Podharillu : పొదరిల్లు సీరియల్ లో ట్విస్ట్.. ఇష్టం లేని పెళ్ళిచూపుల్లో మహా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -04 లో... ఇంట్లో వాళ్లు  మహాకి పెళ్లిచూపులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుసుకొని తను బాధపడుతుంది. తనకి సంబంధించిన మెడల్స్, సర్టిఫికేట్లు తీసుకొని వస్తుంది. ఇవన్నీ తెచ్చుకుంది పెళ్లి చేసుకొని వెళ్ళడానికా అని వాళ్ళ నాన్నని అడుగుతుంది. నువ్వేం చెయ్యాలనుకున్న పెళ్లి అయ్యాక చెయ్యమని ప్రతాప్ చెప్తాడు. దీన్ని ఎవరైనా ప్రేమ అంటారా అని మహా తన వదిన హారికకి చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మరొక వైపు మాధవ పెళ్లిచూపులకి వెళ్లాడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత తాయారు కూతురు గాయత్రి గుడికి వెళ్తుంది.. మాధవ బావకి నాకు పెళ్లి కావాలని మొక్కుకుంటుంది. అప్పుడే తనకి  తన ఫ్రెండ్ ద్వారా మాధవ పెళ్లిచూపులకి వెళ్తున్నాడని తెలుస్తుంది. దాంతో వాళ్ల అమ్మకి ఏదో సాకు చెప్పి అక్కడ నుండి మాధవ దగ్గరికి బయల్దేరుతుంది. రెడీ అయి ఉన్న మాధవ దగ్గరికి వెళ్లి కోప్పడుతుంది. అప్పుడే నారాయణ వచ్చి.. నువ్వు ఇక్కడ ఎన్ని అంటే ఏం లాభం మీ అమ్మకి చెప్పు లేదంటే నువ్వు వచ్చేయ్.. నీతో నా కొడుకు పెళ్లి చేస్తానని నారాయణ అంటాడు. నువ్వు ఈ పెళ్లిచూపులకి వెళ్ళకు బావ ఈ పెళ్లిచూపులు కూడా క్యాన్సిల్ అవ్వాలని గాయత్రి అనేసి వెళ్ళిపోతుంది. మరొకవైపు నేను రెడీ అవ్వను అంటూ మహా మొండిగా ఉంటుంది. దాంతో హారిక వచ్చి నచ్చజెప్తుంది. నీకు అబ్బాయి నచ్చలేదని క్యాన్సిల్ చెయ్యొచ్చని సలహా ఇస్తుంది. మరొకవైపు మహాని పెళ్లిచూపులు చూడడానికి వసున్న అబ్బాయికి దారిలో బొకే కనిపిస్తుంది. అది వేరే వాళ్ళు కొనుక్కొని వెళ్తుంటే అతను ఇవ్వమని అడుగుతాడు. నేను ఇవ్వనని కొనుక్కున్న అతను అనగానే.. ఎక్కువ డబ్బులు ఇచ్చి లాక్కుంటాడు. నాకు నచ్చింది నాకు దక్కాల్సిందేనని అతను కార్ ఎక్కుతాడు. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళని ప్రతాప్ రిసీవ్ చేసుకుంటాడు. అబ్బాయి అటిట్యూడ్ గా బెహేవ్ చేస్తాడు. మహా వచ్చేలోపు కార్ లో ఉన్న బొకే తీసుకొని వస్తాడు. మహాని చూసి ఫ్లాట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: రౌడీని పంపించిన పారు.. హ్యాపీగా గంగ, రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -139 లో.. గంగ, రుద్ర నల్లపూసల కార్యక్రమం కోసం గంగ పుట్టింటికి వస్తారు. బస్తీ వాళ్ళందరు గంగ, రుద్రకి స్వాగతం పలుకుతారు. లక్ష్మీ హారతి ఇస్తుంది. ఇక గంగ ఫ్రెండ్స్ రుద్రని ఒక ఆట ఆడేసుకుంటారు. రుద్ర, గంగలని గుమ్మం దగ్గరే ఆపి.. పేర్లు చెప్పమని అంటారు. గంగ చెప్తుంది కానీ రుద్ర మాత్రం మొహమాటపడతాడు. రుద్ర, గంగ లోపలికి వస్తారు. ఆ స్వీట్ తిను.. ఈ స్వీట్ తిను అంటూ రుద్రని బస్తీ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే మీకెప్పుడు ఇదే పనేనా అని రుద్ర కోప్పడుతాడు. అయిన వాళ్ళు అది జోక్ గా తీసుకుంటారు. మీరు బయటకు వెళ్ళండి అయన తింటాడని గంగ అనగానే అందరు వెళ్ళిపోతారు. నేను తిననని రుద్ర అనగానే నేను తింటాను.. ఎందుకు అంటే వాళ్ళు ఒక పూట భోజనం చెస్తే మరొకపూట చేయరు. అలాంటిది మీ కోసం ఇవన్నీ తెచ్చారు. మీరు తినలేదు అంటే ఫీల్ అవుతారు కదా అని గంగ అంటుంటే.. తన మాటలకి రుద్ర ఇంప్రెస్ అవుతాడు. మరొకవైపు రౌడీని గంగ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది పారు. అతను అక్కడ బాంబ్ పెడతాడు.  ఆ తర్వాత గంగ నల్లపూసలు గుచ్చుతారు. గంగ మెడలో రుద్ర తాళి వేస్తాడు. అదంతా పారుకి రౌడీ వీడియో కాల్ లో చూపిస్తాడు. దాంతో పారు కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత రుద్ర, గంగకి అందరు శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. అందరు కలిసి రుద్ర, గంగ చేత బంతటా ఆడిస్తారు. ఇక బిందెలో ఉంగరం తీపిస్తారు. ఇలా అన్ని రుద్రతో చేపిస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రౌడీల నుండి రాజ్, కావ్య తప్పించుకుంటారా..‌రాహుల్ ప్లాన్ అదేనా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -901 లో....రాహుల్ దగ్గరికి స్వప్న రొమాంటిక్ గా వస్తుంది. తనని చూసి ఏంటి స్వప్న ఇంత అందంగా ఉన్నవని పొగుడుతాడు.స్వప్నని రాహుల్ హగ్ చేసుకొని.. సడెన్ గా అయ్యో సారీ స్వప్న నేను టెన్షన్ లో ఉన్నాను అంటాడు. ఏమైందని స్వప్న అడుగుతుంది. నువ్వు డిజైన్స్ సెలెక్ట్ చేసావ్ కదా ఆ డిజైన్ కి ప్రమోషన్ ఇప్పించాలి కదా వాటికోసం మోడల్స్ కోట్లలో అడుగుతున్నారు. ఇప్పుడే మనం అంత ఇచ్చుకోలేం కదా అని రాహుల్ అంటాడు. స్వప్న నువ్వు ఒకప్పుడు మోడల్ వే కదా ప్లీజ్ ఇప్పుడు ఈ డిజైన్స్ కీ మోడల్ గా  నువ్వు చెయ్యొచ్చు కదా అని రిక్వెస్ట్ చెయ్యడంతో స్వప్న సరే అంటుంది. మరొక వైపు రాజ్, కావ్య హోటల్ లో ఉండగా.. అక్కడ రాజ్ కి తెలిసిన ఇన్‌స్పెక్టర్ కలిస్తే మాట్లాడుతాడు. అప్పుడే రూమ్ సర్వీస్ అతనికి రాజ్ రూమ్ లో పెన్ డ్రైవ్ దొరుకుతుంది. అది బేరర్ కి ఇచ్చి ఆ టేబుల్ మీద ఉన్న వాళ్లకు ఇవ్వమని చెప్తాడు. అతను వెళ్ళేలోపు రాజ్, కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బేరర్ అక్కడున్న ఇన్‌స్పెక్టర్ కి ఇస్తాడు. మీ రూమ్ లో ఇది దొరికింది అని ఇస్తాడు. ఓహ్ రాజ్ వాళ్ళది అయి ఉంటుందని రాజ్ వెనకాలే ఇన్‌స్పెక్టర్ వెళ్తారు. అప్పుడే రాజ్, కావ్యకి మత్తు ఇచ్చి చోటు, మోటు ఇద్దరు కిడ్నాప్ చేస్తారు. అది ఇన్‌స్పెక్టర్ చూసి వాళ్ళని ఇక్కడ కిడ్నాప్ చెయ్యాల్సిన అవసరం ఎవరికి ఉంది. ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చూడాలని ఇన్‌స్పెక్టర్ అనుకుంటాడు. మరొకవైపు రాహుల్, స్వప్నని ఫోటో షూటింగ్ కీ తీసుకొని వస్తాడు.  కెమెరా మెన్ తనని చూసి.. రాహుల్ నీ భార్య చాలా బాగుందంటూ పొగుడుతాడు. స్వప్నకి జ్యువెలరీ వేసి డిజైన్స్ ఫోటో షూటింగ్ జరిపిస్తాడు రాహుల్. ఆ తర్వాత రాజ్, కావ్యని తాళ్లతో కట్టి బంధిస్తారు. పెన్ డ్రైవ్ ఎక్కడ అని చోటు, మోటు వాళ్ళని అడుగుతారు. మాకేం తెలియదని రాజ్ అంటాడు. మరొకవైపు రాజ్ కంపెనీ క్లయింట్స్ ని రాహుల్ రప్పించుకొని డిజైన్స్ ప్రమోషన్ గురించి చెప్పగానే వాళ్ళు రాహుల్ వైపు తిరుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : జ్యోత్స్నకి క్లాస్ పీకిన కార్తీక్.. దీప హ్యాపీ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -538 లో....దీప చెప్పిన ఫుడ్ ట్రక్ ఐడియా బాగుందని అందరూ అనడంతో కార్తీక్ హ్యాపీ నెస్ తో స్వీట్ తీసుకొని వస్తాడు. అది ఓర్వలేక జ్యోత్స్న.. దీప మొదటి పెళ్లి గురించి మాట్లాడుతుంది. దాంతో సుమిత్ర కొట్టబోతుంటే నేను సమాధానం చెప్తానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? ఒక ఆడది రెండో పెళ్లి చేసుకోవద్దన్న రూల్స్ ఉన్నాయా.. ఎవరైనా పరిస్థితికి కట్టుబడి ఉంటారు. నేను దీపని పెళ్లి చేసుకోకున్నా కూడా నిన్ను చేసుకునేటోడిని కాదు. ఇప్పుడు నీకు నాతో ఎంగేజ్ మెంట్ వరకు వచ్చి క్యాన్సిల్ అయింది.. అలాగే గౌతమ్ విషయంలో కూడా అలాగే అయింది.. ఇప్పుడైనా నీకు పెళ్లి అవసరమా ఆని జనాలు అనుకున్నారనుకో నువ్వు చేసుకోకుండా మానేస్తావా.. లేదు కదా.. ఇప్పుడు పారు, తాత వాళ్ల పిల్లలు కోసం చేసుకున్నారు.. దాస్ మావయ్య తన భార్య జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాడు. అనసూయ గారు కూడా తన భర్త అంటే ఇష్టం కాబట్టి అలా ఉన్నారు. ఇకపోతే మా అమ్మనాన్న త్వరలో కలుస్తారని జ్యోత్స్నకి క్లాస్ తీసుకుంటాడు. కార్తీక్ కి పారిజాతం కూడా సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఆడదాని మనసు అర్థం చేసుకున్నావ్ రా అని పారిజాతం అంటుంది. దీప నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అని పారిజాతం అనగానే నీ నోటి నుండి ఇలాంటి మాటలు వింటే స్వీట్ గా ఉంటుందని శివన్నారాయణ అంటాడు. నీకోసం ఏదైనా చెయ్యాలని అనిపిస్తుందని శివన్నారాయణ అనగానే మీ చేతిలో ఉన్న స్వీట్ తినిపించండి అని పారిజాతం అంటుంది. శివన్నారాయణ తినిపిస్తాడు. కార్తీక్ ఫోటో తీస్తాడు. మరొకవైపు శ్రీధర్ తన పీఏ అయిన కాశీకీ ఫుడ్ ట్రక్ వెంట వెళ్ళమని చెప్తాడు. అ తర్వాత జ్యోత్స్న అన్నమాటలకి దీప బాధపడుతుంటే.. కార్తీక్ వెళ్లి మాట్లాడతాడు. జ్యోత్స్న ఇంకెప్పుడు అలా మాట్లాడకుండా చేసాను కదా అని కార్తీక్ అంటాడు. అ తర్వాత అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటూ కాశీకీ శ్రీధర్ కోపం తెప్పిస్తాడు. వీడిని నా కూతురు ఎలా పెళ్లి చేసుకుందో ఏంటోనని శ్రీధర్ ఆనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం చూసేసిన చందు.. శ్రీవల్లి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -339 లో.. రామరాజు కొడుకులు, కోడళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు అందరు పార్క్ కి వస్తారు. శ్రీవల్లి చందు మాట్లాడుకుంటుంటే అప్పుడే తిరుపతి వస్తాడు. మీరేంటి ఇక్కడ ఆని అడుగుతాడు. సరదాగా వచ్చామని చందు చెప్తాడు. ఆ తర్వాత తిరుపతికి నర్మద, సాగర్ కన్పిస్తారు. వాళ్ళని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ కనిపిస్తారు వాళ్ళని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. నువ్వు ఎందుకు వచ్చావ్ మామ అని తిరుపతిని ధీరజ్ అడుగగా నాకు పని ఉండి వచ్చానని అక్కడ నుండి బయల్దేరతాడు. ఆ తర్వాత అమూల్య, విశ్వ ఉన్నవైపు వెళ్తుంటే అప్పుడే తనకి బాల్ తగిలి వెనక్కి వస్తాడు. నా స్వప్న సుందరి ఎక్కడ అంటూ వెతుక్కుంటూ ఉంటాడు. ఆ తర్వాత అందరు ఒకరికొకరు ఎదరుపడుతారు. మీరేంటి ఇక్కడ అంటే మీరేంటి ఇక్కడ అని అందరు అనుకుంటారు. అప్పుడే అటుగా విశ్వ, అమూల్య వెళ్తారు. వీళ్ళందరు వాళ్ళని చూస్తారేమో అని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. వాళ్ళు వెళ్తుంటే ఎవరికి కన్పించకుండా బెలూన్ తో కవర్ చేస్తుంది. కానీ అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం చందు చూసి షాక్ అవుతాడు. చందు చూడడం శ్రీవల్లి చూసి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ధీరజ్, ప్రేమ ఇంటికి వచ్చాక కూడా గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వంగలపూడి అనిత సెటైర్స్.. ఆది తలకిందకి పెట్టి కాళ్ళు పైకిపెట్టిస్తా!

ఈనాడు 50 , ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 14 న వైజాగ్ లో ఘనంగా వేడుకులు జరగబోతున్నాయి. ఇక ఈటీవీ షోస్ నుంచి ఉన్న కళాకారులంతా కూడా వైజాగ్ వచ్చారు. పండు, పల్సర్ బైక్ ఝాన్సీ, సింగర్ సునీత, సుమ, ఆది, సౌమ్య శారద,  ఈనాడు 50 , ఈటీవీ @ 30 , సుమ @16 అంటూ తన వయసు ఇంకా పదహారు అని వైజాగ్ స్టేజి మీద చెప్పేసరికి వంగలపూడి అనిత పకపకా నవ్వేసింది. నేను వైజాగ్ బీచ్ అనగానే ఇదంతా చూపించడానికి గైడ్ లు కూడా వచ్చేసారు అంటూ ఆదిని, పండుని చూపించింది. ఇక వాళ్ళు కూడా నవ్వేశారు. "సర్ నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాను" అని సుమా అనేసరికి "మీరా విశాఖపట్నంలో ఇంటర్మీడియట్ అమ్మాయనుకున్నాను" అంటూ అయ్యన్నపాత్రుడు కామెంట్ చేశారు. "ఆవిడను ఇంటర్మీడియట్ అని పొగిడి మీరు 10th క్లాస్ కి వెళ్లిపోయారు తెలుసా" అంటూ ఆది అయ్యన్నపాత్రుడికి కౌంటర్ ఇచ్చాడు. దానికి అయ్యన్నపాత్రుడు నవ్వేశారు. "మీరు పాలిటిక్స్ కి ముందు టీచర్ గా కూడా చేశారు కదా ఒక వేళా నాలాంటి స్టూడెంట్ తగిలితే ఎం చేసేవాళ్ళు" అంటూ ఆది హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనితను అడిగాడు. "నేనైతే తల కిందకి కాళ్ళు పైకి పెట్టిస్తా" అంటూ ఆది మీద సెటైర్ వేశారు.  వెంటనే సుమ "నాకిప్పుడు ఇది చూడాలని ఉంది". ఇక ఈ ఈవెంట్ కి శంబాలా మూవీ టీమ్ నుంచి ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ వచ్చారు. ఇక సుమ, ఆది, సింగర్ సునీత ఆడియన్స్ లోకి వెళ్లి ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళతో కూడా ముచ్చటించారు. "నేను హీరోగా సుమ గారు హీరోయిన్ గ ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నా" అని రాసి ఉంది. మీరు పేరు చెప్పండి అని ఆది అనేసరికి అనిల్ కుమార్ అన్నాడు. జయమ్మ పంచాయతీ అనిల్ గారి ఆనవాయితీ..సినిమా పేరు  అంటూ ఆది అతని మీద సెటైర్ వేసాడు. తర్వాత ఇంకో ప్లకార్డు చూసారు. "సునీత గారు నన్ను చూసి అందగాడా అందగాడా" అనే పాట పాడాలి అని రాసి ఉంది. వెంటనే సునీత ఆ సాంగ్ ని ఆడియన్స్ మధ్యలోనే నిలబడి పాడి వినిపించారు. ఇక వందేమాతరం శ్రీనివాస్ కూడా రాములమ్మ సాంగ్స్ పాడారు. తర్వాత వంగలపూడి అనిత స్టేజి మీదకు వచ్చి "ఒక నీతితో, నిజాయితీతో, నిబద్దతతో కళాకారులను ముందుకు తీసుకురావడమే కాకుండా ఢీ లాంటి షోస్ ని ఏర్పాటు చేయడం కానీ ఒక పాడుతా తీయగా లాంటివి ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి యువశక్తిని ముందుకు తీసుకొస్తున్న ఇటువంటి వాళ్లకు మనందరం కూడా సపోర్ట్ చేయాలి" అని చెప్పారు.

Divya Support to Demon Pavan: దివ్వ ఓటు డీమాన్ పవన్‌కి .. అన్నయ్య భరణి పోటు

బిగ్ బాస్ ఇప్పటికే పదమూడు వారాలు పూర్తయింది. దివ్య నిఖిత మూడో వారం  వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి లాజిక్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అది గేమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ భరణితో అన్నయ్య అనే బాండింగ్ తోనే గడిచిపోయింది. ఇక భరణి గారి కుటుంబం గురించి తెలిసిందే కదా.. ఒకవైపు చెల్లి.. ఒకవైపు కూతురు. కూతురు అయిన తనూజతో భరణి క్లోజ్ గా ఉంటే దివ్య అసలు ఒప్పుకోదు. భరణిని కమాండ్ చేసేది.. ఆ విషయం భరణి తనకి ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళతో వీళ్లతో చెప్తుండేవాడు. భరణికి బాలేకపోతే దగ్గరుండి మరి బాగోగులు చూసుకునేది. ఫ్యామిలీ వీక్ లో భరణి కూతురు వచ్చి.. మీరు డాడీపై కమాండింగ్ తగ్గించండి అని చెప్పింది. తనూజతో భరణి కూతురు క్లోజ్ గా పాజిటివ్ గా మాట్లాడతుంది కానీ దివ్యతో అంతగా మాట్లాడదు. దివ్య ఎలిమినేట్ అయినప్పుడు భరణి చాలా ఎమోషనల్ అవుతాడు. నాకు ఈ హౌస్ ద్వారా మంచి అన్నయ్య దొరికాడు అని దివ్య స్టేజ్ పైన చెప్పుకొచ్చింది. బజ్ ఇంటర్వ్యూలో కూడా భరణి గారి కూతురు నాతో మాట్లాడలేదు.. నేను హర్ట్ అయ్యానని దివ్య చెప్పింది. అయితే దివ్య బయటకు వచ్చి రెండు వారాలు పూర్తయింది. అయితే హౌస్ లో  భరణితో పాటు హౌస్ మేట్స్ ఆట చూసినట్లుంది. తన గురించి ఎవరు ఏం మాట్లాడారో అన్నీ మనసులో పెట్టుకుంది. అందుకే హౌస్ నుండి బయటకు వచ్చాక భరణికి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ తాజాగా డీమాన్ కి ఓటు వేసినట్లు స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హౌస్ లో ఉన్నప్పుడు భరణిని అన్నయ్య లాగా ఫీల్ అయినా చెప్పిన దివ్య తనకి సపోర్ట్ గా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడంతో అందరికి అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యకి కాకుండా ఫ్రెండ్ కి సపోర్ట్ చెయ్యడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే హౌస్ లో ఉన్నవారిలో జెన్యున్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది డీమాన్ పవన్ అనేది అందరికి తెలిసిందే. హౌస్ లో ఉన్నవారిలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.

Mid week elimination Bigg Boss 9 Telugu : మిడ్ వీక్ ఎలిమినేషన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వీక్ ఒకరు ఎలిమినేట్ అయితే ఇంకా ఆరుగురు ఉంటారు. ఫినాలే కి టాప్-5 ఉంటారు. కాబట్టి ఈ వీక్ ఒకరు లేదా నెక్స్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇప్పటికే ఓటింగ్ లో సంజన, సుమన్ లీస్ట్ లో ఉన్నారు. గతవారమే వీళ్లలో ఎవరో ఒకరు వెళ్ళల్సింది కానీ అనూహ్యంగా రీతూ బయటకు వచ్చింది. ఈ వారం వీకెండ్ లో సుమన్ ఎలిమినేట్ అవ్వడం పక్క.. మిడ్ వీక్ ఎలిమినేషన్ సంజన అవుతుందని అందరు అనుకుంటున్నారు. ఈ ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ నిర్ణయంపై ఆధారపడుతుంది. ఇప్పటివరకు ఏ సీజన్ లో అయిన  మిడ్ వీక్ ఎలిమినేషన్ లో హౌస్ మేట్స్ అందరిని పిలిచి టాప్-5 కి అర్హత లేని వారిని డిసైడ్ అయి చెప్పమంటాడు బిగ్ బాస్. అలా అందరు ఒకరి పేరు చెప్పాలి. ఇప్పటికే హౌస్ లో జీరో పాయింట్స్ తో సంజన ఉంది. హౌస్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే అందరికంటే లీస్ట్ సుమన్.. కానీ సంజన, సుమన్ ఇద్దరు ఉంటే అందరు సంజనని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో తను మిడ్ వీక్ బయటకు వచ్చేస్తుంది. టాప్-5 భరణి కన్ఫమ్. టాప్-5 లో పెట్టేందుకే భరణికి బూస్ట్ ఇచ్చి మరి రీఎంట్రీ ఇచ్చారు. అలాంటిది భరణి బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. కళ్యాణ్, తనూజ,ఇమ్మాన్యుయేల్, డీమాన్, భరణి టాప్-5 కంటెస్టెంట్స్ అని అందరికి తెలిసిందే. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో సుమన్ , సంజన కాకుండా డీమాన్ గానీ భరణి గానీ బయటకు వస్తే బిగ్ బాస్ సీజన్-9 కి ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్ అవుతుంది. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu Tanuja: ఓటు అప్పీల్  చేసిన తనూజ.... మేడమ్ సర్ మేడమ్ అంతే!

బిగ్ బాస్ సీజన్-9 పదమూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక పద్నాలుగో వారం హౌస్ లో టాస్క్ లు కొనసాగుతున్నాయి. నామినేషన్ నుండి సేవ్ అవ్వాలంటే టాస్క్ లో పోటీపడుతూ స్కోర్ బోర్డు పై పాయింట్స్ ఎక్కువ కలిగి ఉండాలి. అలా టాస్క్ అనంతరం పాయింట్స్ ఎక్కువ ఉన్నవాళ్ళకి బిగ్ బాస్ ఓటు అప్పీల్ ఛాన్స్ కలిపించాడు. కాసేపటికి బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. అందులో తనూజ, భరణి, సంజన, సుమన్ నలుగురు పోటీ చేశారు. ఇమ్మాన్యుయల్, డీమాన్ సంఛాలక్ గా ఉన్నారు. ఈ టాస్క్ త్వరగా పూర్తి చేసిన వారికి ఎక్కువ పాయింట్స్ వస్తాయని బిగ్ బాస్ చెప్పాడు. మొదటగా సంజన టాస్క్ పూర్తి చేసినా కొన్ని మిస్టేక్స్ చేసింది.. అలాగే తనూజ కూడా మిస్టేక్ చేసింది. ఆ తర్వాత ప్రాపర్ గా భరణి చేస్తాడు. ఈ గేమ్ ముగిసే సమయానికి  భరణికి 100 పాయింట్లు, తనూజకి 80 పాయింట్లు, సంజనకి 60 పాయింట్లు, సుమన్ కి 40 పాయింట్లు వస్తాయి. ఇక లీడర్ బోర్డు లో భరణి, తనూజ టాప్ లో ఉంటారు. వాళ్ళిద్దరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. వాళ్ళు గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ బయట నుండి వచ్చిన  ఆడియన్స్ ఉంటారు. భరణి గురించి పాజిటివ్ గా మాట్లాడుతారు.  మీరు ఎవరికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇవ్వాలని  అనుకుంటున్నారని బిగ్ బాస్ అడుగగా ఎక్కువ తనూజకి సపోర్ట్ చేస్తారు. దాంతో భరణి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత తనూజ ఓటు అప్పీల్ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆడియన్స్ తనూజని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఒకతను మీకు ఫ్యాన్ బాయ్ వస్తాడు. మేడం సర్ మేడం అంతే అని చెప్పగానే తనూజ మురిసిపోతుంది. ఈ సారి లేడీ విన్నర్ గా చూడాలి అనుకుంటున్నామని మరొకరు చెప్పగానే.. తప్పకుండా అని తనూజ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Sanjana vs Demon Pavan: డీమాన్ పై విరుచుకుపడ్డ సంజన.. ఫుల్ ఫైర్!

బిగ్ బాస్ పదమూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక తుదిదశకి చేరుకుంది. ఈ వారం బిగ్ బాస్ టాస్క్ లు పెడుతూ ఎక్కువ పాయింట్స్ పొందినవారికి ఓటు అప్పీల్ ఛాన్స్ ఇచ్చాడు. అలా  మొదటగా ఇమ్మాన్యుయేల్ కీ ఛాన్స్ వచ్చింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో టాస్క్ కోసం ఇద్దరు ఆటనుండి తప్పుకోవాలని బిగ్ బాస్ చెప్పగా అందరు డిస్కషన్ చేసుకుంటారు. స్కోర్ బోర్డులో ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ టాప్ లో ఉంటారు. లీస్ట్ లో సుమన్, సంజన ఉంటారు. టాప్ లో ఉన్నవాళ్ళని తియ్యాలని భరణి, సంజన, సుమన్ శెట్టి, తనూజ డిసైడ్ అవుతారు. మేమ్ టాప్ పొజిషన్ కి రావడానికి చాలా కష్టపడ్డామని డీమాన్ రిక్వెస్ట్ చేస్తాడు. లీస్ట్ లో ఉన్నవాళ్ళని తియ్యాలని డిమాన్ చెప్తాడు. ఎందుకు ప్రతీసారీ నన్నే తీస్తారు. ఈ వీక్ లో రెండుసార్లు పక్కన పెట్టారు. ఒక మనిషిని ఎన్నిసార్లు చంపుతారంటూ డీమాన్ పై సంజన చెలరేగిపోయింది. సంజన గొడవకి దిగుతుంది. నేను అనేది మీకు అర్థం అవ్వడం లేదు.. అలా చేసుకుంది మీరేనని డీమాన్ అంటాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ చాలా కష్టపడ్డాడని తనూజతో డీమాన్ అనగానే అంటే మేమ్ వట్టిగనే కూర్చొని ఇక్కడికి వచ్చామా ఏంటని తనూజ ఫైర్ అవుతుంది. ఇక ఆ తర్వాత భరణి, సంజన,తనూజ, సుమన్ వీళ్ళు టాప్ లో ఉన్న ఇమ్మాన్యుయేల్, డీమాన్ ని టాస్క్ నుండి తియ్యాలని చెప్తారు. ఇమ్మాన్యుయేల్, డీమాన్ లీస్ట్ లో ఉన్నవాళ్ళని తియ్యాలని చెప్తారు. కళ్యాణ్ కూడా టాప్ లో ఉన్న వాళ్ళని తియ్యాలని చెప్తాడు. దాంతో టాప్ లో ఉన్న ఇమ్మాన్యుయేల్, డీమాన్ ని టాస్క్ నుండి తీసేస్తారు. 

Podharillu: మహా పెళ్ళిచూపులకి ఏర్పాట్లు.. ‌తప్పించుకోగలదా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -03 లో..... మహా తన ఫ్రెండ్ బైక్ పై వెళ్తుంటే వాళ్ళ నాన్న ప్రతాప్ చూస్తాడు. తన వెంటే ఫాలో అవుతాడు కానీ డైవర్ట్ అవుతాడు. దాంతో తన ఫ్రెండ్ చెప్పినట్లు తన కూతురు కూడా ఎవరినైనా లవ్ చేస్తుందానన్న టెన్షన్ మొదలవుతుంది. మరొకవైపు మాధవ భోజనానికి అన్నీ సిద్ధం చేసి తన తమ్ముళ్ళని పిలుస్తాడు. మనలో మనం ఎందుకు కొట్టుకుంటున్నాము.. మనకి ఎవరు సపోర్ట్ లేదు.. మనమే తోడుగా ఉండాలని మాధవ చెప్తాడు. అది కాదు అన్నయ్య.. నాన్న సక్రమంగా ఉంటే మనం కూడా బాగుండేవాళ్ళం కదా.. సొంత వాళ్ళు కూడా అలా మాట్లాడుతుంటే బాధగా ఉండదా.. మాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ నీకు అవ్వాలి అన్నయ్య అని మాధవతో కేశవ అంటాడు. నలుగురు అన్నదమ్ముళ్లు ఎమోషనల్ అవుతారు. కన్నా పక్కకి వెళ్లి బాధపడుతుంటే మాధవ వెళ్లి దైర్యం చెప్తాడు. మరొకవైపు మహా వాళ్ళ ఫ్యామిలీ భోజనం చేస్తుంటారు. సర్టిఫికెట్ తీసుకొని వచ్చావా అని ప్రతాప్ తన కూతురు మహాని అడుగుతాడు. తను టెన్షన్ పడుతూ క్లర్క్ లేడు నాన్న అని చెప్తుంది. మహా అబద్దం చెప్తుందని అతనికి అర్థం అవుతుంది. ఆ తర్వాత ఒకతనికి ఫోన్ చేసి ప్రొద్దున పెళ్లి సంబంధం అన్నారు కదా వాళ్ళని రమ్మని చెప్పండి అని ప్రతాప్ మాట్లాడుతుంటే.. తన భార్య విని ప్రొద్దున.. ఇప్పుడే పెళ్లి వద్దన్నారు మరి ఇప్పుడు ఏంటని అడుగుతుంది. నా ఫ్రెండ్ కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుంది.. అలా నా కూతురు చేస్తుందని కాదు.. ఆ వయసు అలాంటిది.. అందుకే జాగ్రత్తపడాలని ప్రతాప్ అంటాడు. మరొకవైపు పెళ్లి సంబంధం చూసే అతను చక్రికి ఫోన్ చేసి మీ అన్నయ్య పెళ్లిచూపులకి రాలేదని అడుగుతాడు. ఈ రోజు మా అన్నయ్య బిజీ ఉన్నాడు. మరొకరోజు సెట్ చెయ్యండి అని చక్రి చెప్తాడు. మరుసటిరోజు మహా పెళ్లిచూపులకి ఏర్పాట్లు జరుగుతాయి. ఆ విషయం తెలిసి మహా వద్దని అంటుంది కానీ తన మాట ఇంట్లో ఎవరు వినరు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: నల్లపూసల కోసం గంగ వాళ్ళింటికి వెళ్ళిన రుద్ర.. పారు ఏం చేస్తుందంటే!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -138 లో......రుద్ర దగ్గర ఉండి మరి గంగని బాగా చూసుకుంటాడు అది చూసి ఇషిక వీరు, పారు చూసి ఓర్వలేకపోతారు. గంగని దగ్గర ఉండి చూసుకొండి అని పెద్దసారు ఇంట్లో వాళ్లతో చెప్తాడు. అసలు అన్నయ్య మనకి ఛాన్స్ ఇవ్వడం లేదు.. తనే చూసుకుంటున్నాడని స్నేహ అంటుంది. గంగను వాళ్ళ పుట్టింటికి పంపింద్దామనుకుంటున్నాను.. తనతో పాటు రుద్రను కూడా అనగానే అందరు షాక్ అవుతారు. అంటే నల్లపూసల తంతు పుట్టింట్లో చేస్తారు కదా అని పెద్దసారు అనగానే శకుంతల షాక్ అవుతుంది. స్నేహ వెళ్లి గంగకి చెప్పమని పెద్దసారు అంటాడు. అదంతా విని ఇషిక వీరు, పారు మాట్లాడుకుంటారు. వీళ్ళని ఇలా వదిలేస్తే విషయం చాలా దూరం వెళ్తుంది. పుట్టింటికి వెళ్లిన గంగ తిరిగి రాకుండా ప్లాన్ చేస్తానని పారు అంటుంది. అప్పుడే రుద్ర వచ్చి.. ఏదో ప్లాన్ అంటున్నావేంటి అని అడుగుతాడు. మైండ్ డిస్టబ్ గా ఉంది.. ఏదైనా టూర్ ప్లాన్ చెయ్యాలి అంటున్నానని పారు కవర్ చేస్తుంది. ఇంటికి గెస్ట్ గా వచ్చి ఇంతసేపు ఉండడం పద్ధతి కాదని తెలియదా.. నీ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్ వస్తే ఊరుకోనని రుద్ర వార్నింగ్ ఇస్తాడు. మరుసటి రోజు గంగ, రుద్ర రెడీ అవుతారు. మా ఇంట్లో రుద్ర సర్ కి ఏం లోటు లేకుండా చూసుకుంటాం.. మా పక్కింట్లో ప్రిడ్జ్ ఉంది.. గల్లీలో కూలర్ ఉంది అని గంగ చెప్తుంటే.. వాళ్ళని వీళ్ళని అడుక్కొచ్చి అల్లుడికి మర్యాద చేస్తారా అని శకుంతల వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత గంగ,రుద్ర బయల్దేరతారు. గంగ, రుద్ర కలిసి గంగ వాళ్ళింటికి వెళ్ళగానే అందరు వచ్చి వాళ్ళిద్దరిని పలకరిస్తారు. ఎంతో రుద్ర ఇబ్బంది పడతాడు. ఇద్దరు గుమ్మం దగ్గరికి వస్తారు. లక్ష్మీ హారతి ఇస్తుంది. గంగ ఫ్రెండ్స్ రుద్రని ఆటపట్టిస్తారు. పేరు చెప్పి లోపలికి రమ్మని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi:చోటూ, మోటూలని ఆటాడుకున్న రాజ్, కావ్య.. పెన్ డ్రైవ్ దొరికేనా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -900 లో.....రాజ్, కావ్య కావాలనే పెన్ డ్రైవ్ శృతికి ఇచ్చామని మాట్లాడుకుంటారు. అది విని చోటూ, మోటూ ఇద్దరు శృతి కోసం వెతకడానికి వెళ్తారు. సంగీత కచేరి చేసేవాళ్లు శృతి గురించి మాట్లాడుకుంటే వెళ్లి శృతి ఎక్కడ అని అడుగుతారు. ఇదిగో పాడుతున్నారుగా అని వాళ్ళు అంటారు. మరొకవైపు అప్పు తన ఆఫీసర్ చెప్పింది గుర్తుచేసుకొని కోపంగా ఫైల్ విసిరేస్తుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మా సర్ పాప కేసు వదిలేసి కొత్త కేసు చూడమని చెప్పాడు.. ఇక కేసుని వదిలేస్తున్నానని అప్పు అనగానే ఎందుకు అలా తొందరపాటు నిర్ణయం తీసుకుంటావ్.. నువ్వు అనుకున్నది చెయ్ అని ఎంకరేజ్ చేస్తాడు. అప్పుడే రేణుక సూసైడ్ అటెంప్ట్ చేసిందని తన పక్కింటి వాళ్ళు అప్పుకి ఫోన్ చేసి చెప్తారు. మరొకవైపు వాళ్ళ రూమ్ కి వెళ్లి పెన్ డ్రైవ్ తీసుకొని అది మన బాస్ కి గిఫ్ట్ ఇద్దామని చోటు మోటు మాట్లాడుకుంటుంటే కావ్య,రాజ్ వింటారు. మరొకవైపు రేణుక దగ్గరికి అప్పు వస్తుంది. ఎందుకు ఇలా చేసారని అప్పు అనగానే.. నా కూతురు ఉందంటే ఎవరూ నమ్మడం లేదని తను చెప్తుంది. అప్పు బయటకు వచ్చి కానిస్టేబుల్ తో మాట్లాడుతుంది. మూడు రోజులవుతుంది అసలు కేసు గురించి తెలియడం లేదని డిస్సాపాయింట్ అవుతుంటే.. అప్పుడే పాప ఫ్రెండ్ అప్పు దగ్గరికి వచ్చి.. ఆంటీ మా ఫ్రెండ్ ఇందాక ఇంటిముందు కన్పించింది. ఆ విషయం చెప్తే మా అమ్మవాళ్ళు మనకెందుకు పోలీసులు మనల్ని అడుగుతారని చెప్పారంటూ ఆ పాప చెప్పగానే థాంక్స్ అమ్మ మంచి క్లూ ఇచ్చావని అప్పు అంటుంది. మరొకవైపు చోటూ, మోటూ ఇద్దరు రాజ్, కావ్య గదిలోకి వస్తారు. వాళ్ళిద్దరిని రాజ్, కావ్య ఒక ఆట ఆడుకుంటారు. ఆ తర్వాత రాహుల్ వర్క్ చేసుకుంటుంటే అప్పుడే స్వప్న వచ్చి డోర్ వేస్తుంది. ఓహ్ నేను బాధ్యతగా ఉంటున్నానని స్వప్న కూడా భార్యగా ఉండాలని అనుకుంటుందేమోనని రాహుల్ అనుకుంటాడు. ఏంటి స్వప్న ఇంత అందంగా ఉన్నావని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది. అదేం లేదు అత్తయ్య.. అతను నా పీఏ అని శ్రీధర్ అంటాడు. ఎవరికి చెప్పి తీసుకున్నారని జ్యోత్స్న కోప్పడుతుంది. నేను చెప్తే తీసుకున్నాడని శివన్నారాయణ సమాధానం చెప్తాడు. ఆ తర్వాత శ్రీధర్ ప్రెజెంటేషన్ ఇస్తాడు. దానికి దీప కొన్ని సలహాలు ఇస్తుంది. అవన్నీ అందరికి నచ్చుతాయి. ఇలాంటి ఆలోచనలు పెంచితే రావు.. అది పేరెంట్స్ నుండి వస్తుంది. దీప పేరెంట్స్ చాలా గొప్పొళ్ళు అని శివన్నారాయణ అనగానే.. మీ కొడుకుకోడలే దీప అమ్మానాన్న అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీధర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పారిజాతం, దీప మాట్లాడుకుంటారు. ఆ దీప బలం పెరుగుతుందని జ్యోత్స్న అనగానే నీ గ్రాఫ్ తగ్గిపోతుందని పారిజాతం అంటుంది. కార్తీక్ స్వీట్ చేసి తీసుకొని వచ్చి అందరిని హాల్లోకి పిలుస్తాడు. నీ భార్య మంచి సలహా ఇచ్చినందుకు చేసావా అని పారిజాతం అంటుంది. ఇక దీపని జ్యోత్స్న బాధపెట్టాలని తన గతంలోకి వెళ్తుంది. దీప తన భర్తని జైలుకి పంపింది. బావ నచ్చి అతన్ని వదిలేసిందని జ్యోత్స్న అంటుంది. సుమిత్ర తనని కొట్టబోతుంటే సమాధానం చేత్తో కాదు అత్త.. మాటల్తో ఉండాలని కార్తీక్ అంటాడు. ఆమ్మో ఇప్పుడు వీడేం చేయబోతున్నాడో ఏంటో అని పారిజాతం భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు. శ్రీవల్లి ఆ పేపర్ లోది చూసి చందు రాసాడనుకొని మురిసిపోతుంది. అది పక్కన విసిరేస్తుంది. అది ప్రేమ పూల ప్లేట్ తీసుకొని వెళ్తుంటే అందులో పడుతుంది. ధీరజ్, ప్రేమ ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. పేపర్ కింద పడడంతో తనదేమోననుకొని ప్రేమకి పేపర్ ఇస్తాడు. ప్రేమ అది చదివి ధీరజ్ రాసాడని సర్లే అడిగావు కదా సరే వెళదామని పేపర్ ధీరజ్ కి ఇవ్వగానే నువ్వు రాసి నేను రాసాను అంటున్నావా అని ధీరజ్ అనుకుంటాడు. ధీరజ్ ఆ పేపర్ ని పక్కన విసురుతాడు. అది నర్మద చూసి అటుగా వస్తున్న సాగర్ రాసాడనుకుంటుంది. సాగర్ కి ఆ పేపర్ ఇస్తుంది. అది నర్మద రాసి ఇచ్చిందనుకుంటాడు. ఆ తర్వాత ఆ పేపర్ సాగర్ పక్కన పడేస్తాడు. అది తిరుపతికి దొరుకుతుంది. నాకోసం ఎవరో రాసారు.. నేను కచ్చితంగా ఈ రోజు పార్క్ కి వెళ్ళాలనుకుంటాడు. ఆ తర్వాత సాయంత్రం పార్క్ కి అమూల్య, విశ్వ వస్తారు. అమూల్య స్కార్ఫ్ కట్టుకుంటుంది. ప్రేమ, ధీరజ్. నర్మద, సాగర్. చందు, శ్రీవల్లి. తిరుపతి కూడా వస్తారు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అందరు పార్క్ కి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu Voting 14th week: ఓటింగ్‌లో తనూజ టాప్.. సుమన్ శెట్టికి ఆ భయం లేదు!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం రీతూ చౌదరి ఎలిమినేషన్ అవ్వగా హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో కెప్టెన్ కళ్యాణ్ కాబట్టి అతను నామినేషన్లో లేడు. ఇక మిగిలిన ఆరుగురిలో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో.. ఎవరు టాప్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం. ప్రతీ వారంలో లాగే తనూజ ముప్పై శాతం ఓటింగ్ తో టాప్ లో ఉంది. సంజన గల్రానీ కి పదిహేను శాతం ఓటింగ్ పడుతోంది. డీమాన్ పవన్ 14.91 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. భరణి 14.7 శాతం ఓటింగ్ తో నాల్గవ స్థానంలో ఉన్నాడు. 13.6 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయేల్ అయిదో స్థానంలో ఉన్నాడు. ఇక చివరగా 10.78 శాతం ఓటింగ్ తో సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నాడు. అయితే సుమన్ శెట్టి లీస్ట్ లో ఉన్నా అతను ఎలిమినేషన్ కాడు.. ఎందుకంటే సుమన్ శెట్టి ప్రభంజనం అలాంటిది. గతవారం సుమన్ శెట్టి లీస్ట్ లో ఉండి.. తనపైన సంజన, రీతూ ఉండగా.. రీతూని ఎలిమినేషన్ చేసాడు బిగ్ బాస్. అంటే ఈ సారి కూడా సుమన్ శెట్టి ఎలిమినేట్ కాడు. దివ్య, రీతూ చౌదరి, నిఖిల్, దమ్ము శ్రీజ, గౌరవ్ .. వీళ్ళందరి కంటే సుమన్ శెట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆ.. కాదు.. కానీ హౌస్ లో ఉంటాడు. ఎందుకంటే అదే సుమన్ శెట్టి ప్రభంజనం.  సంజన, సుమన్ శెట్టిలకి బిగ్ బాస్ బయాజ్డ్ ఉన్నాడని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్ లో ఎవరెంత ఆడినా, ఆడకపోయినా రిస్క్ ఉంటుంది.. భయం ఉంటుంది.‌ కానీ సుమన్ శెట్టికి ఆ భయం లేదు. ఎందుకంటే పదమూడు వారాల్లో అతనేం చేయకపోయినా ఎలిమినేట్ అవ్వడం లేదు.. అసలేం చేశాడో.. ఎందుకు హౌస్ లో ఉంచుతున్నారో బిగ్ బాస్ మామకే తెలుసు. అయితే ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్ డేంజర్ జోన్ లో ఉన్నారు.

Tanuja Vs Sanjana: సంజన వర్సెస్‌ తనూజ.. ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్!

బిగ్ బాస్ సీజన్-9 పదమూడు వారాలు పూర్తి చేసుకుంది. హౌస్ లో నుండి గతవాతం రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. ఇక ఈ వారం ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.‌ అలాగే సెకెండ్ ఫైనలిస్ట్ ఎవరో తెలియడం కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ‌ఇక నిన్నటి ఎపిసోడ్ లో లోడర్ బోర్డ్ లో సంజన లీస్ట్ లో ఉండగా ఇమ్మాన్యుయేల్ టాప్ లో ఉన్నాడు. హౌస్ లో జరిగిన గేమ్ లో ఇమ్మాన్యుయేల్ ఫస్ట్ గెలిచి అత్యధికంగా 150 పాయింట్లు తెచ్చుకున్నాడు. ఇక ఇమ్మాన్యుయేల్ తర్వాత డీమాన్ పవన్ గెలిచాడు. అతనికి 120 పాయింట్లు రాగా, ఆ తర్వాత వచ్చిన సుమన్ శెట్టి, తనూజ 90 పాయింట్లు వచ్చాయి. భరణికి 90 పాయింట్లు రాగా ఇక చివరగా ఉన్న సంజనకి ఎనభై పాయింట్లు వచ్చాయి. ఇక వీరిలో నుండి ఒకరిని తీసేయమని బిగ్ బాస్ కోరాడు. అక్కడ మొదలైంది అసలైన పంచాయతీ..‌ సంజన వర్సెస్ తనూజ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ‌ హౌస్ లో నెక్స్ట్ గేమ్ ఎవరు ఆడకూడదని అనుకుంటున్నారో చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. మొదటగా సుమన్ శెట్టి లేచి.. అత్యధిక పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇమ్మాన్యుయేల్ ని తీసేద్దామని అనుకుంటున్నానని సుమన్ శెట్టి చెప్పగా, భరణి కూడా అదే రీజన్ చెప్పి ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పాడు. ఇక సంజన లేచి.‌ డీమాన్, ఇమ్మాన్యుయేల్ లో డీమాన్ స్ట్రాంగ్ కాబట్టి డీమాన్ ని తీసేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత తనూజ లేచి ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పింది. ఇక డీమాన్ లేచి సంజన పేరు చెప్పాడు.. కళ్యాణ్ కూడా సంజన పేరు చెప్పాడు. ఇక ఇప్పుడు హౌస్ లో‌ మిగిలింది ఇమ్మాన్యుయేల్. తను ఆడాలనుకుంటే సంజనని తీసేయ్యాలి లేదంటే తను డ్రాప్ అవ్వాలి. వేరే ఆప్షన్ లేదని ఇమ్మాన్యుయేల్ అనగానే.. ఇక వెంటనే సంజన నిల్చొని.. సారీ బిగ్ బాస్ నేను ఇమ్మాన్యుయేల్ ని తీసేద్దామని అనుకుంటున్నానని అంది. ఇక అది విని తనూజకి ఫుల్ కోపం వచ్చింది. తను లేచి సారీ బిగ్ బాస్.. నేను సంజనని గేమ్ నుండి తప్పించాలని అనుకుంటున్నానని చెప్పింది. దాంతో ఇద్దరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది. డ్రాప్ చేస్తానంటే వద్దు ఫ్రెండ్ వస్తుందని మహా వెళ్ళిపోతుంది. మరొకవైపు చక్రి క్యాబ్ ఓనర్ కి రోజు డబ్బులు ఇచ్చి వెళ్తుంటే అప్పుడే ఒక బుకింగ్ వచ్చింది వెళ్ళమని చెప్తాడు. చక్రి కస్టమర్ కోసం వెయిట్ చేస్తాడు. మహాకి తన ఫ్రెండ్ క్యాబ్ బుక్ చేస్తాడు. చక్రి కార్ అనుకొని మహా అందులో ఎక్కుతుంది. మహాని చూసి చక్రి ఫ్లాట్ అవుతాడు. అయ్యో సారీ అండి వేరే క్యాబ్ అనుకొని ఇందులో ఎక్కానని మహా కార్ దిగి వెళ్ళిపోతుంది. మరొకవైపు మాధవకి పెళ్లి చూపులు అని కన్నా రెడీ చేస్తాడు. ఆ తర్వాత కేశవ టీ స్టాల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న నారాయణ ఉంటాడు. అక్కడే వాళ్ళ పెద్దనాన్న వీళ్ళ గురించి తక్కువగా మాట్లాడతాడు. ఎవడ్రా మీ ఇంటికి ఆడపిల్లని ఇచ్చేదని ఇష్టం వచ్చినట్లు తిడుతాడు. దాంతో కేశవ ఇంటికి కోపంగా వెళ్తాడు. చక్రి వస్తాడు.. అన్నయ్య ఎంత మంచిగా రెడీ అయిన పెళ్లి కాదు అంటూ కేశవ అంటాడు. దాంతో కేశవ, చక్రికి గొడవ అవుతుంది. మరొకవైపు మహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తన డిజైన్ చెప్తుంది. అది చూసి.. బాగుంది దాని గురించి గవర్నమెంట్ తో డిస్కషన్ చేస్తామని చెప్తారు. మహా బయటకు వచ్చాక ఓవర్ అంబిషన్ గా ఉందని వాళ్ళు అనుకుంటారు. అ తర్వాత మహా తన ఫ్రెండ్ అయిన అబ్బాయితో కలిసి మాట్లాడుతుంది. నా ఐడియా వాళ్లకు నచ్చిందని అతనితో చెప్తుంది. ఇంత అమాయకురాలివి ఏంటి మహా.. అలా అందరు చెప్పింది నమ్మేస్తావని అతను మహాపై జాలి చూపిస్తాడు. ఆ తర్వాత మహా వాళ్ళ నాన్న ప్రతాప్ తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. నువ్వు షేర్స్ ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావని అడుగుతాడు. మాకున్న డబ్బులు చాలు.. నీకు ఒక కూతురు ఉంది కదరా అని ప్రతాప్ అనగానే మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది.. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది.. కమ్యూనిటీ లో మా పరువు తీసింది.. నీకు ఒక కూతురు ఉంది జాగ్రత్త అని అతను చెప్తాడు. అ తర్వాత ప్రతాప్ వస్తుంటే దారిలో మహా తన ఫ్రెండ్ బైక్ మీద వెళ్లడం చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో మహా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది త్వరగా తనకి పెళ్లి చెయ్యాలని ప్రతాప్ తన భార్యతో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial:గాయాలతో ఇంటికొచ్చిన గంగ.. పట్టించుకోని శకుంతల!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -137 లో.....గంగ నగలు వేసుకోవడంతో శకుంతల కోప్పడుతుంది. నిన్ను ఎప్పటికి కోడలిగా ఒప్పుకోనని శకుంతల చెప్తుంది. దాంతో గంగ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. గంగ ఏడుస్తుంటే ఇషిక, వీరు కలిసి తన దగ్గరికి వెళ్తారు. నేనే నగలు ఇచ్చానని ఇషిక అనగానే అయ్యో అలా ఎందుకు చేసావ్ ఇషిక.. పాపం ఇప్పుడు గంగ సిచువేషన్ చూడమని వీరు అంటాడు. ఇప్పుడు రుద్ర బావ చూడు కోపంగా వెళ్ళాడు.. ఇలా వెళ్తే ఎలా అని లేని డౌట్ గంగలో వీరు క్రియేట్ చేస్తాడు. దాంతో గంగ బయటకు వెళ్లి రుద్ర కార్ వెంబడి పరుగెడుతుంది. గంగ రావడం చూసి రుద్ర కార్ ఆపుతాడు. ఎందుకు ఇలా వస్తున్నావని అడుగుతాడు. మీకు ఏమైనా అవుతుందోనని భయంతో వచ్చానని గంగ అంటుంది. సరే క్యాబ్ బుక్ చేస్తాను వెళ్ళమని రుద్ర అనగానే వద్దు షేర్ ఆటోలో వెళ్తానని గంగ అంటుంది. షేర్ ఆటో రావడంతో గంగని రుద్ర షేర్ ఆటో లో ఎక్కిస్తాటు. డ్రైవర్ కి లైసెన్స్ ఉందా లేదా అని కనుక్కుంటాడు. ఆ తర్వాత ఆటోలో ఉన్న వాళ్లంతా మీ భర్తకి మీరంటే చాలా ఇష్టంగా ఉన్నట్టు ఉందని అంటారు. అది చూసి గంగ మురిసిపోతుంది.  ఆ తర్వాత రుద్ర ఒక దగ్గర ఆగుతాడు. షేర్ ఆటోకి ఆక్సిడెంట్ అయిందని అక్కడ అనుకుంటుంటే విని వెంటనే అక్కడికి వెళ్తాడు. ఆటోలో ఉన్నవాళ్ళకి దెబ్బలు తాకుతాయ్.. గంగకి కూడా చిన్నగా దెబ్బలు తాకుతాయి. మరొకవైపు శకుంతల నగలు తీసుకొని వచ్చి పారుకి ఇస్తుంటే.. వద్దు ఆ నగలు గంగ వేసుకుందని అంటుంది. మరి రుద్ర బావని గంగ పెళ్లి చేసుకుంది కదా వదిలేస్తావా అని ఇషిక అనగానే రుద్ర వేరు అని పారు అంటుంది. అప్పుడే దెబ్బలతో ఉన్న గంగని తీసుకొని వస్తాడు రుద్ర. శకుంతల ఏం పట్టనట్లు ఉంటుంది. ప్రమీల, ప్రీతీ తన గురించి కేర్ తీసుకుంటారు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే బాగోదని రుద్ర తనకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.