Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది. అదేం లేదు అత్తయ్య.. అతను నా పీఏ అని శ్రీధర్ అంటాడు. ఎవరికి చెప్పి తీసుకున్నారని జ్యోత్స్న కోప్పడుతుంది. నేను చెప్తే తీసుకున్నాడని శివన్నారాయణ సమాధానం చెప్తాడు. ఆ తర్వాత శ్రీధర్ ప్రెజెంటేషన్ ఇస్తాడు. దానికి దీప కొన్ని సలహాలు ఇస్తుంది. అవన్నీ అందరికి నచ్చుతాయి. ఇలాంటి ఆలోచనలు పెంచితే రావు.. అది పేరెంట్స్ నుండి వస్తుంది. దీప పేరెంట్స్ చాలా గొప్పొళ్ళు అని శివన్నారాయణ అనగానే.. మీ కొడుకుకోడలే దీప అమ్మానాన్న అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీధర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పారిజాతం, దీప మాట్లాడుకుంటారు. ఆ దీప బలం పెరుగుతుందని జ్యోత్స్న అనగానే నీ గ్రాఫ్ తగ్గిపోతుందని పారిజాతం అంటుంది. కార్తీక్ స్వీట్ చేసి తీసుకొని వచ్చి అందరిని హాల్లోకి పిలుస్తాడు. నీ భార్య మంచి సలహా ఇచ్చినందుకు చేసావా అని పారిజాతం అంటుంది. ఇక దీపని జ్యోత్స్న బాధపెట్టాలని తన గతంలోకి వెళ్తుంది. దీప తన భర్తని జైలుకి పంపింది. బావ నచ్చి అతన్ని వదిలేసిందని జ్యోత్స్న అంటుంది. సుమిత్ర తనని కొట్టబోతుంటే సమాధానం చేత్తో కాదు అత్త.. మాటల్తో ఉండాలని కార్తీక్ అంటాడు. ఆమ్మో ఇప్పుడు వీడేం చేయబోతున్నాడో ఏంటో అని పారిజాతం భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు. శ్రీవల్లి ఆ పేపర్ లోది చూసి చందు రాసాడనుకొని మురిసిపోతుంది. అది పక్కన విసిరేస్తుంది. అది ప్రేమ పూల ప్లేట్ తీసుకొని వెళ్తుంటే అందులో పడుతుంది. ధీరజ్, ప్రేమ ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. పేపర్ కింద పడడంతో తనదేమోననుకొని ప్రేమకి పేపర్ ఇస్తాడు. ప్రేమ అది చదివి ధీరజ్ రాసాడని సర్లే అడిగావు కదా సరే వెళదామని పేపర్ ధీరజ్ కి ఇవ్వగానే నువ్వు రాసి నేను రాసాను అంటున్నావా అని ధీరజ్ అనుకుంటాడు. ధీరజ్ ఆ పేపర్ ని పక్కన విసురుతాడు. అది నర్మద చూసి అటుగా వస్తున్న సాగర్ రాసాడనుకుంటుంది. సాగర్ కి ఆ పేపర్ ఇస్తుంది. అది నర్మద రాసి ఇచ్చిందనుకుంటాడు. ఆ తర్వాత ఆ పేపర్ సాగర్ పక్కన పడేస్తాడు. అది తిరుపతికి దొరుకుతుంది. నాకోసం ఎవరో రాసారు.. నేను కచ్చితంగా ఈ రోజు పార్క్ కి వెళ్ళాలనుకుంటాడు. ఆ తర్వాత సాయంత్రం పార్క్ కి అమూల్య, విశ్వ వస్తారు. అమూల్య స్కార్ఫ్ కట్టుకుంటుంది. ప్రేమ, ధీరజ్. నర్మద, సాగర్. చందు, శ్రీవల్లి. తిరుపతి కూడా వస్తారు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అందరు పార్క్ కి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu Voting 14th week: ఓటింగ్‌లో తనూజ టాప్.. సుమన్ శెట్టికి ఆ భయం లేదు!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం రీతూ చౌదరి ఎలిమినేషన్ అవ్వగా హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో కెప్టెన్ కళ్యాణ్ కాబట్టి అతను నామినేషన్లో లేడు. ఇక మిగిలిన ఆరుగురిలో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో.. ఎవరు టాప్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం. ప్రతీ వారంలో లాగే తనూజ ముప్పై శాతం ఓటింగ్ తో టాప్ లో ఉంది. సంజన గల్రానీ కి పదిహేను శాతం ఓటింగ్ పడుతోంది. డీమాన్ పవన్ 14.91 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. భరణి 14.7 శాతం ఓటింగ్ తో నాల్గవ స్థానంలో ఉన్నాడు. 13.6 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయేల్ అయిదో స్థానంలో ఉన్నాడు. ఇక చివరగా 10.78 శాతం ఓటింగ్ తో సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నాడు. అయితే సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నా అతను ఎలిమినేషన్ కాడు.. ఎందుకంటే సుమన్ శెట్టి ప్రభంజనం అలాంటిది. గతవారం సుమన్ శెట్టి లీస్ట్ లో ఉండి.. తనపైన సంజన, రీతూ ఉండగా.. రీతూని ఎలిమినేషన్ చేసాడు బిగ్ బాస్. అంటే ఈ సారి కూడా సుమన్ శెట్టి ఎలిమినేట్ కాడు. దివ్య, రీతూ చౌదరి, నిఖిల్, దమ్ము శ్రీజ, గౌరవ్ .. వీళ్ళందరి కంటే సుమన్ శెట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆ.. కాదు.. కానీ హౌస్ లో ఉంటాడు. ఎందుకంటే అదే సుమన్ శెట్టి ప్రభంజనం.  సంజన, సుమన్ శెట్టిలకి బిగ్ బాస్ బయాజ్డ్ ఉన్నాడని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్ లో ఎవరెంత ఆడినా, ఆడకపోయినా రిస్క్ ఉంటుంది.. భయం ఉంటుంది.‌ కానీ సుమన్ శెట్టికి ఆ భయం లేదు. ఎందుకంటే పదమూడు వారాల్లో అతనేం చేయకపోయినా ఎలిమినేట్ అవ్వడం లేదు.. అసలేం చేశాడో.. ఎందుకు హౌస్ లో ఉంచుతున్నారో బిగ్ బాస్ మామకే తెలుసు. అయితే ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్ డేంజర్ జోన్ లో ఉన్నారు.

Tanuja Vs Sanjana: సంజన వర్సెస్‌ తనూజ.. ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్!

బిగ్ బాస్ సీజన్-9 పదమూడు వారాలు పూర్తి చేసుకుంది. హౌస్ లో నుండి గతవాతం రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. ఇక ఈ వారం ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.‌ అలాగే సెకెండ్ ఫైనలిస్ట్ ఎవరో తెలియడం కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ‌ఇక నిన్నటి ఎపిసోడ్ లో లోడర్ బోర్డ్ లో సంజన లీస్ట్ లో ఉండగా ఇమ్మాన్యుయేల్ టాప్ లో ఉన్నాడు. హౌస్ లో జరిగిన గేమ్ లో ఇమ్మాన్యుయేల్ ఫస్ట్ గెలిచి అత్యధికంగా 150 పాయింట్లు తెచ్చుకున్నాడు. ఇక ఇమ్మాన్యుయేల్ తర్వాత డీమాన్ పవన్ గెలిచాడు. అతనికి 120 పాయింట్లు రాగా, ఆ తర్వాత వచ్చిన సుమన్ శెట్టి, తనూజ 90 పాయింట్లు వచ్చాయి. భరణికి 90 పాయింట్లు రాగా ఇక చివరగా ఉన్న సంజనకి ఎనభై పాయింట్లు వచ్చాయి. ఇక వీరిలో నుండి ఒకరిని తీసేయమని బిగ్ బాస్ కోరాడు. అక్కడ మొదలైంది అసలైన పంచాయతీ..‌ సంజన వర్సెస్ తనూజ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ‌ హౌస్ లో నెక్స్ట్ గేమ్ ఎవరు ఆడకూడదని అనుకుంటున్నారో చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. మొదటగా సుమన్ శెట్టి లేచి.. అత్యధిక పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇమ్మాన్యుయేల్ ని తీసేద్దామని అనుకుంటున్నానని సుమన్ శెట్టి చెప్పగా, భరణి కూడా అదే రీజన్ చెప్పి ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పాడు. ఇక సంజన లేచి.‌ డీమాన్, ఇమ్మాన్యుయేల్ లో డీమాన్ స్ట్రాంగ్ కాబట్టి డీమాన్ ని తీసేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత తనూజ లేచి ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పింది. ఇక డీమాన్ లేచి సంజన పేరు చెప్పాడు.. కళ్యాణ్ కూడా సంజన పేరు చెప్పాడు. ఇక ఇప్పుడు హౌస్ లో‌ మిగిలింది ఇమ్మాన్యుయేల్. తను ఆడాలనుకుంటే సంజనని తీసేయ్యాలి లేదంటే తను డ్రాప్ అవ్వాలి. వేరే ఆప్షన్ లేదని ఇమ్మాన్యుయేల్ అనగానే.. ఇక వెంటనే సంజన నిల్చొని.. సారీ బిగ్ బాస్ నేను ఇమ్మాన్యుయేల్ ని తీసేద్దామని అనుకుంటున్నానని అంది. ఇక అది విని తనూజకి ఫుల్ కోపం వచ్చింది. తను లేచి సారీ బిగ్ బాస్.. నేను సంజనని గేమ్ నుండి తప్పించాలని అనుకుంటున్నానని చెప్పింది. దాంతో ఇద్దరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది. డ్రాప్ చేస్తానంటే వద్దు ఫ్రెండ్ వస్తుందని మహా వెళ్ళిపోతుంది. మరొకవైపు చక్రి క్యాబ్ ఓనర్ కి రోజు డబ్బులు ఇచ్చి వెళ్తుంటే అప్పుడే ఒక బుకింగ్ వచ్చింది వెళ్ళమని చెప్తాడు. చక్రి కస్టమర్ కోసం వెయిట్ చేస్తాడు. మహాకి తన ఫ్రెండ్ క్యాబ్ బుక్ చేస్తాడు. చక్రి కార్ అనుకొని మహా అందులో ఎక్కుతుంది. మహాని చూసి చక్రి ఫ్లాట్ అవుతాడు. అయ్యో సారీ అండి వేరే క్యాబ్ అనుకొని ఇందులో ఎక్కానని మహా కార్ దిగి వెళ్ళిపోతుంది. మరొకవైపు మాధవకి పెళ్లి చూపులు అని కన్నా రెడీ చేస్తాడు. ఆ తర్వాత కేశవ టీ స్టాల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న నారాయణ ఉంటాడు. అక్కడే వాళ్ళ పెద్దనాన్న వీళ్ళ గురించి తక్కువగా మాట్లాడతాడు. ఎవడ్రా మీ ఇంటికి ఆడపిల్లని ఇచ్చేదని ఇష్టం వచ్చినట్లు తిడుతాడు. దాంతో కేశవ ఇంటికి కోపంగా వెళ్తాడు. చక్రి వస్తాడు.. అన్నయ్య ఎంత మంచిగా రెడీ అయిన పెళ్లి కాదు అంటూ కేశవ అంటాడు. దాంతో కేశవ, చక్రికి గొడవ అవుతుంది. మరొకవైపు మహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తన డిజైన్ చెప్తుంది. అది చూసి.. బాగుంది దాని గురించి గవర్నమెంట్ తో డిస్కషన్ చేస్తామని చెప్తారు. మహా బయటకు వచ్చాక ఓవర్ అంబిషన్ గా ఉందని వాళ్ళు అనుకుంటారు. అ తర్వాత మహా తన ఫ్రెండ్ అయిన అబ్బాయితో కలిసి మాట్లాడుతుంది. నా ఐడియా వాళ్లకు నచ్చిందని అతనితో చెప్తుంది. ఇంత అమాయకురాలివి ఏంటి మహా.. అలా అందరు చెప్పింది నమ్మేస్తావని అతను మహాపై జాలి చూపిస్తాడు. ఆ తర్వాత మహా వాళ్ళ నాన్న ప్రతాప్ తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. నువ్వు షేర్స్ ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావని అడుగుతాడు. మాకున్న డబ్బులు చాలు.. నీకు ఒక కూతురు ఉంది కదరా అని ప్రతాప్ అనగానే మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది.. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది.. కమ్యూనిటీ లో మా పరువు తీసింది.. నీకు ఒక కూతురు ఉంది జాగ్రత్త అని అతను చెప్తాడు. అ తర్వాత ప్రతాప్ వస్తుంటే దారిలో మహా తన ఫ్రెండ్ బైక్ మీద వెళ్లడం చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో మహా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది త్వరగా తనకి పెళ్లి చెయ్యాలని ప్రతాప్ తన భార్యతో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial:గాయాలతో ఇంటికొచ్చిన గంగ.. పట్టించుకోని శకుంతల!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -137 లో.....గంగ నగలు వేసుకోవడంతో శకుంతల కోప్పడుతుంది. నిన్ను ఎప్పటికి కోడలిగా ఒప్పుకోనని శకుంతల చెప్తుంది. దాంతో గంగ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. గంగ ఏడుస్తుంటే ఇషిక, వీరు కలిసి తన దగ్గరికి వెళ్తారు. నేనే నగలు ఇచ్చానని ఇషిక అనగానే అయ్యో అలా ఎందుకు చేసావ్ ఇషిక.. పాపం ఇప్పుడు గంగ సిచువేషన్ చూడమని వీరు అంటాడు. ఇప్పుడు రుద్ర బావ చూడు కోపంగా వెళ్ళాడు.. ఇలా వెళ్తే ఎలా అని లేని డౌట్ గంగలో వీరు క్రియేట్ చేస్తాడు. దాంతో గంగ బయటకు వెళ్లి రుద్ర కార్ వెంబడి పరుగెడుతుంది. గంగ రావడం చూసి రుద్ర కార్ ఆపుతాడు. ఎందుకు ఇలా వస్తున్నావని అడుగుతాడు. మీకు ఏమైనా అవుతుందోనని భయంతో వచ్చానని గంగ అంటుంది. సరే క్యాబ్ బుక్ చేస్తాను వెళ్ళమని రుద్ర అనగానే వద్దు షేర్ ఆటోలో వెళ్తానని గంగ అంటుంది. షేర్ ఆటో రావడంతో గంగని రుద్ర షేర్ ఆటో లో ఎక్కిస్తాటు. డ్రైవర్ కి లైసెన్స్ ఉందా లేదా అని కనుక్కుంటాడు. ఆ తర్వాత ఆటోలో ఉన్న వాళ్లంతా మీ భర్తకి మీరంటే చాలా ఇష్టంగా ఉన్నట్టు ఉందని అంటారు. అది చూసి గంగ మురిసిపోతుంది.  ఆ తర్వాత రుద్ర ఒక దగ్గర ఆగుతాడు. షేర్ ఆటోకి ఆక్సిడెంట్ అయిందని అక్కడ అనుకుంటుంటే విని వెంటనే అక్కడికి వెళ్తాడు. ఆటోలో ఉన్నవాళ్ళకి దెబ్బలు తాకుతాయ్.. గంగకి కూడా చిన్నగా దెబ్బలు తాకుతాయి. మరొకవైపు శకుంతల నగలు తీసుకొని వచ్చి పారుకి ఇస్తుంటే.. వద్దు ఆ నగలు గంగ వేసుకుందని అంటుంది. మరి రుద్ర బావని గంగ పెళ్లి చేసుకుంది కదా వదిలేస్తావా అని ఇషిక అనగానే రుద్ర వేరు అని పారు అంటుంది. అప్పుడే దెబ్బలతో ఉన్న గంగని తీసుకొని వస్తాడు రుద్ర. శకుంతల ఏం పట్టనట్లు ఉంటుంది. ప్రమీల, ప్రీతీ తన గురించి కేర్ తీసుకుంటారు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే బాగోదని రుద్ర తనకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi:రాహుల్ చేసిన ప్లాన్ అదే.. రౌడీల నుండి శృతి తప్పించుకుంటుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -899 లో.. కావ్యని తీసుకొని రాజ్ హోటల్ కి వస్తాడు. నీకు నచ్చింది తినమని చెప్తాడు. ఎప్పుడు నాతో గొడవపడుతూ ఉంటావ్.. అలా కాకుండా సిగ్గుపడుతూ ఉండమని రాజ్ చెప్తాడు. రాజ్, కావ్య మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరిని చూసి పక్కనున్న వాళ్ళు మీరు లవర్స్ ఆ అని అడుగుతారు. మీ జంట చాలా బాగుందని అంటారు దాంతో రాజ్ మురిసిపోతాడు. వాళ్ళని చోటు, మోటు అనే ఇద్దరు రౌడీ లు గమనిస్తారు. వాళ్ళు పెన్ డ్రైవ్ రూమ్ లో పెట్టి ఉంటారని అనుకొని వెళ్లి  రూమ్ లో వెతుకుదామని అనుకుంటారు. కావ్య, రాజ్ ల రూమ్ లోకి వాళ్ళు వెళ్లి వాళ్ళు వెతుకుతారు. అప్పుడే హోటల్ సర్వర్ వచ్చి.. బాత్రూం క్లీన్ చెయ్యడానికి వచ్చింది మీరేనా అని వాళ్ళ చేత బాత్రూం క్లీన్ చేపిస్తాడు. ఇక మోటు చోటు ఇద్దరు గదిలో వెతికిన పెన్ డ్రైవ్ దొరకదు.. మరొకవైపు స్వప్నకి రాహుల్ ఒక నెక్లెస్ తీసుకొని వచ్చి ఇస్తాడు. స్వప్న నువ్వు ఈ డిజైన్స్ ని సెలెక్ట్ చేయమని చెప్తాడు. దాంతో స్వప్న కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేస్తుంది. నువ్వు ఎప్పటికి ఇలాగే ఉంటావ్ కదా అని రాహుల్ తో స్వప్న ప్రేమగా మాట్లాడుతుంది. ఆ తర్వాత చోటు, మోటు ఇద్దరు మళ్ళీ రాజ్, కావ్య దగ్గరికి వెళ్తారు. చోటు, మోటు రావడం రాజ్, కావ్య చూస్తారు.  చోటు, మోటు బేరర్ గా రాజ్ దగ్గర కి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని తన ఫోన్ ని టేబుల్ కింద పెడతాడు. అది రాజ్ గమనించి కావ్యకి చెప్తాడు. ఇక ఇద్దరు కావాలనే పెన్ డ్రైవ్ శృతికి ఇచ్చాము కదా అని అనుకుంటారు. రాజ్, కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్లతో పాటు చోటు, మోటు ఇద్దరు వెళ్ళిపోతారు. సంగీత కచేరి చేసేవాళ్ళ దగ్గరికి వెళ్లి శృతి ఎక్కడ అని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : శౌర్య చెప్పిన నిజం.. పారిజాతానికి టార్చర్ చూపించిన కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -536 లో....జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెళ్లి షాపింగ్ చేద్దామని అంటుంది. నువ్వు అంత సీరియస్ గా తీసుకోకని జ్యోత్స్న అంటుంది. ఆ శౌర్యతో ఇలా చెప్పానని జ్యోత్స్నకి పారిజాతం చెప్తుంది. అప్పుడే దీప, కార్తీక్, శౌర్య ఎంట్రీ ఇస్తారు. జ్యో గ్రానీ అంటు పారిజాతం దగ్గరికి శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఏంటి శౌర్య అంత ప్రేమ చూపిస్తుందని శివన్నారాయణ అనగానే ఏదో దానికి నేనంటే చాలా ప్రేమ అని పారిజాతం అంటుంది. పారిజాతం ఒళ్ళో శౌర్య కూర్చొని జ్యో గ్రాని చాలా మంచిది. నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పిందని శౌర్య అనగానే ఏం మంచి విషయాలు చెప్పిందని శివన్నారాయణ అడుగుతాడు. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తను పుట్టాక నన్ను పట్టించుకోరట అంటూ పారిజాతం చెప్పిన విషయాలన్నీ చెప్తుంది. శౌర్య నువ్వు వెళ్లి నా గదిలో స్వీట్ ఉంది తీసుకొని తినమని పంపిస్తాడు. నీ కూతురికి పారిజాతం అలా చెప్పి తప్పు చేసింది నువ్వు ఏ శిక్ష వెయ్యామంటావని దీపని అడుగుతాడు శివన్నారాయణ. గుర్తు ఉండిపోయే శిక్ష వేయమని దీప అనగానే.. రోజంతా దీప చేసే పనులు అన్ని చెయ్యాలని శివన్నారాయణ ఆర్డర్ వేస్తాడు. నీకు సూపర్ వైజర్ గా కార్తీక్ అని శివన్నారాయణ చెప్పగానే పారిజాతం తప్పక ఒప్పుకుంటుంది. మరొకవైపు కాశీకి స్వప్న ఫోన్ చేసి సాయంత్రం త్వరగా రా గుడికి వెళదామని అంటుంది. శ్రీధర్ ని పర్మిషన్ అడిగితే వద్దని అంటాడు. స్వప్న కోపంగా ఫోన్ కట్ చేసుకుంటుంది. మరొకవైపు పారిజాతానికి కార్తీక్ టార్చర్ చూపిస్తాడు. ఆ తర్వాత స్వప్న దగ్గరికి కావేరి వస్తుంది. మీ ఆయన మా ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదని కోప్పడుతుంటే స్వప్నకి కావేరి సర్దిచెప్తుంది. మరొకవైపు శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వెళ్తాడు. ఈ ఇంటికి అల్లుడు వచ్చాడు కాఫీ పట్టుకొని వెళ్ళమని  పారిజాతానికి కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : శ్రీవల్లి చదువుకోలేదని ప్రేమ, నర్మద నిరూపిస్తారా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -337 లో.... రామరాజుకి కస్టమర్ కేర్ అతను ఫోన్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే రామరాజుకి అర్థం కాక శ్రీవల్లికి మాట్లాడమని ఇస్తాడు. శ్రీవల్లి ఏదో మాట్లాడినట్లు ఒకే యా అంటూ కవర్ చేస్తుంది. ఏంటి అమ్మ వల్లి.. నువ్వు M.A ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ అదరగొడతావని అనుకుంటే అలా మాట్లాడుతున్నావని రామరాజు అంటాడు. అదంతా చూస్తున్న ప్రేమ, నర్మద ఇద్దరు శ్రీవల్లి దగ్గరికి వస్తారు. శ్రీవల్లి దగ్గర నుండి ప్రేమ ఫోన్ లాక్కొని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. నువ్వు  ప్రేమ లాగా గడగడా ఎందుకు మాట్లాడలేదని రామరాజు అడుగుతాడు.. అంటే మావయ్య నాకు అది అర్థం కాలేదు.. లేదంటే నేను మంచిగా మాట్లాడేదాన్ని అని శ్రీవల్లి అనగానే అయితే ఇప్పుడు ప్రేమతో ఇంగ్లీష్ లో మాట్లాడమని నర్మద అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. అప్పుడే వేదవతి వచ్చి రామరాజుని భోజనానికి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు సాగర్ డల్ గా ఉంటే చందు, ధీరజ్ వచ్చి ఏమైందని అడుగుతారు. వాళ్ళకి సమాధానం చెప్పడు. ఆ తర్వాత ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని బుక్ తీసుకొని వచ్చి రాత్రంతా ప్రాక్టీస్ చేస్తుంది శ్రీవల్లి. మరుసటిరోజు శ్రీవల్లి నిద్ర లేవగానే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావని వెయిట్ చేస్తున్నామని ప్రేమ, నర్మద, తిరుపతి, అమూల్య రూమ్ ముందు ఉంటారు. దాంతో శ్రీవల్లి జానీ జానీ ఎస్ పాప అని రైమ్ చదివి వెళ్ళిపోతుంది. దాంతో శ్రీవల్లికి బాగా ఇంగ్లీష్ వచ్చని తిరుపతి అనుకుంటాడు. శ్రీవల్లి M.A ఇంగ్లీష్ కూడా చదవలేదన్నమాట.. తన సంగతి చెప్తానని ప్రేమ, నర్మద అనుకుంటారు. మరొకవైపు అమూల్యని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. పైనుండి అమూల్యని పిలుస్తాడు విశ్వ. అప్పుడే ప్రేమ బయటకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కోడలు గుద్దిన కాపురం... ఎన్టీఆర్ అసోసియేషన్‌ అభిమాన సంఘానికి నేను పని చేసాను!

పాడుతా తీయగా ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించింది. ఈ వారం ఎపిసోడ్ లో గీతాంజలి అనే కంటెస్టెంట్ వచ్చి "నీ ధర్మం మరువద్దు" అంటూ కోడలు దిద్దిన కాపురం మూవీలోని సాంగ్ పాడింది. ఇక దీని మీద గరికపాటి మాట్లాడారు. "ఈ పాట కోడలు దిద్దిన కాపురం సినిమాలోది. అప్పుడు కాబట్టి అలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడైతే కోడలు గుద్దిన కాపురం అనేది వచ్చేది. నేను ఒక చోట అవధానం చేస్తున్నప్పుడు అడిగారు. సమాజం చెడిపోయింది ఏంటి అని..పూర్వకాలంలో ఆత్మీయులు, అనుబంధాలు, ఆడపడుచు రక్తసంబంధాలు ఉండేవి అలాగే కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు వచ్చేవి ఇప్పుడు ఇడియట్, జల్సా, రౌడీ వంటి సినిమాలు వస్తున్నాయి కదా మరి చెడిపోకపోతే ఏమవుతుంది అన్నాను. నేను ఎన్టీఆర్ అసోసియేషన్ అభిమాన సంఘానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేసాను. చదువుకునే రోజుల్లో తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ టాకీస్ లో ఎన్టీఆర్ సినిమా చూడడానికి టిక్కెట్ల కోసం చేయి విరగ్గొట్టుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని. విద్యార్థులకు ఇలాంటి పాటల్ని అల్పాహారం సేవించే సమయంలో వినిపించాలి. అప్పుడు విద్యార్థి చదువు, ఉద్యోగం కోసం కాదు దేశం కోసం బతుకుతాడు. ఇక ఉచ్చారణ విషయానికి వస్తే మా తరం తప్పు ఎందుకంటే మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాం. పదాల విషయానికి వస్తే తెలుగు, ఇంగ్లీష్ లో వేరువేరుగా ఉంటుంది. 56 అక్షరాల మహత్తరమైన మహాబలేశ్వరం గజల్ లాంటి భాషను ఒట్టి శునకంలాంటి భాషలో చేర్చి నేర్చుకుంటున్నామమ్మా..ఇది మన దౌర్బాగ్యం. 26 అక్షరాల భాషలో పెట్టాం పట్టుకెళ్లి అంటే 30 అక్షరాలు గోవిందా." అంటూ చెప్పుకొచ్చారు.

‘శిఖా వీరగోని’వచ్చేసింది.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రేమ జంట

బిగ్ బాస్ సీజన్ 8 లో సోనియా ఆకుల ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. సోనియా - యష్ జోడి కలిసి ఇష్మార్ట్ జోడికి వచ్చి మంచి పెర్ఫార్మెన్స్ లు ఇచ్చి ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో బాగా ఫెమిలియర్ పర్సన్స్ కూడా. బిగ్ బాస్ లో పృద్విని, నిఖిల్ చిన్నోడు పెద్దోడు అంటూ వాళ్ళతో బాగా కనెక్ట్ అయ్యింది. బిగ్ బాస్ లో ఉండగా యష్ తో తన లవ్ గురించి చెప్పింది. తర్వాత హౌస్ లోంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పింది. తమకు పండంటి ఆడపిల్ల పుట్టిందని "శిఖా వీరగోని" మా ఇంటికి వచ్చేసింది అంటూ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. యష్ కి ఆల్రెడీ పెళ్ళై ఒక బాబు ఉన్నాడు. అతని పేరు విరాట్ వీరగోని. సోనియా ఆకుల టాలీవుడ్ లో కొన్ని మూవీస్ లో నటించింది "జార్జ్ రెడ్డి, కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్" వంటి మూవీస్ లో నటించింది. ఇక వాళ్ళ ఫాన్స్, సెలబ్రిటీస్ అంతా కూడా కంగ్రాట్యులేషన్స్ అంటూ మెసేజెస్ పెడుతున్నారు. 2024 డిసెంబర్ 21 న యష్ - సోనియా పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా మళ్ళీ ఏడాదికి వీళ్లకు పాప పుట్టింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాక కొన్ని ఇంటర్వ్యూస్ లో హోస్ట్ నాగార్జున వేస్ట్ అంటూ కూడా కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ కి మళ్ళీ అవకాశం వస్తే వెళ్ళను అంటూ కూడా చెప్పేసింది. యష్ ఐతే ఫ్లై హై టూరిజం, విరాట్ ఫౌండషన్స్ వంటివి స్థాపించాడు. అమెరికాలో దావత్ పేరుతో కొన్ని రెస్టారెంట్స్ కూడా నడుపుతున్నాడు. 

అసలే చలికాలం..పరివారం షోలో రొమాంటిక్ జోడీల హగ్గుల జాతర..

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోని వింటర్ స్పెషల్ థీమ్ గా తీసుకురాబోతున్నారు. ఈ ఎపిసోడ్ లో కొత్తగా పెళ్ళైన జంట మహేష్ - సాండ్రా, ఏక్ నాథ్ - హారిక, బ్రహ్మముడి జోడి మానస్ - దీపికా, యాదమ్మ రాజు - స్టెల్లా, నువ్వుంటే నా జతగా సీరియల్ యాక్టర్స్ అర్జున్ కళ్యాణ్ - అనుమిత వచ్చారు. ఈ కూల్ వెదర్ లో మీ అందరికీ హాట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ ఫేవరేట్ రొమాంటిక్ జోడీస్ రాబోతున్నారు అని చెప్పింది శ్రీముఖి. ఇక కొత్త జంట మహేష్ సాండ్రా జోడిని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. పూలేసి వాటి మీద సాండ్రాని నడిపించారు. రీసెంట్ గా పెళ్ళైన జంట అంటూ స్టేజి మీద ఉన్న యాక్టర్స్ అంతా పూలు వేసి విష్ చేశారు. పెళ్ళైన వెంటనే వింటర్ వచ్చేసింది కదా అని శ్రీముఖి అనేసరికి సాండ్రా సిగ్గుపడి కళ్ళు మూసుకుంది. "ఆ వింటర్ లో ఎలా ఉంది అనీ" అంటూ శ్రీముఖి రాగం తీసేసరికి "చల్లగానే ఉంది" అంటూ మహేష్ ఆన్సర్ ఇచ్చాడు. "అంటే వింటర్ వస్తేనే రొమాంటిక్ గా చేయాలా" అంటూ ఏక్ నాధ్ అడిగేసరికి అందరూ గట్టిగా అరిచారు. వెంటనే హారికని రెండు చేతుల మీద ఎత్తుకుని ఎప్పుడైనా రొమాంటిక్కే మేము అన్నాడు. "చలి పెడుతుంది ఇప్పుడు -16 డిగ్రీలు అంది అంటే జంటలంతా హగ్ చేసుకున్నారు. దీపికా రెండు చేతులు కట్టుకుంది దాంతో మానస్ వెరీ గుడ్ అన్నాడు. -20 డిగ్రీలు అని శ్రీముఖి అనేసరికి ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నారంతా. దీపికా వచ్చి మానస్ భుజం మీద వాలేసరికి ఓకే అన్నాడు. -30 డిగ్రీలు అని శ్రీముఖి మళ్ళీ అనేసరికి ఏక్ నాధ్ - హారిక ఇద్దరూ చీర చెంగు కప్పేసుకుని ఇంకా గట్టిగ హగ్ చేసుకునేసరికి అందరూ అరిచారు గట్టిగా. ఇక దీపికా ఐతే మానస్ వెనకాల పడింది. దాంతో అవినాష్ దీపికను హగ్ చేసుకున్నాడు.

Podharillu: పొదరిల్లు సీరియల్ గ్రాంఢ్ లాంచ్.. మొదటి ఎపిసోడ్ ఎలా ఉందంటే!

స్టార్ట్ మా టీవీలో సరికొత్త కథతో 'పొదరిల్లు' అనే ధారావాహిక సోమవారం రోజున మొదలైంది. ఒక కుటుంబంలో అన్నాతమ్ముళ్లు, ఓ చెల్లి ఉంటారు. వారి మధ్యలో ఆస్తి తగాధాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయని ఈ సీరియల్ లో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. ఇంట్లో ఆడవాళ్లు లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారనేది ఈ సీరియల్ లో ఎమోషనల్ గా సాగింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ -01 లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.  బృందావనం అనేది ఇంటిపేరు.. ఆ ఇంటిపెద్ద నారాయణ. అతనికి నలుగురు మగపిల్లలు.. తన భార్య చనిపోతుంది. అతను తాగుబోతు అవుతాడు. ఇక ఇంటికి పెద్ద కొడుకు మాధవ. తన ముగ్గురు తమ్ముళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. వాళ్ళ నాన్న దగ్గరికి మాధవ వచ్చి.. మేనత్త  తాయారు తన కూతురు గాయత్రికి ఓనీల ఫంక్షన్ చేస్తున్నారని పిలిచింది.. వెళదాం నాన్న అంటాడు. లేదు మీ మేనత్త గురించి నాకు బాగా తెలుసు.. ఇప్పటివరకు మన గురించి పట్టించుకోలేదు.. అలాంటిది వచ్చిందంటే ఏదో ఉందని నారాయణ అంటాడు గాయత్రి కోసం అయినా వెళదాం నాన్న అని మాధవా అంటాడు. మరొకవైపు నారాయణ చెల్లి తాయారు తన కూతురు ఓనీల ఫంక్షన్ కోసం అప్పు తెమ్మని తన భర్తని పంపిస్తుంది. తను వట్టి చేతులతో ఇంటికి వస్తాడు. నువ్వు ఒక చేతకానీ వాడివి.. నాకు వాటాగా వచ్చిన ఆస్తులన్నీ నాకేశవని తాయారు తిడుతుంటే తాయారు ఇంకొక అన్నయ్య అక్కడే ఉండి మీరు గోడవ పడకండి ఇప్పుడు ఫంక్షన్ నేను చేస్తాను. ఆ నారాయణ గాడి ఇంటి స్థలం ఇప్పుడు కొట్లలో ఉంటుంది అది మనకి వాటా ఇవ్వమని అడుగుదామని అతను అనగానే సరే అని తాయారు అంటుంది. ఫంక్షన్ కి నారాయణ తన పిల్లలని తీసుకొని వస్తాడు. అన్నయ్య అంటూ నారాయణని ప్రేమగా చూసుకుంటుంది. మరొకవైపు గాయత్రికి వాళ్ళ అమ్మ రింగ్ గిఫ్ట్ ఇస్తాడు మాధవ. ఆ తర్వాత డ్రింక్ చెయ్యడానికి నారాయణని తాయారు ఇంకా తన భర్త తీసుకొని వెళ్తారు. అక్కడ వాళ్ళ పెద్ద అన్నయ్య ఉంటాడు. వాడితో నేను కూర్చొనని నారాయణ అనగానే ఎంతైన మనము ముగ్గురం సొంత అన్నా చెల్లెళ్ళం అని తాయారు అంటుంది. ఇక నారాయణ తాగుతుండగా తాయారు డాకుమెంట్స్ తీసుకొని వచ్చి సంతకం పెట్టమని అంటుంది. నాకు తెలుసు.. మీరు ఇలా చేస్తారని.. మీ వాటాలు మీరు అమ్ముకొని నా వాటా అడుగుతున్నారా అని కోపంగా పిల్లల్ని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత తాయారు కోర్ట్ లో కేసు వెయ్యడంతో నారాయణ ఉంటున్న ఇళ్ళు నా వాటాకి వచ్చిందని నిరూపించుకునే వరకు అది అమ్మడానికి గానీ అక్కడ కట్టడానికి వీలు లేదని కోర్ట్ తీర్పు చెప్తుంది. ఆ విషయం నారాయణ దగ్గరికి తాయారు వచ్చి చెప్తుంది. దాంతో ఇరు కుటుంబాలకి మధ్య గొడవ జరుగుతుంది. నీ ఇంటికి ఏ ఆడపిల్ల కోడలిగా రాదంటూ నారాయణపై మట్టి కొట్టి పోతుంది తాయారు. కొన్ని సంవత్సరాల తర్వాత మాధవకి పెళ్లిచూపులని అందరికన్నా చిన్నోడు కన్నా.. అతన్ని రెడీ చేస్తూ ఉంటాడు. మరొకవైపు రెండో వాడు చక్రి పెళ్లి కావాలని తను డ్రైవ్ చేస్తున్న క్యాబ్ కార్ కి పెళ్లి కానీ ఆడవాళ్ళకి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని బోర్డు పెట్టుకుంటాడు. ఇక మరొకవైపు ఈ సీరియల్ హీరోయిన్ అయిన మహాలక్ష్మిది చాలా ధనవంతుల కుటుంబం. తన పేరెంట్స్ తనకి మంచి సంబంధం చూస్తుంటారు. మాధవకి తన మేనత్త తాయారు కూతురు గాయత్రి అంటే ఇష్టం.. వాళ్ళు ఎలా కలుస్తారో ట్విస్ట్.. అంతేకాకుండా చక్రి, మహాలక్ష్మి వీళ్ళు ఎలా కలుస్తారనేది మరొక ట్విస్ట్. మరి ఈ ట్విస్ట్ లన్నీ దర్శకుడు ఎలా కలుపుతాడో చూడాలి మరి.

Bigg boss 9 Telugu 14Th Week Captain Bharani : చివరి కెప్టెన్ గా భరణి.. ఇమ్మ్యూనిటీ తప్ప అన్ని ఉంటాయి!

బిగ్ బాస్ హౌస్ లో ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ లేదని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత హౌస్ లో టాస్క్ లు పెట్టి ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో వాళ్ళు నామినేషన్ నుండి సేవ్ అవుతారని బిగ్ బాస్ చెప్తాడు. అందులో భాగంగా స్వింగ్ జరా టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో కళ్యాణ్ టికెట్ ఫినాలే విన్నర్ కాబట్టి తన గేమ్ ఆడడు.. కేవలం సంఛాలక్. ఇక సంజన జైల్లో ఉంది కాబట్టి ఈ టాస్క్ ఆడే ఛాన్స్ లేదని బిగ్ బాస్ చెప్తాడు. ఇక ఈ టాస్క్ లో అయిదుగురు పాల్గొంటారు. టాస్క్ లో ముందుగా ఇమ్మాన్యుయేల్, ఆ తర్వాత డిమాన్ పవన్ ఆ తర్వాత భరణి, తనుజ, సుమన్ శెట్టి ఇలా అయిదగురు ఉంటారు. ఇందులో మొదట వచ్చిన వారి నుండి చివరికి వచ్చిన వారి వరకు పాయింట్స్ ఉంటాయి. ఇలా ఈ వారం జరిగే టాస్క్ లన్నింటిలో ఎవరు ఎక్కువ పాయింట్స్ తో ఉంటారో వాళ్ళే నామినేషన్ నుండి సేవ్ అవుతారు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ మనీ పాయింట్స్ టాస్క్ లో ఎక్కువ పాయింట్స్ ముందంజలో  ఉన్నాడు. ఇక ఈ స్వీంగ్ జరా టాస్క్ లో కూడా ముందంజలో ఉన్నాడు ఇమ్మాన్యుయేల్. హౌస్ లో ఉన్న ఏడుగురిలో ఒక్క భరణి తప్ప అందరు కెప్టెన్ అయిన విషయం తెలిసిందే అయితే బిగ్ బాస్ భరణి ని డైరెక్ట్ కెప్టెన్ చేస్తాడు కానీ ఇమ్మ్యూనిటి ఉండదు.. కెప్టెన్ కి ఉండే అన్ని ఫెసిలిటిస్, అర్హతలు ఉంటాయని బిగ్ బాస్ చెప్పగానే భరణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు. మొదటగా బాల్ ని డీమాన్ పట్టుకొని సుమన్ శెట్టికి లక్ష మనీ పాయింట్స్ ఇస్తాడు. దానికి హౌస్ మేట్స్ అందరు ఆమోదం చెప్తారు. రెండోసారి భరణి పట్టుకొని రెండు లక్షలు గల మనీ పాయింట్స్ ని తనూజకి ఇస్తాడు. దానికి హౌస్ మేట్స్ ఆమోదం చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్ బాల్ పట్టుకొని ఇమ్మాన్యుయేల్ అతి ఎక్కువ మనీ పాయింట్స్ అయిన రెండు లక్షల యాభై వేలు ఇస్తాడు. అందుకు అందరు ఒప్పుకుంటారు.  ఇక మిగిలింది యాభై వేలు, లక్షా యాభై వేలు, జీరో ఉంటాయి. ఇమ్మాన్యుయేల్ బాల్ పట్టుకొని సంజనకి లక్ష యాభై వేలు పాయింట్స్ ఇవ్వగా దానికి హౌస్ మేట్స్ ఎవరు ఒప్పుకోరు. ఆ తర్వాత సుమన్ బాల్ పట్టుకొని డీమాన్ కి లక్షా యాభై వేలు ఇస్తాడు. దానికి అందరు ఒప్పుకుంటారు. ఇక మిగిలింది జీరో, యాభై వేలు. సంజన బాల్ పట్టుకొని యాభై వేలు నాకు ఉంచుకొని జీరో భరణికి ఇస్తున్నానని అనగా.. ఒక్క ఇమ్మాన్యుయేల్ తప్ప దానికి ఎవరు ఒప్పుకోరు. ఆ తర్వాత అందరు హౌస్ మేట్స్ నిర్ణయం అడుగగా.. సుమన్, తనూజ ఇద్దరు భరణికి యాభై వేలు అని సపోర్ట్ చేస్తారు. ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ ఇద్దరు సంజనకి యాభై వేలు అని సపోర్ట్ చేస్తారు. ఇద్దరికి ఈక్వల్ అవుతాయి. భరణికి యాభై వేలు పాయింట్స్ అని కళ్యాణ్ సపోర్ట్ చెయ్యడంతో భరణికి యాభై వేల పాయింట్స్ వస్తాయి. సంజనకి జీరో వస్తుంది. దాంతో సంజన ఏడుస్తుంది. నాకు ఎవరి సపోర్ట్ లేదు.. నేనొక ఎమోషనల్ ఫూల్ ని అని ఏడ్చేస్తుంది. జీరో పాయింట్స్ ఉండడంతో సంజన జైలుకి వెళ్తుంది.

Jayam serial : శకుంతల చేయించిన నగలు వేసుకున్న గంగ.. చెంప చెల్లుమంది కదా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -136 లో.....గంగని మేలిముసుగులో తీసుకొని వచ్చి తనకి సారే పెడుతుంటే అందులో రుద్ర గ్లౌజ్ కూడా పెడతాడు. దాంతో శకుంతల వద్దని అంటుంది. అది కూడా నాకు సారె అని భావించి సర్ ఇస్తున్నాడని గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా నచ్చక శకుంతల అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరుసటిరోజు రుద్ర జాగింగ్ కి రెడీ అవుతుంటే గంగ చద్దన్నం తింటూ ఉంటుంది. ఏంటి ఇదంతా ఇంత ప్రొద్దున తింటున్నావ్.. రన్నింగ్ ఎవరు ప్రాక్టీస్ చేస్తారని రుద్ర అనగానే నిన్న జరిగిన దానికి రాత్రి సరిగ్గా తినలేదు.. అందుకే అని గంగ అంటుంది. మీరు తినండి అని తనకి గంగ తినపెట్టినట్లు మిర్చి తిన్న రుద్రకి కారం అవుతుంటే రుద్రకి లిప్ టూ లిప్ కిస్ పెట్టినట్లు గంగ ఉహించుకుంటుంది. మరొకవైపు పారు కోసం అత్తయ్య నగలు చేయించింది.. ఆ నగలు గంగ వేసుకునేలా చేస్తే తనకి కోపం వస్తుందని ఇషిక, వీరు ప్లాన్ చేస్తారు. గంగ దగ్గరికి ఇషిక వెళ్లి అత్తయ్య నిన్ను కోడలిగా ఒప్పుకోవాలంటే తనకి నచ్చినట్టు ఉండాలంటే ఈ నగలు వేసుకోవాలని ఇషిక చెప్పగానే గంగ వేసుకుంటుంది. ఆ తర్వాత అందరు చీరలు సెలెక్ట్ చేసుకోండి పారుని కూడ పిలిచానని శకుంతల ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. అత్తయ్య అని గంగ నగలు వేసుకొని వస్తుంది అందరు తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ శకుంతల వచ్చి తన చెంపచెల్లుమనిపిస్తుంది. ఎందుకు ఈ నగలు వేసుకున్నావని రుద్ర అడుగుతాడు. ఇంకా అర్థం కాలేదా తనకి నగలు కావాలని పారు అంటుంది. అత్తయ్యకి నచ్చినట్టు ఉంటే తనకి నచ్చుతానని గంగ అనగానే అది ఎప్పటికి జరగదని శకుంతల అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాజ్, కావ్య కిడ్నాప్.. ఆ పెన్ డ్రైవ్ రౌడీలకి దొరుకుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -898 లో......కావ్యకి ఆయుర్వేద వైద్యం చేస్తాడు. బయట రాజ్ వెయిట్ చేస్తాడు. అప్పుడే రౌడీలు పెన్ డ్రైవ్ కోసం  రాజ్ దగ్గరికి వస్తారు. మొన్న అతను నీకేమైనా ఇచ్చాడా అని అడుగుతాడు. అసలు వాడెవడు మీరు ఎవరు అని రాజ్ వాళ్ళపై కోప్పడతాడు. మరొకవైపు కేసు గురించి అప్పు కానిస్టేబుల్ తో మాట్లాడుతుంది. కేసుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ గురించి అడుగుతుంది. లేవని కానిస్టేబుల్ చెప్పగానే అదేంటీ అని అప్పు షాక్ అవుతుంది. అప్పుడే వాళ్ళ.. పై ఆఫీసర్ వచ్చి నువ్వు ఆ కేసు పక్కన పెట్టి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయమని ఫైల్ ఇస్తాడు. లేదు సర్ నేను ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తానని అప్పు అంటుంటే తనపై వాళ్ళ ఆఫీసర్ కోప్పడతాడు. మరొకవైపు రౌడీలు తమ బాస్ దగ్గరికి వెళ్లి పెన్ డ్రైవ్ మిస్ అయిందని చెప్పడంతో వాళ్ళపై సీరియస్ అవుతాడు. ఆ పెన్ డ్రైవ్ లో నా జీవితం ఉందని ఒక వీడియో చూపిస్తాడు. అది చూసి ఏమో అనుకున్న సర్ మీరు మంచి రసికుడు అని రౌడీలు అంటారు. ఆ అమ్మాయి ఎవరో కాదు ఎమ్మెల్యే తాలూకా.. ఇప్పుడు ఈ వీడియో ఆ పెన్ డ్రైవ్ లో ఉంది అది బయటకు వస్తే నా పరిస్థితి ఏంటి? మీరేం చేస్తారో నాకు తెలియదు.. నాకు పెన్ డ్రైవ్ తీసుకొని రావాలని చెప్తాడు. రాజ్, కావ్య మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇందిరాదేవి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణికి డిజైన్స్ చూపించి ఇవి రాజ్ డిజైన్స్ అని చెప్తాడు. ఇవి స్వప్నకి చూపించి సెలెక్ట్ చేయమని చెప్తాను.. అప్పుడు స్వప్నకి ఇవి నేను వేసానని అనుకుంటుందని రాహుల్ అంటాడు. తరువాయి భాగంలో రాజ్, కావ్యలని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాంచనని ఒప్పించిన దీప.. మన పెళ్ళికి కారణం సంకల్పం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -535 లో......కిచెన్ లో అనసూయ, కాంచన మాట్లాడుకుంటారు. అప్పుడే దీప వచ్చి కాంచనతో మాట్లాడాలని అంటుంది. నేను ఎవరితో మాట్లాడనని చెప్పు అక్క అని కాంచన అంటుంది. మీరు మాట్లాకండి నేను మాట్లాడుతానని దీప అంటుంది. మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టినప్పడు మీరు నన్ను ఒప్పుకొని హ్యాపీగా చూసుకున్నారు. శౌర్య నా కూతురు.. అయినా మీ మనవరాలిగా చూసుకున్నారు. ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అంటే మీకు చాలా ప్రేమ.. మీకు ఎంత ప్రేమ ఉందో.. అంతకన్నా ఎక్కువ నాకు ప్రేమ ఉంది.. నా బిడ్డని మీ చేతుల్లో పెడతాను.. నా మాట నమ్మండి.. నేను ఆ ఇంటికి వెళ్ళాలి.. దానికి కారణం ఇప్పుడు నేను చెప్పలేనని దీప రిక్వెస్ట్ చెయ్యడంతో కాంచన ఇక తప్పక ఒప్పుకుంటుంది. మరొకవైపు శ్రీధర్ కాంచన ఫోటో చూస్తూ బాధపడతాడు. అప్పుడే కావేరి పాలు తీసుకొని వస్తుంది. ఏవండీ మిమ్మల్ని ఒక మాట అడగాలని అంటుంది. మీరు కాంచన అక్క దగ్గరికి వెళ్లిపోండి అంటుంది.. దానికి శ్రీధర్ షాక్ అవుతాడు. మీరు కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. ఇక్కడ పక్కనున్నా నన్ను పట్టించుకోవడం లేదు.. అయితే హాల్లో ఉంటున్నారు.. లేదా పైన రూమ్ లో ఉంటున్నారని కావేరి అంటుంది. నాకు ఇద్దరు కావాలి కావేరి. స్వప్న నా కూతురే. కార్తీక్ నా కొడుకే అని శ్రీధర్ అంటాడు. మరొకవైపు థాంక్స్ అమ్మ దీపని అర్థం చేసుకున్నందుకు అని కార్తీక్ అంటాడు. అదే సమయంలో శౌర్య వస్తుంది. అమ్మ సారీ నీ బేబీకి నొప్పి అయ్యేలా చేసానని శౌర్య అంటుంది. బేబీకి కూడా సారీ చెప్తుంది శౌర్య. ఇకనుండి నానమ్మ గదిలో పడుకుంటానని శౌర్య అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప నిద్రపోయేటప్పుడు.. వాళ్ళ పెళ్లి ఏ సిచువేషన్ లో జరిగిందని చెప్తుంది. అదంతా సంకల్పం అంటూ కార్తీక్ తో దీప మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఆ తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : శ్రీవల్లికి షాకిచ్చిన రామరాజు.. సాగర్ ని అల్లుడిగా ఒప్పుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -336 లో.. ప్రేమని పోలీస్ డ్రెస్ లో చూసి ధీరజ్ ఫ్లాట్ అవుతాడు. అది చెప్పకుండా తనని చూసి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావ్ రా అని ప్రేమ అంటుంది. ఇంత పొట్టి పోలీస్ అని ధీరజ్ అనగానే ప్రేమ అలుగుతుంది. దాంతో లేదు ప్రేమ నువ్వు డ్రెస్ లో బాగున్నావ్.. నీకు బాగా సెట్ అయిందని ధీరజ్ అనగానే.. ప్రేమ మురిసిపోతుంది. ఆ తర్వాత భాగ్యం, ఆనందరావు రామరాజు ఇంటికి వస్తారు. భాగ్యం, అందరికి స్వీట్ ఇస్తుంది. అన్నయ్య మీ దయవల్ల బిజినెస్ పెట్టాము కానీ వచ్చిన చిక్కల్లా ఒక్కటే అదేంటి అంటే మీరు శ్రీవల్లి ని జాబ్ చెయ్యమని చెప్పారట కానీ తన సర్టిఫికేట్లు పోయాయని భాగ్యం యాక్టింగ్ చేస్తుంది. దానికి ఎందుకు టెన్షన్ డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకోవచ్చు కదా అని నర్మద, ప్రేమ అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. మరొకవైపు నర్మద వాళ్ళ నాన్న దగ్గరికి సాగర్ వెళ్తాడు. నాకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే ట్యాలెంట్ లేదు.. మీరు మీ కూతురికి భర్తగా నన్ను ఒప్పుకోవాలంటే ఏం చెయ్యాలని అడుగుతాడు. దీనికి ఒక్కటే మార్గం.. నువ్వు చదివి జాబ్ కొట్టలేవు .. అందుకని జాబ్ ని కొనాలి. నేను ఇందులో ఇన్వాల్వ్ కానని సలహా మాత్రమే ఇస్తానని అతను అనగానే అందుకు ఎంత అవుతుందని సాగర్ అడుగుతాడు. పదిహేను నుండి ఇరవై లక్షలు అవొచ్చని అతను చెప్తాడు. మరొకవైపు రామరాజుకి ఎవరో ఫోన్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడుతారు. దాంతో అక్కడున్న శ్రీవల్లికి ఫోన్ ఇచ్చి.. నాకు అర్థం అవ్వడం లేదు మాట్లాడమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.