Eto Vellipoyindhi Manasu : యాగం ఆపడానికి దుష్టశక్తులు ప్రయత్నం.. మరి అది జరిగేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 204 లో.....యాగం ఆపాలని శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. శ్రీలత యాగం పనులు చేస్తుంటే.. మాణిక్యం వద్దని అనడం తో మాణిక్యాన్ని రెచ్చగొట్టి యాగం ఆపాలని శ్రీవల్లి అనుకుంటుంది. మాణిక్యంతో మా అత్తయ్యతో అలా అంటావా అని అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. చూడండి బావ గారు అత్తయ్యని అలా అన్నాడంటూ చెప్తుంది.. నేను అలా అనలేదని మాణిక్యం అంటాడు. అప్పుడే స్వామిజీ కలుగుజేసుకుని అలా అంటే తప్పేంటి ఇది పవిత్రమైంది.. అందుకే అందరు ముట్టుకోకుడదు అన్నాడని అనగానే.. అందరు సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత ఇంకా స్వామి రాలేదని పెద్దాయన అంటాడు. సీతాకాంత్ స్వామికి ఫోన్ చేస్తుంటే కలవదు. తను రాడని తెలిస్తే గుండె ఆగిపోతుందేమోనని శ్రీవల్లి అనుకుంటుంది. ఇక ఇది ఎలా చేస్తావ్ రామలక్ష్మి అని శ్రీలత అనుకుంటుంది. ఆ తర్వాత ఇంకో స్వామి ఫోన్ మాట్లాడుతు.. స్వామికి ఆక్సిడెంట్ అయిందా అంటూ షాక్ అవుతాడు. దాంతో అందరు ఇక యాగం ఆగినట్లేనని టెన్షన్ పడతారు. శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు హ్యాపీ గా ఫీల్ అవుతారు.ఇక అంతా దేవుడు దయ అంటూ రామలక్ష్మి సీతాకాంత్ లు మొక్కుకుంటారు. అప్పుడే స్వామి వస్తుంటాడు. అతన్ని చూసి హ్యాపీ గా ఫీల్ అవుతారు. మీకు ఆక్సిడెంట్ అయిందట అని సీతాకాంత్ అంటాడు. చెప్పాను కదా దుష్టశక్తులు యాగం ఆపాలని చూస్తారని అని స్వామి అంటాడు.ఆ తర్వాత యాగాన్ని మొదలుపెడతారు. ఇది నిష్టతో చెయ్యాలి మధ్యలో నీళ్లు కూడా తాగకూడదని స్వామి చెప్తాడు. ఇప్పుడే ఏదైనా తాగండి అని స్వామి చెప్పగానే నేను తీసుకొని వస్తానంటూ సుజాత వెళ్తుంటే నేను వస్తాను అని శ్రీవల్లి వెళ్తుంది. సుజాత కొబ్బరి నీళ్లు గ్లాస్ లో పోస్తుంది. అందులో శ్రీవల్లి మత్తు టాబ్లెట్ కలుపుతుంది. ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తారు. రామలక్ష్మి ఆ వాటర్ తాగుతుంది. ఆ తర్వాత యాగం మొదలవుతుంది. పంతులు మంత్రాలు చదువుతుంటాడు. ఆ తర్వాత మాణిక్యం పూజ సామాగ్రి తెస్తుంటే కింద పడిపోతాడు. తాగి వస్తే ఇలాగే ఉంటుందంటూ శ్రీవల్లి గొడవ చేయగా.. తాగి రాలేదని మాణిక్యం అంటాడు. తాగి రాలేదు, తాగి వస్తే ఎలా ఉంటాడు నాకు తెలుసని సీతాకంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి మత్తుగా అనిపిస్తుంది. మత్తు పని చేస్తున్నట్లు ఉందని శ్రీవల్లికి శ్రీవల్లి చెప్తుంది. రామలక్ష్మి మత్తులో సీతాకాంత్ పై పడిపోతుంది. ఇదంతా యాగం ఆగడానికి దుష్టశక్తలు చేస్తుంది. మీరు వేదమంత్రాలూ చదవండి ఆపకండి అని స్వామి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రభావతి 2.0 ఎంట్రీ

  బిగ్ బాస్ హౌస్ లో‌ మూడవ వారం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు జోరుగా సాగుతున్నాయి. ‌ఒక్కో కంటెస్టెంట్ భావోద్వేగాలకి లోనవుతున్నారు. తాజాగా వదిలిన ప్రోమోలో బిగ్ బాస్ ఓ కోడిని సెటప్ చేసి , అందులో ఎగ్స్ ఉంచి, కంటెస్టెంట్స్ తీసుకోమని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.  ' బిగ్ బాస్ హౌస్ లో ప్రభావతి (prabavathi 2.0) ' అనే టైటిల్ తో వదిలిన ఈ ప్రోమో ఆసక్తికరంగా మారింది. ఇందులో ఆదిత్య ఓం, పృథ్వీ ఇద్దరు ఫీజికల్ అయినట్టుగా తెలుస్తుంది. విష్ణుప్రియ, యష్మీలకు గాయాలు జరిగినట్టుగా వారి ఆర్గుమెంట్స్ బట్టి తెలుస్తుంది‌. నిన్న జరిగిన టాస్క్ లో అభి, నిఖిల్, సోనియా, యష్మీల మధ్య గొడవ జరుగగా..‌ ఇప్పుడు ఆదిత్య ఓం, పృథ్వీ, యష్మీ ల మధ్య గొడవ గట్టిగానే జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఎవరెవరి మధ్య గొడవ జరిగిందనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే ''ప్రభావతి 2.0 ' టాస్క్ బిగ్ బాస్ అనే టైటిల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ ప్రోమోని మీరు చూసారా? చూస్తే కామెంట్ చేయండి.  

Shekhar basha: ఇంటికెళ్తే నా భార్య ఎందుకొచ్చావ్ వెళ్ళిపో అంది!

  బిగ్ బాస్ సీజన్-8 లో తన ఆణిముత్యాలతో నెటిజన్లకి కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్ శేఖర్ బాషా ( Shekhar baasha). బిగ్ బాస్ హౌస్ లో నాన్ సింక్ పంచ్ లతో క్రేజ్ ని తెచ్చుకున్నాడు..  బెస్ట్ వ్యూ అంటే ' ఐ లవ్ య్యూ', చిరాకు అంటే ఛీ రాకు అని ఇలా శేఖర్ బాషా చెప్పిన ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్ గా నిలిచాయి. మరికొన్ని రోజులు హౌస్ లో ఉంటే  ఇంకా క్రేజ్ వచ్చేది కానీ రెండో వారం హౌస్ మేట్స్ చేత ఎలిమినేట్ అయ్యాడు.  హౌస్ నుండి బయటకొచ్చాక తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ బాషా కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు. తన భార్య డెలివరీ ముందు మూడు రోజుల వరకు తనకి ఒకటే టెన్షన్ అని , అందుకే ఎలిమినేషన్ అయి బయటకొచ్చానని శేఖర్ బాషా చెప్పాడు. ఇక ఇంటికెళ్తే నా భార్య ఎందుకొచ్చావ్ వెళ్ళిపోమని అంది. కనీసం నువ్వు టాప్-5 లో ఉంటావని అనుకున్నా కానీ ఇలా చేశావేంటని అంది. నా బాబుని ఎత్తుకున్న ఆ సంతోషం చాలు అని అనుకున్నా కానీ నేను ఎలిమినేట్ అయ్యానని తెలిసి తను ఏడ్చేసిందంట అని శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. వాళ్ళెలా అనుకున్నా , బిడ్డని ఎత్తుకోవాలనుకున్నాను.. తన పక్కనున్నాను.. హ్యాపీ. బిగ్ బాస్ కి వెళ్ళడం కోసమే ఇలా రాజ్ తరుణ్ ఇష్యూలో దూరవని కొంతమంది అన్నారు నిజమేనా అని అడుగగా.. అదేం లేదు. నేను వెళ్తానో లేదో అనే క్లారిటీ కూడా లేదు. డెలివరీ దగ్గర్లో ఉంది వెళ్ళాలా వద్దా అని నా భార్యని అడిగినప్పుడు.. తను ఓ రోజంతా ఆలొచించుకొని వెళ్ళమని చెప్పింది. వారం రోజుల ముందు వరకు అసలు తెలియదు.. బిగ్ బాస్ టీమ్ చేసిన ఇంటర్వ్యూలో.. నా భార్య డెలివరీకి వన్ డే పర్మిషన్ కావలి లేదా చూపించాలి అన్నాను‌‌.. వాళ్ళు ట్రై చేస్తామని చెప్పారంటు శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. హౌస్ లో నీకు ఫుడ్ ఎలా ఉండేదని అడుగగా.. అందరు నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు.. నేను ఒక్కడినే వెజిటేరియన్.‌ వాళ్ళు ఎగ్ బుజ్జి చేసుకుంటే నాకు సపరేట్ గా చేయమని చెప్పలేక ఒక్కో రోజు క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు తినేవాడిని. విటమిన్ పౌడర్ ఉండేది‌ కాబట్టి సరిపోయేది కానీ బిగ్ బాస్ వాళ్ళు అవి కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుండి డౌన్ అయిపోయానని శేఖర్ బాషా అన్నాడు. మరి ఫుడ్ లేకుండా ఎలా ఉండేదని అడుగగా.. అందరికి ఎగ్ ఉంది కానీ నాకే సిగ్గు లేదంటూ శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలని షేర్ చేసుకున్నాడు.  

ఫిదా మూవీలో సాయి పల్లవి కి డబ్బింగ్...ఆ బాడ్కోని నేనే 

  జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. శివాజీ రావడమేమో కానీ కమెడియన్స్ లో నిద్రపోతున్న జోష్ ని నిద్రలేపాడు. దాంతో వాళ్ళు కామెడీ స్కిట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఈ షోలో తాగుబోతు రమేష్ తనను తాను తిట్టుకున్నాడు. ఎందుకంటే సాయి పల్లవి అంటే తనకు ఎంతో ఇష్టమట. ఎంత అందంగా ఉంటది..ఫిదా సినిమాలో "బాడ్కో బలిసిందారా" అంటది కదా ఆ బాడ్కోని నేనే" అంటూ తెగ సంబరపడిపోతూ ఏంటేంటో వాగేశాడు. ఈ స్కిట్ ఇలా ఉండబోతుంటే బులెట్ భాస్కర్- రష్మీ కలిసి ఒక స్కిట్ వేశారు "బయట వర్షం వస్తుంది జాగ్రత్త" అంటాడు భాస్కర్. "అయ్యో నాకు జలుబు, జ్వరం వస్తుందనగా" అని ఆతృతగా అడుగుతుంది. "కాదమ్మా " అని బులెట్ భాస్కర్ చెప్పగానే "మేకప్ పోతుందేమో అని" అంటూ ఆ వాక్యాన్ని జడ్జ్ శివాజీ ఫిల్ చేసాడు. దాంతో రష్మీ ఫీలైపోయింది. ఇక శివాజీ షో స్టార్టింగ్ లో రాకెట్ రాఘవను అస్సలు మాట్లాడనివ్వకుండా చాలా హడావిడి చేసాడు. దాంతో రాఘవా పాపం చాలా ఫీలైపోయాడు. ఇక ఈ షోకి హీరోయిన్ ఫారియా, శ్రీ సింహ వచ్చారు. వాళ్ళ మధ్యలో నిలబడి డాన్స్ చేసేసరికి శివాజీ గట్టిగా ఒక కామెంట్ చేసాడు. వాళ్ళ మధ్య నువ్వెంత పొట్టిగా ఉన్నవో తెలుసా అన్నాడు.

జానీ మాస్టర్ వివాదంపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందన...

  కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని.. అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్న యువతి ఫిర్యాదు చేసిన  సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం అందరిని ఆలోచింపచేసేలా చేస్తుంది. ఈ విషయంలో చిన్మయి శ్రీపాద తన స్పందనను ట్వీట్ చేసింది. తానూ గమనించిన విషయాలను కూడా చెప్పింది. "జానీ  ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నారనేది ముఖ్యం కాదు. రేపిస్టులు, నేరస్థులు ఈ దేశంలో ప్రతి పార్టీలోనూ ఉన్నారు. అతను ఎవరి ఫ్యాన్ అన్న విషయం కూడా ముఖ్యం కాదు. నేషనల్ అవార్డు విన్నరా కాదా అన్నది కూడా ఇక్కడ ముఖ్యం కాదు. ఎవరి మూవీస్ కి వర్క్ చేసాడు ఎంత పెద్ద స్టార్స్ కి వర్క్ చేసాడు అన్నది కూడా పక్కన పెట్టాలి. బాధితురాలు పోలీస్ దగ్గరకు వెళ్లి కేసు పెట్టిన వెంటనే రియాక్ట్ అయ్యారా లేదా అన్నదే ముఖ్యం. కానీ మన దేశంలోని వ్యవస్థ ఎంత అద్వాన్నంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఆమె ఎవరితో ఎలా బాధపడింది అన్నదే ఇంపార్టెంట్ ఆమె సపోర్ట్ చేసే సిస్టం ఉందా లేదా అన్నదే చూడాలి. బాధితురాలు తన బాధను ఎవరికీ చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టే పోలీసులను ఆశ్రయిస్తుంది. అప్పుడు అసలు విషయాన్ని విచారించాలి. కానీ అదే జరగడంలేదు. దాంతో బాధితులు సైలెంట్ గా ఉండిపోవాల్సి వస్తోంది. కానీ ఇక్కడ మైనర్ గా ఉన్నప్పటినుంచి ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఫైట్ చేస్తోంది ఈ అమ్మాయి అదీ ఇంత శక్తివంతమైన వ్యక్తుల మీద. ఈరోజున అమ్మాయిలు ప్రతీ రంగంలో ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వారికి మీడియా కూడా అసలు విషయన్ని ఫోకస్ చేసేలా సపోర్ట్ చేయాలి అంతేకాని వాళ్ళను కించపరిచేలా చేయకూడదు. ఐనా అమ్మాయిలు కూడా లైంగిక వేధింపులకు గురయ్యాం అని చెప్పి ఇంట్లో కూర్చోనక్కర్లేదు. అవమానంతో అన్నిటికీ దూరం కావొద్దు. అవమానంతో సంబంధం లేని సమాజం కావాలంటే మనం ముందు భయపడడం మానేయాలి. అప్పుడే మన పిల్లలు సురక్షితంగా ఉంటారు.  

అవునా, నిజమా అతను గడ్డం నవీనా..

  గడ్డం నవీన్ ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులరైన నటుల్లో ఒకరు. నెత్తి మీద ఉండాల్సిన జుట్టు మొత్తం గడ్డంగా మారిపోయింది. అలా గుబురు గెడ్డంతో మంచి  ఎక్స్‌ప్రెషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తున్నాడు నవీన్. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు  ఇలా ఎన్నో పేర్లతో ఆయన్ని పిలుస్తారు. గడ్డం నవీన్ మూవీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే 26 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఐతే గడ్డం నవీన్ చాలా మూవీస్ లో చేశారు. ఐతే అప్పట్లో బాగా జుట్టు ఉండేది. ఇప్పుడు అసలు జుట్టే లేదు. దాంతో అప్పటి ఫోటో ఇప్పటి ఫోటో పక్కపక్కన పెడితే అవునా.. నిజమా గడ్డం నవీన అనకుండా మాత్రం ఉండలేము. అలాంటి కొన్ని పిక్స్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు నవీన్. తమ్ముడు, ఆది మూవీస్ లో ఆయన పిక్స్ చూసిన వాళ్ళు నోరెళ్లబెడుతున్నారు. ‘ప్రేమించేది ఎందుకమ్మా’ సినిమాకి దర్శకుడు సురేందర్ రెడ్డికి ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసాడు నవీన్. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసాడు నవీన్. ‘రామసక్కనోడు’, ‘ఆది’, ‘ఇష్టం’, ‘6 టీన్స్’, ‘ఇడియట్’, ‘బ్యాడ్ బాయ్స్’ సినిమాల్లో నటించడంతో పాటు విలన్ గ్యాంగ్స్‌లో కూడా ఒకరిగా నటించాడు నవీన్. 150 సినిమాలలో చేసిన నవీన్ ఇప్పుడు జబర్దస్త్ లోకి వచ్చి అలరిస్తున్నాడు.  

నిఖిల్ ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశాడా...హౌస్ లో పత్తాపారాలు

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ తర్వాత యష్మీకి నాగ మణికంఠకు మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. తను సారీ చెప్పినా యష్మీ పట్టించుకోవడం లేదు.‌ ఇక సోనియా, నిఖిల్, పృథ్వీల ట్రయాంగిల్ లవ్ ట్రాక్ సాగుతుంటే మరోవైపు కిర్రాక్ సీత ఫ్లర్టింగ్ గురించి నిఖిల్ అడిగింది. అదేంటో ఓసారి చూసేద్దాం. ఫుడ్ కోసం బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. మొదటి టాస్క్ 'ఫొటో పెట్టు ఆగే టట్టు'. దీని ప్రకారం కంటెండర్లు వారి చీఫ్ ఫొటోలను ఇచ్చిన స్లాట్స్‌లో వీలైనన్నీ ఎక్కువగా పెట్టాలి.. అలానే ఎవరు పీకకుండా చూసుకోవాలి. ఈ టాస్కు కోసం శక్తి (నిఖిల్) టీమ్ నుంచి పృథ్వీ.. కాంతార (అభయ్) టీమ్ నుంచి నబీల్ పోటీ పడ్డారు. సంచాలక్‌గా సీత ఉంది. ఇక ఎప్పటిలానే పృథ్వీ-నబీల్ ఇద్దరూ గేమ్‌లో ఫిజికల్ అయ్యారు. దాదాపు కొట్టుకునే వరకూ వెళ్లింది. దీంతో ఒకరినొకరు పట్టుకోవడానికి వీల్లేదు.. మీ ఫొటోస్‌ను మీరు డిఫెండ్ చేసుకోవచ్చంటూ బిగ్‌బాస్ అన్నాడు. కానీ పృథ్వీ పట్టుకోవడంతో డిస్ క్వాలిఫై అయి కాంతార టీమ్ గెలిచింది. ఇక తర్వాత మణికంఠ దగ్గరికెళ్లి నామినేషన్స్‌లో యష్మీ ఎందుకు హర్ట్ అయింది నిజం చెప్పరా.. నువ్వు ఫ్లర్ట్ చేశావా అంటూ నిఖిల్ అడిగాడు. దీనికి ఫ్లర్ట్ అని చెబుతుంది ఎవరు అది ఆలోచించు.. ఫ్లర్టేశ్వర్ చెబుతున్నాడంటూ సీత కౌంటర్ ఇచ్చింది. సరే నీతో మాట్లాడతాను.. నీతో కాకుండా ఇంకెవరితో నేను అలా మాట్లాడతాను చెప్పరా అంటూ నిఖిల్ అడిగాడు. సోనియా, యష్మీతో కూడా నువ్వు ఫ్లర్ట్ చేస్తావని సీత అనడంతో యష్మీతో సరిగా మాట్లాడనే మాట్లాడను.. ఇంక ఫ్లర్ట్ ఏం చేస్తానంటూ నిఖిల్ బదులిచ్చాడు. అయితే యష్మీని అడుగుదామా అంటూ విష్ణు మధ్యలో దూరడంతో యష్మీని పిలిచింది సీత. నిఖిల్ ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశాడా నీతో అంటూ యష్మీని సీత అడిగితే..లేదు కన్ను కొట్టేవాడు.. నేనూ కొట్టేదాన్నంటు కొంటె సమాధానం చెప్పింది యష్మీ. దీనికి నేను సీతకి తప్ప ఇంకెవరికి పాడలేదు పాట అలా నిఖిల్ అన్నాడు. సరే అయితే ఓకే.. అంటూ సీత సిగ్గు పడింది. అయితే నువ్వు హ్యాపీ కదా.. అంటూ యష్మీ అడిగితే ఊ కొట్టింది సీత. అయితే మీరు మీరు చూసుకోండి అని వెళ్ళిపోయింది. నువ్వే కదరా చెబుతా అన్నావంటూ నిఖిల్ అడిగితే నాకు వర్డ్స్ రావట్లేదు.. నీకు ఐడియా ఉంది కదా ఇది వేరేలాగా వెళ్లొచ్చు బయటికి.. అది బయటికెళ్లిన తర్వాత నువ్వు ఫేస్ చేయగలుగుతావా అంటూ సీత అడిగింది. తీసుకునేవాళ్లు ఎలాగైనా తీసుకుంటారు. ఇక్కడ మాట్లాడితే బయటికి ఎలా వెళ్తుందో నేను పట్టించుకోను.. ఎందుకంటే నీతో నేను ఏం మాట్లాడతాను.. వేరే వాళ్లతో ఏం మాట్లాడతాను అన్నది నాకు తెలుసంటూ నిఖిల్ అన్నాడు. నాతో నువ్వు ఏం మాట్లాడవులే అది వేరే విషయమంటూ సీత అంది. ఇలా ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. హౌస్ లో పత్తాపారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 

సోనియా బుగ్గపై ముద్దు పెట్టిన పృథ్వీ.. షాక్ లో నిఖిల్!

    బిగ్ బాస్ సీజన్-8 లో ప్రేమాయణం.. వినడానికి ఇది కామన్ గా ఉన్న.. అక్కడ ఉన్నది డిఫరెంట్ పర్సెన్స్. సోనియా, ‌నిఖిల్ మధ్య ఇష్క్ కాదల్ సాగుతుందని నిన్న జరిగి‌న టాస్క్ లో మరోసారి ఋజువైంది.  హౌస్ లోని కంటెస్టెంట్స్ తమ అహారం కోసం కొన్ని టాస్క్ లని ఆడుతున్నారు. ఇక బిగ్ బాస్ రోజుకో కొత్త టాస్క్ తో ఆడియన్స్ కి  ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నాడు. బిగ్‌బాస్ రెండో టాస్క్ "నత్తలా సాగకు.. ఒక్కటీ వదలకు". ఈ టాస్కు ప్రకారం ప్రతి టీమ్ నుంచి ఇద్దరు సభ్యులు నత్తల్లా పడుకొని వాళ్ళ ముందున్న క్యాబేజీలని తోస్తూ గీతవైపు చేర్చాలి.. ఇచ్చిన టైమ్‌లో ఎక్కువ ఎవరు చేరిస్తే వాళ్లే విన్నర్. ఈ గేమ్‌కి కాంతార టీమ్ నుంచి ప్రేరణ, ఆదిత్య రాగా శక్తి టీమ్ నుంచి సోనియా, నిఖిల్ పోటీ పడ్డారు. సంచాలక్‌గా మణికంఠ ఉన్నాడు. ఈ గేమ్‌లో నిఖిల్ వేగంగా క్యాబేజీని తోస్తూ ముందుకెళ్ళాడు. ఇక సోనియా కూడా బాగానే ఆడింది. దీంతో శక్తి టీమ్ విజేతలుగా నిలిచారు. అయితే విన్నర్‌గా ప్రకటించిన వెంటనే సోనియా బెడ్ రూమ్ లో ఉంటే పృథ్వీ తన దగ్గరికెళ్లి బుగ్గ మీద ఓ కిస్ ఇచ్చాడు. ఇదేందయ్యా ఇది.. నిన్న మొన్నటి దాకా పెద్దోడు, చిన్నోడు అని అంది.. ఇప్పుడేమో కిస్సులు, హగ్గులు.. ఇది బిగ్ బాస్ హౌసా లేక.. ఆ హౌసా అని ఆడియన్స్ మండిపడుతున్నారు. బాగా ఆడే నిఖిల్ ని గుప్పిట్లో పెట్టుకొని ‌సోనియా ఆడుతుంది. అయితే ఇప్పుడు సోనియా ఖాతాలో పృథ్వీ కూడా చేరాడు. ఈ కిస్ ని చూసిన ఆడియన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.  

Karthika Deepam2 : నా బావకి దగ్గర కావాలని చూస్తున్నావా.. దీప ఫైర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -152 లో.. అనసూయ, శౌర్యల దగ్గరికి పారిజాతం వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకండని అనసూయ అంటుంది. నా ఇష్టం.. ఇది నా ఇల్లు ఇష్టమైతే ఉండండి లేదా వెళ్లిపోండి అని పారిజాతం అంటుంది. అప్పుడే దీప వస్తుంది. కార్తీక్ కీ ఎలా వుంది నన్ను తీసుకొని రమ్మన్నాడా అని దీపని శౌర్య అడుగుతుంది. ఆ నువ్వు పెద్ద విఐపివి మరి సొంత మనవడు నన్నే వద్దన్నాడు.. నిన్ను రమ్మని అంటాడా అని పారిజాతం అంటుంది. అప్పుడే దీపకి కాంచన ఫోన్ చేసి.. శౌర్యని తీసుకొని రా కార్తీక్ చూడాలి అంటున్నాడని చెప్తుంది. ఎవరు అమ్మ ఫోన్ లో అని శౌర్య అనగానే.. కాంచన అమ్మ.. కార్తీక్ బాబు నిన్ను చూడాలి అంటున్నాడంట తీసుకొని రమ్మని చెప్పిందని దీప అంటుంది. ఆ తర్వాత అనసూయ, దీపని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. చూసావా నేను విఐపినా అన్నావ్ కదా.. కార్తీక్ నన్ను పిలిచాడు.. నిన్ను పిలిచాడా అని పారిజాతానికి శౌర్య కౌంటర్ వేస్తుంది. మరొకవైపు నాన్న గుడ్ న్యూస్ చెప్తాడని స్వప్న స్వీట్ తో రెడీగా ఉంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. ఒకసారి కాశీ కీ ఫోన్ చెయ్ అంటాడు. ఇప్పుడే కదా అక్కడ నుండి వచ్చావని స్వప్న అనగానే.. ఒక విషయం చెప్పాలని శ్రీధర్ అంటాడు. అలా అనగానే కాశీకి స్వప్న ఫోన్ చేస్తుంది. నువ్వు సిటీకీ వచ్చింది జాబ్ చెయ్యడానికి కదా.. అలా కాదని ప్రేమ అంటూ నా కూతురు వెంటపడితే మర్యాదగా ఉండదంటు కాశీకీ శ్రీధర్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత నేను చెప్పిన అబ్బాయిని కాదని గడప దాటినా వాడిని బ్రతకానివ్వనని చెప్పి.. స్వప్న ఫోన్ నా దగ్గర ఉంచుకుంటా అని శ్రీధర్ లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మ నీ ఫోన్ ఇవ్వు కాశీకి చేస్తానని స్వప్న అనగానే అలా ఫోన్ చేసిన వాడిని బ్రతకనివ్వను.. నేను బ్రతకనని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత శౌర్యని తీసుకొని దీప వస్తుంది. కార్తీక్ దగ్గరికి శౌర్య వెళ్లి సరదాగా మాట్లాడుతుంది. దీప కిచెన్ లో వంట చేస్తుంటే అప్పుడే జ్యోత్స్న వచ్చి.. మా బావకి దగ్గర కావాలని చూస్తున్నావా అనగానే దీప తన పైకి చెయ్ ఎత్తుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అడుగడుగునా యాగానికి అడ్డంకులే.. భార్యాభర్తలు కలిసి పూర్తిచేయగలరా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -203 లో...... రామలక్ష్మి మోకాళ్ళ పై ప్రదక్షిణలు చేస్తుంటే అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఇలా పీడ కల వచ్చింది అందుకే ఇలా చేస్తే మంచి జరుగుతుందని, ప్లీజ్ ఆపకండి అని రామలక్ష్మి అంటుంది. ఏం చేసిన మీ గురించి కదా బాబు ఆపకండి అని సుజాత అనగానే.. సరే అని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి ప్రదక్షిణ పూర్తి చేస్తుంది. శ్రీవల్లి తన ముందు కొబ్బరి చిప్పలు వేస్తుంది దానిపై కాలు వెయ్యడంతో గుచ్చుకొని రక్తం వస్తుంది. అది చూసి సీతాకాంత్ కంగారుపడుతూ పక్కన కూర్చొపెట్టి పసుపు పెడతాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు పంతులు దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి, ఇది కింద పడకుండా తీసుకొని వెళ్లి యాగం లో ఉపయోగించండి అని అంటాడు. దాంతో రామలక్ష్మి వాటిని జాగ్రత్తగా తీసుకొని వెళ్తుంది. ఎలాగైనా అవి పడేయాలని శ్రీవల్లి అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సీతాకాంత్ ఆపి కొంచెం మెల్లిగా రమ్మని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి నడుస్తుంటే తన కాలు అడ్డం పెడుతుంది. కాని శ్రీవల్లినే కింద పడిపోతుంది. ఆ తర్వాత రామాలక్ష్మిపై ఎలా ఎటాక్ చెయ్యాలి అని రౌడీ ఆలోచిస్తుంటే అప్పుడే తన పట్టి కింద పడిపోవడం రౌడీ చూస్తాడు. అది తన చేతిలోకి తీసుకుంటాడు ఆ తర్వాత రామలక్ష్మి తన పట్టి లేదని చూసుకొని ఎక్కడో పడిపోయింది చూస్తానని రామలక్ష్మి వెళ్తుంది. మరొకవైపు ఆగిపోయే యాగానికి నువు ఎందుకు హడావిడి చేస్తున్నావని శ్రీలతతో సందీప్ అంటాడు. ఇలా చేస్తే మనపై డౌట్ రాదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి స్వామి వేషమ్ లో ఉన్న రౌడీ దగ్గరికి వస్తుంది. తన పట్టి చూసి తీసుకుంటుంది. అప్పుడే రౌడీ కత్తి తియ్యబోతుంటే సీతాకాంత్ వాళ్లు వస్తారు. ఆ తర్వాత అందరు యాగం దగ్గర సకల వస్తారు. రామలక్ష్మి సీతాకాంత్ లు కలిసి రావడం చూసి వాళ్ళు వస్తున్నారని ఆశ్చర్యంగా శ్రీలత సందీప్ లు చూస్తారు. ఆ తర్వాత ఈ యాగాన్ని ఆపడానికి నేను ట్రై చేసాను కానీ వర్కవుట్ కాలేదని వాళ్ళతో శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత యాగం దగ్గర పనులు చేస్తుంటే.. నీ లాంటి చెడు ఆలోచనలున్న వాళ్లు ముట్టుకోవద్దని మాణిక్యం అంటాడు. అప్పుడే అందరు వస్తారు. మీ నాన్న అత్తయ్యని ఇలా అన్నాడని రామలక్ష్మికి శ్రీవల్లి చెప్తుంది. ఏదో తెలియక అన్నాడని సుజాత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఇంటి కోడలి కోసం దిగొచ్చిన దుగ్గిరాల కుటుంబం.. భార్యకి క్షమాపణ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -517 లో....కావ్య ఇంట్లో నుండి వెళ్లిపోయిన విషయం అపర్ణ కి తెలియడంతో షాక్ అవుతుంది. అసలు ఇంట్లో ఏం జరిగిందని మొత్తం అపర్ణకి చెప్తుంది స్వప్న. నా కోడలు పౌరుషం కలది.. ఆత్మభిమనo కలది.. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.. నేను వెళ్ళమంటెనే నన్ను వదిలేసి వెళ్ళిందని అపర్ణ అనగానే.. చూసారా ఇప్పుడైనా నిజం తెలుసుకున్నారా అని స్వప్న అంటుంది. నా కోడలు వెళ్లిపోవడం లో తప్పులేదు.. తన మనసు ముక్కలు చేసి పంపించారు. నీ మీద నాకు కోపం రావడం లేదని రుద్రాణిని అపర్ణ అంటుంది. ఎందుకంటే చెప్పిన వారి కంటే చెప్పుడు మాటలు విన్న వాళ్ళది తప్పు. నా కొడుకుది తప్పు. నువ్వు వెళ్లి క్షమించమని అడిగి నా కోడలిని తీసుకొని రా అని రాజ్ కి అపర్ణ చేప్తుంది. నేను వెళ్ళమనలేదు నేను తీసుకొని రాలేనని రాజ్ వెళ్ళిపోతాడు. నా కోడలిని నేనే తీసుకొని వస్తానని అపర్ణ వెళ్తుంటే.. నీ ఆరోగ్యం బాలేదు.. మేమ్ వెళ్లి తీసుకొని వస్తామని సీతారామయ్య ఇందిరాదేవిలు అంటారు. ఇప్పుడు ఆ కావ్య ఇంటికి వస్తే మనం ఇప్పటివరకు చేసింది మొత్తం ఫెయిల్ అవుతుందని రాహుల్ అంటాడు. కావ్య మనసు ముక్కలు అయింది రాదని రుద్రాణి అంటుంది. మరుసటి రోజు ఉదయం సీతారామయ్య, ఇందిరాదేవిలు కావ్య దగ్గరికి వస్తారు. ఇంటికి రమ్మని పిలుస్తారు నేను రాలేను. ఏ స్థానంలో రావాలి. భర్తకి తన మనసులో చోటు లేనప్పుడు నేను ఎలా వస్తానంటూ కావ్య డైరెక్ట్ గా చెప్తుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్ధమవుతుంది వాడే వచ్చి నిన్ను క్షమించమని అడుగుతాడంటూ సీతారామయ్య, ఇందిరాదేవిలు వెళ్లిపోతారు. తరువాయి భాగంలో కావ్య దగ్గరకి రాజ్  వెళ్లి రమ్మని పిలిస్తాడు. రానని కావ్య అనగానే రాకుంటే కాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మణికంఠ భార్య సంచలన పోస్ట్.. బిగ్ బాస్ నుంచి రాగానే విడాకులేనా?

  బిగ్ బాస్ సీజన్-8 లో ఫస్ట్ వీక్ లోనే సెంటిమెంట్ కార్డుతో ఫేమస్ అయ్యాడు నాగ మణికంఠ. ప్రేరణ తన నామినేషన్ లో మణికంఠని ఓపెన్ అవ్వమని చెప్పగా.. తను తన వివరాలు చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. అక్కడి నుండి అతడితో హౌస్ మేట్స్ కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే తాజాగా అతని భార్య చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అదేంటో ఓసారి చూసేద్దాం. మణికంఠ భార్య ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని షేర్ చేసింది. సమాజం కోసం వారితో కలిసి ఉండటం కంటే ఆ విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిదంటు ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. అలాగే భార్యా,భర్తలు తరచూ గొడవలు పడటం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్లకి కడుతూ ఆలోచింపజేసేలా ఒక ఫొటోని కూడా షేర్ చేసింది. చిన్నపిల్లల అంతరంగాన్ని వినండి.. ఇది చాలా పవర్ ఫుల్ ఇమేజ్. భార్యాభర్తలు గొడవ పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని శ్రీప్రియ ఈ పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లాంఛింగ్ డే నాడు.. మణికంఠ స్పెషల్ వీడియోలో తన భార్య.. తనని ఇండియాకి వెళ్లిపొమ్మన్నదని భార్య, కూతురు ఉన్నా ఒంటరివాడినయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. అది ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే హౌస్‌లోకి వచ్చిన తరువాత మాత్రం.. తన భార్య ప్రియ గురించి చాలా గొప్పగా చెప్పాడు‌. అతని వీడియో చూసి ఆమె గురించి చాలామంది నెగిటివ్‌గా అనుకున్నారు. కూతుర్ని తన దగ్గరే ఉంచుకుని భర్తని ఇండియాకి పొమ్మదనే మీనింగ్‌లో ఆ వీడియోను కట్ చేయడంతో.. అంతా నాగ మణికంఠ భార్య గురించి తప్పుగా అనుకున్నారు. కానీ హౌస్ లో ఓ సందర్భంలో నా వైఫ్ బంగారం అంటు చెప్పడంతో వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఏం లేవేమో అని అనుకున్నారంతా కానీ ఈ పోస్ట్ తో అది నిజమేనని స్పష్టమవుతుంది. మరి ఈ పోస్ట్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి‌.

సరేగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ త్వరలో

జీ తెలుగు ఇప్పుడొక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసింది. సరేగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ పేరుతో సరికొత్త షో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. హోస్ట్ గా శ్రీముఖి వచ్చింది. ఇక దుమ్ము బాబోయ్ దుమ్ము అంటున్నారు నెటిజన్స్. అలాగే జడ్జెస్ గా అందరికీ ఇష్టమైన కోటి, ఎస్పి. శైలజ, కాసర్ల శ్యామ్ వచ్చారు. ఈ సీజన్ జీ సరేగమప సరదాగా ఉండబోతోంది అని శైలజ అంటే ఈ సారి సీజన్ తీన్ మారే అంటూ శ్యామ్ అన్నారు.  ఇక మెంటార్స్ గా సింగర్స్  రేవంత్, రమ్య బెహరా కనిపించారు. అలాగే సింగర్ చిన్మయి, విజయ్ ఏసుదాస్ వంటి వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు.   జీ తెలుగు ఇప్పుడు సరేగమప సరి కొత్త సీజన్లో ని త్వరలో గ్రాండ్ గా లాంచ్ చేయబోతోంది.  దానితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా  ఉన్న ఎంతోమంది ప్రతిభావంతులైన సింగర్స్ ని ఈ షోలోకి తీసుకురాబోతోంది. ఈ సీజన్ కోసం ఆగష్టు ఎండింగ్ వరకు ఆడిషన్స్ కూడా నిర్వహించింది. జీ తెలుగు కూడా మిగతా ఛానెల్స్ కి తక్కువ కాదన్నట్టు ఎన్నో షోస్ ని అందిస్తోంది. సీరియల్స్, కామెడీ షోస్ అలాగే రియాలిటీ షోస్ అన్నీ ఆడియన్స్ ముందుకు తీసుకువస్తోంది. ఇక ఇప్పుడు సరేగమప కొత్త సీజన్ తో రాబోతోంది.  

ఫుడ్ డెలివరీ గర్ల్ పల్లవితో ....బేబక్క

బేబక్క ఒక అమ్మాయిని చూసి ఎక్సైట్ అయ్యింది. ఇంతకు ఎవరా అమ్మాయి..ఏమా కథా అంటారా..బేబక్క అంటే ఇప్పుడు ఊరు వాడా అంతా ఫేమస్ ఐపోయింది. ఆమె  ఎన్ని మూవీస్ లో చేసినా ఎంతగా యాంకరింగ్ చేసినా ఎన్ని రీల్స్ చేసినా రానంత ఫేమ్ ఒక్క వారం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చేసరికి పిచ్చ ఫేమస్ ఐపోయింది. ఐతే ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసింది బేబక్క. విషయమేంటయా అంటే బేబక్క ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఫుడ్ డెలివరీ చేయడం చూసిందట. ఇంకేముంది ...చాలా ఆనందపడిపోయింది. "హే అమ్మాయిని డెలివరీ చేస్తోంది. ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయి ఫుడ్ డెలివరీ చేయడం చూస్తున్నాను. నేను ఇప్పుడు నిన్ను ఫేమస్ చేస్తా చూడు అంటూ ఫుడ్ డెలివరీ గర్ల్ పల్లవితో ఒక రీల్ చేసింది. మేక్ సం నాయిస్ ఫర్ గర్ల్ పవర్" అంటూ చెప్పింది. ఐతే అందులో ఒక మాట మాత్రం ఫుల్ కామెడీ అనిపిస్తుంది. "ఫస్ట్ టైం ఒక అమ్మాయిని డెలివరీ చేయడం చూడలేదు" అంది ఆ మాట నిజంగా కామెడీ అనిపిస్తుంది. ఇక నెటిజన్స్ ఐతే అదే విషయాన్నీ కామెంట్స్ చేశారు " అమ్మాయిని డెలివరీ చేయలేదు బేబక్క..అమ్మాయి ఫుడ్ డెలివరీ చేసింది" అని కామెంట్స్ పెడుతున్నారు.  

Biggboss 8 Nominations: మూడో వారం నామినేషన్లో ఎవరున్నారంటే!

  బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారం నామినేషన్లకి 'ట్రాష్ బిన్' (చెత్త బుట్ట) థీమ్ పెట్టారు. ఈ ఇంట్లో ఉండేందుకు ఎవరు అనర్హులని మీరు భావిస్తారో ఆ వేస్ట్‌ను త్వరగా బయటికి పంపండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక చీఫ్‌లు అయిన కారణంగా అభయ్, నిఖిల్‌ను ఎవరు నామినేట్ చేయకూడదంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారు ఆ వ్యక్తిపై చెత్త పోసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. నామినేషన్ల ప్రక్రియను సీతతో స్టార్ట్ చేసింది. సీత ముందుగా యష్మీని నామినేట్ చేసింది. గేమ్స్‌లో డామినేటింగ్‌గా, చీఫ్‌గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నట్లు అనిపించిందంటు యష్మీని సీత నామినేట్ చేసింది. ఇక నువ్వు గెలవాలనే కసి నాకు నచ్చుతుంది.. కానీ ఎలాగైనా గెలవాలంటూ చేసే ప్రయత్నాలు నాకు నచ్చలేదు.. నీ అగ్రెషన్ నాకు అసలు నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది సీత. తర్వాత విష్ణుప్రియకి ఛాన్స్ రాగా ముందుగా ప్రేరణను నామినేట్ చేసింది. సాక్స్ టాస్కులో సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావంటూ చెప్పుకొచ్చింది. ఇక దీనికి ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయడంతో కాసేపు ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇక తన రెండో నామినేషన్ యష్మీకి వేసింది విష్ణుప్రియ. మీరు చీఫ్‌గా ఉన్నప్పుడు మీ టీమ్ గేమ్స్ ఫెయిర్‌గా ఆడలేదు.. అలానే పనులు ఎక్కువగా మా టీమ్‌కే ఇచ్చారంటూ విష్ణు చెప్పింది. దీనికి లేదు మిగిలిన పనుల కంటే కుకింగే ఎక్కువ పని.. అందుకే మీకు తక్కువ ఇవ్వాలనే అన్నీ మీ పైన వేశానంటూ పిచ్చి సమాధానం చెప్పింది యష్మీ. మణికంఠ తన ఫస్ట్ నామినేషన్ యష్మీకి వేశాడు. నువ్వు చీఫ్‌గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నావ్.. అలానే ప్రతి పనిలోనూ కావాలని చేస్తున్నారా లేదా అంటూ దూరిపోయావ్.. అంటూ మణికంఠ అన్నాడు. దీనికి యష్మీ ఏదో సమాధానం చెబుతుంటే మణి సీరియస్ అయ్యాడు. నువ్వు మాట్లాడేటప్పుడు పూర్తిగా వినండి.. మీ ఆటిడ్యూడ్ చూపించకండి.. అంటూ మణి అన్నాడు. దీనికి నేనంటే ఇదే.. ఈ టూ వీక్స్ నేను చీఫ్‌గా ఉన్నా.. నేను మాట్లాడాలి.. నా టీమ్ కోసమైన నేను మాట్లాడాలి. నీకు అది మైక్రో మేనేజ్‌మెంట్‌గా అనిపిస్తే నీ చీఫ్ దగ్గర చెప్పుకో.. నీకు చీఫ్ అంటే ఏంటి మెంబర్ అంటే ఏంటనే క్లారిటీనే రాలేదంటూ యష్మీ అరిచింది. నేను మాట్లాడేటప్పుడు ఆపొద్దు యష్మీ అంటూ మణికంఠకి బీపీ తన్నేసింది. దీనికి యష్మీ టాపిక్ డైవర్ట్ చేసి మణికంఠని బుక్ చేసే ప్రయత్నం చేసింది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానంటే నువ్వు డ్రామాలు చేస్తావు చూడు.. హౌస్‌లో నా దగ్గరికొచ్చి ఫ్రెండ్‌గా.. అది డ్రామా, నువ్వు ఫేక్ అని నేను అర్థం చేసుకోలేదంటూ యష్మీ అంది. దీనికి నాకు ఫ్రెండ్‌లో ఒక క్వాలిటీ నచ్చకపోతే నేను రెయిజ్ చేస్తానంటూ మణికంఠ అనగానే నువ్వేంటి బొక్క రెయిజ్ చేసేదంటు యష్మీ బూతులు మాట్లాడింది. నువ్వు మంచిగా మాట్లాడు నేను మాట్లాడతాను.. అంటూ మణికంఠ అంటే నేను తప్పైతే బయట ఆడియన్స్ చూసుకుంటారు. నువ్వు ఫేక్.. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడేందుకు నీకు ఆ దమ్ములేదా.. నువ్వు ఫేక్ పర్సన్.. అంటూ యష్మీ అంది. ఆ తర్వాత అగ్రెషన్ రీజన్‌తో పృథ్వీని నామినేట్ చేశాడు మణికంఠ ప్రేరణ మొదటిగా సీతను నామినేట్ చేసింది. నువ్వు గేమ్‌కి కావాల్సిన దాని కంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నావ్ అంటూ వింత రీజన్ చెప్పింది. దీనికి సీత కూడా గట్టిగానే వాదించింది. ఆ తర్వాత విష్ణుని నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పింది ప్రేరణ. రాత్రి పక్కన పెట్టిన ఐదు గుడ్లలో నువ్వు రెండు ఎగ్స్ తినేశావంటూ నామినేషన్ వేసింది. ఇది నాకు సెల్ఫిష్ అనిపించిందంటు ప్రేరణ అంది. దీనికి నవ్వుకున్న విష్ణు.. నీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం కూడా వేస్ట్.. ఒకసారి నాకు కర్రీ కూడా ఉంచకుండా నువ్వు తిన్నావ్.. అప్పుడు పక్కవాళ్ల గురించి నువ్వు ఆలోచించావా అంటూ విష్ణుప్రియ అంది. ఆ తర్వాత విష్ణుప్రియ, మణికంఠలను ఆదిత్య ఓం నామినేట్ చేశాడు. ఇక యష్మీ, ప్రేరణలను నబీల్ నామినేట్ చేయగా సీత, నైనికలను పృథ్వీ నామినేట్ చేశాడు.

Biggboss 8 Nominations : నామినేషన్లలో యష్మీకే అత్యధికం..  తనకి ఇదే చివరి వారమా!

  బిగ్‌బాస్ మొత్తానికి మూడో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే గత రెండు వారాలుగా నామినేషన్ల నుంచి తప్పించుకుంటు వస్తున్న యష్మీకి ఈసారి కంటెస్టెంట్లు గట్టిగానే నామినేషన్ చేశారు. రెండు వారాల నుంచి నామినేట్ చేద్దామనుకున్న వాళ్లంతా ఈ వారం గుద్దిపడేశారు. ఇప్పటికే హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.  మొదటి వారంలో గత సీజన్ శోభాశెట్టిని గుర్తుచేసిన యష్మీ.. రెండో వారంలో మిగిలిన కంటెస్టెంట్లతో నరకం స్పెల్లింగ్ రాయించింది. చీఫ్ అయ్యాననే గర్వంతో ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేసింది. ఇక దీనికి యష్మీ టీమ్ కూడా తానా అంటే తందానా అన్నారు. ఇలా యష్మీ బిహేవియర్ చూసి ఆడియన్స్ ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారు అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్ కూడా చేశారు. మరోవైపు యష్మీకి నామినేషన్లలో ఓటేసి పంపేద్దామనుకున్న కంటెస్టెంట్లకి గత రెండు వారాలు బిగ్‌బాస్ దయ వల్ల ఆ అవకాశం దొరకలేదు. కానీ మూడో వారం మాత్రం యష్మీ నామినేషన్ లో ట్రోలర్స్ కి దొరికేసింది.  మణికంఠ, సోనియా, సీత సహా చాలా మంది కంటెస్టెంట్లు సోనియాకే గుద్దిపడేశారు. దీంతో అత్యధిక ఓట్లతో ఈవారం నామినేషన్లలోకి అడుగుపెట్టింది యష్మీ. దీని గురించి తెలియగానే యష్మీ యాంటీ ఫ్యాన్స్, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. రా అమ్మా మెరుపు తీగ.. ఈసారి నిన్ను ఇంటికి పంపకపోతే చూడు, వెల్కమ్ యష్మీ ఇదే నీకు చివరి నామినేషన్ అంటు నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు  

Karthika Deepam2 : కొడుకు పెళ్ళితో తండ్రి బంఢారం బయటపడనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -151 లో... కార్తీక్ కి దీప టాబ్లెట్ తీసుకొని వచ్చి వేసుకోమని అంటుంది. తర్వాత వేసుకుంటాలే అని కార్తీక్ అనగానే మీరు శౌర్య లాగే చేస్తున్నారని దీప అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి శౌర్యకి వేసినట్లు నోట్లో వెయ్ దగ్గర ఉండి చూసుకుంటానని అంటే మరి ఇంత దగ్గర ఉండి చూసుకుంటావనుకోలేదు దగ్గర ఉండాల్సిన వాళ్ళని దూరం పెడుతున్నావ్.. దూరం ఉండాల్సిన వాళ్ళని దగ్గర ఉండమంటున్నావ్ అని జ్యోత్స్న అనడంతో ఇద్దరు కోపంగా చూస్తారు. జరిగిన వాటికి అన్నిటికి నేనే బాధ్యత వహిస్తాను.. ఎందుకంటే మీ ఎంగేజ్ మెంట్, పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే అని దీప అంటుంది. నీ భర్త కారణంగానే మా బావ ఈ సిచువేషన్ లో ఉన్నాడు. అసలు అయితే రాత్రికి రాత్రే వెళ్లిపోవాలి నువ్వు.. అలా చెయ్యలేదంటూ దీప బాధపడేలా జ్యోత్స్న మాట్లాడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న మాటలు భరించలేక దీప బయటకు వస్తుంది. ఆ మాటలన్నీ విన్నాను.. శౌర్య ఎలాగో జ్యోత్స్న అలాగా.. దాని మాటలు పట్టించుకోకని కాంచన అంటుంది. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యండి అని దీప చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు కాశీ ఇంటికి శ్రీధర్ వస్తాడు. అప్పుడే పారిజాతం ఆ ఇంటి నుండి బయటకు రావడం శ్రీధర్ చూసి ఆగిపోతాడు. అత్తయ్య ఇక్కడ ఉందేంటని శ్రీధర్ అనుకుంటాడు.‌ అప్పుడే దాస్ కూడా వస్తాడు. పారిజాతాన్ని కాశీ నానమ్మ అని పిలవడం దాస్ ని నాన్న అని పిలవడం విని షాక్ అవుతాడు‌. అంటే  దాస్ కొడుకే కాశీ.. ఈ పెళ్లి జరిగితే నా రెండో పెళ్లి విషయం బయటపడుతుందంటూ కంగారుగా వెనక్కి వెళ్తాడు.బఆ తర్వాత జ్యోత్స్న అన్న మాటలు కార్తిక్ గుర్తుచేసుకుంటుంటాడు. అప్పుడే స్వప్న ఫోన్ చేసి నాన్న పెళ్లికి ఒప్పుకున్నాడు. కాశీ తో మాట్లాడడానికి వెళ్లాడని స్వప్న చెప్పగానే.. కార్తీక్ షాక్ అవుతాడు అక్కడికి నాన్న వెళ్తే నిజం తెలుస్తుంది కదా అని కార్తీక్ టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే కాంచన వస్తుంది. ఏమైంది టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. ఫోన్ లో స్వప్న అంటున్నావ్ తనేనా అని అడుగుతుంది. అవునని కార్తిక్ అంటాడు. ఆ తర్వాత మీ నాన్న మారిపోయారు.. కొడుకుకి ఇలా జరిగినప్పుడు పక్కన ఉండాలి కానీ ఇలా చేస్తున్నాడని కాంచన అంటుంది. తన టెన్షన్ లు తనకి ఉంటాయి కదా అని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న జ్యూస్ చేసుకొని రమ్మని అంటే బత్తాయి కాయ పట్టుకొని వచ్చి ఇదంతా రిస్క్ ఎందుకు అని ఆర్డర్ పెట్టానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ ఇంట్లో లేడని.. శౌర్య, అనసూయలని పారిజాతం తిడుతుంది. అప్పుడే దీప వస్తుంది. తనని చూసి పారిజాతం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : భర్త బాగుండాలని మోకాళ్లపై ప్రదక్షిణలు చేసిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -202 లో......యాగం చెయ్యడానికి అందరు గుడికి వస్తారు. అక్కడ స్వామి వేషంలో శ్రీలత చెప్పిన రౌడీ ఉంటాడు. అతన్ని చూసి రామలక్ష్మి మనిషా అని అడుగుతుంది. లేదు మన మనిషి.. ఇక మన పని ఈజీగా అవుతుందని సందీప్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి సుజాతతో నాకు వచ్చిన కల గురించి తెలుసుకుంటానన్నావ్ కదా ఏమన్నాడని రామలక్ష్మి అడుగుతుంది. తెల్లవారు వచ్చే కలలు నిజం అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు అనగానే రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. అప్పుడే మాణిక్యం ఏమైందని అడుగగా జరిగింది చెప్తుంది. నువ్వేం బాధపడకు అల్లుడు గారికి ఏం కాకుండా నేను చూసుకుంటానని మాణిక్యం అంటాడు. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. ఏమైందని అడుగుతాడు. యాగం పనుల్లో నాన్న హెల్ప్ చేస్తానంటే వద్దని అంటున్నానని రామలక్ష్మి అనగానే.. చెయ్యమను మంచిదే కదా.. అప్పుడు అయినా బుద్ది వస్తుందని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అసలు విషయం అల్లుడు గారికి ఎందుకు చెప్పలేదని సుజాత అనగానే.. నాకు ఆక్సిడెంట్ అయిన నుండి ఏ పని చెయ్యనివ్వడం లేదుమ ఇప్పుడు మోకాళ్ళ పై ప్రదక్షిణాలు చేస్తానంటే ఒప్పుకోడు.‌. నాన్న మీరు అయన పక్కనే ఉండండని రామలక్ష్మి మాణిక్యానికి చెప్తుంది. ఆ తర్వాత మాణిక్యం మందు బాటిల్ ని విసిరి పారేస్తాడు. ఇతనేంటి ఇలా చేస్తున్నాడని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ లు కోనేరు దగ్గరికి వచ్చి స్నానం చేస్తారు. ఇద్దరు దూరం దూరంగా  ఉండి స్నానం చేస్తుంటే.. ఇద్దరు దగ్గరగా ఉండి చెయ్యండి అని పెద్దాయన అంటాడు. మరొక వైపు రౌడీ కోనేటిలోకి కత్తి పట్టుకొని వస్తాడుమ అతను దగ్గరికి రావడం.. అప్పుడే సీతాకాంత్, రామలక్ష్మిలు కోనేటి నుండి బయటకు వస్తారు. ఆ తర్వాత చిన్న మొక్కు ఉంది చేసుకొని వస్తానంటు సుజాతని రామలక్ష్మి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి మోకాళ్ళపై ప్రదక్షిణలు మొదలు పెడుతుంది. రౌడీ రామలక్ష్మి ఎక్కడ వదిలి పెట్టకూడదని అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ప్రదక్షిణలు చెయ్యడం సిరి చూస్తుంది. వదిన ఎందుకు అలా చేస్తుందిమ వెంటనే అన్నయ్యతో చెప్పాలి అనుకుంటుంది. మరొక వైపు రామలక్ష్మి అలా చెయ్యడం చూసిన శ్రీవల్లి.. కొబ్బరి చిప్పలు తన ముందు వేస్తుంది కానీ శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత సిరి వెళ్లి సీతాకాంత్ తో చెప్పగానే రామలక్ష్మి దగ్గరికి సీతా కా వెళ్లి అడుగుతాడు. దాంతో పీడకల వచ్చింది.. మంచి జరగాలని చేస్తున్నాను. ఒక్కటి ఉంది ప్లీజ్ ఆపకండి అని రామలక్ష్మి అంటుంది. నా కూతురేం  చేసిన మీ మేలు కోసం చేస్తుంది చేయనివ్వండని సుజాత అనగానే సీతాకాంత్ సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : నా కోడలికి క్షమాపణ చెప్పి తీసుకొనిరా.. నిజమేంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -516 లో... అపర్ణ డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. స్వప్న హారతి ఇవ్వడంతో నా కోడలు కావ్య ఇవ్వకుండా స్వప్న ఇస్తుంది ఏంటని అపర్ణ అనగానే.. నీ కోడలు ఎక్కడుంది. ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని రుద్రాణి అనగానే ఏంటని అపర్ణ అడుగగా.. ఏం లేదు మొక్కు తిరుచుకోవడానికి గుడికి వెళ్ళిందని రాజ్ కవర్ చేస్తాడు. అపర్ణ ఇంట్లోకి వెళ్ళగానే నోరు అదుపులో పెట్టుకోమంటు రుద్రాణికి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు జాబ్ కోసం ఒక దగ్గరికి వెళ్తుంది. డిజైన్స్ వేస్తానని కావ్య అంటుంది. ఇది వరకు అలాగే చేసావ్.. మళ్ళీ నువ్వు మీ అత్తారింటికి వెళ్ళిపోతే డిజైన్స్ ఎవరు వేస్తారని అతను అనగానే ఇప్పుడు అలా జరగదు మీకు డిజైన్స్ వేస్తానని కావ్య అంటుంది. సరే ఫోన్ చేస్తానని అతను అంటాడు. ఆ తర్వాత రాజ్ అపర్ణకి టాబ్లెట్స్ తీసుకొని వస్తాడు. కావ్య ఎక్కడికి వెళ్ళిందంటే మాట దాటవేస్తున్నావ్ ఏంటని అపర్ణ అడుగుతుంది. అప్పుడు కూడా రాజ్ డైవర్ట్ చేసి వెళ్ళిపోతాడు. ధాన్యలక్ష్మిని కూడా అపర్ణ అడుగుతుంది. తను కూడా డైవర్ట్ చేస్తుంది. ఇందిరాదేవి వస్తుంది. నేను లేనప్పుడు ఏదైనా జరిగిందా అని అపర్ణ అడుగుతుంది. ఏం జరగలేదని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత ఇంత రాత్రి అయింది.. కావ్య ఇంకా ఇంటికి రాలేదని అపర్ణ రాజ్ ని అడుగుతుంది. అసలేం జరిగింది కావ్యని ఇంట్లో నుండి పంపించేసారా అని అడుగుతుంది. ఈ రుద్రాణి వళ్లే నా కోడలు ఇంట్లో నుండి వెళ్లిపోయిందా అని అపర్ణ అనగానే.. నా వల్ల కాదు మీ కొడుకు వల్లే వెళ్ళిపోయింది. తను చేసిన తప్పు బయటపడేసరికి వెళ్ళిపోయిందని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత నా చెల్లి ఏ తప్పు చేసిందంటూ స్వప్న జరిగిందంతా అపర్ణకి చెప్తుంది. మీ కొడుకు మా అత్త మాటలకి రెచ్చిపోయి తన మనసు విరిచేసాడు. అందరికోసం బలవంతంగా కాపురం చేసాడట.. ఇక నా భర్త మనసులో స్థానం లేనప్పుడు, నేను ఇంకా ఎందుకని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని స్వప్న చెప్పగానే.. అపర్ణ షాక్ అవుతుంది. తరువాయి భాగంలో నా కోడలికి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని రా అని రాజ్ కి అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.