బిగ్ బాస్ అనేది వేస్ట్ షో... బేబక్క వీడియో వైరల్

  సోషల్ మీడియాలో బెజవాడ బేబక్క అంటే తెలియని వారుండరు. ఎందుకంటే కామెడీ పండించడంలో, సెటైర్స్ వేసి నవ్వించడంలో ఆమె తర్వాతే ఎవరైనా. జెంట్స్ లో కామెడీ యాంగిల్ కామన్ . కానీ లేడీస్ లో మాత్రం కొంచెం ఆ యాంగిల్ తక్కువగా ఉంటుంది. అలాంటి కామెడీ చేసే  కొందరిలో బెజవాడ బేబక్క ఎంతో ఫేమస్. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వారంలోనే ఎలిమినేట్ అయ్యి వచ్చేయడంతో ఆమె ఇంకా ఫేమస్ ఐపోయింది. దాంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. ఆమె రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ వాళ్ళు మెరుపు తీగలా పని చేయమన్నారు అందుకే ఇలా వెళ్లి అలా ఆ హౌస్ నుంచి ఈ హౌస్ కి వచ్చేసాను అని చెప్పింది. అలాగే బయటకు వచ్చేసరికి 20 వేల మంది ఫాలోవర్లు కూడా పెరిగిపోయారని తెలిసి వాళ్లకు ఫ్లయింగ్ కిస్సులు కూడా ఇచ్చేసింది. ఎంత కాలం ఉన్నామన్నది కాదన్నయ్యా...ఎంత మంచిగా ఉన్నామన్నదే ముఖ్యం..హౌస్ లో అందరితో కలిసిపోయాను, మంచిగా అందరికీ వంట చేసి పెట్టాను. ఇలా బయటకు వచ్చేసాను. ఇక నుంచి మంచి వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అని చెప్పింది. దాంతో నెటిజన్స్ కూడా ఆమె వీడియో మీద కామెంట్స్ చేస్తున్నారు. "అదొక వేస్ట్ షో సిస్టర్.... మీరు ఫస్ట్ వచ్చి మంచి పని చేశారు..మీకు ఆ షో అసలు వేస్ట్. వచ్చావా అక్క నువ్వు లేవని కృష్ణమ్మ బాధతో పొంగిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో  ఉన్నంత చురుకు బిగ్ బాస్ లో లేకుండా పోయింది అక్క " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

నేను డాన్స్ చేస్తే గుర్రాలు కూడా విజిల్స్ వేస్తాయి

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని వినాయక నిమజ్జనం వేడుకలను పురస్కరించుకుని డిజైన్ చేశారు. ఇందులో ఎన్నో సెగ్మెంట్స్ ని కూడా యాడ్ చేసారు. ప్రతీ ఏడాది మగవాళ్లే కదా వినాయక నిమజ్జనం  చేసేది కానీ ఈ ఏడాది మాత్రం ఆడవాళ్ళం చేస్తాం అంటూ లేడీస్ అంతా ఘాటుగా చెప్పేసారు. అలాగే  ఒకప్పుడు అనిత..అనితా అనే సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో..ఆ పాటని ప్రతీ లవర్  ఎంతలా ఆదరించారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సింగర్ నాగరాజు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీదకు వచ్చి ఆ సాంగ్ ని మళ్ళీ పాడి వినిపించాడు. ఇక ఇంద్రజ ఐతే మాములుగా ఊగిపోలేదు. "ఇప్పటికీ నేను డాన్స్ చేస్తే కుర్రాళ్ళు విజిల్స్ వేస్తారు తెలుసా" అని చెప్పింది. ఇక రష్మీ కౌంటర్ వేసింది. "నేను డాన్స్ చేస్తే కుర్రాళ్ళు కాదు గుర్రాలు కూడా విజిల్స్ వేస్తాయి" అంటూ ఇద్దరూ కలిసి ఓ రేంజ్ లో డాన్స్ లు చేశారు. ఇక ఫైమా ఈ షోలో తన బలప్రదర్శన చూపించింది. ఆటో రాంప్రసాద్ ఆమె నెత్తి మీద ఒక గాజు సీసాను బద్దలా కొట్టాడు. అలాగే ఆమె చేతి మీద బల్బ్ ని పగలగొట్టాడు. ఇక ఫైమా ఐతే కుండల్ని బద్దలుకొట్టింది. ఇక రమ్యకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఢీ 17 విన్నర్ వర్షిణి రమ్యకృష్ణ గెటప్ లో వచ్చింది అలాగే ఆటో రాంప్రసాద్ రజనీకాంత్ గెటప్ లో వచ్చి నరసింహ మూవీలో ఒక బిట్ ని స్పూఫ్ గ చేసి చూపించాడు. ఇక ఇందులో క్యాష్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేసింది రష్మీ.  

Biggboss 8 Telugu:  యష్మీ కన్నింగ్ ప్లాన్.. నామినేషన్ లో ఉంది ఎవరెవరంటే!

  బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ వీక్ నామినేషన్ పూర్తయింది. ఇందులో మొత్తంగా ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. నిఖిల్, ఆదిత్య ఓం, పృథ్వీ , విష్ణుప్రియ, కిర్రాక్ సీత , నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. కిర్రాక్ సీత, ప్రేరణ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ సెకెండ్ రోజు కూడా జరిగింది. ప్రతిదానికి డస్ట్ బిన్ డస్ట్ బిన్ అంటావ్ ఏంటి?? చిన్నదాన్ని పెద్దది చేస్తావ్ ఏంటని ప్రేరణ అడుగగా.. దానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ కరెక్ట్ పాయింట్ లాగింది సీత. మొన్న మీ టవల్‌ని పొరపాటుగా ఆదిత్య అన్న వాడుకున్నాడు. దానికి సారీ కూడా చెప్పాడు.. కానీ దాన్ని మీరు రచ్చ రచ్చ చేసి బిగ్ బాస్‌కి కంప్లైంట్ ఇచ్చారు.. కొత్త టవల్ తెప్పించుకున్నారు.. ఏ.. మీరు కూడా రచ్చ చేయకుండా.. ఆ టవల్‌ని ఉతుక్కుని వాడుకోలేకపోయారా? మీది ఇది పెద్ద ఇష్యూ అనిపించింది.. నాకు ఆ డస్ట్ బిన్ ఇష్యూ పెద్దగా అనిపించిందని అనేసరికి దెబ్బకి నోరు మూసేసింది ప్రేరణ. ఇక పృథ్వీని నబీల్, నైనిక నామినేట్ చేశారు. నిఖిల్ చీఫ్ గా ఫెయిల్ అయ్యావంటూ నబీల్ నామినేట్ చేశాడు. ఆదిత్య ఓంని అభినయ్ నవీన్ నామినేట్ చేసి.. అందరితో ఇంకా కలవాలని చెప్పి నామినేట్ చేశాడు.‌ ఇక నామినేషన్ లిస్ట్ లో ప్రేరణ ఉంది. కానీ విష్ణుప్రియ క్లైమాక్స్ లో ఆడ్ అయ్యింది. యష్మీకి ఉన్న స్పెషల్ పవర్ గురించి బిగ్ బాస్ చెప్పిన ఆ క్షణంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసింది యష్మీ. అలానే నామినేషన్లలో లేని విష్ణుప్రియను డైరెక్ట్‌గా నామినేట్ చేసింది. ఇక దీనికి రీజన్‌గా యష్మీ చెప్పిన విషయం వింటే బుర్రతిరిగిపోద్ది. వాళ్లు లక్సరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుండగా ఎవరైనా బాధపడుతున్నారని తెలిస్తే అది సరిగా ఎంజాయ్ చేయలేరట.. గేమ్‌పై కాన్సట్రేషన్ చేయలేరట.. ఈ కారణం చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది యష్మీ. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నామినేషన్ తో యష్మీ , ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అంతా ఒక్కటే అని తెలుస్తోంది. మరి మీకేమనిపిస్తోందో కామెంట్ చేయండి.  

Karthika Deepam2 : నీలాంటి నష్టజాతకురాలిని చూడలేదు.. చావు బ్రతుకుల్లో కార్తీక్!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -146 లో... కార్తీక్ ని నరసింహా కత్తితో పొడిచాడని తెలియగానే.. అందరు హాస్పిటల్ కి వస్తారు. డాక్టర్ బయటకు వచ్చి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది బ్లడ్ చాలా పోయింది.. సేమ్ గ్రూప్ అయితే బ్లడ్ ఇవ్వండి అని డాక్టర్ చెప్తాడు. జ్యోత్స్న నీది కార్తీక్ ది సేమ్ గ్రూప్ కదా అని అనగానే.. నేను డ్రింక్ చేసి ఉన్నా.. ఆ విషయం తెలిస్తే, ఆ చెంప ఈ చెంప వాయిస్తారని జ్యోత్స్న అనుకొని మొన్నే.. మా ఫ్రెండ్ కి బ్లడ్ ఇచ్చానని చెప్తుంది. ఆ తర్వాత నాది అదే బ్లడ్ నేను ఇస్తానని దీప అంటుంది. సరేనని అనగానే లోపలికి వెళ్లి బ్లడ్ ఇస్తుంది. మరొకవైపు అసలు నువ్వు ఏ బ్లడ్ ఇవ్వలేదు.. కదా ఎందుకు అబద్దం చెప్పావని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. అవును నేను డ్రింక్ చేసానని జ్యోత్స్న అంటుంది. నీలాంటి నష్టజాతకురాలిని చూడలేదు. ఈ ఇంటికి అసలు వారసురాలు కాదని నీకు తెలుసు.. అసలు వారసురాలు బ్రతికే ఉందని తెలుసు.. ఇక రెండు రోజుల్లో పెళ్లి ఎలా జరిగుతుంది. బ్లడ్ నువ్వు ఇచ్చి ఉంటే సింపథీ ఉండేది. ఇప్పుడు బ్లడ్ ఇచ్చి దీప దేవత అయిందని జ్యోత్స్నని పారిజాతం తిడుతుంది. ఆ తర్వాత కాంచన దీపకి థాంక్స్ చెప్తుంది. ఎందుకు థాంక్స్ చెప్తున్నావ్.. అసలు దీనికి కారణం ఆ దీప అని శ్రీధర్ అంటాడు. అసలు ఈవిడ గనుక లేకుంటే ఇంత దూరం వచ్చేది కాదు‌ కదా.. ఎవరు ఈ దీప, నరసింహా అని శ్రీధర్ అంటాడు. శ్రీధర్ అన్న మాటలకి దీప ఏడుస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళు దీప అని సుమిత్ర పంపిస్తుంది. దీప ఇంటికి వెళ్లి అనసూయకి జరిగింది చెప్తుంది. అప్పుడే శౌర్య కూడా వింటుంది. ఏమైంది కార్తీక్ కి అని శౌర్య ఏడుస్తుంది. నేను కార్తీక్ ని చూడాలంటూ శౌర్య ఏడుస్తుంటే.. ఇక దీన్ని ఆపలేమంటు శౌర్యని తీసుకొని దీప హాస్పిటల్ కి వెళ్తుంది. దాని గురించి అసలు నిజం నీకు తెలియదని అనసూయ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : మహాయాగాన్ని సీతాకాంత్ పూర్తిచేయగలడా.. ఆమె కనిపెట్టేసిందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -197 లో....రామలక్ష్మికి ఆక్సిడెంట్ చేయించింది నువ్వేనా అని నందినిని హారిక అడుగుతుంది. నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా.. నేను అంత ఘోరంగా ఆలోచిస్తే ఇప్పుడే సీతాని సొంతం చేసుకునేదాన్ని కానీ నేను సీతాని ఇష్టంగా తను కూడా నన్ను ఇష్టంగా ప్రేమించలని అనుకుంటున్నానని నందిని బాధపడుతుంది. అసలు ఆ ఆక్సిడెంట్ ఎలా అయింది. ఎవరు చేసారో కనిపెట్టి సీతాకీ నేనేం తప్పు చెయ్యలేదని నిరూపించాలని నందిని అనుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి పెద్దాయన వచ్చి.. అసలు రామలక్ష్మి ఆక్సిడెంట్ ఎలా అయిందని అడుగుతాడు. సీతకాంత్ పెద్దాయనని పక్కకి తీసుకొని వెళ్లి నందిని గురించి చెప్తాడు. నందిని కావాలనే ఇలా చేసింది. నన్ను రామలక్ష్మిని దూరం చెయ్యాలని అనుకుంటుంది. ఒక్కప్పుడు లవ్ చేసింది రిజెక్ట్ చేశాను.. తను అనుకున్నది సాధించడానికి ఎంత దూరం అయినా వెళ్తుందని సీతాకాంత్ అంటాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటని పెద్దాయన అడుగుతాడు. త్వరలోనే వేరే పెట్టుబడి పెట్టె కంపెనీస్ రప్పించి నందినితో ఉన్న కంపెనీ రిలేషన్ ఆపేస్తానని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు రామలక్ష్మి నిద్ర లేచి అసలు అత్తయ్య ఈ పని చేసి ఉండకపోవచ్చు.. తను చెస్తే తన కళ్లలో భయం కలిగేదని రామలక్ష్మి అనుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి గుడికి వెళదామని రామలక్ష్మితో అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు గుడికి వెళ్తారు. స్వామి దగ్గరికి వెళ్తారు. నువ్వు మొక్కు తీర్చుకోమని  రామలక్ష్మిని సీతాకాంత్ పంపిస్తాడు. జరుగుతున్న సిచువేషన్ గురించి సీతాకాంత్ స్వామికి చెప్తాడు. మీరు మహాయాగం చెయ్యాలని చెప్తాడు. ఏ పరిస్థితిలోనైనా ఆ యాగం ఆగకుండా చూసుకోండని స్వామి చెప్పగానే సీతాకాంత్ సరే అంటాడు. ఆ విషయం రామలక్ష్మికి చెప్పగా తను కూడ సరే అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. యాగం గురించి ఇంట్లో చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : నీ తప్పు వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -511 లో.. కళ్యాణ్ హాస్పిటల్ కి వస్తాడు. అమ్మకి ఏం కాదురా.. రేపు మనతో మాట్లాడుతుందని రాజ్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. నాకు అన్నయ్యని చూస్తుంటే భయమేస్తుంది. మీరు అన్నయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళండి పెద్దనాన్న.. నేను పెద్దమ్మ దగ్గర ఉంటానని కళ్యాణ్ అంటాడు. వాడిప్పుడు వచ్చే సిచువేషన్ లో లేడని సుభాష్ అంటాడు. అన్నయ్య పెద్దనాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళు.. తనకి టెన్షన్ గా ఉందట.. పెద్దమ్మ గురించి కాదు పెద్దనాన్న గురించి కూడా ఆలోచించమని రాజ్ తో కళ్యాణ్ అనగానే.. నువ్వు ఇక్కడే ఉండు డాడ్ ని దింపేసి వస్తానని అంటాడు. మరొకవైపు అందరు ఇంట్లో అపర్ణ గురించి బాధపడుతుంటారు. రుద్రాణి, రాహుల్ లు ఇదే కరెక్ట్ టైమ్.. ఇప్పుడే కావ్యని అందరి దృష్టిలో బ్యాడ్ చెయ్యాలని రాహుల్ అంటాడు. చేస్తాను రాజ్ చేతే కావ్యని గెంటేలా చేస్తానని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్, సుభాష్ లు ఇంటికి వస్తారు. అపర్ణ ఎలా ఉందని ఇందిరాదేవి అడుగుతుంది . చూసారా కదా అంటు రాజ్ కోప్పడతాడు. ఎవరినో నమ్మి తప్పు చేసానని రాజ్ అనగానే.‌. తప్పు నువ్వు చెయ్యలేదు. ఈ కావ్య చేసిందంటు రాజ్ ని రెచ్చగొట్టేలా రుద్రాణి మాట్లాడుతుంది. రుద్రాణి గారు టైమ్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాకండి అని కావ్య అంటుంది. అందరికి మాట్లాడే ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావ్.. అసలు అపర్ణని వదిలి ఎక్కడికి వెళ్ళావని ఇందిరాదేవి అడుగుతుంది. ఎవరో ఒకతను కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుంది. అది కూడా రాహుల్ చేస్తున్నాడు.. మీరు రాకపోతే కంపెనీ పరువు పోతుందన్నారు.. అందుకే వెళ్ళాను.. అత్తయ్య గారు వెళ్ళమంటేనే వెళ్ళానని కావ్య అంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది. అది ఫేక్ కాల్ అని కావ్య చెప్తుంది. ఎంత బాగా కథ అల్లావని రుద్రాణి అంటుంది. రుద్రాణికి కావ్య సమాధానం చెప్తుంటే షటప్ అని రాజ్ కావ్యపైకి అరుస్తాడు. నీకెందుకు కంపెనీ? ఏం అయితే నీకెందుకంటూ కావ్యపై రాజ్ విరుచుకుపడతాడు. నువ్వు తప్పు చేసావ్.. నీ తప్పు వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే మాత్రం.. నిన్ను జీవితంలో మాత్రం క్షమించనని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

Kirrak seetha : ప్రేరణ నోరు మూయించిన కిర్రాక్ సీత!

బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ వీక్ నామినేషన్ ఇంకా పూర్తి కాలేదు. నిన్నటి ఎపిసోడ్ లో సగమే చూపించగా.. నేడు సెకెండ్ డే నామినేషన్ కి సంబంధించిన ప్రోమోని వదిలారు.  ఇక రెండో రోజు కూడా ఈ నామినేషన్స్ హీట్ కొనసాగుతుంది. మణికంఠను పృథ్వీ నామినేట్ చేశాడు. నిఖిల్ టీమ్ లో ఉంటూ.. నైనికతో తన టీమ్ లో చేర్చుకోమని అడగడం.. గోతులు తవ్వుతున్నట్టుగా అనిపించిందని మణికంఠని పృథ్వీ నామినేట్ చేశాడు. ఆ తర్వాత నిఖిల్‌ని ప్రేరణ నామినేట్ చేసింది. ప్రతిదానికి డస్ట్ బిన్ డస్ట్ బిన్ అంటావేంటి.. చిన్నదాన్ని పెద్దది చేస్తావేంటని ప్రేరణ అడుగగా.. మొన్న మీ టవల్‌ని పొరపాటుగా ఆదిత్య అన్న వాడుకున్నాడు. దానికి సారీ కూడా చెప్పాడు.. కానీ దాన్ని నువ్వు రచ్చ రచ్చ చేసి బిగ్ బాస్‌కి కంప్లైంట్ ఇచ్చావు.. కొత్త టవల్ తెప్పించుకున్నావు.. నువ్వు కూడా రచ్చ చేయకుండా ఆ టవల్‌ని ఉతుక్కుని వాడుకోలేకపోయారా.. మీకు ఇది పెద్ద ఇష్యూ అనిపించింది.. నాకు ఆ డస్ట్ బిన్ ఇష్యూ పెద్దగా అనిపించిందని కిర్రాక్ సీత అనేసరికి ప్రేరణకి నోట మాట రాలేదనే చెప్పాలి.  వందమంది నా ముందుకొచ్చి ఇది తప్పు అని చెప్తే.. నాకు అది రైట్ అనిపిస్తే అది రైటే అని చెప్తానంటు సీత స్ట్రాంగ్ గా చెప్పేసింది. ఇక నిఖిల్ ని నబీల్ ఆఫ్రీది నామినేట్ చేసాడు. ఛీఫ్ గా నువ్వు ఫెయిల్ అయ్యావంటూ నబీల్ నామినేట్ చేయగా.. నేను ఎంత చీఫ్ అయినా వాళ్ల పర్సనల్స్ వాళ్లకి ఉంటాయి. ఈరోజు సోనియాతో వచ్చింది.. రేపు ఇంకొకరితో వస్తుంది.. ఐ డోన్ట్ కేర్ అని నిఖిల్ అన్నాడు. ఈ ప్రోమోని బట్టి చూస్తే ఈ వారం మొత్తం ఏడుగురు దాకా నామినేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రోమో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.  

సిగరెట్ మానేస్తే నీ కోరిక తీరుస్తా.... హౌస్ లో ప్రేమజంట ఎవరంటే!

  బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ పదమూడు మంది. వీరిలో నిఖిల్, ప్రేరణ, యష్మీ , పృథ్వీ కన్నడ బ్యాచ్.. వీరందరు బయటే కలిసి మాట్లాడుకున్నారని లోపల ఉన్నవాళ్ళకి అర్థమయింది . అందుకే సీత మొన్న నామినేషన్ లో అదే మాట అంది. సీత హౌస్ లో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కాబట్టి తనకి అర్థమవుతుంది. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్ లో యష్మీ ఛీఫ్ గా ఉన్నప్పుడు ప్రేరణని ఎవరో నామినేట్ చేస్తే తనని సేవ్ చేసింది. ఇక ఈ వారం నామినేషన్ లో ప్రేరణని సీత నామినేట్ చేయగా యష్మీ కి ఉన్న స్పెషల్ పవర్ యూజ్ చేసి తనని కాపాడిందంటూ  ఇన్ స్టాగ్రామ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక సోనియా కమాండింగ్ స్ట్రాటజీని వాడుతూ హౌస్ లోని వాళ్ళని మాట్లాడకుండా చేస్తుంది. నామినేషన్ లో సీత, విష్ణుప్రియలని మాట్లాడకుండా చేస్తూ తన మాటనే నెగ్గేలా చేసుకుంటుంది. ఇక నిన్నటి నామినేషన్ లో విష్ణుప్రియని పర్సనల్ గా అంటు ఎమోషనల్ డ్యామేజ్ చేసింది. గత సీజన్ లో శోభాశెట్టి, రతిక కూడా వ్యాలిడ్ పాయింట్ లేకపోయిన అవతలి వాళ్ళని తమ మాటలతో డిఫెండ్ చేసుకునేవారు. దానివల్ల అవతలివాళ్ళకి మాట్లాడే అవకాసం ఉండేది కాదు. ఇప్పుడు సోనియా కూడా అదే ఫాలో అవుతుంది. ఇక హౌస్ లో నిఖిల్ తో లవ్ ట్రాక్ నడిపిస్తోంది సోనియా. నిన్నటి ఎపిసోడ్ లో .. ' నిఖిల్ నువ్వు సిగరెట్లు మానేస్తే నీకు ఏం అడిగినా  ఇస్తాను' అని సోనియా అంది. ఇక చేతిలో చేయి వేసి, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏదో ఏదో మాట్లాడుతుంది సోనియా. అంటే హౌస్ లో లీడర్ గా ఉన్నాడు కాబట్టి అతని మాట అందరు వింటారని, ఒకవే

నీకు ఫ్యామిలీ లేదేమో నాకు ఉందంటూ విష్ణుప్రియపై నోరుజారిన సోనియా!

  బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్ ల హవా సాగింది‌. ఇందులో కిర్రాక్ సీత, సోనియా మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరుగగా.. శేఖర్ బాషాకు ఆదిత్య ఓం కి మధ్య కోల్డ్ వార్ సాగింది. ఇక ప్రతీది పాయింట్ టూ  పాయింట్ మాట్లాడే అభయ్ నవీన్ మొదటిసారి రాంగ్ పర్సన్ ని నామినేట్ చేసాడని, తను చెప్పిన రీజన్ కూడా వ్యాలిడ్ లేదని స్పష్టమవుతుంది. ఆదిత్య ఓం ఎమోషనల్ అయ్యాడు. మన పర్ స్పెక్టివ్ సెంటిమెంట్ స్టార్ మణికంఠ ఎప్పటిలాగే ల్యాగ్ నామినేషన్ చేయగా.. ప్రేరణ, కిర్రాక్ సీత మధ్య ఇంకా ఆ చెత్తబుట్ట టాపిక్కే సాగుతుంది. ఇంకా హౌస్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే విష్ణుప్రియ మాట్లాడిన ప్రతీది వ్యాలిడ్ అనిపించింది‌. కానీ సోనియా ఆకుల నోరుజారింది. అసలేం జరిగిందంటే సోనియాను విష్ణుప్రియ నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి రెయిజ్ చేస్తూ నేను అన్న దానికి సారీ చెప్పా.. కానీ నాపైన అడల్ట్రీ అనే ముద్ర వేశారు మీరు.. దానికి నాకు సారీ చెప్పలేదంటూ విష్ణుప్రియ అడిగింది. నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు.. మన ఇద్దరి మధ్య ఆ ర్యాపో లేదు.. నాకు అది అడల్ట్రీనే అంటూ సోనియా చెప్పింది. అసలు మీ దృష్టిలో నేను ఏం అడల్ట్రీ (18 ప్లస్) జోక్స్ వేశా అంటూ విష్ణుప్రియ అడిగితే.. మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదని‌ సోనియా అంది. మీరు ఒకళ్లే తెలివైనోళ్లు కాదు.. పిల్ల బచ్చా జోకులేసుకునే దాన్ని అడల్ట్రీ అని ఎట్లా అంటారంటూ విష్ణుప్రియ అనేసరికి బరాబర్ ఇప్పుడు కూడా అంటా అంటు మరోసారి సోనియా అదే మాట అంది. నీకు ఫ్యామిలీ లేదేమో నాకు ఉంది. నన్ను చూస్తారంటూ విష్ణుప్రియని హేళన చేసింది సోనియా. ఇక ఈ మాటలని ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ విష్ణుప్రియ పేరుతో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. నామినేషన్ కరెక్ట్ పాయింట్ మాట్లాడిన విష్ణుప్రియని ఇలా నోటికొచ్చినట్టు మాట్లడటమేంటని సోనియాపై మండిపడుతున్నారు నెటిజన్లు.

Karthika Deepam2 : దీప కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్న కార్తీక్...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -145 లో....దీప కూరగాయలు కట్ చేస్తుంటే.. అప్పుడే నరసింహా వస్తాడు. వీడేందుకు వచ్చాడు అనుకుంటున్నావా అని నర్సింహా అనగానే.. నీడలాగా వెంటాడుతున్నావని తెలుసు.. వంట చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నాను.. వెళ్లిపో గొడవ చెయ్యకని దీప అనగానే.. ఈ సోది అంతా నాకు అవసరం లేదు.. ఆ ఇంటి పత్రాలు ఇస్తావా ఇవ్వవా అని నరసింహా అడుగుతాడు. అది మా నాన్న ఆస్తి.. నేను ఇవ్వనని దీప అనగానే.. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. నీ అడ్డు తొలగిస్తానంట దీపని నరసింహా కత్తితో పొడవబోతుంటాడు. అప్పుడే కార్తీక్ వచ్చి అడ్డుగా ఉండడంతో కత్తి కార్తీక్ కి గుచ్చుకుంటుంది. ఎలాగు వచ్చావ్ కదా.. నిన్ను చంపేస్తా అని నరసింహా అంటాడు. దాంతో కత్తిపీట తీసుకొని దీప నరసింహా పైకి వెళ్తుంది. దాంతో నరసింహా భయపడి పారిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది దీప. అప్పుడే పెళ్లి గురించి ఇరు కుటుంబాలు మాట్లాడుకుంటారు.  కార్తీక్ కి కాంచన ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ దీప లిఫ్ట్ చేస్తుంది. దీప ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావ్ దీప అని కాంచన అనగానే సుమిత్ర ఫోన్ తీసుకొని ఏమైందని అడుగుతుంది. దాంతో దీప జరిగింది చెప్తుంది. దాంతో సుమిత్రతో సహా అందరు షాక్ అవుతారు. అందరూ వెంటనే హాస్పిటల్ కి బయలుదేర్తారు.  మరొకవైపు జ్యోత్స్న  ఫ్రెండ్స్.. ఇంకా మీ బావ రావట్లేదంటు మాట్లాడేసరికి జ్యోత్స్నకి కోపం వస్తుంది. కార్తీక్ కి ఫోన్ చేయగా.. దీప లిఫ్ట్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. జ్యోత్స్న షాక్ అవుతుంది. తను కూడా హాస్పిటల్ కి బయలుదేర్తుంది. ఆ తర్వాత సుమిత్ర వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తారు. అసలేం జరిగిందో దీప అందరికి చెప్తుంది. నరసింహా గురించి పోలీసులతో మాట్లాడాలని శ్రీధర్, దశరథ్ లు అనుకుంటారు. డాక్టర్ వచ్చి కార్తీక్ సిచువేషన్ సీరియస్ గా ఉందని చెప్పడంతో.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : అగ్నిసాక్షిగా తను నేను తాళి కట్టిన భార్య.. నా కుటుంబం జోలికి రావొద్దు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -196 లో.....మీరు ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతుంది.. ఇదంతా చేసింది మీరే అని నాకు తెలుసని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది. నేనే అనడానికి సాక్ష్యం ఏముంది? అనవసరంగా నిందలు వెయ్యకని శ్రీలత అంటుంది. ఆ బ్రేక్ లు తీయడం శ్రీలతకి తెలియకుండా‌  సందీప్ చేసాడు. అయ్యో అత్తయ్యకి విషయం తెలిస్తే ఎలా అంటు శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మరొకవైపు సీతాకంత్ కోపంగా నందిని దగ్గరికి వెళ్తాడు. అసలు నువ్వు ఎం చేస్తున్నావు.. నీకు అర్ధమవుతుందా.. నీ ప్రేమని దక్కించుకోవడానికి ఏదైనా చేస్తావని తెలుసు.. మరి ఇలా చేస్తావనుకోలేదు.. నీ ప్రేమ కోసం నా భార్య అడ్డు తొలగించాలనుకున్నావంటూ సీతాకాంత్ నందినిపై కోప్పడుతాడు. నువ్వేం అంటున్నావో అర్థం కావడం లేదని నందిని అంటుంది. నోరు ముయ్.. రామలక్ష్మి నేను బయటకు వెళ్తుంటే మీటింగ్ అంటూ నన్ను వద్దని చెప్పి తనని చంపాలని చూసావని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి  అగ్నిసాక్షిగా నేను తాళి కట్టిన భార్య.. తనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను.. ఇప్పుడేం కాలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను.. నా జోలికి.. నా కుటుంబం జోలికి రాకని నందినికి సీతాకాంత్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మరొకవైపు రామలక్ష్మికి ఆక్సిడెంట్ గురించి శ్రీవల్లి, సందీప్ మాట్లాడుకుంటారు. అప్పుడే శ్రీలత వస్తుంది. ఎందుకు ఇలా చేసావ్ టైమ్ బాలేక దొరికపోతే పరిస్థితి ఏంటని సందీప్ తో శ్రీలత అంటుంది. మరొకవైపు రామలక్ష్మికి డాక్టర్ వచ్చి ట్రీట్ మెంట్ ఇస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరుండి చూసుకుంటాడు. నా దగ్గర వచ్చి పడుకోమని రామలక్ష్మిని శ్రీలత పిలుస్తుంది.‌ అవసరం లేదు తనని నేనే చూసుకోవాలని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఒకవేళ నువ్వే అలా చేసావా అని నందినిని హారిక అడుగుతుంది. నువ్వు కూడా అలా అంటావేంటని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కోమాలోకి వెళ్లిన అపర్ణ.. కావ్యను ఇంట్లో నుండి గెంటేయ్ రాజ్

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -510 లో.... అపర్ణ ఎప్పటిలాగే టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుంటుంది. మరొకవైపు ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని ఫోన్ వచ్చిందని కావ్య ఆఫీస్ కి వెళ్లి అక్కడ మేనేజర్ ని అడుగుతుంది. మేం ఏం చెయ్యలేదని అతను చెప్పగానే తనకి వచ్చిన నెంబర్ కి కాల్ చేస్తుంది. ఫోన్ కలవదు ఒకసారి అన్ని ఫైల్స్ చెక్ చెయ్యాలని కావ్య అంటుంది. మరోకవైపు అపర్ణకి బీపీ ఎక్కువ అవుతుంది. దాంతో కావ్యకి ఫోన్ చేస్తుంది. తను లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత అంత బాధలో కూడ రాజ్ కి చేసి నాకు ఇబ్బందిగా ఉంది రా త్వరగా అంటూ చెప్తుంది. అసలు ఏమైంది అమ్మకి ఆలా మాట్లాడింది అంటూ రాజ్ తో సహా అందరు ఇంటికి వెళ్తారు. అక్కడ కింద పడిపోయి ఉన్న అపర్ణని చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. కార్ లో కావ్య ఇంటికి వస్తుంటే రాజ్ వాళ్ళు బయటకు వెళ్తారు. అపర్ణ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాక కావ్య నేను చూసుకుంటానంటే వదిలి వెళ్ళాం.. అసలు కావ్య ఎక్కడికి వెళ్ళిందని ఇందిరాదేవి అంటుంది. అప్పుడే అత్తయ్యకి  ఏమైంది అంటు కావ్య అడుగుతుంది. రాజ్ కోపంగా ఎక్కడికి వెళ్ళావ్.. మా అమ్మకి ఏమైనా అయితే చంపేస్తానని కావ్యపై రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి బీపీ ఎక్కువ అయింది. కోమాలోకి వెళ్ళింది. ట్రీట్ మెంట్ కీ రెస్పాండ్ అయితే గానీ ఏం చెప్పలేమని డాక్టర్ అనగానే మీరు అలా అనకండి మా అమ్మ ని కాపాడండి అంటూ డాక్టర్ పై రాజ్ అరుస్తాడు. ఆ తర్వాత అందరూ వెళ్లిపోండి.. ఇక్కడ మా డాడ్ నేను ఉంటామని రాజ్ అంటాడు. అందరు ఇంటికి వెళ్తారు. అపర్ణని రాజ్ చూస్తూ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు కళ్యాణ్ కి అపర్ణ హాస్పిటల్ లో ఉందని తెలిసి హాస్పిటల్ కి వస్తాడు. అమ్మకి ఏం కాదు రేపు చూడు ఎలా మాట్లాడుతుందోనని అంటాడు. ఎవరిని నమ్మొద్దు అమ్మని మనలాగా ఎవరు చూసుకోలేరు భార్యని కుడా నమ్మొద్దంటు కోపంతో కూడిన ప్రేమతో రాజ్ మాట్లాడతాడు. తరువాయి భాగంలో ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని ఫోన్ వస్తే వెళ్ళానని కావ్య అనగానే.. జరిగితే నీకెందుకు మా అమ్మకి ఏదైనా అవ్వాలి.. నిన్ను జన్మలో క్షమించనని రాజ్ అంటాడు. ఏదో జరిగే వరకు ఎందుకు ఈ దరిద్రాన్ని ఇప్పుడే ఇంట్లో నుండి గెంటేయ్ రాజ్ అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Sridevi drama company promo : ఫైమా తలమీద బీర్ బాటిల్ తో కొట్టిన ఆటో రాంప్రసాద్!

  మల్లెమాల సంస్థ నుంచి వచ్చే ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలకు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. జబర్దస్త్ వంటి కామెడీ షోతో ట్రెండ్ సెట్ చేసిన ఈ సంస్థ నుంచి వచ్చిందే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. మొదట్లో ఎవరెవరో కమెడియన్లతో సీరియల్ హీరోని యాంకర్‌గా పెట్టి వ్యూస్ రాబడదామని ప్లాన్ చేశారు. అయితే రెండు మూడు వారాలకే ఇందులో నస తప్ప పస లేదని తేలిపోయింది. కుళ్లు జోకులతో కామెడీ కంటెంట్ లేదని తేలిపోయింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ యాంకర్ గా  చేస్తూ ట్రెండింగ్ లో సాగుతుంది.  ఇక తాజాగా గణపతి బప్ప మోరియా అంటు వచ్చిన ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. వర్ష , ఆటో రాంప్రసాద్ మధ్య మాటల యుద్ధంతో పాటు కమెడీయన్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగే వేలంపాట‌‌ సాగినట్టు తెలుస్తోంది. ఇక రష్మీ, ఇంద్రజ ఇద్దరు కలిసి ఓ డీజే సాంగ్‌కి అదిరిపోయే స్టెప్‌లు వేసి అదరహో అనిపించారు. ఇది కదా గ్రేస్ అంటే.. ఇది కదా డాన్స్ అంటే అన్నట్టు పోటీపడి డాన్స్ చేసి స్టేజ్‌ని షేక్ చేశారు. ఇక ఫైమా, నరేష్ కలిసి కొన్ని కళరీ ప్రదర్శనలు చేశారు. ఇలాంటివి ఇంటివద్ద చేయొద్దని చెప్తూ ఓ ట్యాగ్ కూడా వేశారు. ఫైమా చేతితో కుండలని పగులగొట్టడం, నరేశ్ చేతులతో పెంకులని విరగొట్టడం చేశారు. ఫైమా తలమీద ఆటో రాంప్రసాద్ బీర్ బాటిల్ తో  కొట్టినట్టు తెలుస్తోంది. ఇక నరేశ్ కి గట్టిగానే తగిలినట్టుంది దాంతో వర్ష వచ్చి తనని ఓదార్చడంతో ఎడిటర్ మామ.. ' దేవుడు ఓదారుస్తున్నాడు' అంటు ఖలేజా మూవీలోని బ్రహ్మీ డైలాగ్ ని వేసేశాడు.   ఇక బుల్లెట్ భాస్కర్ , చమ్మక్ చంద్ర, రాములమ్మ, వర్ష, ఆటో రాం ప్రసాద్, పంచ్ ప్రసాద్, నరేశ్ ఇలా‌ అందరు పంచ్ లతో ఫుల్ ఫన్ ని క్రియేట్ చేస్తున్నారు. హైపర్ ఆది, ఇంద్రజల మధ్య తాజాగా ఓ గొడవ కూడా జరిగింది. తను వేసే నాన్ వెజ్ జోకులకి ఇది సరైన ప్లేస్ కాదంటూ ఇంద్రజ అతడికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అలాగే యాంకర్ గా సుధీర్ కంటే  రష్మీనే బెటర్ అని , అసలు సూధీర్ లో యాంకర్ నే చూడలేదని ఇంద్రజ చెప్పడంతో అది వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  

బిగ్ బాస్‌లో నోరు జారిన కిర్రాక్ సీత.. ప్రేరణ, సోనియా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్

  బిగ్ బాస్ రెండవ వారం నామినేషన్ ప్రక్రియ హీటెట్ ఆర్గుమెంట్స్ తో మొదలయ్యిందని ప్రోమో చూస్తూనే అర్థమవుతుంది. నువ్వా నేనా అన్నట్టు హౌస్ మేట్స్ మధ్య గొడవ ముదిరింది. మాములుగా అయితే ఇలాంటి ఫైట్స్ అయిదు వారాలు తర్వాత మొదలవుతాయి కానీ మనోళ్లు ఫుల్ ఆన్ ఫైర్ మీద ఉన్నారు వారం రోజుల్లో దాదాపుగా ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఇక హౌస్ లో ఎప్పటిలాగే ఒక గ్రూప్ స్టార్ట్ అయింది‌ అలాగే ఒక ప్రేమ జంటకి బిగ్ బాస్ వేదిక కాబోతుంది. అది ఏంటని ముందు ముందు తెలుస్తుంది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. ప్రతీ ఒక్కరు ఇద్దరు సభ్యులని నామినేట్ చేయాలి. నామినేషన్ లో ఎవరు ఎవరిని నామినేషన్ చెయ్యాలనుకున్నారో వాళ్ళ తల మీద కలర్ పోసి రీజన్ చెప్పాలని బిగ్ బాస్ కోరాడు. ఇలాంటి టైప్ నామినేషన్ అనేది ప్రతి సీజన్లో ఉంటూ వస్తోంది. ప్రేరణని కిర్రాక్ సీత నామినేట్ చేస్తూ.. మీరు అందరు గ్రూప్ గా బయట నుండే వచ్చారు‌‌. మీరు అలా అందరిని ఫాలో అవ్వమనడం కరెక్ట్ కాదని కిర్రాక్ సీత అనగా.. బయట నుంచి, బయట నుంచి వచ్చారని మొదటి నుండి అంటున్నారు అది తగ్గించండని, రాంగ్ గా పొట్రై చెయ్యొద్దని ప్రేరణ అంది. ఇక కిర్రాక్ సీతకి సోనియాకి మధ్య మాటల యుద్ధం జరిగింది.  అలాగే ఆదిత్య ఓం ని అభినయ్ నవీన్ నామినేట్ చేశాడు. హౌస్ లో ఇన్వాల్వ్ మెంట్ తక్కువగా ఉందని నామినేషన్ రీజన్ చెప్పగా.. మణికంఠ కన్నా తక్కువగా ఉందా అంటు ఆదిత్య అన్నాడు. సోనియా, నైనిక మధ్య కూడా హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం ఎంతమంది నామినేట్ అయ్యారో ఇంకా తెలియాల్సి ఉంది.  

బెజవాడ బేబక్క బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే!

బిగ్ బాస్ సీజన్ 8లో తొలి వికెట్ పడింది. అందరూ అనుకున్నట్టుగానే బెజవాడ బేబక్కని ఇంటికి పంపించేశారు. గతంలో బిగ్ బాస్ హౌస్‌కి ఉన్న సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ.. బేబక్కకి తొలివారంలో అన్యాయం చేస్తూ ఎలిమినేట్ చేసి పారేశారు. అయితే హౌస్ లో ఏం జరిగినా బేబక్క మాత్రం ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. బేబక్క హౌస్ లో ఉంది వారం రోజులే అయినా తనకి లక్ష యాభై వేల వరకు రెమ్యునరేషన్ అందిందని తెలుస్తోంది. అయితే తను కిచెన్ లో డ్యూటీ చేయడమే పెద్ద మైనస్ గా మారింది. నామినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్ లో కీలకం. అందులో పృథ్వీ తనని అన్ ఫిట్ అంటూ నామినేషన్ చేసినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా హౌస్ లో తనకన్నా చిన్నవాళ్ళు ఉన్నప్పటికి సోనియాతో గొడవని తగ్గించుకోలేకపోయింది. నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తనే ఒప్పుకోవడం.. సరైన ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వలేకపోవడంతో బేబక్కకి ఓటింగ్ తక్కువగా పడింది. తర్వాతి వారం నుండి ఆడాలని ఆదివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జునతో అన్న బేబక్క ఇప్పుడు ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ రాగా బేబక్క ఎలిమినేషన్ తో ఇప్పుడు పదమూడు మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా అడుగుపెట్టిన బేబక్క పాజిటివ్ టాక్ తోనే బయటకు వచ్చేసింది. హౌస్ లో నుండి బేబక్క ఎలిమినేట్ అయి బయటకు వస్తుంటే కిర్రాక్ సీత, శేఖర్ బాషా, విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయ్యారు. 

కొంపముంచిన వంటగది.. బేబక్క ఎలిమినేషన్ కి కారణమిదేనా!

  బిగ్ బాస్ ఫస్ట్ వీక్ లో మొదటి ఎలిమినేషన్ గా బేబక్క హౌస్ నుండి బయటకు వచ్చేసింది‌. తను యాక్టివ్ అవుతుందనుకున్న సమయంలో ఇలా బయటకు పంపించేశారంటు ప్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక హౌస్ లోకి వెళ్ళేముందు బేబక్క ప్రోమో చూసిన అందరు.. ఈ సీజన్ ఎంటర్‌టైన్మెంట్ మాములుగా ఉండదనుకున్నారు.‌ కానీ హౌస్ లోకి వెళ్ళాకా అంతా రివర్స్ అయ్యింది. యాక్టివ్ తో పాటు జోక్స్, ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుందని అనుకున్నారంతా.. కానీ అదేమీ లేదు. తనకి స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా రాదు. ప్రతి సీజన్‌లోనూ యంగ్ బ్యాచ్‌తో పాటు ఓ ఆంటీని కూడా కంటెస్టెంట్‌గా తీసుకుంటారు. ఈ సీజన్‌లో బేబక్కని అదే కోవలో ఎంపిక చేశారు. ఫస్ట్ సీజన్ సింగర్ కల్పన.. ఆ తరువాతి సీజన్లలో కరాటే కళ్యాణి, నటి హేమ, ఉమాదేవి వీళ్లందర్నీ కూడా ఇలాగే తీసుకున్నారు. వాళ్లందర్నీ తొలివారంలో హౌస్ నుంచి బయటకు పంపారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. వీళ్లంతా రావడం రావడమే.. వంటగదిలోకి వచ్చి గరిటె తిప్పిన వాళ్లే. కాబట్టి.. ఈ సీజన్‌లో ఇదే సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ అదే ఏజ్ గ్రూప్ ఉన్న బేబక్కని హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఈమె కూడా రావడం రావడమే కిచెన్‌లోకి వెళ్లింది.. తొలివారంలోనే ఎలిమినేట్ అయ్యింది.  అయితే ఓటింగ్ పరంగా బెజవాడ బేబక్కకి అన్యాయం జరిగింది. సాధారణంగా మొదటి వారం నో ఎలిమినేషన్ ఉంటుంది కానీ బేబక్కని ఎలిమినేషన్ చేశారు. ఇది అన్ ఫెయిర్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి మీకేనపిస్తుంది కామెంట్ చేయండి.  

Bebakka Elimination: బేబక్క ఎలిమినేషన్.. తను రోడ్డు మీద పడేసింది ఎవరినంటే!

  బిగ్ బాస్ సీజన్-8 మొదలై అప్పుడే వారం పూర్తయింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో సండే ఫండే అంటూ ఆటలు, టాస్క్ లతో సరదాగా గడిపారు. ఇక ఫస్ట్ ఎలిమినేషన్‌లో భాగంగా.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో శనివారం నాడు సోనియాను సేవ్ చేయగా.. ఇక ఆదివారం నాడు బేబక్కని ఎలిమినేట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్‌లో మొదట శేఖర్ బాషా‌ని.. తరువాత పృథ్వీ, విష్ణు ప్రియలను సేవ్ చేశారు. చివరికిగా నాగ మణికంఠ, బేబక్కలు మాత్రమే మిగిలారు. ఇక యాక్షన్ రూమ్ లోకి మణికంఠ, బేబక్కలని పిలిచి చివరి సేవింగ్ చేశాడు నాగార్జున. డ్రమ్స్ కొడుతూ చివరికి అందులో నుండి ఓ పేపర్ వస్తుందని చెప్పాడు. ఆ పేపర్ లో ఎవరు సేవ్, ఎవరు ఎలిమినేషన్ వస్తుందని చెప్పగా.. మణికంఠ సేవ్ అయ్యాడు. బేబక్క ఎలిమినేషన్ అయి నాగార్జున దగ్గరికి వచ్చేసింది. ఇక హౌస్ లో తన జర్నీ చూసుకొని నవ్వేసింది. ఇక సోనియాకి తనకు మధ్య అంత రాపో లేదని చెప్తూ సారీ చెప్పింది. ఇక నాగార్జున ఓ బోర్డ్ తీసుకొచ్చి.. అందులో ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఉండకూడదని అనుకుంటున్నారో వారిని రోడ్డు మీద పడేయండి అని నాగార్జున చెప్పగానే.. బేబక్క కొంతమందిని సెలెక్ట్ చేసింది. నిఖిల్, పృథ్వీ, సోనియా, ఫోటోలని రోడ్డు మీద ఉంచింది. ఎవరైనైన మిస్ అవుతున్నావా అని బేబక్కని నాగార్జున అడుగగా.. అందరు తనని మిస్ అవుతున్నట్టుగా చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. కిర్రాక్ సీత బాగా ఎమోషనల్ అయింది.  నేను వాళ్ళందరిలాగే నచ్చాలి కదా.. కుక్కర్ అప్పుడు కూడా సరదాగా సాగిందని కానీ అది సీరియస్ అయ్యిందని సోనియా అంది. అన్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని పృథ్వీ అన్నాడు.‌. నేను ఒక బ్రదర్ అనుకొని ఫర్ గివ్ చేశానంటు బేబక్క అంది. కిచెన్ లో స్టిక్ట్ గా ఉండాలని నిఖిల్ చెప్పగా బేబక్క ఆ రూల్ ఫాలో అయింది‌. సీతకి నేనంటే ఇష్టం సర్.. కానీ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి అలా చేసాను సారీ సీత అంటు బేబక్క అనగానే.. సీత వెక్కి వెక్కి ఏడ్చింది. అక్క తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటాను.. కానీ నిన్ను రాంగ్ గా లీడ్ చేయాలని కాదని నిఖిల్ అన్నాడు. ఇక నెగెటివ్ ఏం లేదు.. ఇంప్రూవ్ అవ్వాలని మణికంఠతో బేబక్క అంది. ఇలా ఒక్కొక్కరితో తన అనుభవాలని షేర్ చేసుకొని బేబక్క ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది.   

Bigg Boss Naga Manikanta : బిగ్ బాస్ నాగ మణికంఠ పెళ్ళి వీడియో వైరల్!

బిగ్ బాస్ సీజన్ 8 గ్రాంఢ్ గా మొదలైంది. ఇక వారం గడిచిపోయింది. ఇందులో సెంటిమెంట్ కార్డ్ ని వాడి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ తీసుకుంది నాగ మణికంఠ. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. ఎక్కువగా వినిపించిన పేరు మాత్రం నాగ మణికంఠ. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టి.. తన స్పెషల్ వీడియోలోనే కష్టాలను చెప్పుకుని హైలైట్ అయ్యాడు. మణికంఠ తన భార్య, కూతురు గురించి  స్పెషల్ వీడియోలో ఒకలా చెప్తే.. హౌస్‌లోకి వెళ్లిన తరువాత.. మరోలా మాట్లాడాడు. తన భార్య.. యూఎస్ నుంచి వెళ్లిపొమ్మన్నదని చెప్పగా.. మణికంఠ భార్య నెగిటివ్ అయ్యింది. హౌస్‌లోకి వెళ్లిన తరువాత తన భార్య బంగారం అని మణికంఠ హౌస్‌లోకి వచ్చాడంటే తన భార్య వల్లేనని ఆమే తనకి షాపింగ్‌కి డబ్బులు కూడా పంపి వెళ్లు నాన్నా అని ప్రోత్సహించిందని చెప్పాడు. అంతేకాదు తన భార్యతో తనకి ఎలాంటి గొడవలు లేవని చిన్నచిన్న మనస్పర్థల వల్లే తాను భార్య కూతురికి దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పాడు.  హౌస్‌లో కూడా తన భార్యని గుర్తు చేసుకుని మిస్ యూ మిస్ యూ అంటున్నాడు నాగ మణికంఠ. అంటే వీరిద్దరి మధ్య గొడవలేం లేవని, అందరు నామినేట్ చేయడంతో ఓ కట్టుకథ అల్లాడంటూ అందరు అనుకుంటున్నారు. నాగ మణికంఠ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య ఫొటోలు కానీ... పెళ్లి ఫొటోలు, వీడియోలు లేవు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్‌లలో మణికంఠ పెళ్లి వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మణికంఠ భార్య ప్రియను చూడొచ్చు. ఆమె మణికంఠకి సరైన జోడీనా.. వీళ్ల జంట ఎలా ఉందనేది  మీరే కామెంట్ చేయండి.

Bigg Boss 8 Telugu : బేబక్క నిఖిల్ మధ్య గొడవ.. యష్మీని లాగిపెట్టి కొట్టాలనిపించింది!

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రతీరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. అయితే హౌస్ లో జరిగిన టాస్క్ లలో గెలిచిన మూడు టీమ్ లు.. నైనిక , నిఖిల్, యష్మీ టీమ్. అయితే హౌస్ లో వీరి మధ్య ఎన్నో మిస్ అండర్ స్టాండ్స్ వస్తున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం. ఎప్పటిలానే కిచెన్‌లో బేబక్కపై సోనియా సెటైర్లు వేసింది. దీంతో తన చీఫ్ అయిన నిఖిల్‌ వైపు బేబక్క చూసినా మనోడు ఏం పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి పక్కకెళ్లిపోయి నిఖిల్‌తో గొవడ పెట్టుకుంది బేబక్క. ఎందుకు అస్తమానం సోనియాకే సపోర్ట్ చేస్తావ్.. తనే ప్లేయర్‌లా కనిపిస్తుందా.. మేము కామా.. అంటూ బేబక్క గొడవేసుకుంది. ఇక వీళ్ల గొడవ మధ్యలో మణికంఠ కూడా కాసేపు దూరాడు. మొత్తానికి నిఖిల్ నువ్వు ముందు ఉన్నట్లు లేవని మాస్క్ వేసుకున్నావంటూ బేబక్క ఫైర్ అయింది.  ఇక తర్వాత కిచెన్‌లో నైనిక టీమ్‌కి నిఖిల్ ఏదో సాయం చేస్తుండగా యష్మీ అక్కడికి వెళ్లింది. ఏంటి వీళ్లకి సాయం చేస్తున్నావ్.. ఈ పని వాళ్లే చేయాలని చెప్పింది. దీనికి నిఖిల్ కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. నాకు సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా చేస్తా అంటూ నిఖిల్ అన్నాడు. అంటే నువ్వు బిగ్‌బాస్ ఆర్డర్లు కూడా లెక్కచేయవా అని యష్మీ చెప్పింది. కాసేపటికి అభయ్ దగ్గరికెళ్లిన నిఖిల్.. యష్మీ గురించి చెప్తూ ఫుల్ ఫైర్ అయ్యాడు. అసలు యష్మీ బిహేవియర్ చూస్తుంటే లాగి పెట్టి కొట్టాలనిపించింది.. నాకు టెంపర్ లేచింది.. పోతే పోయింది షో.. ఇందాక వెజిటేబుల్స్ క్లీన్ చేసి కుకింగ్ చేయడానికి వెళ్తుంటే.. బాత్‌రూంలో కాసేపు పెట్టి తీసుకొస్తా అప్పుడు వండండి అంటూ తిక్కతిక్కగా మాట్లాడుతుందని నిఖిల్ చెప్పాడు. యష్మీకి నిఖిల్ కి మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. అటు బేబక్కకి నిఖిల్, ఇటు యష్మీకి నిఖిల్ మధ్య గొడవ జరుగుతుంది. వీరిలో ఎవరు కరెక్టో మీరే కామెంట్ చేయండి.