ఢీ జోడి సీజన్ లో డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అదుర్స్...

  ఢీ జోడి షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షో సంథింగ్ డిఫెరెంట్ గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు షోస్ అన్నీ మూసగా, ఒకటే రకం డాన్స్ లు ఒకటే రకం ఎక్స్ప్రెషన్స్  ఏదో డాన్స్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టుగా సాగిపోయాయి. కానీ ఈ సీజన్ మాత్రం కొత్త కంటెస్టెంట్స్ అందరూ సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావడం కొత్తగా పెర్ఫార్మ్ చేయడం..ఏ వారానికి ఆ వారం ఫైనల్ ఎపిసోడ్ అన్నట్టుగా డాన్స్ చేసి ఆడియన్స్ మనసులను గెలుచుకుంటున్నారు. ఇక ఈ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే గనక ఒక్కో జోడి ఒక్కో రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి వావ్ అనిపించుకున్నాయి. ఈ ఢీ జోడిలో సూర్యతేజ - హంస డాన్స్ చూస్తే ఎవ్వరైనా ఫ్లాట్ ఐపోవాల్సిందే. కొత్త కొత్త స్టెప్స్ తో అందరినీ అట్ట్రాక్ట్ చేసేలా పెర్ఫార్మ్ చేయడంతో అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇక గణేష్ మాష్టర్ కి ఈ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చేసింది. ఒకవేళ ఇది సెమి ఫైనల్ అయ్యుంటే ఈ జోడి ఫైనల్ కి వెళ్ళేవాళ్ళు. అదే ఫైనల్ ఐతే వీళ్ళే గెలిచేవాళ్ళు అని చెప్పేసారు. ఇక ఈ జోడి ఫైనల్ గా కేక్ తెచ్చి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసారు. ఢీ షో మళ్ళీ వచ్చింది. డాన్స్ వావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ సూపర్ గా ఉండబోతోంది అంటున్నారు. పార్టీ థీమ్ కాన్సెప్ట్ తో జోడీస్ అన్ని డాన్స్ చేశాయి. అనీష్ - ఆప్తి, చందన్ - తులసి, బబ్లు - అద్విత ఈ జోడీస్ అన్నీ కూడా వేటికవే పోటీ పడుతున్నాయి.  

క్రౌడ్ ఫండింగ్ అన్న చేసి ఒక మంచి మూవీ తీస్తా..బిగ్ బాస్ కంటెస్టెంట్

  బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో రీతిన ఉన్నారు. అందులో నిఖిల్, పృద్వి ఒక లెక్క ఉంటె, గౌతమ్ ఇంకో లెక్క..ఇక నబీల్ ఐతే మరో లెక్క. సైలెంట్ గా ఉంటాడు. ఎక్కువతక్కువ మాట్లాడడు. కానీ చేయాలనుకున్నది చేస్తాడు. అలాంటి నబీల్ తన యూట్యూబ్ లో తన ఫస్ట్ ఇంటర్వ్యూని పోస్ట్ చేసాడు. "బిగ్ బాస్ 5 చూసాక నాకు బిగ్ బాస్ కి వెళ్లాలని అనిపించింది. బిగ్ బాస్ 7 కి ఇంటర్వ్యూ ప్రాసెస్ మొదలయ్యింది. ఆ ఇంటర్వ్యూస్ లో మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. సోషల్ మీడియాలో మనం బాగా ఫేమస్ అవ్వాలి. మన ప్రొఫైల్ బిగ్ బాస్ వాళ్ళ దగ్గరకు వెళ్తే అది కూడా వాళ్లకు నచ్చితే పిలుస్తారు. బిగ్ బాస్ కి వెళ్ళడానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అంటే ప్రతీ ఒక్కరికీ తెలుస్తాం. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు. బిగ్ బాస్ బయాస్డ్ కూడా కాదు. మొదటి టు వీక్స్ బాగా అబ్జర్వ్ చేసి తర్వాత గేమ్ ఆడడం స్టార్ట్ చేశా. హౌస్ లో ఎవరైనా బాధపడుతూ ఉంటే అందరినీ మోటివేట్  చేస్తూ ఉన్నాను. మానికంతా, నిఖిల్, పృద్వి వంటి వాళ్లకు ధైర్యం చెప్పా. మొబైల్ లేకుండా ఇన్ని రోజులు ఉండడం నిజంగా గ్రేట్. మొబైల్ లేకుండా కూడా ఉండగలను అని అనిపించింది. బిగ్ బాస్ కి ఒక్కరమే వెళ్తాం ఒక్కరమే వస్తాం. ఇక ఈ ఎమోషనల్ బాండింగ్ వంటివి పెట్టుకోకూడదు అనుకుని వెళ్ళాం.. నేను ఫేస్బుక్ లో 4 వ తరగతిలోనే ఓపెన్ చేశా..నేను హౌస్ నుంచి బయటకు వచ్చాక కమ్యూనిటీ మ్యాటర్ గురించి తెలిసింది. నా ఫ్రెండ్స్ లిస్ట్ లో హిందూస్, క్రిస్టియన్స్, సిక్స్ అందరూ ఉన్నారు. నేను వెళ్లి వాళ్ల ఇంట్లో పడుకుంటా.. వాళ్లు వచ్చి నా ఇంట్లో పడుకుంటారు. నాకు నా రిలేటివ్స్ కంటే నా ఫ్రెండ్స్ ముఖ్యం. మా పెద్దన్న పెళ్లిలో నా దోస్త్‌లే ఎక్కువ ఉన్నారు.  మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా వాళ్ళే పనులు చక్కబెడతారు . ఈ కమ్యునిటీ ఫీలింగ్‌‌ని నేను పట్టించుకోను. నేను అందరితో కలిసి ఎలా ఉంటానో నాతో ఉండే దోస్త్‌లను అడిగితే చెప్తారు.  మెహబూబ్ నాకు చెప్తున్నప్పుడు జస్ట్ నేను విన్నానంతే.  అసలు రియాక్ట్ కాలేదు.  వరంగల్ డైరీస్ ని కంటిన్యూ చేస్తాను. మూవీ ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అవి కూడా నటిస్తాను. ఐదేళ్ల తర్వాత గట్టిగ సంపాదిస్తే నేనొక సినిమా తీస్తా లేదంటే క్రౌడ్ ఫండింగ్ అన్నా చేసి మూవీ తీస్తా. ముందుగా తెలుగు ప్రజల కోసం తెలుగు కంటెంట్ చేస్తా అలాగే హిందీ వీడియోస్ చేస్తా.తెలుగు, హిందీ ఆడియన్స్ నా రెండు కళ్ళ లెక్క. అందరినీ ప్రేమిస్తాను. " అని చెప్పాడు నబీల్.

Brahmamudi : చెల్లెలు మీద కోపంతో నగలు వద్దన్న అక్క.. ఇంటి పెత్తనం మొత్తం కావ్యకే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -603 లో.... కావ్య, రాజ్ ఇద్దరు మిగతా పది లక్షలు ఏం అయ్యాయని ఆలోచిస్తారు. మరొకవైపు ఆకలిగా ఉందని రుద్రాణి, ధాన్యలక్ష్మిలు పనిమనిషి దగ్గరికి వెళ్తారు. అయ్యో అన్నం వద్దన్నారు.. వేస్ట్ అవుతుందని ముష్టి వాళ్ళకి వేసానని పనిమనిషి అనగానే.. మాకు ఆకలిగా ఉంది మళ్ళీ వంట చేయమని రుద్రాణి అనగానే.. కావ్య మేడమ్ ని అడగాలని పనిమనిషి అనగానే వాళ్ళకి కోపం వస్తుంది. అప్పుడే స్వప్న వస్తుంది. ఒకసారి నన్ను చూడండి. నా నెక్లెస్ ఎలా ఉందని అడుగుతుంది. పది లక్షలని స్వప్న అనగానే.. అంత డబ్బు నీకు ఎక్కడిదని రుద్రాణి అనగానే.. మా చెల్లి కావ్య ఇచ్చిందని అంటుంది. మాకు ఇలా చేస్తుంది నీకు ఏకంగా అంత డబ్బు ఇచ్చిందా అని రుద్రాణి, ధాన్యలక్ష్మిలు అంటారు. వెంటనే కోపంగా అపర్ణ, సుభాష్ ల దగ్గరికి వెళ్లి.. మా కార్డ్స్ బ్లాక్ చేశారు కానీ స్వప్నకి పది లక్షలు ఇచ్చిందని చెప్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. ఆ తర్వాత కావ్య ఎప్పుడు అలా చెయ్యద్దని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత కావ్య, రాజ్ లు వస్తారు. వచ్చావా మా కార్డ్స్ ఎందుకు బ్లాక్ చేసావని అడుగుతారు. అనవసరం ఖర్చు చేస్తారనని కావ్య అనగానే.. అయితే మీ అక్కకి నగలు కొనియొచ్చా అని ధాన్యలక్ష్మి అనగానే.. ఏం అంటున్నారని స్వప్నని పిలుస్తుంది కావ్య. ఆ నగలకి డబ్బు ఎక్కడివి అనగానే.. నువ్వే ఇచ్చావ్ కదా అంటుంది. నేను నగలు కొనుక్కోమ్మని ఇచ్చానా అని కావ్య అంటుంది.  ఏం నాటకం ఆడుతున్నారని రుద్రాణి అంటుంది. నా భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దు ఇంట్లో అవసరం అయితే ఈ చెక్ వాడు అని స్వప్నకి కావ్య చెక్ ఇవ్వడం నేను చూసానని రాజ్ అంటాడు. నీకు నేనేం అని చెప్పి ఇచ్చానని స్వప్నని కావ్య అడుగుతుంది. ఇంట్లో అవసరం అయితే ఇవ్వమన్నావ్ కానీ ఎవరు అడగలేదు. అందుకే వాడుకున్నానని స్వప్న అనగానే.. నీకు ఇలా అనవసరం ఖర్చు చెయ్యమనే హక్కు ఎవరు ఇచ్చారని స్వప్న పైన కావ్య కోప్పడుతుంటే.. నీ నగలు ఏం వద్దు .. ఇంత అవమానిస్తావా అంటూ స్వప్న నగలు తీసి ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరు నేను చెప్పిందే వినాలని కావ్య అంటుంది. తరువాయి భాగంలో సీతారామయ్య హాస్పిటల్ బిల్ కట్టలేదని సుభాష్ కి ఫోన్ చెయ్యడంతో.. కావ్యని పిలిచి ఎందుకు కట్టలేదని అడుగుతాడు. మావయ్య గారి బిల్ కూడా అనవసరం అనిపించిందా అని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు ఏమో జరుగుతుంది. వీళ్ళు చెప్పడం లేదని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : రామారాజుని ఒప్పించిన కొత్త కోడలు.. ప్రసాదం వాళ్ళు తిన్నారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -39 లో......ప్రసాదరావు ఇచ్చిన కంప్లైంట్ తో రామరాజుని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులు వస్తారు. నేను మేజర్ ని నా పెళ్లి నా ఇష్టప్రకారం జరిగిందంటూ రామరాజుకి సపోర్ట్ గా నర్మద మాట్లాడుతుంది. అయినా సరే ప్రసాదరావు కోపంగా మాట్లాడుతుంటే.. నేనే మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ప్రసాదరావుతో నర్మద అనగానే అతను షాక్ అవుతాడు. ఇదేంటీ మీ ఫ్యామిలీ గొడవలకి మమ్మల్ని లాగుతున్నారంటూ పోలీసులు అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాడి కోసం నన్నే ఎదురిస్తావా అనుకుంటూ.. నాకు కూతురు లేదని ప్రసాదరావు నీళ్లు వదిలేస్తాడు. దాంతో నర్మద ఏడుస్తుంది. ఆ తర్వాత ఆ రామరాజు గాడు అరెస్ట్ అవుతాడనుకున్న కానీ మిస్ అయ్యాడునని భద్రవతి డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత నర్మద బాధపడుతుంటే ధీరజ్ వచ్చి దైర్యం చెప్తాడు. నీకు అమ్మనాన్నలాగా చూసుకునే అత్త మామ ఉన్నారంటూ చెప్తాడు. ఆ తర్వాత రామరాజు దగ్గరికి నర్మద వెళ్లి.. మా నాన్న తరుపున నేను సారీ చెప్తున్నాను.. పూజ జరిపించండి అని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో పదా వెళ్లి పూజ చేద్దామని వేదవతితో రామరాజు అంటాడు. పూజ పూర్తి అవుతుంది. సాగర్  నర్మద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇద్దరు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని పంతులు చెప్తాడు. నా భార్య ఒకతే ఆశీర్వాదిస్తుందని  రామరాజు మొదట చెప్పినా.. ఆ తర్వాత ఇద్దరు సాగర్, నర్మదలని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత తిరుపతికి నర్మద ప్రసాదం ఇస్తుంది. ఇది ఎదురింట్ల వారికి ఇవ్వండి అని నర్మద అనగానే.. వద్దని అతను అంటాడు. సరే నేను వెళ్తానని నర్మద అనగానే.. వద్దు నేను వెళ్తానని తిరుపతి ప్రసాదం తీసుకుని భద్రవతి ఇంటికి వెళ్తాడు. ఈ ప్రసాదం ఎందుకు తెచ్చావని భద్రవతి కోప్పడుతుంది. ప్రసాదం వద్దంటే కళ్ళు పోతాయంటూ సేనాపతి భార్య అనగానే.. అందరు ప్రసాదం తీసుకుంటారు. ఎప్పుడు లేనిది ఎదరింట్లో నుండి తెచ్చిన ప్రసాదం తీసుకున్నారని తిరుపతి ఆశ్చర్యపడతాడు. తరువాయి భాగంలో ప్రేమ, కళ్యాణ్ లు టీ తాగుతుంటే ధీరజ్ వెళ్లి ప్రేమని టీ తాగకుండా ఆపుతాడు. ఆ తర్వాత ఇద్దరు గొడవపడి ప్రేమ చెంప చెల్లుమనిపిస్తాడు ధీరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..  

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మిలు ఒక నాటకం.. సంబరపడ్డ అత్త,‌ మామ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. (Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -289 లో..... శ్రీలతతో ఛాలెంజ్ చేస్తుంది రామలక్ష్మి. నువ్వు ఎప్పటికైన మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని అంటుంది. మీరే నా దగ్గరికి వస్తారని శ్రీలత అంటుంది . ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి నేను మర్చిపోయింది బ్యాగ్ లోనే ఉందని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు బయలుదేర్తారు. చీకటి అవుతుంది నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళు.. నేను రెండు రోజుల్లో వస్తానని సీతాకాంత్ అంటాడు. మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే.. నేను అక్కడికి వెళ్లి హ్యాపీగా ఉండాలా నేను వెళ్ళను.. మీరు రండి లేదంటే నేను వెళ్ళనంటుంది.  నా వల్ల రామలక్ష్మి ఇబ్బంది పడడం ఎందుకని.. పదా వస్తానని సీతాకాంత్ అనడంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు సిరి దగ్గరికి ధన వచ్చి.. నేను ఏది కావాలని చెయ్యలేదు.. పరిస్థితి అలా చేయించింది. నేను వాళ్లు చెప్పినట్లు వినకపోతే మనల్ని కూడా అలాగే చేసేవాళ్ళు.. అందుకే వినాల్సి వచ్చిందని ధన అనగానే.. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళదామని సిరి అంటుంది. మీ అన్నయ్య నువ్వు కష్టపడితే చూడలేడని సిరిని కూల్ చేస్తాడు ధన. ఆస్తులన్నీ నీ పేరున ఉన్నాయ్.. కాబట్టి నీతో ఇలా ఉంటున్నాను. ఎలాగైనా ఆస్తులు నా పేరున రాయించుకోవాలని ధన కన్నింగ్ గా ఆలోచిస్తాడు.  మరొకవైపు సీతాకాంత్, రామలక్ష్మి లు ఇద్దరు మాణిక్యం ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసి మాణిక్యం సుజాతలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి అల్లుడు గారు అలా ఉన్నారని మాణిక్యం రామలక్ష్మిని అడుగుతాడు. ఏం లేదంటూ రామలక్ష్మి జరిగింది చెప్పదు. ఆ తర్వాత అల్లుడు గారు ఏం తినలేదని సుజాత అనగానే.. పింకీ, రామలక్ష్మిలు ఒక నాటకం ఆడి ఎలాగైనా సీతాకాంత్ భోజనం చేసేలా చేస్తారు. సీతాకాంత్ రామలక్ష్మిలని చూసి మాణిక్యం, సుజాతలు మురిసిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.      

Karthika Deepam2 : ఇల్లు తాకట్టు పెట్టాలని చూస్తున్న అనసూయ.. దీప చీపురకట్టతో సమాధానం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -238 లో......శౌర్య కొన్ని రోజులు లగ్జరీకి అలవాటు అవడం వల్ల.. ఆ చిన్న ఇంట్లో ఉండలేక పదే పదే ఇక్కడ నచ్చడం లేదని అంటుంది. భోజనం కింద కూర్చొని తినాలా అంటుంది. ఎందుకు అలా అంటున్నావ్.. సుమిత్ర గారి అవుట్ హౌస్ లో  ఉన్నప్పుడు కింద కూర్చొని తిన్నాము.. మన ఊళ్ళో కూడ కింద కూర్చొని తిన్నాము.. అంటూ శౌర్య పైన కోప్పడుతుంది దీప. ఆ తర్వాత శౌర్యకి కార్తీక్ నచ్చజెప్పి భోజనం తినిపిస్తాడు. మరుసటిరోజు ఉదయం కాంచన దగ్గరికి అనసూయ వచ్చి.. నేను ఊరు వెళ్తున్నాను.. ఊళ్ళో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి వస్తాను. ఇక్కడ డబ్బు అవసరం కదా అని అనసూయ అనగానే.. వద్దని కాంచన అంటుంది. అయిన వెళ్తానని అనసూయ చెప్తుంది. ఇలా మీకు లేకున్నా సాయపడాలన్న గొప్ప గుణం ఉందని కాంచన అనగానే.. గొప్పవాళ్లతో ఉంటున్నా కదా అని అనసూయ అంటుంది. ఈ విషయం దీపకి చెప్పకండి అని చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ రెడీ అవుతూ దీపని అద్దం పట్టుకోమని చెప్తాడు. కార్తీక్, దీప ఇద్దరు ప్రేమగా చూసుకుంటారు. ఆ తర్వాత అమ్మ నేను జాబ్ చూసుకోవడానికి వెళ్తున్నానని కార్తీక్ అంటాడు. అనసూయ గారు ఎక్కడ.. తనకి కూడా ఒక మాట చెప్పి వెళ్తానని కార్తీక్ అనగానే.. తను ఊరు వెళ్ళింది పని మీద అని కాంచన అంటుంది. నాకు చెప్పకుండా వెళ్ళిందని దీప అంటుంది. నువ్వు కార్తీక్ కి ఎదరురా దీప అని కాంచన అంటుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఇక ఎప్పటిలాగే ఏదో ఒకటి గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తుంది. తనకి కౌంటర్ ఇచ్చి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇక కాంచన కూడా చిరాకుపడుతూ వెళ్లిపోయే అంటుంది. ఆ తర్వాత దీప కూడా వెళ్ళిపో అంటూ డోర్ వెయ్యబోతుంటే.. దీపని తిడుతుంది జ్యోత్స్న. నేను తల్చుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావని జ్యోత్స్న అనగానే.. నువ్వు తలుచుకోమని దీప చీపురు కట్ట తీసుకొని రాగానే.. జ్యోత్స్న భయపడుతూ మాములుగా మాట్లాడాతున్న కదా అంటూ కవర్ చేస్తూ వెళ్ళిపోతుంది. దీని సంగతి తర్వాత.. బావ ఎక్కడికి వెళ్ళాడోనని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Vishnupriya Biggboss: హర్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను 

  బిగ్ బాస్ సీజన్-8 లో విష్ణుప్రియ ఆటతీరు, మాటతీరుతో ఎంతోమందికి సుపరిచితమైంది. బిగ్ బాస్ కి వెళ్ళకముందే యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ.. అడపాదడపా సినిమాలు, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ లలో చేసింది. అయితే తనకు ఫుల్ లెంత్ నటించే ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు తనకి నెగెటివ్ పబ్లిసిటి వచ్చింది. దానికి కారణం పృథ్వీ ఎందుకంటే ఎక్కువ సమయం పృథ్వీతో గడపడం, తనకి కాఫీ చేసి ఇవ్వడం.. ఆ కప్పు తీసుకెళ్లి కడగడం.. అతడికి షూస్ తొడగడం.. ఇంకా ఓ వీకెండ్ ఎపిసోడ్ లో‌ లైవ్ లో పృథ్వీకి ముద్దుపెట్టడం.. ఇలా ప్రతీ దగ్గర విష్ణుప్రియకి మైనస్ అయ్యింది. అయితే హౌస్ నుండి బయటకి వచ్చిన విష్ణుప్రియ నిన్న క్రిస్మస్ రోజున పృథ్వీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ యష్మీతో పాటు దిగిన ఫోటోలని పృథ్వీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. విష్ణుప్రియ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ అప్లోడ్ చేసింది. అందులో బిగ్ బాస్ హౌస్ లో తనెందుకు అలా ఉందో చెప్పుకొచ్చింది. నలభై అయిదు నిమిషాలతో ఉన్న ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. ఇందులో తనేం చెప్పిందంటే.. గత రెండేళ్లుగా దైవచింతనలో ఉన్నాను. నాకు కోపం ఎక్కువ.. ఇగో ఎక్కువ.. వాటిని నేను ఎంత వరకూ కంట్రోల్ చేసుకోగలుగుతున్నానో తెలుసుకోవాలనిపించింది. నాకు సీజన్ 3 నుంచి బిగ్ బాస్ ఆఫర్ వస్తూనే ఉంది. ఈసారి మా గురువు గారు బిగ్ బాస్‌కి వెళ్లమని చెప్పారు. ఆయన చెప్పారనే వెళ్లాను. నేను చేసిన ప్రాక్టీస్ అంతా ఎంత వరకూ అప్లై చేయగలుగుతున్నాను. ఎంత వరకూ నన్ను నేను మార్చుకున్నానో తెలుసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ మంచి అవకాశం అనిపించింది. అందుకే వెళ్లాను.. కానీ వెళ్లిన తరువాత వేరే విధంగా అయ్యింది. నేను లోపల ఉన్నప్పుడు.. నా గురించి చేస్తున్న కామెంట్స్ విని.. వీళ్లకి నా పర్సనాలిటీ గురించి తెలియడం లేదా? బయటకు ఎలా వెళ్తుందో అన్న భయం ఉండేది. బయటకు వచ్చిన తరువాత.. నేను మంచి పేరుతోనే వచ్చాను అని అనిపించింది. కొన్ని సందర్భాల్లో నేను కంట్రోల్ తప్పాను. ఎమోషనల్‌గా నేను వీక్ కావడం వల్ల జెన్యూన్‌గా అక్కడ సపోర్ట్ చేసేవాళ్లు ఉండరు. అదో ఎడారి లాంటిది. నాకు బిగ్ బాస్ హౌస్‌లో పీరియడ్స్ వచ్చినప్పుడు.. పీరియడ్స్ రావడానికి ఐదురోజుల ముందు హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ జరిగాయి. కానీ నా గ్రౌండ్, నా కంపోజర్, నా ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలనుకున్నదే నా మెయిన్ అజెండా. దానికే ప్రయత్నించానంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.  

అయ్యో బిగ్ బాస్ బ్యూటీకి ఎంత కష్టమొచ్చిందో...కాలుకు కట్టుతో

  బిగ్ బాస్ షోతో పాపులర్ ఐన దివి గురించి అందరికీ తెలుసు. ఈమె బిగ్ బాస్ బ్యూటీ మాత్రమే కాదు ఎన్నో మూవీస్ లో కూడా నటించింది. రుద్రాంగి, రీసెంట్ గా వచ్చిన హరికథ, సింబా  లాంటి ఎన్నో మంచి మూవీస్ లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ లో అలాగే హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పొచ్చు. అలాంటి దివి తన ఇన్స్టాగ్రామ్ లో లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్స్ చూసి అందరూ షాకవుతున్నారు. తన కాలుకు కట్టుకుని కనిపించింది. అలాగే ఒక పోస్ట్ కూడా పెట్టింది. "కొన్నిసార్లు జీవితం మన మీదకు రకరకాల సమస్యలను బంతుల్లా విసురుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ సమస్యకు మనం కుంగిపోయి కాలు విరగ్గొట్టుకుంటే మాత్రం దానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కట్టు కూడా కడుతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐనా లైఫ్ లో అలాంటి ఎంటర్టైన్మెంట్ ని ఎందుకు ఆపాలి  మనం ? అందుకే వాటిని అస్సలు పట్టించుకోకుండా ఆ సమస్యలకు కట్టు కట్టిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నే నా కాన్వాస్ గా మార్చుకున్నా.. మంచిగా బొమ్మలు గీస్తున్నా. ఈ చిన్న ఆక్సిడెంట్ ని కొంత క్రియేటివ్ గా కొంచెం మెమొరబుల్ గా మార్చుకుంటున్న. జీవితం అంటే సవాళ్లను తప్పించుకోవడం కాదు. గందరగోళంలో కూడా  నవ్వడం అనేది నేర్చుకోవాలి. కష్ట సమయాల్లో జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడంలో ప్రత్యేకత ఉంటుంది. వెళ్లే దారిలో ఎన్నో సమస్యలు వస్తాయి... చూసుకుని వెళ్ళాలి అంటూ నేర్పించే పాఠాలు ఎన్నో మనకు తెలుస్తూ ఉంటాయి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ! ప్రతిదానిలో ఆనందాన్ని వెతుక్కుందాం. చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిద్దాం. ఈ సీజన్‌ను ఎప్పటిలాగే ఉత్సాహంగా మరియు మరపురానిదిగా చేద్దాం.." అంటూ ఒక భారీ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. క్రిస్మస్ రోజున తన లెగ్ ఇంజ్యూరి అయ్యిందని చెప్పుకొచ్చింది. కాలికి వేసిన సిమెంట్ కట్టు మీద రకరకాల పిచ్చి రాతలు, పెయింటిగ్ వేస్తూ ఎంజాయ్ చేసింది. ఇక దివి పిక్స్ చూసాక నెటిజన్స్ "గెట్ వెల్ సూన్ , అసలు ఏమయ్యింది, స్పీడీ రికవరీ" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

స్కూల్ లో ఉన్నప్పటినుంచే ఫస్ట్ నైట్ కోసం ఎదురుచూస్తున్నా

  ఇష్మార్ట్ జోడి 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో వెడ్డింగ్ థీమ్ ఇచ్చాడు హోస్ట్ ఓంకార్. ఐతే కంటెస్టెంట్స్ అంతా కూడా పెళ్లి దుస్తుల్లో అచ్చమైన పెళ్ళికొడుకు పెళ్లి కూతుళ్లలా వచ్చారు. ఇందులో అలీ రెజా, మాసుమా చానా అందంగా మురిసిపోయారు. ఇక ఓంకార్ అలీ రెజాని ఒక వెరైటీ ప్రశ్న అడిగాడు . "ఫస్ట్ నైట్ కోసం ఈ ఏజ్ నుంచి ఎదురు చూస్తున్నావు" అని. దానికి "స్కూల్ ఏజ్ నుంచే" ఆన్సర్ చెప్పాడు అలీ రెజా. "ఫస్ట్ నైట్ రోజు ఎనర్జీ కోసం ఏదైనా స్పెషల్ ఫుడ్ తిన్నారా" అని అడిగాడు. "ఎనర్జీ డ్రింక్స్ కంపెనీ ఉంటది కదా సర్. అది మా దగ్గర నుంచే వెళ్తుంది" అన్నాడు అలీ రెజా. దానికి వెంటనే మాసుమా " స్ట్రాంగ్ మ్యాన్ అన్నా" అంటూ తన భర్త గురించి గొప్పగా చెప్పుకుంది. తర్వాత అలీ రెజా పేరెంట్స్ వచ్చారు.. వాళ్ళ నాన్నను పరిచయం చేసాడు అలీ. "నా వయసు 69 . కానీ ఇప్పటికీ స్ట్రాంగ్" అన్నాడు. దానికి ఆటగాడే అన్నారంతా. సీరియల్ నటుడుగా మెప్పించిన అలీ రెజా బిగ్ బాస్ సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అలరించాడు. ఒకానొక టైంలో అలీ రెజా విన్నర్ రేస్‌లోకి వచ్చాడు. కానీ అనూహ్యంగా ఎలిమినేట్ ఐపోయాడు. ఆ తరువాత వైల్డ్ కార్డ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ.. విన్నర్ రేస్‌లో కి రాలేకపోయాడు.  అలాంటి అలీ రెజా ఇప్పుడు ఇష్మార్ట్ జోడి 3 లో అలరించడానికి వచ్చాడు.

త్రినయని సీరియల్ కి శుభం కార్డ్ పడనుందా.. ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!

  జీతెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ లో త్రినయని టాప్-5 లో ఉంది. అయితే ఈ సీరియల్ త్వరలో ముగుస్తుందనే వార్తలొస్తున్నాయి. జీతెలుగులో అత్యధిక రేటింగ్ వచ్చే సీరియల్స్‌లో త్రినయని ఒకటి. ఈ సీరియల్ ప్రారంభం నుంచి కూడా మంచి టీఆర్పీ రేటింగ్‌ను సాధిస్తోంది. గత వారం ఈ సీరియల్‌‌కి 6.62 రేటింగ్ వచ్చింది. పడమటి సంధ్యారాగం సీరియల్‌ 8.49 రేటింగ్‌తో టాప్‌లో ఉంటే.. మేఘ సందేశం 7.98 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. నిండునూరేళ్ల సావాసం 7.87 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంటే.. జగద్ధాత్రి 7.02 రేటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక త్రినయని 6.62 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచింది.  త్రినయని సీరియల్ లో అషిక పదుకొనే (Ashika Padukone) త్రినయని పాత్రలో నటిస్తుండగా.. చందు బి గౌడ (Chandu B Gowda) విశాల్‌గా త్రినయని భార్తగా చేస్తున్నారు. చైత్రా హలికేరి.. తిలోత్తమగా కీలకపాత్రలో కనిపించింది. ఈ సీరియల్ ప్రారంభం నుంచి త్రినయని పాత్ర ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ సీరియల్ గత నాలుగేళ్ళుగా జీ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతోంది. అయితే తాజాగా ఈ సీరియల్ టైమ్ మారుతోందంటూ అప్డేట్ వచ్చేసింది. సోమవారం నుంచి శనివారం వరకూ రాత్రి 8.30 గంటలకు ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ని.. కొత్త ఏడాది జనవరి 01 నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు మార్చేశారు. జనవరి 1 నుంచి జీ తెలుగులో రాత్రి 8.30 గంటలకు ‘చామంతి’ (Chamanthi Serial Zee Telugu) అనే కొత్త సీరియల్ ప్రసారం కానుంది. దాంతో త్రినయని సీరియల్ మధ్యాహ్నం 2.30 గంటలకు మారింది. అయితే మధ్యాహ్నం 2.30 గంటలకు జీ తెలుగులో జానకి రామయ్య గారి మనవరాలు (Janaki Ramayya Gari Manavaralu Serial) ప్రసారం అవుతోంది. మరి ఆ సీరియల్‌ని మరో స్లాట్‌కి మారుస్తారా? లేదంటే సీరియల్‌ని ముగించేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జీతెలుగులో‌ అత్యధిక టీఆర్పీ పొంతున్న ఈ సీరియల్ టైమింగ్ చేంజ్ చేయడంపై అభిమానులు తీవ్రంగా నిరాశని వ్యక్తం చేస్తున్నారు.  

పిచ్చి అభిమానంతో ప్రాణాలు పోగొట్టుకోవద్దు

  ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ సందీప్ అప్పుడప్పుడు కొన్ని మోటివేషనల్ వీడియోస్ కూడా  చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియో చేసింది. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. ఒక ఫ్యాన్ ప్రాణమే పోయింది. అలాంటి ఫ్యాన్స్ కి జ్యోతి రాజ్ ఒక వార్నింగ్ లాంటి మెసేజ్ ఇచ్చింది. "ఫ్యాన్స్ ఇప్పటికైనా మారండి. పిచ్చి ప్రేమ పెంచుకున్న ఈ ఫ్యాన్స్ కి ఈ వీడియో. మీరు తలుచుకుంటే నార్మల్ పర్సన్ ని కూడా పెద్ద సెలెబ్రిటీని చేస్తారు..మీరు తలుచుకుంటే ఎంత తోపు హీరోని కానీ హీరోయిన్ ని ఐనా కూడా ఓవర్ నైట్ జైలుకు కూడా పంపిస్తారు. మీ పిచ్చి అభిమానం ఎప్పుడూ ఎవరికీ ఇబ్బందికరంగా ఉండకూడదు. ఇకముందైనా మారండి. మీ హీరోస్ ని హీరోయిన్స్ ని చూసి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వాళ్ళు కూడా మన లాంటి మనుషులే..మన తల్లితండ్రుల కన్నా గొప్ప కాదు.   హీరోస్ హీరోయిన్స్ ఏమీ దేవుళ్ళు కాదు. సినిమా హీరోస్ గ్రేట్ కానీ వారిని అభిమానిద్దాం.. సినిమా వాళ్ళ ప్రీ రీలీజ్ ఈవెంట్స్ కి కానీ ఏ ఫంక్షన్స్ కైనా కొంచెం రెస్పాన్సబుల్ గా ఉందాం. సినిమా వచ్చిన రోజునే చూడాలి అన్న రూలేం లేదు. థియేటర్ లో మూవీ ఫస్ట్ డేనే చూడాలన్న పిచ్చి అభిమానంతో ప్రాణాలు పోగొట్టుకోవద్దు వేరే వాళ్ళ ప్రాణాలను తీయొద్దు. ఈ ప్రేమను, పిచ్చిని మంచికి వాడదాం" అంటూ పిచ్చి ఫ్యాన్స్ కోసం ఒక మోటివేషనల్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉంటె ఇంకొంతమంది మాత్రం ఫ్యాన్స్ మారరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

అల్లు అర్జున్, రవితేజ కల్లోకి వచ్చారు..జెడి.చక్రవర్తి చెప్పారని బిగ్ బాస్ 8 కి వెళ్లాను

  బిగ్ బాస్ 8 విష్ణుప్రియ అండ్ పృద్వి ఎపిసోడ్స్  మంచి క్యూట్ గా ఉంటాయి. అలాంటి విష్ణుప్రియకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వియర్డ్ కలలు వచ్చేవట. ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  "ఒక రోజు మా నాన్న, ఒక రోజు మా తమ్ముడు చనిపోయినట్టు, ఒక రోజు మా చెల్లిని కిడ్నప్ చేసినట్టు, ఒక రోజు అల్లు అర్జున్, రవితేజగారు నా డ్రీమ్ లోకి వచ్చి రా పార్టీ చేసుకుందాం అన్నట్టు రకరకాల కలలు వచ్చాయి. మూడు నెలల పాటు నాకు సరిగా నిద్ర లేదు. ఒక ఉద్యమంలా బతికాను నిద్రలేక. ఒకవేళ బిగ్ బాస్ హౌస్ నుంచి ఏదైనా  దొబ్బేయాల్సి వస్తే కొన్ని పింక్ చెయిర్స్ తీసుకుపోయి నా బాల్కనీలో వేసుకుంటా. ఒక వేళా బిగ్ బాస్ టైం మెషిన్ ఇస్తే గనక దివాలి రోజుకు వెళ్లి ఎంజాయ్ చేయాలనీ ఉంది. ఎందుకంటే ఆ రోజు పృద్వితో టైం స్పెండ్ చేసి డాన్స్ చేసి స్వీట్స్ తిన్నాం. ఇక ఒక్కొక్కరి గురించి చెప్పాలి అనే నిఖిల్ లో కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. నబీల్ డెడికేటెడ్ స్టూడెంట్, ప్రేరణ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, గౌతమ్ చూడడానికి ఓకే కానీ డేంజరస్, రోహిణి ఫైర్, అవినాష్ డేంజరస్ కానీ నైస్ కమెడియన్, సోనియా గురించి ఎక్కువ తెలీదు. మణికంఠ డ్రామా కింగ్. శేఖర్ బాషా హానెస్ట్ గా ఉంటాడు. యాష్మి వారియర్, ఆదిత్య స్పిరిట్యుయల్ పర్సన్. సీత ఇంటెలిజెంట్. పృద్వి ఫైర్ విత్ ఫ్లవర్ హార్ట్. ఇప్పటి వరకు చేసిన షోస్ కంటే కూడా బిగ్ బాస్ హౌస్ నాకు ఎంతో మంది ప్రేమ దొరికింది. బిగ్ బాస్ 3 నుంచి అవకాశం వస్తూనే ఉంది. కానీ ఇప్పడు మా గురువు గారు జెడి. చక్రవర్తి చెప్పారని బిగ్ బాస్ 8 కి వెళ్లాను." అని చెప్పింది విష్ణుప్రియ.  

ప్రియుడితో ఇనయా సుల్తానా బ్రేకప్.. నెట్టింట వైరల్ గా మారిన ఫోటోలు!

  బిగ్ బాస్ సీజన్-6 ద్వారా ఫేమస్ అయిన వారిలో ఇనయా సుల్తానా ఒకరు. తన ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టుకున్న ఇనయా.. బయటకొచ్చాక తన లవర్ తో కలిసి గోవా ట్రిప్ లకి వెళ్లి అక్కడ హాటల్ గదుల్లో టవల్ పై ఫోటోలు దిగి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ‌ఇక వాటి గురించి నెటిజన్లు కామెంట్ చేయగా.. పెళ్లా.. అబబ్బే.. అలాంటి ఉద్దేశం మాకు ఇప్పుడైతే లేదు. అయినా మేమిద్దరం చిన్నపిల్లలం. మా గోల్స్ అచీవ్ చేసిన తరువాత పెళ్లి చేసుకుంటేనే మాకు సంతృప్తి.. అప్పటి వరకూ మాకు ఇదే తృప్తి అని అన్నాడు గౌతమ్. మా రిలేషన్ గురించి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. వీళ్లు ఎంత కాలం కలిసి ఉంటారులే అని అంటున్నారు. వాటిని నేను కేర్ చేయను. అయినా మా రొమాంటిక్ ఫొటోలు బాగున్నాయి కదా చూసి ఆనందించాలి.. కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఏంటని అతను అన్నాడు.  నా లైఫ్, నా ఛాయిస్, నా ప్రాబ్లమ్స్, నా తప్పులు, నా పాఠాలు. మీరు నా గురించి మాట్లాడే ముందు మీ సొంత సమస్యలపై దృష్టిపెట్టండి. నా జీవితం గురించి చెప్పడానికి ఇది నీ కథ కాదంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఇనయా అప్పట్లో కొటేషన్లు రాసింది. ఇక ఇప్పుడేమో ఫైనల్‌గా ఇన్ స్టాగ్రామ్ లో బ్రేకప్ సింబల్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే ప్రియుడితో బ్రేకప్ అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇనయా సుల్తానా.. ఇయర్ ఎండింగ్ కావడంతో ఫారెన్ ట్రిప్‌లో ఉన్నట్టు ఉంది. అక్కడ హోటల్స్ రూమ్ నుంచి సింగిల్ గర్ల్.. సింగిల్ గర్ల్ అని చెప్తూ ఫొటోలు, వీడియోలు వదలుతుంది. దీంతో మేమ్ ముందే ఊహించాం కదా.. ఇలాంటిదేదో జరుగుతుందని. మీ రెచ్చిపోవడాలు చూసిన తర్వాత బుద్దిన్నోడు ఎవడూ కూడా మీరు కలిసి ఉంటారని మాత్రం అనుకోరు. చివరికి అదే అయ్యింది. ఇంతకి తమ్ముడు (గౌతమ్) కనిపించడం లేదు.. బ్రేకప్ చెప్పేశావా? చెప్పే ఉంటావ్‌లే అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  

సోనియా ఆకుల కోసమే మొదటి భార్యకు విడాకులు..

నిన్న మొన్నటి వరకు ఆకుల సోనియా అంటే పెద్దగా ఎవ్వరికీ తెలీదు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 తో ఆమె ఫుల్ ఫేమస్ ఐపోయింది. అలాగే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ ఐపోగానే తాను ప్రేమించిన యష్ ని పెళ్లి చేసుకుంది. అలాగే పెళ్లి చేసుకున్న సాయంత్రానికే ఇష్మార్ట్ జోడి 3 లోకి వచ్చేసారు. హైదరాబాద్ వేదికగా జరిగిన సోనియా వివాహానికి పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సోనియా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఐతే రీసెంట్ గా సోనియా గురించి ఒక విషయం బాగా మీడియాలో ట్రోల్ అవుతోంది. "సోనియా కోసమే మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు యష్ అని" ఐతే ఈ విషయం మీద ఈ భార్యా భర్తలు ఇద్దరూ కూడా స్పందించారు. " ఐతే నేను ఈ విడాకుల విషయం గురించి ఏమీ మాట్లాడను.. కానీ అది నిజం కాదు. మా పర్సనల్ డిస్టర్బెన్సెస్ కారణంగా మేము విడాకులు తీసుకున్నాం..ఆ తర్వాతే సోనియా నా లైఫ్ లోకి వచ్చింది. నా బిడ్డ విరాట్ ని నా ఫామిలీ మెంబర్స్ ని బాగా చూసుకుంటుంది. ఇక మేము ఇద్దరం కూడా ఆ అమ్మాయిని రెస్పెక్ట్ చేస్తాం. ఆమెకు కూడా మంచి లైఫ్ ఉండాలి అనుకుంటున్నాం. నా గురించి యష్ వాళ్ళ ఫామిలీ మొత్తానికి కూడా బాగా తెలుసు. నేను ఎవరితో ఎలా ఉంటాను. ఎవరిని ఎలా ట్రీట్ చేస్తానో కూడా బాగా తెలుసు. ఇక యష్ వాళ్ళ మేనత్తకి ఐతే నేను పవన్ కళ్యాణ్ లెక్కా. అంత ఇష్టం." అని చెప్పారు.  డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కథ అందించిన కరోనా వైరస్ మూవీలో  నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూతురు శాంతి పాత్రలో సోనియా ఆకుల నటించింది. అలాగే ఆశ, ఎన్ కౌంటర్ మూవీస్ లో నటించింది.  బాధితురాలు ఆశ పాత్రలో సోనియా మెప్పించింది.  

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్ అదుర్స్.. నర్మద చెప్పిన మాటతో అంతా షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -38 లో.....రామరాజు ఇంట్లో పూజ జరుగుతుందని తెలిసి అది ఎలాగైనా ఆపాలని ప్రసాదరావుకి భద్రవతి ఫోన్ చేసి.. ఏదో మాట్లాడుతుంది. మరొకవైపు వేదవతి పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.... అప్పుడే సాగర్, నర్మద లు రెడీ అయి వస్తారు. వాళ్ళని చూసి.. చూసావా అమ్మ.. అన్నయ్య, వదినలు ఎలా ఉన్నారో అని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత సాగర్, నర్మద లు పూజ దగ్గర కూర్చొని ఉంటారు. తల్లితండ్రలుగా మీరు పక్కన కూర్చోవాలని పంతులు వేదవతికి చెప్తాడు. అత్తయ్య మీరే వెళ్లి మావయ్యని తీసుకొని రండి.. మీరు చెప్తే మావయ్య వస్తాడని నర్మద అంటుంది. వేదవతి రామరాజు దగ్గరికి వెళ్లి.. మీరు రండి మళ్ళీ జనాలు అలా ఇలా అంటూ చెవులు కోరుక్కుంటారని రామరాజుని పూజ దగ్గరికి తీసుకొని వస్తుంది. నర్మద, సాగర్ లతో పాటు రామరాజు, వేదవతి లు కూర్చొని ఉంటారు. పూజ జరుగుతుంటుంది. అప్పుడే ప్రసాదరావు పోలీసులని తీసుకొని రామరాజు ఇంటికి వస్తాడు. రామరాజు అని పిలువగా మీరు పూజ చెయ్యండి అంటూ బయటకు వస్తాడు. మీ పైన ప్రసాదరావ్ కంప్లైంట్ ఇచ్చాడని తీసుకొని వెళ్తుంటే.. ధీరజ్ వచ్చి ఆపుతాడు. ఆ తర్వాత ఇంట్లో అందరు బయటకు వస్తారు. ప్రసాదరావు కూతురిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారని అందులో మీ హస్తం కూడా ఉందని రామరాజుతో పోలీస్ అంటాడు. వాడు అలాంటి వాడే అంటూ భద్రవతి అంటుంది. రామరాజుని పోలీస్ లు తీసుకొని వెళ్తుంటే.. నర్మద ఆపి నేనేం చిన్న పిల్లని కాదు.. నా ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాను.. మా మావయ్య గారి గురించి మీకేం తెలుసంటు రామరాజు గురించి గొప్పగా మాట్లాడుతుంది నర్మద. తరువాయి భాగంలో నా కూతురు లేదంటూ ప్రసాదరావు అంటాడు. దాంతో నర్మద బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప పోగుచేసిన డబ్బు కార్తీక్ కి ధైర్యమిచ్చిందా.. జ్యోత్స్న రివేంజ్ ఆమెపైనే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -237 లో.... కాంచన దగ్గరికి శ్రీధర్ వెళ్తాడు. కార్తీక్ రెస్టారెంట్ పెట్టడానికి కావల్సిన డబ్బు ఇస్తాను.. నాకు సారీ చెప్పాలి.. ఇంకా నన్ను మీతో ఉండనివ్వాలని శ్రీధర్ షరతులు పెడతాడు. దాంతో కాంచనకి కోపం వచ్చి.. నీ డబ్బు అవసరం లేదు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను.. నా దైర్యం నా కొడుకు తన వెంట నిజాయితీ గల భార్య దీప ఉంది అంటు తన డబ్బు తనకి ఇస్తుంది. దాంతో ఇంకా ఇక్కడెందుకు ఇంత అవమానం జరిగిన తర్వాత అని కావేరిని తీసుకొని శ్రీధర్ వెళ్ళిపోతాడు. మరొకవైపు శివన్నారాయణ వాళ్లు భోజనం చేస్తుంటారు. ఎలా భోజనం చేయాలనిపిస్తుంది. మీ చెల్లి అక్కడ ఎక్కడో ఉంది అంటూ దశరత్ తో సుమిత్ర అనేసి తినకుండా సుమిత్ర వెళ్ళగానే దశరత్ వెళ్తాడు. శివన్నారాయణ కూడ తినకుండా వెళ్ళిపోతాడు కానీ పారిజాతం మాత్రం మంచిగా భోజనం చేస్తుంటుంది. నాకు బావ వెళ్లిపోవడం బాధగా ఉంది కానీ ఆ దీప గురించి వెళ్లినందుకు కోపంగా ఉందని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత దీప కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. డబ్బులు లేవు.. ఎవరిని అడగలేనని కార్తీక్ బాధపడుతుంటాడు. అప్పుడే దీప వెళ్లి తను కార్తీక్ కి ఇవ్వడం కోసం పోగు చేసిన డబ్బులున్న బాక్స్ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇవి సరిపోతాయా అని దీప అనగానే కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ డబ్బులు నాకు చాలా దైర్యాన్ని ఇచ్చాయి దీప అంటు థాంక్స్ చెప్తాడు. మరొకవైపు దీప గురించి దాస్ బాధపడుతుంటాడు. ఆ తర్వాత శ్రీధర్ కి స్వప్న ఫోన్ చేసి నీకు బుద్ది ఉందా.. అన్నయ్య దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడావట అని కోప్పడుతుంది. దానికి శ్రీధర్ కూడా తనపై కోప్పడతాడు. కాసేపటికి స్వప్న దగ్గరికి దాస్ వచ్చి.. ఏమైందని అడుగుతాడు. కాంచన దగ్గరికి శ్రీధర్ వెళ్ళిన విషయం చెప్తుంది. బావేంటి ఇలా తయారు అయ్యాడని దాస్ అనుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ భోజనం చెయ్యడానికి అంతా సిద్ధం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సవతి కొడుకు మీద ప్రేమ ఉంటుందా.. ఆస్తి కోసమే ఇదంతా డ్రామా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -288 లో....మా ఆయన మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటే మీరు ఇంత మోసం చేస్తారా అంటూ రామలక్ష్మి అందరిని తిడుతుంది. సందీప్ నా కన్నకొడుకు.. వీడు నా సవతి కొడుకు.. నా కన్నకొడుకు పైనే ప్రేమ చూపిస్తాను. అసలు సీతా అంటేనే నాకు పడదని శ్రీలత అనగానే.. అమ్మ నువ్వేనా ఇలా అంటుంది.. సీతా అన్నయ్యకి ఏ బాధైనా తల్లడిల్లిపోయేదానివి.. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని సిరి అంటుంది. ఆ ప్రేమ మొత్తం ఆస్తుల కోసం.. అవే ఇప్పుడు నా చేతికి వచ్చాక. ఇక నటించాల్సిన అవసరం లేదని శ్రీలత అంటుంది. శ్రీలతతో సీతాకాంత్ ఇంకా ప్రేమగా మాట్లాడుతుంటే.. నన్ను అమ్మ అని పిలిచిన ప్రతీసారి తేళ్లు, జెర్రీలు పాకినట్లు ఉంటుందని శ్రీలత అనగానే సీతాకాంత్ బాధపడతాడు. అన్నయ్య లేకుంటే మన పరిస్థితి ఎలా ఉండేది అమ్మ ఇలా మాట్లాడుతున్నావని సిరి అంటుంది. ఒకవైపు శ్రీవల్లి.. మరొకవైపు సందీప్ కలిసి సీతాకాంత్ ని తమ మాటలతో బాధపెడతారు. ఇంట్లో నుండి వెళ్ళిపోతారా.. బయటకు గెంటేయ్యమంటారా అని శ్రీవల్లి అంటుంది. ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి రామలక్ష్మి, సీతాకాంత్ లు నిర్ణయం తీసుకొని బయటకు వస్తుంటే.. నేను మీతో వస్తాను అన్నయ్య అని సిరి అంటుంది. వద్దని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత డబ్బు కోసమే నన్ను ప్రేమించావా అంటూ ధన పైన సిరి కోప్పడుతుంది. ఆ తర్వాత నేను ఒకటి మర్చిపోయానంటూ రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావ్ డబ్బు కావాలా అంటూ తనని అవమానిస్తారు. జల్సాలకి అలవాటు పడ్డ వీడి చేతిలో ఆస్తులు పెట్టావ్.. మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే టైమ్ వస్తుందని రామలక్ష్మి అంటుంది. మీరే నా అవసరం కోసం వస్తారని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ఆ పదిలక్షలు ఎలా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -602 లో..... ప్రకాష్ ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి.. కావ్య పెత్తనం నచ్చాడం లేదనీ చెప్తుంది. దాంతో ధాన్యలక్ష్మి పైన కోప్పడతాడు ప్రకాష్. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కావ్య వచ్చి.. నేను చేస్తుంది తప్పంటారా అని అడుగుతుంది. నువ్వేం చేసినా అలోచించి చేస్తావ్ కానీ ఇంట్లో వాళ్ళకే తిండి విషయం మనలో ఇలా చేస్తన్నావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది ఏంటని అడగను.. చెప్పే అవసరం ఉంటే చెప్పే దానివి అని అపర్ణ అంటుంది. అవును అత్తయ్య బలమైన కారణం ఉంది చెప్పాలిసిన టైమ్ వచ్చినప్పుడు చెప్తానని కావ్య అంటుంది. మరొకవైపు రుద్రాణి వాళ్లు తమకి నచ్చిన టిఫన్స్ ఆర్డర్ చేసుకొని తింటుంటారు. అప్పుడే కావ్య వస్తుంది. కావాలనే కావ్య ముందు అది బాగుంది. ఇది బాగుంది అంటూ తింటారు. వీళ్ళు అనవసరంగా ఖర్చు చేస్తున్నారని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత సీతారామయ్యని చూస్తూ ఇందిరాదేవి బాధపడుతుంది. కావ్య, రాజ్ లు వస్తారు. సీతారామయ్య హాస్పిటల్ బిల్ కళ్యాణ్ కి రాజ్ ఇచ్చి పే చెయ్యమంటాడు. ఆ తర్వాత పని మనిషిని ఏం వంటలు చేసావని రుద్రాణి అడుగుతుంది. తోటకూర అని చెప్పగానే.. వద్దని రుద్రాణి, ధాన్యలక్ష్మిలు గదిలోకి వెళ్లి ఆర్డర్ పెట్టుకుంటారు కానీ వాళ్ళ కార్డ్స్ పని చెయ్యవ్. ఆ తర్వాత సుభాష్ కి వెళ్లి చెప్తారు. సుభాష్ బ్యాంకుకి ఫోన్ చెయ్యగా. అవును బ్లాక్ అయ్యాయి కావ్య గారు చేయించారని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మి లు కోపంగా ఉంటారు.కావ్య, రాజ్ లు ఇంటికి వస్తుంటారు. అప్పుడే బ్యాంకు నుండి ఒకతను ఫోన్ చేసి మీరు చెక్కు పంపారు కదా బాలెన్స్ లేవని అంటాడు. ఆ తర్వాత మేనేజర్ కి ఫోన్ చేసి ఎంత డ్రా చేశారని అడుగుతాడు. మీరు ట్వంటీ లాక్స్ అన్నారు కానీ ఫిఫ్టీ లాక్స్ ఉన్నాయ్ అవే డ్రా చేసామని అంటాడు. ఆ తర్వాత మిగతా టెన్ లాక్స్ ఏం అయ్యాయని కావ్య, రాజ్ ఆలోచిస్తారు. స్వప్న అక్కకి టెన్ లాక్స్ చెక్ ఇచ్చాను కదా తనేమైన డ్రా చేసిందా అని కావ్య అనగానే.. అలా చెయ్యదని రాజ్ అంటాడు. స్వప్నకి కావ్య ఫోన్ చేస్తుంటే తను లిఫ్ట్ చెయ్యదు. మరొకవైపు ధాన్యలక్ష్మి, రుద్రాణిలకి ఆకలి అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నిఖిల్ ని కోపంగా చూసిన కావ్యశ్రీ.. ముఖం చాటేసిన కపట ప్రేమికుడు!

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 లో రైతు బిడ్డ అంటూ పల్లవి ప్రశాంత్ సానుభూతి పొంది విజేతగా నిలిస్తే సీజన్-8 లో కావ్యశ్రీతో నాకు బ్రేకప్ అయ్యింది.. కప్ గెలిచాక వెళ్ళి తనని కలుస్తానంటూ సానుభూతి తెచ్చుకొని విజేతగా నిలిచాడు నిఖిల్. ఇక బిగ్ బాస్ షో నుండి బయటకెళ్ళాక డైరెక్ట్ బెంగుళూరు వెళ్ళిన నిఖిల్ అక్కడ తన ఫ్రెండ్స్ తో సరదాగా గడిపుతున్నాడు.  బిగ్ బాస్ సీజన్-8 లో టాప్-5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు అందరి లవ్ స్టోరీలని, మర్చిపోలేని విషయాలని షేర్ చేసుకోమనగా.. ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పగా మన నిఖిల్ మాత్రం తెగ యాక్ట్ చేశాడు. కావ్యే నా భార్య... నా ఫస్ట్ లవ్.. నా సెకండ్ లవ్.. థర్డ్ లవ్.. అన్ని బ్రేకప్ లవ్ స్టోరీలను మరిచిపోయేట్టు చేసింది. మా ప్రేమ కావ్యానికి ఆరేళ్లు పూర్తైంది. మేమ్ కలిసి ఉన్నామా విడిపోయామా అంటే.. మా బంధం తెగిపోలేదు. కావ్య నా భార్య అని మైండ్‌లో ఫిక్స్ అయ్యా.. ఇక తనే నా భార్య. జన్మజన్మలకు తనే నా భార్య. తను కూడా మా అమ్మ లాగే.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం.. ఆమె ముందు నిలబడతా. తను కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే పడతా.. ఐ లవ్యూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటు తెగ నటించేశాడు నిఖిల్.  తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో వచ్చింది. ఇందులో నిఖిల్ బ్లాక్ అద్దాలు పెట్టుకొని వచ్చేశాడు. ఇక యాంకర్ శ్రీముఖి అద్దాలు తీయొచ్చు కదా అనగా.. ఇవి తీయకపోవడమే మంచిది అని నిఖిల్ అన్నాడు. ఇక ఇదే షోలో తన మాజీ ప్రేమికురాలు కావ్యశ్రీ కూడా ఉంది. దాంతో వీళ్లిద్దరినీ ఎదురెదురుగా పెట్టి మాట్లాడించడానికి శ్రీముఖి చూడగా.. కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్‌ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ.. కావ్యశ్రీకి మాత్రం కన్నీళ్లు ఒక్కటే తక్కువ అన్నట్టుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్లీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగానే కనిపించాయి కావ్య చూపులు. మరి నిఖిల్, కావ్యశ్రీ ఇద్దరు మాట్లాడుకున్నారో లేదో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.