Karthika Deepam 2 : కొంపముంచిన స్వప్న పెళ్లి.. ఇంకెప్పుడు‌ కలిసేది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -162 లో......స్వప్న నా చెల్లి లాంటిది అని అన్నావ్.. అలా కాకుండా నా సొంత చెల్లి, తల్లి వేరే కానీ తండ్రి ఒక్కడే అని కాంచన కార్తీక్ తో అంటుంది. నా లాంటి పరిస్థితి మీకు వస్తే ఏం చేస్తారు అన్నప్పుడు చెప్పాలిసింది దీప నా మొగుడు లాగే నీ మొగుడు మిమ్మల్ని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని దీపతో కాంచన అంటుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.. నేనే చావను అంటు కాంచన లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావ్..  వాళ్ళ పెళ్లి దీనికి పరిష్కారమా నాకోక మాట చెప్పొచ్చు కదా అని దీపపై కార్తిక్ కోప్పడతాడు. నేనేం వాళ్ళని తీసుకొని వెళ్లి పెళ్లి చెయ్యలేదు. మీ నాన్న స్వప్నకి వేరొక అబ్బాయితో పెళ్లి చేయబోతుంటే ఆపి ఈ పెళ్లి చేసాను లేకపోతే మీ చెల్లి బ్రతకనంది అని జరిగింది మొత్తం కార్తీక్ కి వివరిస్తుంది. అప్పుడే శ్రీధర్ కాంచన దగ్గరికి వస్తాడు. మరొకవైపు ఎందుకమ్మ ఇన్ని రోజులు నాకు చెప్పలేదు.. ఇంత బాధలో కూడా ఇక సంతోషం అయిన విషయం ఏంటంటే.. కార్తీక్ నా అన్న అని స్వప్న అంటుంది. ఆ తర్వాత కావేరి దగ్గరికి స్వప్న, కాశీ లు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. స్వప్న కాశీలని దాస్ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఆ దీప కావాలనే వాళ్ళ పెళ్లి చేసింది. నాకు బావ కావాలని జ్యోత్స్న పారిజాతంతో అంటుంది. అయితే వెళ్లి మీ తాతయ్యతో బావ నాకు కావాలని చెప్పు అంటుంది. దాంతో పారిజాతం, జ్యోత్స్న శివన్నారాయణ‌ దగ్గరికి వెళ్తుంటే.. తనే కోపంగా శ్రీధర్ ఉన్న ఫ్యామిలీ ఫోటో ని పగులగొట్టి.. రేయ్ దశరథ్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పదా అని అంటాడు. మీరేం చేసిన జ్యోత్స్నని దృష్టిలో పెట్టుకొని చెయ్యండి అని పారిజాతం అంటుంటే.. నాకేం చెయ్యాలో తెలుసు అని శివన్నారాయణ‌ అంటాడు. మరొకవైపు కాంచన కాళ్ళ మీద పడి తనని క్షమించమని అడుగుతాడు శ్రీధర్. మీరు చేసింది తప్పు కాదు నమ్మకద్రోహం అంటూ కాంచన ఎమోషనల్ అవుతుంది. అప్పుడే కావేరి ఇంటికి వస్తుంది. మీరు వచ్చారేంటని కార్తీక్ అడుగుతాడు. ఆవిడ రమ్మని ఫోన్ చేసారని కావేరి చెప్తుంది. అమ్మ ఎందుకు రమ్మంది అనుకుంటారు. ఆ తర్వాత నువ్వేం శిక్ష వేసిన ఒప్పుకుంటానని శ్రీధర్ అనగానే.. అయితే వెళ్లి డోర్ తీయండి అని కాంచన అనగానే శ్రీధర్ డోర్ తీసాడు. బయట కార్తీక్, దీప దగ్గర కావేరి ఉంటుంది. తనని చూసిన శ్రీధర్ షాక్ అవుతాడు. నేనే రమ్మని చెప్పానని కాంచన అంటుంది.  కావేరితో కాంచన మాట్లాడి.. కాసేపటికి దీపకి చెప్పి చీర తెప్పించి ఇస్తుంది. కార్తీక్ తో ఒక బ్యాగ్ తెప్పించి మీ నాన్న ముందు పెట్టు అంటుంది. అక్కడ కాంచన ఏం చేస్తుందో ఎవరికి అర్ధం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Nagarjuna Fires on Yashmi : మదర్ ప్రామిస్.. నేను ఆ ఉద్దేశంతో అనలేదు!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున ఎవరికి క్లాస్ పీకుతాని ఆడియన్స్ అనుకున్నారో అదే జరిగింది. హౌస్ లో పర్ఫామెన్స్ వైజ్ నబీల్ ది బెస్ట్ అని తేలింది. ఇక నాగ మణికంఠ, నిఖిల్, సోనియా పెద్దగా ఆడటం లేదని నాగార్జున చెప్పేశాడు. (Bigg Boss 8 Telugu) మొన్న టాస్క్ జరిగిన తర్వాత మణికంఠని ఉద్దేశించి.. అతను మగాడు కాదంటూ యష్మీ చేసిన వ్యాఖ్యలని నాగార్జున తిడతాడని, క్లాస్ పీకుతాడని తెలుగువన్ ఇంతకముందే చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో యష్మీని నాగార్జున నిల్చోబెట్టి.. హౌస్ లో ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారని అడుగగా.. ఏమీ తెలియనట్టు మొహం పెట్టి నలుగురు బాయ్స్, అయిదుగురు గర్ల్స్ అని యష్మీ అంది. ఇక నాగార్జున వీడియో ప్లే చేసి చూపించాడు.ఈ వీడియోలో ఏం ఉందంటే.. మణికంఠ దూరంగా కూర్చొని ఉంటే యష్మీ సహా తొట్టి గ్యాంగ్ అంతా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. అందులో హౌస్‌లో ఎంతమంది మగాళ్లున్నారని ఎవరో అడిగితే నలుగురే అంటూ ఇంకెవరో అన్నారు. అదేంటి మణికంఠను లెక్కపెట్టలేదా అని పృథ్వీ అంటే వాడు లెక్కల్లో లేడంటూ యష్మీ డైలాగ్ వేసింది. దీన్ని కొనసాగిస్తూ రేయ్ నిన్ను మగాళ్ల లిస్ట్‌లోనే వేయట్లేదంటూ నిఖిల్ ఇంకా గట్టిగా చెప్పాడు.  ఇక ఈ వీడియో చూసిన వెంటనే యష్మీ.. మదర్ ప్రామిస్ సర్.. నేను ఆ ఇంటెన్షన్ తో అనలేదు.. నా ఇంటెన్షన్ అయితే అది కాదు.. ఐయామ్ సారీ మణికంఠ.. నా గురించి నీకు తెలుసు.. సారీ మణి అంటూ యష్మీ అంది. దీంతో మణికంఠను పైకి లేపి నాగ్ అడిగారు. యష్మీ అన్న మాట నీకు ఎలా అనిపించిందని నాగ్ అడిగితే.. అది ఒక జోకులా అనిపించింది సర్.. అందుకే వెంటనే రియాక్ట్ అయి మీ హద్దుల్లో మీరుండండి అన్నా అంటూ మణికంఠ చెప్పాడు. మరి నువ్వు ఎందుకు రెయిజ్ చేయలేదు.. నీ వాయిస్ ఎందుకు గట్టిగా వినిపించలేదంటూ నాగార్జున అడిగాడు. అంటే వీళ్లకి చెప్పిన వేస్ట్.. వీళ్ల జ్ఞానం ఇంతే అని వదిలేశా అంటూ మణికంఠ అన్నాడు. దీనికి నాగార్జున సీరియస్ అయ్యాడు. స్టాండ్ తీసుకో మణి, నిన్ను ఎవరైనా ఏదైనా అంటే మాట్లాడు.. నువ్వు ఏమనవనే వాళ్లు జోక్స్ వేస్తున్నారంటూ నాగార్జున క్లాస్ పీకాడు.

Brahmamudi : అనామికని చూసి షాకైన కావ్య.. ఆ డిజైన్ ఇస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -527 లో.....రాజ్ ఆఫీస్ కి వెళ్లేసరికి అందరూ వర్క్ చేయకుండా తమకి నచ్చిన పని చేస్తుంటారు. దాంతో రాజ్ కి కోపం వచ్చి.. ఇప్పుడు మిమ్మల్ని జాబ్ లో నుండి తీసేయాలి అనుకుంటే క్షణం పట్టదు. ఇన్ని రోజులు పని చేశారని ఆలోచిస్తున్నా ఇక ముందు చేయబోయే వర్క్ పై దృష్టిపెట్టండి. లేదంటే అందరి జాబ్ తీసేస్తా అని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత జరిగే ఎక్స్పో కీ డిజైన్స్ రెడీ చెయ్ అని శృతికి రాజ్ చెప్తాడు. లాస్ట్ ఇయర్ కావ్య మేడం రెడీ చేశారని శృతి అనగానే.. అంతకుముందు మనమే రెడీ చేశాం.. చెప్పింది చెయ్ అని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య వర్క్ చేసే తన బాస్ దగ్గరికి వెళ్తుంది. ఈ సారి పెద్ద కంపెనీతో టైఅప్ అయ్యాం మంచి డిజైన్స్ వెయ్యండి అని తన బాస్ కావ్య కి చెప్పగానే.. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఆ బాస్ అనామిక దగ్గరికి వెళ్తాడు. కావ్య డిజైన్స్ సామంత్ గ్రూప్ ఇండస్ట్రీ వాళ్లకి వెళ్తున్నాయని కావ్య తెలియొద్దని అతనికి చెప్తుంది అనామిక. ఆ తర్వాత రాజ్ కి సామంత్ ఎదురుపడుతాడు. ఇక ఇప్పుడు నా కంపెనీ నెంబర్ వన్ కావాడానికి రెడిగా ఉందని సామంత్ అంటాడు. ఇద్దరు కాసేపు వాదించుకుంటారు. ఆ తర్వాత సామంత్ కి అనామిక ఫోన్ చేస్తుంది. ఇక్కడ రాజ్ నాతో ఛాలెంజ్ చేస్తున్నాడని సామంత్ అనగానే.. వాడి కంపెనీ త్వరలోనే ఓటమి కాబోతుంది. నువ్వు అయితే నామినేషన్ వెయ్ అని అంటుంది. ఆల్రెడీ ఎప్పుడో నామినేషన్ వేసానని సామంత్ అంటాడు. అయితే త్వరగా ఇంటికి రా బేబీ.. నీ కోసం వెయిట్ చేస్తుంటా అని అనామిక అంటుంది. మరొకవైపు అప్పుని కళ్యాణ్ పోలీస్ కోచింగ్ దగ్గరికి తీసుకొని వస్తాడు. అక్కడ ఫీజు ఎక్కువ అనడంతో అప్పు వద్దని వెనక్కి వస్తుంది. నేను ఎలాగోలా కష్టపడి డబ్బులు తెస్తాను. నువ్వు కోచింగ్ తీసుకోమని కళ్యాణ్ అంటాడు. అయినా అప్పు వినదు.  ఆ తర్వాత రాజ్ ఇంటికి వచ్చి ఆఫీస్ సిచువేషన్ గురించి చెప్తాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావ్ .. ఇన్ని రోజులు రాహుల్ వెళ్ళాడని ఇలా అంటున్నావా అని రుద్రాణి అంటుంది. ఇన్ని రోజులు ఆలోచించలేదు..‌ ఇక అలోచిస్తా.. ఎవరు ఎంత మింగారో అర్ధం అవుతుందని రాజ్ అంటాడు. ఇప్పుడు బాగా అయిందా అని ప్రకాష్ అంటాడు. ఈ సంవత్సరం డిజైన్ ఎక్స్పో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట.. అందులో మనకే అవార్డు రావాలి.. అప్పుడే మళ్ళీ కంపెనీకీ మంచి పేరు వస్తుందని రాజ్ అంటాడు. అయితే అలా డిజైన్స్ కావ్య బాగా వెయ్యగలదు. తనని తీసుకొని రా అని సుభాష్ అంటాడు. నేను తీసుకొని రాను నేను ఎలాగైనా అవార్డు తీసుకొని వస్తానని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య డిజైన్స్ వేయకుండా రాజ్ కావ్య ఫోటోని వేస్తుంది. కనకం వచ్చి నీ మనసులో ఏముందో.. అది పేపర్ పై వేసావని కనకం అంటుంది. మరొకవైపు రాజ్ దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. తరువాయి భాగంలో ఎక్స్పో లో డిజైన్ పెట్టడానికి కావ్య ఇంకా డిజైన్ తీసుకొని రాలేదని కావ్య బాస్ తో సామంత్ అంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. అక్కడ అనామికని చూసి కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Biggboss 8 Promo: కిర్రాక్ సీతకి  కిరీటం... నిఖిల్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున!

బిగ్ బాస్ సీజన్ 8 శనివారం నాటి ప్రోమో రానే వచ్చింది. ఇక హౌస్ లో ఎవరెవరు ఏంటని చెప్తూ నాగార్జున క్లాస్ పీకుతాడని అందరు ఎదురుచూస్తుంటారు.  నాగార్జున వచ్చీ రాగానే హౌస్ లో హీరో ఎవరు జీరో ఎవరో చెప్పమంటూ వారికి కిరీటం తొడగమన్నాడు. అందులో మొదటగా కిర్రాక్ సీతకి మణికంఠ కిరీటం పెట్టగా.. తను నీకే కాదు మాకు కూడా హీరో అని నాగార్జున అన్నాడు. ' థ్రీ అవర్స్ ఫేస్ మీద చిరునవ్వు చెరగకుండా ఉన్నావ్.. యూ ఆర్ జస్ట్ బికమింగ్ మై డొపమైన్ ఆ'  అని పృథ్వీతో నాగార్జున అనగానే.. విష్ణుప్రియ ఫుల్లుగా నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నావని విష్ణుప్రియని నాగ్ అడిగాడు. ఇక ఆ తర్వాత ఆటలో జీరో అయిపోతుందెవరో వారి ఫేస్ మీద మార్క్ వేయమన్నాడు. నైనిక ఫేస్ మీద నాగ మణికంఠ మార్క్ వేస్తుండగా.. 200% రైట్ మణికంఠ అని నాగార్జున అన్నాడు. ఇక ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నావని మణికంఠని నాగార్జున అడుగగా.‌. నాకు అదే అర్థమై చావడం లేదు సర్ అని అన్నాడు.  ఆ తర్వాత నిఖిల్ కి ప్రేరణ మార్క్ వేసింది. యునైటెడ్ గా గేమ్ ఆడాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు.. వాడు క్లాన్ కి ఇంపార్టెంటెన్స్ ఇచ్చి హౌస్ ని పక్కన పెట్టేశాడు.. నాకు అనిపించిందని ప్రేరణ అనగానే.. నీకే కాదు ప్రేరణ మాకు అనిపించిందని నాగ్ అన్నాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ లో నబీల్ ని ఎందుకు తీసావ్‌.. నీ డెసిషన్ కరెక్టేనా అని అడుగగా.. మిస్ బ్యాలెన్స్ అయ్యిందని నిఖిల్ అన్నాడు. మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణమని నాగ్ అడుగగా.. నిఖిల్ మొహం వాడిపోయింది.  నువ్వు చీఫ్ గా ఉన్నప్పుడు నీ క్లాన్ లోకి రావడానికి ఎవరు ఇష్టపడలేదు ఎందుకో ఆలోచించావా అని నిఖిల్ ని అడుగగా.. మేమ్ ఏం చేసిన ఎక్కడైనా మేము ముగ్గురమే ఉంటున్నామని అందరు అనుకున్నారని నిఖిల్ అన్నాడు. మీరేమంటారని హౌస్ మేట్స్ ని అడుగగా.. ఎస్ అని హౌస్ అంతా అన్నారు. యునానిమస్ ఎస్ అని నాగార్జున అన్నాడు. ఈ ప్రోమో చూస్తే నిఖిల్, సోనియాలకి గట్టిగానే క్లాస్ పీకినట్టున్నాడు నాగార్జున.  ఇక  హౌస్ లో ఎవరుంటారు.. ఎవరు ఎలిమినేషన్ అవుతారు.. ఎవరు సీక్రెట్ రూమ్ లో ఉంటారు.. అసలు ఈ వారం ఒక్కో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో సోనియా...ఈ వారం డబుల్ ఎలిమినేషన్

  బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే నాలుగు వారాలు ముగిసాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే వందలో తొంభై శాతం మంది జనాలు సోనియా ఎలిమినేషన్ అవ్వాలనే కోరుకుంటున్నారు. అయితే సోనియాని ఎలిమినేషన్ చేయకుండా సీక్రెట్ రూమ్ లో పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సోనియా సీక్రెట్ రూమ్ కి వెళ్తే హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ తన గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకుంటుంది. కచ్చితంగా హౌస్ మేట్స్ కి తనకి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. దాంతో తను నిఖిల్, పృథ్వీలతో ఉండకుండా హౌస్ లో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఓటింగ్ ముగిసే సమయానికి పృథ్వీ, సోనియా లీస్ట్ లో ఉండగా వారిపైన ఆదిత్య ఓం ఉన్నాడు. అయితే బిగ్ బాస్ పృథ్వీని ఎలిమినేట్ చేస్తే సోనియాని సీక్రెట్ రూమ్ కి పంపిస్తాడు. అయితే ఓటింగ్ లో నబీల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రేరణ సెకెండ్ పొజిషన్ లో ఉంది‌. నబీల్ కు బయట ఫాలోయింగ్ కూడా పెరిగింది. మరో ట్విస్ట్ కూడా ఉంటుందని..  నాగ మణికంఠని బయపెట్టడానికి, ఆటతీరు, మాటతీరు ఇంప్రూవ్ చేసుకుంటాడని.. అతడిని సీక్రెట్ రూమ్ కి పంపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి‌. ఎలిమినేషన్ అయ్యేవారెవరనేది మాత్రం మరికొన్ని గంటల్లో లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అని మరికొందరు అంటున్నారు. ఇదే జరిగితే హౌస్ మేట్స్ కి పెద్ద షాక్ అవుతుంది‌. ఇక శనివారం నాటి ప్రోమో కోసం ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. సోనియా ఎలిమినేషనా లేక సీక్రెట్ రూమా అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.  

చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు... గ్యాప్ ఇవ్వకండి మాష్టర్...

              ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2  షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో పెరఫార్మెన్స్ ఒక్కో రేంజ్ లో ఉంది. ఐతే ఇందులో ఫస్ట్ లవ్ గురించి నందు ఒక ప్రశ్న అడిగేసరికి ఆది ఫస్ట్ లవ్ గురించి చెప్పాలంటూ శేఖర్ మాష్టర్ అడిగాడు. అప్పుడు ఆది తన సెవెంత్ క్లాస్ స్టోరీ గురించి చెప్పాడు. "మా క్లాస్ లో నేను లాస్ట్ లో కూర్చునేవాడిని..అమ్మాయిలంతా ముందు కూర్చునేవారు. అందులో ఒక అమ్మాయి అలా వెనక్కి తిరిగి నన్నే చూస్తూ ఉండేది. తర్వాత ఒక రోజు నేను వెళ్లి ఎందుకు అలాగే చూస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి మా అన్నయ్య అచ్చం మీలాగే ఉంటాడు అని చెప్పింది. మిమ్మల్ని అన్నయ్యలా చూసుకుంటాను మీరేమీ అనుకోరు కదా అని అన్నది. ఇంకో సారి నా వైపు చూస్తే కళ్ళు పీకేస్తా అని చెప్పా " అంటూ తన స్టోరీ చెప్పుకొచ్చాడు. తర్వాత శేఖర్ మాష్టర్ చెప్పాడు " లవ్ ఎక్కడా స్టార్ట్ అయ్యిందంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో కర్నూల్ వెళ్ళాం. ఒక డాన్స్ షో ఉందని అక్కడికి వెళ్లాం. అక్కడికి వెళ్లాం నైట్ అని గ్యాప్ ఇచ్చాడు శేఖర్ మాష్టర్. దానికి నందు వచ్చి "గ్యాప్ ఇవ్వకండి మాష్టర్" అని చెప్పాడు. ఐతే ఈ షోలోకి ప్రభుదేవా మాష్టర్ రావడంతో పండు మాష్టర్ బట్టలు సర్దేసుకుని వచ్చాడు. "ఏంటి పండు వెళ్ళిపోతున్నావా నువ్వు" అని అడిగాడు. "పండు వెళ్ళిపోదాం అనుకున్నాడు కాబట్టే ప్రభుదేవాను పిలిచాడు. అంతా ప్రభుదేవా చూసుకుంటాడు" అన్నాడు ఆది కూడా. తర్వాత రెడీ అయ్యి బట్టలు తీసుకుని వెళ్ళిపోదామని అనుకున్నా హన్సిక దగ్గరకు వెళ్ళాడు. అక్కడ హన్సిక అమ్మాయిలా మేకప్ చేసింది. దాంతో అచ్చు "చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు" అనేలా ఉన్నాడు.

నబీల్ వన్ మ్యాన్ షో.. అటు హౌస్ మేట్స్, ఇటు ఆడియన్స్ ఫిధా!

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఊహకి అందకుండా కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ ఒక్కో కంటెస్టెంట్ యొక్క నేచర్ బయటకొస్తుంది‌.‌ మొదట్లో గంభీరంగా, స్టిక్ట్ గా ఉన్న నిఖిల్ ఇప్పుడు సోనియా మాయలో పడిపోయాడు.  ఇక ఫస్ట్ టూ వీక్స్ అసలు నబీల్ ఉన్నాడో లేదా అనిపించింది కానీ ఎప్పుడైతే తనలో ఫైర్ లేదని , వాయిస్ వినిపించడం లేదని నామినేషన్ లో అన్నారో.. అప్పటి నుంటి నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‌ లో నబీల్ హవా కొనసాగింది. బిగ్‌బాస్ గోల్డెన్ బ్యాండ్ అంటూ ఓ స్పెషల్ ఐటెమ్‌ను కంటెస్టెంట్లకి చూపించాడు. దానికి స్పెషల్ పవర్స్ ఉంటాయని చెప్పినా సరే కంటెస్టెంట్లు ఎవరూ తీసుకోలేదు. కానీ మణికంఠ మాత్రం తెలివిగా దాన్ని అందుకున్నాడు. అయితే మణికంఠ తీసుకున్న తర్వాతే దాని పవర్ ఏంటో అందరికీ అర్థమైంది. ఆ గోల్డెన్ బ్యాండ్‌తో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరూ వేరే సభ్యుల్ని ఇమిటేట్ చేస్తూ నటించమని చెప్పాడు. ఇందులో అందరికంటే నబీల్ మాత్రం ఇరగదీశాడు. ఆదిత్యను అద్భుతంగా ఇమిటేట్ చేశాడు. ఇక పృథ్వీ, విష్ణుప్రియ లాగా నిఖిల్ అండ్ కిర్రాక్ సీత నటించారు. అలాగే మణికంఠ లాగా ప్రేరణ చక్కగా చేసింది. ఇక హౌస్ లో ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి వాటిని ఇరు టీమ్ లు గెస్ చేసి ఆర్డర్ లో రాయాలి. అందులో శక్తి టీమ్ కు రెండు పాయింట్లు, కాంతారా టీమ్ కి ఒక్క పాయింట్ వచ్చింది‌. ఇక ఈ టాస్క్ కి సంఛాలక్ గా నబీల్ ఉన్నాడు. ఇక‌ నిన్నటి ఎపిసోడ్ లో నబీల్ ది వన్ మ్యాన్ షో అని చెప్పాలి.  

ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన వారిలో మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. అయితే నిన్న హౌస్ లో పృథ్వీ-విష్ణుప్రియ మధ్య జరిగింది చూస్తుంటే ఈ వారం ఓటింగ్ పరంగా లీస్ట్ లో ఉన్న  పృథ్వీని ఎలిమినేషన్ చేయకుండా ఆపి.. విష్ణుప్రియతో లవ్ ట్రాక్ చేసేలా ఉన్నాడు బిగ్ బాస్ మావ. నిన్న హౌస్ లో .. విష్ణుప్రియ దగ్గరుండి పృథ్వీకి మేకప్ వేసి డ్రెస్ వేసి రెడీ చేసింది. రెడీ అయ్యాక పృథ్వీని చూసి తెగ మురిసిపోయింది విష్ణుప్రియ. దీంతో మనోడు ఓ టైట్ హగ్ ఇచ్చాడు. ఇక ఈ యవ్వారాలన్నీ చూసి సోనియా తెగ కుళ్లుకుంది. నాకు పృథ్వీని చూస్తుంటే భయమేస్తుంది.. పడిపోతున్నాడు వాడు విష్ణుకి.. అంటూ సోనియా అంది. అవును నేను అబ్జర్వ్ చేస్తున్నా విష్ణుపై సాప్ట్ కార్నర్ ఉంది వాడికి అంటూ నిఖిల్ అన్నాడు. నాకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు కానీ.. విష్ణుప్రియ మీద సాఫ్ట్ ఒపినీయన్ అయితే కనిపిస్తుంది.. వాడు ఏం చేస్తలేదు కానీ పడిపోతున్నాడు.. వాడికి ఎఫెక్ట్ అవ్వకపోయేవరకూ ఏదైనా పర్లేదులే అంటూ సోనియా అంది. హౌస్ లో సోనియా చెప్పినట్టుగా నిఖిల్, పృథ్వీ వింటున్నారనేది అందరికి తెలిసిన నిజమే. అయితే ఈ సారి ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది పృథ్వీ అండ్ సోనియా.. కానీ సోనియాని ఎలిమినేషన్ చేస్తే కంటెంట్ ఉండదు, పృథ్వీని ఎలిమినేషన్ చేస్తే లవ్ ట్రాక్ ఉండదు. దీంతో వీరిద్దరి కంటే పైనున్న ఆదిత్య ఓం ని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరితో కంటెంట్ వస్తుందో వారిని ఎలిమినేషన్ చేయకుండా ఆపేస్తాడని అందరు అనుకుంటున్నారు. అయితే సోనియాని ఎలిమినేషన్ చేయాలని బిబి ఆడియన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. సోనియా ఎలిమినేషన్ బటన్, సోనియా ఎలిమినేషన్ కన్ఫమ్, ప్లీజ్ ఎలిమినేట్ సోనియా అంటు ట్యాగ్ లు పెడుతూ తనని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూడాలి మరి.

Karthika Deepam2 : పోరా కుక్క బయటకి అంటు అల్లుడిని గెంటేసిన మామ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -161 లో... స్వప్నని కాశీ పెళ్లి చేసుకొని శివన్నారాయణ, పారిజాతంల ఆశీర్వాదం కోసం వస్తాడు. ఈ అమ్మాయిని ఎక్కడ పట్టుకొచ్చావ్ రా అంటూ స్వప్నని పారిజాతం తిడుతుంటే.. అలా తిట్టకండి నాకు ఒక ఫ్యామిలీ ఉందని స్వప్న అంటుంది. అయితే మీ వాళ్ళని పిలువు అమ్మ అని శివన్నారాయణ స్వప్నతో అనగానే.. అందరు షాక్ అవుతారు. కాంచనకి ఏమైనా అవుతుందోనని భయంతో పదా అమ్మ వెళదామని కార్తీక్ అనగానే ఇక్కడ ఇంత జరుగుతుంటే ఎక్కడికి వెళదాం.. ఉండమని కాంచన అంటుంది  ఆ తర్వాత పదండి కాశీ అని దీప అంటుంది. వద్దు విషయం ఇంత వరకు వచ్చింది శివన్నారాయణ‌ మనవడు ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అంటే పోయేది ఈ ఇంటి పరువు.. ఈ సమస్య ని ఇప్పడే పరిష్కారించాలని శివన్నారాయణ అంటాడు. ఎక్కడ నిజం బయటపడుతుందోనని.. వాళ్ళతో మాటలు ఏంటి పంపించండి అని పారిజాతం అనగానే.. ఈ విషయం లో సైలెంట్ గా ఉండమని పారిజాతంపై శివన్నారాయణ కోప్పడతాడు. స్వప్నని పారిజాతం తిడుతుంటే ఇంకొకసారి నా గురించి తప్పు గా మాట్లాడితే మర్యాదగా ఉండదని స్వప్న అంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. అక్కడ స్వప్నని చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. మీరేంటి ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరు నన్ను అవమానిస్తున్నారు.. నేను ఎవరో అందరికి చెప్పండి అని శ్రీధర్ తో స్వప్న అంటుంది. మీ డాడ్ గురించి అంటే అతన్ని చెప్పమంటావని శివన్నారాయణ అనగానే.. అతనే మా డాడ్ శ్రీధర్ అని స్వప్న అనగానే అందరు షాక్ అవుతారు. నా అల్లుడిని పట్టుకొని డాడ్ అంటున్నావని శివన్నారాయణ అనగానే.. అల్లుడు ఏంటని స్వప్న షాక్ అవుతుంది. ఆ తర్వాత అతను నా కూతురు భర్త కార్తీక్ తండ్రి అని శివన్నారాయణ‌ చెప్తూ స్వప్నని తిడుతుంటే.. నా కూతురిని ఏం అనకండి మావయ్య అని శ్రీధర్ అనగానే అందరూ షాక్ అవుతారు. తను నా కూతురు.. నా రెండో భార్య కూతురని శ్రీధర్ చెప్పగానే.. కాంచన మనసు ముక్కలు అవుతుంది. శ్రీధర్ పై చెయ్ చేసుకుంటాడు శివన్నారాయణ‌. పోరా కుక్క అంటు తిడతాడు. అందరిని ఇంట్లో నుండి వెళ్ళమనగానే అందరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కోడలు ఇంటిలిజెన్స్ చూసి అత్త షాక్.‌. సంతోషంలో భర్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ '‌ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -212 లో......అందరు కొటేషన్ లతో బిట్ వెయ్యడానికి వెళ్తారు. రామలక్ష్మి కొటేషన్ తో ఎంట్రీ ఇస్తుంది. అందరు బిట్ వేసాక రిజల్ట్స్ కోసం చూస్తుంటారు. అందరి కోటేషన్లు చూసి ఎవరు తక్కువ వేస్తే వాళ్లకు బిట్ ఇవ్వాలని వాళ్లు అనుకుంటారు. అంతకుముందే వేరొకా కంపెనీ కి బిట్ ఇవ్వాలని ముందే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. తీరా చుస్తే వాళ్ళ కంటే సీతాకాంత్ వేసిన బిట్ తక్కువ అమౌంట్ తో వేసి ఉంటుంది. ఇదేంటి సీతాకాంత్ బిట్ అందరికంటే తక్కువ ఉందని అనుకుంటారు. ఆ తర్వాత ముందు డబ్బులు తీసుకున్న అతనికి వాళ్ళు ఫోన్ చేసి పక్కకి రమ్మని చెప్పి.. మీ కంటే సీతాకంత్ కొటేషన్ తక్కువ వేసాడు. న్యాయం గా అయితే వాళ్ళకే వెళ్ళాలి కానీ మీరు డబ్బులిస్తే మీకు వస్తుందనగానే అతను డబ్బులు ఇస్తాడు. అదంతా రామలక్ష్మి చూసి వీడియో తీస్తుంది. అందరు బయటకు వచ్చి ఈ బిట్ శ్రీజ గ్రూప్ కి వెళ్తుందని చెప్పగానే అదేంటి అందరికన్న మేమే తక్కువ వేసాము కదా అని రామలక్ష్మి అంటుంది. మీది రిజెక్ట్ చేసాం సీతాకాంత్ గారి సైన్ లేదు.. మీ సైన్ లేదు అని వాళ్లు అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఆడవాళ్ళ కీ పెత్తనమిస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పటివరకు ఓటమి అంటూ తెలియదు సీతాకాంత్ అంటారు. లేదు నేను అన్ని బానే మెయిల్ చేసానని రామలక్ష్మి అంటుంది. డబ్బులు తీసుకున్న అతన్ని రామలక్ష్మి పక్కకు పిలిచి డబ్బులు తీసుకున్న వీడియో చూపిస్తుంది. సారీ మేడమ్ తప్పు చేసాను అంటాడు. ఆ తర్వాత అందరి ముందు వచ్చి సీతాకాంత్ గారు బిట్ గెలుచుకున్నారని చెప్తాడు. దాంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు ఎటాక్ లు చేస్తుంది ఎవరో కనుకోవడానికి సీతాకాంత్ ఒక డిటేక్టివ్ ని ఏర్పాటు చేస్తాడు. అతను వచ్చి సీతాకాంత్ తో మాట్లాడతాడు. జరిగింది మొత్తం చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ నందిని ఫోటో చుపించి ఈమె చేసిందేమో డౌట్ గా ఉందని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వస్తుంది. అందరూ బిట్ మనకే వచ్చిందా అంటూ అడుగుతారు. రామలక్ష్మి సైలెంట్ గా ఉండడంతో బిట్ పోయిందంటు శ్రీవల్లి అంటుంది. అప్పుడే ఎవరో సీతాకాంత్ కీ ఫోన్ చేసి బిట్ వచ్చిందని చెప్తారు. ఆ విషయం సీతాకాంత్ అందరికి చెప్తాడు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటి ఎలా వచ్చిందని శ్రీవల్లి శ్రీలతలు అనుకుంటారు. మరొకవైపు సీతాకాంత్ అన్న మాటలు నందిని గుర్తుచేసుకుంటుంది. అప్పుడే హారిక వస్తుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య డిజైన్స్ లో ఏం ఉందంటే.. భర్తకి తెలియకుండా అలా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -526 లో......కావ్య ఆఫీస్ కి హడావిడిగా రెడీ అవుతుంటే.. కనకం టిఫిన్, లంచ్ బాక్స్ తీసుకొని వస్తుంది. టిఫిన్ చేసే టైమ్ లేదు కానీ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తానంటూ కావ్య వెళ్తుంటే.. కృష్ణమూర్తి ఎదరుపడి ఛార్జ్ డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు. ఉన్నాయని కావ్య అనగానే చూపించమని అంటాడు. డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నావని కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతాడు. కావ్యకి డబ్బులు ఇచ్చి కృష్ణమూర్తి అటోలో వెళ్ళమని చెప్తాడు. కావ్య వెళ్ళిపోయాక మీరు కావ్య జాబ్ చెయ్యడానికి సపోర్ట్ చేస్తున్నారు కానీ దాని కాపురం బాగుండాలంటూ మాట్లాడుతుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే అపర్ణ, ఇందిరాదేవిలు కంపెనీకి మంచి పేరు తీసుకొని రావాలని చెప్తారు. అదంతా చూస్తున్న రుద్రాణి అనామికకి ఫోన్ చేసి రాజ్ మళ్ళీ ఆఫీస్ కి వెళ్తున్నాడని చెప్తుంది. వెళ్లనివ్వు.. నా ప్లాన్ లో నేనున్నా.. ఇక కావ్య డిజైన్స్ ని అడ్డం పెట్టుకొని స్వరాజ్ కంపెనీని తొక్కేస్తాను. ఇక భార్య వర్సెస్ భర్త అని అనామిక అంటుంది. మరొకవైపు రాజ్, కావ్యలు అనుకోకుండా ఇద్దరు ఒకే గుడికి వెళ్తారు. ఇద్దరు ఒకేసారి గంట కొడుతుంటే.. నువ్వా అంటూ రాజ్ అంటాడు. ఇక ఇద్దరి మధ్య ఎప్పటిలాగా వార్ మొదలవుతుంది. ఆ తర్వాత పూజారి అర్చన చేస్తుంటే నాకు పెళ్లి కాలేదని రాజ్ అనగానే.. అయ్యో ఇంకా పెళ్లి కాలేదా ఏదైనా లోపం ఉండి ఉంటుంది హాస్పిటల్ లో చూపించుకోమని పూజారి అంటాడు. దాంతో కావ్య నవ్వుతుంది. నాకు పెళ్లి అయింది నా మొగుడు తాగి వచ్చి టార్చర్ చేస్తున్నాడంటూ కావ్య కావాలనే అంటుంది. ఆ తర్వాత రాజ్ తొక్క పై అడుగేసి పడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. రాజ్ తిక్కగా మాట్లాడుతుంటే అతడిని చేతుల్లో నుండి వదిలేస్తుంది కావ్య.. దాంతో రాజ్ కింద పడిపోతాడు. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్లేసరికి అందరు వర్క్ చేయకుండా ఎంజాయ్ చేస్తుంటారు. దాంతో రాజ్ అందరిపై కోప్పడతాడు. తరువాయి భాగంలో  కావ్య డిజైన్స్ మాకు వేస్తుందని కావ్యకి తెలియొద్దని అనామిక మీడియటర్ కి చెప్తుంది. అతను కావ్యతో పెద్ద కంపెనీతో టై అప్ అయ్యాం.. మీరు మంచి డిజైన్స్ వేయండి అంటాడు. దానికి కావ్య సరే అంటుంది. సామంత్ రాజ్ తో ఛాలెంజ్ చేస్తాడు. ఇక మా కంపెనీనే నెంబర్ వన్ లో ఉంటుందని అంటాడు. ఆ తర్వాత రాజ్ ఒకవైపు.. కావ్య ఒకవైపు డిజైన్స్ వేస్తుంటారు. కావ్య డిజైన్స్ వేస్తుంటే నీ మనసులో ఉంది కాగితంపై వేస్తున్నావా అని కావ్యతో కనకం అంటుంది. కావ్య డిజైన్స్ కాకుండా రాజ్, కావ్యల ఫోటోని వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నిఖిల్ తప్పుల్ని లేపేసిన బిగ్ బాస్ ఎడిటర్.. సోనియా చేసిన చిల్లర పని అదే!

అసలు బిగ్ బాస్ హౌస్ లో లైవ్ టాస్క్ లలో ఏం జరుగుతుంది. బిగ్ బాస్ ఎడిటర్ మావ ఏం చూపిస్తున్నాడో ఓసారి చూద్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఆపడం కోసం ఇరు టీమ్ లకి మధ్య టాస్క్ లు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్నటి ఎపిసోడ్ లో .. నిఖిల్ టీమ్ నుండి పృథ్వీ, సీత టీమ్ నుండి నబీల్ వచ్చారు. ఇక బాల్ ని పగలకుండా ఇద్దరు రెండు చేతులతో పట్టుకొని ఉన్నారు. అయితే బిగ్ బాస్ పదిహేను నిమిషాలు అలా ఉంటే సరిపోతుందని చెప్పాడు కానీ దాదాపు 2:30 గంటల సేపు వాళ్ళిద్దరు పట్టుకొని నిల్చున్నారు.‌ ఇకీ గేమ్ తర్వాత బిగ్ బాస్ నబీల్ ని అభినందించాడు. మహాతాలి టాస్క్ ముగిసిన వెంటనే ఈ టాస్క్ ఒక పెట్టాడు బిగ్ బాస్. ఇక అప్పటికే ఫుల్ గా తిన్న నబీల్ అసలు కాస్త కూడ ఆడలేని సిచువేషన్ లో ఉన్నాడు. కానీ కాంతారా టీమ్ ని గెలిపించడానికి ముందుకొచ్చాడు నబీల్. గేమ్ స్పిరిట్, టీమ్ స్పిరిట్ అంటే ఇదే అని నబీల్ ఆటతీరు చెప్తుంది. ఇక ఇద్దరు రెండు చేతులతో కాదు ఒక్క చేతితో పట్టుకోవాలని బిగ్ బాస్ మళ్ళీ మార్చేశాడు. అయినప్పటికి‌ పృథ్వీకి నబీల్ టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇక కాసేపటికి నబీల్ చేతి నొప్పి భరించలేక వచ్చేశాడు. పృథ్వీ గెలిచాడు. శక్తి టీమ్ ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపింది. ఇదంతా ఎడిటర్ మావ లేపేశాడు.‌ఇక ఆ తర్వాత నబీల్ దగ్గరికి నిఖిల్ వెళ్ళి సూపర్ రా అంటు అభినందిస్తాడు. కాసేపు నబీల్ దగ్గరే ఉండి అతనికి మసాజ్ కూడా చేస్తాడు. హౌస్ అంతా నబీల్ ఎఫర్ట్స్ ని గుర్తించి అభినందిస్తారు. అది లేపేశాడు‌ ఎడిటర్ మావ.  నిఖిల్, సీత ఇద్దరు కలిసి.. టీమ్ ల వారిగా కాదు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపాలని చెప్పి కలిసి ఆడాలని అనుకుంటారు. ఇది ఎడిటర్ మావ లేపేశాడు. ఇక సీతతో  నిఖిల్ మాట్లాడి వెళ్ళి.. సోనియా చెప్పగానే దానికి ఒకే అని నబీల్ తీసేద్దామని అనుకుంటారు. బిగ్ బాస్ ఎడిటర్ మావ ఇది లేపేశాడు. ఇలా శక్తి టీమ్ లోని సోనియా, నిఖిల్ భాగోతాన్ని మొత్తం దాచేసి... మోస్ట్ వాల్యుబుల్ ఎపిసోడ్ ని కాస్తా పాటలు, డ్యాన్స్ లతో సప్పగా చేశారు.  

నాన్నతో చివరి హగ్ ఫోటో అదే.. నరేష్ లొల్ల వాళ్ళ నాన్న ఇక లేరు!

  నరేష్ లొల్ల.. అమర్ దీప్‌కి ప్రాణ స్నేహితుడు. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు.. అమర్ దీప్ గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు నరేష్ లొల్ల. జానకి కలగనలేదు, గీతాగోవిందం, రామచక్కని సీత వంటి సీరియల్స్‌లో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న నరేష్ లొల్ల.. బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అమర్ దీప్‌కి ప్రాణ స్నేహితుడు. గత సీజన్‌లో అమప్ దీప్ హౌస్‌లో గెలుపుకోసం పోరాడితే.. బయట ట్రోలర్స్‌తో పోరాడి వార్తల్లో నిలిచాడు నరేష్ లొల్ల. నరేష్ లోల్ల.. 'లొల్లాస్ వరల్డ్' అనే యూట్యూబ్ ఛానల్ లో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఇక కొన్ని గామడల క్రితం తన తండ్రి హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్తూ వ్లాగ్ చేశాడు. అందులో నరేష్ ఏం అన్నాడంటే..  ఇలాంటి పరిస్థితి తనకి వస్తుందని కలలో కూడా ఊహించలేదని, మీ బ్లెస్సింగ్ నాకు కావాలి. దీన్ని మీరు నెగిటివ్ అనుకున్నా పబ్లిసిటీ అనుకున్నా పర్లేదు. నాకు ఫస్ట్ టైం ఒక ఛాన్స్ వచ్చింది. మా డాడీ అంటే ఎంత ఇష్టమో.. పేరెంట్స్ అంటే ఎంత ఇష్టమో నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. నేను పుట్టినప్పటి నుంచి చాలా విషయాలు మా డాడీకి చెప్పుకోలేదు. అవన్నీ చెప్పుకోవాలని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశాను. మా డాడీకి 60 ఇయర్స్ బర్త్ డే సెలబ్రేషన్ చేశాను. ఆరోజు డాడీతో మనసు విప్పి మాట్లాడాను.  నేను పుట్టినప్పటి నుంచి నాతో చెప్పని చాలా విషయాలు ఆయన నాతో చెప్పారు. కానీ ఒక్కరాత్రిలో లైఫ్ మొత్తం మారిపోయింది. మా డాడీ హాస్పిటల్‌లో ఉన్నారు. ఆయన తొందరగా కోలుకోవాలి. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని బ్లెస్ చేయండి అని వ్లాగ్ చేశాడు. అయితే ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే నరేష్ లొల్ల వాళ్ళ నాన్న చనిపోయారు. ఇదే విషయాన్ని తెలుపుతూ లొల్ల తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశాడు.  

Karthika Deepam2 : పెళ్ళి చేసుకొని వచ్చిన స్వప్న, కాశీ.. నాన్నని పిలిపించమని పెద్దాయాన ఆర్డర్

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -160 లో.....స్వప్న, కాశీ లు కార్తీక్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. స్వప్నని జాగ్రత్త గా చూసుకో నిన్ను నమ్మి వచ్చిందని కార్తీక్ అనగానే.. ప్రాణం పోయినా చెయ్ వదలనని చెప్పి కాశీ స్వప్నని తీసుకొని వెళ్తాడు. దీప మాతో పాటురా అని కాంచన  అంటుంది. అందరి పెళ్లి చేస్తుంది. నా పెళ్లి చేయదా అని కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు. మరొకవైపు శ్రీధర్ కి స్వప్న ఫోన్ చేసి.. నేను క్షేమంగా ఉన్నాను.. మీరు టెన్షన్ పడకండి.. ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాను.. నేను కనపడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తారని కాల్ చేస్తున్నాను.. ఈవినింగ్ వస్తానని కాల్ కట్ చేస్తుంది స్వప్న. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకున్నట్లు చెప్పొచ్చు కదా అని కాశీ అంటాడు. ఎప్పుడు మా డాడే సర్ ప్రైజ్ ఇస్తాడా.. నేను ఇవ్వొద్దా అని స్వప్న అంటుంది. మరొక వైపు శ్రీధర్ కీ సుమిత్ర ఫోన్ చేసీ త్వరగా ఇంటికి రండి అన్నయ్య.. జ్యోత్స్న, కార్తీక్ ల పెళ్లి ముహూర్తం గురించి అని చెప్తుంది. దానికి శ్రీధర్ సరే అంటాడు. ఆ తర్వాత స్వప్న ఈవినింగ్ వచ్చాక ఎక్కడికి వెళ్లనివ్వకు వచ్చాక మాట్లాడతాను.. అక్కడ కొడుకు పెళ్లి గురించి ముహూర్తం అంట అని కావేరితో  శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర వాళ్ళందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే.. అప్పుడే స్వప్నని కాశీ తీసుకొని వస్తాడు. తనని చూసి పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. వీడిని ఇక్కడ నుండి పంపించాలని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత మమ్మల్ని ఆశీర్వదీంచండి అని పారిజాతంతో  కాశీ అంటాడు. దాంతో కాశీని తిడుతుంది పారిజాతం. అప్పుడే దీప, కార్తీక్ కాంచన లు వస్తారు. మమ్మల్ని ఆశీర్వదించండి అని కాశీ మళ్ళీ అనగానే పారిజాతం తిడుతుంది. మా పెళ్లి ఒక మంచి మనిషి సమక్షంలో జరిగిందని కాశీ అంటాడు. ఎవరి సమక్షంలో అని పారిజాతం అనగానే దీపక్క అని కాశీ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఈ పిల్ల మావయ్య కూతురని తెలిసే ఈ పని చేసినట్లు ఉందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత  స్వప్నని పారిజాతం తిడుతుంది. నన్ను తిట్టకండి. నాకు ఒక గౌరమైన ఫ్యామిలీ ఉందని స్వప్న అంటుంది. అందరు ఎక్కడ స్వప్న శ్రీధర్ గురించి చెప్తుందోనని టెన్షన్ పడుతారు. మీ నాన్న ఎవరో పిలిపించమని శివన్నారాయణ అనగానే.. కార్తీక్, దీప లు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : వాళ్ళిద్దరి ప్రేమకి మధ్యలో శ్రీలత.. ఆమె డ్రీమ్ నెరవేరుతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -211 లో.....పేపర్స్ పట్టుకోబోతుంటే రామలక్ష్మి అనుకోకుండా సీతాకాంత్ కి ముద్దు పెడుతుంది.. నీకు పెడతానని సీతాకంత్ అనగానే.. ముందు పని చూసుకోండి. బోలెడంత కాంపిటీషన్ ఉంది బయట అని అంటుంది. దాంతో సీతాకాంత్ బిట్ వెయ్యడని కొటేషన్ రెడీ చేస్తుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు నిద్రపోతుంటే.. అప్పుడే శ్రీవల్లి మెల్లిగా గదిలోకి వస్తుంది. సీతాకాంత్ రెడీ చేసిన కొటేషన్ ఎక్కడ ఉందని వెతుకుతుంది. ఆ తర్వాత టేబుల్ మీద కొటేషన్ కవర్ చూసి.. శ్రీవల్లి తీసుకోబోతుంటే అక్కడ కింద ఉన్న ర్యాట్ ప్యాడ్ పై కాలు వేస్తుంది. దాంతో కాలు స్టిక్ అవుతుంది. అలా కొటేషన్ కవర్ తీసుకొని మెల్లిగా ఆ ప్యాడ్ తోనే శ్రీలత దగ్గరికి వెళ్లి తియ్యమంటుంది. ప్యాడ్ తీస్తుండగా శ్రీలత చెయ్ కి అతుకుంటుంది. ఎలాగైనా విడిపించుకుంటారు ర్యాట్ ప్యాడ్. మళ్ళీ అక్కడే పెట్టు లేదంటే డౌట్ వస్తుందని శ్రీవల్లికి శ్రీలత చెప్తుంది. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి నిద్రలేచి రాత్రి జరిగిన విషయం గుర్తుచేసుకుంటుంది. సీతాకాంత్ రెడీ చేసిన కొటేషన్ ని దాచిపెటి రామలక్ష్మి రెడి చేసిన కొటేషన్ టేబుల్ పై పెట్టి ఎవరైనా వచ్చారో లేదో తెలుసుకోవడానికి ర్యాట్ ప్యాడ్ ని కూడా పెడుతుంది అది ఫోటో తీసుకుంటుంది. ఆ సంఘటన గుర్తుచేసుకొని ఈ పాటికి కొటేషన్ కొట్టేసి ఉండాలని ర్యాట్ ప్యాడ్ పెట్టిన చోట ఉందో లేదో ఫోటో చూస్తుంది. పెట్టిన చోట లేకపోయేసరికి ఎలుకలు వచ్చాయన్న మాట అని అనుకుంటుంది. ఆ తర్వాత కానిస్టేబుల్ సీతాకాంత్ దగ్గరికి వచ్చి.. మీపై ఎటాక్ జరిగింది కదా.. ఎవరిపైన అయిన డౌట్ ఉందా అని అడుగుతాడు. ఏం లేదని చెప్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. దూరం నుండి శ్రీవల్లి వింటుంది. ఏంటి అక్క పోలీస్ లు వచ్చారని అడుగుతుంది.  ఎటాక్ చేసిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయమన్నానని శ్రీవల్లిని భయపెడుతుంది. ఆ తర్వాత శ్రీవల్లి వెళ్లి శ్రీలత కి చెప్తుంది. ఆ తర్వాత ఇది ఎవరో కావాలనే చేశారని రామలక్ష్మి అంటుంది. నువ్వు అన్ని ఆలోచించకు.. ఆఫీస్ కి వెళ్ళమని శ్రీలత అంటుంది. బయటకు వచ్చాక నాపై డౌట్ రాలేదు. ఆ రామలక్ష్మిని ఉంచకూడదని శ్రీలత అనుకుంటుంది. మరొకవైపు రామలక్ష్మి బిడ్ వెయ్యడానికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్యకి గుడ్ న్యూస్.. అప్పు పోలీస్ జాబ్ తెచ్చుకోగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -525 లో....సీతారామయ్య ఫ్రెండ్ తన ఇంటికి వస్తాడు. ఇన్ని రోజులాగా మీ కంపెనీతో నా మనవడు కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. ఇక ఆ కాంట్రాక్టు కాన్సిల్ చేసుకున్నాడని అతను చెప్తాడు. ఎందుకు ఏమైంది అని సీతారామయ్య అంటాడు. మర్యాద తక్కువ అయింది.. నా మనవడిని రాహుల్ అవమానించాట అని అతను చెప్తాడు. ఇన్ని రోజుల నుండి మన మధ్య స్నేహం ఉంది కాబట్టి ఆ విషయం చెప్పాడనికి వచ్చానని అతను అనగానే చాలా థాంక్స్ రా ఇప్పటికైనా మా కంపెనీలో ఏం జరుగుతుందో తెలియజేశావని సీతారామయ్య అంటాడు.  ఆ తర్వాత అతను వెళ్లిపోయాక రాహుల్ ఎందుకు ఇలా చేసావ్ అంటూ తిడుతారని ముందుగానే రాహుల్ ని తిడుతుంది రుద్రాణి. నటించింది చాలు ఎక్కడ మేమ్ తిడుతామో అని తిట్టినట్లు నటిస్తున్నావ్ కదా అని ఇందిరాదేవి అంటుంది. ఆ రోజే కావ్య చెప్పింది.. రాహుల్ వద్దు ఇలాంటి సిచువేషన్ వస్తుందని కానీ పట్టించుకోలేదు. ఇక నుండి రాజ్ ఆఫీస్ కి వెళ్తాడని సీతారామయ్య చెప్తాడు. నేను వెళ్ళను.. పిన్నికి ఇష్టం అయితే వెళ్తా అని రాజ్ అంటాడు.... నా కొడుకు న్యాయం జరగాలి అన్నాను కానీ అది పక్కన పెట్టి ఈ విషయం ఆలోచిస్తున్నారు.. రాజ్ ఆఫీస్ వెళ్లడం నాకు ఇష్టమే కానీ కళ్యాణ్ ని ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత రాజ్ దే అని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తాన్నాడు అని న్యూస్ తెలిసి కావ్యకి కనకం చెప్పాలని వస్తుంది. నాకేం చెప్పొద్దని కావ్య అనగానే సరే మీ ఆయన గురించి మా ఆయనకి చెప్తానని కనకం అంటుంది. రాజ్ ఆఫీస్ కి వెళ్తున్నాడంట రాహుల్ ఏదో తప్పు చేస్తే మళ్ళీ రాజ్ ని వెళ్ళమన్నారంట అని అనగానే కావ్య కూడా వింటుంది. ఆ తర్వాత అందరిలో తిట్టావంటూ రాహుల్ కోపంగా ఉంటాడు. అప్పుడే స్వప్న వచ్చి.. మీ ఇద్దరి యాక్టింగ్ సూపర్ సొంత కంపెనీలో ఇలా చేసేవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నానని స్వప్న అంటుంది. మరొకవైపు అప్పు పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే కళ్యాణ్ తనకి భోజనం తినిపిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నిఖిల్ నిజస్వరూపం బయటపడింది. గోతికాడ నక్క!

  బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి కంటెస్టెంట్స్ మరోసారి షాక్ అయ్యారు. అసలేం జరుగుతుందో అర్థం కానట్లుగా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం జరిగే టాస్క్ లలో రెండు క్లాన్స్ మధ్య చిచ్చు రేగింది.  నిన్న హౌస్ లో రెండు టాస్క్ లు జరుగగా అందులో ఒకటి సీత టీమ్ గెలవగా.. మరొకటి ఎవరు గెలవలేదు. ఇక నేడు తాజాగా రీలీజ్ చేసిన ప్రోమోలో శక్తి క్లాన్ గెలిచినట్లు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ కాంతారా టీమ్ నుండి ఒకరిని తప్పుకోమని చెప్పాలి మ కానీ కంటెస్టెంట్ ని తీసేసే పవర్ శక్తి క్లాన్ కి ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో కాంతారా టీమ్ నుండి నబీల్ ని తీసేశాడు నిఖిల్ . దాంతో కిర్రాక్ సీత, ప్రేరణ ఇద్దరు ఫుల్ ఫైర్ అయ్యారు. అలా ఎలా తీస్తారు. మన టీమ్ లో నబీల్ బాగా ఆడుతున్నాడు. అతడిని తీసేస్తే వాళ్ళే అన్ని టాస్క్ లు గెలుస్తారని కాంతారా టీమ్ భయపడుతుంది. ఇక మణికంఠ విషయంలో నిఖిల్, సోనియా, పృథ్వీ ఇచ్చిన ప్రెషర్ తో అతన్నే తప్పుకునేలా చేశారంటు ప్రేరణ, సీత అడుగగా.‌. ఎస్ అంటు మణికంఠ సమాధానమిచ్చాడు. దాంతో సోనియా అతడిపై ఫైర్ అయింది. ఇలా మోసం చేస్తావనుకోలేదంటు మణికంఠని ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుతుంది సోనియా. ఇక సోనియాతో పాటు నిఖిల్ , పృథ్వీ కూడా మణికంఠదే తప్పు అన్నట్టుగా మాట్లాడేసరికి అతను మైక్ విసిరిపారేసి వెళ్ళిపోయాడు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

మణికంఠ మగాడు కాదంటూ నీచంగా మాట్లడిన యష్మీ...

  బిగ్ బాస్ చరిత్రలో ఓ మగాడి గురించి ఇంత నీచంగా మాట్లాడిన సందర్భం లేదు. బహుశా యష్మీ మాట్లాడిన మాటలే ఫస్ట్ టైమ్. మణికంఠని ఫిజికల్ గా వీక్ అంటూ యష్మీ ఎటాక్ చేస్తుంది. తనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా మణికంఠని మాటలతో మానసికంగా ఇబ్బంది పెడుతుంది యష్మీ. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్ట్ ఎంట్రీలని ఆపడానికి కంటెస్టెంట్స్ కి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగా హౌస్ లో ఉన్న రెండు క్లాన్ల సభ్యలు తమకి సాధ్యమైనంతగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇలా టాస్క్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అందరు కూర్చొని మాట్లాడుకుంటారు. అలా నిన్న జరిగిన ఓ ఎపిసోడ్ లో మణికంఠని టార్గెట్ చేసి నిఖిల్, యష్మీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. మణికంఠ తనని ఓదార్చడంలో భాగంగా.. హగ్ చేసుకున్నాడని... పెద్ద డ్రామా క్రియేట్ చేసి తెగ ఫీల్ అయిపోయిన యష్మీ గౌడ.. అదే వ్యక్తిని మగాడే కాదంటూ నీఛంగా మాట్లాడింది. హౌస్ మొత్తం ఒక్క చోట కూర్చుని.. మణికంఠ మగతనం గురించి మాట్లాడి వాళ్ల క్యారెక్టర్‌లను బజారున పెట్టుకున్నారు. వీళ్లకంటే.. ఆ బజారున బతికేవాళ్లే నయం అన్నంత నీఛంగా మాట్లాడారు. అందరు కలిసి మణికంఠ మగతనంపై జోక్‌లు వేసుకుని నవ్వేశారు. అరెయ్ మణి అందరం ఇక్కడ ఉంటే నువ్వు ఒక్కడివే అక్కడ కూర్చున్నావేంటి ఇక్కడికి రా అని నిఖిల్ అనగానే.. ఇక్కడ మగాళ్ళు మాత్రమే కూర్చుంటారని యష్మీ అంది. అంటే మణికంఠ మగాడు కాదని అంది. ఇలా అతడి క్యారెక్టర్ ని పదేపదే కించపరుస్తూ మాట్లాడుతుంది యష్మీ. మరి బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూపై స్పందించడం లేదో ఏమో. వీకెండ్‌లో నాగార్జున అయిన ఈ ఇష్యూ మీద హెచ్చరిస్తారో.. లేదంటో యష్మీకి ఆ ఫ్రీడమ్ ని అలాగే కంటిన్యూ చేయమంటారో చూడాలి మరి.  ఈ వారం మణికంఠ నామినేషన్ లో ఉన్నాడు‌. నబీల్ తర్వాత ప్రేరణ, మణికంఠ ఉన్నారు. యష్మీ మాటలకి మణికంఠకి బీభత్సమైన పాజిటివిటి పెరిగింది. మరి ఈ ఇష్యూ ఎలా ముగుస్తుందో చూడాలి.  

ఈ దేశంలో రిగ్గింగ్ నేరం కానీ బెగ్గింగ్ నేరం కాదు

ఈ శుక్రవారం శనివారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో స్కిట్ ఒక్కోలా ఎంటర్టైన్ చేసింది. ఇందులో రౌడీ రోహిణి బాగా నవ్వించింది. ఇందులో రోహిణి బెగ్గింగ్ రోల్ లో నటించింది. బెగ్గింగ్ కోచింగ్ సెంటర్ పెట్టి అందులో అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈ కోచింగ్ సెంటర్ కి ఆటో రాంప్రసాద్, దొరబాబు ఇద్దరూ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారు. "మాకు జాబ్ లు ఇస్తామని చెప్పింది బెగ్గర్స్ గానేనా" అని ఆటో రాంప్రసాద్ అడిగేసరికి "అవును బెగ్గింగ్ కోసమే" అని చెప్పింది రోహిణి. దానికి ఆటో రాంప్రసాద్ కొంచెం ఫీలైనట్టు కనిపించాడు. "చీప్ గా అడుక్కోవడం ఏంటండీ దరిద్రంగా " అని అడిగేశాడు రాంప్రసాద్. "చీప్ గా అడుక్కోవడం ఏమిటి " అని అడిగాడు. "చీప్ గా అడుక్కోవడమా ...ఏమనుకుంటున్నావ్. ఈ దేశంలో రిగ్గింగ్ నేరం కానీ బెగ్గింగ్ కాదు" అని చెప్పింది రౌడీ రోహిణి. ఇక రోహిణి అడుక్కునే అమ్మాయి రోల్ లో బాగా నటించింది. దీంతో జడ్జెస్ ఐతే ఫుల్ జోష్ తో నవ్వేశారు. దాంతో శాంతి, రోహిణి ఇద్దరూ కలిసి జడ్జెస్ దగ్గరకి వెళ్లేసరికి వాళ్ళు ఒకరికి 10  , ఇంకొకరికి 8 మార్కులు వేశారు. ఇలా ఈ వారం జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు.