Biggboss Nainika : బిగ్ బాస్ నైనిక ఎవరో తెలుసా!

బిగ్ బాస్ సీజన్‌లో మొదటి వారమే ముగ్గురు ఛీఫ్ లు ఉన్నారు. వారిలో నైనిక ఒక చీఫ్. ఈ పొట్టి పిల్ల హౌస్ లో టాస్క్ లలో ఇరగదీస్తుంది. అసలు ఎవరీమే. బిగ్ బాస్ కి ముందు నైనిక(Nainika) ఏం చేసేది ఓసారి చూసేద్దాం. నైనిక పూర్తి పేరు నైనిక అనసురు(Nainika Anasuru). తను డ్యాన్సర్. పుట్టింది ఒడిస్సా.. తను పుట్టినప్పుడే ఆడపిల్ల అని వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడంట‌. అక్కడి నుండి తన కష్టాలు మొదలయ్యాయి. ఇక అక్కడి నుండి హైదరాబాద్ కి వచ్చిన నైనిక.. కష్టపడి డ్యాన్స్ నేర్చుకుందంట. ఢీ షోలో తన డ్యాన్స్ స్టెప్పులకి జడ్జెస్ ఫిధా అయ్యారంటే తను ఏ రేంజ్ లో డ్యాన్స్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. నైనికకి ఇన్ స్టాగ్రామ్(Instagram) లో 941K ఫాలోవర్స్ ఉన్నారు. ఢీ షోలో మగ డ్యాన్సర్స్ తో పోటీపడి మరీ డ్యాన్స్ చేసే నైనికకి బిగ్ బాస్(Biggboss) ఆఫర్ లభించింది. డ్యాన్స్ తో పాటుగా సినిమాల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించందంట ఈ బ్యూటీ.. అయితే అక్కడ దర్శక, నిర్మాతలు తనని కమిట్ మెంట్ అడిగారని , అది తనకి ఇష్టం లేదని చెప్తూ డ్యాన్స్, రీల్స్, షార్ట్ ఫిల్మ్ , వెబ్ సిరీస్ లు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. నైనిక చేసిన 'నయనం' వెబ్ సిరీస్ కి యూట్యూబ్ లో అత్యధిక వీక్షకాధరణ లభించింది. అలాగే తన ఇన్ స్టాగ్రామ్ లో ఏ రీల్ చేసిన వైరల్ అవుతుంది. ఎందుకంటే గ్లామర్ ట్రీట్ అందించడంలో ఈ భామ తక్కువేం కాదు. బిగ్ బాస్ కి వెళ్ళేముందు యాంకర్ శివతో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలని కొన్నింటిని షేర్ చేసుకుంది నైనిక. అవి కూడా తను వైరల్ అయ్యేలా చేశాయి. బిగ్ వాస్ హౌస్ లో నైనిక ప్రస్తుతం చీఫ్ గా లేదు‌. కానీ తన ఆటతీరు, మాటతీరుతో అభిమానులని సొంతం చేసుకుంటుంది ఈ భామ.

పార్లమెంట్ లో అడుగుపెట్టాలన్నదే నా కోరిక...

ఖుష్బూ అటు సినిమా రంగంలో ఇటు టీవీ రంగంలో పొలిటికల్ గా కూడా ఆమెకు ఎంతో మంచి పేరు ఉంది. అలాంటి ఖుష్బూతో ఒక ఛానెల్ సరదాగా జరిపిన చిట్ చాట్ లో ఆమె ఎన్నో విషయాలు చెప్పారు. స్కూల్ లో నా పేరు నక్కత్ ఖాన్ .. ఐతే స్కూల్ టైం నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చేసాను అప్పుడే ఖుష్బూ అని పేరు మార్చేశారు. నేను ముస్లింని. నక్కత్ అంటే అర్ధం ఖుష్బూ అందుకే పేరు మార్చేశారు. వెంకటేష్, కమల్ సర్, చిరంజీవి, సుహాసిని అంటే ఇష్టం. రాజమౌళి అంటే మూవీని చాలా గ్రాండ్ లుక్ లో చూపించడానికి ట్రై చేస్తారు, త్రివిక్రమ్ పక్కా కమర్షియల్. పొలిటికల్ గా నేను ఎంట్రీ ఇవ్వడానికి చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు.. నా గోల్ ఏంటంటే నేను పార్లమెంట్ కి వెళ్ళాలి. జయలలిత, సీనియర్ ఎన్టీఆర్, నరేంద్ర మోడీ వీరంతా నాకు ఇన్స్పిరేషన్. 80 స్ రి-యూనియన్ లో అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. మేము కొంతమందిమి కలిసి కోర్ కమిటీగా ఏర్పడడం. ఎప్పుడు ఈ ఫంక్షన్ పెట్టుకోవాలి..ఎలాంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకోవాలి వంటివన్నీ మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. ప్రతీ ఇయర్ ఈ రీయూనియన్ జరుగుతుంది. మేమంతా బాగా అల్లరి చేస్తాం. వెంకటేష్ తో నటించిన కలియుగ పాండవులు అంటే నాకు చాలా ఇష్టం.. అదెప్పుడూ నా మనసులోంచి పోదు. సినిమా, టీవీ, రాజకీయ రంగాల్లో ఇంత సక్సెస్ కావడానికి కారణం డెడికేషన్" అంటూ ఎన్నో విషయాలు చెప్పింది ఖుష్బూ..  

భోలే షావలికి నూకరాజుకు మధ్య బిగ్ ఫైట్

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో భోలే షావలికి నూకరాజుకు మధ్య బిగ్ ఫైట్ అయ్యింది. ఐతే షో పేరుతో ఒక అందమైన కేక్ ని తీసుకొచ్చి అందులో ఒక గోల్డ్ రింగ్ ని పెట్టారు అని రష్మీ చెప్పింది. ఐతే ఆ కేక్ ని పీసెస్ గా కట్ చేసి అందరికీ పంచింది. ఆ రింగ్ ఎవరికీ వస్తే వాళ్ళు లక్కీ అని చెప్పింది. నూకరాజుకు బోలీ షావలిని చూస్తే ఏమనిపించిందో కానీ బాగా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి కేక్ పీస్ నోట్లో పెట్టకుండా అతని ముఖానికి పూసేసాడు. దాంతో భోలే ఫుల్ ఫైర్ అయ్యాడు. కరెక్ట్ కాదు కదా ఇలా చేయడం. "ఏంటిది ఇలా ముఖానికి కేక్ పూస్తావా" అని సీరియస్ గా అడిగాడు. "అది చాలా చిన్న విషయం..నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావ్" అంటూ నూకరాజు భోలేని రివర్స్ లో మళ్ళీ ఏడిపించాడు. దాంతో అక్కడ సీన్ కాస్తా ఇంకా హాట్ అయ్యింది. ఇక ఈ వారం జానపద పాటల స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. అలాగే యూట్యూబ్ లో ఫేమస్ ఐనా అవుతున్న వాళ్ళను తీసుకొచ్చారు. ఇక భోలే ఐతే "భోలే అంటే హీరో..హీరో అంటే భోలే" అనే సాంగ్ పాడి అందరినీ అలరించాడు. ఐతే నెటిజన్స్ మాత్రం అటు భోలేని ఇటు నూకరాజును తిడుతున్నారు. ఇదంతా హిప్ కోసం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

నువ్వేంటి బొక్క రెయిజ్ చేసేది.. డ్రామాలు చేయకు!

  బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నామినేషన్ ల ప్రక్రియ మొదలైంది. ఇక వాటికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. అందులో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినట్టు తెలుస్తుంది.  ఎవరు ఎవరిని నామినేషన్ చేశారో ఓసారి చూసేద్దాం.. యష్మీని మణికంఠ నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు. ఎవరు గిన్నెలు కడుగుతున్నారు.. ఎవరు గిన్నెలు కడగటం లేదు.. ఇలా అన్నీ చూడాలంటూ మణికంఠ ఏదో చెబుతుంటే.. అవును మాకు లగ్జరీ వచ్చినప్పుడు.. మా టీమ్‌కి వచ్చినప్పుడు.. మేము కడగక్కర్లే" అంటూ యష్మీ మధ్యలో మాట్లాడింది. దీంతో ఒళ్లు మండిన మణికంఠ.. నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజెన్ లేడీ అంటు మణికంఠ వాయిస్ రెయిజ్ చేశాడు. దీనికి యష్మీ టాపిక్ డైవర్ట్ చేస్తూ.. నువ్వు డ్రామాలు చేస్తావ్ చూడు నా దగ్గరికొచ్చి ఫ్రెండ్‌గా అంటూ యష్మీ అంది. దీంతో నాకు ఒక పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే నేను రెయిజ్ చేస్తానంటూ మణికంఠ అన్నాడు. నువ్వేంటి బొక్క రెయిజ్ చేసేదంటు యష్మీ బూతులు మాట్లాడింది. ఆ తర్వాత మణికంఠకి రివెంజ్ నామినేషన్ వేసింది యష్మీ. నేను ఈ హౌస్‌లో ఎన్ని రోజులు ఉంటానో.. ప్రతి నామినేషన్‌లో నీ పేరు అయితే నేను తీసుకుంటా.. ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావ్.. ఇది ఫ్రెండ్ షిప్ అనే పేరుతో నన్ను మోసం చేశావంటు యష్మీ అంది. ఇది మోసం కాదంటూ మణికంఠ అనగానే.. ఇది నా నామినేషన్ గురూ నిల్చోమంటూ యష్మీ ఫైర్ అయ్యింది. చూస్తా గురు అంటూ మణికంఠ కూడా గట్టిగానే మాట్లాడాడు. విష్ణుప్రియ తన నామినేషన్ లో భాగంగా ప్రేరణని నామినేట్ చేసింది. సాక్స్ టాస్కు లో సంఛాలక్ గా సరిగా చేయలేదనే రీజన్‌తో ప్రేరణని నామినేట్ చేయగా.. వెంటనే విష్ణుప్రియను ప్రేరణ కూడా నామినేట్ చేసింది. తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ.. నువ్వు గెలవాలనే స్పిరిట్ నాకు ఇష్టం కానీ నువ్వు ఎలా గెలుస్తావన్నది నాకు నచ్చదంటు సీత రీజన్ చెప్పింది. నేను ఒక టీమ్‌లో ఆడుతున్నప్పుడు ఆపోజిట్ టీమ్‌ను ఎలాగైనా ఓడించాలనే ఆడతానంటూ పృథ్వీ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత సోనియాను నైనిక నామినేట్ చేసింది.  ఇక ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.  

Shekhar basha elimination: ఆ ముగ్గురు ఫేక్.. రియల్ ఎవరంటే!

  బిగ్ బాస్ సీజన్ 8 లో సెకెంఢ్ వీక్ ముగిసింది. హౌస్ నుండి మొదటి కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా, రెండో ఎలిమినేషన్ గా శేఖర్ బాషా నిన్న బయటికి వచ్చాడు. నిజానికి ఈ వారం ఓటింగ్ పరంగా చూసుకుంటే శేఖర్ చాలా క్లియర్‌గా సేఫ్‌లో ఉన్నాడు. కానీ బిడ్డ పుట్టిన ఆనందంలో, వాడిని చూడాలనే ఆత్రుతతో బిగ్‌బాస్ హౌస్ నుంచి తనకి తానుగా శేఖర్ బాషా బయటికి వచ్చేశాడనే చెప్పాలి. కానీ అలా చెప్తే బాగోదు కనుక నాగార్జున ఈ ఎలిమినేషన్‌కి బిగ్ ట్విస్ట్ అంటూ చెప్పాడు. ఇక నామినేషన్ లో ఒక్కొక్కరిని సేవ్ చేయగా.. చివరికి ఆదిత్య ఓం, శేఖర్ బాషా ఉన్నారు. బాటమ్ 2లో ఆడియన్స్ సెలక్ట్ చేసిన వాళ్లే ఉన్నారు.. కానీ ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే.. ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న ఆ ఇద్దరిలో ఇంట్లో ఎవరుంటారు.. ఇంటి బయటికి ఎవరొస్తారనేది ఈసారి హౌస్‌మెట్స్ డిసైడ్ చేయబోతున్నారంటు నాగార్జున అన్నాడు. ఆ తర్వాత వీళ్లలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనేది హౌస్‌మెట్స్ రీజన్ చెప్పి డిసైడ్ చేయాలంటూ నాగ్ అన్నారు. ఇక దీనికి ఆడియన్స్ తప్పుపట్టకూడదని హౌస్ బయట విషయాలు కాదు.. లోపల విషయాలను పరిగణించే రీజన్ చెప్పాలంటూ ఇండైరెక్ట్‌గా శేఖర్ భార్య డెలివరీ గురించి నాగ్ హింట్ ఇచ్చాడు. ఇక హౌస్ లోని పన్నెండు మందిలో ఒక్క సీత మినహా అందరు ఆదిత్య ఓం కి పూలదండ వేసి అతనిలో గెలవాలనే ఫైర్ ఉందని, ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పారు. ఇక శేఖర్ బాషా ఇక్కడ లేడని, యాక్టివ్ గా ఉండటం లేదని అందరు అదే రీజన్ చెప్పారు. ఆ తర్వాత శేఖర్ బాషా ఎలిమినేషన్ అయి నాగార్జున దగ్గరకి వచ్చాడు. దాంతో కిర్రాక్ సీత బాగా ఏడ్చేసింది. ఇక హౌస్ లో ఎవరు ఫేక్? ఎవరు రియల్ గా ఉన్నారో చెప్పమని నాగార్జున అడుగగా‌‌.. సీత, విష్ణుప్రియ, ప్రేరణ రియల్ అని వారు ఇన్నోసెంట్ అని రియల్ క్యారెక్టర్ అని శేఖర్ బాషా చెప్పాడు. ఇక సోనియా, మణికంఠ ఫేక్ అని చెప్పాడు. ఆఅ తర్వాత తన దోస్త్ ఆదిత్య బొమ్మ పెడుతూ ఆయన నన్ను మూడు సార్లు నామినేట్ చేశాడు.. తిరిగి నేను ఒక్కసారి నామినేట్ చేస్తేనే ఫేస్ మారిపోయింది.. సూటిపోటి మాటలు మాట్లాడినట్లు అనిపించింది. నేను తీసుకున్నంత స్పోర్టివ్‌గా ఆయన తీసుకోలేదంటూ శేఖర్ అన్నాడు. ఇలా మొత్తానికి వెళ్తూ వెళ్తూ అందరికి తెలిసిన సోనియా బిహేవియర్‌ను మరోసారి ఆడియన్స్‌కి గుర్తుచేసి వెళ్లిపోయాడు శేఖర్.  

Bigg Boss 8 : సోనియాని నోరు అదుపులో పెట్టుకోమన్న నాగార్జున!

బిగ్ బాస్ సీజన్ 8 తాజా ఎపిసోడ్ లో  కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకాడు హోస్ట్ నాగార్జున. హౌస్ లో వారం మొత్తం కంటెస్టెంట్స్ యెుక్క బిహేవియర్ ని చూసి వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. (Bigg Boss 8 Telugu) మొదట చీఫ్ ల బాధ్యతలు గుర్తుచేసి వారు సరిగ్గా చేయలేదని చెప్పి యష్మీ, నైనికలని చీఫ్ బాధ్యతల నుండి తొలగించిన నాగార్జున.. హౌస్ లో సోనియాది వరెస్ట్ బిహేవియర్ అంటు వార్నింగ్ ఇచ్చేశాడు. అసలు సోనియా చేసిన తప్పేంటి? నాగార్జున ఏం అన్నాడో ఓసారి చూసేద్దాం...90 మార్క్స్ వస్తాయన్న స్టూడెంట్‌కి 40 మార్క్స్ వస్తే నిరుత్సాహం ఉంటుంది కదా అని నాగార్జున అన్నాడు. నాకు స్కోప్ కనిపించడం లేదు సర్ అని సోనియా అనగానే.. స్కోప్ ఉండదు.. నువ్వు తీసుకోవాలని చెప్పాడు. గత వారం విష్ణు ప్రియ క్యారెక్టర్‌ గురించి చాలా నీచంగా మాట్లాడిన ఇష్యూని లేవనెత్తుతూ వీడియో ప్లే చేశాడు. నిన్ను పట్టించుకోవడానికి ఎవరూ లేరేమో విష్ణుప్రియా.. నాకు ఫ్యామిలీ ఉంది.. పట్టించుకునే వాళ్లు ఉన్నారంటూ సోనియా నోటికొచ్చినట్టు మాట్లాడిన వీడియోని హౌస్ మేట్స్ అందరికి వేసి చూపించాడు.  ఇక అదంతా చూసాక కూడా సోనియా ఎక్కడా తగ్గడం లేదు. నేను గొడవని పెంచాలని అనుకోలేదు సర్ అని సోనియా అనగానే.. నోరు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరమని అన్నాడు. నువ్వు ఇలా ఉంటే కుదరదు. ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు.. నువ్వు ఇలాగే ఉంటే వాళ్ళు నిన్ను ఎక్కడ ఉంచుతారో తెలుసు కదా అని నాగార్జున అనగానే.. సోనియా కాస్త భయపడ్డట్టు అనిపించింది‌.‌ మరి హౌస్ లో ఇక నుండి అయినా తన బిహేవియర్ మార్చుకుంటుందో లేదో చూడాలి మరి.

'బ్లా..బ్లా..బ్లా' అంటున్న రౌడీ రోహిణి

యూట్యూబ్ వచ్చాక చాలా మంది సెలబ్రిటీస్ ఐపోతున్నారు. అంటే బుల్లితెర కంటే కూడా ఈ యూట్యూబ్ మినీ తెరల మీద ఎక్కువ కంటెంట్ కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరి ఓన్ టాలెంట్ వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానెల్స్ ఒక స్టార్టప్స్ లా పనికొస్తున్నాయి. ఐతే ఇప్పుడు రౌడీ రోహిణి కూడా అదే వేలో వెళ్లాలని నిర్ణయించుకుంది. దాంతో ఒక అనౌన్స్మెంట్ చేసింది రోహిణి.  త్వరలో మీముందుకు కొత్తగా అంటూ కొన్ని రోజుల నుంచి రోహిణి కొన్ని సంకేతాలను ఫాన్స్ కి ఆడియన్స్ కి పంపిస్తూనే ఉంది. అదేంటో తెలీదు కానీ ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ పేజీ చూస్తే మంచి స్మార్ట్ డ్రెస్ పిక్స్ తో పాటు "బ్లా..బ్లా..బ్లా" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఒక పోస్టర్ అలాగే ఎదురుగా టేబుల్ మీద వాటర్ బోటిల్ కూడా పెట్టి ఉన్న ఒక రూమ్ లో రోహిణి కూర్చుని కనిపించింది. "సంథింగ్ కమింగ్ న్యూ" అంటూ పోస్ట్ చేసింది.  దాంతో నెటిజన్స్ మాత్రం కంగ్రాట్యులేషన్స్ అని పోస్ట్ చేస్తున్నారు. అలాగే రోహిణి అవుట్ ఫిట్స్ చూసి ఇంత స్లిమ్ గా ఉంటారని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఇంతకు ఈ షో దేనికి సంబంధించింది అన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రోహిణి.

Bigg Boss 8 Telugu: అన్ని రికార్డులు బ్రేక్ చేసిన బిగ్ బాస్ సీజన్ 8.. హౌస్ లో ఏం జరిగిందంటే!

బిగ్ బాస్ సీజన్ 8 లో సెకెండ్ వీకెండ్ వచ్చేసింది. నిన్న అనగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ నామినేషన్ పాయింట్స్ తో కూడిన సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇది రికార్డు అంటు ఓ విషయం చెప్పాడు. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్ కలిపి అన్ బిలేబుల్, అన్ బ్రేకెబుల్ సిక్స్ బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మన బిగ్ బాస్ సీజన్ 8  సాధించింది అంటు తన హ్యాపీ నెస్ ని షేర్ చేసుకున్నాడు నాగార్జున.  ఇప్పటి వరకు జరిగిన తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్లని క్రాస్ చెయ్యడమే కాదు.. ఆల్ ఓవర్ ఇండియాలోని అన్ని బిగ్ బాస్ సీజన్ ల టీఆర్పీని కూడా బ్రేక్ చేసిందంటు నాగార్జున చెప్పాడు. ఇక శుక్రవారం జరిగిన ప్రమోషన్ టాస్క్ ని బిగ్ స్క్రీన్ మీద చూపించాడు. మణికంఠ వేరొక టీమ్ నుండి కారం పొడి దొంగతనం చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తాడు. దాంతో విష్షుప్రియ తనపై కోప్పడుతుంది. నువ్వు దొంగతనం చేసావని చెప్పాలి కదా.. మళ్ళీ ఎందుకు తిరిగి ఇవ్వడమంటూ చిన్న ఆర్గుమెంట్ జరుగుతుంది. మన పర్ స్పెక్టివ్ స్టర్ విష్ణు మప్రియని కూల్ చెయ్యాలని ట్రై చేస్తాడు. ఇదంతా బిగ్ స్క్రీన్ మీద అందరు చూసేస్తారు. ఇక హౌస్ లో మూడు క్లాన్ లు ఉన్న విషయం అందరికి తెలిసిందే. మూడు క్లాన్ లు ఉన్నా టీమ్ లలోని తమ క్లాన్ సభ్యుల పర్ఫామెన్స్ బాగుంటే గ్రీన్ లో... బాగోకపోతే రెడ్ లో పెట్టాలని నాగార్జున చెప్పగా.. ముందుగా యష్మీ తన క్లాన్ మెంబర్స్ అయిన అభయ్, పృథ్వీలని గ్రీన్ లోను శేఖర్ బాషా,  ప్రేరణ, సోనియాలని రెడ్ లో పెడుతుంది. ఆ తర్వాత నైనిక క్లాన్ లో నబీల్, విష్ణుప్రియ, సీతలని గ్రీన్ లో ఆదిత్య ఓమ్ లని రెడ్ లో పెడుతుంది. ఇక నిఖిల్ తన క్లాన్ మెంబెర్ ఒక్కడే మణికంఠ ఉండడంతో ఆతని పర్ఫామెన్స్ బాగుందని గ్రీన్ లో పెడతాడు. హౌస్ మేట్స్ ల్ ఉన్న చిన్నచిన్న మిస్ అండర్ స్టాండింగ్స్ ని క్లారిఫికేషన్ చేసి అందరికి చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు నాగార్జున. సోనియా నామినేషన్ లో విష్ణుప్రియని ఫ్యామిలీ పరంగా అన్నదాని గురించి క్లారిటీగా సీసీటీవీ ఫుటేజ్ వేసి చూపించాడు‌ నాగార్జున. నీకు చూసేవాళ్ళు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ మాకు చూస్తారన్నావ్ అలా అనడం కరెక్టా అని నాగార్జున అడుగగా.. సోనియా సారీ చెప్తుంది. ఇకముందు అలా మాట్లాడితే ప్రేక్షకులు ఏం చేస్తారో తెలుసు కదా అంటు సోనియాకి వార్నింగ్ ఇచ్చాడు. ఇక పృథ్వీ చాలాసార్లు ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావ్.. టంగ్ స్లిప్ అవుతున్నావ్.. ఇంకొకసారి అలా అయితే అంటూ గన్ చూపిస్తాడు నాగార్జున. యష్మీ మణికంఠ విషయంలో ఉన్న ఇష్యూని వీడియో ఫుటేజ్ లో వేసి చూపించగా యష్మీనే తప్పు అని చూపించగా మాట్లాడేలేక ఎమోషనల్ అవుతుంది. ఇలా ఒక్కొక్కరి గురించి ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసినట్టే చురకలు అంటించాడు నాగార్జున. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన నబీల్, సీతలకి గ్రీన్ బ్యాండ్ ఇచ్చాడు నాగార్జున.

Eto Vellipoindi Manasu : కొడుకు చేస్తున్న యాగాన్ని ఆపడానికి సవతి తల్లి ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -201 లో.....రామలక్ష్మి వచ్చిన కలకి భయపడుతూ.. వాళ్ళ అమ్మ సుజాతకి ఫోన్ చేసి సీతాకాంత్ ని కత్తితో పొడిచినట్లు వచ్చిన కల గురించి చెప్తుంది. దాంతో అల్లుడు గారు మంచి వారు తనకి అంత మంచే జరుగుతుంది. నువ్వు కంగారు పడకు.. నేను మన పంతులు గారిని అడుగుతానని రామలక్ష్మికి సుజాత చెప్తుంది. రామలక్ష్మి కంగారు పడుతంటే సీతాకాంత్ వచ్చి.. ఏమైందని అడుగుతాడు. ఏం లేదని రామలక్ష్మి అంటుంది. అయితే వెళ్లి త్వరగా రెడీ అవ్వమని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత ఇంకా రెడీ అవ్వలేదా అని పెద్దాయన సిరిలు సీతాకాంత్ ని అడుగుతారు. అప్పుడే రామలక్ష్మి అందంగా రెడీ అయి వస్తుంది‌. సీతాకాంత్ తననే చూస్తుంటాడు. రెడీ అవుతానని సీతాకాంత్ అంటాడు. ఏదో ఆఫీస్ కీ రెడి అయినట్లు కాకుండా పంచె కట్టుకోమని చెప్తాడు. నాకు కట్టుకోవడం రాదని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి హెల్ప్ చేస్తుంది వెళ్ళమంటూ పెద్దాయన పంపిస్తాడు.. ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి పంచె కడుతుంది. దాంతో సీతాకాంత్ సిగ్గు పడుతుంటాడు. సీతాకాంత్ రామలక్ష్మిలు కిందకి వస్తుంటే.. సిరి, పెద్దాయన చూసి మురిసిపోతుంటారు. ఆ తర్వాత పదండి గుడికి అని పెద్దాయన సందీప్ వాళ్ళని అంటాడు. మేమ్ తర్వాత వస్తాం.. మీరు వెళ్ళండి అని సందీప్ అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు అయినా రామలక్ష్మికి నీ ప్రేమ విషయం చెప్పమని సీతాకాంత్ కి పెద్దాయన సలహా ఇస్తాడు. ఆ తర్వాత వాళ్లు యాగం చేస్తుంటే.. మనం చూస్తు ఉంటామా అంటు శ్రీవల్లి కోప్పడుతుంది. యాగం ఆగిపోయేలా ఆల్రెడీ ప్లాన్ చేసానని శ్రీలత అంటుంది. ఆ తర్వాత మాణిక్యం సుజాతలు యాగానికి వస్తారు. మరొకవైపు శ్రీలత మనిషి సీతాకాంత్ పై ఎటాక్ చెయ్యడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 8 Telugu: యష్మీ, నైనిక చీఫ్ గా ఫెయిల్.. హౌస్ లో కొత్త చీఫ్ ఎవరంటే!

బిగ్ బాస్ హిస్టరీలోనే ఎన్నడు లేని విధంగా.. అన్నీ ఊహించని విధంగా జరుగుతున్నాయి. ప్రతి సీజన్ లో కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. కానీ ఈ సీజన్ లో క్లాన్స్ ఉన్నాయి. లిమిట్ లెస్ రేషన్, లిమిట్ లెస్ ప్రైజ్ మనీ కావడంతో మొదటి వారం టాస్క్ లో గెలిచిన ముగ్గురు ఇంటి సభ్యులని క్లాన్స్ చేశారు బిగ్ బాస్. నైనిక, యష్మీ, నిఖిల్ ముగ్గురు క్లాన్స్.. వీరిలో యష్మీ ఎక్కువ ఇంటిసభ్యులు కలిగిన క్లాన్ అందుకే తనకి బిగ్ బాస్ పవర్స్ ఇచ్చాడు. యష్మీ తన క్లాన్ కి చీఫ్గా వ్యవహరించింది. అయితే అతి తక్కువ క్లాన్ మెంబర్స్ ని కలిగి ఉంది నిఖిల్. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మీ, నైనిక లని క్లాన్స్ గా ఫెయిల్ అయ్యారు. మిమ్మల్ని డిస్ క్వాలిఫై చేస్తున్నానని నాగార్జున చెప్పాడు. వాళ్ళు డిస్ క్వాలిఫై అవ్వడానికి కారణం కూడా నాగార్జున చెప్పాడు. రేషన్ విషయంలో నెగ్లెట్ చెయ్యడం.. అంతేకాకుండా అతి తక్కువ క్లాన్ కలిగిన నిఖిల్ క్లాన్ సంపాదించిన అమౌంట్ మీ రెండు టీమ్ లు సంపాదించిన దానికంటే ఎక్కువ. అందుకే మిమ్మల్ని ఛీఫ్ లుగా డిస్ క్వాలిఫై చేస్తున్నానంటు నైనిక, యష్మీలని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా హౌస్ లో ఇంకొక క్లాన్ ఉంటారు. మీరందరు ఎవరు క్లాన్ గా ఉండాలో.. ఎవరు ఉండకూడదో.. వాళ్ళ ముందు ఉన్న గ్లాస్ లో‌‌..  క్లాన్ గా ఉండాలి అనుకునే కంటెస్టెంట్ దగ్గర ఉన్న గాజు సీసాలో వైట్ వాటర్ పోయాలి‌‌..  ఎవరు వద్దని అనుకుంటారో వారి గాజు గ్లాస్ లో బ్లాక్ వాటర్ పొయ్యాలని నాగార్జున చెప్పాడు. ఎవరిది ఎక్కువ గ్లాస్ లో ఉంటే వాళ్లే న్యూ క్లాన్ కి లీడర్ అని నాగార్జున చెప్తాడు. దాంతో అందరు తమకు నచ్చిన వాళ్ళకి ఓటు వేస్తారు. నచ్చని వాళ్ళకి బ్లాక్ వాటర్ పోస్తారు. అయితే చివరికి అభయ్ వైట్ గ్లాస్ ఎక్కువ ఉండడంతో అతనే న్యూ క్లాన్ అని నాగార్జున అనౌన్స్ చేస్తాడు. ఆ క్లాన్ లోకి ఎవరు ఆడ్ అవుతారనేది ముందు ముందు తెలుస్తుందంటూ కొంచెం ఆసక్తిని పెంచే మాటలతో శనివారం ఎపిసోడ్ ని ముగించాడు నాగార్జున. ప్రస్తుతం హౌస్ లో పదమూడు మంది ఉండగా అందులో ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. వారిలో నైనిక సేవ్ చేశాడు నాగార్జున.

Karthika Deepam 2 : పారిజాతం పనిమనిషా.. కూతురి ప్రేమని ఒప్పుకున్న తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -150 లో..... మీరు ఇంత బాగా వంట చేస్తారు కదా మా రెస్టారెంట్ లో వర్క్ చెయ్యండి అని కార్తీక్ అంటాడు. నేను వర్క్ చేసే ప్లేస్ కి వచ్చి ఇలా చేసాడు. ఇక రెస్టారెంట్ లో వర్క్ చేస్తే నరసింహా గురించి తెలుసు కదా అని దీప అంటుంది. మీరెందుకు ఇలా చేశారని దీప అనగానే.. మీరు లేకుంటే శౌర్య ఉండలేదు అందుకే అని కార్తీక్ అంటాడు. అంతా నా వల్లే మీరు పెళ్లి కొడుకుగా ఉండాల్సిన వాళ్ళు ఇలా పేషేంట్ అయ్యారని దీప బాధపడుతుంది. ఆ తర్వాత శ్రీధర్, కావేరి ఇంటికి వస్తాడు. అక్కడికి వెళ్తే  నా కొడుకు పెళ్లి గురించి, ఇక్కడికి వస్తే నా కూతురు పెళ్లి గురించి టెన్షన్ అని శ్రీధర్ అనుకుంటు ఇంట్లోకి వస్తుంటాడు. అప్పుడే స్వప్న ఫ్యాన్ క్లీన్ చేస్తుంటుంది. అది చూసి స్వప్న సూసైడ్ చేసుకుంటుందని కంగారు పడుతాడు. నేను అలా పిరికిదాన్ని కాదంటూ శ్రీధర్ కే ఎదురు మాట్లాడుతుంది స్వప్న. మా నాన్నకి మన గురించి ఛాన్స్ ఇవ్వలేదు కానీ స్వప్న మనకి ఇస్తుంది. కొంచెం ఆలోచించండి అని శ్రీధర్ తో కావేరి అంటుంది.  ఆ తర్వాత శౌర్య తులసి చెట్టు దగ్గర దీపం పోతుంటే పోకుండా చెయ్ అడ్డుపెడుతుంది. కార్తీక్ బాగుండాలంటూ మొక్కుకుంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి అన్నీ మీరే చేస్తారు.. మీరే కోరుకుంటారు.. అసలు మీ నాన్న ఇదంతా చేసాడు అని అనబోతుంటే అనసూయ వచ్చి పారిజాతాన్ని ఆపుతుంది. అనసూయ, దీపలని  పారిజాతం తిడుతుంది. నువ్వు మా అమ్మని తిడితే కార్తీక్ కి చెప్తానని శౌర్య అనగానే.. పారిజాతం భయపడుతుంది. అదంతా శివన్నారాయణ చూసి వచ్చి పారిజాతాన్ని తిడుతాడు. నువ్వేం చేసావో నేను చూసాను.. నిన్ను అనసూయ తిట్టకుండా వెళ్ళింది నేను అలా కాదు.... నువ్వు ఎక్కడ నుండి వచ్చావో మర్చిపోయావా అని శివన్నారాయణ అనగానే పారిజాతం పనిమనిషిగా ఉన్న రోజులు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి కావేరి వస్తుంది. ఒక ఆడది మగాడిని ఇష్టపడడం తప్పైతే ఆ తప్పు చెయ్యని ఆడది ఉండదు. మన అమ్మాయి కూడా అందరిలాంటి ఆడపిల్ల‌.. అది ఒక కుర్రాడిని ప్రేమించింది దాని కారణం దానికి ఉంది.. మీ కారణం మీకు ఉంది.. అది అనుకున్నది జరగపోతే నిజంగానే ఈ సారి ఫ్యాన్ క్లీన్ కాకుండా.. ఇంకేదైనా చేసుకుంటే ఎలా అని కావేరి చెప్తుంది. ఒకసారి అబ్బాయిని కలవమని అనగానే శ్రీధర్ సరేనంటాడు. అప్పుడే స్వప్న వచ్చి హ్యాపీగా అతడి నెంబర్, అడ్రెస్ ఇస్తుంది. థాంక్స్ మమ్మీ అంటు కావేరికి స్వప్న చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Shekhar basha: శేఖర్ బాషాకి బాబు పుట్టాడు.. హౌస్ లో గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ ఎపిసోడ్ లో ఒక్కొక్కరిని రఫ్ఫాడించాడు నాగార్జున. హౌస్ లో వీకంతా ఎవరెవరు ఏం చేసారో చెప్తూ గట్టిగా క్లాస్ పీకాడు. అయితే వీటిల్లో ఓ గుడ్ న్యూస్ అండ్ సర్ ప్రైజ్ కూడా చెప్పాడు నాగార్జున. (Bigg Boss 8 Telugu)  ఇలాంటి సర్ ప్రైజ్ లు సర్వ సాధారణం.. ప్రతీ సీజన్లో ఇలాంటి ఒక ఎమోషన్ ఉండనే ఉంటుంది. గత సీజన్ 6 లో సింగర్ రేవంత్ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అతను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు బయట తన వైఫ్ ఎలా ఉందోనంటూ రేవంత్ ఒక ఎమోషన్ ని క్యారీ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత తనకి పాప పుట్టిందంటూ బిగ్ బాస్ రేవంత్ కి గుడ్ న్యూస్ షేర్ చేసాడు. ఆ సీన్ మోస్ట్ హార్ట్ టచింగ్ అని చెప్పొచ్చు. (Shekar Basha) గత సీజన్లో కూడ అంబటి అర్జున్ కూడా అదే ఎమోషన్ క్యారీ చేస్తూ వచ్చాడు‌ ప్రస్తుతం హౌస్ లో శేఖర్ బాషా కూడా అదే ఎమోషన్ ని క్యారీ చేస్తున్నాడు‌. కానీ బయటపడడం లేదు. అతని భార్యకి డెలివరీ డేట్ సెప్టెంబర్ 14 కావడంతో శేఖర్ బాషా ప్రొద్దున నుండి నాగార్జున సర్ ఎప్పుడు వస్తారు.. ఏదైనా న్యూస్ చెప్తారేమోనని వెయిట్ చేస్తున్నానంటు నాగార్జునతో శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. శేఖర్ కోసం బిగ్ బాస్ ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాను. నీకు బాబు పుట్టాడని నాగార్జున చెప్పగానే శేఖర్ బాషా ఏడుస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సీజన్ లో ఇదే మోస్ట్ ఎమోషనల్ సీన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత అందరు శేఖర్ బాషాకి కంగ్రాట్స్ చెప్పారు. దాంతో తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Brahmamudi :  నీ కొడుకు వల్లే వెళ్లిపోయింది..  షాక్ లో అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -515 లో... ఇందిరాదేవి రాజ్ దగ్గరకి వచ్చి కావ్యని తీసుకొని రమ్మని చెప్తుంది. నేను తీసుకొని రాను.. నేను వెళ్ళామనలేదు.. అలా అని తీసుకొని రాలేను.. నా తల్లికి ఆ పరిస్థితి రావడనికి కారణం అయిన తనని అసలు క్షమించనని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య బాధపడుతుంటే.. అప్పుడే అప్పు వస్తుంది. అప్పు బాధపడుతూ కావ్యని వచ్చి హగ్ చేసుకొని ఏడుస్తుంది. నువ్వు ఏడవడం ఫస్ట్ టైమ్ చూస్తున్న అని ఏడవకని అప్పుకు కావ్య చెప్తుంది. ఇదంతా మా పెళ్లి వల్లే అని అప్పు అంటుంది. మీ పెళ్లి వల్ల కాదు.. పెళ్లి జరిగేటప్పుడు ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ ఇన్ని రోజులైనా నా గురించి మా ఆయనకి తెలియకపోవడం వళ్లే ఇదంతా.. ఇంకా ఎన్ని రోజులు అతని మనసులో స్థానం కోసం ప్రయత్నం చేయాలి.. లేదు ఇక ఒకదాన్నే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని కావ్య అంటుంది.  మరొకవైపు అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి బాధపడుతుంటే.. తను స్పృహలోకి వస్తుంది. దాంతో సుభాష్ వెళ్లి అందరికి చెప్తాడు. అందరూ తను స్పృహలోకి వచ్చినందుకు హ్యాపీ కగా ఫీల్ అవుతారు. అపర్ణ అందరిని చూస్తుంది కావ్య ఎక్కడా అని అడుగుతుంది. దాంతో రాజ్ డైవర్ట్ చేసి.. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడుగుతానంటూ వెళ్తాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చాక ఆమెకి షాకింగ్ కలిగే విషయాలు చెప్పకండి అని చెప్తుంది. ఆ తర్వాత కావ్యని అపర్ణ అడుగుతుందని రాజ్ తో ఇందిరాదేవి అంటుంది. ఇది నీ కాపురానికి సంబంధించిన విషయం కాదు.. మీ అమ్మ ప్రాణానికి సంబందించినది అని ఇందిరాదేవి అడుగుతుంది. నాకేం తెలియదు ఇప్పుడు నన్నేం అడగకండి అని రాజ్ వెళ్ళిపోతాడు. రాజ్, కావ్యలని అపర్ణ కలుపుతుందని సుభాష్ అంటాడు. ఆ తర్వాత స్వప్నకి కావ్య ఫోన్ చేసి అపర్ణ గురించి అడిగి తెలుసుకుంటుంది. ఆ తర్వాత కావ్య జాబ్ చూసుకోవడానికి బయటకు వెళ్తుంటే.. కనకం వద్దని అంటుంది. కృష్ణమూర్తి వెళ్ళమని చెప్తాడు‌. ఎందుకు అలా చెప్పారని కనకం అంటుంది. తన కాళ్ళ పై తను నిలబడాలని అనుకుంటుందని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత అపర్ణ ని డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తారు. స్వప్న దిష్టి తీస్తుంటే.. కావ్య ఎక్కడ  అని అపర్ణ అడుగుతుంది. తరువాయి భాగంలో నేను లేనప్పుడు ఏం జరిగిందని అపర్ణ అనగానే.. నీ కోడలు చెయ్యాల్సిన తప్పు చేసి నిలదీసేసరికి వెళ్ళిపోయింది. నేను కారణం కాదు.. నీ కొడుకు వల్లే వెళ్లి పోయిందని రుద్రాణి అనగానే అపర్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Shekar Basha Elimination: శేఖర్ బాషా ఎలిమినేషన్.. షాక్ లో బిగ్ బాస్ ఫ్యాన్స్!

బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ వీక్ ఎండ్ కి వచ్చేసింది. ఇక రెండో వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ఇక వీకెండ్ లో శేఖర్ బాషా ఎలిమినేషన్ (Shekar basha elimination) జరిగిందనే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ పోల్స్ లో కిర్రాక్ సీత, పృథ్వీ లీస్ట్ లో ఉండగా.. అనూహ్యంగా శేఖర్ బాషా ఎలిమినేషన్ అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చే కొన్ని లీక్స్ వల్ల ఈ న్యూస్ బయటకొచ్చిందని టాక్ నడుస్తుంది. అసలు ఇది నిజమేనా.. అంటే జరిగే ఛాన్స్ లు వందకి వంద శాతం ఉన్నాయి. ఎందుకంటే ఈ వారమంతా శేఖర్ బాషా పేరు ఒక్క టాస్క్ లో కూడా వినపడలేదు. అసలు అతనికి సంబంధించిన ఫుటేజ్ లేనే లేదు. ఇక కిర్రాక్ సీత గేమ్స్ లో బాగా ఆడింది. అందరితో బాగా ఉంది. కాస్త స్క్రీన్ స్పేస్ కూడా ఉంది.‌ కానీ శేఖర్ బాషాకి సంబంధించిన ఏ కంటెంట్ లేదు. ఇక ఇతడిని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ లు భారీగానే ఉన్నాయి. శనివారం ప్రోమోలో యష్మీ, ప్రేరణకి ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున ‌. ఇక నాగ మణికంఠ తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా మెరుగైన ఆట కనబరిచాడు. ఇక శేఖర్ బాషా ఎలిమినేషన్ అనగానే అటు మీడియా, ఇటు ఏఫ్ఎమ్ అంతా ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇది నిజంగా బిగ్ బాస్ ఇచ్చిన షాక్ అనే చెప్పాలి. మొన్నటి ఎమోషనల్ సర్ ప్రైజ్ ఎపిసోడ్ లో కూడా అతనికి స్క్రీన్‌ స్పేస్ తక్కువే ఇచ్చారు బిబి టీమ్. అంటే అతడి ఎలిమినేషన్ ముందే ఫిక్స్ అయిందని తెలుస్తుంది. Shocking elimination in Bigg boss 8 అంటూ ట్యాగ్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Biggboss 8 Telugu Promo: యష్మీ గౌడ ని గన్ తో కాల్చేసిన నాగార్జున!

బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ వారమంతా హౌస్ లో ఎవరేం చేశారు? ఎవరేం తప్పు చేశారంటూ వాళ్లకి నాగార్జున క్లాస్ పీకే శనివారం రానే వచ్చింది. ఇక వీకెండ్ నాగార్జున కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకే ప్రోమో కోసం ఆందరు ఎదురుచూస్తుంటారు. ఆ ప్రోమో రానే వచ్చింది. గత వారం నాగార్జున తన పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల ఎవరిని ఎక్కువగా అనకుండా చాలా సింపుల్ గా ఉన్నాడు. మునుపటి ఫైర్ లేదు. మరి హౌస్ లో కన్నడ బ్యాచ్ చేసే కన్నింగ్ చేష్టలకి ముగింపు ఇచ్చి వార్నింగ్ ఇస్తాడో లేదో అని ఇంటెన్స్ తో ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ ప్రోమోలో ఏం ఉందంటే.... వచ్చీ రాగానే నాగార్జున గన్ పట్టుకొని వచ్చేశాడు.‌ ఇక హౌస్ లోని ముగ్గురు చీఫ్ లని నిల్చోమని చెప్పాడు. ఎవరి క్లాన్ బాగా ఆడిందో చీఫ్ లనే చెప్పమని నాగార్జున అడుగగా.. ప్రేరణని రెడ్ లో ఉంచింది యష్మీ. ఎందుకంటే తను సంఛాలక్ గా ఫెయిల్ అయ్యిందంటూ యష్మీ చెప్పగా.. మరి నువ్వు సంఛాలక్ గా సీత, మణికంఠలు ఆడిన టాస్క్ లో ఫెయిల్ అవ్వలేదా అని నాగార్జున అడిగాడు. మణికంఠ అడిగానని చెప్తున్నాడు నువ్వు అడగలేదని అంటున్నావ్.. ఎవరు నిజం చెప్తున్నారో చూద్దామని సీసీటీవి ఫుటేజ్ చూపించగా.. అందులో నియర్ బై( దగ్గరగా) ఉందని తీసుకుందామని కిర్రాక్ సీత అనగా.. ఒకే అని యష్మీ ఒప్పుకుంది. ఆ తర్వాత మణికంఠ గెలవకుండా ఉండాలని , ఆ టీమ్ గెలవకూడదని అలా చేసానంటు యష్మీ చెప్పుకొచ్చింది. సంఛాలక్ గా యష్మీ ఫెయిల్ అంటు గన్ తో బోర్డ్ మీద ఉన్న యష్మీ ఫోటోని కాల్చేశాడు.  ఇక అభయ్, విష్ణుప్రియల మధ్య జరిగిన దాని గురించి కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టున్నాడు నాగార్జున. ఇక పృథ్వీ, నిఖిల్ ని స్ట్రాంగ్ ప్లేయర్స్ అని యష్మీ గ్రీన్ లో పెట్టమని అంది‌‌‌ కానీ నాగార్జున.. ఇది నీ దృష్టిలో అసలేం జరిగిందో చూద్దామని అన్నాడు. మరి యష్మీ, ప్రేరణలకి ఈసారి గట్టిగానే క్లాస్ పడేలా ఉంది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో చూసారా మీరు. చూస్తే కామెంట్ చేయండి.

బాలుతో కావ్య రొమాన్స్...జోడిని ఇలా స్క్రీన్ మీద చూడడం ఫస్ట్ టైం

ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోమో మస్త్ ఉంది. అందులోనూ ఇందులో కొన్ని కొత్త విషయాలు కూడా తెలిసాయి. బుల్లితెర నటుడు ఆకర్ష్ బైరముడి ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పాడు. ఆకర్ష్ కి రీసెంట్ గా పెళ్ళైన విషయం తెలిసిందే. ఆయన భార్య పేరు ఐశ్వర్య. ఐతే ఈ ఎపిసోడ్ కి ఆకర్ష్ ఒక రెడ్ జాకెట్ వేసుకొచ్చాడు. దాని మీద ఆర్ అనే లెటర్ ఉండేసరికి శ్రీముఖికి దొరికిపోయాడు. "మీ ఆవిడ పేరు ఐశ్వర్య కదా మరి నీ జాకెట్ మీదకు రోహిణి ఎందుకొచ్చింది" అని అడిగేసింది. "అంటే ఐశ్వర్య నా లైఫ్ లో ఉంది. రోహిణి నా జాకెట్ మీదైనా ఉంటుంది" అని ఆన్సర్ ఇచ్చాడు. దానికి శ్రీముఖి "అమ్మో రోహిణి ఒకరు గదిలో, ఒకరు మదిలో" అంటా అని హడావిడి చేసింది. తర్వాత అబ్బాయిలకు అమ్మాయిలకు పోటీలు పెట్టింది. ఐతే పవిత్ర, కావ్య మీ ఇద్దరూ ఒక అబ్బాయిని డిసైడ్ చేసుకోండి. అని శ్రీముఖి అడిగేసరికి 'బాలు" అని  అన్నారిద్దరూ.. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే నిఖిల్-కావ్య జోడీ అన్న విషయం తెలిసిందే ఐతే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇప్పుడు కావ్య సింగల్ గా ఉండిపోయింది. ఇక ఇప్పుడు బాలు-కావ్య వచ్చే గేమ్ ఆడారు. ఈ జోడిని ఇలా స్క్రీన్ మీద చూడడం ఫస్ట్ టైం అంటూ శ్రీముఖి అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఆ గేమ్ లో కావ్య ఓడిపోయింది. ఇక శ్రీముఖి "ఏంటి కావ్య బాయ్స్ కి పాయింట్ ఇద్దామనుకుంటున్నావా" అని అడిగింది. దానికి కావ్య "పది సెకన్లు బాలుతో గేమ్ ఆడేసరికి మైండ్ డిస్ట్రాక్ట్ ఐపోయింది" అని చెప్పింది. దానికి బాలు "అవునా" అని అడగడం భలే క్యూట్ గా అనిపించింది.

Biggboss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ లో  ప్రేమకథ పట్టాలెక్కినట్లేనా!

  బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ సూత్రం కంపల్సరీ. అదేంటంటే.. అబ్బాయి,అమ్మాయితో లవ్ ట్రాక్ నడపడం. అది అనుకోకుండా హౌస్ లో కుదరుతుందో లేక బిగ్ బాస్ కావాలని అలా లవ్ ట్రాక్ నడిపిస్తే మనం కంటెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతామని అనుకుంటారో ఏమో తెలియదు గానీ సీజన్ కి రెండు జంటలు మాత్రం అవుతున్నాయి. బిగ్ బాస్ కూడా లవ్ గురునే కాబట్టి వీటికి స్క్రీన్ స్పేస్ ఎక్కువే ఇస్తుంటాడు. ఇలాంటి జంటలని చివరివరకు ఉంచి ఇక వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత పెళ్లే అన్నట్లు వాళ్లపై ప్రోమోలు వదులుతుంటాడు బిగ్ బాస్ మామ. ఈ సీజన్లో నిఖిల్ ఏంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నిఖిల్ హౌస్ లోకి సింగిల్ అంటూ ఎంట్రీ ఇచ్చి.. మింగిల్ అయి వెళ్తాడనిపిస్తుంది. నిఖిల్ కి బిగ్ బాస్ ఎంట్రీకి ముందువరకు బయట లవ్ స్టోరీ ఉంది. అన్ని షోస్ లో కూడా నిఖిల్ తన లవర్ పార్టిసిపేట్ చేసేవారు. కానీ నాగార్జున తో స్టేజ్ మీద నేను సింగల్ అనగానే అందరు షాక్ అయ్యారు. మరి ఆ సింగిల్ అని ఎందుకు అన్నాడో ఆల్రెడీ కమిటెడ్ అని తెలిస్తే హౌస్ లో లవ్ ట్రాక్ నడిపేందుకు వీలు అవ్వదని ఆలా చెప్పాడో లేక నిజంగానే బ్రేకప్ అయిందో తెలియదు కానీ మనోడు హౌస్ లో మాత్రం వేరేలా ఉంటున్నాడు. ప్రస్తుతం సోనియాతో నిఖిల్ చనువుగా ఉంటున్నాడు. ఎక్కడ చుసినా వీళ్ళిద్దరే ఉంటున్నారు. అదే డౌట్ వచ్చి విష్ణుప్రియ అడగ్గా.. అది కాస్తా ముదిరి పెద్దగొడవనే అయింది కానీ హౌస్ మేట్స్ అందరిలోను వాళ్ళ బిహేవియర్ పై కాస్త డౌట్ గానే ఉంది. అయితే హౌస్ లో ఏ టాస్క్ పెట్టిన అందులో సోనియా గెలిచినా , గెలవకపోయిన, నిఖిల్ గెలిచినా గెలవకపోయిన ప్రతిసారి నిఖిల్ ని సోనియా హగ్ చేసుకోవడం కామన్ అవుతుంది. అంటే వీళ్ళు ఓదార్చుకోవడం కోసమే టాస్క్ లు ఆడుతున్నారా అనిపిస్తుంది. ఎప్పుడు ఇద్దరు పక్కపక్కనే కూర్చోవడం ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడం చూస్తుంటే ప్రేమ కథ పట్టాలెక్కినట్లే అనిపిస్తుంది. మరి వీరిమధ్య నిజంగానే ఇష్క్ సిఫాయా ఉందా లేక కంటెంట్ కోసం ఇద్దరు అలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. వీరిద్దరిని చూసి మరి మీకేనపిస్తుందో కామెంట్ చేయండి.

బిగ్ బాస్ హిస్టరీలోనే మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ గా యష్మీ!

  బిగ్ బాస్ మొదలై రెండు వారాలవుతుంది. కానీ ఇప్పటికి హౌస్ లోని వాళ్ళలో పలానా వీళ్ళు ఫేవరెట్ అన్న ఫీలింగ్ కి ఇంకా జనాలు రావట్లేదు. 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో మొదటి వారం బేబక్కకి బై చెప్పేయడంతో ఇప్పుడు పదమూడు మంది ఉన్నారు.  ప్రతి సీజన్ లాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఒక గ్రూప్ అయితే మొదలైంది. వాళ్లే యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వి, అభయ్. వీళ్ళంతా షోకీ ముందు నుండే పరిచయం కాబట్టి హౌస్ లో కూడా అలాగే ఉంటున్నారు. యష్మీ చీఫ్ అయి చాల చీప్ గా బెహేవ్ చేస్తుంది. ఎక్కువ స్క్రీన్ స్పేస్ కి ట్రై చేస్తుంది. టాస్క్ లో విన్ అవ్వడం బిగ్ బాస్ పవర్ ఇవ్వడంతో అప్పోజిట్ టీమ్ కి చుక్కలు చూపించింది. వాళ్లు బాధపడుతుంటే యష్మీ, ప్రేరణలు పార్టీ చేసుకుంటున్నారు. తనకి నచ్చిన వాళ్ళు గెలిస్తే చాలు మిగతా వాళ్ళ ఫీలింగ్ తో సంబంధం లేకుండా బెహేవ్ చేస్తుంది. మొన్న జరిగిన సాక్స్ ప్రొటెక్షన్ టాస్క్ లో నబిల్, విష్ణుప్రియ అవుట్ అవ్వడంతో యష్మీ పిచ్చి పిచ్చిగా ఎగురుతూ, గెంతుతూ పృథ్వీతో కలిసి తీన్ మార్ డ్యాన్స్ కనిపించింది. ఇక్కడ యష్మీ, పృథ్వీలని చూసిన వారందరికి "ఏం సైకో గాళ్ళు ఉన్నార్రా" అనేంతలా అనిపించింది. ఇక యష్మీ ని చూసిన ట్రోలర్స్.. ఆ జేజమ్మే మళ్ళీ బిగ్ బాస్ కి వచ్చింది రా అని యష్మీ స్థానంలో శోభాశెట్టి ముఖాన్ని పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు.‌ సీజన్ సెవెన్ లో శోభాశెట్టికి ఎంత నెగెటివ్ వచ్చిందో రెండు వారాలకే యష్మీకి అంతటి నెగెటివ్ వచ్చింది. ఇక ఈ వారం నామినేషన్ లో లేదు కాబట్టి సేఫ్ అయింది. ఒక్కసారి నామినేషన్ కి వస్తే ఎలిమినేషన్ చేసేదాకా వదలిపెట్టమని నెటిజన్లు భావిస్తున్నారు.  

వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే మాజీ కంటెస్టెంట్స్ వీళ్ళే!

  బిగ్ బాస్ టెలివిజన్ రంగంలో ఒక సంచలనమని చెప్పొచ్చు. ఈసారి సీజన్ సరికొత్తగా అన్ లిమిటెడ్ అంటూ ముందుకి వచ్చింది కానీ లిమిటెడ్ కంటెస్టెంట్ తో మొదలైంది. బిగ్ బాస్ ఈ సీజన్లో ఎవరు ఉహించని విధంగా ట్విస్ట్ లు, గేమ్స్ తో ముందుకి వెళ్తుంది. గత సీజన్లో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ తో షో ని మొదలుపెట్టారు. ఆ తర్వాత అయిదు, ఆరవ వారంలో ఒకరు లేదా ఇద్దరు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపారు. కానీ ఈసారి పద్నాలుగు మందితో షోని మొదలు పెట్టారు. అందులో ఒకరు ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం హౌస్ లో పదమూడు మంది ఉన్నారు. ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చేది గత సీజన్ కంటెస్టెంట్స్ అని టాక్ వినిపిస్తుంది. ఇది ఆల్రెడీ హిందీ , తమిళ్ బిగ్ బాస్ షో లో ఇలా తీసుకోవడం సాధారణంమే కానీ తెలుగు బిగ్ బాస్ లో ఇంత వరకు అలా చెయ్యలేదు కానీ ఈసారి కచ్చితంగా మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉంటుందట. అందులో ఇప్పటికే సీజన్ 4 కంటెస్టెంట్ అయిన ముక్కు అవినాష్ ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందట ముక్కు అవినాష్ ఆ సేసన్ లో కూడ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంటే. అంతేకాకుండా సీజన్ 3 కంటెస్టెంట్ రౌడీ రోహిణి ఇంకా గత సీజన్ లో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన నయని పావని వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బయట నుండి లోపలున్న వారి గేమ్ చూసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే వారి గేమ్ స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంటుంది. హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది మూడవ వారంలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి హౌస్ లోకి ఎవరు వస్తే బాగుంటుంది.. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.