Brahmamudi : కావ్య లాంటి ట్యాలెంటెడ్ డిజైనర్ లేరు.. కాబట్టి ఆమెని తీసుకురా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -534 లో.. రాజ్ లోని అంతరాత్మ బయటకు వచ్చి.. వెళ్లి భార్యా బట్టలు బయటపడేసావు కదా వెళ్లి తీసుకొని రా అని అనగానే.. రాజ్ కోపంగా తీసుకొని రానని అంటాడు. ఎక్కడ వస్తువులు ఉంటే మనసు కరిగి వెళ్లి తీసుకొని వస్తావని భయపడి పడేసావు కదా అని రాజ్ తో తన అంతరాత్మ గొడవ పడుతుంది. మరొకవైపు కావ్య, అపర్ణ లు గుడిలో మాట్లాడుకుంటారు. అత్తయ్య అని కావ్య అనగానే.. ఎవరు నీకు అత్తయ్య నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయావ్ కనీసం ఎలా ఉన్నావని కూడా అడుగులేదని అపర్ణ అంటుంది. నేనే దగ్గర ఉండి మిమ్మల్ని చూసుకోవాలనుకున్నాను కానీ ఇలా మీ అబ్బాయి నా మనసు ముక్కలు చేసి పంపిస్తాడనుకోలేదని కావ్య అనగానే.. నాకు అంత తెలుసు.. కనీసం నేను వచ్చేవరకు ఉండాలి కదా అని అపర్ణ అంటుంది. నన్ను భార్యగా ఒప్పుకోడట బలవంతంగా నాతో కాపురం చేసాడట అని అపర్ణపై కావ్య పడి ఎమోషనల్ అవుతుంది. నేను ఈ తప్పు చెయ్యలేదు.. నా కాళ్ళపై నేను నిలబడాలని అనుకున్నాను.. డిజైనర్ గా జాయిన్ అయ్యాను. కానీ ఆ అనామిక ఇలా చేస్తుందనుకులేదు.. నన్ను మోసం చేసి నా డిజైన్ అనామిక కొనుక్కొని ఇలా చేసింది. ఆ విషయం తనకి చెప్తే నమ్మడం లేదని కావ్య అంటుంది. అవన్నీ కాదు నాతో పాటు వచ్చి బుద్దిగా కాపురం చేసుకోమని అపర్ణ అనగానే.. నేను రానని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్యతో అపర్ణ మాట్లాడడం.. రాహుల్ చూసి రుద్రాణికి ఫోన్ చేసి చెప్తాడు. మరోవైపు మమ్మీ ఎక్కడికి వెళ్ళిందంటూ రాజ్ అడుగుతాడు. అప్పుడే రుద్రాణి వచ్చి.. కావ్యని కలవడానికి వెళ్ళిందని చెప్తుంది. అప్పుడే అపర్ణ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని రాజ్ అడుగుతాడు. రాజ్ కి తెలిసిందని సైగ చేస్తుంది ఇందిరాదేవి.. దాంతో కావ్యని కలవడానికి వెళ్ళానని అపర్ణ చెప్పగానే.. రాజ్ కోప్పడతాడు. రుద్రాణి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడితే.. నాకు రాహుల్ ఫోన్ చేసి చెప్పాడని రుద్రాణి అంటుంది. అపర్ణ, ఇందిరదేవిలు కలిసి రుద్రాణిని తిడతారు. నా సంగతి సరే.. నీ కొడుకు ఏంటి ఇంట్లో అందమైన అమ్మాయిని వదిలి.. బయట వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని అపర్ణ చెప్తుంది.తరువాయి భాగంలో నా కంపెనీ లో వర్క్ చేస్తావని అగ్రిమెంట్ ఉందని కావ్యతో అనామిక అంటుంది. మరొక వైపు  కావ్య లాంటి ట్యాలెంట్ అమ్మాయి మన కంపెనీలో లేకపోవడం వల్లే ఇలా జరిగింది.. వెంటనే కావ్యని మన కంపెనీలో డిజైనర్ గా అప్పాయింట్మెంట్ చెయ్ అని రాజ్ కి సీతారామయ్య చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఏ హీరో కూడా నన్ను అలా నిలబెట్టలేదు

  బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ స్థాయి నుంచి టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాష్టర్ తన ప్రస్థానాన్ని ఎలా నిలుపుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. రాకేష్ మాష్టర్ దగ్గర డాన్స్ స్కిల్స్ నేర్చుకున్నారు. అలాగే ఎన్నో సాంగ్స్ లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేశారు. చివరికి ఇప్పుడు ఎన్నో హిట్ సాంగ్స్ కి టాప్ హీరోస్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. అలాంటి శేఖర్ మాష్టర్ ఒక చిట్ చాట్ లో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పారు. " నా పని నేను చేసుకుంటూ వెళ్ళా. మంచి పొజిషన్ లో నిలబడ్డా. ఫైట్ మాష్టర్ సాంబశివరావు గారి సాయంతో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. మా భావాన్ని మావయ్యకు నా అభిరుచి గురించి చెప్పేసరికి సాంబశివ రావు మావయ్య దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన నన్ను ఫైట్ మాష్టర్ రాజు గారి దగ్గరకు తీసుకెళ్లి నా గురించి  చెప్పి కార్డు ఇప్పించేసరికి అలా డాన్స్ మాస్టర్ గా నా జర్నీని స్టార్ట్ చేసాను. కొరియోగ్రాఫర్స్ లో నా రోల్ మోడల్ ప్రభుదేవా. డాన్స్ లో ఈ హీరోస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే  చిరు గారి డాన్స్ లో గ్రేస్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫాస్ట్ డాన్సర్. చెప్పగానే నేర్చేసుకుంటారు. రామ్ చరణ్ డాన్స్ చాలా షార్ప్ గా చేస్తారు. అల్లు అర్జున్ డాన్స్ లో స్వాగ్ ఉంటుంది. ఢీ షోలో వర్క్ చేసి అదే షోకి జడ్జ్ గా వెళ్లడం చాలా బాగుంది. అంటే ఎలా ఐతే ఒక స్కూల్ లో చదువుకుని ఆ స్కూల్ కి ప్రిన్సిపాల్ గా వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా ఉంది. ఒక సాంగ్ విషయంలో ఒక హీరో ఎక్కువ సేపు వెయిట్ చేయించారని అనుకుంటున్నారు చాలామంది. కానీ స్టార్టింగ్ డేస్ లో నేను చాలామంది డైరెక్టర్స్ దగ్గరకు వెళ్లాను కానీ అలా ఎవరూ వెయిట్ చేయించలేదు. ప్రభుదేవా, లారెన్స్ లా డైరెక్షన్ చేస్తానా లేదా అనే విషయం తెలీదు. ఎప్పుడు మూడ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఏ హీరోతో చేస్తానని విషయాన్నీ కూడా చెప్పలేను. అసలు చేస్తానో లేదో కూడా తెలీదు." అంటూ ఎన్నో విషయాలు చెప్పారు.  

సుధీర్, రష్మీల మధ్య ఏదో ఉందని చెప్పడానికి ఇదే సాక్ష్యం!

  తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్న షో ' శ్రీదేవీ డ్రామా కంపెనీ' ‌. ఇందులో యాంకర్ గా రష్మీ, హైపర్ ఆది చేస్తుండగా.. ఇంద్రజ జడ్జ్ గా చేస్తున్నారు. ఇక జబర్దస్త్ నుండి చాలా మంది ఈ షోకి వచ్చి ఎంటర్‌టైన్ చేస్తున్నారు. టీవీ షోలలో అభిమానించే ఆన్ స్క్రీన్‌ జంటల్లో సుడిగాలి సుధీర్‌, రష్మి గౌతమ్ జంట ఒకటి. ఎప్పటినుండో ప్రేక్షకులు వీరి జంటను ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య ప్రేమ లేదు.. మంచి స్నేహితులు మాత్రమే అని తెలిసినా.. ఇద్దరిని జంటగా చూసేందుకే తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. సుధీర్‌, రష్మీల జంట సూపర్‌ హిట్‌ జోడీ అన్నట్లు నిలిచింది. ఈ మధ్య కాలంలో వీరిద్దరు కలిసి షోలు చేయడం లేదు, అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు ఆ కాంబో మళ్ళీ రిపీట్ చేసేలా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోని వదలింది. నవరాత్రి స్పెషల్ ప్రోమోగా రిలీజైన ఈ ప్రోమోలో మొదటగా.. బలగం నల్లిబొక్క ఫేమ్ అతను .. ఈ ముసలోడికి దసరా పండగా కావాలని చెప్పాడు. నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తానంటు హైపర్ ఆది చెప్తాడు. ఇక ఆ తర్వాత డ్యాన్స్ , సింగింగ్ ఉంది. కాసేపటికి హైపర్ ఆది ఓ టాస్క్ ఇచ్చాడు. అక్కడ ఉన్నవారి ఫోన్ లు అన్నీ తీసుకున్నాడు. మీ ఫ్రెండ్ కి గానీ ఇంట్లో వాళ్ళకి గానీ కాల్ చేసి.‌ అర్జెంట్ గా నాకు పది వేలు కావాలని అడగాలని హైపర్ ఆది చెప్పాడు. మొదటగా బుల్లెట్ భాస్కర్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి.‌ నాన్న నాకు అర్జెంటుగా పదివేలు గూగుల్ పే చేయవా అని అనగానే.. భాస్కర్ వాళ్ళ నాన్న కాల్ కట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత హైపర్ ఆది మహతికి ఫోన్ చేస్తే‌‌.. మంచి కాలర్ ట్యూన్ వస్తుంది. అది విని. ఒరేయ్..  ఆ బాడీకి  ఈ పాటకి ఏం అయిన సంబంధం ఉందా అని ఆది అంటాడు. ఇక తనని అడుగగా.. పంపిస్తానని అంటుంది. ఇక ఆ తర్వాత రష్మీని సుధీర్ కు కాల్ చేయమని చెప్తాడు. బేబ్‌ అంటు రష్మీ ఇటు నుండి అనగా.. చెప్పరా అంటూ సుధీర్ సమాధానం ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్మి రూ.10 వేలు అడిగిన వెంటనే ఇదే నెంబర్ కి గూగుల్‌ పే ఉందా అంటూ ఫోన్ కట్‌ చేసే లోపే ఆ అమౌంట్‌ ను సుధీర్‌ పంపించాడు.  ఇక మన ఎడిటర్ మామ మంచి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేసి హైప్ ఇచ్చాడు. దాంతో ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్స్ ప్రోమో నుంచి సుధీర్, రష్మీల సంభాషణ వరకు కట్‌ చేసి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. మళ్లీ వీరి ట్రెండ్‌ మొదలైందని తెలుస్తోంది. రష్మీ, సుధీర్ కలసి షోలు చేయాలని కోరుకుంటున్నవారు చాలా మందే ఉన్నారు.

మెహబూబ్ ఎంట్రీ .. కూల్ గా ఆడమని సోహెల్ సలహా!

  మెహబూబ్ దిల్ సే.. బిగ్ బాస్ సీజన్-4 లో ఎంట్రీ ఇచ్చాడు. దాంతో ఎంతో‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సీజన్-8 లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో శ్రీసత్యతో కలసి జమ్ము కాశ్మీర్ లో తీసిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ మంచి వీక్షకాధరణ పొందింది.  ఇలా వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ ద్వారా మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న మెహబుబ్ రెండోసారి హౌస్ లో ఎంట్రీతో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు.  మెహబూబ్ మంచి డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే సూపర్ డ్యాన్స్ పర్ఫామెన్స్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన మెహబూబ్ తన అచీవ్ మెంట్స్ గురించి చెప్పుకున్నాడు. ఇక నాగార్జున తనకోసం సర్ ప్రైజ్ వీడియోని చూపించాడు. ఈ వీడియోలో సోహెల్ వచ్చాడు. " అరెయ్ హౌస్ లో నాలాగా కూల్ గా ఉండు అంటూ తనకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు సొహెల్. అతను కూల్ ఆ.. అతను కోప్పడుతుంటే.. మెడ దగ్గర నరాలు కనపడేవి అని నాగార్జున అన్నాడు. నాకు మంచి ఫ్రెండ్ సర్ వాడు.. ఇక లైఫ్ లో అలాంటి ఫ్రెండ్ దొరకడు. జీవితంలో అలాంటి వాడు ఒక్కసారి మాత్రమే దొరుకుతాడు. నేను సక్సెస్ అయ్యాను అంటే సపోర్ట్ వాడు అంటూ సోహెల్ గురించి మెహబుబ్ గొప్పగా చెప్తాడు. ఇప్పుడు హౌస్ లో మళ్ళీ ఎవరైనా అవొచ్చా అని నాగార్జున అనగానే.. అయితే ఫ్రెండ్ అవుతారు అంతే కానీ అలా మాత్రం అవ్వలేరని చెప్పాడు. ఆ తర్వాత హౌస్ లో ఎవరు నీకు కాంపిటీషన్ అని అనుకుంటున్నావని నాగార్జున అడుగుతాడు. నాకు ఇంకా ఎవరు అన్పించడం లేదని మెహబూబ్ అంటాడు.‌ఆ తర్వాత మెహబూబ్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో అవినాష్, గంగవ్వ, మెహబూబ్ లు సీజన్-4 కంటెస్టెంట్స్. మెహబుబ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో మాట్లాడతాడు అందరిని పరిచయం చేసుకుంటాడు. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్లలో మెహబూబ్ ఒక్కడే ఫిజికల్ గా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. పాత హౌస్ మేట్స్ లో నిఖిల్, నబీల్, పృథ్వి లు ఫిజికల్ గా స్ట్రాంగ్ అయితే రాబోయే టాస్క్ లో రెండు టీమ్ లకి మధ్య పోటీలు గట్టిగానే ఉంటాయి. అందులో ఎవరు గెలుస్తారో.‌. ఎవరు ఓడిపోతారో చూడాలి మరి.  

రఫ్ఫాడించిన ముక్కు అవినాష్.. పెళ్లి అయ్యిందంటూ గుర్తుచేసిన శ్రీముఖి!

  ముక్కు అవినాష్ ప్రస్తుతం ఫుల్ ట్రేండింగ్ లో ఉన్న కమెడియన్. టీవీ షో లో తనకి అంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నాడు. ఎక్కువగా యాంకర్ శ్రీముఖితో కలిసి టీవీ షోస్ చెయ్యడం.. ఇద్దరి కామెడి టైమింగ్ కి మంచి ఆదరణ లభించింది. జబర్దస్త్ ద్వారా ముక్కు అవినాష్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే బిగ్ బాస్ సీజన్-4 లో అప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారానే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. ఇప్పుడు కూడా వైల్డ్ కార్డు ద్వారానే ఎంట్రీ ఇచ్చాడు. సీజన్-4 అప్పుడు నాకు పెళ్లి కాలేదు.. మీరు చాలాసార్లు అవినాష్ కి ఎవరైనా పిల్లని ఇవ్వండి అంటు చాలాసార్లు చెప్పారు.. అందుకే నేను బిగ్ బాస్ నుండి బయటకు వెళ్ళగానే నాకు పెళ్లి అయ్యిందని నాగార్జునతో చెప్పాడు. నాగార్జున సర్ ప్రైజ్ వీడియో అంటూ.. శ్రీముఖి మాట్లాడిన వీడియోని చూపిస్తాడు. అరెయ్ నీకు అప్పుడు పెళ్ళి కాలేదు.. ఇప్పుడు పెళ్లి అయింది.. జాగ్రత్తగా ఆడు.  నీ ఎంటర్‌టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నానని శ్రీముఖి చెప్తుంది. ఎంటి బాగా క్లోజ్ ఆ అని నాగార్జున అడగగానే.. అవును సర్ ఫ్యామిలీ లాగా అని శ్రీముఖి గురించి అవినాష్ అంటాడు. ఇక హౌస్ లో ఎవరు కత్తిలా బాగుంటారని నాగార్జున అడగగా.. యశ్మీ పాప కత్తిలా ఉంటుందని అవినాష్ అంటాడు. ఇప్పుడే కదా సుత్తి అన్నావని నాగార్జున అనగానే.. అంటే గేమ్ పరంగా సుత్తి కానీ బాగుంటుందని అలా అన్నానని అవినాష్ అంటాడు.

అశ్వగంధ ఈజ్ బ్యాక్.. యష్మీతో లవ్ ట్రాక్!

  గౌతమ్ కృష్ణ అలియాస్ అశ్వథ్దామా 2.0.. మళ్ళీ ఇప్పుడు 4.0 గా ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్ లో తన ఓవర్ అగ్రెషన్ తో చాలాసార్లు నాగార్జునతో చివాట్లు తిన్నాడు. అనుకోకుండా కొద్దీ రోజులకే ఎలిమినేట్ అయి సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు‌. మళ్ళీ తిరిగి వచ్చి.. అశ్వథ్థామా 2.0 ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ వేసాడు. అసలు విషయానికీ వస్తే వచ్చిన రెండు వారాలకే సర్దేసుకొని బయటకొచ్చేశాడు. అయితే సీక్రెట్ రూమ్ నుండి హౌస్ లోకి వెళ్ళాక గౌతమ్ పై తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. అశ్వత్థామ 2.0 కాదు నువ్వు అశ్వగంధ 2.0 అని అప్పుడు చాలా ట్రోల్స్ గౌతమ్ కృష్ణ మీద వచ్చాయి. హౌస్ లో వావ్ అనే పర్ఫామెన్స్ లేకపోయిన శుభశ్రీ రాయగురుతో లవ్ ట్రాక్ నడపడం వల్ల కాస్త ఎక్కువ రోజులే హౌస్ లో కొనసాగాడు. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున సర్ ప్రైజ్ అంటూ.. ప్రియాంక జైన్ మాట్లాడిన వీడియోని చూపిస్తాడు. అందులో ప్రియాంక ఏం చెప్పిందంటే.. బాగా ఆడు అల్ ది బెస్ట్, అప్పుడు 2.0  ఇప్పుడు 4.0 అని చెప్తుంది. ఇక ఆ వీడియో తర్వాత నాకు బిగ్ బాస్ ఇచ్చిన చెల్లి సర్ తను అని గౌతమ్ కృష్ణ అంటాడు.ఆ తర్వాత గౌతమ్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. మొహానికి మాస్క్ పెట్టుకొని వెళ్తాడు. అందరు ఎవరు ఇతను అంటూ కన్ఫ్యూషన్ లో ఉంటారు. ప్రేరణ మాత్రం అశ్వత్థామ 2.0 అని అనగానే మాస్క్ తీస్తాడు. ఇక అందరిని పరిచయం చేసుకొని పాజిటివ్ గా మాట్లాడతాడు. బిగ్ బాస్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆటతీరు, మాటతీరు చూసి వచ్చాడు. కాబట్టి గతంలో కంటే ఇప్పుడు బెటర్ పర్ఫామెన్స్ ఇవ్వొచ్చు. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు అంతా కూడా మాజీ కంటెస్టెంట్స్.‌ వాళ్ళ గేమ్ కూడా ఆల్రెడీ అందరికి తెలుసు. గత సీజన్ లో శుభశ్రీతో లవ్ ట్రాక్ నడిపిన గౌతమ్.. ఇప్పుడు యష్మీతో లవ్ ట్రాక్ నడిపించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు హౌస్ లో ప్రస్తుతం రెండు గ్రూప్ లో ఉన్నాయ్.. వీరిలో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఎంటర్‌టైన్మెంట్ చేస్తారో చూడాలి మరి.

టేస్టీ తేజ ఏం మారలేదుగా.. టాటూ వేసుకోమన్న నాగార్జున!

  టేస్ట్ తేజ గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చి ఎంటర్‌టైన్మెంట్ పరవాలేదనిపించాడు. మళ్ళీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున ఏవిని చూపించి తేజని పిలుస్తాడు. తేజ బిఫోర్ బిగ్ బాస్.. ఆఫ్టర్ బిగ్ బాస్ అని తన లైఫ్ చేంజింగ్ గురించి చెప్పుకొచ్చాడు.  అంతకు ముందు అన్ని రెస్టారెంట్ లలో ఫుడ్ వీడియోలు తీసేవాడిని.. ఇప్పుడు దాదాపు చాలా రెస్టారెంట్ లని ఓపిన్ చేయడానికి గెస్ట్ గా పిలిచారు.. అంతే కాకుండా ఇరవై టీ బ్రాంచెస్ ఓపెన్ చేసానని తేజ అనగానేమ. కంగ్రాట్స్ అంటు నాగార్జున విష్ చేసాడు. ఆ తర్వాత తేజ అమ్మ గారు చేసిన పాయసం నాగార్జునకి టేస్ట్ చేపిస్తాడు తేజ. నేనొక సర్ ప్రైజ్ అంటూ శోభాశెట్టి మాట్లాడిన వీడియోని చూపిస్తాడు. నువ్వు చాలా బాగా ఆడాలి.. లాస్ట్ టైమ్ నువ్వు మీ అమ్మాగారిని బిగ్ బాస్ హౌస్ కీ తీసుకొని వెళ్ళలేదని ఫీల్ అయ్యావ్.. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందని అల్ ది బెస్ట్ అని శోభాశెట్టి చెప్తుంది. ఆ తర్వాత నీకు ఇంకొక సర్ ప్రైజ్ అంటూ గత సీజన్ లో తేజ చేతిపై శోభా శెట్టి పేరు వేయించుకోవాలని నాగార్జున చెప్తాడు. అప్పుడు డైవర్ట్ చేసాడు.. ఇప్పుడు టాటూ వేయించుకోమని నాగార్జున అనగానే.. వద్దు సర్ ఆవిడకి త్వరలోనే పెళ్లి తన పేరు నేను వేయించుకుంటే బాగోదని తేజా అంటాడు. ఆ తర్వాత తేజకి బిర్యాని ఇచ్చి.. ఇది ఒక యష్మీ కీ మాత్రం షేర్ చెయ్ అని నాగార్జున అంటాడు. తేజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో సరదాగా మాట్లాడతాడు. బిర్యానీ మొదట అందరికి కొంచెం, కొంచెం టేస్ట్ చేయిస్తాడు. ఒక్క యష్మీకీ తప్ప.. అయితే నాకు బిర్యానీ అని యష్మీ అనగానే.. నువ్వు నన్ను ఇంప్రెస్ చెయ్యాలి. అది వీళ్ళందరు ఒకే అనాలి అప్పుడు బిర్యానీ మొత్తం నీకే అని టేస్టీ తేజ అనగానే.. యష్మీ ఇంప్రెస్ చేసి బిర్యానీ మొత్తం లాగించేస్తుంది. ఇక గత సీజన్ లో శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ లతో కలిసి ఆడిన తేజ.. ఈ సీజన్ ఎవరితో కలసి ఆడతాడో చూడాలి మరి.  

వైల్డ్  లేడీగా రోహిణి ఎంట్రీ.. మేము ఉన్నామంటూ మాటిచ్చిన జ్యోతక్క!

  రౌడీ రోహిణి.. సీజన్-3లో ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-8 లోకి ఎంట్రీ ఇచ్చి.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. రోహిణి బిగ్ బాస్ కి ముందు అసలు ఎవరనేది చాలా మందికి తెలియదు కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా షోస్ కి యాంకర్ గా, సినిమా ప్రమోషన్ లు అంటూ చాలా పాపులర్ అయింది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో కామెడీతో మంచి పేరు తెచ్చుకుంది. అదే విషయం నాగార్జున తో కూడా స్టేజ్ మీద చెప్పేసింది. బిగ్ బాస్ తర్వాతనే నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఎవరి దిష్టి తగిలిందో ఏమో గాని నాకు ఆక్సిడెంట్ అయింది. కాలుకి దెబ్బ తాకింది. మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్.. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా అయ్యానని తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్పుకొచ్చింది. రోహిణి ఎప్పుడు చలాకీతనంతో కమెడి క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో కూడా తనదైనా స్టైల్ లో కామెడీ చేస్తుంది. అయితే రోహిణికి నాగార్జున సర్ ప్రైజ్ అంటు.. జ్యోతక్క అలియాస్ తీన్మార్ సావిత్రి మాట్లాడిన ఒక వీడియోని చూపించాడు. ఆ వీడియోలో ఏం ఉందంటే.. రోహిణి నువ్వు చాలా బాగా ఎంటర్‌టైన్మెంట్ అందిస్తావ్. నువ్వు బాగా ఆడాలని కోరుకుంటున్నాను.. నువ్వు బయట గురించి ఆలోచించకు.. అంతా మేమ్ చూసుకుంటాం.. నీ ఎంటర్‌టైన్మెంట్ కోసం బయట వెయిట్ చేస్తున్నామని రోహిణికి శివజ్యోతి బూస్టప్ ఇచ్చింది. ఇక హౌస్ లోకి వెళ్ళి అందరితో ఫ్రాంక్ చెయ్యాలని చెప్తాడు. రోహిణి లోపలికి వెళ్లి.. నేను కంటెస్టెంట్ గా రాలేదు.. గెస్ట్ గా వచ్చాను.. నన్ను ముట్టుకుంటే డైరెక్ట్ నామినేట్ అవుతారని అంటుంది. అందులో కొంతమంది నిజం అనుకుంటారు కూడా.. కొంతమంది ఫ్రాంక్ అనుకుంటారు. ఆ తర్వాత రోహిణి ఫ్రాంక్ అని చెప్పి అందరితో మాట్లాడుతుంది.  

నయని పావనికి శివాజీ సపోర్ట్.. ఫెయిర్ గా ఆడమని సలహా!

  నయని పావని గత సీజన్ లో బిగ్ బాస్ అన్యాయం చేసాడు. గత సీజన్ లోను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. తన ఆట మొదలు కాకముందే అదే వారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. తన ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై నెగెటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. అయితే నయని హౌస్ లో ఉన్న ఒక్క వారంలోనే అందరితో కలిసిపోయింది. ముఖ్యంగా శివాజీతో చాలా క్లోజ్ అయ్యింది. అతడిని చుస్తే ఒక డాడ్ ని చూసినట్లు ఉంటుందని చాల ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అలాగే శివాజి కూడా తనకి ఇద్దరు కొడుకులే కావడంతో నయనిని కూతురులా ట్రీట్ చేస్తూ వస్తున్నాడు. ఈ బంధం కేవలం బిగ్ బాస్ హౌస్ కే పరిమితం కాలేదు.. హౌస్ నుండి బయటకు వచ్చాక శివాజీ ఇంటికి వచ్చిన వీడియోస్  ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుండేది నయని పావని. అలా బిగ్ బాస్ అనంతరం కూడా  నయనికి శివాజీ సపోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని నాగార్జునతో తన హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంది. గత సీజన్ లో వచ్చినప్పుడు.. ఉన్నది వారమే కానీ ఆ వారంలో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాను.. వాళ్ళ నమ్మకం నిలబెడతానని నయని అంది. ఆ తర్వాత నాగార్జున సర్ ప్రైజ్ వీడియో చూపించాడు. శివాజీ మాట్లాడిన వీడియోని చూపించాడు. అల్ ది బెస్ట్ నయని లాస్ట్ సీజన్ లో నీ ట్యాలెంట్ ప్రూవ్ చేసుకోలేదు.. ఇప్పుడు చేసుకునే టైమ్ వచ్చింది.. నువ్వు గేమ్ అనేది ఫైయిర్ గా ఆడు.. అప్పుడు గేమ్ గెలవడంతో పాటు ప్రేక్షకులను గెలుస్తావని శివాజి తనకి సలహా ఇవ్వగా.. థాంక్స్ డాడీ అని నయని అంది. బిగ్ బాస్ హౌస్ లో నాకు నాన్న దారికారు..‌లైఫ్ లో నాకు ఇది సెకెంఢ్ ఛాన్స్ అంటూ నయని అంది. ఇక వచ్చీ రాగానే ఆటలో కత్తి నబీల్.. సుత్తి మణికంఠ, సీత అంటూ చెప్పేసింది నయని. అప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారానికే ఎలిమినేట్ అయిపోయా.. కానీ ఈసారి అసలు తగ్గేదేలే అంటూ కాన్ఫిడెన్స్‌గా చెప్పింది. ఇక నాగార్జున తనని హౌస్ లోకి పంపగా..లోపలికి వెళ్లి అందరితో సరదాగా మాట్లాడేసింది. ఇక హౌస్ లో నయని పావని ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి మరి.  

యష్మీ సుత్తేనంట.. తేల్చిసిన వైల్ట్ కార్డ్ కంటెస్టెంట్స్!

   బిగ్ బాస్ సీజన్-8 లో ప్రతి ఒక్కరి దృష్టి తనవైపుకి తిప్పుకుంది యష్మీ. ఈ అమ్మడు ప్రతీ దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతు నెగెటివిని ఎక్కువగా తెచ్చేసుకుంటుంది. చెప్పాలంటే అక్కడ మ్యాటర్ ఏముండదు కేవలం స్క్రీన్ స్పేస్ కోసమేనని తెలిసిపోతుంది. కానీ యష్మీ తనకి తను గేమ్ బాగా ఆడినట్లు తెగ ఫీల్ అవుతుంది. అంతే కాకుండా నిఖిల్ పృథ్వీలని ఇన్ ఫ్లూయెన్స్ చేస్తుంది. ఆ మాట అంటే ఒప్పుకోని సోనియాని ఆడియన్స్ పట్టుబట్టి బయటకు పంపించారు. అంటే పృథ్వి, నిఖిల్ లని కచ్చితంగా ఎవరో ఒకరు ఇన్ ఫ్లూయెన్స్ చెయ్యాలన్నమాట అందుకే ఇప్పుడు సోనియా ప్లేస్ లోకి యష్మీ వచ్చిందనే చెప్పాలి. హౌస్ అంత కూడా యష్మీ హైపర్ యాక్టివ్ అనే అనుకుంటున్నారు. అది కేవలం నామినేషన్ లో గట్టిగా అరుస్తూ మాట్లాడడం మాత్రమే చూస్తారా అందుకే అలా అనుకుంటారు. ఇప్పుడు బయట నుండి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారు.. హౌస్ లో ఉన్నా వారి గేమ్ ఇంక వారి పాజిటివ్, నెగెటివ్ మొత్తం తెలుసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు హౌస్ మేట్స్ గురించి చెప్పే విషయాలు మాత్రమే కీలకం.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిని నాగార్జున ఒకే క్వశ్చన్ అడిగాడు. హౌస్ లో సుత్తి ఎవరు? కత్తి ఎవరు అని అడిగాడు. అయితే ఎనిమిది మందిలో ఒక్కరు తప్ప అందరు కూడా సుత్తి యష్మీ అని చెప్పారు. అసలు యష్మీ గేమ్ ఆడదా అని నాగార్జున అడుగగా.. లేదు ఓవర్ ఎక్సైట్మెంట్ తప్ప ఏముండదు.. అనవసరంగా మాట్లాడుతుంది.. చిన్న విషయన్ని పెద్దది చేస్తోందనే చెప్పుకొచ్చారు. అలా చెప్పిన వాళ్ళు అందరూ మళ్ళీ హౌస్ లో యష్మీతో పాటే ఉండాలి అంటే.. యష్మీ వీక్ నెస్ ని క్యాచ్ చేసుకొని తమ గేమ్ ప్లాన్ చేసుకుంటారని క్లియర్ గా అర్ధమవుతుంది. మరి నిఖిల్, పృథ్వీలని అడ్డుగా పెట్టుకొని యష్మీ చేస్తున్న నామినేషన్లని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి.

హరితేజ మాస్ ఎంట్రీ.. ఇక కన్నడ బ్యాచ్ కి దబిడిదిబిడే !

  హరితేజ బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎంట్రీ ఇచ్చి మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది. మళ్ళీ సీజన్-8 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మంచి డాన్స్ పర్ఫామెన్స్ తో హరితేజ మొదటి వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున స్టేజి మీదకి పిలవగానే ఫుల్ జోష్ తో వచ్చింది. ఇక తనకి సర్ ప్రైజ్ వీడియోగా తన తోటి కంటెస్టెంట్ అయిన నవదీప్ మాట్లాడిన వీడియోని ప్లే చేశాడు నాగ్ మామ.  నువ్వు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా ఆడు అంటూ హరితేజని మోటివేట్ చేశాడు నవదీప్. ఆ తర్వాత హరితేజ వెళ్ళబోతుంటే నీకు ఇంకో సర్ ప్రైజ్ అంటు నాగార్జున ఆపాడు. తన కూతురు భూమిని స్టేజ్ మీదకి పిలుస్తాడు నాగ్ మామ. తనని చూడగానే హరితేజ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత హరితేజ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తుంటారు. అందరిని వెళ్లి పరిచయం చేసుకుంటుంది. అంతే కాకుండా పాత కంటెస్టెంట్ లకి విష్ణుప్రియ, నిఖిల్ లు.. మరొక వైపు టేస్టీ తేజ, హరితేజలు కలిసి టాస్క్ ఆడుతారు. ఇందులో హరితేజ , టేస్తీ తేజ విన్ అయి ఇరవై లక్షల మనీ గెలుచుకొని ప్రైజ్ మనీకీ ఆడ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లందరితో హరితేజ పాజిటివ్ గా మాట్లాడుతూ.. మంచి కామెడీ టైమింగ్ తో పంచ్ లు వేస్తుంది. ఇక నామినేషన్ ప్రక్రియ విషయానికి వస్తే.. పృథ్వీ , యష్మీలని హరితేజ నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. హరితేజ బయట నుండి వాళ్ళ గేమ్ చూసి వచ్చి.. ఎవరు ఎలా ఆడుతున్నారోనని తెలుసుకొని వచ్చింది కాబట్టి నామినేషన్ పాయింట్స్ స్ట్రాంగ్ గా పెట్టి వాళ్లకు గట్టి పోటీ ఇస్తుందనిపిస్తుంది.  

బిగ్ బాస్ లోకి రాయల్ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ!

  బిగ్ బాస్ 2.0 లో ఎనిమిది మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అందులో చివరగా ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ..  సీజన్-4లో వాతావరణానికి అడ్జెస్ట్ అవ్వలేక అయిదో వారమే హౌస్ నుండి బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ హౌస్ లోకి ఛాన్స్ వచ్చిందంటే మాములు విషయం కాదు. వైల్డ్ కార్డ్స్ లో చివరి కంటెస్టెంట్ అంటూ గంగవ్వ ఇంట్రడక్షన్ ని చూపించాడు నాగార్జున. ఆ తర్వాత గంగవ్వ సూటు, క్యాప్, కళ్లజోడు, మెడలో చైన్ తో గ్రాంఢ్ లుక్ లో ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనకి అర్ధం అయ్యే బాషలో, తెలంగాణ యాసలలో నాగార్జున మాట్లాడాడు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులు, మీరు నాకు ఏడు లక్షలు సాయం చేసారు.. దాంతో ఇల్లు కట్టుకున్నాను.. నేను ఎప్పటికి అది గుర్తుపెట్టుకుంటాను.. అందరికి అదే చెప్తున్నానని గంగవ్వ తన సంతోషాన్ని పంచుకుంది. హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారని నాగార్జున అనగా.. వరంగల్ పిల్లగాడు నబీల్ అని చెప్పింది గంగవ్వ. అప్పుడు నేను హౌస్ లో ఉండలేదు.. బయటకు వచ్చాక అందరు ఎందుకు వచ్చావ్.. నువ్వు విన్ అయ్యేదానివి‌‌.. మేమ్ అందరం సపోర్ట్ గా ఉన్నామని అన్నారు.. అయిదవ వారంలో బయటకు వచ్చిన అయిదవవారం లో మళ్ళీ లోపలికి వెళ్తున్నానని గంగవ్వ అంది. హౌస్ లోకి తమ పొలంలో పండించిన కూరగాయలని తీసుకొచ్చింది గంగవ్వ. హౌస్ లో కూరగాయల గురించి గొడవపడుతున్నారు అందుకే మందులు కొట్టని, కూరగాయలు హౌస్ లోకి తీసుకొని వెళ్ళాలని తెచ్చినా అని గంగవ్వ స్టేజ్ మీద చెప్పింది. ఆ తర్వాత గంగవ్వ కోసం అఖిల్ సార్థక్ పంపిన వీడియోని ప్లే చేసి చూపించాడు నాగార్జున. గంగవ్వ నువు చాలా బాగా ఎంటర్‌టైన్మెంట్ చేస్తావ్.. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది అప్పుడు.. మళ్ళీ ఇప్పుడు నువ్వు హౌస్ లోకి వెళ్తున్నావ్ బాగా ఆడు అని అఖిల్ సార్థక్ చెప్పాడు. ఆ తర్వాత గంగవ్వ ని డోర్ వరకు నాగార్జున స్వయంగా తీసుకొని వెళ్ళాడు. హౌస్ లోకి వెళ్ళాక పాత కంటెస్టెంట్స్ కి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ కి టాస్క్ ఉంటుంది. ఒకవైపు విష్ణు ప్రియ, సీతలు రాగా.. మరోవైపు అవినాష్, గంగవ్వలు వచ్చి ఆడతారు. గంగవ్వ, అవినాష్ లు విన్ అయి ఇమ్మ్యూనిటి స్టార్ సాధిస్తారు. గంగవ్వ హౌస్ లోకి వెళ్ళిన మొదటి రోజే యూత్ తో సమానంగా అడి గెలవడంతో వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు. గంగవ్వ టాస్క్ లో ఫాస్ట్ గా ఆడి.. పాత కంటెస్టెంట్స్ షాక్ ఇచ్చింది. హౌస్ లో ఇక ముందు టాస్క్ లలో ఎలా పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి మరి‌.  

పాత కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్!

  బిగ్ బాస్ సీజన్-8కి సంబంధించిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆదివారం నాటి ఎపిసోడ్ రీలోడ్ పేరుతో ఏడు గంటలకే మొదలైంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా హరితేజ, నయని పావని, రోహిణి, గంగవ్వ, గౌతమ్, టేస్టీ తేజా, అవినాష్, మెహబూబ్ ఈ ఎనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే గత ఐదు వారాలుగా గేమ్‌ని గమనించి మరీ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ ఎనిమిది మంది పాత కంటెస్టెంట్స్‌కి చెమటలు పట్టిస్తున్నారు. మొదటి రోజు ఏం జరిగిందో చూసేద్దాం.  హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ తమ టీమ్ కి వైల్డ్ రాయల్ అని పేరుపెట్టుకోగా.. పాత కంటెస్టెంట్స్ ఓజీ(వొరిజినల్ గ్యాంగ్ స్టర్స్) అని పేరు పెట్టుకున్నారు. ఇక హౌస్ లో‌ కొత్త కంటెస్టెంట్స్ కి పాత కంటెస్టెంట్స్ కి మధ్య మొత్తంగా నాలుగు టాస్క్ లు జరుగగా.. అందులో మూడు వైల్డ్ రాయల్స్ గెలిచారు. ఒక్కటి ఓజీ టీమ్ గెలిచింది. కొత్త వాళ్ళ గేమ్ తీరుకి పాత హౌస్ మేట్స్ మొహాలు వాడిపోయాయి.  బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్పటికే ఐదుగురు ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా.. మొదటి నాలుగు వారాల్లో ఎలిమినేట్ కాగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం ఔట్ అయ్యాడు. ఇక తాజాగా నైనిక ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఎలిమినేషన్‌కి ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి నాగార్జున హౌస్‌లో చెప్పారు. కానీ వాళ్లందిరినీ మడతెట్టేస్తాం అంటూ ఓజీ గ్యాంగ్ గట్టిగానే ధీమాగా చెప్పింది. కానీ వెళ్ళు వచ్చాక వీళ్ళ ఆట భయపడింది. " అన్న లేక సుఖాలు ఎక్కువయ్యాయి మీకు.. ఒక్కసారి అన్న వస్తే.. " అన్నట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేంతవరకు చప్పగా సాగిన బిగ్ బాస్ సీజన్-8.. ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ తో యమ క్రేజ్ తెచ్చుకుంటుంది.‌ ఈ వారం హౌస్ లో వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

దేవీ నవరాత్రులలో లాస్య మంజునాథ్ కొత్త ట్రెండ్!

బతుకమ్మ, దసరాలకి తెలంగాణాలో ఎంతో విశిష్టమైన ఆదరణ ఉంది. ఇక ఈ పండగ సమయంలో భక్తులు దేవీ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.‌ అందులో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. లాస్య కాస్త ఢిపరెంట్ గా దేవీ నవరాత్రులని జరుపుకుంటుంది. బుల్లితెర మీద లాస్య మంజునాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు లాస్య-రవి చేసిన అల్లరి గురించి అందరికి తెలిసిందే. ఆ తర్వాత పెళ్లి చేసుకొని బుల్లితెరకి విరామం ఇచ్చింది. లాస్య మంజునాథ్ కి ఇద్దరు మగపిల్లలు. పిల్లలు పుట్టాక పెద్దగా షోలలో కనిపించలేదు. ఈ సంవత్సరం బోనాల జాతరలో జీ తెలుగుకి వచ్చి హంగామా చేసింది.  ఇక లాస్య దేవీ నవరాత్రులు విశిష్టతని తెలుపుతూ రోజుకో గెటప్ తో కన్పిస్తుంది. మొదటి రోజు శైలపుత్రీ దేవీ. ఎల్లో కలర్ ఏదో పాజిటివిటి ఉంది. ఒక హ్యాపీ ఫీలింగ్ అని పసుపు రంగు చీరలో పోస్ట్ ని షేర్ చేసింది. ఇక రెండో రోజు- బ్రహ్మచారిణి దేవి. ఎంతో జీవంతో నిండి , ఆనందాన్ని వెదజల్లుతున్నట్టు ఉంది. గ్రీన్ కలర్ చీరలో పోస్ట్ ని షేర్ చేసింది. చెడుపై  మంచి సాధించిన విజయాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు , మన సమస్యలతో పోరాటం చేసి, కొత్త అవకాశాలు, ఒక ఫ్రెష్ స్టార్ట్ గురించి తెలియజేస్తుందని రాసుకొచ్చింది లాస్య.  ఇక మూడో రోజు చంద్రగంటా దేవీ.. గ్రే కలర్. మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంథ్.. రెండింటి కాంబినేషనే ఈ కలర్. మెంటల్లీ బాగా ప్లాన్ చేసుకుంటూ ఫిజికల్లీ వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ దుర్గా దేవీ రాక్షసులని ఎదుర్కొన్నట్టు ప్రాబ్లమ్ ఏదైనా పారిపోయేలా ముందుకెళ్ళడమే అని లాస్య రాసుకొచ్చింది. ఇక మట్టిలో పనిచేస్తూ కొన్ని ఫోటోలని షేర్ చేసింది. ఇలా దేవీ నవరాత్రులలో లాస్య చేస్తున్న ఈ తరహా వివరణ బాగుంది. లాస్య చేస్తున్న కొత్త ట్రెండ్ కి ఇన్ స్టాగ్రామ్ లో ఆదరణ లభిస్తోంది.

నాగార్జునకి బంపర్ ఆఫర్ ఇచ్చిన విష్ణుప్రియ!

బిగ్‌బాస్ అంటే ప్రేమలు, జంటలు, యవ్వారాలు మామూలుగా ఉండదు. గత సీజన్‌లలో నాలుగో వారమో, ఐదో వారమో మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్ మధ్య ప్రేమాయణాలు, ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లుగా బయటపడేవారు. అయితే ఈసారి అలాంటి వ్యవహారాలను ఫస్ట్ వీక్‌లోనే మొదలెట్టేసినట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే స్టార్ యాంకర్ విష్ణుప్రియ- పృథ్వీరాజ్ మధ్య ప్రేమను పుట్టించే ప్రయత్నాలు స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ కంటెస్టెంట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టాడు నాగార్జున.. హౌస్ లో ప్రతీ ఒక్కరు రెండు అద్దాలు(మిర్రర్ బోర్డ్) తీస్కోండి. వాటిలో వారి ఫేస్ చూపించి జెలస్, సెల్ఫిష్, అన్నోయింగ్ బోర్డ్ లు ఇవ్వాలని చెప్పాడు. ఇక నిఖిల్ కి మిర్రర్ బోర్డ్ చూపించి.. చీఫ్ నుండి దిగిపోయాక నా కన్నా చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడంటూ విష్ణుప్రియ చెప్పింది. ఛీఫ్ నుండి దిగిపోయాకనా లేక సోనియా వెళ్ళిపోయాకనా అని నాగార్జున అనగానే.. విష్ణుప్రియతో పాటు హౌస్ అంతా నవ్వేసారు. ఇక విష్ణుప్రియని ఎక్కడి వస్తావని అడుగగా.. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని విష్ణుప్రియ అంటుంది. తెలుసుగా నా దగ్గరకి ఎప్పుడూ వస్తారో అని నాగార్జున అంటాడు. ఎలిమినేషన్ అయి బయటకొస్తే ఇక్కడ స్టేజ్ మీదకి రావచ్చని నాగార్జున ఇండైరెక్ట్ గా చెప్తాడు. ఇక విష్ణుప్రియ మనసులో మన హోస్ట్ నాగార్జున అంటే క్రష్ అని అర్థమవుతుంది. హౌస్ లో పృథ్వీతో విష్ణుప్రియ చేసే లవ్ ట్రాక్ ఎంతలా సాగుతుందో చూడాలి.  నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న నబీల్, నిఖిల్ సేవ్ అయ్యారు. ఇంకా మణికంఠ, విష్ణుప్రియ, నైనిక ఇంకా నామినేషన్ లో ఉన్నారు. వీరిలో నైనిక ఎలిమినేషన్ అనే వార్తలొచ్చాయి. మరి నైనికే ఎలిమినేషన్ అవుతుందా లేక బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడా చూడాలి మరి.

Eto Vellipoindi Manasu : ఆయిల్ పోసి విడగొట్టాలనుకున్న అత్త.. కొడుకు కనిపెట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్  శనివారం నాటి ఎపిసోడ్ -219 లో.....సందీప్ రౌడీతో ఫోన్ మాట్లాడతాడు. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకోమని సందీప్ అనగానే.. అవునా అయితే ఒక వీడియో పంపిస్తున్నాను చూడమని రౌడీ అంటాడు. అందులో రౌడీ తో సందీప్ మాట్లాడిన మాటలు ఉంటాయి. అది చూసి రౌడీకి సందీప్ ఫోన్ చేస్తాడు. ఆ వీడియో మీ అన్నయ్యకి పంపాలా అని రౌడీ అనగానే.. వద్దు నీకు ఎంత డబ్బు కావాలో ఇస్తానని సందీప్ అంటాడు. అయితే నేను చెప్పిన ప్లేస్ కి మనీ తీసుకొని రా అని రౌడీ అంటాడు. సందీప్ ఫోన్ మాట్లాడడం రామలక్ష్మి వింటుంది. ఖచ్చితంగా అదేంటో కనుక్కోవాలని రామలక్ష్మి అనుకుంటుంది.  మాణిక్యానికి రామలక్ష్మి ఫోన్ చేసి ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి చెప్పాలనుకుంటుంది.‌లేదు అవన్నీ టెన్షన్ అయనకి ఎందుకని మళ్ళీ వెనక్కి వెళ్తుంది. కిచెన్ లోకి వెళ్లి రామలక్ష్మి పాలు పోసి అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి సీతాకాంత్ కి ఇస్తుంది. అవి తాగి సీతాకాంత్ పడుకుంటాడు. సారీ అండి అని రామలక్ష్మి ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మాణిక్యం దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది. ఇద్దరు కలిసి రౌడీ ని చూస్తారు. అప్పుడే సందీప్ వచ్చి రౌడీకీ డబ్బులు ఇవ్వడం ఇద్దరు చూస్తారు. సందీప్ వెళ్ళిపోయాక రౌడీని పట్టుకొని తమతో పాటు తీసుకొని వస్తుంటే.. ఇంకా కొందరు రౌడీ లు ఎటాక్ చేస్తారు. మాణిక్యం అందరిని కొడుతాడు. రౌడీ ని కార్ లో ఎక్కించుకొని వెళ్తుంటే.. వారిని రౌడీలు వెంబడిస్తారు.  ఆ తర్వాత రౌడీలని డైవర్ట్ చెయ్యడానికి రామలక్ష్మి ఒక దగ్గర ఆపి ఇక్కడ దాక్కోండి.. వాడితో నిజం చెప్పించి వీడియో తీసి పంపు.. నేను ఎప్పుడు తీసుకొని రమ్మంటే అప్పుడు రా అని రామలక్ష్మి వాళ్ళని దింపి వెళ్తుంది. మరొకవైపు సీతాకాంత్, రామలక్ష్మి విడిపోవాలని సీతాకాంత్ బెడ్ పక్కన శ్రీలత, శ్రీవల్లి ఆయిల్ పోస్తారు. సీతాకాంత్ కి జ్యూస్ ఇచ్చి లేపుతారు.. సీతాకాంత్ లేచి వస్తుంటే జారీ పడిపోతాడు. అదేంటి ఇక్కడ ఆయిల్ ఎవరు పోశారు. అసలు రామాలక్ష్మి ఎక్కడ కన్పించడం లేదని శ్రీలత అంటుంది. దాంతో నేను ఎక్కడికి వెళ్ళకని రామలక్ష్మి ఇచ్చిన మాటని సీతాకాంత్ గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆదిత్య ఓంకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చిన బిగ్ బాస్.. ఎంతంటే!

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడమంటే కంటెస్టెంట్స్ కి కాసుల పంట అందినట్టే.. హౌస్ లో ఎన్ని వారాలుంటే అంత ఖజానా జేబులో వేసుకోవచ్చు.  బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే అయిదు వారాలు పూర్తి చేసుకుంది. అందులో మొదటగా బెజవాడ బేబక్క, రెండో కంటెస్టెంట్ గా శేఖర్ బాషా, మూడో కంటెస్టెంట్ గా అభయ్ నవీన్, నాల్గవ కంటెస్టెంట్ గా సోనియా ఆకుల ఎలిమినేషన్ అయ్యారు. ఇక అయిదో వారం మిస్టర్ కూల్ ' ఆదిత్య ఓం' (Aditya Om) ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఎవరికి సపోర్ట్ చేయకుండా అందరికి నచ్చేలా ఉంటూ.. డీసెంట్ కంటెస్టెంట్ అని ముద్ర వేసుకున్న మంచోడు ఆదిత్య ఓం. అయితే హౌస్ లో కన్నడ కుట్టీలు యష్మీ, ప్రేరణ చేసిన నామినేషన్ అతని పెద్ద మైనస్ గా మారింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ గా బయటకొచ్చాడు. ఇక హౌస్ లో అతనికి జీరో హేటర్స్ ఉన్నారు.  ఆదిత్య ఓం మొత్తం నాలుగున్నర వారాలపాటు హౌస్ లో ఉన్నాడు. ఆదిత్య ఓం కి బిగ్ బాస్ నిర్వాహకులు బాగానే ఆఫర్ చేశారట. వారానికి రూ.3 లక్షల చొప్పున నాలుగున్నర వారాలకు గానూ దాదాపు రూ.14 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది.

Karthika Deepam 2 : ఆ సెల్ఫీ చూసి షాకైన జ్యోత్స్న.. దీపకి ఇక దేత్తడే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -168 లో...కాశీ, స్వప్న ఇద్దరు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. దాంతో కోపంగా కావేరిని శ్రీధర్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్తాడు. స్వప్న అక్షింతలు తీసుకొని కావేరి దగ్గరికి.. వచ్చి నన్ను ఆశీర్వదించు అని అనగానే నేను ఒక్క దాన్ని కాదు. ఇద్దరమని కావేరి అనగానే.. అవసరం లేదని స్వప్న అంటుంది. అప్పుడే దీప వస్తుంది. మీ కూతురు ఏదైనా తప్పు చేస్తే మీరే క్షమించాలని దీప అంటుంది. శ్రీధర్ పిలవడంతో కావేరి వెళ్లిపోతుంది. స్వప్న ని తీసుకొని దీప లోపలికి వస్తుంది. ఇక వెళ్తామని కార్తీక్ అంటాడు. ఆగండి బావ.. అందరం ఒక సెల్ఫీ దిగుదామంటూ కాశీ ఫోటో తీస్తాడు. ఆ తర్వాత కార్తీక్ వాళ్ళు వెళ్ళిపోతారు. నానమ్మ రమ్మంటే రాలేదు‌‌.‌‌ ఇప్పుడు ఈ సెల్ఫీ పంపిస్తానని పారిజాతానికి కాశీ పంపిస్తాడు. ఈ కాశీ గాడు ఏదో పంపాడు.. తిట్టానని ఏడుస్తూ ఫోటో పంపినట్టున్నాడని ఓపెన్ చేస్తుంది. కాశీ పంపిన ఫోటో చూసి పారిజాతం షాక్ అవుతుంది. కాంచన, కార్తీక్ లు వెళ్లడమేంటని అనుకుంటుంది. అప్పుడే జ్యోష్న వచ్చి.. చూపించమని అంటుంది. పారిజాతం భయపడుతూనే ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. వీళ్లేంటి అక్కడికి వెళ్లారని జ్యోత్స్న ఆవేశపడుతుంది. ముందు ఆ దీపని అనాలి.. రానియ్ ఆ దీప అని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు స్వప్న చేసిన అవమానం.. గుర్తుచేసుకొని శ్రీధర్ డ్రింక్ చేస్తాడు. అక్కడ జరిగింది గుర్తుచేసుకుంటాడు. కోపంగా గ్లాస్ పగులగొడతాడు. కావేరి వచ్చి ఇంకా అదే ఆలోచిస్తున్నారా అంటూ ఇంకా శ్రీధర్ కి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. కూతురు అల్లుడిని ఇంటికి తీసుకొని రావాలని చెప్తుంది. దాంతో శ్రీధర్ కి ఇంకా కోపం వస్తుంది. మరోవైపు వంట చేశాను అమ్మ.. ఇక వెళ్తాను థాంక్స్ అమ్మ.. స్వప్న దగ్గరికి వచ్చినందుకని దీప చెప్తుంది. కార్తీక్ నువ్వు వెళ్లి దీపని దింపిరా అని అనగానే.. ఇద్దరు బయలుదేర్తారు. మీ అమ్మ గారు ఇప్పుడు ఇప్పుడే బాధని మర్చిపోతున్నారు.. ఆవిడ పుట్టింటికి దగ్గర అయ్యే ప్రయత్నం చెయ్యండి. అది మీ పెళ్లితోనే జరుగుతుందని దీప అంటుంది. రోజు వెళ్లి అడగలేను.. పెళ్లి అనేది కలిసాక జరుగుతుంది. పెళ్లి ద్వారా కలవకూడదని కార్తీక్ అంటాడు. మరొకవైపు శౌర్య ఆడుకుంటుంటే నర్సింహా ఇంటి బయట ఉంటాడు. శౌర్యని ఎత్తుకొని వెళ్లి దీపని రప్పించాలనుకొని రిమోట్ కార్ ని శౌర్య ముందుకు పంపిస్తాడు. అది చూస్తూ శౌర్యా బయటకు వస్తుంది. అప్పుడే కార్తీక్, దీప లు వస్తారు. కార్తీక్ తో శౌర్య మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మణికంఠని కార్నర్ చేసిన హౌస్ మేట్స్.. టిష్యూ ఇచ్చి వాడుకోమన్న నాగార్జున!

బిగ్ బాస్ సీజన్- 8 లో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూసే వీకెండ్ రానే వచ్చింది. ఇక ఈ వారం కంటెస్టెంట్స్ తో నాగార్జున కొంచెం కూల్ గానే మాట్లాడాడు. మొదటగా మెగా చీఫ్ నబీల్ ని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత పృథ్వీని పొగిడాడు. నబీల్ కి పృథ్వీ చేత గోల్డెన్ బ్యాండ్ పెట్టించాడు. మణికంఠని యాక్షన్ రూమ్ కి పిలిచి.. ఇక నీకు టైమ్ ఇస్తున్నా ఎంత ఏడుస్తావో ఏడువు టిష్యూని వాడుకోమని చెప్తాడు. నువ్వు అనుకున్నట్టు నీకు ఫుడ్ ప్రియ దగ్గర నుండి రాలేదని అనగానే మణికంఠ ఏడుస్తాడు. కానీ ప్రియ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. నువు ఇంకొకసారి ఏడవొద్దని కూల్ గా వార్నింగ్ ఇస్తాడు నాగార్జున. ఆ టిష్యూ రోల్ నీ దగ్గర పెట్టుకో.‌. నువ్వు ఎప్పుడైనా ఏడుపు వస్తే అది చూసి నువ్వు కంట్రోల్ చేసుకోవాలని నాగార్జున చెప్తాడు. ఆ తర్వాత హౌస్ లో ఎవరు ఎలాంటి వాళ్ళో మిర్రర్ బోర్డుతో చెప్పాలని అంటాడు. అందరు కూడా మణికంఠని సెల్ఫిష్, ఇర్రిటేట్ అంటూ మిర్రర్ బోర్డు పెడుతుంటే.. మళ్ళీ లోగా ఫీల్ అవుతాడు మణికంఠ. ఇక తన వంతు వచ్చేసరికి.. నాకు ఎవరు లేరని మణికంఠ చెప్పగానే నాగార్జున సీరియస్ గా.. ఇప్పుడు మళ్ళీ కార్నర్ చేసారని ఫీల్ అవుతున్నావా అని నాగార్జున అనగానే.. లేదని అంటూనే మణికంఠ ఏడుస్తుంటాడు. మళ్ళీ యాక్షన్ రూమ్ లో చెప్పింది గుర్తు చేసి.. నీ గేమ్ నువ్వు ఆడు అనగానే మణికంఠ నార్మల్ అయి గేమ్ కంటిన్యూ చేస్తాడు. నైనిక నీ గేమ్ మొదటి వారంలో తప్ప.. మరెప్పుడు కనపడలేదని‌ నాగ్ చెప్తాడు. ఇక పృథ్వీని చాలా కోపం కంట్రోల్ చేసుకున్నావ్.. గేమ్ ఇంప్రూవ్ అయిందని నాగ్ మెచ్చుకుంటాడు. ఇలా ఈ వీకెండ్ నాగార్జున మాస్ లా కాకుండా క్లాస్ లా డీల్ చేసాడు. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు నామినేషన్ అవ్వగా.. మొదటగా నిఖిల్ ని, ఆ తర్వాత నబిల్ ని సేవ్ చేశాడు. ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓమ్ ని స్టేజ్ పైకి పిలిచి తన ఏవీ(AV) చూపింవాడు నాగ్ మామ. ఆదిత్య ఓం హౌస్ మేట్స్ కి కొన్ని సలహాలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు.