నిఖిల్ కి గట్టిపోటీ ఇచ్చిన మణికంఠ.. ఫిజికల్ టాస్క్ లో‌ నిన్ను కొట్టేవారు లేరు!

బిగ్ బాస్ సీజన్-8 మొదలైనప్పటి నుండి అన్ లిమిటెడ్ టాస్క్ లతో అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ తో దూసుకెళ్తోంది. అయితే ఐదో వారం నైనిక ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. వీరు లోపలికి వచ్చాక హౌస్ లో గేమ్ ఆన్ అన్నట్టుగా సాగుతోంది. ఇక గత నాలుగు రోజుల నుండి హౌస్ లో బిబి హోటల్ టాస్క్ జరుగుతుంది. నిన్న హౌస్ లో ఫిజికల్ టాస్కుల్లో ఓజీ క్లాన్‌లో నిఖిల్-మణికంఠ ఇద్దరూ అదరగొట్టారు. ఫిజికల్ టాస్క్ అంటేనే రెచ్చిపోయే నిఖిల్ ఎప్పటిలానే ఇచ్చిపడేశాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా మణికంఠ ఈసారి నిఖిల్‌కి గట్టి పోటీ ఇచ్చాడు. అయితే చివరి రౌండ్‌లో ఓడిపోవడంతో నిఖిల్ విజయం సాధించి ఓ స్టార్ సంపాదించుకున్నాడు. అయితే ఓడిపోయిన మణికంఠకి కూడా రాయల్ క్లాన్ స్టార్ ఇవ్వడం నిఖిల్‌తో సహా ఓజీ క్లాన్‌లో చాలా మందికి నచ్చలేదు. ఇది జరిగి కాసేపటికి కిచెన్‌లో ఉన్న సీత దగ్గరికెళ్లి కామెడీ చేశాడు మణికంఠ. హే వాట్సాప్ సీత.. ఏం చేస్తున్నావ్ అంటూ మణికంఠ అడిగితే సీత ఏదో చెప్పింది. దీనికి జోక్‌గా నీ పక్కన మాడిపోయిన ఆ పెసరట్టు ముఖం (నిఖిల్ గురించి) ఎవడు అంటూ మణికంఠ అన్నాడు. దీంతో ఆయన మా హెడ్ చెఫ్ అంటూ సీత అంది. అవునా.. హెడ్ లెని చెఫ్ వాడు హెడ్ చీఫ్ ఏంటి అంటూ మణికంఠ జోక్ వేశాడు. దీనికి సీత నవ్వగా పక్కనే ఉన్న నిఖిల్ కాస్త సీరియస్ అయ్యాడు. రేయ్.. "అంటే మరి ఫీలవకు.. మిం** బయటికి" అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో మణికంఠ సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇది నిఖిల్ జోక్‌గా అని ఉంటే ఏదో అనుకోవచ్చు కానీ కాస్త హర్ట్ అయి సీరియస్‌గా అన్నట్లుగానే అనిపించింది. మరి దీనిపై వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఏం అయిన అంటాడో లేదో చూడాలి. ఇక ఈ టాస్క్ లో నిఖిల్ ఆటని పొగుడుతూ సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఫిజికల్ టాస్క్ లల్లో నిన్ను కొట్టేవాడెవడూ లేడని నిఖిల్ ని ప్రశంసిస్తున్నారు. అయితే నిఖిల్ బిహేవియర్ కాస్త ఛేంజ్ అయింది. దీనిని నాగార్జున వీకెండ్ లో అడిగితే బాగుంటుంది.

Karthika Deepam 2: కలిసిపోయిన ఆ ఇద్దరు.. శివన్నారాయణ‌ ఒప్పుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2 ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -172 లో.....పూజ మా ఇంట్లో జరగాలని సుమిత్ర అనగానే.. మిమ్మల్ని ఇద్దరిని మా ఇంట్లో కలపాలనుకున్న కానీ అమ్మావారి సంకల్పం వేరేలా ఉందని దీప అనుకుంటుంది. అదంతా వింటున్న జ్యోత్స్న, పారిజాతంలు పక్కకి వెళ్లి.. అసలు మళ్ళీ దీప ఏం ప్లాన్ చేసిందనుకుంటారు. ఆ దీప ఏం చేసిందో కచ్చితంగా.‌ నువ్వు తెలుసుకోమని పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది. ఆ తర్వాత దీపతో అనసూయ మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావ్ .. ఆ పెద్దాయనకి తెలిస్తే ఊరుకోడని అనసూయ అంటుంది. రోజు రోజుకి దూరం పెరిగిపోతుంది. ఎలాగైనా ఈ కుటుంబాలని కలపాలి దీప అంటుంది. అదంతా కిటికీలో నుండి నరసింహ వింటుంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు దీప, సుమిత్ర పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. శౌర్యని బాల త్రిపుర సుందరి దేవీగా సుమిత్ర రెడీ చేస్తుంది. ఇంట్లో ఎవరు లేరా అని దీప అనగానే.. జ్యోత్స్న, అత్తయ్యలు రెడీ అవుతున్నారు. ఆయన మావయ్య బయటకి వెళ్లారని సుమిత్ర అంటుంది. దాంతో తాతయ్య ఇంట్లో లేడని రీలాక్స్ అవుతుంది.అప్పుడే పారిజాతం జ్యోత్స్న ఇద్దరు పూజ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత శౌర్యని సుమిత్ర రెడీ చేసి మురిసిపోతుంటే జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత దీపని అనసూయ పిలిచి.. కార్తీక్ వాళ్ళు వచ్చారని చెప్తుంది. దాంతో దీప వాళ్లకు ఎదరుగా వెళ్లి.. పూజ మా ఇంట్లో కాదు అక్కడ అని అనగానే.. మేమ్ రామని చెప్తారు. దానికి దీప రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే శౌర్య వచ్చి పద కార్తీక్ అంటూ తీసుకొని వెళ్తుంది. దీప లోపలికి వెళ్లి నాకు తెలిసిన వాళ్ళని పిలిచానని చెప్తుంది. దాంతో పారిజాతం వెటకారం గా మాట్లాడుతుంది. కార్తీక్ కాంచన లు రావడం చూసిన సుమిత్ర, పారిజాతం, జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతారు. సుమిత్ర, కాంచనలు ప్రేమగా మాట్లాడుకుంటారు. వాళ్ళని పిలిచినందుకు దీపకి థాంక్స్ చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత దశరథ్, శివన్నారాయణ లు జ్యోత్స్నకి పెళ్లి సంబంధం మాట్లాడి తిరిగి వస్తుంటారు. ఈ విషయం ఇంటికి వెళ్లి అందరికి చెప్పాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి ప్రేమ తెలిసిపోయింది.. రివర్స్ డ్రామా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -223 లో.....సందీప్, శ్రీలతలు రౌడీ తో ఉన్న ఫోటోలని నందిని వాళ్లకు పంపిస్తుంది. అది చూసి శ్రీలత, సందీప్ లు షాక్ అవుతారు అప్పుడే నందిని ఫోన్ చేసి.. మీరు ఇద్దరు ఇక్కడికి రావాలి లేదంటే ఆ ఫోటోలు సీతాకాంత్ కి పంపిస్తానని చెప్తుంది. దాంతో కంగారుగా శ్రీలత, సందీప్ లు నందిని దగ్గరికి వెళ్తారు. మీరూ చూపించే సవతి ప్రేమ నాకెలా తెలుసనుకుంటున్నారా అని నందిని అంటుంది. రామలక్ష్మి అడ్డు తొలగించి ఆస్తులు సొంతం చేసుకోవాలని చూస్తున్నారని నాకు తెలుసు అని నందిని అంటుంది. అప్పుడే సందీప్, శ్రీలతలు గోడకి సీతాకాంత్, నందినిలున్నా ఫోటోని చూసి రివర్స్ డ్రామ ప్లే చేస్తుంటారు. నువ్వు ఆ విషయం సీతాకాంత్ తో చెప్పగలవా చెప్పు.. నిన్ను దక్కించుకోవాలని అందుకే ఇలా నాపై నిందలు వేస్తుందని చెప్తానని శ్రీలత అంటుంది. నువ్వు సీతాకాంత్ ని ప్రేమించావు.. నిన్ను కాదని రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు రామలక్ష్మిని అడ్డు తొలగించి సీతాకాంత్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావని శ్రీలత అనగానే.. నందిని షాక్ అవుతుంది. మన ఇద్దరి లక్ష్యం ఒకటే అయినప్పుడు.. మనం శత్రువులలాగా ఉండొద్దు మిత్రల్లాగా ఉండాలని శ్రీలత అంటుంది. దాంతో ఇప్పుడు వీళ్ళతో చెయ్యి కలపకపోతే సీతాకీ నెగెటివ్ చెప్తారని అనుకొని సరేనని వాళ్ళతో నందిని చెయ్ కలుపుతుంది.. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వచ్చి.. మాట్లాడాలని ట్రై చేస్తుంది కానీ సీతాకాంత్ దూరంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు దగ్గర అవుతున్నారనుకుంటే.. మళ్ళీ ఇలా అయిందని పెద్దాయన అంటాడు. వాళ్ళని మళ్ళీ కలపాలంటే నువ్వు వెళ్లి సీతాని భోజనానికి తీసుకొని రా అని పంపిస్తాడు. సిరి వెళ్లి భోజనానికి రా అన్నయ్య అనగా.. రానని అంటాడు. అయినా బలవంతంగా తీసుకొని వస్తుంది సిరి. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. భోజనం చెయ్ వదిన అంటుంది. నాకు ఆకలిగా లేదని రామలక్ష్మి అంటుంది. మీ అమ్మ ఒక మాట అంటే ఇలాగే ఉండేదానివా అంటూ వారందరి ముందు శ్రీలత యాక్ట్ చేస్తుంది. నువ్వు అన్నయ్య తినకపోతే నేను తిననని సిరి అనగానే.. ఇద్దరు కూర్చొని భోజనం చేస్తారు. మళ్ళీ రామలక్ష్మి ఫై అన్నయ్యకి కోపం వచ్చేలా చెయ్యాలని శ్రీవల్లితో సందీప్ అంటాడు. కానీ రామలక్ష్మి రివర్స్ గా అత్తయ్య అంటూ భోజనం తినిపిస్తుంది. నీను తినిపిస్తే తినరా అని అనగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అమ్మనాన్నల పెళ్ళి రోజున ఆ ఇద్దరు కూతుళ్ళు వస్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -537 లో... కనకంతో మాట్లాడడానికి అపర్ణ, ఇందిరాదేవీలు వస్తారు. ఎలాగైనా కావ్య ని రాజ్ కలపాలనుకుంటారు. ఈ జన్మ లో జరిగేలా లేదు.. నేను బ్రతికి ఉండగా అవుద్దో లేదోనని కనకం అనగానే.. ఇప్పుడు ఏమైందని అలా అంటున్నావని అపర్ణ అడుగుతుంది.‌ఎందుకు అంటే నేను ఎక్కువ రోజలు బ్రతకను.. నాకు కాన్సర్ అని కనకం అనగానే.. అపర్ణ, ఇందిరాదేవి లు షాక్ అవుతారు. ఎంత కష్టం వచ్చిందని వాళ్ళు బాధపడుతుంటే.. మీరు నిజంగానే నమ్మేసారా అంటూ కనకం నవ్వుతుంది. ఇలా చేస్తే వాళ్ళు ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది.. రేపు మా ఇరవై అయిదో పెళ్లి రోజు అందరిని పిలిచి సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళు వస్తారు. నాకు ఇలా అని నాటకం ఆడితే అల్లుడు గారు నమ్ముతారని కనకం అనగానే.. ఇందిరాదేవి, అపర్ణలు సరేనని అంటారు. ఆ తర్వాత కృష్ణమూర్తి దగ్గరికి కావ్య వచ్చి.. నాన్న మీ పెళ్లి రోజు కదా రేపు సెలబ్రేట్ చేసుకుందామని కావ్య అంటుంది. ఇప్పుడు నీ సిచువేషన్ బాగోలేదు..‌ ఎందుకు వద్దని అంటాడు. స్వప్న రాదు.. అప్పు రాదని కృష్ణమూర్తి అంటాడు అప్పుడే కనకం వచ్చి స్వప్ననే ఈ పెళ్లి రోజు జరిపిస్తానని చెప్పింది అని కనకం అనగానే.. నేను చేస్తాను వాళ్ళు ఎందుకమి కావ్య అంటుంది. వాళ్లు చేస్తానంటే ఎందుకు వద్దనడమని కనకం అనగానే.. వాళ్ళు ఎవరని కావ్య అంటుంది. దాంతో కనకం టాపిక్ డైవర్ట్ చేస్తుంది. మీ ఇష్టమంటూ కావ్య వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ ,కావ్యలని ఒక్కటిని చెయ్యడానికే ఇదంతా అని కృష్ణమూర్తితో కనకం చెప్తుంది.ఆ తర్వాత అపర్ణ, ఇందిరదేవిలు రాజ్ కి కనకం కాన్సర్ అని చెప్పాలి అనుకుంటారు కానీ వినడు. ఆ తర్వాత కనకం ఫోన్ చేసి ఇక్కడ కావ్యని ఒప్పించానని చెప్తుంది అక్కడ ఏమైందని అడుగగా.. ఇక్కడ ఫెయిల్ అని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత ప్రకాష్ ని అడ్డు పెట్టుకొని రాజ్ కి చెప్పాలి అనుకుంటారు. నువ్వు రాజ్ దగ్గరికి వెళ్లి.. ఇలా పాపం కావ్య అను అంతే అని ప్రకాష్ కి అపర్ణ చెప్పి పంపిస్తుంది. ప్రకాష్ వెళ్లి అలాగే అంటాడు. అంటే కావ్యకి ఏమైంది అని లోపలికి అడగడానికి వస్తాడు అడగలేకపోతాడు. మళ్ళీ సుభాష్ దగ్గరికి వెళ్తాడు. తనేదో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అవినాష్- రోహిణి స్కిట్ కి బిగ్ బాస్ ఫిధా.. సర్ ప్రైజ్ గిఫ్ట్ గా సాల్ట్ ప్యాకెట్!

బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన టాస్క్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల పర్ఫామెన్స్ మాములుగా లేదు. వీరిలో స్వయంగా బిగ్ బాస్ నే ఆకట్టుకున్నారు అవినాష్- రోహిణి. అసలేం జరిగిందంటే.. బిబి హోటల్ ముందు జబర్దస్త్ అవినాష్- రోహిణి కలిసి యాక్ట్ చేశారు. ఇది మోస్ట్ హిలేరియస్ గా మారింది. బిగ్‌బాస్ సొంత ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూపించేందుకు ఓ స్కిట్ చేశారు. బిగ్‌బాస్‌లా అవినాష్.. ఆయన భార్యలా రోహిణి కలిసి యాక్ట్ చేశారు. ఇక బిగ్‌బాస్ అనౌన్స్‌మెంట్ టైమ్‌లో ఎలా అయితే మాట్లాడతాడో అలానే ఇంట్లో కూడా ఉంటాడంటూ ఇద్దరు కామెడీ చేశారు. రోహిణి మీరు ఒకసారి యాక్షన్ రూమ్‌కి రండి.. అంటూ అవినాష్ అంటే.. ఇంట్లో చేసే యాక్షన్ ఏముండదు కానీ యాక్షన్ రూమ్‌కి వెళ్లి ఏం చేయాలి.. ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్ రావయ్యా మగడా అని రోహిణి అంది. ఇక ఈ పంచులకి కంటెస్టెంట్లు తెగ నవ్వుకున్నారు.  ఇక ఈ స్కిట్ తర్వాత బిగ్ బాస్ వారిద్దరిని మెచ్చుకున్నాడు. టాస్కును వినోదాత్మకంగా చేసి మెప్పించినందుకు మీకు స్పెషల్ రివార్డ్ ఇస్తున్నానంటూ బిగ్ బాస్ ఓ సాల్ట్ ప్యాకెట్ పంపించాడు. ఇక ఆ తర్వాత హౌస్ లో బిబి హోటల్ టాస్క్ మొదలైంది. దీనిలో రోహిణి-అవినాష్ కలిసి యాక్ట్ చేశారు. అది సూపర్ ఫన్ ని జనరేట్ చేసింది.‌ అందరు బాగానే పర్ఫామెన్స్ చేశారు‌ వీరిలో ముఖ్యంగా రోహిణి-అవినాష్ ది బెస్ట్ ఎంటర్‌టైన్మెంట్ అందించారు. ఇక నిన్నటి ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

బిగ్ బాస్ హౌస్‌‌లోకి సుజాత... రివీల్ చేసిన రాకేష్!

జోర్దార్ సుజాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతోంది. అదేంటి బిడ్డ పుట్టి ఎన్నో రోజులు కాలేదు అప్పుడే బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్లడం అనుకుంటున్నారా...ఈ విషయం కూడా రాకింగ్ రాకేష్ చెప్పాడు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేసాడు. ఇంతకు విషయం ఏమిటి అంటే వాళ్ళ ఇంట్లో బిగ్ బాస్ రూమ్ అనేదాన్ని ఒక ఏర్పాటు చేసాడు. అది కూడా రీసెంట్ గా పుట్టిన వాళ్ళ కూతురు కోసం. ఆ రూమ్ కి బిగ్ బాస్ ఎవరు వాళ్ళ అమ్మాయే. అందుకే రాకేష్ తెలివిగా సుజాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తోంది అంటూ చెప్పాడు. అంటే సుజాత వాళ్ళ పాప కోసం రోజూ ఆ గదిలో ఫామిలీ మెంబర్స్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ టైం టు టైం అన్ని బిడ్డకు ఇస్తోంది అని చెప్పుకొచ్చాడు. బిడ్డ పుట్టాక ముందు వరకు తానే ఆ ఇంటికి బిగ్ బాస్ అని ఇప్పుడు తన బిడ్డ ఆ ఇంటికి బిగ్ బాస్ అని చెప్పాడు. అలాగే సుజాత సేవ్ ది టైగర్స్ సీజన్ 3  మరింత మంచి రోల్ లో నటిస్తోందని దానికి కూడా సుజాత ప్రిపేర్ అవుతోందని చెప్పాడు. అలాగే ఇంకా కొన్ని బిగ్ బ్యానర్స్ లో మంచి మూవీ ఆఫర్స్ వచ్చాయని..అలాగే త్వరలో జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక రాకేష్ సుజాతను ఒక మాట అడిగాడు నీకు "జబర్దస్త్ ఇష్టమా, బిగ్ బాస్ ఇష్టమా" అని. రెండు రెండు కళ్ళ లాంటివి అని చెప్పింది సుజాత. ఈ బిగ్ బాస్ హౌస్ లో తామంతా  ఇలాగే ఒక ఏడాది వరకు ఉంటాం అని తమ కూతురు బిగ్ బాస్ చెప్పిన మాట వింటాం అని చెప్పాడు రాకేష్.

సుమ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనం!

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. పల్లవి, రవికిరణ్, మానస, శ్రీలలిత, హృతేష్, భావనా రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఐతే రవి కిరణ్ , హృతేష్ కలిసి సుమ ఇంట్లో దొంగతనం ప్లాన్ చేశారు. టీవీలో ఎక్కడ చూసినా సుమ గారే కనిపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో డబ్బులున్నాయనే ఇన్ఫర్మేషన్ ఉంది...అంటే అంబానీ, అమితాబచ్చన్ తర్వాత సుమ గారి దగ్గరే బాగా డబ్బుంది. ముందు అబ్జర్వ్ చేద్దాం, తర్వాత ప్లానేద్దాం, తర్వాత నూనె రాసుకుందాం, తర్వాత చెడ్డీ వేసుకుందాం అని ముందుగా దొంగతనం ఎలా చేయాలో ప్లాన్ చేసుకున్నారు.   తర్వాత రవికిరణ్ ఇలా అన్నాడు. దొంగతనం చేయడానికి మంచి టైం ఏదంటే "సుమ అడ్డా షో లో ఇరుక్కుపోయి ఉంటదిగా..అదే మంచి టైం దొంగతనానికి" అని అనేసరికి "కాదు కాదు ఆమె ఎప్పుడూ జిమ్ కి వెళ్లి ఓ ఎక్ససర్సైజులు చేసేస్తూ ఉంటుందిగా ఆ టైం ఐతే బెటర్ దొంగతనానికి" అని చెప్పాడు హృతేష్. ఇలా వీళ్ళిద్దరూ సుమ ఇంట్లో దొంగతనానికి వెళ్ళబోతున్నారు. ఇక వీళ్ళ ప్లానింగ్ కి సుమ రియాక్షన్ చూడాలి మాములుగా లేదు.    

మైక్ విసిరేసిన అశ్వగంధ 2.0.. సారీ చెప్పిన అవినాష్!

హౌస్ లోకి మాస్క్ పెట్టుకొని రావడం.. అందరు చూసి గౌతమ్ అంటే పలకకుండా.. అశ్వత్థామ అనగానే మాస్క్ తీసి అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ తనే హౌస్ లో ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న గౌతమ్.. ఇప్పుడు అదే మాట అవినాష్ అంటే హర్ట్ అయి ఆమ్లెట్ అయిండు. అసలేం ఏం అయిందంటే.. నిన్న హౌస్ లో బిబి హోటల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ‌ ఇక దీని ముందు హౌస్ లో సరదాగా చిన్న టాస్క్ ఆడించాడు‌ బిగ్ బాస్.   హౌస్ మేట్స్ ని రెండు టీమ్ లుగా చేసి, అమ్మాయిల లీడర్ అవినాష్.. అబ్బాయిల లీడర్ రోహిణి అని చెప్పాడు. మీరు కన్ఫ్యూజ్ అయినట్లున్నారు బిగ్ బాస్ అని అవినాష్ అనగానే.. నేను కరెక్ట్ గానే చెప్పానని బిగ్ బాస్ మామ అనేసాడు.  మొదటి రౌండ్ నవ్వుకుండా ఉండటానికి ప్రయత్నించు.. టీమ్ సభ్యులు అందరూ వారి నోటిని నీటితో నింపుకోవాల్సి ఉంటుంది.. ఎదుటి టీమ్ నుంచి ఒకరు వచ్చి జోక్స్ చెప్పి వారిని నవ్వించి నోటిలో నీటిని బయటికొచ్చేలా చేసి వారిని ఔట్ చేయాలి.. ఇలా రెండు టీమ్స్ ఒకరి తర్వాత ఒకరు చేయాల్సి ఉంటుంది.. అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఇక మొదట రోహిణి ప్రయత్నించింది కానీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత అవినాష్ వెళ్ళాడు. అఖిలాండ కోటి అంటు మణికంఠ లాగా పాడాడు కానీ అతను నవ్వలేదు కానీ అపరిచితుడులోని క్యారెక్టర్  తో అవినాష్ చేశాడు..రేయ్ అని అనడంతో నవ్వేశాడు మణికంఠ. ఇక ఆ తర్వాత గౌతమ్ దగ్గరికి వెళ్ళిన అవినాష్..గత సీజన్లో గౌతమ్ అన్నట్టుగా అన్నాడు. అశ్వత్థామ 2.0 వచ్చాడంటూ గౌతమ్ దగ్గరికెళ్లి నవ్వించడానికి ట్రై చేశాడు అవినాష్. ఇంతలో స్టేజ్ దిగిపోయి.. "సరేసరే బ్రో ఒన్ సెకండ్.." అంటూ అరిచాడు గౌతమ్. అసలు ఎవరికీ ఏం అర్థం కాలేదు. అశ్వత్థామ అన్నది సీజన్-7లో అయిపోయింది. అది మళ్లీ మళ్లీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించకు బ్రో.. అంటూ గౌతమ్ సీరియస్‌గా అన్నాడు. దీనికి ఏదో కామెడీ చేస్తే ఏంటి బ్రో అంటూ అవినాష్ అన్నాడు. అది కామెడీ కాదు బ్రో నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది బ్రో అంటూ మైక్ కింద పడేసి గౌతమ్ లోపలికి వెళ్లిపోయాడు. ఇక దీనికి హర్ట్ అయిన అవినాష్.. నేను స్టార్టింగ్‌లోనే ఎవరు హర్ట్ అవ్వొద్దని చెప్పా.. నేను ఈ టాస్కు ఆడను బిగ్‌బాస్ అంటూ అవినాష్ కూడా సీరియస్ అయ్యాడు. ఇక తర్వాత లోపలికి వెళ్లి ఒంటరిగా కూర్చొని గౌతమ్ ఏడ్చాడు. దీంతో అవినాష్ సహా అందరూ గౌతమ్ దగ్గరికెళ్లి ఓదార్చారు. "అది నాకు సీజన్ 7లో బాగా ట్రోలింగ్ అయిందని అది (అశ్వత్థామ) తీయొద్దు తీయొద్దని చెప్పా..నేను నార్మల్‌గా ఏడవను.. కానీ లోపల అది నాకు పిండేస్తుంది.. అప్పుడు నా మైండ్ సెట్ వేరు.. వన్ ఇయర్ క్రితం.. నన్ను ఒక్కొక్కడు ఒక్కోలా ట్రీట్ చేస్తుంటే.. నేను తట్టుకోలేక అన్న మాట అది.. అది ఎంతమందికి చెప్పాలి బ్రో.. నాకు ఇప్పుడు కూడా అది అయ్యేవరకూ ఆగుదామనుకున్నా.. కానీ అనుకోకుండా వచ్చేసింది.. సారీ.. మిమ్మల్ని అందామని కాదు.." అంటూ గౌతమ్ సారీ చెప్పాడు. ఇక హౌస్‌మెట్స్ అందరూ కూడా ఇంకెప్పుడు అశ్వత్థామ అనం అంటూ మాటిచ్చారు.

Karthika Deepam2 : అమ్మవారి పూజ కారణంగా దీప నిందల పాలు కానుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -171 లో.....సుమిత్ర ఏడుస్తూ బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే దీప వచ్చి.. ఏమైందని అడుగుతుంది. ఇంతకన్నా ఏం చెయ్యగలను.. ఇంట్లో జ్యోత్స్నకి మరొక పెళ్లి సంబంధం చూస్తారు. నేను వేరే పెళ్లి చేసుకోనంటూ జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోయింది. అలా వద్దని ఇంట్లో చెప్పలేను.. అలా అని జ్యోత్స్నకి చెప్పలేను.. చిన్నప్పటి నుండి బావనే నీ భర్త అని చెప్పాను.. ఇప్పుడు బట్టలు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకోమని చెప్పలేను కదా అని సుమిత్ర అంటుంది. నాకు వదినని కలవాలని ఉంది కానీ ఏం చెయ్యగలను.. ఇంట్లోకి వెళ్తానంటే.. వద్దన్నారూ కానీ వదినని ఫేస్ చెయ్యలేనని సుమిత్ర అంటుంది. మళ్ళీఈ రెండు కుటుంబాలు కలవాలని సుమిత్ర అంటుంది. అప్పుడే శౌర్య వచ్చి నువ్వు అనుకున్నది జరుగుతుందని అనగానే.. నిజమా అంటూ సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు జ్యోత్స్న పారిజాతంలు శ్రీధర్ ని కలుస్తారు. జ్యోత్స్న, శ్రీధర్ చేసిన పనికి ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు నాకు వేరే సంబంధం చూస్తున్నారని అంటుంది. నీ పెళ్లి కార్తీక్ తో జరగాలి.. ఏం చెయ్యడానికి అయిన రెడీ అని వాళ్ళతో శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత కాంచన వాళ్ళ దగ్గరికి దీప వచ్చి.. నేను రేపు పూజ చేసుకుంటున్నాను.. మీరు రావాలని అంటుంది. నేను రానని కాంచన అంటుంది. చేసేది మా ఇంట్లో అని దీప అంటుంది. అయిన రాను అనేసరికి శౌర్య వచ్చి రమ్మని అంటుంది. దాంతో వస్తానని చెప్తుంది. ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి దీప వచ్చి.. రేపు పూజ చేస్తున్నాను రమ్మని చెప్తుంది. అక్కడ ఎందుకు ఇక్కడే చేద్దామని సుమిత్ర అంటుంది. అప్పుడే పారిజాతం, జ్యోత్స్నలు వచ్చి వాళ్ళ మాటలు వింటుంటారు. మా ఇంట్లో చేద్దామని దీప అంటుంది. వద్దు ఇక్కడే అని సుమిత్ర అంటుంది. అప్పుడే శౌర్య వచ్చి.. కార్తీక్ అని ఏదో అంటుంటే దీప ఆపుతుంది. నేను అక్కడ సుమిత్ర కాంచన గారిని కలపాలనుకున్నాన్ కానీ ఇక్కడ జరుగుతుందని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Eto Vellipoindhi Manasu: ఊహకందని మలుపులతో ఎటో వెళ్ళిపోయింది మనసు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -222 లో....శ్రీవల్లి, సందీప్ లు బయటకు వెళ్లిపోతుంటే.. తప్పు చేసిన వాళ్ళు వెళ్తారు.‌ మీరెందుకని సీతాకాంత్ ఆపుతాడు. నేను తప్పు చేసానని అనుకుంటున్నారా అని రామలక్ష్మి అనగానే.. అది నీ మనసుకే తెలుసని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి బట్టలు సర్దుకుని వెళ్ళడానికి సిద్ధమవుతుంది. రామలక్ష్మి వెళ్లిపోతుంటే సీతాకాంత్ సైలెంట్ గా ఉంటాడు. రామలక్ష్మి మళ్ళీ వెనెక్కి వచ్చి నన్ను క్షమించండి అని సీతాకాంత్ కాళ్ళపై పడుతుంది రామలక్ష్మి. నేను ఏ తప్పు చెయ్యలేదు.. ఏం చేసిన మీ కోసమే చేసానని అంటుంది. రామలక్ష్మి ఎలాంటిదో మాకన్న నీకే తెలుసు.. తను పొరపాటు అయిందని అంటుంది కదా క్షమించు అని పెద్దాయన అంటాడు. వదిన ఇది వరకు చాలాసార్లు నీకోసం చేసింది. నగల విషయంలో తన తప్పు లేదని సందీప్ అన్నయ్యదే తప్పని  ఋజువు చేసింది. అలాంటిది అప్పుడు సందీప్ అన్నయ్య వెళ్ళాలని సిరి అంటుంది. రామలక్ష్మి వల్ల నా తల్లి బాధపడింది. తన కాళ్ళ ఫై క్షమించమని అడగాలని సీతాకాంత్ అనగానే రామలక్ష్మి వెళ్లి శ్రీలతకి సారీ చెప్తుంది. ఇప్పుడు ఇంకా రామలక్ష్మిని పంపించమని అంటే నేనే బ్యాడ్ అవుతానని శ్రీలత అనుకొని.. రామలక్ష్మి, సీతాకాంత్ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానని శ్రీలత అంటుంది.   ఆ తర్వాత మాణిక్యం వెళ్తుంటే రామలక్ష్మి వచ్చి.. ఎందుకు నాన్న అంత నీపై వేసుకున్నావని అడుగుతుంది. నీ కాపురం బాగుండాలని అలా చేశానని మాణిక్యం అంటాడు. ఇప్పుడు మా అత్తయ్య గురించి మొత్తం తెలిసింది.‌ ఇక ఈ రామలక్ష్మి ఇప్పటి నుండి మరొక రామలక్ష్మి చూడాలని అంటుంది. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి రామలక్ష్మి వెళ్లి ప్లాన్ ఫెయిల్ అయిందని అనుకుంటున్నావా అంటూ తనకి కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత శ్రీలతకి.. రౌడీతో ఉన్న ఫోటోస్ పంపిస్తారు.‌ అది చూసిన శ్రీలత.. సందీప్ ని పిలుస్తుంది. సందీప్ అవి చూసి షాక్ అవుతాడు. అప్పుడే నందిని ఫోన్ చేసి.. మీరు చేసిన తప్పు బయటపడకుండా ఉండాలంటే.. వెంటనే మీరిద్దరు నా దగ్గరికి రండి అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అత్తకి క్యాన్సర్.. అల్లుడు ఆ పని చేయగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -536 లో.. కావ్య అగ్రిమెంట్ తీసుకొని కనకం రావడానికి లేబర్ ఆఫీసర్ గా కావ్య బాస్ దగ్గరికి వెళ్తుంది. కావ్య అగ్రిమెంట్ తీసుకుంటుంది.‌ అప్పుడే అనామిక వచ్చి కనకం పిన్ని.. మర్యాదగా ఆ అగ్రిమెంట్ పేపర్ ఇవ్వు.. లేదంటే సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వెళ్లి.. నువ్వు మోసం చేసి అగ్రిమెంట్ పేపర్ తీసుకున్నావని పోలీసులకి చెప్తానని అనగానే కనకం అగ్రిమెంట్ పేపర్ ఇస్తుంది. వెళ్లి నీ కూతురిని ఆఫీస్ కి రమ్మని చెప్పు అని అనామిక అంటుంది. నా కూతురు రాదు.. ఎలా రప్పిస్తావో చూపిస్తానని కనకం వెళ్లిపోతుంది. ఆ తర్వాత కనకం ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఎక్కడికి వెళ్ళావని కావ్య అడుగుతుంది. దాంతో కనకం జరిగింది చెప్తుంది. ఎందుకిలా చేసావ్.. తనకి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసని కావ్య అంటుంది.ఆ తర్వాత రాజ్ పడుకుంటాడు.‌ కావ్య వచ్చి తనతో మాట్లాడినట్టు నేనేం తప్పు చెయ్యలేదని తనని కావ్య హగ్ చేసుకున్నట్లు ఉహించుకుంటాడు రాజ్. దాంతో రాజ్ హాల్లోకి వెళ్లి పడుకుంటాడు. రాజ్ హాల్లో పడుకోవడం అపర్ణ ఇందిరాదేవిలు చూసి.. ఎందుకు ఇక్కడ పడుకున్నావని అడుగుతారు. కావ్య కారణమని చెప్తే.. వీళ్ళతో నాకు గొడవ అని అనుకొని ఏదో ఒకటి మ్యానేజ్ చేస్తాడు. ఆ తర్వాత అపర్ణ ఇందిరాదేవి లు కలిసి ఎలాగైనా రాజ్, కావ్యలని ఒక్కటి చెయ్యాలనుకుంటారు. ఆ పని కనకం చెయ్యగలదని ఇద్దరు అత్త కోడళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత కనకం గుడికి వెళ్ళి అపర్ణ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే అపర్ణ ఇందిరాదేవిలు వచ్చి కనకంతో మాట్లాడతారు. కావ్య ఎప్పుడు అల్లుడు గారి గురించే ఆలోచిస్తుందని కనకం అంటుంది. రాజ్ కూడా అంతే అని ఇందిరాదేవి అంటుంది. ఎలాగైనా వాళ్ళని కలపాలనుకుంటారు. తరువాయి భాగంలో కనకంకి క్యాన్సర్ అంట అని రాజ్ కి చెప్తుంది అపర్ణ. దాంతో రాజ్ వెళ్తాడు. మీ చివరి కోరిక ఏంటని కనకాన్ని రాజ్ అడుగగా.. నా ముగ్గురు కూతుళ్లు, అల్లుల్లతో కలిసి నా చివరాకరి పెళ్లి రోజు జరుపుకోవాలని ఉందని కనకం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పృథ్వీకి ఇచ్చిపడేసిన అవినాష్.. యష్మీకి నామినేషన్ల దెబ్బ!

    బిగ్ బాస్ హౌస్ లో కన్నడ బ్యాచ్ కి దిమ్మతిరిగే నామినేషన్లు పడ్డాయి. అందులో యష్మీ, పృథ్వీలకే ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. ఆ తర్వాత విష్ణుప్రియ, కిర్రాక్ సీతలకి పడ్డాయి. ఇక దీనితో పాటు కొత్తగా వచ్చి‌న రాయల్ క్లాన్ నుండి మెహబూబ్, గంగవ్వ నామినేషన్లో ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో పృథ్వీని అవినాష్ నామినేట్ చేశాడు. నామినేషన్ గా తన రీజన్ చెప్తూ.. ప్రభావతి టాస్కు.. బెలూన్ టాస్కు తప్ప మీరు ఎక్కడా కనిపించలేదు.. ఆ ప్రభావతి టాస్కులో కూడా అమ్మాయిలతో ఆడారు, అలా ఆడటం నాకు నచ్చలేదని అవినాష్ అన్నాడు. అంటే అమ్మాయిలతో ఆడకూడదా? ఏమైంది అంటూ పృథ్వీ అన్నాడు. అంటే నీ ఇష్టమొచ్చినట్లు అమ్మాయిలను విసిరేశావ్.. వాళ్లకి దెబ్బలు తగిలుంటాయ్ కదా అంటూ అవినాష్ అన్నాడు. దీనికి నాకు కూడా తగిలాయ్ అంటూ వాదించాడు పృథ్వీ. ఏమో బ్రో నాకు నువ్వు కనిపించలేదు.. టాస్కులో తప్ప హౌస్ లో ఎక్కడా కనపడలేదంటూ అవినాష్ అన్నాడు. మరి ఇంకేం చేయాలి చెప్పు బ్రో టాస్కు కాకుండా అంటూ పృథ్వీ వాదించాడు. గేమ్ అంటే టాస్కు మాత్రమే కాదు.. మరి ఎందుకొచ్చావని అవినాష్ అంటే విన్ అవ్వడానికి వచ్చానంటూ పృథ్వీ అన్నాడు. అయితే సరే విన్ అవ్వు అంటూ అవినాష్ అన్నాడు. ఇక తన రెండో నామినేషన్ గా యష్మీని చేశాడు అవినాష్. వేరేవాళ్ళు మణికంఠని నామినేట్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నావ్.. ప్రతీవారం అలా నామినేట్ చేయడం నచ్చలేదంటూ తన రీజన్ చెప్పాడు అవి‌నాష్.  ఇక మన పాత కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేసాక.. వారికి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ మామ. మీరు రాయల్స్ క్లాన్ నుంచి ఇద్దరు సభ్యులను.. అందరూ కలిసి డిస్కస్ చేసుకొని నామినేట్ చేయాలి.. అయితే నిన్న వారు రెండు షీల్డ్స్ గెలుచుకున్నారు.. వారు నామినేషన్ షీల్డ్‌ను ఉపయోగించుకోవచ్చు.. ఆ షీల్డ్ ఉన్న వారిని మీరు నామినేట్ చేయాలంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి లక్ష రూపాయలు కోల్పోతారు కాబట్టి ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకోండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఓజీ వాళ్ళంతా కలిసి నయని పావని, అవినాష్, గంగవ్వ, మెహబూబ్ అని అనుకున్నారు. అయితే రాయల్ క్లాన్ వాళ్ళంతా కలిసి నయని పావనికి నామినేషన్స్ షీల్డ్ ఇచ్చారు. ఇక వేరే దారి లేక మెజారిటీ సభ్యులు చెప్పిన మెహబూబ్, గంగవ్వలని ఓజీ కంటెస్టెంట్స్ ఛీఫ్ నబీల్ నామినేషన్ చేశారు. ఇక హౌస్ లో జరిగిన నామినేషన్లో యష్మీకే అత్యధికంగా ఆరు నామినేషన్లు  పడ్డాయి.

యష్మీ బాగోతం బయటపెట్టిన రోహిణి.. విష్ణుప్రియపై గంగవ్వ షాకింగ్ కామెంట్లు!

  బిగ్ బాస్ హౌస్ లో మొన్నటి నుండి సాగుతున్న నామినేషన్లు నిన్నటి ఎపిసోడ్ తో ముగిసాయి. ఇక ఈ వారం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. పృథ్వీ, యష్మీ, కిర్రాక్ సీత, విష్ణుప్రియ, గంగవ్వ, మెహబూబ్ నామినేషన్ లో ఉన్నారు. అయితే వీరి నామినేషన్ లో రోహిణి, గంగవ్వ చేసిన నామినేషన్ లో హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ గా అనిపించాయి. అవేంటో ఓసారి చూసేద్దాం. మొదటగా యష్మీని నామినేట్ చేసింది రోహిణి. తన నామినేషన్ రీజన్ చెప్తూ.. నబీల్-పృథ్వీ మెగా చీఫ్ టాస్క్ ఆడినప్పుడు ప్రేరణ సంచాలక్‌గా ఉంది.. తను సంచాలక్‌గా పర్ఫెక్ట్‌గా చేసింది.. కానీ నువ్వు తను సరిగా చేయలేదంటూ చెప్పావ్.. అది నాకు నచ్చలేదంటూ రోహిణి చెప్పింది. నేను తను తప్పు చేసింది అని చెప్పలేదంటూ యష్మీ అనగానే తప్పు చేసిందని చెప్పలేదు కానీ నువ్వే తప్పు చేయమని చెప్పావ్ .. సంచాలక్‌గా ఉన్నప్పుడు తను ఎందుకు హెల్ప్ చేస్తుందంటూ రోహిణి అంది.  సంచాలక్‌గా తను నా ఫ్రెండ్‌కి హెల్ప్ చేయలేదనే కారణంతో నా ఫ్రస్ట్రేషన్ బయటికొచ్చేసింది.. ఒక స్పేస్ వల్ల ఓడిపోయాడని నాకు అనిపించింది.. పృథ్వీ చాలా కష్టపడ్డాడంటూ యష్మీ అంది. అంటే నబీల్ ఏమైనా కాళ్లు చాపి కూర్చున్నాడా.. ఆయన కూడా కష్టపడ్డాడు కదా అని ఇచ్చిపడేసింది రోహిణి. దాంతో హౌస్ లోని వైల్డ్ కార్డ్స్ అంతా పగలబడి నవ్వేశారు. ఇక దానిని సపోర్ట్ చేసుకుంటూ యష్మీ కవర్ చేసింది. అవును నబీల్ గేమ్ కూడా నేను చూశా.. నేను ఏడ్చిన దానికి రీజన్ అంత ఫైట్ చేసి దొరకలేదని ఏడ్చా.. అంతే అంటూ యష్మీ కవర్ చేసుకుంది. మరి నువ్వేమన్నావ్.. నువ్వు గెలవడం తనకి (ప్రేరణ) ఇష్టం లేదేమో అని పృథ్వీతో అన్నావ్ కదా అంటూ మరో ఫిట్టింగ్ పెట్టింది రోహిణి. అంటే నాకు అనిపించింది నేను చెప్తా..మైక్ ఎందుకిచ్చారు మాట్లాడటానికే.. అన్ని పాజిబిలిటీస్ నేను చెప్పా.. నాకు అనిపించింది నేను మాట్లాడాను అంటూ యష్మీ అంది. ఆ తర్వాత తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేసింది రోహిణి. మొదటి వారం చూసినప్పుడు విష్ణు బాగా ఆడుతుందనే ఫీలింగ్ కలిగింది.. కానీ ఆ రేంజ్ నుంచి తర్వాత కిందకి పడిపోయావ్.. నీ కాన్సట్రేషన్ వేరే చోట ఉంది.. నువ్వు రియల్‌గా ఉండు.. కానీ దాని అర్థం టాస్కులన్నీ ఆడి.. ప్రతి దాంట్లో ఎంజాయ్‌మెంట్ వెతుక్కోమంటూ రోహిణి చెప్పింది. మొదటగా విష్ణుప్రియను నామినేట్ చేసింది గంగవ్వ. నువ్వు గేమ్ ఆడట్లేదు.. నీకు కాళ్లు చేతులు సక్కగా లేవా.. ఉన్నా మరెందుకు ఆడట్లే.. ఉత్తిగనే కూసుంటున్నావంటూ గంగవ్వ అంది.  అలా లేదు అవ్వ నాకు వచ్చిన దాంట్లో నేను దూకి బాగా ఆడతా.. అయినా ఇది పర్సనాలిటీ షో కాబట్టి నా బిహేవియర్, నా ఆలోచనలు అన్నీ బయటికి చెబుతున్నా.. నా దృష్టిలో అదే నా ఆట.. ఇక రేపటి నుంచి నా అల్లరి చూస్తావంటూ విష్ణుప్రియ అంది. ఇక తన రెండో నామినేషన్ గా యష్మీని చేసింది గంగవ్వ. మీరు ఎనిమిది మంది ఉన్నారు.. మేము ఎనిమిది మందిమి ఉన్నాం.. వచ్చినప్పటి నుంచి మీరు మాతో మాట్లాడనేలేదు.. మీ రూమ్‌కి వచ్చినా మీరు కేర్ చేయలేదు.. మేము ఉత్తగానే రాలేదుగా.. అలానే మీరే పాలు తాగుతున్నారు.. మమ్మల్ని ఎండబెట్టినారు.. అందుకే మిమ్ముల్ని నామినేట్ చేస్తున్నానంటూ గంగవ్వ చెప్పింది. అయితే గంగవ్వ తెలంగాణ స్లాంగ్‌లో చెప్పిన మాటలు యష్మీకి అర్థం కాలేదు. దీంతో వేరే వాళ్లు మళ్లీ చెప్పాల్సి వచ్చింది. అంటే ఫుడ్ డిసెషన్ నా చేతుల్లో లేదు.. మా చీఫ్ ఇవ్వద్దన్నారు అందుకే ఇవ్వలే.. ఇక మిమ్మల్ని వెల్కమ్ చేయలేదంటే సారీ.. ఇకనుండి రోజూ మీతోనే మాట్లాడతా.. నాకు వచ్చిన చాక్లెట్ కూడా షేర్ చేసుకుంటానంటూ యష్మీ అంది.

నయని పావనిని బాడీ షేమింగ్ చేసిన యష్మీ.. సాటి అమ్మాయిని ఇలా అంటారా?

  బిగ్ బాస్ హౌస్ లో కన్నడ బ్యాచ్ డ్రామా కొనసాగుతుంది. ఎక్కడికెళ్ళిన ప్రేరణ, యష్మీ, పృథ్వీలే కనపడుతున్నారు. అయితే నత్తి బ్రెయిన్ విష్ణుప్రియ ఆ లేజీ అండ్ వేస్ట్ ఫెలో పృథ్వీని ఇష్టపడుతూ తనతోనే తిరుగుతుంది. వైల్డ్ కార్డులు వచ్చి నామినేషన్ చేసి చెప్పిన తన బిహేవియర్ మార్చుకోవడం లేదు విష్ణుప్రియ. మంచిగా గేమ్ ఆడుతూ అందరితో మాట్లాడుతూ కన్పిస్తే కనీసం టాప్-5 లో ఉంటుంది కానీ ఇలా పృథ్వీ వెనకాలే తిరగడం చూసే ఆడియన్స్ కి చిరాకుగా ఉంది. ఇక యష్మీ టార్గెట్ చేసే వారి లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్న మొన్నటి దాకా మణికంఠని ప్రతీ వారం నామినేషన్ చేస్తూ ఓ శత్రువులా చూసిన యష్మీ.. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని పావని మీద‌ పడి ఏడుస్తుంది. అయితే బిగ్ బాస్ మామ తను మాట్లాడిన నెగెటివ్ మాటలని ట్రిమ్ చేసి లేపేశాడు. అయితే బిబి ఆడియన్స్ దీనిని కట్ చేసి సోషల్ మీడియాలో‌ పోస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే పృథ్వీ, యష్మీ గౌడ, విష్ణుప్రియ ఒక దగ్గర మాట్లాడుకుంటన్నారు. నయని పావని.. ఉదయాన్నే లేచి బాగా రెడీ అయ్యి.. డాన్స్ చేసింది. ఫుల్ మేకప్ అయ్యింది.. ఆమె రాత్రి కూడా మేకప్ వేసుకుంటుందేమో.. లేదంటే నిన్న వేసిన మేకప్ తీయలేదేమోనని పృథ్వీ వెటకారంగా అనగా.. ఏంటీ ఆమె మేకప్ తీయలేదా.. మేకప్ తీస్తే చూడలేం అనుకో అని యష్మీ ఆమె స్కిన్ గురించి నీఛంగా మాట్లాడింది. కలర్ బాలేదని , అదీ అమ్మాయిని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది యష్మీకే తెలుసు. అయితే ఇదంతా చూసే ఆడియన్స్ కు మాత్రం కరెక్ట్ అనిపించలేదు‌.. అందుకే  యష్మీ ఇలా బాడీ షేమింగ్ చేసిందంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ని అమర్ దీప్.. వాడు మేకప్ వేసుకోకపోయిన దొంగలాగే ఉంటాడని అనడంతో పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. మరి యష్మీ ఇలా ఒపెన్ గా నయని పావని బాడీ కలర్ గురించి మాట్లాడటాన్ని బిగ్ బాస్ ఎలా వదిలేశారో ఏంటో చూడాలి.

ముమైత్ ఫ్యూచర్ బ్యూటిషియన్స్  అకాడమీ త్వరలో

ముమైత్ ఖాన్ అంటే చాలు ఐటమ్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గానే ఎవరికైనా గుర్తొస్తుంది.  బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గా అల్లాడించింది ముమైత్ ఖాన్.. అమ్మ తమిళనాడు.. నాన్న పాకిస్థాన్ .. దాంతో ముమైత్ మిక్స్డ్ బ్రీడ్ బేబీగా మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో చేసి ఆడియన్స్ లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుంది. అలాంటి ముమైత్  చాలా ఏళ్లుగా బయట ఎక్కడా కనిపించడంలేదు. షోస్ లో మూవీస్ లో కూడా కనిపించడం లేదు.  జీ తెలుగులో ‘డాన్స్ ప్లస్’ జడ్జీగా చేసాక ఆమె ఎవరికీ కనిపించలేదు. ఐతే ఇప్పుడు రీసెంట్ గా ముమైతే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ ని పెట్టింది. త్వరలో ఒక అకాడమీని స్టార్ట్ చేయబోతోంది. అదే "వెల్కి అకాడెమి" అంటే ఫ్యూచర్ బ్యూటిషియన్స్ ని తయారు చేసే అకాడెమి అన్నమాట. బ్యూటీ మాస్టర్ కోర్స్ లో ట్రైనింగ్ ఇప్పించేలా ముమైత్ తన అకాడెమిని సిద్ధం చేస్తోంది. మరి తన అకాడమీ స్టార్ట్ చేయబోతున్న సందర్భంగా అందరూ ఆమెకు విషెస్ చెప్పారు. ఇక ముమైత్  13 ఏళ్ల నుంచే  బ్యాగ్రౌండ్ డాన్సర్‌గా పని చేయడం స్టార్ట్ చేసింది.  17 ఏళ్ల వయసులో మున్నాభాయ్ సినిమాలో కూడా నటించింది. తర్వాత పోకిరి మూవీలో  ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ సాంగ్‌ చేసింది. ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.

బేబక్క పిల్లికి దుబాయ్ లో పెళ్లి

      బిగ్ బాస్ బేబక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హౌస్ లో ఏమో కానీ బయట మాత్రం సోషల్ మీడియాని ఆమె వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోరేమో అనిపిస్తుంది. చిన్న లైన్ దొరికినా చాలు  ఒక వీడియో చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఫుల్ కామెడీగా ఉంది. బేబక్క దగ్గర ఎప్పుడూ ఒక పిల్లి పిల్ల ఉంటుంది. దాని పేరు సింబా. దానికి పెళ్లి చేయాలని అక్క డిసైడ్ అయ్యింది. సో దాన్ని ఎయిర్ పోర్ట్ కి తీసుకొచ్చింది. విషయం ఏమిటి అంటే అది ఆడపిల్ల అంట. దానికి కోసం దుబాయ్ ఫ్లయిట్ లో కాబోయే పెళ్ళికొడుకు వస్తున్నాడని తన సింబాని తీసుకొచ్చిందట. ఒకవేళ ఆ పిల్లి సింబాకి నచ్చితే పెళ్లి చేసేసి దుబాయ్ ఫ్లయిట్ లో పంపించేస్తుందట. సింబాతో పాటు తాను కూడా దుబాయ్ వెళ్ళిపోయి అరబ్ షేక్ గారి పెళ్లిలో ప్రోగ్రామ్స్ అవీ చేసుకుని అక్కడే సెటిల్ ఐపోతానని చెప్పుకొచ్చింది. ఇక  యూట్యూబర్‌గా పాపులర్ అయిన బెజవాడ బేబక్క అసలు పేరు మధు నెక్కంటి. ఐతే బిగ్ బాస్ హౌస్ లో జస్ట్ వన్ వీక్ ఉన్న బేబక్క ఈ వారానికి సుమారుగా రూ. 1.50 లక్షలు సంపాదించింది.

Eto Vellipoyindhi Manasu : భర్తతో భార్యని గెంటించేలా చేసిన సవతి తల్లి.. ఇదేం ట్విస్ట్ రా మామ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ '  ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -221 లో.....రౌడీని తీసుకొని వచ్చి రామలక్ష్మి, మాణిక్యంలు నిజం చెప్పిస్తారు. ఇదంతా చేసింది ఈ సందీప్ అని రౌడీ చెప్పి మళ్ళీ ఇలా చెప్పకుంటే.. ఈ రామలక్ష్మి మాణిక్యంలు చంపేస్తానని బెదిరించారు. ఇప్పుడు నిజం చెప్తున్నాను.. నన్ను ఎప్పుడు ఈ సందీప్ చూడలేదని రౌడీ చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. రౌడీ చెప్పి వెళ్లిపోతుంటే.. వద్దని మాణిక్యం అంటాడు. వెళ్లనివ్వని సీతాకాంత్ అంటాడు. చూసావా సీతా.. నీ భార్య ఎలా చేసిందో.. అన్నాతమ్ముడిని విడదియ్యానుకుంటుంది. ఎప్పుడు నిన్ను గానీ తనని గాని పరాయిలాగా చూసానా అని శ్రీలత యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు బావ గారు.. ఇందాక తప్పు చేసాడని మీ భార్య అనగానే.. తమ్ముడని చూడకుండా కొట్టారు. ఇప్పుడు నిజం తెలిసింది కదా ఇప్పుడు ఎం చేస్తారని శ్రీవల్లి అంటుంది. నేనేం తప్పు చెయ్యలేదు.. ఎప్పుడు ఆయన క్షేమం కోసం మాత్రమే చేశానని రామలక్ష్మి అంటుంది. చక్కగా ఉన్న కుటుంబంలోకి వచ్చి అన్న తమ్ముళ్లని విడదీసి ఆస్తులు కొట్టేయాలనుకుందని శ్రీలత అంటుంది. ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ ఇంట్లో ఎందుకు ఉండడమంటూ శ్రీవల్లి సందీప్ లు బ్యాగ్ తో బయలుదేరతారు. ఉండండి అని శ్రీలత అంటుంది. వదిన నాపై ఉన్నా కోపంతో ఆస్తులు కోసం అన్నయ్యనే చంపాలనుకుంటున్నానని చెప్తుంది అందుకే దూరంగా ఉండి.. నాకు నేనే శిక్ష వేసుకుంటా అని సందీప్ వెళ్లిపోతుంటే.. ఆగండీ మీరెందుకు వెళ్లడం తప్పు చేసిన వాళ్ళు వెళ్తారని సీతాకాంత్ అంటాడు. నేను తప్పు చేసానని అనుకుంటున్నారా అని రామలక్ష్మి అనగానే.. అది నీ మనసుకి తెలుసని సీతాకాంత్ అంటాడు. దాంతో రామలక్ష్మి బాధపడుతూ లోపలికి వెళ్లి బట్టలు సర్దుకొని బ్యాగ్ తో బయటకు వస్తుంటే.. సీతాకాంత్ బాధపడతాడు. శ్రీలత, సందీప్, శ్రీవల్లిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న మాటలకు అత్త షాక్.. దీప ఏం చేయనుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -170 లో.....జ్యోత్స్న కాంచన దగ్గరికి వెళ్తుంది. రా జ్యోత్స్న అని కాంచన అనగానే.. మనుషులే అనుకున్నా పిలుపులు కూడా దూరం అయ్యాయన్నమాట అని జ్యోత్స్న అనగానే.. ఏం దూరం అయిందని కాంచన అంటుంది. ఎప్పుడు వచ్చిన.. రా మేనకోడలా అని పిలిచేదానివి అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎందుకు నన్ను వద్దనుకున్నావని జ్యోత్స్న అనగానే.. నేను అనుకోలేదు.. మీరే నన్ను వద్దని అనుకోలేదా అని కాంచన అంటుంది. మీరు వచ్చి తాతయ్య వాళ్ళని అడగొచ్చు కదా అని జ్యోత్స్న అనగానే.. తన గౌరవం తగ్గించే పని చెయ్యలేనని కాంచన అంటుంది. నువ్వు అంత గౌరవంగా ఫీల్ అయితే అక్రమ సంతానం దగ్గరికి ఎందుకు వెళ్ళావ్.. నీ సవతి కూతురు దగ్గరికి ఎందుకు వెళ్ళావ్.. అది గౌరవమైనా పనా.. దిగజరిపోయి చేసావని జ్యోత్స్న అనగానే.. మర్యాదగా మాట్లాడు అంటూ జ్యోత్స్నపై కార్తీక్ కోప్పడుతారు. నువ్వు ముందు వెళ్లి మీ తాతయ్య, డాడీలని ఒప్పించూ నాకేం అభ్యoతరం లేదని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప ఆలోచిస్తుంటే.. మనకి ఏదో చొరవ ఇచ్చారని మాట్లాడకూడదు. వాళ్లకు నచ్చింది మాత్రమే చేస్తారని దీపతో అనసూయ అంటుంది. అప్పుడే కాంచన ఫోన్ చేసి.. శౌర్యని తీసుకొని రా.. అది ఇక్కడే రెండు మూడు రోజులు ఉంటుందని చెప్పగానే.. దీప సరే అంటుంది. ఆ తర్వాత ఇప్పుడే తీసుకొని వెళ్ళాలిసింది. తనకి ఒంటరిగా ఉన్నా అనిపిస్తుందేమోనని అనసూయ అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ వాళ్ళు భోజనం చేస్తుంటారు.‌జ్యోత్స ఎక్కడా అని అడుగగా.. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాని అంది అని సుమిత్ర అంటుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని శివన్నారాయణ అనగానే.. అత్త వాళ్ళింటికి వెళ్ళానని చెప్తుంది. దాంతో శివన్నారాయణ‌ కోప్పడతాడు. రేపు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళదాం.. తన మనవడితో జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడడానికి అని చెప్పి శివన్నారాయణ‌ వెళ్ళిపోతాడు. వేరే పెళ్లి జరిగితే నీ కూతురు ఉండదని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు నీ కూతురు జీవితం నీ చేతిలో ఉందని పారిజాతం అంటుంది. ఆ తర్వాత సుమిత్ర బయట కూర్చొని ఏడుస్తుంటే.. దీప వచ్చి ఏమైందని అడుగుతుంది జ్యోత్స్నకి వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారని సుమిత్ర అనగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahamamudi : నేనే తప్పు చేయలేదంటూ భార్య రిక్వెస్ట్.. అతను అంగీకరిస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -535 లో.....అందరి గురించి బానే ఆలోచిస్తావ్ కానీ నీ కొడుకేం చేస్తున్నాడో పట్టించుకుంటున్నావా అని అపర్ణ అనగానే.. ఏం చేసాడు అంటీ అని స్వప్న అడుగుతుంది. ఎవరో అమ్మాయిని తీసుకొని షికారు చేస్తున్నాడని అనగానే రాహుల్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత బాగా చూసుకోమంటూ అపర్ణ, ఇందిరాదేవి లోపలికి వెళ్తారు. పద రాహుల్ గదిలోకి అని స్వప్న అంటుంది. నేను రానని రాహుల్ అనగానే.. అయితే ముసుగు వేసుకొని మరి కొడుతానని స్వప్న అనగానే.. అంటే నిన్న నైట్ కొట్టింది నువ్వేనా అని రుద్రాణి అంటుంది. నేను కొడితే నువ్వు ఇలా ఉండేదానివి కాదని రాహుల్ ని గదిలోకి తీసుకొని వెళ్లి చితకబాదుతుంది స్వప్న. మరొకవైపు కావ్య దగ్గరికి అనామిక వస్తుంది. నిన్ను నా దగ్గర పని చేయమని రిక్వెస్ట్ చేయడానికి రాలేదు.. నువ్వు అగ్రిమెంట్ పై సంతకం పెట్టావ్.. అది తప్పితే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. నువ్వు రాకున్నా.. నాకు బెటరే.. నన్ను జైల్లో పెట్టించావ్.. నిన్ను పెట్టించే అవకాశం వచ్చిందని కావ్యకి అనామిక వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అది ఏం చేసిన దుగ్గిరాల కుటుంబానికి చెడు తలపెట్టే ఏ పని చెయ్యనని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత అప్పుని కళ్యాణ్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత సీతారామయ్య దగ్గరికి రాజ్ వస్తాడు. నువ్వు నీ భార్యపై కోపం తో బిజినెస్ మ్యాన్ అన్న విషయం మర్చిపోతున్నావ్ .. కావ్య లాంటి డిజైనర్ మన కంపెనీకి అవసరం.. వెంటనే డిజైనర్ గా అప్పాయింట్మెంట్ చెయ్ అని సీతారామయ్య చెప్తాడు. మరొకవైపు అనామిక దగ్గరున్న అగ్రిమెంట్ కొట్టాయ్యడానికి కనకం మేడమ్ లాగా ఆఫీస్ కి వచ్చి.. కావ్య బాస్ ని మీ కంపెనీ లో ఎంప్లాయిస్ ని టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ వచ్చిందని చెప్తుంది. అందుకే అన్ని అగ్రిమెంట్ లు చెక్ చెయ్యాలని చెప్తుంది. తనతో ఇద్దరిని తీసుకొని వస్తుంది. వాళ్ళ సాయంతో కావ్య అగ్రిమెంట్ పేపర్ తీసుకుంటుంది. అప్పుడే అనామిక.. పిన్ని అంటూ వచ్చి మర్యాదగా ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వమని అంటుంది. తరువాయి భాగంలో రాజ్ ని కావ్య హగ్ చేసుకొని.. నేను ఏ తప్పు చెయ్యలేదు.. నన్ను అర్థం చేసుకోండని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.