తెలుగు-కన్నడ వివాదంపై స్పందించిన బ్రహ్మముడి రుద్రాణి.. అంతా ఒక్కటే అంటూ నిఖిల్ కే సపోర్ట్!

తెలుగు టీవీ ఇండస్ట్రీపై బిగ్ బాస్ షో ప్రభావం గట్టిగానే పడింది. ఈ షో సాగుతున్నన్ని రోజులు టీవీ సీరియల్స్ రేటింగ్ పడిపోయాయి. అయితే సీజన్-8 లో కన్నడ యాక్టర్ నిఖిల్ గెలవడంపై , హౌస్ లో కూడా వారిదే మెజారీటీ ఉండటం.. వారికే బిగ్ బాస్ సపోర్ట్ చేయడం పెద్ద దుమారం రేగింది. ఈ తరుణంలో రీసెంట్ గా సీనియర్ యాక్టర్ కౌశిక్ తెలుగు ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వడం లేదంటు ఎమోషనల్ అవ్వగా తాజాగా షర్మిత గౌడ కూడా రియాక్ట్ అయ్యింది. స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో బ్రహ్మముడి కి ఉండే క్రేజే వేరు. అందులో సుభాష్‌, ప్రకాష్ లకి చెల్లిగా, రాజ్ కి మేనత్తగా రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ నటిస్తోంది. ఇందులో మోస్ట్ పాపులర్ లేడి విలన్ గా షర్మిత గౌడ  గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే తను తాజాగా మీడియాతో తెలుగు కన్నడ వివాదంపై మాట్లాడింది. తెలుగు కన్నడ అంటు ఏం లేదు.. అంతా ఆర్టిస్టులమే.. మనమంతా ఇండియన్స్ అని రుద్రాణి అంది. సీజన్-8 లో నిఖిల్‌ని గెలిపించాలని కోరుతూ అతనికి ఓట్లు వేయమని పోస్ట్ పెట్టింది రుద్రాణి. ఓ పక్క ఆల్ ఆర్ ఇండియన్స్ అంటూనే.. కన్నడ వాడు కాబట్టి నిఖిల్‌కి సపోర్ట్ చేస్తున్నావా అంటూ షర్మిత తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. తెలుగు కన్నడ అనే బాషాభేదాలు లేనట్లయితే హౌస్ లో అంత మంది కంటెస్టెంట్స్ ఉండగా కన్నడ అతడికే ఎందుకు సపోర్ట్ చేశారంటు నిజంగా షర్మితకి అంత కన్నడ భాషాభిమానం లేకపోతే.. తెలుగు కంటెస్టెంట్స్ అంతమంది ఉన్నారు కదా.. మరి వాళ్లలో ఎవరికైన సపోర్ట్ చేయొచ్చు కదా.. తెలుగు వాళ్లు గెలవకూడదా.. తెలుగు బిగ్ బాస్‌లో తెలుగు వాడు గెలవాలంటే తప్పా అంటూ షర్మితకి కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ నిఖిల్ గురించి మాట్లాడిన ఈ మాటలు.. మరోసారి ఈ వివాదానికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయి. అయితే షర్మిత గౌడ చేసిన వ్యాఖ్యలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నిఖిల్ ఈ పోస్ట్ కి లైక్ చేయడంతో ఇది ఇప్పుడు మరింతగా ట్రెండింగ్ అవుతోంది. 

గుండెల్ని పిండేసిన అత్తాకోడళ్లు.. తను ఆ వ్రతం జరగనిస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -37 లో... భద్రవతికి రామరాజు సారీ చెప్పినందుకు బాధపడుతుంటే వేదవతి వస్తుంది. ఇంట్లో ఏం జరుగుతుంది అసలు నువ్వు ముగ్గు వేయకుండా ఆ పిల్ల ఎందుకు వేసిందని భద్రావతి పైన కోప్పడతాడు రామరాజు. ఇక ఇంట్లో ఏ గొడవ జరగకుండా చూడు.. అన్ని నువ్వు చూసుకో అని వేదవతికి చెప్తాడు. దాంతో కోపంగా నర్మద దగ్గరికి వెళ్తుంది వేదవతి. నర్మద కూడా వేదవతి కోసం వస్తుంటుంది. నీ వల్లే ఈ గొడవలు.. నీకు ఇవన్నీ పనులు చెయ్యమని నేను చెప్పానా.. ఎందుకు అన్నింట్లో పెద్దరికం చేస్తున్నావని నర్మదపైన కోప్పడుతుంది వేదవతి. దాంతో వేదవతిని నర్మద హగ్ చేసుకొని.. మీరు చాలా గ్రేట్ అత్తయ్య మా అమ్మనాన్నలకి దూరంగా ఉండి రెండు రోజులు అవుతుంది.. నాకే ఏదోలా బాధగా ఉంది కానీ మీరు ఇన్ని సంవత్సరాలుగా మీ వాళ్ళకి దూరంగా ఉంటూ ఎంత బాధని అనుభవిస్తున్నారని నర్మద ఎమోషనల్ అవుతుంది. దంతో వేదవతి అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఆ తర్వాత వేదవతి గుడికి వెళ్తుంది. అక్కడ కొంతమంది వేదవతి తన కొడుకు కోడలు చేత సత్యనారాయణ వ్రతం చేయించలేదంటూ మాట్లాడుకుంటారు. అది విని రామరాజుకి చెప్పి పూజ జరిపిద్దామని తనే అనేలా చేస్తుంది వేదవతి. అది చూసి చూసావా వదిన మా అమ్మ పూజ జరిపించడానికి ఎలా నరక్కుంటూ వస్తుందోనని నర్మదతో ధీరజ్ అంటాడు. ఆ తర్వాత నర్మద, ధీరజ్ లు పూజకి కావలిసినవి కొనడానికి వస్తారు. అక్కడికి ప్రేమ వస్తుంది. మళ్ళీ ఎప్పటిలాగే ధీరజ్, ప్రేమలకి గొడవ అవుతుంది. ఆ తర్వాత ప్రేమ మా ఇంట్లో పూజ ఉంది రావాలనంటుంది. ఆ మాటలు తన అన్న విశ్వ విని దగ్గరికి వచ్చి నర్మద పైన కోప్పడి.. ప్రేమని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత విశ్వ ఇంటికి వెళ్లి.. ఆ నర్మద మన ప్రేమతో పూజకి రమ్మని చెప్తుందని భద్రవతికి చెప్తాడు. ఆ పూజ ఎలాగైనా ఆపాలని భద్రవతి అంటుంది. ఎలా అని విశ్వ అనగానే.. నేను చూసుకుంటానని ప్రసాదరావుకి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది భద్రవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పది లక్షలున్నాయ్.. నీకు కావాలంటే క్షమాపణలు చెప్పాల్సిందే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -236 లో.....కార్తీక్ అందరిని లోపలికి పంపించి ఓనర్ తో ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వడం కష్టం.. ఈ ఫోన్ ఉంచండి.. డబ్బులు ఇచ్చి తీసుకుంటానని కార్తీక్ అనగానే సరే కానీ రెంట్ మాత్రం కరెక్ట్ టైమ్ కి ఇవ్వాలి అంటాడు. దానికి కార్తీక్ సరే అంటాడు. అదంతా దీప చూసి గతంలో తను హెల్ప్ చేసినప్పటి విషయం గుర్తుచేసుకొని ఎలా ఉండేవాళ్లు ఎలా అయ్యారనుకుంటుంది. కార్తీక్ ఓనర్ తో మాట్లాడి వస్తుంటే వెనకాల దీప ఉంటుంది. కార్తీక్ కవర్ చేస్తూ.. ఈ ఇల్లు బాగుంది కదా అంటూ కవర్ చేస్తాడు. అప్పుడే శౌర్య వచ్చి.. నాన్న నాకు ఈ ఇల్లు నచ్చలేదని అంటుంది. ఎందుకు అమ్మ, నాన్నకి నచ్చినప్పుడు.. నీకు నచ్చకుంటే నాన్న బాధపడుతాడు కదా అని కార్తీక్ అంటాడు. నాకు నచ్చింది నాన్న అని శౌర్య అంటుంది. ఆ తర్వాత నాకు ఆకలిగా ఉంది. నాన్న అమ్మ ఏదైనా పెట్టు అని శౌర్య అనగానే.. బయటకు వెళ్లి తిందామని దీప, శౌర్యలని బయటకు తీసుకొని వెళ్తాడు కార్తీక్. చిన్న బండి దగ్గరికి తీసుకొని వెళ్లి టిఫిన్ తీసుకుంటాడు. డబ్బులు తక్కువ ఉంటాయి. అయిన హోటల్ అతను ఇస్తాడు. ఆ తర్వాత నాన్న అది కూడా తింటా ఆకలిగా ఉందని శౌర్య అనడంతో.. కార్తీక్ ప్లేట్ శౌర్య తీసుకుంటుంది. కార్తీక్ వెళ్లి వాటర్ తాగుతుంటే.. దీప వెళ్లి తన ప్లేట్ లో ఉన్నవి ఇస్తుంది. ఇద్దరు షేర్ చేసుకొని తింటారు. మరొకవైపు కాంచన, అనసూయ ఇల్లు క్లీన్ చేస్తుంటే శ్రీధర్, కావేరిలు వస్తారు. కావేరి కార్తీక్ రెస్టారెంట్ కి డబ్బులు ఇవ్వగా.. వద్దని కాంచన కోప్పడుతుంది. ఈ పరిస్థితి వచ్చినందుకు కాంచనతో వెటకారం గా మాట్లాడతాడు శ్రీధర్. అప్పుడే కార్తీక్ వాళ్లు వస్తారు. రెస్టారెంట్ పెట్టడానికి నా దగ్గరున్న డబ్బు ఇస్తాను కానీ కొన్ని షరతులు అని శ్రీధర్ చెప్తుంటాడు. నన్ను అవమానించినందుకు నాకు సారీ చెప్పాలి. ఇంకొకటి మీతో నన్ను ఉండనివ్వలని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సవతి తల్లి గురించి తెలుసుకున్న కొడుకు.. ఆస్తి మొత్తం రాసిచ్చేశాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -287 లో......సీతాకాంత్ మేనేజర్ ని పిలిచి పెద్దాయనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత సందీప్ పెద్దాయన దగ్గరికి వచ్చేసరికి లేకపోవడంతో టెన్షన్ గా శ్రీలత వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను లేడని చెప్పడంతో అందరు కంగారుపడతారు. ఎక్కడ వాళ్ళ గురించి పెద్దాయన చెప్తాడోనని టెన్షన్ పడతారు. అపుడే సిరి వచ్చి.. ఏంటి అండి వచ్చినప్పటి నుండి మా వాళ్ళతో అంత చనువుగా ఉంటున్నారని ధనతో సిరి అంటుంది. మీ అమ్మ చాలా మంచిదని ధన అంటాడు. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మిలు వస్తారు. ఎక్కడికి వెళ్లారు తాతయ్య కూడా కన్పించడం లేదని సిరి అంటుంది. తాతయ్య ఆఫీస్ నుండి కాల్ వస్తే వెళ్లారని సందీప్ అనగానే.. ఎంత ఈజీ గా అబద్ధం ఆడుతున్నావని సీతాకాంత్ అనుకుంటాడు. నువ్వు ఏంటి అన్నయ్య అలా ఉన్నావని సిరి అడుగగా.. మీ అన్నయ్యని ఈ ల్యాండ్ ఓనర్స్ కొట్టారు. నేను టైమ్ కి వెళ్లను కాబట్టి సరిపోయిందని రామలక్ష్మి అనగానే.. అయ్యో ఏమైంది నాన్న అంటూ శ్రీలత నటిస్తుంటుంది. నువ్వు చేసిన గాయం ముందు ఇది ఎంత అని సీతాకాంత్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీలత కేక్ కట్ చేస్తుంది. మొదటగా సీతాకాంత్ కి తినిపిస్తుంది. అప్పుడే మేనేజర్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు. ఆ డాకుమెంట్స్ పైన సీతాకాంత్, రామలక్ష్మి లు సంతకం పెడతారు. సీతాకాంత్ తన ఆస్తులు అన్ని కూడా సగం సిరికి సగం సందీప్ కి ఇస్తున్నట్లు ఉంటుంది. ఇక ఆస్తులు అన్ని మీవే అని సీతాకాంత్, శ్రీలతకి డాక్యుమెంట్స్ ఇస్తాడు. శ్రీలత, సందీప్, శ్రీవల్లి, ధనలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏమైందని సీతాకాంత్ ని అడుగుతుంది రామలక్ష్మి.. కానీ‌ అతను సమాధానం చెప్పడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు ఇంటికి వచ్చి తమ బ్యాగ్ ని సర్దుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అనవసరంగా సీతా బావ రామలక్ష్మిలని చంపాలనుకున్నామని ధన అంటాడు. ఆ మాటలు సిరి విని మా అన్నయ్యని చంపాలనుకున్నారా అని అడుగుతుంది. అవునంటూ సందీప్ కఠినంగా మాట్లాడుతాడు. ఆ మాటలన్నీ రామలక్ష్మి, సీతాకాంత్ లు వింటారు. వాళ్ళ గురించి నిజం తెలిసి నా దగ్గర దాచారా అని సీతాకాంత్ ని రామలక్ష్మి అడుగుతుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి ధన చెంప పగులగొడుతుంది. వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తుంది మీరేనా అని రామలక్ష్మి అనగానే.. అవునని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అక్కకి నెక్లెస్ ఎందుకు కొనిచ్చావ్.. షాక్ అయిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. (Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -601 లో.... ఇంట్లో ఏది ఖర్చు చేసినా నాకూ చెప్పాలని కావ్య చెప్పడంతో.. రుద్రాణి, ధాన్యలక్ష్మిలకి కోపం వస్తుంది. మీరేం మాట్లాడడం లేదని ఇందిరాదేవితో ధాన్యలక్ష్మి అంటుంది. ఎప్పుడు నాకు నువ్వు పెద్ద దానివని విలువ ఇచ్చావ్.. నా భర్త అలా ఉంటే మీకు ఆస్తుల గురించి గొడవ పడుతున్నారని ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి చురకలు అంటిస్తుంది. నువ్వు అయిన చెప్పమని రాజ్ తో రుద్రాణి అనగానే.. నానమ్మనే ఏం అనడం లేదు.. నేనేం అంటాను.. నా ఫోన్ బిల్ కూడ తనే కట్టింది. తాళాలు తన చేతులో ఉన్నాయ్ కాబట్టి అందరం తను చెప్పినట్టు విందామని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎలా ఇలా మాట్లాడుతున్నావని కావ్యతో రాజ్ అంటాడు. నాలో ఉన్న మీరు ఇలా నాతో మాట్లాడిస్తున్నారు.. ఎదుటి వారిని తమ మాటల్తో కట్టి పడేయ్యడం మీ దగ్గర నుండి నేర్చుకున్నానని కావ్య అంటుంది. థాంక్స్ అని రాజ్ అనగానే.. మీకే థాంక్స్ ఒక భార్యకి థాంక్స్ చెప్పే భర్త దొరికినందుకని కావ్య అంటుంది. దాంతో రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత పనిమనిషి శాంత రావడంతో నిన్ను ఎవరు పిలిచారని రుద్రాణి గొడవపడుతంటే.. కావ్య వచ్చి నేనే పిలిచానని చెప్తుంది. మరొకవైపు ఇందిరాదేవి హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ లతో ఇంకా ఎన్ని రోజులు అవుతుంది. నా బావ బాగవ్వడానికి అని అడుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి అని డాక్టర్ అంటాడు. ఆ తర్వాత అందరు టిఫిన్ చెయ్యడానికి వస్తారు. టిఫిన్ ఒక ఇడ్లీ చెయ్యడంతో రుద్రాణి ఏంటి ఒక్కటే చేశారని అడుగుతుంది. ఇకనుండి ఒకటే అని కావ్య చెప్తుంది. మాకు వద్దు నచ్చింది ఆర్డర్ చేసుకుంటామని రాహుల్, రుద్రాణి, ధాన్యలక్ష్మిలు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ప్రకాష్ దగ్గరికి వచ్చి ఆ కావ్య ఇలా చేస్తుందని ప్రకాష్ పైన కోప్పడుతుంది. తరువాయి భాగంలో మా కార్డ్స్ ని బ్లాక్ చేసావా అని రుద్రాణి అనగానే.. అవునని కావ్య అంటుంది. ఎందుకని రుద్రాణి అనగానే అనవసరమైన ఖర్చు పెట్టొద్దని కావ్య అంటుంది అయితే అక్కకి ఖర్చు పెట్టి నెక్లెస్ కొనొచ్చా అని ధాన్యలక్ష్మి అని అనగానే.. కావ్య షాక్ అవుతూ అక్క ఆ నెక్లెస్ కొనడానికి డబ్బు ఎక్కడిది అంటుంది. నువ్వే చెక్ ఇచ్చావ్ కదా అని స్వప్న అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తాగుబోతు రమేష్ ని కొట్టిన ఫైమా

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఫైమా తాగుబోతు రమేష్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టిపారేసింది. అసలు ఒక సీనియర్ కమెడియన్ అని కూడా లేకుండా తిట్టేసింది. "మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పరువంతా గంగలో కలిసిపోయింది" అనేసరికి తాగుబోతు రమేష్ వెళ్ళిపోతాడు. "ఎక్కడికి వెళ్తున్నారు" అని అడిగింది ఫైమా. " పరువు పోయిందన్నావుగా గంగలోకి వెళ్లి తీసుకొస్తా" అని చెప్పాడు. దాంతో ఫైమా తాగుబోతు రమేష్ ని పిచ్చ కొట్టుడు కొట్టింది. ఇక ఇందులో ఒక టాస్క్ ఇచ్చారు ..వేరే వాళ్ళు వచ్చి నెమలీకతో డిస్టర్బ్ చేస్తూ ఉన్నా కూడా టాస్క్ ఆడే వాళ్ళు సూదిలో దారం ఎక్కించాలి. ఐతే నాటీ నరేష్  సూదిలో దారం ఎక్కిస్తుంటే మహేశ్వరీ వచ్చి నెమలీకతో బాగా దిస్తుర్బ్ చేస్తుంది. ఐనా కూడా నరేష్ దిస్తుర్బ్ కాకుండా దారం ఎక్కించి గెలుస్తాడు. ఇక రష్మీ "నరేష్ ఎం కోరుకుంటున్నావ్" అనేసరికి "కోరుకున్నాక కాదనకూడదు చెప్తున్నా" అన్నాడు. "ఒక చిన్న కిస్ ఇచ్చేస్తే నే వెళ్ళిపోతా" అన్నాడు. దానికి మహేశ్వరీ సిగ్గుపడిపోయింది. పెట్టండిరా "ముద్దే పెట్టు ముద్దే పెట్టు" అనే సాంగ్ ని అని నరేష్ అనేసరికి రష్మీ వచ్చి మంచి ఫీల్ ఉన్న సాంగ్ పెట్టమని అని సలహా ఇచ్చింది. "నాకు ఆ ఫీలే కావాలి" అన్నాడు. ఇక నూకరాజు ఇంద్రజ మీద పెద్ద కౌంటర్ వేసాడు. "ఇంద్రజమ్మకు అంత క్రేజ్ ఉందా రా" అని నరేష్ అడిగేసరికి. " అంత క్రేజ్ ఉందా..మొన్నటికి మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే ..అక్కడ జనాలంతా అరుపులు..ఎందుకంటే బస్సుకు ఎదురు నిల్చుంది అమ్మ..తప్పుకోండి తప్పుకోండి అని అరుపులు " అంటూ కౌంటర్ వేసేసరికి ఇంద్రజ ఫీలైపోయింది. ఇక ఇంద్రజ ఎక్కడ కొడుతుందో అని అక్కడి నుంచి పారిపోయాడు.

రష్మీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది...లక్కీ భాస్కర్ కావడానికి ఫైమాకి ప్లాస్టిక్ సర్జరీ

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోస్ లో యాంకర్ రష్మీ మీద జోక్స్ , కౌంటర్లు వేయడం బాగా ఎక్కువగా కనిపిస్తోంది. నెక్స్ట్ వీక్ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. అందులో చూస్తే రెండు స్కిట్స్ లో రష్మీ పేరును బాగా వాడేశారు. బులెట్ భాస్కర్ స్కిట్ లో ఐతే నాటీ నరేష్ వచ్చి పేరు చెప్పి డీటెయిల్స్ నోట్ చేసుకున్నాడు. లక్ష రూపాయలు కడిగితే కోటి రూపాయలు వస్తుంది అని చెప్పేసరికి ఫైమా డీటెయిల్స్ ఇచ్చాడు బులెట్ భాస్కర్. ఎలాగైనా ఆ కోటి రూపాయలు కొట్టేసి లక్కీ భాస్కర్ ఐపోవాలని ప్లాన్ చేసి ఫైమాకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాడు. ఆ ప్లాస్టిక్ సర్జరీలో ఏకంగా ఫైమా బదులు సత్య వచ్చేస్తుంది. "ఇదేంటి సర్ నా భార్య ఎక్కడ...ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తే ఇంత మార్పు వస్తుందా" అని అడిగాడు. "ఈమెనే నీ భార్య..ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంత మార్పు వస్తుంది" అని డాక్టర్ చెప్పేసరికి "రష్మీ ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలు ఎన్ని చేయించుకుందో ఏమిటో" అని భాస్కర్ కౌంటర్ వేసాడు. దానికి రష్మీ షాకైపోతుంది. "సి థిస్ గర్ల్...నంబర్ వన్ మేకప్ గర్ల్ " అంటూ వెనక ఒక డైలాగ్ కూడా వచ్చేసింది. ఇక ప్రోమో స్టార్టింగ్ లో దొరబాబు స్కిట్ లో కూడా రష్మీ పేరొచ్చింది. దొరబాబు పెళ్ళికొడుకు గెటప్ లో ఉంటాడు. ఆటో రాంప్రసాద్ దొరబాబును అడుగుతాడు " పెళ్లి కూతురు ఎలా ఉంటుంది" అని " అటు ఇటుగా రష్మిలా ఉంటుంది" అంటాడు దొరబాబు. "అటైతే ఓకే కానీ ఇటు రష్మిలా ఉంటే ఎందుకు బొక్కా" అంటూ కౌంటర్ వేసాడు ఆటో రాంప్రసాద్.

Brahmamudi : కావ్య మాటతో ఇంట్లో ఒక్కటే టిఫిన్.. రుద్రాణికి చెక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -600 లో..... కావ్య బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేస్తుంది. వందకోట్ల డబ్బులు ఇన్స్టాల్మెంట్ లో పే చెయ్యడానికి వాళ్లని ఒప్పిస్తుంది. దానికి రాజ్ ఇంప్రెస్ అవుతాడు. చాలా థాంక్స్ ఈ ప్రాబ్లెమ్ నుండి ఎలా బయటపడాలనుకున్నా కానీ నువ్వు చాలా ఈజీగా సాల్వ్ చేసావ్.. కీప్ ఇట్ అప్ అని తన భుజాన్ని తట్టి వెళ్ళిపోతాడు. దాంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.  అపుడే శృతి వచ్చి.. ఏంటి మేడమ్ సర్ ని అంతలా మార్చేశారని అంటాడు. నిజంగానే తనలో మార్పు వచ్చిందా అని కావ్య అంటుంది. ఆ తర్వాత టీ పెట్టుకుంటున్న ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్లి.. రాబోయే రోజుల్లో టీ స్టాల్ పెట్టుకోవాలని తనని రెచ్చగొడుతుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ మళ్ళీ మళ్ళీ థాంక్స్ చెప్తాడు. నన్ను భార్యగా ఒప్పుకుంటే చాలు నాకూ.. ఈ థాంక్స్ ఏం వద్దని రాజ్ ని కన్ఫ్యూషన్ చేసినట్లు కావ్య మాట్లాడుతుంటుంది. మీ భార్యలతో ఇదే బాధ కన్ఫ్యూజ్ చేస్తారని రాజ్ అంటాడు. ఇద్దరు ఎన్నడూ లేని విధంగా సరదాగా మాట్లాడుకుంటారు. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ కానీ ఈ నెలలో ఇరవై కోట్లు కట్టాలని రాజ్ అంటాడు. మీరు నెమ్మదిగా ఆలోచించండి అని కావ్య అనగానే.. రాజ్ మేనేజర్ కి ఫోన్ చేసి వర్క్ త్వరగా కంప్లీట్ కావాలని ఆర్డర్ వేస్తాడు. కానీ ఇప్పుడు ఇంట్లోకి డబ్బులు కావాలి.. వాళ్ళను ఎలా మేనేజ్ చెయ్యాలని రాజ్ అనగానే.. అది నేను చూసుకుంటానని కావ్య అంటుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు స్వప్న దగ్గరికి వచ్చి డబ్బు కావాలని అడుగుతారు. ఇవ్వనని స్వప్న అనగానే.. లేదంటే ధాన్యలక్ష్మికి చెప్తానని బ్లాక్ మెయిల్ చెయ్యగానే.. డబ్బు తీసుకొని వస్తుంది స్వప్న. అప్పుడే కావ్య రాజ్ వస్తారు. ఆగు అక్క అని స్వప్నని కావ్య ఆపుతుంది. ఇంట్లో అందరిని పిలిచి ఇంట్లో ఏ ఖర్చు పెట్టినా నాకు చెప్పాలి. రిసీట్స్ తో సహా అంటూ అని కావ్య అనగానే రుద్రాణి, ధాన్యలక్ష్మిలు కోప్పడతారు. ఇది ఇంట్లో అందరికి ఇది నా ఆర్డర్ అని కావ్య చెప్తుంది. దానికి ఇందిరాదేవి వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో ఇంట్లో టిఫిన్ ఒక ఇడ్లీనీ చేస్తారు. ఇదేంటని రుద్రాణి అడుగగా.. ఇక నుండి ఇంట్లో ఒక టిఫిన్ మాత్రమే ఉంటుందని కావ్య అంటుంది. ఆ తర్వాత తిండి గురించి ఇలా ఆలోచిస్తున్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుందని కావ్యతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

llu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ట్రాప్ చేసాడంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -36 లో... ధీరజ్ మళ్ళీ ఎందుకు వచ్చాడంటూ రామరాజు గొడవ పెడుతుంటే.. వద్దని వేదవతి ఆపుతుంది. వాడు తప్పు చేసాడని వద్దని అంటున్నారు. మరి చెప్పకుండా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని ఎందుకు రానిచ్చారని వేదవతి అడుగుతుంది. రామరాజు ఆలోచలలో పడి.. సరే ఇక ముందు వాడు ఏదైనా తప్పు చేస్తే నీ సంగతి చెప్తానని రామరాజు అంటాడు. దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య నేనే హెల్ప్ చేస్తే చివరికి నన్నే వెళ్ళమంటారా అని నర్మద అంటుంది. దాంతో నీకు నాకు మాటలు లేవు అంటూ వెళ్ళిపోతుంది వేదవతి. మరుసటి రోజు ఉదయం నర్మద ఇంటి ముందు ముగ్గువేస్తుంది. అవతల వైపు సేనాపతి భార్య ముగ్గు వేస్తుంది. అప్పుడే తన దగ్గరికి ప్రేమ వచ్చి.. అమ్మ నేను ముగ్గు వేస్తానంటుంది. ప్రేమ ముగ్గు వేస్తు నర్మదతో మాట్లాడుతుంది. ఆ ధీరజ్ గాడిని ఇంట్లోకి రప్పించే ప్రయత్నం చేయకు నర్మద అని ప్రేమ అంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. వాడెలా వచ్చాడని ప్రేమ అనగానే.. నేనే తీసుకొని వచ్చానంటుంది. ఆ తర్వాత ప్రేమ ధీరజ్ లు గొడవపడుతు.. ప్రేమ ముగ్గు తప్పు వేస్తుంటే అయ్యో ముగ్గు తప్పు వేస్తున్నావంటూ నర్మద గీత ధాటి వస్తుంది. దంతో సేనాపతి కొడుకు చూసి.. గొడవకి దిగుతాడు. దాంతో ఆ ఇంట్లో వాళ్ళు‌.. ఈ ఇంట్లో వాళ్లందరు వస్తారు. భద్రవతి టైమ్ దొరికింది కదా అని రామరాజుని తిడుతుంది. దాంతో తనకి ఇదంతా తెలియదని సారీ చెప్తున్నానని సాగర్ అనగానే.. మీ నాన్న చెప్పాలని భద్రవతి అంటుంది. రామరాజు క్షమాపణ అడుగుతాడు. దాంతో భద్రవతి కుటుంబం సంతోషపడుతుంది. మరొకవైపు నర్మద బాధపడుతుంటే.. ధీరజ్ వచ్చి అసలు గొడవేంటో చెప్తాడు. అత్తయ్య ఎక్కడ అంటూ వేదవతి దగ్గరికి వెళ్తుంది నర్మద. తరువాయి భాగంలో రామరాజు ఇంట్లో పూజ జరుగుతుంటే.. ప్రసాదరావు పోలీసులని తీసుకొని వస్తాడు. నర్మదని ట్రాప్ చేసి బలవంతంగా నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడంట.. అంతా నీ వల్లే అంట అని రామరాజుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : ఇంటినుండి వెళ్లాక కార్తీక్ కి కష్టాలు.. రెంట్ కోసం ఫోన్ తాకట్టు!

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -235 లో.. సంవత్సరానికి రెస్టారెంట్ పెట్టి బెస్ట్ రెస్టారెంట్ అవార్డు అందుకుంటానని శివన్నారాయణతో కార్తీక్ ఛాలెంజ్ చేసి.. కట్టుబట్టలతో బయటకి వస్తాడు. రోడ్డుపైన కార్తీక్ తన కుటుంబంతో నడుచుకుంటూ వెళ్తాడు. అది చూసి దీప బాధపడుతుంది. ఇలా చేసి ఉండకూడదు. అంత నా వళ్లే ఆ జ్యోత్స్న అన్నంత పని చేసిందని దీప బాధపడుతుంది. ఆ తర్వాత కార్తీక్ వాళ్లు గుడికి వెళ్తారు. కడియం బాబాయ్ కి ఫోన్ చేస్తానని దీప అనగానే.. వద్దు ఇప్పుడు మన పరిస్థితి గురించి మొత్తం చెప్పాలి. అది బాగోదని కాంచన అంటుంది. అయితే మీ చెల్లికి చేయండి అని కార్తీక్ తో దీప అంటుంది. దాస్ అన్నయ్యకి చెయ్ అని కాంచన అంటుంది. దాంతో దాస్ కి కార్తీక్ ఫోన్ చేసి రమ్మంటాడు. ఆ తర్వాత దాస్, కాశీ, స్వప్నలు వస్తారు. వాళ్లకి జరిగింది మొత్తం చెప్తారు. మా ఇంటికి వెళదామని స్వప్న అనగానే.. వద్దని కార్తీక్ అంటాడు. ఏదైనా అద్దెకి ఇల్లు చూడండి అని దాస్ కి కాంచన చెప్తుంది. నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉందని దాస్ అంటాడు. ఆ తర్వాత కాంచన వాళ్ళను సుమిత్ర తీసుకొని రండీ అని రిక్వెస్ట్ చేస్తుంది. వస్తే వద్దని అనను.. అలాగని నేను వెళ్లి రమ్మనను.. ఎవరు వెళ్లొద్దని శివన్నారాయణ‌ అంటాడు. ఆ తర్వాత ఇదంతా నీ వళ్లే అని జ్యోత్స్నని సుమిత్ర తిడుతుంది. మరొకవైపు దాస్ ఒక ఇంటికి తీసుకొని వస్తాడు. ఇదే మీరు ఉండబోయే ఇల్లు అని అంటాడు. అప్పుడే ఓనర్ వస్తాడు. రెంట్ ఇరవై వేలు.. మూడు నెలల అడ్వాన్స్ అని అంటాడు. ఆ తర్వాత దాస్ వాళ్ళని పంపిస్తాడు కార్తీక్. కాంచన వాళ్ళను లోపలికి వెళ్ళమంటాడు. మూడు నెలలు అడ్వాన్స్ అంటే కష్టం. ఈ ఫోన్ మీ దగ్గర ఉంచండి.. డబ్బులు ఇచ్చి తీసుకుంటానని ఓనర్ తో కార్తీక్ అంటాడు. అది దీప చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కపటప్రేమని తెలుసుకున్న కొడుకు.. భార్య చెప్పింది వినలేదని గిల్టీ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -286 లో..... శ్రీలత కపట ప్రేమని సీతాకాంత్ కళ్లారా చూసి బాధపడతాడు. ఈ ముసలోడిని ఏం చేద్దామని సందీప్ అనగానే గదిలో ఉంచండి అని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత తనపై చూపించిన ప్రేమని గుర్తుచేసుకుంటాడు సీతాకాంత్. శ్రీలత గురించి చెప్పిన వినలేదన్న విషయం గుర్తుచేసుకొని గిల్టీగా ఫీల్ అవుతాడు సీతాకాంత్. ఆ తర్వాత సందీప్, ధనలు పెద్దాయనని గదిలో బందిస్తారు. అప్పుడే రౌడీలు వచ్చి మీ అన్న వదినలు ఎక్కడున్నారని వాళ్ళు అడుగగా.. సందీప్ చూపిస్తాడు. ఆ తర్వాత రౌడీలు సీతాకాంత్ దగ్గరికి వెళ్తారు. తనని కొడుతారు నాకు బతుకు మీద అశ లేదని రౌడీలతో సీతాకాంత్ అంటుంటే.. రౌడీలు ఇంకా కొడుతుంటారు. అప్పుడే సీతాకాంత్ ని వెతుక్కుంటూ వస్తుంది రామలక్ష్మి. రౌడీలని చూసి వాళ్ళకి ఎదురుతిరుగుతుంది. దాంతో రామలక్ష్మిని వాళ్లు నెట్టేస్తారు. అది చూసి సీతాకాంత్ రౌడీలని కొడతారు. వాళ్లు పారిపోతారు. రామలక్ష్మిని హగ్ చేసుకొని సీతాకాంత్ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు రౌడీలు పారిపోవడం సందీప్, శ్రీలత, శ్రీవల్లి లు చూసి ఈసారి కూడా ప్లాన్ ఫెయిల్ అని డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత సీతాకాంత్ తనకి తన తల్లి గురించి తెలిసిందని రామలక్ష్మికి చెప్పడు. నేనేం చేసినా నాకు సపోర్ట్ చేస్తావా అని సీతాకాంత్ అడుగుతాడు. మీరేం చేసినా మీతో నేను అని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకొని రమ్మని అంటాడు. ఆ తర్వాత పెద్దాయనను గదిలో చూసి రామలక్ష్మికి తెలియకూడదని తనని పంపించి.. మేనేజర్ కి కాల్ చేసి పెద్దాయనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత  పెద్దాయన దగ్గరికి సందీప్ వచ్చి చూసేసరికి.. అతను లేకపోవడంతో టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Nikhil lover kavyashree: నిఖిల్ తో కాకుండా వేరే అతడితో రొమాంటిక్ సాంగ్ చేసిన కావ్యశ్రీ!

  కావ్య నువ్వేంటి ఇక్కడ.. ఏ నేను ఇక్కడ ఉండకూడదా.. ఎల్లోరా శిల్పాలు ఇక్కడ ఉండకూడదు కదా అనే డైలాగ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. బిగ్ బాస్ సీజన్-8 విన్నర్ నిఖిల్ లవర్ కావ్యశ్రీ గురించి ఇప్పుడు ఓ‌ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.  తాజాగా రిలీజ్ చేసిన దావత్ ప్రోమోలో‌ సుమతో పాటు రాజీవ్ కనకాల, సమీర్, హైపర్ ఆది ఇంకా కొంతమంది టీవీ యాక్టర్స్ వచ్చారు. ఇక ఇందులో కావ్యశ్రీ కూడా వచ్చింది. కావ్య ఓ సీరియల్ హీరోతో డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసింది. "హే రంగులే హే రంగులే" అనే పాటకి ఆ హీరోతో కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇది చూసి ప్రోమో కింద నిఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిఖిల్-కావ్యలను చూసిన కళ్లు ఇలా చూడలేకపోతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఆ హీరో ఎవడు? అంటూ కొశ్చన్ చేస్తున్నారు. అయితే ఆ హీరో ఈటీవీలో ప్రసారమవుతున్న 'గువ్వ గోరింక' సీరియల్ హీరో తేజస్ గౌడ (నందు). ఈ ధారావాహికలో కావ్య కూడా నటిస్తుంది. దీంతో వీళ్లిద్దరూ కలిసి ఇలా ఓ డ్యాన్స్ చేశారన్నమాట. నిజానికి గతంలో కూడా కావ్య.. ఈటీవీలో పలు షోలు చేసింది. కానీ అందులో నిఖిల్ కూడా వెంట వచ్చేవాడు. ఎప్పుడూ వీళ్లిద్దరే కలిసి పర్ఫామ్ చేసేవారు.. ఒకవేళ ఎవరైనా కావ్యతో కలిసి డ్యాన్స్ చేస్తానన్నా కూడా నిఖిల్ ఒప్పుకునేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు కావ్య ఇలా వేరే వాళ్లతో పర్ఫామ్ చేసేసరికి నిఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.  బిగ్ బాస్ సీజన్-8 కి నిఖిల్ వెళ్ళేముందే వారికి బ్రేకప్ అయ్యింది. ‌అయితే హౌస్ లోకి వెళ్ళాక నిఖిల్ లవ్ ఫెయిల్యూర్ ముసుగులో ఉన్నాడని, తను కావాలనే అలా చేస్తాడని కావ్యశ్రీ చాలాసార్లు చెప్పింది. అయితే నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం కావ్యశ్రీని‌ తిడుతూ కామెంట్లు పెట్టేవారు. బయటకొచ్చాక నిఖిల్ చేసే పనులకి కావ్యశ్రీకి అసలు సంబంధమే లేదు. కానీ కావ్యశ్రీ-నిఖిల్ ల మధ్య ఇంకా ప్రేమ ఉందని కొందరు నమ్ముతున్నారు కానీ ఈ ప్రోమో చూసాక వారి మనస్సు మార్చుకుంటారు. అంత రొమాంటిక్ గా వేరే అతడితో కావ్యశ్రీ డ్యాన్స్ చేసింది.‌ ఇది ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అయిన బ్రహ్మముడి కావ్య పోస్ట్.. ఆంద్రప్రదేశ్ మంత్రులతో ఫోటోలు!

  బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైంది దీపిక రంగరాజు. కావ్య పాత్రలో రాజ్ అలియాస్ మానస్ కి జోడీగా నటిస్తున్న ఈ బ్యూటీ.. సీరియల్ లో తెలుగింటి ఆడపడుచులా కన్పిస్తుంది. ఇక బయట రెగ్యులర్ గా ఏదో ఒక షోలో కన్పిస్తూ తన అల్లరితో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి మరోసారి ఫేమస్ అయ్యింది. ఇక తాజాగా కావ్య అలియస్ దీపిక రంగరాజు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ పాలకొల్లులో జరిగిన ఓ కార్యక్రమానికి గెస్టుగా వెళ్లిన దీపిక.. ఆ ఈవెంట్‌కి సంబంధించిన విశేషాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులైన వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడితో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. పవర్‌ఫుల్ హోంమంత్రి అంటు ఆడపిల్లలను రక్షించుకుందాం, భ్రూణహత్యలు నిర్మూలిద్దాం.. స్త్రీ జాతిని సమున్నతం చేద్దాం- హత్యలు, అత్యాచారాలు, దాడులను అరికడదాం- భవిష్యత్తు భారాతావనిని ఆదర్శంగా తీర్చిదిద్దుదామంటూ ఓ మంచి సంకల్పంతో పాలకొల్లులో ఈ కార్యక్రమం జరిగింది. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలకొల్లులో ఈ నెల 15న జరిగిన 'సేవ్ ద గర్ల్ చైల్డ్' 2కే రన్ కార్యక్రమంలో దీపిక పాల్గొంది. ఈ సందర్భంగా దీపికని స్టేజ్‌పై సత్కరించారు మంత్రి నిమ్మల. గౌరవనీయులైన మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను ఇలాంటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆనందంగా ఉంది. మీరు నిజంగా చాలా మంచి మనిషి. ఇంత సింపుల్‌గా ఉండే రాజకీయ నాయకుడ్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అలానే పవర్‌ఫుల్ లేడీ, హోంమంత్రి అయిన వంగలపూడి అనిత మేడమ్‌కి కూడా చాలా థ్యాంక్స్. అలానే నా ఫేవరెట్ సింగర్ మధుప్రియని, టాలెంటెడ్ క్యూట్ వాగ్దేవిని కూడా అక్కడ కలిసినందుకు సంతోషంగా ఉంది. నాపైన ఇంత ప్రేమ చూపించిన పాలకొల్లు ఫ్యామిలీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ దీపిక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.  

బ్రహ్మముడి టెలికాస్ట్ టైమింగ్ మారనుందా.. ఇక టీఅర్పీ గోవిందా!

స్టార్ మా టీవీలో  ప్రసారమయ్యే సీరియల్ బ్రహ్మముడికి యమ క్రేజ్ ఉంది. కానీ దానిని మధ్యాహ్నానికి మార్చేశారు. దాని టీఆర్పీ గోవింద అయింది. ఇప్పుడేమో రాత్రి 10.30 గంటలకు సీరియల్‌ని రీ టెలికాస్ట్ చేయబోతున్నారు. అంటే మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయిన బ్రహ్మముడి సీరియల్‌ని తిరిగి రాత్రి 10.30 గంటలకు రీ టెలికాస్ట్ చేయబోతున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది. కాబట్టి మధ్యాహ్నం మిస్ అయితే రాత్రి చూడొచ్చన్నమాట. కొత్త సీరియల్స్ వస్తున్నాయని.. టాప్ రేటింగ్‌లో ఉన్న సీరియల్స్ స్టార్ మా  టైమింగ్స్‌ని మార్చేస్తోంది. ఏ కొత్త సీరియల్ వచ్చినా దాన్ని మంచి ప్రైమ్ టైంలో వదిలి ఆ టైమ్ లో ప్రసారమయ్యే సూపర్ హిట్ సీరియల్‌ని మధ్యాహ్నానికి తోసేస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ విషయంలో ఇదే స్ట్రాటజీతో బొక్క బోర్లాపడ్డ స్టార్ మా.. మళ్ళీ బ్రహ్మముడి సీరియల్ విషయంలోనే అదే చేసింది. అప్పట్లో ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ని రాత్రి 7 గంటలకు ప్రసారం అయ్యేది. ఆ టైంలో టీఆర్పీ రేటింగ్‌ని బద్దలు కొట్టేసింది గుప్పెడంత మనసు. ఆ తరువాత కొత్త సీరియల్స్ వస్తున్నాయని.. మధ్యాహ్నానికి మార్చేశారు. దాంతో గుప్పెడంత మనసు టీఅర్పీ పడిపోయింది. ఇప్పుడు ‘బ్రహ్మముడి’ సీరియల్‌ని అలాగే చేస్తున్నారు. ప్రారంభంలో రాత్రి 7.30 గంటలకు ప్రసారం అయ్యేది బ్రహ్మముడి. స్టార్ మా ఛానల్‌లో ఆ టైమ్‌లో టెలికాస్ట్ అయ్యే సీరియల్ అంటే సూపర్ హిట్ కిందే లెక్క. కార్తీకదీపం అదే టైమ్ లో ప్రసారమయ్యే జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్‌గా అనేక రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఆ సీరియల్ అయిపోయిన తరువాత అదే టైమ్ లో రాత్రి 7. 30 గంటలకు బ్రహ్మముడి సీరియల్‌ని ప్రసారం చేశారు. ఈ సీరియల్ కూడా అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ని నమోదు చేసింది. అంతకముంది స్టార్ మా ఛానల్‌‌లో ప్రసారమయ్యే సీరియల్స్ రేటింగ్‌లో బ్రహ్మముడికే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చేది. ఇప్పుడు గుండెనిండా గుడిగంటలు సీరియల్ టాప్ వన్ స్థానంలో నిలిచింది. ప్రైమ్ టైంలో 13-14 తక్కువ కాకుండా టీఆర్పీ రేటింగ్ వచ్చే బ్రహ్మముడి మధ్యాహ్నానికి మార్చేసరికి సగానికి సగం పడిపోయింది. ఇప్పుడు మళ్లీ రాత్రి 10.30 గంటలకు రీ టెలికాస్ట్ చేసేకంటే.. యధాస్థానంలో అంటే రాత్రి 7.30 గంటలకు ప్రసారం చేస్తేనే బ్రహ్మముడి మళ్ళీ ఆ టీఆర్పీని సొంతం చేసుకోవచ్చు.

గీత దాటి వచ్చింది.. మీ నాన్న సారీ చెప్పాలి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -35 లో.. నర్మద దగ్గరికి ప్రేమ వచ్చి.. ధీరజ్ అటువైపు ఉన్నాడు.. వెళ్ళండి అని చెప్తుంది. దాంతో ధీరజ్ దగ్గరికి వెళ్తుంది నర్మద. ప్రేమ నువ్వు ఇక్కడ ఉన్న విషయం చెప్పిందని నార్మద అంటుంది. ఎందుకు వచ్చావ్ వదిన అంటూ ధీరజ్ అడుగుతాడు. మీ అమ్మ ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చెయ్యడం లేదు.. పాపం తను ఏడుస్తూ తిండి కూడా తింటలేదు.. పెద్దవాళ్ళేం చేసిన మన కోసమే కదా ఇంటికి రా అని నర్మద అంటుంది. నేను మీ పెళ్లి చేస్తున్నప్పుడు.. ఏదో చిన్న భయం ఉండేది కానీ నేను చేసింది కరెక్ట్ పని అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. మీరు మా కుటుంబం గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నారని ధీరజ్ అంటాడు. మీరు వెళ్ళండి నేను వస్తానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత నర్మద ఇంటికి వెళ్లి ధీరజ్ గురించి చూస్తుంది. మరొకవైపు వేదవతి ఏడుస్తుంటే.. బయటున్న ధీరజ్ లోపలకి వస్తాడు.. వేదవతి దగ్గరికి పంపిస్తుంది నర్మద. ఆ తర్వాత ధీరజ్ ని చూసి వేదవతి ఎమోషనల్ అవుతుంది. అమ్మ ఆకలి అని ధీరజ్ అనగానే.. వేదవతి తినిపిస్తుంది. వదిన వచ్చి నువ్వు భాదపడుతున్నావని చెప్పి తీసుకొని వచ్చిందని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఎవరో వస్తున్నారంటూ భయపడి దాక్కుంటారు కానీ పెద్దోడు వాళ్లు వస్తారు. ఆ తర్వాత రామరాజు రాగానే ధీరజ్ దక్కుంటాడు. ధీరజ్ నీ అద్దంలో నుండి రామరాజు చూసి.. మళ్ళీ వచ్చావా అంటూ కోప్పడతాడు. దాంతో నేను చెప్పినట్టు చెయ్యండి అని నర్మద అనగానే వేదవతి చేస్తుంది. మీరు వాడిని ఇంట్లో నుండి పంపిస్తే నేను కూడా వెళ్లిపోతానని వేదవతి అనగానే నేనే వెళ్ళిపోతానని రామరాజు వెళ్తుంటాడు. అందరు కలిసి రామరాజుని ఆపుతారు. తరువాయి భాగంలో నర్మద గీత ధాటి వచ్చిందని భద్రవతి కుటుంబం గొడవపడుతుంది. సాగర్ సారీ చెప్తుంటే.. మీ నాన్న చెప్పాలని భద్రవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దీప, శౌర్యలని తీసుకొని బయటకొచ్చేసిన కార్తీక్.. తను పగతీర్చుకుంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -234 లో..... కార్తీక్ కట్టుబట్టలతో వెళ్పోతానని శివన్నారాయణతో అంటాడు. నువ్వేమంటావ్ అమ్మ అనగానే.. నీ మాటే నా మాట అని కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప, అనసూయలని వాళ్లకు సంబంధించినవి తెచ్చుకోమంటాడు. ఆ తర్వాత దశరత్ వస్తాడు. ఏం జరుగుతుందని అనగానే.. బావ వాళ్లు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాడని జ్యోత్స్న అనగానే వద్దని దశరథ్ అంటాడు. దీప, అనసూయలు బ్యాగ్ తీసుకొని వస్తారు. కార్తీక్ తన ఒంటి మీద ఉన్నా బంగారం పర్సు అంత అక్కడ పెడతాడు. కాంచన కూడా తన మీద ఉన్న బంగారం అక్కడ పెడుతుంటే.. ఇవన్నీ నీవి అని దశరథ్ అంటాడు. కాదని నాన్న అంటున్నాడని కాంచన ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత శౌర్య దగ్గరికి వెళ్లిన కార్తీక్ నిద్రపోతుంటే లేపి బ్యాగ్, టాబ్లెట్ తీసుకుంటాడు. ఆ తర్వాత తన జ్ఞాపకం అయిన లాకెట్ ని బీరువా నుండి తీసుకుంటాడు. ఇక మీ వంటూ మా దగ్గర ఏమీ లేవని దీప, శౌర్యలని కార్తీక్ తీసుకొని బయటకు వెళ్తు.. గుడ్ బై మై డియర్ మరదలా అని జ్యోత్స్నతో అంటాడు. ఆ తర్వాత ఇంటివైపు చూసి కార్తీక్ ఎమోషనల్ అవుతూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అసలైన వారసురాలు కట్టుబట్టలతో బయటకు వెళ్తుంది. బావ నా ఇగో మీద దెబ్బ కొట్టావ్.. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలను.. దీప నీ లేకుండా చేసి నిన్ను నా సొంతం చేసుకుంటానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ, జ్యోత్స్న, దశరత్ లు ఇంటికి వెళ్ళగానే.. అక్కడ ఏం గొడవ జరగలేదు కదా అని సుమిత్ర అడుగుతుంది. ఇంట్లో నుండి వెళ్లిపోయారని దశరథ్ అనగానే.. మీరు ఎలా చూస్తూ ఉన్నారని సుమిత్ర అనగానే.. తాతయ్య మీద కోపంతో వెళ్ళిపోయాడని జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సవతి తల్లి ఆస్తుల కోసమే ఇదంతా చేస్తుందని కనిపెట్టేసిన సీతాకాంత్.. పాపం పెద్దాయన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -285 లో....శ్రీలత సందీప్ లు కలిసి మాట్లాడుకుంటారు. రామలక్ష్మి, సీతాకాంత్ లని చంపేయడానికి రౌడీకి కాల్ చేసా ఇంకా రావడం లేదని ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే ధన వచ్చి.. ఎవరిని చంపాలి అంటున్నారని అనగానే సందీప్ కవర్ చేస్తాడు. నేను చెప్పినట్టు విను అప్పుడే ఆస్తులు మనకి వస్తాయి. అటు అక్క.. ఇటు మేము అంటూ మధ్యలో ఉండకని శ్రీలత అనగానే నేను మీ వైపే అని ధన అంటాడు.  ఆ తర్వాత ధన ఒంటరిగా కూర్చొని రామలక్ష్మి తన కోసం చేసిన పనులు గుర్తుచేసుకొని.. మా అక్కకి ఇలా అన్యాయం చెయ్యడం కరెక్ట్ కాదు అనుకుంటాడు కానీ మళ్ళీ తను తిట్టిన సంఘటన గుర్తుచేసుకొని నన్ను తమ్ముడు అని కూడా చూడకుండా తిట్టిందని అలా చెయ్యడంలో తప్పు లేదని అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడ ఇద్దరు ముసలివాళ్లు ప్రేమగా మాట్లాడుకోవడం చూసి సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. వాళ్ళు ఎలా ప్రేమగా ఉన్నారు చూడమంటూ వాళ్ళ గురించి రామలక్ష్మితో సీతాకాంత్ మాట్లాడతాడు. ఆ తర్వాత రౌడీకి సందీప్ ఫోన్ చేసి ఇంకడప్పుడు వస్తావ్.. సీతాకాంత్, రామలక్ష్మిని త్వరగా చంపెయ్ అని సందీప్ మాట్లాడుతుంటే.. పెద్దాయన వింటాడు. ఆ తర్వాత ఫోన్ కట్ చేసీ వెనక్కి చూడగానే పెద్దాయన కోప్పడ్తాడు. ఏదో కవర్ చేస్తుంటాడు కానీ పెద్దాయన నమ్మడు. అప్పుడే ధన వస్తాడు. మీ అక్కాబావలని చంపాలి అనుకుంటున్నావని పెద్దాయన అనగానే.. తప్పేముంది ఆస్తులు కావాలంటే తప్పదని ధన అనగానే.. పెద్దాయన షాక్ అవుతాడు. ఆ తర్వాత పెద్దాయన తల పైన కొడుతాడు సందీప్. అది సీతాకాంత్ దూరం నుండి చూస్తాడు. అప్పుడే శ్రీలత వచ్చి ఎవరికి తెలియకుండా చేయమంటే ఇలా అందరికి తెలిసేలా చేస్తున్నావంటూ సందీప్ ని కొడుతుంది. అంటే నువ్వు వాళ్ళతో కలిసిపోయావా అని పెద్దాయన అనగానే.. మరి ఏం చెయ్యమంటారు.. నా కొడుకు నేను సంతోషంగా ఉండాలంటే ఆస్తులు కావాలి. అలా అయితే సీతా, రామలక్ష్మిలు ఉండకూడదని శ్రీలత అంటుంది. వీడి సంగతి తర్వాత చూద్దాం.. గదిలో ఉంచండి. మన పని అయ్యాక వద్దామని శ్రీలత అంటుంది. ఆ మాటలని విన్న సీతాకాంత్ మనసు ముక్కలు అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బ్యాంక్ వాళ్ళని ఒప్పించిన కావ్య.. ఇంటి కోడలి భాద్యతల్లో కొత్తగా ఆర్డర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -599 లో.... రాజ్ గదిలోకి వచ్చి నీతో మాట్లాడాలని కావ్య చేతులు పట్టుకుంటాడు. కావ్య సిగ్గుపడుతూ.. చెప్పండి అని అంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. నేను ప్రాబ్లమ్ లో ఉన్నాను. దుగ్గిరాల ఇంటి సమస్య అని సీతారామయ్య షూరిటి విషయం రాజ్ చెప్తాడు. కావ్య షాక్ అవుతుంది. మీరేం టెన్షన్ పడకండి నాకు చెప్పి మంచి పని చేశారు. మీ భారం దించుకున్నారు.. ఇద్దరం కలిసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం.. ఆఫీస్ కి రేపు నేను కూడా వస్తానని కావ్య అనగానే కావ్యని హగ్ చేసుకుంటాడు రాజ్. మరుసటిరోజు కావ్య, రాజ్ ఇద్దరు ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతారు. కావ్య ఆస్తుల పేపర్స్ తీసుకొని వస్తుంటే.. ఎందుకు ఆ ఆస్తులు నావి... దానికి నాకు ఏం సంబంధం లేదని అంటావా అని రాజ్ అంటాడు. నేనెందుకు అలా అంటాను.. నన్ను అర్థం చేసుకుంది అంతేనా.. తాతయ్య మాటను ఎలా తప్పుతాను.. ఈ పేపర్స్ తో అవసరం ఉందని కావ్య అనగానే సారీ అని రాజ్ అంటడు. రాజ్, కావ్య ఇద్దరు కలిసి వస్తుంటే సుభాష్, అపర్ణ లు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆఫీస్ కి వెళ్తున్నామంటూ బయల్దేరతారు. స్వప్నకి కావ్య తాళాలు ఇచ్చి అవసరం ఉంటేనే ఎవరికైనా డబ్బులు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని రుద్రాణి అనగానే.. ఆఫీస్ కి అని స్వప్న అంటుంది. ఆ తాళాలేంటని రుద్రాణి అడుగగా.. కావ్య బాధ్యతలు నాకు ఇచ్చిందని స్వప్న అంటుంది.ఆ తర్వాత కనకానికి అపర్ణ ఫోన్ చేసి.. నా కొడుకు, కోడలు కలిసిపోయారని చెప్తుంది. దాంతో కనకం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు నిజంగా కలిసి పోయారా? అవసరానికి కలిసిపోయార నిజంగా కలిసిపోతే బంధం బాగుంటుంది. అవసరం కోసమైతే అది అప్పటి వరకే అని కృష్ణమూర్తి అంటాడు. అ తర్వాత రాజ్, కావ్య లు ఆఫీస్ కి వెళ్తారు. బ్యాంక్ వాళ్లు వస్తారు. మీ డబ్బులు మేము కచ్చితంగా ఇస్తాం కానీ అంత డబ్బు ఒకేసారి అంటే కష్టం మాకు టైమ్ కావాలి ఇన్స్టాల్ మెంట్ లో ఇస్తామని కావ్య అనగానే.. మొదట ఒప్పుకోలేదు కానీ ఆ తర్వాత వాళ్ళని కావ్య కన్విన్స్ చేస్తుంది. బ్యాంక్ వాళ్లు ఒప్పుకోవడంతో రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో రుద్రాణికి స్వప్న డబ్బు ఇస్తుంటే.. కావ్య వచ్చి అక్క అవసరం ఉంటేనే ఇవ్వమని అంటుంది. ఇప్పటి నుండి ఇంట్లో వాళ్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారో నాకు రిసీప్ట్ లు కూడా కావాలి. ఇది నా ఆర్డర్ అని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సీనియర్ యాక్టర్ కౌశిక్ : తెలుగోడికి శాపంగా తెలుగు టీవీ ఇండస్ట్రీ

బిగ్ బాస్ సీజన్-8 లో కన్నడ కంటెస్టెంట్ నిఖిల్ గెలవడంతో తెలుగు-కన్నడ ఆర్టిస్ట్ ల మధ్య వివాదం రేగింది. దాని తర్వాత టీవీ ఆర్టిస్ట్ లు ఒక్కొక్కరిగా తెలుగు ఆర్టిస్ట్ లకు జరుగుతున్న అన్యాయాలని బయటపెటుడుతున్నారు. సీనియర్ యాక్టర్ కౌశిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారి భాదలని చెప్పుకొచ్చాడు. యాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ.. ఒక తెలుగు సీరియల్ ప్రారంభం అవుతుంటే అందులో 10 మంది ఆర్టిస్ట్‌లు కావాల్సి వస్తే.. అందులో ఏడుగుర్ని తెలుగు వాళ్లని తీసుకోండి. ముగ్గురు పరాయి భాష వాళ్లని తీసుకోండి. హీరోని తెచ్చుకుంటా? హీరోయిన్‌ని తెచ్చుకుంటారా? అన్నది మీ ఇష్టం. అంతా పరాయి భాష వాళ్లనే పెట్టడం వల్ల వాళ్లకి భాష రాదు. భాషలో భావం తెలియదు. భాష, భావం తెలియనప్పుడు ఎక్స్‌ప్రెషన్ ఎలా వస్తుంది? లొకేషన్‌లో పరాయి భాష వాళ్లని తీసుకొచ్చి పెట్టడం వల్ల.. వాళ్లు చాలా టేక్‌లు తీసుకుంటారు. అది వాళ్ల తప్పు కూడా కాదు. వాళ్లకి భాష రాదు.. మళ్లీ వాళ్లకి వచ్చిన భాషలో సీన్‌ని వివరించాలి. అర్థం చెప్పాలి.. ప్రామిటింగ్‌లో లిప్ సింక్ కరెక్ట్‌గా మ్యాచ్ కావాలి. ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్. దీని వల్ల నిర్మాతకి నష్టం జరుగుతుంది. రోజుకి ఐదారు సీన్లు కావాల్సింది.. రెండు మూడు సీన్లే అవుతుంది. అయినా సరే వాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. నేను ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. నాకు 45 ఏళ్లు. ఇప్పుడు నేను కొత్తగా ఉద్యోగం ఏమీ చేయలేను కదా. నా బతుకు ఇదే. నాలాంటి వాళ్లు తెలుగు ఇండస్ట్రీ ఎంతో మంది ఉన్నారు. తెలుగు సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో 900 మంది వరకూ మెంబర్స్ ఉన్నారు. వాళ్లలో 150 మందికి మాత్రమే పని ఉంది. మిగిలిన వాళ్లంతా ఖాళీగా ఉన్నారు. ఈ మాట నేను చాలా బాధగా చెప్తున్నా. అసోషియేషన్ అంటే వేషాలు ఇప్పించే సంస్థ కాదు.. కరెక్టే కానీ.. అసోషియేషన్ అంటే వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగని ఖాళీగా ఉన్న వాళ్లు తెలుగు వాళ్లకి అవకాశం ఇవ్వమని ముందుకొచ్చి నిలబడే పరిస్థితి లేదు. ఎవడికి కావాలంటే వాడు ముందుకెళ్లండి అంటున్నారు. అలాగైతే తెలుగు వాళ్లకి అవకాశాలు ఎలా వస్తాయి. నా వరకు నాకు వేషాలు వస్తున్నాయి. బాగానే సంపాదించుకున్నా.. హ్యాపీగానే ఉన్నా. నాకొచ్చిన నష్టం ఏం లేదు. నాకెందుకు ఇంత తాపత్రయం ఎందుకంటే.. నేను ఇలా ఉన్నానంటే టీవీ సీరియల్స్ వల్లే. నాకు ఇంత ఇచ్చిన టీవీ ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి చేయాలి.. తెలుగు ఆర్టిస్ట్‌లకు న్యాయం జరగాలనే నా పోరాటం. ఈరోజు తెలుగు వాళ్లకి అవకాశాలు రావడం లేదనేది నిజమంటూ టీవీ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ల గోడుని వ్యక్తపరిచాడు సీనియర్ టీవీ ఆర్టిస్ట్ కౌశిక్.