వైసీపీ, బీఆర్ఎస్ బంధానికి ఇంత కంటే రుజువుంటుందా?

Publish Date:Dec 20, 2025

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, ఆయన పార్టీ నేతలు, శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి.  అవన్నీ పక్కన పెడితే  తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన  ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని  తాడేపల్లిలోని జగన్ నివాసం అదేనండి తాడేపల్లి ప్యాలెస్ వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు, హోర్డింగ్ లు, కటౌట్ లు వెలిశాయి.  వీటిలో ఒక బ్యానర్ మాత్రం అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.  ఆ భారీ కటౌల్ లో జగన్, కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఉండటమే అందుకు కార ణం. ఈ బ్యానర్ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ బ్యానర్ బీఆర్ఎస్, వైసీపీ బంధానికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో జగన్ కేటీఆర్ తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.  

న‌క్స‌ల్ ఫ్రీ కంట్రీ ఎలాగో....వైసీపీ రాక్ష‌సుల్ ఫ్రీ స్టేట్ సాధ్య‌మేనా?

Publish Date:Dec 21, 2025

  ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు. 2026 మార్చి 31 నాటికి న‌క్స‌ల్ ఫ్రీ కంట్రీగా భార‌త్ ని ఎలా చేస్తున్నారో.. ఏపీ  గ‌వ‌ర్న‌మెంట్ త‌లుచుకుంటూ జ‌గ‌న్ వెంట ఉన్న ఫ్యాక్ష‌నిస్టుల‌ను, గూండాల‌ను, మ‌ర్డ‌రిస్టుల‌ను అలాగే లేకుండా  చేయ‌డం ఏమంత క‌ష్టం కాద‌న్న కామెంట్ చేశారాయ‌న‌. దీంతో ఒక్కొక్క‌రి  ఫీజులెగిరిపోయాయ్. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ అండ్ కో ఉలిక్కి ప‌డింది. ఈ కామెంట్ ప‌వ‌న్ ఎందుకు చేయాల్సి వ‌చ్చిందంటే.. అధికారులు సైతం జ‌గ‌న్, ఆయ‌న వెన‌కున్న ఫ్యాక్ష‌న్ ముఠాల‌ను చూసి భ‌య‌ప‌డుతుండ‌టం వ‌ల్ల‌. వారికంటూ ధైర్యం అందించే దిశ‌గా ప‌వ‌న్ ఈ కామెంట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దీనంత‌టిని బ‌ట్టీ చూస్తే.. ప్ర‌భుత్వం త‌లుచుకుంటే జ‌గ‌న్ని, ఆయ‌న పార్టీని నామ రూపాల్లేకుండా చేయ‌డం పెద్ద ప‌నేం కాద‌ని  తెలుస్తోంది. నిజానికి అది సాధ్య‌మేనా? అంటే అందుకు ద‌గ్గ‌ర్లో ఉన్న ఉదాహ‌ర‌ణ న‌క్స‌లైట్ల‌ను భార‌త  ప్ర‌భుత్వం  రూపుమాపుతుండ‌టం కంటి ముందు క‌నిపిస్తూనే ఉంది. నిన్న మొన్న తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ చెప్పే మాట‌ల‌ను అనుస‌రించి చెబితే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లొంగిపోవ‌ల్సిన  మావోయిస్టుల‌  సంఖ్య కేవ‌లం 54 మంది మాత్ర‌మేన‌ట‌. యాభై నాలుగు మంది అంటే చాలా చాలా  త‌క్కువ సంఖ్య‌. ఇప్ప‌టికే కొన్ని వంద‌లాది మంది మావోయిస్టులు ఇటు ఛ‌త్తీస్ గ‌ఢ్, అటు మ‌హారాష్ట్ర‌తో పాటు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల ముందు లొంగిపోతున్న దృశ్యాలు లేదా ఎన్ కౌంట‌ర్ అవుతున్న దృశ్యాలు మ‌న‌కు క‌నిపిస్తూనే ఉన్నాయి.  ఈ యాంగిల్లో చూస్తే జ‌గ‌న్, ఆయ‌న వెన‌కున్న ర‌ప్ప ర‌ప్ప బ్యాచ్ ని అంత మొందించ‌డం పెద్ద ప‌నేం కాదు. ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌న 5 ఏళ్ల పాల‌నా కాలంలో చేసిన అవినీతి అక్ర‌మాల‌కు సంబంధించిన  ప్ర‌తిదీ  త‌వ్వి  పోస్తున్నారు సీఐడీ అధికారులు. ఇంకా ఎన్నో డిపార్ట్ మెంట్లు జ‌గ‌న్ చుట్టూ అల్లుకుని ఉన్న అవినీతి ప్ర‌పంచం మొత్తాన్ని డీకోడ్ చేస్తున్నారు. వ‌రుస అరెస్టులు చేస్తున్నారు.  అలాంటిది  జ‌గ‌న్ చుట్టూ ఉన్న వారితో పాటు జ‌గ‌న్ ని సైతం జైలు పాలు చేయ‌డం గానీ ఆయ‌న అనుచ‌ర‌గ‌ణాన్ని అరెస్టు చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. దానికి తోడు ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాలను బ‌ట్టీ చూస్తే.. ఇలాంటి వారు ఫ‌లానా కేసుల్లో ఫ్రేమ్ అయితే ఆ త‌ర్వాత ఉన్న ఆ అర‌కొర, బొటాబొటి ప‌ద‌వుల‌ను కూడా కోల్పోయి జైల్లో చిప్ప కూడు తినాల్సి వ‌స్తుంది. మ‌రో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ లా జ‌గ‌న్ ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం మారాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి జ‌గ‌న్ అండ్ గో గంగ‌మ్మ జాత‌ర రివ‌ర్స్ లో ప‌డేలా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో చెప్పేదేముందీ జ‌గ‌న్ రాక్ష‌సుల్ ఫ్రీగా ఏపీ స్టేట్ అవ‌త‌రించినా అవ‌త‌రిస్తుంది.

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

భార్యాభర్తల బంధంలో ప్రేమ తగ్గకూడదంటే.. ఇలా చేయండి..!

Publish Date:Dec 20, 2025

ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది. అంతే కాదు.. ప్రేమ లేని బంధాలు ఎక్కువ కాలం నిలబడవు కూడా. ఇద్దరు వ్యక్తులను అన్ని పరిస్థితులలో నిలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  అయితే బార్యాభర్తల బందంలో చాలా మంది ప్రేమ లేదని అంటూ ఉంటారు.  కొందరేమో ప్రేమ లేకపోయినా కేవలం బందం కోసం ఒక యంత్రంలా బ్రతికేస్తుంటారు. అలా ఉన్న బంధాలలో జీవం ఉండదు. భార్యాభర్తల బందంలో ప్రేమ ఉన్నప్పుడు అది చాలా కాలం ఎంతో అన్యోన్యంగా ఉండేలా చేస్తుంది. అయితే భార్యాభర్తల బందాన్ని బలంగా ఉంచే చిట్కాలు కొన్ని ఉన్నాయి.  ఇవి ఇద్దరి మధ్య ప్రేమను పెంచి ఇద్దరిని మరింత దగ్గర చేస్తాయి.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..  నిజాయితీగా ఉండాలి.. నిజాయితీ అనేది సంబంధానికి బలమైన పునాది. చిన్న విషయాలకు కూడా అబద్ధం చెప్పడం వల్ల సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడూ నిజం చెప్పాలి.   లైప్ పార్ట్నర్ ఫీలింగ్స్ ను కూడా గౌరవించాలి.  నిజాయితీ నమ్మకాన్ని పెంచుతుంది,  ప్రేమను మరింత పెంచుతుంది. ప్రేమ.. మాటల్లో కాదు చేతల్లో.. చాలామంది మాటల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అదే నిజమైన ప్రేమ అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమ అనేది చేతల్లో చూపించాలి. ఒకరికొకరు సమయం కేటాయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం,  చిన్న చిన్న విషయాలలో కూడా కేరింగ్ గా ఉండటం వంటివి ఇద్దరి మధ్య ప్రేమను బలపరుస్తుంది. చిన్న సంతోషాలు.. ప్రేమను, సంతోషాన్ని పంచుకోవడానికి పెద్ద పెద్ద విజయాలు, పెద్ద సమయాలు,  పెద్ద ప్లానింగ్ లు అవసరం లేదు.  చిన్న చిన్న సందర్భాలను కూడా ఇద్దరూ కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అభిరుచులను షేర్ చేసుకోవడం,  చిన్న సర్‌ప్రైజ్ లు, చిన్న బహుమతులు లాంటివి ఇద్దరి మధ్య బంధాన్ని బలంగా మారుస్తాయి. కమ్యూనికేషన్.. నేటి కాలంలో సంబంధాలలో కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే చాలా పెద్ద గొడవలకు కారణం అవుతోంది.   ఆనందాలు, బాధలు, సమస్యలు,  సంతోషకరమైన విషయాలను  ఒకరితో ఒకరు పంచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏ విషయాన్ని అయినా ఆరో్గ్యకరంగా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇద్దరి మధ్య మంచి బంధం ఉంటుంది. ఇగో.. బందాలను దెబ్బ తీసే అతిపెద్ద శత్రువు ఇగో..  చిన్న కోపతాపాలు లేదా కోపంలో మాట్లాడే మాటలు కూడా సంబంధాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి క్షమించడం నేర్చుకోవాలి. భార్యాభర్తలు ఏ గొడవలు జరిగినా ఇద్దరూ ఒకరినొకరు క్షమించడం నేర్చుకున్నప్పుడే బంధం నిలబడుతుంది.  ఇగోను పక్కన పెట్టినప్పుడే ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు.                                                 *రూపశ్రీ.
[

Health

]

ఉప్పు ఎక్కువ తినకపోయినా బీపి ఎక్కువ ఉంటుందా? అసలు నిజం ఇదే..!

Publish Date:Dec 20, 2025

ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది.  భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు  ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. ఉప్పు డేంజర్ ఇందుకే.. ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది.  దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి.  గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం,  మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.  అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది.  దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు. బ్రెడ్, బన్.. బేకరీ.. రోజూ బ్రెడ్ లేదా బన్   వంటివి తినేవారు చాలామంది ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు.  మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు.  కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు  శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం,  సుగర్ ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్,  చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా,  బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. వీటిలో చాలా ఎక్కువ.. టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు,  ప్యాక్ చేసిన చట్నీలు,  ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు..   వీటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా  ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్‌లు, క్రాకర్లు,  బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్‌లో కూడా ఎక్కువ  మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు. చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్‌లు,  ఫ్లేవర్డ్ బటర్ లో  కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది.   అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం,  టెక్చర్ కోసం  కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి.   కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...