నయని పావనిని బాడీ షేమింగ్ చేసిన యష్మీ.. సాటి అమ్మాయిని ఇలా అంటారా?

  బిగ్ బాస్ హౌస్ లో కన్నడ బ్యాచ్ డ్రామా కొనసాగుతుంది. ఎక్కడికెళ్ళిన ప్రేరణ, యష్మీ, పృథ్వీలే కనపడుతున్నారు. అయితే నత్తి బ్రెయిన్ విష్ణుప్రియ ఆ లేజీ అండ్ వేస్ట్ ఫెలో పృథ్వీని ఇష్టపడుతూ తనతోనే తిరుగుతుంది. వైల్డ్ కార్డులు వచ్చి నామినేషన్ చేసి చెప్పిన తన బిహేవియర్ మార్చుకోవడం లేదు విష్ణుప్రియ. మంచిగా గేమ్ ఆడుతూ అందరితో మాట్లాడుతూ కన్పిస్తే కనీసం టాప్-5 లో ఉంటుంది కానీ ఇలా పృథ్వీ వెనకాలే తిరగడం చూసే ఆడియన్స్ కి చిరాకుగా ఉంది. ఇక యష్మీ టార్గెట్ చేసే వారి లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్న మొన్నటి దాకా మణికంఠని ప్రతీ వారం నామినేషన్ చేస్తూ ఓ శత్రువులా చూసిన యష్మీ.. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని పావని మీద‌ పడి ఏడుస్తుంది. అయితే బిగ్ బాస్ మామ తను మాట్లాడిన నెగెటివ్ మాటలని ట్రిమ్ చేసి లేపేశాడు. అయితే బిబి ఆడియన్స్ దీనిని కట్ చేసి సోషల్ మీడియాలో‌ పోస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే పృథ్వీ, యష్మీ గౌడ, విష్ణుప్రియ ఒక దగ్గర మాట్లాడుకుంటన్నారు. నయని పావని.. ఉదయాన్నే లేచి బాగా రెడీ అయ్యి.. డాన్స్ చేసింది. ఫుల్ మేకప్ అయ్యింది.. ఆమె రాత్రి కూడా మేకప్ వేసుకుంటుందేమో.. లేదంటే నిన్న వేసిన మేకప్ తీయలేదేమోనని పృథ్వీ వెటకారంగా అనగా.. ఏంటీ ఆమె మేకప్ తీయలేదా.. మేకప్ తీస్తే చూడలేం అనుకో అని యష్మీ ఆమె స్కిన్ గురించి నీఛంగా మాట్లాడింది. కలర్ బాలేదని , అదీ అమ్మాయిని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది యష్మీకే తెలుసు. అయితే ఇదంతా చూసే ఆడియన్స్ కు మాత్రం కరెక్ట్ అనిపించలేదు‌.. అందుకే  యష్మీ ఇలా బాడీ షేమింగ్ చేసిందంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ని అమర్ దీప్.. వాడు మేకప్ వేసుకోకపోయిన దొంగలాగే ఉంటాడని అనడంతో పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. మరి యష్మీ ఇలా ఒపెన్ గా నయని పావని బాడీ కలర్ గురించి మాట్లాడటాన్ని బిగ్ బాస్ ఎలా వదిలేశారో ఏంటో చూడాలి.

ముమైత్ ఫ్యూచర్ బ్యూటిషియన్స్  అకాడమీ త్వరలో

ముమైత్ ఖాన్ అంటే చాలు ఐటమ్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గానే ఎవరికైనా గుర్తొస్తుంది.  బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గా అల్లాడించింది ముమైత్ ఖాన్.. అమ్మ తమిళనాడు.. నాన్న పాకిస్థాన్ .. దాంతో ముమైత్ మిక్స్డ్ బ్రీడ్ బేబీగా మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో చేసి ఆడియన్స్ లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుంది. అలాంటి ముమైత్  చాలా ఏళ్లుగా బయట ఎక్కడా కనిపించడంలేదు. షోస్ లో మూవీస్ లో కూడా కనిపించడం లేదు.  జీ తెలుగులో ‘డాన్స్ ప్లస్’ జడ్జీగా చేసాక ఆమె ఎవరికీ కనిపించలేదు. ఐతే ఇప్పుడు రీసెంట్ గా ముమైతే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ ని పెట్టింది. త్వరలో ఒక అకాడమీని స్టార్ట్ చేయబోతోంది. అదే "వెల్కి అకాడెమి" అంటే ఫ్యూచర్ బ్యూటిషియన్స్ ని తయారు చేసే అకాడెమి అన్నమాట. బ్యూటీ మాస్టర్ కోర్స్ లో ట్రైనింగ్ ఇప్పించేలా ముమైత్ తన అకాడెమిని సిద్ధం చేస్తోంది. మరి తన అకాడమీ స్టార్ట్ చేయబోతున్న సందర్భంగా అందరూ ఆమెకు విషెస్ చెప్పారు. ఇక ముమైత్  13 ఏళ్ల నుంచే  బ్యాగ్రౌండ్ డాన్సర్‌గా పని చేయడం స్టార్ట్ చేసింది.  17 ఏళ్ల వయసులో మున్నాభాయ్ సినిమాలో కూడా నటించింది. తర్వాత పోకిరి మూవీలో  ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ సాంగ్‌ చేసింది. ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.

బేబక్క పిల్లికి దుబాయ్ లో పెళ్లి

      బిగ్ బాస్ బేబక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హౌస్ లో ఏమో కానీ బయట మాత్రం సోషల్ మీడియాని ఆమె వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోరేమో అనిపిస్తుంది. చిన్న లైన్ దొరికినా చాలు  ఒక వీడియో చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఫుల్ కామెడీగా ఉంది. బేబక్క దగ్గర ఎప్పుడూ ఒక పిల్లి పిల్ల ఉంటుంది. దాని పేరు సింబా. దానికి పెళ్లి చేయాలని అక్క డిసైడ్ అయ్యింది. సో దాన్ని ఎయిర్ పోర్ట్ కి తీసుకొచ్చింది. విషయం ఏమిటి అంటే అది ఆడపిల్ల అంట. దానికి కోసం దుబాయ్ ఫ్లయిట్ లో కాబోయే పెళ్ళికొడుకు వస్తున్నాడని తన సింబాని తీసుకొచ్చిందట. ఒకవేళ ఆ పిల్లి సింబాకి నచ్చితే పెళ్లి చేసేసి దుబాయ్ ఫ్లయిట్ లో పంపించేస్తుందట. సింబాతో పాటు తాను కూడా దుబాయ్ వెళ్ళిపోయి అరబ్ షేక్ గారి పెళ్లిలో ప్రోగ్రామ్స్ అవీ చేసుకుని అక్కడే సెటిల్ ఐపోతానని చెప్పుకొచ్చింది. ఇక  యూట్యూబర్‌గా పాపులర్ అయిన బెజవాడ బేబక్క అసలు పేరు మధు నెక్కంటి. ఐతే బిగ్ బాస్ హౌస్ లో జస్ట్ వన్ వీక్ ఉన్న బేబక్క ఈ వారానికి సుమారుగా రూ. 1.50 లక్షలు సంపాదించింది.

Eto Vellipoyindhi Manasu : భర్తతో భార్యని గెంటించేలా చేసిన సవతి తల్లి.. ఇదేం ట్విస్ట్ రా మామ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ '  ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -221 లో.....రౌడీని తీసుకొని వచ్చి రామలక్ష్మి, మాణిక్యంలు నిజం చెప్పిస్తారు. ఇదంతా చేసింది ఈ సందీప్ అని రౌడీ చెప్పి మళ్ళీ ఇలా చెప్పకుంటే.. ఈ రామలక్ష్మి మాణిక్యంలు చంపేస్తానని బెదిరించారు. ఇప్పుడు నిజం చెప్తున్నాను.. నన్ను ఎప్పుడు ఈ సందీప్ చూడలేదని రౌడీ చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. రౌడీ చెప్పి వెళ్లిపోతుంటే.. వద్దని మాణిక్యం అంటాడు. వెళ్లనివ్వని సీతాకాంత్ అంటాడు. చూసావా సీతా.. నీ భార్య ఎలా చేసిందో.. అన్నాతమ్ముడిని విడదియ్యానుకుంటుంది. ఎప్పుడు నిన్ను గానీ తనని గాని పరాయిలాగా చూసానా అని శ్రీలత యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు బావ గారు.. ఇందాక తప్పు చేసాడని మీ భార్య అనగానే.. తమ్ముడని చూడకుండా కొట్టారు. ఇప్పుడు నిజం తెలిసింది కదా ఇప్పుడు ఎం చేస్తారని శ్రీవల్లి అంటుంది. నేనేం తప్పు చెయ్యలేదు.. ఎప్పుడు ఆయన క్షేమం కోసం మాత్రమే చేశానని రామలక్ష్మి అంటుంది. చక్కగా ఉన్న కుటుంబంలోకి వచ్చి అన్న తమ్ముళ్లని విడదీసి ఆస్తులు కొట్టేయాలనుకుందని శ్రీలత అంటుంది. ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ ఇంట్లో ఎందుకు ఉండడమంటూ శ్రీవల్లి సందీప్ లు బ్యాగ్ తో బయలుదేరతారు. ఉండండి అని శ్రీలత అంటుంది. వదిన నాపై ఉన్నా కోపంతో ఆస్తులు కోసం అన్నయ్యనే చంపాలనుకుంటున్నానని చెప్తుంది అందుకే దూరంగా ఉండి.. నాకు నేనే శిక్ష వేసుకుంటా అని సందీప్ వెళ్లిపోతుంటే.. ఆగండీ మీరెందుకు వెళ్లడం తప్పు చేసిన వాళ్ళు వెళ్తారని సీతాకాంత్ అంటాడు. నేను తప్పు చేసానని అనుకుంటున్నారా అని రామలక్ష్మి అనగానే.. అది నీ మనసుకి తెలుసని సీతాకాంత్ అంటాడు. దాంతో రామలక్ష్మి బాధపడుతూ లోపలికి వెళ్లి బట్టలు సర్దుకొని బ్యాగ్ తో బయటకు వస్తుంటే.. సీతాకాంత్ బాధపడతాడు. శ్రీలత, సందీప్, శ్రీవల్లిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్న మాటలకు అత్త షాక్.. దీప ఏం చేయనుంది!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -170 లో.....జ్యోత్స్న కాంచన దగ్గరికి వెళ్తుంది. రా జ్యోత్స్న అని కాంచన అనగానే.. మనుషులే అనుకున్నా పిలుపులు కూడా దూరం అయ్యాయన్నమాట అని జ్యోత్స్న అనగానే.. ఏం దూరం అయిందని కాంచన అంటుంది. ఎప్పుడు వచ్చిన.. రా మేనకోడలా అని పిలిచేదానివి అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎందుకు నన్ను వద్దనుకున్నావని జ్యోత్స్న అనగానే.. నేను అనుకోలేదు.. మీరే నన్ను వద్దని అనుకోలేదా అని కాంచన అంటుంది. మీరు వచ్చి తాతయ్య వాళ్ళని అడగొచ్చు కదా అని జ్యోత్స్న అనగానే.. తన గౌరవం తగ్గించే పని చెయ్యలేనని కాంచన అంటుంది. నువ్వు అంత గౌరవంగా ఫీల్ అయితే అక్రమ సంతానం దగ్గరికి ఎందుకు వెళ్ళావ్.. నీ సవతి కూతురు దగ్గరికి ఎందుకు వెళ్ళావ్.. అది గౌరవమైనా పనా.. దిగజరిపోయి చేసావని జ్యోత్స్న అనగానే.. మర్యాదగా మాట్లాడు అంటూ జ్యోత్స్నపై కార్తీక్ కోప్పడుతారు. నువ్వు ముందు వెళ్లి మీ తాతయ్య, డాడీలని ఒప్పించూ నాకేం అభ్యoతరం లేదని కాంచన అంటుంది. ఆ తర్వాత దీప ఆలోచిస్తుంటే.. మనకి ఏదో చొరవ ఇచ్చారని మాట్లాడకూడదు. వాళ్లకు నచ్చింది మాత్రమే చేస్తారని దీపతో అనసూయ అంటుంది. అప్పుడే కాంచన ఫోన్ చేసి.. శౌర్యని తీసుకొని రా.. అది ఇక్కడే రెండు మూడు రోజులు ఉంటుందని చెప్పగానే.. దీప సరే అంటుంది. ఆ తర్వాత ఇప్పుడే తీసుకొని వెళ్ళాలిసింది. తనకి ఒంటరిగా ఉన్నా అనిపిస్తుందేమోనని అనసూయ అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ వాళ్ళు భోజనం చేస్తుంటారు.‌జ్యోత్స ఎక్కడా అని అడుగగా.. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాని అంది అని సుమిత్ర అంటుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని శివన్నారాయణ అనగానే.. అత్త వాళ్ళింటికి వెళ్ళానని చెప్తుంది. దాంతో శివన్నారాయణ‌ కోప్పడతాడు. రేపు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళదాం.. తన మనవడితో జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడడానికి అని చెప్పి శివన్నారాయణ‌ వెళ్ళిపోతాడు. వేరే పెళ్లి జరిగితే నీ కూతురు ఉండదని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు నీ కూతురు జీవితం నీ చేతిలో ఉందని పారిజాతం అంటుంది. ఆ తర్వాత సుమిత్ర బయట కూర్చొని ఏడుస్తుంటే.. దీప వచ్చి ఏమైందని అడుగుతుంది జ్యోత్స్నకి వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారని సుమిత్ర అనగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahamamudi : నేనే తప్పు చేయలేదంటూ భార్య రిక్వెస్ట్.. అతను అంగీకరిస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -535 లో.....అందరి గురించి బానే ఆలోచిస్తావ్ కానీ నీ కొడుకేం చేస్తున్నాడో పట్టించుకుంటున్నావా అని అపర్ణ అనగానే.. ఏం చేసాడు అంటీ అని స్వప్న అడుగుతుంది. ఎవరో అమ్మాయిని తీసుకొని షికారు చేస్తున్నాడని అనగానే రాహుల్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత బాగా చూసుకోమంటూ అపర్ణ, ఇందిరాదేవి లోపలికి వెళ్తారు. పద రాహుల్ గదిలోకి అని స్వప్న అంటుంది. నేను రానని రాహుల్ అనగానే.. అయితే ముసుగు వేసుకొని మరి కొడుతానని స్వప్న అనగానే.. అంటే నిన్న నైట్ కొట్టింది నువ్వేనా అని రుద్రాణి అంటుంది. నేను కొడితే నువ్వు ఇలా ఉండేదానివి కాదని రాహుల్ ని గదిలోకి తీసుకొని వెళ్లి చితకబాదుతుంది స్వప్న. మరొకవైపు కావ్య దగ్గరికి అనామిక వస్తుంది. నిన్ను నా దగ్గర పని చేయమని రిక్వెస్ట్ చేయడానికి రాలేదు.. నువ్వు అగ్రిమెంట్ పై సంతకం పెట్టావ్.. అది తప్పితే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. నువ్వు రాకున్నా.. నాకు బెటరే.. నన్ను జైల్లో పెట్టించావ్.. నిన్ను పెట్టించే అవకాశం వచ్చిందని కావ్యకి అనామిక వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అది ఏం చేసిన దుగ్గిరాల కుటుంబానికి చెడు తలపెట్టే ఏ పని చెయ్యనని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత అప్పుని కళ్యాణ్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత సీతారామయ్య దగ్గరికి రాజ్ వస్తాడు. నువ్వు నీ భార్యపై కోపం తో బిజినెస్ మ్యాన్ అన్న విషయం మర్చిపోతున్నావ్ .. కావ్య లాంటి డిజైనర్ మన కంపెనీకి అవసరం.. వెంటనే డిజైనర్ గా అప్పాయింట్మెంట్ చెయ్ అని సీతారామయ్య చెప్తాడు. మరొకవైపు అనామిక దగ్గరున్న అగ్రిమెంట్ కొట్టాయ్యడానికి కనకం మేడమ్ లాగా ఆఫీస్ కి వచ్చి.. కావ్య బాస్ ని మీ కంపెనీ లో ఎంప్లాయిస్ ని టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ వచ్చిందని చెప్తుంది. అందుకే అన్ని అగ్రిమెంట్ లు చెక్ చెయ్యాలని చెప్తుంది. తనతో ఇద్దరిని తీసుకొని వస్తుంది. వాళ్ళ సాయంతో కావ్య అగ్రిమెంట్ పేపర్ తీసుకుంటుంది. అప్పుడే అనామిక.. పిన్ని అంటూ వచ్చి మర్యాదగా ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వమని అంటుంది. తరువాయి భాగంలో రాజ్ ని కావ్య హగ్ చేసుకొని.. నేను ఏ తప్పు చెయ్యలేదు.. నన్ను అర్థం చేసుకోండని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నేను చేద్దామనుకునేలోపే విజయ్ దేవరకొండ చేసేసాడు

  గూగుల్ లో ఆటిట్యూడ్ స్టార్ ఎవరు అని టైపు చేయగానే సీనియర్ మోస్ట్ నటుడు ప్రభాకర్ సుపుత్రుడు చంద్రహాస్ పేరే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఆటిట్యూడ్ స్టార్ట్ "రామ్ నగర్ బన్నీ" అనే మూవీలో నటించాడు. ఐతే కొడుకుని హీరోని చేయడానికి ఆస్తులు మొత్తం తాకట్టుపెట్టి మరీ సినిమాను నిర్మించాడు ప్రభాకర్. ఐతే ఈ మూవీ నిర్మిస్తున్నంత సేపు కూడా ప్రభాకర్ చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు చంద్రహాస్ ఒక ఇంటర్వ్యూలో. ఐతే ఈ మూవీలో నటించినందుకు మొదటి రెమ్యూనరేషన్ గా తండ్రి చేతుల మీదుగా ఒక లక్ష రూపాయలు అందుకున్నాడట. ఐతే ఆ డబ్బును ఎం చేసావ్ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రెండు రాష్ట్రాల వరద సహాయంగా చెరో 50 వేలు ఇచ్చేశానని చెప్పాడు. ఇక నాన్న సినిమా షూటింగ్ ఎన్నాళ్ళు ఎన్నో కరెక్షన్స్ చెప్పారని చెప్పాడు. అలాగే కోపమొస్తే "నా కొడకా" అని తిట్టేవాళ్లు. నిజంగా ఆయన కొడుకునే కదా అంటూ కామెడీ చేసాడు. అలాగే "విజయ్ దేవరకొండను కలుద్దామనుకున్న ఫోన్ నంబర్ సంపాయించి మెసేజ్ చేశా. ఐతే అర్జున్ రెడ్డిలో విజయ్ స్పీచ్ విని అలా చేద్దాం ఆనుకున్న... అలాగే లాక్ డౌన్ టైములో ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. అవన్నీ చూసినప్పుడు నేను చేద్దాం అనుకునేలోపే ఆయన చేసేస్తున్నారు అని అనిపించేది ..ఆయన నటనే కాదు జనాల్లోకి వెళ్లేలా ఎన్నో మంచి పనులు చేశారు అందుకే ఆయనంటే ఇష్టం" అంటూ చంద్రహాస్ ఎన్నో విషయాలు చెప్పాడు.

ఆది - రష్మీ ప్రేమకు ఇన్నేళ్ళుగా అడ్డుపడిన సుధీర్

  జబర్దస్త్ టైం నుంచి మనం చూస్తే ఆన్ స్క్రీన్ జోడీగా బాగా క్లిక్ ఐన పెయిర్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మీ - సుధీర్ జోడి మాత్రమే. కార్తీక దీపం సీరియల్ జోడి తరువాత జబర్దస్త్ జోడి బాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఐతే అదంతా ఆన్ స్క్రీన్ మీద తప్ప అసలు బయట ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటాం అని కూడా చాలా సార్లు చెప్పారు. కానీ ఆడియన్స్ ఊరుకోలేదు. సుధీర్ - రష్మీ పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకునేవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఐతే తరువాత కాలంలో ఇద్దరూ వేరు వేరు షోస్ చేసుకుంటూ దూరమైపోయారు. ఐనా కానీ వీళ్ళ జోడి మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పొద్దూ. బుల్లితెర జోడి అంటే వీళ్ళే గుర్తొస్తారు. ఐతే ఇప్పుడు ఆది తన మనసులో అసలు విషయాన్ని బయటపెట్టాడు. రష్మీ సుధీర్ మీద మనసు పడిందో లేదో కానీ ఆది మాత్రం రష్మీ మీద మనసు పడినట్టు తన కామెంట్స్ ద్వారా చెప్పకనే చెప్పాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో ఈ విషయం బయట పెట్టాడు. రష్మీని కుర్చీలో కూర్చోబెట్టి నెమలి ఈకల్తో ఆమెను సవరదీస్తూ "రష్మీ నాకు వాడు తొమ్మిది సంవత్సరాలు అడ్డుపడ్డాడు.." అనేసరికి అందరూ షాకైపోయారు. అంటే దీన్ని బట్టి రష్మీ అంటే ఆదికి ఇష్టం అనే విషయం తెలుస్తోంది.

అఖిల్ సార్థక్ సెలూన్ ని ఓపెన్ చేసిన నాగార్జున

  బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ కొంతకాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయాడు. వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కూడా  అఖిల్ సందడి చేయడం లేదు. నీతోనే డ్యాన్స్ షో అంటూ తేజస్వీతో  అఖిల్ డ్యాన్స్ చేసాడు ఆ తర్వాత అస్సలు కనిపించకుండా  వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ సందడి చేస్తున్నాడు అఖిల్. హైదరాబాద్ లో ఎలెవన్ సలోన్ ని ఓపెన్ చేసాడు. ఇక తన సలోన్ ఓపెనింగ్ ఫంక్షన్ కి  తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసాడు. ఆర్జే కాజల్, రోల్ రైడ, సిరి హన్మంత్, నోయెల్, అలాగే హీరో నాగార్జున, బ్రహ్మముడి  మానస్ వాళ్ళ అమ్మ పద్మిని, వచ్చారు. ఇక నాగార్జునతో సలోన్ ని ఓపెన్ చేయించాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నరప్ గా నిలైహ్చాడు అఖిల్. ఐతే అఖిల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పెద్దగా ఎలాంటి ఆఫర్స్ రాలేదు. కొన్ని షోస్ కి హోస్ట్ చేసాడు కానీ పెద్దగా క్లిక్ కాలేదు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక అందరిలో కొందరికైనా దశ తిరుగుతుంది కానీ అఖిల్ కి మాత్రం ఇంకా మహర్దశ వచ్చినట్టు కనిపించడం లేదు. ఇక ఇప్పుడు సలోన్ ఓపెన్ చేసేసరికి నెటిజన్స్ అంతా కూడా విషెస్ చెప్తున్నారు.

రక్ష గౌడ వెకేషన్ ఫోటోలు.. గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి షాక్!

  అందమైన చందనాల బొమ్మరా అని పాడాలనిపచేలా గుప్పెడంత మనసు సీరియల్ లో కన్పించిన వసుధార అలియాస్ రక్ష గౌడ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలని షేర్ చేసింది. ఆ ఫోటోలని‌ గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ చూస్తే షాక్ అవుతారు. ట్రెండీ లుక్ లో‌ పొట్టి బట్టల్లో ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ భామ‌‌. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి జోడీగా రిషీధాలుగా కలిసి ఉన్నారు ‌ వీరిద్దరి జోడికి ఇన్ స్టాగ్రామ్ లో‌ బోలెడంత ఫ్యాన్స్ ఉన్నారు. ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరి జోడి ఎంత పెద్ద హిట్టో ఆ సీరియల్ టీఆర్పీ చూస్తే తెలుస్తుంది. రక్ష తాజాగా మలేషియా వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ రక్ష అక్కడి ఫొటోలు పంచుకుంది. ఇందులో చిన్న డ్రెస్ లో కనువిందు చేసింది. అయితే కొందరు భలే క్యూట్‌గా ఉందనగా.. మరికొందరు ఇలాంటివి పోస్ట్ చేయకండి అంటు కామెంట్లు పెడుతున్నారు. ఇక రిషి, వసుధారల కాంబినేషన్ లో‌ మరో  సీరియల్ కావాంటే ' గుప్పెడంత మనసు' సీరియల్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు.  

మణికంఠని రోస్ట్ చేసిన గంగవ్వ.. ఇదెక్కడి మాస్ రా మామ!

  ఓరీ మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయిర్రా నాకు అన్నట్టుగా నాగ మణికంఠ భావిస్తున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్-8 మొదలైనప్పటి నుండి‌ మణికంఠ సింపథీ గేమ్ ప్లే చేస్తున్నాడు. అయితే టాస్క్ లో క్లియర్ గా సంఛాలక్ గా చేసే మణికంఠ.. కాస్త వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు.‌ అదే విషయాన్ని చెప్తూ గంగవ్వ ఓ ఆట ఆడుకుంది. యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.. ఆరు పదుల వయస్సులో సెలబ్రిటీగా మారిన గంగవ్వకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తన కల నెరవేర్చుకుంది. అయితే ఈ ఇంటి నిర్మాణం కోసం నాగార్జున సాయం చేసినట్లు స్టేజ్ మీదే వెల్లడించింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ, మెహబూబ్, మణికంఠ, టేస్టీ తేజ గార్టెన్ ఏరియాలో ఉన్నారు. ఇక గంగవ్వ తన మాటలతో , పంచులతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది.  ఓ పిలగా.. నా భార్య కావాలి.. నా పాప కావాలని ఏడ్చింది నువ్వే నాకు తెలుసు అని‌ గంగవ్వ అనగానే.. అవును కావాలని మణికంఠ అంటాడు. అయితే నామినేషన్ వేస్తా వెళ్ళని అనగానే.. మరి పైసల్ కావాలి కదా.. హౌస్ లోకి వచ్చింది పైసల కోసం కాదా అని గంగవ్వ అంది. అయిన గట్ల ఏడుస్తున్నాడేంది ఈ మగ బాయ్ అని అనుకున్నానంటూ గంగవ్వ అనగానే.. టేస్టీ తేజ, మెహబూబ్ నవ్వుకున్నారు. ఇక అంతకముందు నబీల్, నిఖిల్, రోహిణి, పృథ్వీ, విష్ణుప్రియ అందరు గార్డెన్ ఏరియా దగ్గరలోని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటన్నారు. కాస్త ఆ పాలు ఇస్తే మేం ఛాయ్ చేసుకుంటామని గంగవ్వ అనగానే.. మిల్క్ లగ్జరీ అని నబీల్ అన్నాడు. మరి అలా చెప్తే మేం పాల ప్యాకెట్లు తెచ్చుకునేవాళ్ళ‌ం కదా అని గంగవ్వ అంది. అయిన మా సీజన్ లో ఫుల్ పాలు.. పెద్దదాన్ని కదా నాకు ఇవ్వమని గంగవ్వ అనగానే.. నేను కూడా పెద్దదాన్నే అని అక్కడే ఉన్న రోహిణి అనగానే.. నీకెంత మంది పిల్లలు అని గంగవ్వ అంది. ఇక రోహిణితో పాటు అక్కడివారంతా ఫల్లుమని నవ్వేశారు.   

విష్ణుప్రియకు నయని పావని గైడెన్స్.. ఛీఫ్ గా గెలవాలనే జీల్ లేదంట!

  ఇదెక్కడి మాస్ రా మామ.‌. అన్నట్టుగా ఎవరైన నామినేషన్ లో తమ తప్పు చెప్తే డిఫెండ్ చేసుకోవాలి కానీ మన అడల్ట్ రిలేటెడ్ జోక్స్ ముద్దుబిడ్డ ప్రేక్షకుల గారాల పట్టీ విష్ణుప్రియ తన నత్తి బ్రెయిన్ ని మరోసారి ఋజువు చేసుకుంది.  అసలేం జరిగిందంటే.. నిన్న వైల్డ్ కార్డ్స్ అందరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పగా.. మొదటగా విష్ణుప్రియని నయని పావని నామినేట్ చేసింది. అసలు నువ్వు హౌస్ లో ఎందుకున్నావ్.. ఓ టాస్క్ ఆడవు.. ఛీఫ్ అవ్వాలనే జీల్ లేదు.. కానీ ఇన్ని వారాల నుండి ఎవరో ఒకరి వెనక తిరుగుతు ఎందుకు ఇలా ఉన్నావ్.. నీకు సీరియస్ నెస్ అస్సలు లేదు.. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతి టాస్కు ముఖ్యం.. అది మిస్ అయితే నువ్వు ప్రూ చేసుకునే ఛాన్స్ ఒకటి మిస్ అయినట్లే.. కానీ నువ్వు ఈ వారం నాకు చీఫ్ అవ్వాలని లేదు.. ఆరో వారం అవుతానంటూ చెప్తున్నావ్.. అలా అప్పుడు నీకు ఛాన్స్ రాకపోవచ్చు.. ఈలోపే వెళ్లిపోవచ్చు.. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు.. నీ బదులు ఎంతమంది ట్యాలెంటెడ్  పీపుల్స్ బయట ఉన్నారు. మీ బదులు వారొస్తే బాగుండేదని మీ ఆటతీరు చూస్తే అర్తమైందని నయని పావని అనగా.. ఇది నా ఆట.. నా లైఫ్‌లో సీరియస్‌నెస్ లేదు.. నాకు ఏది కావాలో అదే సీరియస్‌గా తీసుకుంటా.. అందుకే నా కెరీర్‌లో ఇంతవరకు పైకి వచ్చా.. నాలో ఏదో ఉందనే ఈ షో వాళ్లు నన్ను పిలిచారు.. ఇక చీఫ్ టాస్కుకి నేను ఇంట్రెస్ట్ లేదు అన్నా.. ఎందుకంటే రెడీగా లేకుండా నేను అయిపోతా అని గొప్పలు చెప్పడం నాకు ఇష్టం లేదు.. ఇక ఈ షోను అర్థం చేసుకోవడానికే నాకు కాస్త టైమ్ కావాలంటూ విష్ణుప్రియ అంది. సెకండ్ సీతని నామినేట్ చేసింది నయని. మీరు చీఫ్ అయిన తర్వాత మీ గేమ్ ఎక్కువ కనిపించలేదు.. అంతకుముందు చాలా ఫైర్ ఉండేది.. కానీ చీఫ్ అయ్యాక ఏ గేమ్‌లోనూ ముందుకు రాలేదు మీరు.. అలానే మీరు నామినేట్ చేసినప్పుడు వాళ్లు బయటికి వెళ్లిపోతారని మీకు తెలుసు కదా.. మరి మీరే నామినేట్ చేసి మీరే ఏడవటం ఎందుకు.. అలానే నిన్న మేము ఎంట్రీ ఇచ్చినప్పుడు.. అందరు బాగా వెల్ కమ్ చెప్పారు.. కానీ మీరు కనీసం నవ్వలేదంటూ నయని అంది. ఇది కాస్త సిల్లీగా అనిపించింది కానీ హౌస్ లో వారి బిహేవియర్ అనేది దగ్గరుండి చూసినవాళ్ళకే తెలుస్తుంది.

మణికంఠకు రాడ్ దింపిన టేస్టీ తేజ!

  మిమ్మల్ని అందరిని అడుగుతున్నా.. అదే మిమ్మల్నే అడుగుతున్నా.. మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవా.. అలా ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చేయి లేపండి.. ఇలా మాట్లాడింది టేస్టీ తేజ. బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత మొదటి నామినేషన్ జరిగింది. ‌ఇక ఇందులో యష్మీకి అత్యదిక నామినేషన్లు పడ్డాయి. ఆ తర్వాతి పృథ్వీ, విష్ణుప్రియ, కిర్రాక్ సీతలకి నామినేషన్లు పడ్డాయి. కిర్రాక్ సీతని క్రైయింగ్ బేబీ అంటు నయని పావని చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యాయి. అయితే మణికంఠని ఎవరు నామినేషన్ చేయరు అని అనుకున్నారంతా కానీ టేస్టీ తేజ అతడిని నామినేట్ చేసి పాత కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చాడు.  నాకు అవకాశం ఇస్తే 8 మందిని నామినేట్ చేసేస్తా బిగ్‌బాస్.. ఎందుకంటే పొద్దున్నే పాట పెట్టగానే మీరంతా డ్యాన్స్ వేయడం లేదబ్బా.. డ్యాన్స్‌లు వేసేటప్పుడు కుక్కల సౌండ్ పెట్టాడు బిగ్‌బాస్.. అది ఈ సీజన్‌లోనే ఫస్ట్ టైమ్ జరిగింది.. అది నేనెప్పుడు చూడలేదు.. ఇంత బాడీ పెట్టుకొని నేనే డ్యాన్స్ చేస్తున్నా.. మీకేమైంది.. రేపు మార్నింగ్ నుంచి కలిసి డ్యాన్స్ చేద్దాం.. మీ అందరికీ నేను నేర్పిస్తా డ్యాన్స్.. అంటూ తేజ అన్నాడు. మొదటగా కిర్రాక్ సీతని నామినేట్ చేసిన టేస్టీ తేజ.. తన సెకెంఢ్ నామినేషన్ గా మణికంఠని నామినేషన్ చేశాడు. ఇందులో తేజ ఏం చెప్పాడంటే.. ప్రాబ్లమ్స్ లేనివాళ్లు ఎవరూ లేరబ్బా.. అందరికీ ఉన్నాయి.. అయితే ఒకసారి ప్రాబ్లమ్ ఉందని చెప్పినప్పుడు.. పాపం అని అర్థం చేసుకుంటారు.. కానీ మాటిమాటికీ అదే చెబితే ఏందిరా వీడు అనిపిస్తుంది.. సీరియస్‌లీ నువ్వు గుడ్ గేమర్ నీ అభిప్రాయం ప్రకారం.. కానీ నువ్వు ఆ ఏడపు మాత్రం మానేయాలి.. నీకు తెలీకుండానే అలా అయిపోతున్నావంటే మాత్రం మార్చుకో.. లేదు నువ్వు కావాలనే చేస్తున్నావంటే ఓకే.. నువ్వు గుడ్ గేమర్ అని చెప్పేస్తానంటూ తేజ అన్నాడు. కన్ఫెషన్ రూమ్‌లో ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్ విషయంలో యష్మీ నీకు ఇవ్వలేదని నువ్వు చాలా బాధపడ్డావ్. ఆ తర్వాత నువ్వు కూడా యష్మీ కోసం తీసుకురాలేదు.. అప్పుడు యష్మీ నీకంటే వెయ్యి రెట్లు బాధపడింది.. నువ్వు యష్మీకి ఇచ్చేస్తే బావున్ను అనిపించింది.. అంటూ తేజ అన్నాడు. దీనికి మణికంఠ సమాధానమిస్తూ నేను లోపలికి వెళ్లేటప్పుడు యష్మీ నాకు చెప్పింది. నాది తీసుకురాకపోయినా ఫర్లేదు అన్నట్లుగా అంటూ మణి అన్నాడు. దీనికి వెంటనే యష్మీ దూరిపోయి నేను అలా అనలేదు.. నీకు నచ్చినట్లు చెయ్ అని చెప్పానంటూ యష్మీ అంది. 

యష్మీ, పృథ్వీల నిజస్వరూపాన్ని బయటపెట్టిన హరితేజ!

  బిగ్ బాస్  సీజన్-8 ఇప్పుడు కొత్త రంగులను పులుముకుంది. హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఎంటర్‌టైన్మెంట్ మాములుగా లేదు. వచ్చీ రాగానే ఎక్స్ కంటెస్టెంట్స్ ఇచ్చే ఫన్ అండ్ కంటెంట్ కి ఆడియన్స్ వారికి కనెక్ట్ అయ్యారు.‌ ఎనిమిది మంది వస్తే ఒక్కరు ఇద్దరు తప్ప అందరు తమ బెస్ట్ ఇస్తున్నారు. ఇక సోమవారం హౌస్ లో‌ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ‌ఏదీ వదలకుండా ప్రతీ పాయింట్ ని క్లియర్ గా చెప్తూ వైల్డ్ కార్డ్స్ నామినేషన్ చేస్తుంటే.. బిగ్ బాస్ చూసే ఆడియన్ అడిగినట్టుగా ఉంది. చాలా రోజుల తర్వాత ది బెస్ట్ డే ఇన్ బిగ్ బాస్ అనిపించేలా నిన్నటి ఎపిసోడ్ సాగింది.  ఐదు వారాల మీ ప్రయాణాన్ని, మీ ఆటతీరు, మీ స్వభావాన్ని ఆడియన్స్‌లాగ చూసి వైల్డ్ కార్డ్స్ ఇక్కడికి వచ్చారు.. కనుక మీపై వారికి ఓ స్పష్టమైన అభిప్రాయం ఉండి ఉంటుంది.. కనుక ఈసారి నామినేషన్స్ రాయల్ క్లాన్ మాత్రమే చేస్తారు.. మీకు ఎవరు అనర్హులని భావిస్తే వాళ్లలో ఇద్దరూ ఓజీ క్లాన్ సభ్యులను నామినేట్ చేయాలి.. మెగా చీఫ్ అయిన కారణంగా నబీల్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు.. అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. మొదటిగా యష్మీని నామినేట్ చేసింది హరితేజ. తన కారణాలు చెప్పింది.. మీరు హౌస్‌లో చెప్పేది ఒకటే చేసిది ఒకటి.. పర్సన్ పర్సన్‌కి మీ రూల్స్ మారుతున్నాయి.. మీకు మంచి రిలేషన్ ఉన్నవాళ్ల దగ్గర మీకు రూల్స్ ఏం ఉండవు.. ఇక ప్రతివారం ఒక మనిషిని టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం ఒక స్ట్రాటజీలా పెట్టుకున్నట్లు ఉంది.. అయితే అలా రిపీటెడ్‌గా ఒకరినే నామినేట్ చేయడం వల్ల వేరే ఒక అనర్హుడైన వ్యక్తిని నామినేట్ చేయకుండా మీరు సేవ్ చేస్తున్నారు.. ఇక నన్ను హర్ట్ చేశావ్.. అందుకే నామినేట్ చేస్తున్నా అంటూ ప్రతి వారం చెప్పడం వల్ల అది న్యాయంగా అనిపించడం లేదు.. అలాగే బోర్‌గా ఉంది.. ఇక మొన్న ఫ్యామిలీ పంపిన ఫుడ్ విషయంలో మీరు అది మణికంఠకి ఇచ్చి ఉంటే బావుండేదనిపించింది. మీకు ఇష్టమైన వాళ్లవి ఎమోషన్స్ మిగిలిన వాళ్లవి కాదనేటట్టుగా ఉంది మీ బిహేవియర్ అంటూ యష్మీ తిరిగి మట్లాడకుండా చేసింది హరితేజ. ఆ తర్వాత తన సెకెండ్ నామినేషన్ గా పృథ్వీని నామినేట్ చేసింది హరితేజ. మీరు టాస్కులు ఆడేటప్పుడు స్ట్రెంత్‌తో.. అలానే కాస్త పొగరుగా కూడా ఆడతారు.. అయితే మీరు మెగా చీఫ్ టాస్క్ జరిగినప్పుడు 'ఐ' పక్కన గ్యాప్ ఉండాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోలేకపోయారు.. పక్కన వాళ్లు ఏమంటే దానికి ఊ కొట్టేసి ఆడారు.. అంత ముఖ్యమైన టాస్కులో మీ డెసిషన్ మీరు తీసుకొని ఉంటే బావుండేది.. ఇలా పక్కవాళ్లు చెప్పిన దానికి ఇన్ ఫ్లూయెన్స్ అయిపోతే మీ గుర్తింపు ఎక్కడ ఉంటుంది.. అలానే టాస్కులు తీసెస్తే మీరేంటి అనేది పెద్దగా కనిపించడం లేదంటూ హరితేజ చెప్పింది. ఇక హరితేజ చెప్పిన పాయింట్లకి యష్మీ, పృథ్వీల నోట మాట రాలేదు. ఫస్ట్ ఓవర్ లో  మొదటి రెండు బంతులకి రెండు సిక్సర్లు కొట్టినంతంగా హరితేజ చేసిన ఈ నామినేషన్లు అనిపించాయి.

Karthika Deepam2 : వాళ్ళని క్షమించలేరా.. మీ ప్రయత్నం మీరు చెయ్యండి!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -169 లో... శౌర్యని తీసుకొని నరసింహా వెళ్ళాలనుకుంటాడు. శౌర్యని అడ్డు పెట్టుకుని దీపని రప్పించి.. ఇల్లు సొంతం చేసుకోవాలనుకొని రిమోట్ కార్ ని నర్సింహా లోపలికి పంపిస్తాడు. అది చూసి సరదాగా శౌర్య బయటకు వస్తుంది. అప్పుడే దీప, కార్తీక్ లు వస్తారు. శౌర్యతో కార్తీక్ మాట్లాడతాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావంటూ చాక్లెట్ ఇచ్చి లోపలికి వెళ్లమని చెప్తాడు. వీడు ఎప్పుడు అడ్డుపడుతున్నాడని నరసింహా అనుకోని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ వెళ్ళిపోయాక శౌర్య లోపలికి వెళ్లి.. అమ్మ ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. మీ అమ్మ ఎక్కడికి వెళ్లిందో నాకు తెలుసని జ్యోత్స్న అంటుంది. శౌర్యని దీప లోపలికి పంపిస్తుంది. ఇక జ్యోత్స్న తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. నువ్వు ఇక వెళ్లి మా బావ దగ్గర ఉండు.. స్వప్న , కాశీ లకి పెళ్లి చేసినట్టు.. గుడిలో నీకు, కార్తీక్ కి నా అత్త పెళ్లి చేస్తుందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత అసలేం మాట్లాడుతున్నావ్.. నువ్వు నన్ను తీసుకొని వచ్చావ్.. సుమిత్ర గారి గురించి ఆలోచిస్తున్నాను.. లేదంటే నీ దవడ పళ్ళు రాలేవని దీప అంటుంది. అసలు నిన్ను ఒకటి అడుగుతా చెప్పు.. నీ బావ మనసులో నువ్వు ఉన్నావా.. అది తెలుసుకోమని దీప అనగానే.. అదంతా దూరం నుండి చూస్తున్న పారిజాతం షాక్ అవుతుంది. ఆ తర్వాత దీప మాట్లాడిన మాటలకి జ్యోత్స్న కోపంగా ఉంటుంది. బావ నా దగ్గరకి రాలేదని జ్యోత్స్న అనగానే.. తను రాకుంటే ఏంటి నువ్వు వెళ్ళమని పారిజాతం అంటుంది. ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి దీప వెళ్లి కాంచన వాళ్ళని క్షమించలేరా అని అంటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి.. అది జరగదు.. ఇక ముందు అలాంటివి మాట్లాడకంటూ చెప్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ వెళ్ళిపోయాక.. ఎలాగైనా జ్యోత్స్న కార్తీక్ ల పెళ్లి జరగాలి.. మీ ప్రయత్నం మీరు చెయ్యండి.. నా ప్రయత్నం నేను చేస్తానని సుమిత్రకి దీప చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ఇంటిదొంగని కనిపెట్టేసిన రామలక్ష్మి.. సాక్ష్యాలతో సహా సీతాకాంత్ ముందు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -220 లో......అందరు రామలక్ష్మి సీతాకాంత్ ని వదిలేసి వెళ్లిందని రామలక్ష్మిపై కోపంగా ఉంటారు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. గుమ్మం లో అడుగుపెడుతుంటే ఆగు అని శ్రీలత ఆపుతుంది. ఏంటి నా కొడుకు ఎక్కడికి వెళ్లొద్దని చెప్పినా కూడా ఆలా ఎలా వదిలేసి వెళ్ళావని కోప్పడుతుంది. స్వామి మీరు ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళకని చెప్పినా కూడా నువ్వెందుకు ఇలా చేసావని అడుగుతుంది. నా సీతకీ ఏమైనా అయితే నేను తట్టుకోలేనని తెలుసు.. అయిన ఎందుకు వదిలి పెట్టి వెళ్ళావని శ్రీలత యాక్టింగ్ చేస్తుంది. అసలేం జరిగిందో చెప్పకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని రామలక్ష్మి అంటుంది. బావ గారు జారీ పడ్డారని శ్రీవల్లి చెప్తుంది. దాంతో రామలక్ష్మి రాబోతుంటే ఆగమని శ్రీలత ఆపుతుంది. ఈ నటనే వద్దంటున్నారు.. అంత ప్రేమ ఉంటే అసలు తనని వదిలి వెళ్లి ఉండేదానివి కాదని.. శ్రీలత అంటుంది. స్వామి వద్దని చెప్పిన కానీ ఎందుకు వెళ్ళావ్ వదిన అంటూ సందీప్ అంటాడు. పెద్దాయన కూడా రామలక్ష్మినే అంటాడు. ఎందుకు వదిలేసావ్ వదిన అంటూ సిరి కోప్పడుతుంది. నాకు ఏదో అవుతుందని భయం లేదు.. నాకు మాట ఇచ్చి ఇలా చేసావ్.. నేను అంటే ఇష్టం లేదనే కదా అని సీతాకాంత్ అంటాడు. నీకు వెళ్ళాలి అనిపిస్తే నాకు ఒక మాట చెప్పాలి కదా అని సీతాకాంత్ అంటాడు. నేనేం చేసిన దానికి కారణం ఉంటుందని రామలక్ష్మి అనగానే.. ఆ కారణం చెప్పు ఎందుకు వెళ్ళావని శ్రీలత అంటుంది. ఏదో తప్పు చేసి ఉంటుందని శ్రీవల్లి అనగానే.. తప్పు చేయాల్సిన అవసరం లేదని రామలక్ష్మి అంటుంది. ఇక నువ్వెవరో.. మేమ్ ఎవరో.. వెళ్ళు ఇక్కడ నుండి అని శ్రీలత అంటుంది. ఎవరు బయటకు వెళ్లాలో ఇప్పుడు చెప్తానంటూ రామలక్ష్మి లోపలికి వస్తుంది. వద్దన్నా కూడా ఎందుకు వస్తున్నావని శ్రీలత అంటుంది. ఆవేశ పడకండి అని రామలక్ష్మి సీతకాంత్ కి నిజం చెప్తుంది. ఆ రోజు సిరి నగలు దొంగతనం చెయ్యాలి అనుకున్నవాడు నన్ను చంపాలని వచ్చాడు.. నేను కాదని తెలిసి సిరి నగలు అని ప్లాన్ చేసాడు. మీరు పట్టుకోబోతుంటే మిమ్మల్ని నెట్టాడు.. ఇదంతా ఈ సందీప్ చేసాడు.. అనగానే అందరూ షాక్ అవుతారు. శ్రీలత సందీప్ లు అలా ఎందుకు మాట్లాడుతున్నావని అంటారు. ఇదిగో అంటూ రౌడీ సందీప్ గురించి చెప్పిన వీడియోని చూపిస్తుంది . వీడే ఆ రౌడీ నేను చూసిందని సిరి అంటుంది. అది చూసి సందీప్ ని కొడతాడు సీతాకాంత్. ఇంకా రౌడీ ఆఫీస్ కీ వెళ్లిన వీడియోని కూడా రామలక్ష్మి చూపిస్తుంది. అలా నమ్మను.. ఆ రౌడీ వచ్చి చెప్తేనే నమ్ముతానని సందీప్ అంటాడు. దాంతో మాణిక్యానికి ఫోన్ చేసి రౌడీ ని తీసుకొని రమ్మని రామలక్ష్మి చెప్పగానే.. మాణిక్యం తీసుకొని వస్తాడు. సందీపే ఇదంతా చేసాడని రౌడీ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య లాంటి ట్యాలెంటెడ్ డిజైనర్ లేరు.. కాబట్టి ఆమెని తీసుకురా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -534 లో.. రాజ్ లోని అంతరాత్మ బయటకు వచ్చి.. వెళ్లి భార్యా బట్టలు బయటపడేసావు కదా వెళ్లి తీసుకొని రా అని అనగానే.. రాజ్ కోపంగా తీసుకొని రానని అంటాడు. ఎక్కడ వస్తువులు ఉంటే మనసు కరిగి వెళ్లి తీసుకొని వస్తావని భయపడి పడేసావు కదా అని రాజ్ తో తన అంతరాత్మ గొడవ పడుతుంది. మరొకవైపు కావ్య, అపర్ణ లు గుడిలో మాట్లాడుకుంటారు. అత్తయ్య అని కావ్య అనగానే.. ఎవరు నీకు అత్తయ్య నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయావ్ కనీసం ఎలా ఉన్నావని కూడా అడుగులేదని అపర్ణ అంటుంది. నేనే దగ్గర ఉండి మిమ్మల్ని చూసుకోవాలనుకున్నాను కానీ ఇలా మీ అబ్బాయి నా మనసు ముక్కలు చేసి పంపిస్తాడనుకోలేదని కావ్య అనగానే.. నాకు అంత తెలుసు.. కనీసం నేను వచ్చేవరకు ఉండాలి కదా అని అపర్ణ అంటుంది. నన్ను భార్యగా ఒప్పుకోడట బలవంతంగా నాతో కాపురం చేసాడట అని అపర్ణపై కావ్య పడి ఎమోషనల్ అవుతుంది. నేను ఈ తప్పు చెయ్యలేదు.. నా కాళ్ళపై నేను నిలబడాలని అనుకున్నాను.. డిజైనర్ గా జాయిన్ అయ్యాను. కానీ ఆ అనామిక ఇలా చేస్తుందనుకులేదు.. నన్ను మోసం చేసి నా డిజైన్ అనామిక కొనుక్కొని ఇలా చేసింది. ఆ విషయం తనకి చెప్తే నమ్మడం లేదని కావ్య అంటుంది. అవన్నీ కాదు నాతో పాటు వచ్చి బుద్దిగా కాపురం చేసుకోమని అపర్ణ అనగానే.. నేను రానని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్యతో అపర్ణ మాట్లాడడం.. రాహుల్ చూసి రుద్రాణికి ఫోన్ చేసి చెప్తాడు. మరోవైపు మమ్మీ ఎక్కడికి వెళ్ళిందంటూ రాజ్ అడుగుతాడు. అప్పుడే రుద్రాణి వచ్చి.. కావ్యని కలవడానికి వెళ్ళిందని చెప్తుంది. అప్పుడే అపర్ణ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని రాజ్ అడుగుతాడు. రాజ్ కి తెలిసిందని సైగ చేస్తుంది ఇందిరాదేవి.. దాంతో కావ్యని కలవడానికి వెళ్ళానని అపర్ణ చెప్పగానే.. రాజ్ కోప్పడతాడు. రుద్రాణి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడితే.. నాకు రాహుల్ ఫోన్ చేసి చెప్పాడని రుద్రాణి అంటుంది. అపర్ణ, ఇందిరదేవిలు కలిసి రుద్రాణిని తిడతారు. నా సంగతి సరే.. నీ కొడుకు ఏంటి ఇంట్లో అందమైన అమ్మాయిని వదిలి.. బయట వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని అపర్ణ చెప్తుంది.తరువాయి భాగంలో నా కంపెనీ లో వర్క్ చేస్తావని అగ్రిమెంట్ ఉందని కావ్యతో అనామిక అంటుంది. మరొక వైపు  కావ్య లాంటి ట్యాలెంట్ అమ్మాయి మన కంపెనీలో లేకపోవడం వల్లే ఇలా జరిగింది.. వెంటనే కావ్యని మన కంపెనీలో డిజైనర్ గా అప్పాయింట్మెంట్ చెయ్ అని రాజ్ కి సీతారామయ్య చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఏ హీరో కూడా నన్ను అలా నిలబెట్టలేదు

  బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ స్థాయి నుంచి టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాష్టర్ తన ప్రస్థానాన్ని ఎలా నిలుపుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. రాకేష్ మాష్టర్ దగ్గర డాన్స్ స్కిల్స్ నేర్చుకున్నారు. అలాగే ఎన్నో సాంగ్స్ లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేశారు. చివరికి ఇప్పుడు ఎన్నో హిట్ సాంగ్స్ కి టాప్ హీరోస్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. అలాంటి శేఖర్ మాష్టర్ ఒక చిట్ చాట్ లో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పారు. " నా పని నేను చేసుకుంటూ వెళ్ళా. మంచి పొజిషన్ లో నిలబడ్డా. ఫైట్ మాష్టర్ సాంబశివరావు గారి సాయంతో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. మా భావాన్ని మావయ్యకు నా అభిరుచి గురించి చెప్పేసరికి సాంబశివ రావు మావయ్య దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన నన్ను ఫైట్ మాష్టర్ రాజు గారి దగ్గరకు తీసుకెళ్లి నా గురించి  చెప్పి కార్డు ఇప్పించేసరికి అలా డాన్స్ మాస్టర్ గా నా జర్నీని స్టార్ట్ చేసాను. కొరియోగ్రాఫర్స్ లో నా రోల్ మోడల్ ప్రభుదేవా. డాన్స్ లో ఈ హీరోస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే  చిరు గారి డాన్స్ లో గ్రేస్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫాస్ట్ డాన్సర్. చెప్పగానే నేర్చేసుకుంటారు. రామ్ చరణ్ డాన్స్ చాలా షార్ప్ గా చేస్తారు. అల్లు అర్జున్ డాన్స్ లో స్వాగ్ ఉంటుంది. ఢీ షోలో వర్క్ చేసి అదే షోకి జడ్జ్ గా వెళ్లడం చాలా బాగుంది. అంటే ఎలా ఐతే ఒక స్కూల్ లో చదువుకుని ఆ స్కూల్ కి ప్రిన్సిపాల్ గా వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా ఉంది. ఒక సాంగ్ విషయంలో ఒక హీరో ఎక్కువ సేపు వెయిట్ చేయించారని అనుకుంటున్నారు చాలామంది. కానీ స్టార్టింగ్ డేస్ లో నేను చాలామంది డైరెక్టర్స్ దగ్గరకు వెళ్లాను కానీ అలా ఎవరూ వెయిట్ చేయించలేదు. ప్రభుదేవా, లారెన్స్ లా డైరెక్షన్ చేస్తానా లేదా అనే విషయం తెలీదు. ఎప్పుడు మూడ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఏ హీరోతో చేస్తానని విషయాన్నీ కూడా చెప్పలేను. అసలు చేస్తానో లేదో కూడా తెలీదు." అంటూ ఎన్నో విషయాలు చెప్పారు.  

సుధీర్, రష్మీల మధ్య ఏదో ఉందని చెప్పడానికి ఇదే సాక్ష్యం!

  తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్న షో ' శ్రీదేవీ డ్రామా కంపెనీ' ‌. ఇందులో యాంకర్ గా రష్మీ, హైపర్ ఆది చేస్తుండగా.. ఇంద్రజ జడ్జ్ గా చేస్తున్నారు. ఇక జబర్దస్త్ నుండి చాలా మంది ఈ షోకి వచ్చి ఎంటర్‌టైన్ చేస్తున్నారు. టీవీ షోలలో అభిమానించే ఆన్ స్క్రీన్‌ జంటల్లో సుడిగాలి సుధీర్‌, రష్మి గౌతమ్ జంట ఒకటి. ఎప్పటినుండో ప్రేక్షకులు వీరి జంటను ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య ప్రేమ లేదు.. మంచి స్నేహితులు మాత్రమే అని తెలిసినా.. ఇద్దరిని జంటగా చూసేందుకే తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. సుధీర్‌, రష్మీల జంట సూపర్‌ హిట్‌ జోడీ అన్నట్లు నిలిచింది. ఈ మధ్య కాలంలో వీరిద్దరు కలిసి షోలు చేయడం లేదు, అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు ఆ కాంబో మళ్ళీ రిపీట్ చేసేలా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోని వదలింది. నవరాత్రి స్పెషల్ ప్రోమోగా రిలీజైన ఈ ప్రోమోలో మొదటగా.. బలగం నల్లిబొక్క ఫేమ్ అతను .. ఈ ముసలోడికి దసరా పండగా కావాలని చెప్పాడు. నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తానంటు హైపర్ ఆది చెప్తాడు. ఇక ఆ తర్వాత డ్యాన్స్ , సింగింగ్ ఉంది. కాసేపటికి హైపర్ ఆది ఓ టాస్క్ ఇచ్చాడు. అక్కడ ఉన్నవారి ఫోన్ లు అన్నీ తీసుకున్నాడు. మీ ఫ్రెండ్ కి గానీ ఇంట్లో వాళ్ళకి గానీ కాల్ చేసి.‌ అర్జెంట్ గా నాకు పది వేలు కావాలని అడగాలని హైపర్ ఆది చెప్పాడు. మొదటగా బుల్లెట్ భాస్కర్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి.‌ నాన్న నాకు అర్జెంటుగా పదివేలు గూగుల్ పే చేయవా అని అనగానే.. భాస్కర్ వాళ్ళ నాన్న కాల్ కట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత హైపర్ ఆది మహతికి ఫోన్ చేస్తే‌‌.. మంచి కాలర్ ట్యూన్ వస్తుంది. అది విని. ఒరేయ్..  ఆ బాడీకి  ఈ పాటకి ఏం అయిన సంబంధం ఉందా అని ఆది అంటాడు. ఇక తనని అడుగగా.. పంపిస్తానని అంటుంది. ఇక ఆ తర్వాత రష్మీని సుధీర్ కు కాల్ చేయమని చెప్తాడు. బేబ్‌ అంటు రష్మీ ఇటు నుండి అనగా.. చెప్పరా అంటూ సుధీర్ సమాధానం ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్మి రూ.10 వేలు అడిగిన వెంటనే ఇదే నెంబర్ కి గూగుల్‌ పే ఉందా అంటూ ఫోన్ కట్‌ చేసే లోపే ఆ అమౌంట్‌ ను సుధీర్‌ పంపించాడు.  ఇక మన ఎడిటర్ మామ మంచి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేసి హైప్ ఇచ్చాడు. దాంతో ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్స్ ప్రోమో నుంచి సుధీర్, రష్మీల సంభాషణ వరకు కట్‌ చేసి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. మళ్లీ వీరి ట్రెండ్‌ మొదలైందని తెలుస్తోంది. రష్మీ, సుధీర్ కలసి షోలు చేయాలని కోరుకుంటున్నవారు చాలా మందే ఉన్నారు.