కార్తీక దీపం ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. లుంగీలో టిఫిన్ సెంటర్ దగ్గర కార్తీక్ బాబు!
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే.. అన్నట్టుగా మన కార్తీకదీపం-2 సీరియల్ లో కథ ముందుకు సాగుతుంది. ట్రెండీ లుక్ నుండి టవల్, లుంగీ గెటప్ లోకి కార్తీక్ వచ్చేశాడు. మొన్నటి ఎపిసోడ్ లో ఓ ధనవంతురాలి దగ్గర పనికి చేరిన కార్తీక్ బాబు కొత్త అవతారమెత్తాడు.
స్టార్ మా టీవీ సీరియళ్ళలో కార్తీకదీపం-2 కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. వారిలో ఎక్కువగా కార్తీక్ బాబుకి వంటలక్క అభిమానులే. వీరిద్దరి హ్యాపీగా ఉంటే చూడాలనే అభిమానులు ఎప్పుడు చూస్తుంటారు. అయితే దర్శకుడు మొదటి సీజన్ కంటే కార్తీకదీపం-2 లోనే దీప,కార్తీక్ లకి ఎక్కువ కష్టాలు చూపిస్తున్నాడు. రీసెంట్ గా దీప మెడలో కార్తీక్ తాళి కడితే టీవీలకి హారతులు ఇస్తూ అభిమానులు వీడియోలు పెట్టారు. ఓ కంపెనీ సీఈఓగా కార్తీక్ ఉన్నప్పుడు కారు, బంగ్లా, సూట్ అంటు రిచ్ గా చూపించిన దర్శకుడు.. ఇక రోడ్డుమీద కట్టుబట్టలతో చూపిస్తున్నాడు. వారి దారిద్ర్యాన్ని మరీ దారణంగా చూపిస్తున్నాడు దర్శకుడు దీనిపై ఓ రేంజ్ లో తిడుతున్నారు అభిమానులు.
మా కార్తీక్, దీపల కష్టాలను తీసేయండి. బాగుండేలా తీయండి అంటు నెటిజన్లు ప్రతీ ప్రోమో కింద కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా రిలీజైన కార్తీకదీపం-2 ప్రోమో అప్పుడే లక్ష న్యూస్ ని దాటేసింది. ఇక ఈ ప్రోమోలో ఏం ఉందంటే.. కార్తీక్ టిఫిన్ సెంటర్ ని దీప పూజ చేసి మొదలెడుతుంది. మరోవైపు కార్తీక్ రాలేదని బాధగా ఉండగా.. అప్పుడే కార్తీక్ బాబు చెక్స్ షర్ట్, మెడలో టవల్, లుంగీతో ఓ వాటర్ క్యాన్ భుజాన వేసుకొని వస్తాడు. ఇది చూసి అందరు షాక్ అవుతారు. ఇక అప్పుడే జ్యోత్స్న వచ్చేస్తుంది. సూపర్ బావ.. సీఈఓ నుండి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టే స్థాయికి వచ్చావని తక్కువ చేసి మాట్లాడగా.. కొన్నిటి విలువ చూసే వాళ్ళకి తెలియదు జ్యోత్స్న.. వాటి విలువ బ్రతికే వాళ్ళకే తెలుస్తుందంటు కార్తీక్ కౌంటర్ వేస్తాడు. ఇక బావ కళ్ళలో సంతోషం చూసి ఈర్ష్యతో కుళ్ళుకుంటుంది జ్యోత్స్న. ఇక ఈ ప్రోమో కింద చాలా కామెంట్లు వస్తున్నాయి. మున్ముందు కార్తీక్, దీపలకి కాలం కలిసిరావాలని, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారంటూ ఒకరు కామెంట్ చేయగా, గుంటూరు కారంలో మహేష్ బాబుని చూసి దర్శకుడు ఇన్ స్పైర్ అయ్యాడేమోనని మరొకరు కామెంట్ చేశారు. ఇలా భిన్నమైన కామెంట్లు చేయడంతో ఈ ప్రోమో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.