Karthika Deepam2 : ఇది ఆరంభం మాత్రమే.. కార్తీక్ శపథం అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'.(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -231 లో...కార్తీక్, దీప కలిసి ఇంటికి వస్తారు. అనసూయ క్యారేజ్ చూసేసరికి అది బరువుగా ఉంటుంది. దాంతో వీళ్ళు భోజనం చెయ్యాలేదు.. ఏం జరిగిందని అనసూయ, కాంచన ఇద్దరు దీపని అడుగుతారు. నన్నేం అడగకండి అంటూ దీప లోపలికి వెళ్ళిపోతుంది. మరొకవైపు కార్తీక్ ని కంపెనీ నుండి తీసేయ్యడమేంటని దశరత్ తో మాట్లాడుతుంది సుమిత్ర. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. వాడు పోతే నష్టమేంటి అన్నట్లు మాట్లాడుతాడు. అప్పుడే జ్యోత్స్న కూడా వస్తుంది. బావ వెళ్తుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావని జ్యోత్స్నతో సుమిత్ర అనగా.. వాడు తగ్గాలా నేను తగ్గాలా అని శివన్నారాయణ‌ అంటాడు. వాడు పోతే ఇంకా దొరకరా ఏంటని పారిజాతం అనగానే.. దొరకరు పిన్ని వాడు చాలా టాలెంటెడ్.. వాడు సీఈఓ అయినప్పటి నుండి మరిన్ని లాభాలు వచ్చాయని దశరథ్ అంటాడు. ఇంకా వాడి గురించి ఆపు.. మనమందరం ఉన్నాం.. వాడేం చేసిన శివన్నారాయణని మాత్రం ఢీ కొట్టలేడని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ కి దీప కాఫీ తీసుకొని వస్తుంది. ఇద్దరు కాఫీని షేర్ చేసుకుంటారు. అప్పుడే అనసూయ, కాంచన ఇద్దరు వస్తారు. అసలేం జరిగిందని కాంచన అడుగగా.. నా నోటితో నేను కంపెనీ నుండి వెళ్లిపోయేలా చేశారు.. అవమానించాడు.. అందుకే రాజీనామా చేసి వచ్చానని అనగానే.. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కాంచన బాధపడుతుంది. నన్ను జీరోకి తీసుకొని వచ్చానని వాళ్లు అనుకుంటున్నారు కానీ ఇక్కడి నుండి మొదలుపెడతానని వాళ్లకు తెలియదు.. ఇది ముగింపు కాదూ ఆరంభమని కార్తీక్ అంటాడు.. ఆ తర్వాత కార్తీక్ ని జాబ్ నుండి తీసేసిన విషయం శ్రీధర్ కి కావేరి చెప్పగానే.. బాగా అయింది అంటూ శ్రీధర్ సంతోషపడుతూ స్వీట్ తీసుకొని రమ్మంటాడు. దాంతో కావేరి మిరపకాయ తీసుకొని వచ్చి శ్రీధర్ నోట్లో పెడుతుంది. వాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చెయ్యాలని కావేరి అనుకుంటుంది. మరొకవైపు స్వప్న, కాశీ, దాస్ లు కార్తీక్ ఇంటికి వస్తారు. అన్నయ్య మేము ఫుడ్ కోర్ట్ పెడుదామనుకున్నాం కానీ అది ఇప్పుడు మీకు అవసరం రెస్టారెంట్ పెట్టండి అని కార్తీక్ కి సలహా ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భాదతో దూరంగా వెళ్తానన్న మాజీ ప్రేమికురాలు.. అత్త గురించి నిజం చెప్పేసిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -282 లో..... రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వెనకాల నుండి వచ్చి ఆట పట్టిస్తాడు. దాంతో రామలక్ష్మి చిరాకు పడుతుంది. వెళ్లి చాప తెచ్చుకొని కింద పడుకుంటుంది. సీతాకాంత్ కూడా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే అని అంటాడు. మళ్ళీ చిరాకు గా నందినికి మీకు మధ్య ఎం జరుగుతుందని అడుగుతుంది. చెప్పాను కదా మా మధ్య ఏం లేదని ఎందుకు ఇలా అపార్ధం చేసుకుంటున్నావని సీతాకాంత్ కోపంగా వెళ్లి బెడ్ పైన పడుకుంటాడు. అదంతా విన్న శ్రీవల్లి వెళ్లి హ్యాపీగా శ్రీలత, సందీప్ లకి జరిగింది చెప్పగానే వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఒక దెబ్బకి మూడు పిట్టలు అన్నట్లు రామలక్ష్మి, సీతాకాంత్, నందినిల పని అవుట్ అని సందీప్ అంటాడు. మరొకవైపు తప్పు చేశాను.. శ్రీలతతో చేతులు కలపకుండా నాకు నేనే ప్రయత్నం చేస్తే సీతకి దగ్గర అయ్యేదాన్ని అని హారికకి నందిని చెప్తూ ఫీల్ అవుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి హారికని బయటకు వెళ్ళమని నందినితో మాట్లాడతాడు. ఒక ఫ్రెండ్ గా చాలా హెల్ప్ చేసావ్ ఇప్పుడు కూడా చేస్తావ్ అనుకుంటున్నాను.. నాకు రామలక్ష్మి అంటే చాలా ఇష్టం. ఒకరి వల్ల మా మధ్య ప్రాబ్లమ్ రావడానికి వీలు లేదని సీతకాంత్ అనగానే.. ఎవరు ఆ ఒక్కరని నందిని అడుగుతుంది. నువ్వే నీ వల్ల రామలక్ష్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అర్ధం అయింది.. నీకు దూరంగా వెళ్ళాలి అంతే కదా వెళ్తానని నందిని బాధగా చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ వెళ్ళాక హారిక వస్తుంది. నందిని బాధపడుతుంటే ఓదార్చాతుంది. ఆ తర్వాత ఇక ఇక్కడ మనకేం పని లేదు USA వెళదామని హారికతో నందిని అంటుంది. ఆ మాట విని ధన, సందీప్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. కోపంగా నందినిని చూస్తుంటే అంత తప్పు నేనేం చెయ్యలేదు సీతని ప్రేమించాను కానీ తను నన్ను ఫ్రెండ్ లాగే చూసాడు.. ఎందుకు అపార్ధం చేసుకుంటున్నవ్ ఇదంతా మీ అత్తయ్య కావాలనే చెప్పింది. ఇన్ని రోజులు లేనిది మీరు హ్యాపీగా ఉన్నప్పుడే ఎందుకు చెప్పింది. మిమ్మల్ని విడగొట్టడానికి అని నందిని అంటుంది. మా అత్తయ్య మరిపోయిందని రామలక్ష్మి అనగానే.. లేదు మారలేదు.. ఇదంతా మీ అత్తయ్య ప్లాన్ అని నందిని చెప్పగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వైవిఎస్ చౌదరితో జానీ మాష్టర్...

లైంగిక ఆరోపణలతో జైలుకెళ్లిన జానీ మాస్టర్ రీసెంట్ గా బెయిల్ పై విడుదల ఐన విషయం తెలిసిందే. అలాంటి జానీ మాష్టర్ ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది. జానీ మాష్టర్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరితో కలిసి ఉన్న పిక్ అది.  ఐతే ఇప్పుడు జానీ మాష్టర్ తన మూవీ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలోనే మంచి అప్డేట్ తో రాబోతున్న అంటూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేసాడు. రామ్ చరణ్  మూవీ ‘గేమ్ ఛేంజర్’లోని ‘డోప్’ సాంగ్ తో జానీ మాస్టర్ ఆడియన్స్ ముందు రాబోతున్నారు.  వైవిఎస్ చౌదరితో ఫోటో దిగడాన్ని బట్టి ఏదో ప్రాజెక్ట్ రాబోతోంది అన్న విషయం అర్ధమవుతోంది. ఒకప్పుడు ఆయన ఎన్నో మూవీస్ తీశారు. కానీ ఇప్పుడు వస్తున్న నటీ నటులు, కొత్త కొత్త కంటెంట్ కారణంగా  ఆయన కొంత  వెనుకబడిపోయారు. ఇక ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ప్రెజెంట్ ఆయన  విశ్వ విఖ్యాత సీనియర్ నటుడు  నందమూరి తారక రామారావు మునిమనవడు, హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావుతో డెబ్యూ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైవిఎస్ చౌదరిని జానీ మాస్టర్ తన భార్యతో వెళ్లి కలిశారు. దాంతో ఆ పిక్ ని పోస్ట్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టారు  “చాలా రోజుల తర్వాత జెమ్ లాంటి పర్సన్ ఐన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారిని కలిసాను. నా కెరీర్ స్టార్టింగ్ లో ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, ఆయన చెప్పిన మాటలు నాకెంతో బూస్టింగ్ ఇచ్చాయి. తెలుగులో డాన్స్ మాస్టర్లకు మంచి అవకాశాలు ఇచ్చి, ఎదగడానికి సహాయం చేసిన అతి కొద్ది మంది డైరెక్టర్స్ ఆయన కూడా ఒకరు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని రాసారు.  అంటే ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా అవకాశాలు వెంటనే వచ్చే పరిస్థితి లేదు. అంటే మళ్ళీ కెరీర్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నా..అప్పట్లో ఎలా లిఫ్ట్ ఇచ్చారో ఇప్పుడు కూడా వైవిఎస్ చౌదరి అలాగే లిఫ్ట్ ఇస్తున్నారు అనే అర్ధం ఐతే జానీ మాష్టర్ కామెంట్ లో కనిపిస్తోంది. అంటే ఈ మూవీలో ఆయన కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చారు అనే టాక్ నడుస్తోంది.  

Shanmukh Jaswanth :  ఫస్ట్ లవ్ విషయంలో... సూసైడ్ చేసుకుందామనుకున్నా

  షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో ఈ పేరు ఒకప్పుడు చాలా పాపులర్.  షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్ స్టార్ గా ఒక ఫ్యాన్ బేస్ ని తయారు చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ డెవలపర్ మూవీ బాగా వ్యూస్ సంపాదించుకుంది. ఐతే  కానీ కొన్ని నెలలుగా అడియన్స్ తో కనెక్ట్ కావడం లేదు షణ్ముఖ్.  ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బెన్స్ లోకి వెళ్లడం ఆ తర్వాత పోలీస్ కేసులు వంటి వాటితో ఎక్కువగా వార్తలలో నిలిచాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న టైములో దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడు. కానీ ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 5లోకి వెళ్లిన షన్నూ అక్కడ ఇష్యూస్ తో దీప్తితో లవ్ బ్రేకప్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఐతే చాన్నాళ్లకు "లీలా వినోదం" మూవీతో కం బ్యాక్ ఇచ్చారు. ఇక ఈ మూవీ హీరో-హీరోయిన్స్ షణ్ముఖ్, అనఘ కాకమ్మ కథలు ఎపిసోడ్ కి గెస్టులుగా వచ్చారు. అందులో షణ్ముఖ్ తన గురించి చెప్పుకొచ్చాడు. "ఫస్ట్ లవ్ విషయంలో ఒక పాయింట్ తర్వాత సూసైడ్ చేసుకుందామనుకున్నా. అందరి కంటే ఎక్కువగా మా పేరెంట్స్ బాగా బాధపడ్డారనిపించింది. వాళ్ళ మీద నేను నా ప్రేమను చూపించుకుని పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే నేను అదే సమయానికి డిప్రెషన్ లో ఉన్నానని చెప్తున్నా. నా దగ్గరేం డబ్బులు లేవు. నాకు మా నాన్న ఎప్పుడూ మెంటల్ సపోర్ట్ ఇచ్చారు. మా ఫామిలీ కొన్ని ఇష్యూస్ వల్ల చాలా చాలా ఎఫెక్ట్ అయ్యారు. నేను నా తప్పును తీసుకుంటా...కానీ అన్ని తప్పులు నేనే చేశాను అంటే ఊరుకోను. ఎందుకంటే నా ఫామిలీని పైకి తీసుకువచ్చేది నేనే." అని చెప్పాడు షణ్ముఖ్.

హౌస్ లో ఉన్నప్పుడు నా అమ్మ.. లవ్ నా ప్రాణం అన్నావ్!

  బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 విజేతగా నిఖిల్ మలియక్కల్ గెలిచాడు. రెండు రోజుల క్రితం జరిగిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో నిఖిల్ విన్నర్ కాగా గౌతమ్ రన్నర్ అయ్యాడు. అయితే విన్నర్ అవ్వగానే ట్రోఫీ తీసుకొని నిఖిల్ తన లవర్ కావ్యశ్రీ దగ్గరకి వెళ్తాడని ఫ్యాన్స్ అందరు అనుకున్నారు. దీనికి హౌస్‌లో నిఖిల్ చెప్పిన మాటలే కారణం. బిగ్‌బాస్ గేటు దాటిన మరుక్షణం నా లవర్‌ని కలుస్తానంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు కావ్యశ్రీ పేరే ఎత్తడం లేదు. కావ్యశ్రీ ముందే చెప్పింది.. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని కానీ నిఖిల్ ఫ్యాన్స్ అంతా కావ్యశ్రీని తప్పుపట్టారు‌. ఇప్పుడేమో బెంగుళూరు వెళ్లి అక్కడ డ్యాన్స్ లతో ఎంజాయ్ చేస్తున్నాడు నిఖిల్. కొన్ని గంటల క్రితం నైనికతో కలిసి ఓ డ్యాన్స్ వీడియోని అప్లోడ్ చేశాడు. అయితే ఆ వీడియోకి చాలా కామెంట్లు వస్తున్నాయి. అందులో చాలావరకు కావ్యశ్రీని అర్థం చేసుకో.. వదిలేయకు..తన దగ్గరికి వెళ్తా అన్నావ్ కదా.. ఇప్పుడేమో డ్యాన్స్ లు చేస్తున్నావంటూ నెటిజన్లు తిడుతున్నారు. కావ్య ఎక్కడ నిఖిల్? హౌస్‌లో ఉన్నప్పుడు నా అమ్మ.. లవ్ నా ప్రాణం అన్నావ్.. కావ్య నిన్ను దూరం పెడుతుందన్నట్లు కలరింగ్ ఇచ్చావ్.. ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చెప్పినవన్నీ అబద్దాలేనా.. గెలవడానికి బ్రేకప్ అయినట్టు చెప్పాడా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రష్మిక కంగ్రాట్యులేషన్స్ అని టెక్స్ట్ మెసేజ్ చేసింది...సోనియా నంబర్ ని బ్లాక్ లో పెట్టాను!

  స్టార్ మా సీరియల్  'కృష్ణ ముకుంద మురారి'తో పాపులర్ అయ్యింది ప్రేరణ కంభం. అందులో ఆమె కృష్ణ రోల్ చేశారు. నాలుగేళ్లు ఆ సీరియల్ నడిచింది. ఆ తరువాత ఆమె బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్లి టాప్ 5 లో నిలిచింది. ఇక బిగ్ బాస్ ఐపోయి వచ్చాక చాలా విషయాలను ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. "కిర్రాక్ సీత మొదట్లో నన్ను ట్రిగర్ చేయాలని చూసింది కానీ ఆమె ట్రిగర్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. ఆమె ఎందుకు అలా వెళ్లిపోయిందో నాకు తెలీదు. ఆమె నన్ను అనాలని చూసింది కానీ నేను లైట్ తీసుకున్నా. ఇక సోనియా ఫస్ట్ నుంచి నన్నే టార్గెట్ చేస్తూ వచ్చింది. అలాగే రెండో సారి వచ్చినప్పుడు కూడా టార్గెట్ చేసింది. నాకు చాలా బాధగా  అనిపించింది. ఆమె ముందు నుంచి చేసిన దానికి, రెండో సారి వచ్చి చేసిన దానికి లాస్ట్ లో ఆమె ఫోన్ నంబర్ ని బ్లాక్ లో పెట్టాను. రెండింటికి కలిపి అదే నా ఆన్సర్..నాకు చాలా బాధగా అనిపించింది ఆమె చేసిన కామెంట్స్..ఎందుకంటే నేను అలా బిహేవ్ చేయడం లేదు. నా మీదే ఎందుకు అంత ఫోకస్, నా మీదే ఎందుకు అంత కోపం అనేది నాకు తెలీదు. నేను చాలా నిజాయితీగా ఉన్నాను. నాకు నచ్చినవి చెప్పాను. నచ్చనివి వదిలేసాను. ఆమెకు నచ్చింది ఆమె చెప్పింది. అలా జరిగిపోయింది అంతే..నేను బిగ్ బాస్ కి వచ్చిన విషయం నా ఫ్రెండ్ రష్మికకి చెప్పాను..బయటకు వచ్చాను కొన్ని రోజులు ఆగాక కలుస్తాను..విన్నర్ ఐనందుకు కంగ్రాట్యులేషన్స్ అని టెక్స్ట్ మెసేజ్ పంపింది. కొంచెం రెస్ట్ తీసుకుని ఆరాంగా వెళ్లి పుష్ప మూవీ చూస్తాను." అని చెప్పింది ప్రేరణ.  

బిగ్ బాస్ చరిత్రలో కప్పు కొట్టి చరిత్ర సృష్టిద్దామనుకున్నా ...కానీ నోటి దూలతో

    బిగ్ బాస్ సీజన్ 8 మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్ కి మధ్య చాల టఫ్ ఫైట్ నెలకొంది. మేల్స్ లో నిఖిల్, గౌతమ్, ఫీమెల్స్ లో యాష్మి, ప్రేరణ బాగా గట్టి పోటీ ఇచ్చారు. ఇక ప్రేరణ లేడీ సింగం అనే పేరు కూడా తెచ్చుకుంది. కానీ కప్పు మాత్రం నిఖిల్ పట్టుకుపోయాడు. అలాంటి ప్రేరణ తనకు బిగ్ బాస్ టైటిల్ వస్తుందని అనుకుందట..ఐతే మరేమయ్యింది. ఎందుకు విన్ కాలేదు అనే విషయాల మీద ఒక ఇంటర్వ్యూలో ఆన్సర్స్ ఇచ్చింది. "నేను నాలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాను. నాలాగే బయటకు వచ్చాను. ఒక గేమ్ ప్లే చేయాలని అనుకోలేదు. ఏదైనా స్ట్రాటజీ ప్లే చేసినా ఏదో ఒక పాయింట్ లో అది అందరికీ తెలిసిపోతుంది. జనాలు ఇష్టపడితే ఇష్టపడతారు...లేదంటే తిడతారు. ఇక మీడియా కూడా ఏమన్నా నాలాగా లేకపోతె గనక బిగ్ బాస్ ని కూడా క్లోజప్ లో చూపించారు..మమ్మల్నే చూపిస్తారు. నా బెస్ట్ ఇవ్వడానికి వెళ్లాను. నేను నా మైండ్ లో ఏదైతే అనిపించిందో అదే నిజాయితీగా చెప్పేసాను. అది కొంతమందికి నచ్చలేదు. నోటి దూల అన్నారు చాలామంది కానీ రెండు సార్లు అనుకోకుండా కొన్ని మాటలు వచ్చేసాయి వాటికి చాలా బాధపడ్డాను. మేము ప్రతీది లైఫ్ లో కష్టపడేది డబ్బులు కోసమే. బిగ్ బాస్ హౌస్ లో 105 డేస్ ఉన్నాం. మొత్తం ఇచ్చేస్తున్నాం..ఫ్రీగా ఎవరూ చేయరు. డబ్బులు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కానీ డబ్బే ముఖ్యం అని కాదు. నా టైం, నా కంటెంట్, నా డ్రామా అంతా పెట్టి ఆడినందుకే వాళ్ళు డబ్బులు ఇస్తారు. తీసుకుని వచ్చేస్తాం.. అసలు ఎంత ఇస్తారో నాకే పూర్తిగా తెలీదు...అసలు అలా ఎలా ఊహించేస్తారు అంతా. నిజానికి నేను విన్నర్ కావాల్సింది..చాలా కష్టపడ్డాను. బిగ్ బాస్ ఇన్ని  సీజన్స్ హిస్టరీలో ఇప్పటివరకు ఎప్పుడూ ఒక లేడీ విన్ కాలేదు. నేను గెలవాలని గట్టిగా కోరుకున్నా. రష్మిక మందన్న ఇప్పుడు నేషనల్ క్రష్ కానీ తాను నా చడ్డీ,బడ్డీ ఫ్రెండ్. మా మధ్య ఒక టీజింగ్ ఫ్రెండ్ షిప్ ఉండేది. ఫ్రెండ్ షిప్ టైంలో నేను రష్మికని ఏదో ఒక విషయంలో తిడుతూనే ఉండేదాన్ని. ఏ ఫ్రెండ్ ని ఐనా అలాగే తిట్టేసేదాన్ని..ఐతే బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టైం తన గురించి పొగిడేసరికి రష్మికాకు ఏడుపొచ్చేసి తన గురించేనా ఇలా చెప్తోంది అని అనుకుంది రష్మిక" అని చెప్పింది ప్రేరణ.

Illu illalu pillalu : ఈ ఇంటిని ముక్కలు చేయాలనుకుంటున్నారా.. వాళ్ళిద్దరిని గెంటేసిన రామరాజు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -31 లో.. నర్మద వాళ్ల నాన్న ప్రసాదరావు ఇంటికి భద్రవతి వెళ్లి.. నీ కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుందని చెప్తుంది. దాంతో పెళ్లి వాళ్లు ప్రసాదరావుని తిట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రసాదరావు కోపంగా నర్మద దగ్గరికి బయలుదేర్తాడు. మరొకవైపు కళ్యాణ్ ప్రేమ కోసం వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే ప్రేమ రాగానే నిన్ను ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తానంటూ బైక్ ఎక్కించుకొని వెళ్తాడు. అప్పుడే ప్రేమ ఫ్రెండ్ తనకి ఫోన్ చేసి.. ధీరజ్ ఎక్కడున్నాడో తెలిసిందనగానే కళ్యాణ్ బైక్ ఆపు ఆ దీరజ్ గాడు ఎక్కడున్నాడో తెలిసింది పద అంటుంది. ఎందుకు అలా అని కళ్యాణ్ అనగానే.. వాడెప్పుడు నన్ను ఏడిపిస్తాడు కదా.. ఇప్పుడు వాడిని ఇంట్లో నుండి గెంటేసారు. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో చూడాలని ప్రేమ అనగానే.. ఇక తప్పక సరే అంటాడు కళ్యాణ్. మరొకవైపు ప్రసాదరావు నర్మద దగ్గరికి వచ్చి తిడతాడు. నర్మదని వాళ్ళ అమ్మ కొడుతుంటే..  అత్తయ్య గారు ఆపండి అని సాగర్ అంటాడు. నువ్వు మధ్యలో రాకని సాగర్ తో నర్మద వాళ్ళ అమ్మ అంటుంది. ఆ తర్వాత ఇదేనా పెంపకమంటూ రామరాజుని ప్రసాదరావు తిడతాడు. దాంతో నాన్న మా ఆయనని మా మావయ్య గారిని ఏం అనకు.. అదే మాట పెంపకం ఇదేనా అని అడిగితే ఏం చేస్తావ్ అది ఈ ఇంటి సంస్కారమని నర్మద అనగానే ప్రసాదరావు కోప్పడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనతో పాటు రామరాజుకి ఇంకొక శత్రువు అయ్యాడని భద్రావతి, సేనాపతి లు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు నర్మదకి ఆకలి అవుతుంది. సాగర్ ని పిలిస్తే తను సైలెంట్ గా ఉంటాడు. తరువాయి భాగంలో ఈ ఇంటిని ముక్కలు చెయ్యాలి అనుకుంటున్నారా అని నర్మద, సాగర్ లని రామరాజు ఇంట్లో నుండి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : జ్యోత్స్నని పెళ్లి చేసుకోమన్న దీప.. షాకైన కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -230 లో......కార్తీక్ తన పోస్ట్ కి రాజీనామా చేస్తాడు. దాంతో వద్దని దీప రిక్వెస్ట్ చేస్తుంది. శివన్నారాయణ, జ్యోత్స్నలు దీపని తిడతారు. నా భార్యని ఏం అనొద్దంటూ కోప్పడుతాడు. అయిన దీప వద్దని అనడంతో ఇంకా ఇలా మాట్లాడిన కూడా నువ్వెందుకు ఇలా అంటున్నావని కార్తీక్ అంటాడు. రాజీనామా లెటర్ ని శివన్నారాయణకి ఇచ్చి.. దీపని తీసుకొని కోపంగా వెళ్లిపోతాడు. బావ వెళ్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావ్ తాతయ్య అని జ్యోత్స్న అనగానే.. వాడు ఎక్కడికి వెళ్లినా మళ్ళీ తిరిగిరావల్సిందే అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత పారిజాతం స్వీట్స్ తీసుకొని దాస్ ఇంటికి వస్తుంది. మీకోక గుడ్ న్యూస్.. ఆ కార్తీక్ జాబ్ మానేసాడని స్వప్నకి చెప్పి స్వీట్స్ ఇస్తుంది పారిజాతం. అవునా మా అన్నయ్యకి ఫ్రీడం దొరికిందంటు పారిజాతానికి కౌంటర్ వేస్తుంది స్వప్న. బావ తలుచుకుంటే వాళ్ళ కంటే గొప్ప పొజిషన్ కి వెళ్తాడని కాశీ అంటాడు. ఆ తర్వాత దీప గురించి పారిజాతం తప్పుగా మాట్లాడుతుంటే.. వద్దని దాస్ అంటాడు. మరొకవైపు కార్తీక్, దీప లు ఒక దగ్గర ఆగి మాట్లాడుకుంటారు. ఎందుకు దీప ఏడుస్తున్నావని కార్తీక్ అడుగుతాడు. నా వల్ల మీ కుటుంబం నుండి విడిపోయారని దీప అంటుంది. నాకు కుటుంబం ఉందని కార్తీక్ అంటాడు. మీరు జ్యోత్స్నని పెళ్లి చేసుకోండి కార్తీక్ బాబు అని దీప అనగానే.. పద ఆ పెద్దాయన దగ్గరికి వెళ్లి నీ మనవరాలిని నా భర్తకిచ్చి పెళ్లి చెయ్ అని అడుగు ఒప్పుకుంటే నీ తాళి ఇచ్చి తన మెడలో కట్టించు.. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో అప్పుడు చరిత్రలో మిగిలిపోతావని కార్తీక్ కోప్పడతాడు. నేను ఎప్పుడైనా జ్యోత్స్నతో మాట్లాడడం చూసావా.. ఇష్టమని ఎప్పుడైనా చెప్పానా.. నిన్ను ఇస్టపడి చేసుకున్నాను.. నువ్వేం చేసినా ఇష్టమని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప లు ఇంటికి వెళ్తారు. ఇప్పుడే వచ్చావ్ మళ్ళీ వెళ్తావా అని కాంచన అడుగుతుంది. మళ్ళీ వెళ్ళే అవసరం లేదని కార్తీక్ అనగానే.. ఏమైందని దీపని కాంచన అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భర్త మాజీ ప్రేమికురాలు అని తెలుసుకున్న భార్య...

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -281 లో.....సీతాకాంత్, రామలక్ష్మి లు వేరొక కంపెనీ హెడ్ రావడం కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడే నందిని కూడా వస్తుంది. ఆ తర్వాత అతను రాగానే అందరు వెల్ కమ్ చెప్తారు. చెప్పాగానే మాతో కలిసి పని చెయ్యడానికి వచ్చినందుకు థాంక్స్ అని నందిని అనగానే.. సీతాకాంత్ లాంటి వరితో కలిసి వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది.. అందుకు మీకే థాంక్స్ చెప్పాలని అతను అంటాడు. నందిని నీకు థాంక్స్ అని సీతాకాంత్ అనగానే.. నువ్వెప్పుడు ఉన్నతంగా ఉండాలనిదే నా కోరిక అనగానే నందిని వంక రామలక్ష్మి అదోలా చూస్తుంది. ఆ తర్వాత అందరు మీటింగ్ కి వెళ్తుంటే.. నందిని స్లిప్ అవుతుంది. దాంతో నందిని అంటు సీతాకాంత్ కంగారు పడుతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్పగానే.. సీతాకాంత్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకొని వచ్చి రామలక్ష్మి ఇస్తుంది. మరొకవైపు మీరు చెప్పిన విషయం నందినికి రామలక్ష్మి చెప్తుందా అని శ్రీవల్లి అనగానే.. చెప్తే మనకేం ప్రాబ్లమ్ లేదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత మీటింగ్ జరుగుతుంటే సీతాకాంత్ వంక నందిని చూడడం రామలక్ష్మి చూస్తుంది.ఆ తర్వాత రామలక్ష్మి మాట్లాడుతుంటే పోలమారుతుంది. దాంతో వాటర్ తాగు అని సీతకంత్ అంటాడు. దాంతో కావాలనే నందిని పొలమారినట్లు చెయ్యగానే సీతాకాంత్ తనకి వాటర్ ఇవ్వడంతో నా కంటే తనే ఎక్కువనా అన్నట్లు ఫీల్ అవుతుంది రామలక్ష్మి. ఆ తర్వాత మీటింగ్ ఒకే అయ్యాక ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. నాకు ఇష్టమైంది తినాలని ఉందన సీతాకాంత్ అంటాడు.  మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చెయ్యాలా.. చేస్తానని నందిని అనగానే.. సరేనని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత మా ఆయనకి ఇష్టమైంది మీకెలా తెలుసని నందినిని రామలక్ష్మి అడుగగా తను డైవర్ట్ చేస్తుంది.. ఆ తర్వాత రామలక్ష్మి అసలు విషయం తెలుసుకోవాలని సీతాకాంత్ ని నందిని గురించి అడుగుతుంది. మొదట తెలియదన్న తన పైన ఒట్టేసి చెప్పమనగా సీతాకాంత్ నందిని గురించి చెప్తాడు. కానీ ఇప్పుడు ఫ్రెండ్ అంతే అని చెప్తాడు. కానీ ఈ విషయం ఇంతవరకు చెప్పనందుకు రామలక్ష్మి ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ధన ఫోన్ చూస్తూ.. సిరిని పట్టించుకోకుంటే రామలక్ష్మి వచ్చి కోప్పడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి గదిలోకి వెళ్లగానే సీతాకాంత్ వెనకాల నుండి వచ్చి బయపెడుతాడు. దాంతో రామలక్ష్మి చిరాకు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఆస్తుల కోసం కోర్టుకి వెళ్తామన్న ఆ ఇద్దరు.. కుప్పకూలిన ఇంటిపెద్ద!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -595 లో.....దుగ్గిరాల ఇంటికి తమ దగ్గర పని చేసేవాళ్లు వస్తారు. ఎక్కడికి వస్తున్నారంటూ రుద్రాణి చిరాకుపడుతుంది. సీతారామయ్య గారు నా కొడుకు చదువుకి డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు డబ్బులు అవసరం అయ్యాయని వాళ్లు అనగానే.. ఇలా అందరికి ఇస్తూ పోతే మా పరిస్థితి ఏంటని రుద్రాణి తిట్టి పంపిస్తుంది. వాళ్లు బయట మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రాజ్ వచ్చి.. వాళ్ళ మాటలు విని లోపలికి వస్తాడు. ఏం జరిగిందని రుద్రాణిని రాజ్ అడుగుతాడు. మా తాతయ్య ఒకరికి మాటిచ్చారంటే తప్పడు.. ఆయన మాట నిలబెట్టే బాధ్యత నాది అంటూ కావ్యని డబ్బులు తీసుకొని రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఇందిరాదేవి చేతులు మీదుగా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. తాతయ్య గారి మాట నిలబెట్టి సరైన వారసుడు అనిపించుకున్నారంటూ వాళ్లు రాజ్ గురించి గొప్పగా పొగుడుతారు. ఆ తర్వాత రాజ్ పై కోప్పడుతుంది రుద్రాణి. దాంతో అందరు రుద్రాణిని తిడతారు. నా భర్త కష్టం.. తన ఇష్టం వద్దనడానికి నువ్వెవవరంటూ రుద్రాణిపై ఇందిరాదేవి విరుచుకుపడుతుంది. కరెక్ట్ టైమ్ కి వచ్చి మీ తాతయ్య మాట నిలబెట్టావని ఇందిరాదేవి రాజ్ తో అంటుంది. మరొకవైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేసి మాట్లాడుతుంది కానీ సీతారామయ్య గురించి చెప్తే అప్పు బాధపడుతుందని కళ్యాణ్ చెప్పడు. నార్మల్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి సుభాష్ వచ్చి డబ్బులు తీసుకంటాడు. ఆ తర్వాత ప్రకాష్ వచ్చి డబ్బులు తీసుకుంటాడు. ఆ తర్వాత రాహుల్ తీసుకుంటాడు. ఇలా అందరు తీసుకుంటుంటే ఈ బాధ్యత నాకు వద్దని కావ్య అనుకోని రాజ్ దగ్గరికి వెళ్తుంది. రాజ్ కి ఈ బాధ్యతలు వద్దని చెప్పాలి.. ముందు టీ ఇచ్చి మాట్లాడుతాననుకొని వెళ్తుంది కానీ రాజ్ చిరాకుపడేసరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి వెళ్లి బాధ్యతలు వద్దని చెప్తుంది. కానీ అపర్ణ అందుకు ఒప్పుకోదు. తరువాయి భాగంలో సీతారామయ్య గారు షూరిటీ పెట్టారని బ్యాంక్ వాళ్లు చెప్పగానే అందరు తన భర్త మాటకి విలువ ఇవ్వాలని ఇందిరాదేవి అనగానే.. కుదరదు.. మా ఆస్తులు మాకు కావాలి..లేదంటే కోర్ట్ కి వెళ్తామని రుద్రాణి, ధాన్యలక్ష్మి అంటారు. అలా అనగానే ఆస్తుల కోసం కోర్ట్ కి వెళ్తారా అని ఇందిరాదేవి కిందపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

వర్ష - ఇమ్ము మధ్య శ్రీకర్ కృష్ణ...వాళ్లకు బ్రేకప్ అయ్యిందా ?

  శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమో ఫైనల్ లో ఒక ట్విస్ట్ ఐతే ఉంది. జబర్దస్త్ లో నటించే వర్ష - ఇమ్మానుయేల్ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  వీళ్ళ మధ్య ప్రేమ ఉందని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని విషయం ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఐతే ఇమ్ము మాత్రం వర్షని  ఎంతసేపు అమ్మాయి కాదు అని అబ్బాయి అంటూ కామెంట్ చేస్తూ హర్ట్ చేస్తూ ఉంటాడు. ఐతే మరి వర్ష - ఇమ్ము మధ్య  ఏమయ్యిందో కానీ వర్ష కోసం వకాల్తా పుచ్చుకున్నాడు శ్రీకర్ కృష్ణ..బుల్లితెర నటుడు...బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ గా చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు. ఇక ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో వర్ష ఒక స్కిట్ వేసింది. అందులో ప్రేమించిన వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. దానికి వర్ష చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీకర్ కృష్ణ వస్తాడు. "ఇన్ని రోజులుగా నిన్ను కించపరిచేవాడి కోసం అంతగా పరితపించి పోయి ఏమన్నా నువ్వు అర్ధం చేసుకుని వదిలేస్తున్నావ్. అలాంటిది నా కోసం ఒక్కసారి ఆలోచించొచ్చు కదా.. ఈ సెట్టు సాక్షిగా అడుగుతున్నా నాతో వస్తావా. " అంటూ వర్షతో కలిసి డాన్సులు వేసాడు. శ్రీకర్ కృష్ణ వేసిన డైలాగ్స్ కి సెట్ మొత్తం చప్పట్లు కొట్టింది. ఆటో రాంప్రసాద్ కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఇక తనతో ఉండమని శ్రీకర్ అడిగేసరికి వర్ష ఐతే అదేదో నమ్మలేని అంశంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఇక నెటిజన్స్ ఐతే ఏంటి ఇమ్ము-వర్ష మధ్య బ్రేకప్ అయ్యిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

Illu illalu pillalu : ప్రేమని అమ్మడానికి డీలింగ్.. భద్రవతి మాస్టర్ ప్లాన్ అదే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -30 లో.. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కో వాళ్ళని అడ్డుపెట్టుకొని రామరాజు పరువుతియ్యాలని భద్రవతి అనగానే.. సేనాపతి సరే అంటాడు. దాంతో భద్రవతి అమ్మ ఆ మాటలకూ బాధపడుతుంటే ఎందుకు అమ్మ.. అది మన ఇంటి పరువు తీసింది. వాళ్ళ గురించి నువ్వు బాధపడడం ఎందుకు అంటుంది. అది కూడా నా కన్నకూతురని వాళ్ళ అమ్మ అంటుంది. మరొకవైపు మీ నాన్నని ఎంత మోసం చేసావని సాగర్ ని వేదవతి తిడుతుంది. నన్ను క్షమించు అమ్మ అని సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు. నన్ను క్షమించు నాన్న అని సాగర్ అంటుంటే.. ఆ అమ్మాయి మొహం చూసి ఇంట్లోకి రానించానంతే కానీ చిన్నోడు లాగే వీడిని కూడా క్షమించలేదు.. నాతో మాట్లాడే ప్రయత్నం చేయ్యొద్దంటూ చెప్పేసి రామరాజు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కళ్యాణ్ ప్రేమని వేరొకరి అమ్మడానికి డీలింగ్ కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ తన బాబాయ్ ని ధీరజ్ ఎక్కడ అని అడుగుతుంది. వాడు అంటే నీకు ఎంత ప్రేమ అని అతను అనగానే.. ప్రేమ కాదు.. ఏం కాదు.. నన్ను ఎప్పుడు తిడుతాడు.. అందుకే అని ప్రేమ అంటుంది. అప్పుడే ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని అంటాడు. దాంతో ప్రేమ సరే అంటుంది. మరొకవైపు ప్రసాదరావు నర్మద ఎంగేజ్మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడే సేనాపతిని తీసుకొని  భద్రవతి వాళ్ళింటికి వస్తుంది. ఆల్రెడీ పెళ్లి అయిన అమ్మాయికి ఎంగేజ్ మెంట్ చేస్తున్నావని భద్రవతి అనగానే.. అందరూ షాక్ అవుతారు. తరువాయి భాగంలో రామారాజు ఇంటికి ప్రసాదరావు వచ్చి తనని తిడుతుంటే.. మా నాన్నకి  ఏం సంబంధం లేదని సాగర్ అంటాడు సాగర్ ని ప్రసాదరావు కొట్టబోతుంటే నర్మద అడ్డువస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam2 : కార్తీక్ జాబ్ కి రాజీనామా చేస్తాడా.. దీపని లేకుండా చేయాలి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -229 లో....కార్తీక్ ఆఫీస్ లో ఫైల్ గురించి వెతుకుతాడు. మేనేజర్ ని పిలిచి ఫైల్ ఎక్కడ అని అడుగుతాడు. ఆ ఫైల్ చైర్మన్ గారి దగ్గర ఉందని మేనేజర్ చెప్పగానే.. అదేంటీ నేను సంతకం పెట్టి అప్రూవల్ చెయ్యాలి కదా అని కార్తీక్ అంటాడు. ఏమో సర్ అని మేనేజర్ అనగానే కార్తీక్ కోపంగా శివన్నారాయణ దగ్గరికి వెళ్తాడు. మరొకవైపు కార్తీక్ ఎంత గొడవ చేస్తాడోనని జ్యోత్స్న భయపడుతుంది. ఆ ఫైల్ పైన నేను సంతకం చేసి అప్రూవల్ చెయ్యాలని కార్తీక్ అనగానే చైర్మన్ ని నేను.. నేను చేస్తే చాలని శివన్నారాయణ‌ అంటాడు. నా జాబ్ అది.. అలాంటప్పుడు నేను ఎందుకు ఇక్కడ.. వర్క్ చెయ్యాలి.. నా మాటకి జాబ్ కి వాల్యూ లేనప్పుడు.. నాకు ఈ జాబ్ అవసరం లేదు.. రూల్స్ ప్రకారం వన్ మంత్ ముందు చెప్పాలి ఇప్పుడే చెప్తున్నానని కార్తీక్ అనగానే.. వన్ మంత్ అవసరం లేదు. ఇప్పుడే వెళ్లొచ్చు వెళ్తే ఆపను.. ఉంటే వద్దననని శివన్నారాయణ అనగానే కార్తీక్ హర్ట్ అవుతాడు. టూ మినిట్స్ రాజీనామా లెటర్ తీసుకొని వస్తానని కార్తీక్ వెళ్తాడు. అప్పుడే దీప క్యారేజ్ పట్టుకొని వస్తుంది. దీప రెండు నిముషాలు తింటూ మాట్లాడుకుందామని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. కార్తీక్ బాబు ఏంటి అలా ఉన్నాడని అడుగగా తాతయ్యతో గొడవ పడి రాజీనామా చేస్తున్నాడని జ్యోత్స్న అనగానే.. కార్తీక్ ని వద్దని రిక్వెస్ట్ చేస్తుంది దీప. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. తాతయ్య గారు అంటూ దీప ఏదో చెప్పబోతుంటే.. నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని శివన్నారాయణ‌ అంటాడు. మీ మనవరాలిని అని దీప అనగానే.. దాస్ నిజం చెప్పాడా అని జ్యోత్స్న కంగారుపడుతుంది. మొన్న మిమ్మల్ని పెద్దాయన అంటే తాతయ్య అని పిల్వమన్నారని గుర్తుచేస్తుంది. దీనికి నిజం తెలియదు అని జ్యోత్స్న రిలాక్స్ అవుతుంది. త్వరగా ఈ దీపని లేకుండా చెయ్యాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : నందిని గురించి తెలిసి షాకైన రామలక్ష్మి.. భర్తని అడగగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -280 లో... సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. ఇప్పుడు మన షేర్ వాల్యూ పెరిగింది కదా ఇప్పుడే మన కంపెనీ బ్రాంచ్ స్టార్ట్ చేద్దామని అనగానే గుడ్ ఐడియా అని సీతాకాంత్ అంటాడు. దాంతో ఇద్దరు కలిసి ప్లేస్ కోసం చూస్తుంటారు. అప్పుడే నందిని వచ్చి నేను ఆల్రెడీ ప్లేస్ సెలక్ట్ చేసానని అంటుంది. ఎక్కడ అని సీతాకాంత్ అడగగా బెంగుళూరు అని నందిని చెప్తుంది. అప్పుడే అక్కడికి సందీప్, ధనలు వస్తారు. బెంగుళూరు వద్దు.. అక్కడ ఆల్రెడీ చాలా కంపెనీలున్నాయ్.. మన కంపెనీ సెటిల్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. పూణేలో పెడితే తక్కువ టైమ్ లో డెవలప్ కావచ్చని ధన అంటాడు. చాలా బాగా చెప్పావని సీతాకాంత్ మెచ్చుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ పూలు తీసుకొని వస్తాడు. తన చేత్తో రామలక్ష్మి తలలో పెడతాడు ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సందీప్ ప్రొద్దున నందిని చేసిన అవమానం భరించలేక ఆవేశపడుతూ.. జరిగింది శ్రీలత, శ్రీవల్లిలకి చెప్తాడు. దాని సంగతి నేను చెప్తానని శ్రీలత అంటుంది. మరుసటిరోజు ఉదయం శ్రీలత కిచెన్ లో వర్క్ చేస్తుంది. మీరు ఎందుకు చేస్తున్నారని రామలక్ష్మి అడుగుతుంది. ఇలా చెయ్యడం హ్యాపీగా ఉందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామాలక్ష్మితో శ్రీలత మాట్లాడుతుంది. నేనొకటి చెప్పాలి కంపెనీ పార్టనర్ గా ఉన్న నందిని సీతాకాంత్ పార్టనర్ కావాలని అనుకుంటుంది. నేను మారక ముందు నాతో మిమ్మల్ని విడగొట్టాడానికి హెల్ప్ చేసింది.. తనతో జాగ్రత్త అని శ్రీలత రామలక్ష్మికి చెప్పగానే తను షాక్ అవుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ షర్ట్ బటన్ పోయిందని రామలక్ష్మి నీ పిలుస్తాడు. కానీ రామలక్ష్మి ఆలోచిస్తూ బటన్ కుడుతుంది. ఇప్పుడు నందిని గురించి సీతాకాంత్ ని అడగాలా వద్దా అని రామలక్ష్మి అడగకుండా ఉంటుంది. రామలక్ష్మి మీటింగ్ గురించి ఆలోచిస్తున్నట్లుందని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : తప్పించుకున్న నందగోపాల్.. కావ్యకి చుక్కలు చూపిస్తున్న ఆ ఇద్దరు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -594 లో.....రాజ్ నందగోపాల్ ని కలవడానికి వెళ్తుంటాడు. అప్పుడే తన పోలీస్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నందగోపాల్ తప్పించుకోవద్దని చెప్తాడు. మరొకవైపు కావ్య కిచెన్ లో వంట చేస్తుంటే.. ఏం వంట చేస్తున్నావంటూ రుద్రాణి వస్తుంది. ప్రిడ్జ్ లో ఫ్రూట్స్ లెవ్వు చూసుకోవాలి కదా అంటూ ప్రతీదీ తనని అడుగుతుంది. అన్ని తెప్పించు ఇంటి బాధ్యతలు తీసుకున్నావ్ కదా ఆ మాత్రం చూసుకోవాలి కదా అని కావ్యతో రుద్రాణి అంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. ఇద్దరు కలిసి కావ్యని ఒక అట ఆడుకుంటారు. ఇంట్లో అది పాడైంది.. ఇది పాడైంది చూసుకోవాలి కదా అంటూ మాట్లాడతారు. అందరికి ఫోన్ చేసి అన్ని బాగా చేపిస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత బాగా మాట్లాడావ్ ధాన్యలక్ష్మి  అని రుద్రాణి అనగానే.. మంచిగ ఉంటే విలువ లేదు ఇలాగే ఉండాలి మనకి రావాల్సిన ఆస్తులు రప్పించుకోవాలని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత నందగోపాల్ ఇంటికి రాజ్ వస్తాడు. అక్కడ సెక్యూరిటీ లేడని చెప్పడంతో అయ్యో అతనికి డబ్బులు ఇవ్వాలి.. అవి ఇవ్వడం కోసం వచ్చానని రాజ్ అనగానే అవునా అంటూ నందు గోపాల్ అడ్రస్ చెప్తాడు సెక్యూరిటీ. దాంతో రాజ్ కోపంగా బయలుదేర్తాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి డిజైనర్ సారి డిజైన్ చేపించుకుంటుంది. దానికి మూడు లక్షలు కావ్యని అడిగి ఇస్తుంది. ఆ తర్వాత రాజ్ తన పోలీస్ ఫ్రెండ్ కి నందగోపాల్ అడ్రస్ చెప్పి వాడు తప్పించుకోకూడదని చెప్తాడు. మరొకవైపు నందగోపాల్ కి ఎవరో ఫోన్ చేసి రాజ్ నీ కోసం వస్తున్నాడని చెప్పాగానే అతను పారిపోతాడు. రాజ్ అక్కడికి వెళ్ళగానే సెక్యూరిటీ అతను ఇప్పుడే ఫారెన్ వెళ్ళాడని చెప్తాడు. ఆ తర్వాత రాజ్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి దొరికాడా అని అడుగగా.. పారిపోయాడని రాజ్ చెప్తాడు మనం వస్తున్నట్లు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నాడని అతను రాజ్ తో అంటాడు. ఆ తర్వాత స్వప్న షాపింగ్ కి కావ్య దగ్గర డబ్బులు తీసుకుంటుంది. మీ అక్కకి అయితే ఎందుకు ఏమిటి అని అడగావని రుద్రాణి అనగానే తనపై విరుచుకుపడుతుంది స్వప్న. ఆ తర్వాత రాజ్ సీతారామయ్య షూరిటీ పెట్టిన విషయం తన ఫ్రెండ్ కి చెప్తాడు. తరువాయి భాగంలో ఒక జంటకి ఇందిరాదేవి డబ్బులు ఇస్తే రుద్రాణి ఎందుకు ఇస్తున్నారంటుంది. అయన ఆస్తులు రాసిన ఎవరు అడ్డుచెప్పొద్దని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు కావ్యతో రాజ్ చిరాకుగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

జబర్దస్త్ కమెడియన్ సన్నీ లైఫ్ లో  ప్రేమ విషాదాన్ని నింపింది

  జబర్దస్త్ కమెడియన్ సన్నీ కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఇండస్ట్రీలో చాలామంది ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముందు ఇండస్ట్రీలో పని చేసేవాళ్ళతో పెళ్లి అంటే చాలు చాలా మంది వెనకా ముందు ఆలోచిస్తూ ఉంటారు. ఐతే జబర్దస్త్ లో ఇన్నేళ్ళుగా కామెడీ పండిస్తున్న సన్నీ గురించి తెలుసు కానీ అయన లైఫ్ లో ఒక లవ్ ఫెయిల్యూర్ ఎపిసోడ్ అనేది ఉందని ఇంత వరకు ఎవరికీ తెలీదు. ఆయన పైకి కామెడీ పండిస్తున్నారు కానీ లోపల ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారు అనే విషయం తెలుస్తోంది.  ఇప్పుడు ఈ విషయం జబర్దస్త్ ఈ వారం ఎపిసోడ్ లో బయటపడబోతోంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో రామ్ ప్రసాద్ వేసిన స్కిట్ లో సన్నీ ఒక వెరైటీ ప్రశ్న అడిగాడు "వ్యాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14 కి మాత్రమే ఎందుకు వస్తుంది" అని దానికి రష్మీ ఆన్సర్ ఇచ్చింది. "ఎందుకంటే చిల్డ్రన్స్ డే నవంబర్ 14 కి వస్తుంది కాబట్టి" అనేసరికి అందరూ నవ్వేశారు. దాంతో రష్మీ సన్నీని ఇలా అడిగింది " ఇన్ని రోజుల నుంచి అడగాలనుకుంటున్నా కానీ అడగలేదు. మీ లవ్ స్టోరీ గురించి ఎప్పుడూ అడగలేదు. అసలు మీరు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది. "నిజానికి నేను ఒక అమ్మాయిని ప్రేమించా. ఇద్దరం ఎనిమిదేళ్లు ప్రేమించుకున్నాం. చివరికి ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసేసుకుంది." అని చెప్పాడు. "మేడం నిజం చెప్పాలంటే సన్నీ కోటీశ్వరుడు. వీడి కోసం ఎన్ని సార్లు వాళ్ళ వాళ్ళు ఫోన్ చేస్తున్నా ఒక్క లవ్ ఫెయిల్యూర్ వల్ల సన్నీ తన లైఫ్ ని అలాగే వదిలేసుకున్నాడు" అంటూ రాంప్రసాద్ చెప్పాడు. అలా సన్నీ లైఫ్ లో కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ ఉందన్న విషయం తెలిసింది.    

Avinash Buzz : టాప్-5 కి వచ్చి ఆగిపోయానంటే ఓటింగ్ లేకపోవడమే 

  బిగ్ బాస్ సీజన్ -8 లో మొదట్లో కాస్త బోరింగ్ అనిపించింది. ఆ తర్వాత అయిదవ వారంలో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ  ఇచ్చాక.. షో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా అవినాష్, తేజ, రోహిణీల కామెడీ టైమింగ్ తో మరింత ఎంటర్‌టైన్మెంట్ గా సాగింది.  అవినాష్ తన కామెడీతో అటు హౌస్ మేట్స్, ఇటు ప్రేక్షకులను నవ్వించేసాడు.  అవినాష్ ఒక కామెడీలోనే కాదు.. గేమ్ లో కూడా తన సత్తాచాటి మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. అవినాష్ టాప్-5 లో ఉండగా..  ఫినాలేలో మొదట ఎలిమినేషన్ అయ్యాడు. అవినాష్ బజ్ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. మొదట ఫైనలిస్ట్ అయ్యాక నీకు ఫీలింగ్ ఎలా ఉందని యాంకర్ అర్జున్ అడగ్గా.. నేను బ్యాక్ టూ బ్యాక్ కంటెండర్ అయ్యాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగిందని అవినాష్ అన్నాడు. హౌస్ లో మిమ్మల్ని సుడిగాడు అని అంటే ఒప్పుకుంటారా అని యాంకర్ అడగ్గా.. ఖాళీ గా కూర్చొని ఉంటే మాత్రం టికెట్ టూ ఫినాలే రాలేదని కొంచెం ఘాటుగానే సమాధానమిచ్చాడు అవినాష్. నాకు ఏదో పాజిటివ్ వైబ్  ఉందని అవినాష్ అనగానే.. విష్ణుప్రియతో ఫ్రెండ్ షిప్ చేసావా ఏంటి తనలా మాట్లాడుతున్నావని యాంకర్ అంటాడు.  సీజన్ 4 లో ఫినాలే వీక్  వన్ వీక్ అనగా వచ్చేసావ్.. ఇప్పుడు ఫినాలే వీక్ వరకు ఉండి టైటిల్ మిస్ అయ్యావ్.. ఏదైనా బాధగా ఉందా అని యాంకర్ అడగ్గా.. ఖచ్చితంగా బాధ ఉంటుందన్నాడు అవినాష్. నామినేషన్ అంటే భయపడుతున్నావా అని అర్జున్ అనగానే.. జనాలు నామినేషన్ కి వస్తే ఆట బాగా ఆడుతున్నారని ఓటు వేసి సేవ్ చేస్తున్నారా లేక టెలికాస్ట్ అయినా వీడు ఆట బాగా ఆడుతున్నాడు.. వీడికి ఓటు వెయ్యాలని డిసైడ్ చేస్తున్నారా అని అవినాష్ అంటాడు. అది నువ్వు బయటకు వెళ్ళాక నీ అట నువ్వు చూసుకుంటే తెలుస్తుందని యాంకర్ అన్నాడు. ఆడాను కాబట్టే పదిహేడు మంది బయట ఉన్నారు.. నేను టాప్-5 లో ఉన్నాను. నేను ఈ టాప్-5 కి వచ్చి ఆగిపోయానంటే నాకు ఓటు బ్యాంకింగ్ లేకపోవడమే అని అవినాష్ అన్నాడు. స్టేజ్ పైన ఏంటి ఇందాక మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి వస్తానంటున్నావ్.. ఇక వదలవా బిగ్ బాస్ ని అని యాంకర్ పంచ్ వేయగా.. అవినాష్ నవ్వుకున్నాడు. అయితే జెన్యున్ ఆడిన అవినాష్ కి స్ట్రాంగ్ పీఆర్ లేకపోవడం, ఓట్ బ్యాంకింగ్ లేకపోవడమే పెద్ద మైనస్. లేదంటే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన హౌస్ మేట్స్ లో అవినాష్ ఫస్ట్ ఉంటాడు. 

Gowtham Buzz : పక్కన వాళ్లు గెలిచినా ఓడినా నేను హ్యాపీ.. ఆ రెండు వారాల్లో రీగ్రెట్ ఉండేది

బిగ్ బాస్ సీజన్- 8 విన్నర్ గా నిఖిల్,  రన్నరప్ గా గౌతమ్ నిలిచారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. ఎలిమినేషన్ వరకు వెళ్లి మణికంఠ వళ్ళ సేవ్ అయి, తన అటతీరుని చేంజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కసిగా ఆడుతూ ఇండివిడ్యువల్ ప్లేయర్ గా ఆడి బిగ్ బాస్ ఫినాలే లో స్టేజిపై ఉన్నాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి నుండి సోలో బాయ్ అంటూ ఒక ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. యష్మీతో లవ్ ట్రాక్ నడిపించినా కూడా అది సెట్ అవ్వలేదు. తాజాగా గౌతమ్ కి సంబంధించిన బిగ్ బాస్ బజ్ ప్రోమో వచ్చింది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు గౌతమ్. ఈ సీజన్ లో అశ్వథ్దామా 3.0గా అడుగు పెట్టావని  యాంకర్ అర్జున్ అన్నాడు. గత సీజన్ థర్టీన్త్ వీక్ వెళ్ళిపోయానని రెగ్రేట్ ఉండే, ఆ సీజన్ కి ఈ సీజన్ కి తేడా ఏంటి అని యాంకర్ అడుగగా.. నిజాయితీ, నిర్మొహమాటంగా లెట్స్ టేక్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ అని గౌతమ్ చెప్పాడు. సీజన్ మొత్తం లో ఏమైనా రీగ్రెట్ ఉందా అని యాంకర్ అడగ్గా.. సిక్స్, సెవెన్ వీక్ లో కొంచెం డౌన్ అయ్యానని గౌతమ్ అన్నాడు. టాప్-2 రావడానికి మణికంఠనే అంటే ఒప్పుకుంటావా అని యాంకర్ అడుగ్గా.. ఇక్కడి దాకా రావడానికి నేను చేసిన ఎఫర్ట్ అని నేను నమ్ముతున్నానని గౌతమ్ చెప్పాడు. లాస్ట్ ఇయర్ శుభశ్రీతో.. ఇప్పుడు యష్మీతో కావాలనే లవ్ ట్రాక్ నడిపించావనిపించింది.. బయట నుండి యష్మీ , నిఖిల్ ది చూసి లోపలికి వెళ్ళాక ఏమనిపించింది. అసలు స్టేజ్ పైన ఉంటే ఏమనిపించింది.. గెలుస్తావనుకున్నావా..  కప్ కి నీకన్నా నిఖిల్ డిజర్వ్ అనుకున్నావా యాంకర్ అడుగగా.. పక్కన వాళ్లు గెలిచినా.. ఓడినా.. నేను హ్యాపీ అని గౌతమ్ పాజిటివ్ గా స్పందించాడు. సీజన్-8 రన్నరప్ గా నిలిచిన గౌతమ్ కి బయట భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే వైల్డ్ కార్డ్ గా రావడంతో మొదటి నుండి ఉండే ఓట్ బ్యాంకింగ్ తక్కువగా పడింది.‌ ఇదే పెద్ద మైనస్.. లేదంటే గౌతమ్ విన్నర్ అయ్యేవాడనడంలో ఎటువంటి సందేహం లేదు.