నాన్నతో చివరి హగ్ ఫోటో అదే.. నరేష్ లొల్ల వాళ్ళ నాన్న ఇక లేరు!

  నరేష్ లొల్ల.. అమర్ దీప్‌కి ప్రాణ స్నేహితుడు. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు.. అమర్ దీప్ గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు నరేష్ లొల్ల. జానకి కలగనలేదు, గీతాగోవిందం, రామచక్కని సీత వంటి సీరియల్స్‌లో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న నరేష్ లొల్ల.. బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అమర్ దీప్‌కి ప్రాణ స్నేహితుడు. గత సీజన్‌లో అమప్ దీప్ హౌస్‌లో గెలుపుకోసం పోరాడితే.. బయట ట్రోలర్స్‌తో పోరాడి వార్తల్లో నిలిచాడు నరేష్ లొల్ల. నరేష్ లోల్ల.. 'లొల్లాస్ వరల్డ్' అనే యూట్యూబ్ ఛానల్ లో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఇక కొన్ని గామడల క్రితం తన తండ్రి హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్తూ వ్లాగ్ చేశాడు. అందులో నరేష్ ఏం అన్నాడంటే..  ఇలాంటి పరిస్థితి తనకి వస్తుందని కలలో కూడా ఊహించలేదని, మీ బ్లెస్సింగ్ నాకు కావాలి. దీన్ని మీరు నెగిటివ్ అనుకున్నా పబ్లిసిటీ అనుకున్నా పర్లేదు. నాకు ఫస్ట్ టైం ఒక ఛాన్స్ వచ్చింది. మా డాడీ అంటే ఎంత ఇష్టమో.. పేరెంట్స్ అంటే ఎంత ఇష్టమో నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. నేను పుట్టినప్పటి నుంచి చాలా విషయాలు మా డాడీకి చెప్పుకోలేదు. అవన్నీ చెప్పుకోవాలని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశాను. మా డాడీకి 60 ఇయర్స్ బర్త్ డే సెలబ్రేషన్ చేశాను. ఆరోజు డాడీతో మనసు విప్పి మాట్లాడాను.  నేను పుట్టినప్పటి నుంచి నాతో చెప్పని చాలా విషయాలు ఆయన నాతో చెప్పారు. కానీ ఒక్కరాత్రిలో లైఫ్ మొత్తం మారిపోయింది. మా డాడీ హాస్పిటల్‌లో ఉన్నారు. ఆయన తొందరగా కోలుకోవాలి. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని బ్లెస్ చేయండి అని వ్లాగ్ చేశాడు. అయితే ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే నరేష్ లొల్ల వాళ్ళ నాన్న చనిపోయారు. ఇదే విషయాన్ని తెలుపుతూ లొల్ల తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశాడు.  

Karthika Deepam2 : పెళ్ళి చేసుకొని వచ్చిన స్వప్న, కాశీ.. నాన్నని పిలిపించమని పెద్దాయాన ఆర్డర్

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -160 లో.....స్వప్న, కాశీ లు కార్తీక్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. స్వప్నని జాగ్రత్త గా చూసుకో నిన్ను నమ్మి వచ్చిందని కార్తీక్ అనగానే.. ప్రాణం పోయినా చెయ్ వదలనని చెప్పి కాశీ స్వప్నని తీసుకొని వెళ్తాడు. దీప మాతో పాటురా అని కాంచన  అంటుంది. అందరి పెళ్లి చేస్తుంది. నా పెళ్లి చేయదా అని కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు. మరొకవైపు శ్రీధర్ కి స్వప్న ఫోన్ చేసి.. నేను క్షేమంగా ఉన్నాను.. మీరు టెన్షన్ పడకండి.. ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాను.. నేను కనపడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తారని కాల్ చేస్తున్నాను.. ఈవినింగ్ వస్తానని కాల్ కట్ చేస్తుంది స్వప్న. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకున్నట్లు చెప్పొచ్చు కదా అని కాశీ అంటాడు. ఎప్పుడు మా డాడే సర్ ప్రైజ్ ఇస్తాడా.. నేను ఇవ్వొద్దా అని స్వప్న అంటుంది. మరొక వైపు శ్రీధర్ కీ సుమిత్ర ఫోన్ చేసీ త్వరగా ఇంటికి రండి అన్నయ్య.. జ్యోత్స్న, కార్తీక్ ల పెళ్లి ముహూర్తం గురించి అని చెప్తుంది. దానికి శ్రీధర్ సరే అంటాడు. ఆ తర్వాత స్వప్న ఈవినింగ్ వచ్చాక ఎక్కడికి వెళ్లనివ్వకు వచ్చాక మాట్లాడతాను.. అక్కడ కొడుకు పెళ్లి గురించి ముహూర్తం అంట అని కావేరితో  శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర వాళ్ళందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే.. అప్పుడే స్వప్నని కాశీ తీసుకొని వస్తాడు. తనని చూసి పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. వీడిని ఇక్కడ నుండి పంపించాలని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత మమ్మల్ని ఆశీర్వదీంచండి అని పారిజాతంతో  కాశీ అంటాడు. దాంతో కాశీని తిడుతుంది పారిజాతం. అప్పుడే దీప, కార్తీక్ కాంచన లు వస్తారు. మమ్మల్ని ఆశీర్వదించండి అని కాశీ మళ్ళీ అనగానే పారిజాతం తిడుతుంది. మా పెళ్లి ఒక మంచి మనిషి సమక్షంలో జరిగిందని కాశీ అంటాడు. ఎవరి సమక్షంలో అని పారిజాతం అనగానే దీపక్క అని కాశీ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఈ పిల్ల మావయ్య కూతురని తెలిసే ఈ పని చేసినట్లు ఉందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత  స్వప్నని పారిజాతం తిడుతుంది. నన్ను తిట్టకండి. నాకు ఒక గౌరమైన ఫ్యామిలీ ఉందని స్వప్న అంటుంది. అందరు ఎక్కడ స్వప్న శ్రీధర్ గురించి చెప్తుందోనని టెన్షన్ పడుతారు. మీ నాన్న ఎవరో పిలిపించమని శివన్నారాయణ అనగానే.. కార్తీక్, దీప లు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : వాళ్ళిద్దరి ప్రేమకి మధ్యలో శ్రీలత.. ఆమె డ్రీమ్ నెరవేరుతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -211 లో.....పేపర్స్ పట్టుకోబోతుంటే రామలక్ష్మి అనుకోకుండా సీతాకాంత్ కి ముద్దు పెడుతుంది.. నీకు పెడతానని సీతాకంత్ అనగానే.. ముందు పని చూసుకోండి. బోలెడంత కాంపిటీషన్ ఉంది బయట అని అంటుంది. దాంతో సీతాకాంత్ బిట్ వెయ్యడని కొటేషన్ రెడీ చేస్తుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు నిద్రపోతుంటే.. అప్పుడే శ్రీవల్లి మెల్లిగా గదిలోకి వస్తుంది. సీతాకాంత్ రెడీ చేసిన కొటేషన్ ఎక్కడ ఉందని వెతుకుతుంది. ఆ తర్వాత టేబుల్ మీద కొటేషన్ కవర్ చూసి.. శ్రీవల్లి తీసుకోబోతుంటే అక్కడ కింద ఉన్న ర్యాట్ ప్యాడ్ పై కాలు వేస్తుంది. దాంతో కాలు స్టిక్ అవుతుంది. అలా కొటేషన్ కవర్ తీసుకొని మెల్లిగా ఆ ప్యాడ్ తోనే శ్రీలత దగ్గరికి వెళ్లి తియ్యమంటుంది. ప్యాడ్ తీస్తుండగా శ్రీలత చెయ్ కి అతుకుంటుంది. ఎలాగైనా విడిపించుకుంటారు ర్యాట్ ప్యాడ్. మళ్ళీ అక్కడే పెట్టు లేదంటే డౌట్ వస్తుందని శ్రీవల్లికి శ్రీలత చెప్తుంది. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి నిద్రలేచి రాత్రి జరిగిన విషయం గుర్తుచేసుకుంటుంది. సీతాకాంత్ రెడీ చేసిన కొటేషన్ ని దాచిపెటి రామలక్ష్మి రెడి చేసిన కొటేషన్ టేబుల్ పై పెట్టి ఎవరైనా వచ్చారో లేదో తెలుసుకోవడానికి ర్యాట్ ప్యాడ్ ని కూడా పెడుతుంది అది ఫోటో తీసుకుంటుంది. ఆ సంఘటన గుర్తుచేసుకొని ఈ పాటికి కొటేషన్ కొట్టేసి ఉండాలని ర్యాట్ ప్యాడ్ పెట్టిన చోట ఉందో లేదో ఫోటో చూస్తుంది. పెట్టిన చోట లేకపోయేసరికి ఎలుకలు వచ్చాయన్న మాట అని అనుకుంటుంది. ఆ తర్వాత కానిస్టేబుల్ సీతాకాంత్ దగ్గరికి వచ్చి.. మీపై ఎటాక్ జరిగింది కదా.. ఎవరిపైన అయిన డౌట్ ఉందా అని అడుగుతాడు. ఏం లేదని చెప్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. దూరం నుండి శ్రీవల్లి వింటుంది. ఏంటి అక్క పోలీస్ లు వచ్చారని అడుగుతుంది.  ఎటాక్ చేసిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయమన్నానని శ్రీవల్లిని భయపెడుతుంది. ఆ తర్వాత శ్రీవల్లి వెళ్లి శ్రీలత కి చెప్తుంది. ఆ తర్వాత ఇది ఎవరో కావాలనే చేశారని రామలక్ష్మి అంటుంది. నువ్వు అన్ని ఆలోచించకు.. ఆఫీస్ కి వెళ్ళమని శ్రీలత అంటుంది. బయటకు వచ్చాక నాపై డౌట్ రాలేదు. ఆ రామలక్ష్మిని ఉంచకూడదని శ్రీలత అనుకుంటుంది. మరొకవైపు రామలక్ష్మి బిడ్ వెయ్యడానికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్యకి గుడ్ న్యూస్.. అప్పు పోలీస్ జాబ్ తెచ్చుకోగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -525 లో....సీతారామయ్య ఫ్రెండ్ తన ఇంటికి వస్తాడు. ఇన్ని రోజులాగా మీ కంపెనీతో నా మనవడు కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. ఇక ఆ కాంట్రాక్టు కాన్సిల్ చేసుకున్నాడని అతను చెప్తాడు. ఎందుకు ఏమైంది అని సీతారామయ్య అంటాడు. మర్యాద తక్కువ అయింది.. నా మనవడిని రాహుల్ అవమానించాట అని అతను చెప్తాడు. ఇన్ని రోజుల నుండి మన మధ్య స్నేహం ఉంది కాబట్టి ఆ విషయం చెప్పాడనికి వచ్చానని అతను అనగానే చాలా థాంక్స్ రా ఇప్పటికైనా మా కంపెనీలో ఏం జరుగుతుందో తెలియజేశావని సీతారామయ్య అంటాడు.  ఆ తర్వాత అతను వెళ్లిపోయాక రాహుల్ ఎందుకు ఇలా చేసావ్ అంటూ తిడుతారని ముందుగానే రాహుల్ ని తిడుతుంది రుద్రాణి. నటించింది చాలు ఎక్కడ మేమ్ తిడుతామో అని తిట్టినట్లు నటిస్తున్నావ్ కదా అని ఇందిరాదేవి అంటుంది. ఆ రోజే కావ్య చెప్పింది.. రాహుల్ వద్దు ఇలాంటి సిచువేషన్ వస్తుందని కానీ పట్టించుకోలేదు. ఇక నుండి రాజ్ ఆఫీస్ కి వెళ్తాడని సీతారామయ్య చెప్తాడు. నేను వెళ్ళను.. పిన్నికి ఇష్టం అయితే వెళ్తా అని రాజ్ అంటాడు.... నా కొడుకు న్యాయం జరగాలి అన్నాను కానీ అది పక్కన పెట్టి ఈ విషయం ఆలోచిస్తున్నారు.. రాజ్ ఆఫీస్ వెళ్లడం నాకు ఇష్టమే కానీ కళ్యాణ్ ని ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత రాజ్ దే అని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తాన్నాడు అని న్యూస్ తెలిసి కావ్యకి కనకం చెప్పాలని వస్తుంది. నాకేం చెప్పొద్దని కావ్య అనగానే సరే మీ ఆయన గురించి మా ఆయనకి చెప్తానని కనకం అంటుంది. రాజ్ ఆఫీస్ కి వెళ్తున్నాడంట రాహుల్ ఏదో తప్పు చేస్తే మళ్ళీ రాజ్ ని వెళ్ళమన్నారంట అని అనగానే కావ్య కూడా వింటుంది. ఆ తర్వాత అందరిలో తిట్టావంటూ రాహుల్ కోపంగా ఉంటాడు. అప్పుడే స్వప్న వచ్చి.. మీ ఇద్దరి యాక్టింగ్ సూపర్ సొంత కంపెనీలో ఇలా చేసేవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నానని స్వప్న అంటుంది. మరొకవైపు అప్పు పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే కళ్యాణ్ తనకి భోజనం తినిపిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నిఖిల్ నిజస్వరూపం బయటపడింది. గోతికాడ నక్క!

  బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి కంటెస్టెంట్స్ మరోసారి షాక్ అయ్యారు. అసలేం జరుగుతుందో అర్థం కానట్లుగా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం జరిగే టాస్క్ లలో రెండు క్లాన్స్ మధ్య చిచ్చు రేగింది.  నిన్న హౌస్ లో రెండు టాస్క్ లు జరుగగా అందులో ఒకటి సీత టీమ్ గెలవగా.. మరొకటి ఎవరు గెలవలేదు. ఇక నేడు తాజాగా రీలీజ్ చేసిన ప్రోమోలో శక్తి క్లాన్ గెలిచినట్లు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ కాంతారా టీమ్ నుండి ఒకరిని తప్పుకోమని చెప్పాలి మ కానీ కంటెస్టెంట్ ని తీసేసే పవర్ శక్తి క్లాన్ కి ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో కాంతారా టీమ్ నుండి నబీల్ ని తీసేశాడు నిఖిల్ . దాంతో కిర్రాక్ సీత, ప్రేరణ ఇద్దరు ఫుల్ ఫైర్ అయ్యారు. అలా ఎలా తీస్తారు. మన టీమ్ లో నబీల్ బాగా ఆడుతున్నాడు. అతడిని తీసేస్తే వాళ్ళే అన్ని టాస్క్ లు గెలుస్తారని కాంతారా టీమ్ భయపడుతుంది. ఇక మణికంఠ విషయంలో నిఖిల్, సోనియా, పృథ్వీ ఇచ్చిన ప్రెషర్ తో అతన్నే తప్పుకునేలా చేశారంటు ప్రేరణ, సీత అడుగగా.‌. ఎస్ అంటు మణికంఠ సమాధానమిచ్చాడు. దాంతో సోనియా అతడిపై ఫైర్ అయింది. ఇలా మోసం చేస్తావనుకోలేదంటు మణికంఠని ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుతుంది సోనియా. ఇక సోనియాతో పాటు నిఖిల్ , పృథ్వీ కూడా మణికంఠదే తప్పు అన్నట్టుగా మాట్లాడేసరికి అతను మైక్ విసిరిపారేసి వెళ్ళిపోయాడు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

మణికంఠ మగాడు కాదంటూ నీచంగా మాట్లడిన యష్మీ...

  బిగ్ బాస్ చరిత్రలో ఓ మగాడి గురించి ఇంత నీచంగా మాట్లాడిన సందర్భం లేదు. బహుశా యష్మీ మాట్లాడిన మాటలే ఫస్ట్ టైమ్. మణికంఠని ఫిజికల్ గా వీక్ అంటూ యష్మీ ఎటాక్ చేస్తుంది. తనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా మణికంఠని మాటలతో మానసికంగా ఇబ్బంది పెడుతుంది యష్మీ. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్ట్ ఎంట్రీలని ఆపడానికి కంటెస్టెంట్స్ కి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగా హౌస్ లో ఉన్న రెండు క్లాన్ల సభ్యలు తమకి సాధ్యమైనంతగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇలా టాస్క్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అందరు కూర్చొని మాట్లాడుకుంటారు. అలా నిన్న జరిగిన ఓ ఎపిసోడ్ లో మణికంఠని టార్గెట్ చేసి నిఖిల్, యష్మీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. మణికంఠ తనని ఓదార్చడంలో భాగంగా.. హగ్ చేసుకున్నాడని... పెద్ద డ్రామా క్రియేట్ చేసి తెగ ఫీల్ అయిపోయిన యష్మీ గౌడ.. అదే వ్యక్తిని మగాడే కాదంటూ నీఛంగా మాట్లాడింది. హౌస్ మొత్తం ఒక్క చోట కూర్చుని.. మణికంఠ మగతనం గురించి మాట్లాడి వాళ్ల క్యారెక్టర్‌లను బజారున పెట్టుకున్నారు. వీళ్లకంటే.. ఆ బజారున బతికేవాళ్లే నయం అన్నంత నీఛంగా మాట్లాడారు. అందరు కలిసి మణికంఠ మగతనంపై జోక్‌లు వేసుకుని నవ్వేశారు. అరెయ్ మణి అందరం ఇక్కడ ఉంటే నువ్వు ఒక్కడివే అక్కడ కూర్చున్నావేంటి ఇక్కడికి రా అని నిఖిల్ అనగానే.. ఇక్కడ మగాళ్ళు మాత్రమే కూర్చుంటారని యష్మీ అంది. అంటే మణికంఠ మగాడు కాదని అంది. ఇలా అతడి క్యారెక్టర్ ని పదేపదే కించపరుస్తూ మాట్లాడుతుంది యష్మీ. మరి బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూపై స్పందించడం లేదో ఏమో. వీకెండ్‌లో నాగార్జున అయిన ఈ ఇష్యూ మీద హెచ్చరిస్తారో.. లేదంటో యష్మీకి ఆ ఫ్రీడమ్ ని అలాగే కంటిన్యూ చేయమంటారో చూడాలి మరి.  ఈ వారం మణికంఠ నామినేషన్ లో ఉన్నాడు‌. నబీల్ తర్వాత ప్రేరణ, మణికంఠ ఉన్నారు. యష్మీ మాటలకి మణికంఠకి బీభత్సమైన పాజిటివిటి పెరిగింది. మరి ఈ ఇష్యూ ఎలా ముగుస్తుందో చూడాలి.  

ఈ దేశంలో రిగ్గింగ్ నేరం కానీ బెగ్గింగ్ నేరం కాదు

ఈ శుక్రవారం శనివారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో స్కిట్ ఒక్కోలా ఎంటర్టైన్ చేసింది. ఇందులో రౌడీ రోహిణి బాగా నవ్వించింది. ఇందులో రోహిణి బెగ్గింగ్ రోల్ లో నటించింది. బెగ్గింగ్ కోచింగ్ సెంటర్ పెట్టి అందులో అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈ కోచింగ్ సెంటర్ కి ఆటో రాంప్రసాద్, దొరబాబు ఇద్దరూ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారు. "మాకు జాబ్ లు ఇస్తామని చెప్పింది బెగ్గర్స్ గానేనా" అని ఆటో రాంప్రసాద్ అడిగేసరికి "అవును బెగ్గింగ్ కోసమే" అని చెప్పింది రోహిణి. దానికి ఆటో రాంప్రసాద్ కొంచెం ఫీలైనట్టు కనిపించాడు. "చీప్ గా అడుక్కోవడం ఏంటండీ దరిద్రంగా " అని అడిగేశాడు రాంప్రసాద్. "చీప్ గా అడుక్కోవడం ఏమిటి " అని అడిగాడు. "చీప్ గా అడుక్కోవడమా ...ఏమనుకుంటున్నావ్. ఈ దేశంలో రిగ్గింగ్ నేరం కానీ బెగ్గింగ్ కాదు" అని చెప్పింది రౌడీ రోహిణి. ఇక రోహిణి అడుక్కునే అమ్మాయి రోల్ లో బాగా నటించింది. దీంతో జడ్జెస్ ఐతే ఫుల్ జోష్ తో నవ్వేశారు. దాంతో శాంతి, రోహిణి ఇద్దరూ కలిసి జడ్జెస్ దగ్గరకి వెళ్లేసరికి వాళ్ళు ఒకరికి 10  , ఇంకొకరికి 8 మార్కులు వేశారు. ఇలా ఈ వారం జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో నబీల్...25 రోజుల్లో లక్షన్నర మంది ఫాలోవర్స్!

బిగ్ బాస్ హౌస్ లో నబీల్ ఓ కొత్త మార్పుని తీసుకొచ్చాడు. నిన్న మొన్నటి దాకా అసలెందుకు చూడాలి అనిపించిన ఈ సీజన్.. సోనియాని నబీల్ నామినేషన్  చేసిన తీరుతో చూడాలనే ఇంట్రెస్టింగ్ కలిగింది. హౌస్ లో ట్రయాంగిల్ రిలేషన్ షిప్ జరుగుతుంది. అది ఎవరని బిగ్ బాస్ చూసే ప్రతీ ఒక్కరికి తెలుస్తుంది. ఇక వీరిని స్ట్రాంగ్ గా అపోజ్ చేసిన వ్యక్తులలో నబీల్ టాప్ లో ఉన్నాడు. సందు దొరికినప్పుడల్లా వాయించేస్తున్నాడు. నబీల్‌ కాకుండా హౌస్‌లో ఉన్న మిగిలిన మేల్ కంటెస్టెంట్లు అందరూ అమ్మాయిల వెనకాల హగ్గుల కోసం తిరుగడమే సరిపోయింది. నిఖిల్ టాస్కులు బాగా ఆడుతున్నప్పటికీ అస్తమానం సోనియా వెనకాల తిరగడం, సపోర్ట్ చేయడం ఆడియన్స్‌కి అస్సలు నచ్చడం లేదు. అలానే మిగిలిన వాళ్లు కూడా సందు దొరికితే చాలు అమ్మాయిలన ఓదార్చడమే సరిపోతుంది. కానీ నబీల్, ఆదిత్య మాత్రం వీటికి దూరంగా ఉంటున్నారు. ఇక నబీల్ తన ఆటతీరు, మాట తీరుతో ఆడియన్స్‌ మనసులు గెలుచుకుంటున్నాడు. అందుకే ఈ వారం ఓటింగ్‌లో కూడా స్టార్స్‌ను తలదన్ని దూసుకుపోతున్నాడు నబీల్.  తొలిరోజు ఓటింగ్‌లోనే నబీల్ రికార్డులు కొట్టేశాడు. మరి ఇదే ఆటతీరు కొనసాగిస్తే టాప్ లో ఉంటాడనేది వాస్తవం. బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టేముందు నబీల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో 4 లక్షల 50 వేల మంది ఫాలోవర్లు ఉండేవారు. కానీ మూడు వారాలు గడిచాయో లేదో ఇప్పుడు నబీల్ ఖాతాలో దాదాపు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే 25 రోజుల్లోనే లక్షన్నర మంది ఫాలోవర్లు పెరిగారు. నిజానికి హౌస్‌లోకి వెళ్లిన 14 మందిలో ఈ రేంజ్‌లో ఫాలోవర్లు పెరిగింది ఒక్క నబీల్‌కి మాత్రమే. అసలు నబీల్‌కి పెరిగిన ఫాలోవర్లలో సగం మంది కూడా ఏ కంటెస్టెంట్‌ సంపాదించలేకపోయారు. ఇక నబీల్ టాస్క్ లో తన వంద శాతం ఎఫర్ట్స్ ఇస్తూ అందరికి బిగ్ బాస్ చూడాలనిపించేలా చేస్తున్నాడు.

యష్మీ రాక్ డెసిషన్.. నిఖిల్ , సోనియా కన్నింగ్ బయటపడిందిగా!

  సోమవారం నాటి నామినేషన్ కాంతారా టీమ్ వర్సెస్ శక్తి టీమ్ అన్నట్టుగా సాగింది. ఇక ఆ తర్వాత కొత్త ఛీఫ్ కోసం కంటెస్టెంట్స్ చేత సుత్తి టాస్క్ ఒక్కటి పెట్టాడు బిగ్ బాస్. అందులో చివరగా కిర్రాక్ సీత గెలిచి కొత్త చీఫ్ అయ్యింది.  ఇక కిర్రాక్ సీత క్లాన్ లోకి నైనిక, విష్ణుప్రియ, ఆదిత్య, యష్మీ , నబీల్ వచ్చారు‌. ఇక నిఖిల్ క్లాన్ లోకి ఎప్పటిలాగే సోనియా, పృథ్వీ ఉన్నారు. ఇక మణికంఠ వంతు రాగానే బిగ్ బాస్ మెలిక పెట్టాడు. సోనియా టీమ్ ఫుల్ అయ్యింది ఎవరినైన స్వాప్ చేసుకోవాలనగా‌‌.. సీత దానికి అంగీకరించలేదు‌. దాంతో నిఖిల్ క్లాన్ కి వెళ్ళాడు. ఇక చివరగా ప్రేరణ మిగిలింది. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ స్వాప్ చేసుకోమనగా.. ప్రేరణ నిఖిల్ టీమ్ లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు‌‌. దాంతో యష్మీ కన్విన్స్ అయ్యింది. అటు సీతకి, ఇటు ప్రేరణకి చెప్పేసి నిఖిల్ టీమ్ కి వెళ్లింది. దీన్ని బట్టి చూస్తే సోనియా, పృథ్వీ మినహా హౌస్ మొత్తం సీత టీమ్‌లోకి వెళ్లేందుకే ఇష్టపడ్డారు. ఇక ఈ చీఫ్ లోని కంటెస్టెంట్స్ సెలక్షన్ అయిపోయిన తర్వాత సీత తన టీమ్‌తో మాట్లాడింది. నిఖిల్‌, సోనియాలపై గట్టిగానే కౌంటర్లు వేసింది. నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ క్లాన్‌కి వెళ్లలేదు.. ఇప్పుడైనా వాళ్లకి అర్థం కావాలి.. ఫ్రెండ్ షిప్, బాండ్ గురించి వాళ్లారా మాట్లాడేది.. మరి రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకిచ్చాడురా అంటూ సీత కౌంటర్ల మీద కౌంటర్లు వేసింది. ఇక మరోవైపు నిఖిల్ ఎప్పటిలాగే పృథ్వీ, సోనియాలతో గుసగుసలు పెట్టాడు. యష్మీ తమ టిమ్ లోకి రావడం గురించి తన అనుమానాలని చెప్పాడు నిఖిల్. మణికంఠ.. అలానే యష్మీ కూడా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏంటో ప్రూ చేయాలనే వచ్చింది.. నెగెటివ్ ఏంటి పాజిటివ్ ఏంటని.. కానీ ఈరోజు టీమ్ సెలక్షన్‌తో నాకు ఓ క్లారిటీ వచ్చింది.. మన త్రీ వర్సెస్ హౌస్ అన్నట్లుగా మొత్తం మారిపోయిందని నిఖిల్ అన్నాడు. నీకు లేటుగా అర్థమైందా అంటూ పృథ్వీ అన్నాడు. అది కాదురా నిన్ను ఇష్టపడేవాళ్లు నన్ను ఇష్టపడేవాళ్లు కూడా అపోజిట్ అయ్యారు.. ఎవరి దగ్గర నాకు లిమిట్‌గా ఉండాలనే క్లారిటీ వచ్చింది..నా క్లాన్‌కి వచ్చేసరికి మీ ఇద్దరికీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తానని వాళ్లు అనుకుంటున్నారు. అయిన సోనియాను హేట్ చేసే యష్మీ.. నిన్ను (పృథ్వీ) ద్వేషించే మణికంఠ ఇద్దరూ నా టీమ్‌లోకే వచ్చారు చూడమని నిఖిల్ అన్నాడు. ఇక అదే సమయంలో యష్మీ రావడంతో వాళ్ళు టాపిక్ ని ఆపేసి నార్మల్ గా మాట్లాడుకున్నారు.

విష్ణుప్రియకి ప్రపోజ్ చేసిన పృథ్వీ!

  ఇదేందయ్యా సామి.. నిన్న మొన్నటి దాకా పృథ్వీ వెనకలా విష్ణుప్రియ ఎంత తిరిగినా పట్టించుకోలేదు. ఇప్పుడేమో తనకోసం ఏకంగా పాటలు పాడేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్-8 లో విష్ణుప్రియ, పృథ్వీ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుండే అతడిపై విష్ణుప్రియ కాస్త ఇష్టం పెంచుకుంది. ఇక హౌస్ లో‌ తనకి ఏది అడిగినా చేసి పెడుతూ.‌ కాఫీ కలిపి ఇస్తూ.. అలా అలా నడిపిస్తోంది. కానీ మన పృథ్వీ అసలు పట్టించుకోలేదు కానీ తాజాగా రిలీజైన ప్రోమోలో.. ఎవరెవరో .. నాకెదురైనా అని పృథ్వీ పాడాడు. ఇక ఇది ఎవరి కోసం పాడుతున్నావని అడుగగా.. విష్ణుప్రియ కోసమని పృథ్వీ చెప్పాడు. దాంతో హౌస్ అంత ఒకటే అరుపులు. వీరితో పాటు మన ఎడిటర్ మావ కూడా ఓ లవ్ సాంగ్ ఏసేసాడు. ఉండిపోరాదే గుండె నీదేలే అంట వారిద్దరిని చూపిస్తూ ఎడిటర్ ఈ ప్రోమోలో ఆడ్ చేశాడు.  హౌస్ లో కొత్తగా కిర్రాక్ సీత క్లాన్ మొదలైంది. ఇక కాంతారా టీమ్ కి శక్తి టీమ్ కి మధ్య టాస్క్ లు సాగుతున్నాయి. మరో రెండు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని బిగ్ బాస్ చెప్పడంతో.. కంటెస్టెంట్స్ అంతా తమ వంద శాతం ఎఫర్ట్స్ ఇస్తున్నారు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

డేంజర్ జో‌న్‌లో సోనియా, పృథ్వీ.. ఆ అమాయకపు చక్రవర్తిని బలి చేస్తారా?

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు గేమ్స్ భళే సాగుతున్నాయి. అయితే నామినేషన్ లో ఉన్న  ఆరుగురిలో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.  హౌస్ లో బాగా ఆడేది ఎవరంటే మొదటి రెండు వారాల్లో నిఖిల్, విష్ణుప్రియ, కిర్రాక్ సీత ఉండేది.‌ ఇప్పుడు కొత్తగా నబీల్ వచ్చేశాడు. మొదటి రెండు వారాలు సైలెంట్ గా ఉన్న నబీల్.. మూడో వారం నామినేషన్ నుండి ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. దాంతో ఓటింగ్ లో అతనికి అత్యదిక శాతం ఓట్లు పడుతున్నాయి. అంతకుముందు జరిగిన టాస్క్‌లలో కూడా నబీల్ అఫ్రిది అదరగొట్టిన సోనియాని నామినేషన్ చేసిన తర్వాతే అతనికి హైప్ వచ్చింది. ఎందుకంటే అతను గత సీజన్ భోళే షావలి లాగా పర్ఫామెన్స్ చేస్తూ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నాడు.  ఇక ఈ వారం ఎలిమినేషన్ కి దగ్గర్లో ఉన్నది ఆ ఇద్దరు గజదొంగలే.. అదే పృథ్వీ, సోనియా. అయితే ఓటింగ్ ప్రకారం సోనియా లాస్ట్ లో ఉంది.‌ ఎంత అంటే ఆదిత్య ఓం.. పృథ్వీ, సోనియాలపై ఉన్నాడు. ఈ సారి ఈ కన్నింగ్ బ్యాచ్ లో నుండి ఎవరైనైనా పంపిస్తాడా లేక ఆదిత్య ఓం ని బలిచేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి మన బిగ్ బాస్ మామ టీఆర్పీ కోసం పృథ్వీ, సోనియాని లోపలే ఉంచి .. మన అమాయాకపు చక్రవర్తి బలిచేస్తారా అని అనుకుంటున్నారు. మరి ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్ లో ఉన్న పృథ్వీ, సోనియాలలో ఎవరో ఒకరిని బయటకు పంపిస్తాడా లేక మరేదైనా ట్విస్ట్ ఇస్తాడా చూడాలి మరి.  

లక్ష గెలిచిన కాంతారా టీమ్.. నిఖిల్ టీమ్ నుండి మణికంఠ అవుట్!

  బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల పరంపర కొనసాగుతుంది. అయితే వైల్ట్ కార్డ్ ఎంట్రీలు.. హౌస్ లోకి రాకుండా ఆపే టాస్క్ లు‌ ఇవి.‌ మరి టాస్క్ లో‌ ఎవరు‌ గెలిచారో చూసేద్దాం. మొదటి టాస్కు 'బాల్ ని పట్టు టవర్ లో పెట్టు'.. ఇందులో మొదటగా నిఖిల్ అండ్ నబీల్ ఆడారు. ఆ తర్వాత ఇరు టీమ్ ల నుండి ఒక్కొక్కరుగా వచ్చి బాల్స్ ని వేయగా.. మొదటగా కాంతారా టీమ్ గెలిచింది. ఆ తర్వాత పన్నెండో నెంబర్  వైల్డ్ కార్డ్ ని తీసేసి కాంతారా ఫ్లకార్డ్ ని పెట్టేశారు.  ఇక ఈ టాస్క్ లో శక్తి టీమ్ ఓడిపోవడంతో నిఖిల్‌ను తన క్లాన్‌ నుంచి ఒక సభ్యుడిని తీసేయాలని బిగ్‌బాస్ కోరాడు. దీంతో అందరూ ఆలోచించుకొని మణికంఠను పక్కన కూర్చోబెట్టేశారు. అయితే ఇది కేవలం తర్వాతి టాస్కు వరకే కదు ఈ వారం మొత్తం మణికంఠ.. నిఖిల్ క్లాన్‌కి దూరంగా ఉండాలి. అలానే హౌస్‌లో ఏ టాస్కులోనూ పార్టిసిపేట్ చేయకూడదు. ఇలా మొత్తానికి అందరూ కూడబలుక్కొని మణికంఠను పక్కన కూర్చోబెట్టేశారు. ముఖ్యంగా యష్మీ, పృథ్వీ అస్తమానం మణికంఠ ఫిజికల్‌గా వీక్ అంటూ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే చెప్పి టాస్కుల నుంచి మణికంఠను కూర్చోబెట్టేశారు. ఇక ఆ తర్వాత ' ఈట్ ఇట్ అండ్‌ బీట్ ఇట్' సెకెండ్ టాస్క్ గా ఫుడ్ పంపించాడు బిగ్ బాస్. అదే 'మహా తాలి'. బిర్యానీ, చికెన్ ఫ్రై, పరోట ఇలా అన్నీ నాన్ వెజ్ కలిపి దాదాపు అయిదారుగురు తినే ఫుడ్ ని ఒకరు కంప్లీట్ చేయాలని బిగ్ బాస్ కోరాడు.‌ఇక ఇరు టీమ్ ల నుండి ఎవరొస్తారని అడుగగా.. నిఖిల్ టీమ్ నుండి సోనియా, సీత టీమ్ నుండి నబీల్ వచ్చారు. ఇక ఇద్దరికి నలభై అయిదు నిమిషాల్లో తాలిని తినాలని చెప్పాడు బిగ్ బాస్. ఇక వారిద్దరూ మరొకరిని హెల్ప్ కోసం పంపించాడు బిగ్ బాస్. యష్మీ, ఆదిత్య ఓం ఇద్దరు వెళ్ళగా వాళ్ళు కూడా ఆ తాలిని తినలేకపోయారు. ఇక నలభై అయిదు నిమిషాలు పూర్తవ్వడంతో బజర్ మోగించేశాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో ఏ టీమ్ గెలవలేదు. తర్వాతి టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.  

Brahmamudi : అనామిక ప్లాన్ లో‌ కావ్య కీలుబొమ్మ కానుందా.. భర్త వర్సెస్ భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -524 లో.....కనకం దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఏంటి పిలవని పేరంటానికి వచ్చావ్.. ఈ సాకుతో నీ కూతురిని కాపురానికి పంపించి చేతులు దులుపుకుందామనుకుంటున్నావా? అది ఈ జన్మలో జరగదని రాజ్ ఎప్పుడో చెప్పాడు కదా అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కనకం వెళ్లి.. తన మంచి చెడులు కనుక్కుంటుంది. అబ్బో కూతురు ప్రాణం మీదకి తెచ్చింది.. తల్లి కుశలం అడుగుడానికి వచ్చిందని రుద్రాణి అంటుంది. దాంతో రుద్రాణిపై అపర్ణ కోప్పడుతుంది. మీరు నా వాళ్ళ గొడవపడకండి అని కనకం అనగానే.. అవునులే మీ జీవితానికి సిగ్గా, శరమా అని రుద్రాణి అనగానే.. ఏదైనా జరిగితే నాకు కావ్యకి జరిగింది అంతే గాని వాళ్ళేం చేశారని రాజ్ అంటాడు. ఆ తర్వాత నా కూతురు అల్లుడు విడిపోలేదు.. అందుకు సాక్ష్యం అల్లుడు పక్కన నా కూతురు చీర ఉంది.. మరొకటి కావ్య తయారు చేసిన విగ్రహం తిరిగి ఈ ఇంటికే చేరింది. ఇది దైవ నిర్ణయమని కనకం అనగానే.. అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ షాక్ అవుతాడు. మరొకవైపు అనామిక సామంత్ కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఒకతనితో ఇప్పుడు కావ్య వస్తుంది. తనని డిజైన్ వెయ్యడానికి మీ కంపెనీలోకీ తీసుకొని ఆ డిజైన్స్ మాకు అమ్మాలని చెప్తుంది. దానికి అతను సరే అంటాడు. కావ్య వచ్చిందని తెలిసి ఫోన్ లైన్ పెట్టి అతని కావ్య దగ్గరికి అనామిక పంపిస్తుంది. మీకు నా కంపెనీలో జాబ్ ఇస్తున్నానని కావ్యకి అతను చెప్పగానే కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ మాటలన్ని అనామిక ఫోన్ లో వింటుంది. ఆ తర్వాత కావ్య హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఇంటికి వచ్చి జాబ్ వచ్చిందని చెప్తుంది. కానీ కనకం చిరాకు పడుతుంది. అల్లుడు వచ్చినా నువ్వు వెళ్ళలేదని అంటుంది. ఆ తర్వాత సీతారామయ్య ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడు వచ్చావంటే ఏదో పని వుండి వచ్చావని సీతారామయ్య అంటాడు. నా మనవడు శ్రీకాంత్ ఎప్పుడు మీ కంపెనీలో పెట్టుబడి పెట్టేవాడు.. ఇప్పుడు సామంత్ గ్రూప్ కంపెనీలో పెడుతున్నాడని అతను చెప్పగానే.. ఎందుకని సీతారామయ్య అడుగుతాడు. నా మనవడిని రాహుల్ అవమానించాడట అని అతను చెప్తాడు. తరువాయి భాగంలో రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే.. కంపెనీని వృద్ధి చెయ్ అని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. రాజ్ ఆఫీస్ కి వెళ్తున్నాడని చెప్తుంది. నా ప్లాన్ లో నేనున్నాను.. భర్త వర్సెస్ భార్య అని అనామిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : వాళ్ళిద్దరి పెళ్లి చేసిన దీప.. షాక్ లో కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -159 లో.... శ్రీధర్ ని దీప లోపలికి రాకుండా చేసి.. స్వప్న, శ్రీకాంత్ ల పెళ్లి ఆగిపోయేలా చేస్తుంది. పెళ్లి కొడుకు అమ్మాయి పోయే ఆస్తి పోయే అంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళండి అని దీప అనగానే.. ఇప్పుడు మా డాడ్ ని ఎలా ఆపారో తెలియదు కానీ ఆపారు.. కానీ ఇప్పుడు కాకపోయినా మళ్ళీ నాకు పెళ్లి చేస్తాడని స్వప్న అనగానే.. ఇప్పుడు మా పెళ్లి చేస్తేనే దీనికి సొల్యూషన్ అని కాశీ అంటాడు. దాంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత మాకు ఇప్పుడు పెళ్లి చెయ్యండి అంటూ దీపని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు. మరొకవైపు ఏంటి అండి.. ఫోన్ కట్ చేస్తున్నారని శ్రీధర్ దగ్గరికి  కావేరి వెళ్లి అడుగుతుంది. అక్కడ మా చెల్లి సుమిత్ర ఉందని చూపిస్తాడు. మరి పెళ్లి అని కావేరి అనగానే.. ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు కానీ ఇప్పుడు దొరికిపోతే ప్రాబ్లమ్ అవుతుందని శ్రీధర్ అంటాడు. మరొకవైపు కాశీ స్వప్నలకి దీప పెళ్లి చేస్తుంది. ఆ తర్వాత సుమిత్ర చూడకుండా.. శ్రీధర్, కావేరిలు లోపలికి వస్తుంటారు. దీప వాళ్ళని చూసి కాశీ, స్వప్నలని బయటకు పంపిస్తుంది. కావేరి, శ్రీధర్ లు వెళ్లేసరికి అక్కడ లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఉంటారని శ్రీధర్ కావేరిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. దీప దగ్గరికి సుమిత్ర వచ్చి.. నన్ను బయట ఉండమని చెప్పి నువ్వు లోపలికి వచ్చావ్ ఏంటని సుమిత్ర అంటుంది. అప్పుడే కాశీ ఫోన్ చేస్తాడు. నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్లున్నావ్ నేను కార్తీక్ జ్యోత్స్నల పెళ్లి ముహూర్తం అడుగుతాను. నువ్వు వెళ్ళమని సుమిత్ర అనగానే సరేనని దీప వెళ్తుంది. మరొకవైపు కార్తీక్ ఆలోచిస్తుంటే అప్పుడే సుమిత్ర ఫోన్ చేసి.. తాతయ్య పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఇంటికి అమ్మని తీసుకొని రమ్మని చెప్పాడు. వెళ్ళమని చెప్పగానే కార్తీక్ సరే అంటాడు. ఆ తర్వాత దీప వస్తుంది. మీరు ఒక జంటని దీవించండి అని చెప్పి.. స్వప్న, కాశీలని పిలుస్తుంది. వాళ్ళని చూసి నాతో ఒక్కమాట కూడా చెప్పలేదని కార్తీక్ అనుకుంటాడు‌. ఆ తర్వాత కాశీతో కాంచన మాట్లాడుతుంది. ఇద్దరిని కాంచన ఆశీర్వదిస్తుంది. కార్తీక్ ఇంకా షాక్ లోనే ఉన్నాడు.. ఆశీర్వాదం తీసుకుంటారు.. ఇబ్బందిగానే కార్తీక్ ఆశీర్వదిస్తాడు. ఎక్కడ వాళ్ళ నాన్న వస్తాడోనని కార్తీక్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అనుకోకుండా ముద్దు పెట్టుకున్న భార్య.‌. ఆ ప్రాజెక్ట్ ఎవరికంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -210 లో.....కంపెనీ బోర్డు మెంబర్ శ్రీలత వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. మొన్న మనం అనుకున్న ప్రాజెక్ట్ కి రేపే బిట్ వేస్తున్నారు. సీతాకాంత్ కీ కాకుండా వేరే వాళ్లకు బిట్ వచ్చేలా చేస్తే మనకి టెన్ పర్సంట్ కమిషన్ ఇస్తానని అన్నారని అతను చెప్తాడు. సీతాకాంత్ బిట్ వెయ్యడానికి వెళ్తే కచ్చితంగా ఆ బిట్ తనకి వస్తుందని అతను అంటాడు. తను రాకుండా నేను చూస్తాను కదా అని శ్రీలత అంటుంది. వాళ్ళ మాటలన్నీ దూరం నుండి రామలక్ష్మి వింటుంది. మీ ప్లాన్ లో మీరు ఉన్నారు.. నా ప్లాన్ లో నేను ఉంటానని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. రేపు బిట్ వేయడానికి వెళ్తున్నానని సీతాకాంత్ పెద్దాయనతో అంటాడు. నీకు రెస్ట్ అవసరం.. నువ్వు ఎక్కడికి వెళ్లొద్దని అంటాడు. మరి మీరు వెళ్ళండి తాతయ్య అని అనగానే వేరే మీటింగ్ ఉందని చెప్తాడు. బావ గారి తర్వాత మా అయన కాబట్టి మా అయన వెళ్తాడని శ్రీవల్లి అంటుంది. వద్దని రామలక్ష్మి అంటుంది. ఏంటి సందీప్ ని చేతకాని వాడు అనుకుంటున్నావా మనసులో ఏదో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావని శ్రీలత అంటుంది. ఒకవైపు రామలక్ష్మి మరొకవైపు శ్రీలత ఇద్దరు గొడవపడుతుంటే సీతాకాంత్ కోప్పడి వెళ్లిపోతుంటాడు. తినకుండా వెళ్తున్నావ్ నేను కూడా తిననని శ్రీలత అనగానే సీతాకాంత్ కూర్చుంటాడు. నీకు రామలక్ష్మి వెళ్లడం ఇష్టమైతే తననే పంపించు అని శ్రీలత అంటుంది. మరొక వైపు శ్రీవల్లి, సందీప్ లు కోపంగా ఉంటారు. అప్పుడే శ్రీలత వస్తుంది. మీరేంటి రామలక్ష్మిని బిట్ వెయ్యడానికి వెళ్ళమని చెప్పారని అంటారు..నువ్వు వెళ్తే బిట్ ఓకే కాకపోతే సీతాకాంత్ తిడతాడు. అదే రామలక్ష్మి బిట్ వేస్తె రాకపోతే రామలక్ష్మిపై సీతాకాంత్ కోప్పడతాడు. అంతే కాకుండా ఆ బిట్ రామలక్ష్మి కి రాకుండా మనం చేయాలని శ్రీలత అంటుంది. మరొకవైపు సీతాకాంత్ బిట్ కి సంబంధించిన కొటేషన్ రెడీ చేస్తుంటే రామలక్ష్మి వస్తుంది. ఫ్యాన్ వేసుకులేదు అని ఫ్యాన్ వేస్తుంది. పేపర్స్ అని గాలికి ఎగిరిపోతాయ్. దాంతో ఇద్దరు పట్టుకున్నే ప్రయత్నం చేస్తుంటే రామలక్ష్మి అనుకోకుండా సీతాకాంత్ కి ముద్దు పెడుతుంది. నువ్వు నాకు పెట్టావ్ వడ్డీతో సహా తిరిగి ఇస్తానని సీతాకాంత్ సరదాగా మాట్లాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్‌లోకి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ... కంటెస్టెంట్స్ కి బిగ్ షాక్!

  తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నేటి ఎపిసోడ్ ఉండబోతుందని తాజాగా విడుదలైన ప్రోమోని చూస్తే తెలుస్తుంది. హౌస్ లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేషన్ అయి బయటకు వెళ్లారు. ఇక ఈ వీక్ సర్వైవల్ వీక్ అని చెప్తూ బిగ్ బాస్ ప్రోమోని వదిలాడు. అంటే హౌస్ లోకి ఒక్కటి కాదు అయిదు కాదు మొత్తంగా పన్నెండు(12) మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవ్వబోతున్నారని బిగ్ బాస్ చెప్పడంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. ఇక మొదటిసారి హౌస్ లోని వాళ్ళకి ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే హౌస్ లో కొన్ని టాస్క్ లు పెడతాడు బిగ్ బాస్. హౌస్ లోని వాళ్ళు ఆ టాస్క్ లు తమ ఎఫర్ట్ పెట్టి ఆడి గెలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదు. అంటే ఎన్ని టాస్కలు గెలుస్తారో అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండవని అర్థం. ఇక హౌస్ లో ఇక నుండి ట్విస్ట్ ల‌ మీద ట్విస్ట్ లతో గేమ్స్ ఉండబోతున్నాయని ప్రోమోని బట్టి తెలుస్తుంది. ' వైల్డెస్ట్ ట్విస్ట్ ఎవర్' అంటూ వదిలిన ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ షాకిచ్చాడు బిగ్ బాస్. తాజగా శక్తి క్లాన్, కాంతారా క్లాన్ రెండు టీమ్ లుగా విభజించబడ్డారు. మరి బిగ్ బాస్ ఇప్పుడు పెట్టే టాస్క్ లు అందరికి కలిపి ఉంటాయా లేక ఇండివిడ్యువల్ టాస్క్ లా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రోమోని చూస్తే తెలుస్తుంది. మరి  మీరు చూసేయ్యండి.  

ఓటింగ్ లో నబీల్ నెంబర్ వన్.. సోనియా ఎలిమినేషన్ ఫిక్స్!

  బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారా అనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్ ని పరిశీలించగా ఊహించని విధంగా విన్నర్‌ రేస్‌లోకి దూసుకుని వచ్చేశాడు నబీల్. సోమవారం నాటి నామినేషన్స్‌లో.. అంతకు ముందు జరిగిన టాస్క్‌లలో నబీల్ అఫ్రిది పర్ఫామెన్స్ చూసి ఆడియన్స్ అతనికి ఓట్లు వేస్తున్నారు. ఇక అదే విధంగా సోనియాకి అసలు ఓటింగే లేదు.. అయిదు శాతం ఓటింగ్ తో లీస్ట్ లో ఉంది సోనియా.  ఇక ఓటింగ్ లో నబీల్ కి అత్యధిక శాతం పడుతుంది. 37 శాతం ఓట్లు నబీల్ కి పడుతున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే.. విన్నర్ రేస్‌లో ఉన్న విష్ణు ప్రియ, నిఖిల్‌లు నామినేషన్స్‌లో ఉన్నప్పుడు.. వాళ్లకి 20-25 శాతం మాత్రమే ఓటింగ్ వచ్చేవి. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ నామినేషన్స్‌లో లేరు. అందుకే నబీల్ టాప్ లో ఉన్నాడు. మొత్తం నామినేషన్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉంటే.. 50 పర్సంట్ ఓటింగ్ విష్ణు, నిఖిల్‌లు పంచేసుకునేవారు. అయితే ఈవారంలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వీళ్లిద్దరూ నామినేషన్స్‌‌లో లేరు. నబీల్, మణికంఠ, సోనియా, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య ఓం ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా.. నబీల్ ఆఫ్రిదికి ఊహించని రేంజ్‌లో 37 శాతానికి పైగా ఓట్లను ఆడియన్స్ వేశారు. ముందురోజు జరిగిన నామినేషన్స్ ఓటింగ్‌ని ఏ రేంజ్‌లో ప్రభావితం చేస్తాయి అనడానికి ఇదే ఉదాహరణ. నిన్నటి నామినేషన్స్‌లో సోనియాతో చెడుగుడు ఆడుకున్నాడు నబీల్. దాంతో ఆమెపై ఉన్న నెగిటివిటీ.. నబీల్‌కి పాజిటివ్‌గా మారింది. దాంతో.. విష్ణు ప్రియ, నిఖిల్‌ల కంటే.. ఎక్కువగా ఓటింగ్ శాతం నబీల్‌కి వస్తుండటం విశేషం.  నబీల్ తర్వాత ప్రేరణ, ఆ తర్వాత మణికంఠ ఉండగా.. నాల్గవ స్థానంలో ఆదిత్య ఓం ఉన్నాడు.‌ ఇక చివరి రెండు స్థానాలలో పృథ్వీ, సోనియా ఉన్నారు. ఈ ఓటింగ్ ని బట్టి చూస్తే సోనియా మీద బిగ్ బాస్ చూసేవారంతా పగబట్టినట్టు ఉన్నారు. ఎందుకంటే నిఖిల్, పృథ్వీ ల గేమ్ ని పూర్తిగా మార్చేస్తుంది సోనియా. నిఖిల్ మొదట్లో అగ్రెషన్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు సోనియా చెప్పినట్టే వింటున్నాడు. అందుకే సోనియా బయటకు వస్తే నిఖిల్, పృథ్వీల ఆట మెరుగుపడుతుందని భావించిన నిఖిల్ ఫ్యాన్స్.. ఓటింగ్ లో వీరికన్నా పైనున్న ఆదిత్య ఓం కి ఓట్లు వేస్తున్నారు. దీంతో సోనియా లీస్ట్ లో‌ ఉంటు వస్తోంది. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే. 

నిఖిల్ పోరాటం వృధా.. సోనియాపై సీత గెలుపు!

  బిగ్‌బాస్ హౌస్‌లో కాంతార టీమ్‌కి కొత్త చీఫ్ ఎన్నిక జరిగింది. ఇందులో నిఖిల్ ఒంటరి పోరాటం చేశాడు. అయితే బిగ్ బాస్ పెట్టిన మెలికతో సోనియా ఛీఫ్ రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.  బిగ్ బాస్ కొత్త చీఫ్ కోసం సరికొత్త గేమ్ ని పెట్టాడు. " రెండో చీఫ్‌ను ఎంచుకునే సమయం వచ్చింది.. దీనికి ఇప్పటికే చీఫ్ అయిన నిఖిల్ మినహా మిగిలిన ప్రతి సభ్యుడు పోటీదారుడే.. ఇందుకోసం హౌస్‌లో నిఖిల్ మినహా ఉన్న మిగిలిన 10 మంది బొమ్మలను టేబుల్‌పై ఉన్నాయి. వాటి ముందు ఒక సుత్తి కూడా ఉంది.. ముందుగా నిఖిల్ మీరు చీఫ్ కాబట్టి ఇందులో ఎవరు చీఫ్‌గా అనర్హులని భావిస్తే ఆ మొదటి సభ్యుడి బొమ్మను తగిన కారణాల చెప్పి పగలకొట్టండి " అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అలానే రేసు నుంచి తప్పుకున్న వారు కడా ఈసారి బజర్ మోగినప్పుడు నిఖిల్‌తో పాటు సుత్తి కోసం పోటీపడాలి. అయితే ఎవరైతే సుత్తిని ముందుగా పట్టుకుంటారో వారు సుత్తిని వేరేవాళ్ళకి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు.  ఇక బజర్ మోగింది. ముందుగా సుత్తిని నిఖిల్ తీసుకున్నాడు. ఆదిత్య బొమ్మను నిఖిల్ పగలగొడుతూ.. మీకు లీడర్ షిప్ క్వాలిటీస్ లేవు.. మొన్న ప్రేరణ-మణికంఠ మధ్య దోస ఇష్యూ జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నా మాట్లాడలేదంటూ నిఖిల్ చెప్పాడు. తర్వాత బజర్ మోగినప్పుడు నిఖిల్‌తో పోటీపడి సుత్తిని ఆదిత్య దక్కించుకున్నాడు. అది  పృథ్వీ చేతికి ఇచ్చాడు ఆదిత్య. దీంతో మణికంఠను రేసు నుంచి తప్పిస్తూ బొమ్మ పగలగొట్టేశాడు పృథ్వీ. ఆ తర్వాత నిఖిల్ చేతికి సుత్తి దొరకగా.. ఈసారి సీతకి ఇచ్చాడు. దీంతో ఇప్పిటకే ఒకసారి చీఫ్ అయిన కారణంగా యష్మీని రేసు నుంచి తప్పించింది సీత. తర్వాత వెంటనే మరోసారి నిఖిల్‌కే సుత్తి దొరికింది. దీంతో ఈసారి సోనియాకి ఇచ్చాడు నిఖిల్. దీంతో నబీల్ బొమ్మ పగలగొట్టి తన రివెంజ్ తీర్చుకుంది సోనియా. మరోసారి నిఖిల్‌కే హ్యామర్ దొరికింది. ఈసారి నైనికకి ఇవ్వగా విష్ణుప్రియను రేసు నుంచి తప్పించింది. ఆ తర్వాతే అసలు గేమ్ మొదలైంది.  ఆ తర్వాత విష్ణుప్రియ, నిఖిల్ దాదాపు ఒకే టైమ్‌లో సుత్తి పట్టుకున్నారు. కానీ విష్ణుప్రియ మొదటగా పట్టుకుందని కాంతార టీమ్.. కాదు నిఖిల్ పట్టుకున్నాడంటూ సోనియా వాదించారు. అయిన సరే ఇద్దరూ వదలకపోవడంతో నిఖిల్ లాక్కునేందుకు ట్రై చేశాడు. దీంతో విష్ణుప్రియకి సపోర్ట్‌గా యష్మీ, నబీల్, మణికంఠ కూడా వెళ్లారు. మొత్తానికి నిఖిల్ చేతి నుంచి విష్ణుప్రియకి సుత్తి అందించారు. దీంతో విష్ణుప్రియ సుత్తిని ప్రేరణ చేతికి ఇచ్చింది. ఇంకేముంది ముందే ప్లాన్ చేసినట్లుగా సోనియాను లేపేసింది ప్రేరణ. నీకు ఆల్ రెడీ చీఫ్ అయ్యేందుకు ఓ ఛాన్స్ వచ్చింది.. కానీ యూజ్ చేసుకోలేకపోయావంటూ ప్రేరణ రీజన్ ఇచ్చింది. ఇలా ఒక్కో బొమ్మ పగిలిపోతు చివరిగా సీత-ప్రేరణ మాత్రమే రేసులో మిగిలారు. అప్పుడూ బిగ్‌బాస్ కలుగజేసుకొని ఈసారి డైరెక్ట్‌గా నైనికకే సుత్తిని ఇచ్చాడు. దీంతో ప్రేరణను రేసు నుంచి తప్పించింది‌. ఇక కొత్త చీఫ్ గా సీత నిలిచింది.  

నిఖిల్‌కి రిటన్ గిప్ట్ ఇచ్చిన అభయ్ నవీన్!

  బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మూడో ఎలిమినేషన్ గా అభయ్ నవీన్ బయటకొచ్చాడు.‌ అభయ్ బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేశాడు.‌ నిఖిల్, సోనియా, పృథ్వీల గురించి యాంకర్ అడుగగా.. వాళ్ళ ముగ్గురి మధ్య బాండింగ్ ఏర్పడింది. నిఖిల్ కాస్త ఆలోచిస్తున్నాడు కానీ పృథ్వీ పూర్తిగా సోనియా మాట వింటున్నాడని చెప్పాడు. ఇక సోనియా చెప్పిందే వాళ్ళిద్దరు వినాలని చూస్తుందని కూడా అభయ్ చెప్పాడు. ఇక సోనియా ఫేకా రియలా అని యాంకర్ అడుగగా.. తను డెబ్బై శాతం రియల్.. ముప్పై శాతం ఫేక్ అని అభయ్ చెప్పాడు. ప్రతీ టాస్క్ లో సోనియా వాళ్ళిద్దరిని వాడుకుంటుందని అందరికి అర్థమైంది. అదే విషయాన్ని అభయ్ తన స్టైల్లో చెప్పాడు. 'అరెయ్ సోనియా వల్ల నీ గేమ్ డిస్టబ్ అవుతుంది చూసుకోరా' అని నిఖిల్ కి అభయ్ చెప్పాడంట. ఇక బజ్ లో విన్నింగ్ లక్షణాలు ఎవరికి ఉన్నాయి.. అసలు హౌస్ లో ఉన్నవాళ్ళ గురించి చెప్పమని యాంకర్ అనగా.. ఒక్కో కంటెస్టెంట్ గురించి అభయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్నవాళ్ళలో నబీల్ కి విన్నర్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని అన్నాడు.  ఇక ప్రేరణ గేమ్ గురించి టెన్షన్ పడుతుందని, బిగ్ బాస్ టాస్క్ చెప్పకముందే, ఎలా ఆడాలి.. ఏం చేయాలని ఆలోచిస్తుంటుంది. తీరా గేమ్ మొదలయ్యాక మాములు అవుతుందని అభయ్ అన్నాడు. ‌ఇక సీత ఏడుపు వెనుక ఉన్న నిజం చెప్పాడు. బేబక్క వెళ్తుంటే ఎందుకు ఏడ్చినవ్ అని సీతని అభయ్ అడిగితే.‌ రేపు నేను కూడా ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్తా కదా అని చెప్పిందంట‌. మరి నువ్వు వస్తుంటే కూడా ఏడ్చింది కదా అని యాంకర్ అనగానే.. అలా  ఏం లేదు.‌ తను నన్ను అన్నయ్య అంది.. అందుకే బయటకొచ్చాక రాఖీ కట్టించుకుంటా అని చెప్పా అని అభయ్ అన్నాడు. ఇక హౌస్ లో ఆదిత్య ఓం, మణికంఠ, నైనిక, విష్ణుప్రియల గురించి అభయ్ చెప్పుకొచ్చాడు. తనేం చెప్పాడో తెలియాలంటే స్టార్ మా యూట్యూబ్ ఛానెల్ లోని ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.