ఈ షోకి వచ్చింది కూడా తేజు లిప్స్ చూడడానికే

  ఆర్జే చైతు బెజవాడ కుర్రాడే. ఇతని పూర్తి పేరు చైతన్య బసవ. అతను రేడియో జాకీ. అలా సోషల్ మీడియాలో ఆర్జేగా మంచి క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ కి వెళ్లి బాగా ఫేమస్ అయ్యాడు. అటు షోస్ కి, ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ శ్రీముఖికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాడు. ఇట ఆర్జే చైతూకు లేడీస్ లిప్స్ అంటే బాగా ఇష్టం అంట. ఆ విషయాన్నీ కాకమ్మ కథలు ఎపిసోడ్ లో చెప్పుకొచ్చాడు. తేజు ఆడిన రాపిడ్ ఫైర్ ప్రశ్నల్లో తనకు ప్రదీప్ యాంకరింగ్ ఇష్టమని, ఆర్జేని కాకపోయి ఉంటే యాంకర్ ని అయ్యేవాడిని. శ్రీముఖిలో తనకు నచ్చని క్వాలిటీ ఏంటంటే నచ్చకపోతే బ్లాక్ చేస్తుంది పర్లేదు అనుకున్నాక అన్ బ్లాక్ చేస్తుంది. ఇలా బిగ్ బాస్ కి వెళ్ళకముందు చేసేది వెళ్లొచ్చాక అలా చేయడం మానేసింది  అని చెప్పుకొచ్చాడు. ఇక హీరో  సాయి ధరమ్ తేజ్ కి డబ్బింగ్ చెప్పడం ఇష్టం. తన వాయిస్ అతనికే సూట్ అవుతుందని చెప్పాడు. చెప్పాలంటే సమంత చాలా హాట్ గా ఉంటారు. ఎన్టీఆర్ తో  సెల్ఫీ దిగే ఛాన్స్ వస్తే వదులుకోను. ఒక అమ్మాయిలో తనకు నచ్చేవి లిప్స్ అని చెప్పాడు. ఐతే తేజు నటించిన ఐస్ క్రీం మూవీ చాలా సార్లు చూశాడని కేవలం తేజు లిప్స్ కోసమే చూసాడంటూ పక్కనుంచి శ్రీముఖి చైతులోని లిప్స్ యాంగిల్ ని చెప్పుకొచ్చింది. ఆ మాటకు చైతు కూడా ఇప్పుడు ఈ షోకి వచ్చింది కూడా తేజు లిప్స్ చూడొచ్చని అంటూ కామెంట్ చేసాడు. శ్రీముఖి అంటే...అలాగే ఆర్జేగా చేయడం అంటే ఇష్టం. ఎవరిలో ఐనా హాట్నెస్ అంటే ఇష్టం.. అలాగే ఫిట్ గా ఉండడానికే తింటాను అంటూ తేజు అడిగిన రాపిడ్ ఫైర్ కి ఆన్సర్స్ చెప్పాడు ఆర్జే చైతు.

నాగార్జున కంటే నేనే బాగా హోస్ట్ చేసేదాన్ని

  ఆహా ప్లాట్ఫార్మ్ మీద స్ట్రీమ్ అవుతున్న కాకమ్మ కథలు ఎపిసోడ్ లో శ్రీముఖి ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఈ షోకి ఆర్జే చైతూ, యాంకర్ శ్రీముఖి గెస్టులుగా వచ్చారు. ఐతే  ఇందులో అన్ని జానర్స్ లో గేమ్స్ ఆడించేసాక రాపిడ్ ఫైర్ అడిగింది తేజస్విని. ఐతే ఆమె అడిగిన ప్రశ్నలకు వరసగా ఇలా సమాధానాలు చెప్పింది శ్రీముఖి. "నా ఫేవరేట్ హోస్ట్ ఎవరూ లేరు. నా కో-హోస్ట్ ప్రదీప్ హోస్టింగ్ ఇష్టం. నేను హోస్ట్ చేసే అన్ని షోస్ లోకి ఆదివారం విత్ స్టార్ మా పరివారం అంటే ఇష్టం. ఆర్జే చైతుకు కొంచెం యాంకరింగ్ నేర్చుకోరా బాబు అని చెప్పాలనిపిస్తుంది. బిగ్ బాస్ షోని నేను నాగార్జున గారి కన్నా కూడా బాగా హోస్ట్ చేయగలుగుతాను అని అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది స్టార్స్ బిగ్ బాస్ కి హోస్ట్ చేశారు కానీ నేనుంటేనా బిగ్ బాస్ హౌస్ లోపలి వెళ్లి ఇంకా జాడించి మరీ గేమ్స్ ఆడించేలా హోస్ట్ చేసేదాన్ని. రణ్వీర్ సింగ్ తో పాన్ ఇండియా వరల్డ్ లెవెల్ లో మూవీ ఛాన్స్ వస్తే ఈ యాంకరింగ్ వదిలేసి యాక్టింగ్ కి వెళ్ళిపోతా. డాన్స్ రాకపోయినా మేనేజ్ చేసే హీరోయిన్ నయనతార. ఇన్ని రోజులు సింగల్ గా ఉన్నా కాబట్టి త్వరగా మింగిల్ కావాలని ఉంది.. సుమక్క హోస్టింగ్ ఇష్టం. అమ్మంటే ఇష్టం. నన్ను రాములమ్మ అన్నా శ్రీముఖి అన్నా ఇష్టమే." అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి.. మరి బిగ్ బాస్ కి శ్రీముఖి హోస్ట్ కావాలని ఆరాటపడుతోంది కాబట్టి ఈ షో చూసాక నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ కి  శ్రీముఖికి హోస్టింగ్ ఛాన్స్ ఏమన్నా ఇస్తారో లేదో చూడాలి.  

శ్రీముఖి పెళ్లెప్పుడో తెలుసా ?

  ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది హోస్ట్ శ్రీముఖి. ఇండస్ట్రీలో ఉన్న ఒక తెలుగింటి అమ్మాయికి పెళ్ళైతే చూసి హ్యాపీగా ఉండేవారిలో చాలా మంది ఉన్నారు. ఐతే తనకు పెళ్లి చేసేసుకోవాలని ఎక్కువ కోరికగా ఉంది అని చెప్పుకొచ్చింది. ఇక ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి త్వరలో జరగబోతోందన్న విషయాన్నీ కూడా  చెప్పింది. ఎనర్జీ సేవింగ్ తో పాటు ఏజ్ సేవింగ్ కూడా చేస్తున్నారా ఎలా ? అని తేజస్విని మడివాడ అడిగేసరికి శ్రీముఖి ఇలా చెప్పింది " రోజూ ఒక్క మీల్ మాత్రమే తింటాను. అది కూడా ఫుల్ ప్రోటీన్ మీల్. ఈ ప్రొఫెషన్ కోసం చాలా ఇష్టమైన ఫుడ్ ని సాక్రిఫైస్ చేశా. నేను పదో తరగతిలో ఉండేటప్పుడు 108 కేజీలు ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా మారిపోయాయి పూర్తిగా ప్రొఫెషన్ కోసం. దేవుడు ఏదైనా ఇవ్వాలంటే కస్టాలు పెట్టి మరీ ఇస్తాడు. అలాగే నేను ఎంతో కష్టపడుతూనే ఉంటాను. నన్ను నేను ప్రేమించుకుంటాను. నేను షోలో కనిపించే విధానం కానీ నేను వేరే వాళ్ళను ఇన్స్పైర్ చేసే విధానం అన్నిటిని ప్రేమిస్తాను. ఇక నాకు రాబోయే అబ్బాయి నన్ను బీటౌట్ చేసేలా ఉండాలి. నాతో పోటీ పడాలి. నేను ఒక విషయాన్నీ మార్చుకోవాలి అనుకుంటున్నా..నేను ఎప్పుడూ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాను. కానీ దాని వలన నాకు వేల్యూ లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. సో ఇవ్వడం అనేదాన్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నా " అని చెప్పింది శ్రీముఖి.  

బ్రహ్మముడి సీరియల్ లో కొత్త విలన్ ఎంట్రీ!

  తెలుగు టీవి సీరియల్స్ లలో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. అందులో బ్రహ్మముడి సీరియల్ టాప్-5 లో ఉంటుంది. ఈ సీరియల్ లోని ప్రతీ పాత్ర అందరికి సుపరిచితమే. ముఖ్యంగా కావ్య పాత్ర.. కావ్య అలియాస్ దీపిక రంగరాజు.. బ్రహ్మముడి సీరియల్ లో తన నటనతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. రాజ్-కావ్యల జోడీ బుల్లితెరపై హిట్ జోడీగా నిలిచింది. ఇక వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ  ఫైట్ లా అనిపిస్తాయి. ఇక బ్రహ్మముడి తాజా ఎపిసోడ్ లలో భాగంగా ధాన్యలక్ష్మి ఆస్తిని పంచివ్వమని అడగడంతో ఇంటి పెద్ద సీతారామయ్యకి గుండెపోటు రావడంతో.. అతడిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించడం.. డాక్టర్స్ కోమాలోకి వెళ్ళాడని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. ఇక రుద్రాణి వేసిన మాస్టర్ ప్లాన్ లో ధాన్యలక్ష్మి ప్రతీసారీ బలిపశువు అవుతుంది. ఇక ధాన్యలక్ష్మి ఆస్తిని వాటాలు పంచి ఇవ్చమనడంతో సుభాష్ పంపిస్తాననడం హైలైట్ గా నిలిచింది. తీరా లాయర్ వచ్చి ఓ న్యూస్ చెప్పగానే అందరు షాక్ అవుతారు.  ఆస్తి మొత్తం కావ్య పేరు మీద పెద్దాయన ఎప్పుడో రాసిచ్చాడని లాయర్ చెప్పడంతో అందరు కంగుతిన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రాజ్ ఆఫీస్ లో ఉండగా  కొంతమంది ఆఫీసర్స్ వచ్చి సీతారామయ్య ఒక కంపెనీకి షూరిటీ ఇచ్చాడని చెప్పడం.. దానికి ఒప్పుకోమని రాజ్ ని బలవంతం చేయడం ఉత్కంఠగా మారింది.  అయితే ఆ షూరిటి ఇచ్చిన సీతారామయ్య ఫ్రెండ్ కొడుకే మన కొత్త విలన్. అతనే నందగోపాల్. ఇక అతని ఎంట్రీ మాములుగా లేదు. 'ఈగ' సినిమాలో‌ని విలన్ 'కిచ్చ సుదీప్' లా అనిపిస్తోంది. ఇక అతని రాకతో బ్రహ్మముడి సీరియల్ మగ విలన్ దొరికేసాడనే ఫీలింగ్ వచ్చేసింది. ముందుముందు రాజ్ తో ఈ కొత్త విలన్ కి మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి మరి.  

Nabeel journey: నబీల్ జర్నీ వీడియో.. వరంగల్ కా షేర్.. 

  బిగ్ బాస్ సీజన్-8 లో గత వారం నుండి విన్నర్ ఎవరా అనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ఇక హౌస్ లో ఉన్న అయిదుగురిలో ఒక్కొక్కరికి తమ జర్నీ వీడియోలని అద్భుతంగా ఎడిట్ చేశారు బిగ్ బాస్. మొదటగా గౌతమ్ జర్నీ వీడియో చూపించగా, రెండోది అవినాష్, మూడు నిఖిల్, నాల్గవది ప్రేరణ జర్నీ వీడియో చూపించగా చివరగా నబీల్ జర్నీ వీడియోని చూపించాడు బిగ్ బాస్. నబీల్ గురించి బిగ్‌బాస్ చెప్పిన మాటలని ఓసారి చూసేద్దాం. నబీల్.. లైక్ షేర్ సబ్‌స్కైబ్ నుంచి లైట్స్ కెమెరా యాక్షన్ వరకూ మీ ప్రయాణాన్ని తీసుకెళ్లాలనే మీ తొమ్మిదేళ్ల తపన మిమ్మల్ని ఈ స్థానంలో నిల్చోబెట్టింది.. వరంగల్ కా షేర్ అనే పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు.. మీ టాలెంట్‌ని మీ వ్యక్తిత్వాన్ని కోట్ల మంది ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు ఈ ప్టాట్‌ఫామ్ ద్వారా మీకు వచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం మీరు సద్వినియోగం చేసుకున్నారు. నామినేషన్స్‌లో మీరు చూపించిన ఫైర్ కానీ టాస్కులో మీరు చూపించిన పట్టుదల కానీ మీ పేరును అందరూ అండర్‌లైన్ చేసేలా చేసింది.. మెగా చీఫ్ ప్రామిస్ చేయడంలోనైనా.. ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేయడంలోనైనా ఉన్నతంగా ఆలోచించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు..నబీల్.. మీరు సెల్ఫ్ మేడ్.. అందుకే మీకు ఆత్మ గౌరవం కూడా ఎక్కువే.. దాన్ని ప్రశ్నించింది ఎవరైనా వారికి దీటుగా మీ ఆటతో జవాబిచ్చారు.. ఈ ఇంటి మొదటి మెగా చీఫ్‌గా నిలిచారు.. ప్రయాణం మధ్యలో మీలో ఫైర్ తగ్గిందని మీ తోటివాళ్లు చెప్పినప్పుడు.. మీ సామర్థ్యాన్ని మీరు ప్రశ్నించుకున్నారు. అప్పటి నుంచి అందరికీ ఆమోదయోగ్యంగా మారేందుకు మీరు పడిన తపన స్పష్టంగా కనిపించింది.. మీ చుట్టూ ఉన్న తారల తళుకుబెళుకల మధ్య ఒక సామాన్యుడిగా ఒంటరై నిలిచినట్లు మీకు అనిపించింది.. కానీ నబీల్ అది మీ బలహీనత కాదు అదే మీ బలం.. టాప్-5లో ఒకరిగా నిలిచిన మీ ప్రయాణం చూసి యావత్ ప్రేక్షక లోకమే కాదు ఇప్పుడు బిగ్‌బాస్ కూడా మనస్ఫూర్తిగా అంటున్నారు వెల్ ప్లెయిడ్ నబీల్.. ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఇప్పుడు ఓసారి చూద్దామంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు నబీల్. నోట మాట రావట్లేదని నబీల్ చెప్పాడు.. తన అమ్మ చెప్పిన మాటలని గుర్తుచేసుకున్నాడు నబీల్. 

Prerana Journey: టాప్-5 లో ప్రేరణ..బిగ్ బాస్ 8 బెస్ట్ మెగా ఛీఫ్!

  బిగ్ బాస్ సీజన్-8 టాప్-5 లో ప్రేరణ ఒక్కతే లేడి కంటెస్టెంట్. పెళ్ళి తర్వాత కూడా ఎంతో సాధించొచ్చని ప్రూవ్ చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో తన జర్నీ వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. అది చూసి బిబి ఆడియన్స్ అంతా ఫిధా అయ్యారు. ప్రేరణ గురించి బిగ్ బాస్ తన మాటల్లో ఏం చెప్పాడో ఓసారి చూసేద్దాం. ప్రేరణ.. నిన్నకి నేటికి రేపటికి మధ్య తేడా మనిషి సాధించే మార్పే.. నిరంతరం నేర్చుకునే గుణం నిలబెడుతుంది.. అంతా నేనే అనే అహం పడగొడుతుంది.. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరే మిమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టింది.. పసిపాప లాంటి అమాయకత్వంతో మీరు ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన తీరు మిమ్మల్ని అందరికి దగ్గర చేసింది.. కానీ వారు మీకు నేర్పిన గుణపాఠాలే స్నేహం నుంచి ఆటని వేరు చేసే నైపుణ్యాన్ని మీకు నేర్పించాయి. ప్రేరణ బిగ్‌బాస్ ఇంట్లో మీరు ఒక ఫస్ట్ బెంచర్.. ఓటమిని ఒప్పుకోని మీ తత్త్వమే మిమ్మల్ని చాలా సార్లు గెలుపు అంచుల వరకు తీసుకెళ్లింది. అదే మిమ్మల్ని మెగా చీఫ్‌ని చేసింది. కానీ అప్పటి నుంచి మీకు కష్టాలు పెరిగాయి.. మీరు మెగా చీఫ్‌గా తన మన అనే భేదాలు లేకుండా మీ కర్తవ్యాలని సవ్యంగా నిర్వర్తించారు.. మీ బాధ్యత కోసం వెన్ను వంచని మీ మనస్తత్వం మిమ్మల్ని అందరు నిందించేలా చేసింది.. తిప్పలు తెచ్చింది.. ప్రేరణ.. ఇంటిసభ్యుల దృష్టిలో మీరు వరస్ట్ మెగా చీఫ్ అయి ఉండొచ్చు కానీ బిగ్‌బాస్ దృష్టిలో మీరు బెస్ట్ మెగా చీఫ్.. తప్పు నిజంగా జరిగితే సరైన కారణాలుంటే అది మీ స్నేహితులైనా సరే వాళ్లని నామినేట్ చేయడానికి మీరు వెనుకాడలేదు.. మీలోని మొండిఘటం మిమ్మల్ని ప్రశ్నించినవాళ్లకి చెమటలు పట్టించింది..ఆ లక్షణమే టాప్-5లో నిలిచిన ఒకే ఒక్క మహిళగా మిమ్మల్ని నిలబెట్టింది.. పెళ్లైన మహిళలు కూడా ఎంతో సాధించొచ్చని మీ ప్రయాణంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారని ఆశిస్తున్నాను. బిగ్‌బాస్ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దామంటూ ప్రేరణ జర్నీ వీడియో చూపించగా..  ఇక బిగ్‌బాస్ మాటలకి ప్రేరణ ఫుల్ ఎమోషనల్ అయి ఏడ్చేసింది.  

జర్నీ వీడియో చూసి నిఖిల్ ఎమోషనల్.. మీరొక స్మార్ట్ గేమర్!

  బిగ్ బాస్ సీజన్-8 ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక టాప్-5 ఫైనలిస్ట్ ల జర్నీ వీడియోలని చూపించేశాడు బిగ్ బాస్. మొదటగా గౌతమ్, ఆ తర్వాత అవినాష్ జర్నీ వీడియో చూపించిన బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా నిఖిల్ జర్నీ వీడియో చూపించారు.  నిఖిల్.. నది పుట్టుక ఒక్కో బొట్టుగా నెమ్మదిగానే మొదలవుతుంది.. కానీ ప్రయాణంతో ప్రవాహం పెరిగి మహానదిగా మారుతుంది.. మీ ఆట తీరు కూడా అదే విధంగా ప్రతిబింబించింది.నిందలు మీ మీద ఎన్ని వేసినా ఏగాగ్రతను కోల్పోలోదు.. అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అదే.. మిగతా బంధాలు మీతో చివరి వరకూ కలిసి నడవకపోయినా ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు.. మీ ఇద్దరూ ఒకరితో ఒకరు.. ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు.. ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటని వేలెత్తి చూపినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు.. ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు.. కానీ మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం. మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు.. అప్పుడు మీ మనసుకి అయిన గాయాన్ని మీలోనే దాచుకున్నారు .. మిమ్మల్ని చాలా మంది సేఫ్ గేమర్ అని నిందించారు.. కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోరన్న విషయాన్ని వాళ్లు గ్రహించలేకపోయారు. నిజానికి మీరొక స్మార్ట్ గేమర్.. ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్‌గా ఉన్నారు.. మీ సత్తాని పరీక్షించే టాస్కుల్లో రక్తాన్ని సైతం చిందించి మీ దూకుడు చూపించారు.. మీ మీద ఎవరు ఎప్పుడు దుమ్మెత్తి పోసినా ఎప్పుడు జెంటిల్‌గా ఉండాలో ఎప్పుడు మ్యాన్లీగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్ మ్యాన్ మీరు.. రాయల్స్ ఇంట్లోకి ఎంటరైనప్పుడు విచ్ఛిన్నమైన ఓజీలని ఒకతాటిపైకి తీసుకొచ్చారు..మీ కన్నా ఇంటి కోసమే ఎక్కువ ఆలోచించారు.. సరదాకి మీరు ఏం చేసినా హద్దులు దాటలేదు.. ఈ లక్షణాలే మిమ్మల్ని చివరి మజిలీకి అతి చేరువలో నిలిపింది.. నిఖిల్.. ఒక పోటీదారుడిగా.. ఒక ఇంటిసభ్యుడిగా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చినా.. మీ మనసులోని ఆ ఒక్క లోటూ బిగ్‌బాస్‌కి తెలుసు.. మీ మనసు మోస్తున్న ఆ బరువు తొందరగా తగ్గాలని.. మీ మనసుకి దగ్గరైన ప్రతిదీ మీకు దక్కాలని కోరుకుంటూ ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దామంటూ నిఖిల్ జర్నీ వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు నిఖిల్.  

తారుమారైన ఓటింగ్ రిజల్ట్స్.. సీజన్-8 విన్నర్ గౌతమే!

  నిన్న రాత్రితో బిగ్ బాస్ సీజన్-8 విన్నర్‌ని తేల్చే ఓటింగ్ ముగిసింది. ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన బిగ్ బాస్ చివరి వారం ఓటింగ్ శుక్రవారం రాత్రితో క్లోజ్ అయ్యింది. మొత్తం 5 ఫైనలిస్ట్‌ల మధ్య ఈ ఓటింగ్‌లో ఇద్దరి మధ్యే ప్రధానమైన పోటీ ఉంది. నిఖిల్ వర్సెస్ గౌతమ్‌ల మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది. మొత్తం ఓటింగ్‌లో ఈ ఇద్దరిదే పైచేయి.  అన్ లిమిటెడ్ ఫన్ గా మొదలైన ఈ సీజన్-8 క్లైమాక్స్ చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. 16 మంది ఓజీ క్లాన్.. 05 మంది రాయల్ క్లాన్ సభ్యులతో మొత్తం 22 మంది ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొని టైటిల్ కోసం పోటీ పడ్డారు. అయితే ఐదోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడంతో సీజన్ 8 ఊపందుకుంది. నిఖిల్, నబీల్, గౌతమ్, ప్రేరణ, అవినాష్ సీజన్-8 టాప్-5 ఫైనలిస్ట్ లుగా నిలిచారు. ఇక ఈ అయిదుగురికి గత ఆదివారం నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వగా.. 80 శాతం ఓటింగ్ టైటిల్ రేస్‌లో ఉన్న ఉన్న నిఖిల్, గౌతమ్ ఇద్దరికే పడ్డాయి. మిగిలిన 20 పర్సంట్ ఓటింగ్‌ని నబీల్, ప్రేరణ, అవినాష్‌లు పంచుకున్నారు. పోటీలో నామమాత్రంగా మిగిలిపోయారు. తొలిరోజు నుంచి ఐదోరోజు వరకూ కూడా ఈ ముగ్గురి స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు కానీ.. టైటిల్ రేస్‌లో ఉన్న నిఖిల్, గౌతమ్‌లు స్థానాలు తారుమారయ్యాయి.  బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ ఆన్ లైన్ పోల్స్ శుక్రవారం అర్ధరాత్రి ముగిసేసరికి చూస్తే.. గౌతమ్‌ 38 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉన్నాడు. గౌతమ్‌కి 1,18,264 ఓట్లు పడ్డాయి. నిఖిల్‌కి 33 శాతం ఓట్లు పడ్డాయి. అతనికి 1,03,972 ఓట్లు పడ్డాయి. వీళ్లిద్దరి మధ్య కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది. ఇక మూడో స్థానంలో 16 శాతం ఓటింగ్‌తో నబీల్ ఉన్నాడు. ఇతనికి 51,461 ఓట్లు పడ్డాయి. ఇక ప్రేరణ, అవినాష్‌లు సింగిల్ డిజిట్‌కి పరిమితం అయ్యారు. ప్రేరణకి 9 శాతం ఓట్లు పడితే.. అవినాష్‌కి 4 శాతం ఓట్లు పడ్డాయి. ఆటల పరంగా నిఖిల్ టాప్ లో ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాలలో గౌతమ్ కి ఫ్యాన్ బేస్ బాగుంది. గౌతమ్, నిఖిల్ ఈ ఇద్దరిలోనే విన్నర్, రన్నర్ ఉన్నారు. మూడో స్థానంలో నబీల్, నాలుగో స్థానంలో ప్రేరణ, ఐదో స్థానంలో అవినాష్‌లు నిలిచే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరో తెలియబోతుండటంతో బిబి ఆడియన్స్ విజేత ఎవరా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  

Illu illalu pillalu : ప్రేమ పెళ్ళి చేసుకున్నాడని ఇంట్లో నుండి గెంటేసిన తండ్రి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -28 లో.....ధీరజ్ దగ్గరుండి మరీ సాగర్, నర్మదల పెళ్లి జరిపిస్తాడు. ఇక నర్మద మీ ఇంటికి వెళదామనడంతో ధీరజ్ సపోర్ట్ తో ఇంటికి బయలుదేర్తారు. మరొకవైపు రామరాజు పెద్ద కూతురు కామాక్షి వేదవతి దగ్గరికి వస్తుంది. తన కూతురు అక్కడే ఉండి చదువుతుంటుంది. ఇక్కడ తాతయ్య భయంతో చదువుతావని ఇక్కడ ఉంచితే చదవడం లేదని తన కూతురిని కామాక్షి తిడుతుంది. ఇక కామాక్షి తన చెల్లితో గొడవపడుతుంది. అప్పుడే సాగర్ నర్మదలని తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసి అందరు షాక్ అవుతారు. అల్లుడు ఎంత పని చేసావ్ రా అని వాళ్ళ మామ అంటాడు. అప్పుడే రామరాజు బయటకు వచ్చి ఏమైందని అంటాడు. నర్మద,  సాగర్ లని చూసి షాక్ అవుతాడు. ఎదురింట్ల ఉన్న సేనాపతి, భద్రవతి ఇద్దరు వాళ్ళని చూసి రామరాజు పరువు పోయిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. తండ్రి దారినే కొడుకు అంటు రామరాజుకి ఇంకా కోపం వచ్చేలా సేనాపతి మాట్లాడతాడు. నాన్న నన్ను క్షమించండి అని సాగర్ అనగా... నువ్విలా చేస్తావనుకులేదని రామరాజు బాధపడతాడు. నువ్వు ఇలా ఎలా చేసావ్ రా అందుకేనా వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళావని వేదవతి అంటుంది. మీ నాన్న పరువు తీసావ్ కదరా అని వేదవతి బాధపడుతుంది. తరువాయి భాగంలో ఊళ్ళో వాళ్లు రామరాజు కొడుకు లేచిపోయి.. పెళ్లి చేసుకున్నాడంటూ తప్పుగా మాట్లాడుతుంటే ధీరజ్ వాళ్లపై కోప్పడతాడు. ఆ తర్వాత సాగర్ ని ఇంట్లో నుండి రామరాజు గెంటేస్తాడు. ఆ తర్వాత  జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : జ్యోత్స్నే అసలు సూత్రధారి.. వాళ్ళని నిలదీసిన కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -227 లో.....శౌర్య కళ్లు తిరిగి కింద పడిపోయిందని అటెండర్ లాగా రౌడీ ఫోన్ చేసి చెప్పగానే.. దీప హడావిడిగా అనసూయకి చెప్పి బయలుదేర్తుంటుంది. దీప వెళ్తుంటే రౌడీ ఆటోతో ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలని ఎక్కించుకుంటాడు. దీపని స్కూల్ కి కాకుండా వేరొక చోటుకి తీసుకొని వెళ్తాడు. అప్పటికే దీపకి డౌట్ వస్తుంది. మరికొంత మంది రౌడీలు దీప దగ్గరికి వస్తారు. దూరం నుండి జ్యోత్స్న, పారిజాతంలు చూస్తుంటారు. మరొకవైపు శౌర్య పడిపోయిందట అని కార్తీక్ కి అనసూయ చెప్తుంది. ఏదైనా కాల్ స్కూల్ నుండి నీకు వస్తుంది కానీ తనకి రావడమేంటని కాంచన అనగానే.. కార్తీక్ హడావిడిగా వెళ్తాడు. మరొకవైపు దీప, రౌడీలని కొడుతుంది. దీపని రౌడీ కత్తితో పొడవబోతుంటే కార్తీక్ వచ్చి ఆపుతాడు. దాంతో జ్యోత్స్న, పారిజాతం లు షాక్ అవుతారు బావ వచ్చాడేంటని జ్యోత్స్న అంటుంది. దీప, కార్తీక్ లు ఇద్దరు కలిసి రౌడీలని కొడతారు. మీతో ఇలా చేయించింది ఎవరని కార్తీక్ రౌడీని అడుగగా కళ్ళలో మట్టి కొట్టి పారిపోతాడు. వాళ్లని కార్తీక్ ఎక్కడ చూస్తాడోనని జ్యోత్స్న, పారిజాతం లు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కార్తీక్ , దీపలు ఇంటికి వచ్చి జరిగింది చెప్తారు. ఇదంతా ఆ నర్సింహా పని అని దీప అనుకుంటుంది కానీ కార్తీక్ మాత్రం హాస్పిటల్ లో జరిగింది గుర్తు చేసుకొని జ్యోత్స్న పని అనుకుంటాడు. మరొకవైపు బావకి మనపై డౌట్ వచ్చి ఉంటుందని జ్యోత్స్న అంటుండగా.. అప్పుడే కార్తీక్ ఫోన్ చేస్తాడు. పారిజాతం భయపడుతూ మాట్లాడుతుంది. మీరే ఇదంతా చేసారని కార్తీక్ అంటాడు. మాకేం అవసరం నరసింహ రెండో భార్య చేసి ఉంటుందని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కొత్త ప్లాన్.. సింపథీ డ్రామా వర్కవుట్ అయ్యేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -278 లో.....సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వస్తుంది. తప్పులు చేసేది ఒక సందీప్ అనుకున్నా కానీ ఆ లిస్ట్ లోకి ధన కుడా చేరాడని సీతాకాంత్ ఆవేశంగా మాట్లాడతాడు. ఇది ఒక అంతుకి మంచి అయ్యింది ఇప్పుడు నిజం బయటపడింది లేదంటే తప్పు మీద తప్పు చేస్తునే ఉండేవారని సీతాకాంత్ కి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటుంది రామలక్ష్మి. ఆ తర్వాత జరిగింది గుర్తు చేసుకొని సిరి బాధపడుతుంటే.. అప్పుడే ధన వచ్చి నేను కావాలని అప్పు చెయ్యలేదు ఇంకొకసారి ఇలా ఎప్పటికి చెయ్యను కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా అని రిక్వెస్ట్ చెయ్యగానే.. సిరి క్షమిస్తుంది. ఆ తర్వాత సందీప్, ధన, శ్రీవల్లి, శ్రీలతలు జరిగిన దాని గురించి డిస్కషన్ చేస్తుంటారు. అసలు ఆ శంకర్ గాడు అలా ఎలా వచ్చాడని సందీప్ అనగానే.. నేనే రప్పించానని శ్రీలత అంటుంది. అందరు షాక్ అవుతారు. అదేంటీ మీరు సేవ్ చేస్తారన్నారు.. ఇప్పుడు మీరే ఇలా చేశారని ధన అనగానే ఇప్పుడు తెలిస్తేనే సీతా అప్పు తీరుస్తాడు లేదంటే ప్రాబ్లమ్ అవుతుందని శ్రీలత చెప్తుంది. సందీప్, ధన లకి సీతాకాంత్ ని నమ్మకంతో గెలవాలని, మీరు మారినట్టు తెలియాలని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం శ్రీలత చెప్పినట్లు సందీప్, ధనలు దేవుడు ముందు చేతిలో హారతి వెలిగిస్తారు. అది చూసి సీతాకాంత్, రామలక్ష్మి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారంటూ అడుగుతారు. అందరి ముందు ఇద్దరు సింపథీ ట్రై చేస్తారు. కాసేపటికి సందీప్, ధనలకి మళ్ళీ ఏదో ప్లాన్ చెప్తుంది శ్రీలత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఇకనుండి కావ్యే ఇంటికి పెద్ద.. కనకాన్ని అవమానించిన ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -592 లో....కావ్య తనపై అంత పెద్ద బాధ్యతలు పెట్టినందుకు బాధపడుతూ దేవుడికి మొక్కుకుంటూ బాధపడుతుంది. అప్పుడే ఇందిరాదేవి వచ్చి.. సమస్యలని పక్కన పెట్టి బాధ్యతలు తీసుకోమని ఇందిరాదేవి అంటుంది. చాలా హ్యాపీగా ఉంది నాన్న ఇలా చేసినందుకని సుభాష్ అంటాడు. ఇలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉందటున్నారు కానీ ధాన్యలక్ష్మి, అత్తయ్య, రుద్రాణి గార్లని ఎదరుకోగలనా అని కావ్య అంటుంది. దైర్యంగా ఎదుర్కో మేమ్ మీకు సపోర్ట్ అంటూ ఆస్తుల పేపర్స్, తాళాలు కావ్య చేతిలో పెడతారు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వచ్చి ఆస్తుల పేపర్స్ ఇచ్చి దీనికి మీరే అర్హులని అంటుంది. లేదు తాతయ్య నీకేం ఇచ్చాడని రాజ్ అంటాడు. తాతయ్యకి నీకు ఆ సామర్థ్యం ఉందని నమ్మాడు. ఆ నమ్మకం నిలబెట్టుకోమని రాజ్ పాజిటివ్ గా మాట్లాడేసరికి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రుద్రాణి, రాహుల్ కలిసి.. అసలు ఇలా జరిగిందేంటని బాధపడుతుంటారు. అప్పుడే స్వప్న వచ్చి సిచువేషన్ తగ్గ సాంగ్ పెడుతుంది. దాంతో రాహుల్, రుద్రాణీలకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి ఆస్తుల గురించి లాయర్ తో కోర్ట్ లో వేయమని చేప్తుంది. అప్పుడే ప్రకాష్ వచ్చి కావ్యపై కేసు వెయ్యడానికి సిద్ధమయ్యావన్నమాట అని అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రకాష్ విరుచుకుపడతాడు.ఆ తర్వాత కావ్య దగ్గరికి కనకం వస్తుంది. దాంతో ధాన్యలక్ష్మి, రుద్రాణి లు కనకాన్ని సూటిపోటీ మాటలతో బాధపెడతారు. తరువాయి భాగం లో రాజ్ దగ్గరికి కొంతమంది వచ్చి.. మీ తాతయ్య గారు తన ఫ్రెండ్ ని నమ్మి కోటి రూపాయలకి షూరిటీ  సంతకం పెట్టారు. అది ఇప్పుడు మీ తాతయ్య కట్టాలి. లేదంటే ఆస్తులు తీసుకుంటామని వాళ్ళనగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నేను ప్రేమించే అమ్మాయి...అమ్మాయా...కాదా

  జబర్దస్త్ కమెడియన్స్ లో ప్రముఖంగా ఇమ్మానుయేల్ పేరు చెప్పుకోవచ్చు. జబర్దస్త్ సైడ్ కమెడియన్ నుంచి టీంలీడర్ అయ్యాడు. అలాగే కొంతవరకు మంచి స్కిట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ఇక ఒక చిట్ చాట్ లో రకరకాలల ఆన్సర్స్ ఇచ్చాడు. "నేను ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటంటే బేసిక్ గా నా బండి యాక్టివ్. మిగతా వాళ్లందరితో  నేను జోవియల్ గా ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. లవ్ లెటర్స్ రాసే రోజులు కావు ఇవి. ఎవరూ నాకు లవ్ లెటర్స్ రాయలేదు. కానీ బాగా చేస్తాను అని అందరూ మెచ్చుకుంటారు. కోపాన్ని ఎప్పుడూ చూపించను నేను. ఐతే నేను ఒక అమ్మాయిని ప్రేమించాలి అంటే ముందు నేను అసలు అమ్మాయా కాదా అని చూస్తాను ఎందుకంటే ఈరోజున ఎవరినీ నమ్మే పరిస్థితి ఉండడం లేదు. చేసిన సినిమాలు అవీ సరిగా ఆడనప్పుడు కొంచెం బాధపడతాను. నేను యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు. జబర్దస్త్ లో వెళ్ళాను, వాళ్ళను చూసే నేర్చుకున్నా. ఒకవేళా నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటె పెళ్ళైపోయి పిల్లల తండ్రిని అయ్యేవాడిని. ప్రస్తుతం నా క్రష్ నేషనల్ క్రష్ రష్మిక మందాన్న. నేను బాగా వంట చేస్తా. అందులో మజ్జిగ బాగా వండుతా...నా కెరీర్ ఇప్పుడు మూడు షూటింగులు ఆరు పేమెంట్లుగా నడుస్తోంది." అంటూ నవ్వించాడు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ "ప్రేమ వాలంటీర్" అంటూ ఇటీవల ఓ వెబ్ సిరీస్ చేశాడు.   జబర్దస్త్ షో బాగా  పాపులర్ అయిన జంట ఇమ్ము-వర్ష.  

సడన్ గా డెలివరీ అయిపోయింది.. యాదమరాజు స్టెల్లా వ్లాగ్ వైరల్!

  కామెడీయన్స్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం.. వ్లాగ్స్ చేయడం.. వైరల్ అయ్యేందుకు రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టి ఫేమస్ అవ్వడం ప్రస్తుతం కామన్ అయిపోయింది. రీసెంట్ గా ప్రియాంక జైన్-శివ్ కలిసి తిరుపతిలో చేసిన ఓ వ్లాగ్ వైరల్ అవ్వడం.. వారి మీద తీవ్రంగా ట్రోల్స్ అవ్వడం చూసాము.. ఇప్పుడు అదే తరహాలో యాదవరాజు.. అతడి భార్య కలిసి చేసిన ఓ వ్లాగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. జబర్దస్త్  ద్వారా ఫేమ్ పొందినవారిలో యాదమ్మ రాజు ఒకడు. యాదమరాజు , స్టెల్లా లవ్ మ్యారేజ్ చేసుకోగా తాజాగా వారికి మగ బిడ్డను జన్మించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు షేర్ చేసుకున్నారు. ఈ మేరకు తమ యూట్యూబ్‌ ఛానెల్ లో ఒక వీడియోను పంచుకున్నారు.  యాదవరాజు భార్య స్టెల్లా తన ప్రసవ సమయంలో కొన్ని సమస్యలు వచ్చాయని ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది. నార్మల్ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు తగ్గిందన్నారు. త్వరగా ప్రసవం చేయాలన్నారు. దీంతో డాక్టర్ల సలహాతో ఒక ఇంజెక్షన్‌ తీసుకుని ఇంటికి వచ్చాను. ఆ తర్వాత ఇంకో డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ కేసు.. వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్‌ అవ్వాలన్నారు. అప్పటికీ కూడా కడుపులో ఉన్న బిడ్డకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అప్పుడు యాదమ్మరాజును పట్టుకుని చాలా ఏడ్చాను. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చాం. మాకు తెలిసినవాళ్ల ద్వారా తర్వాతి రోజు గాంధీ ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు ఎక్కించారు. ఆ తర్వాత మరో ఆస్పత్రికి వెళ్లాం. నా పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. అక్కడ కూడా బిడ్డ గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దన్నారు. ఈ కారణంగానే సీమంతం ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. డాక్టర్స్‌ చెప్పిన డెలివరీ డేట్‌ కంటే దాదాపు 15 రోజుల ముందే ప్రసవం జరిగింది. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగా ఉందని స్టెల్లా చెప్పుకొచ్చింది. ఇక యాదమరాజు, స్టెల్లా దంపతులకు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలంతా అభినందనలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

నా పేరు సగం నాశనం కావడానికి బిగ్ బాస్ సీజన్ 2 ఒక కారణం

  బుల్లితెర మీద అప్పుడప్పుడు కనిపించే చక్కని తెలుగమ్మాయి తేజస్వి మడివాడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటోంది. అలాగే ఆహా ఓటిటి మీద కాకమ్మ కథలు పేరుతో ఒక షోకి హోస్ట్ గా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తూ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల "అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2 " వెబ్ సిరీస్ లో బికినీ వేసుకుని కనిపించింది. ఇక ఒక షోలో బిగ్ బాస్ గురించి చెప్పుకొచ్చింది. "నా పేరు సగం నాశనం కావడానికి బిగ్ బాస్ సీజన్ 2 ఒక కారణం. నేను జర్నలిజం స్టూడెంట్ ని. ఒక ప్రోడక్ట్ ని అమ్మాలంటే ఎలాంటి ప్రోపగాండా చేస్తారో ఆ సీజన్ లో అలానే నా మీద ప్రోపగాండా చేశారు. నా మీద ఒక ప్లాన్ ప్రకారమే నెగటివ్ ప్రోపగాండా జరిగింది. దాన్ని తీసుకోవడం నాకు కష్టంగా అనిపించింది. బిగ్ బాస్ 2 కి వెళ్ళినప్పుడు నా వయసు 25 . ఆ సీజన్ నన్ను చాలా బాడ్ చేసింది. జనాల్లోకి ఒక ఇమేజ్ వచ్చేసాక అది మార్చడం చాలా చాలా కష్టం. కాబట్టి ప్రజల ఆలోచనను నేను మార్చలేను. నేను ఎలా ఉండాలి అనుకుంటానో అలాగే ఉంటాను. నేను ఏ బిగ్ బాస్ సీజన్ కూడా చూడను. డబ్బులు తీసుకుని చెక్కేసే టైపు. బిగ్ బాస్ కి ఒకసారి వెళ్లి వచ్చాక సిగ్గున్నోడు ఎవడైనా మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్తాడా. నేను వెళ్లాను బిగ్ బాస్ ఓటిటికి వెళ్ళా డబ్బులు. చూడడానికి రిచ్ కిడ్ కనిపిస్తా కానీ నాకు మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి బుల్లితెర మీద ఎక్కువగా నేను కనిపించడానికి కారణం కేవలం డబ్బుల కోసమే.. " అంటూ చెప్పుకొచ్చింది.  

Actor Naresh Lolla : కన్నడ వాళ్ళ కంటే తెలుగు వాళ్ళేం తక్కువ.. భాష రాని వాళ్ళతో యాక్టింగా!

  నరేశ్ లొల్ల.. తెలుగు సీరియల్స్ ద్వారా అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్-7 లో అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో  ఫుల్ ఫేమస్ అయ్యాడు. అమర్ దీప్ కి ఆప్తుడు అయినటువంటి నరేశ్ లొల్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నాడు.  ఈ మధ్య కాలంలో కన్నడ నటీనటులకి డిమాండ్ ఎక్కువ అయింది. కొత్తవాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళనే తీసుకుంటున్నారు. మన తెలుగువాళ్ళని తీసుకోవడం లేదంటూ చెప్పుకొచ్చాడు. తెలుగులో ఎంతమంది హీరోలు లేరు.. చాలామంది ఉన్నారు. కానీ పక్క రాష్ట్రాల హీరో, హీరోయిన్లను ప్రమోట్ చేసినంతగా.. మన తెలుగు వాళ్లని ప్రమోట్ చేయడం లేదు టీవీ ఛానల్స్ వాళ్లు. ఒక్కసారి మా తెలుగు వాళ్లని కూడా ప్రమోట్ చేసి చూడండి. రేటింగ్ డబుల్ వస్తుంది. నేను కన్నడ వాళ్లని తక్కువ చేయడం లేదు కానీ.. కనీసం వాళ్లకి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం కూడా రావడం లేదు. తెలుగు భాష రాకపోవడం వల్ల.. ఆ డైలాగ్‌లకు అర్థం తెలియకపోవడం వల్ల.. ఎమోషన్స్ అన్నీ కిల్ అయిపోతున్నాయి. అయినా సరే వాళ్లనే పెడుతున్నారు. సినిమాల్లో వచ్చే రెమ్యూనరేషన్ వేరు.. సీరియల్స్‌కి వచ్చే రెమ్యూనరేషన్ వేరు. సీరియల్స్‌‌లో తెలుగు వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే.. ఓ సీనియర్ నటుడు.. రెండు మూడు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఆయన ఒక్కోసారి ఫోన్ చేసి.. నరేష్ ఓ రెండు వేలు ఉన్నాయా? పేమెంట్ వచ్చాక ఇస్తా అని అడుగుతాడు. అంటే రెమ్యూనరేషన్ ఎంత తక్కువగా ఉన్నాయో మీరే అర్థం చేసుకోవచ్చు. తినడానికి తిండి లేక.. ఫ్యామిలీని పోషించుకోలే ఎంత మంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. మీరు అనుకున్నంత గొప్పగా మాకు పేమెంట్స్ ఇవ్వరు. ఈ సోకాల్డ్ ఇతర రాష్ట్రాల ఆర్టిస్ట్‌లతో పోల్చుకుంటే.. మాకు ఇచ్చే రెమ్యూనరేషన్ వాళ్ల కంటే 50 శాతం తక్కువ ఇస్తారు. పక్క రాష్ట్రాల నటీ నటులకు ఇక్కడ హోటల్స్ రూంలు ఇస్తారు.. ఫ్లైట్ టికెట్స్ పెడతారు.. కారు ఇస్తారు.. ఫుడ్ చార్జీలు కూడా ప్రొడ్యుసర్స్ భరిస్తారు. కానీ తెలుగు ఆర్టిస్ట్‌ల విషయానికి వస్తే.. కారు కన్వినెన్స్ ఇస్తారు.. అసిస్టెంట్ బేటా ఇస్తారు.. ఫుడ్ ప్రొడక్షన్ వాళ్లు పెడతారు. వాళ్లు ఏది పెడితే అది తినాలి. వాళ్లు ఇచ్చింది తీసుకుని వెళ్లాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు క్యాస్ట్యూమ్స్ కూడా ఇవ్వరు. నేను చేసిన సీరియల్స్‌లో ఇప్పటి వరకూ అన్నీ నేను కొనుకున్నవే. హీరో హీరోయిన్లకు క్యాస్ట్యూమ్స్ ఇస్తుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు మాత్రం సొంతంగా భరించాల్సిందే. అవి కూడా వాళ్లకి నచ్చినట్టు ఉండాలి. మనకి నచ్చింది కాదు. నేను అడిగేది ఏంటంటే.. వాళ్లకి ఇచ్చేటంత రెమ్యూనరేషన్ తెలుగు వాళ్లకి ఇవ్వమని అడగడం లేదు. వాళ్లకి ఇచ్చే సదుపాయాలు మాకు కల్పించమని అడగడం లేదు. మాకు వాళ్లకిచ్చేటంత బడ్జెట్ వద్దు.. అవకాశాలు ఇవ్వండి చాలు. వాళ్లకంటే ఖచ్చితంగా బాగా చేస్తాం.. వాళ్లకంటే మంచి ఔట్ పుట్ ఇస్తాం. వాళ్ల కంటే మంచి రేటింగ్ తెస్తాం. వాళ్లకంటే తెలుగు వాళ్లు ఎందులోనూ తక్కువగా అయితే చేయరని నరేశ్ లొల్ల అన్నాడు. మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం.. ఈ ఇండస్ట్రీని నమ్ముకుని బోలెడంత మంది ఉన్నారు. తిండిలేని వాళ్లు కూడా ఉన్నారు. ఇంతకు ముందు 20-22 పైన రేటింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు 4-6 రేటింగ్ వచ్చిందంటే గొప్పగా ఫీల్ అవుతున్నారు. తెలుగు వాళ్లని పెట్టి.. తెలుగు సీరియల్స్ తీయండి.. ఇంతకంటే మంచి రేటింగ్ ఖచ్చితంగా వస్తుందంటూ తమ కష్టాలని నరేశ్ లొల్ల చెప్పుకొచ్చాడు.  

Gowtham Av : కెజెఎఫ్ లెవెల్ లో గౌతమ్ జర్నీ వీడియో.. ఓటింగ్ లో అతడికే ప్లస్!

    బిగ్ బాస్ సీజన్-8 లో గౌతమ్ ఎలిమినేషన్ దాకా వెళ్లి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రతీ టాస్క్ ఫుల్ కసిగా ఆడుతూ వంద శాతం ఎఫర్ట్స్ తో టాప్-5 లో చోటు దక్కించుకున్నాడు. అయితే బయట ఎలా ఉందంటే.. గౌతమ్‌ని బిగ్ బాస్ టీమ్ తొక్కేస్తుంది.. నిఖిల్‌ని విన్నర్ చేయాలని బిగ్ బాస్ టీమ్ ముందుగానే ఫిక్స్ అయ్యిందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికే ఇలా చేశారేమో అని అనుకుంటున్నారు. కానీ గౌతమ్ జర్నీ వీడియో చూసాక అది మార్చుకుంటారు. గౌతమ్ జర్నీ వీడియో అదిరిపోయింది. ఇది అందరికంటే ముందు చూపించడం కూడా ఓటింగ్ పరంగా అతనికి చాలా ప్లస్. ఎందుకంటే కీలకమైన చివరి వారంలో ఈ జర్నీ వీడియో కూడా ఓటింగ్‌ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. బిగ్ బాస్ ఆట మరో కీలకమైన దశకు చేరుకుంది. ఫినాలే వీక్‌లో ఫైనలిస్ట్‌ల జర్నీ వీడియోలు వాళ్ల ఓటింగ్‌పై చాలా ప్రభావితం చూపిస్తాయి. వాళ్ల జర్నీని ఎంత బాగా చూపిస్తే అన్ని ఓట్లు. ఎవరి జర్నీని ఎలా చూపించారు? ఎంతసేపు చూపించారు? ఎప్పుడు చూపించారు? ఇవన్నీ కూడా చాలా కీలకమే. అయితే ఇక విజేతను తేల్చేందుకు మూడు రోజుల ఓటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ జర్నీ వీడియోల టైమింగ్ కూడా చాలా కీలకం. అయితే ఫైనలిస్ట్‌లలో తొలి జర్నీ వీడియో గౌతమ్‌కి పడింది. లైవ్ ఎపిసోడ్‌లో గౌతమ్ జర్నీ వీడియో చాలా ఎమోషనల్‌గా చూపించారు.  తన బిగ్ బాస్ జర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు గౌతమ్. తన తల్లి గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. లైవ్ ఎపిసోడ్‌లో దాదాపు 10 నిమిషాల పాటు.. తన లైఫ్ జర్నీ గురించి చెప్పాడు గౌతమ్. తను బిగ్ బాస్ హౌస్‌కి వచ్చింది రెస్పెక్ట్ కోసం అని.. తన లైఫ్‌లో ఇప్పటివరకూ రెస్పెక్ట్ దొరకలేదని.. రెస్పెక్ట్ కోసం ఎంత దూరం అయినా వెళ్తానని అన్నాడు గౌతమ్. బిగ్ బాస్ సీజన్ 7 తన లైఫ్‌కి ఎంతో మేలు చేస్తే.. బిగ్ బాస్ సీజన్ 8 తన లైఫ్‌కి మైల్డ్ స్టోన్ అని అన్నాడు. బిగ్ బాస్ జీవితాంతం రుణపడి ఉంటానంటూ గౌతమ్ సాష్టాంగ నమస్కారం చేశాడు.  

Avinash Av: కమెడియన్ కాదు కంప్లీట్ ఎంటర్‌టైనర్.. నవ్వుని పంచే మీరు అందరికంటే ఐశ్వర్యవంతులు!

  బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకి ముందు ప్రతి సీజన్‌లో టాప్-5 జర్నీ వీడియోలు చూపించడం ఆనవాయితీ. అయితే ఇందులో ఒక్కొక్కరి జర్నీ వీడియో ఒక్కో విధంగా చూపిస్తూ మంచి ఫీల్ ఇస్తుంటాడు బిగ్‌బాస్. ఇక దీని కోసం గార్డెన్ ఏరియాలో చేసే డెకరేషన్, సెలబ్రేషన్ మాములుగా ఉండవు. ఇక ఈ సీజన్ ఫైనలిస్టులకి కూడా జర్నీ వీడియోలను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసింది బిగ్‌బాస్ టీమ్. నేటి ఎపిసోడ్‌లో గౌతమ్, అవినాష్‌లకి సంబంధించిన జర్నీలను చూపించాడు బిగ్ బాస్.  గార్డెన్ ఏరియాలో తన కోసం చేసిన గ్రాండ్ సెటప్ చూసి అవినాష్ చాలా సర్‌ప్రైజ్ అయ్యాడు. ముఖ్యంగా బిగ్‌బాస్ జర్నీలో అవినాష్‌ సాధించిన విజయాలు, ఎమోషన్స్, తన భార్య వచ్చినప్పటి ఫొటోలతో పెద్ద ఆల్బమ్ ఏర్పాటు చేశారు. ఇది చూసి అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఎవిక్షన్ షీల్డ్, తను రెండో సారి మెగా చీఫ్ అయిన టాస్కుకి సంబంధించిన వస్తువులు చూసి ఒకసారి తన జర్నీని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత అవినాష్ గురించి చాలా గొప్పగా చెప్పాడు బిగ్‌బాస్. అవినాష్.. తెలియని సముద్రం భయాన్ని పెంచితే తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది.. ఈరోజు మీరు ఈ స్థానంలో నిలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.. మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకి తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది.. ఎన్ని డిగ్రీలు పొందినవారికైనా అది సాధ్యమవుతుందా చెప్పండి.. ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులైన అందరూ మీ ఆప్తులే.. మీ రింగుల జుట్టు మీ భార్యకి ఎంతో ఇష్టమైనప్పటికీ ఆట మీదున్న ప్రేమ కోసం దాన్ని త్యాగం చేశారు. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చెయ్యగలిగే జస్ట్ కమెడియన్ కాదు.. అన్నీ చేయగలిగే కంప్లీట్ ఎంటర్‌టైనర్‌లా మిమ్మల్ని మీరు ఆవిష్కరించారు.. అవినాష్ ఈ ప్రంపంచంలో అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే దివ్య ఔషధం నవ్వు ఒక్కటే.. ఆ నవ్వును పంచే మీరు అందరికంటే ఐశ్వర్యవంతులంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఈ మాటలకి అవినాష్ కంటతడి పెట్టుకున్నాడు. జస్ట్ కమెడియన్ మాత్రమే కాదు ఎంటర్‌టైనర్ అని బిగ్‌బాస్ చెప్పినప్పుడు అవినాష్ ఫేసులో చాలా ఆనందం కనిపించింది. ఇక బిగ్‌బాస్ మాటలు పూర్తికాగనే విజిల్ వేసి థాంక్యూ అంటూ గట్టిగా అరిచాడు అవినాష్. తన జర్నీని ఇంత గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ చెప్పాడు.  

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో  సూపర్ ట్విస్ట్.. షాక్ లో రెండు కుటుంబాలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -27 లో..... వేదవతి సామూహిక వివాహం జరిగే దగ్గర ఉంటుంది. వాళ్ళని చూస్తే తమ కొడుకులు గుర్తుకువచ్చి సాగర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నాకు మీరే గుర్తు వచ్చారని అనగానే సాగర్ బాధపడుతాడు. ఆ తర్వాత నర్మద మెడలో సాగర్ తాళి కడతాడు. మరొకవైపు సామూహిక వివాహాలు చేసుకున్న వాళ్లు రామరాజు వేదవతిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మనం కూడా అత్తయ్య, మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని నర్మద అనగానే సాగర్ వద్దని అంటాడు. ధీరజ్ ఒక సలహా ఇవ్వడంతో ఆశీర్వాదం కోసం వెళ్తున్న వారి వెనకాలే ఇద్దరు వెళ్లి రామారాజు వేదవతిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత చెంచలమ్మతో మాట్లాడి రామరాజు వేదవతిలు అక్కడ నుండి వెళ్లిపోతారు. మరొకవైపు నర్మద, సాగర్ లు వెళ్తుంటే.. మీరెవరు ప్రేమ వివాహం చేసుకున్నారా అని చెంచలమ్మ అడుగుతుంది. పెద్దలని ఒప్పించి చేసుకోవాలి.. వెళ్లి పెద్దలను క్షేమించమని అడిగండి అని చెంచలమ్మ చెప్పగానే.. సరే అని చెంచలమ్మ దగ్గర సాగర్ నర్మదలు ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు మనం వైజాగ్ వెళదామని సాగర్ అంటాడు. వద్దు మనం మీ ఇంటికి వెళదాం.. చెంచలమ్మ గారు చెప్పింది మర్చిపోయావా అని నర్మద అంటుంది. వద్దని సాగర్ అంటుంటే అప్పుడే ధీరజ్ వచ్చి.. తను చెప్పింది కరెక్ట్ ఇంటికి వెళ్ళాలని అంటాడు. తరువాయి భాగంలో నర్మద, సాగర్ లని తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసి భద్రవతి కుటుంబం ఓవైపు.. రామరాజు కుటుంబం మరోవైపు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.