గ్రాండ్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ పెళ్లి...సందడి చేసిన మిగతా కంటెస్టెంట్స్

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8తో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది సోనియా ఆకుల.  ఇక ఇప్పుడు తన లవర్ యష్ ని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.  యష్ తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సోనియా.  ఈ పెళ్ళికి మొత్తం  బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ వెళ్లారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో జెస్సీ, అమర్ దీప్, తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిర్రాక్ సీత వచ్చారు. డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన కొన్ని మూవీస్ లో సోనియా  నటించింది.   ఆ పాపులారిటీతో సోనియా  బిగ్‌బాస్ లోకి అడుగుపెట్టింది. ఇక హౌస్ లో  స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిరూపించుకుంది. తర్వాత  నిఖిల్, పృథ్వీతో ఫ్రెండ్ షిప్ కారణంగా ఆమె మీద చాలా నెగటివిటీ వచ్చేసింది.  ఫైనల్ గా ఫోర్త్ వీక్ లోనే ఎలిమినేట్ ఐపోయింది. హౌస్ నుంచి వచ్చాక సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యింది సోనియా.  హౌస్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో  ఇంటర్వ్యూలలో మాట్లాడింది. ఇక తన ఫ్రెండ్స్ నిఖిల్, పృథ్వీతో తనకున్న బాండింగ్ పై సైతం క్లారిటీ ఇచ్చింది.  

జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం హైపర్ ఆది ?

  జబర్దస్త్ షోకి యాంకర్ గా అనసూయ వెళ్లిపోయాకా చాలా మంది మారారు కానీ అప్పటికి ఇప్పటికీ ఒకే ఒక్క యాంకర్ రష్మీ మాత్రమే అలాగే ఆ షోస్ ని ఏలుతోంది. ఐతే ఈ గ్యాప్ లో సౌమ్య రావు కూడా జబర్దస్త్ యాంకర్ గా కన్నడ నుంచి వచ్చింది. కానీ చాలా కొద్దీ టైంలోనే వెళ్ళిపోయింది. ఐతే ఆమె షో నుంచి వెళ్లిపోవడానికి కారణం హైపర్ ఆది అనే టాక్ బాగా వైరల్ అయ్యింది. మరి ఇప్పుడు హైపర్ ఆది గురించి సౌమ్య తన మాటల్లో చెప్పుకొచ్చింది. "జబర్దస్త్ కి హోస్ట్ గా వచ్చినప్పుడు నాకు అసలు ఆ షో అంటే ఏంటో కూడా తెలీదు. హోస్ట్ అనసూయ అంటే కూడా ఎవరో తెలీదు. తర్వాత వాళ్ల వీడియోస్, షోస్ చూసి తెలుసుకున్నా. సుధీర్, రష్మీ జోడి నేనెప్పుడూ చూడలేదు. వాళ్ళ గురించి నాకేం తెలీదు. ఆఫ్ స్క్రీన్ లో సుధీర్ ఎం మాట్లాడరు.. వచ్చినప్పుడు హాయ్ అని వెళ్ళేటప్పుడు బై అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. సుధీర్ కి ఆటిట్యూడ్ అనేది ఏమీ లేదు. ఐతే నేను జబర్దస్త్ యాంకర్ గా చేసేటప్పుడు నా తెలుగును చూసి చాలా మంది నవ్వుకున్నారు. నేను నా భాషను కరెక్ట్ చేసుకుంటూ వచ్చా. ఐతే ఒక టైంలో హైపర్ ఆది వల్ల నేను బయటకు వచ్చేసాను అనే పుకారు వచ్చింది. కానీ హైపర్ ఆదికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నన్ను సపోర్ట్ చేశారు... వెళ్లిపోయారు. వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. వాళ్లకు మంచి ఆర్టిస్ట్ దొరికితే సపోర్ట్ చేస్తారు కానీ ఏమీ చేయరు. నా విషయంలో నా తెలుగు యాంకరింగ్ చూసి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి రండి బాగా మాట్లాడుతున్నారు ..మంచి టైమింగ్ ఉంది అని నన్ను దగ్గరుండి తీసుకెళ్లి షో డైరెక్టర్ కి చెప్పి నన్ను షోకి తీసుకొచ్చి సపోర్ట్ చేసారు. నేను జబర్దస్త్ షోలో యాంకరింగ్ నుంచి బయటకు రావడానికి ఆది కారణం కాదు.. అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆదితో చేసిన కొన్ని ఎపిసోడ్స్ బాగా హైలైట్ అయ్యాయి " అంటూ సౌమ్య చెప్పుకొచ్చింది.

Brahmamudi : భార్యని వాటేసుకొని నిజం చెప్పేసిన భర్త.. సూపర్ ట్విస్ట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -598 లో.... కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేస్తుంది. నేను ఎలాగైనా ఎస్సై అయి తిరిగి వస్తాను. అందుకే ఎంత కష్టమైనా ఉంటున్నానని అప్పు అంటుంది. నువ్వు నన్ను చూడడానికి రావొచ్చు కదా అని అప్పు అనగానే.. త్వరలో వస్తానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా అని అప్పు అనుకుంటుంది. అయిన నాకు చెప్పకుండా ఉండడులే అనుకుంటుంది అప్పు. ఆ తర్వాత కావ్యని ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యాలని అనుకుంటాడు రాజ్. ఆ తర్వాత కిచెన్ లోకి వచ్చి టీ పెట్టుకుంటాడు రాజ్. అప్పుడే అపర్ణ వచ్చి.. ఏంటి ఈ మార్పు అన్నట్లుగా మాట్లాడుతుంది. ఏ మాయ చేసావ్ కావ్య.. రాజ్ మారిపోతున్నాడని కావ్యతో సరదాగా మాట్లాడుతుంది అపర్ణ. ఆ తర్వాత కావ్య ఫ్యాన్ క్లీన్ చేస్తుంటే రాజ్ వస్తాడు. కావ్య పడిపోతుంటే రాజ్ పట్టుకుంటాడు. నేను హెల్ప్ చేస్తానని తను ఫ్యాన్ క్లీన్ చేస్తుంటే కావ్య మీద పడిపోతాడు రాజ్. ఇద్దరు కాసేపు రొమాంటిక్ గా చూసుకుంటారు. అప్పుడే అటుగా వెళ్తున్న రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు వాళ్ళని చూసి వెళ్ళిపోతారు. రాజ్ తర్వాత వస్తానంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంటే కావ్య సిగ్గుపడుతుంది. ఆ తర్వాత కొంచెం కూడా సిగ్గు లేదు కనీసం డోర్ కూడా వేసుకోలేదని ధాన్యలక్ష్మి అంటుంది. వాళ్ళు కలిసిపోతే మన మాటకి వాల్యూ ఉండదు. ఇక ఇలా ఉంటే చాలదంటు ధాన్యలక్ష్మిని రెచ్చగోడుతుంది రుద్రాణి. మరొకవైపు సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి.. రాజ్ లో మార్పు వస్తుంది.. నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది.  మనకి కావల్సింది కూడా అదే కదా అని సుభాష్ అంటాడు. వాళ్ళ మాటలు కావ్య విని హ్యాపీగా ఫీల్ అవుతు.. తన మనసులో నా పైన ప్రేమ మొదలైందన్న మాట.. చూడాలి ఎలా ప్రపోజ్ చేస్తారోనని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ కి ఆఫీస్ నుండి మేనేజర్ కాల్ చేసి.. రేపు బ్యాంక్ వాళ్ళు ఆఫీస్ కి వస్తున్నారని చెప్తాడు. దాంతో కావ్య కి విషయం చెప్పాలని రాజ్ అనుకొని గదిలోకి వెళ్లి డోర్ వేస్తాడు. నేనొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానని రాజ్ అనగానే.. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో నేను సమస్యలో ఉన్నానంటూ సీతారామయ్య షూరిటీ గురించి జరిగింది మొత్తం కావ్యకి చెప్తాడు రాజ్. దాంతో కావ్య షాక్ అవుతుంది. రాజ్ బాధపడుతూ కావ్యని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సూపర్ ట్విస్ట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -34 లో.... ధీరజ్ తన తండ్రికి తెలియకుండా తన అన్న పెళ్లి చేసినందుకు తన తండ్రి ఎంత బాధపడుతున్నాడోనని మిల్ లో పని చేసే సింహాద్రితో చేప్తాడు. మళ్ళీ మీరందరు కలిసి ఉండే రోజు వస్తుందని అతను అంటాడు. అప్పుడే రామరాజు రావడం చూసి ధీరజ్ దాక్కుంటాడు. మరొకవైపు ధీరజ్ గురించి వేదవతి బాధపడుతుంటే.. నర్మద చూడలేకపోతుంది. అక్కడే ఉన్న వేదవతి తమ్ముడు తిరుపతిని పిలిచి ధీరజ్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి బాబాయ్ అని అడుగుతుంది. నాకు తెలియదు కానీ ఎప్పుడు వాడిని కనిపెట్టుకొని తిరిగే మా ప్రేమకి తెలుసని తిరుపతి చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ నీతో మాట్లాడాలని నర్మద అనగానే.. ఇక్కడ కాదూ బస్టాండ్ దగ్గరికి రా అని నర్మదకి ప్రేమ చెప్తుంది. మరొకవైపు రామరాజు దగ్గరికి బియ్యం బస్తాల లెక్కలు చెప్పి డబ్బులు ఇవ్వడానికి ఒకతను వస్తాడు. నడిపోడు ఆ లెక్కలు రాస్తాడని అనుకోని బుక్ లో ఉన్నవి రామరాజు చెప్తుంటే తప్పుడు లెక్కలు చెప్తున్నావని అతను రామరాజుని తిడతాడు. అప్పుడే సాగర్ వచ్చి లెక్కలు చెప్తాడు. అవి మా నాన్న రాయలేదు వేరొకరివి చెప్పారు. ఆ మాత్రానికే తిడతారా అని సాగర్ అతనిపై కోప్పడుతాడు. మరోవైపు నర్మదని కలుస్తుంది ప్రేమ‌. నాకు ధీరజ్ ఎక్కడున్నాడో చెప్పవా అని అనగానే.. చూపిస్తానంటూ తన వెంట తీసుకొని వెళ్తుంది నర్మద. ధీరజ్ గురించి గొప్పగా చెప్తుంటే ప్రేమ వినలేకపోతుంది. రైస్ మిల్ దగ్గరికి తీసుకొని వెళ్లి ఇక్కడే ఉంటాడు ధీరజ్ అని ప్రేమ చెప్తుంది. నాకూ ఎలా తెలుస్తుందని నర్మద అనగానే.. నేను వెళ్లి చూసి వస్తానంటు ప్రేమ వెళ్తుంది. అక్కడ రామరాజు లాగా మిమిక్రీ చేసి ధీరజ్ నీ ప్రేమ ఆడుకుంటుంది. తరువాయి భాగంలో ధీరజ్ ఇంటికి వస్తాడు. మళ్ళీ వచ్చావ్ ఏంటి రా అని గెంటేయ్యబోతుంటే.. ఆగండి అంటూ వేదవతి ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కట్టుబట్టలతో బయటకొచ్చేసిన కార్తీక్, దీప.. శివన్నారాయణ‌కి ఛాలెంజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -233 లో....ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో టిఫిన్ అమ్ముకునే దీప.. ఇప్పుడు ఏకంగా రెస్టారెంట్ ఓనర్ అవుతుంది. ఇది గొప్ప విషయం కదా అని శివన్నారాయణ అనగానే.. మీకు ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండండి అని కార్తీక్ అంటాడు. నా భార్య పేరు మీద రెస్టారెంట్ కడుతాను.. పెట్టుబడి ఏమైనా నిన్ను అడిగనా అని కార్తీక్ అనగానే.. పెట్టుబడి పెట్టడానికి దీప  ఏం తాకట్టు పెట్టి నీకు ఇచ్చిందని శివన్నారాయణ అనగానే నా ఇల్లు బ్యాంక్ లో తాకట్టు పెట్టి పెట్టుబడి తీసుకుంటున్నానని కార్తీక్ అంటాటు. నీకు ఇల్లు ఎక్కడిది.. ఇవి నా ఆస్తులని శివన్నారాయణ‌ అంటాడు. ఈ ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువు నాది.. నువ్వు నా మీద గెలవాలనుకుంటే, నా అనేది లేకుండా ఉండి గెలువు.. అప్పుడే నువ్వు మొగాడివి అని ఒప్పుకుంటా అని శివన్నారాయణ అంటాడు. దాంతో ఆస్తుల పేపర్లని కార్తీక్ చింపేసి.. నీ ఆస్తి నాకు వద్దని అంటాడు. చింపినంత ఈజీ కాదు.. వద్దనుకోవడం.. ఇంట్లో ఉన్న ప్రతిదీ నాది.. నువ్వు వేసుకున్న బంగారంతో సహా అని శివన్నారాయణ అనగానే.. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో నా భార్య పేరుపై రెస్టారెంట్ పెట్టి నెక్స్ట్ ఇయర్ బెస్ట్ రెస్టారెంట్ అవార్డు అందుకుంటానని  ఛాలెంజ్ చేస్తాడు కార్తీక్. మరొకవైపు శివన్నారాయణ‌ వాళ్ళని ఏం అంటున్నాడో అని సుమిత్ర అనగానే.. దశరథ్  టెన్షన్ గా కార్తీక్ ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ‌ మాటలకి.. మీ కూతురు ఎంత బాధపడుతుందో ఆలోచించారా అని దీప అంటుంది. ఆ తర్వాత కాంచన తన తండ్రి తన కొడుకుని తనని చిన్నచూపు చూస్తున్నందుకు ఏడుస్తుంది. మమ్మల్ని క్షమించాలంటే  ఏం చెయ్యాలని కాంచన అనగానే.. అందరి ముందు క్షమాపణ అడిగి.. నేను ఇచ్చిన జాబ్ చెయ్యాలని శివన్నారాయణ‌ అంటాడు. నేను ఒప్పుకోనని కార్తీక్ అనగానే నేను ఒప్పుకుంటున్నాను కార్తీక్ బాబు తరుపున నేను చెప్తానని దీప అనగానే.. నీ భర్త అసమర్ధతుడు అంటున్నారు.. దానికి నువ్వు ఒప్పుకుంటావా అని కార్తీక్ అనగా.. లేదని దీప అంటుంది. అదీ నా భార్య.. ఇప్పుడు చెప్తున్నా నేను కట్టుబట్టలతో ఇంట్లో నుండి వెళ్లిపోతా ఏం అంటావ్ అమ్మ అని కాంచనని కార్తీక్ అడుగుతాడు. నీ మాటే నా మాట అని కాంచన అంటుంది. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Eto Vellipoyindhi Manasu : ఆస్తుల కోసం కొడుకుని లేపేయ్యాలని చూస్తున్న సవతి తల్లి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -284 లో... శ్రీలత దగ్గరికి రామలక్ష్మి వచ్చి మీరు నిజంగానే మారిపోయారా అని అడుగుతుంది. రామలక్ష్మి అడిగిన వాటిల్లో సందీప్ ఇష్టమని శ్రీలత చెప్పగానే.. అంటే మీకు సీతా సర్ కన్నా సందీప్ ఇష్టం అన్నమాట అని రామలక్ష్మి అనగానే.. సీతా ఇష్టమే కానీ సందీప్ ని నవమాసాలు మోసి కన్నాను కదా అని శ్రీలత కవర్ చేస్తుంది. మీరు మారిపోతే మంచిదే కానీ మారకుండా సీతా సర్ నీ ఏమైనా చెయ్యాలనుకుంటే మాత్రం మళ్ళీ నా సంగతి తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత నందిని వెళ్ళిపోయినందుకు సందీప్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. అప్పుడే శ్రీలత కోపంగా వచ్చి నేను ఎంత నటించిన కూడా ఎలా రామలక్ష్మికి దొరికిపోతున్నానని అంటుంది. మీరు నటిస్తున్న విషయం తెలిసిందా అని శ్రీవల్లి అనగానే.. లేదు డౌట్ వచ్చింది కానీ తనకి డౌట్ వస్తే తెలుసుకునే వరకు వదిలి పెట్టదు. ఇక ఆలస్యం చెయ్యొద్దు సీతా, రామలక్ష్మిలని లేపెయ్యాలి. రేపు బయటకు వెళ్తున్నాం కదా మనం ఇంటికి రావాలి.. వాళ్ళు రాకూడదని శ్రీలత అంటుంది. మరుసటి రోజు శ్రీలత పుట్టిన రోజు కాబట్టి సీతాకాంత్ సర్ ప్రైజ్ అంటూ ఒక చారిటబుల్ ట్రస్ట్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఆ ట్రస్ట్ కి శ్రీలత పేరు పెడతాడు. దాంతో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారా అత్తయ్య ఆయనకు మీరంటే ఏంత ఇష్టమో.. ఎప్పుడు తనని బాధపెట్టాలనుకోకండి అని రామలక్ష్మి అనగానే.. అలా ఎందుకు అనుకుంటానని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఇలా అన్ని డబ్బులు ఖర్చు చేస్తే మనకి మిగిలేది ఏంటని శ్రీలతతో సందీప్ అంటాడు. ఇక వీళ్ళని చంపెయ్యాలని శ్రీలత అనగానే అప్పుడే ధన వచ్చి ఎవరిని చంపెయ్యాలంటున్నారని అంటాడు. దాంతో సందీప్ కవర్ చేస్తాడు. ఆస్తులు కావాలంటే నేను చెప్పినట్టు విను అని శ్రీలత అనగానే.. సరేనని ధన అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అఖిల్ కామెంట్స్ కి నిఖిల్ కౌంటర్...ప్రతీ ఒక్కరికీ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు

  పొలిటికల్ కామెంట్స్ మాత్రమే కాదు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చేసే కామెంట్స్ బయట వాళ్ళ ఫాన్స్ కానీ ఇతరత్రా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే కామెంట్స్ కూడా  బాగా డిబేటబుల్ అవుతాయి.. అలాగే కాంట్రవర్సి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ 8 కి సంబంధించి గత బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్  చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. "గౌతమ్ రియల్ విన్నర్ కానీ గౌతమ్ ని బిగ్ బాస్ విన్నర్ ని చేయాలనుకోవడం లేదు..నిఖిల్ ని విన్నర్ ని చేయాలనుకుంటోంది..ఏదో జరుగుతోంది" అంటూ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అఖిల్ సార్ధక్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అలాగే ఓటిటికి వెళ్ళొచ్చాడు. దీనిపై నిఖిల్ ఏమన్నాడంటే "రెండు సార్లు గెలిచిన వాళ్ళు మా టీవీ వాళ్ళు కాదేమో..అఖిల్ కి ఈ విషయం తెలీదేమో..ఇండస్ట్రీకి వచ్చింది నేను  ఏది జరిగినా రిసీవ్ చేసుకోవడానికి...ఏదో ఒకటి అన్న ప్రతీ ఒక్కరికీ ఆన్సర్ చేయను. స్టార్ మా వాడిని అని బిగ్ బాస్ గెలిపించారు అని అఖిల్ అనుకుంటే ఒకే ...నిఖిల్ జెన్యూన్ గా ఆడాడు అని కొందరు అనుకుంటారు. దానికి కూడా ఒక ఎవరు ఎలా అనుకున్నా దానికి కూడా ఓకే...నాకొచ్చే ఇబ్బందేం లేదు" అన్నట్టుగా చెప్పాడు బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్.  

టీఆర్పీలో నెంబర్ వన్ గా నిలిచిన గుండెనిండా గుడిగంటలు!

  తెలుగు టీవీ సీరియల్స్ అన్నింటిలో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి ప్రతీ వారం అత్యధిక టీఆర్పీ వస్తుంది. అయితే గత నాలుగు నెలల క్రితం వరకు బ్రహ్మముడి సీరియల్ నెంబర్ వన్ లో నిలవగా.. ప్రస్తుతం ఆ రికార్డుని గుండెనిండా గుడిగంటలు సీరియల్ బ్రేక్ చేసింది. గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో బాలు, మీనాల పాత్రలు తెలుగువారికి తెగ నచ్చేస్తాయి. మొదట్లో తాగుతూ భాద్యత లేకుండా కన్పించిన బాలు, మీనాని పెళ్ళి చేసుకొని కామన్ మ్యాన్ గా మారిపోయాడు. ఇక బాలు వాళ్ళ అమ్మ చిన్నతనంలోనే తనని జైలులో పెట్టించడంతో.. అమ్మ ప్రేమకి దూరమయ్యాడు. ఇక వాళ్ళ అమ్మ చేసే అప్పులకి ఇళ్ళంతా బాదల్లోకి వెళ్ళడంతో కుటుంబ భారాన్ని బాలు తీసుకుంటాడు. బాలుని అర్థం చేసుకునే భార్యగా మీనా సపోర్ట్ ఇస్తుంది. ఇదే ప్రస్తుతం ఈ సీరియల్ ని నెంబర్ స్థానంలో నిల్చోబెట్టింది. అయితే స్టార్ మా సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు, నువ్వుంటే నా జతగా లాంటి కొత్త సీరియల్స్ రావడంతో సాయంత్రం టైమ్ స్లాట్ నుండి బ్రహ్మముడి సీరియల్ ని తీసి మధ్యాహ్నం టైమ్ స్లాట్ లో వేయడంతో బ్రహ్మముడి టీఆర్పీ పడిపోయింది. గుండెనిండా గుడిగంటలు సీరియల్ 9.27 తో అగ్రస్థానంలో ఉండగా, పడమటి సంధ్యారాగం 9.11 తో రెండో స్థానంలో ఉంది. కార్తీకదీపం-2 సీరియల్ 8.90 రేటింగ్ తో మూడో స్థానంలో ఉండగా, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కి 8.47, మేఘసందేశం సీరియల్ కి 8.38 రేటింగ్ వచ్చేసింది. ఇక ఈ వారం టాప్-5 లో మూడు స్టార్ మా సీరియల్స్ చోటు దక్కించుకున్నాయి.  

బతుకుదెరువులో మాత్రమే కమెడియన్స్ మి...మా జీవితంలో మేమే హీరోలం

  టాలీవుడ్ లో మంచి కామెడీ టైమింగ్ తో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రచ్చ రవి. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాల్లో నటించాడు. తర్వాత కామెడీ షో ‘జబర్దస్త్’ ప్రోగ్రాంతో రచ్చ రవిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఐతే రచ్చా రవి మూవీస్ లో కూడా మంచి పేరు తెచ్చుకుని మంచి వాటిని ఎంచుకుంటూ వెళ్తున్నాడు. అంతే కాదు లైఫ్ మోటివేషన్ సబ్జెక్టు కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చెప్తుంటాడు. రచ్చ రవి రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసాడు. అందులో కమెడియన్స్  లైఫ్ గురించి చెప్పాడు. "మీ ముందు మేము కమెడియన్స్ కావొచ్చు కానీ మా లైఫ్ లో మేమే హీరోస్ మీ..నాలుగు గింజల కోసం బ్రెడ్ అండ్ బటర్ కోసం మేము కమెడియన్స్ గా చేస్తాం కానీ మా లైఫ్ కి మేమే కథానాయకులం..మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని గుర్తుపట్టి మీ స్కిట్స్ బాగున్నాయి, బాగా చేశారు అని చెప్తూ ఉంటారు. బాధను వదిలేసి రెండు సెకన్లు మాతో మాట్లాడతారు. ప్రపంచంలో ఎవరైనా అదృష్టంగా భావించేది హాస్య నటుడిగా పుట్టడం. హాస్య నటుడిగా ఫుడ్ సంపాదించి ఫామిలీకి అందించడం. నాకు దేవుడు హాస్య నటుడిగా పుట్టించి అద్భుతమైన అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే శత్రువులు లేనిది, పోటీ మాత్రమే ఉన్నది, అద్భుతంగా జీవించేది ఒక్క కమెడియన్ జీవితమే. అందుకే మేము అద్భుతంగా ఫీలవుతాం. " అని చెప్పాడు రవి. ఇక నెటిజన్స్ ఐతే "అన్న మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు కలమ్మ తల్లి ముద్దుబిడ్డ...చాలా బాగా చెప్పారు రవి బ్రో..సూపర్ అన్న" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

విజయ సేతుపతి సలహా : బేబక్క తినడమే కాదు.. మంచిగా వర్కౌట్ చేయండి 

    సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, యుట్యూబర్, సింగర్ బెజవాడ బేబక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె వాడే పడికట్టు పదాలతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. "బై పెండ్స్...గట్టిగా పాపాలు చేసేయండి. నాలుగు కాలాలు పాటు హాయిగా  ఉంటారు" లాంటి రీల్స్ తో ఆమె బాగా హైలైట్ అయ్యింది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్లి వచ్చింది. ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ ఐపోయింది. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనౌన్స్ చేసే రోజున విజయ్ సేతుపతిని తెలుగు బిగ్ బాస్ కి తీసుకొచ్చారు హోస్ట్ నాగార్జున. అలాగే ఎలిమినేట్ ఐన, ఎక్స్ - కంటెస్టెంట్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టారు. అందులో ముందుగా ముక్కు అవినాష్ చెయ్యెత్తి టాప్ 5 కంటెస్టెంట్ ని సర్ అని విజయ్ సేతుపతికి చెప్పాడు. తర్వాత బెజవాడ బేబక్క "సర్ ఫస్ట్ వీక్ అవుట్ ఐపోయాను సర్.. మీకు మల్లె నాకు కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం సర్. మీ ఇంటర్వ్యూస్ లో మీరు చెప్తారు కదా నాకు ఫుడ్ అంటే ఇష్టం..గుడ్ ఫుడ్ హ్యాపీనెస్ ని ఇస్తుంది అని. నేను ఎక్కువ ఫుడ్ తినాలని ప్రజలంతా కోరుకుంటూ ఉంటారు సర్." అని చెప్పింది బేబక్క. ఇక విజయ్ సేతుపతి రియాక్ట్ అయ్యారు. "అలాగే మీరు వర్కౌట్ చేయాలి కూడా. ఎంత తింటారో అంత వర్కౌట్ చేయండి మొత్తం సరిపోతుంది" అని ఫన్నీ కౌంటర్ వేశారు. ఇక బేబక్క ఈ కన్వర్జేషన్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుని ఇలా రాసుకుంది. "బిగ్ బాస్ ఫైనల్ డే రోజున విజయ్ సేతుపతి గారితో మంచి సందేశాత్మకంగా సంభాషణ జరిగింది. మేము మంచి ఆహారం పట్ల నాకున్న ప్రేమ గురించి మాట్లాడుకున్నాము.. మంచి ఫుడ్ తింటూనే ఫిట్‌గా బాడీని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఆయన చెప్పిన మాటలు నిజంగానే చాల ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. " పోస్ట్ పెట్టింది.

బిగ్ బాస్ 8 గేమ్ చెంజర్ ...నీ పొట్టెక్కడ భయ్యా 

  జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ దాదాపు జబర్దస్త్ లో పదేళ్లుగా కామెడీ స్కిట్స్ చేస్తూ ఆడియన్స్ ని నవ్విస్తూ వస్తున్నాడు. అలాంటి అవినాష్ కమెడియన్ గా మాత్రమే కాదు అటు బిగ్ బాస్ కి వెళ్లి కూడా ఎంటర్టైన్ కూడా చేసాడు. బుల్లితెర మీద అవినాష్ హోస్ట్ శ్రీముఖి ఇద్దరూ జిగిరీ దోస్తులు. ఐతే అవినాష్ ముందుగా బిగ్‌బాస్ సీజ‌న్ 4లో పార్టిసిపేట్ చేసి త‌న‌దైన రీతిలో న‌వ్వించి ఆక‌ట్టుకున్నాడు. ఇక హౌస్ నుంచి వచ్చాక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఇతరత్రా షోస్ లో కనిపిస్తూ వస్తున్నాడు. అలాగే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా వీడియోస్ చేస్తున్నాడు. అలాంటి అవినాష్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 8 లోకి అవకాశం వచ్చింది. దాంతో తన సత్తా నిరూపించుకోవడానికి వెళ్ళాడు. గేమ్ కూడా బాగా ఆడాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో రానంత గుర్తింపు ఈ సీజన్ లో వచ్చింది. టాప్ 5 లో నిలబడ్డాడు.   ఐతే ఏ సీజన్ లో ఐనా కానీ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ అంతా మంచి వెయిట్ గైన్ తో బాగా దిట్టంగా వెళ్తారు ఇక హౌస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు సన్నగా మల్లెతీగల్లా వెయిట్ లాస్ అవుతూ వస్తూ ఉంటారు. ఈ సీజన్ లో  ఆ వెయిట్ లాస్ అనేది కంటెస్టెంట్స్ లో బాగా కనిపించింది. నిఖిల్, ప్రేరణ, యాష్మి, అవినాష్ వీళ్లంతా బాగా వెయిట్ లాస్ అయ్యారు. ఇక అవినాష్ లో ఆ చేంజ్ బాగా కనిపిస్తోంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ పెట్టాడు అవినాష్. హౌస్ లోకి వెళ్లే ముందు వరకు భారీ పొట్టతో కనిపించిన అవినాష్ కి ఇప్పుడు పొట్ట బాగా తగ్గిపోయింది. ఇక నిఖిల్ ముఖంలోనూ  చేంజ్ వచ్చింది. సన్నగా పీక్కుపోయినట్టుగా ఐపోయింది. ఇక ప్రేరణ ఫేస్ లో ఆ చేంజ్ బాగా కనిపించింది. ఐతే అవినాష్ పిక్స్ చూసిన నెటిజన్స్ ఐతే వీరలెవెల్ లో కామెంట్స్ చేస్తున్నారు. "వ్వాహ్ అన్నా ..నో పొట్టా...టిప్పుటాపుగా ఉన్న కమెడియన్..ఇలాగే బాడీని జిమ్ కి వెళ్లి మెయింటైన్ చెయ్యి..మళ్ళీ కామెడీ వైపు రావొద్దు...యాంకర్ గా కానీ హీరోగా కానీ చెయ్యి..బిగ్ బాస్ కి కింగ్ అన్నా నువ్వు. ఈ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయండి..ఈయనేంటి రోజురోజుకూ మోడల్ గా మారిపోతున్నాడు..అతను గేమ్ ఛేంజర్ ... ఎంటర్టైన్మెంట్ కి హీరో" అంటూ చెప్తున్నారు.

రైతు బిడ్డ కాదు..మోడరన్ రాయల్ బిడ్డ

బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ క్యాటిగరీలో వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఎప్పుడూ సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటాడు. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ తో వైరల్ అవుతూ ఉంటాడు. రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ కి వచ్చి వేషాలేస్తున్నాడని కొందరు, రైతు పని చేసినంత మాత్రాన స్టైల్ గా ఉండకూడదా అంటూ ఇంకొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటూ పల్లవి ప్రశాంత్ ని తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక అతను కూడా తగ్గేదేలే అన్నట్టు అల్లు అర్జున్ డైలాగ్ ని రెట్టించి చెప్తూ ఉంటాడు. " మల్లొచ్చినా" అంటే అంటూనే ఉంటాడు. ఐతే బిగ్ బాస్ టైటిల్‌ గెలిస్తే వచ్చిన ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానని బిగ్ బాస్ స్టేజి మీద ప్రకటించాడు కూడా.   ఐతే ఆ  మాటను పల్లవి ప్రశాంత్ నిలబెట్టుకోలేదని కొందరు...ప్రైజ్ మనీ వస్తే ఇవ్వాలా అంటూ ఇంకొందరు డిబేట్లు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఇన్ని  విమర్శలు మధ్య పల్లవి ప్రశాంత్ ఒక పేద కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. ఐతే ఈ సాయంలో భోలే షావళి, నటుడు శివాజితో కలిసి మరీ ఈ సాయాన్ని అందించాడు. ఇక ఇప్పుడు పల్లవి ప్రశాంతి తన డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేసి ఒక హీరో లెక్క రాయల్ ఫామిలీలోని వ్యక్తి లెక్క మారిపోయాడు. ఇప్పుడు ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. దాంతో నెటిజన్స్ ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. "మోడరన్ రైతు బిడ్డ, రైతు  బిడ్డ అన్న మాట మర్చిపోయినట్టున్నాడు, రైతు బిడ్డ ఇలా ఐపోయాడు ఏమిటి ? నీయవ్వారం చూస్తుంటే ఇక పొలం పనులు చేయవనుకుంటాగా ఇగ...రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడు బాబో..." అంటూ ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు.  

సుడిగాలికి పవిత్ర వార్నింగ్..నీ వీడియోస్ అన్నీ బయటపెడతా...

  సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న ఫామిలీ స్టార్స్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి రంగుల రాట్నం వెర్సెస్ కలిసుందాం రా సీరియల్ టీమ్స్ వచ్చాయి. ఇక సుడిగాలి సుధీర్ వీళ్ళను బాగా పటాయించాడు. ఇక రెండు సీరియల్స్ లో అమ్మాయిలను తెగ పొగిడేసాడు. "వర్షం పడుతుందా ఏంటండీ...సడెన్ గా సెట్ లో ఇంద్రధనుస్సును చూస్తే...." అని ఒక సీరియల్ హీరోయిన్.."మీ సీరియల్ లక్ష ఎపిసోడ్స్ ఐనా అవ్వాలనుకుంటానండి ఎప్పుడూ మిమ్మల్ని లక్ష సార్లు చూడొచ్చు కదా" అంటూ తెగ బిల్డప్ ఇచ్చేసాడు. ఇంతలో భానుశ్రీ వచ్చి "నిన్న లక్ష సార్ల కంటే ఎక్కువగానే పొగిడాం..ఐనా ఎప్పుడైనా నన్ను పొగిడావా" అనేసరికి " 30 ఎపిసోడ్స్ చూసేసరికి చిరాకొచ్చేసింది" అంటూ ముఖాన్ని తెగ చిరాకుగా పెట్టి మరీ చెప్పాడు. దాంతో భాను కొంచెం హర్ట్ ఐనట్టు కనిపించింది. ఇక తర్వాత సీన్ లోకి పవిత్ర "రగులుతోంది మొగలి పొద" అంటూ నల్ల రంగు చీరలో పాములా వచ్చింది. ఐనా "నువ్వు పాము కదా" అని సుధీర్ పవిత్రని అడిగేసరికి " పాము గురించి నీకేం తెలుసు కాటేయడం తప్ప" అని కౌంటర్ వేసింది. తర్వాత మరో పెద్ద ఝలక్ ఇచ్చింది. గొడుగేసుకుని మందాకినిలా వచ్చి "ఏయ్...నాతో చేయవా..." అనేసరికి సుధీర్ తెగ నవ్వలేక నవ్వుకుని చిరాగ్గా "ఏంటి నీ ప్రాబ్లమ్ " అని సీరియస్ గా అడిగాడు.. "వేద్దాం దా డాన్స్" అని కైపుగా, మత్తుగా అడిగింది."నేను వేయనమ్మా డాన్స్ " అని చెప్పేసాడు సుధీర్. "వస్తావా..నీ వీడియో క్లిప్స్ అన్ని ప్లే చేయమంటావా" అంటూ బెదిరించేసింది పవిత్ర. దానికి సుధీర్ దగ్గర ఆన్సర్ లేదు. పవిత్ర అన్న వీడియో క్లిప్స్ అన్న మాటకు షాకైపోయాడు.

Illu illalu pillalu : మిమిక్రీ చేసి ఆటపట్టించిన ప్రేమ.. కొత్త కోడలి బంగారు గాజులు తీసుకుందెవరు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -33 లో..... నర్మద ప్రొద్దునే లేచి తులసి పూజ చేస్తుంది. ఆ తర్వాత రెడీ అవుతుంటే తన గాజులు కన్పించవు.. అదే విషయం సాగర్ ని పిలిచి నా బంగారు గాజులు కన్పించడం లేదని అంటుండగా.. అది రామరాజు విని వేదవతిని పిలుస్తాడు. ఎన్నడూ లేని విధంగా వస్తువులు పోవడమేంటి ఆ పిల్ల బంగారు గాజులు పోయాయట అని రామరాజు అనగానే.. ఇంతవరకు ఈ ఇంట్లో ఒక వస్తువు కూడా పోలేదని వేదవతి అంటుంది. అప్పుడే రామరాజు పెద్ద కూతురు నిద్ర లేచి వస్తుంది. తన చేతికి గాజులు చూసి అవి నావే అని నర్మద అంటుంది. ఆ గాజులు ఎవరివి అని వేదవతి కామాక్షిని అడుగగా.. తనవే ఆడపడుచు కట్నం ఇవ్వలేదు కదా తేరగా వచ్చేసిందని కామాక్షి అనగానే.. తనవి తనకు ఇచ్చేయ్.. నీకు అలాంటివి తీసుకొని వస్తానని రామరాజు అనగానే కామాక్షి ఇస్తుంది. ఆ తర్వాత వేదవతి పూజ చేసి హారతి ఇస్తుంది. నర్మద సాగర్ లకి ఇవ్వదు. దాంతో సాగర్ కి నర్మద హారతి ఇస్తుంది. రామరాజు మిల్ కి వెళ్తాడు. నన్ను తీసుకొని వెళ్లడం లేదని సాగర్ ఫీల్ అవుతాడు. అయినా వద్దని చెప్పలేదు కదా.. వెళ్ళమంటూ సాగర్ ని పంపిస్తుంది నర్మద. ఆ తర్వాత  ధీరజ్ కి వేదవతి ఫోన్ చేస్తుంది. అయినా ధీరజ్ లిఫ్ట్ చెయ్యడు. దాంతో వేదవతి బాధపడుతుంది. వేదవతి బాధపడడం నర్మద చూస్తుంది. మరొక వైపు ధీరజ్ గాడు బయట తిరుగుతున్నడని భద్రవతి మేనల్లుడు వచ్చి తనకి చెప్పగానే సంతోషపడుతాడు. ఎందుకిలా చేస్తున్నారు వేదవతి నీ చెల్లెలు అని వాళ్ళ అమ్మ అంటుంది. తరువాయి భాగంలో ధీరజ్ వెనకాల నుండి ప్రేమ వచ్చి రామారాజులాగా మిమిక్రీ చేస్తుంది. దాంతో నన్ను క్షమించండి నాన్న అంటూ ధీరజ్ భయపడతాడు. ధీరజ్ ని ప్రేమ ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : దీప పేరుతో కొత్త హోటల్ ప్రారంభించనున్న కార్తీక్.. శివన్నారాయణ‌ ఒప్పుకుంటాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -232 లో.... దాస్ కాశీ స్వప్నలు కలిసి కార్తీక్ ఇంటికి వస్తారు. మేము ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకున్నాం కానీ అది ఇప్పుడు మీకు అవసరం. ఒక రెస్టారెంట్ పెట్టండి అని కార్తీక్ తో స్వప్న అనగానే.. మంచి ఆలోచన అని దాస్ అంటాడు. ఆ ఆలోచన సరైనదని అందరు అంటారు కానీ దానికి చాలా పెట్టుబడి కావాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఆస్తిలో నా వాటా అడుగుతానని కాంచన అనగానే వద్దమ్మ అది నీ ఆస్తి అని కార్తీక్ అనగానే.. నీది నాది అంటావేంటి అని కాంచన బాధపడుతుంది. అయినా వాళ్ళది వద్దని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఈ ఇంటి మీద లోన్ తీసుకుందామని కాంచన అనగానే.. కార్తీక్ సరే అంటాడు. కార్తీక్ రెస్టారెంట్ పేరు దీప రెస్టారెంట్ అని పెడుదామని అంటాడు. అందరు దానికి సరే అంటారు. ఆ తర్వాత దాస్ బయటకు వెళ్తుంటే అనసూయ వచ్చి.. దీప అమ్మ నాన్న ఎవరో తెలిసిందా అని అడుగుతుంది. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు చెప్తానని దాస్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి వస్తాడు దాస్. కార్తీక్ తన భార్య పేరున రెస్టారెంట్ పెడుతున్నాడు. వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు.. వాళ్ళ జోలికి వెళ్ళకని జ్యోత్స్నకి దాస్ వార్నింగ్ ఇవ్వగా.. వెళ్ళానని జ్యోత్స్న అంటుంది.  ఆ తర్వాత జ్యోత్స్న వెళ్లి శివన్నారాయణకి విషయం చెప్తుంది. వాళ్ళ ఇంటికి లోన్ తీసుకొని రెస్టారెంట్ పెడుతున్నారంట అని జ్యోత్స్న అనగానే.. ఎవడి ఆస్తులు అనుకుంటున్నారంటూ శివన్నారాయణ‌ కోపంగా జ్యోత్స్నని తీసుకొని కార్తీక్ ఇంటికి వెళ్తాడు. మరొకవైపు బ్యాంక్ మేనేజర్ కార్తీక్ ఇంటికి వచ్చి.. లోన్ కి అన్ని సంతకాలు పెట్టించుకుంటాడు. అప్పుడే శివన్నారాయణ, జ్యోత్స్న వస్తారు. ఆ తర్వాత కార్తీక్ నా భార్య దీప పేరు మీద రెస్టారెంట్ పెడుతున్నా అని అనగానే జ్యోత్స్న నాకు ఒక బుక్ కావాలి. దీప జీవిత చరిత్ర.. ఎక్కడో సైకిల్ పైన టిఫిన్ అమ్ముకునే వ్యక్తి.. ఇప్పుడు ఏకంగా స్టార్ హోటల్ కి యాజమాని అని శివన్నారాయణ‌ వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి డ్రామాని కనిపెట్టేసిన కోడలు.. ట్విస్ట్ అదుర్స్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -283 లో..... నందిని వెళ్లిపోతు.. నేను ప్రేమించాను కానీ సీతా నన్ను ప్రేమించలేదు.. ప్రేమించడు కూడా ఎందుకంటే సీతాకి నువ్వు చాలా ఇష్టం.. ప్రేమిచడం కంటే ప్రేమించబడడం చాలా అదృష్టమని రామలక్ష్మితో నందిని అంటుంది. మీ అత్తయ్య వల్ల మీరు త్వరలో విడిపోతారు. ఇదంతా మీ అత్తయ్య ప్లాన్ అంటూ శ్రీలత నిజస్వరూపం రామలక్ష్మి ముందు బయట పెడుతుంది నందిని. ఆ తర్వాత రామలక్ష్మి ఆలోచనలో పడుతుంది. రామలక్ష్మి వెళ్తుంటే సందీప్ పని చేస్తున్నట్లు నటిస్తాడు. అది రామలక్ష్మి చూసి సందీప్ గురించి నందిని చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది. అత్తయ్య ఇంత మోసం చేస్తుందా మారినట్లు నటించి నన్ను తన మాయలో పడెయ్యాలని చూసిందా దీన్ని ఎలాగైనా తిప్పి కొట్టాలని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి మాటలు గుర్తుచేసుకుంటూ సీతాకాంత్ బాధపడుతుంటే.. అప్పుడే అక్కడికి రామలక్ష్మి వస్తుంది. నేనే నందిని వెళ్లామన్నా ఎందుకంటే మన మధ్య దూరం భరించలేనని సీతాకాంత్ అనగానే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న సారీ అని వచ్చి హగ్ చేసుకుంటుంది. అయిన నందిని నాకు తెలుసని ఎవరు చెప్పారనగానే మీరు చూసే చూపులో అర్థమైందని రామలక్ష్మి అంటుంది. అయితే నీపైన నా కళ్లలో ప్రేమ కన్పిస్తుందా అని సీతాకాంత్ సరదాగా మాట్లాడతాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. పెద్దాయన ఫోన్ చేసి డీల్ ఒకే అయిందని సీతాకాంత్ కి ఫోన్ చేసి చెప్తాడు. ఆ విషయం సీతాకాంత్ ఇంట్లో అందరికి చెప్తాడు. ఇక ఆ కంపెనీని నేను చూసుకుంటానని ధన అంటాడు. ఆ తర్వాత అందరు సరదాగా మాట్లాడుకుంటర్ కానీ రామలక్ష్మి శ్రీలత వంక డౌట్ గా చూస్తుంది. కాసేపటికి శ్రీలత, శ్రీవల్లి లు మాట్లాడుకుంటారు. శ్రీవల్లి వెళ్లిపోయాక అప్పుడే రామలక్ష్మి వస్తుంది. మీరు నిజంగా మారిపోయారా అని అడుగుతుంది. మారిపోయాను నువ్వు నమ్మాలంటే ఏం చెయ్యాలని శ్రీలత అనగానే.. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని రామలక్ష్మి అంటుంది. మీకు సిరి ఇష్టమా.. సందీప్ ఇష్టమా అని రామలక్ష్మి అడుగగా సందీప్ అంటుంది శ్రీలత. ధన ఇష్టమా సందీప్ ఇష్టమా అని అడుగగా సందీప్ అంటుంది. మరి సందీప్ ఇష్టమా సీతా సర్ ఇష్టమా అని అడుగగా ఆలోచించకుండా సందీప్ అంటుంది. దాంతో రామలక్ష్మి షాక్ అవుతుంది. శ్రీలత కూడా అయ్యో ఇలా చెప్పానేంటని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : భార్య చేతులు పట్టుకున్న భర్త.. ఎందరికో స్పూర్తిగా నిలుస్తుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -597 లో..... దుగ్గిరాల ఇంటికి బ్యాంకు ఆఫీసర్స్ వచ్చినట్లు ఆస్తులు జాప్తు చేస్తామనగానే ధాన్యలక్ష్మి, రుద్రాణి లు కేసు వేస్తామని అనడంతో ఇందిరాదేవి కిందపడిపోయినట్లు రాజ్ కల కంటాడు. దాంతో ఒక్కసారిగా నిద్ర లేచి అలా జరగకూడదు లోన్ తీసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలని రాజ్ తనకి తెలిసిన బ్యాంక్ ఎంప్లాయికి ఫోన్ చెయ్యగా.. ఇస్తాం, కానీ ఆస్తులు ఎవరి పేరున ఉన్నాయో వాళ్ళని తీసుకొని రండీ అనగానే రాజ్ సరే అంటాడు. ఇప్పుడు కావ్యని బ్రతిమిలాడాలని రాజ్ అనుకుంటాడు. అప్పుడే తన అంతరాత్మ వచ్చి.. ఇన్ని రోజులు కావ్య పైన కోప్పడావు ఇప్పుడడలా అడుగుతావంటూ అనగానే.. ఎప్పుడు ఇలా కరెక్ట్ టైమ్ కి వస్తావని రాజ్ కోప్పడతాడు. మరొక వైపు సీతారామయ్య దగ్గరికి డాక్టర్ వస్తాడు. ఎప్పుడు మా తాతయ్య బాగవతాడని కళ్యాణ్ అనగానే.. ఎప్పుడు కోమాలో నుండి బయటకు వస్తాడో చెప్పలేమని డాక్టర్ అంటాడు. ఆ తర్వాత సీతారామయ్య గురించి కళ్యాణ్ దేవుడికి మొక్కుకుంటాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే కూరలో ఉప్పు తక్కువైందంటూ కావ్య పైన రుద్రాణి కోప్పడుతుంది. అపుడే రాజ్ వచ్చి.‌. ఎన్నడు లేని విధంగా కావ్య ఆకలి అవుతుంది మంచి వాసన వస్తుందంటూ పొగుడుతాడు. భోజనం తిన్నాక అయ్యో ఈ రోజే చప్పగా ఉండాలా అని మనసులో అనుకుంటాడు రాజ్. బయటకు బాగున్నాయి వంటలు అని రాజ్ చెప్పగానే.. ఆస్తులన్నీ కావ్య పేరు వున్నాయ్ కదా అందుకే రాజ్ వంటలు బాలేకపోయిన బాగున్నాయంటూ  చెప్తున్నాడని రుద్రాణి అంటుంది. దాంతో రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక మీరే తినండి అంటూ కావ్య కోప్పడుతుంది. మరొకవైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతుంది. నిన్ను అవమానించిన వాళ్లు.. నిన్ను గొప్పగా చెప్పుకోవడానికి ఏంత కష్టమైనా ఇష్టంగా చేస్తున్నానంటూ అప్పు అంటుంది. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ హెల్ప్ చేస్తుంటాడు. ఎన్నడూ లేనిది రాజ్ నీపై ప్రేమ చూపిస్తున్నాడని కావ్యతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత నీకు ఒక విషయం చెప్పాలని కావ్య చేతులు పట్టుకుంటాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : కోడలికి భాద్యతలు చెప్పిన అత్త.. ఆయనెందుకు టెన్షన్ లో ఉన్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -596 లో.... అపర్ణ దగ్గరికి కావ్య వస్తుంది.  ఈ బాధ్యతలు నాకు వద్దని అంటుంది. అది బరువు అనుకోకు బాధ్యతలా ఫీల్ అవ్వు.. ఎవరు అడిగిన వాళ్ళ అవసరం అడుగు.. అవసరం అయితేనే ఇవ్వు.. అప్పుడే నీ నైపుణ్యం తెలుస్తుందని కావ్యకి అపర్ణ చెప్తుంది. మీరు అందుకే ఈ బాధ్యతలు అప్పజెప్పారా అని కావ్య అనగానే.. నీకు అలవాటు అవుతుందని ఇచ్చానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఈ ఇంట్లో ఎవరు వచ్చి డబ్బులు అడిగినా ఇస్తారన్నమాట అయితే నేను కూడా డబ్బులు సంపాదించాలని రాహుల్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి సీతారామయ్య గారు నాకు డబ్బులు ఇస్తా అన్నారని అడుగమని రాహుల్ మాట్లాడుతుంటే.. అప్పుడే స్వప్న వచ్చి రాహుల్ నీ తిడుతుంది. రుద్రాణికి కూడా రాహుల్ భాగోతం చెప్పగానే.. తను కూడ స్వప్న వెళ్ళిపోయాక చివాట్లు పెడుతుంది. మరొకవైపు రాజ్ తన పోలీస్ ఫ్రెండ్ కాల్ చేసి.. ఇంటి బయటున్నాను అంటాడు. రాజ్ బయటకు వెళ్లి ఆ నందగోపాల్ గురించి మాట్లాడుతుంటే అప్పుడే కావ్య కాఫీ తీసుకొని వస్తుంది. నీకు బుద్ది ఉందా మాట్లాడుకుంటుంటే సడెన్ గా వస్తావంటూ కావ్యపై రాజ్ చిరాకుపడుతుంటే అపర్ణ చూసి రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ ఆఫీస్ లో కలుస్తానంటూ తన ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వేరొకరి ముందు భార్యని అవమానించడం ఎప్పుడు నేర్చుకున్నావని అపర్ణ కోప్పడగానే.. కావ్యకి సారీ చెప్తాడు రాజ్. అసలు ఎందుకు ఆయన చిరాకుగా టెన్షన్ గా ఉన్నారు కనుక్కోవాలని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత దుగ్గిరాల ఇంటికి బ్యాంక్ నుండి ఇద్దరు ఆఫీసర్స్ వస్తారు. తన ఫ్రెండ్ కి సీతారామయ్య గారు వంద కోట్లకి షూరిటి పెట్టారు. రాజ్ గారికి ఈ విషయం చెప్తే రెస్పాండ్ అవ్వలేదు. ఈ ఆస్తులు జప్తు చేస్తామనగానే.. రుద్రాణి, ధాన్యలక్ష్మి లు టెన్షన్ పడుతు.. నేను ఎప్పటి నుండి చెప్తున్నా.. ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికీ కాకుండాపోయంటూ సీతారామయ్యని తిడతారు. తరువాయి భాగంలో కావ్యకి హెల్ప్ చేస్తానంటూ రాజ్ వస్తాడు. అయితే ఆ ఫ్యాన్ క్లీన్ చెయ్యండి అని కావ్య అనగానే.. రాజ్ క్లీన్ చేస్తుంటాడు. దాంతో స్లిప్ అయి కిందే ఉన్న కావ్య మీద పడిపోతాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : ఆమెని అమ్మేయడానికి చూసిన కళ్యాణ్.. సేవ్ చేసిన ధీరజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -32 లో..... నర్మదకి ఆకలి అవుతుంది.. సాగర్ ని పిలిస్తే తను పట్టించుకోకుండా తన బాధలో తను ఉంటాడు. నర్మద వెళ్లి భోజనం చేస్తుంటే.. అప్పుడే వేదవతి వస్తుంది. తనని చూసి తినకుండా నర్మదా ఆగిపోతుంది. వద్దని అనేంత రాక్షసిని కాదు.. ఒక తల్లిని.. ఈ ఇల్లు ఎప్పుడు నవ్వుతు సరదాగా ఉండేది. ఇప్పుడు ఎక్కడివారు అక్కడే ఉన్నారు.. ఇదంతా మీ పెళ్లి వల్ల అని వేదవతి అనగానే.. నర్మద బాధపడుతుంది. ఆ తర్వాత బాధపడుతున్న ధీరజ్ దగ్గరికి ప్రేమ బిర్యానీ తీసుకొని వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. నీ బిర్యానీ వద్దు.. ఏం వద్దంటూ ధీరజ్ కోపంగా విసిరేస్తాడు. ఆ కళ్యాణ్ గాడితో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి.. వాడు పెద్ద వెస్ట్ ఫెల్లో అని ధీరజ్ అనగానే.. కళ్యాణ్ ని ఒక్క మాట అనకంటూ ప్రేమ అంటుంది. ఆ తర్వాత ప్రేమని కళ్యాణ్ బైక్ మీద సర్ ప్రైజ్ అంటూ తీసుకొని వెళ్తాడు. కళ్యాణ్ వేరొకరికి ప్రేమని అమ్మడానికి రెడీ అవుతాడు. అతని దగ్గరికి తీసుకొని వెళ్తుంటే ప్రేమ వాళ్ళ అన్నయ్య ఎదురుపడతాడు. ఎవరతను అనగానే ఫ్రెండ్ అన్నయ్య.. ఇంటి దగ్గర దింపడానికి వస్తున్నాడని కవర్ చేస్తుంది. ప్రేమ వాళ్ళ అన్నయ్య బైక్ పైన వెళ్తుంటే.. ఛ మిస్ అయిందని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ ధీరజ్ గాడు నాకు ఫోన్ చేసి మీ చెల్లి ఎవరితోనో వెళ్తుందన్నాడని వాళ్ళ అన్నయ్య చెప్పగానే.. ఇది వాడి పనా అని ప్రేమ అనుకుంటుంది. ఆ తర్వాత ఇల్లు ఎలా ఉండేది.. నీ పెళ్లి వల్ల ఎలా అయింది నడిపోడా అంటూ సాగర్ తో వాళ్ళ మామ అంటాడు. మరుసటి రోజు ఉదయం రామరాజు ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతుందా అంటూ భద్రవతి ఫ్యామిలీ చేస్తుంటుంది. సేనాపతి భార్య మాత్రం రామరాజు కొడుకు, కోడలిని బయటకు గెంటేసినట్లు ఉహించుకుంటుంది. కానీ నర్మదా బయటకి వచ్చి తులసి పూజ చేస్తుంది. అది చూసి భద్రవతి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. నర్మద ప్రేమకి హాయ్ చెప్తుంది. తరువాయి భాగంలో ధీరజ్ కి ఫోన్ చేస్తుంది వేదవతి. కానీ లిఫ్ట్ చెయ్యడు. వేదవతి బాధపడడం నర్మద చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.