రియల్ లైఫ్ లో చాలామంది విలన్స్ ని చూస్తున్నాను

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్స్ వాళ్ళు చాలామంది వచ్చారు. అలాగే కావ్య కూడా వచ్చింది. శ్రీముఖి కావ్యని ఒక ప్రశ్న అడిగింది "సీరియల్స్ లో విలన్స్ ని చూసినప్పుడు ఎందుకురా వీళ్ళు ఇంత విలనిజం చూపిస్తారు వీళ్ళను చంపేస్తాను అనిపించిందా" అని అడిగింది. దానికి కావ్య "రియల్ లైఫ్ లో చాలా మంది విలన్స్ ని చూస్తున్నాను కాబట్టి సీరియల్స్ లో విలన్స్ ని చూసాక పెద్దగా ఏమీ అనిపించదు" అని రిప్లై ఇచ్చింది కావ్య. ఈ ఆదివారం రాబోయే ఎపిసోడ్ ని హీరోయిన్స్ వెర్సెస్ విలన్స్ థీమ్ తో తీసుకొచ్చారు. ఇందులో హీరోయిన్స్ అంతా రకరకాల సెక్సీ భంగిమలు పెట్టారు. కావ్య, దీపికా రంగరాజు, సుహాసిని, అమూల్య గౌడా అందరూ కూడా ఈ భంగిమలు పెట్టి ఎంటర్టైన్ చేశారు. ఇక నెటిజన్స్ అంతా కూడా నిఖిల్ ని కావ్యని జోడిగా పిలవండి..." అంటూ కోరుతూ మెసేజెస్ పెడుతున్నారు. ఐతే నిఖిల్ - కావ్యకి కొన్ని నెలల నుంచి ఇద్దరికీ సరిగా కెమిస్ట్రీ కుదరడం లేదు. నిఖిల్ ని కావ్య వదిలేసింది అలాగే నిఖిల్ మాస్క్ మ్యాన్ ,  విలన్ అంటూ చెప్తోంది. నిఖిల్-కావ్య మధ్య ఏడేళ్ల రిలేషన్‌ ఒక్కసారిగా బ్రేక్ అయ్యింది . నిఖిల్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు కావ్యతో బ్రేకప్ చెప్పేసి  తాను సింగిల్ అంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. నిఖిల్, కావ్య  మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళు కచ్చితంగా కలవాలి అని కోరుకుంటున్నారు.  

హైపర్ ఆది  : కావ్య కాలేజీలో నేను ఉండి ఉంటే 500 ల సార్లు నేనే ప్రపోజ్ చేసేవాడిని

బుల్లితెర మీద చాలా షోస్, ఈవెంట్స్ ప్రసారమవుతూ ఉంటాయి. వీటి షూటింగ్ టైమ్స్ లో ఆఫ్ స్క్రీన్ లో మంచి కామెడీ నడుస్తూ ఉంటుంది. అలాంటి ఒక షో రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా  ప్రసారమయ్యింది. అదే న్యూ ఇయర్ దావత్ లొకేషన్ హోమ్ టూర్ షో. అందులో కావ్య, రీతూ చౌదరి, ఆది మధ్య మంచి కామెడీ జరిగింది. రీతూ చౌదరి వచ్చి "హాయ్ కావ్య..వాట్సాప్..ఎలా ఉన్నావ్" అని అడిగింది. "ఇలా ఉన్నా" అని కావ్య చెప్పేలోపు ఆది వచ్చేసాడు. "హాయ్ కావ్య..ఎలా ఉన్నావ్" అని అడిగాడు. " బాగున్నాను" అని చెప్పింది కావ్య. "ఆది నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పవు కానీ కావ్యను అడిగినప్పుడు మాత్రం వచ్చేస్తావ్" అంటూ రీతూ చౌదరి ఆది మీద అరిచింది. "కావ్య నచ్చని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరూ" అని ఆది కావ్య గురించి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసాడు. "నా లైఫ్ లో కావ్య అంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. సీరియస్ గానే చెప్తున్నా ఈ విషయం. అందరికీ చెప్పేది బిస్కెట్..కానీ కావ్య విషయంలో చెప్పేది రియల్. ఇలా ఎలా ఇంత అందంగా పుట్టావ్. నీకు ఇప్పటి వరకు నీ లైఫ్ లో కాలేజ్ డేస్ లో ఎన్ని ప్రొపోజల్స్ వచ్చాయి." అని ఆది అడిగాడు. "నాలుగైదు వచ్చి ఉంటాయి " అంది కావ్య. "అరేయ్ ఇలాంటి అందమైన అమ్మాయికి కాలేజీలో నాలుగైదు ప్రొపోజల్స్ మాత్రమే వచ్చాయా ...ఒకవేళ ఆ కాలేజీలో నేను ఉంటే 400 ,500 ల సార్లు నేనే ప్రొపోజ్ చేసేవాడిని" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నెటిజన్స్ ఐతే క్రీమ్  బిస్కెట్, నిఖిల్ వింటే ఈ మాటలు ఇక ఆది పని అంతే" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Illu illalu pillalu : ఆమెను డబ్బులకి అమ్మాలనుకుంటున్న కళ్యాణ్.. ఆ పెళ్ళి జరిగేనా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -46 లో..... మేనకోడలు పెళ్లికి వేదవతిని పిల్వలేదని పెద్దావిడ బాధపడుతుంది. భద్రవతి వచ్చి ఎందుకు భాదపడుతున్నావ్.. లేచిపోయిన వాళ్ళ ఆశీర్వాదం దరిద్రమని వేదవతిని తిడుతుంది. అదంతా నర్మద, వేదవతి లు వింటారు. వేదవతి లోపలికి వెళ్లి బాధపడుతుంది. అత్తయ్య మీరు ఎన్ని రోజులు బాధపడతారు.. మీరు మీ మేనకోడలని ఆశీర్వదించే ఛాన్స్ వస్తుందని నర్మద చెప్తుంది. ఆ తర్వాత వేదవతి దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. తనని హగ్ చేసుకొని వేదవతి బాధపడుతుంది. మీ నాన్న చనిపోయేముందు మన కుటుంబం ఎప్పుడు కలిసి ఉండాలని అన్నాడు కానీ ఆ కోరిక తిరేలా లేదు. ఆ ఇంటికి ఈ ఇంటికి ప్రేమ పెళ్లి వారధి అనుకున్నాను కానీ ఈ ఒక్క అవకాశం కూడా లేదని పెద్దావిడ బాధపడుతుంది. ఆ తర్వాత వేదవతి తన మేనకోడలికి వెయ్యమని అక్షింతలు ఇస్తుంది. అలాగే ఒక నెక్లెస్ కూడా ఇస్తుంది. అది పట్టుకొని పెద్దావిడ వెళ్తుంటే భద్రవతి ఆపి నెక్లెస్ చూసి విసిరేస్తుంది. అది రామరాజుపై పడుతుంది. ఆ తర్వాత అక్షింతలు కూడా పడేస్తుంది. లోపలికి పదండీ అంటూ వేదవతి వాళ్ళని లోపలికి వెళ్ళమంటాడు రామరాజు. మరొకవైపు ప్రేమని అమ్మాలనుకుంటాడు కళ్యాణ్. దాంతో ఒకతని దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాడు కళ్యాణ్. అతను వచ్చి రేపటిలోగా ప్రేమని తీసుకొని రాకుంటే.. చంపేస్తానంటూ బెదిరిస్తాడు. దాంతో కళ్యాణ్ భయపడి ప్రేమకి ఫోన్ చేస్తాడు కానీ తను లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత ప్రేమను చూసిన ధీరజ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి.. ప్రేమ నెంబర్ తీసుకుంటాడు. ఆ తర్వాత ప్రేమకి ఫోన్ చేసి ధీరజ్ మాట్లాడతాడు అప్పుడు కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఫోన్ చేయగానే.. ప్రేమ లిఫ్ట్ చేస్తుంది కానీ తన పెళ్లి విషయం చెప్పలేక కట్ చేస్తుంది. తరువాయి భాగంలో ప్రేమ తన పెళ్లి విషయం కళ్యాణ్ కి చెప్తుంది. దాంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. ఎలాగైనా ప్రేమని తీసుకొని వచ్చి వాడికి అమ్మాలని అనుకున్నానని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : గతం చెప్పేసిన కార్తీక్.. ప్రాణదాత తనే అని మురిసిపోయిన దీప!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -245 లో..... కార్తీక్ తన జ్ఞాపకమైన లాకెట్ వెనకాలున్న గతం గురించి దీపకు చెప్తాడు. మేము చిన్నప్పుడు  మా అత్తయ్యతో కలిసి ఒక గుడికి వెళ్ళాం.. అక్కడ కోనేరులో ఉన్న పువ్వు కావాలని అడిగింది జ్యోత్స్న. నాకు నీళ్లంటే భయమైన లోపలికి వెళ్ళాను.. నేను మునిగిపోతుంటే జ్యోత్స్న వదిలేసి వెళ్ళింది కానీ ఒక అమ్మాయి నన్ను కాపాడింది. నాకు ఇంకా గుర్తుంది.. నేను వెళ్తుంటే తన లాకెట్ నా జేబులో ఉంది. ఎప్పటికైనా తన ఋణం తీర్చుకుంటానని కార్తీక్ గతమంతా చెప్తాడు. అది విన్న దీప అది నేనే అని మనసులో మురిసిపోతుంది. మిమ్మల్ని కాపాడింది నేనేనా.. అందుకే ఋణం తీర్చుకున్నారని దీప ఎమోషనల్ అవుతుంది. కానీ తనే కాపాడిందని, ఆ లాకెట్ తనదేనని దీప చెప్పదు. నన్ను కాపాడిన అమ్మాయి ఏం అడిగిన ఇస్తాను.. ఒక ప్రాణం తప్ప.. ఎందుకంటే నా ప్రాణం నా భార్యది అని ఎమోషనల్ గా మాట్లాడతాడు కార్తీక్. ఆ తర్వాత శౌర్య వచ్చి లాకెట్ ఇవ్వమని అడుగగా.. నేను ఇవ్వనని శౌర్యని బుజ్జగిస్తాడు కార్తీక్. కాసేపటికి కార్తీక్ వెళ్ళిపోయాక.. మీరు ఎలా  ఉండేవారు ఎలా అయ్యారు.. మీరు మీ తాతయ్య గారితో ఛాలెంజ్ చేశారు.. మీరు నేను కోరుకున్న విధంగా ఉన్నప్పుడు.. మీ ప్రాణదాత నేనే అని చెప్తాను. అప్పటివరకు చెప్పనని దీప అనుకుంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ లు టిఫిన్ కి అవసరమయ్యే సరుకులు తీసుకొని వస్తుంటారు. నేను పట్టుకుంటానని దీప అనగానే.. ఇది కూడా మోయ్యాలేననుకున్నావా అని కార్తీక్ అంటాడు. అప్పుడే పారిజాతం వచ్చి విజిల్ వేస్తుంది. ఏం సీన్ అంటూ నవ్వుకుంటుంది. కార్తీక్ ని అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది పారిజాతం. ఈ దీపతో ఉంటే ఇదే పరిస్థితి వస్తుంది. అదొక నష్టజాతకురాలని దీపని తిడుతుంది పారిజాతం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అత్తతో సారీ చెప్పించుకున్న కోడలు.. భద్రం చేసే మోసాన్ని వాళ్ళు గుర్తిస్తారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -295 లో... ఒకతనికి ప్రాజెక్ట్ గురించి ఐడియా ఇచ్చినందుకు సీతాకాంత్ కి అతను డబ్బులు ఇస్తాడు. తనకి అడ్వైజర్ గా ఉండమని అడుగగా సీతాకాంత్ సరే అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంటికి వెళ్ళాక ఎవరు ఎంత సంపాదించారో చూసుకుంటారు. నేను ఆటో రెంట్ పోగా వెయ్యి సంపాదించానని రామలక్ష్మి అంటుంది. నేను రెంట్ పోగా ఆరు వెయ్యలు సంపాదించానని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి ఒక్క రోజులో అంత డబ్బా అని ఆశ్చర్యంగా చూస్తుంది. నేను నీలాగా వెయ్యి సంపాదించాను కానీ ఒకతనికి ఐడియా ఇస్తే నాకూ డబ్బు ఇచ్చాడని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి సీతాకాంత్ డబ్బులు గల్లాలో వేస్తుంది. ఏంటి అలా వేస్తున్నావని సీతాకాంత్ అడుగగా.. ఇద్దరు సంపాదిస్తుంటే ఒకరివి ఇలా సేవ్ చెయ్యాలి.. ఫ్యూచర్ లో ఎవరిని అడగాల్సిన పని ఉండదని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు కబుర్లు చెప్పుకుంటూ.. ఒకరికొకరు భోజనం తినిపించుకుంటారు. మరుసటి రోజు ఉదయం మనం మొదలు పెట్టబోయే రియల్ ఎస్టేట్ వెంచర్ ఇదే అని శ్రీలత వాళ్లకి చూపిస్తాడు భద్రం. సీతాకాంత్ వెంచర్ అని పెడితే సీతాకాంత్ పై నమ్మకంతో అందరు కొంటారు.. ఆఫర్స్ పెట్టి అమ్మాలి.. మేమే కట్టిస్తామని చెప్పాలని భద్రం అనగానే.. మరి మనకేం లాభమని సందీప్ అంటాడు. ఇందులో లాభం చాలా ఉంటుంది. ఒక ఫైవ్ పర్సెంట్ లాభం ఇవ్వండి. మిగతావి మొత్తం మీదే అనగానే శ్రీలత వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. లాభమని ఆనందపడుతున్నారు తర్వాత జరగబోయే నష్టం తెలిస్తే అని భద్రం తనలో తాను అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీవల్లి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. పక్కన శ్రీలత ఉంటుంది. మెల్లగా వెళ్ళమని చెప్తూ శ్రీలత భయపడతుంది. అప్పుడే ఎదురుగా వస్తున్న రామలక్ష్మి ఆటోకి డాష్ ఇస్తుంది శ్రీవల్లి. కళ్ళు నెత్తికెక్కినాయా అని శ్రీలత వాళ్ళపై రామలక్ష్మి కోప్పడుతుంది. శ్రీలత పొగరుగా మాట్లాడతుంది. దాంతో రామలక్ష్మి అందరిని పిలిచి ఇలా డాష్ ఇచ్చారు. పైగా తిడుతున్నారని చెప్తుంది. అందరు శ్రీలత వాళ్ళని తిడతారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని రామలక్ష్మి అనగానే.. ఏం చెయ్యాలి అక్కా అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. సారీ చెప్పాలని రామలక్ష్మి అనగానే శ్రీవల్లి సారీ చెప్తుంది. నువ్వు కాదు ఆవిడ అనగానే.. నేను చెప్పనంటుంది శ్రీలత. దాంతో శ్రీవల్లి రిక్వెస్ట్ చెయ్యడంతో రామలక్ష్మికి సారీ చెప్తుంది శ్రీలత. త్వరలోనే సీతాకాంత్ సర్ కి కూడా చెప్పిపిస్తానని శ్రీలతతో రామలక్ష్మి ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : తప్పించుకున్న నందగోపాల్.. రాజ్, కావ్య పట్టుకుంటారా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -610 లో.... కావ్యతో సావిత్రి క్లోజ్ గా ఉంటున్నాడని జెలస్ గా ఫీల్ అవుతాడు రాజ్. ఆ తర్వాత మేము కిడ్నాపర్స్ అంటూ సావిత్రిని భయపెట్టి కార్ దిగి వెళ్లిపోయేలా చేస్తాడు రాజ్. ఆ తర్వాత నందు గాని అడ్రెస్ దొరికిందంట పదా అంటూ కావ్యని తీసుకొని రాజ్ నందగోపాల్ ఫామ్ హౌస్ కి వెళ్తాడు. ఎక్కడికి వెళ్లినా ఈ పాత బంగ్లా గోలేంటి.. ఈ బంగ్లా చూస్తే నాకూ ఏదేదో గుర్తొస్తుందని కావ్య అనగానే.. ఆ పీడకలని ఎందుకు గుర్తుచేస్తావని రాజ్ అంటాడు. ఆ తర్వాత సెక్యూరిటీతో రాజ్ మాట్లాడతాడు. మేము నందు ఫ్రెండ్స్ తనకి సర్ ప్రైజ్ ఇవ్వాలని వచ్చామంటూ రాజ్ చెప్తాడు. దాంతో సెక్యూరిటీ వాళ్ళని లోపలికి పంపిస్తాడు. మరొకవైపు అత్తాకోడళ్ళిద్దరు ఎక్కడికో వెళ్తున్నట్లున్నారని ధాన్యలక్ష్మి అడుగుతుంది. హాస్పిటల్ కి అని ఇందిరాదేవి చెప్పాగానే.. ఎలా వెళ్తారు కార్లు లేవ్ కదా అని రుద్రాణి అంటుంది. సుభాష్ వస్తున్నాడు.. వెళ్తామని ఇందిరదేవి అంటుంది. అప్పుడే సుభాష్ వస్తాడు. కార్ ట్రబుల్ ఇచ్చిందని సుభాష్ అంటాడు. అయ్యో ఇప్పుడు ఎలా వెళ్తారు ఆటోకి వెళ్తారా అంటూ రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. నేను క్యాబ్ బుక్ చేస్తానని ప్రకాష్ అంటాడు. మరొకవైపు రాజ్ , కావ్య ఇద్దరు గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తారు. అక్కడ బెడ్ రూమ్ డెకరేషన్ చేసి ఉంటుంది. అది చూసి ఇది మీ ప్లాన్ అయితే కాదు కదా అని రాజ్ తో కావ్య అనగానే.. ఎలా కన్పిస్తున్నానని రాజ్ అంటాడు. కావ్య, రాజ్ లు పొరపాటుగా బెడ్ పై పడిపోతారు. ఇద్దరు రొమాంటిక్ గా చూసుకుంటు ఉంటారు. అప్పుడే నందగోపాల్ వచ్చినట్లు వాళ్లకు వినిపిస్తుంది. వాడు వచ్చాడని రాజ్ అంటాడు. ఆ తర్వాత నందగోపాల్ తన గర్ల్ ఫ్రెండ్ తో లోపలికి వస్తారు. వాళ్ళకి ఎదరుగా రాజ్ , కావ్య ఉంటారు. ఎన్ని రోజులు తప్పించుకుంటావురా.. ఇంత మోసం చేస్తావా అని రాజ్ అనగానే.. లాస్ వచ్చింది అందుకే ఇలా చేసానని నందగోపాల్ అంటాడు. నందగోపాల్ ని రాజ్ కొడుతుంటే అతను పారిపోతాడు. తన వెనకాలే రాజ్, కావ్య వెళ్తారు కానీ మధ్యలో కార్ ఆగిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్ కి వెళ్తాడు. మీ సర్ ఎక్కడ చెప్పమని సెక్యూరిటిని రాజ్ అడుగుతాడు. నాకు తెలియదని అతను చెప్తాడు. ఎలాగైనా వాడిని వెతికి పట్టుకోవాలని కావ్య అంటుంది. తరువాయి భాగంలో మీరు ఊరేగడానికి ఏసీ కార్ కావాలి.. ఇంట్లో వాళ్ళు బయటకి వెళ్ళడానికి ఒక్క కార్ కూడా అవసరం లేదా మీకు కార్లు వద్దని చెప్పే అధికారం ఎవరు ఇచ్చారని కావ్యని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అన్ని విషయాల్లో సర్వహక్కులు తాతయ్య గారు నాకు ఇచ్చారు.. మీకు నచ్చినా, నచ్చకున్నా నేను చెప్పింది వినాలని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu: మేనకోడలి పెళ్ళికి గిఫ్ట్ పంపిన అత్త.. విసిరేసిన భద్రవతి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -45 లో.... వేదవతి దగ్గరికి నర్మద వచ్చి కూరగాయలు కొనుక్కొని వద్దాం అత్తయ్య అని అడుగుతుంది. మొదట రానని అన్నా కూడా నర్మద తన మాటలతో కన్విన్స్ చేస్తుంది. ఇద్దరు కలిసి కూరగాయలు కొనడానికి వెళ్తారు. మరొక వైపు ప్రేమని ధీరజ్ అటపట్టిస్తాడు. నిన్ను పెళ్లి చేసుకునే వాడు ఎవడో గాని వాడి పని అంతే అని ధీరజ్ అంటాడు. ధీరజ్ ని కొట్టాలని ప్రేమ ఏదో ఒకటి విసిరేస్తుంది. అవి అన్ని కూడా తిరుపతికి తాకుతాయి. ఆ తర్వాత నర్మద, వేదవతి లు కూరగాయలు కొంటుంటారు. అప్పుడే సేనాపతి, రేవతిలు అటుగా కార్డ్స్ ఇస్తూ వెళ్తు.. నర్మద, వేదవతిలని చూస్తారు. సేనాపతి వేదవతి వంక వెళ్తాడు. తన చెల్లిపై ఎంత కోపమున్నా కార్డ్ ఇవ్వడానికి వెళ్తున్నాడని రేవతి అనుకుంటుంది. వేదవతి కూడా అలాగే అనుకుంటుంది కానీ సేనాపతి వచ్చి కూరగాయలు అమ్మేవాడికి  కార్డు ఇస్తాడు సేనాపతి. దాంతో వేదవతి బాధగా అక్కడ నుండి వెళ్తుంది. తన వెనకాలే నర్మద వెళ్తుంది. మరొకవైపు ప్రేమని పెళ్లి కూతురులాగా రెడీ చేస్తారు. తనని చూసి భద్రవతి మురిసిపోతుంది. ఆ తర్వాత వేదవతి బయట ఉండి ఆ ఇంటి వైపు చూస్తుంటుంది. వేదవతి వాళ్ళ అమ్మ బయటకు వచ్చి బాధపడుతుంటే.. ఎందుకు అమ్మ లోపలికి రా అని భద్రవతి అంటుంది. అసలైన వాళ్లు వస్తేనే సంతోషమని పెద్దావిడ అనగానే అసలైన వాళ్ళు ఎవరని భద్రవతి అంటుంది. మేనత్త అని పెద్దావిడ అంటుంది. దాంతో భద్రవతి తనపై కోప్పడుతుంది. తరువాయి భాగం లో వేదవతి ప్రేమకి గిఫ్ట్ గా నెక్లెస్ తీసుకొని పెద్దావిడకి ఇచ్చి పంపిస్తుంది. అది చూసి భద్రవతి దానిని దూరంలో విసిరేయగా అటుగా వస్తున్న రామరాజుపై పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : అలమరాలో దొరికిన లాకెట్ తీసుకున్న దీప.. నిజం చెప్పేసిన కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -244 లో.....ఒక పాప టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చి.. డబ్బు లేదు. నాకు ఆకలిగా ఉంది. ఇంటి దగ్గర అమ్మ ఉందనగానే దీపకి జాలి వేసి టిఫిన్ తనకి, తన అమ్మకి పంపిస్తుంది. ఆ తర్వాత ఒక తాగుబోతు వస్తాడు. అది తీసుకొని రా. ఇది తీసుకొని రా అంటూ దీపని ఇబ్బంది పెడతాడు. తీరా చూస్తే డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోతుంటాడు. అతడిని దీప డబ్బులు అడుగగా.. ఇవ్వడు. నా గురించి ఎక్కడైనా అడుగు..‌ఈ ఏరియా నాది అంటూ రుబాబుగా మాట్లాడతాడు. ఆ తర్వాత రౌడీ కోపంగా బండిని పట్టుకుంటాడు. దాంతో దీప అతని చెయ్యి ఆపుతుంది‌. సివంగిలా రౌడీ అంతు చూస్తుంది దీప. తప్పు అయింది.. నా దగ్గర డబ్బు లెవ్వని రౌడీ అనగానే.. సరే వాచ్ ఇవ్వమని వాచ్ తీసుకుంటుంది. అది చూసిన కాంచన , కార్తీక్ లు దీప ధైర్యం చూసి మురిసిపోతారు. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి తన మేనేజర్ వచ్చి రెస్టారెంట్ లాస్ లో ఉందని చెప్తాడు. అలా కాకుండా చూడాలి బావ లాంటి వాళ్ళ ముందు మాట పడాల్సి ఉంటుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత వచ్చిన డబ్బులో నేను సగం తీసుకుంటానని కార్తీక్ అందులో నుండి కొంత డబ్బు తీసుకుంటాడు. అది తీసుకొని దాచి పెడుతు ఇది మన కూతురు కోసం తీసాను దీప అని కార్తీక్ అనుకుంటాడు. కార్తీక్ డబ్బులు అలమరాలో పెట్టేటప్పుడు కార్తీక్ జ్ఞాపకమైన లాకెట్ కిందపడుతుంది. అది కార్తీక్ చూసుకోకుండా వెళ్ళిపోతాడు. కాసేపటికి అది శౌర్యా చూసి తీసుకుంటుంది‌. అప్పుడే దీప వచ్చి ఏంటని శౌర్యని అడుగుతుంది. బలవంతంగా శౌర్య దగ్గర నుండి లాకెట్ తీసుకొని చూస్తుంది దీప. అది చూసి షాక్ అవుతుంది. తన అమ్మ జ్ఞాపకమని గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ లాకెట్ గురించి వెతుక్కుంటూ ఉంటే.. అప్పుడే దీప వచ్చి.. ఇదేనా అని అడుగుతుంది. ఇది ఎక్కడిది మీకు ఎవరు ఇచ్చారు తెలుసుకోవాలని ఉందని దీప అనగానే.. కార్తీక్ చెప్తాను అంటాడు. ఇన్నిరోజులు ఈ విషయం చెప్పే అంతా సాన్నిహిత్యం రాలేద‌ని కార్తీక్ అంటాడు. ఇక తనని చిన్నప్పుడు ఒక అమ్మాయి కొలనులో పడిపోతే కాపాడిందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : సీఈఓ పదవి వదిలి ఆటో నడుపుకుంటున్న సీతాకాంత్.. భద్రం ఆట మొదలైందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -294 లో.....సందీప్, ధన లు ఇంటికి వచ్చి ఆనందంగా అమ్మ అంటూ పిలుస్తారు. ఎంటి ఇంత హ్యాపీగా ఉన్నారని శ్రీవల్లి అంటుంది. మన ప్రాబ్లమ్ అని క్లియర్ అయ్యే అవకాశం దొరికిందని భద్రం గురించి చెప్తాడు సందీప్. అప్పుడే భద్రం వస్తాడు. మీ ప్రాబ్లమ్ అన్నిటిని నేను సాల్వ్ చేస్తానని శ్రీలతకి చెప్తాడు. ఒక్క రూపాయి మీరు పెట్టుబడి పెట్టనవసరం లేదని భద్రం అనగానే.. శ్రీలత వాళ్ళు సరే అంటారు. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా అంటేనే కదా.. మీరు నా మాట వింటారని భద్రం అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి ఆటోకి పూజ చేస్తుంది. డ్రైవర్ కష్టాలు సీతాకాంత్ కి చెప్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత రామలక్ష్మి చిటికె వెయ్యగానే ఇంకొక ఆటో వస్తుంది. ఒకటి రామలక్ష్మి ఇంకొకటి సీతాకాంత్ కి దానికి కూడా రామలక్ష్మి పూజ చేస్తుంది. ఇద్దరు ఆటో నడపడానికి చెరొకవైపు వెళ్తారు. మరొకవైపు సందీప్, ధన లు ఆఫీస్ కి వెళ్లి.. నేను సీట్ లో కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అంటూ గొడవపడతారు. దాంతో మీరు ఆపండి ఆఫీస్ గురించి ముందు నాకు చెప్పండి అని భద్రం అనగానే సందీప్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఆటోలో ఒకతను ఎక్కుతాడు. తన ఆఫీస్ టెన్షన్ లో ఉంటే తనకి మంచి ఐడియా ఇస్తాడు. దాంతో అతను సీతాకాంత్ కి థాంక్స్ చెప్తాడు. కొంత డబ్బిచ్చి మీరు నాకు అడ్వైజర్ గా ఉండాలని అతను చెప్పి సీతాకాంత్ నెంబర్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో సావిత్రి.. అడ్రెస్ కనిపెట్టగలడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -609 లో......రాజ్, కావ్య లు వెళ్తుంటే ఒకతను లిఫ్ట్ అడుగుతాడు. అతను రాజ్, కావ్య లని పరిచయం చేసుకుంటాడు. నా పేరు సావిత్రి అంటూ చెప్పగానే అదేంటి అమ్మాయి పేరు పెట్టుకున్నావని రాజ్, కావ్య అడుగగా.. తన పేరు వెనకున్న స్టోరీని సావిత్రి చెప్పుకొస్తాడు. అదేంటి అంత దరిద్రమైన జాతకమా అని రాజ్ అంటాడు. ఇప్పుడు నేను పెళ్లి చూపులకి వెళ్తున్నానని సావిత్రి చెప్తాడు. ఆ తర్వాత సావిత్రి వెనకాల కావ్య పక్కన వెళ్లి కూర్చొని ఉంటాడు. మొదట రాజ్ డ్రైవర్ కావ్య మేడమ్ అని చెప్తాడు. దాంతో డ్రైవర్ అంటూ రాజ్ తో మాట్లాడుతాడు సావిత్రి. రాజ్ కి కోపం వస్తుంది. మరొకవైపు కళ్యాణ్ హాస్పిటల్ లో ఒక పోలీస్ మహిళను చూసి అప్పుని గుర్తు చేసుకుంటాడు. అప్పుతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత డ్రైవర్ కార్ ఆపు కొబ్బరి బొండం దగ్గర అని సావిత్రి అనగానే.. రాజ్ కార్ ఆపుతాడు. కావ్య కావాలనే సావిత్రి చెయ్ పట్టుకొని దిగుతుంది. దాంతో రాజ్ కుళ్ళు కుంటాడు. ఆ తర్వాత సావిత్రికి లాయర్ ఫోన్ చేసి కోర్ట్ లో కేసు గెలిచామని అంటాడు. దాంతో మేడం చెయ్ పట్టుకోగానే అదృష్టమని కావ్యని సావిత్రి పొగుడతాడు. దాంతో రాజ్ కి కోపం వచ్చి కొబ్బరి బొండం కాలుపై పడేస్తాడు. మరొకవైపు నందగోపాల్ తన ఫామ్ హౌస్ కి వస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ ని కాల్ చేసి రమ్మని చెప్తాడు. నువ్వే వచ్చి తీసుకొని వెళ్ళమని తను అనగానే.. సరే అని సెక్యూరిటీకి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాజ్ కావ్య, సావిత్రి వాళ్లు వెళ్తుంటారు. అప్పుడే రాజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి నందగోపాల్ అడ్రస్ షేర్ చేస్తున్నానని అంటాడు. సరే వెంటనే వస్తున్నామని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Tasty Teja: పుష్ప రేంజ్ లో టేస్టీ తేజ.. ఫుడ్ వ్లాగర్ అనుకుంటివా అంతకుమించి!

  టేస్టీ తేజా అంటే బిగ్ బాస్ అనుకుంటిరా.. అంతకుమించే అనేట్టుగా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ బిజినెస్‌ని వ్యాప్తి చేసాడు. ఇప్పుడు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్‌కి గురిపెట్టాడు తేజ. బిగ్ బాస్ సీజన్-7తో పాటు సీజన్-8లోనూ కంటెస్టెంట్‌గా వెళ్లి అత్యధిక రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్‌లో చేరాడు. అంతేకాదు.. రెమ్యూనరేషన్‌ విషయంలోనూ గట్టిగానే అందుకున్నాడు. బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న టేస్టీ తేజ.. ఇప్పుడు దానిని వినియోగించుకునే పనిలో పడ్డాడు. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేశాడు.అందులో ఏం చెప్పాడంటే.. నన్ను ఇష్టపడే వాళ్లు కేవలం బిగ్ బాస్ షోలేనే కాకుండా బిజినెస్ పరంగా కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఇరానీ నవాబ్ అని ఫ్రాంచైజీ స్టార్ట్ చేశా. ఇప్పటి వరకూ 22 బ్రాంచ్‌లు ఓపెన్ అయ్యాయి. అసలు ఎవడన్నా తేజా గాడూ.. తేజా గాడ్ని నమ్మి అంతమంది ఇరానీ నవాబ్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. నన్ను నమ్మి.. అంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారు. త్వరలో మరో 3 బ్రాంచ్‌లు కంప్లీట్ చేసి ఇరానీ నవాబ్ పేరున పెద్ద ఈవెంట్ చేయబోతున్నానని తేజ అన్నాడు. ఇరానీ నవాబ్‌లో టీ టేస్ట్ బాగుంది కాబట్టి సూపర్ సక్సెస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగుళూరు ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఇప్పుడు యూకే, యూఎస్, దుబాయ్‌లలో కూడా ఇరానీ నవాబ్ టీ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నానంటు చెప్పాడు. అంటే ఈ లెక్కన టేస్టీ తేజా నేషనల్ నుంచి ఇంటర్నేషన్ రేంజ్‌కి వెళ్తున్నాడన్న మాట. లీగల్‌గా కొన్ని పర్మిషన్స్ కావాల్సి ఉన్నాయని వాటి కోసం వెయిట్ చేస్తున్నట్టు.. వాళ్ళ టీమ్ అదే పనిలో ఉందంటూ టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు.   

శివుడు కాలభైరవవుడి రూపంలో ఇక్కడి కుక్కలను కాపాడుతూ ఉంటాడు

రేణు దేశాయ్ ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈమెకు భూతదయ చాలా ఎక్కువ. ఇలా మూగజీవాల్ని ప్రేమించే మహిళల్లో ఎవరైనా ఉన్నారు అంటే రష్మీ, సదా, రేణు దేశాయ్ ఇలా కొంతమంది ఉన్నారు. ఇక ఇప్పుడు రేణు దేశాయ్ అకీరా నందన్, ఆద్యతో కలిసి కాసి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వాళ్ళ అప్డేట్స్ ని రెగ్యులర్ గా రేణు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఒక పోస్ట్ ని తన స్టేటస్ లో పెట్టింది. "కుక్కల్ని కాపాడేవాళ్ళను ఆ పరమ శివుడు కచ్చితంగా రక్షిస్తాడు. శివుడు అంటే ఎవరో కాదు.. ఆ కాల భైరవుడు రూపంలో ఉండే దైవమే. ఆ కాల భైరవ రూపంలో ఉండే శివుడే కుక్కల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకే అవి కూడా ఆ కాలభైరవుడిని తమ ఇష్టదైవంగా భావిస్తూ ఉంటాయి. ఆ శివుడే తమను కాపాడుతూ ఉంటాడు అనుకుంటూ ఉంటాయి. ఎందుకంటే కాశీకి క్షేత్రపాలకుడు ఆ కాలభైరవుడే " అంటూ రేణు దేశాయ్ ఒక పోస్ట్ పెట్టింది. కాషాయి వస్త్రం ధరించి కాశీ వీధుల్లో వీళ్లంతా వెళ్తూ అక్కడ సాధుసంతువులతో మాట్లాడుతూ ఉన్న పిక్స్ ని, వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంది. ఇక వీళ్ళు ఒక ఫేమస్ స్టార్, డిప్యూటీ సీఎం పిల్లలు అన్న ఆలోచన లేకుండా చాలా సింపుల్ గా వెళ్ళిపోతూ కాశీ యాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. రేణు దేశాయ్ కి మూగ జీవాలంటే ఎంత ప్రేమతో ఉంటుందో అంతే దైవ భక్తి కూడా.    

ఇండస్ట్రీ అనేది నీటి బుడగ.. ఎంతవరకు ఉంటుందో చెప్పలేము

  బుల్లితెర మీద జబర్దస్త్ షోలో నూకరాజు కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. జడ్జ్ ఇంద్రజాను అమ్మ అమ్మ అని పిలుస్తూ కామెడీ చేస్తాడు. అప్పుడప్పుడు గెటప్ శీనులా గెటప్స్ వేస్తాడు. ఐతే నూకరాజు తన ఇండస్ట్రీ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. "నేను డిప్లొమా చేసేటప్పుడు యాదమ్మ రాజును, సద్దాంని పటాస్ షోలో చూస్తూ ఉండేవాడిని. నేను మా విజయవాడలో ఒక గల్లీ కమెడియన్ ని. ఐతే నేను కూడా ఇలాంటి వెళ్తే బాగుండేది కదా అనుకునే వాడిని. అలా పటాస్ ఆడిషన్స్ కి ట్రై చేసాను. కానీ సెలెక్ట్ కాలేదు. కానీ జీ తెలుగులో వచ్చే కామెడీ కిలాడీలు షోకి ఆడిషన్స్ కి వెళ్తే సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ హైదరాబాద్ కి ఏదో చేసేద్దాం అని వచ్చి వారం ఉండి వెళ్ళిపోయాను. తర్వాత విజయవాడలో నా పని చేసుకుంటూ నేను ఆడిషన్స్ కి ట్రై చేస్తూ ఉండేవాడిని. నేను కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అనుకునే వాళ్లకు ఒక్కటే చెప్తున్నా..మొత్తం అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అంటే అవ్వదు. ఎందుకంటే ఇండస్ట్రీ నీటి బుడగ లాంటిది ఎప్పుడు ఉంటుందో తెలీదు ఎప్పుడు పోతుందో తెలీదు. మనం ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. ఇంట్లో పని చేసుకుంటూనే కష్టపడి ఆడిషన్స్ ఇస్తూ వచ్చాను. జీ తెలుగు నుంచి పటాస్ ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అలా బండి నడిపిస్తున్న. జీ తెలుగులో కామెడీ షో ఆగిపోయాక నేను మళ్ళీ విజయవాడ వచ్చి నా కూలి పనులు చేసుకున్నా. ఆ టైములో నేను బతకాలి హైదరాబాద్ లో రూమ్ రెంట్ లు కట్టాలి కాబట్టి నా పని నేను చేసుకుంటూ వెళ్ళా. నేను యాక్టింగ్ లాంటిది ఏమీ నేర్చుకోలేదు. మిడిల్ క్లాస్ వాళ్లకు రోజు సంపాదించుకోవడానికి జాబ్ చేయడానికే టైం సరిపోదు మళ్ళీ యాక్టింగ్ ప్రాక్టీస్ లు అంటే కుదరని పని. అందరినీ చూసి యాక్టింగ్ నేర్చుకున్నా అంతే. టక్ జగదీశ్ లో, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీస్ లో చేసినప్పుడు నాకు చాలామంది సినిమా వాళ్ళు ఫోన్ చేసి బాగా చేసావ్ అన్నారు. గుమ్మడికాయంత కష్టపడినా కానీ ఆవగింజంతైనా అదృష్టం ఐతే ఉండాలి.." అంటూ చెప్పుకొచ్చాడు నూకరాజు.  

Illu illalu pillalu : మేనకోడలి పెళ్ళికి ఆమెను పిలుస్తారా.. సూపర్ ట్విస్ట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -44 లో......తిరుపతి భద్రవతి వాళ్ళ దగ్గరికి వెళ్లి.. ఏం జరుగుతుందని అడుగగా నా మేనకోడలు పెళ్లి జరుగుతుందని భద్రవతి వేదవతి వాళ్ళకి వినపడేలా మాట్లాడుతుంది. నా మేనకోడలు పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నాను. నాకు మాత్రమే మేనకోడలు పెంపకం అంటే తెలుసు.. ఇది కొందరికి పెంచడం చేతకాదు లేచిపోయి పెళ్లిచేసుకుంటారు. మా కుటుంబం నచ్చి అమెరికా సంబంధం వెతుక్కుంటూ వచ్చిందని వేదవతి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతుంది భద్రవతి. మరొకవైపు ధీరజ్ దగ్గరికి తిరుపతి వచ్చి ప్రేమ పెళ్లి అవుతుందని చెప్పగానే.. మంచి పని అవుతుందంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వేంటి రా బాధపడుతావనుకుంటే ఇలా మాట్లాడుతున్నవంటూ తిరుపతి అనగానే..అదేదో ఆ కళ్యాణ్ మాయలో పడుతుందని అలా తిట్టాను అంతే అని ధీరజ్ అంటాడు. మరొకవైపు వేదవతి కిచెన్ లో ఉండగా నర్మద వచ్చి మీ మేనకోడలికి హల్ది ఫంక్షన్ జరుగుతుందని చెప్తుంది. ఆ తర్వాత వేదవతి వెళ్లి ప్రేమ హల్దీ ఫంక్షన్ చాటుగా చూస్తుంటే‌.. అది గమనించిన భద్రవతి చూడకుండా కర్టెన్ అడ్డుపెడుతుంది. దాంతో వేదవతి కోపంగా లోపలికి వచ్చి అందరిపై చిర్రుబుర్రులాడుతుంది. ఆ తర్వాత ప్రేమకి ఫోన్ చేస్తుంటాడు కళ్యాణ్. తరువాయి భాగంలో సేనాపతి, రేవతి లు అందరికి పెళ్లి పత్రిక ఇస్తుంటారు. వేదవతి, నర్మదలు కూరగాయలు కొంటుంటే.. సేనాపతి వాళ్ళ దగ్గరికి వస్తాడు. తనకి కార్డ్ ఇవ్వడానికి వచ్చాడేమోనని వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ కూరగాయలు అమ్మే అతనికి కార్డు ఇస్తాడు. దాంతో వేధవతి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : నా కూతురిపై పిన్నికి ఎందుకు అంత కేరింగ్ అండ్ ఇంట్రస్ట్.. దశరథ్ కి డౌట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -243 లో..... అసలైన వారసురాలు ఎవరో చెప్పడానికి సుమిత్ర దగ్గరికి వస్తాడు దాస్. దాంతో దాస్ రావడం జ్యోత్స్న చూసి తనని బయటనే ఆపుతుంది. ఎందుకు వచ్చావని జ్యోత్స్న అనగానే.. సుమిత్ర వదినకి నిజం చెప్పడానికి వచ్చానని దాస్ అంటాడు. వద్దు మీరు నిజం చెప్తే నేను ఉండనంటు దాస్ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది జ్యోత్స్న. అలా జ్యోత్స్న కాళ్ళు పట్టుకోవడం పారిజాతం దూరం నుండి చూసి షాక్ అవుతుంది. అసలు వాళ్లేం మాట్లాడుకుంటున్నారని పారిజాతం అనుకుంటుంది. నిజం చెప్పను చెప్పి కన్న కూతురిని దూరం చేసుకోలేనని చెప్పి దాస్ వెళ్ళిపోతాడు. మరొకవైపు శౌర్యకి నిద్ర పట్టక బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే దీప, కార్తీక్ లు వస్తారు. ఏమైంది అని శౌర్యని అడుగుతారు. దోమలు కుడుతున్నాయి.. నిద్ర పట్టడం లేదని శౌర్య అనగానే.. ఇక్కడ చల్లగా ఉందంటూ అటు ఇటు తింపుతాడు కార్తీక్. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి.. నువ్వెందుకు దాస్ కాళ్ళు పట్టుకున్నావని అడుగుతుంది. అదేం లేదు నేను అసలైన వారసురాలు కాదని చెప్తానన్నాడు దాంతో అలా చేసానని జ్యోత్స్న చెప్తుంది. కానీ పారిజాతానికి తను చెప్పింది అబద్ధమని అర్ధమవుతుంది. మరొకవైపు టిఫిన్ బండి పై కార్తీక్ దీపలు కవర్ కప్పుతారు. మరుసటిరోజు నువ్వేదో దాస్తున్నావ్.. నేను ఆఫీస్ కి వస్తానని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న కోపంగా శివన్నారాయణ‌ని పిలిచి.. చూడు గ్రానీ ఆఫీస్ కి వస్తుందట అని అంటుంది. శివన్నారాయణ‌ విని పారిజాతా‌న్ని తిట్టి పంపిస్తాడు. ఆ తర్వాత ఎందుకు మా పిన్ని నా కూతురుపై అంత ఇంట్రెస్ట్ కేర్ చూపిస్తదని సుమిత్రతో దశరథ్ అంటాడు. మీరు అలాంటి అనుమానం ఏం పెట్టుకోకని దశరత్ తో సుమిత్ర అంటుంది. ఆ తర్వాత టిఫిన్ సెంటర్ దగ్గరికి ఒక తాగుబోతు వచ్చి.. అది తీసుకొని రా.. ఇది తీసుకొని రా అంటూ దీప తో దురుసుగా మాట్లాడతాడు. అప్పుడే ఒక పాప ఆకలిగా ఉంది.. మా అమ్మ కుడా ఏం తినలేదని చెప్పగానే వాళ్లు తినడానికి టిఫిన్ ఇస్తుంది దీప. దాంతో ఆ పాప దీపని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలి సిందే.  

Brahmamudi : బెడ్ పై రాజ్, కావ్య.. నందగోపాల్ దొరికేస్తాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -608 లో..... ధాన్యలక్ష్మి రుద్రాణిలు కలిసి కావ్య కార్లని పంపించేసింది.. తనని అడగండని అపర్ణతో చెప్తారు. కావ్యకి అపర్ణ ఫోన్ చెయ్యగా.. బిజీ అని చెప్తుంది. కావ్య ఇంటికి వచ్చాక మాట్లాడుదామని అపర్ణ అంటుంటే అయిన కావాలనే కావ్య ఇలా చేస్తుంది.. అలా చేస్తుందటూ తిడుతుంటారు. మరొకవైపు మేనేజర్ దగ్గరికి కావ్య వచ్చి డబ్బు వాడేటప్పుడు నాకు చెప్పాలని చెప్తుంది. అప్పుడే ఒక ఎంప్లాయి మేనేజర్ దగ్గరికి వచ్చి సాలరీ అడ్వాన్స్ కావాలని అంటాడు. అకౌంట్ లో డబ్బు లేక మేము ఇబ్బంది పడుతుంటే.. నీకు డబ్బు కావాలా అంటూ మేనేజర్ కోప్పడతాడు. ఇంత పెద్ద కంపెనీ ఉంది అడ్వాన్స్ అడిగితే లేవట అంటూ ఎంప్లాయి వెళ్లి వేరే వాళ్ళతో చెప్తాడు. అంటే ఈ కంపెనీ లాస్ లో ఉందా? తీసేస్తారా ఏంటి అని ఎంప్లాయిస్ మాట్లాడుకుంటుంటే.. అదంతా కావ్య విని వాళ్ళ పైన కోప్పడతుంది. అసలు మీకు ఎవరు చెప్పారు. కంపెనీ లాస్ లో ఉందని అంటు కావ్య వాళ్ళపై విరుచుకుపడుతుంది. అప్పుడే రాజ్ వచ్చి అదంతా వింటాడు. మరొకవైపు అనామిక దగ్గరికి నందగోపాల్ వస్తాడు. మేడమ్ మీరు చెప్పినట్లే బోర్డు తిప్పేసాను.. ఇప్పుడేం చెయ్యాలని నందగోపాల్ అనామికతో చెప్తూ టెన్షన్ పడతాడు. నువ్వేం కంగారు పడకు రాజ్ ఆల్రెడీ ఇరవై కోట్లు కట్టాడు.. అప్పు చేసి అయినా మిగతాది కట్టేస్తాడు కానీ నువ్వు ఒక మూడు నెలల బయటకు రాకుండా ఉండమని నందగోపాల్ తో అనామిక అంటుంది. సరే అంటూ నందగోపాల్ బయటకు వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఒక మూడు నెలల పండుగ.. నేను చెప్పిన అడ్రెస్ కి రా అంటు ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత రాజ్ కి తన పోలీస్ ఫ్రెండ్ ఫోన్ చేసి నందగోపాల్ ఫారెన్ వెళ్ళలేదని చెప్తాడు. నేను నా భార్య వాడి ఫోన్ ట్రాప్ చేసి వస్తామని రాజ్ తన ఫ్రెండ్ తో చెప్తాడు. మరొకవైపు ఇంట్లో అదే పనిగా రుద్రాణి, ధాన్యలక్ష్మికి కావ్య గురించి నెగటివ్ గా చెప్తుంది. ఇక ఆ కావ్య ఏం చెసిన అడ్డు చెప్పాలని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్, కావ్య వెళ్తుంటే ఒకతను కార్ కి అడ్డుపడి.. పెళ్లిచూపులకి వెళ్తున్నానంటూ లిఫ్ట్ అడుగుతాడు. సరే అంటు రాజ్ అతన్ని ఎక్కించుకుంటాడు. తరువాయి భాగంలో రాజ్, కావ్యలు నందగోపాల్ అడ్రెస్ తెలుసుకొని వెళ్తారు. వెళ్లేసరికి బెడ్ రూమ్ డెకరేషన్ చేసి ఉంటుంది. కావ్య, రాజ్ లు పొరపాటుగా బెడ్ పై పడిపోతారు. అప్పుడే నందగోపాల్ తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంటాడు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కన్నడ వాళ్ళను ఇక షోస్ కి పిలవకండి...ఇలా అవమానించకండి..

2024 వెళ్తూ వెళ్తూ ఆర్టిస్టుల మధ్యలో గొడవలు పెట్టి మరీ వెళ్ళింది. ఈటీవీలో రీసెంట్ గా ప్రసారమైన దావత్ షోలో కొంతమంది బుల్లితెర నటుల మధ్య గొడవలు జరిగాయి. అందులో హైలైట్ ఐన సబ్జెక్టు నూకరాజు - యాంకర్ సౌమ్యరావు. నూకరాజు సౌమ్య ఫోటో తీసి నిప్పుల్లో వేసి బూడిద చేసాడు. దాంతో సౌమ్య ఫుల్ ఫైర్ అయ్యింది. ఇద్దరి మధ్య స్టేజి మీద ఘాటుగానే గొడవ జరిగింది. "కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి యాంకరింగ్ చేసింది సౌమ్య. ఆమె మాట్లాడే పది మాటల్లో 8 బూతులు ఉంటాయి. ఏదైనా పని నేర్చుకునేటప్పుడు దాన్ని నేర్చుకుని వెళ్తే ఒక అర్ధం ఉంటుంది. తెలుగు నేర్చుకుంటే ఆమెకు తెలుగు షోస్ లో ప్లస్ అవుతుంది అనేది నా నమ్మకం అందుకే మేడం 2025 లో తెలుగు నేర్చుకుని మంచి మంచి షోస్ చేయాలని కోరుకుంటున్న" అన్నాడు నూకరాజు. దానికి సౌమ్య "ఎందుకండీ ఎప్పుడూ కన్నడ వాళ్ళను తక్కువగా చూస్తారు. నా మాతృబాష కన్నడ..అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడి షో చేయడం అంటే అది గొప్ప విషయం. మీరు కూడా కన్నడ ఇండస్ట్రీకి వచ్చి కన్నడ నేర్చుకుని షోస్ చేయాల్సింది అప్పుడు తెలిసేది" అన్నది సౌమ్య. "నాకు రానప్పుడు నేను కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళను" అన్నాడు నూకరాజు. "ఇలా జరుగుతుంది అనేటప్పుడు నన్ను షోకి పిలవకండి..నిజంగానే పిలవకండి.. మీ తెలుగు వాళ్లనే పిలుచుకోండి. నాకు వచ్చినంత తెలుగులో ఆడియన్స్ ని ఎంతగా ఎంటర్టైన్ చేయాలో అంత ఎంటర్టైన్ చేస్తున్నాను." అంటూ ఫైర్ ఐపోయింది సౌమ్య. దాంతో సుమ ఎంట్రీ ఇచ్చింది. ఈ టాపిక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లోకి వెళ్తోంది అంటూ సౌమ్యకు కొన్ని టిప్స్ చెప్పింది. "నేను మలయాళీ కానీ తెలుగు నేర్చుకుని యాంకరింగ్ చేస్తున్నా. కళాకారులను ఎవరినైనా ఆడియన్స్ ఆదరిస్తారు. ఎవరో ఏదో అన్నారని కాకుండా నువ్వు ఎం చేయాలి అనుకున్నావో అది చెయ్యి.." అంటూ సపోర్ట్ చేసింది.

పాఠాలు చెప్తూనే పోవాలి అన్నారు దేవదాస్ కనకాల మాస్టారు : గుర్తు చేసుకున్న స్టూడెంట్స్

న్యూ ఇయర్ స్పెషల్ గా దావత్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో రాజీవ్ కనకాలకు వాళ్ళ అమ్మ నాన్న విగ్రహాలను గిఫ్ట్ గా ఇచ్చారు నటుడు బ్రహ్మాజీ. ఆ గిఫ్ట్ ప్యాక్ ని ఓపెన్ చేసాక విపరీతంగా ఏడ్చేశారు  రాజీవ్, బ్రహ్మాజీ, సమీర్. "మా మాస్టారు, లక్ష్మి మేడం  ..ఈరోజు మేము నాలుగు ముద్దలు తింటున్నాం అంటే దానికి కారణం వాళ్లే..చాలా మందికి తెలుసు మా మాస్టారు, మేడం గురించి. టాప్ యాక్టర్స్ ఎంతో మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నవాళ్ళే.. యాక్టర్స్, డైరెక్టర్స్ అంతా కూడా వీళ్ళ ఫిలిం ఇన్సిట్యూట్ లోనే ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా వీళ్లంతా కలిసినప్పుడు వాళ్ళ గురించే తలచుకుంటూ ఉంటారు. అప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు కూడా అక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు. నేను వీళ్ళ కడుపున పుట్టడం నిజంగా నా అదృష్టం. నేను మొదట్లో మా పేరెంట్స్ ని బాగా ఇబ్బంది పెట్టాను. ఆ విషయం బ్రహ్మాజీ గారికి బాగా తెలుసు. నన్ను చిన్నప్పుడు చూసినవాళ్లకే తెలుసు నేను ఎంత అల్లరోడినో..గొప్ప గొప్ప నటులతో క్లాసెస్ ని షేర్ చేసుకోవడం నిజంగా ఎంతో అదృష్టం. నా తోడబుట్టినది, నా కన్నవాళ్ళు కూడా లేరు. " అని చెప్పారు రాజీవ్ కనకాల ఏడుస్తూ. ఇక సమీర్ మాట్లాడుతూ "నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఫీజ్ తీసుకోకుండా పాఠాలు చెప్పారు. ఉదయం లేస్తే చాలు ఇక్కడి ఇన్స్టిట్యూట్ లోనే ఉండేవాళ్ళం. లక్ష్మి మేడం మాకు భోజనం పెట్టేవాళ్ళు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న ఎంతో మంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. మా మాస్టారు దేవదాస్ కనకాల గారు మాకు పాఠాలు చెప్తూనే అలా కుర్చీలోనే జీవితం వెళ్ళిపోవాలి అనేవారు" అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.  

రెండేళ్లలో నిఖిల్ పెళ్లి...షాక్ తో షో నుంచి వెళ్లిపోయిన కావ్య

‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ఎపిసోడ్ మొత్తం కావ్య - నిఖిల్ చుట్టూనే తిరిగింది. ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉన్నారు. నిఖిల్ నల్ల జోడు పెట్టుకుని చూసే ప్రయత్నం చేసాడు కానీ కావ్య చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఐతే ఈ షోలో ఫైనల్ గా నిఖిల్ తల్లి సులేఖ ఎంట్రీ ఇచ్చారు. అయితే సులేఖ అలా వచ్చిందో లేదో కావ్య షో నుంచి కనిపించకుండా వెళ్ళిపోయింది. ఇంకా నిఖిల్ తన తల్లి గురించి తల్లి సులేఖ కొడుకు గురించి పొగుడుకుంటూ ఉన్నారు. నిఖిల్ వాళ్ళ అమ్మకు పెద్ద ఫ్లవర్ బొకే ఇచ్చాడు అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్ కి తీసుకెళ్తానని, రెస్టారెంట్ కి తీసుకెళ్తానని, సినిమాకు తీసుకెళ్తానని  అలాగే మంచి ఇల్లు కొంటానని, వాళ్ళ అమ్మ - నాన్నను రొమాంటిక్ ట్రిప్ కి పంపిస్తానని ఇలా ప్రామిస్ చేసాడు.  ‘చిన్నప్పటి నుంచి మా అమ్మ కష్టపడి పెంచింది. నా కోసం తమ్ముడి కోసం  చాలా త్యాగం చేసింది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆమె వల్లే. మా అమ్మ పెంపకమే నన్ను ఇంత దూరం తెచ్చింది. నాపై ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా నన్ను  వదలకుండా నాతోనే ఉంది’ అని ఎమోషనల్‌గా చెప్పాడు నిఖిల్. ఇక ఫైనల్ గా శ్రీముఖి కూడా అడగాల్సిన విషయమే అడిగేసింది. "చాలా మంది అమ్మాయిలకు ఒక డౌట్ ఉంది. మా నిఖిల్ పెళ్లి ఎప్పుడు"  అని అడిగింది. "మీరో రెండేళ్లలో పెళ్లి చేస్తాను" అని చెప్పింది సులేఖ. ఇక ఫైనల్ గా అందరినీ పిలిచి కేక్ కట్ చేయించింది శ్రీముఖి. ఇక నిఖిల్ తల్లి షో నుంచి వెళ్లిపోయేసరికి కావ్య మళ్ళీ స్టేజి మీద ప్రత్యక్షమయింది. కేక్ కటింగ్ లో పార్టిసిపేట్ చేసింది. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా కావ్య తన డెసిషన్ చెప్పింది. రాబోయే రోజుల్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా రైట్ డెసిషన్స్ తీసుకుంటూ కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా అంటూ చెప్పింది.