Nikhil Buzz: ఫేక్ మణికంఠ.. కన్నింగ్ బేబక్క.. స్ట్రాంగ్ నబీల్!

  బిగ్ బాస్ సంబరం కాస్త ముగిసింది. మెజారిటీ పీపుల్స్ అనుకున్నట్టుగానే నిఖిల్ విన్నర్ అయ్యాడు. ఫినాలేలో ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారని ఉత్కంఠభరితంగా సాగింది. నిఖిల్, గౌతమ్ మధ్య ఓటింగ్ లో గట్టి పోటీ జరుగగా నిఖిల్ గెలిచి.‌ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతులు మీదుగా బిగ్ బాస్ సీజన్-8 ట్రోఫీ అందుకున్నాడు. నిఖిల్ ట్రోఫీని అందుకున్న తర్వాత స్టూడియో ముందు ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్త్ చేశారు. నిఖిల్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ(Biggboss Buzz) లో భాగంగా యాంకర్ అంబటి అర్జున్ తో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విన్నర్ అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నావని యాంకర్ అడగగా.. అది ఊహకి అందనిదని నిఖిల్ అన్నాడు. అసలు ఇది ఊహించావా అని అడుగగా.. నేను మనసు పెట్టి ఆడానని నిఖిల్ అన్నాడు. నిన్ను చూస్తే ఒకటి చెప్పాలనిపిస్తుంది. తనని తాను చెక్కుకున్న శిల్పి అని నిఖిల్ ని యాంకర్ పొగుడుతాడు. నాగార్జున సర్ నా చెయ్యి పట్టుకొని పైకి లేపాక నేను షాక్ లో ఉండి పోయా అని నిఖిల్ తన ఫీలింగ్ ని చెప్పాడు. ట్రోఫీ గెలిచాక డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తానన్నావ్ .. ఇప్పుడు తన దగ్గర కి వెళ్తావా అని అర్జున్ సూటిగా నిఖిల్ ని అడుగగా.. బయటకు వెళ్ళాక సిచువేషన్ బట్టి అంటూ సమాధానమిచ్చాడు నిఖిల్. గౌతమ్ పై చాలా సార్లు అగ్రెసివే అయ్యావ్ ఎందుకని అని అడగ్గా.. తను కూడా నాపై చాలా సార్లు అగ్రెసివ్ అయ్యాడు  వందసార్లు మనది తప్పని చెప్పినప్పుడు మనోడిది కూడా ఒక్కసారి అయినా చెప్పాలి కదా అని నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ గురించి అడుగగా.. హౌస్ లో ఫేక్ మణికంఠ.. కన్నింగ్ బేబక్క.. స్ట్రాంగ్ నబీల్.. జెన్యూన్ పృథ్వీ అంటూ తన ఒపీనియన్ ని సూటిగా చెప్పాడు నిఖిల్. ఇక బిగ్ బాస్ నాగార్జున గురించి ఒక్క మాటలో పొగిడేసాడు.ఆ తర్వాత నిఖిల్ చే అర్జున్ కేక్ కట్ చేయించాడు. ఈ ప్రోమో చూస్తుంటే ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు చాలానే ఉంటారని తెలుస్తోంది. ఇలా మొత్తానికి ఈ సీజన్ విజవంతంగా ముగిసింది.  

ప్రేమ-పగ సినిమాలో సావిత్రి గారితో నటించా...ఆమెను చూసి కన్నీళ్ళొచ్చేసాయి

  ఋతురాగాలు సీరియల్ లో నటించిన రూప దేవి అలియాస్ శారద అంటే చాలు ఎవ్వరికైనా గుర్తొచ్చేస్తుంది. అసలు ఈ సీరియల్ ఇప్పుడు టెలికాస్ట్ ఐనా కూడా చూడని వారంటూ ఎవరూ ఉండరు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ లవ్ స్టోరీ. ఇక రూపాదేవి నటన గురించి చెప్పాలంటే పీక్స్..ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం బాలన్స్ గా నటిస్తారు. అలాంటి రూపాదేవి మహానటి సావిత్రి గారి గురించి కొన్ని కామెంట్స్ చేసారు. " మహానటి సావిత్రి గారు రియల్ లైఫ్ లో ఎప్పుడూ దర్పం చూపించుకునే వారు కాదు. ఎవరం వెళ్లి మాట్లాడినా కూడా మరీ ఎక్కువగా కాదు తక్కువగా కాదు బ్యాలన్సుడ్ గా మాట్లాడేవారు. బాలకృష్ణ నటించిన ప్రేమ - పగ అనే మూవీలో నేను సావిత్రి గారితో కలిసి ఒక సీన్ చేశా. కానీ అప్పటికే ఆమె ఇండస్ట్రీలో మాలాంటి వారందరికీ ఒక చాఫ్టర్ లాంటి వారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరంగా చాలా పాడైపోయారు. ఐతే తమిళ్ లో ఋతురాగాలు చేస్తున్నప్పుడు ఆమె మంచం పట్టారు. నేను ఒక రోజు చూడడానికి వెళ్లాను. అప్పుడు జెమినీ గణేశన్ గారు అక్కడే ఉన్నారు. ప్రేమ - పగ మూవీ అప్పట్లో పెద్ద హిట్. నా క్యారెక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది. నేను వెళ్ళినప్పుడు సావిత్రి గారికి నేనొచ్చిన విషయాన్నీ చెప్పారు. కానీ ఆమె కోమాలో ఉన్నారు. అంత భారీ ఖాయంతో ఎంతో అందంగా కళ్ళతో నటించే సావిత్రి గారు చిన్న పిల్లలా మారి మంచం మీద ఉండడం చూసాక నాకు చాలా బాధగా అనిపించింది. ఆమె కాళ్లకు దణ్ణం పెట్టుకుని ఇంటికి వచ్చి బాధపడ్డాను, నాకు ఏడుపాగలేదు. ఇప్పుడు డయాబెటిక్ పేషంట్స్ కి అవేర్నెస్ అనేది ఉంది కానీ అప్పట్లో అంతగా తెలీదు. ఆ తర్వాత సావిత్రి గారు ఒక రెండు నెలల తర్వాత పోయారు. చివరి రోజుల్లో జెమినీ గణేష్ గారు చూసుకున్నారు. మహానటి మూవీలో చూపించిన ఒక మీడియం హౌస్ లోనే ఆమె ఉన్నారు. అసలు ఆవిడ చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండేవారు. పాపం అని పిలిచి ఆ రోల్ ఇచ్చినట్టు ఉన్నారు ఆ సినిమాలో. సెట్ లో ఎంతమంది కొత్తవాళ్లు ఉన్నా కూడా ఆవిడ తన పని తానూ చూసుకునేవారు. మేమంతా వెళ్లి ఆమె బ్లేసింగ్స్ తీసుకునేవాళ్ళం. సెట్ అందరితో చాలా బాగుండేవాళ్లు. మరీ ఓవర్ ఫ్రెండ్లిగా లేరు అలాగని మాట్లాడకుండా కూడా ఉండరు. నేనొక పెద్ద హీరోయిన్ అనే గర్వం కూడా ఆమెకు ఉండేది కాదు. " అని చెప్పుకొచ్చింది.  

Biggboss 8 Telugu: బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్.. కారణాలివే!

  బిగ్ బాస్ సీజన్-8 ముగిసింది. మూడు నెలల పాటు తెలుగు ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసిన ఈ షో నిన్నటి ఎపిసోడ్ తో పూర్తయింది. ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ తో గ్రాంఢ్ గా కొనసాగిన ఈ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చేముందు ఒకలా.. వాళ్ళు వచ్చాక మరోలా ఉంది. బిగ్ బాస్ గత ఎనిమిది సీజన్ల నుండి ఒకటే ప్యాట్రన్ ఫాలో అవుతున్నారు. సేమ్ గెస్ట్ లు రావడం.. హరీబరీగా ఫినిష్ చేయడం.. కప్ ఇచ్చేయడం.. హోస్ట్ జర్నీ వీడియో చూపించడం కామన్ గా మారింది. ఇదే రెగ్యులర్ గా చూడటం డిస్సపాయింట్ గా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్.  ఎంతలా అంటే చాలా మంది అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. దీనికి ప్రధాన కారణం విన్ అయ్యాక ఎమోషన్స్ సరిగ్గా లేవని, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయిన వాటిని కూడా వన్ మినిట్ కూడా చూపించలేదు. ఎందుకంటే అక్కడ టైమ్ లేదు. చాలా మంది సెలెబ్రిటీలు రావడం.. వారి గురించి మాట్లాడం.. సినిమా ప్రమోషన్స్.‌ ఇలా అన్నీ ప్రమోషనల్ కోసం గ్రాంఢ్ ఫినాలే ఏర్పాటు చేశారా అన్నట్టుగా ఉంది. ఇక నిఖిల్ విన్నర్ అయ్యాక సాధారణంగా అనిపించింది. అదే గౌతమ్ విన్నర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో. ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా లేదని తరలిపోయింది.  గత ఎనిమిది సీజన్ల నుండి రెగ్యులర్ గా సాగడం మరింత బోరింగ్ గా అనిపించింది. ముఖ్యంగా నిఖిల్ కి సరైన విన్నింగ్ స్పీచ్ రాలేదని, గౌతమ్ కి సరిగ్గా రెండు నిమిషాలు కూడా మాట్లాడటానికి టైమ్ ఇవ్వకపోవడంతో తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది సెలెబ్రిటీలు స్టేజ్ మీదకి వచ్చినా వారిది ఫైనల్ ఎపిసోడ్ లో తీసేసినట్టుగా తెలయస్తోంది. ఈ సీజన్-8 లో పెద్ద మైనస్ ఏంటంటే.. కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు ఫ్యాన్స్ ఓటింగ్ లో పోటీపడటం.. దీనివల్ల జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగింది. హౌస్ లో ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన అవినాష్.. ప్రతీ గేమ్ లో గెలిచాడు కానీ గౌతమ్ ఇండివిడ్యువల్ గా ఆడుతున్నానంటు ఎక్కువ గొడవలు పెట్టుకోవడం, అతడికి స్క్రీన్ స్పేస్ ఎక్కువవడంతో అవినాష్ కి ఓటింగ్ లేకుండా పోయింది. గ్రాంఢ్ ఫినాలే గ్రాంఢ్ గా లేకపోవడం.. ఒక స్పార్క్ లేకపోవడంతో ఈ సీజన్-8 అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచింది‌. మరి ఫైనల్ డే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Biggboss 8 Prerana : నా కోపాన్ని, పిచ్చి మాటలని యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్

  బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలేలో టాప్-5 ఫ్యామిలీస్ వచ్చారు. ఇక హౌస్ నుండి ఎలిమినేషన్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. హరితేజ, నయని పావని మాత్రం మిస్ అయ్యారు. శ్రీకృష్ణ, గీతా మాధురి కలిసి పాటలతో అలరించగా.. నబా నటేష్ డ్యాన్స్ పర్ఫామెన్స్ అదిరిపోయింది. ముందుగా టాప్-5 నుంచి అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చింది. ఇక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కి హోస్ట్ నాగార్జున ఓ బాధ్యత అప్పగించారు. హౌస్ లోపలికి వెళ్లి టాప్-4 నుంచి ఒకరిని బయటికి తీసుకురావాలన్నారు. ఇక ప్రగ్యా జైస్వాల్ వెళ్లి నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణలో ఓటింగ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ప్రేరణని బయటికి తీసుకొచ్చింది. ఇక బయటికి వచ్చే ముందు ప్రేరణ మిగిలిన ముగ్గురికీ ఆల్ ది బెస్ట్ చెప్పి బయటికొచ్చేసింది. ఇక స్టేజ్ మీదకి వచ్చాక ప్రేరణపై ప్రశంసలు కురపించారు నాగార్జున. చాలా కష్టపడి టాప్-5లో నిలిచిన ఒకే ఒక్క లేడీ నువ్వు అంటూ కొనియాడారు. ఇక తనని ఈ స్థాయి వరకూ తీసుకొచ్చిన ప్రేక్షకులకి ప్రేరణ కృతజ్ఞతలు చెప్పింది. తన కోపాన్ని, పిచ్చి మాటలని యాక్సెప్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకముందు హౌస్ లో ఉన్న లేడి కంటెస్టెంట్స్ లో ప్రేరణకి ఎక్కువ సపోర్ట్ ఉండేది‌. తన ఆటతీరు కూడా బాగుండేది. అయితే ఒకానొక దశలో మెగా ఛీఫ్ కోసం ప్రేరణ పడే కష్టం చూసి అందరు తనని మెగా ఛీఫ్ గా చూడాలనుకున్నారు. కానీ అదే కొంపముంచింది. మెగా ఛీఫ్ తర్వాత ప్రేరణలో చాలా మార్పు వచ్చింది. బ్యాడ్ మెగా ఛీఫ్ అంటూ మెజారిటీ హౌస్ మేట్స్ చెప్పడంతో తనకి నెగెటివిటి పెరిగింది. ఆ తర్వాత ఇండివిడ్యువల్ గా ఆడటానికి ట్రై చేయటంతో టాప్-5 లో నిలిచింది ప్రేరణ.

బిగ్ బాస్ సీజన్-8 రన్నర్ గా గౌతమ్.. ఓడినా టఫ్ ఫైట్ ఇచ్చాడు!

  బిగ్‌బాస్ సీజన్-8లో విన్నర్ ఎవరనే విషయం తెలిసిపోయింది. 105 రోజులపాటు ఆడియన్స్‌ని అలరించిన బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్‌గా నిఖిల్ నిలిచాడు. ఇక టైటిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న గౌతమ్‌కి రన్నరప్ మాత్రమే మిగిలింది. కానీ సీజన్-8లో మస్త్ పోటీ అయితే ఇచ్చాడు గౌతమ్. చివరి నిమిషం వరకూ ఎవరు గెలుస్తారా అంటూ ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూసేలా గౌతమ్ ఆట ఆడాడు. అయితే ఓటింగ్ విషయంలో చాలా తక్కువ డిఫరెన్స్‌లోనే గౌతమ్ ఓడిపోయినట్లు తెలుస్తోంది. గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వకపోయి ఉంటే నిఖిల్ విన్నర్ అని ఆడియన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయేవారు. కానీ గౌతమ్ రావడం.. టైటిల్ రేసులో నిలవడంతో ఆడియన్స్‌కి మరో ఆప్షన్ వచ్చింది. అయితే చివరి నిమిషం వరకూ టఫ్ ఫైట్ ఇచ్చిన గౌతమ్.. చాలా తక్కువ డిఫెరన్స్ ఓటింగ్‌తో టైటిల్ కోల్పోయాడు. బిగ్‌బాస్ సీజన్-8 రన్నరప్‌గా నిలిచాడు. వైల్డ్ కార్డ్‌తో వచ్చి వైల్డ్ ఫైర్‌ అయ్యాడు గౌతమ్. పడిలేచిన కెరటంలా.. ఎలిమినేషన్‌తోనే గౌతమ్‌ని బిగ్ బాస్ చావు దెబ్బ కొట్టాడు. మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి గౌతమ్ హౌస్‌లో ఉన్నాడు లేడంటే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలని ఎంతోమంది ట్రోల్స్ చేశారు. ఇలా సేవ్ చేయడం కంటే.. ఎలిమినేట్ చేసినా బాగుండేదని గౌతమ్ తనలో తాను బాధపడ్డాడు. అయితే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదన్నట్టుగా.. జీరో నుంచి హీరోగా మారాడు. ఎలిమినేషన్ నుంచి బిగ్ బాస్ ఎలవేషన్ ఇచ్చేంతగా టాప్-5 కి చేరి విన్నర్ రేస్‌లోకి వచ్చి రన్నరప్ అయ్యాడు. గౌతమ్ ఐదో వారంలో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ సీజన్ 8 రన్నరప్ అయ్యాడు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి రావడం వల్లే గౌతమ్‌ ఓటింగ్‌లో కాస్త వెనుకబడ్డాడు. నిజానికి రెగ్యులర్ కంటెస్టెంట్‌లో వచ్చి ఉంటే ఖచ్చితంగా గౌతమ్‌ టైటిల్ కొట్టేవాడేమో. అతడికి బయట భారీగా ఫ్యాన్ బేస్ పెరిగింది. ఇండివిడ్యువల్ ప్లేయర్ అంటూ గౌతమ్ కి ఓ ట్యాగ్ కూడా ఉండనే ఉంది. ఈ సీజన్-8లో జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ జాబితాలో గౌతమ్ కూడా ఒకడు.

గేమ్ ఛేంజర్ సీన్ లీక్ చేసిన రామ్ చరణ్.. గంగవ్వ తిట్టిందంట!

బిగ్ బాస్ సీజన్-8 వందరోజులు గడిచినా రానీ క్రేజ్ ఫైనల్ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రావడంతో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అయ్యప్ప స్వామి మాలలో వచ్చి‌న రామ్ చరణ్ హుందాగా మాట్లాడారు. రామ్ చరణ్ ని చూసి బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యరు. ఇక హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని నాగార్జున పరిచయం చేస్తుంటే.. అందరి గురించి రామ్ చరణ్ మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించింది. ఇక గంగవ్వని నాగార్జున పరిచయం చేస్తుండగా.. గంగవ్వ తెలుసు సర్.. గంగవ్వ ఛేంజర్‌లో ఇద్దరూ కలిసి చేశాం.. చాలా గట్టిగా తిట్టారు నన్ను.. మీ ఉద్యోగం సరిగా చేయడం లేదు సర్..మా పేదోళ్లకి ఏమైనా చేయండని.. అంటూ చరణ్ అన్నారు. అయితే గేమ్ ఛేంజర్‌లో చరణ్ కలెక్టర్‌ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గంగవ్వ తిట్టిందని  అన్నారు కాబట్టి కలెక్టర్ సరిగా పనిచేయడం లేదని తిట్టుంటుంది గంగవ్వ. ఇలా గేమ్ ఛేంజర్‌లో ఓ సీన్‌ని తెలీకుండానే లీక్ చేశారు గేమ్ ఛేంజర్. అలానే రోహిణి గారిని కూడా సెట్‌లోనే కలిశామంటూ చెర్రీ చెప్పారు. ఇక టేస్టీ తేజ లేచి చరణ్ సినిమాలు, నటన గురించి చెబుతూ మిమ్మల్ని మొదటి సినిమా నుంచి చూస్తున్నా సార్.. మీరు ఇలానే ఇంకా ఇంకా మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలంటూ తేజ అన్నాడు. దీనికి తేజ మీది కూడా ఫస్ట్ షో అల్లు శిరీష్‌ నుంచి చూస్తున్నా.. అంత టెప్టింగ్‌గా ఉంటుంది.. మీ షో.. అంటూ చరణ్ ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్‌లో ఉండగా శంకర్ సర్ నుంచి కాల్ వచ్చింది.. అసుల కాల్ రాగానే ఇంతకంటే మంచి విషయం ఏముంటుందని ఓకే చేసేశాను.. ఆయన చాలా వర్క్ హాలిక్.. పనిచేయడం కాస్త టార్చర్ అయినా కెరీర్‌కి చాలా బూస్ట్ ఇస్తుందంటూ చరణ్ అన్నారు. గేమ్ ఛేంజర్ చాలా మంచి సినిమా. ఓ మంచి మాస్ పొలిటికల్ డ్రామా. శంకర్ సార్ వింటేజ్ పొలిటికల్ డ్రామా చూస్తున్న ఫీలింగ్ కగలుగుతుందంటూ చరణ్ చెప్పారు. ఇక చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.  

నబీల్ : నేను డబ్బుల కోసం రాలేదు.. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలని గెలుచుకున్నాను 

  బిగ్‌బాస్ సీజన్-8 లో‌ నిఖిల్, గౌతమ్ ల తర్వాత నబీల్ కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. వైల్డ్ కార్డ్స్ రాకముందు నబీల్ ఆటతీరు వేరె లెవెల్ ఉండేది కానీ వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక వాళ్ళు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడంతో నబీల్ కి స్క్రీన్ స్పేస్ తగ్గింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో టాప్-3 పొజిషన్‌లో నబీల్ ఎలిమినేట్ అయ్యాడు. ఖచ్చితంగా టైటిల్ గెలుస్తాడని ఆశతో ఉన్న నబీల్‌కి చివరికి మూడో స్థానమే మిగిలింది. అయితే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నబీల్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.  హీరో, తమిళ్ బిగ్‌బాస్ హోస్ట్ అయిన విజయ్ సేతుపతి, మలయాళ నటి మంజు వారియర్ ఇద్దరూ బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. వారి కొత్త సినిమా విడుదలై పార్ట్ 2 డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. దీంతో ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ జోడీ వచ్చింది. ఇక వచ్చీ రాగానే నాగార్జునతో మాట్లాడుతూ విజయ్ సేతుపతి చాలా ఆనందపడ్డారు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నాగార్జున సార్‌ని లైవ్‌గా చూస్తున్నా.. చాలా అందంగా ఉన్నారంటూ విజయ్ చెప్పారు. ఇక మంజు వారియర్‌ని తెలుగు ఆడియన్స్‌కి పరిచయం చేస్తూ.. సౌత్‌లో చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు కానీ మంజు వారియర్ లేడీ సూపర్ స్టార్ అంటూ నాగార్జున చెప్పాడు. విజయ్ సేతుపతి, మంజు వారియర్ కలిసి హౌస్‌ లోపలికి వెళ్లి నబీల్‌ని మూడో స్థానంలో బయటికి తీసుకొచ్చారు. అయితే తనని తీసుకురావడనికి విజయ్ సేతుపతి రావడం నబీల్‌కి చాలా ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ సేతుపతితో పాటు స్టేజ్ మీదకి వచ్చేసిన నబీల్.. తనకి ఓటేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు చెప్పాడు. బ్రీఫ్ కేస్ తీసుకోలేదని బాధపడుతున్నావా నబీల్ అని నాగార్జున అడిగితే.. నేను డబ్బుల కోసం రాలేదు సర్.. నాకు ఏ మాత్రం బాధలేదు. ఒకవేళ బాధ ఉండి ఉంటే.. నా ముఖంలో కనిపించేది.. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలు గెలవాలనుకున్నాను.. అది గెలిచానంటూ నబీల్ చెప్పాడు. ఇక విజయ్ సేతుపతి, మంజు వారియల్ వెళ్లిపోతుంటే ఓ రిక్వెస్ట్ చేశాడు నబీల్. వాళ్లంతా కుళ్లుకునేలా ఓ కిస్ ఇవ్వండి సార్ అంటూ నబీల్ అడిగితే విజయ్.. నబీల్‌కి బుగ్గ మీద ముద్దు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన ఫ్యాన్స్‌కి విజయ్ సేతుపతి ఇలా ముద్దు పెట్టి తన అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.  

Biggboss 8 winner: మీ ఇంటిబిడ్డగా ఆదిరించారు.. బయటి వాడిని కాదు

  బిగ్ బాస్ సీజన్-8 నిన్నటితో ముగిసింది. వంద రోజులు హౌస్ లో ఉన్న నిఖిల్ ఓ వైపు, వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ మరోవైపు ఉండగా.. సస్పెన్స్ కి తెరతీస్తూ నిఖిల్ విన్నర్ అంటూ నాగార్జున ప్రకటించాడు. విన్నర్ అని ప్రకటించగానే నిఖిల్ చాలా సర్‌ప్రైజ్ అయ్యాడు. చాలా సేపు మౌనంగా అలానే ఉండిపోయాడు. అయితే ఫేస్‌లో మాత్రం మొత్తానికి సాధించాననే గర్వం మాత్రం కనిపించింది. మరోవైపు నిఖిల్ విన్నర్ అని ప్రకటించగానే తన తల్లి, సోదరుడు ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా నిఖిల్ తల్లి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇక ట్రోఫీ తీసుకున్న తర్వాత మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. నన్ను ఇంతవరకూ తీసుకువచ్చిన ఆడియన్స్‌కి పాదాభివందనాలంటూ నిఖిల్ చెప్పాడు. ఇక ఈ విజయాన్ని తన తల్లికి అంకితం ఇస్తూ తెలుగు ఆడియన్స్ నేను బయటివాడిని కాదని ఈ విజయంతో నిరూపించారు అంటూ నిఖిల్ అన్నాడు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా అయితే తమ ఇంటి బిడ్డగా ఆదరించారో అదే ప్రేమను ఇప్పుడు కూడా కొసాగించారంటూ నిఖిల్ చెప్పాడు. మరోవైపు ఎక్స్ హౌస్‌మేట్స్ అందరికీ థాంక్యూ చెబుతూ ఈ విజయం తన ఒక్కడిదే కాదని అందరిదీ అంటూ నిఖిల్ అన్నాడు.  టైటిల్ విజేత నిఖిల్‌కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పారు. ఇన్ని రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం చిన్న విషయం కాదన్నారు రామ్ చరణ్. ఎక్కడైనా ఔట్ డోర్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు 20 రోజులకే ఫ్యామిలీ మీద బెంగ వచ్చేస్తుందని.. కానీ మీరు ఇలా ఉండటం గ్రేట్ అంటూ చరణ్ అన్నారు. నా దృష్టిలో మీరందరూ విన్నర్స్‌యే కానీ అల్టిమేట్ విన్నర్ మాత్రం నిఖిల్ అంటూ చరణ్ చెప్పారు.  

వందకోట్ల షూరిటీకి రాజ్ సంతకం.. నంద గోపాల్ ని పట్టుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -593 లో.... దుగ్గిరాల ఇంటికి కనకం రాగానే రుద్రాణి, ధాన్యలక్ష్మి తనని అవమానిస్తారు. ఇక ఇందిరాదేవి ఇంట్లో పరిస్థితిని చెప్తూ బాధపడుతుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడకి కొంతమంది బ్యాంకు నుండి ఎంప్లాయిస్ వస్తారు. రాజ్ క్యాబిన్ లోకి వెళ్తారు. పర్మిషన్ లేకుండా వచ్చారేంటని రాజ్ అడుగగా.. రాజ్ అంటే మీరేనా అంటూ వాళ్లు వచ్చిన విషయం చెప్తారు. మీ తాతయ్య తన ఫ్రెండ్ కంపెనీకి వంద కోట్లకి షూరిటి పెట్టారు. కానీ ఇప్పుడు ఆ కంపెనీ బోర్డు తిప్పింది. సీతారామయ్య ఫ్రెండ్ మనవడు మోసం చేశాడు. ఇప్పుడు అప్పు కట్టడం లేదు ఇక షూరిటీ ఉన్న మీ తాతయ్య గారు కట్టాలి ఆయన కోమలో ఉన్నారని తెలిసింది కాబట్టి ఇప్పుడు మీరే బాధ్యత వహించాలి. వంద కోట్లు కడతారా లేక ఆస్తులు జాప్తు చెయ్యమంటారా.. ఒక పది రోజులు టైమ్ ఇస్తామ్.. ఇందులో సంతకం చెయ్యండి అని వాళ్లు అనగానే రాజ్ సంతకం చేయబోతుంటే అక్కడ ఆఫీస్ లో ఎంప్లాయి రాజ్ ని పక్కకు పిలిచి సంతకం పెట్టకండి అని అంటాడు. అంటే మా తాతయ్య మాటకి విలువ లేదా ఎవరు మా తాతయ్యని తప్పుగా అనుకోవద్దని రాజ్ తనపై కోప్పడతాడు. ఆ తర్వాత రాజ్ వాళ్ళు సంతకం పెట్టమన్న దగ్గర పెడతాడు. ఇక రాజ్ పది రోజుల్లో వంద కోట్లు ఎలా కట్టాలి? ఆస్తులు ఎలా కాపాడాలని ఆలోచిస్తూ నడుచుకుంటు వెళ్లిపోతాడు. తరువాయి భాగంలో రాజ్ సీతారామయ్య ఫ్రెండ్ మనవడు నందగోపాల్ దగ్గరికి వెళ్తాడు కానీ అతను లేడని ఫారెన్ కి వెళ్లాడని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దీపని ఎటాక్ చేసింది మేము కాదంటూ డైవర్ట్ చేసిన పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -228 లో.....దీపపై ఎటాక్ చేయించింది జ్యోత్స్న అని కార్తీక్ కి డౌట్ వచ్చి వెంటనే ఫోన్ చేస్తాడు. పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నా భార్య పై ఎటాక్ చేయించింది మీరే కదా అని అడుగగా.. పారిజాతం టెన్షన్ పడుతుంది. జ్యోత్స్న ఏదో ఒకటి కవర్ చెయ్యమని చెప్తుంది. మేమ్ ఎందుకు ఎటాక్ చేస్తాం.. మాకేం అవసరం తన మాజీ భర్త అయి ఉండొచ్చు లేక అతని భార్య శోభ అయి ఉండొచ్చని కార్తీక్ మనసుని డైవర్ట్ చేస్తుంది పారిజాతం. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తుంది. నేనే తప్పుగా అనుకున్నానా అని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు శౌర్య నాకు కబుర్లు చెప్పమని అంటుంది. నాకు పని ఉందంటూ కార్తీక్, దీపలు వెళ్తుంటే తను అలుగుతుంది. దాంతో ఇద్దరు పనులు మానేసి శౌర్యతో కబుర్లు చెప్తారు. కార్తీక్ కళ్ళు మండుతుంటే దీప చీర కొంగుతో శౌర్య ఆవిరి పడుతుంది. నాకు అమ్మకి నువ్వున్నావ్.. నీకు నేనున్నాను అని శౌర్య అనగానే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం జ్యోత్స్న పారిజాతంలు మాట్లాడుకుంటారు. దీపని ఏదో ఒకటి చెయ్యాలని జ్యోత్స్న అనగానే అప్పుడే సుమిత్ర వచ్చి‌.. ఏం చేస్తావ్? దీప జోలికి పోతేనే తను మీ జోలికి వస్తుంది. తన మంచిదని సుమిత్ర అంటుంది. జ్యోత్స్నని మీరే చెడగొడుతున్నారని పారిజాతంపై కోప్పడుతుంది సుమిత్ర. ఎంతైనా సొంత కూతురు దీప కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందని జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి జ్యోత్స్న ఆఫీస్ కి వెళదామని అంటాడు. దాంతో పారిజాతంకి జ్యోత్స్న బై చెప్పి వెళ్తుంది. అక్కడే ఉన్న సుమిత్రకి చెప్పదు. మరొకవైపు కార్తీక్ ఆఫీస్ కి రెడీ అవుతాడు. అప్పుడే దీప ఫైల్ తీసుకొని వస్తుంది. నాకు ఎందుకో ఈ రోజు ఆఫీస్ కి వెళ్లాలని లేదు దీప అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పద్దెనిమిదవ అంతస్తు నుండి దూకేద్దనుకున్నా.. గౌతమ్ వరెస్ట్ మూమెంట్!

బిగ్ బాస్ సీజన్-8 లో టాప్-5 ఫైనలిస్ట్ లు మాత్రమే మిగిలారు. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తమ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలని షేర్ చేసుకున్నారు. అవినాష్ తనకి పుట్టిన బిడ్డ చనిపోయాడంటూ ఎమోషనల్ అవ్వగా, ప్రేరణ వాళ్ళ నానమ్మతో తన బాండింగ్ గురించి చెప్పుకుంటూ ఏడ్చేసింది. అలాగే గౌతమ్, నిఖిల్ లు తమ వరెస్ట్ అండ్ బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు. గౌతమ్‌ తన లైఫ్ లో జరిగింది చెప్పాడు. ఈ విషయం ఇంతకుముందే చెప్పాను.. నేను ఢిల్లీలో మెడిసిన్‌ చదువుతున్నప్పుడు ఒకమ్మాయితో బ్రేకప్‌ అయింది. ఆ బాధ తట్టుకోలేక ఒకరోజు నేను ఉంటున్న 18వ అంతస్థులోని బాల్కనీలో నుంచి దూకి చనిపోదామనుకున్నాను. చివరి వరకు వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది.. నన్ను ప్రేమించేవాళ్లు గర్వపడేలా చేయాలనుకున్నాను.. అప్పుడు ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆలోచించి ఆగిపోయానన్నాడు. ఇక బెస్ట్ అంటే బిగ్‌బాస్ హౌస్‌లోకి నా తల్లిని తీసుకురావడం ఎప్పటికి మర్చిపోలేనంటూ గౌతమ్ చెప్పాడు. కాసేపటికి నిఖిల్ తన కష్టాల గురించి చెప్పాడు. నేను ఆర్కిటెక్ట్‌ కోర్స్‌ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్‌ వచ్చింది. దీంతో చదువు మధ్యలోనే వదిలేశాను. కానీ తర్వాత ఛాన్సులు లేక మూడేళ్ల పాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. దీంతో రోజూ అమ్మ దగ్గర రూ.30 అడుక్కునేవాడిని. దీంతో నువ్వు ఇంటికి భారమయ్యావు.. నీకు తిండి పెట్టడమే కాకుండా ఖర్చులకు కూడా డబ్బివ్వాలా? అంటూ తిట్టింది. ఆ రోజులు మర్చిపోలేను. తర్వాత కన్నడ సీరియల్‌లో ఆఫర్‌ వచ్చింది. రోజుకి రూ.2500 ఇస్తామన్నారు. అయితే నెలకి రూ.75 వేలు వస్తాయనుకున్నాను. కానీ నెలకి పదిరోజులే షూటింగ్‌ జరిగేది. కానీ ఆ తర్వాత తెలుగు సీరియల్‌ అయిన గోరింటాకులో ఛాన్స్ వచ్చింది. అప్పటి నంచి ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. స్టార్ మాకి ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ నిఖిల్ అన్నాడు. ఆ తర్వాత సుమ వచ్చి ఫుల్ ఫన్ చేస్తూ ఎంటర్‌టైన్ చేసింది.

సవతి తల్లి ప్లాన్ అదే.. ఆమె గుర్తుపట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -279 లో... సందీప్, ధనలకి శ్రీలత ఒక ప్లాన్ చెప్తుంది. మీరు పూర్తిగా మారిపోయినట్టు వాళ్లనుకోవాలి.. ఆఫీస్ కి వెళ్ళాలి అక్కడ కూడా వాళ్ళని నమ్మించాలని శ్రీలత చెప్తుంది. అక్క బావలకి తెలిస్తే ఎలా అని ధన అనగానే.. ఇప్పుడు రిలేషన్ గురించి ఆలోచిస్తే నువ్వు ఇక్కడే ఉంటావని సందీప్ అంటాడు. నాకు నా లైఫ్ ఆస్తులు ముఖ్యం అన్నట్లు ధన సెల్ఫిష్ గా ఆలోచిస్తాడు. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు ఆఫీస్ కి వెళ్తు.. ధన, సందీప్ ల బాధ్యతలు అత్తయ్య మనకి అప్పజెప్పారు. మనం ఎలాగైనా వాళ్ళని మార్చాలని రామలక్ష్మి అనగానే.. నేను దాని గురించి ఆలోచిస్తున్నానని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు శ్రీలతకి నందిని ఫోన్ చేసి రామలక్ష్మి సీతాకాంత్ ని విడగొడతానన్నావని అడుగుతుంది. నేను అలా చెయ్యలేను. నేను మారిపోయాను నువ్వు ఏదైనా చేసుకోమని శ్రీలత అంటుంది. ఆ తర్వాత నేనే నా సీతాని సొంతం చేసుకుంటాను అని నందిని అనుకుంటుంది. ఆ తర్వాత అత్తయ్య మీరు మారలేదు కదా ఎందుకు అలా చెప్పారని శ్రీవల్లి అడుగగా.. మారలేదు.. ప్లాన్ లో ఉన్నానని నందినికి చెప్పలేదని శ్రీలత అంటుంది. అలా అనగానే చెప్పలేదు.. తెలియొద్దు ఇప్పుడు నేను మారానని రామలక్ష్మి నమ్ముతుంది. ఇప్పుడు మారలేదని తెలిస్తే దాన్ని ఎదర్కోలేము.. ఇప్పుడేదైనా నందిని పైకి వెళ్తుందని శ్రీలత అంటుంది. మరొకవైపు సందీప్, ధన ఆఫీస్ కి వెళ్తారు. ధనకి వర్క్ చెప్పండి అని నందిని అంటుంది. సందీప్ మాట తీరు చూస్తే నందిని కి మారినట్టు అనిపించదు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు షేర్ వాల్యూ పడిపోయిందని టెన్షన్ పడుతుంటే.. నందిని స్వీట్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు చూడండి షేర్ వాల్యూ అని నందిని అనగానే రామలక్ష్మి చూస్తుంది. షేర్ వాల్యూ పెరుగుతుంది. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నందినిని దగ్గరికి తీసుకొని సీతాకాంత్ థాంక్స్ చెప్తాడు. కాసేపటికి నందిని అందరికి స్వీట్ ఇస్తానంటూ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

దొంగపెళ్ళి చేసుకున్న వాళ్ళని ఇంట్లోకి రమ్మన్న తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -29... సాగర్, నర్మదల పెళ్లి చేసి ఇంటికి తీసుకొని వస్తాడు ధీరజ్. వాళ్ళని చూసి రామరాజు షాక్ అవుతాడు. ఎదురింట్లో ఉన్నా భద్రవతి కుటుంబం రామరాజు పరువు పోయిందని సంతోషపడుతుంది. ఎంత నమ్మానురా? ఎందుకిలా చేసావ్ ఇంత దైర్యం ఎలా వచ్చిందని రామరాజు అనగానే.. ఆ దైర్యానికి కారణం నేనే అని ధీరజ్ చెప్పగానే తనపై రామరాజు కోప్పడతాడు. నా పరువు తీసావ్ కదారా.. నువ్వు ఇంట్లో ఉంటే పెద్దోడిని ఇంకా కూతురిని కూడా చెడగొడతావ్.. ఇంట్లో నువ్వు ఉండకూడదు వెళ్ళిపోమని రామరాజు అనగానే.. వద్దు నాన్న ప్లీజ్ తప్పు చేసింది మేము.. శిక్ష వాడికేందుకని సాగర్ అంటాడు. నర్మదని వాళ్ళింట్లో దింపేస్తానని సాగర్ అనగానే.. సిగ్గు లేదా ఆ మాట అనడానికి నిన్ను నమ్మి వచ్చిందని రామరాజు అంటాడు. ధీరజ్ ని ఇంట్లో నుండి పంపిస్తాడు రామరాజు. వద్దని వేదవతి అంటుంది‌. అయిన ధీరజ్ వెళ్ళిపోతాడు. నిన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది. మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తున్నాను కానీ ఎప్పటికి క్షమించలేనని రామరాజు అంటాడు. ఆ తర్వాత భద్రవతి కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఇన్ని రోజులుగా రామరాజు పరువుపోవడం కోసం చూసామంటూ సేనాపతితో భద్రవతి అంటుంది. తరువాయి భాగంలో రామరాజు ఇంట్లో గొడవలు మొదలవ్వాలి అంటే ఆ పిల్ల పేరెంట్స్ ఎవరో కనుక్కోమని.. వాళ్ళతో మాట్లాడుదామని సేనాపతికి చెప్తుంది భద్రవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నేను ఆల్రెడీ గెలిచేశాను సర్.. విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన అవినాష్!

బిగ్‌బాస్  సీజన్-8 క్లైమాక్స్ కి చేరుకుంది. నేటి సండే ఎపిసోడ్ తో సీజన్-8 ముగియనుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. హౌస్‌మేట్స్ అందరికీ ఓ టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ షో అయిపోయాక ఎవరితో కలిసుండాలనుకుంటున్నారు? ఎవరిని ఎప్పటికీ కలవకూడదనుకుంటున్నారో చెప్పండి అంటూ బోర్డ్‌పై ఫాలో, బ్లాక్ సింబల్స్ పెట్టాడు బిగ్‌బాస్. ఇక హౌస్‌మేట్స్ వాళ్ల వాళ్ల అభిప్రాయం ప్రకారం ఎవరిని ఫాలో, ఎవరి బ్లాక్ చేయాలి అనుకుంటన్నది చెప్పారు. అయితే అందరూ దాదాపు అందరినీ ఫాలో కావాలని అనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక బ్లాక్ విషయానికొస్తే ముందుగా సోనియా పర్సనాలిటీ నచ్చలేదంటూ ప్రేరణ బ్లాక్ చేసింది. ఇక నబీల్ అయితే హరితేజ, సోనియా ఇద్దరినీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు. నేను పగబడతానని హరితేజ అంది అందుకే బ్లాక్ చేశా.. సోనియా నామినేషన్స్‌లో నన్ను టార్గెట్ చేసింది అందుకే బ్లాక్ అంటూ నబీల్ క్లారిటీ ఇచ్చాడు.  ఇక మిగిలిన వారితో పోలిస్తే తక్కువ పరిచయం ఉండటం వల్లే పృథ్వీ ని బ్లాక్ చేశాడు గౌతమ్. బేబక్క, సీతను బ్లాక్‌ చేశాడు నిఖిల్. పృథ్వీని టెంపరరీగా బ్లాక్‌ చేస్తానని అవినాష్ చెప్పాడు. ఆ తర్వాత అందరు మీ జీవితంలోని బెస్ట్‌, వరస్ట్‌ సంఘటనలను పంచుకోండని బిగ్‌బాస్ అడిగాడు. ముందుగా నబీల్‌ మాట్లాడుతూ ఏదో సాధించాలని కలలు కన్న నాకు.. బిగ్‌బాస్ లాంటి పెద్ద ఆఫర్ రావడమే లైఫ్‌లో బెస్ట్ విషయం అంటూ చెప్పాడు. ఇక 10వ తరగతి తర్వాత బైక్‌ యాక్సిడెంట్‌ జరిగింది. అప్పుడు హాస్పిటల్‌‌లో చూసిన లైఫ్ ది వరస్ట్ అంటూ నబీల్ చెప్పాడు. ఇక ప్రేరణ మాట్లాడుతూ దేవుడి దయవల్ల నాకు అంత వరస్ట్ సిట్యూవేషన్స్ అయితే ఎప్పుడూ రాలేదు. కానీ నా నానమ్మకి నేనంటే చాలా ఇష్టం.. నాతో మాట్లాడటం కోసం చెప్పిన కథలే మళ్లీ మళ్లీ చెప్పేది. అప్పుడు ఆమెపై చిరాకుపడేదాన్ని.. కానీ నానమ్మ వెళ్లిపోయాకే ఆ లోటు తెలిసిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక చివరిగా అవినాష్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పకూడదనుకున్నా కానీ బిగ్‌బాస్ నా ఫ్యామిలీ కాబట్టి చెబుతున్నాను. నేను, నా భార్య అను పిల్లల విషయంలో ఎన్నో కలలు కన్నాం.. కానీ ఏ జన్మలో ఏ తప్పు చేశానో మాకు బాబు పుట్టినట్లే పుట్టి చనిపోయాడు. చాలా బుజ్జిగా ఉండేవాడు.. వాడిని ఇలా ఎత్తుకున్నదే గుర్తుంది.. నా చేతిలో కొడుకున్నాడు, కానీ వాడికి ప్రాణం లేదంటూ అవినాష్ ఏడ్చేశాడు. అవినాష్‌ని అలా చూసి హౌస్‌మేట్స్ అందరూ బాధపడ్డారు. నీకు ఈసారి ట్విన్స్ పుడతారు చూడమంటూ ప్రేరణ ఏడుస్తూ చెప్పింది.

నాకు నేర్పిన జీవిత పాఠాల్లో ఒకటి..

  అనసూయ ఒక బోల్డ్ యాక్టర్ మాత్రమే కాదు బోల్డ్ హోస్ట్ కూడా..ఎవరన్నా ఏమన్నా అంటే చాలు ఫైర్ బ్రాండ్ లా మీద పడిపోతుంది అనే కామెంట్స్ ఆమె మీద నిత్యం వస్తూనే ఉంటాయి. జబర్దస్త్ కామెడీ షోతో  పాపులర్ యాంకర్ గా మారింది.  అలాంటి  అనసూయ ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. ఈ ఇయర్ ఎవరికీ ఎం నేర్పిందో కానీ తనకు ఒక జీవిత పాఠం నేర్పింది అంటూ పోస్ట్ చేసింది. "మిమ్మల్ని మీలోని ట్రాన్సఫార్మ్ అయ్యే శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. అలాగని మీ శక్తితో వేరే వాళ్ళని మార్చేయగలం అంటూ అతిగా కూడా ఆలోచించకండి. దేన్నైనా మార్చగల శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉందని గుర్తుంచుకోండి. ఎందుకంటే ముళ్ళను ఎంత ఎక్కువగా ప్రేమించగలుగుతారో గులాబీలను కూడా అంతే ఎక్కువగా ప్రేమించే అవకాశం ఉంటుంది. అప్పుడే మీరు  మరింత పవర్ ఫుల్ గా మారతారు" అంటూ రాసుకొచ్చింది అనసూయ. ఇక అనసూయ నటించిన  'రజాకర్' మూవీ త్వరలో  ఓటీటీలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇక అనసూయ పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్స్  కూడా కామెంట్స్ చేస్తున్నారు. " అను లాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు..మీరు గోర్జియస్" అంటున్నారు. అనసూయ  క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి వంటి మూవీస్ లో  నటించింది. ముఖ్యంగా రంగస్థలం మూవీలో  రంగమ్మత్తగా ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. దాంతో  వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది..    

బిగ్ బాస్ లో భలే ట్విస్ట్.... షో మధ్యలో  దీన్ని ఎవరూ ఊహించి ఉండరు....

తెలుగులో బిగ్ బాస్ షో  సీజన్8 నడుస్తున్న విషయం తెలిసిందే.. అయితే బిగ్ బాస్ షోలో అప్పుడప్పుడు ఎవరూ ఊహించని సంఘటనలు జరిగి వీక్షకులను విస్మయానికి గురి చేస్తుంటాయి. అలాంటిదే ఇప్పుడు కూడా చోటు చేసుకుంది. అది మరేంటో కాదు.. కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో మాటీవి ప్రేక్షకులను అలరించిన ప్రేరణ. బిగ్ బాస్ షోలో  తన మనసులో ఉన్న కోరిక బయటపెట్టి అటు కంటెస్టెంట్ లకు ఇటు బిగ్ బాస్ వీక్షకులకు ఊహించని షాకిచ్చింది. అదేంటంటే  ఒక ఎపిసోడ్లో  ప్రముఖ హోస్ట్, నిర్మాత ఐన ఓంకార్ గారు గెస్టుగా వచ్చి కంటెస్టెంట్సుకి ఒక  టాస్కు  పెట్టారు. అందులో ప్రేరణ  గెలవటంతో  ఆమెని ఒక కోరిక కోరుకోమన్నారు.  ప్రేరణ తన పెళ్లి వీడియోని ప్లే చెయ్యల్సిందిగా  కోరి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.  ఆమె కోరిన విధంగా బిగ్ బాస్ వీడియో ప్లే చేయటంతో ఆ వీడియో చూస్తూ ప్రేరణ ఎంతో ఎమోషనల్ అయింది.  బిగ్ బాస్ షోలో ఒకరి పెళ్లి వీడియో ప్లే చేయటం అనేది  ఇదే మొదటిసారి. అసలు ఇలా జరుగుతుందని ప్రేక్షకులు కానీ, కంటెస్టెంట్స్ కానీ ఎవరూ ఊహించి ఉండరు. సీరియల్లో ముకుందగా ఎలాగైతే తన అల్లరితో అందరి మనసులని గెలుచుకుందో, అలాగే ఈ  షోలో కూడా ప్రేరణ చేసిన  అల్లరి అంతా ఇంతా కాదు.  ఎంత అల్లరి చేసినా కూడా, ఆటల విషయం వచ్చేసరికి సివంగిలా బరిలో దిగి ఆడటం ఆమెని ప్రేక్షకులకి ఇంకా దగ్గర చేసింది. ప్రేరణకి  మొదటినుంచే  లాంగ్ జంప్, హై జంప్, వంటి స్పోర్ట్సులో  ఆసక్తి ఉండటం, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల అనుభవం కూడా ఉండటంతో, ఈ షోలో  పెట్టిన ఫిజికల్ టాస్కుల్లో కూడా తన ప్రయత్నలోపం లేకుండా అబ్బాయిలతో పోటీగా ఫైట్ చేసింది. ఐతే ఈ సీజన్లో వచ్చిన  కంటెస్టెంట్సులో ఒకరిగా అడుగుపెట్టిన  ప్రేరణ చివరి వారం వరకూ ఉండి,  టాప్5 గా నిలవటం, అందులోనూ ఉన్నవారిలో ఒక్కగానొక్క అమ్మాయి కావటం విశేషం. ఈమె మా టీవీలో ఇటీవల పూర్తయిన ‘కిర్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్’ అనే గేమ్ షోలో కూడా తమ టీం విన్నింగ్ కోసం కష్టపడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. కాలేజీ రోజుల్లో తన మోడలింగ్ కెరీర్ మొదలుపెట్టి   కన్నడ సీరియల్ ‘హర హర మహాదేవ్’ లో అవకాశం రావటంతో తన బుల్లి తెర ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని కన్నడ సినిమాలు చేసినా కూడా అంత గుర్తింపు దొరకలేదు. మన తెలుగు బుల్లి తెర పరిశ్రమకి ‘కృష్ణా ముకుంద మురారి’ తో వచ్చి మంచి పేరు తెచ్చుకుంది. ఈమెకి గతంలో కన్నడ బాషలో ఆన్లైన్ మినీ బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనుభవం కూడా ఉంది. ఇప్పుడు ఈ తెలుగు బిగ్ బాస్ లో చివరివారం వరకూ  నిలిచి తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ప్రేరణ మగాళ్ళకి ధీటుగా నిలబడి ఈ టైటిల్ గెలుస్తుందా..... వేచి చూడాల్సిందే...

బిగ్ బాస్ బిజినెస్ మొత్తంలో మనం చిన్న పాత్రలం...అంతే

ఈ మధ్య కాలంలో షోస్ కావొచ్చు ఈవెంట్స్, రియాలిటీ షోస్, మూవీస్, సీరియల్స్ అన్నిటికి ప్రజలు అభిమానులు బాగా ఎడిక్ట్ ఐపోయి అందులో కనిపించేవి నిజంగా క్యారెక్టర్స్ అనుకుని వాళ్ళను తిట్టడం అబ్యూజ్ చేయడం వంటివి చేయడం బాగా ఎక్కువైపోయింది. అంటే సినిమాని సినిమాలా చూడడం లేదు...బిగ్ బాస్ ని కూడా ఒక నార్మల్ షోలా చూడడం లేదు. అదొక ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే అని.. అందులో ఆడేవాళ్లంతా కూడా ఆ కాసేపు అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు  అన్నట్టుగా ఎవరూ అనుకోవట్లేదు. ఇప్పుడు సోనియా ఆకుల విషయంలో కూడా ఇదే జరిగినట్టు అర్ధమవుతోంది..ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన పోస్ట్ చూస్తే తెలుస్తోంది. "బిగ్ బాస్ ఆడించే గేమ్ లో నా పాత్ర, నీ పాత్ర గురించి...విన్నింగ్ కప్ గురించి ఇంత దిగజారి కామెంట్స్ చేసుకోవడం ఎందుకన్నా ? ఈ మొత్తం బిగ్ బాస్ బిజినెస్ లో మనమంతా చిన్న రోల్స్ ప్లే చేసాం అంతే..రిలాక్స్ గా ఉండండి...బిగ్ బాస్ చూడండి ..ఎంజాయ్ చేయండి" అంటూ ఎవరికో కానీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఈ ఫైర్ బ్రాండ్..సోనియా అంటే ఫైర్ బ్రాండ్ లా బిగ్ బాస్ లో పేరు తెచ్చుకుంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతోంది. ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసి ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు.జార్జ్ రెడ్డి సినిమాలో హీరో సిస్టర్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీలో వచ్చిన ఫేమ్‌తో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్,  ఎన్‌కౌంటర్ అనే సినిమాల్లో నటించింది.  సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఆమె  ఆసా అంటే యాక్షన్ ఎయిర్‌ఫర్ సొసైటల్ అడ్వాన్స్‌మెంట్  అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించింది. అనాథ పిల్లలకు ఆర్ధిక సాయం, లాక్‌డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణి వంటివి చేసింది.  

ఈ షోకి వచ్చింది కూడా తేజు లిప్స్ చూడడానికే

  ఆర్జే చైతు బెజవాడ కుర్రాడే. ఇతని పూర్తి పేరు చైతన్య బసవ. అతను రేడియో జాకీ. అలా సోషల్ మీడియాలో ఆర్జేగా మంచి క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ కి వెళ్లి బాగా ఫేమస్ అయ్యాడు. అటు షోస్ కి, ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ శ్రీముఖికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాడు. ఇట ఆర్జే చైతూకు లేడీస్ లిప్స్ అంటే బాగా ఇష్టం అంట. ఆ విషయాన్నీ కాకమ్మ కథలు ఎపిసోడ్ లో చెప్పుకొచ్చాడు. తేజు ఆడిన రాపిడ్ ఫైర్ ప్రశ్నల్లో తనకు ప్రదీప్ యాంకరింగ్ ఇష్టమని, ఆర్జేని కాకపోయి ఉంటే యాంకర్ ని అయ్యేవాడిని. శ్రీముఖిలో తనకు నచ్చని క్వాలిటీ ఏంటంటే నచ్చకపోతే బ్లాక్ చేస్తుంది పర్లేదు అనుకున్నాక అన్ బ్లాక్ చేస్తుంది. ఇలా బిగ్ బాస్ కి వెళ్ళకముందు చేసేది వెళ్లొచ్చాక అలా చేయడం మానేసింది  అని చెప్పుకొచ్చాడు. ఇక హీరో  సాయి ధరమ్ తేజ్ కి డబ్బింగ్ చెప్పడం ఇష్టం. తన వాయిస్ అతనికే సూట్ అవుతుందని చెప్పాడు. చెప్పాలంటే సమంత చాలా హాట్ గా ఉంటారు. ఎన్టీఆర్ తో  సెల్ఫీ దిగే ఛాన్స్ వస్తే వదులుకోను. ఒక అమ్మాయిలో తనకు నచ్చేవి లిప్స్ అని చెప్పాడు. ఐతే తేజు నటించిన ఐస్ క్రీం మూవీ చాలా సార్లు చూశాడని కేవలం తేజు లిప్స్ కోసమే చూసాడంటూ పక్కనుంచి శ్రీముఖి చైతులోని లిప్స్ యాంగిల్ ని చెప్పుకొచ్చింది. ఆ మాటకు చైతు కూడా ఇప్పుడు ఈ షోకి వచ్చింది కూడా తేజు లిప్స్ చూడొచ్చని అంటూ కామెంట్ చేసాడు. శ్రీముఖి అంటే...అలాగే ఆర్జేగా చేయడం అంటే ఇష్టం. ఎవరిలో ఐనా హాట్నెస్ అంటే ఇష్టం.. అలాగే ఫిట్ గా ఉండడానికే తింటాను అంటూ తేజు అడిగిన రాపిడ్ ఫైర్ కి ఆన్సర్స్ చెప్పాడు ఆర్జే చైతు.

నాగార్జున కంటే నేనే బాగా హోస్ట్ చేసేదాన్ని

  ఆహా ప్లాట్ఫార్మ్ మీద స్ట్రీమ్ అవుతున్న కాకమ్మ కథలు ఎపిసోడ్ లో శ్రీముఖి ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఈ షోకి ఆర్జే చైతూ, యాంకర్ శ్రీముఖి గెస్టులుగా వచ్చారు. ఐతే  ఇందులో అన్ని జానర్స్ లో గేమ్స్ ఆడించేసాక రాపిడ్ ఫైర్ అడిగింది తేజస్విని. ఐతే ఆమె అడిగిన ప్రశ్నలకు వరసగా ఇలా సమాధానాలు చెప్పింది శ్రీముఖి. "నా ఫేవరేట్ హోస్ట్ ఎవరూ లేరు. నా కో-హోస్ట్ ప్రదీప్ హోస్టింగ్ ఇష్టం. నేను హోస్ట్ చేసే అన్ని షోస్ లోకి ఆదివారం విత్ స్టార్ మా పరివారం అంటే ఇష్టం. ఆర్జే చైతుకు కొంచెం యాంకరింగ్ నేర్చుకోరా బాబు అని చెప్పాలనిపిస్తుంది. బిగ్ బాస్ షోని నేను నాగార్జున గారి కన్నా కూడా బాగా హోస్ట్ చేయగలుగుతాను అని అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది స్టార్స్ బిగ్ బాస్ కి హోస్ట్ చేశారు కానీ నేనుంటేనా బిగ్ బాస్ హౌస్ లోపలి వెళ్లి ఇంకా జాడించి మరీ గేమ్స్ ఆడించేలా హోస్ట్ చేసేదాన్ని. రణ్వీర్ సింగ్ తో పాన్ ఇండియా వరల్డ్ లెవెల్ లో మూవీ ఛాన్స్ వస్తే ఈ యాంకరింగ్ వదిలేసి యాక్టింగ్ కి వెళ్ళిపోతా. డాన్స్ రాకపోయినా మేనేజ్ చేసే హీరోయిన్ నయనతార. ఇన్ని రోజులు సింగల్ గా ఉన్నా కాబట్టి త్వరగా మింగిల్ కావాలని ఉంది.. సుమక్క హోస్టింగ్ ఇష్టం. అమ్మంటే ఇష్టం. నన్ను రాములమ్మ అన్నా శ్రీముఖి అన్నా ఇష్టమే." అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి.. మరి బిగ్ బాస్ కి శ్రీముఖి హోస్ట్ కావాలని ఆరాటపడుతోంది కాబట్టి ఈ షో చూసాక నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ కి  శ్రీముఖికి హోస్టింగ్ ఛాన్స్ ఏమన్నా ఇస్తారో లేదో చూడాలి.