Illu illalu pillalu..కొత్త కోడలిని శోభనానికి రెడీ చేసిన అత్త.. గదిలోకి వెళ్ళకుండా ఆపేసిన కామాక్షి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -41 లో.....ప్రేమని ఇంటికి త్వరగా రమ్మని సేనాపతి ఫోన్ చెయ్యగానే.. ప్రేమ ఇంటికి వస్తుంది. నీకు ఇప్పుడు పెళ్లి చూపులు.. మంచి సంబంధం.. వెళ్లి త్వరగా రెడీ అవ్వమని భద్రవతి చెప్పగానే.. ప్రేమ షాక్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమ రెడీ అవుతుంది. కళ్యాణ్ అదే పని గా ఫోన్ చేస్తుంటాడు కానీ ప్రేమ ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత పెళ్లిచూపులకి అబ్బాయి వాళ్లు వస్తారు. ప్రేమ హాల్లో కి వస్తుంది. ప్రేమని చూసి అబ్బాయి నచ్చిందని చెప్తాడు. ప్రేమ బయటకి వెళ్లి కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి అలా వెళ్లిపోయావ్.. ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని కళ్యాణ్ అనగానే.. నాకు పెళ్లి చూపులు జరిగాయి.  నేను తర్వాత మాట్లాడుతానంటూ ఫోన్ కట్ చేస్తుంది ప్రేమ. అప్పుడే ధీరజ్ ఎదురింట్లో నుండి చూసి.. ఏంటి ఈ రోజు ఇంత అందంగా రెడీ అయ్యావని అడుగుతాడు. ఓహ్ పెళ్లి చూపులా అని ధీరజ్ అంటాడు. నేను మీ అన్నయ్యకి ఫోన్ చెయ్యలేదు వట్టిగనే బెదిరించాను.. ఇంకొకసారి ఆ కళ్యాణ్ తో కనిపిస్తే నిజంగానే చెప్తానని ధీరజ్ అంటాడు. అంటే వాడు కళ్యాణ్ గురించి ఇంట్లో వాళ్లకి చెప్పలేదా.. అంటే వీళ్ళే పెళ్లి చూపులు ఏర్పాటు చేసారా అని ప్రేమ అనుకుంటుంది. మరొకవైపు నర్మదని శోభనానికి రెడీ చేస్తారు. సాగర్ ని రెడీ చేస్తాడు తిరుపతి.  నర్మద అందంగా ఉందని వేదవతి మురిసిపోతుంది. ఆ తర్వాత నర్మదని గదిలోకి వెళ్లకుండా కామాక్షీ ఆపుతుంది. తరువాయి భాగంలో రెండు రోజుల్లో పెళ్లి చెయ్యాలి అమెరికాకి తీసుకొని వెళ్తామని పెళ్లి వాళ్ళు అంటున్నారని భద్రవతి ఇంట్లో వాళ్ళకి చెప్పాగానే.. చేద్దామని విశ్వ అంటాడు. దాంతో ప్రేమ కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : కోడలి చేత సంతకం పెట్టించలేకపోయిన సవతి తల్లి.. బాధలో కొడుకు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -291 లో.....రామలక్ష్మి పెట్టిన ట్విస్ట్ కి శ్రీలత వాళ్లకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎలాగైనా రామలక్ష్మితో ఆస్తులు అమ్ముకోవచ్చని సంతకం పెట్టించాలని రామలక్ష్మి దగ్గరికి ధనని పంపిస్తారు. ధన లోపలికి వెళ్లకుండా బయట నుండే రామలక్ష్మిని పిలుస్తుంటాడు. కాసేపటికి రామలక్ష్మి రాగా.. ధన పక్కకి తీసుకొని వెళ్లి దీనిపైన సంతకం పెట్టమని అంటాడు.. నేను పెట్టనని తన చెంప చెల్లుమనిపిస్తుంది రామలక్ష్మి. అది మాణిక్యం చూస్తాడు. ఆ తర్వాత ధన జరిగింది వెళ్లి బయటున్న సందీప్, శ్రీలతలకి చెప్తాడు. నువ్వు వెళ్ళు.. అమ్మలేదంటే మన పరిస్థితి తెలుసు కదా అని సందీప్ అంటాడు. ఆ తర్వాత ముగ్గురు మళ్ళీ రామలక్ష్మి దగ్గరికి వెళ్తారు. శ్రీలత మాట వినగానే మా అమ్మ వచ్చిందంటూ తినే ప్లేట్ లో వాటర్ పోసి వెళ్తాడు సీతాకాంత్.  ఇంత మోసం చేస్తారా ఆస్తులన్నీ రాసి అమ్ముకునే అవకాశం లేకుండా నీ భార్య వీలునామా రాసిందని శ్రీలత అనగానే.. నిజంగా నాకు తెలియదని సీతాకాంత్ అంటాడు. అసలేం జరుగుతుంది.. మీ అమ్మ నిజ స్వరూపం నీకు తెలియదు అల్లుడు అని మాణిక్యం అనగానే.. నా గురించి నేనే నీ అల్లుడుకి చెప్పానని అనగానే మాణిక్యం షాక్ అవుతాడు. ఆ తర్వాత ధన పైన సుజాత, మాణిక్యంలు తిడతారు. సంతకం పెట్టమని సీతాకాంత్ అనగా.. నేను పెట్టను మీరు వాళ్లు బాగుపడాలని నన్ను పెట్టమని అనకండి అని రామలక్ష్మి అంటుంది. దాంతో సీతాకాంత్ సైలెంట్ గా ఉంటాడు. మరొకవైపు శ్రీలత కోపంగా ఇంటికి వెళ్తుంది. ఏమైందంటూ శ్రీవల్లి అడుగగా సంతకం పెట్టలేదని చెప్తారు. నాకు అర్థమైంది.  తను ఛాలెంజ్ చేసి వెళ్ళినప్పుడే ఏదో ప్లాన్ చేసిందని అర్థమైందని శ్రీవల్లి అంటుంది. శ్రీలత కోపంగా సీతాకాంత్ ఫోటోని కింద పడేస్తుంది. మీ అక్క చేత సంతకం పెట్టించలేక పోయావని ధనతో శ్రీలత అనగానే‌.. మీరు నా కంటే పెద్ద వారు.. మీరే ఏం చెయ్యలేదని ధన అంటాడు. మరొకవైపు సీతాకాంత్ తన తల్లి చేసిన మోసాన్ని గుర్తుచేసుకుంటాడు‌ అప్పుడే రామలక్ష్మి వస్తుంది. అందరు నన్ను జాలిగా చూస్తుంటే భరించలేకపోతున్నానని రామలక్ష్మితో  సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : టిఫిన్ బండి పెడదామనుకుంటున్న దీప.. వద్దన్న కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -240 లో..... దీప వంటమనిషిగా జాయిన్ అయిన దగ్గరికి అప్పుడే సరుకులు తీసుకొని కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. కార్తీక్ సరకులు చెప్తుంటే.. దీప సరి చూసుకుంటుంది. అక్కడే ఉన్న ఇంటి యజమాని అక్కడ యాభై రూపాయలున్నాయ్ తీసుకొని వచ్చి.. ఆ అబ్బాయికి ఇవ్వమనగానే దీప తీసుకొని వచ్చి కార్తీక్ ఇస్తుంటే.. నాకు ఇచ్చే అలవాటు ఉంది కానీ తీసుకునే అలవాటు లేదని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. ఏదో గొప్పగా బతికినట్లు ఆ పొగరు ఎందుకని యజమాని అంటుంది. మరొకవైపు జ్యోత్స్న ఇంటికి వెళ్లి పారిజాతంతో బావకి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేసానని హ్యాపీగా ఫీల్ అవుతుంది.  ఇక బావ నా దగ్గరికి రావాలి వేరే ఆప్షన్ లేదని అనుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీపలు ఇంటికి ఒకేసారి వస్తారు. జాబ్ ఏమైందని కాంచన కార్తీక్ ని అడుగగా.. ఆ ఫోన్ చేసింది శ్రీధర్ అని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంట్లోకి వెళ్ళాక.. ఎందుకు మీరు అక్కడ సూపర్ మార్కెట్ లో జాయిన్ అయ్యారని దీప అడుగుతుంది. జాబ్ వచ్చేదాకా ఇంట్లో గడవాలి కదా అయిన నువ్వు ఎందుకు వంట మనిషిగా జాయిన్ అయ్యావని కార్తీక్ అడుగుతాడు. మరొకవైపు స్వప్న వాంథింగ్ చేసుకుంటుంది. ప్రెగ్నెంట్ ఏమో అనీ కాశీ హ్యాపీగా ఫీల్ అవుతాడు.  నువ్వు చేసిన వంటకి ఇలా అయిందని స్వప్న అంటుంది. అప్పుడే దాస్ వచ్చి దీప ఫోన్ చేసిందని వెళ్తున్నానని అంటాడు. ఆ తర్వాత స్వప్న, కాశీ, దాస్ లు కార్తీక్ ఇంటికి వెళ్తారు. మనం ఒక టిఫిన్ సెంటర్ పెడదామని దీప అనగానే.. నాకు ఇష్టం లేదు నేను వేరే ఆలోచిస్తున్నానని కార్తీక్ అంటాడు. నా దగ్గర పెట్టుబడికి ఉన్నాయ్ ఒక బండి చూడమని దాస్ కి చెప్తుంది దీప. టిఫిన్ సెంటర్ పేరు ఏంటని స్వప్న అనగానే దీప సర్ ప్రైజ్ అంటుంది. నేను కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను ఒప్పుకోండి అని కాంచనతో దీప అనగానే కాంచన ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఏదో దాస్తున్నారంటూ కూపీ లాగిన ఇందిరాదేవి.. కవర్ చేసిన రాజ్, కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi) సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -605 లో.... కావ్య పెత్తనం గురించి అడగండి అంటూ ప్రకాష్ ని హాల్లోకి తీసుకొని వస్తుంది ధాన్యలక్ష్మి. అన్నయ్య ఒక విషయం చెప్పాలి.. కావ్య వల్ల చాలా మంది బాధపడుతున్నారని రుద్రాణి, ధాన్యలక్ష్మి లు బయటపడుతున్నారు కానీ మిగతా వాళ్లు బయట పడట్లేదని ప్రకాష్ అంటాడు. ఏంటి నా కోడలిపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అని సుభాష్ అంటాడు.  అప్పుడే సుభాష్ కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. ఇంకా మీ నాన్న గారి హాస్పిటల్ బిల్ పే చేయలేదని చెప్తారు.దాంతో కావ్యని పిలుస్తాడు సుభాష్. ఏంటి అమ్మ హాస్పిటల్ బిల్ క్లియర్ చెయ్యలేదు అంట అని అడుగుతాడు. కావ్య టెన్షన్ పడుతుంది. అంటే మావయ్య గారి హాస్పిటల్ బిల్ కూడా అనవసరం అనుకున్నావా లేక అంత ఖరీదైన వైద్యం ఎందుకు అనుకున్నావా అని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి అందరు కావ్యని ఎందుకు తప్పు పడుతున్నారని అడుగుతాడు. దానికి నేను సమాధానం చెప్తాను. రాహుల్ సీఈఓ గా ఉన్నప్పుడు అన్ని మిస్టక్స్ ఉన్నాయ్. అందుకే ఆడిట్ చేపిస్తున్నాను.. అందుకే ట్రాన్సక్షన్స్ అన్ని ఆగిపోయాయని రాజ్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత నేను తాతయ్య బిల్ పే చేస్తానని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు.  ఆ తర్వాత ఇందిరాదేవి దగ్గరికి కావ్య వస్తుంది. ఏంటి అమ్మమ్మ నాపై కోపంగా ఉందా అని అడుగుతుంది. కోపం ఏమీ లేదు కానీ మన దగ్గర అయిదు లక్షలు కూడ లేవా.. మీరేదో దాస్తున్నారనిపిస్తుంది కంపెనీనీ కాపాడే క్రమంలో సతమతమవుతున్నారని, మాకు చెప్పలేకపోతున్నారనిపిస్తుందని ఇందిరాదేవి అనగానే.. అదేం లేదని కావ్య కవర్ చేస్తుంది. మరొకవైపు రాజ్ దగ్గరికి సుభాష్ వచ్చి.. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా ఎందుకు టెన్షన్ పడుతున్నావంటు అడుగగా.‌. అదేం లేదని రాజ్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేసావా.. కావ్య టెన్షన్ పడుతుంటే రాజ్ వచ్చి ఏదో కవర్ చేసాడు అనిపించిందని ధాన్యలక్ష్మితో రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో కావ్య ఇంట్లో ఉన్న కార్లన్నీ పంపిస్తుంది. అది చూసిన రుద్రాణి, రాహుల్ ఇంట్లో గొడవ చెయ్యాలనుకుంటారు. ఆ తర్వాత ఏం  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రెండు రూపాయల కోసం రిక్షా తొక్కిన సందర్భాలు ఉన్నాయి

  ఇస్మార్ట్ జోడి 3 ఈవారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇక ఈ వారం జోడీలను గ్రూప్స్ గా డివైడ్ చేశారు హోస్ట్ ఓంకార్. అనీల్ గీలా- ఆమని, రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత, అలీ రెజా - మాసుమా, ఆదిరెడ్డి - కవిత , లాస్య - మంజునాథ్ ని కలిపి టోటల్ ఫైవ్ జోడీస్ ని గ్రూప్ ఏలో పెట్టాడు. అనిల్ గీలా-ఆమని ఇద్దరూ ఈ స్టేజి మీద కన్నీళ్లు పెట్టేసుకున్నారు. "మా నాన్న ఊళ్ళో రిక్షా తొక్కుతూ ఉండేవాడు. రెండు రూపాయల కోసం నేను రిక్షా తొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా లైఫ్ లోకి ఆమని వచ్చాక మా ఊళ్ళో నా పేరు బాగా తెలిసింది. నా యూట్యూబ్ ఛానల్ కి వ్యూయర్ షిప్ కూడా బాగా పెరిగింది. నాకు ఆమని అంటే ఇష్టం. నేను ఎప్పుడైనా కష్టపడే పరిస్థితి స్ట్రెస్ తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు నాకు ధైర్యం చెప్తుంది. నాతో కలిసి పనిచేస్తూ నాకు తోడుగా ఉంటుంది. ఒక నైట్ మా జీవితం ఎటు పోతోంది అంటూ డిస్కషన్ కూడా జరిగింది" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వైఫ్ అండ్ హజ్బెండ్ ఇద్దరూ కూడా ఎమోషన్ ఇపోయారు. తర్వాత ఇద్దరూ కలిసి ఓంకార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఐతే హనీమూన్ కి ఎక్కడికి తీసుకెళ్లాలో అడుగు అని ఆమనిని అడిగేసరికి కాశ్మీర్ అని చెప్పింది. దాంతో ఇద్దరినీ కాశ్మీర్ వెళ్లాలని వెళ్లినట్టు ప్రూఫ్ కూడా చూపించాలని ఓంకార్ చెప్పాడు.   ఇక  అనీల్ గురించి చెప్పాలంటే  మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్‌లో ఎంటర్‌టైనింగ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇందులోనే గంగవ్వతో అనిల్  చాలా వీడియోలు చేశాడు. బిగ్‌బాస్ సీజన్ 7లో కూడా అవకాశం వచ్చినట్లే వచ్చి అనీల్ చేజారిపోయింది. ఈ విషయాన్ని  తన యూట్యూబ్ ఛానల్‌లో ఒకసారి చెప్పుకొచ్చాడు.    

లాస్య మంజునాథ్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా...

  ఇస్మార్ట్ జోడి 3 లో లాస్య మంజునాథ్ ఎపిసోడ్ నిజంగా కన్నీళ్లు తెప్పించింది. వాళ్ళు చాలా యంగ్ ఏజ్ లోనే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే దాని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈ షో స్టేజి మీద చెప్పింది లాస్య . "మంజునాథ్ నాకంటే ఒక ఏడాది చిన్నవాడు...నాకు ఆ విషయం అప్పటికి తెలీదు. మేము పరిచయం ఐన ఎనిమిది నెలల్లోనే పెళ్లి చేసేసుకున్నాం. ఈ విషయాన్ని మా పేరెంట్స్ కి చెప్పాం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎద్దుల్ని కొట్టే తాడుతో నన్ను మా నాన్న కొట్టారు. మంజునాథ్ మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దానికి మా నాన్న ఆయనకు భోజనం పెట్టి ఈ పెళ్లి జరగదు అని చెప్పి పంపేశారు. ఐతే నేను ఇంట్లోంచి పారిపోయాను తర్వాత ఇద్దరం పెళ్లి చేసేసుకున్నాం. ఆ టైంకి మా పేరెంట్స్ వచ్చి పెళ్లి ఆపడానికి వచ్చారు. కానీ అప్పటికే పెళ్లి  ఐపోయేసరికి ఏమీ అనలేక వెళ్లిపోయారు. మేము కడపలో పెళ్లి చేసుకుని ఆ రాత్రి  హైదరాబాద్ వచ్చాము. ఐతే ఒకరోజు కొంత మంది వచ్చి ఇంట్లో అంతా వెతికేస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలీదు, ఎం మాట్లాడ్డం లేదు, ఏమీ చెప్పడం లేదు, ఎం వెతుకుతున్నారా తెలీదు. వేరే బాషా ఏదో మాట్లాడుతున్నారు. వెంటనే మంజునాథ్ కి ఫోన్ చేస్తే వచ్చాడు. తీరా వచ్చింది మంజునాథ్ ఇంటికి సంబంధించిన వాళ్ళు మా పెళ్లి సర్టిఫికెట్ కోసం వెతుకుతున్నారు. సడెన్ గా మమ్మల్ని ఆటో ఎక్కించేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నన్ను కాసేపు బయట నిలబెట్టేసారు. వాళ్ళ అమ్మ వచ్చి నా కొడుకును వదిలేయ్ అంటూ చెప్పారు. అప్పటి వరకు నాకు మంజునాథ్ మరాఠీ అనే విషయం నాకు తెలీదు. ఆరోజు నా మనసు ముక్కలైపోయింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే నా భర్త తక్కువైపోతాడని ఫీలయ్యా " అంటూ బాధపడింది లాస్య. ఐతే మంజునాథ్ కూడా మాట్లాడుతూ "లాస్య తన జీతంతోనే నన్ను బతికించింది. ఎందుకంటే నాకు రెండేళ్లు జాబ్ అనేది లేదు." అని చెప్పాడు.  

Prerana Biggboss: అలా అనేవాళ్ళకి బుద్ధి లేదు.. నేను ఎక్కడి నుండి వస్తే ఏంటి

  బిగ్ బాస్ సీజన్-8 లో టాప్-5 కంటెస్టెంట్స్ లో ప్రేరణ కంబం ఒకరు. పెళ్ళి చేసుకొని ఆర్నెళ్ళ తర్వాత హౌస్ లోకి వచ్చిన మొదటి లేడి కంటెస్టెంట్ ప్రేరణ కంబం‌. హౌస్ లో తన మాటతీరుతో,  ఆటతీరుతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక టాప్-5 కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది ప్రేరణ.  ఇక తాజాగా ప్రేరణ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ నిజాలు చెప్పింది‌. కే బ్యాచ్ టీ బ్యాచ్ అని పెట్టారు. నేను కే బ్యాచ్ కాదు.. నేను తమిళ అమ్మాయిని. కన్నడలో పెరిగాను.. కన్నడలో పని చేశాను. అందుకని నన్ను కూడా కే బ్యాచ్‌లో కలిపేశారు. నేను తెలుగు పనిచేస్తున్నా.. అలాగని టీ బ్యాచ్‌లో కలిపేయలేరుగా. కన్నడలో పనిచేశానంతే. అలాగని కన్నడదాన్ని అయిపోను. నేను తమిళ్ అమ్మాయిని. అలా చూస్తే నేను కే బ్యాచ్ కాదు టీ బ్యాచ్ కాదు వేరే టీ బ్యాచ్ అవుతాను. మూడో బ్యాచ్‌లో ఉన్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఈ కే బ్యాచ్.. టీ బ్యాచ్ గురించి తెలిసినప్పుడు చాలా కోపం వచ్చింది. ఎవరు స్టార్ట్ చేశారో కానీ బుద్దిలేదు వాళ్లకి.. ఎందుకంటే షోలోకి వెళ్లింది తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి. మేమ్ తెలుగు సీరియల్స్ చేస్తున్నది తెలుగు వాళ్ల కోసం. నేను హైదరాబాద్‌లోనే పెరిగాను. పెళ్ళైన తర్వాత కూడా మళ్లీ హైదరాబాద్‌కి వచ్చేశాను. గట్టిగా మాట్లాడితే నేను తెలుగు అమ్మాయిలాగే ఫీల్ అవుతా. షోలో కూడా మేమ్ ఎక్కడ నుంచి వచ్చిన కూడా తెలుగులోనే మాట్లాడేవాళ్లం. హౌస్‌లో మమ్మల్ని మీరు అక్కడ నుంచి వచ్చారు.. ఇక్కడ నుంచి వచ్చారనే భేదం చూపించలేదు. మాకు టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు. మేము ఎంటర్ టైన్ చేశాం. నేను తెలుగులోనే కదా మాట్లాడుతున్నా. నేను తెలుగు షోలో ఉన్నప్పుడు నేను ఎక్కడ నుంచి వస్తే ఏంటి? తెలుగు వాళ్లనే కదా ఎంటర్‌టైన్ చేస్తున్నా. నేను కష్టపడి తెలుగు వాళ్లనే కదా ఎంటర్‌టైన్ చేస్తున్నది. కష్టపడి తెలుగు భాష నేర్చుకున్నది మాకోసం కాదు.. మీకోసం.. తెలుగు వాళ్లని ఎంటర్‌టైన్ చేయడం కోసమే కాబట్టి మమ్మల్ని వేరు చేసి చూడొద్దు. బ్యాచ్‌లు అని పేరు చెప్పి.. విడగొట్టొద్దు. భాష గొడవలు ఎందుకు వస్తున్నాయ్.. అంతా కలిసి ఉందాం. నేను ఇంట్లో కన్నడ మాట్లాడితే మీకెందుకు. మీ తెలుగులోనే మాట్లాడుతున్నా కదా. ఇలాంటి రియాలిటీ షోలో ఇలాంటివి ఎందుకు తీసుకుని వస్తున్నారంటూ ప్రేరణ చెప్పుకొచ్చింది.

అన్నా పెళ్లి చూపులకు వెళ్తున్నావా...నెక్స్ట్ జనరేషన్ హీరో ఆదినే...

  హైపర్ ఆది అంటే చాలు కామెడీ షోస్ గుర్తు వస్తాయి. అటు జబర్దస్త్ షోస్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, మరో వైపు ఢీ జోడి ఏదీ వదలకుండా అన్ని షోస్ లో కనిపిస్తూనే ఉంటాడు. ఐతే హైపర్ ఆది ఫోటో షూట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి హైపర్ ఆది రీసెంట్ గా కొన్ని ఫొటోస్ ని పోస్ట్ చేసాడు. అది కూడా ఒక కార్ ఎదురుగా నిలబడి మరీ నవ్వుతూ ఉన్న పిక్స్ అవి.  ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆదికి బేసిక్ గా బాగా పొట్ట ఉంటుంది. ఏ డ్రెస్ వేసినా కూడా పొట్ట బయటకు కనిపించేస్తూ ఉంటుంది. ఈ ఫోటో షూట్ లో కూడా పొట్ట బాగా కనిపించేస్తోంది. దాంతో నెటిజన్స్ వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. " హీరో పోలికలు వచ్చేసాయి వెయిట్  చేయడమే...నెక్స్ట్ నువ్వే అనే హీరో...పొట్ట ఉండే వారికీ మీరే అన్న అవుట్ ఫిట్ కి మోడల్...అన్నా జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేసి బొజ్జ తగ్గించవచ్చు కదా .. అన్నా న్యూ లుక్ బాగుంది. అన్న కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారా..హాయ్ అన్నా పెళ్లి చూపులకు వెళ్తున్నారా ... అన్నా పెళ్ళెప్పుడు...అందరికి వయసు పెరుగుతుంది నీకేమో వయసు తగ్గుతుంది...అన్నా కొంచెం ఫ్యాట్ గా ఉన్నా కూడా జబర్దస్త్ గా ఉన్నావు. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హైపర్ ఆది జబర్దస్త్ తో కెరీర్ ప్రారంభించి అటు సినిమాల్లో, ఈవెంట్ లలో అలరిస్తూ బిజీ ఐపోయాడు. తనదైన కామెడీ పంచులతో.. టైమింగ్ తో జనాలను ఆకట్టుకుంటున్నాడు.  

కార్తీకదీపం ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ సీన్ మళ్ళీ రిపీట్!

  స్టార్ మా సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కి ఉండే క్రేజే వేరు. ఎంత అభిమానిస్తారో తెలిసిందే. అయితే సెకెండ్ పార్ట్ లో దీప వేరే అతడిని పెళ్ళి చేసుకొని శౌర్యని కనడం.. కార్తీక దీపం ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. కొంతకాలం దీపకి తన మాజీ భర్తతో గొడవలు చూపించి ఆ తర్వాత విడాకులు చేపించాడు దర్శకుడు. ఇక రీసెంట్ గా దీప, కార్తీక్ లు పెళ్ళి చేసుకున్నారు. అయితే అప్పటి నుండే వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో వంట చేసే దీపని పెళ్ళి చేసుకుంటావా అంటూ శివన్నారాయణ‌ అందరిని బయటకి గెంటేశాడు. ఇక దీప, కార్తీక్ లని టార్గెట్ చేస్తూ జ్యోత్స్న పగ సాధిస్తుంది.  కార్తీక్ ని శివన్నారాయణ‌ జాబ్ లో నుండి తీసేయడంతో ఫ్యామిలీని మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. దాంతో కార్తీక్ చాలా చోట్ల జాబ్ కి ప్రయత్నించగా జ్యోత్స్న చెడగొడుతుంది. తాజా ఎపిసోడ్ లో మన కార్తీక్ బాబు తండ్రి దగ్గర ఇరవై నాలుగు గంటల్లో జాబ్ తెచ్చుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. ఆ జాబ్ తెచ్చుకుంటాడు. ఇంతకీ అదేం జాబ్ అంటే.. సూపర్ మార్కెట్‌లో బాయ్ జాబు అన్న మాట. అందుకే భార్య దగ్గర తల దించుకుని నడుచుకుంటూ ఉంటాడు. మొత్తానికి కార్తీక్ పనికి జాయిన్ ఇంట్లోనే దీప కూడా పనిలో చేరడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. వారిద్దరికి ఇది పెద్ద కష్టమే. ఇక ఆ ఇంటి ఓనర్ అమ్మ మాత్రం దిట్టంగా కాలు మీద కాలేసుకుని.. ఫోన్ చూసుకుంటూ.. మెడలో బంగారు గొలుసులు దిగేసుకుని ఉంది. మన దీపను వంట మనిషిగా.. కార్తీక్ బాబుని ఒక సూపర్ మార్కెట్ బాయ్‌గా చూడటం నిజంగా అంటే నిజంగా బాధకరం. ఇది కార్తీకదీపం ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అని మాట. గతంలో కార్తీకదీపం వన్‌లో కూడా ఇలాంటి ఓ సీన్ ఉంటుంది. అప్పుడు కూడా ఇలానే ఎదురుపడతారు ఈ మొగుడు పెళ్లాలు. మొత్తానికీ సీన్ రిపీట్ అన్న మాట. ముందుముందు మన కార్తీక్, దీపలకి ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయో చూడాలి మరి.

హీరోయిన్ కావడం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు

  నటి ఆమని గురించి పెద్దగా చెప్పక్కరలేదు. తెలుగులో శుభలగ్నం, శుభసంకల్పం, మిస్టర్ పెళ్లాం, ఘరానా బుల్లోడు, అమ్మదొంగా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పుకొచ్చారు. "కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు సావిత్రి గారి టైం నుంచి ఉంది. ఐతే అప్పట్లో సోషల్ మీడియా అనేదే లేదు కాబట్టి ఎవరికీ తెలీదు.  ఇండస్ట్రీలో హీరోస్ కి కాదు హీరోయిన్స్ కి ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. ప్రతీ హీరోయిన్ వెనక వాళ్ళ కష్టం, వాళ్ళ కథ ఉంటుంది. ఏ ప్రొఫెషన్ లో ఐనా కానీ మంచి, చెడు ఉంటాయి. తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెట్టే కంపెనీస్ లో పెద్దగా సమస్యలు  ఉండవు.. కానీ చిన్న చిన్న కంపెనీలు వస్తాయి. హీరోయిన్ ఛాన్సెస్ ఇస్తామంటారు. మనం మన అమ్మనో, అన్ననో, తమ్ముడినో తీసుకెళ్తాం. వాళ్ళ ముందే టు పీసెస్ వేయాలంటారు. కాళ్ళ మీద స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి ఒకసారి డ్రెస్ తీసి చూపించండి అని వాళ్ళ ముందే అడుగుతూ ఉంటారు. అలా ఎలా చూపిస్తాం. పెద్ద కంపెనీకి వెళ్ళా నేను ఆడిషన్ కోసం..అక్కడ వాళ్ళు  డాన్స్ చేసి, యాక్టింగ్ చేసి చూపించమని అడిగారు . అది సినిమాకు సంబంధించి డైలాగ్ ఎలా చెప్తారు అని అడిగారు  తప్ప వేరే ఏమీ అడగరు. అప్పుడు మనకు కంపెనీని బట్టి ఎవరు మంచిగా ఉంటున్నారో ఎవరు చెడుగా ప్రవర్తిస్తున్నారో తెలిసిపోతుంది. నేను స్విమ్ సూట్ షూటింగ్ టైంలో వేసుకుంటా కానీ ఇంతమంది ముందు బట్టలు విప్పి చూపించను , కుదరదు అని లేచి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమా ట్రయల్స్ చేస్తున్న టైంలో హీరోయిన్ గా పెట్టి  అడ్వాన్స్ చెక్ ఇచ్చి రెండో రోజు మేనేజర్ ఇంటికి వచ్చి ఫైనాన్సియర్ వచ్చారు మీ అమ్మగారితో కాకుండా మిమ్మల్నే  రమ్మంటున్నారు అని చెప్పినప్పుడు నాకు విషయం అర్ధమయ్యింది. దాంతో రాను అని చెప్పేసాను. హీరోయిన్ కావడం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదని తెలుసుకున్నా" అంటూ చెప్పారు ఆమని.

సోనియా సింగ్ : లిఫ్ట్ దగ్గర సిద్ధుని లాగిపెట్టి కొట్టా

  బుల్లితెర మీద సోనియా సింగ్, పవన్ సిద్దు జోడి ఏ షో ఐనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ పక్కా అందిస్తూ ఉంటారు. వీళ్ళు కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తారు అలాగే షార్ట్ ఫిలిమ్స్ , మూవీస్ , బుల్లితెర షోస్ లో కనిపిస్తూ ఉంటారు. సోనియా సింగ్ కి విరూపాక్ష మూవీతో మంచి పేరు రాగా పవన్ సిద్దుకి అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సెకండ్ సిరీస్ తో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఢీ జోడి షోకి వస్తున్నారు. అలాంటి వీళ్ళతో జరిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ ని చెప్పారు. "ముందు పవన్ సిద్ధునే ప్రొపోజ్ చేసాడు. నా లైఫ్ లోకి సిద్దు  రావడం బిగ్ సర్ప్రైజ్.. నా లైఫ్ లో సెలబ్రిటీ క్రష్ ముందు కానీ ఇప్పుడు కానీ ఎవరూ లేరు. సిద్దు ఒక్కడే నా క్రష్. నాకు సిద్దు అంటేనే ఇష్టం. అతనిలో నచ్చని క్వాలిటీ ఏదీ లేదు. హీరో హీరోయిన్స్ గా ఏదైనా మూవీని రిక్రియేట్ చేయాల్సి వస్తే సౌందర్య గారు నటించిన పవిత్ర బంధం మూవీ చేస్తా. మేము గొడవపడినప్పుడు నేనే గెలుస్తా. బ్రేకప్ అని నా పార్టనర్ చెప్తే గనక  నెక్స్ట్ సెకండ్ చంపేస్తాను. ఒకసారి నా మూవీ షూటింగ్ నైట్ 2 కి పూర్తయ్యింది. అప్పుడు లిఫ్ట్ దగ్గర నిలబడ్డాను. అక్కడ ఉన్న సిద్దు నన్ను ఒక్కసారిగా దెయ్యంలా చూసాడు. అతనిలోకి ఏదో శక్తి వచ్చేసిందని భయపడి లాగిపెట్టి చెంప పగలగొట్టా . అది కూడా విరూపాక్ష రిలీజయిన కొత్తలో. అలా కొట్టేసరికి సిద్దు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత అనిపించింది ఇప్పుడు నన్ను తిడతాడా ఏంటా అని. కానీ ఏమీ అనలేదు. ఇక  సెలెబ్రిటీ కపుల్ తో మమ్మల్ని పోల్చుకోవాల్సి వస్తే సూర్య అండ్ జ్యోతిక గారిలా ఉండాలని అనుకుంటా." అంటూ సోనియా సింగ్ చెప్పుకొచ్చింది. తర్వాత పవన్ సిద్దు తన అభిప్రాయాలను చెప్పాడు. "మాది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అలా రిలేషన్  లవ్ లోకి వెళ్ళిపోయింది. ఇద్దరం కలిసి చూసిన ఫస్ట్ ఫిలిం జెర్సీ..సోనియానే ఎక్కువగా సర్ప్రైజ్ లు ఇస్తుంది. నా సెలబ్రిటీ క్రష్ తమన్నా. సోనియానే కుకింగ్ బాగా చేస్తుంది. నాకు కోపం ఎక్కువ. బాగా అరుస్తా ఉంటా. అన్ని అర్ధం చేసుకుని భరిస్తుంది. హీరో హీరోయిన్స్ గా ఏదైనా మూవీని రిక్రియేట్ చేయాల్సి వస్తే బిజినెస్ మ్యాన్ మూవీని చేస్తా. నేను ఏడుస్తూ ఉంటా బాధొచ్చినప్పుడు. మగాళ్లు ఏడుస్తారని బయటకు చెప్పరు కానీ నేను ఏడుస్తాను. సోనియా నీకు చంపేంత ప్రేమ ఉంటే నాకు చచ్చిపోయేంత ప్రేమ ఉంది. ఇక సెలెబ్రిటీ కపుల్ తో మమ్మల్ని పోల్చుకోవాల్సి వస్తే రీతేష్ దేశ్ ముఖ్ - జెనీలియాలా ఉండాలనుకుంటా" అని చెప్పాడు.

Ilu illalu pillalu : కొత్తజంటకి శోభనం ఏర్పాట్లు.. ప్రేమని కాపాడిన ధీరజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -40 లో.......నర్మద స్నానం చేసి తల తుడ్చుకుంటుంటే అప్పుడే సాగర్ వచ్చి నర్మద వంక రొమాంటిక్ గా చూస్తూ తనని పట్టుకుంటాడు. వదలండి లేదంటే గట్టిగ అరుస్తానని నర్మద అంటుంది. అరువు అని సాగర్ అనగానే నిజంగానే నర్మద గట్టిగా అరుస్తుంది. దాంతో ఏమైందంటూ వేదవతి ఇంకా కామాక్షి వస్తారు. ఏమైందని అనగానే బల్లి పడింది అందుకే అరిచానని నర్మద అంటుంది. అదంతా గమనించిన కామాక్షి నాకు అంతా అర్థం అయింది కానీ శోభనం జరగకుండా ఇద్దరు ఒకే గదిలో వద్దని సాగర్ తో కామాక్షి చెప్తుంది. అది విన్న వేదవతి అప్పుడే రామరాజు దగ్గరికి వెళ్లి పెళ్లి అయిన జంటకి కొన్ని తంతులు ఉంటాయి. అవి పట్టించుకోకుంటే ఎలా అని వేదవతి అంటుంది. ఏంటని రామరాజు అడుగగా నడిపోడికి శోభనమని వేదవతి చెప్తుంది. వాళ్లకు సంబంధించినవి నువ్వే చూసుకోమన్నాను అలాంటప్పుడు నన్ను అడగడం ఎందుకని రామరాజు చెప్పి వెళ్ళిపోతాడు. ఒప్పుకున్నారు కానీ అలా ఎందుకు ఉన్నారని వేదవతి అనుకుంటుంది. మరొకవైపు ప్రేమ కోసం కళ్యాణ్ వెయిట్ చేస్తుంటాడు. తన కోసం టీ ఆర్డర్ చేసి అందులో మత్తు కలుపుతాడు. అప్పుడే ప్రేమ వచ్చి అది తాగబోతుంటే ధీరజ్ వచ్చి ఆపుతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. వీడితో తిరగొద్దని ధీరజ్ అనగానే.. నువ్వు ఎవడివిరా అంటు ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తుంది ప్రేమ. నువ్వు నా మరదలివి నిన్ను కాపాడే బాధ్యత నాకుందని ధీరజ్ అంటాడు. అయినా ప్రేమ వినదు. దాంతో ధీరజ్ ప్రేమ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ప్రేమకి వాళ్ళ నాన్న ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మంటాడు. ఆ తర్వాత ప్రేమ ఇంటికి వెళ్తుంది. అందరు తన గురించి వెయిట్ చేస్తుంటే.. ఇంట్లో అందరికి చెప్పేసి ఉంటాడని ప్రేమ భయపడుతుంది. నేనొక నిర్ణయం తీసుకున్నాను.. నీకు పెళ్లి చూపులని భద్రవతి అనగానే ప్రేమ షాక్ అవుతుంది. తరువాయి భాగంలో సాగర్, నర్మదలకి శోభనం ఏర్పాట్లు చేస్తుంది వేదవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2 : ఓకే దగ్గర పనికి చేరిన కార్తీక్, దీప.. శ్రీధర్ తో ఛాలెంజ్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -239 లో.....కార్తీక్ జాబ్ కోసం వెళ్తాడు బస్టాప్ లో వెయిట్ చేస్తుంటే.. జ్యోత్స్న చూస్తుంది. అక్కడికి వెళ్ళేలోపు కార్తీక్ ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ కి ఇంటర్వ్యూకి వెళ్తాడు కార్తీక్. ఇక్కడ సీఈఓ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసిందని అంటాడు. మీరు జాబ్ కి రావడం ఏంటి? అయిన జాబ్ ఖాళీగా లేదని అంటాడు. ఆ తర్వాత చైర్మన్ కి ఫోన్ చేసి ఉందని అనగానే.. కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఫామ్ ఫీల్ చేస్తుంటాడు. అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి వద్దని చెప్పడంతో సారీ సర్ జాబ్ కి వేరే వాళ్లు సెలెక్ట్ అయ్యారట అని అంటాడు. దాంతో కార్తీక్ డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతాడు. అందురు నో అని చెప్తారు. మరొకవైపు శౌర్యకి కాంచన భోజనం తినిపిస్తుంది. మనం మన ఇంటికి ఎప్పుడు వెళ్తామని శౌర్య అనగానే.. కొన్ని రోజులు అవుతుందని దీప అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు ఏదో జరిగుతుంది జాబ్ వస్తుందనుకున్న కానీ ఇలా జరిగిందంటూ కార్తీక్ నిరాశగా మాట్లాడతాడు. ఆ తర్వాత కార్తీక్ టీ తాగుతుంటే.. ఎవరో ఫోన్ చేసి మీకు ఇప్పుడు జాబ్ కావాలి కదా అడ్రెస్ పంపిస్తున్నాను రమ్మని చెప్తారు. ఎవరో మీ గురించి తెలిసినా వాళ్లే వెళ్ళండి అని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్ వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ శ్రీధర్ ఉంటాడు. నీకు జాబ్ కావాలి.. నేను ఇస్తానంటాడు. వద్దని కార్తీక్ తిరిగి వస్తుంటే.. నీకు జాబ్ రాదు దమ్ముంటే ఇరవై నాలుగు గంటల్లో జాబ్ తెచ్చుకోమని శ్రీధర్ అనగానే కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత దీప ఒక దగ్గరికి వంట మనిషిగా వెళ్తుంది. అక్కడికి సరుకులు తీసుకొని కార్తీక్ వస్తాడు. అతన్ని చూసి దీప షాక్ అవుతుంది. సరకులన్నీ కరెక్టే ఉన్నాయా చూడమని దీపతో ఆ ఓనర్ అంటుంది. కార్తీక్ చెప్తుంటే.. దీప చూస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : బిజినెస్ గురించి సీతాకాంత్ ఆలోచన.. అప్పులిచ్చిన వాళ్లు శ్రీలతకి వార్నింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -290 లో....ఇక ఇంటికి నేనే మహారాణి అని శ్రీవల్లి ఒంటి నిండా నగలు వేసుకొని దర్జాగా పై నుండి వస్తుంటుంది. కళ్లజోడు పెట్టుకొని ఉంటుంది. దాంతో స్లిప్ అయి కింద పడిపోతుంది. ఇంకా నయం ఎవరు చూడలేదు కదా అనుకుంటుంది శ్రీవల్లి. తనని చూసిన శ్రీలత.. ఏంటి ఈ అవతారమని అడుగుతుంది. ఇప్పుడు ఈ ఇంటికి మహారాణిని అంటూ బిల్డింగ్ ఇస్తుంటుంది శ్రీవల్లి. ఆ తర్వాత అప్పుడే ఇంటికి కొంతమంది వస్తారు. వాళ్లు సందీప్ కి అప్పు ఇచ్చిన వాళ్లు.. మా డబ్బు మాకు కావాలని వాళ్లు అడుగగా.. ప్రస్తుతం మా దగ్గర డబ్బు లేదు. ఒక ల్యాండ్ ఉంది.. అది అమ్మి ఇస్తాం. మీకు ఎవరైనా ఉంటే ఉంటే చెప్పండి అని వాళ్లకు ఆస్తి పేపర్స్ చూపిస్తుంది శ్రీలత. మరొకవైపు సీతాకాంత్ స్నానం కోసం వేడినీళ్లు పెడుతాడు మాణిక్యం. పింకీ జుట్టు వేసుకుంటూ బావ ఒక మంచి మాట చెప్పండి అనగానే.. బిజినెస్ కి సంబంధించి చెప్తాడు. నాకు ఎందుకు బిజినెస్ ది చెప్పారని పింకీ అంటుంది. ఆ తర్వాత పింకీకి ఓ మంచి మాట చెప్తుంది రామలక్ష్మి. మీరు స్నానం చేసి రండి అని రామలక్ష్మి వాళ్లు వెళ్ళిపోతారు. అప్పుడే సీతాకాంత్ కి మేనేజర్ ఫోన్ చేసి.. పెద్దాయన కండిషన్ గురించి చెప్తాడు. సీతాకాంత్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటే.. ఏం ఆలోచించకని రామలక్ష్మి చెప్తుంది. నేను మళ్ళీ అంత సంపాదించి నిన్ను మహారాణిని చేస్తానని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. మరొకవైపు శ్రీలత దగ్గరికి సందీప్ కి అప్పు ఇచ్చిన వాళ్లు వస్తారు. ఈ ల్యాండ్ మీరు అనుభవించడానికే కానీ అమ్ముకోవడని రామలక్ష్మి సంతకం కావాలట.. మాకు అయితే మా డబ్బు కావాలంటూ వాళ్లు శ్రీలత వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత మాణిక్యంతో కలిసి సీతాకాంత్ కింద కూర్చొని భోజనం చేస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి అంటు ధన పిలుస్తుంటాడు. బయట కార్ లోనే సందీప్, శ్రీలత వాళ్ళుంటారు. ధన ఎలాగైనా పని చేసుకొని వస్తాడని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏంటి బయట ఉన్నావ్.. రా లోపలికి అని సుజాత అనగానే.. రామనే బయటకు రమ్మని చెప్పమని ధన అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : అక్కని మరోసారి అవమానించిన చెల్లి.. ఆమె మాటతో ప్రకాష్ నిలదీస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -604 లో.... నన్ను ఆపే అధికారం మీ అత్తగారికి లేదు.. మా అత్త గారికి లేదని ధాన్యలక్ష్మికి మాస్ వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇక రాజ్ అయితే నా భార్య చేసేది కరెక్ట్ దాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. ఏం చేసినా ఈ ఇంటి కోసం చేస్తుంది.. ఎక్కువ మాట్లాడితే మీ అందరిని ఉద్యోగం చేసుకొని బతకమంటుంది.. అంతవరకు తెచ్చుకోకండి అని అందరికి చెప్తాడు. ఆ తర్వాత కావ్యని గదిలోకి తీసుకొని వెళ్తాడు రాజ్. అది చూసి సుభాష్, అపర్ణ, ఇందిరాదేవి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు కావ్య అందరి ముందు తిట్టిందని స్వప్న బాధపడుతుంటే.. రాహుల్, రుద్రాణిలు వచ్చి ఇంకా కావ్య గురించి నెగెటివ్ గా మాట్లాడతారు. ఇప్పటికైనా నీ చెల్లి నిజస్వరూపం తెలిసిందా ఇప్పటికైనా మాతో ఉండు.. ఫ్యామిలీ అంటే మేమే.. మనం కలిసి ఆస్తులు సొంతం చేసుకుందామని రుద్రాణి అనగానే.. నా చెల్లి నన్ను తిట్టింది మీకేంటి అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది స్వప్న. ఆ తర్వాత కావ్య దగ్గరికి స్వప్న వచ్చి.. నేను నీ అక్కనేనా అందరి ముందు నన్ను అలా అవమానించావని అడుగుతుంది. నన్ను ఈ కుటుంబంలో మెంబర్ కాదన్నట్లు మాట్లాడావని అంటుంది. అది కాదు అక్క నేను డబ్బు మొత్తం పుట్టింటికి చేరవేస్తున్నానని అంటున్నారంటూ కావ్య అంటుంది. నువ్వు ఆస్తులు చేతికి వచ్చాక నీలో మార్పు వచ్చిందని స్వప్న అనగానే కావ్య కోప్పడుతుంది. దాంతో స్వప్న బాధపడుతూ వెళ్ళిపోతుంది. మరొకవైపు ఇంత జరిగినా ఏం అడగలేదని ప్రకాష్ తో ధాన్యలక్ష్మి అంటుంది. సరే అడుగుతానులే అని ప్రకాష్ అంటాడు. ఆ తర్వాత నువ్వు అందరి ముందు స్వప్నని తిట్టకుండా ఉండాల్సిందని కావ్యతో రాజ్ అంటాడు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పేనని కావ్య అంటుంది. మరుసటి రోజు ఉదయం ఇప్పుడు హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలని రాజ్ అంటాడు. స్వప్న అక్క నగలు ఇచ్చింది కదా అవి అమ్మి డబ్బు తీసుకుందామని కావ్య అనగానే వద్దని రాజ్ అంటాడు. ఆ తర్వాత మీ వాళ్లని అడుగుతానన్నారు కదా పదండి అడగండి అంటూ ప్రకాష్ ని తీసుకుని వస్తుంది ధాన్యలక్ష్మి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పెళ్లి ఎప్పుడైంది సత్య ..? హీరోయిన్ గా ఎప్పుడు చేస్తున్నారు ?

  జబర్దస్త్ షో ద్వారా ఒక రేంజ్ లో  పాపులారిటీని పెంచుకున్న సత్యశ్రీ గురించి అందరికీ తెలుసు.  కొన్ని మూవీస్ లో కూడా నటించింది. జబర్దస్త్ ని తన ఇంటి పేరుగా మార్చేసుకుంది  సత్యశ్రీ. అలాంటి సత్యశ్రీ రీసెంట్ గా తన  ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక రీల్ ని పోస్ట్ చేసింది. "గోదారి గట్టు మీద" అనే ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ చేస్తూ ఉన్న వీడియో అది. ఐతే ఆ వీడియోలో ఆమె తన నుదిటిన కుంకుమ దిద్దుకుని కనిపించింది. ఇక నెటిజన్స్ ఐతే సత్యశ్రీ  పెళ్లి పై ఆరా తీయడం మొదలు పెట్టారు. సత్యా పెళ్లెప్పుడయ్యింది ? పెళ్లి చేసుకోను అని చెప్పారు కదా చాలా ఇంటర్వ్యూస్ లో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐతే సత్యశ్రీ గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా పెళ్లి గురించి తన అభిప్రాయం చెప్పింది. పెళ్లి చేసుకుని భర్త షరతులు విధిస్తే ఇబ్బందిపడాలని తనను ఎవరైనా రూల్ చేస్తే తనకు నచ్చడంతో చెప్పుకొచ్చింది. తనకు మ్యారేజ్ ప్రపోజల్స్ ఎన్నో వచ్చాయని వాటిని ఆపుతూ వచ్చానని కూడా చెప్పింది. ఐతే ఒక వ్యక్తి పెళ్లిచూపులకు వచ్చి షూటింగ్స్ లొ పాల్గొనకూడదు అని చెప్పేసరికి తనకు బాగా కోపం వచ్చిందని వాళ్ళ మీద సీరియస్ అయ్యాయని కూడా చెప్పింది. అలాంటి సత్యశ్రీ నిజంగానే ఇప్పుడు పెళ్లి చేసుకుండా అనే డౌట్ ఈ రీల్ చూసేసరికి అందరిలోనూ వచ్చింది అలాగే ఈ రీల్ లో ఆమె ఒక హీరోయిన్ లా ఉందని చెప్తూ "హీరోయిన్ గా ఎప్పుడు చేస్తున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ ని మీకు ఇవ్వాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి సత్యశ్రీ రీసెంట్ గా లాస్ట్ మంత్ లో ఇంటి గృహప్రవేశం కూడా చేసుకుంది. ‘జబర్దస్త్’లో చమ్మక్ చంద్ర టీమ్‌లో లేడీ కామెడియన్‌గా జాయిన్ ఐన సత్యశ్రీ బులెట్ భాస్కర్ స్కిట్స్ లో కనిపిస్తోంది.  

మాకు అమ్మాయి పుట్టిందోచ్..కూతురే పుట్టాలని దేవుడిని కోరుకున్నా

  యాదమ్మ రాజు-స్టెల్లా.. వీళ్ళ గురించి చెప్పాలంటే తక్కువే కానీ జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ లో యాదమ్మ రాజుకు మంచి పేరు వచ్చింది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఒక డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసారు. ఐతే రీసెంట్ గా స్టెల్లా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తమకు  పుట్టింది పాప, బాబా అని చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు దానికి క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఐతే తమకు పాప పుట్టిందంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎలాగైనా అమ్మాయే పుట్టాలని ఆ ఏసయ్యను ప్రార్ధించాను అని చెప్పింది స్టెల్లా. తన బంగారు తల్లి చూడడానికి చాలా క్యూట్ గా ఉందని చెప్పింది. మొదటి నుంచి పాప పుట్టాలని అనుకున్నాం ఒకవేళ బాబు గనక పుట్టి ఉంటే అప్సెట్ అయ్యేవాళ్ళం అన్నాడు యాదమ్మ రాజు. కూతురే  ఎందుకు పుట్టాలి అని  అనుకున్నామంటే కూతురు ఒక్కటే తల్లిని చివరికి వరకు చూస్తుంది అని..అలాగే ..ఒంట్లో కాస్త నలతగా ఉన్నా కూడా ఆమె సేవ చేస్తుంది, కొడుకు అంత బాగా చూసుకోలేడు అని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయినా తల్లిని గురించి తలుచుకునేది కూతురే అంటూ చెప్పింది. ఇప్పుడు తన కూతురికి మంచి పేరు పెట్టాలని అనుకుంటున్నామని..ఎవరైనా సరే ఏ లెటర్ తో ఐనా కానీ  మంచి పేరు చెప్పాలంటూ కూడా ఫాన్స్ ని కోరింది. దేవుడి దయ వలన అనుకున్నది సాధించా అని అంది . ఈరోజున కొడుకైన, కూతురైన ఒక్కటే..కానీ చిన్నవయసులో బిడ్డ పుట్టేయడంతో ఒక బాధ్యత వచ్చేసింది, ఐతే  అమ్మ పాపను చూసుకుంటూ ఉంటే తాను ఫీడింగ్ ఇస్తున్నట్లు చెప్పింది స్టెల్లా. ఐతే యాదమ్మ రాజు సుమారు ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా పండంటి పాప కూడా వచ్చేసిందంటూ చాలా సంతోషంగా చెప్పారు.  

మా ఛానెల్ హాక్ ఐనప్పుడు కాలినడకన వస్తామని వెంకన్నని మొక్కుకున్నాం

ఏక్ నాథ్- హారిక వీరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళు కొంతకాలం క్రితం వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఐతే ఈటీవీ ప్లస్ లో వచ్చిన నేను శైలజ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నరు ఏకనాథ్, హారిక. ఏక్ నాథ్ ది విజయవాడ కాగా హారికది కాకినాడ. "నేను శైలజ" సీరియల్ తరువాత ఇద్దరూ పెళ్లి   చేసేసుకున్నారు. ఇద్దరికీ ఈ  సీరీయల్ సమయంలోనే పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్ళికి ముందు వాళ్ళ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా  ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇక యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యారు. అలా యూట్యూబ్ లో సక్సెస్ అయ్యారు. ఎంతో కస్టపడి యూట్యూబ్ ని డెవలప్ చేసుకున్నారు. ఐతే రీసెంట్ గా వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా తిరుపతి వెళ్లారు. అక్కడ దైవ సన్నిధిలో కొంచెం ప్రశాంతమైన ప్రాంతంలో కూర్చుని ఒక విషయాన్ని తన ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. అది వాళ్ళ యూట్యూబ్ కి గోల్డెన్ బటన్ వచ్చింది అని చెప్పారు. "మా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యింది ఒక టైములో. ఆ టైంలో ఛానెల్ మళ్ళీ తిరిగి వస్తే తిరుమలకు నడిచి వస్తాం అని మొక్కుకున్నాను. ఫైనల్ గా ఈ గోల్డ్ బటన్ ని సాధించాం. ఛానెల్ ని స్టార్ట్ చేసే ముందు ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారా ఇంకా ఎక్కువ వస్తారా అనుకున్నాం కానీ ఇప్పుడు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసింది మా ఛానెల్. బయటకు వెళ్తే మమ్మల్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారానే గుర్తు పడుతున్నారు. సీరియల్స్ చేసినా రానంత గుర్తింపు యూట్యూబ్ ద్వారా వచ్చింది. అందరికీ థ్యాంక్యూ. " అని చెప్పారు.  

కళింగపట్నం రెస్టారెంట్ తో మీ సయ్యద్ సోహైల్...ఆరు నెలల్లో పెళ్లి ఫిక్స్

  బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పడి లేచిన కెరటం అంటూ అతని అభిమానులు అంటూ ఉంటారు. ఇక  సోహెల్ కెరీర్ విషయానికొస్తే వరుణ్ సందేశ్ ఫస్ట్ మూవీ ‘కొత్తబంగారు లోకం’ తో సయ్యద్ సోహెల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో సోహైల్ పెద్దగా కనిపించడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ తదితర సినిమాల్లో సైడ్ ఆర్టిస్టుగా నటించాడు. సోషల్ మీడియాలో బాగా క్రేజ్ రావడంతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలలో హీరోగా నటించాడు సోహైల్. కథలపరంగా సినిమాల సెలెక్షన్స్ బాగున్నా ఆ మూవీస్  కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో ఒకానొక టైమ్ లో తన సినిమాను చూడమని వేడుకుంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు సొహైల్. అలాంటి సోహెల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఎన్నో వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా ఫుడ్ బిజినెస్ లోకి దిగాడు సయ్యద్ సోహెల్. మణికొండలో "కళింగపట్నం" పేరుతో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసాడు. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కి పాత , కొత్త బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. అందులో  పల్లవి ప్రశాంత్, గౌతమ్, అఖిల్ సార్థక్, టేస్టీ తేజ, ఆకాష్ పూరి, వరుణ్ సందేష్ , రాహుల్ సిప్లిగంజ్, శుభశ్రీ, మణికంఠ, విజె సున్ని, రాజు జయమోహన్, సౌమ్య జానూ, అలీ వైఫ్ జుబేదా సుల్తానా, మెహబూబ్ వంటి వాళ్లంతా వచ్చి విష్ చేశారు. అలాగే సోహెల్ వాళ్ళ నాన్న కూడా తన బిడ్డ ఇంతలా ఎదగడం  ఎంతో సంతోషముగా ఉందని చెప్పారు. అలాగే మరో ఆరు నెలల్లో సోహెల్ పెళ్లి చేయబోతున్న అని చెప్పాడు. పెద్దలు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని సోహెల్ చెప్పాడంటూ ఆయన తండ్రి చెప్పుకొచ్చాడు.