్యాలి మధ్యలో నీళ్లు కూడా తాగకూడదని స్వామి చెప్తాడు. ఇప్పుడే ఏదైనా తాగండి అని స్వామి చెప్పగానే నేను తీసుకొని వస్తానంటూ సుజాత వెళ్తుంటే నేను వస్తాను అని శ్రీవల్లి వెళ్తుంది. సుజాత కొబ్బరి నీళ్లు గ్లాస్ లో పోస్తుంది. అందులో శ్రీవల్లి మత్తు టాబ్లెట్ కలుపుతుంది. ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తారు. రామలక్ష్మి ఆ వాటర్ తాగుతుంది. ఆ తర్వాత యాగం మొదలవుతుంది. పంతులు మంత్రాలు చదువుతుంటాడు. ఆ తర్వాత మాణిక్యం పూజ సామాగ్రి తెస్తుంటే కింద పడిపోతాడు. తాగి వస్తే ఇలాగే ఉంటుందంటూ శ్రీవల్లి గొడవ చేయగా.. తాగి రాలేదని మాణిక్యం అంటాడు. తాగి రాలేదు, తాగి వస్తే ఎలా ఉంటాడు నాకు తెలుసని సీతాకంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి మత్తుగా అనిపిస్తుంది. మత్తు పని చేస్తున్నట్లు ఉందని శ్రీవల్లికి శ్రీవల్లి చెప్తుంది. రామలక్ష్మి మత్తులో సీతాకాంత్ పై పడిపోతుంది. ఇదంతా యాగం ఆగడానికి దుష్టశక్తలు చేస్తుంది. మీరు వేదమంత్రాలూ చదవండి ఆపకండి అని స్వామి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రభావతి 2.0 ఎంట్రీ

  బిగ్ బాస్ హౌస్ లో‌ మూడవ వారం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు జోరుగా సాగుతున్నాయి. ‌ఒక్కో కంటెస్టెంట్ భావోద్వేగాలకి లోనవుతున్నారు. తాజాగా వదిలిన ప్రోమోలో బిగ్ బాస్ ఓ కోడిని సెటప్ చేసి , అందులో ఎగ్స్ ఉంచి, కంటెస్టెంట్స్ తీసుకోమని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.  ' బిగ్ బాస్ హౌస్ లో ప్రభావతి (prabavathi 2.0) ' అనే టైటిల్ తో వదిలిన ఈ ప్రోమో ఆసక్తికరంగా మారింది. ఇందులో ఆదిత్య ఓం, పృథ్వీ ఇద్దరు ఫీజికల్ అయినట్టుగా తెలుస్తుంది. విష్ణుప్రియ, యష్మీలకు గాయాలు జరిగినట్టుగా వారి ఆర్గుమెంట్స్ బట్టి తెలుస్తుంది‌. నిన్న జరిగిన టాస్క్ లో అభి, నిఖిల్, సోనియా, యష్మీల మధ్య గొడవ జరుగగా..‌ ఇప్పుడు ఆదిత్య ఓం, పృథ్వీ, యష్మీ ల మధ్య గొడవ గట్టిగానే జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఎవరెవరి మధ్య గొడవ జరిగిందనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే ''ప్రభావతి 2.0 ' టాస్క్ బిగ్ బాస్ అనే టైటిల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ ప్రోమోని మీరు చూసారా? చూస్తే కామెంట్ చేయండి.