Bigg Boss : సీజన్-8  మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? 

బిగ్ బాస్ సీజన్-8 లో ప్రతీవారం కొత్త నామినేషన్లు, కొత్త టాస్క్ లు జరుగుతున్నాయి. ఇక హౌస్ లో మొత్తంగా పది మంది ఉన్నారు‌. వీరిలో ఎవరి ఆట బాగుంది.. ఎవరు అనర్హులు‌‌.. ఎవరు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారు.. ఎవరు వీకెండ్ ఎలిమినేషన్ అవుతారనేది ఓ సారి చూసేద్దాం. (Bigg Boss Telugu 8) హౌస్ లో ఇప్పటివరకు జరిగిన వారాల్లో నబీల్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు‌‌. వచ్చిన ప్రతీ టాస్క్ లో తన 100% ఇస్తూ వస్తున్నాడు. అలాగే ఆదిత్య ఓం తన ఆటతీరుని మెరుగుపర్చుకున్నాడు. నిన్నటి టాస్క్ లో చాలా ఫాస్ట్ గా బాల్స్ బాస్కెట్ లో పడేశాడు. నిఖిల్ తన రాంగ్ డెసిషన్స్ తో బోల్తా పడుతున్నాడు. మొదటి రెండు వారాలు నిఖిల్ ని చూసి విన్నర్ ఇతనే అనుకున్నారంతా కానీ సోనియా చెప్పుడు మాటలకి తను ఆడే ఇండివిడ్యువల్ ఆటని మర్చిపోయాడు‌. దాంతో అతనికి ఓటింగ్ కూడా లేకుండా పోయింది. ఇక తాజాగా జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియలో కూడా మొదటగా నబీల్, రెండవ స్థానంలో విష్ణుప్రియ ఉండగా మూడవ స్థానంలో నిఖిల్ ఉన్నాడు. సాధారణంగా అయితే నిఖిల్ మొదటి స్థానంలో ఉంటాడు. మరి ఇక ముందు జరిగే టాస్క్ లలో నిఖిల్ తన ఆటని మెరుగుపరుచుకుంటాడో చూడాలి మరి. ఇక సోనియా వెళ్ళిపోయాక యష్మీ చేరింది. నిఖిల్, పృథ్వీలకి లేనిపోనివి కల్పించి చెప్తూ వస్తోంది. తనలో ఉన్న సైకోయిజాన్ని మళ్ళీ బయటకు తెస్తుంది. ఇక ప్రేరణ ఆటల్లో ముందుకు రాలేకపోతుంది. కిర్రాక్ సీత క్లాన్ చీఫ్ అయిన కారణంగా తమ టీమ్ అందరి ఒపినీయన్  తీసుకొని తను ఆడకుండా సాక్రిఫైజ్ చేస్తోంది. ఇక ఈ వారం నామినేషన్ లో లేదు కాబట్టి పెద్దగా పర్వాలేదు కానీ టాస్క్ లు ఆడితేనే అటు హౌస్ మేట్స్ , ఇటు ఆడియన్స్ గుర్తిస్తారనేది వాస్తవం. నాగ మణికంఠ సంచాలక్ గా బాగా చేస్తున్నాడు‌. అయితే గేమ్ లో సరిగ్గా ఏకాగ్రతతో ఆడలేకపోతున్నాడు. నైనిక ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుంది. మొదటి రెండు వారాల్లో ఉన్న ఫైర్ ఇప్పుడు లేదు. విష్ణుప్రియ గేమ్స్ లో లైట్ తీస్కుంటుంది‌. అయితే నిన్నటి స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో బాగానే ఆడింది‌‌. పృథ్వీ అగ్రెసివ్ అండ్ టెక్నిక్ తో బాగానే నెట్టుకొస్తున్నాడు. అయితే అతనకి తోటి కంటెస్టెంట్స్ చేత ఎలా మాట్లాడాలో తెలియడం లేదు‌. ఛీఫ్ అయ్యే లక్షణాలు అసలే లేవు. ఇక ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో..  హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారని అనుకుంటున్నారో.. వీకెండ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

మెచూర్డ్ గా థింక్ చేసే మణికంఠ జీరోనా.. రాంగ్ డెసిషన్స్ తీసుకునే నిఖిల్ హీరోనా!

బిగ్ బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్స్ ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు. ఎందుకంటే ఒక్కో గేమ్ కి ఒక్కోలా మారిపోతున్నారు. హౌస్ లో ప్రతీ గేమ్ కి బెస్ట్ సంచాలక్ గా నాగ మణికంఠ చేస్తున్నాడు‌‌‌. కానీ అతడిని హౌస్ అంతా ఆటలో అరటిపండులా పక్కన పెడుతున్నారు. మరోవైపు రాంగ్ డెసిషన్స్ తీసుకునే నిఖిల్ ని అనవసరంగా హీరోని చేస్తున్నారు. (Naga Manikanta) వీకెండ్ లో నాగార్జున ఓ కుక్కని చూపించి ఇది కుక్క కాదు.. నక్క అని అంటే హౌస్ లో ఉన్నవాళ్ళంతా అది నక్క అనే నమ్ముతారు‌. ఎందుకంటే నాగార్జున అలా బిగ్ స్క్రీన్ మీద వేసి చూపిస్తాడు. ఇక హౌస్ లో గతవారం గుడ్ల టాస్క్ జరిగింది. అందులో ఏం జరిగిందో చూపించాడు నాగార్జున. ఆ తర్వాత సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ లో మణికంఠని నిఖిల్ టీమ్ తీసేసారు‌. అలా వీక్ అని పక్కన పెట్టడమేంటని ప్రేరణ, కిర్రాక్ సీత అడిగారు‌‌. దాంతో అక్కడ సోనియా, నిఖిల్, పృథ్వీ బ్యాడ్ అయ్యారు. కానీ జరిగిందేంటని నాగార్జున బిగ్ స్క్రీన్ మీద చూపించడంతో.. మణికంఠే సాక్రిఫైజ్ చేశాడని హౌస్ మేట్స్ అంతా నమ్మేశారు. ఇక అదే రోజు హౌస్ లో ఎవరు అనర్హులో వారికి క్రాస్ మార్క్ వేయమని నాగార్జున అనగానే‌‌.‌. హౌస్ లో మెజారిటీ ఆఫ్ ది కంటెస్టెంట్స్ నాగ మణికంఠ రాంగ్ అని, అనర్హుడని చెప్తూ అతనికి క్రాస్ వేశారు‌. అతడికే ఎక్కువగా జీరోలు రావటంతో అతడిని జైల్లోకి పంపించేశాడు బిగ్ బాస్. జైల్లోకి వెళ్ళిన నాగ మణికంఠ కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు. ఆడియన్స్ సేవ్ చేసిన తరువాత.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అభిప్రాయం ఎందుకు తీసుకుంటున్నారు? నన్ను ఆల్రెడీ జనం తమ ఓట్లతో సేవ్ చేశారు కదా.. మరి నన్నెందుకు జీరో అని చెప్పి ఈ జైలులో వేశారు. జనం సేవ్ చేశారంటే.. హౌస్‌లో ఉండటానికి అర్హత ఉందనే కదా అర్థం. జనం వాళ్ల అభిప్రాయాన్ని ఓట్ల ద్వారా చెప్పిన తరువాత.. హౌస్‌లో వాళ్లు ఇన్వాల్వ్ అవ్వడమేంటి? వాళ్లు నన్ను డేంజర్ జోన్‌లో పెట్టడమేంటి? ప్రతిసారి ఇలాగే అయితే దాని వల్ల నాకు నష్టం జరుగుతుంది కదా.. జనం పిచ్చోళ్లు కాదు కదా సేవ్ చేయడానికి. జనాల దృష్టిలో రాంగ్ అవుతుంది కదా బిగ్ బాస్‌ అని మణికంఠ మాట్లాడాడు.

Bigg Boss : ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ని రివీల్ చేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-8 మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్‌తో మొదలైంది. మొదటివారం బేబక్క, రెండో వారం శేఖర్ బాషా, మూడోవారం అభయ్ నవీన్, నాలుగోవారం సోనియా ఎలిమినేట్ అయ్యారు.  ఇక నాలుగు వారాలు ముగిసేసరికి పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక ఈ వారం మరో ఇద్దరు బయటకు వస్తున్నారు. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండటంతో పాటు వీకెండ్ ఎలిమినేషన్ ఉంటుంది. అయితే వచ్చేవారం హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా కొత్త కంటెస్టెంట్స్‌లు హౌస్‌లోకి రాబోతున్నారు. వారిలో కొంతమంది పేర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. వారిలో యాంకర్ రవి, గంగవ్వ, దిల్ సే మెహబూబ్, నయని పావని, తీన్మార్ సావిత్రి, టేస్టీ తేజ, రోహిణి, ముక్కు అవినాష్ హౌస్ లోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి‌.  వీరిలో టేస్టీ తేజ ఇప్పటికే కన్ఫమ్ అయినట్టు తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి.. పాత కంటెస్టెంట్స్‌నే వైల్డ్ కార్డ్‌ల ద్వారా హౌస్‌లోకి పంపిస్తున్నారనేది అందరికి తెలిసిందే.  సీజన్ 8 ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ టేస్టీ తేజా పేరును అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు బిబి టీమ్. ఇన్ స్టాగ్రామ్ లో స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రెండు అఫీషియల్ పేజీలలో కంటెస్టెంట్ ఎవరో కనిపెట్టండి అంటు పోస్ట్ వేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తేజా ఫేస్ రివీల్ చేయకుండా.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ ఎవరో కనిపెట్టండి అంటూ అతని నీడను మాత్రమే రివీల్ చేశారు. ఇక ఆ బాడీ సైజు చూసి , ఆ కటౌట్ చూస్తే అతనే టేస్టీ తేజ అని ఎవరికైనా అర్థమవుతుంది. మరి మీకేమనిపిస్తోందో కామెంట్ చేయండి.

Eto Vellipoindi Manasu : వాడే ఎటాక్ చేసింది.. సీసీటీవీ ఫుటేజ్ లో ఏం ఉందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -215 లో.. రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్తుంటే సీతాకాంత్ అన్ని తనకి రెడీగా ఉంచుతాడు. తనే స్వయంగా టిఫిన్ తినిపిస్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ కి డిటెక్టివ్ ఫోన్ చేసి పనిమనిషిగా నందిని ఇంట్లో చేరానని చెప్తాడు. అయితే ఏదైనా తెలిసిందా అని సీతాకాంత్ అడుగుతాడు. ఇప్పుడు నాకు డబ్బులు కావాలని అనగానే సీతకాంత్ తనకి డబ్బులు పంపిస్తాడు.  ఆ తర్వాత సందీప్ దగ్గరికి సీతాకాంత్ పై ఎటాక్ చేసిన అతను వస్తాడు. నాకు డబ్బులు ఇవ్వలేదని అనగానే.. అనుకున్నది చెయ్యలేదు.. నీకు డబ్బులు ఎక్కడివి అని సందీప్ అంటాడు. నేను ట్రై చేశాను ఎటాక్ కోసం గదిలోకీ వెళ్తే వేరొక అమ్మాయి ఉంది. కవర్ చెయ్యడానికి దొంగలా నటించాను. అప్పుడే సీతాకాంత్ వెంబడించి పట్టుకోబోతుంటే నేను నెడితే అలా అయిందని రౌడీ అంటాడు. అదంతా బ్లూ టూత్ ద్వారా నందిని వింటుంది. దీనికి కారణం సందీప్ ఆ అనుకుంటుంది. ఆ రౌడీ ని పట్టుకుంటే అంతా బయటపడుతుందని నందిని బయటకి వస్తుంది. అప్పుడే రౌడీ బయటకు వెళ్తుంటే.. రామలక్ష్మి వస్తుంది. తనని చూసి రౌడీ మాస్క్ పెట్టుకుంటాడు. అప్పుడే రౌడీ పర్సు కిందపడిపోతుంది. దాంతో రామలక్ష్మి అతనికి పర్సు ఇచ్చి లోపలికి వస్తుంది. నందిని వచ్చేసరికి రౌడీ వెళ్ళిపోతాడు. అతడిని ఎక్కడో చూసానని రామలక్ష్మి అనుకుంటుంది. సిరి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. రౌడీ చేతిపై స్నేక్ టాటూ ఉంటుంది అంటుంది. రామలక్ష్మి పర్సు ఇచ్చేటప్పుడు అతని చేతికి ఉన్న స్నేక్ టాటూ చూసి.. అతనే అంటూ మళ్ళీ బయటకు వచ్చి చూస్తుంది. ఆ రౌడీని చూసావా అని మాణిక్యాన్ని రామలక్ష్మి వెళ్లి అడుగుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి, మాణిక్యం లు వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్ చూస్తారు. అందులో రౌడీ సందీప్ దగ్గరికి వెళ్లినట్లు ఉంటుంది. ఆ తర్వాత హారికని ఏదైనా క్లూ దొరికిందా అని నందిని అడుగుతుంది. సందీప్ ని అలా అడిగితే మనపై డౌట్ వస్తుంది. కాస్త ఓపిక పట్టు అని నందినికి హారిక సలహా ఇస్తుంది. మరొక వైపు అల్లుడు గారు నీకు లంచ్ పంపారని మాణిక్యం బాక్స్ తీసుకొని వచ్చి రామలక్ష్మికి ఇస్తాడు. అందులో లెటర్ కూడా ఉంటుంది. అది చదువుతు రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు రామలక్ష్మికి సీతాకాంత్ చాటుగా మల్లె పువ్వులు తీసుకొని వెళ్తుంటే.. సిరి వాళ్లు చూసి నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 8 : మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది వీళ్లేనా!

బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా మోస్ట్ ట్రెండింగ్ టాపిక్. లిమిట్ లెస్ థీమ్ తో మొదలైంది బిగ్ బాస్-8. ఎవరు ఊహించని ట్విస్ట్ లతో ఉత్కంఠగా సాగుతుంది. పద్నాలుగు మందితో మొదలైన ఈ సీజన్.. ఇప్పుడు పదిమంది మాత్రమే హౌస్ లో ఉన్నారు. (Bigg Boss 8 Telugu) ఇప్పుడు ఎవరు ఉహించని విధంగా గత వారం జరిగిన సండే రోజు ఎపిసోడ్ లో..  మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. దీంతో ఎవరు వెళ్తారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. అయితే ఈ వారం నామినేషన్ లో ఆరుగురు ఉన్నారు. నబీల్, విష్ణుప్రియ, నిఖిల్, నైనిక, ఆదిత్య ఓం, నాగ మణికంఠ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో ఆడియన్స్ ఓట్లని లెక్కలోకి తీసుకొని లీస్ట్ ఉన్నవారిని బయటకు పంపిస్తారో లేక హౌసెమేట్స్ ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేస్తారో చూడాలి. ఓటింగ్ ప్రకారం అయితే లీస్ట్ లో నైనిక, ఆదిత్య ఓం ఉన్నారు. ఒకవేళ హౌసమేట్స్ ఒపీనియన్ లేకుండా బిగ్ బాస్ మీరే ఒకరిని బయటకు పంపించండి అనే అవకాశం ఇస్తే అందరు ఆదిత్య ఓం ని బయటకు పంపించే అవకాశం ఉంది. కానీ నిన్నటి ఎపిసోడ్ లో అదిత్య ఓం టాస్క్ లో గెలిచి అతను గేమ్స్ లో యాక్టివ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. (Mid Week Elimination) ఇక ఓటింగ్ లో నబీల్, నిఖిల్ టాప్ లో ఉన్నారు. వీరితో పాటు విష్ణుప్రియకి అత్యధిక ఓటింగ్ పడుతుంది. అయితే నైనికకి ఎక్కువగా ఫ్యాన్ బేస్ లేకపోవడంతో తనకి ఓటింగ్ చాలా తక్కువగా ఉంది‌. ఆదిత్య ఓం ఓ ఊరిని దత్తత తీసుకోవడం.. వారి కోసం సపరేట్ అంబులెన్స్ ని ఏర్పాటు చేయడం.. ఇలా ఎవరికి తెలియకుండా కొన్ని మంచి పనులు చేస్తున్న ఆదిత్య ఓం కి గ్రామాల నుండి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. రేపటి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలియాల్సి ఉంది.

Karthika Deepam 2 : లేచిపోతామని చెప్పేసిన జ్యోత్స్న..  దీపని తిట్టిపోసిన‌ ఆ ఇద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -164 లో.....దీప ఇంటికి రాగానే ఇక నువ్వు అనుకున్నది జరిగింది కదా అంటూ జ్యోత్స్న తిడుతుంది. నీ వల్ల నా మనవరాలి పెళ్లి ఆగిపోయిందని పారిజాతం అంటుంది. దాంతో దీప షాక్ అవుతుంది. తాతయ్య వెళ్లి మీలాంటి కుటుంబంతో పెళ్లి సంబంధం వద్దని చెప్పి వచ్చారట అని జ్యోత్స్న ఏడుస్తుంది. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కలిసి దీపని ఇష్టం వచ్చినట్లు తిడతారు. అప్పుడే సుమిత్ర వచ్చి.. శ్రీధర్ అన్నయ్య తప్పు చేసాడు దానికి దీప కారణమా.. పెళ్లి దీప చేయకుంటే స్వప్న, కాశీలు పెళ్లి చేసుకోలేరా అని దీపకి సపోర్ట్ గా సుమిత్ర మాట్లాడుతుంది. అయిన కూడ ఇద్దరు దీపని తప్పు పడతారు. ఏం జరిగినా దీపని అనడం అలవాటు అయిందని సుమిత్ర అంటుంది. చిన్నప్పటి నుండి బావ నీ భర్త అని చెప్పడం మాది తప్పు.. అందుకు జ్యోత్స్న శిక్ష అనుభవిస్తుందని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత నన్ను ఈ సిచువేషన్ కి తీసుకొని వచ్చావని జ్యోత్స్న అంటుంటే.. తనని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది సుమిత్ర. ఆ తర్వాత కుటుంబంలో ఒక్కరు తప్పు చేస్తే అందరికి శిక్ష ఎందుకు.. ఉదాహరణ ఇదే అని దీప బాధపడుతుంది. మరొకవైపు కార్తీక్ కాంచనకి కాఫీ చేసుకొని వస్తాడు. ఒరేయ్ నువు మళ్ళీ లండన్ వెళ్ళురా నీతో పాటు నేను కూడా వస్తానని కాంచన అంటుంది. అక్కడ ఎవరున్నారని కార్తీక్ అనగా.. ఇక్కడ ఎవరన్నారని కాంచన అంటుంది. తన కుటుంబం నుండి కాంచన విడిపోయినందుకు చాలా ఫీల్ అవుతుంది. తాతయ్యకి మైండ్ ఉందా అలా చెయ్యడమేంటి అంటూ కార్తీక్ సీరియస్ అవుతాడు. ఆ సిచుయేషన్ లో నేనున్నా కూడా ఆలాగే చేసేదాన్ని అని కాంచన ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు జ్యోత్స్నకి సుమిత్ర కాఫీ తీసుకొని వస్తుంది. దాన్ని విసిరేస్తుంది. నాకు బావ కావాలి అంటు బాధపడుతుంది. అలాంటిది ఇంటికి ఇస్తే.. ఈ కుటుంబం పరువు ఏమవుతుందని శివన్నారాయణ అంటాడు. మీరు పెళ్లి చేయండి మేమ్ ఫారెన్ వెళ్తామని జ్యోత్స్న అంటుంది. మరి మేమ్ ఎక్కడికి వెళ్ళాలని శివన్నారాయణ అంటాడు. నేను బావ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటామని జ్యోత్స్న అంటుంది. అప్పుడు లేచిపోయింది అంటారని శివన్నారాయణ అంటాడు. అంటే అనుకోనియ్.. నాకు నా బావ కావాలని జ్యోత్స్న అంటుంది.‌ నువ్వు స్వార్థపరుడివి తాతయ్య అని జ్యోత్స్న అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 8 Telugu: యష్మీ బ్యాక్ బిచింగ్.. ఆదిత్య ఓం విన్!

బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇందులో గతవారం సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఇక హౌస్ లో సోనియా స్థానాన్ని యష్మీ భర్తీ చేస్తుంది. నిన్న జరిగిన టాస్క్ లు ఓ వైపు, యష్మీ మాటలు మరోవైపు ఆసక్తిని రేకెత్తించాయి. ఎంతలా అంటే యష్మీలోని నెగెటివ్ మొత్తం ఆడియన్స్ కి అర్థమైంది. ఈరోజు ఎపిసోడ్ మొదలుకాగానే యష్మీతో ప్రేరణ సరదాగా ఓ మాట అడిగింది. మణికంఠ, ఆదిత్యలో ఎవరికైనా ఈ వారం బయటికెళ్లడానికి టైమ్ వచ్చిందని అనుకుంటున్నావా? అని ప్రేరణ అడిగింది. దీనికి "అమ్మా వెళ్లాలిరా మణి.. ఇలాంటోళ్లు అసలు ఎన్ని వీక్స్ ఉంటాడు.. ఇది ఐదోవారం అయినా ఇంకా ఉన్నాడు.. ఎదుటివాళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటూ.. నమ్మించి మోసం చేయడం.. ఇదేం గేమ్‌రా.. ఆయన్ని చూస్తేనే నాకు కోపం వస్తుందంటూ యష్మీ రెచ్చిపోయింది. నువ్వు వాడిని గ్రేట్ ఫ్రెండ్ అన్నావు కదా అంటూ ప్రేరణ అడిగితే.. నమ్మాను ఫ్రెండ్ అని, పాపం నాలాగా బ్యాడ్ స్టోరీ ఉందని సపోర్ట్ చేయాలని కానీ చాలా డేంజరస్, క్రిమినల్ ఫేస్ ఉందని నేను అనుకోలేదంటూ యష్మీ అంది. ఇక ఐదు వారాల ఆటలో మొత్తానికి ఒక టాస్కులో అయితే యష్మీ గెలిచింది. 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' ఛాలెంజెస్‌లో భాగంగా 'జాగ్రత్తగా నడువు. లేకపోతే పడతావ్' అనే టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. ఈ గేమ్ ఏంటంటే బాస్కెట్లో ఉన్న 8 బాల్స్‌ను అటువైపు మరో బాస్కెట్లో వేయాలి.. కానీ 'సీసా' (seesaw) మీదుగా బ్యాలెన్స్ చేసుకుంటూ అందులో వేయాలి.. 8 నిమిషాల్లో ఎవరైతే ముందు వేస్తారో వాళ్లు విన్నర్.. గేమ్‌లో ముందుగా బాల్స్ అన్నీ వేసిన మణికంఠ దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయాడు. మరోవైపు యష్మీకి అటు నిఖిల్, ఇటు పృథ్వీ సలహాలు ఇస్తూ మొత్తానికి గెలిపించేశారు. ఇక గేమ్ గెలవగానే యష్మీ చేసిన ఓవరాక్షన్ మాములుగా లేదు.  ఆ తర్వాత పెట్టిన మూడో ఛాలెంజ్‌లో ఆదిత్య-నబీల్ పోటీపడగా ఆదిత్య గెలిచాడు. దీంతో ప్రేరణ దగ్గరికెళ్లి.. గేమ్ అనగానే నబీల్ పరిగెత్తుకొస్తాడు.. కానీ ఏమన్నా ఆడాడా అంటే బక్వాస్‌గా ఆడాడని యష్మీ అంది. అయితే మొన్న వీకెండ్ ఎపిసోడ్‍‌లో నాగార్జున ముందు నబీల్ గురించి యష్మీ ఎలా పొగిడిందో తెలిసిందే. ఆట అంటే నబీల్‌లా ఆడాలి సర్.. అంటూ నాగార్జున ముందు చెప్పి ఇప్పుడు ఒక్క గేమ్ తను గెలవగానే నబీల్ గేమ్ బక్వాస్ అంటూ కామెంట్లు చేసింది యష్మీ. ఇది బ్యాక్ బిచ్చింగ్ అంటే.. మనిషి ముందు ఒకలా మనిషి లేనప్పుడు ఒకలా.. కన్నింగ్ మైండ్ సెట్ తో ఉన్న యష్మీని చూసి నెటిజన్లు మండి పడుతున్నారు.  ఇక హౌస్ లో నిన్న జరిగిన టాస్క్ లలో స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో విష్ణుప్రియ, నిఖిల్ పోటీపడగా.. ఇన్ టైమ్ లో ఎవరు పూర్తిచేయలేకలోయారు. రెండో టాస్క్ లో మణికంఠ, యష్మీ పోటీపడగా.. యష్మీ గెలిచింది‌. మూడో టాస్క్ లో ఆదిత్య, నబీల్ పోటీపడగా.. ఆదిత్య గెలిచాడు.

Brahmamudi : భార్యాభర్తల మధ్య పోటీ.. గెలిచేదెవరంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -529 లో....కళ్యాణ్ ఆటో నడుపుతున్న విషయం అప్పుకి తెలుస్తుంది. దాంతో కళ్యాణ్ పై కోపంగా అప్పు ఇంటికి వెళ్తుంది. మరొకవైపు రాజ్ మరియు స్టాఫ్ అందరు డిజైన్స్ వేస్తుంటారు. స్టాఫ్ అందరు ఒక్కొక్కరుగా అందరు ఇంటికి వెళ్తుంటారు. శృతి మాత్రం రాత్రి అయిన డిజైన్స్ ట్రై చేస్తూనే ఉంటుంది. అలాగే నిద్రపోతుంది.. ఆ తర్వాత కావ్య భోజనం చేస్తుంటుంది. అప్పుడే తన బాస్ రేపు జరగబోయే డిజైన్ ఎక్స్పోకి మీరు రావాలి.. అక్కడ అందరికి పరిచయం చేస్తానని అంటాడు. ఆ తర్వాత ఎప్పుడు ఆ పోటీలో మా ఆయనకే అవార్డు వస్తుంది. ఆయన ఖచ్చితంగా అక్కడకి వస్తారు. నేను ఎదరుపడలేనని మనసులో అనుకోని నాకు వర్క్ ఉంది రాలేనని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఎందుకు వెళ్ళనని అంటున్నావని కనకం అడుగుతుంది. వాళ్లు కూడా వస్తారని కావ్య అనగానే.. అల్లుడు గారిని చూడగానే కరిగిపోయి మాట్లాడుతావనే భయంతో వెళ్లట్లేదు కదా అని కనకం అంటుంది. అంత సీన్ లేదు. ఆయన చేసిన పనికి తను వచ్చి బ్రతిమిలాడినా నేను వెళ్ళను. నువ్వు అంటున్నావ్ కాబట్టి నేను రేపు ఎక్స్పో కి వెళ్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ డిజైన్స్ వేసి శృతి దగ్గరకి వస్తాడు. తనని లేపి డిజైన్స్ అన్ని రేపు ఎక్స్పో కి సిద్ధంగా ఉండాలని డిజైన్స్ ఇస్తాడు. మరొక వైపు అనామికకి రుద్రాణి ఫోన్ చేస్తోంది. కావ్య డిజైన్ మేమ్ తీసుకున్నాం.. ఇక రేపు రాజ్ కి పోటీగా తన భార్య ఉండబోతుందని అనామిక చెప్పగానే రుద్రాణి సంబరపడుతుంది. రుద్రాణి వెనకాల స్వప్న ఉండి తన మాటలు వింటుంది. మా అత్త ఏదో ప్లాన్ చేసినట్లుంది. ఎందుకైనా మంచిది నేను రేపు ఎక్స్పో కీ వెళ్ళాలని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఇంటికి వస్తాడు. నన్ను మోసం చేసావంటూ అప్పు బాధపడుతుంది. మనం బ్రతకడానికి మాత్రమే చేస్తున్నానని అప్పుకి అర్థం అయ్యేలా చెప్తాడు కళ్యాణ్. మరుసటి రోజు కావ్య ఎక్స్పో కి వెళ్తుంటే.. అల్లుడు ఎదరుపడితే కూల్ గా మాట్లాడమని కనకం చెప్తుంది‌. ఆయన కూల్ గా మాట్లాడితే నేను మాట్లాడతానని కావ్య అంటుంది. మరొకవైపు రాజ్ ఎక్స్పో కి వెళ్తుంటే అపర్ణ పూజ చేసి హారతి ఇస్తుంది. అందరు ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఆ తర్వాత నేను వస్తానని రుద్రాణి అనగానే అందరు షాక్ అవుతారు. నేను వస్తానని స్వప్న అంటుంది ఆ తర్వాత స్వప్న, రుద్రాణి, సుభాష్ , రాజ్ లు వెళ్తారు. ఈ ఇయర్ మనకే అవార్డు రావాలని సామంత్ టెన్షన్ పడతాడు. మనకే వస్తుంది కావ్య డిజైన్ చూసావ్ కదా అని అనామిక అంటుంది. రాజ్ కూడా తను అనుకున్నది సాధిస్తాడని సామంత్ అంటాడు. నువ్వు టెన్షన్ పడకని అనామిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప చేసిన ఆ పనికి పెళ్ళి ఆగిపోయింది.. బంధం తెంచుకున్నట్టేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -163 లో..... కావేరిని కాంచన ఇంటికి రప్పిస్తుంది. తనకి చీర ఇస్తుంది. ఆ తర్వాత బ్యాగ్ శ్రీధర్ కి ఇచ్చి.. ఏం చేసిన ఒప్పుకుంటానని అన్నారు కదా.. ఇక కావేరిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్లిపోండి అని కాంచన చెప్పగానే.. కావేరిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు శ్రీధర్. అతను వెళ్లిపోతుంటే కాంచన ఏడుస్తుంది. కార్తీక్ బాధపడతాడు. అక్కడున్నా దీప.. కాంచనకి దైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరొకవైపు స్వప్న, కాశీ లని దాస్ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆడపడుచు ఉంటే ఇప్పుడు మిమ్మల్ని సరదాగా ఆటపట్టించే వాళ్లని దాస్ అంటాడు. దీప వుంది కదా తను కాశీని సొంత తమ్ముడు లాగా చూస్తుందని స్వప్న అంటుంది. ఆ తర్వాత దాస్ వాళ్లకు హారతి ఇచ్చి ఆహ్వానిస్తాడు. మరుసటి రోజు  శ్రీధర్ చేసిన నమ్మకద్రోహాన్ని గుర్తుచేసుకుంటుంది కాంచన. ఈ విషయం దీపకి తెలిసిన చెప్పలేకపోయింది. మరి నువ్వు ఎందుకు చెప్పలేదు. మీ అమ్మ మోసపోనివ్వు అనుకున్నావా అని కాంచన కార్తీక్ ని అడుగుతుంది కాంచన. అప్పుడే శివన్నారాయణ దశరథ్ లు కాంచన ఇంటికి వస్తారు. కూర్చోండి నాన్న అని కాంచన అనగానే.. మర్యాద కోసం రాలేదు దశరథ్ కి ఇచ్చిన మాట చెప్పు అని శివన్నారాయణ‌ అంటాడు. నీకు కూతురు ఉంటే అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంటికి కోడలుగా ఇస్తావా అని దశరథ్ అంటాడు. నాకు అర్ధం అయింది. మొన్న కార్ కొనాలి అనుకున్న ఆ కార్ కొనాలి అంటే ఫ్యామిలీ గురించి వెరిఫికేషన్ చేస్తారమ్మ అన్నాడు. కార్ విషయం లోనే అలా ఉంటే ఇక నీ కూతురు జీవితం విషయంలో ఇంకా ఎలా ఆలోచిస్తారని కాంచన అంటుంది. ఆ తర్వాత నా కొడుకుకి నీ కూతురికి పెళ్లి జరగదు.. మాట తీసుకున్నా.‌. ఇప్పుడు మాటది ఏముందని కాంచన బాధపడుతుంది. సంబంధం మాత్రమే వద్దని అనుకున్నారా.. నాతో బంధం వద్దని అనుకున్నారా అని కాంచన ఎమోషనల్ అవుతుంటే.. వచ్చిన పని అయిపోయిందంటూ ఇద్దరు వెళ్ళిపోతారు. మరొకవైపు దీప ఇంటికి వస్తుంది. నువ్వు అనుకున్నది చేసావ్ కదా.. ఇక్కడ నీకు అవసరం లేదు.. వెళ్లి మా బావ దగ్గర ఉండమని జ్యోత్స్న అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ జ్యోత్స్న అని దీప కోప్పడుతుంది. చిన్నప్పటి నుండి బావ నా భర్త అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు అది జరగకుండా చేసావని జ్యోత్స్న అంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి.. నువ్వు చేసిన పనికి జ్యోత్స్న పెళ్లి ఆగిపోయిందని అంటుంది. దీప షాక్ అవుతుంది. నీ పెళ్లి ఎందుకు ఆగిపోతుంది. తప్పు చేసింది మీ మావయ్య కదా అని దీప అనగానే.. మా తాతయ్య వెళ్లి తప్పు చేసిన ఇంటి నుండి సంబంధం వద్దని చెప్పారట.. ఇక ఈ పెళ్లి జరగదని జ్యోత్స్న అంటుంది. దాంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భార్యకి సర్ ప్రైజ్ ఇచ్చిన భర్త.. మోస్ట్ హ్యాపీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -214 లో.....రామలక్ష్మి ఆలోచిస్తుంటే మాణిక్యం వచ్చి.. దేని గురించి ఆలోచిస్తున్నావని అంటాడు. ఆయనపై ఎటాక్ చేసింది ఇంట్లో వాళ్లే అని డౌట్ గాఉంది కానీ సాక్ష్యం లేకుండా ఎలా నిరూపిస్తామని రామలక్ష్మి అంటుంది. ఎటక్ చేసింది ఎవరో నేనే కనుక్కుంటా.. నాకు నీ హెల్ప్ కావాలని మాణిక్యాన్ని రామలక్ష్మి అడుగుతుంది. ఏదైనా చేస్తానని మాణిక్యం అంటాడు. ఎటాక్ చేసినా వాడిని చూసావా అని రామలక్ష్మి అడుగుతుంది. లేదు సిరి చూసి ఉంటుంది. తనని అడుగు అని మాణిక్యం సలహా ఇస్తాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పాకని రామలక్ష్మి అంటుంది. మాణిక్యం సరే అని అంటాడు. మాణిక్యం వెళ్తు సీతాకాంత్ తో వెళ్తున్నా అని చెప్తాడు. మీ కూతురుకు ఏది అంటే బాగా ఇష్టమని అడుగుతాడు. నా కూతురికి చందమామని చూస్తూ ఉయ్యాలా ఊగుతూ ఆవకాయ అన్నం తిన్నడం అంటే చాలా ఇష్టమని సీతాకాంత్ తో మాణిక్యం చెప్పి వెళ్లిపోతాడు.ఆ తర్వాత సిరి దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. సీతా సర్ పై ఎటాక్ చేసిన  వాడిని చూసావా అని అడుగుతుంది. నాకేం గుర్తు లేదని అంటుంది. ఆ తర్వాత గుర్తు వచ్చిందంటూ అతని చెయ్ పై స్నేక్ టాటూ ఉంటుందని చెప్తుంది. సరే ఈ విషయం ఎవరికి చెప్పకని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రాత్రి రామలక్ష్మి కళ్ళకి గంతలు కట్టి సస్పెన్స్ అంటూ ఇంటి ముందుకి తీసుకొని వెళ్తాడు సీతాకాంత్. ఉయ్యాలాలో కూర్చొపెట్టి గంతలు విప్పి ఉయ్యాల ఊపుతాడు . ళ్ళు తెరవమని అంటాడు. రామలక్ష్మి కళ్ళు తెరిచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా ఆవకాయతో భోజనం తినిపిస్తాడు సీతాకాంత్. దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తున్న శ్రీవల్లి.. వెళ్లి శ్రీలతకి చెప్పి తనని తీసుకొని వస్తుంద.  వాళ్ళు అలా హ్యాపీగా ఉండడం చూసి వాళ్ళని ఎలాగైనా విడగొట్టాలని శ్రీలత అనుకుంటుంది. మరుసటి రోజు నందిని ఇంట్లో పని చేసే అయోమయం బయటకు వస్తాడు. అతన్ని మాటల్లో పెట్టి ఆతని ప్లేస్ లో సీతాకాంత్ అప్పాయింట్ చేసుకున్న డిటేక్టివ్ నందిని ఇంటికి వెళ్తాడు. అయోమయం ఎక్కడ అని నందిని, హారిక అడుగుతారు. తను నా బ్రదర్ అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళాడు. నన్ను ఇంట్లో వర్క్ చెయ్యమని చెప్పాడని వాళ్లకి డౌట్ రాకుండా డిటేక్టివ్ అంటాడు. మరొకవైపు రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్తుంటే సీతాకాంత్ అన్ని రెడీగా పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అయిదో వారం నామినేషన్లో ఉందెవరంటే!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. గతవారం సోనియా ఎలిమినేషన్ అవ్వగానే అటు హౌస్ మేట్స్, ఇటు ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక అయిదో వారం నామినేషన్లు జరిగాయి. ఇంట్లో ఎవరి ప్రయాణాన్ని బూడిద చేయాలనుకుంటున్నారో, ఎవరిలో గెలవాలనే ఫైర్ లేదో వారి ఫోటోని ఫైర్‌లో వేసి నామినేట్ చేయండి అని బిగ్ బాస్ కోరాడు. అలాగే చీఫ్ అయిన కారణంగా సీత, నిఖిల్‌లను ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక నామినేషన్స్ ప్రక్రియను మణికంఠ మొదలుపెట్టాడు. నైనికను నామినేట్ చేశాడు మణికంఠ. నీకు డెసిషన్ పవర్ తగ్గుతూ వస్తుంది.. కంఫర్ట్ రూమ్‌ నుంచి బయటికి రావట్లేదు.. నిన్ను బెడ్డు మీద తప్ప ఇంకెక్కడా నేను చూడట్లేదు.. నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం లేదు.. ఏదైనా సిచువేషన్ వచ్చినప్పుడు నువ్వు నీ అభిప్రాయం చెప్పాలి.. ఇక్కడున్న పది మందిలో నువ్వు డల్‌గా ఉన్నావంటూ మణికంఠ రీజన్స్ చెప్పాడు. దీనికి నేను అవసరం ఉన్న చోటే మాట్లాడతా.. అందరితో ఉండే నీ పర్ఫామెన్స్ ఏముంది అంటూ నైనిక కొశ్చనన్ చేసింది. ఇక తన రెండో నామినేషన్ యష్మీకి వేశాడు మణికంఠ. యష్మీ నాతో పాటు గుడ్ల టాస్కులో ఉన్నావ్.. నేను ఫిజికల్‌గా ఎంత కష్టపడినా నేను ఆడలేదని చెప్పావ్.. అది నాకు నచ్చలేదు. అలానే మాటలు వదిలేస్తున్నావ్.. నాగ్ సర్ ఆ ఫుటేజి చూపించకపోయి ఉంటే నాకు తెలిసేది కాదు.. నువ్వు అప్పుడే రియలైజ్ అయి సారీ చెప్పి ఉంటే బాగుండేది.. అంతా అయ్యాక నాగ్ సర్ చెప్పాకే సారీ చెప్పావంటూ మణికంఠ తన పాయింట్స్ చెప్పాడు. నబీల్‌ను నైనిక నామినేట్ చేసింది. ఫుడ్ చాలా ఇంపార్టెంట్ .. నువ్వు సంచాలక్‌గా ఉన్నప్పుడు తప్పు డెసిషన్ వల్ల మాకు రేషన్ పోయిందంటు నైనిక చెప్పింది. దీనికి సారీ చెప్పిన నబీల్.. అవసరమైతే నేను లాస్ట్ తింటా.. కడుపు నిండా మీరు తినండి.. అంటు పొలైట్ గా చెప్పాడు. ఇక తర్వాత విష్ణుప్రియను నామినేట్ చేసింది నైనిక. నా గురించి నువ్వు వేరే వాళ్ల దగ్గర చెప్పిన కొన్ని నేను విన్నాను.. అవి నాకు నచ్చలేదు.. అంటూ నైనిక అంది. నువ్వు చెప్పింది ఎక్కడికైనా వెళ్లి చెప్పి ఉంటే దానికి సారీ అంటూ విష్ణుప్రియ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఆ తర్వాత నాగ మణికంఠ, విష్ణుప్రియని కిర్రాక్ సీత నామినేట్ చేసింది. విష్ణుప్రియ, నైనికలని నబీల్ నామినేట్ చేశాడు. నైనిక, విష్ణుప్రియని ఆదిత్య ఓం నామినేట్ చేశాడు.నైనిక, నబీల్ ని విష్ణుప్రియ నామినేట్ చేసింది.  ఆదిత్య ఓం, నాగ మణికంఠని యష్మీ నామినేట్ చేసింది. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆదిత్య ఓం, నాగ మణికంఠ, నైనిక, నిఖిల్, విష్ణుప్రియ, నబీల్ నామినేషన్ లో ఉన్నారు.

Brahmamudi : భార్య డ్రీమ్ కోసం ఆటో నడుపుతున్న భర్త.. అసలేం జరిగిందంటే! 

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -528 లో..... రాజ్ దగ్గరకి ఇందిరాదేవి వస్తుంది. ఏం చేస్తున్నావని అడుగుతుంది. కళాకృతికి డిజైన్స్ పంపిస్తున్నానని చెప్తాడు. అక్కడ కళావతి అని రాసావని ఇందిరాదేవి అంటుంది. కూరగాయలు తీసుకొని రా అని ఇందిరాదేవి అనగానే వెళ్లి కావ్యకి ఇవ్వు తానే తెస్తుందని రాజ్ అంటాడు. కనకం ఇంటికి వెళ్లి చెప్పాలా అని ఇందిరాదేవి అనగానే.. రాజ్ కి కావ్య లేదన్న విషయం గుర్తుకువస్తుంది. మరొక వైపు కావ్యతో రాజ్ గురించి మాట్లాడుతుంది కనకం. దాంతో నాకు వర్క్ ఉందని కావ్య టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది. మరొకవైపు కళ్యాణ్ అలిగి భోజనం చెయ్యకుండా ఉంటాడు. భోజనం చెయ్ అని అప్పు అనగానే నేను చెప్పింది చేయనప్పుడు నువ్వు చెప్పింది నేనెందుకు వింటానని కళ్యాణ్ అంటాడు. పోలీస్ అనేది నీ కల.. అది నిజం చేసే బాధ్యత నాది.. నువ్వు కోచింగ్ తీసుకుంటే బాగుంటుందంటే నా మాట వినడం లేదని కళ్యాణ్ అనగానే.. అప్పు ఒప్పుకుంటుంది. దాంతో అప్పునే కళ్యాణ్ కి భోజనం తినిపిస్తుంది. మరొకవైపు అపర్ణ పూజ చేస్తుంటే రాజ్ కి నీరసంగా కన్పిస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి ఎందుకు ఇవన్నీ అంటాడు. నేను చెపింది విననప్పుడు నువ్వు చెప్పింది నేనేందుకు వినాలని అపర్ణ అంటుంది. వెళ్లి నా కోడలిని తీసుకొని రా ని అపర్ణ అనగానే.. అందరు తిరిగి తిరిగి అక్కడకే వస్తారెందుకు? నువ్వు రమ్మని చెప్పినా రాలేదని రాజ్ అనగా.. అంతలా తన మనసు విరిచేసావని అపర్ణ అంటుంది. ఆ తర్వాత కావ్య డిజైన్స్ తీసుకొని ఆఫీస్ కి వెళ్తుంది. కావ్య ఎక్కడ వాళ్ళని చూస్తుందోనని సామంత్ అనామికలు టేబుల్ కింద దాక్కుంటారు.  మరొకవైపు శృతి వేసిన డిజైన్ బాగోలేదని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత కావ్య ఇచ్చిన డిజైన్స్ బాగున్నాయని చెప్తాడు ఆ తర్వాత తన బాస్ సామంత్ కి చూపిస్తాడు. బాగున్నాయి ఆ రాజ్ ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిని దూరం చేసుకున్నాడని అనుకుంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఆటోలో ఒక రౌడీ ఎక్కి డబ్బులు ఇవ్వకుండా వెళ్తాడు. డబ్బులు అడిగితే కళ్యాణ్ పై గొడవపడతాడు. అదంతా అప్పు చూసి వాడిని కొడుతుంది. నువ్వు ఆటో నడుపుతూ నాతో జాబ్ అని అబద్ధం చెప్తున్నావని అప్పు బాధపడుతుంది. తరువాయి భాగం లో డిజైన్ ఎక్స్పో కి రాజ్, రుద్రాణి వాళ్ళు వస్తారు. అక్కడ కావ్య ఎదరుపడితే తన మాటలతో బాధపెడుతుంది. ఆ తర్వాత ఇక అడుగడుగునా మీ కంపెనీకి మా కంపెనీ అడ్డు వస్తుందని రాజ్ తో సామంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఆ హగ్గులు చూసి మీ ఇంట్లో వాళ్ళు ఏం అనరా సోనియా!

  నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి సోనియా ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. ఇక బజ్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు షాకింగ్ రిప్లై ఇచ్చింది సోనియా.. అవేంటో చూసేద్దాం. హౌస్‌లో బెస్ట్ బాండింగ్ ఎవరితో ఉందని యాంకర్ అడుగగా.. అభయ్, నిఖిల్, పృథ్వీ అని సోనియా చెప్పింది. నిఖిల్‌ పై మీ మీకు ఏ ఫీలింగ్ ఉందని సూటిగా అడుగగా.. మా అన్నలాగ.. ఇంట్లో వాళ్లలాగ అని సోనియా అంది. ఆ సమాధానం విన్న అర్జున్‌కి దిమ్మతిరిగిపోయింది. ఏంటీ అన్నా? అని తలపట్టుకున్నాడు యాంకర్. బిగ్ బాస్ హౌస్‌లో వాళ్లని మ్యానిప్యులేట్ చేసినట్టు నన్ను కూడా మ్యానిప్యులేట్ చేయకు అక్కా అని యాంకర్ అన్నాడు. నువ్వు ఫీల్ అవ్వనంటే ఓ ప్రశ్న అడుగుతా.. పృథ్వీ ఆవేశమే అతని మైనస్ అని నీకు తెలిసినా.. వాడ్ని ఒక వెపన్‌లా వాడింది నిజం కాదా? ముందుండి నడిపిస్తున్నా అని మీరు అనుకున్నా.. వెనుకుండి నడిపిస్తున్నారనేది మా ఆడియన్స్‌కి తెలుసని యాంకర్ అనగా.. పృథ్వీకి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పా అని సోనియా అంది. చేయాల్సిందంతా చేసేసి.. ఏమి తెలియనట్టు కూర్చుంటారు.. కపటనాటక సూత్రధారి అని యాంకర్ అన్నాడు. సరే.. హౌస్‌లో వీక్ పర్సన్ ఎవరని అనుకుంటున్నారని అడుగగా.. నైనిక అని సోనియా చెప్పింది. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసు.. వీక్ పర్సన్ నిఖిల్ అని అనుకుంటున్నారంటు యాంకర్ అన్నాడు. హౌస్‌లో ఆడపులి అని నీకు నువ్వే బిరుదు ఇచ్చేసుకున్నావా అని యాంకర్ అడుగగా..  నన్ను ఇంట్లో కూడా అలాగే అంటారని సోనియా అంది. ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడుతుంది.. పిల్లిలాగ వెనుక నుంచి కాదని యాంకర్ అన్నాడు. నీ వల్ల నిఖిల్, పృథ్వీలు.. బాధితులుగా మారారని యాంకర్ అనగా.. నా బాధితులు అయితే వాళ్లు కదా బయటకు రావాలి.. నీనెందుకు వచ్చానని సోనియా చెప్పది. వాళ్లు బాధితులు.. మీరు బాధపెట్టిన వాళ్లు కాబట్టి బయటకు వచ్చారని యాంకర్ అన్నాడు. సరే చూద్దాం.. వాళ్లు ఎన్ని రోజులు ఉంటారా అని సోనియా అంది. ఒక్క మాట అంటే సోనియాని అడల్ట్ రేటెడ్ అని.. ఇంట్లో వాళ్లు చూస్తారని అన్నారు.. ఈ హగ్‌లను ఇంట్లో వాళ్లు చూడరా అని అడుగగా.. అవి హగ్‌లు కాదు.. స్పెషల్ మూమెంట్స్ అని సోనియా అంది. నిఖిల్‌కి ఒక మాట ఇచ్చావ్ కదా.. నువ్వు స్మోకింగ్ మానేస్తే అడిగింది ఇస్తారా అని.. ఏం ఇద్దాం అనుకున్నావని అడుగగా.. సోనియా మౌనంగా ఉంది. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? లేదంటే బ్లాంక్ అయిపోయారా? అంటూ అర్జున్ అనగానే.. సోనియా నోటి వెంట మాట రాలేదు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మీరు ఓ లుక్కేయండి.  

ఎలిమినేషన్ ముందే ఊహించిన సోనియా.. స్ట్రాంగ్ ఉండమని నిఖిల్ కి టిప్!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఓ కంటెస్టెంట్ ని ఇంత తీవ్రంగా వ్యతిరేకించారంటే అది సోనియా ఆకుల. హౌస్ నుంచి మోస్ట్ హేటెడ్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ వార్త ముందే బయటకు వచ్చేయడంతో.. అసలు ఆమె ఎలిమినేట్ అయిన తరువాత రియాక్షన్ ఏంటని.. ఎవరి గురించి ఏమి మాట్లాడిందో చూడాలని ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురు చూశారు.  సోనియా ఎలిమినేషన్ అయ్యాక నాగార్జున దగ్గరికి వచ్చేసింది సోనియా. హౌ ఆర్ యూ సోనియా అనగానే.. ఎనీ ఫీలింగ్ అని నాగార్జున అనగా.. అదేం లేదు సర్.. ఈ ఎలిమినేషన్‌ని ముందే ఊహించానని సోనియా అంది. ఇక తన జర్నీ చూసి నాగార్జున.. బ్యూటిఫుల్ జర్నీ సోనియా.. హ్యాపీ‌ మూమెంట్స్ , సాడ్ మూమెంట్స్ ఉన్నాయని నాగ్ అనగా.. గుడ్ వన్ సర్ అని సోనియా అంది. మార్నింగ్ నుంచి బయటికి రావడానికి సిద్ధంగానే ఉన్నాను.. నిజానికి నేను ఒంటరిని అయిపోయాను.. నేను కాలేజ్‌లో కూడా అంతే.. నన్ను అంతగా ఇష్టపడరు. కానీ నేను మారను.. ఉన్నది ఉన్నట్లు చెబుతాను.. తప్పు అయితే తప్పు.. ఒప్పు అయితే ఒప్పు చెబుతాను.. అంటూ సోనియా చెబుతూ ఉంటే.. ‘హా.. అది చాలా మందికి నచ్చదు’ అంటారు నాగార్జున. నిఖిల్, పృధ్వీ.. ఇద్దరూ నేను చెప్పింది ఏది విననే వినరు.. నేను కేవలం ఇలా కాదు అని సలహా ఇవ్వడమే తప్ప.. వాళ్లు విననే వినరని సోనియా అంటుంది. ఆ తర్వాత 'మహాతాలి' మెనూ బోర్డ్ తెప్పిస్తాడు నాగార్జున. అందులో ఉన్న ఐటమ్స్ కి హౌస్ మేట్స్ ఎవరు సెట్ అవుతారో చెప్పమని నాగ్ మామ అడిగాడు.  పులిహోరా విష్ణుకే వెళ్తుంది సర్.. ఆమెకు నచ్చితే ఎంతైనా చేస్తుంది. పులిహోరా కలుపుతూనే ఉంటుంది.. నచ్చకపోతే ఇక అంతే.. ఇంకేముండదిక.. అంది సోనియా. విష్ణు ఫొటోని పులిహోరాపై పెడుతూ. కాకరకాయ వేపుడు సీతూ సర్.. చేదు.. టక్ మని మాట్లాడేస్తుంది.. అండ్ తర్వాత ఇక మాట్లాడను ఇక అంతే ఇక అంటుంది. చేదుగా అంతే ఉంటుంది. ఆవకాయ.. ప్రేరణ. తను క్యూట్ అండ్ స్వీట్ కానీ.. తనకు నచ్చనిది ఏదైనా ఉంటే ఏదొకటి అంటూనే ఉంటుంది.. నబీల్ రోటీలాగే.. సాఫ్ట్‌గానే ఉంటాడు. పైకి అలా కనిపిస్తాడు కానీ.. మంచివాడే.. కేవలం నామినేషన్స్‌లో అలా ఉంటాడు కానీ.. తను చాలా సాఫ్ట్ సర్ అంటుంది. పాయసం పృథ్వీ.. తనను అంతా ఇష్టపడుతుంటారు.. అలాగే నిఖిల్ అన్నం లెక్క.. అన్నం లేకపోతే ఏం లేదు.. అంటే అక్కడ నువ్వు లేకపోతే ఏం మ్యాటర్ లేదు. యష్మీ చేపల పులుసు.. చాలా టఫ్‌గా ఉండటానికి ట్రై చేస్తుంది కానీ తను చాలా నైస్ అండ్ ఎమోషనల్. అప్పడం నైనిక... అప్పడం అంటే త్వరగా సులువుగా విరిగిపోతుంది. మెంటల్ స్ట్రెంత్ కావాలి తనకి. వీళ్లు ఏమనుకుంటారు.. అలా అనుకోకని అంటుంది. ఇక ఆ తర్వాత నిఖిల్ ని లేపి.. ఏంటి నిఖిల్ అని నాగ్ అడగగా.. ఎమోషనల్ అవుతాడు. స్ట్రాంగ్ గా ఆడు అని సోనియా అంటుంది. ఇక అందరికి బై చెప్పేసి బయటకు వచ్చేస్తుంది.   

Sonia elimination: ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేషన్..

  బిగ్ బాస్ సీజన్-8 లో ఓ శఖం ముగిసింది. అంటే ఇక్కడ శఖం అని ఎందుకు అన్నానంటే.. సోనియా ఇన్ ఫ్లూయెన్స్,  ఆ తర్వాత ఎలా కంటెస్టెంట్స్ ఉందనేది ఇప్పుడు తెలుస్తుంది. అదే హౌస్ లో నిన్న జరిగిన సండే ఎపిసోడ్ లొ సోనియా ఎలిమినేషన్ అయి బయటకు వచ్చింది. సోనియా ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సీజన్ సెవెన్ లో రతిక, సీజన్ 8  లో సోనియా అంటు.. అబ్బ సాయిరాం సోనియా ఎలిమినేషన్ అయ్యిందంటూ తెగ కామెంట్లు చేసేస్తున్నారు అభిమానులు.  ఇక నామినేషన్ లో ఉన్నవారందరిని సేవ్ చేస్తూ చివరగా అదిత్య ఓం, సోనియా, మణికంఠ మిగలగా వారిని యాక్షన్ రూమ్ కి పంపించాడు నాగ్ మామ. అక్కడ ఆదిత్య ఓం సేవ్ అయ్యి హౌస్ లోకి వచ్చాడు.  చివరికి మణికంఠ, సోనియాలు మాత్రమే మిగిలారు. ఇక హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్‌తో నాగార్జున మాట్లాడుతూ.. మీరు మణికంఠ ఆటలో పనికి రాడు.. జీరో అని అన్నారు. అతను డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అలాగే ఆడియన్స్ సోనియాని లీస్ట్ ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో పెట్టారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.. హౌస్‌లో ఉన్న మీ తొమ్మది మంది.. ఎవరి పక్షాన నిలబడితే వాళ్లు హౌస్‌లో ఉంటారు. మిగిలిన వాళ్లు ఎలిమినేట్ అవుతారు. సోనియా, మణికంఠలో ఎవరు ఉండాలో వెళ్లాలో నిర్ణయం మీదే అని అన్నారు నాగార్జున. మీరు వేసే ఓటింగ్ మీకు నాకు తప్ప యాక్షన్ రూంలో ఉన్న వాళ్లకి తెలియదు. కానీ మిమ్మల్ని ఆడియన్స్ వాచ్ చేస్తుంటారు.. మీకు 8 సెకన్లు మాత్రమే టైమ్ అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు‌ నాగార్జున. ఈ మణికంఠ హౌస్‌లో ఉండాలని కోరుకునే వాళ్లు లేచి నిలబడండి అని నాగార్జున అడిగాడు. దాంతో హౌస్‌లో ఉన్న తొమ్మది మందిలో.. నిఖిల్, పృథ్వీ, నైనికలు తప్ప.. మిగిలిన ఆరుగురు నబీల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, ప్రేరణ, విష్ణు ప్రియ, సీతలు మణికంఠే సేవ్ అవ్వాలని స్టాండ్ తీసుకున్నారు. దాంతో ఆడియన్స్ ఓటింగ్, హౌస్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేట్ అయ్యిందని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మణికంఠ డేంజర్ జోన్‌ వరకు వచ్చినందున తనని జైలుకి పంపిస్తున్నట్టు.. జైలు నుంచి ఎప్పుడు బయటకు రావాలనేది బిగ్ బాస్ ప్రకటిస్తారని నాగార్జున చెప్పాడు.  దాంతో మణికంఠ తనని సేవ్ చేసిన ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు  

Honeymoon Photographer web series review: హనీమూన్ ఫోటోగ్రాఫర్ రివ్యూ

  వెబ్ సిరీస్ : హనీమూన్ ఫోటోగ్రాఫర్ నటీనటులు: ఆశా నేగి, సాహిల్ సలాధియా, రాజీవ్ సిద్దార్థ, ఆపేక్ష పోర్వల్, రీతూ రాజ్ సింగ్, సంవేదన తదితరులు సినిమాటోగ్రఫీ: సంతోష్ వసండి మ్యూజిక్: శివమ్ సేన్ గుప్తా నిర్మాతలు: రిషబ్ సేథ్ ఎడిటింగ్ , దర్శకత్వం: అర్జున్ శ్రీవాస్తవ ఓటీటీ: జీ5 కథ:  రోమేశ్ ఇరాని (రీతూ రాజ్ సింగ్) ఒక పెద్ద బిజినెస్ మెన్. అతని సంస్థలలో ఫార్మా కంపెనీ కూడా ఉంటుంది. ఆయన ఒక్కగానొక్క కొడుకు అధీర్ (సాహిల్ సలాథియా). అతను జోయా (ఆపేక్ష)తో ప్రేమలో పడతాడు. తండ్రికి ఇష్టం లేకపోయినా, ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. జోయాతో కలిసి మాల్దీవులకు హనీమూన్ ప్లాన్ చేస్తాడు. తమ వెడ్డింగ్ షూట్ కి వచ్చిన అంబిక (ఆశా నేగి)ని హనీమూన్ ఫొటోగ్రాఫర్ గా పిలుస్తారు. వాళ్లతో పాటు ఆమె మాల్దీవులకు వెళుతుంది. జోయాతో పెళ్లికి సంబంధించిన ఫోటోలను తీయడానికి వెళ్లినప్పుడే, అంబికపై అధీర్ మనసు పారేసుకుంటాడు. అతను జోయాతో సంతృప్తికరంగా లేడనే విషయం అంబికకి అర్థమవుతుంది. మాల్దీవులలో ఆమెకి రేహాన్ (రాజీవ్ సిద్ధార్థ) పరిచయమవుతాడు. అతనితో ఆమె చనువుగా ఉండటాన్ని అధీర్ తట్టుకోలేకపోతాడు. అంబికపై అధీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే విషయం జోయాకి కూడా అర్థమైపోతుంది. ఒక రోజు తెల్లవారేసరికి బీచ్ లో అధీర్ శవమై కనిపిస్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. అధీర్ తల్లి మీనా పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేయిస్తారు. అధీర్ రక్తంలో పాయిజన్ ఆనవాళ్లు ఉన్నట్టుగా తేలుతుంది. తమ కొడుకును ఎవరు హత్య చేశారనేది తనకి తెలియాలని రోమేశ్ ఇరాని పోలీస్ డిపార్టుమెంటుపై ఒత్తిడి తెస్తాడు. దాంతో ఏసీపీ దివ్య రంగంలోకి దిగుతుంది.‌ అధీర్ ను హత్య చేసింది ఎవరనేది తెలియాలంటే, రోమేశ్ వెదుకుతున్న పెన్ డ్రైవ్ తమకి దొరకాలని అంటుంది. ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది? అధీర్ హత్యకి కారకులు ఎవరనేది మిగతా కథ. విశ్లేషణ: ఈ సిరీస్ మొత్తం చూసాక ఒక్కటే అనిపిస్తుంది.  ల్యాగ్ అండ్ స్లోకి కొత్త పేరేమో ఈ ' హానీమూన్ ఫోటోగ్రాఫర్' అనిపిస్తుంది. కథలో ఎంత బలమున్నా దానిని స్లోగా చూపిస్తే ఆడియన్ కి థ్రిల్ ఉండకపోగా నీరసం వస్తుంది. ఇందులోను అదే జరిగింది. సిరీస్ లో అధీర్ ఎప్పుడైతే చనిపోతాడో కథ ఆసక్తికరంగా మారుతుంది. కానీ దానిని చివరిదాకా కంటిన్యూ చేయలేకపోయారు మేకర్స్. కథలో కొత్తదనం ఉంది.. కానీ ల్యాగ్ అండ్ స్లోగా సాగడంతో అది అంతగా ఇంపాక్ట్ అనిపించదు‌. అసలు కథలోకి వెళ్లడానికి సమయఙ ఎక్కువ తీసుకున్నాడు దర్శకుడు. ఇన్వెస్టిగేషన్ లో ట్విస్ట్ లు థ్రిల్ల్స్ ఉన్నప్పటికి దానినే చివరి వరకు కొనసాగించలేకపోయారు. ఒక రెండు సీన్లలో అడల్ట్ సీన్స్ ఉంటాయి. మిగతాదంతా పర్వాలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా తీసారు మేకర్స్. కానీ ఇది సిరీస్ లా కాకుండా సీరియల్ లా అనిపిస్తుంది.  కథని సరిగ్గా ప్రెజెంట్ చేయాలంటే మూడు ఎపిసోడ్ లలో సరిపోతుంది కానీ దర్శకుడు ఆరు ఎపిసోడ్ ల వరకు సాగదీసాడు. ఇక ఇందులో ఇన్వెస్టిగేషన్ ఒక్కటి తప్పితే ఏదీ అంతగా సెట్ కాలేదు. కానీ ఇది బాగా ఖాళీగా ఉండేవారికి మంచి టైమ్ పాస్ అయ్యేలా ఉంటుంది కానీ కథ, లాజిక్స్ అడుగక్కూడదు. సిరీస్ మొదలయ్యాక స్కిప్ చేయకుండా ఉండే ఎపిసోడ్ ఏదీ ఉండదు. సంతోష్ వసండి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. ఓకే మ్యూజిక్. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: జోయా గా ఆపేక్ష, అధీర్ గా సాహిల్  సలాథియా, అంబికగా ఆశా నేగి ఆకట్టుకున్నారు. ఇక మిగతావారంతా వారి పాత్రల పరిధి మేరకి నటించారు.  ఫైనల్ గా :  బాగా ఖాళీగా ఉంటే మాత్రమే చూడాలి. జస్ట్ వన్ టైమ్ వాచెబుల్ ఫర్ ఇన్వెస్టిగేషన్.  రేటింగ్ :  2.25  / 5 ✍️. దాసరి మల్లేశ్

సోనియా, నిఖిల్ కి నాగార్జున మాస్ వార్నింగ్.. మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం?

బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో.. ఈ వారమంతా బిగ్ బాస్ చూసిన ఆడియన్స్ ఏం అనుకున్నారో.. నాగార్జున ఎవరిని ఏం అన్నాడో చూద్దాం. (Bigg Boss 8 Telugu) నిఖిల్, సోనియా, పృథ్వీ ముగ్గురికి ఇచ్చిపడేశాడు నాగార్జున. అసలేం జరిగిందంటే.. హౌస్ లో హీరో ఎవరు? జీరో ఎవరో చెప్పమని ప్రేరణని నాగార్జున అడుగగా.. నబీల్‌ తన హీరో అని చెప్పింది ప్రేరణ.. వాడిలో చాలా ఫన్, ఎమోషన్ ఉంది.. ఒక మంచి హ్యూమన్ బీయింగ్.. లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటూ నబీల్ గురించి ప్రేరణ అంది. ఇక తన వరకూ జీరో నిఖిల్ అని ప్రేరణ చెప్పింది. అసలు నిఖిల్ పప్పులా ఆడుతున్నాడా లేక అతని స్ట్రాటజీనా అనేది తెలీడం లేదని ప్రేరణ అంది‌. తనకి ఓ క్లారిటీ లేదు.. వైల్డ్ కార్డ్ రాకూడదని.. అందరు యునైటెడ్‌గా ఆడాలని మాతో చెప్పాడు.. కానీ తర్వాత తన క్లాన్ మంచి కోసం అంటూ నబీల్‌ను తీసేశాడంటు ప్రేరణ చెప్పింది. దీంతో నిఖిల్‌ను నాగార్జున అడుగగా... ఏంటి నాన్న ఎందుకలా చేశావ్.. నబీల్‌ను తీసేయడం కరెక్ట్ డెసిషనా అంటూ అడగ్గా నిఖిల్ ఏదో చెప్పాడు. అది నాగ్‌తో పాటు ఎవరికి పెద్దగా కరెక్ట్ అనిపించలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపాలంటే స్ట్రాంగ్‌‌గా ఆడాలి కదా.. బిగ్‌బాస్ అన్ ఫిట్ వాళ్లని తీయాలన్నాడు. నువ్వెవరిని తీశావంటూ నాగార్జున ప్రశ్నించగా... దీనికి మిస్ బ్యాలెన్స్ అయింది సర్ కొంచెం అంటూ నిఖిల్ అన్నాడు‌. ఆ మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణమంటూ నాగార్జున అడిగాడు. ఇక మధ్యలో సీత కూడా లేచి నిఖిల్‌ గురించి కొన్ని మాటలు చెప్పింది. మొసట్లో నిఖిల్ చాలా కాంపిటేటివ్ అనుకున్నాను.. కానీ ఈజీగా ఫ్లిప్ అయిపోయినట్లు అనిపించింది.. అయిన వాళ్లు ముగ్గురూ కలిసే ఆడుతున్నారు.. నామినేషన్స్‌లో కూడా సోనియా తరపున వీళ్లు మాట్లాడుతున్నారంటూ సీత చెప్పింది. దీంతో నిఖిల్‌కి క్లాస్ పీకాడు నాగార్జున. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట చెప్తున్నావ్.. అది టెంపరెరీగా ఉపయోగపడుతుంది.. కానీ నీ ముందు ఎలా పిలిచినా నువ్వు లేనప్పుడు మాత్రం నిన్ను నారద అని పిలుస్తారంటూ నాగార్జున అన్నాడు. అందుకే నువ్వు చీఫ్‌గా ఉన్న ఆ క్లాన్‌కి ఎవరూ రావడానికి ఇష్టపడలేదంటూ నాగార్జున అన్నాడు ఇక ఆ తర్వాత సోనియాను లేపి ప్రశ్నించాడు నాగార్జున. సోనియా.. విష్ణు నిన్ను నిఖిల్ విషయంలో ఏదో అన్నప్పుడు అడల్ట్ రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నువ్వు చేసిందేంటంటూ యష్మీ గురించి నామినేషన్స్‌లో సోనియా అన్న వీడియోను ప్లే చేశి చూపించాడు నాగార్జున. ఇక్కడ నిఖిల్-పృథ్వీలను చూడటం మానేసి నన్ను చూస్తే తెలుస్తుందంటూ సోనియా అంది. దీన్నే దాని అర్థమేంటని నాగార్జున అడుగగా.. అది నిఖిల్ కూడా తప్పుగానే తీసుకున్నాడు సర్.. ఆరోజు నా హార్ట్ బ్రోక్ చేశాడు.. నా ఉద్దేశం అంది కాదంటూ సోనియా అంది. దీంతో ఆ మాట సోనియా అనడం రైటా అంటూ నిఖిల్-పృథ్వీలను లేపి నాగార్జున అడిగాడు. అప్పుడు కూడా లేదు సర్.. తన ఉద్దేశం అది కాదు మాకు తర్వాత క్లారిటీ ఇచ్చిందంటూ సోనియాకి పెద్దోడు-చిన్నోడు ఇద్దరు సపోర్ట్ చేశారు. దీంతో నాగార్జునకి కోపం వచ్చింది‌.  అక్కడ వీడియోలో క్లియర్ గా ఉంది కదా.. కళ్లతో చూసింది నమ్ముతారా.. తను చెప్పింది వింటారా అంటు నిఖిల్, పృథ్వీలని నాగార్జున అడుగగా.. అది కాదని వాళ్ళిద్దరు అన్నారు. ఇదంతా చూసి ఒళ్లు మండిన ప్రేరణ.. దీని వల్లే ఎవరు ఆ క్లాన్‌కి వెళ్లలేదు.. ఎవరు ఎంతలా చెప్పినా.. క్లియర్‌గా కనిపించినా దాన్ని కూడా కవర్ చేసి, ముగ్గురూ నీటిగా ప్రొటెక్ట్ అయి కూర్చోవడం వాళ్లకి అలవాటు అంటూ ప్రేరణ అంది. దీనికి ముగ్గురు కాదు కాదు అంటూ అనండతో నాగార్జున మాట్లాడాడు. విష్ణు..ఏం అనకుండానే అడల్ట్ రేటింగ్ అన్న నువ్వు, ఇది కూడా కరెక్ట్‌గా మాట్లాడాలి కదా అంటూ నాగార్జున అన్నాడు. ఇక మీ ఇష్టం.. మీ ఆటని మీరే నాశనం చేస్కోండి అంటు నిఖిల్, పృథ్వీలకి నాగార్జున చెప్పడంతో ఇద్దరు కూర్చున్నారు.

Eto Vellipoindi Manasu : నిఘా పెట్టిన నందిని.. అసలు ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -213 లో.....నందిని సీతాకాంత్ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే హారిక వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. అసలు సీతాపై ఎటాక్ జరగడమేంటి? ఇలా చూడడానికి మళ్ళీ వచ్చానా.. అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారని హారికతో‌ నందిని అంటుంది. సందీప్ తనతో మాట్లాడిన సంఘటన గుర్తుచేసుకొని.. ఇదంతా సందీప్ చేస్తున్నాడని నందిని అంటుంది. నువ్వు ఎలాగైనా సందీప్ దగ్గర నుండి ఒక్క క్లూ సంపాదించమని హారికకి‌ నందిని చెప్తుంది. మరొక వైపు డిటెక్టివ్ సీతకాంత్ కి ఫోన్ చేసి.. నందిని టీ తాగి ఆఫీస్ కి వెళ్ళిందంటూ చెప్తాడు. అసలు నువ్వు అవి చెప్తున్నావేంటి? నువ్వు డిటెక్టివ్ ఏనా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళు అందరు భోజనం చేస్తుంటే నేను వడ్డిస్తానని సీతాకాంత్ అంటాడు. అప్పుడే మాణిక్యం మటన్ కర్రీ తీసుకొని వస్తాడు. అల్లుడు నువ్వు ఇది తినాలి నేనే వడ్డిస్తానని అందరికి వడ్డీస్తాడు. అందులో మటన్ బొక్కలు ఎలా తినాలో సీతాకంత్ కి‌ మాణిక్యం చూపిస్తాడు. శ్రీవల్లితో సహా అందరూ తింటుంటే శ్రీలత కోపంగా వెళ్తుంది. మరొకవైపు సందీప్ ఆఫీస్ లో ఉండగా.. సందీప్ దగ్గరికి హారిక వెళ్లి ఫైల్ పై సంతకం చెయ్యండి అని సందీప్ ని ఇంప్రెస్స్ చేసేలా మాట్లాడుతుంది. సందీప్ ని మాటలో పెళ్లి తన టేబుల్ కింద ఒక బ్లూ టూత్ కనెక్ట్ చేసి పెడుతుంది. ఆ తర్వాత గట్టిగ ట్రై చేస్తే తను నాకు పడేలా ఉందని సందీప్ అనుకుంటాడు. ఆ తర్వాత నందిని బయటకు వచ్చి సందీప్ టేబుల్ కింద బ్లూటూత్ పెట్టాను.. తనేం మాట్లాడినా నీకు తెలిసేలా కనెక్ట్ చేసానని హరిక చెప్పగానే.. థాంక్స్ అని నందిని చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి మాణిక్యం వచ్చి.. ఏం అయిందని అలా ఉన్నావని అడుగుతాడు.‌ ఏం కాకూడదనే భయపడుతున్నాను.. ఇంటి దొంగని ఈశ్వరడైనా కనిపెట్టలేడని రామలక్ష్మి అంటుంది. సాక్ష్యం లేకుండా ఆరోపిస్తే సీతా గారి దృష్టిలో బ్యాడ్ అవుతాను.. అలా అని సైలెంట్ గా ఉంటే మళ్ళీ తనపై ఎటాక్ జరుగుతుందేమో భయంగా ఉందని రామలక్ష్మి అనగానే.. నీ భయంలో అర్థం ఉంది అని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss Telugu 8 : హౌస్ లో హీరో ఎవరు? జీరో ఎవరు?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాటి ఎపిసోడ్ లో ఎవరి పర్ఫామెన్స్ ఏంటో చెప్తూ హౌస్ మేట్స్ కి నాగార్జున క్లాస్ పీకాడు‌. హౌస్ లో ఎవరు హీరో? ఎవరు జీరో? చెప్పమన్నాడు నాగార్జున. మొదటగా మణికంఠని అడగ్గా.. సీత హీరోలా ఆడిందంటూ నెత్తిన కిరీటం పెట్టాడు. చీఫ్ అయిన తర్వాత సీతలో చాలా లీడర్ షిప్ క్వాలిటీస్ కనిపించాయి.. ఏదైనా సరే ధైర్యంగా చెబుతుందంటూ మణికంఠ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. దీంతో నీకే కాదు నాకు కూడా సీత హీరో అంటూ నాగ్ ప్రశంసించారు. తర్వాత తన దృష్టిలో నైనిక జీరో అంటూ చెప్పాడు మణికంఠ చెప్పాడు. ఫస్ట్ వీక్‌తో పోలిస్తే ఇప్పుడు ఆట పరంగా చాలా డౌన్ అయిందంటూ మణి అన్నాడు. " టూ హండ్రెడ్ పర్సంట్ కరెక్ట్ " నాగార్జున అన్నాడు. ఆ తర్వాత యష్మీకి అవకాశం ఇవ్వగా.. తనకి ఆట పరంగా నబీల్ హీరో అంటూ యష్మీ చెప్పింది. ఎప్పుడు తను గేమ్ ఆడినా.. అలా నేను కూడా ఆడాలనుకుంటానంటూ యష్మీ చెప్పింది. మరి ఎందుకు ఆడట్లేదంటూ నాగార్జున అడుగగా.. లేదు సర్ వంద శాతం ట్రై చేస్తున్నా అంటూ యష్మీ అంది. అంతేనా లేక ఎవరినో చూస్తూ ఆటలో ఆగిపోతున్నావా అంటూ సెటైర్ వేశారు నాగార్జున. ఇక తన వరకు జీరో అంటే నైనిక అంటూ యష్మీ చెప్పింది. ఇక తర్వాత నబీల్‌ ని అప్రిషియేట్ చేశాడు  నాగార్జున. టాస్కుల్లో చాలా బాగా ఆడుతున్నావ్ నబీల్.. అసలు బెలూన్ టాస్కులో అయితే చాలా గొప్పగా ఆడావ్.. నువ్వు పృథ్వీ అంటూ నాగ్ అన్నారు. ఇక నబీల్ తన దృష్టిలో హీరో పృథ్వీ అంటూ చెప్పాడు. పృథ్వీ బెలూన్ టాస్కు సూపర్‌గా ఆడాడంటూ చెప్పగానే నాగ్ కూడా పృథ్వీకి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. మూడు గంటలు ఫేస్ మీద చిరునవ్వు పోకుండా.. పాటలు పాడుకుంటూ ఆడావ్ గ్రేట్ అంటూ నాగార్జున అన్నాడు. ఇక తన వరకూ జీరో మణికంఠ అంటూ నబీల్ చెప్పాడు. మణికంఠకి క్లారిటీ లేదు.. సపోర్ట్ చేసేవాళ్లలోనే నెగెటివ్ తీసుకొని నామినేట్ చేస్తుంటాడు.. అంటూ నబీల్ చెప్పగా నాకు కూడా అదే అనిపిస్తుంది.. నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నామంటూ మణికంఠకి నాగార్జున చెప్పాడు. దీనికి ఉదాహరణగా టాస్కులో త్యాగం చేసిన వీడియో చూపించాడు. అక్కడ సెల్ఫ్ శాక్రిఫైజింగ్ పాయింట్ అనేది అవసరమా.. నీకు ఓ స్టాండ్ ఉంటే దాని మీదే నిలబడు.. ఎందుకు ఓవర్ థింకింగ్.. అంటూ నాగ్ క్లాస్ పీకాడు. అలానే మైక్ తీసి విసిరేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు. ఇక తర్వాత ఆదిత్య తన వరకూ హీరో నిఖిల్.. జీరో మణికంఠ అంటూ చెప్పాడు. నైనిక తనకి సీత హీరో.. మణికంఠ జీరో అంటూ చెప్పింది. తర్వాత ప్రేరణకి ఛాన్స్ ఇవ్వగా నబీల్‌ తన హీరో అని.. వాడిలో చాలా ఫన్, ఎమోషన్ ఉంది.. ఒక మంచి హ్యూమన్ బీయింగ్.. లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటూ ప్రేరణ అంది. ఇక తన వరకు జీరో నిఖిల్ అంటూ ప్రేరణ చెప్పింది. ఇక ఓవారాల్ హౌస్ లో హీరో ఎక్కువగా నబీల్ కి, జీరో ఎక్కువగా మణికంఠకి వచ్చింది. దాంతో మణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడు.