అరియానా గ‌య్యాళి వ‌దిన అయిన వేళ‌..!

  బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ముక్కు అవినాష్‌, అరియానా జోడీకి మంచి మార్కులు ప‌డిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కామెడీ స్టార్స్‌' షోలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకు శేఖ‌ర్ మాస్టర్, శ్రీ‌దేవి జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ షోలో లో గ‌య్యాళి వ‌దిన‌గా అరియానా ఓ రేంజ్‌లో ర‌చ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో సంద‌డి చేస్తోంది. అవినాష్ ఈ షోలో ఓ టీమ్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటే, చ‌మ్మ‌క్ చంద్ర మ‌రో టీమ్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ షో కోసం ముక్కు అవినాష్‌, అరియానా క‌లిసి స్కిట్ చేశారు. ఇందులో ముక్కు అవినాష్ భ‌ర్త‌గా, అరియానా భార్య‌గా న‌టించారు. భ‌ర్త హోదాలో కాఫీ అడిగితే అరియానా ఏకంగా ముఖంపైనే కొట్టేసింది. ఇక ముక్కు అవినాష్ త‌మ్ముడిపై వీర లెవెల్లో వీరంగం ఆడింది. అవినాష్ త‌మ్ముడు అమ్మా అని పిల‌వ‌డంతో వీరంగం వేసిన అరియానా అత‌న్ని ఓ ఆట ఆడేసుకుంది. జుట్టుప‌ట్టుకుని ర‌చ్చ చేసింది. తినే తింగ‌డి అవినాష్ ముక్కుకే పోతోందా అని చిందులేసింది.. అంత‌టితో ఆగ‌క అవినాష్ త‌మ్ముడి జుట్టుప‌ట్టుకుని తిండి మొత్తం దీనికే పోతోందారా అంటూ చిందులు తొక్కింది. గ‌య్యాళి వ‌దిన‌గా అరియానా వీరంగం వేసిన 'కామెడీ స్టార్స్' ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కాబోతోంది. 

'జ‌బ‌ర్ద‌స్త్‌'ను బీట్ చేసిన‌ 'కామెడీ స్టార్స్‌'!

  ఈటీవీ ఛాన‌ల్‌లో మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రారంభ‌మైన 'జ‌బ‌ర్ద‌స్త్‌' కామెడీ షోని ఏ కార్య‌క్ర‌మం బీట్ చేయ‌లేక‌పోయింది. జ‌నాల్లో కామెడీ షో అంటే 'జ‌బ‌ర్ద‌స్త్‌' అనేంత‌గా పాపులారిటీని ఈ షో ద‌క్కించుకుంది. దీంతో నిర్వాహ‌కుల‌తో పాటు వీక్ష‌కులూ ఈ షోని కొట్టేది మ‌రోటి లేద‌ని, రాద‌ని ఫిక్స‌యిపోయారు. ఈ షోని బీట్ చేయాల‌ని చాలా మంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేసి ఫ్లాప‌య్యారు. కానీ తాజాగా ఈ షోని స్టార్ మాలో కొత్త‌గా ప్రారంభ‌మైన 'కామెడీ స్టార్స్‌' షో బీట్ చేసి దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ వ్యాఖ్యాత‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌, శ్రీ‌దేవి న్యాయ‌నిర్ణేత‌లుగా ప్రారంభ‌మైన ఈ షో హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ముక్కు అవినాష్‌, అరియానా, చ‌మ్మ‌క్ చంద్ర అండ్ టీమ్ పాల్గొంటున్న ఈ షో గ‌త వారం 9 రేటింగ్ పాయింట్లని సాధించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇదే స‌మ‌యంలో జ‌బ‌ర్ద‌స్త్‌కు కేవ‌లం 7 శాతం మాత్ర‌మే రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం. 'కామెడీ స్టార్స్‌' షో  ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30కు స్టార్ మాలో ప్ర‌సారం అవుతోంది.

ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్సులో విష్ణుప్రియ రెచ్చిపోయింది!

బుల్లితెర‌పై రాణించాలంటే గ్లామ‌ర్‌తో పాటు మంచి మాట‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట‌క‌ట్టుకోవాలి. అదే స‌మ‌యంలో త‌మ వైపు చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేయాలి. క‌ళ్లార్పితే ఇంత‌టి అందం ఎక్క‌డ మిస్స‌యిపోతామా అనే ఫీలింగ్‌ని స‌గ‌టు వీక్ష‌కుడిలో క‌లిగించాలి. అప్పుడే బుల్లితెర‌పై యాంక‌ర్స్ ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా ఇట్టే హిట్ట‌యిపోద్ది. ఇదే సూత్రాన్ని బాగా వంట‌బ‌ట్టించుకుంటున్నారు బుల్లితెర అందాల భామ‌లు శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ‌. ఇటీవ‌ల పేప‌ర్ త‌ర‌హా డ్రెస్‌లో హొయ‌లు పోతూ శ్రీ‌ముఖి ర‌చ్చ చేస్తే అంత‌కు ముందు రోజు విష్ణు ప్రియ ష‌ర్ట్ బ‌టన్స్ విప్పేసి కావాల్సినంత వ‌య్యారాల్ని ఒల‌క‌బోసింది. అదీచాలద‌నుకుందేమో తాజాగా విష్ణు ప్రియ ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్‌లో యెద అందాల్ని ప‌రుస్తూ ఫొటోల‌కు పోజులిచ్చేసింది. ఆ ఫొటోల‌ని అభిమానుల కోసం ఇన్ స్టాలో పంచుకుంది. ఇంకేముందీ ఇన్ స్టా విష్ణు ప్రియ అందాల తాకిడిని త‌ట్టుకోలేక హీటెక్కిపోతోంది. ట్రాన్స్ ప‌రెంట్ డ్రెస్‌లో యెద అందాల విందు చేస్తున్న విష్ణు ప్రియ ఫొటోలు ప్ర‌స్తుతం ఇన్ స్టాలో వైర‌ల్ అవుతున్నాయి. విష్ణు ప్రియ ఇంత‌లా రెచ్చిపోయి అందాల విందు చేయ‌డానికి కార‌ణం సినిమాలే అని.. సినిమా అవ‌కాశాల కోస‌మే విష్ణు ప్రియ ఈ స్థాయిలో అందాల విందు చేస్తోంద‌ని టీవీ ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.   

ముమైత్‌కు వ‌చ్చిన లెట‌ర్‌.. అర‌బిక్‌లో చ‌దివిన అవినాష్‌‌!

  బుల్లితెర‌పై మ‌ళ్లీ ఓంకార్ హంగామా మొద‌లైంది. గ‌తంలో 'డ్యాన్ బేబీ డ్యాన్స్' అంటూ డ్యాన్స్ జూనియ‌ర్స్‌.. డ్రామా జూనియ‌ర్స్ .. సిక్స్త్ సెన్స్, ఇస్మార్ట్ జోడీ, వంటి విభిన్న‌మైన షోల‌తో పాపుల‌ర్ అయిన ఓంకార్ మ‌ళ్లీ త‌న స‌త్తాని స్టార్ మాలో చాటుకుంటున్నారు. కొత్త‌గా డ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ 'డ్యాన్స్ ప్ల‌స్' అంటూ స‌రికొత్త డ్యాన్స్ షోని మొద‌లుపెట్టారు. ఈ షో విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. యానీ మాస్ట‌ర్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, బాబా భాస్క‌ర్‌, ముమైత్ ‌ఖాన్‌, మోనాల్ గ‌జ్జ‌ర్‌, య‌ష్ మాస్ట‌ర్ ఈ షోకి జ‌డ్జెస్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఈ షో శ‌నివారం, ఆదివారాలు ప్ర‌సారం అవుతోంది. ఈ శ‌నివారం షోలో ముక్కు అవినాష్ పోస్ట్‌మ్యాన్‌గా వ‌చ్చి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ల‌క్ష‌లు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి షో చేస్తూ బాబా భాస్క‌ర్‌కి ఒక్క ప్యాంట్ కూడా కొనివ్వ‌లేదు, అందుకే లుంగీ క‌ట్టుకొని షోకు వ‌స్తున్నారు .. అంటూ అవినాష్ న‌వ్వులు పూయించాడు. ఇక అర‌బ్ కంట్రీ నుంచి ముమైత్‌ఖాన్‌కి లెట‌ర్ వ‌చ్చిందంటూ అర‌బిక్ భాష‌లో ఆ లెట‌ర్‌ను అవినాష్ చ‌దివిన తీరు అంద‌ర్నీ తెగ న‌వ్వించింది. ముమైత్ అయితే ప‌డీ ప‌డీ న‌వ్వేసింది. అలా త‌న పోస్ట్‌మ్యాన్ క్యారెక్ట‌ర్‌తో న‌వ్వులు విరబూయించాడు. అత‌డి కామెడీని ముమైత్ బాగా ఎంజాయ్ చేసింది. 

కార్తీక్‌ చేతికి ప్రూఫ్స్‌.. దీప లైన్ క్లియ‌ర్‌!

  'కార్తీక దీపం' సీరియ‌ల్ ఈ శ‌నివారం స‌రికొత్త మ‌లుపు తిర‌గ‌బోతోంది. శౌర్య‌తో క‌లిసి వంట‌గ‌దిలో కింద కూర్చుని కార్తీక్ అన్నం తిన‌డం చూసిన సౌంద‌ర్య‌, ఆనంద‌రావు ఫ్యామిలీ ఒక్క‌సారిగా అవాక్క‌వుతారు. ఎంత‌లో ఎంత మార్పు అనుకుంటారు. కార్తీక్ తింటూ ఇంట్లో వాళ్ల‌పై సెటైర్లు వేస్తున్న తీరుకు ఆశ్చ‌ర్య‌పోయిన ఇంటివారు ఆ తంతుని సైలెంట్‌గా చూస్తుండిపోతారు. క‌ట్ చేస్తే కార్తీక్‌ని అన‌వ‌స‌రంగా మాట‌ల‌న్నాన‌ని మోనిత ఫీల‌వుతూ వుంటుంది. ఎలాగైనా అత‌‌న‌ని త‌న ద‌గ్గ‌రికి తెచ్చుకోవాల‌ని, ఆలోచిస్తూ వుంటుంది. "నేను చెప్పిందంతా కార్తీక్ విని సైలెంట్‌గా వెళ్లాడంటే నేను చెప్పింది క‌రెక్టే అని ఆలోచిస్తున్నాడ‌నే క‌దా అర్థం. సో త‌ను న‌న్ను అపార్థం చేసుకునే అవ‌కాశం లేన‌ట్టే. కాక‌పోతే కార్తీక్ త‌న ద‌గ్గ‌ర శౌర్య వుంద‌ని చెప్పాడు. దానివ‌న్నీ దీప బుద్దులే.. సందు చూసుకుని కార్తీక్ మ‌న‌సుని మార్చి త‌న‌తో పాటు దీప ద‌గ్గ‌రికి తీసుకెళ్లినా తీసుకెళుతుంది. అంత చావు తెలివితేట‌లున్నాయి దానికి. వీలైనంత త్వ‌ర‌గా శౌర్య‌ని పంపించేయాలి." అని మోనిత త‌న‌లో తానే మాట్లాడుకుంటుంది. క‌ట్ చేస్తే కార్తీక్ కోర్టు విష‌యం గురించి మాట్లాడుతుంటాడు. "కోర్టు ఇద్ద‌రినీ ఇస్తానంటే ఇద్ద‌రినీ తీసుకుందాం" అంటాడు. "వాళ్లిద్ద‌రినీ తీసుకుంటే నేనేందుకు?" అంటూ పి‌చ్చిపట్టిన దానిలా న‌వ్వుతుంది మోనిత‌.. ఇంకోవైపు.. "ఏంటే ఇది.. కోర్టు నోటీసు చ‌‌దివావా?.. ఇంత నిబ్బ‌రంగా వున్నావేంటే?" అంటుంది సౌంద‌ర్య దీప‌ని. "నిబ్బ‌రంగా ఎందుకు లేను శుబ్బ‌రంగా ఇద్ద‌రం కోర్టుకు వెళ‌దాం" అంటుంది దీప‌. "జ‌రిగేవ‌న్నీ చూస్తూ పిచ్చిప‌ట్టి మాట్లాడుతున్నావే" అంటుంది సౌంద‌ర్య‌.. ఇదే స‌మ‌యంలో కార్తీక్ చేతికి అస‌లు ప్రూఫ్స్ వ‌చ్చి చేర‌తాయి.. దీంతో దీప లైన్ క్లియ‌ర్ అవుతుంది.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో పూర్తిగా చూడాలంటే స్టార్ మాలో 'కార్తీక దీపం' చూడాల్సిందే. 

పేప‌ర్ డ్రెస్‌లో శ్రీ‌ముఖి ఫ్యాష‌న్‌‌ షో!

బుల్లితెర యాంక‌ర్స్ ఒక‌రిని మించి ఒక‌రు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు పోటీప‌డుతున్న‌ట్టుగాన్నారు. ఇటీవ‌ల వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ హాట్ హాట్ డ్రెస్సుల్లో అందాల విందుకు పోటీప‌డితే .. `పోరా పోవే` ఫేమ్ బుల్లితెర యాంక‌ర‌మ్మ విష్ణు ప్రియ కూడా ష‌ర్ట్ బ‌ట‌న్స్ విప్పేసి షార్ట్ నిక్క‌ర్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి కాక‌పుట్టించింది.విష్ణు ప్రియ హాట్ ఫొటోషూట్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికీ నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. ఇక ఇటీవ‌ల గోవా బీచ్‌లో చిట్టిపొట్టి గౌనులో వాట‌ర్ బేబీగా మారిన శ్రీ‌ముఖి త‌డిసిన అందాల‌ని ఆర‌బోస్తూ గోవా తీరంలో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. పేప‌ర్ గౌను వేసుకుని థై షో చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ఫోల్డింగ్ ఐర‌న్ చైర్‌పై కూర్చుని అందాల విందు చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చిన స్టిల్స్ ప్ర‌స్తుతం ఇన్ స్టాలో సంద‌డి చేస్తున్నాయి.   అన్న‌ట్టు ఈ ప్రేమికుల రోజున గ్రేట్ న్యూస్‌ని చెప్ప‌బోతోంద‌ట‌. ఆ వార్త‌ని ప్ర‌క‌టించ‌డానికి చాలా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాన‌ని త‌న ఫొటోషూట్ ఫొటోల‌తో పాటు షేర్ చేసింది. ఆ వార్త ఏంటీ? ఎవ‌రినైనా ప్రేమించిందా? ప‌్రేమికుల రోజునే గ్రేట్ న్యూస్‌ని వినిపిస్తాన‌ని ఎందుకు అంటోంద‌న్న‌ది అర్థం కావ‌డం లేద‌ని శ్రీ‌ముఖి ఫ్యాన్స్ త‌ల‌బాదుకుంటున్నారు.  

ముద్దుల్తో శ్యామ‌ల‌ని ముంచెత్తాడు!

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా రాణిస్తోంది శ్యామ‌ల‌. కొన్ని చిత్రాల్లో న‌టిగా కూడా రాణించిన శ్యామ‌ల ప్ర‌స్తుతం సినిమా కార్య‌క్ర‌మాల‌తో పాటు ప‌లు టీవీ షోల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అంతే కాకుండా సొంతంగా ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌ని కూడా ప్రారంభించింది. దీని పేరే వెరైటీగా ప్లాన్ చేసింది. శ్యామ‌ల త‌న యూట్యూబ్ ఛాన‌ల్ పేరుని 'ఏం చెప్పారు శ్యామ‌ల‌గారు' అని పెట్టేసింది. టీవీ న‌టుడితో ప్రేమ‌లోప‌డిన శ్యామ‌ల అత‌న్నే వివాహం చేసుకుంది. ఇటీవ‌లే త‌న వైవాహిక జీవిత ప‌ద‌వ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా శ్యామ‌ల పంచుకున్న ఓ వీడియో ఇప్ప‌డు నెట్టింట సంద‌డి చేస్తోంది. ప‌ద‌వ వివాహ వేడుక‌ని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్న శ్యామ‌ల ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఓ వీడియోను అభిమానుల కోసం పంచుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. ఈ వీడియోలో శ్యామ‌ల భ‌ర్త న‌ర‌సింహ ఆమెపై ముద్దుల వ‌ర్షం కురిపించాడు. వీడియో షూట్ మొద‌లైంద‌ని తెలిసినా శ్యామ‌లని ఆప‌కుండా ముద్దుల్లో ముంచేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. బిగ్‌బాస్ సీజ‌న్ 2లోనూ సంద‌డి చేసిన శ్యామ‌ల ప్ర‌స్తుతం మ‌రింత పాపులారిటీని ద‌క్కించుకుని య‌మ బిజీగా మార‌డం విశేషం.

కోర్టు నోటీసులు.. సౌంద‌ర్య టెన్ష‌న్‌‌.. దీప ఆనందం!

  'కార్తీక దీపం'లో ఇంత కాలంగా సాగుతున్నఎపిసోడ్‌ల‌లో కంట‌నీరు పెట్టిన వంటల‌క్క తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో న‌వ్వుతూ చ‌లాకీగా క‌నిపిస్తోంది. వంటల‌క్క న‌వ్వు వెన‌కున్న ధైర్య‌మేంటీ?  మోనిత అస‌లు గుట్టు దీప చేతికి చిక్కిందా? అని స‌గ‌టు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే గురువారం ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబుకు దీప‌ మ‌రో ట్విస్ట్ ఇవ్వ‌బోతోంది. కార్తిక్‌తో విడాకుల‌కు అప్లై చేసిన దీప ఆ కేసుని హిమ కేసుతో లింక్ పెట్టేసి మోనిత అస‌లు రంగు బ‌ట్ట‌బ‌య‌లు చేసే మ‌హ‌త్త‌ర ప్లాన్ కు శ్రీ‌కారం చుట్టింది. ఇదే విష‌యం ఈ రోజు రివీల్ ‌కాబోతోంది. స‌రోజ తెచ్చిన విడాకుల నోటీసులు అందుకున్న దీప అంతులేని సంతోషంతో "జీవితంలో విడాకులు అడ‌క్కుండా చేయ‌డానికి నాకు దొరికిన‌ అవ‌కాశం" అంటుంది. క‌ట్ చేస్తే కోర్టు నోటీసులు సౌంద‌ర్య చేతికి అందించి న‌వ్వుతూ నిల‌బ‌డుతుంది దీప‌. విడాకుల నోటీసులు చూసి సౌంద‌ర్య టెన్ష‌న్ ప‌డుతుంటే దీప మాత్రం ఆనందంతో న‌వ్వుతుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. "ఏంటీ? ఏం జ‌రుగుతోంది?" అని కంగారుగా అడిగిన సౌంద‌ర్య‌కు దీప ధైర్యం చెబుతుంది. "కొండంత అండ‌గా నిల‌బ‌డే మీరే ఇలా బెదిరిపోతే ఎలా?" అంటుంది దీప. అయినా సౌంద‌ర్య‌లో భ‌యం వీడ‌దు. ఇంత‌కీ దీప ధైర్యం ఏంటీ?  దాని వెన‌కున్న అస‌లు సీక్రెట్ ఏంట‌న్న‌ది తెలియాలంటే 'కార్తీక‌ దీపం' గురువారం ఎపిసోడ్ చూడాల్సిందే. 

శ్రీ‌ముఖి గోవా టూర్ ఖ‌ర్చు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

  ఇటీవ‌ల బుల్లితెర స్టార్స్ శ్రీ‌ముఖి, ముక్కు అవినాష్‌, అరియానా, విష్ణు ప్రియ గోవా వెళ్లి అక్క‌డి బీచ్‌లో ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. శ్రీ‌ముఖి మాత్రం వీరంద‌రికి భిన్నంగా వాట‌ర్ బేబీ‌గా మారి త‌డిసిన డ్రెస్సుల్లో ఓ రేంజ్‌లో అందాల క‌నువిందు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల‌తో ఇన్ స్టా వేదిక‌గా పంచుకుని మురిసిపోయింది. విష్ణుప్రియ.. శ్రీ‌ముఖితో పోటీప‌డి ఎంజాయ్ చేసింది. ఇక ముక్కు అవినాష్ కూడా అదే స్థాయిలో అరియానాలో క‌లిసి ర‌చ్చ చేశాడు. కానీ అరియానా మాత్రం రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో క‌లిసి ప్ర‌త్యేకంగా ఈ అకేష‌న్‌ని సెల‌బ్రేట్ చేసుకుంది. శ్రీ‌ముఖి గ్లామ‌ర్ షో ఈ టూర్‌కి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అయితే వీరంతా ఒకేసారి గోవా వెళ్ల‌డానికి అస‌లు కార‌ణం వేరే వుంద‌ని తెలిసింది. `కోలా గోవా బీచ్ రిసార్ట్‌`ని ప్ర‌మోట్ చేయ‌డంలో భాగంగా వీరిని స‌ద‌రు రెస్టారెంట్ నిర్వాహ‌కులు ప్ర‌త్యేకంగా ఆహ్వానించారట‌. అందులో భాగంగానే `కోలా గోవా బీచ్ రిసార్ట్‌` ద్వారం వ‌ద్ద పేరు క‌నిపించేలా శ్రీ‌ముఖి, విష్ణుప్రియ ప్ర‌త్యేకంగా ఫొటోల‌కు పోజులిచ్చారు. ఈ టూర్‌కి సంబంధించిన ఖ‌ర్చు మొత్తం వారిదే కావ‌డంతో ఈ సీక్రెట్ తెలిసి మిగ‌తావారంతా అవాక్క‌వుతున్నారు‌.

హాట్ ఫొటో షూట్‌తో విష్ణు ప్రియ ర‌చ్చ ర‌చ్చ‌!

  బుల్లితెర యాంక‌ర్స్ ఒక‌రిని మించి ఒక‌రు అన్న‌ట్టుగా అందాల విందుకు రెడీ అంటూ పిచ్చెక్కిస్తున్నారు. శ్రీ‌ముఖి ఇటీవ‌ల గోవాలో విహ‌రిస్తూ వాట‌ర్ బేబీలా మారి అందాల విందు చేసిన విష‌యం తెలిసిందే. స్టార్ మా చాన‌ల్‌లో ప్ర‌సారం అవుతున్న కామెడీ స్టార్స్ స్టేజ్‌పై వ‌ర్ష‌ణి సౌంద‌ర‌రాజ‌న్ హాట్ హాట్ పోజుల‌తో స‌రికొత్త స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. తాజాగా ఈ జాబితాలో హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ చేరిపోయింది. సుడిగాలి సుధీర్‌తో క‌లిసి పోరా పోవే` అనే షోని ర‌క్తిక‌ట్టించిన విష్ణు ప్రియ తాజాగా హాట్ షోతో ర‌చ్చ చేస్తోంది. బుల్లితెర‌పై యాంక‌ర్‌గా ఓ వెలుగు వెలుగుతున్న 'విష్ణుప్రియ' క్రేజీ హీరోయిన్ త‌ర‌హాలో క్రేజ్‌ని ద‌క్కించుకుని త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా త‌ను చేస్తున్న 'పోరా పోవే' ప్రోగ్రామ్‌కి కాస్త బ్రేక్ ల‌భించ‌డంతో మేక‌ర్స్‌కి గాలం వేయ‌డానికి హాట్ హాట్ పోజుల‌తో విష్ణుప్రియ ర‌చ్చ చేస్తున్న ఫొటోలు ఇన్ స్టాని హీటెక్కిస్తున్నాయి. తాజాగా విష్ణుప్రియ బ్లాక్ షార్ట్‌తో పాటు అదే క‌ల‌ర్ లోదుస్తులు ధ‌రించి పైన వైట్ ష‌ర్ట్ వేసుకుని ఫొటోల‌కి పోజులిచ్చింది. అయితే ఇక్క‌డ పైన ధ‌రించి వైట్ ష‌ర్ట్ బ‌ట‌న్స్ విప్పేసి అందాల విందు చేస్తూ విష్ణుప్రియ ఫొటోల‌కు పోజులివ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 'చెక్‌మేట్‌' మూవీలో త‌డిసిన అందాల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష్ణుప్రియ తాజాగా సినిమా అవ‌కాశాల కోసం హాట్ షోకు సిద్ధం కావ‌డం గ‌మ‌నార్హం.

మోనిత‌కు టెన్ష‌న్‌.. అత్తా కోడ‌ళ్ల కామెడీ!

  స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' రోజుకో మ‌లుపు తిరుగుతోంది. సీరి‌య‌స్ ట‌ర్న్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ దీప‌, ఆమె అత్త సౌంద‌ర్య‌తో క‌లిసి కామెడీని పండించేస్తోంది. దీంతో మ‌హిళా ప్రేక్ష‌కుల్లో ఒకింత ఆనందం.. ఒకింత ఉత్కంఠ నెల‌కొంది. ఈ బుధ‌వారం ఎపిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో సాగ‌బోతోంది. డాక్ట‌ర్ బాబు అడుగులు మోనిత‌కు వ్య‌తిరేకంగా ప‌డుతున్న నేప‌థ్యంలో ఎపిసోడ్ కీల‌క మ‌లుపులు తిర‌గ‌బోతోంది. అయితే సీరియ‌స్ గా సాగే ఈ ఎపిసోడ్‌లో అత్తా కోడ‌ళ్లు దీప, సౌంద‌ర్య కామెడీ హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. "రెండు రోజులు నీతో వుంటాను నాన్నా" అంటూ డాక్ట‌ర్ బాబుతో ఇంటికి వ‌చ్చేసిన శౌర్య చిన్న చిన్న‌గా త‌న‌ని మార్చ‌డం మొద‌లుపెడుతుంది. టిఫిన్ బండి వ‌ద్ద టిఫిన్ చేద్దామంటూ తీసుకెళ్లి కార్తీక్ తో టిఫిన్ తినిపించేస్తుంది. ముందు అయిష్టంగానే టిఫిన్ బండి ద‌గ్గ‌రికి వ‌చ్చినా కార్తీక్ ఆ త‌రువాత శౌర్య చెప్పిన మెనూ అద్భుతంగా వుండ‌టంతో లొట్ట‌లేస్తూ తింటుంటాడు. ఇంత‌లో అక్క‌డికి అత్త సౌంద‌ర్య‌ని తీసుకుని దీప స్కూటీపై వ‌స్తుంది. అక్క‌డ కార్తీక్‌ని చూసి ముందు ముఖం చిట్లించుకున్నా శౌర్య‌తో క‌లిసి టిఫిన్ చేస్తుండ‌టం చూసి ఆనందిస్తుంది. దీప‌ మాత్రం ఈ చూడ‌ముచ్చ‌టైన దృశ్యం చూసి సంబ‌రంతో గాల్లో తేలిపోతోంది. ఇక గురువారం ఎపిసోడ్ మోనిత‌కు టెన్ష‌న్‌గా.. వుంటే దీప‌కు, సౌంద‌ర్య‌కు కామెడీగా వుంటుంది. మోనిత బండారాన్ని బ‌య‌ట‌పెట్టే ఆధారం కార్తీక్ చేతికి చిక్కుతుంది. కానీ దాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డానికి మోనిత‌కు మ‌రో ఆధారం ల‌భిస్తుంది. అదేంటీ?  దాన్ని అడ్డు పెట్టుకుని కార్తీక్‌తో మోనిత ఆడిన నాట‌కం ఏంటీ అన్న‌ది రేప‌టి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

చ‌ర్ల‌ప‌ల్లి జైలుకి 'కోయిల‌మ్మ‌' న‌టుడు!

  'కోయిల‌మ్మ‌' సీరియ‌ల్‌లో న‌టించిన అమ‌ర్ శ‌శాంక్‌ అలియాస్ స‌మీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవ‌ల తాగి ఓ న్యూస్ రిపోర్ట‌ర్‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొని వార్త‌ల్లో నిలిచిన అమ‌ర్‌ని తాజాగా అరెస్ట్ చేసి పోలీసులు చ‌ర్ల‌ప‌ల్లి జైలుకి త‌ర‌లించ‌డం బుల్లితెర వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. గ‌త నెల 27న అమ‌ర్‌పై ఇద్ద‌రు యువ‌తులు లైంగిక ఆరోప‌ణ‌లు చేస్తూ పోలీసుల్ని ఆశ్ర‌యించారు. దీంతో రాయ‌దుర్గం పోలీసులు అమ‌ర్‌ని అదుపులోకి తీసుకుని విచార‌ణ అనంత‌రం కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి అమ‌ర్‌కి రిమాండ్‌ విధించారు. దీంతో అత‌న్ని పోలీసులు చ‌ర్ల‌ప‌ల్లి జైలుకి త‌ర‌లించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఈ వివాదంపై అమ‌ర్ వాద‌న మ‌రోలా వుంది. ఓ టీవీ రిపోర్ట‌ర్ కావాల‌నే త‌న‌ని ఇలా ఇరికించింద‌ని, ఓ రౌడీ షీట‌ర్‌తో బెదిరించ‌డ‌మే కాకుండా మ‌రో ఇద్ద‌రు యువ‌తుల్ని తీసుకొచ్చి ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం త‌న‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేసింద‌ని అమ‌ర్ ఆరోపించారు. కానీ తాజాగా వివాదంలో అమ‌ర్‌దే త‌ప్పంటూ అత‌నికి కూక‌ట్‌ప‌ల్లి కోర్టు రిమాండ్‌ విధించ‌డంతో బుల్లితెర‌ వ‌ర్గాలు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. 

శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ.. గోవా బీచ్‌లో క‌లిసి చేస్తున్న‌ది ఇదా?!

  గ‌త నాలుగు రోజుల క్రితం నుంచీ బుల్లితెర రాముల‌మ్మ శ్రీ‌ముఖి గోవాలో చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. అక్క‌డి బీచ్ హోట‌ల్‌లో హొయ‌లు పోతూ శ్రీ‌ముఖి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వాట‌ర్ ఫాల్స్‌లో దిగి త‌డిపొడి దుస్తుల్లో అందాలు ఆర‌బోస్తూ శ్రీ‌ముఖి ర‌చ్చ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇటీవ‌ల ఇన్ స్టాలో సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. శ్రీ‌ముఖికి తొడు విష్ణుప్రియ కూడా గోవా వెళ్లింది. అక్క‌డ శ్రీ‌ముఖితో క‌లిసి త‌ను కూడా ర‌చ్చ చేస్తోంది. అయితే గోవా బీచ్‌లో శ్రీ‌ముఖి, విష్ణుప్రియ చేసిన ఓ ప‌ని ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ‌ముఖి త‌న క్రైమ్ పార్ట‌న‌ర్‌ అంటూ ఈ సంద‌ర్భంగా విష్ణు ప్రియ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం మ‌రింత హీటెక్కిస్తోంది. ఇంత‌కీ శ్రీ‌ముఖితో క‌లిసి విష్ణు ప్రియ చేసిన క్రైమ్ ఏంటీ ? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. గోవా బీచ్‌లో గ‌త నాలుగు రోజులుగా తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ జోడీ నైట్ డిన్న‌ర్ చేస్తూ హ‌గ్ చేసుకున్న ఫొటోల‌తో పాటు బీచ్‌లో ఇసుక‌పై కూర్చుని ఒక‌రి నొక‌రు గాఢంగా హ‌త్తుకున్న ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ బీచ్‌లో ఇదేం పాడుప‌ని అంటూ కామెంట్‌లు కురిపిస్తున్నారు. ఈ కామెంట్‌ల‌ని శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ సీరియ‌స్‌గా తీసుకోకుండా ఎంజాయ్ చేస్తుండ‌టం విశేషం.

జోర్దార్ సుజాత చేతిలో రాకింగ్ రాకేశ్ బ‌క‌రా!‌

  జోర్దార్ సుజాత గుర్తుందిగా.. బిగ్ బాస్ సీజ‌న్ 4తో లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసింది. టీవీ ఛాన‌ల్‌లో స‌బ్ యాంక‌ర్‌గా కెరీర్ మొద‌టుపెట్టిన జోర్ద‌ర్ సుజాత బిగ్ ‌బాస్ సీజ‌న్ 4తో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్ప‌డు ప‌లు టీవీ షోల్లో పాల్గొంటూ ప్ర‌స్తుతం య‌మ బిజీగా వుంటోంది. యూట్యూబ్ ఛాన‌ల్స్ నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల్లోనూ జోర్దార్ జుజాత త‌న స‌త్తా చాటుకుంటోంది. బిగ్ బాస్‌ షోలో నాగ్‌ని బిట్టూ అంటూ హంగామా చేసిన సుజాత ఆ కార‌ణంగానే హౌ‌స్ నుంచి నాగ్ ఫ్యాన్స్ కార‌ణంగా నిష్క్ర‌మించాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల జబ‌ర్ద‌స్త్ రాకింగ్ రాకేష్‌తో ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కి ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చేసింది. ఆ చాన‌ల్ ఎవ‌రిదో కాదు.. రాకేశ్‌దే. దాని పేరు "చంట‌బ్బాయి".  'జోర్దార్ సుజాత హోమ్ టూర్' అనే పేరుతో నిర్వ‌హించిన ఈ టాక్ షోలో రాకింగ్ రాకేష్‌కి దిమ్మ‌దిరిగే పంచ్ ఇచ్చి బ‌క‌రాని చేసేసింది. కోట్లు ఖ‌రీదు చేసే ఇల్లు, ల‌గ్జ‌రీ లైఫ్‌ని లీడ్ చేస్తున్న‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చిన జోర్ద‌ర్ సుజాత చివ‌రికి పెద్ద ట్విస్ట్ ఇచ్చేసింది. ‌ఖ‌రీదైన ఇంట్లో జోర్దార్‌ సుజాత ఇంట‌ర్వ్యూ జ‌రిగింది. అయితే ఆ ఇల్లు సుజాత‌దే అని భ్ర‌మ‌ప‌డిన రాకింగ్ రాకేష్ ఆ త‌రువాత ఆ ఇల్లు సుజాత‌ది కాద‌ని తెలిసి షాక‌య్యాడు. సుజాత చేతిలో బక‌రా అయిపోయాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. 

సీక్రెట్ ల‌వ్‌లో బిగ్‌బాస్ జోడీ..?

లాక్‌డౌన్ కార‌ణంగా బిగ్‌బాస్ సీజ‌న్ 4 కొంత ఆల‌స్యంగా మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే ఈ షోలో పాల్గొ‌న్న వాళ్ల‌లో చాలా వ‌ర‌కు యూట్యూబ్‌లో పాపుల‌ర్ అయిన వాళ్లే అయినా బుల్లితెర‌కు చాలా కొత్త ముఖాలు. దీంతో షో ప్రారంభ రోజుల్లో చాలా వ‌రకు నెగెటివ్ టాక్ వినిపించింది. త‌రువాత బిగ్ బాస్ నిర్వాహ‌కులు వేసిన ల‌వ్ ట్రాక్ మంత్రాతో సీజ‌న్ ‌4 గాడిలో ప‌డి కొత్త వొర‌వ‌డిని సృష్టించింది. ముఖ్యంగా మోనాల్‌, అఖిల్‌ల ప్రేమాయ‌ణం ఈ షోలో ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది. ముందు అభిజీత్‌తో పులిహోర క‌ల‌పాల‌ని మోనాల్ ట్రై చేసింది. మోనాల్ డ‌బుల్ ట్రాక్ అర్థం కావ‌డంతో అభిజీత్ త‌న పంథాని మార్చుకుని మోనాల్‌ని దూరం పెట్టాడు.. అప్పుడు అఖిల్‌ని లైన్‌లోకి దించేసింది మోనాల్. వీరిద్ద‌రి ప్రేమాయ‌ణం సీజ‌న్ ఎండ్ వ‌ర‌కు ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు, గిల్లిక‌జ్జాల‌తో సాగి హాట్ టాపిక్‌గా మారిపోయింది. టాప్ 5కి ముందే మోనాల్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది. అఖిల్ మాత్రం ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లి ర‌న్న‌ర‌ప్‌గా మిగిలిపోయాడు. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం సీజ‌న్ 4 అయిపోయినా ఇంకా న‌డుస్తూనే వుంద‌ట‌. ఈ విష‌యం 'బిగ్‌బాస్ ఉత్స‌వం' పేరుతో శ్రీ‌ముఖి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కార్య‌క్ర‌మంలో గ‌త ఆదివారం ప్ర‌సా‌ర‌మైన ఎపిసోడ్‌లో బ‌ట్ట‌బ‌య‌లైంది. గంగ‌వ్వ‌, శ్రీ‌ముఖి వీరి సీక్రెట్ ల‌వ్‌స్టోరీని బ‌య‌ట‌పెట్టేశారు. దీన్ని నిజం చేస్తూ మోనాల్ గంగ‌వ్వ‌కు చీర పెట్టేసింది. "దీన్ని ఎప్పుడు క‌ట్టుకుంటావ్ మోనాల్.. పెళ్లికా?" అ‌ని శ్రీ‌ముఖి అడిగితే "ఎందుకు? అఖిల్ కొనిస్తాడు" అంటూ అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేసింది గంగ‌వ్వ. అంటే అఖిల్‌, మోనాల్ ల‌వ్ ట్రాక్ నిజ‌మేన‌న్న మాట‌. మ‌రి ఆ ట్రాక్ నిజంగానే పెళ్లి దాకా వ‌స్తుందా?  చూడాలి..

శౌర్య మాట‌ల‌తో కార్తీక్‌లో మార్పు?

బుల్లితెర ధార‌వాహిక `కార్తీక దీపం`. `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్స్‌లో టాప్ సీరియ‌ల్ అన‌డం కంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్స్‌లో టాప్ వ‌న్ రేటింగ్‌లో వున్న ఏకైక సీనియ‌ల్ ఇదే అని చెప్ప‌డం క‌రెక్టేమో అంతగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని, పిల్ల‌ల్ని అమితంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ ఇది. ఈ మంగ‌ళ‌వారం ముగింపు ద‌శ‌కు కీల‌క అడుగు ప‌డేలా వుంది. హిమ సాక్షిగా ఒట్టు వేస్తున్నాను నీకు మంచే జ‌ర‌గాలంటూ డాక్ట‌ర్ బాబు దీప‌కు మాటిస్తాడు. అక్క‌డి నుంచిఏ దీప‌లో పాజిటీవ్ వైబ్స్ మొద‌ల‌వుతాయి. ఇంటికి వెళ్లిన దీపి హిమ‌తో మేడ‌పై ప‌డుకుని డాక్ట‌ర్ బాబు సంగుత‌ల్ని చెబుతూ అమితానందంలో నిద్రలోకి జారుకుంటుంది. డాక్ట‌ర్ బాబు కూడా శౌర్య‌తో క‌లిసి మేడ‌పైకి వెళ్లి అక్క‌డే వెన్నెల‌ని చూస్తూ డాబాపై ప‌డుకుంటారు. ఇంత‌లో శౌర్య కాలుష్యం అంటే ఏంటి అని డాక్ట‌ర్ బాబుని అడుగుతుంది. కాలుష్యం అంటే ఆకాశానికి భూమికి మ‌ధ్య వుండేది అని చెబుతాడు. దీంతో వెంట‌నే శౌర్య అది పోతే అని అడుగుతుంది. అది పోతే ఆకాశం నిర్మ‌లంగా స్వ‌శ్చంగా వుంటుంది అని డాక్ట‌ర్‌బాబు (కార్తీక్‌) అంటాడు. ఆకాశానికిభూమికి మ‌ధ్య కాలుష్యం వున్న‌ట్టే నీకు అమ్మ‌కు మ‌ధ్య అలాంటిది ఏదో వుంది కాదా?  నాన్నా అన‌గానే కార్తీక్ షాక్ అవుతాడు.. వెంట‌నే ఆలోచ‌న‌లో ప‌డిపోతాడు. శౌర్య మాట‌ల‌తో కార్తీక్‌లో మార్పు మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది తెలియాలంటే మంగ‌ళ‌వారం ఎసిసోడ్ చూడాల్సిందే. 

శ్రీ‌ముఖి‌ అక్క‌డా రుబ్బురోలే.. ఇక్క‌డా రుబ్బురోలే!

బుల్లితెర గ్లామ‌ర్ క్వీన్ శ్రీ‌ముఖి. యాంక‌ర్‌గా ఈ బొద్దుగుమ్మ‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ ప్రోగ్రామ్ చేసినా.. ఫొటో షూట్‌ల‌తో అద‌ర‌గొట్టినా శ్రీ‌ముఖి త‌న‌కు తానే సాటి. బుల్లి తెర రాముల‌మ్మ‌గా పాపులారిటీని ద‌క్కించుకున్న శ్రీ‌ముఖి ఇటీవ‌ల గోవాలో వాట‌ర్ డాల్‌గా మారి, చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. త‌డిపొడి డ్రెస్సుల్లో అందాలు ఆర‌బోస్తూ పోజులిచ్చిన ఫొటోలు నెట్టింట ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో హీటెక్కిస్తున్నాయి. ఇదిలా వుంటే "శ్రీ‌ముఖి అక్క‌డా రుబ్బురోలే..ఇక్క‌డా రుబ్బురోలే" అంటూ రోహిణి చేసిన కామెంట్స్ ఇప్ప‌డు వైర‌ల్ గా మారాయి. `బిగ్‌బాస్ ఉత్స‌వం` పేరుతో `స్టార్ మా` బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ల‌తో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఇటీవ‌లే ప్రారంభించింది. ముందుగా బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్‌లు పాల్గొన‌గా చిత్రీక‌రించిన తొలి ఎసిసోడ్ ని టెలీకాస్ట్ చేశారు. తాజాగా సీజ‌న్‌3కి సంబంధించిన కంటెస్టెంట్‌ల‌తో `బిగ్‌బాస్ ఉత్స‌వం 2`ని టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవ‌ల విడుద‌లైంది. ఇందులో రోహిణి యాంక‌ర్ శ్రీ‌ముఖిపై వేసిన పంచ్‌లు న‌వ్వులు పూయిస్తున్నాయి. రీయూనియ‌న్ పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌ముఖిని రోహిణి ఓ రేంజ్‌లో ఆడేసుకుంది. రోహిణిని ఉద్దేశిస్తూ "బిగ్‌బాస్ ఇంట్లో చికెన్ రోలా వుండేదానివి.. ఇప్పుడేంటీ రుబ్బురోల్‌లా త‌యార‌య్యావ్?" అని శ్రీ‌ముఖి పంచేసింది. ఈ పంచ్‌కి రోహిణి "నువ్వు మాత్రం అస్స‌లు మార‌లే. అక్క‌డా రుబ్బురోలే ఇక్క‌డా రుబ్బురోలే!" అని రివ‌ర్స్ పంచ్ వేసింది. ఈ పంచ్ వీర‌లెవెల్లో పేలి ఎపిసోడ్‌కే ఫైలైట్‌గా నిలిచింది. ఈ ఎపిసోడ్ వ‌చ్చే ఆదివారం టెలీకాస్ట్ కానుంది.

ఇంకెన్ని డిజాస్ట‌ర్స్ సంభ‌వించాలి.. అన‌సూయ ఫైర్‌!

  ఉత్త‌రాఖండ్‌లో హిమానీన‌దం కార‌ణంగా ధౌలిగంగా న‌ది ఉధృతంగా పోటెత్త‌డంతో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఎన్‌టీపీసీ నిర్మిస్తోన్న రిషిగంగ ప‌వ‌ర్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంస‌మైంది. ఆ ప్ర‌కృతి వైప‌రీత్యానికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఆదివారం నుంచీ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విషాద‌మేమంటే ఆ ప్రాజెక్టులో ప‌నిచేస్తున్న దాదాపు 170 మంది సిబ్బంది గ‌ల్లంత‌యిపోయారు. వారిలో ఎంత‌మంది మృత్యువాత‌ప‌డ్డారు, ఎంత‌మంది ప్రాణాలు ద‌క్కించుకున్నార‌నే విష‌యం ఇంకా వెల్ల‌డి కాలేదు. ఈ విషాదం అంద‌రినీ క‌దిలించి వేస్తోంది.. అంద‌రి హృద‌యాల‌నీ క‌ల‌చివేస్తోంది. ఈ ఉత్పాతానికి ఎవ‌రు బాధ్యులంటూ ప‌లువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌కృతిని ధ్వంసం చేస్తూ రావ‌డం వ‌ల్లే ఇలాంటి వైప‌రీత్యాలు ఎదుర‌వుతున్నాయ‌ని విమ‌ర్శిస్తున్నారు.  మ‌న ఫైర్ బ్రాండ్ యాంక‌ర్ అన‌సూయ భ‌రద్వాజ్ సైతం ఈ విషాదంపై త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. "మ‌రో ప్ర‌కృతి వైప‌రీత్యం మ‌న‌ల్ని తాకింది. ఇది మ‌నం ప్ర‌కృతికి అనుగుణంగా జీవిస్తూ, దానిని సంర‌క్షించడం మొద‌లుపెట్టాల్సిన స‌మ‌యం కాదా? మ‌నం నేర్చుకోవ‌డానికి ముందు ఇంకెన్ని ఉత్పాతాలు సంభ‌వించాలి?" అంటూ ఆమె ఆగ్ర‌హంతో ప్ర‌శ్నించింది.  హిమాల‌యాల‌పై కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతుండ‌టం వ‌ల్ల ఆ ప‌ర్వ‌తాలు చాలా వేగంగా వేడెక్కుతున్నాయ‌ని పర్యావ‌ర‌ణ‌వేత్త‌లు చెబుతున్నారు. దాని వ‌ల్లే మంచు చ‌రియ‌లు క‌రిగి, విరిగి ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వాలు కూడా దీనికి బాధ్య‌త వ‌హించాలంటున్నారు.

'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' స్టేజ్‌పై ఇమ్మానియేల్ ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌!

  ఈటీవీలో 'జ‌బ‌ర్ద‌స్త్' త‌రువాత‌ అంత‌గా పాపుల‌ర్ అయిన షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో'. ఈ షోకి న్యాయ నిర్ణేత‌లుగా రోజా, మ‌నో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌ష్మీ గౌత‌మ్ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోలో వ‌ర్షని స్టేజ్‌పైనే ఇమ్మానియేల్ ప్ర‌పోజ్ చేయ‌డం అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేస్తోంది. ఈ షో లేటెస్ట్ ప్రోమోలో ఫిబ్ర‌వ‌రి 14 వేలంటైన్స్ డే సంద‌ర్భంగా చేతిలో ఒక‌సారి రెడ్ క‌ల‌ర్ హార్ట్ సింబ‌ల్ బెలూన్‌ని ప‌ట్టుకుని, ఇంకోసారి చేతిలో గులాబీ పువ్వు ప‌ట్టుకుని ఇమ్మానియేల్ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ మోకాళ్ల‌పై కూర్చుని ప్ర‌పోజ్ చేసిన తీరు వైర‌ల్‌గా మారింది.  ఈ దృశ్యం చూసి రోజా అవాక్క‌యింది. ఫిబ్ర‌వ‌రి 12న ప్ర‌సారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. వ‌ర్ష కూడా సిగ్గుల మొగ్గ‌వుతూ ఇమ్మానియేల్ ఇచ్చిన‌ రోజా పువ్వుని అందుకోవ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఇమ్మానియేల్ భావోద్వేగానికి లోన‌య్యాడు. చాలా మంది అమ్మాయిలు త‌న ప‌క్క‌న నించోవ‌డానికే ఇష్ట‌ప‌డ‌లేద‌ని, అలాంటిది వ‌ర్ష మాత్రం త‌న‌తో స‌న్నిహితంగా వుంద‌నీ ఎమోష‌న‌ల్ అయ్యాడు.  వ‌ర్ష 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్'లోకి ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌రి నుంచి ఇమ్మానియేల్ తో స‌న్నిహితంగా వుంటోంది. వీరిద్ద‌రిపై గ‌త కొన్ని రోజులుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశం జ‌ర‌గ‌డం, ప్రేమికుల రోజు సంద‌ర్భంగా చిత్రీక‌రించిన ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలో జ‌డ్జెస్ సాక్షిగా ఇమ్మానియేల్ .. వ‌ర్ష‌కు ప్ర‌పోజ్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్ర‌వ‌రి 12న ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానున్న‌ది.